Helmet
-
ఆరున్నొక్కరు.. జారితే దక్కరు
హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ ఓ వైపు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు లెక్కచేయడం లేదు. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలతో బైక్‌పై ఇలా దౌడు తీస్తూ ఫొటోకి చిక్కాడు. - సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడబంతికాదది భానుడే చీకట్లను చీల్చుకుని వెలుగులు వెదజల్లుతూ పైకి వస్తున్న బాలభానుడు ఇలా ఓ దీపస్తంభంపైన ఎర్రని బంతి ఉంచినట్లు కనిపించాడు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప సండే సందడివారమంతా పనిఒత్తిడితో బిజీబిజీగా గడిపిన నగరప్రజలు ఆదివారం వచ్చేసరికి ఇలా సముద్ర తీరానికి చేరుకుని సేదతీరారు. పర్యాటకుల సందడితో ఆదివారం సాయంత్రం విశాఖ ఆర్కేబీచ్ ఇలా సందడిగా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
సూపర్ హెల్మెటూ కాదంట పెట్టుకోకుంటే బండి స్టార్టు
-
తలనే లాక్ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..
ధూమపానం సేవించడం అనేది ఓ ఫ్యాషన్‌లా మారింది యువతకు. ఏదో సరదాగా ట్రై చేసి.. చివరికి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొందరూ మాత్రం పొగరాయుళ్లుగా మారిపోవడం లేదు. మరికొందరికి మాత్రం అదొక బలహీనతలా మారిపోతోంది ఈ వ్యసనం. అయితే ఇలాంటి బలహీనతతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఈ ధూమపాన అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఎంతటి భయనాక నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే కంగుతింటారు. అయితే అతడు ఈ వ్యసనాన్ని జయించేందుకు ఇలాంటి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం అనేది ప్రశంసించదగ్గ విషయం. ఆ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సెన్సేషన్‌గా మారి వార్తల్లో నిలిచాడు కూడా. అతడెవరంటే..టర్కిష్కి చెందిన ఇబ్రహీం యుసెల్(Ibrahim Yucel) పొగ తాగడం మానేయాలని(Quit Smoking) గట్టిగా బీష్మించుకున్నాడు. కానీ ఎంతలా ఆ అలవాటుని వదులుకుందామన్నా..సాధ్యం కాలేదు. తన పిల్లల పుట్టిన రోజులప్పుడు, తమ పెళ్లిరోజు అప్పుడు.. ఇక ఈ రోజు నుంచి సిగెట్ మానేస్తానని ఒట్టు పెట్టుకోవడం..మళ్లీ ఏదో ఒక బలహీన క్షణంలో తెలియకుండానే తాగడం. ప్రతిసారి తన నిర్ణయాన్ని బ్రేక్ చేసేయ్యడం ఓ భయానక బలహీనతగా మారింది. ఇక లాభం లేదనుకుని ఏకంగా బోను(Cage) మాదిరిగా హెల్మెట్‌ని తయారు చేయించుకుని దాన్ని తలకు తగిలించుకుని లాక్ చేసేసుకున్నాడు. బయటకు కూడా మనోడు అలానే వెళ్తాడట. ఎందుకంటే ఎవర్ని చూసినా.. మళ్లీ నాలిక ఓ దమ్ము కొట్టు బ్రదర్.. అంటాదేమోనన్న భయంతో తలకు ఇలా ఇనుప ఊచల బోను మాదిరి హెల్మట్ ధరించుకుని వెళ్తున్నాడు. ఇలా వెళ్లడంతోనే యూసెల్ ఓ సెన్సేషన్ వ్యక్తిగా మారిపోయాడు. ఆ విషయం కాస్త దావనంలా వ్యాపించి మీడియా వరకు చేరడంతో వింత వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. పదకొండేళ్ల క్రితం మీడియాలో బోనులో తలను లాక్ చేసుకున్ని వ్యక్తి అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అయితే కేవలం భోజనం చేసేటప్పడూ లేదా ఏదైనా తినాలనుకున్నప్పుడూ మాత్రమే భార్య లాక్‌ని ఓపెన్ చేస్తుందట. ఆయన ఒకప్పుడు రోజుకి రెండు సిగరెట్ ప్యాకెట్లు హాంఫట్ చేసేవాడట. దీనివల్ల కలిగే అనారోగ్య ప్రమాదాల రీత్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు యూసెల్. ఈ వ్యసనం నుంచి బయటపడాని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు యూసెల్. మరీ యూసెల్ ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(world Health Organisation) కూడా ప్రతి ఏడాది ఈ పొగాకు కారణం దాదాపు ఎనిమిది మిలియన్ల మంది మరణిస్తున్నట్లు చెబుతోంది. మధ్య తరగతి కుటుంబాల్లోనే ఈ వ్యసనానికి సంబంధించిన మరణాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. He quit because his father died of lung cancer. pic.twitter.com/RAWSVJvCXY— Clover Lavender (@AyoolaMatthee) November 7, 2024 (చదవండి: కామ్య... అఖండ ఖ్యాతి..! 17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..!) -
హెల్మెట్ లేకుండా నడిచినందుకు ఫైన్!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి, ‘హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టు’అంటాడు ఓ సినిమాలో ట్రాఫిక్ పోలీస్. మధ్యప్రదేశ్‌లో పోలీసులు మరో అడుగు ముందుకేశారు! రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తకి హెల్మెట్ పెట్టుకోలేదంటూ రూ.300 జరిమానా విధించారు! పన్నా జిల్లాలో అజయ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన జరిగింది. సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు అతిథులను ఆహ్వానించేందుకు వెళ్తుండగా ఓ పోలీసు వాహనం అడ్డగించింది. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కుమార్తె పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వెళ్లాల్సి ఉందని చెప్పినా పోలీసులు విన్పించుకోలేదు. పక్కనే ఉన్న ఓ బైకు రిజి్రస్టేషన్ నంబర్ రాసి మరీ, హెల్మెట్ లేకుండా వాహనం నడిపావంటూ శుక్లాకు జరిమానా విధించారు. దాంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఆధారంగా తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందే
సాక్షి, అమరావతి : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాల అమలులో పురోగతి కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. హెల్మెట్ ధరించని వాహనదారులకు పోలీసు లు చలాన్లు వేయడం ఆశ్నింనించదగ్గ పరిణామమని పేర్కొంది. ఈ విధానాన్ని, అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. గత 20 రోజుల్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వాహనదారుల నుంచి రూ.95 లక్షలు చలాన్ల రూపంలో వసూలు చేయడం పట్ల కూడా హైకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. చట్ట నిబంధనలను అత్రికమించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని తేల్చి చెప్పింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే దుష్ప్ర భావాలు, చట్టాన్ని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యల గురించి పత్రికలు, టీవీల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. చలాన్లు చెల్లించని వారి వివరాలు వెంటనే రవాణా శాఖ అధికారులకు చేరేలా ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ల వసూలు, హెల్మెట్ ధారణ విషయంలో చేపడుతున్న చర్యలు, చలాన్ల వసూళ్లు పెరిగాయా లేదా తదితర వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచా రణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలు పాటించడం లేదంటూ కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడంలేదని, దీంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ని సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. తమ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కొంత మేర చర్యలు చేపట్టారని ధర్మాసనం తెలిపింది.అయినప్పటికీ ప్రతి 10 మందిలో ఇద్దరు ముగ్గురే హెల్మెట్ ధరిస్తున్నారంది. తన సిబ్బందిలో ఒకరిని రోడ్డుపైకి పంపి ఈ విషయాన్ని రూఢీ చేసుకున్నానని సీజే తెలిపారు. ఈ చర్యలు కొనసాగిస్తారా లేక ఆపేస్తారా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. పిటిషనర్ తాండవ యోగేష్ జోక్యం చేసుకుంటూ.. విజయవాడలోనే తనిఖీలు చేస్తున్నారని, చాలా జిల్లాల్లో తనిఖీలు చేయడం లేదని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. చలాన్లు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు భౌతికంగానే వసూలు చేస్తున్నామని, యూపీఐ ద్వారా కూడా వసూలు చేస్తామని ప్రణతి చెప్పారు. గత 20 రోజుల్లో చలాన్ల రూపంలో రూ.95 లక్షలు వసూలు చేశామన్నారు. గతంలో ఈ మొత్తం ఎంత ఉండేదని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ. 4 లక్షలు ఉండేదని చెప్పారు. కాగా వచ్చే విచారణలో చలాన్ల మొత్తం పెరిగిందా? తగ్గిందా? అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. చలాన్లు చెల్లించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని, చట్టం ఏం చెబుతోందని ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్ యోగేష్ చట్ట నిబంధనలను వివరించారు. నిర్ణీత కాల వ్యవధిలో చలాన్లు చెల్లించకుంటే అధికారులు సంబంధిత మేజి్రస్టేట్ ద్వారా ఆ వాహనాన్ని జప్తు చేయవచ్చన్నారు. -
ఇకపై మరింత మందిని కోల్పోనివ్వం
సాక్షి, అమరావతి: హెల్మెట్ లేకపోవడం వల్ల చోటు చేసుకుంటున్న మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదని.. నిబంధనల అమలులో పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము ఈ విధంగా మరింత మందిని కోల్పోనివ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలు విషయంలో పోలీసులు, ఆర్టీఏ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరవ్వాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో రవాణా శాఖ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలుకు ముఖ్యంగా హెల్మెట్లు ధరించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రాష్ట్రవ్యాప్తంగా 8,770 మంది ట్రాఫిక్ పోలీసులు ఉండాలి కానీ.. కేవలం 1,994 మందే ఉన్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాళ్లు తెలంగాణ సరిహద్దు రాగానే సీటు బెల్టులు పెట్టుకుంటున్నారని.. ఇందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారన్న భయమే కారణమని పేర్కొంది. కుటుంబానికి అండగా ఉండే వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ప్రణతి జోక్యం చేసుకుంటూ.. మొత్తం బాధ్యత పోలీసులదే అంటే సరికాదని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజలను తప్పు పట్టొద్దని, అవగాహన కల్పించడం పోలీసుల బాధ్యత అని హితవు పలికింది. మోటారు వాహన చట్ట నిబంధనల అమలు, హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసే విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. జరిమానాలు కఠినంగా వసూలు చేయాలి.. రాష్ట్రంలో కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయట్లేదని.. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేశ్ వాదనలు వినిపిస్తూ.. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. హెల్మెట్ ధారణ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలని తాము జూన్‌లో ఆదేశాలిచి్చనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారని ప్రశ్నించింది. జూన్ నుంచి సెపె్టంబర్ వరకు 667 మంది చనిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి తెలిపారు. ఇది చిన్న విషయం కాదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రణతి స్పందిస్తూ, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో 5,62,492 చలాన్లు విధించామని చెప్పారు. కృష్ణా జిల్లాలో 20,824 చలాన్లు విధించి రూ.4.63 లక్షలు జరిమానా వసూలు చేశామన్నారు. ఇది చాలా తక్కువ మొత్తమన్న ధర్మాసనం.. నిబంధనలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా ఉందని ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని సూచించింది. చలాన్లు కట్టని వారి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఆపేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. చలాన్లు చెల్లించకపోతే సదరు వాహనాన్ని ఎందుకు జప్తు చేయట్లేదని పోలీసులను, ఆర్టీఏ అధికారులను ప్రశ్నించింది. భారీ జరిమానాలు విధించే బదులు.. ఇప్పటికే ఉన్న జరిమానాలను కఠినంగా వసూలు చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడింది. -
AP: హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఆగ్రహం
-
చట్టాలంటే ప్రజలకు గౌరవం లేదు, భయం లేదు
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆక్షేపించారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, తన కాలు నాలుగుచోట్ల విరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30 వేల మందిమృత్యువాత పడుతున్నారని తెలిపారు. జరిమానాలు పెంచినా... ఈ ఏడాది ఇప్పటివరకు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గడ్కరీ వివరించారు. మృతుల్లో 60 శాతం మంది యువతీ యువకులే ఉండడం బాధాకరమని చెప్పారు. జరిమానాలు పెంచుతున్నా ప్రజలు లెక్కచేయడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో తన కళ్లెదుటే ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి వెళ్లిందని అన్నారు. మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో చాలాచోట్ల రోడ్లపై బ్లాక్స్పాట్లు ఉన్నాయని, వీటిని సరి చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
హెల్మెట్ ధరించి వచ్చేవారికి టీవీ బహుమతి
వేలూరు: వేలూరు జిల్లాలో ప్రమాదాల నివారించేందుకు గాను డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించి రావాలని బ్యానర్లు, పోస్టర్లను కరిపించారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు చేయడంతో పాటు హెల్మెట్ ధరించి వచ్చే వారిని ప్రొత్సహించే విధంగా పుష్పాలు, చాక్లెట్లు, బొమ్మలను అందజేసి స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో వేలూరు డీఎస్పీ పృథ్వీరాజ్ సౌకాన్ అధ్యక్షతన ట్రాఫిక్ పోలీసులు వేలూరు గ్రీన్ సర్కిల్లో ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి రావాలని రావాలని బొమ్మలను ఉంచి అవగాహన చేపట్టారు. హెల్మెట్ ధరించి వచ్చే వారికి బొమ్మలు, పెన్‌లను అందజేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి వచ్చిన వారికి కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ రజనీ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుంచి తరచూ హెల్మెట్ ధరించి వచ్చే వారిని గుర్తించి వారి వాహన నెంబర్లను నమోదు చేసి వారిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. గెలుపొందిన వారికి పెద్ద ఎల్ఈడీ టీవీని బహుమతిగా అందజే స్తామని తెలిపారు. -
క్యాన్సర్ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్ వంటి ఈ హెడ్‌గేర్ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ఐర్లండ్‌కు చెందిన ల్యూమినేట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్‌ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్‌గేర్ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. ‘‘ఈ హెడ్గేర్ను ఇప్పటికే యూరప్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్ హానన్ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు. రొ మ్ము క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్‌కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్ మార్కెట్లో ఈ హెల్మెట్‌ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.లోపాలూ లేకపోలేదు అయితే ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్ సందర్భంగా, ముగిశాక హెడ్‌గేర్ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్‌ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్
ఇది మామూలు హెల్మెట్ కాదు, బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్. ఈ హెల్మెట్ మెదడు పరిస్థితిని తెలుసుకునేందుకు చేసే ‘ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్’ (ఈఈజీ) పరీక్షకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘ఐ మెడి సింక్’ కంపెనీ ఈ హెల్మెట్‌ను ‘ఐ సింక్వేవ్’ పేరుతో రూపొందించింది.మెదడు పరీక్షలను నిర్వహించడానికి ఖరీదైన ఈఈజీ మెషిన్లకు బదులుగా ఆస్పత్రుల్లోని వైద్యులు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్‌ను ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఈఈజీ మెషిన్ ద్వారా మెదడు పరీక్ష జరిపించుకోవాలంటే, అడ్హెసివ్ ప్యాచ్‌లు, జెల్ వాడాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్‌కు అవేవీ అవసరం లేదు. నేరుగా తలకు ధరిస్తే చాలు, నిమిషాల్లోనే మెదడు లోపలి పరిస్థితిని తెలియజేస్తుంది.ఇది రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏడు గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని లోపలి భాగంలోని 19 ఎల్ఈడీ బల్బులు మెదడును క్షుణ్ణంగా స్కాన్ చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధి వంటి మెదడు సంబంధిత వ్యాధులను దీని ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. దీని ధర 6.54 కోట్ల వాన్లు (రూ. 41.04 లక్షలు). -
Harshitha: కామన్ మ్యాన్ ఫ్రెండ్..!
ఆలోచించాలేగానీ.. శతకోటి సమస్యలకు అనంత కోటి పరిష్కారాలు ఉంటాయి. మామయ్యను అనారోగ్యానికి గురి చేసిన సమస్యపై దృష్టి పెట్టిన హరిత ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుంది. శాస్త్రప్రపంచంలో తొలి అడుగు వేసింది...పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన హర్షిత చిన్ననాటి నుంచి తెలివైన విద్యార్థి. జెడ్పీ హెచ్ఎస్ చందనాపూర్లో చదువుతుండేది. క్రమం తప్పకుండా బడికి వచ్చే హర్షిత ఒకసారి వరుసగా వారంరోజులు రాలేదు. ఆ తరువాత బడికి వచ్చిన హర్షితను సైన్స్ టీచర్‌తో పాటు క్లాస్ టీచర్‌గా ఉన్న సంపత్ కారణం అడిగారు.తన మామయ్య వెల్డింగ్ పనిచేస్తాడని, వెల్డింగ్ పొగ పీల్చి ఊపిరితిత్తులు జబ్బు పడ్డాయని, ఆయనకు సహాయంగా ఉండేందుకు స్కూలుకు రాలేదని చెప్పింది. ‘మామయ్య మరోసారి జబ్బు పడకుండా ఏదైనా చేయాలని ఉంది’ అని తన మనసులోని మాట చెప్పింది. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో హరిత ఒక హెల్మెట్ తయారుచేసింది. చిన్న ఫ్యాన్ అమర్చి రూపొందించిన ఈ హెల్మెట్ వెల్డింగ్ సమయంలో పొగను ముఖం వరకు చేరనివ్వదు. హరిత రూపొందించిన హెల్మెట్ చూసి సైన్స్ టీచర్ ఆశ్చర్యపోయారు. హరితను అభినందించారు.తొలుత ప్రోటోటైప్‌గా రూపొందించిన ఈ హెల్మెట్‌ను ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో మరింత మెరుగు పరిచింది. హెల్మెట్‌కు ఒక సెన్సార్ బిగించి, వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి ముఖం పైకి పొగ రాగానే హెల్మెట్‌పై ఉన్న ఫ్యాన్ దానంతట అదే తిరిగేలా డిజైన్ చేసింది. సిమెంటు, ఇటుక, పిండిమర.... మొదలైన పరిశ్రమలలో పని చేసే కార్మికులు, నిరంతరం దుమ్ములో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా రక్షణ ఇస్తుంది. దీనికి ‘కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ హెల్మెట్’గా నామకరణం చేసింది. ఈ హెల్మెట్ జపాన్ సకురా ఇంటర్నేషనల్ సైన్స్ప్రోగ్రాం, ఇండియన్ ఇంటర్నేషన్ ఇన్నోవేషన్ప్రోగ్రాం, ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ప్రోగ్రామ్లకు ఎంపికైంది.స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్‌బాటిల్.కరోనా టైమ్‌లో స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్ బాటిల్‌ను తయారు చేసింది హర్షిత. ఈ బాటిల్‌ను మూడు అరలుగా విభజించారు. మొదటి అరలో శానిటైజర్, రెండో అరలో తాగునీరు, మూడో అరలో సబ్బు/స్నాక్స్ పెట్టుకునేలా ఈ బాటిల్‌ను రూపొందించింది. ప్రతీ అరగంటకు ఒకసారి నీరు తాగే విషయాన్ని మనకు రెడ్‌లైట్‌తో లేదా వైబ్రేషన్, సౌండ్ సదుపాయాల ద్వారా గుర్తు చేస్తుంటుంది. హర్షిత కరీంనగర్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. – బాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
విశాఖపట్నం : కఠినంగా హెల్మెట్ నిబంధనలు (ఫొటోలు)
-
రూలర్స్..రూల్స్ బ్రేక్
ఈ ఫొటోల్లో రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి... హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.1,030 అపరాధ రుసుం విధించడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.ఈ ఫొటోల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చొని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ను పరిశీలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి గానీ వెనుక కూర్చున్న కలెక్టర్, గణబాబు గానీ హెల్మెట్ ధరించలేదు. ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్లు ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తుంగలో తొక్కుతున్నా.. అటువైపు కనీసం రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. చట్టం అధికారం ఉన్న వాడికి చుట్టమనే నానుడి ఇటువంటి అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల మరింత బలపడినట్టయింది.గోపాలపట్నం: జిల్లాలో హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారంటూ... ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు 1,199 మందికి రూ.1,035 అపరాధ రుసుం విధించడంతో పాటు లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేశారు. మూడు నెలల వరకు వీరెవ్వరూ వాహనాన్ని నడిపేందుకు అవకాశం లేదు. వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు కఠినంగా వ్యవహరించాల్సిందే. దీనిని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే సాధారణ ప్రజలకు ఒక విధంగా.. అధికారం ఉన్న వారి పట్ల మరో విధంగా ప్రవర్తించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.విస్తృతంగా తనిఖీలుద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి రూ.1035 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. వీరు మూడు నెలల తరువాత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి జరిమానా విధించిన రశీదు, ఆధార్ కార్డు అందజేస్తే లైసెన్సును పునరుద్ధరిస్తారు.హెల్మెట్ ధారణ తప్పనిసరిహెల్మెట్లు లేకుండా ప్రయాణించడంతోనే చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్నవారు కూడా కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని కొద్ది రోజులుగా అవగాహన కల్పించాం. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిబంధనలను అమలు చేస్తున్నాం. ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను రద్దు చేశాం. పోలీసుల వద్ద సుమారు 3 వేల వరకు ఈ రశీదులున్నాయి. వాటిని కూడా సేకరించి రద్దు చేసే చర్యలు చేపడతాం.– రాజారత్నం, ఉప రవాణా కమిషనర్, విశాఖ -
‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’
ద్విచక్ర వాహన తయారీదారులు తమ కస్టమర్లకు డిస్కౌంట్ ధరకు హెల్మెట్ అందించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. 2022లో దేశంలో జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 50,029 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.‘ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు అధికంగా మృత్యువాత పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే తయారీదారులను డిస్కౌంట్ ధరకు హెల్మెట్లు ఇవ్వమని అడగండి. తయారీ కంపెనీలు కూడా కొంత తగ్గింపుతో వాహనదారులకు హెల్మెట్లు ఇస్తే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న ద్విచక్రవాహనదారుల్లో దాదాపు 43 శాతం మంది మరణిస్తున్నారు’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: జీవిత పాఠాలు నేర్పిన గురువులుపాఠశాల బస్సులు నిలిపేందుకు సరైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీ జరిమానాలు విధించిందని చెప్పారు. దేశంలోని ప్రతి టౌన్లో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
ఏమో సార్.. మాకు కనబడదు.! (ఫొటోలు)
-
ఏమో సార్.. మాకు కనబడదు.!
విశాఖ సిటీ: ‘నన్ను ధరించు మీకు పునర్జన ఇస్తాను’అని ఫ్లెక్సీలు అమర్చిన ప్రాంతంలోనే హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. ‘ట్రిపుల్ రైడింగ్‌కు నో చెప్పండి’ అని ప్రచార బోర్డులు ఉన్న చోటే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా.. వాహనచోదకులకు ఇవేమీ పట్టడం లేదు. ఫ్లెక్సీలను చూస్తూనే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల ప్రయత్నాలను నీరుగారుస్తున్నారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహనాలు నడుపుతున్న ఈ దృశ్యాలు.. వాహనచోదకులనిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
వామ్మో.. మైనర్ల డ్రైవింగ్! జర జాగ్రత్త!!
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని పోలీస్ శాఖ విస్తృత ప్రచారం జనం చెవికెక్కడం లేదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఎక్కడా మార్పు కనిపించటం లేదు.పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నా వినడం లేదు. కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ప్రజల్లో సామాజిక బాధ్యత పెరగదని జనం అభిప్రాయపడుతున్నారు.సోమవారం కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపిస్తూ ‘సాక్షి’ కంటపడగా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
చల్లచల్లని కూల్ కూల్
ఈ వేసవిలో ఆకాశానికి ఏసీ బిగిస్తే? మనం నడుస్తూ ఉంటే గాలి గొడుగు పడితే? కూర్చున్న చోటు చల్లని మందిరంగా మారితే? అసలు వేసవి మొత్తం కూల్ కూల్‌గా అనిపిస్తే? నిజంగా ఎలాగూ జరగదు. ఘోరమైన ఎండల్లో మాడక తప్పదు. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగి ఇలాంటి ఊహలు చేసి ఆనందిస్తున్నారు జనం. మార్తాండుడి ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే ఎండాకాలంలో. వట్టివేర్లు కిటికీలకు కట్టుకునేవారు, కూల్ పెయింట్ చేయించుకునేవారు, గోతాం పట్టాలు కట్టుకుని నీళ్లు చల్లుకునేవారు, ఏసీలు కొనుక్కునేవారు, కూలర్లు రిపేర్లు చేయించుకునేవారు, కొబ్బరి మట్టలతో పందిరి వేసుకునేవారు... చల్లదనం కోసం ఎన్నో మార్గాలు. అయితే మన నెత్తి మీదే ఎప్పుడూ ఫ్యాన్ ఉండాలని, మనం ఎక్కడ కూచున్నా జిల్లుమనాలని అత్యాశ కూడా ఉండొచ్చు. ‘ఇలాంటి ఆశలు మాకున్నాయి. అవి తీరినట్టుగా ఫొటోలు చేసి చూపించు’ అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగితే అది తయారు చేసిన ఫొటోలు నెట్లో వైరల్ అయ్యాయి. నెత్తి మీద ఐసు గడ్డల హెల్మెట్ ఉన్న అవ్వ, ఐసు బల్ల మీద కూచుని టూరిస్ట్‌లు, ఐసు స్కూటర్ మీద రివ్వున దూసుకెళ్లే అమ్మాయి, ఒళ్లంతా ఫ్యాన్లు మొలిచిన గరీబు... ఇవన్నీ ఏ.ఐ చూపించి ఐసు వాటర్ తాగిన ఫీలింగ్ కలిగించింది. -
టోపీ, హెల్మెట్లు వల్ల బట్టతల వస్తోందా? నిపుణులు ఏమంటున్నారంటే..
చాలామంది తలకు టోపీ ధరిస్తారు. కొందరూ యువకులు ఫ్యాషన్‌గా ధరించగా మరికొందరూ ఎండ నుంచి రక్షణ కోసం పెట్టుకుంటారు. ఇక హెల్మెట్లంటారా బండి డ్రైవ్ చేయాలంటే తప్పదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మట్ తప్పనసరిగా ధరించాల్సిందే. వెనుక కూర్చొన్నవాళ్లు కూడా పెట్టుకోవాల్సిందే. అయితే ఇవి తలకు పెట్టడం వల్లే జుట్టు ఊడిపోతోందని చాలా మంది అనుకుంటారు. అవి పెట్టడం వల్ల తలలో చెమట పట్టి త్వరితగతిన జుట్టు రాలి బట్టతల వస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవకు నిజం?. నిజంగానే టోపీ, హెల్మెట్లు ధరిస్తే బట్టతల వస్తుందా? అయితే వైద్యుల మాత్రం అదంతా అపోహ అని తేల్చి చెబుతున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోదని వైద్యులు చెబుతున్నారు. బట్టతల రావడానికి అనేక కారణాలు ఉంటాయని దానికి, ఈ టోపీలకు ఎలాంటి సంబంధం లేదని వివరిస్తున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుందే తప్ప ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు. అలాగే ఆరుబయట ఎండలోకి వెళ్ళినప్పుడు... ఆ ఎండకి మాడు వేడెక్కిపోతుంది. అలా వేడెక్కకుండా ఉండడం కోసమే టోపీని ధరిస్తూ ఉంటారు. అంతే తప్ప టోపీ వల్ల జుట్టు రాలిపోవడం జరగదు. అలా అని మరీ బిగుతుగా ఉండే టోపీలు వాడకపోవడమే మంచిది. కాస్త జుట్టుకు గాలి తగులుతూ ఉండడం చాలా అవసరం. జుట్టు తీవ్రంగా రాలిపోవడానికి, బట్టతల రావడానికి టోపీ ఏనాటికే కారణం కాదని అన్నారు నిపుణులు. ఇక హెల్మట్లు కూడా మన రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనల ప్రకారం తప్పనసరిగా ధరించాల్సిందే. అయితే దీనికి జుట్టు రాలడానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తలకు సరిపడ హెల్మట్ ధరించండి, దీంతోపాటు అదే పనిగా తలపై హెల్మెట్ ధరించకండి అంటే మధ్య మధ్యలో తీస్తు కాస్త తలకు భారం తగ్గించమంటున్నారు. అలాగే లాంగ్ డ్రైవ్ చేసేవాళ్లు కూడా విరామం తీసుకుంటూ వెళ్లండని సూచిస్తున్నారు నిపుణులు ఎందుకు రాలిపోతుందంటే.. హఠాత్తుగా జుట్టు రాలిపోతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కొసారి కొన్ని వ్యాధులకు ఇది సంకేతం కూడా కావొచ్చు. దీంతోపాటు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లను ఉంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించాలి. అలాగే తండ్రికి బట్టతల ఉన్నా... భవిష్యత్తులో కొడుకులకు, మనవళ్లకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే హార్మోన్లలో హఠాత్తుగా విపరీతమైన మార్పులు వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. ఇవిగాక గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా వస్తాయి. ఇలాంటి వారికి కూడా వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. అంతేగాక వాతావరణ కాలుష్యం వల్ల కూడా జుట్లు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడే మహిళలు, పురుషల్లో జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంది. జుట్టు చక్కగా పెరగాలంటే.. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం చాలా ముఖ్యం. మీ జీవన శైలి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే జుట్టు కూడా అంతే బలంగా పెరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల తలకు రక్తప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. తత్ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు రాలుతున్నప్పుడే వైద్యులను సంప్రదిస్తే సమస్యను అధిగమించొచ్చు. చాలా జుట్టు కోల్పోక ముందే వైద్యలను సంప్రదించడం మంచిది. అంతేగాక జుట్టు మురికి పట్టకుండా వారానికి మూడుసార్లు తల స్నానం చేయాలి. ఎప్పటికప్పుడూ నూనెలతో మర్దనా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందంగా ఉంటుంది. (చదవండి: పెదవులు గులాబీ రేకుల్లా మెరవాలంటే ఇలా చేయండి!) -
హెల్మెట్ ధరించలేదు సరికదా, అడిగితే పోలీసు వేలు కొరికేశాడు
హెల్మెట్ ధరించలేదని అడిగినందుకు ఒక వ్యక్తిట్రాఫిక్ పోలీసుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం హెల్మెట్ ధరించడం తప్పని సరి. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్న వ్యక్తి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన వివాదంలో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసుపై దుర్భాషలాడి ట్రాఫిక్ పోలీసు వేలిని కొరికిన ఘటన బెంగుళూరులో నమోదైంది. విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ దగ్గర సయ్యద్ సఫీని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ ఏదని ప్రశ్నించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ తన స్కూటర్ కీని లాక్కున్నాడు. ఆసుపత్రికి వెళుతుండగా హెల్మెట్ ధరించడం మర్చిపోయానంటూ వివరించే ప్రయత్నం చేశాడు సయ్యద్. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజాలగిహెల్మెట్ నిబంధన ఉల్లంఘించినందుకు సఫీని రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సయ్యద్, ట్రాఫిక్ పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించాడు. హెడ్ కానిస్టేబుల్ ఫోన్‌ను లాక్కొని, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారనిప్రశ్నించాడు. అలాగే తన వీడియో వైరల్‌గా మారినా నాకేం ఫరక్ పడదన్నట్టు వాదించాడు. దీంతో పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడడం, శారీరకంగా గాయపర్చడం, నేరపూరిత బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. Syed Sharif biting traffic police in Bengaluru He was caught riding bike without Helmet Usually Police don’t ask for helmets to Jali topis in bengaluru pic.twitter.com/IZ9x2o5Iks — Swathi Bellam (@BellamSwathi) February 13, 2024 -
పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది!
#HelmetsReturn Gifts:ఇటీవలి కాలంలోపెళ్ళిళ్లకు రిటన్ గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా కామన్‌గా మారింది. అలా ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తె తండ్రి ఇచ్చిన రిటన్ గిఫ్ట్ వైరల్‌గా మారింది. రిటన్ గిఫ్ట్ ఏంటి? వైరల్ కావడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా జిల్లా, ముదాపూర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ తన కుమార్తె వివాహం ఘనంగా జరిపించాడు. తన కుమార్తె, స్పోర్ట్స్ టీచర్ నీలిమతో, సరన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హాన్ యాదవ్‌తో మూడు ముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించాడు. విందు భోజనాలు కూడా ఘనంగా ఏర్పాటు చేశాడు. అయితే ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్లు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇది చూసిన అతిథులు ఆశ్చర్యపోయారు. ఇదీ చదవండి: అపుడు సల్మాన్ మూవీ రిజెక్ట్.. ఒక్క సినిమాతో కలలరాణిగా..ఈ స్టార్ కిడ్ ఎవరు? అయితే రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు వధువు తండ్రి. రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు తామిచ్చిన హెల్మెట్లు ఉపయోగడాలని భావించామన్నాడు. పెళ్లికి వచ్చిన వారిలో 60 మంది అతిథులకు స్వీట్లతోపాటు హెల్మెట్లను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చినట్లు సెద్ యాదవ్ తెలిపాడు. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా కలిసి హెల్మెట్లు ధరించి మరీ డ్యాన్సులు చేసినట్టు సంబరంగా చెప్పుకొచ్చాడు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన మద్యం తాగి వాహనాలు నడపడం మానుకోవాలని అతిథులను కోరారు. అందరూ జీవితం విలువను గుర్తించాలని పిలుపునిచ్చాడు. రోడ్డు భద్రత, హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించేందుకు తన కుమార్తె పెళ్లి వేడుక తనకొక వేదికను అందించిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అటు గిఫ్ట్స్ అందుకున్న బంధువులు, సన్నిహితులు చాలామంచి ఆలోచన అంటూ సెద్ను అభినందించారు. ఆనదంతో వారు స్టెప్పులు వేశారు. గతంలో బెంగళూరులో కూడా గతంలో బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి నమోదైంది. తమ పెళ్లికి వచ్చిన అతిథులకు హెల్మెట్లు, మొక్కలు గిఫ్ట్‌గా ఇచ్చారు నూతన జంట శివరాజ్, సవిత. ఇలా అయినా కొంతమంది ప్రాణాలైనా రక్షించగలిగితే తమకదే చాలని, అలాగే తామిచ్చిన మొక్కల్లో 500 మొక్కలు బతికినా తమకు ఆనందమేనని వెల్లడించారు. పెళ్లిళ్లలకు మందు, విందు, మ్యూజిక్ అంటూ చేసే వృధా ఖర్చులకు బదులుగా, ఇలా చేయడం ద్వారా, అటు పర్యావరణానికి, ఇటు భవిష్యత్తరాలకు మేలు చేసిన వారమవుతాంటూ వెల్లడించాడు శివరాజ్. -
హెల్మెట్ ధరించి గమ్యస్థానానికి..
దామరగిద్ద: బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించడం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు చూస్తున్నది నిజమే.. హైదరాబాద్ నుంచి నారాయణపేటకు ఆర్టీసీ బస్సు బయల్దేరగా.. కొడంగల్ సమీపంలో డ్రైవర్ ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. డ్రైవర్ తిరుపతయ్యతో పాటు కండెక్టర్ రఘువీర్‌కు గాజుముక్కలు తగిలి చేతివేళ్లకు గాయాలయ్యాయి. మరోవైపు ముసురు.. చల్లని గాలితో బస్సును నడపడం డ్రైవర్‌కు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో కొడంగల్ నుంచి బస్సు డ్రైవర్ హెల్మెట్ సహాయంతో బస్సు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. -
Video: హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్ మిస్
ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్‌లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి హెల్మెట్‌లో పాము కలకలం రేపింది. నాగుపాము బుసలు కొట్టుకుంటూ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Dev Shrestha (@d_shrestha10) ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో దేవ్ శ్రేష్ట అనే వ్యక్తి నవంబర్1న షేర్ చేశారు. ఇందులో నేలపై ఉంచిన హెల్మెట్‌లో పాము కనిపిస్తుంది. దగ్గరగా ముడుచుకొని హెల్మెట్‌లో నుంచి బయటకు చూస్తూ ఉంది. దాని దగ్గరకు ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే హెల్మెట్‌లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గమనించడంతో ప్రాణాలుదక్కించుకున్నాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. నాలుగు మిలియన్లకు పైగా వీక్షించారు. 43వేల మంది లైక్ కొట్టారు. కాగా పాములు జనావాసాల్లోకి రావడం వస్తువుల్లోకి దూరడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల కేరళలోని త్రిస్సూర్‌లో పార్క్ చేసిన బైక్ హెల్మెట్‌లో పాము దాక్కుంది. సోజన్ అనే వ్యక్తి తాను పని చేసే ప్రాంతంలో ఓ చోట బైక్ పార్క్ చేసి ఉంచాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్దామని సాయంత్రం బైక్ తీయబోయాడు. అందులో పాము పిల్ల కనిపించిడంతో నిర్ఘాంతపోయిన సోజన్.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. హెల్మెట్‌లో నుంచి దాన్ని బయటకు తీసి అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ‼️WATCH: A man in Kerala narrowly avoided a venomous snake bite when he discovered a small cobra inside his two-wheeler helmet. The incident unfolded at his workplace in Kerala’s Thrissur. Sojan, who is a native of Thrissur, had placed his helmet on the platform beside his… pic.twitter.com/8OMTiqMGYE— truth. (@thetruthin) October 8, 2023 -
అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్ టీచర్ సంపత్‌కుమార్ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్) హెల్మెట్ ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్ఎం లక్ష్మి, గైడ్ టీచర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది. -
BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?
పోలీస్ బలగాల రక్షణ కోసం తయారు చేసే హెల్మెట్లతో పాటు బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్లు, డోర్ ఫిట్టింగ్‌లకు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా నిబంధనలు తీసుకొచ్చారు. దేశ రక్షణకోసం, ప్రజల శ్రేయస్సుకోసం నిరంతరం పని చేసే పోలీస్ దళాలు మరింత పటిష్ఠంగా పనిచేసేలా చూడాలని ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగానే వారు వినియోగించే వస్తువులు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోబుతున్నట్లు ప్రకటించింది. నాసిరక ఉత్పత్తులు దేశంలోకి దిగుమతి కాకుండా నిరోధించాలని చెప్పింది. దేశీయ తయారీకి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 23న పోలీస్ దళాలు, సివిల్ డిఫెన్స్, వ్యక్తిగత భద్రతా నిబంధనలు 2023, బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్ల నిబంధనలు 2023, డోర్ ఫిట్టింగ్స్ నిబంధనలు 2023 పేరిట మూడు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ ఆదేశాల ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్క్ లేని ఈ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, దిగుమతులు, నిల్వ చేయరాదు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. -
వినబడకున్నా.. కనిపిస్తుంది! ఖమ్మం కుర్రాడి ఆవిష్కరణ!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాలు నడిపే చెవిటి, మూగ దివ్యాంగులకు శుభవార్త. వెనుక నుంచి వస్తున్న వాహనాల హారన్ శబ్దం వినిపించక దివ్యాంగులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటివారి కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్కే రజలిపాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినూత్న హెల్మెట్‌ను తయారు చేశారు. వెనుక నుంచి వచ్చే వాహనాలు హారన్ మోగించినప్పుడు.. వెంటనే హెల్మెట్ ముందుభాగంలో దీపం వెలుగుతుంది. అలా వెలగడంతో ఆ కాంతి హెల్మెట్ అద్దంపై కనిపిస్తుంది.దీంతో అప్రమత్తమై వాహనాన్ని మరింత జాగ్రత్తగా నడపవచ్చు. హారన్ నుంచి వచ్చే ధ్వని తరంగాల ఆధారంగా ఈ హెల్మెట్ దీపాలు వెలిగేలా రూపకల్పన చేయడం విశేషం. -
క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ప్రతి ఆస్ట్రేలియా ఆటగాడు (దేశవాలీ, అంతర్జాతీయ ఆటగాళ్లు) నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్‌తో బ్యాటింగ్‌కు దిగడం తప్పనిసరి చేసింది. ఇటీవలికాలంలో బ్యాటర్లు తరుచూ ఫాస్ట్ బౌలింగ్‌లో గాయపడుతుండటంతో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. సీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది ఆసీస్ క్రికెటర్లు తమ మునుపటి ప్రాక్టీస్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ తదితరులు నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడరు. సీఏ తాజా నిర్ణయంతో వీరంతా తప్పనిసరిగా మెడ భాగం సురక్షితంగా ఉండేలా హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. కాగా, నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఫిలిప్ హ్యూస్ మరణాంతరం (2012) ప్రత్యేకంగా తయారు చేయించింది. హ్యూస్ ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోయే వాడు కాదు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇంచుమించు ఇలాంటి ప్రమాదమే మరొకటి సంభవించి ఉండేది. నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ స్టీవ్ స్మిత్‌ను మెడ భాగంలో బలంగా తాకింది. అంత జరిగాక కూడా స్మిత్ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడే వాడు కాదు. ఇది ధరిస్తే అతని హార్ట్ బీట్ అమాంతంగా పెరుగుతుందని అతను చెప్పుకొచ్చేవాడు. వార్నర్ సైతం నెక్ ప్రొటెక్టర్ ధరిస్తే, అది తన మెడలోకి చొచ్చుకుపోయేదని చెప్పి తప్పించుకునే వాడు. సీఏ తాజా నిర్ణయంతో వీరు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న సిరీస్ సందర్భంగా రబాడ వేసిన ఓ రాకాసి బౌన్సర్ కెమారూన్ గ్రీన్ మెడ భాగంలో బలంగా తాకింది. అయితే అతను ఈ నెక్ ప్రొటెక్టర్ ఉండటంతో బ్రతికి బయటపడ్డాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే క్రికెట్ ఆస్ట్రేలియా నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మరోవైపు స్వదేశంలోనూ బౌన్సీ పిచ్‌లు ఎక్కువగా ఉండటంతో దేశవాలీ క్రికెటర్లు కూడా ముందు జాగ్రత్తగా ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి బ్యాటింగ్‌కు దిగాలని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన జారీ చేసింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆసీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఆసీస్ సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు టీమిండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. తదనంతరం అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. -
హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి
ఈమధ్య కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య బట్టతల. దీనికి అనేక కారణాలున్నాయి. తీసుకునే ఆహారం, నిద్ర, లైఫ్‌స్టైల్, జన్యపరమైన సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలడానికి కారణం కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ రోజూ ధరించడం వల్ల కూడా బట్టతల వస్తుందని చాలామంది అనుకుంటారు. మరి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నిజంగా జుట్టు రాలుతుందా? బట్టతల రాకుండా ఏం చేయాలి అన్నది ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలో తెలుసుకుందాం. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. బైక్‌పై రయ్రయ్ మని తిరగాలంటే హెల్మెట్ ఉండాల్సిందే. అయితే నిత్యం హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఇదే కారణంగా యువత హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. హెల్మెట్‌కి, బట్టతలకి ఎలాంటి సంబంధం లేదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి నుంచి జుట్టు పొడిపారకుండా ఉంటుంది. అయితే ఎక్కువసేపు ధరిస్తే మాత్రం తలలో వేడి పెరిగి దాని వల్ల జుట్టులో చెమటకి దారితీస్తుంది.నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. మంచి క్వాలిటీ హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు కాపాడటమే కాకుండా జుట్టుకు ఎలాంటి ఇబ్బంది రానివ్వదు. అందుకే మంచి సౌకర్యవంతమైన, నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి. బట్టతల రాకుండా ఏం చేయాలి? ►హెల్మెట్‌ను వాడిన తర్వాత గాలి తగిలే చోట ఉంచాలి. రెండు, మూడు రోజులకోసారి ఎండలో ఉంచాలి. ► హెల్మెట్ లోపల ఉండే కుషనింగ్ మీద ఉన్న మురికిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ► హెల్మెట్ తీసేటప్పుడు కొందరు చాలా ఫాస్ట్‌గా తీస్తుంటారు. అలా చేయరాదు. ► ఎందుకంటే అప్పటికే చాలాసేపటి వరకు హెల్మెట్ జుట్టుకు అతుక్కొని ఉంటుంది. కాబట్టి హెల్మెట్ తీసేటప్పుడు మెల్లిగా తీయండి ► చండ్రు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వేరేవాళ్ల హెల్మెట్లు వాడకపోవడమే మంచిది. ► హెల్మెట్ వాడటానికి ముందు లోపలిభాగంలో ఒక క్లాత్ ఉంచండి. దీనివల్ల జుట్టు దెబ్బతినదు. ► చాలామంది తలస్నానం చేసిన వెంటనే తడి ఆరకుండానే హెల్మెట్ ధరిస్తుంటారు. అలా అస్సలు చేయొద్దు. ► జుట్టు పూర్తిగా పొడిగా మారిన తర్వాతే హెల్మెట్ ధరించాలి. లేకపోతే ఫంగల్, దురద సమస్యలు వస్తాయి. ► అంతేకాకుండా తడిజుట్టుపై హెల్మెట్ ధరిస్తే జుట్టు బలహీనంగా మారి త్వరగా ఊడిపోతుంది కూడా. ► వీటన్నింటితో పాటు తరచుగా నూనెతో మర్దనా చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ► మంచి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. ►మానసిక ఒత్తిడితో బాధపడేవాళ్లలో జుట్టు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్ సిస్టమ్ మీద ప్రభావితం చూపిస్తుంది. -
రోజూ హెల్మెట్ వాడుతున్నారా? బాక్టీరియా, క్రిములు..
నిత్యం మనకు సంరక్షణగా ఉండే హెల్మెట్ ప్రాణాలనే కాదు దుమ్ము, ధూళి నుంచి కూడా కాపాడుతుంది. మరి దుమ్ము, ధూళితో నిండే ఆ హెల్మెట్‌ని శుభ్రం చేసుకోవడం ఎలా? పరిష్కారం ఇదిగో.. ఈ డ్రైయర్! ఇది క్రిములు, వైరస్లు, దుర్వాసన కలిగించే బాక్టీరియా, వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వంటివన్నిటినీ చంపేస్తుంది. 99.99 శాతం శుభ్రపరుస్తుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్, హాఫ్ ఫేస్ హెల్మెట్, సైకిల్ హెల్మెట్ ఇలా అన్నింటికీ ఉపయోగపడుతుంది. మరోవైపు ఈ డివైస్‌తో.. సాక్స్, గ్లౌవ్స్, షూ వంటివాటినీ ఆరబెట్టుకోవచ్చు. అందుకు వీలుగా చిత్రంలో ఉన్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి కుడివైపే ఉంటాయి. సూపర్‌గా ఉంది కదూ!. ఈహెల్మెట్ డ్రైయర్ ధర కేవలం 53 డాలర్లు(రూ.4356)మాత్రమే. -
బండి మాకొద్దు బాబోయ్..!
నిబంధనలు ఉల్లంఘించి జరిమానాకు గురవుతున్న వాహనదారులు తమ వాహనాలను స్టేషన్లలోనే వదిలేస్తున్నారు. ఫైన్లు పెద్దమొత్తంలో ఉండడంతో వాటిని చెల్లించలేక సతమతం అవుతున్నారు. దీంతో సీజ్ చేసిన వాహనాలతో రాజధాని చైన్నెలోని పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి. సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారికి, మద్యం మత్తులో వాహనం నడిపి పట్టుబడ్డ వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పెద్దమొత్తంలో ఫైన్లు విధిస్తున్నారు. దీంతో జరిమానాలు చెల్లించలేక తమ వాహనాలను వదులు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాదిన్నర కాలంలో 50 వేల వాహనాలు పోలీసు స్టేషన్లకు పరిమితమై తుప్పు బడుతుండడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో 371 వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల దూకుడు.. చైన్నెతో పాటు ఇతర నగరాల్లో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువే. ఇలాంటి వారి భరతం పట్టే రీతిలో ట్రాఫిక్ పోలీసులు దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపే వారు కొందరు అయితే, ట్రిబుల్ రైటింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు మరికొందరు. సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారు కూడా ఎక్కువే. వీరితోపాటు రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారికీ పోలీసులు జరిమానాల మోత మోగిస్తున్నారు. తాజాగా మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రావడంతో జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలూ మరింత కఠినతరం అయ్యాయి. గత ఏడాదిన్నర కాలంగా చైన్నెలోనే కాదు రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలలో ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకుండా ముందుకు సాగే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకెళ్తున్నారు. జరిమానాలు చెల్లించలేక.. ట్రాఫిక్ నిబంధనల్ని పదే పదే ఉల్లంఘించడం, ప్రమాదాలకు కారకులుగా ఉండే వాహన చోదకులు, మందు బాంబులకు రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత ఆధారంగా ఈ చెలాన్లపై అధిక దృష్టి పెడుతున్నారు. వాహనాలను సీజ్ చేయడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు లేదా కోర్టుల్లో వాటి యజమానులు జరిమానా చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులే కాదు, నేర విభాగం పోలీసులు సైతం జరిమానాల వడ్డనలో బిజీగానే ఉన్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ జరిమానాలు చెల్లించ లేక అనేక మంది తమ వాహనాలను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక వేగం, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి రూ. 10 వేలు జరిమానా విధిస్తుండడంతో వాటిని చెల్లించే పరిస్థితి లేక వాహనాలను పోలీసు స్టేషన్ల వద్దే వదలి పెట్టి వెళ్తున్నారు. పోలీసులు తమను పట్టుకున్న చోటే వాహనం వదిలి ఉడాయించే వారూ ఉన్నారు. ఇక, రూ. 10 వేలు కూడా విలువ చేయని తమ వాహనానికి ఎందుకు అంత భారీస్థాయిలో జరిమానా కట్టాలన్నట్లు.. వాహనం మీరే ఉంచుకోండి అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. తుప్పు పడుతున్న వాహనాలు గత ఏడాదిన్నర కాలంలో 50 వేల వాహనాలకు చెందిన యజమానులు జరిమానా చెల్లించక పోవడంతో ఆ వాహనాలన్నీ పోలీసు స్టేషన్ల బయట, పోలీసులకు సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో పార్క్ చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 43 కోట్ల వరకు జరిమానా విధించారు. ఇందులో రూ. 16 కోట్లు మాత్రమే వసూళ్లైంది. జరిమానా చెల్లించిన వారి వాహనాలను తిరిగి అప్పగిస్తున్నారు. చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న మిగిలిన వారి వాహనాలు పోలీస్ స్టేషన్ల సమీపంలో రోడ్ల మీద తప్పుబట్టే విధంగా పడి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వాళ్లే ఉన్నట్టు పరిశీలనలో తేలింది. ఇక సీజ్ చేసిన వాటిలో 371 వాహనాలను వేలం వేయాలని చైన్నెలోని పోలీసు అధికారులు తాజాగా నిర్ణయించారు. -
రేయ్! మారండ్రా.. హెల్మట్ ధరించి మరీ రైడ్ చేస్తున్న కుక్క
ట్రాఫిక్ పోలీసుల మన రక్షణ కోసమే హెల్మట్‌ని ధరించమని చెబుతున్నా సరే చాలామంది వాహనదారులు అస్సలు లక్ష్యపెట్టరు. పోలీసులకు పట్టుబడిన తీరు మారకపోగా జరిమానాలు కట్టేందుకు రెడీ అయ్యిపోతుంటారు. ఎందుకు ధరించడం లేదని అధికారులు ప్రశ్నించినా ఏదో ఒక కారణం చెప్పి జారుకునేందుకే ట్రై చేస్తారే తప్ప బాధ్యతగా వ్యవహరించరు. నన్ను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి అన్నట్లుగా కుక్క హెల్మట్ ధరించి మరీ బైక్‌పై రైడ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి వెనుకాల ఓ కుక్క హెల్మట్ ధరించి.. మనిషి మాదిరిగా కూర్చొని వెళ్తోంది. నిజానికి బైక్ నడిపేవాడు మాత్రమే గాక వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా పిలియన్ రైడర్‌గా హెల్మట్ ధరించాల్సిందే. కానీ చాలామంది ప్రయాణకులు హెల్మట్‌ని ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి తెచ్చకుంటున్నారు. ఐతే ఆ వీడియోని ఓ ట్విట్టర్ వినియోగ దారుడు 'రూల్ ఇస్ రూల్' అనే క్యాప్షనతో ఓ కుక్క ప్రయాణికుడి మాదిరిగా బైక్‌పై హెల్మట్ ధరించి వెళ్తోందంటూ.. వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Rule is rule..😜#WhatsApp #instagramdown #TamilNadu pic.twitter.com/g47mB5mEfY — Mohammed Nayeem (@PMN2463) May 23, 2023 (చదవండి: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు..) -
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
బాలీవుడ్ స్టార్స్ ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్ ఇదే!
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ బైక్ రైడ్‌పై ముంబయి పోలీసులు స్పందించారు. అమితాబ్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి వెళ్లారు. అయితే బైక్‌పై ఇద్దరు ఎలాంటి హెల్మెట్ లేకుండా కనిపించారు. బైక్‌పై కూర్చొని ఉన్న చిత్రాన్ని బిగ్ బీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై ముంబయి పోలీసులు సైతం స్పందించారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (ఇది చదవండి: పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి) మరోవైపు బాలీవుడ్ నటి అనుష్క శర్మ సైతం ఎలాంటి హెల్మెట్ లేకుండా బైక్‌పై కనిపించారు. తన బాడీగార్డ్‌తో బైక్ రైడ్ చేస్తూ కనిపించింది. వాళ్లద్దరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో నెటిజన్స్ వెంటనే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మలపై ముంబయి పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2024లో విడుదల కానుంది. ఇదే కాకుండా బిగ్ బి రిభు దాస్‌గుప్తా మూవీ కోర్ట్ రూమ్ డ్రామా సెక్షన్ 84లో కనిపించనున్నారు. ఆ తర్వాత అతను టైగర్ ష్రాఫ్, కృతి సనన్ చిత్రం గణపత్‌లో కూడా నటించనున్నారు. (ఇది చదవండి: లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) మరోవైపు.. అనుష్క చివరిసారిగా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో కలిసి జీరోలో కనిపించింది. ఈ ఏడాది ఆమె చక్దా 'ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి సినిమాల్లోకి రానుంది. తన కూతురు వామిక పుట్టిన తర్వాత ఆమెకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. #AnushkaSharma ditches the car and takes a bike ride to travel in the city! pic.twitter.com/jUwiCsyhbJ — Pinkvilla (@pinkvilla) May 15, 2023 We have shared this with traffic branch. @MTPHereToHelp — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) May 15, 2023 -
కొత్త బండి.. రెండు హెల్మెట్లు!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తుండటం... కొన్ని సందర్భాల్లో వాహనదారులు హెల్మెట్ ధరించినా వెనుక కూర్చొనే వ్యక్తులకు (పిలియన్ రైడర్) హెల్మెట్ లేక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంతో ఈ తరహా ప్రమాదాలను నివారించాలని పోలీసులు భావిస్తున్నారు. వాహనదారుడితోపాటు వెనుక కూర్చొనే వారు సైతం హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వెళ్లనున్నారు. ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలోనే రెండు నాణ్యమైనహెల్మెట్లను కొనడాన్ని తప్పనిసరి చేస్తే మరింత ఫలితం ఉంటుందని యోచిస్తున్నారు. నూతన ద్విచక్ర వాహన ధరతోపాటు రెండు నాణ్యమైన హెల్మెట్ల ధరను సైతం జోడించి షోరూంలు విక్రయించేలా చూడాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాలనుకుంటున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీన్ని అమలు చేసేలా రవాణా శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పోలీసు శాఖ తరఫున కోరనున్నట్లు చెప్పారు. ఇలా రెండు హెల్మెట్ల వాడకం క్రమంగా పెరిగితే రోడ్డు ప్రమాదాలు జరిగినా ద్విచక్రవాహనదారుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని ఆ అధికారి పేర్కొన్నారు. -
హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన మహిళా పోలీసులు.. నెటిజన్ల ఫైర్..
ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం మన దేశంలో తప్పనిసరి. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. మోటారు వాహన చట్టం సెక్షన్ 129లో ఈ నిబంధన ఉంది. దీంతో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే ముంబైలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ ధరించకుండానే స్కూటీ నడపడం చూసిన ఓ వ్యక్తి వెంటనే ఫొటో తీశాడు. ఓ సాధారణ పౌరుడు ఇలా చేస్తే ఉరుకుంటారా అని అధికారులను ప్రశ్నిస్తూ ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు వీళ్లకు వర్తించవా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ఫైర్ అయ్యాడు. MH01ED0659 What if we travel like this ?? Isn't this a traffic rule violation ?@MumbaiPolice @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/DcNaCHo7E7 — Rahul Barman (@RahulB__007) April 8, 2023 దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ఈ మహిళా పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరేమో.. రూల్స్ ఎప్పుడూ సామాన్యులకే వర్తిస్తాయి, చట్టాలు చేసేవారికి, చట్టపరిరక్షకులకు అవి వర్తించవు అని అసహనం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. ఆ ఫొటో సరిగ్గా ఎక్కడ తీశారో చెప్పాలని పోస్టు చేసిన వ్యక్తిని అడిగారు. దీంతో అతడు ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే (దాదర్) అని బదులిచ్చాడు. అనంతరం ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మాతుంగా ట్రాఫిక్ డివిజన్ పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారే చేశామని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు శాంతించారు.భారత్‌లో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తారు. ఇదే తప్పును పదే పదే రిపీట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తారు. అరుదైన సందర్బాల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. చదవండి: ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. మైండ్ దొబ్బిందా..? -
బండెక్కితే భయమే! రాష్ట్రంలో రోజూ 20 మంది మృతి.. టాప్ 10లో తెలంగాణ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రోడ్డెక్కగానే బండిని రయ్‌మంటూ పరుగెత్తిస్తారు.. జన సంచారం ఉండని హైవేలపై అయితే వాయు వేగంతో పోటీ పడతారు.. ఇలా దూసుకుపోతే ఆ కిక్కే వేరనుకుంటారు.. దీనికోసం ట్రాఫిక్ నిబంధనలనూ బేఖాతరు చేస్తారు.. ఇందులో కిక్కు ఎంత వస్తుందో వారికే తెలుసుగానీ.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం మాత్రం పెరిగిపోతోంది. రహదారులపై బ్లాక్ స్పాట్లు, వాహన వేగ నియంత్రణలో వైఫల్యం, హెల్మెట్, సీటుబెల్టు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వంటివి వేలకొద్దీ మరణాలకు కారణమవుతున్నాయి. కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. దీనితో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువై ప్రమాదాలు– మరణాల శాతం పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు. ప్రమాద మృతుల్లో 35ఏళ్ల లోపు వారే 46.3శాతం ఉంటుండటంపై ఆందోళన కరమని పేర్కొంటున్నారు. 2021 సంవత్సరానికిసంబంధించి కేంద్ర రవాణాశాఖ ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించిన గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయి. అతి వేగమే.. చంపేస్తోంది ♦ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18–35 ఏళ్లలోపు వారే అత్యధికంగా (46.3శాతం) ఉన్నారు. ఇందులోనూ 45.1శాతం టూవీలర్స్‌పై, 12.9 శాతం కార్లలో ప్రయాణిస్తున్నవారుకాగా.. 18.9శాతం మంది పాదచారులు. ♦ 71.7శాతం ప్రమాదాలు అతివేగంతో డ్రైవర్ వైఫల్యం వల్లే చోటు చేసుకున్నాయి. ఇందులో 31శాతం కొత్త వాహనాలు (5 ఏళ్లలోపువే) నడిపేవారే చేశారు. 9.5 శాతం మంది మద్యం–సెల్‌ఫోన్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాల బారినపడ్డారు. ♦ ప్రమాదాలు చేసిన వారిలో ఏడు శాతం మందికి లైసెన్స్‌లు కూడా లేకపోవడం గమనార్హం. ♦ నేషనల్ హైవేలపైనే అత్యధిక ప్రమాదాలు–మరణాలు చోటు చేసుకున్నాయి. 2021లో 1,28,825 (31.6శాతం) ప్రమాదాలు, 56,007 మరణాలు హైవేలపైనే నమోదయ్యాయి. ఆ ఏడాది తెలంగాణలోని హైవేల 2,735 మంది చనిపోయారు. ♦ 10 లక్షలు జనాభా దాటిన నగరాల్లో రోడ్డు ప్రమాదాల విషయంలో చెన్నై, ఢిల్లీ, జబల్పూర్లో తొలి మూడు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ 8వ ప్లేస్‌లో ఉంది. మహానగరాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పాదచారులే. హైవేలపై లోపాలు సరిదిద్దక.. తెలంగాణ మీదుగా వెళుతున్న ప్రధాన హైవేలపై లోపాలను సరిదిద్దే అంశం వేగంగా ముందుకు కదలటం లేదు. అత్యధిక ప్రమాదాలు జరిగే హైవే–65 (మచిలీపట్నం– హైదరాబాద్– పుణే), హైవే–44 (కన్యాకుమారి–కశ్మీర్), హైవే–563 (భూపాలపట్నం–హైదరాబాద్)లపై పలుచోట్ల ఇంజనీరింగ్ లోపాలను గతంలోనే గుర్తించారు. వాటితో ప్రమాదాలు జరుగుతున్నట్టూ తేల్చారు. కానీ వాటిని సరిదిద్దే విషయంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా హైవే–65పై కోదాడ, మునగాల, కట్టంగూర్, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో అండర్‌వేలు నిర్మించాల్సి ఉంది. మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియే పూర్తికాలేదు. హైవే–44లోనూ నిర్మల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఇంజనీరింగ్ లోపాలు అలానే ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? తెలంగాణలో ప్రమాదాల నియంత్రణ దిశగా నూతన మోటార్ వెహికల్ యాక్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్‌లో లోపాలను సరిచేయడం, సైన్‌బోర్డులు, ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ను పెంచటం, ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందే చర్యలు తీసుకోవడం అవసరమని స్పష్టం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా తగిన అవగాహన కల్పించాలని పేర్కొంటున్నారు. ప్రమాదాల్లో యూఎస్.. మరణాల్లో భారత్.. వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్–2020 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 19,27,654 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్య (36,650)లో మూడో స్థానంలో నిలిచింది. భారత్ 4,12,432 ప్రమాదాలతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా.. 1,53,972 మృతులతో మరణాల సంఖ్యలో మాత్రం టాప్‌లో నిలిచింది. అమ్మానాన్నను రోడ్డు మింగింది గత ఏడాది డిసెంబర్ 11న సూర్యాపేట జిల్లా అనంతగిరి నుంచి ఖమ్మం జిల్లా జల్లేపల్లికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో రమేష్–రేణుక దంపతులు మృతిచెందడంతో.. వారి పిల్లలు కార్తీక్, హాసిని అనాథలుగా మారిపోయారు. -
హెల్మెట్‌లో దాక్కున్న ప్రమాదకరమైన పాము.. బుస్ బుస్‌మంటూ..
-
Crime News: దా.. బండెక్కు! అన్నాడు..
క్రైమ్: పొరుగింట్లో ఉంటోంది.. కాస్త చనువు ప్రదర్శిద్దామనుకున్నాడో ఏమో.. వచ్చి బండెక్కు అన్నాడు!. అయితే.. ఆమె ప్రతికూలంగా స్పందించింది. అవమానంగా అనిపించింది కాబోలు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. నడిరోడ్డు మీదే ఆమెపై దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రి పాలుకాగా, పరారీలో ఉన్నాడు నిందితుడు. హర్యానా గురుగ్రామ్‌లో ఓ మహిళపై వ్యక్తి దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వీడియో వైరల్ కావడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రేస్ చేసి నిందితుడ్ని కమల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ మనోజ్ మీడియాకు వెల్లడించారు. బాధితురాలు కమల్ పక్క ఇంట్లోనే ఉంటోందని విచారణలో తేలింది. ఆటోలో ఆమె కూర్చుని ఉండగా.. బైక్ మీద వచ్చిన కమల్ ఆమెతో మాట్లాడాడు. వచ్చి తన బైక్ ఎక్కాలని ఆమెను కోరాడు. అయితే ఆమె అంగీకరించకపోవడంతో.. కోపంతో ఊగిపోతూ ఆమెపై దాడికి దిగాడు. చేతిలో ఉన్న హెల్మెట్‌తో బాదేశాడు. స్థానికులు కొందరు గుమిగూడి.. కమల్‌ను నెట్టేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ మనోజ్ పేర్కొన్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి -
సీటుబెల్ట్ ధరించక 16 వేల మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా, 7,959 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులు, మిగతా 13,716 మంది ప్రయాణికులు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది దుర్మరణం పాలవగా, 3,84,448 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో హెల్మెట్ ధరించని వారు 93,763 మంది, సీటు బెల్ట్ ధరించని వారు 39,231 మంది అని పేర్కొంది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 8.2% డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, జంపింగ్ రెడ్ లైట్, సెల్ ఫోన్ వాడకం వంటి కారణాలతోనే జరిగాయని తెలిపింది. జాతీయ రహదారులపై జరిగే 9.35% ప్రమాద మరణాలకు ఇవే కారణాలని తెలిపింది. 67.5% ప్రమాదాలు తిన్నగా ఉండే రహదారులపై జరుగుతున్నాయి. గుంతలు, ఇరుకుగా, ఏటవాలుగా ఉండే రోడ్లపై 13.9% ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషించింది. కూడళ్లలో 20% ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టి–జంక్షన్లలో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోవడమో, గాయపడటమో జరుగుతోందని తెలిపింది. 2021లో అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే నాలుగింట మూడొంతుల ప్రమాదాలు సంభవించగా, మంచు, వర్షం, గాలుల తీవ్రత వల్ల 16% ప్రమాదాలు జరిగాయని వివరించింది. దేశంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. -
ఫైబర్ హెల్మెట్: క్షేమంగా... లాభంగా.. సవాళ్లను ఎదుర్కొనే సాహసం ఉంటేనే!
బ్రాండ్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఆల్పన పరీదా రైడర్ సెంట్రిక్ స్టార్టప్‌తో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ‘యువత మనసుతో ఆలోచిస్తాను’ అని చెప్పే పరీదా తన స్నేహితురాలు, వ్యాపార దిగ్గజం ఫల్గుణీ నాయర్ చెప్పిన మాటను శిరోధార్యంగా భావిస్తుంది. ‘ఆసక్తి మాత్రమే కాదు. సవాళ్లను ఎదుర్కొనే సాహసం ఉండాలి’ అంటూ ముందుకు సాగుతోంది. బ్రాండ్ డిజైన్, డిజైన్ థింకింగ్ ఏజెన్సీ ‘డివై వర్క్స్’లో పనిచేయడానికి ఆల్పన పరీదా బెంగళూరు నుంచి ముంబైకి వెళుతున్నప్పుడు తన మదిలో ఎన్నో ఆలోచనలు. అందులో అనుకూలమైన వాటితోపాటు ప్రతికూలమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ‘డివై వర్క్స్’లో చేరిన తరువాత తాను ఉద్యోగి మాత్రమే కాలేదు. విద్యార్థి కూడా అయింది. ‘డిజైన్ అనేది కస్టమర్‌ను ఎలా ఆకట్టుకుంటుంది, ప్రాడక్ట్ వైపు వచ్చేలా ఎలా చేస్తుంది...మొదలైన విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను’ అంటుంది పరీదా. ఫ్రానెస్కో ముట్టి అనే పాస్తా, పిజ్జా సాస్ తయారీ కంపెనీ కోసం తాను పని చేయాల్సి వచ్చింది. దీనికోసం క్షేత్రస్థాయిలో ఎంతోమందిని కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చాలామంది కస్టమర్స్ గ్లాస్ జార్స్‌ను ఉపయోగించడాన్ని ఇష్టపడడం లేదని అర్థం చేసుకున్న ఆ కంపెనీ గ్లాస్ బాటిల్స్‌లో సాస్ అమ్మడం మొదలుపెట్టింది. ఇది సత్ఫలితాన్నిచ్చింది. సొంతంగా కంపెనీ ఐఐఎం, అహ్మదాబాద్‌లో పీజీడిఎం(పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్) చేసింది పరీదా. ‘ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు, ఉద్యోగం చేయలేకపోతున్నాననే బాధ మహిళల్లో ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడేమో, కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. అందుకే ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు’ అంటుంది పరీదా. మార్కెటింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన పరీదాకు సొంతంగా కంపెనీ మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో తాను నేర్చుకున్న విషయం గుర్తొచ్చింది. ‘ఎక్కడ అవసరం, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అనేవి ప్రాడక్ట్ విషయంలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు. ఆ తరువాతే... విజువల్ ఐడెంటిటీ, బ్రాండ్ గురించి ఆలోచించాలి’ ఆ సమయంలో తన దృష్టి హెల్మెట్లపై పడింది. మన దేశం టూ–వీలర్స్ రైడర్స్‌కు పెట్టింది పేరు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కానీ బైక్‌లతో పోల్చితే హెల్మెట్ల డిజైన్‌లో పెద్దగా మార్పు లేదు. ‘టీవ్ర’కు శ్రీకారం తన ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంతోమంది రైడర్స్‌తో మాట్లాడి హెల్మెట్ల విషయంలో వారి అభిప్రాయాలు తెలుసుకుంది. ‘ప్లాస్టిక్ అనేది బకెట్స్కు బాగుంటుంది. మన తలను రక్షించడానికి కాదు. అందుకే ట్రాక్రైడర్స్ అందరూ కాంపోజిట్ ఫైబర్ హెల్మెట్లనే వాడతారు’ అంటున్న పరీదా టూ–వీలర్స్ కోసం ‘టీవ్ర’కు శ్రీకారం చుట్టింది. గ్లాస్ ఫైబర్ అండ్ కార్బన్ ఫైబర్ హెల్మెట్ల తయారీ కంపెనీ ఇది. తక్కువ బరువు ఉండడం ఈ హెల్మెట్ల ప్రత్యేకత. సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘నైకా’ వ్యవస్థాకురాలు ఫల్గుణీ నాయర్ పరీదాకు ఐఐఎం–అహ్మదాబాద్‌లో క్లాస్మేట్. ఒక విధంగా చెప్పాలంటే పరీదాకు స్ఫూర్తిని ఇచ్చింది నాయరే. పరీదా సాధించిన విజయాలను బట్టి, ఆమెలో ఉత్సాహం మాత్రమే లేదని, సవాళ్లను ఎదుర్కొనే సాహసం మెండుగా ఉందని, ఆ సాహసమే తన వ్యాపారాన్ని ముందుకు నడిపించే ఇంధనమని అర్థం అవుతుంది. చదవండి: SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి.. -
ప్రూఫ్ ఏంటంటూ నిలదీసిన వాహనదారుడు.... పోలీసుల రియాక్షన్‌తో సైలెంట్
రోడ్లపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మట్ ధరించడం తప్పనిసరి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ధరించకపోతే ట్రాఫిక్ పోలీసలు ఫోటో తీసి చలాన్ పంపించడం వంటివి చేస్తారు. ఇది సర్వసాధారణం. మాములుగా ఎవరైనా చలాన్ చూసుకుని కట్టడం వంటివి చేస్తారు గానీ ఎప్పుడూ జరిగింది ఏంటని ఎవరూ పోలీసులను నిలదీయరు. కానీ ఇక్కడొక వాహనదారుడు మాత్రం ఎవిడెన్స్ కావాలంటూ పోలీసులకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. వివారల్లోకెళ్తే...ఫెలిక్స్రాజ్ అనే వ్యక్తి బెంగళూరు రహదారిపై హెల్మట్ ధరించకుండా స్కూటర్‌పై ప్రయాణించాడు. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతనికి తన బండి, నెంబర్ ప్లేట్ ఫోటోలు తీసి పంపించి ఫైన్ విదిస్తూ చలాన పంపించారు. దీంతో సదరు వాహనదారుడు ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశిస్తూ..మీరు నా బండి ఫోటో, నెంబర్ ప్లేట్ పంపించారు. కానీ నేను రైడ్ చేస్తున్నట్లు చూపించలేదు. కాబట్టి నేనే రైడ్ చేశాననడానకి ప్రూఫ్ ఏంటని ప్రశ్నించాడు. గతంలో ఇలానే పంపిచారని, జరిమాన చెల్లించానని చెప్పుకొచ్చాడు. మళ్లీ మళ్లీ ఇలా జరిగితే ఊరుకోను. తాను హెల్మట్ లేకుండా ప్రయాణించినట్లు ప్రూఫ్ చూపించండి. అప్పుడే ఫైన్ కడతా లేకపోతే మీరు కేసు అయినా తీసేయండి అని పోలీసులకే సవాలు విసురుతూ ట్వీట్ చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి.... అతగాడు డ్రైవ్ చేస్తున్న ఫోటో తోపాటు ఎప్పుడూ ఏ సమయంలో ఎలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడో వంటి ఆధారాలు, పోటోలతో సహా పోస్ట్ చేశారు. దీంతో సదరు వాహనదారుడు... ఆధారాలు సమర్పించినందుకు ట్రాఫిక్ పోలీసులకు ధన్యావాదాలు. ఇలా ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని సమర్థించుకోవడమే గాక ఫైన్ కట్టేస్తానని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన సంబంధించిన విషయాన్ని వివరిస్తూ ఫోటోలను ట్విట్టర్లో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు సదరు యువకుడి తీరుపై మండిపడటమే గాకుండా హెడ్ ఫోన్స్పెట్టుకుని మరీ వాహనాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది కాబట్టి పోలీసులు మరో నేరం మోపి అరెస్టు చేయాలి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. pic.twitter.com/jRd7FX0KNs — ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) October 19, 2022 (చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!) -
రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!
నిబంధనలకు అందరికీ వర్తిస్తాయి. అందుకు ఎవరూ అతీతులు కారు అని నిరూపించింది ఇక్కడ జరిగిన ఒక సంఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే...ఇక్కడోక పోలీసు సరైన హెల్మట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీస్‌కి అడ్డంగా దొరికిపోయాడు. అతనిపై హెల్త్ హెల్మెట్ కేసు బుక్‌చేసి కేసు నమోదు చేశారు ఈ ఘటన బెంగళూరులోని ఆర్టీ నగర్లో చోటు చేసుకుంది. నగర రహదారులపై ఇలా ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. ఇలా గేర్‌లెస్ స్కూటర్ నడుపుతున్నప్పుడూ.. ఆఫ్ హెల్మట్ ధరించడం నేరం. ఈ మేరకు ఆర్టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ట్విట్టర్లో... ఇలా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక పోలీస్‌పై ట్రాఫిక్ పోలీసు కేసు నమోదు చేసి జరిమానా విధించిన విషయాన్ని వివరిస్తూ..ఆ ఘటనకు సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ వైరల్ ఫోటోని చూసి పోలీసులు సైతం నిబంధనలను అతిక్రమించడానికి వీల్లేదన్నట్లుగా జరిమానా విధించారంటూ... పలువురు ప్రశంసిస్తే, మరికొంతమంది ఇది స్టేజ్ స్టంట్ కాబోలు లేకపోతే సదరు వ్యక్తి ఫోటోలో ఎలా నవ్వుతున్నాడంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజకీయ నాయకుడి విడుదల...అట్టహాసంగా ఘనస్వాగతం) -
హెల్మెట్ లేకుంటే నా ‘తోపుడు బండి’ని ఆపేస్తారు సార్..!
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఎవరూ లేరు కదా అని హెల్మెట్ పెట్టుకోకపోయినా.. నిఘా కెమెరాల ద్వారానే చలాన్లు జారీ చేస్తున్నారు పోలీసులు. దీంతో భారీగా జారీ అవుతున్న చలాన్లతో ప్రజలు బెబెలెత్తిపోతున్నారు. కొందరు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారుకూడా. ఈ క్రమంలో తోపుడు బండిపై కూరగాయలు విక్రయించే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుంటే నా బండిని పోలీసులు ఆపేస్తారు సార్ అంటూ అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియోను షాకాస్మ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. తోపుడు బండికి హెల్మెట్ ఎందుకు ధరించావని వీడియో తీసిన వ్యక్తి అడిగాడు. దానికి,హెల్మెట్ లేకుంటే పోలీసులు అడ్డుకుంటారని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఈ నిబంధన కేవలం బైక్‌లకు మాత్రమేనని ఆ వ్యక్తికి వివరించే ప్రయత్నం చేశాడు వీడియో తీసిన వ్యక్తి. ట్విటర్లో వీడియో షేర్ చేస్తూ బ్రదర్ నీ తెలివి అమోఘం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అక్టోబర్ 9వ తేదీన వీడియో పోస్ట్ చేయగా.. 28,800వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫైన్లు వేస్తున్నారనే కారణంగా అమాయకులు భయపడుతున్నారు, చాలా బాధకరమైన విషయం, సరైన అవగాహన లేదు అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. కొందరి తప్పుడు సూచనలతో అమాయకులు భయపడుతున్నారంటూ మరొకరు పేర్కొన్నారు. Bhai apka knowledge to Kamal hai bhai 🤣🤣 pic.twitter.com/twjvQhNe6a — ShaCasm (@MehdiShadan) October 9, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
విచిత్రమైన తలపాగ.. ఫ్యాన్ హెల్మెట్ ధరించిన వ్యక్తి: వీడియో వైరల్
సృజనాత్మకతకు కాసింత మేథస్సును జోడించి కొత్త కొత్త ఆవిష్కరణలను సృష్టించిన వారెందరో ఉన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి పుట్టుకొచ్చినవే. అచ్చం అలానే ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్‌పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఎందుకలాగా అంటే..ఆయన ఎండలో వెళ్లినప్పడూ ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడేవారు. అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు. అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ...ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు. అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. అదే సోలార్ శక్తితో పనిచేసే ప్యాన్ హెల్మట్. ఆ వ్యక్తి ఒక హెల్మట్కి ఫ్యాన్, సోలార్ ప్లేట్ అమర్చి హెల్మట్ మాదిరిగా ధరించాడు. చూసేందుకు తలపాగ మాదిరిగా ఉంది. ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు. జనాలు కూడా ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS — Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022 (చదవండి: ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే లవ్‌లో పడ్డా: లవ్ స్టోరీ వైరల్) -
హెల్మెట్ ధరించి బస్సు డ్రైవింగ్.. కారణం తెలిస్తే షాక్!
లక్నో: సాధారణంగా బైక్‌పై వెళ్తే హెల్మెట్ ధరిస్తాం. కానీ, కారు, బస్సు, ట్రక్కుల్లో హెల్మెట్ ధరించటం ఎప్పుడైనా చూశారా? ఓ డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. లోని బస్ డిపోకు చెందిన ఆ బస్సు డ్రైవర్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలు హెల్మెట్ ధరించిన కారణం తెలిస్తే మీరు షాకవుతారు. రోడ్డుపై వెళ్తున్న బస్సును ఓ వ్యక్తి వెంబడించి మరీ వీడియో తీశాడు. ఆ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. దీంతో గాయాలబారిన పడకుండా, వర్షం, గాలి నుంచి రక్షణ కోసం ఇలా డ్రైవర్ హెల్మెట్ ధరించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం లోని బాగ్పత్ సరిహద్దులో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో బస్సును ఢీకొట్టటం వల్ల ముందు అద్దాలు పగిలిపోయాయని డ్రైవర్ చెప్పినట్లు వెల్లడించారు. Picture of UP Roadways bus clicked in Baghpat pic.twitter.com/0hkJAimkfG — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 ఇదీ చూడండి: కదులుతున్న ట్రక్కుపై సూపర్ హీరోలా ఫీట్లు.. వీడియో వైరల్ -
రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో
ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందో ఊహించలేం. చేయని తప్పుకు కూడా కొన్నిసార్లు అనుకోకుండా బలికావాల్సి వస్తోంది. అచ్చం ఓ మహిళకు కూడా ఇలాంటి ఓ భయంకర సంఘటనే ఎదురైంది. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఊహించని ఈ ఘటన మలేషియాలో జరిగింది. తన స్నేహితురాలితో కలిసి మహిళ తేలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్ వైపు వెళుతోంది. అయితే రహదారి పక్కన కొన్ని కొబ్బరి చెట్లు రోడ్డుపైకి వంగి ఉన్నాయి. ఇంతలో ఒక కొబ్బరి చెట్టుపై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళ తలపై నేరుగా పడింది. దీంతో మహిళ ఒక్కసారిగా స్కూటర్ పై నుంచి రోడ్డుపై పడిపోయింది. అయితే మహిళ హెల్మెట్ ధరించి ఉండటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. వెంటనే స్కూటర్‌పై ఉన్న స్నేహితురాలు, స్థానికులు అప్రమాత్తమయ్యారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కాగా టూవీలర్ వెనకాల వెళ్తున్న కారు డ్యాష్ బోర్డుపై ఉన్న కెమెరాలో రికార్డైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. చదవండి: ‘యూకే ప్రధాని’ని ఛేజ్ చేస్తున్నపోలీసులు!: వీడియో వైరల్ -
బైక్ వెనుక కూర్చొని హెల్మెట్ పెట్టుకోవడం లేదా? ఈ వార్త మీకోసమే!
సాక్షి, ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలని ముంబై ట్రాఫిక్ పోలీసు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో రూ.500 జరిమాన వసూలు చేస్తారు. లేదంటే మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అందుకు సంబంధించిన అధికారిక సర్క్యూలర్ ముంబై ట్రాఫిక్ పోలీసు శాఖ జారీ చేసింది. అయితే వెనక సీట్లో కూర్చున్న హెల్మెట్ ధరించని వారికి 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత పట్టుబడితే బైక్ నడిపే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతోపాటు, జరిమాన వసూలు చేస్తామని హెచ్చరించారు. దీంతో బైక్ నడిపేవారు లేదా యజమానులు ఇప్పటినుంచే అదనంగా ఒక హెల్మెట్ కొనుగోలు చేసుకుని ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. యథేచ్ఛగా నియమాల ఉల్లంఘన కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం 2020 మార్చిలో అమలుచేసిన లాక్డౌన్ వల్ల అనేకమంది వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించడం మానేశారు. హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం, ట్రిపుల్ సీటు డ్రైవింగ్, నో ఎంట్రీ, రాంగ్ రూట్లో వాహనాలు తోలడం, సిగ్నల్స్ జంప్ చేయడం లాంటి అనేక ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల్ని ఎత్తివేసినప్పటికీ వాహన చోదకులు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు. ఇప్పటికీ హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపటం, సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ సైడ్‌లో వెళ్లడం లాంటి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా బైక్‌లకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నడిపేవారితోపాటు వెనక కూర్చున్న వారికి కూడా తలకు హెల్మెట్ లేకపోవడంవల్ల ప్రాణనష్టం అధికంగా జరుగుతోంది. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియమాలు 1988, సెక్షన్ 126, 194–డి ప్రకారం తలకు హెల్మెట్ లేని ద్విచక్ర వాహన చోదకులకు రూ.500 జరిమాన, అలాగే మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే నియమాలున్నాయి. ఇప్పుడు ఈ నియమాలను అమలు చేయనున్నారు. చదవండి: జ్ఞానవాపి మసీదు కేసు: విచారణ సోమవారానికి వాయిదా దీంతో ఇకనుంచి బైక్ నడిపే వారితోపాటు వెనక సీట్లో కూర్చునే వారు కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. అందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ముంబై ట్రాఫిక్ పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర ప్ర«ధాన నగరాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో ముంబై అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలను, ప్రాణ నష్టాన్ని నివారించే ప్రయత్నంలో ఉన్నారు. -
హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే లైసెన్స్ రద్దు!
న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తే మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తాం అని పోలీసులు చెప్పారు. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన వీడియోని ముంబై పోలీసులు పోస్ట్ చేశారు కూడా. ఆ వీడియోలో ...."హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి వ్యక్తి చలాన్ని వెంటనే ఆర్టీవోకి పంపతాం. దీంతో మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా జరిమాన కూడా విధించబడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి సమీపంలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ పంపిస్తాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తాం." అని డీసీపీ రాజ్ తిలక్ రోషన్ పేర్కొన్నారు. అలాగే ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడూ హారన్లు మోగించకుండా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరైన గనుక ఇలా హారన్ మోగిస్తే ఆయా వాహనాల వ్యక్తుల డబుల్ టైం వెయిటింగ్ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదీగాక ముంబై ప్రపంచంలోనే అత్యంత ధ్వనించే నగరాల్లో ఒకటి. పైగా ముంబై వాసులు రెడ్ సిగ్నల్ వద్ద కూడా హారన్లు వేయడంతో శబ్దకాలుష్యం ఎక్కువ అతుతోందని, దీన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ పోలీస్ కమీషనర్ మధుకర్ పాండే అన్నారు. (చదవండి: రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్) -
బిడ్డకు హెల్మెట్.. సూపర్ తల్లి! కారులో వెళ్తూ వీడియో తీసిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదాలు నగరంలో అంతకంతకు పెరుగుతున్నాయి. బయటికి వెళ్లిన వాహనదారులు ఇంటికి క్షేమంగా వచ్చేవరకు ఆందోళనకరంగా గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు దెబ్బలు తగిలి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మందికి పట్టింపు ఉండటం లేదు. అయితే కొంత మంది మాత్రం తమతో పాటు తమ పిల్లలు, వాహనాలు నడిపే సమయంలో భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా శిరస్త్రాణం ధరిస్తున్నారు. బుధవారం నానక్‌రాంగూడ చౌరస్తాలో ఓ మహిళ తాను హెల్మెట్ ధరించడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్తున్న నాలుగేళ్ల కూతురికి కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి స్కూటీ నడిపిస్తున్న దృశ్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ముచ్చటపడ్డ ఈ దృశ్యాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్ వేదికగా షేర్చేసుకోగా వేలాది మంది ఆ వీడియోకు ఫిదా అయ్యారు. తల్లి తానే కాకుండా తన కూతురికి కూడా హెల్మెట్ ధరించి స్కూటీ నడిపిస్తూ తనకు స్ఫూర్తిగా నిలిచిందంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరు హె ల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాంటూ సందేశాన్నిచ్చింది. Inspiring Mother & Daughter duo I ran into at Nanakram guda chourastha today !!! Wear Helmet & Be safe 😊🙏🏻 pic.twitter.com/0RfV6Bj2rH — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 23, 2022 -
Sakshi Cartoon: నాలుగేళ్లలోపు పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి!
-
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్‌కు బై బై?
సాక్షి, బెంగళూరు: బైక్ మీద వెళ్లేవారు క్షేమం కోసం శిరస్త్రాణం తప్పక ధరించాలి. కొంత మంది నాణ్యమైన ఐఎస్ఓ ధృవీకృత హెల్మెట్లను వాడితే మరికొందరు చీప్‌గా దొరికే వాటితో సర్దుకుపోవచ్చు. ఇక తలను పూర్తిగా కాకుండా సగం మాత్రమే కప్పి ఉంచే శిరస్త్రాణాలను వాడడం పెరిగిపోతోంది. ఈ హాఫ్ హెల్మెట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ముప్పును ఆపలేవని నిమ్హాన్స్, పోలీసులు చేపట్టిన అధ్యయనంలో తేలింది. బెంగళూరులో నమోదైన రోడ్డు ప్రమాదాల గణాంకాలను గమనిస్తే మృతుల్లో ఎక్కువమంది హాఫ్ హెల్మెట్లను ధరించిన వారు ఉన్నారు. ముఖం భాగాల్లో గట్టి దెబ్బలు తగిలే ప్రమాదాన్ని ఇవి ఏమాత్రం తగ్గించలేవని వెల్లడైంది. జాగృతి తరువాత జరిమానా యోచన.. ఐటీ నగరంలో 15 చోట్ల 90 వేల ద్విచక్రవాహనదారులను పరిశీలించగా నాణ్యత లేని హాఫ్ హెల్మెట్లను ఎక్కువ మంది ధరిస్తున్నట్లు గుర్తించారు. 60 శాతం మంది చవక రకం హెల్మెట్లనే వాడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం హెల్మెట్ల వినియోగంపై 15 రోజుల పాటు అవగాహన కల్పించాలని పోలీసు శాఖ యోచన చేస్తోంది. అనంతరం హాఫ్ హెల్మెట్లను ధరించేవారికి జరిమానాలు విధించాలని ఆలోచిస్తున్నట్లు భావిస్తోంది. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
అసలే కోపంలో ఉన్నాడు.. క్రీజులో హెల్మెట్ అడ్డుగా
Weatherald Scolded for Bizarre Helmet-Kicking Video: షఫీల్డ్ షీల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్ సమయంలో సౌత్ ఆస్ట్రేలియా ఆటగాడు వెదర్లాండ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌కు ముందు బ్రేక్ సమయంలో క్వీన్స్‌ల్యాండ్ ఫీల్డర్ మ్యాట్ రెన్షా.. క్రీజులో బ్యాటర్స్ గార్డ్ తీసుకునే చోట హెల్మెట్ పెట్టేసి వెళ్లాడు. ఓవర్ ప్రారంభం కావడంతో వెదర్లాండ్ స్ట్రైకింగ్‌కు వెళ్లాడు. కాగా అప్పటికే వెదర్లాండ్ ఏదో విషయంలో కోపంతో ఉన్నాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే అంతలో క్రీజులోకి చేరుకున్న వెదర్లాండ్స్.. అక్కడ హెల్మెట్ ఉండడం చూసి చిర్రెత్తిపోయినట్టున్నాడు. దీంతో హెల్మెట్‌ను ఫుట్బాల్లా భావించి పెనాల్టీ కిక్ ఇవ్వడంతో అది ఎగిరి దూరంగా పడిపోయింది. వెదర్లాండ్ చర్య అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన క్వీన్స్లాండ్ కెప్టెన్ ఉస్మాన్ ఖవాజా జేక్ వెదర్లాండ్స్ దగ్గరకు వచ్చి వాదనకు దిగాడు. ఒక హెల్మెట్‌ను అలా తన్నడం ఏంటని.. కాస్త హుందాగా ప్రవర్తించాలని కోరాడు. అయితే వెదర్లాండ్స్ ఖవాజాను ఏదో అనబోయి.. వెనక్కి తగ్గాడు. ఇదంతా చూసిన అంపైర్ వెదర్లాండ్స్ను పిలిచి ఇలా చేయడం కరెక్టు కాదని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో Bizarre things on a cricket field: Matt Renshaw (QLD) carried the helmet from one end to other and kept it right on the batting crease on batters guard. Jake Weatherald (SA) with a penalty kick to that helmet. @beastieboy07 @cric_blog #SheffieldShield pic.twitter.com/fXNarJZUE8 — Nash (@NashvSant) November 25, 2021 -
డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్!
సాక్షి, అప్జల్‌గంజ్: రోగులకు ప్రాణం పోసే వైద్యులు వారు. కానీ.. తమ ప్రాణాలకే దిక్కులేకుండా పోయిందని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తమ తలలకు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. అంతకు ముందు అవుట్ పేషెంట్ బ్లాకు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తించాలంటే భయంగా ఉందని, తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ ఆవేదన చెందారు. చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు సోమవారం డెర్మటాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ భువనశ్రీ తలపై ఫ్యాన్ ఊడి పడడంతో ఆమె గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే నూతన భవన నిర్మాణ దిశగా అడుగులు వేయాలని కోరారు. చదవండి: హుజురాబాద్ ఉప పోరు: ఈ కొన్ని గంటలే కీలకం! -
ఆందోళనలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బంది
-
Terrific Road Accidents: తీరని విషాదాలు
-
తీవ్ర విషాదం నింపుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: అతివేగమో, మద్యం మత్తో, రేసింగ్ పిచ్చో, ఎదుటి వారి నిర్లక్క్ష్యమో కారణం ఏదైతేనేమి ఘోర రోడ్డు ప్రమాదాలు చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. చెట్టంత ఎదిగిన బిడ్డలు కళ్లముందే తిరిగి రాని లోకాలకు తరలిపోతోంటే కన్నవారి గుండెలవిసిపోతున్నాయి. ఆ మానసిక క్షోభ జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సీనియర్ నటుడు బాబూ మోహన్ భావోద్వేగం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తోంది. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి అంటూ ఆయనిచ్చిన సందేశం యువతలో ఆలోచన రేపుతోంది. వాహనాలు నడిపేటపుడు వాహదారులు పాటించాల్సిన నిబంధనల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. -
ఐదేళ్ల శ్రమతో హెల్మెట్ తయారీ, ధర రూ.3700.. ఎన్నెన్నో ప్రత్యేకతలు
వాషింగ్టన్: మన మెదడులోని ఆలోచనలను కనిపెట్టడం అంత సులువు కాదని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అది సులువేనని అమెరికాలోని ఓ సంస్థ చెప్తోంది. కెర్నెల్ అనే సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేసింది. దీనిపై చేసిన పరీక్షల ఫలితాలన్నీ ఆశాజనకంగానే వచ్చాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక వీటిని వారం రోజుల్లో పలువురు కస్టమర్లుకు కూడా పంపునుంది. దీని ధరను 50 డాలర్లు (సుమారు రూ. 3,700)గా నిర్ణయించారు. ఈ హెల్మెట్లలో మెదడును అంచనా వేయగల ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు ఉంటాయి. వీటితో రక్త ప్రవాహం, ఆలోచనల వేగం, బయట పరిస్థితులకు శరీరంలోని అవయవాలు స్పందిస్తున్న తీరును అంచనా వేయవచ్చని అంటున్నారు. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదివరకే ఉన్నప్పటికీ అందులో కొన్ని లోపాలు ఉన్న కారణంగా వాటిని అధిగమిస్తూ ఈ పరికరాన్ని కనిపెట్టారు. ఉదాహరణకు ఇలాంటి పరికరానికి ఇదివరకు అయ్యే ఖర్చు మిలియన్ డాలర్లుగా ఉండేది. పైగా సైజు పరంగా ఒక గది స్థలాన్ని ఆక్రమించేది. ప్రస్తుతం ఈ పరికరం తక్కువ ఖర్చు, పైగా బరువు చూస్తే 2 పౌండ్లు మాత్రమే ఉంటుంది. ‘సమాజంలో అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించడానికి, మా హెల్మెట్ ఉపయోగపడనుందని’ బ్రయాన్ జాన్సన్ చెప్పారు, అతను గత ఐదేళ్ళకు పైగా ఆయన ఈ హెల్మెట్ రూపొందించడానికి పని చేస్తున్నాడు. అదే క్రమంలో ఈ ప్రాజెక్ట్ కోసం 110 మిలియన్ డాలర్లు డబ్బును కూడా ఖర్చు పెట్టాడు. చదవండి: స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా' -
హెల్మెట్‌ను చాక్లెట్లా మింగేసిన ఏనుగు.. వీడియో వైరల్
దిస్పూర్: సాధారణంగా ఏనుగంటే అందరికి ఇష్టమైన జంతువే. మావటివారు దాన్ని తీసుకొని నగరాలలో, గ్రామాలలో తిప్పుతుంటారు. ఈ క్రమంలో, పిల్లలు దానిపై ఎక్కడానికి ఇష్టపడతారు. అదే విధంగా, దానికి అరటి పండో.. మరేదైన ఫలమో పెట్టి తెగ సంబర పడిపోతుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఏనుగు కూడా, ఆఫలాన్నితిని తన తోండంతో వారిని ఆశీర్వదిస్తుందని తెలుసు. అయితే, అస్సాంలో ఒక ఏనుగు చేసిన వెరైటీ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన గువహతిలోని సత్గావ్ ఆర్మీ క్యాంపులో చోటుచేసుకుంది. ఈ ఆర్మీ క్యాంపు అడవికి సమీపంలో ఉంది. అయితే, ఏలా వచ్చిందో.. కానీ, ఒక గజరాజు అడవి నుంచి ఆర్మీ క్యాంపు వైపు వచ్చింది. అది పార్కింగ్ చేసి ఉన్న బైక్ దగ్గరకు చేరుకుంది. అక్కడ, బైక్‌కు తగిలించి ఉన్న హెల్మేట్ను తోండంతో తీసుకుంది. దాన్ని పట్టుకుని వింతగా చూసింది. ఇదంతా గమనిస్తున్న కొంత మంది అధికారులు ఏనుగు దాన్ని కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ ఆ ఏనుగు మాత్రం.. తోండంతో ఆ హెల్మేట్ ను అమాంతం నోట్లో వేసుకొని గుటుక్కున తినేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే , దీన్ని చూసిన నెటిజన్లు.. ‘పాపం... గజరాజుకి ఏంత ఆకలేసిందో..’, ‘ బహుషా.. వెలగ పండు అనుకొని ఉంటుంది కాబోలు..’, ‘ హెల్మెట్ లేదు.. ఇక ఎలా బయటకు ఎలా వెళ్తావు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఎంత పని చేశావమ్మా... ఏనుగు! -
వాట్సాప్ మెసేజ్: సిటీలో హెల్మెట్ అవసరం లేదా?
"నగరవాసులకు శుభవార్త.. నగరపరిధిలో ప్రయాణించే వాహనదారులు ఇక మీదట బైకులపై హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈమేరకు దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీలను కోర్టు వ్యతిరేకించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరేమీ కాదని తేల్చి చెప్పింది." "కనీస రక్షణ అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర, జిల్లాల హైవేలపై మాత్రం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని తీర్పునిచ్చింది. నగర పరిధుల్లో మాత్రం హెల్మెట్ ధరించాలా? వద్దా? అన్నది కేవలం పౌరుల వ్యక్తిగత ఇష్టమని వెల్లడించింది. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీ బండి ఆపి మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని అడిగితే నేను పలానా మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని వారికి చెప్పొచ్చు. దీంతో వారు మీపై ఎలాంటి జరిమానా వేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి" అంటూ ఓ మెసేజ్ వాట్సాప్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇకపై హెల్మెట్ లేకున్నా నో ఫైన్ అంటూ జనాలు దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారు. అయితే మీరు మాత్రం దీన్ని నమ్మి హెల్మెట్ లేకుండా వెళ్లారంటే చలానా బారిన పడటం ఖాయం. ఎందుకంటే ఇది పూర్తిగా ఓ ఫేక్ న్యూస్. ఈ అసత్య ప్రచారానికి తోడు దాని కింద ఫోన్ నెంబర్లు జోడించారు. అందులో ఒక నంబర్ కలవగా అది న్యాయవాది దేవేంద్ర ప్రతాప్ సింగ్‌దే కావడం గమనార్హం. అయితే అతడు దీనిపై స్పందిస్తూ ఈ మెసేజ్‌కు, తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పాడు. ఎవరో కావాలనే తన పేరు మీద ఈ వదంతులు సృష్టించారని, దీన్ని ఎవరూ నమ్మొద్దని సూచించాడు. కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వవని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఫేక్ న్యూస్‌ను ఎవరూ నమ్మవద్దని, దీన్ని అస్సలు ఫార్వర్డ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: వైరల్: ఎప్పుడైనా ఎగిరే వడాపావ్ తిన్నారా?! పోలీస్ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు -
నిర్లక్ష్యపు నడక, బైకర్ అతివేగం.. మీరు మారరా!
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. మద్యం సేవించి డ్రైవ్ చేయకండి అంటూ ట్రాఫిక్ అధికారులు ఎన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు, సూచనలు చేసినా పట్టించుకోని వారు కోకొల్లలు. ట్రాఫిక్ అధికారులు చెప్పేది మన ప్రాణాలు కాపాడటం కోసమే. కానీ మనం వినకుండా ఇదిగో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. ఓ వ్యక్తి ఏమరపాటుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ బైకు వేగంగా వస్తోంది. బైక్ సమీపించడంతో పాదచారి పరుగెత్తుకెళ్లాడు. దాంతో బైక్ అతన్ని ఢీకొట్టి ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి, బైకర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించకపోవండంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను హెల్మెట్ ధరించి ఉంటే ఇంత తీవ్రంగా గాయపడేవారు కాదంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పాదచారి నిర్లక్ష్యం, బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. బైక్ మీద వెళ్తోన్నప్పుడు హెల్మెట్ ధరిచండం ఎంత ముఖ్యమో.. ప్రయాణం చేసేటప్పుడు చుట్టు పక్కల గమనించడం కూడా అంతే ముఖ్యమని.. లేదంటే మీతో పాటు మీ కుటుంబాలు కూడా బాధపడతాయంటూ ట్రాఫిక్ పోలీసులు మరో సారి హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం జీడిమెట్ల చింతల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్ ‘అయ్యా నీకో దండం.. ఇది బైకా ఎడ్ల బండా? -
జీడిమెట్ల చింతల్లో రోడ్డు ప్రమాదం
-
వాహనదారులకు షాక్ : శాశ్వతంగా లైసెన్సు రద్దు
సాక్షి,హైదరాబాద్: భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా..అనేకమంది ద్విచక్రవాహనదారుల ప్రాణాలు పోతున్నా..లైట్ తీసుకుంటున్నారా? హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తున్నారా? ఆఫీసుకు ఆలస్యం అవుతోందని, ఏమవుతుందిలే.. చలానా కట్టేద్దాంలే అంటూ నిర్లక్ష్యంగా బైక్‌తో రోడ్డెక్కుతున్నారా? అయితే మీకు భారీ ఝలక్ తప్పదు. ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad@cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/AWbxWDLTZM — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 19, 2021 -
హెల్మెట్‌తో స్లిప్ ఫీల్డింగ్.. సూపర్ అంటున్న నెటిజన్లు
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో నవ్వులు పూయించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో అతను హెల్మెట్ పెట్టుకొని సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. రోహిత్ ఇలా చేయడాన్ని చూసిన భారత ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యానికి గురైనా, ఆ తరువాత రోహిత్ ప్రవర్తనను చూసి ముసి ముసిగా నవ్వుకున్నారు. థర్డ్ స్లిప్‌లో ఉన్న రహానే, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లు అయితే ఆ ఓవర్ మొత్తం నవ్వుతూ కనిపించారు. అయితే రోహిత్ ఇలా హెల్మెట్ పెట్టుకొని స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడానికి ఓ కారణం ఉంది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జో రూట్ డిఫెన్స్ ఆడుతున్న సందర్భంలో బంతి గాల్లోకి లేచి రోహిత్‌కు ముందు కొద్ది దూరంలో పడింది. దీంతో అతను షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ నుంచి హెల్మెట్ తీసుకుని కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇది చూసి భారత క్రికెటర్లతో సహా గ్రౌండ్లో ఉన్నవారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. రోహిత్ ఇలా చేయడంపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్‌డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. -
ఇక మీదట ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’
కోల్‌కతా: బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి.. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొండి అంటూ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కొందరు మాత్రం అస్సలు పట్టించుకోరు. ఫైన్ విధించినా మారరు కొందరు. అలాంటి వారి కోసం ఇక మీదట హెల్మెట్ ధరించకపోతే.. బంకుల్లో వారికి పెట్రోల్ పొయకూడదంటూ కోల్‌కతా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 8 నుంచి కోల్‌కతా పరిధిలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మ మాట్లాడుతూ.. ‘ఇక మీదట హెల్మెట్ ధరించకుండా బంకుల్లోకి వచ్చే టూ వీలర్ వాహనాలకు పెట్రోల్ పోయకూడదని ఉత్తర్వులు జారీ చేశాం. బైక్ నడిపేవారితో పాటు.. వెనక ఉన్నవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి. కోల్‌కతా పోలీసు స్టేషన్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది’ అన్నారు. డిసెంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకు ఈ ఉత్తుర్వులు అమల్లో ఉంటాయి అని తెలిపారు. (చదవండి: ఈ హీరోయిన్‌కు ఫైన్ వేసిన పోలీసులు) ఇక ఓ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. హెల్మెట్ కొనలేని వారికి రాష్ట్ర ప్రభుత్వమే వాటిని అందజేస్తుందని తెలిపారు. ‘హెల్మెట్ ధరించి బైక్‌లు నడపండి. మాస్క్ ధరించకపోతే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తానని హెచ్చరించే ప్రభుత్వం మాది కాదు. మాస్క్ ధరించాల్సిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇక హెల్మెట్ కొనలేని వారు మీ సమీప పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. మీ వివరాలు వారికి ఇవ్వండి. వారు మీకు హెల్మెట్ ఇస్తారు’అని తెలిపారు. -
జరిమానాల కొరడాతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు 8 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటానికి ప్రధాన కారణమైన ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి కేటగిరీల్లో అయితే ఏకంగా పది నుంచి 15 శాతం వరకు ఉల్లంఘనలు తగ్గిపోయాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసి పక్కాగా అమలు చేస్తుండటమే ఇందుకు కారణమని రవాణా శాఖ పేర్కొంటోంది. ఉల్లంఘనలు ఇంకా తగ్గుముఖం పడితే రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గిపోతాయని అధికారులు అంటున్నారు. గత నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు, అలాగే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 17 వరకు నమోదైన ఉల్లంఘనల్ని రవాణా శాఖలోని ట్రాఫిక్ రీసెర్చి వింగ్ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఉల్లంఘనలతో రోజుకు 9మంది మృతి ⇔ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తేల్చింది. ⇔ ఈ కారణంగా రోజుకు 9మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలవుతున్నారు. ⇔ ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానాలు భారీగా పెంచింది. ⇔ 2019లో మొత్తం 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 15,303 ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 1,262 ప్రమాదాలు లెర్నింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 2,576 రోడ్డు ప్రమాదాలు అసలు డ్రైవింగ్ లైసెన్సు లేనివారి వల్ల జరిగాయి. కాగా నిబంధనల ఉల్లంఘనల కారణంగా 2,851 ప్రమాదాలు జరిగాయి. ⇔ ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నెలకు సగటున 7 వేల వరకు నమోదు అయ్యేవి. జరిమానాల పెంపుతో దాదాపు నెల రోజుల్లో 6,400 మాత్రమే నమోదయ్యాయి. అంటే 8 శాతం వరకు తగ్గాయన్న మాట. ⇔ ఇక భారీ జరిమానాలు విధిస్తుండటంతో హెల్మెట్ ధరించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగింది. ⇔ గతంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 జరిమానా విధించే వారు. ఇప్పుడు రూ.1,000కి పెంచడం సత్ఫలితాన్నిచ్చింది.. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు హెల్మెట్ ధరించని కేసులు 1,947 నమోదు కాగా.. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 17 మధ్య 1,650 కేసులు నమోదయ్యాయి. అంటే 15 శాతం మేర కేసులు తగ్గాయన్న మాట. ⇔ ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలకు జరిమానా రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు పెంచడంతో ఈ కేసులు 10 శాతం తగ్గిపోయాయి. జరిమానా పెంచక మునుపు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు 900 వరకు మాత్రమే నమోదవుతున్నాయి. పదే పదే ఉల్లంఘిస్తే జైలే జరిమానాల పెంపుతో సత్ఫలితాలు వస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల సంఖ్య తగ్గిపోతోంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 20 శాతం తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జైలుకు పంపేలా ఆలోచన చేస్తున్నాం. -ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ -
ఈ హీరోయిన్‌కు ఫైన్ వేసిన పోలీసులు
'ఝుమ్మంది నాదం' చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు తాప్సీ పన్ను. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తక్కువ కాలంలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో సడన్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చారు. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తూ బిజీబిజీగా మారారు. ప్రస్తుతం ఆమె "రష్మి రాకెట్" చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం డైట్ మార్చేసి, వ్యాయామం మీద ఫోకస్ పెడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె బుధవారం నాడు ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తాప్సీ.. సినిమా షూటింగ్లో భాగంగా హెల్మెట్ పెట్టుకోకుండా బుల్లెట్ నడుపుతున్నారు. కానీ ఇది పోలీసుల కంట పడటంతో ఫొటో కొట్టి ఆమెకు ఫైన్ విధించారు. (చదవండి: చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే: కథానాయికలు) ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. "ఛలానా విధిండానికి ముందు.." అంటూ తను షేర్ చేసిన ఫొటోకు క్యాప్షన్ సైతం జోడించారు. అయితే ఇది వెనక నుంచి తీసిన ఫొటో కావడంతో అక్కడు ఉన్నది తాప్సీనే అని గుర్తుపట్టడం కాస్త కష్టంగా ఉంది. ఇక తాప్సీ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆమె విజయ్ సేతుపతితో కలిసి ఓ తమిళ సినిమాలో నటించారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ‘రష్మి రాకెట్’ చిత్రం కోసం కేటాయిస్తున్నారు. (చదవండి: ఎన్నో అవమానకర పరిస్థితులు చూశా: తాప్సీ) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
హెల్మెట్లకు బీఐఎస్ లేకుంటే జరిమానాలు
సాక్షి, అమరావతి: ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు స్టాండర్డ్ మార్క్ హెల్మెట్లనే ధరించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ స్పష్టం చేసింది. బైక్‌లపై వెళ్లేటప్పుడు హెల్మెట్ విధిగా ఉండాలని, వాటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు లేకుంటే భారీగా జరిమానాలు విధించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఫేస్ షీల్డ్తోనే ప్రయాణాలు చేస్తున్నారని, ప్రమాదం జరిగితే ఫేస్ షీల్డ్ తలకు సరైన భద్రత కల్పించలేకపోతుందని అందులో పేర్కొన్నారు. -
తప్పొకరిది.. ఫైన్ మరొకరికి!
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): హెల్మెట్ ధరించని వాహనదారుడు ఒకరైతే.. మరో వాహనదారుడికి పోలీసులు చలాన్ పంపించారు. ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 19న ఎల్లారెడ్డిపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీఎస్ 02 ఈఈ 4628 నంబరు వాహనంపై హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్న వ్యక్తిని ఫొటో తీశారు. అనంతరం అతన్ని పట్టుకొని, చలాన్ పంపుతామని, ఫైన్ కట్టాలని మందలించి వదిలేశారు. కానీ చలాన్‌ను నిందితుడి చిరునామాకు కాకుండా చందుర్తి మండలం మూడపల్లికి చెందిన గోలి శ్రీనివాస్‌కు పంపించారు. అందులో రూ.135 ఫైన్ చెల్లించాలని ఉంది. దానిపై ఉన్న ఫొటోను పరిశీలించి, అది తనది కాదని బాధితుడు తెలిపారు. తన వాహనం నంబర్ టీఎస్ 02 ఈఈ 4328 అని, పోలీసులు చలాన్ తప్పుగా పంపించారని వాపోయాడు. చలాన్‌ను రద్దు చేయాలని శ్రీనివాస్ ఎస్పీని కోరారు. -
హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడేమో?
ద్విచక్రవాహనదారులు ప్రయాణంలో హెల్మెట్‌ధరించకపోవడంతో ప్రమాదంలోఆమూల్యమైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ఆర్టీసీబస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధారి మండలం జువ్వాడి సర్పంచ్ కొనింటి సాయిలు మంగళవారం ఎల్లారెడ్డి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. గాంధారి నుంచి లింగంపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు మండలంలోని నల్లమడుగు సమీపంలోని ముడిగల ప్రాంతంలో బైక్‌ను ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించి బతికేవాడేమో అని స్థానికులు చర్చించుకున్నారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు కృపాకర్, జీవన్ ఉన్నారు. జీవన్ జన్మదినం మంగళవారం కావడం విశేషం. చిన్న కొడుకు జీవన్‌కు కాళ్లు్ల, చేతులు పని చేయవు, దివ్యాంగుడు. సర్పంచ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.బస్సు డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం లింగంపేట సమీపంలోని రవిగౌడ్ పెట్రోల్ బంకు యజమాని కారును సైతం ఢీకొన్నట్లు లింగంపేట గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి లింగంపేట, గాంధారి పోలీసులు, చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జరిమానా కాదు.. నేరుగా కోర్టుకే
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే పిలియన్ రైడర్‌కు హెల్మెట్ తప్పనిసరి అని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలకు సైడ్ మిర్రర్లు ఉండాలంటూ విధిస్తున్న ఈ–చలాన్లతో వాహనదారుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. అదే సమయంలో అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లు, యువకుల భరతం పడుతున్నారు. స్నేహితులు, బంధువుల కార్లు, బైక్‌లను తీసుకుని రహదారులపై దూసుకెళ్తూ ఇతరుల వాహనాలను ఢీకొట్టే వారిని కట్టడి చేయడం.. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 5156 వితవుట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు, 425 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. (నెంబర్‌ప్లేట్ కనిపించకుండా ట్యాంపరింగ్..) ఊహించని విధంగా... సైబరాబాద్‌లో విస్తృ్తతంగా వాహనాలను నిలిపి తనిఖీలు చేస్తున్నారు. ఒకే బైక్‌పై ముగ్గురి ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిని పట్టుకునేందుకు వాహన చోదకులు ఊహించని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్ లేకుండా బండి నడిపే వారిని ఆపి అక్కడికక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా సైబరాబాద్‌లో జనవరి నుంచి ఇప్పటివరకు 5,156 కేసులు నమోదుచేశారు. మైనర్లైతే తల్లిదండ్రులను పిలిపించి వారితో మరోసారి వాహనాలను నడపనీయమంటూ లిఖితపూర్వకంగా రాయించుకుని వాహనం ఇస్తున్నారు. ఇలా 425 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదుచేశారు. మేజర్లయితే కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇతర ప్రక్రియలతోపాటు ... లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ దరఖాస్తు నంబరు చూపించాకే వాహనాన్ని ఇస్తున్నారు. జరిమానా కాదు...నేరుగా న్యాయస్థానానికే ద్విచక్ర వాహనం, కార్లు, ఇతర వాహనాలు నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే నేరుగా న్యాయస్థానానికి వెళ్లాల్సిందే. గతంలో లైసెన్స్ లేకుండా నడిపితే పోలీసులు జరిమానా విధించి వదిలేసేవారు. కొద్ది నెలల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకొంటున్నారు. మరుసటి రోజు ఉదయం సదరు చోదకుడు ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని న్యాయస్థానంలో హాజరు కావాలి. వాస్తవానికి మోటార్ వాహన చట్టంలో ఇవన్నీ ఉన్నా.. పోలీసులు, రవాణా శాఖ అధికారులు అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తున్నారు. ప్రమాదాలు తగ్గుతున్నా.. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. అందరూ లైసెన్సును తప్పక దగ్గర ఉంచుకోవాలని ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కూడళ్ల వద్ద సైన్ బోర్డుల్లోనూ ఈ విషయాన్ని వివరిస్తున్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాను విధిస్తున్నారు. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే.. ♦లైసెన్సు లేకుండా తొలిసారి పోలీసులకు చిక్కితే.. వాహనం స్వాధీనం చేసుకుంటారు. తర్వాతి రోజు న్యాయస్థానంలో వాహనదారుడిపై చార్జిషీట్ దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తయ్యేవరకూ న్యాయస్థానం ప్రాంగణంలోనే నిలబడి ఉండాలి. జరిమానా చెల్లించాలి. ♦ రెండోసారి పోలీసులకు దొరికితే.. 48 గంటలపాటు జైల్లో ఉంచుతారు. ♦మూడోసారి చిక్కితే రెండు అంతకంటే ఎక్కువ రోజుల జైలుశిక్షతోపాటుగా భారీగా జరిమానా చెల్లించాలి. దీని ప్రభావం విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలపై ఉంటుంది. ♦ ఐదు, అంతకంటే ఎక్కువసార్లు దొరికితే మాత్రం వారం రోజుల జైలుశిక్ష అనుభవించి.. భారీ జరిమానా చెల్లించక తప్పదు. పోలీసుల నివేదిక అధారంగా కోర్టులు జరిమానాను నిర్ణయిస్తాయి. -
పిలియన్ రైడర్లకు హెల్మెట్.. మిర్రర్ మస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: పై మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు పిలియన్ రైడర్లు (మహిళలు) హెల్మెట్ ధరించకపోవడంతోనే మృతి చెందారన్న వాదనకు బలం చేకూరుతోంది. ఎందుకంటే హెల్మెట్లు ధరించిన రైడర్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. పేట్‌బషీరాబాద్, మేడ్చల్‌లో జరిగిన రెండు ప్రమాదాల్లో హెల్మెట్లు ధరించకపోవడంతో పాటు ఆయా ద్విచక్ర వాహనాలకు సైడ్ మిర్రర్ లేకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ సైడ్‌మిర్రర్ ఉండి ఉంటే ఆయా భారీ వాహనాల కదలికలను గుర్తించి ఉంటే ఈ ప్రమాదాలు జరగకపోయి ఉండొచ్చన్న మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గతంలోనూ ఇటువంటి ఘటనలు వందల సంఖ్యలో జరుగుతుండటాన్ని గమనించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనుల వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్చి నెల నుంచి హెల్మెట్ లేని పిలియన్ రైడర్లకు, సైడ్ మిర్రర్ లేని వాహనాలకు ఈ– చలాన్లు విధిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనైతే ఈ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీగానే కొరడా ఝుళిపించారు. కేవలం మూడు నెలల్లోనే హెల్మెట్ లేని పిలియన్ రైడర్ కేసులు 4,59,280, మిర్రర్ లేని వాహనాలకు 1,49,884 చలాన్లు విధించారు. ఇలా మొత్తం 6,09,164 ఈ– చలాన్లు జారీ చేశారు. (డబుల్స్ వస్తే రూ.500 జరిమానా) ప్రజల భద్రత కోసమే.. ‘ఎంవీ చట్టం 129 సెక్షన్ ప్రకారం నాలుగేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారూ పిలియన్ రైడర్‌గా ఉంటేæ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ లేకుండా చాలా ద్విచక్ర వాహనాలు కనిపిస్తాయి. ఇది నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు. మలుపు తీసుకునేటప్పుడు, ఏదైనా వాహనాన్ని అధిగమించేటప్పుడు, రోడ్లపై సందులను మార్చేటప్పుడు వెనుక నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రైడర్ గమనించడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రహదారి భద్రత దృష్ట్యా కొన్ని నెలల నుంచి ఈ ఉల్లంఘనుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామ’ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. మార్చి నెల నుంచిఈ– చలాన్లు ఇలా.. హెల్మెట్ పిలియన్ రైడర్ కేసులు:4,59,280 మిర్రర్ కేసులు: 1,49,884 మొత్తం: 6,09,164 ఈ‘పేట్‌బషీరాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో బైక్ వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు (పిలియన్ రైడర్లు) మృతి చెందారు. భారీ వాహనాలు వెనక నుంచి వచ్చి ఢీకొట్టడంతో రెండు బైక్‌లపై ఉన్న ముగ్గురు పిలియన్ రైడర్ల తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాల్లో బైక్ రైడ్ చేస్తున్నవారు హెల్మెట్లు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.’ఈ ‘బాచుపల్లిలో భారీ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఓ బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో పిలియన్ రైడరైన మహిళ దుర్మరణం చెందారు. హెల్మెట్ ధరించిన రైడర్ ప్రాణాలతో బయటపడ్డారు’. -
హెల్మెట్ ధరిస్తే.. శానిటైజర్ ఫ్రీ
సాక్షి, సిటీబ్యూరో: బైకర్లకో లక్కీ చాన్స్. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు మీరు..మీతోపాటు వెనుక కూర్చున వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే..మీకో హ్యాండ్ శానిటైజర్ ఉచితంగా లభించే అవకాశం ఉంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు హెల్మెట్ గురించి వినూత్న ప్రచారం చేపట్టారు. బైకులపై వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్లు ధరించి కన్పిస్తే..వారిని ఆపి అభినందిస్తూ శానిటైజర్ బాటిల్‌ను అందచేస్తున్నారు. హెల్మెట్ లేనివారికి ఈ–చలాన్ విధిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇప్పటివరకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 9,15,182 ఉల్లంఘనల కేసులు నమోదు చేశామని కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం తెలిపారు. -
ఇదికూడా హెల్మెటే కదా సార్..
కరోనా వైరస్ కట్టడికి పోలీసులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. పంజగుట్ట లోని ఓ వ్యక్తి క్రికెట్ ఆడే సమయంలో వాడే హెల్మెట్ పెట్టుకొని రోడ్డుపైకి వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నించగా.. ఇదికూడా హెల్మెటే కదా సార్ అంటూ జవాబివ్వడంతో వదిలేశారు. ఇరుగుపొరుగే.. తోడయ్యారు.. భర్త మృతి చెందడంతో ఇరుగు పొరుగున ఉండే మహిళలు, బంధువులు ఆమెను చివరి చూపునకు తీసుకెళ్తూ శ్రీనగర్ కాలనీలో కనిపించారు. కరోనా భయంతోమహిళలంతా మాస్కులతో అంతిమయాత్రకు తరలివెళ్లారు. రైలు మార్గంలో.. సొంత రాష్ట్రానికి.. రైలు మార్గంలో వెళ్తే దూర భారం తగ్గుతుందని భావించిన వలస కార్మికులు రైలు పట్టాల మధ్యలో నడుచుకుంటూ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. సోమవారం మాదాపూర్ నుంచి వెస్ట్‌బెంగాల్‌కు వెళ్తుండగా ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు.- ఫొటోలు: దయాకర్ తూనుగుంట్ల -
‘కరోనా’హెల్మెట్‌తో వినూత్న ప్రచారం
సాక్షి, చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు పదే పదే వేడుకుంటున్నా కొంతమంది మాత్రం రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి వాళ్లకు పోలీసులు ముందు పద్దతిగా చెప్పి చూస్తున్నారు.. కొన్నిచోట్ల మాత్రం తమ లాఠీలకు పనిచెబుతున్నారు. అయినప్పటికీ కొందరు ఆకతాయిలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇలాంటి వారికి కరోనావైరస్పై అవగాహన కల్పించేందుకు తమిళనాడు పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. నిబంధనలు అతిక్రమించి.. అకారణంగా ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చిన వారిని ఆపి, కరోనా ప్రభావం ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాములుగా చెప్తే వినడంలేదని.. వినూత్నంగా కరోనా వైరస్ రూపంలో డిజైన్ చేసిన హెల్మెట్ పెట్టుకొని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించాలని, దయచేసి ఎవరూ అకారణంగా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోందని పోలీసు అధికారులు చెబుతున్నారు . ‘ప్రజలు బయటకు రాకుండా అన్ని ప్రయత్నాలు చేశాం. అయినప్పటికి కొంతమంది అకారణంగా బయటకు వస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. దీనికోసం అచ్చం కరోనా వైరస్‌ను పోలిన హెల్మెట్ తయారు చేయించాం. ఇలాగైనా ప్రజల్లో కరోనాపై భయం పెంచి, వారిని ఇళ్లకే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ హెల్మెట్ కొంచెం డిఫరెంట్‌గా ఉండడంతో ప్రతి ఒక్కరికి ఈ మహమ్మారి ప్రభావం గురించి ఆలోచించగల్గుతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కరోనావైరస్పై అవగాహన కలిగి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటారు’అని హెల్మెట్ ధరించిన ఓ పోలీసులు అధికారి తెలిపారు. -
హెల్మెట్ వాడకంలోహైదరాబాదీల బద్ధకం
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షించే అవకాశమున్నప్పటికీ...హెల్మెట్ల వాడకంలో నగరవాసులు బద్ధకం వీడడం లేదు. హెల్మెట్ ధరించడం వల్ల ఎంతో మంది ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఉన్నప్పటికీ ద్విచక్రవాహనదారుల్లో మార్పు రావడం లేదు. దేశవ్యాప్తంగా హెల్మెట్లు సక్రమంగా వినియోగిస్తున్న నగరాల్లో మనది 14వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. హెల్మెట్లను నిలకడగా వాడటంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో తొలి మూడు స్థానాల్లో ఉండగా...హైదరాబాద్ మాత్రం 14వ స్థానంలో నిలిచింది. ఐసీఐసీఐ లాంబార్డ్ ‘హెల్మెట్ సర్వే ఫైండింగ్స్’ 2020 పేరుతో సర్వే నిర్వహించి ఈ స్థానాలను ప్రకటించింది. 18 నగరాల్లో 2400 మంది బైక్ రైడర్ల (18 నుంచి 35 ఏళ్ల మధ్య)తో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి హెల్మెట్ల వాడకం, పిలియన్ రైడర్ల( బైక్‌పై వెనుక కూర్చునే వ్యక్తి)కు హెల్మెట్లు ఎంతమేర అవసరం అన్న దానిపై ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టింది. పిలియన్ రైడర్లకు హెల్మెట్ల వినియోగంపై న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం వల్లనే నిర్లక్ష్యం చేస్తున్నారనే సమాధానాలు వచ్చినా...రోడ్డు ప్రమాద సమయాల్లో మాత్రం వారి ప్రాణాలకు హెల్మెట్ అవసరమని ఆయా నగరాల్లోని ద్విచక్రవాహనదారులు సమాధానాలిచ్చారు. పిలియన్ రైడర్లయిన పిల్లలకు పెద్దగా హెల్మెట్ అవసరం లేదని, అయితే మహిళలకు మాత్రం ఉండాల్సిందేనని అత్యధిక మంది అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఫస్ట్..విజయవాడ లాస్ట్ నిలకడగా హెల్మెట్ల వినియోగంలో ఆయా నగరాల్లో బైక్ వాహనచోదకులను శాతాల వారీగా చూసుకుంటే ఢిల్లీ (80), ముంబై (78) బెంగళూరు (72), కొచ్చి (70), లుధియానా (64 శాతం), గౌహతి (64) ,చెన్నై(60), రాయ్‌పూర్ (58), కోల్‌కతా (55), పాట్నా (52), లక్నో (52 శాతం), అహ్మదాబాద్ (51), భువనేశ్వర్ (50), హైదరాబాద్ (48), పుణే (41), ఇండోర్ (30), రాంచీ (25), విజయవాడ(8)లు ఉన్నాయి. అయితే హైదరాబాద్ 48 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. దీన్నిబట్టి చూస్తే హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ల వినియోగం పెరగాల్సిన అవసరముందని ఈ సర్వే నొక్కి చెబుతోంది. విజయవాడలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో హెల్మెట్ల వినియోగంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. పిలియన్ రైడర్స్ హెల్మెట్ వినియోగంలోనూ వెనకబాటే... రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో రైడర్‌తో పాటు వెనకాల కూర్చొని ఉండే పిలియన్ రైడర్‌కు హెల్మెట్ వాడకంలోనూ హైదరాబాద్, విజయవాడలు 14, 15 స్థానల్లో ఉన్నాయి. ఢిల్లీలో 63 శాతం, గౌహతిలో 58 శాతం మంది వినియోగిస్తుంటే హైదరాబాద్‌లో ఐదు శాతం, విజయవాడలో మూడు శాతం మందే వినియోగిస్తున్నారు. ఇక అహ్మదాబాద్‌లో రెండు, ఇండోర్‌లో రెండు, పుణేలో మాత్రం ఎవరూ వినియోగించేందుకు ఆసక్తి చూపడం లేదని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. హెల్మెట్ సురక్షిత ప్రయాణానికి ఉపయోగపడుతుందా అని అడిగితే 99 శాతం మంది హైదరాబాదీలు అవునని చెప్పారు. ఇక హెల్మెట్ వాడకుంటే జరిమానా విధిస్తారనే భయంతో వాడుతున్నారా అంటే 87 శాతం మంది అవునని చెప్పడం గమనార్హం. 32 కిలోమీటర్లు చుట్టేస్తారట... హెల్మెట్ లేకుండా ఎన్ని కిలోమీటర్లు ప్రతిరోజూ ప్రయాణిస్తారంటే 32 కిలోమీటర్ల మేర జర్నీ చేస్తామని హైదరాబాదీలు సర్వేలో సమాధానం ఇచ్చారు. ఎక్కువగా అహ్మదాబాద్ (43), పుణే (41), ఇండోర్ (35), లక్నో (35) కిలోమీటర్లు తిరుగుతున్నారన్న జవాబులొచ్చాయి. విజయవాడలో 30 కిలోమీటర్లు బైక్ నడుపుతారని, అతి తక్కువగా ఢిల్లీలో 14 కిలోమీటర్ల వెళతారని సర్వే పేర్కొంది. కొద్ది దూరమే ప్రయాణించాల్సి వస్తే 79 శాతం హైదరాబాదీలు హెల్మెట్ వాడరని, ట్రాఫిక్ పోలీసులు ఉండని ప్రాంతాల్లోనూ 75 శాతం హెల్మెట్ వినియోగించడం లేదని సర్వే తెలిపింది. అలాగే ట్రాఫిక్ లేని ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా వెళ్లడంలో 68 శాతంతో హైదరాబాదీలు, 53 శాతంతో విజయవాడ బైకర్లు తొలి రెండు స్థానాల్లో ఉండగా అతి తక్కువగా 11 శాతంతో ఢిల్లీ బైకర్లు ఉన్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. -
మటన్ కొంటే హెల్మెట్ ఉచితం!
సాక్షి, నందిగామ: కోవిడ్–19 (కరోనా వైరస్) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. (చదవండి: ఉచితంగా 2 వేల ఐఫోన్ల పంపిణీ!) కాగా, కోవిడ్–19కు చికెన్‌కు సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, గుడ్లతో ఈ వైరస్ సోకుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పౌల్ట్రీ ఫెడరేషన్ ఖండించింది. చికన్, గుడ్లు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తెలిపింది. (చదవండి: ‘కోవిడ్’.. చికెన్‌తో నో డేంజర్!) -
తల మీద పాము.. గమనించకుండా 11 కిలోమీటర్లు
తిరువనంతపురం: బైక్‌లు, షూలు, ఏసీలు, కార్లలో పాములు దూరడం చూసి ఉంటాం. కానీ ఓ పాము ఏకంగా హెల్మెట్‌లో దూరింది. అది గమనించని ఆ వ్యక్తి ఏకంగా తలపైనే విష సర్పాన్ని పెట్టుకొని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. గమ్యం చేరుకునేదాక దానిని చూసుకోలేదు. తీరా స్కూలుకు చేరుకున్నాక చూసుకుంటే తనకేం కానందుకు బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కేరళలోని ఓ ఉపాధ్యాయుడికి ఈ వింత అనుభవం ఎదురైంది. కందానాద్ సెయింట్ మేరీ హైస్కూల్లో పనిచేస్తున్న టీచర్ రంజిత్ తన ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరాడు. ఎప్పటిలాగే బైక్ వద్ద ఉన్న హెల్మెట్ పెట్టుకొని స్కూల్‌ను చేరుకోగానే హెల్మెట్ తీస్తుండగా లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో దాన్ని పరిశీలనగా చూసి షాకయ్యాడు. అందులో ఓ పాము చనిపోయి కనిపించింది. తాను హెల్మెట్ పెట్టుకోవడం వల్లే చనిపోయిందా లేక ఎవరైనా కావాలనే పెట్టారా అనేది తెలియలేదు. రంజిత్‌కు ఆ పాము నుంచి ఎలాంటి ప్రమాదం లేకపోయినా అతడి సహోద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడికి రక్త పరీక్ష చేశారు. అయితే ఆ పాము అతడిని కాటేయలేదని చెప్పారు. -
‘కరోనా’ నుంచి రక్షణకు హెల్మెట్
పెర్త్: చైనాలో షాంఘై నగరం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి బుధవారం నాడు ఉదయం 9.30 గంటలకు వచ్చిన విమానంలో ప్రయాణికులందరిలోనూ కరోనా వైరస్ భయం కనిపించింది. వారంతా మూతికి, ముక్కుకు క్లినికల్ మాస్క్‌లు ధరించి రాగా, ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా తలకు మోటారు బైక్ హెల్మెట్ ధరించి వచ్చారు. అయినా వారిని వెంటనే కిందకు దిగనీయలేదు. వైద్య సిబ్బంది వచ్చి వారి చుట్టూ వైరస్ నాశన మందును స్ప్రే చేసిన తర్వాతనే ప్రయాణికులను విమానం దిగేందుకు అనుమతించారు. (చదవండి: మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా) విమానం ప్రయాణంలో తన కొడుకు చికాకేసి పలుసార్లు మాస్క్ తీసివేసేందుకు ప్రయత్నించాడని, తాను అందుకు అవశాశం ఉండకుండా పక్కనే ఉండి జాగ్రత్త పడ్డానని జాన్ వూ అనే వ్యక్తి తెలిపారు. చైనాలో కరోనా వైరస్ రోగుల సంఖ్య నాలుగున్నర వేల నుంచి ఆరు వేలకు హఠాత్తుగా పెరగడంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. చైనా నుంచి ఆస్ట్రేలియా వచ్చిన ఆస్ట్రేలియన్లలో 16 మందికి ఈ వైరస్ సోకినట్లు అనుమానించి అధికారులు వారిని ఆస్పత్రిలో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనాలో ఉన్న మరో 600 మంది ఆస్ట్రేలియన్లను ఇంకా తమ దేశానికి తీసుకురావాల్సి ఉందని అధికారులు తెలిపారు. (చదవండి: కరోనా వైరస్‌తో ఎంతటి ముప్పు!?) -
వైరల్ వీడియో: హెల్మెట్‌తో శునకం విహారం
-
వైరల్: ఈ కుక్కను చూసి నేర్చుకోండి
‘హెల్మెట్ ధరించండి- ప్రాణాలను కాపాడుకోండి’ అని ట్రాఫిక్ పోలీసులు నెత్తీనోరూ మొత్తుకున్నా ఎవ్వరూ దాన్ని నిబద్ధతగా పాటించిన పాపాన పోలేదు. బుజ్జగిస్తే వినేలా లేరనుకున్న కేంద్రం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ మొత్తంలో చలాన్లు విధిస్తోంది. దీంతో చలాన్లు కట్టలేక జేబులు ఖాళీ అవుతున్నాయని కొంతమంది చచ్చినట్టు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. కానీ ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు చాలామందే ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే వ్యక్తి తనతోపాటు పెంపుడు కుక్క రక్షణ బాధ్యత తనమీద వేసుకున్నాడు. అదెలాగంటే.. బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి తన పెంపుడు జంతువైన కుక్కను వెంట తీసుకెళ్లాడు. అయితే దాన్ని వెనకాల కూర్చోపెట్టుకుని, దానికో హెల్మెట్ ధరించి మరీ తీసుకెళ్లాడు. దీంతో రోడ్డు వెంబడి జనమంతా ఆ కుక్కను చూసి ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. ఈ అరుదైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘కుక్క అంటే ఎంత ప్రేమో’ అని కొందరు నెటిజన్లు బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ‘కుక్కను ముందు కూర్చోపెట్టుకోండి, వెనకాల కూర్చోబెడితే.. ఆ శునకం పడిపోతే ఏంటి పరిస్థితి?’ అంటూ మరికొందరు కుక్కపై ప్రేమ, దాని యజమానిపై కోపం ఏకకాలంలో ప్రదర్శించారు. ‘హెల్మెట్ ధరించనివాళ్లు కనీసం ఈ కుక్కను చూసైనా నేర్చుకోండయ్యా’ అంటూ ఓ నెటిజన్ ఒకింత ఘాటుగా, కాస్త వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. గతంలో ఢిల్లీలోనూ ఓ శునకం హెల్మెట్ ధరించి బైక్‌పై ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి లోను చేసిన సంగతి తెలిసిందే. -
హెల్మెట్ పెట్టుకోకుంటే లైసెన్స్ పోద్ది
సాక్షి, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ప్రతి 100 మందిలో 30 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే వాహన చోదకుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన మోటార్ వాహన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ నగరంలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. విజయవాడలో 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇందులో 60 శాతం మందికి పైగా వాహనచోదకులు హెల్మెట్ లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని వారే అధికంగా మృత్యువాత పడుతున్నారు. నగరంలో జనవరి 1వ తేదీ నుంచి హెల్మెట్ ధరించకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేస్తారు. వారి డ్రైవింగ్ లైసెన్సులను నెల రోజులపాటు సస్పెండ్ చేయబోతున్నారు. సస్పెన్షన్ సమయంలో మళ్లీ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని సీజ్ చేయనున్నారు. సెప్టెంబరులో కృష్ణా జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో నిబంధనలు పాటించని 372 మందిపై చర్యలు తీసుకున్న సంగతి విదితమే. వీరిపై కేసులు నమోదు చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్‌లను సైతం సస్పెండ్ చేశారు. మళ్లీ జనవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇన్సూరెన్స్ సొమ్ము రాదు ‘‘కేంద్ర మోటార్ వాహన చట్టం 138(ఎఫ్) ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్సులను నెల రోజులపాటు సస్పెండ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్సు రద్దుచేసిన సమయంలో వాహనం నడుపుతూ మరోసారి పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా వాహనం సీజ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా లైసెన్స్ రద్దు సమయంలో వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ సొమ్ము రాదు’’ – ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ, కృష్ణా జిల్లా -
హెల్మెట్ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా!
కర్ణాటక,బొమ్మనహళ్లి: సాధారణంగా బైక్‌పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే 409 లారీలో వెళ్తున్న డ్రైవర్ హెల్మెట్ వేసుకోలేదని సదరు డ్రైవర్‌కు జరిమానా విధించిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార్లో చోటుచేసుకుంది. దీంతో రసీదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్‌గా నజీర్ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్ ధరించ లేదని జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు. దీంతో పోలీసులు నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
‘అందుకే ఆఫీసులో హెల్మెట్ పెట్టుకుంటాం’
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రతిరోజూ హెల్మెట్ ధరించే ఆఫీసుకు వెళ్తారు. అంతేకాదు కార్యాలయానికి చేరుకున్న తర్వాత కూడా హెల్మెట్ పక్కన పెట్టకుండానే పనిచేసుకుంటారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 మీద ఉన్న భయం వలనో, భక్తి వలనో వీరిలా చేస్తున్నారనుకుంటే పొరబాటే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పడే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వారు ఇలా చేయడం లేదు. పనిచేసే చోట ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు వేరే గత్యంతరంలేక ఈ మార్గం ఎంచుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే... విద్యుత్ శాఖకు చెందిన బాందా జిల్లాలోని ఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కప్పు ఎప్పుడు ఊడి మీద పడుతుందో తెలియని దుస్థితి. కాస్త వర్షం పడినా పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉద్యోగులే ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నారు. కాగా హెల్మెట్లు ధరించి ఆఫీసులో పనిచేసుకుంటున్న ఉద్యోగుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి విద్యుత్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ‘ మమ్మల్ని మేము రక్షించుకోవడానికి గత్యంతరం లేక ఇలా హెల్మెట్‌తో కాలం వెళ్లదీస్తున్నాం. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఫైళ్లు భద్రపరుచుకునేందుకు సరైన అల్మారాలు లేవు. కుర్చీలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. వర్షం వస్తే గొడుగులు పట్టుకుని పనిచేస్తాం. ఇంతా జరుగుతున్నా సీనియర్లకు మా బాధలు పట్టవు. కప్పు కూలి మాలో ఎవరో ఒకరు చచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం వెదుకుదామని వాళ్లు ఆలోచిస్తున్నారేమో. అప్పుడే భవనాన్ని రిపేరు చేస్తారు కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. -
జర్నలిస్ట్‌పై హెల్మెట్ తో దాడి
నాగోలు: జర్నలిస్ట్‌పై దాడిచేయమేగాక కులం పేరుతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాన్సురాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తీలో నివాసం ఉంటున్న కేదరి దుర్గయ్య ఓ పత్రికలో రిపోర్టర్ పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతను తన స్నేహిఉతుడ లింగయ్యతో కలిసి హయత్‌నగర్ నుంచి బైక్‌పై ఇంటికి తిరగి వస్తుండగా ప్రెస్ కాలనీ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు కారణమైన కారు డ్రైవర్‌ను పక్కకు జరగాలని దుర్గయ్య కోరాడు. దీంతో ఆగ్రహానికిలోనైన కారు డ్రైవర్ నెహంత్ కుమార్ దుర్గయ్యపై దాడికి దిగాడు. లింగయ్య అతడిని అడ్డుకోగా నెహంత్ కుమార్ తండ్రి విజయ్‌కుమార్ తన చేతిలో ఉన్న హెల్మెట్‌తో దుర్గయ్యపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
సారు... హెల్మెట్ మరిచారు
సాక్షి,సిటీ బ్యూరో: గురువారం ఉదయం బజాజ్ చేతక్ స్కూటర్ నడిపిన జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తన అనుభవాన్ని టిట్వర్ ద్వారా పంచుకున్నారు. ‘‘బజాజ్ చేతక్ నడపడం చాల అద్భుతంగా ఉంది. భారతీయ మెడ్మిషన్ కలిగిన ఇంజిన్‌కు కిక్ కొట్టి స్టార్ట్ చేయడం చాలా ఇష్టం‘‘ అంటూ ట్వీట్ చేశారు. బజాజ్ చేతక్ స్కూటర్ నడపడం.. తన అనుభవాన్ని టీట్వర్ ద్వారా పంచుకోవడం బాగానే ఉంది. కానీ.... సారు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం మరిచారు. -
హాఫ్ హెల్మెట్‌కు ఈ–చలాన్ షాక్
గచ్చిబౌలిలో ఉండే అరుణ్ కుమార్ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైక్‌పై వెళ్లే ఇతడు హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు చాలాసార్లు ఈ–చలాన్ విధించారు. ఇలా అయితే కష్టమని.. పోలీస్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు బైక్‌పై వెళ్లేటప్పుడు ‘హాఫ్ హెల్మెట్’ (ప్లాస్టిక్ క్యాప్ మాదిరిది) ధరించసాగాడు. తాను హెల్మెట్ ధరిస్తున్నందున చలాన్ రాదనుకున్నాడు. ఓసారి ట్రాఫిక్ పోలీసులు అరుణ్ బైక్ ఆపి తనిఖీ చేయగా.. హెల్మెట్ ధరించడం లేదంటూ పదుల సంఖ్యలో ఈ–చలాన్లు చేతికివ్వడంతో షాక్ తిన్నాడు. సాక్షి,సిటీబ్యూరో: శంషాబాద్‌లో నివాసముండే శివాజీ మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైక్‌పై వచ్చి వెళుతుంటాడు. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో హెల్మెట్ ధరించని కారణంగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తలకు హెల్మెట్ పెట్టుకునేందుకు ఇష్టపడని శివాజీ.. ‘కన్స్ట్రక్షన్ హెల్మెట్’ (ప్లాస్టిక్ క్యాప్)ను ధరించసాగాడు. అయినా శివాజీకి ‘వితవుట్ హెల్మెట్’ అని ఈ–చలాన్లు జారీ అవుతుండడంతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించగా.. హాఫ్ హెల్మెట్ క్యాప్‌గా పరిగణిస్తామని షాకిచ్చారు. ...ఈ రెండు కేసుల్లోనే కాదు.. హాఫ్ హెల్మెట్లు వాడుతున్న చాలామంది ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. దీంతో పోలీసులు కనీస పరిజ్ఞానం లేకుండా జరిమానాలు విధిస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సమయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తాము ధరించింది హెల్మెట్ అంటూ పోలీసులతోనే వాదిస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం హెల్మెట్లు ధరిస్తున్నప్పుడు తమకు జరిమానాలు ఎందుకు విధిస్తున్నారంటూ అవేశపడుతున్నారు. అయితే.. ఎంవీయాక్ట్ ప్రకారం తలను పూర్తిగా కప్పి ఉంచేదే హెల్మెట్ అని, అది ఉంటేనే ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలు నిలబడతాయని.. క్యాప్ మాదిగా ఉన్నది హెల్మెట్ కిందకు రాదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అందుకే చట్టప్రకారం వారికి ‘వితవుట్ హెల్మెట్’ అనే అప్షన్‌తో జరిమానా విధిస్తున్నామంటున్నారు. ‘‘కేవలం ట్రాఫిక్ పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకునేందుకే హాఫ్ హెల్మెట్లను బలవంతంగా ధరిస్తూ నిబంధనలు పాటిస్తున్నామని భావిస్తున్న వాహనదారులు.. ప్రమాదం జరిగినప్పుడు తమ ప్రాణానికి ఆ సగం హెల్మెట్లు ఏమాత్రం కనీస రక్షణనివ్వవన్న సంగతి మరిచిపోతున్నారు.’’ వాహనదారులూ.. ఇది మీ మంచికే.. ట్రాఫిక్ పోలీసులు ఈ–చలాన్లు జారీ చేస్తుండడంతో హెల్మెట్లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, చాలా మంది హెల్మెట్ ఉండి వాడకుండా బైక్‌కు వెనకవైపు పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఈ విధంగానే గత నెల 29వ తేదీన పులిజా విజయ్, మరో వ్యక్తి అనిల్ కుమార్‌తో కలిసి బుల్లెట్ బైక్ (టీఎస్13ఈఎం 8214)పై వెళుతుండగా అరామ్‌ఘర్ అండర్‌పాస్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని తాకడంతో తలకు తీవ్రగాయాలైన పులిజా విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ తలకు పెట్టుకోవల్సిన హెల్మెట్‌ను బండి వెనకాల తగిలించుకున్నాడు. అదే హెల్మెట్‌ను ధరించి ఉంటే తలకు స్వల్పగాయాలై బయటపడి ఉండేవాడని ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ చెప్పారు. గాయాలైన మరోవ్యక్తి అనిల్‌కుమార్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఒక్క సంఘటనే కాదు చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ఉండి కూడా ధరించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. వాహనదారులు పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు హాఫ్ హెల్మెట్లు వాడుతున్నారని, ఇది వారికి మంచిది కాదన్నారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో ఆ హెల్మెట్ గాయాల తీవ్రతను తగ్గించాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విజయ్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. -
హెల్మెట్ లేదని బైక్ ఆపారు.. అంతలోనే
సాక్షి, చెన్నై: హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళుతున్న యువతిని పోలీసులు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున లారీ బంంగా ఢీకొంది. దీంతో యువతి కాళ్లపై నుంచి లారీ చక్రం ఎక్కిదిగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపైనే రాస్తారోకో చేపట్టారు. వివరాలు.. చెన్నై సెన్‌గుండ్రమ్ సమీపంలోని పాడియనల్లూర్ జ్యోతినగర్‌కు చెందిన యువనేష్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల ప్రియా (23) అనే యువతితో వివాహం జరిగింది. శుక్రవారం ప్రియా తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కొనడానికి స్కూటర్‌పై రాత్రి 7.30 గంటల సమయంలో కేకేనగర్ సమీపంలోని బేకరీకి వెళ్లింది. అదే సమయంలో సెన్‌గుండ్రమ్–తిరువళ్లూరు రోడ్డుపై ఎస్ఐ కుమారన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. కేక్ కొన్నుకుని తిరుగు ప్రయాణమైన ప్రియాను హెల్మెట్ ధరించకపోవడంతో కానిస్టేబుల్ ఆపమని కర్రతో సైగ చేశాడు. ప్రియా హఠాత్తుగా బ్రేక్ వేసింది. అదే సమయంలో సెన్‌గుండ్రమ్ నుంచి వస్తున్న లారీ స్కూట్‌ను ఢీకొంది. అదుపుతప్పి కిందపడిన ప్రియాపై లారీ చక్రం ఎక్కిదిగడంతో ఆమె రెండు కాళ్లు చితికిపోయాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన చెన్నై ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ప్రియా కిందపడడానికి పోలీసులే కారణమని ఆగ్రహించిన స్థానికులు రాస్తారోకో చేపట్టారు. లారీ అద్దాలను ధ్వంసం చేశారు. ఓ బైక్‌ను తగుబెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో తిరువళ్లూరు ఎస్పీ అరవిందన్, ఇన్స్పెక్టర్లు, సబ్ – ఇన్స్పెక్టర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా మార్పు రాకపోవడంతో లాఠీ చార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
హెల్మెట్ పెట్టుకోలేదని బస్సు డ్రైవర్‌కు చలాన్!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి దేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. అర్థం పర్థం లేని నిబంధనలతో అయినదానికి, కానిదానికి జరిమానాలు ఎడాపెడా విధించేస్తున్నారు. తాజాగా బస్సు డ్రైవర్‌కు హెల్మెట్ పెట్టుకోలేదని ఆన్లైన్ చలాన్ విధించారు. హెల్మెట్ పెట్టుకోకుండా బస్సు నడుపుతున్నందుకు రూ. 500 కట్టాలని నోటీసు పంపించారు. దీంతో ఆ డ్రైవర్ బిత్తరపోయి.. ఈ విషయాన్ని బస్సు యాజమానికి తెలిపాడు. ఈ ఘటన నోయిడాలో జరిగింది. నోయిడాకు చెందిన నిరాంకార్ సింగ్‌కు సొంతంగా 40 నుంచి 50 బస్సులు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీలకు తన బస్సులను అద్దెకిచ్చి నడిపిస్తుంటాడు. సెప్టెంబర్ 11వ తేదీన ఆయనకు ఒక చలాన్ వచ్చింది. తన బస్సు నడుపుతున్న డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని, అందుకు రూ. 500 చలాన్ చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు నోటిసు పంపారు. దీంతో నిరాంకర్ సింగ్, ఆయన డ్రైవర్ బస్సు నడిపేందుకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటూ విస్తుపోయారు. ట్రాఫిక్ సిబ్బంది ఒకవేళ పొరపాటున తనకు ఈ చలాన్ పంపించి ఉండొచ్చునని, కానీ, ఒక బస్సు యాజమానికే ఇలాంటి చలాన్ వస్తే.. ఇక మిగతా చలాన్లు ఎంతవరకు సవ్యంగా వస్తున్నాయన్నది సందేహాలు రేకెత్తిస్తోందని, దీనిపై ట్రాఫిక్ అధికారులను సంప్రదించడమే కాదు.. అవసరమైతే న్యాయం పోరాటం చేస్తానని నిరాంకర్ సింగ్ స్పష్టం చేశారు. -
హెల్మెట్ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!
అహ్మదాబాద్ : నూతన మోటారు వాహన చట్టంతో జనం బెంబేలెత్తుతున్నారు. భారీ చలాన్లకు భయపడి వాహనాలతో రోడ్లపైకి రావాలంటేనే జడుసుకుంటున్నారు. అయితే, ఉదయ్‌పూర్ జిల్లాలోని బొడేలిలో నివాముండే జకీర్ మోమన్ అనే వ్యక్తి మాత్రం హెల్మెట్ లేకుండానే యథేచ్ఛగా బైక్‌పై తిరుగుతున్నాడు. దీంతో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకుని భారీ ఫైన్ వేశారు. కానీ, అతను జరిమానా చెల్లించేందుకు నిరాకరించాడు. ఆ చుట్టుపక్కల పట్టణాలన్నీ వెతికినా తన తలకు సరిపడా హెల్మెట్ దొరకడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. దయుంచి తన భారీ తలకు ఓ హెల్మెట్ జాడ చెప్పండని వేడుకున్నాడు. కావాలంటే చెక్ చేసుకోండని అక్కడున్న హెల్మెట్లు పెట్టుకుని చూశాడు. ఒక్కటి కూడా అతని తలకు సరిపోలేదు. భారీ తల కారణంగానే హెల్మెట్ లేకుండా తిరుగుతున్నానని.. తనకు ఫైన్ వేయొద్దని పోలీసులకు విన్నవించాడు. (చదవండి : ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు) జకీర్ వాహనానికి మిగతా అన్ని పేపర్లు సక్రమంగా ఉండటంతో అతనికి ఎలాంటి ఫైన్ వేయకుండా ట్రాఫిక్ పోలీసులు వదిలేశారు. ఇదిలాఉండగా.. నూతన మోటారు వాహన సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు రావడంతో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలుచేస్తూనే.. అందులోని జరిమానాలను సగానికి సగం తగ్గిస్టున్న ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రకటించారు. ఇక గుజరాత్ బాటలోనే కర్ణాటక ప్రభుత్వం నడిచే యోచనలో ఉన్నట్టు తెలిసింది. గుజరాత్ తరహాలో ట్రాఫిక్ చలాన్లు తగ్గిస్తామని సీఎం బీఎస్ యడ్యూరప్ప మీడియాతో అన్నారు. (చదవండి : ట్రాఫిక్ చలాన్లను తగ్గించనున్న మరో రాష్ట్రం!) -
చలికాలం హెల్మెట్ సరే మరి ఎండాకాలం..?
కర్ణాటక, యశవంతపుర : వేసవిలో మండే ఎండలకు హెల్మెట్ ధరించటమంటే తలకు మించిన భారంగా భావిస్తారు. అయితే సమస్యను పరిష్కారించటానికి బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ హెల్మెట్‌కు ఏసీ సాధనాన్ని తయారు చేశారు. దీనికి ‘వాతానుకూల’ అని నామకరణం చేశారు. వేసవిలో చల్లగాను, చలికాలంలో వేడిగా ఉండటానికి ఈ పరికరాన్ని తయారు చేశారు. బహుళజాతి సంస్థలలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆర్టీ నగరకు చెందిన సందీప్ దహియా ఈ సాధనాన్ని అవిష్కరించారు. ఉపయోగదారుల ఉత్పత్తులను తయారు చేసే పరికరాలను విన్యాసం(డిజైన్) చేయటంలో సిద్ధహస్తుడిగా సందీప్ దహియాకు పేరుంది. ఆయన ఆర్టీనగరలో గ్యారేజీ కం వర్క్‌షాపును కూడా నడుపుతున్నారు. యువకుడు సందీప్ దహియా చేసిన ఏసీ హెల్మెట్‌పై అందరినీ అకర్షిస్తోంది. వీపుపై జాకెట్‌కు వెనుక తగిలించుకుని హెల్మెట్‌కు ఏసీ గాలి వచ్చేలా సాధనాన్ని తయారు చేశారు. నాలుగేళ్ల నుండి హెల్మెట్‌పై ప్రయోగం గత నాలుగేళ్ల నుండి సందీప్ దహియా హెల్మెట్లపై అనేక ప్రయోగాలను చేస్తున్నారు. బైకుకు ఉయోగించే 12 ఓల్ట్ సామర్థ్యంగల బ్యాటరీ (డీసీ)ని ఇందుకు ఉయోగించారు. బెంగళూరు నగరంలాంటి ప్రాంతాల్లో సిగ్నల్స్ పడగానే తలలో వేడికి కొందరు హెల్మెట్లను తీసేస్తారు. అలా ఎందుకు తీయాలో ఒక అలోచన వచ్చింది. దీనిపై సీరియస్‌గా దృష్టి సారించిన సందీప్ దహియా ఏసీ హెల్మెట్‌ను ఎలాగైనా తయారు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. నేను కూడా హెల్మెట్ జీవరక్షణ ధరిస్తున్నట్లు భావించా. హెల్మెట్ ధరించటంతో తలలో వేడి పుడుతుంది. దీంతో వెంట్రుకలు రాలిపోతున్నట్లు కొందరు అంటుంటారు. ఈ కారణంతో తను తయారు చేసే హెల్మెట్ అన్ని వాతావారణాలకు అనుకూలంగా ఉండలానే ఉద్దేశంతోనే ‘వాతానుకూల’గా హెల్మెట్‌కు పేరు పెట్టినట్లు సందీప్ దహియా వివరించారు. ఏర్ కూల్‌తో 1.7 కేజీలు మాములుగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెల్మెట్ 8 వందల గ్రాముల నుండి రెండు కేజీలుంటాయి. అయితే ఈ హెల్మెట్ 1.7 కేజీల బరువు ఉంది. ఇందులో రెండు భాగాలుగా విభజించారు. వీపుపై బ్యాక్‌ప్యాక్‌తో ఏసీ పరికరాన్ని తగిలించుకోవాలి. అక్కడ నుండి రబ్బర్ ట్యాబ్ ద్వారా తలకు ధరించిన హెల్మెట్‌కు ఏసీ గాలిని అందిస్తుంది. వేడిని చల్లగా మార్చే ఏర్ కూలింగ్ పని చేస్తుంది. ఈ చల్లదనాన్ని అందిస్తున్న పరికరాలకు నీరు అవసరంలేదు. ఈ సాధనం సెమి కండక్టర్‌తో అనుసంధానం చేశారు. ఈ సాధనం ద్వారా వేడిని తగ్గించవచ్చు. పెచ్చుకోవచ్చు. హెల్మెట్‌కు బ్యాటరితో ఎలాంటి సంబధం లేదు. రబ్బర్ నుండి గాలిని హెల్మెట్‌కు అందిలా వ్యవస్థను కల్పించారు. ఏసీని నియంత్రించటానికి సాధనంలో ఒక చిన్న రిమోట్‌ను కూడా ఉపయోగించారు. ఇప్పుటి వరకు డిమాండ్ ఆధారంగా 40 మంది వినియోగదారులకు ఏసీ హెల్మెట్‌ను తయారు చేసి ఇచ్చినట్లు సందీప్ తెలిపారు. ఆర్టీ నగరలోని తన ఇంటీ నుండి యుబీ సీటీలో తను పని చేస్తున్న అఆఫీసు వరకు ఏసీ హెల్మెట్‌ను సందీప్ దహియా ఉపయోగిస్తున్నా రు. బైక్‌పై వెళ్తుండగా అనేక మంది వీపుపై ఉన్న యంత్రం ఏమిటని అడుగుతున్నారు. హెల్మెట్ ఏసీ అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా గమనిస్తున్నట్లు సందీప్ వివరించారు. దీనికి అవుతున్న ఖర్చును మాత్రం చెప్పటం లేదు. పరికరాల ఉపయోగాన్ని బట్టి ధరలుంటాయని సందీప్ తెలిపారు. కనీసం రూ. మూడు వేల నుండి ఏడు వేల వరకు ధర ఉండవచ్చు. -
ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!?
గాంధీనగర్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తోంది. వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గతంలో మాదిరి ఇంట్లో మర్చిపోయాను సర్ అంటే కుదరదు. అన్ని కాగితాలను మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. ఈ క్రమంలో ఓ వ్యక్తి బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించుకుని తిరుగుతున్నాడు. వివరాలు.. గుజరాత్ వడోదరకు చెందిన రామ్ షా అనే వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రోజంతా ఎక్కడెక్కడో తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన నూతన మోటార్ వాహన చట్టం వల్ల ఏ చిన్న కాగితం మిస్ అయినా పెద్ద మొత్తంలో చలాన్ కట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి రామ్ షా ఓ వినూత్న మార్గం కనుగొన్నాడు. ఎక్కడికెళ్లినా హెల్మెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. దాంతో బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించాడు. ఇక నేను కాగితాలు చూపించడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పని లేదు.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదంటున్నాడు రామ్ షా. ఇతని ప్రయత్నాన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా అభినందిస్తున్నారు. (చదవండి: విక్రమ్ ల్యాండర్‌కు చలాన్ విధించం) -
రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపెట్టడం ఖాయం. గుర్‌గ్రామ్‌లో చోటు చేసుకున్న ఉదంతం ఒకటి ఈ విషయాన్ని తేట తెల్లం చేసింది. నాలుగు రాష్ట్రాలు (తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్) మినహా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం భారీ జరిమానాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా హెల్మెల్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ.. ఇలా ఏ సర్టిఫికెట్ లేకపోయినా వాహనదారుడు పది రెట్లకు మించి భారీ మూల్యం చెల్లించాల్సిందే. దినేష్ మదన్ తాజా అనుభవం గురించి తెలుసుకుందాం.. దినేష్‌కు కొత్త ట్రాఫిక్ నిబంధనల కింద ఏకంగా రూ.23,000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే.. లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్స్ లేవు.. దీంతో పాటు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు భారీ జరిమానా విధించారు. హెల్మెట్ లేదని బండి ఆపి, సర్టిఫికెట్లు లేవంటూ భారీ ఫైన్ విధించారని, వాట్సాప్‌లో లెసెన్స్ కాపీని చూపించినా అంగీకరించలేదని దినేష్ వాపోయాడు. హోండా యాక్టివా బైక్‌ను సెకండ్ హ్యాండ్లో రూ.15వేలకు కొన్నాను. ఇపుడు దీనికి రూ. 23 వేల జరిమానా చూసి షాకయ్యానంటున్నాడు దినేష్. బండికి సంబంధించిన కాగితాలన్నీ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పాడు. అయితే హెల్మెట్ ధరించనందుకు గాను వెయ్యి రూపాయల ఫీజును తీసుకొని, తన బండి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. అంతేకాదు.. ఇక మీదట అన్ని నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తానని తెలిపాడు. అయితే రూల్ ఈజ్ రూల్ అంటున్నారు అధికారులు. లైసెన్స్ లేని డ్రైవింగ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేదు, ఎయిర్ పొల్యూషన్ నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేని డ్రైవింగ్... ఈ నిబంధనల ఉల్లంఘనల కింద జరిమానా విధించామని వెల్లడించారు. చదవండి : 'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే! -
హెల్మెట్ లేదంటూ కారు యజమానికి జరిమానా
సాక్షి, చెన్నై : హెల్మెట్ ధరించలేదంటూ కారు యజమానికి పోలీసులు జరిమానా విధించడం సంచలనం కలిగించింది. దీంతో కారు యజమాని అవాక్కయి నేరుగా కమిషనర్ కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు. చెన్నై కొట్టివాక్కం ప్రాంతానికి చెందిన న్యాయవాది భరణీశ్వరన్. ఇతని భార్య నందిని. గత 25వ తేదీ ట్రాఫిక్ పోలీసు శాఖ నుంచి భరణీశ్వరన్‌కు ఒక ఎస్ఎంఎస్ అందింది. అందులో ద్విచక్ర వాహనంలో హెల్మెట్ ధరించకుండా వెళ్లినందుకు రూ.100 రూపాయలు అపరాధం చెల్లించాలని ఎస్ఎంఎస్ ద్వారా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కారు యజమాని దిగ్భ్రాంతి చెందారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించని పక్షంలో వారికి జరిమానా విధించడం పరిపాటి. అయితే కారు యజమానికి హెల్మెట్ జరిమానా మెసేజ్ రావడంతో సంచలనం కలిగించింది. దీంతో కారు యజమాని సంబంధిత ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించకపోవడంతో శనివారం ఆయన నేరుగా కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. -
బీ కేర్‌ఫుల్...డబ్బులు ఊరికేరావు
శ్రీనగర్‌కాలనీ: ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తే ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడమేగాకుండా 80శాతం ప్రమాదాలను నివారించవచ్చని ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ సీఐ శ్రీకాంత్‌గౌడ్ అన్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలకు పాల్పడినా చలాన్లు కడితే సరిపోతుందిలే అనుకంటే పొరపాటే...కొత్త నిబంధనలతో జరిమానాలు ఐదు రెట్లు పెరగడంతో పాటు కఠిన శిక్షలు అమలులోకి వస్తున్నాయన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి వస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ జరిమానాలు, ట్రాఫిక్ నిబంధనలపై బుధవారం వాహనదారులకు అవగాన కల్పించారు. చలాన్లు ఐదింతలు... నూతన ట్రాఫిక్ నిబంధనల ద్వారా చలాన్లు ఐదింతలు పెరిగాయి. వాహనదారుల్లో మార్పు తక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు చలాన్లను తీవ్రతరం చేశారు. వాహనదారులు ఈ విషయమై అవగాహన పెంచుకొని ట్రాఫిక్ ఉల్లంఘనలపట్ల జాగ్రత్తగా ఉండాలి. తాగినడిపితే జైలుకే... డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేల జరిమానాతో పాటు జైలు కెళ్లాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లను ఒకప్పుడు వారాంతాల్లో నిర్వహించే వాళ్లం...ఇప్పుడు ప్రతిరోజు డ్రైవ్‌లను నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవర్ల పని పడుతున్నాం. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దుచేసి కఠిన శిక్షలను అమలు చేస్తున్నాం. చలానా కట్టకపోతే కఠిన చర్యలు.. చలానాలు కట్టకపోతే ఏమీకాదులే అని అనుకుంటే పొరపాటే.. నూతన నిబంధనలతో జైలుకు వెళ్లాల్సిందే. పెండింగ్‌లో ఉన్న చలానాలు చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలను సవివరంగా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఐదు కంటే ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలకు చార్జిషీట్లు వేస్తూ, ఆరు నెలల జైలుతో పాటు జరిమానా కూడా విధిస్తున్నారు. వాహనదారులు ప్రతిఒక్కరూ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోతే వాహనదారుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఇన్సూరెన్స్‌లు సైతం వినియోగించుకోవచ్చు. చలాన్లను ఈ–సేవా, మీ–సేవా, ఏపీ–ఆన్లైన్, ఎస్బీఐ, పోస్ట్ఆఫీస్, నెట్ బ్యాంకింగ్, ట్రాఫిక్ పోలీస్ యాప్ ద్వారా మొబైల్ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు...బీ కేర్‌ఫుల్...డబ్బులు ఊరికే రావు... ‘ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవండి...డబ్బును ఆదా చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. Follow Traffic Rules...Save Your Money. pic.twitter.com/hfElm0hLCm — Hyderabad City Police (@hydcitypolice) August 22, 2019 కొత్తగా అమలులోకి రానున్న చలాన్ల రేట్లు ఇవీ -
హెల్మెట్ ధరించకుంటే రూ.1000 జరిమానా
తమిళనాడు, టీ.నగర్: హెల్మెట్ ధరించకుంటే రూ.1,000 అపరాధం విధించే చట్ట సవరణ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపినట్లయితే రూ.వెయ్యి అపరాధం విధించబడుతుందని ఇటీవల ట్రాఫిక్ పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మోటార్ వాహన చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణ జరిపి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,00 నుంచి రూ.1,000కి పెంచారు. వెనుక కూర్చున్నవారు హెల్మెట్ ధరించనట్లయితే ఖచ్చితంగా అపరాధం వసూలు చేయబడుతుందని నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలో తెలిపారు. చెన్నై నగర పోలీసు సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అరుణ్ ఉత్తర్వుల మేరకు గురువారం నుంచి హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినవారికి రూ.1,000 అపరాధం విధించారు. అలాగే వెనుక కూర్చున్న వారి వద్ద అపరాధాన్ని వసూలు చేశారు. ముఖ్యంగా చెన్నై కామరాజర్ రోడ్డు, ఈస్ట్‌కోస్ట్ రోడ్డు, ఓఎంఆర్ రోడ్డు, మౌంట్‌రోడ్డు, పూందమల్లి హైరోడ్డు సహా నగరవ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరిపి అపరాధ సొమ్మును వసూలు చేశారు. -
హెల్మెట్ పెట్టుకోలేదు; 4 గంటలు కరెంట్ బంద్!
లక్నో : తనకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులపై ప్రతీకార చర్యగా సదరు ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషనుకు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు ఓ అధికారి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు... శ్రీనివాస్ అనే వ్యక్తి దక్షిణాంచల్ విద్యుత్ విట్రన్ నిగమ్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన వ్యక్తిగత పనికోసం బైక్ మీద బయల్దేరారు. అయితే శ్రీనివాస్ హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆయన బండిని ఆపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రూ. 500 చలానా విధించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యుత్ బకాయిలు చెల్లించని పోలీసులు ఇలా జరిమానా విధించడం సరికాదంటూ శ్రీనివాస్ ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఫిరోజాబాద్ పరిధిలోని పోలీసు స్టేషను.. విద్యుత్ సంస్థకు రూ. 6 లక్షలు బకాయి పడిందని.. అలాంటిది తానెందుకు రూ. 500 జరిమానా చెల్లించాలని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన నుంచి పోలీసులు చలానా వసూలు చేశారు. ఈ నేపథ్యంలో తన కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్ పై అధికారులను సంప్రదించకుండానే పోలీసు స్టేషనుకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సుమారు నాలుగు గంటల పాటు కరెంట్ పోవడంతో పోలీసులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వీరు మారరంతే..!
గత జనవరిలో అత్తాపూర్‌లో వేగంగా వెళుతున్న బైక్ ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. అయితే ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించడంతో చిన్న చిన్న గాయాలతో క్షేమంగాబయటపడ్డాడు’మే నెలలో బాలానగర్‌లో వేగంగా వెళుతున్న బైక్ ముందున్న కారును ఢీకొట్టడంతో ప్రశాంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తలకుతీవ్ర గాయం కావడంతో ఘటనాస్థలిలోనే దుర్మరణం చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే అతడి ప్రాణాలు కూడా దక్కేవి’ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సగానికి పైగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న కేసులే. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే నెలవరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 10,48,934 ఈ–చలాన్లు జారీ చేయగా, అందులో 5,72,237(54.55 శాతం) కేసులు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపినవే కావడం గమనార్హం. మొత్తం ఈ–చలాన్ల ద్వారా రూ.38,18,96,205 జరిమానా విధించగా, అందులో దాదాపు రూ.8 కోట్లు హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు విధించినదే. ప్రాణాలు పోతున్నా మారరు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మే నెలవరకు జరిగిన 1090 రోడ్డు ప్రమాదాల్లో 600 వరకు ఘటనలకు (55 శాతం) ద్విచక్ర వాహనదారులే కారణం. ఆయా ప్రమాదాల్లో 281 మంది మృతి చెందగా, వారిలో 182 మంది బైక్ రైడర్లే(64.7 శాతం) ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలోనూ పలువురు హెల్మెట్ ధరించనందునే తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హెల్మెట్ ధరించిన వారు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. ‘హెల్మెట్ లేకుండా బైక్ నడిపినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగితే తలకు గాయాలై కొద్ది సెకన్లపాటు స్పృహ కోల్పోవడం, తలనొప్పి, అయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, దృష్టి మసకబారడం, చెవిలో హోరున శబ్దం, రుచి తెలియకపోవడం, బాగా ఆలసటగా ఉన్నట్లు అనిపించడం, ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణలో మార్పులు కనిపిస్తాయ’ని వైద్యులు పేర్కొన్నారు. తీవ్ర గాయా లైతే తలనొప్పి, వాంతులు, వికారం, ఫిట్స్, మాట ముద్దగా రావడం, ఏదైనా అయోమయం లో బలహీనత లేదా తిమ్మిర్లు, ఆలోచనలకు చేతు లు సమన్వయం లోపించడం, తీవ్రమైన అయో మయం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఇక హెల్మెట్ పెట్టుకున్నా కింద బెల్ట్ సక్రమంగా పెట్టుకోకుంటే ప్రమాద సమయాల్లో ఊడిపోయితలకు గాయాలవుతున్నాయి. పూర్తి స్థాయిలో సక్రమంగా ధరించినప్పుడే ప్రమాదవేళరక్షణ లభిస్తుందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. సెల్..హెల్.. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్‌కాల్ వస్తే బండి నడుపుతూనే మాట్లాడటానికి వాహనచోదకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ఐదు నెలల్లో 4341 మంది ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ఐదు నెలల్లో ఏకంగా 24,396 కేసులు నమోదయ్యాయి. దీనికితోడు మైనర్ డ్రైవింగ్ కేసులూ భారీగా పెరుగుతున్నాయి. మాదాపూర్ జోన్లో 784, బాలానగర్ జోన్లో 186, శంషాబాద్ జోన్లో 185 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడిపిన 6,955 మందికి ట్రాఫిక్ పోలీసులు ఈ–చలాన్లు జారీ చేశారు. తప్పించుకోలేరు... ట్రాఫిక్ జంక్షన్లలోని సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ పోలీసులు చేతిలోని కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు అసంపూర్తి, అసమగ్ర నంబర్ ప్లేట్లతో రోడ్లపై చక్కర్లు కొడుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్పాట్ ఈ–చలాన్లు జారీ చేసి వారి భరతం పడుతున్నారు. ఇలా ఈ ఐదు నెల్లో ఏకంగా 16,239 నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలకు జరిమానా విధించారు. ఐటీ కారిడార్‌తో పాటు బాలానగర్, శంషాబాద్ జోన్లలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన 28,810 ఆటోవాలాలకు ఈ–చలాన్లు జారీ చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకున్న 1,310 వాహనాలకు కూడా జరిమానా విధించామన్నారు. డ్రంకన్ డ్రైవర్లకు జైలే... మద్యం తాగి వాహనం నడుపుతున్న డ్రంకన్ డ్రైవర్లను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఐదు నెలల్లో 8987 డ్రంకన్ డ్రైవర్లపై కేసులు నమోదుచేశారు. వీరిలో 2,418 మందికి ఒకటి నుంచి పది రోజుల పాటుజైలు శిక్ష పడింది. జరిమానా విధిస్తున్నా మారడం లేదు... వాహనచోదకులు ఎక్కువగా హెల్మెట్ లేకుండా బైక్ నడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. జరిమానాలు విధించినా తీరు మార్చుకోవడం లేదు. ఫలితంగా రోడ్డుప్ర మాదాలు జరిగితే తలకు తీవ్రగాయాలై మృత్యువాత పడుతున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉంటుండడంతో కళాశాలల్లో రోడ్డు ప్రమాదాలకు దారి తీసే పరిస్థితులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.–విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
నో హెల్మెట్, నో పెట్రోలు : ఈ రోజు నుంచే
సాక్షి, న్యూఢిల్లీ: ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి వచ్చాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో పరిధిలోని బైక్ రైడర్స్ హెల్మెట్ లేకుండా పెట్రోల్ స్టేషన్‌కు వెళితే అక్కడి సిబ్బంది పెట్రోల్ పోయరు. ఈ నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్డు భద్రతను ప్రోత్సహించేందుకు జిల్లా మేజిస్ట్రేట్ బ్రిజేష్ నారాయణ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు పెట్రోల్ పంపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతానికి ఈ అదేశాలను రెండు నగరాల్లో అమలు చేయాలని, అనంతరం ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని యజమానులను ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే, డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయడంతోపాటు, చట్టపరమైన చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని కలెక్టర్ సింగ్ తెలిపారు. అలాగే పెట్రోల్ బంకుల్లోని సిబ్బందితో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే రైడర్లను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 151 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. కాగా మోటారు వాహనాల చట్టం 129 సెక్షన్ ప్రకారం, హెల్మెట్ లేని ప్రయాణం నేరం. దీని ఉల్లఘించినవారికి 6 నెలలు జైలు శిక్ష విధించవచ్చు. -
హెల్మెట్‌పెట్టు.. నీళ్లు పట్టు..
ఆదిలాబాద్‌కల్చరల్ : అది జిల్లా కేంద్రంలోని పోలీసు ఆర్మ్డ్ రిజర్వు(ఏఆర్)హెడ్‌క్వార్టర్. జిల్లా పోలీసు సిబ్బందికి తాగునీరు అందించే వాటర్‌ప్లాంట్ ఇక్కడే ఉంది. ఇందులో కొత్తేమి ఉందనుకుంటే మీరు మినరల్వాటర్లో కాలేసినట్లే.. పోలీసు సిబ్బందికి ప్యూరిపైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఈ వాటర్ ప్లాంట్‌కు వెళ్లి మంచినీరు తెచ్చుకోవాలంటే హెల్మెట్ తప్పక ధరించి వెళ్లాల్సిందే. హెల్మెట్ లేకపోతే అక్కడ నీరు సరఫరా చేయరు. మంచి నీటికి హెల్మెట్‌కు ఏమిటీ సంబంధం అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ప్రతీరోజు ఎంతో మంది వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు గురవుతుండటం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతుండటం జరుగుతోంది. ప్రమాదాలు జరిగిన చాలా సందర్భాల్లో ద్విచక్రవాహనం నడుపుతున్నప్పుడు శిరస్త్రాణం ధరించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకపోవడంతోనే చాలామంది మృత్యువాత పడుతున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడేమోనని అందరూ అనుకోవడం మనం తరచుగా వింటుంటాం. రోడ్డు భద్రత నిబంధనల ప్రకారం రోడ్డుపై బైకు నడుపుతున్న ప్రతీవ్యక్తి హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఇటీవల దేవాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసు హెడ్‌కానిస్టేబుల్ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు దీన్ని ముందుగా తమ శాఖలోనే అమలు చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఈ నిబంధనలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాలను పక్కాగా అమలు చేసేందుకు సంబంధిత పోలీసు అధికారులు హెడ్‌క్వార్టర్ ప్రధాన ద్వారం వద్ద ప్లెక్లీ సైతం ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకుండా లోనికి వెళ్లకుండా అడ్డుకునేలా అక్కడ గార్డులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం విశేషం. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసుశాఖలో ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ క్యాంపు కార్యాలయానికి, పోలీసుహెడ్క్వార్టర్స్కు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. హెడ్‌క్వార్టర్‌లోని వాటర్‌ప్లాంటు నుంచి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ తెచ్చుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకొని వెళ్లాలనే నిబంధన ఇటీవల విధించారు. హెల్మెట్లేనివారికి లోనికి అనుమతి నిరాకరించడమే కాకుండా వారికి నీటిక్యాన్ పట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు. ద్విచక్రవాహనం బయట ఆపి క్యాన్‌తో వెళ్తున్న వారికి సైతం నీరు సరఫరా చేయడం లేదు. దీంతో తప్పనిసరిగా పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించి మంచినీటిని ప్లాంటు నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ నిబంధన పోలీసులతోపాటు అక్కడికి వెళ్లే సామాన్యులకు సైతం వర్తించేలా చేయడంతో మంచినీటి కోసం పోలీసు హెడ్‌క్వార్టర్ వెళ్లేవారంతా తప్పకుండా హెల్మెట్ ధరిస్తున్నారు. ఉదయం పూటా రోడ్డుపై వెళ్లే ఎంతోమంది శిరస్త్రాణం ధరించి మంచినీటీ క్యాన్లు పట్టుకెళ్తున్న పోలీసు సిబ్బందిని చూసి ఈ విషయం తెలియనివారు ఆశ్చర్యపోతున్నారు. కాగా ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు హెల్మెట్‌ను వాడే నిబంధన విధించడం ఎంతో మంచి నిర్ణయమని పలువురు ప్రశంసిస్తున్నారు. -
ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్
సాక్షి, హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వాహనదారుడిని నిలువరించేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్ తగిలింది. ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్ నడపటాన్ని గమనించారు. యువకుడిని ఆపడానికి ప్రయత్నించగా, పోలీసులను చూడగానే ఒక్కసారిగా యువకుడికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి సపర్యలు చేయాల్సి వచ్చింది. -
పల్లెల్లో.. హెల్మెట్లు
శంకరపట్నం: హెల్మెట్ కొనాలంటే పట్టణాలకు పరుగులు తీయాల్సిన పని లేదు. జాతీయ రహదారి వెళ్లే పల్లెల్లోనూ లభ్యమవుతున్నాయి.శంకరపట్నం మండలంలో హెల్మెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ చట్టం అమలుకావడంతో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో మాదిరిగా వాహనాలు తనిఖీచేసి కేసులు పెట్టేవారు. ఇప్పుడు ఈ పెట్టి కేసులు పెడుతుండడంతో ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించకుంటే ఫోటోతీసి అప్లోడ్ చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి సీటుబెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరల్లో నమోదవుతున్న పుటేజీల ఆధారంగా కేసులు నమోదుచేస్తున్నారు. ఈ చలాన్ విధానం అమల్లోకి రావడంతో పోలీసులు జాతీయరహాదారిపై రోజుకో ప్రాంతంలో నిఘా పెంచుతున్నారు. మండలంలోని కేశవపట్నంలోనే మూడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపక్కన విక్రయిస్తున్నారు. ఒక్కో హెల్మెట్ రూ.300నుంచి రూ.1000 వరకు ధరల్లో లభ్యమవుతున్నాయి. హెల్మెట్ ధరించండి కరీంనగర్– వరంగల్ జాతీయ రహాదారి ని త్యం రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకల తో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయకుంటే ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే సురక్షతంగా గమ్యానికి చేరుకుంటారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ఈ పెట్టి కేసులు నమోదు చేస్తున్నాం. – సత్యనారాయణ, ఎస్సై -
అతిక్రమణకు తప్పదు మూల్యం
విజయవాడ, గుడ్లవల్లేరు(గుడివాడ): రకరకాల పనులపై ఇంటినుంచి తమతమ వాహనాల్లో ప్రజలు బయటకు వెళుతుంటారు. అలా వెళ్లిన వారిలో చాలామంది ప్రమాదాలు జరిగి మృత్యువాతకు గురవుతున్నారు. మరికొందరు దివ్యాంగులుగా మారుతున్నారు. బాధిత కుటుంబాల్లో చీకట్లు నెలకొంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను ఫిట్‌గా ఉంచుకుంటే ప్రయాణాలు సుఖవంతంగా జరుగుతాయి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రయాణాల్లో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు రవాణా శాఖాధికారుల నుంచి వస్తున్నట్లే రవాణాలో తమకు రక్షణ ఉండటం లేదని ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైకిస్టులు, వాహన చోదకులు అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్కూల్ పిల్లలను ఎక్కించే బస్సులు కండీషన్లో లేవనే ఆరోపణలు తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణాల్లో కొన్ని నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను అదుపు చేసుకోవచ్చు. స్కూల్ బస్సుకు నిబంధనలు పాటించాలి ఏపీ మోటారు వాహనాల నియమావళి ప్రకారం 1989లో 185 (జి)ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోరాదు. 60 ఏళ్ల వయసు దాటినవారు డ్రైవింగ్ చేయకూడదు. పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటారు వాహన చట్టం సెక్షన్ 86 ప్రకారం జరిమానా, పర్మిట్‌పై చర్య కూడా ఉంటుంది. డ్రైవింగ్‌లో సెల్ మాట్లాడితే ప్రమాదమే సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే మోటారు వాహన చట్టం 184 ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. లేదా సీఎంవీ రూల్ 21 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేస్తారు. సెల్లో మాట్లాడుతూ ఏ వాహనాన్ని డ్రైవ్ చేసినా ఇవే చర్యలుంటాయి. హెల్మెట్‌తో ప్రాణానికి రక్ష వాహన చోదకుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రమాదాల సమయంలో ప్రాణానికి హాని తక్కువగా ఉంటుంది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే సెక్షన్ 177 ప్రకారం జరిమానా రూ.వంద విధిస్తారు. అతి వేగం ప్రమాదం అతివేగం అత్యంత ప్రమాదకరం. అతివేగం వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎందరో అభాగ్యులు ప్రమాదాల బారిన పడతారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 112, 183(1)ప్రకారం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. మద్యం సేవించి నడిపితే మృత్యు కౌగిలే.. మద్యం సేవించి వాహనం నడిపితే మృత్యువాత పడాల్సిందే. మద్యం సేవించిన సమయంలో చిన్న మెదడు పని చేయకపోవడం వల్ల ఎదుట వచ్చే వాహనాలను గుర్తించే శక్తి తగ్గుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మద్యం సేవించి వాహనం నడిపితే వాహన చట్టం సెక్షన్ 185 ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష విధిస్తారు. సిగ్నల్ అధిగమిస్తే చర్యలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సిగ్నల్ జంపింగ్ చేస్తే నేరం. ఈ దుందుడుకు చర్య వల్ల సిగ్నల్ ఇచ్చిన వైపు నుంచి వచ్చే వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతారు. ఇలా చేస్తే వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం ఆరు నెలల వరకు జైలుశిక్ష లేదా రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. వాహనం నడపాలంటే ఇవి తప్పనిసరి వాహనం నడుపుటకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. రిజిస్ట్రేషన్ లేకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్లు 39, 192 ప్రకారం జరిమానా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే మోటారు సెక్షన్ 3, 4, 180, 181 ప్రకారం జరిమానా లేదా జైలుశిక్ష తప్పదు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహన చోదకునికి సెక్షన్ 190 (2) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే సెక్షన్ 196 (ఎ) ప్రకారం మూడు నెలల జైలశిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా ఉంటుంది. సీట్బెల్ట్తో ప్రయాణం సురక్షితం కారులో సీట్‌బెల్ట్ పెట్టుకుని ప్రయాణిస్తే గమ్యస్థానానికి సురక్షితంగా చేరవచ్చు. డ్రైవింగ్ సీట్లో ఉన్నవారే కాకుండా ఫ్రంట్ సీట్లో కూర్చున్నవారు కూడా బెల్ట్ పెట్టుకుంటే మంచిది. సీఎంవీ రూల్ 138 (3) ప్రకారం విధిగా సీట్‌బెల్ట్ ధరించాల్సిందే. సీట్‌బెల్ట్ ధరించనిచో మోటారు వాహన చట్టం సెక్షన్ 177ప్రకారం రూ.వెయ్యి జరిమానా తప్పదు. -
ట్రాఫిక్ పాఠాలు చెప్పిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతహాగా ఐపీఎస్ అధికారి. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొరడా ఝుళిపిస్తున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ సర్కారుకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు చాలా కాలం తర్వాత తనలోని ఐపీఎస్‌ను బయటకు తీశారు కిరణ్ బేడీ. సోమవారం నుంచి పుదుచ్చేరిలో హెల్మెట్ తప్పనిసరి చేశారు. అలాగే, సీట్ బెల్ట్ ధరించాల్సిందేనన్న హుకుం జారీ అయింది. ఉదయం నుంచే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అన్నది అమల్లోకి రావడంతో కిరణ్ ఐపీఎస్ అవతారం ఎత్తక తప్పలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా, అవగాహన కల్పించే విధంగా పుదుచ్చేరిలోని పలు మార్గాల్లో ఆమె తిష్ట వేశారు. పోలీసులతో కలిసి వాహనదారులను బెంబేలెత్తించారు. హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్లను పిలిచి మరీ క్లాస్ పీకారు. పరిమితిని మించి ఓవర్ లోడింగ్‌తో సాగే వారి భరతం పట్టారు. ఓ మోటార్ సైకిల్ మీద ఇద్దరు మహిళల్ని ఎక్కించుకుని ఓ యువకుడు రాగా, అతిడికి తీవ్రంగానే క్లాస్ పీకారు. వెనుక ఉన్న మహిళల్లో ఓ యువతిని కిందకు దించేశారు. బస్సులో వెళ్లమని సలహా ఇచ్చారు. ఇక పిల్లల్ని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్లకు అయితే, కిరణ్ క్లాస్ ముచ్చెమటలు పట్టించక తప్పలేదు. సీట్ బెల్ట్ ధరించకుండా కార్లు నడిపిన వాళ్లను వదలి పెట్టలేదు. మంగళవారం నుంచి హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని హెచ్చరించి పంపించారు. -
బైక్‌లకే బాద్ షా
‘ఆర్క్’ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ ట్రూమన్ ఇదేచెబుతున్నారు.. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లోని హైఫై బైక్‌లకు ఇది ఏమాత్రం తీసిపోదంటున్నారు.. వాళ్లలా బలం రాకపోవచ్చు గానీ.. దీన్ని నడుపుతుంటే.. మనం కూడా సూపర్ హీరోల్లా ఫీలైపోవచ్చని చెబుతున్నారు..మార్క్ చెబుతున్నదాన్ని బట్టి ఇది ప్రపంచంలోనే అత్యాధునికమైన బైక్.. బ్రిటన్‌లోని కోవెంట్రీకి చెందిన ‘ఆర్క్’ కంపెనీలోనిఅత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం దీన్ని తయారుచేసింది. ఈ బైక్.. దీనితోపాటు వచ్చే హెల్మెట్, జాకెట్ అన్నీ ప్రత్యేకమైనవేనట. ఇంతకీ ఏంటివీటి స్పెషాలిటీ.. ఓ లుక్కేద్దాం హెల్మెట్ ఐరన్ మ్యాన్ సినిమా చూశారా..అందులో హీరో బుర్రకు వేసుకునే హెల్మెట్ తెరపై రూట్ మ్యాప్‌లు ఇలా అన్ని వివరాలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇందులో కూడా దాదాపు అలాగే ఉంటుంది. హెల్మెట్‌లో ఉండే బుల్లితెరపై బైక్ వెళ్తున్న వేగం.. వెళ్లాల్సిన ప్రదేశం తాలూకు మ్యాప్ ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ప్రదర్శితమవుతూ ఉంటుంది. బుర్రతిప్పాల్సిన పని లేకుండా.. వెనకేం జరుగుతోందన్న విషయాన్ని ఇందులో ఉండే కెమెరా తెరపై డిస్ప్లే చేస్తుంది. జాకెట్ హ్యూమన్ మెషీన్ ఇంటర్ఫేస్(హెచ్ఎంఐ)టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. మనం అతి వేగంగాప్రయాణించినా.. డ్రైవింగ్‌లో తేడా ఉన్నా.. బ్రేక్‌లు లేదా బైక్‌లో ఏదైనా లోపాలు ఉన్నట్లు అనిపించినా.. ప్రమాద సంకేతాలుకనిపించినా.. ఇది వెంటనే వైబ్రేట్ అయి అప్రమత్తం చేస్తుంది.అంతేకాదు.. వెళ్తూవెళ్తూ మీకు నచ్చిన పాటలు వినే ఏర్పాటు కూడా ఇందులో ఉంది. బైక్ ఇది ఎలక్ట్రిక్ బైక్.. పర్యావరణ అనుకూలమైనది. తక్కువ బరువుఉండటానికిగానూ చాలా భాగాలను కార్బన్ ఫైబర్‌తో తయారుచేశారు. ఎలక్ట్రిక్ పవర్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. అత్యధిక వేగం గంటకు 193 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే.. 320 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఫుల్ చార్జింగ్కు 45 నిమిషాలు పడుతుంది. దీన్ని కొన్నవాళ్లకు వాళ్ల ఇంటి వద్దే ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్‌ను కంపెనీ వాళ్లు ఏర్పాటు చేస్తారు. అయితే, దీన్ని డబ్బున్న కామన్ మ్యాన్లే కొనగలరు.. బైక్ ధర రూ.80 లక్షలు! – సాక్షి సెంట్రల్ డెస్క్ -
హెల్మెట్ ధరించనిది ఆ.. ఒక్కరోజే
చిత్తూరు, వరదయ్యపాళెం: సైకిల్ ప్రయాణంలోనూ హెల్మెట్ ధరించి ఆదర్శంగా నిలిచిన ఆ వ్యక్తి విధి ఆడిన వింత నాటకంలో మృత్యువాత పడ్డాడు. వరదయ్యపాళెం ఉబ్బలమడుగు రోడ్డు మార్గంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందారు. పోలీసులకు అందిన సమాచారం మేర కు వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చినాయుడుకండ్రిగ మండలానికి చెందిన చిన్న గుర్రప్ప (59) సమీపంలోని అవంతి తోళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే నెలసరి వేతనం కోసం మంగళవా రం అవంతి పరిశ్రమకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా కారు ఢీకొనడంతో చిన్న గుర్రప్ప తలకు బలమైన గాయం తగిలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను శ్రీసిటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఎస్ఐ హరిప్రసాద్ í ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నామన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. సైకిల్ ప్రయాణంలోనూ హెల్మెట్ ధరించే గుర్రప్ప ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ వాడకపోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. -
వారికి హెల్మెట్ నుంచి మినహాయింపు!
సాక్షి, చండీగఢ్ : సిక్కు మహిళలు వాహనాలు నడిపేటపుడు హెల్మెట్ల వాడకం నుంచి చండీగఢ్‌లో మినహాయింపు ఇవ్వనున్నారు. సిక్కు మతానికి చెందిన పలువురు పెద్దలు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి టూవీలర్ నడిపే సిక్కు మహిళలకు హెల్మెట్ల వాడకంపై మినహాయింపునివ్వాలని కోరారు. మరోవైపు అకాలీదళ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ బాదల్ కూడా రాజ్‌నాథ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సిక్కు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు .. ఇప్పటికే ఢిల్లీలో సిక్కు మహిళలకు హెల్మెట్ వాడకంపై మినహాయింపు ఉండటంతో అక్కడి రవాణా శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌నే పాటించాలని చండీగఢ్ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసినట్లు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
తస్మాత్ జాగ్రత్త
మేం కారులో, బైక్‌లో స్పీడుగా వెళుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. హెల్మెట్ లేకున్నా ఎవరూ అడగడం లేదు. మందు తాగి వాహనాన్ని నడుపుతున్నా ఏ అధికారీ తనిఖీ చేయడం లేదని అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే. ఇటీవల జాతీయ రహదారిపై రవాణా అధికారులు తనిఖీల స్పీడును పెంచారు. రోజుకో ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఇళ్లకు ఈ–చలానాలు పంపిస్తున్నారు. నెల్లూరు(టౌన్): వాహనచోదకులు నిబంధనలు అతిక్రమిస్తే వాళ్లకు తెలియకుండానే తనిఖీలకు సంబంధించిన ఈ–చలానాలను రవాణాశాఖ అధికారులు ఆయా వాహనదారుల ఇళ్లకు పంపిస్తున్నారు. ఇవేంటని పరిశీలించిన వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. రహదారి మధ్యలో ఎవరూ ఆపి తనిఖీలు చేయలేదు గదా.. ఈ చలానాలు ఏంటని రవాణా కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. తీరా మీరు పలాన సమయంలో నిబంధనలు అతిక్రమించారని, అందుకు ఫైన్ చెల్లించాలనిఅధికారులు చెబుతుండటంతో అవాక్కువుతున్నారు. గతంలో పెద్ద నగరాలకే పరిమితమైన ఈ–చలానా పద్ధతి జిల్లాలో కూడా అవలంబిస్తున్నారు. జిల్లాలో 176 కిలో మీటర్ల జాతీయ రహదారి జిల్లాలో 176 కిలో మీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు రహదారి నిబంధనలు అతిక్రిమించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అతి వేగం, మద్యం తాగి వాహనం నడపడం, సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బైక్ నడపటం, ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం తదితర కారణాల వల్లే అధిక సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తనిఖీలు ముమ్మరం జాతీయ, రాష్ట్ర రహదారులపై రవాణాశాఖ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. రోజూ కావలి నుంచి తడ వరకు ఉన్న జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు రెండు స్పీడు లేజర్గన్లను కొనుగోలు చేశారు. రవాణాశాఖకు ఒకటి, పోలీసు శాఖకు మరొక స్పీడు లేజర్ గన్ను కేటాయించారు. అదేవిధంగా 30 బ్రీత్ ఎన్లైజర్లను కొనుగోలు చేశారు. 24 పోలీసు శాఖకు కేటాయించగా, ఆరు బ్రీత్ ఎన్లైజర్లును రవాణాశాఖకు కేటాయించారు. రహదారిపై వాహన స్పీడును లేజర్ గన్‌తో పరిశీలిస్తున్నారు. తనిఖీలు నిర్వహించే ప్రాంతాన్ని బట్టి వేగాన్ని నిర్ణయిస్తారు. స్పీడు లేజర్గన్లో వాహన నంబరు నమోదవుతుంది. ఆ నంబరు ఆధారంగా వాహనదారుడు వివరాలు తెలస్తాయి. నిర్దేశించిన వేగం కంటే వాహనం ఎక్కువ వేగం వెళుతుందని స్పీడు లేజర్గన్లో నమోదవుతుంది. మద్యం సేవించి వాహనాన్ని నడిపితే కోర్టుకు ప్రాసిక్యూట్ పెడుతున్నారు. కోర్టు కొన్ని రోజుల పాటు జైలు శిక్ష విధించిన పరిస్థితి ఉంది. చలానా ఇంటికే.. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఇళ్లకు రవాణా అధికారులు ఈ–చలనాలు పంపిస్తున్నారు. నిర్దేశిత వేగం కంటే అధిక వేగంగా వెళితే రూ.1,400లు ఫైన్ విధిస్తున్నారు. ఉదాహరణకు జాతీయ రహదారిపై అక్షర స్కూల్ సమీపంలో వాహన వేగం 90 కి.మీ. నిర్దేశించారు. అంతకన్న వేగంగా వెళితే ఫైన్ విధిస్తారు. రద్దీని పరిగణనలోకి తీసుకుని వేగాన్ని నిర్ణయిస్తారు. అదేవిధంగా హెల్మెట్ లేక పోయినా, సీటు బెల్టు ధరించకున్నా ఫైన్‌ను ఈ–చలానా రూపంలో పంపిస్తున్నారు. ఈ–చలానా రూపంలో వచ్చిన ఫైన్‌ను వారం రోజుల్లో రవాణా కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైన్ చెల్లించకుండా పదే పదే తప్పు చేసినట్లయితే వాహనాన్ని సీజ్ చేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన కేసులు వివరాలను ఒక సారి పరిశీలిస్తే... ఓవర్ స్పీడుకు సంబంధించి 814 కేసులు, హెల్మ్‌ట్ లేకుండా బైక్ నడపటం 560, మద్యం తాగి వాహనాన్ని డ్రైవింగ్ చేసినందుకు 648 కేసుల వరకు ఉన్నాయి. వీరందరికీ అతి వేగం, హెల్మెట్ లేకుండా బైకు నడపటం వంటి వాటికి ఈ–చలనా రూపంలో ఫైన్ విధించారు. మద్యం తాగి వాహనాన్ని నడిపిన కేసులో వాహనదారులను కోర్టుకు ప్రాసిక్యూట్ చేశారు. నిబంధనలు పాటించాల్సిందే ప్రతి వాహనదారుడూ రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తునే ఉన్నాం. ఇప్పుడు వాహనాన్ని ఆపి తనిఖీ చేయకుండా స్పీడు లేజర్ గన్, బ్రీత్ ఎన్లైజర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు అతిక్రమించినట్లయితే వారి ఇళ్లకు ఈ–చలానాలను పంపిస్తున్నాం. –ఎన్.శివరాంప్రసాద్, ఉప రవాణాశాఖ కమిషనర్ -
సీటు బెల్టు..చిన్నచూపు!
కార్లు.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు సీటు బెల్టు పెట్టుకోవడం.. హెల్మెట్ వాడడం తప్పనిసరి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..ఇవి పోలీసు..రవాణాశాఖాధికారులు తరచూ చెబుతున్న మాటలు.. చేస్తున్న హెచ్చరికలు. కానీ ఇవేవీ వాహనదారుల చెవులకు ఎక్కడం లేదు. సీటు బెల్టు.. హెల్మెట్ అన్నా చాలామంది చిన్నచూపు చూస్తున్నారు. వీటిని పెట్టుకోవడమంటే ఏదోలా భావిస్తున్నారు.– లాల్‌జాన్ బాషా.. టీడీపీ సీనియర్ నాయకుడు. నందమూరి హరికృష్ణ.. సినీ నటుడు, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు. వీరిద్దరూ వారు ప్రయాణిస్తున్న కార్లు బోల్తాపడడంతోనే చనిపోయారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే వీరు మృత్యువు ఒడికి చేరారు. అదే సీటు బెల్టు వాడి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేదికాదనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరే కాదు చాలామంది పరిస్థితి ఇదే. సీటు బెల్టు పెట్టుకోకుండానే వాహనాలను డ్రైవ్ చేస్తుంటారు. అనుకోని రీతి లో ప్రమాదాలబారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. శ్రీకాకుళం సిటీ: రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు వంటి భారీ వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ప్రమాదాలు బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించకపోవడం, కార్లు నడిపే సమయంలో సీటుబెల్ట్ పెట్టుకోకపోవడం వలన జరిగే ప్రమాదాలు పెను విషాదానికి కారణమవుతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం, కార్లు నడిపేవారు తమ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే 10 శాతం వరకూ ప్రమాదాల బారిన పడుతూ మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబు తున్నాయి. ఇందుకు ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రమాదాల బారిన పడడం శోచనీ యం. దీనికి తోడు మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, జాతీయ రహదారులపై పరిమితికి మిం చిన వేగంతో ప్రయాణించడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు తోడవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులపై తీసుకోవా ల్సిన చర్యల గురించి క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల యంత్రాంగం ప్రజలకు అప్రమత్తం, అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ అవి తూతూ మంత్రంగానే సాగుతుండడంతో ప్రమాదాల శాతం ఏమాత్రం తగ్గడం లేదు సరికదా మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రమాదాల బారిన పడుతూ క్షతగాత్రులుగా మారుతుండడం, పదుల సంఖ్యలో మృత్యువాత పడడం కూడా ఒకింత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో పోలీసులు, రవాణాశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు వలన కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఇంటి వద్దనుంచి బయలుదేరిన వాహనదారులు సక్రమంగా తిరిగి వచ్చే వరకూ వారి కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాకుండా గుండెలమీద చేయి వేసుకునేలా ఉండాలంటే వాహనదారుడు వేగనియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించల్సిందేనని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి: ప్రతి వాహనదారుడు వారి వాహనం నడిపే సమయంలో ఒక్కక్షణం ఆలోచించాలి. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఒక కుటుంబం తనపై ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెక్షన్ 177 ప్రకారం ప్రతి వాహనదారుడు నిబంధనలను కచ్చితంగా పాటించినట్లైతే ప్రమాదాల శాతం చాలా వరకూ అరికట్టవచ్చు. ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించకపోతే రూ.100, కార్డు నడిపే సమయంలో సీటు బెల్ట్ ధరించకపోతే రూ.100 అపరాధ రుసుంగా అధికారులు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం వీటి రుసుం రూ. 1000 వరకూ పెంచారు. ఇవి ఇంకా అమలు కావాల్సి ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి వాహన దారుడు మితిమీరిన వేగంతో కాకుండా పరిమితికి లోబడి ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన కూడా ఎంతో ప్రమాదం ఉంది. తనకు జరిగే ప్రమాదంతోపాటు ఎదుటివ్యక్తులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ప్రయాణం చేస్తే వాహనదారునికి ఇన్సూరెన్స్ రాయితీలు కూడా వర్తించే అవకాశాలు ఉండవు. పలుమార్లు చలానాల రూపంలో వాహనదారుడు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైతే వారి డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవాల్సి వస్తుంది. వాహనాలను కూడా కొన్ని సందర్భాల్లో సీజ్ చేసే అవకాశం ఉంది. -
సీటు బెల్టు ప్రాణదాతే!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనానికి హెల్మెట్.. తేలికపాటి వాహనానికి సీటుబెల్టు.. నిబంధనల ప్రకారం కచ్చితం. ఎయిర్‌బ్యాగ్స్‌తో సంబంధం లేకుండా సీటుబెల్టు పెట్టుకోవాల్సిందే. ఇది అనేక సందర్భాల్లో ప్రాణదాతగా మారింది. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్టు వాడని కారణంగానే మృత్యు వాతపడుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. ప్రాణాలు కాపాడిన సీటుబెల్టు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూరు వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్టు పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర్రావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు కన్నుమూశారు. సీటుబెల్టు పెట్టుకోవడంతో వెంకటేశ్వర్రావు ప్రాణాలతో బయటపడ్డారు. సీటుబెల్టు, ఎయిర్ బ్యాగ్స్‌కు లింక్.. అన్ని హైఎండ్ కార్లలో సీటు బెల్టుకు, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. బెల్టు పెట్టుకోకుంటే ఎయిర్‌బ్యాగ్స్ యాక్టివ్ కావు. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. డ్రైవింగ్సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీటుబెల్టు పెట్టుకుంటేనే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుంది. వాహనం బయల్దేరిన తర్వాత డ్రైవర్, పక్క వ్యక్తి సీటుబెల్టు పెట్టుకోకపోతే గుర్తు చేసేందుకు బీప్ శబ్దం కూడా వచ్చేలా తాజా వాహనాలకు ఏర్పాట్లు చేశారు. -
హెల్మెట్ ఇద్దరూ ధరించాల్సిందే..!
ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక సీట్లో కూర్చున్న వాళ్లు ఇక, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే. లేని పక్షంలో జరిమానాల మోత మోగుద్ది. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంతో డీజీపీ టీకే రాజేంద్రన్ శుక్రవారం ఇందుకు తగ్గ ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నై మినహా తక్కిన జిల్లాల్లో ఇది అమల్లోకి వచ్చింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అన్నది అమల్లో ఉన్న విషయం తెలిసిందే. చెన్నై వంటి నగరాల్లో కొన్ని ప్రాంతాల్ని ఎంపిక చేసిన హెల్మెట్ జోన్లుగా ప్రకటించారు. ఈ మార్గాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. లేని పక్షంలో ట్రాఫిక్ పోలీసులు కేసుల మోత మోగించడం ఖాయం. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే రీతిలో చేసిన తప్పుల్ని మళ్లీ మళ్లీ చేస్తే లైసెన్స్‌లు సీజ్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టీఏ చట్టం మేరకు ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్లే కాదు, వెనుక కూర్చొనే వాళ్లు సైతం హెల్మెట్ ధరించాల్సిందేనన్న నిబంధన ఉందని, దీని అమలుకు ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేకే రాజేంద్రన్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఈ పిటిషన్ విచారణ సమయంలో ప్రభుత్వానికి, పోలీసులకు చీవాట్లు తగిలించే రీతిలో హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్య ప్రశాంత్ ముందు విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్లీడర్ రాజగోపాల్ ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు. న్యాయమూర్తుల ప్రశ్నలు, ఆగ్రహానికి గురికాక తప్పలేదు. అమలు చేసే ఉద్దేశం ఉంటే చట్టాలు తీసుకు రావాలని, గాల్లోకి వదలి పెట్టేందుకు కాదంటూ తీవ్రంగానేన్యాయమూర్తులు స్పందించారు. ఇక తప్పని సరిగా ధరించాల్సిందే: హైకోర్టు అక్షింతలు, ఆగ్రహానికి తాము గురి కావాల్సి రావడంతో పోలీసు యంత్రాంగం కదిలింది. హైకోర్టులో సాగుతున్న విచారణ, ఎదురైన పరిస్థితులు, ఆర్టీఏ చట్టంలోని అంశాలను ఎత్తి చూపుతూ, ఇక, ద్విచక్ర వాహనంలో వెనుక సీట్లో ఉన్న వ్యక్తి సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారు. రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ ఆదేశాలతో అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు శుక్రవారం ఉత్వర్వులు చేరాయి. ఆగమేఘాలపై ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో హైకోర్టు చేసిన హెచ్చరికల్ని వివరిస్తూ, హెల్మెట్ తప్పనిసరి ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మీడియా సమావేశాలు, లోకల్ టీవీ చానళ్ల ద్వారా ప్రజలకు ఈ విషయం త్వరితగతిన చేరే రీతిలో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారు, వెనుక సీట్లో ఉన్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని అవగాహన విస్తృతం చేయాలని, ధరించని పక్షంలో కేసులు, జరిమానా మోతకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెన్నై మినహా అన్ని జిల్లాలో తక్షణం ఈ ఉత్తర్వులను అమలుపరచాలని ఆదేశించారు. చెన్నైలో అమలు ఎప్పుడన్న విషయం త్వరలో ప్రకటిస్తామని డీజీపీ కార్యాలయం పేర్కొంది. చెన్నై వంటి మహానగరంలో తక్షణం అమలు పరచాల్సి వచ్చిన పక్షంలో హెల్మెట్ సంక్షోభం తప్పదు. ఆగమేఘాలపై డీలర్లు, విక్రయ దారులు ధరల్ని పెంచేయడం ఖాయం. వీటన్నింటిని పరిగణించి చెన్నైలో కాస్త ఆలస్యంగా హెల్మెట్ తప్పనిసరి అమలుకు నిర్ణయించారు. ఇక, మిగిలిన ప్రాంతల్లో అమల్లోకి రావడంతో హెల్మెట్ల కోసం జనాలు దుకాణాల బాట పట్టారు. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. అవగాహన విస్తృతం : డీజీపీ ఉత్తర్వులతో కమిషనర్లు, ఎస్పీలు, ఇ తర అధికారులతో పాటు రెవెన్యూ, ఆర్టీఏ వర్గాలు ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో విస్తృతంగా ముందుకు దూసుకెళ్లారు. చెన్నై మినహా తక్కిన జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా సాగాయి. గుమ్మిడిపూండి తాలూకా కార్యాలయంలో తహశీల్దార్ మదన్ కుప్పురాజ్ నేతృత్వంలో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం జరిగింది. రోడ్డు భద్రత, హెల్మెట్ వాడకం, ట్రాఫిక్ నియామకాలపై రెవెన్యూ ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది. తహశీల్ధార్ కుప్పురాజ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో జరిగే రోడ్డు ప్రమాదాలు అతివేగం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతో జరుగుతున్నాయన్నారు.అలాగే ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రెవెన్యూ ఉద్యోగులు ఇకనుంచి తప్పక హెల్మెట్ వాడాలని, అలాగే గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. -
ఓర్నాయనో...ఆటో డ్రైవర్లకూ హెల్మెట్ అట !
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఈ వార్త వింటే ఓర్నాయనో అవునా అని ముక్కున వేలుసుకుంటారు. అయినా ఇది నిజం... దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పోలీసులు ఇలాంటి ఒక విచిత్రమైన చట్టాన్ని వెలుగులోకి తెచ్చారు. పిల్లలను స్కూల్‌కు తీసికెళ్లే ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కువమంది పిల్లలను ఎక్కించుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసారట. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే పోలీసులు అందుకు కేసు నమోదు చేయలేదట..ఆటో డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని కేసు రాశారట. -
ఇలా వెళితే ప్రమాదాలు జరగవా?
చిత్తూరు: ఓసారి ఈ చిత్రం చూడండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, హెల్మెట్ వేసుకోండి అని ట్రాఫిక్ పోలీసులు ఓ వైపు చెబుతూనే ఉన్నా జనాలకు మాత్రం ఈ తరహా పైత్యం ఇంకా తగ్గలేదు. చిత్తూరు నగరం మురకంబట్టులో ఓ బైక్ మీద ఐదుగురు వెళుతూ సాక్షి కెమెరాకు చిక్కారు. మరి ఇలా వెళితే ప్రమాదాలు జరగవా? ఏ చిన్న తేడా వచ్చినా వీరి ప్రాణాలతో పాటు ఎదురుగా వచ్చే ప్రాణాలకూ ముప్పే కదా? -ఫోటో: ఎన్.మురళి, చిత్తూరు -
'రోజ్' ఇలాగే వెళ్లండి
గుంటూరు(లక్ష్మీపురం) : ఆదివారం మధ్యాహ్నం. నగరంలోని వాహనాలు హడావుడిగా ముందుకు కదులుతున్నాయి. లక్ష్మీపురం ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తలకు హెల్మెట్, వాహనాలకు పత్రాలు ఉన్నా ఎందుకో కొద్దిగా అనుమానంతో బ్రేక్‌పై కాలు పడింది. అనుకున్నట్లుగానే ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను ఆపారు. కాగితాలు ఎక్కడ అని గట్టిగా ప్రశ్నించే గొంతులు.. ఈ సారి మౌనంగానే ఉన్నాయి. చేతిలో గులాబీతో మోముపై చిరునవ్వులు చిందించాయి. ‘వెరీ గుడ్.. ఇలాగే హెల్మెట్ ధరించాలి’ అంటూ భుజం తట్టాయి. ప్రయాణికుల్లో ఎక్కడలేని ఆనందం. ఈసారి ఎక్సలేటర్‌పై కాలు పడడంతో వాహనాలు రయ్యిమంటూ దూసుకెళ్లాయి. అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ పాపారావు ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లతో ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ధారణతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ గులాబీలు పంచారు. హెల్మెట్ లేకుంటే కలిగే అనర్థాలపై హెచ్చరించారు. కార్యక్రమంలో ఈస్ట్ ట్రాఫిక్ సబ్ డివిజన్ సీఐ పూర్ణచంద్రరరావు, ఎస్సైలు రాజకుమారి, శివరామకృష్ణయ్య, జేఆర్ మోహన్‌రావు, కే సత్యనారాయణ పాల్గొన్నారు. -
హెల్మెట్ ప్లీజ్
సాక్షి బెంగళూరు: హెల్మెట్లు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అని ద్విచక్ర వాహనదారులకు పోలీసులు, ప్రభుత్వం, కోర్టు పలు విధాలుగా అవగాహన కల్పిస్తున్నా అరణ్య రోదనే అవుతోంది. శిరస్త్రాణాలు లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే వాహనం నడపాలని 2016లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా బెంగళూరులో ద్విచక్ర వాహనదారులు యథేచ్ఛగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నా మార్పు స్వల్పమే. ఏటా లక్షలాది కేసులు ♦ రాజధానిలో హెల్మెట్ లేని వాహనదారులకు రూ.100 చొప్పున జరిమానా విదిస్తున్నారు. గతేడాది జూన్ నుంచి ఈ జూన్ వరకు ఇలా 6.95 లక్షల మందిపై ఫైన్ వేసి కేసులు రాశారు. ♦ ద్విచక్రవాహనాల్లో ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురైన వారి సంఖ్య 2017లో 73 ఉండగా.. అందులో హెల్మెల్ లేకుండా ప్రమాదాలకు గురై మరణించిన వారి సంఖ్య 66గా ఉంది. ♦ 2018లో ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య 44 ఉండగా, అందులో 40 మంది హెల్మెట్ ధరించలేదని తేలింది. కఠిన చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు నిక్కచ్చిగా అమలు చేయాలి. ప్రధాన కూడళ్లతో పాటు చిన్న చిన్న రోడ్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి జరిమానా వసూలు చేయాలి. పదేపదే హెల్మెట్ లేకుండా దొరుకుతున్న వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలి. రాజధాని నగరంలో సుమారు 40 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అందులో 60 శాతం పైగా వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. – ఎంఎన్ శ్రీహరి, సర్కారు మాజీ ట్రాఫిక్ సలహాదారు ప్రజల్లో మార్పు రావాలి ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేస్తూ ఉండటంతో ప్రయోజనం లేదు. ప్రజల్లో మార్పు వస్తే సరిపోతుంది. స్పెషల్ డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు, బహిరంగ ప్రచారాలు చేస్తున్నాం. అయినా హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలని కోరుతున్నాం. – ఆర్.హితేంద్ర, అదనపు పోలీసు కమిషనర్ -
హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయం
చంచల్‌గూడ: హెల్మెట్ ధరించని వినియోగదారులకు పెట్రోల్ విక్రయించమని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా నేరాలను అదుపు చేయడంలో జైళ్ల శాఖ కీలకపాత్రం పోషించిందని, అదే విధంగా విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించిందన్నారు. ఇటీవలకాలంలో రోడ్డు ప్రమాదాల బారినపడిన వారు అత్యధికంగా హెల్మెట్ ధరించకపోవడంతో మరణిస్తున్నట్లు దినపత్రికల ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. దీంతో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 13 పెట్రోల్ బంకులు, నూతనంగా నిర్మించబోయే మరో 8 పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించని వినియోగదారులకు విక్రయాలు జరపకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జైళ్ల శాఖ సరఫరా చేస్తున్న నాణ్యమైన పెట్రోల్ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రైవేటు పెట్రోల్ బంకుల యజమానులు కూడా ఇలాంటి నిర్ణయం తీసు కుంటే మరణాలు తగ్గే అవకాశం ఉందని తెలిపా రు. బంకుల ద్వారా లాభార్జనే కాకుండా మంచి లక్ష్యాల కోసం జైళ్ల శాఖ పనిచేస్తుందన్నారు. -
ఇక ఇద్దరికీ హెల్మెట్ ‘పట్టుకుంటే పదివేలు’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పట్టుకుంటే పదివేలు’. ఇదేదో మంచి సినిమా టైటిల్‌లాగుందే అనుకుని తీసిపారేస్తే ‘తప్పు’లో కాలేసినట్లే. మోటార్ ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారిద్దరూ ఇక శిరస్త్రాణం ధరించడం తప్పనిసరని మద్రాసు హైకోర్టు తాజాగా ఆదేశించింది. మీరినవారు పట్టుబడితే రూ.10వేలు జరిమానా వసూలు చేయాలని పోలీస్‌శాఖ భావిస్తున్నట్లు సమాచారం. మోటార్ సైకిళ్లలో వెళ్లేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ 2015లో ఆదేశించారు. ఈ ఆదేశాల్లో ట్రాఫిక్ పోలీసులు విజృంభించి హెల్మెట్ లేకుండా బైక్‌లో ప్రయాణిస్తున్న వారిని పట్టుకుని కేసులు పెట్టారు. అంతేగాక బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కోర్టులు, మొబైల్ కోర్టులు ద్విచక్రవాహన చోదకులతో కిటకిటలాడాయి. కోర్టులో జరిమానా చెల్లించనదే బైక్‌లు విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఆ తరువాత క్రమేణా పోలీసు జోరు తగ్గడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ దశలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు శివజ్ఞానం, భవాని సుబ్బరాయన్ ముందు న్యాయవాది రాజేంద్రన్ కోర్టులో గురువారం హాజరై హెల్మెట్ అంశాన్ని లేవనెత్తారు. బైక్‌లలో వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు వేసుకోవాలనే నిబంధన సక్రమంగా అమలు కావడం లేదని చెప్పారు. నిబంధనలను అమలుచేయడంలో ట్రాఫిక్ పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. దీంతో న్యాయమూర్తులు గురువారం మరలా ఆదేశాలు జారీచేశారు. మోటారు ద్విచక్రవాహనాల్లో వెళ్లే ఇద్దరూ హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించేపుడు డ్రైవర్ సహా అందరూ సీటు బెల్టు వేసుకోవాలని ఆదేశించారు. ఈ నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనలను పాటించాలని చెప్పారు. హెడ్లైట్లకు మధ్యలో నలుపు స్టిక్కర్ అతికించి ఉందా అని కూడా గమనించాలని సూచించారు. ఇందుకు సంబంధించి డీజీపీ ఈనెల 27వ తేదీన హైకోర్టులో ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. హెల్మెట్, సీటుబెల్టు ఆదేశాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరించనివారి నుంచి రూ.10వేల వరకు జరిమానా వసూలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. -
ఆకర్షిస్తున్న పులివేషం హెల్మెట్
దొడ్డబళ్లాపురం : హెల్మెట్ ధరించడమంటే నేటి యువత ఎంతో కష్టమయిన పనిగా భావిస్తుంటారు. వెంట్రుకలు రాలిపోతాయని ,హేర్‌స్టైల్ పాడవుతుందని హెల్మెట్ వేసుకోవడానికి చాలా అయిష్టత చూపుతారు. పోలీసులకు ఫైన్ కావాలంటే కడతాం కానీ, హెల్మెట్ పెట్టుకోమని చాలామమంది యువతీ.యువకులు చెబుతుంటారు. ఈ కష్టాన్ని అర్థం చేసుకున్న మంగళూరుకు చెందిన ఒక యువకుడు కొత్తగా ఆలోచించాడు. ఆ యువకుడు సెట్ చేసిన ట్రెండ్ ప్రస్తుతం మంగళూరులో హాట్‌టాఫిక్‌గా మారింది. హెల్మెట్‌పై పులివేషం పెయింటింగ్ వేయడం ద్వారా హెల్మెట్‌పై ఇష్టం కలిగేలా చేసాడు. అతడి పేరు ఆకాంక్ష్ శెట్టి. హెల్మెట్ కష్టాలు పడ్డవారిలో ఇతడూ ఒకడు. యువతకు హెల్మెట్‌పై మోజు కలిగేలా చేయాలనుకుని కొత్తగా ఆలోచించాడు.విదేశాలలో హ్యావెంజర్స్ హెల్మెట్లను ధరించి యువత బైక్‌లు నడపడం టీవీలో చూసాడు. కరావళి ప్రాంతాల్లో పులివేషం ఒక క్రేజ్..పులివేషం వేసుకుని డ్యాన్స్ చేయడమన్నా, చూడడమన్నా ఇక్కడి ప్రజలకు ఎంతో ఇష్టం.ఇదే వీక్నెస్ పట్టుకున్న ఆకాంక్ష్ మంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ ఉమేశ్ వద్ద తమ ఐడియా గురించి చెప్పి హెల్మెట్లపై పులివేష పెయింటింగ్ గీయించి మొదట తానే వేసుకుని తిరిగాడు. తరువాత హెల్మెట్లను ఖరీదుచేసి వాటిపై పెయింటింగ్ వేయించాడు. రానురాను ఈ తరహా హెల్మెట్లకు మంగళూరులో డిమాండు ఏర్పడుతోంది. -
హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు దక్కేవి!
పెద్దారవీడు: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులు ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి కింద పడిపోయారు. దీంతో ఒకరు ఆక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన పెద్దారవీడు గ్రామం సమీపంలో చెరువు దగ్గర మూలమలుపు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. బాధితుని మామ బాలంకయ్య తెలిపిన ప్రకారం.. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లె గ్రామానికి చెందిన అక్కలి శివ తన మామ గంగుపల్లె గ్రామానికి చెందిన మురారి బాలంకయ్య కలిసి ద్విచక్ర వాహనంపై పెద్దదోర్నాలకు వెళుతున్నారు. పెద్దారవీడు గ్రామం చెరువు మూలమలుపు వద్దకు రాగానే కిందపడిపోవడంతో అక్కలి శివ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై కుర్చున్న మామ మురారి బాలంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ఉన్నప్పటికీ పెట్టుకోకపోవడంతో శివ తలకు బలమైన గాయాలు తగిలాయి. గ్రామస్తులు వెంటనే 108కి సమాచారం అందించడంతో తీవ్ర గాయాలైన బాలంకయ్యను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాలంకయ్య కూతురు మల్లేశ్వరిని శివ సంవత్సరం క్రితం వివాహాం చేసుకుని మామ ఇంటి వద్దనే ఉంటున్నారు. పెద్దదోర్నాలలో అమ్మమ్మ దగ్గర శివ చెల్లెలు నాగలక్ష్మి ఉంటూ చదువుకుంటూ ఉంది. మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో నాగలక్ష్మిని చేర్పించేందుకు మామతో కలిసి శివ ద్విచక్ర వాహనంపై పెద్దదోర్నాల బయలుదేరారు. ఈ ఘటనతో భార్య, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎస్సై పి. ముక్కంటి సంఘటన స్థలంనకు చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకుని ట్రాఫ్‌కు అంతరాయం లేకుండా చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
హెల్మెట్‌తో వెంట్రుకలు రాలుతాయా?
వాహనం నడిపే సమయంలో నేను ఎప్పుడూ హెల్మెట్ వాడుతుంటాను. అయితే ఇటీవలే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. కాస్త బట్టతలలా ఉంది. ఇలా నా వెంట్రుకలు రాలడానికి హెల్మెటే కారణమా? దీనికి చికిత్స సూచించగలరు. – ఎన్. ఆదిత్య, నెల్లూరు మీరు చెబుతున్నట్లుగా హెల్మెట్ వాడటానికీ జట్టు రాలిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. పైగా హెల్మెట్ వల్ల తలకు, జుట్టుకు రక్షణ కలుగుతుంది. మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు బయోటిన్ ఫెనస్టెరైడ్, మినాక్సిడిల్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి. అరచేతుల్లో చెమటలు... పరిష్కారం చెప్పండి నా వయసు 25. నా సమస్య ఏమిటంటే... నా అరచేతులు, అరికాళ్లలో చెమటలు ఎక్కువగా పడుతున్నాయి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఏదైనా రాసుకునే సమయంలో, ఎవరైనా చూస్తుంటే ఈ సమస్య మరీ ఎక్కువైపోయి నా చేతులు, కాళ్లు తడిసిపోతున్నాయి. ఫ్రెండ్స్‌తో కూడా సరిగా కలవలేకపోతున్నాను. చాలా ఇబ్బందిపడుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – శ్రీనివాస చక్రవర్తి, చిత్తూరు మీరు ఎదుర్కొంటున్న సమస్యను వైద్యపరిభాషలో పామోప్లాంటార్ హైపర్ హిడరోసిస్ అంటారు. ఇది ఒక నరాలకు సంబంధించిన సమస్య. యాంగై్జటీ వల్ల మీకు ఈ సమస్య వస్తోంది. యాంగై్జటీ పెరిగినప్పుడు చెమట పట్టే ప్రక్రియ పెరుగుతుంది. దీనికి చికిత్స ఇలా... 1. బోట్యులినమ్ టాక్సైడ్ అనే ఇంజెక్షన్ ద్వారా దీన్ని కొద్దిమేరకు శాశ్వతంగా (సెమీ పర్మనెంట్)గా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియను ఇటీవల విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఈ ప్రక్రియ అనుసరించాక 4–6 నెలల్లో చెమటలు పట్టడం అదుపులోకి వస్తుంది. 2. దీనికి ఐయన్టోఫొరెసిస్ వంటి మరికొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవంత మంచి ఫలితాలు ఇవ్వవు. మీరు ఒకసారి అనుభవజ్ఞులైన డర్మటాలజిస్ట్‌ను కలవండి. ఈ ఎరుపు, నలుపు రంగు మచ్చలు తగ్గేదెలా? నా వయసు 48 ఏళ్లు. నా తొడలపై ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. చెమటలు పట్టినప్పుడు వాటిలో చాలా దురద ఉంటుంది. అవి క్రమంగా సైజు పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. నేనెన్నో మందులు వాడాను. కానీ ప్రయోజనం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మురళి, కొత్తగూడెం మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్–100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినఫిన్ ఉన్న క్రీమును 2–3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. మంచి స్కిన్ వైటెనింగ్ క్రీమ్స్ సూచించండి నేను ఈ మధ్య ముఖం తెల్లబడటానికి ఒక బ్రాండ్‌కు చెందిన స్కిన్ వైటెనింగ్ క్రీమ్ ఉపయోగిస్తున్నాను. ముఖంలో మార్పు వచ్చింది కానీ... ముఖంపై మొటిమలతో నల్లమచ్చలు వస్తున్నాయి. ఇలా ఈ క్రీమ్ వాడటం మంచిదేనా? తెల్లబడటానికి సైడ్ ఎఫెక్ట్స్‌లేని మంచి క్రీమ్స్ ఏవైనా ఉంటే చెప్పగలరు. – తేజ, విజయవాడ మీ ముఖం రంగు తెల్లబడటానికి మీరు వాడిన కాంబినేషన్లో బహుశా మాడిఫైడ్ క్లిగ్‌మెన్స్ రెజిమెన్ ఉండి ఉండవచ్చు. అందులో కార్టికోస్టెరాయిడ్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఆ క్రీమ్‌ను కొన్ని వారాలపాటు వాడినప్పుడు అది మొటిమలు వచ్చేందుకు దోహదం చేసి ఉంటుంది. దీన్ని ‘స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ ఆక్నే’ అంటారు. ఇది ముఖంపై అంతటా వ్యాపించి బ్లీచ్ చేసిన గుర్తులను ముఖంపై వచ్చేలా చేస్తుంది. కాబట్టి మీరు ఈ క్రీమ్‌ను వాడటం మానేయండి. దీనికి బదులు మీరు ఆర్బ్యుటిన్, లికోరెస్ లేదా కోజిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడండి. అవి నల్లమచ్చలను తొలగిస్తాయి. ఇక మీ మొటిమలు తగ్గడానికి రాత్రివేళల్లో క్లిండమైసిన్, అడాపలీన్ కాంబినేషన్ ఉన్న క్రీమ్‌ను రాసుకోండి. దాంతో మీ సమస్య తగ్గుతుంది. చుండ్రు సమస్య బాధిస్తోంది... ఏం చేయాలి? నా వయసు 27 ఏళ్లు. చాలారోజులుగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నాను. ప్రతి వారం రెండుసార్లు తలస్నానం చేస్తాను. ఈ సమస్య తగ్గడానికి వారానికి మూడు సార్లు గానీ, రోజు విడిచి రోజుగానీ తలస్నానం చేస్తే జుట్టుకు ఏదైనా హాని జరుగుతుందా? దయచేసి వివరించండి. – సాయిప్రసన్న, నిజామాబాద్ మీరు వివరించిన అంశాలను బట్టి మీరు మాడు మీద సబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ మాడు మీద ఉండే సీబమ్ అనే నూనెలాంటి స్రావాన్ని వెలువరించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల మీరు పేర్కొంటున్న సమస్య వస్తుంది. మీరు జడ్‌పీటీఓ, కెటాకోనజాల్ ఉండే షాంపూను వాడండి. మీరు ఈ షాంపూను రోజు విడిచి రోజు వాడవచ్చు. ఇక నోటి ద్వారా తీసుకోవాల్సిన ఐటాకొనజోల్ టాబ్లెట్లను ఉదయం రెండు, రాత్రి రెండు చొప్పున రెండు రోజుల పాటు వాడాలి. ఈ మోతాదును స్టాట్ డోసిండ్ అంటారు. అంటే ఇది మీ సమస్యకు తక్షణం పనిచేసే మోతాదు అన్నమాట. అప్పటికీ సమస్య తగ్గకపోతే నోటి ద్వారా తీసుకునే ఐసోట్రెటినాయిన్ అనే మందును వాడవచ్చు. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
సార్ మిమ్మల్ని చనిపోనివ్వం : ట్రాఫిక్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : నగర రోడ్లపై అడ్డదిడ్డంగా వెళ్లిపోదామనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఓ వాహనదారుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడ్డాడు. కృష్ణారెడ్డి అనే ఆ వ్యక్తికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసుల సోషల్‌మీడియా టీమ్ ఓ ఫొటోను ఈ-చలాన్‌తో పాటు షేర్ చేసింది. బైక్ వెనుక భాగంలో ‘నో హెల్మెట్, ఐ డై లైక్ రియల్ మెన్’ అంటూ స్టిక్కరింగ్ ఉంది. దీనిపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.. ‘కృష్ణా రెడ్డి గారు మీరు మమ్మల్ని క్షమించాలి. మేం మిమ్మల్ని చనిపోనివ్వం. నిజమైన మగాడిలా మీరు బ్రతికేలా మేం చేస్తాం’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల ట్వీట్‌పై ‘నేనైతే ఇక ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకోకుండా బయటకు వెళ్లను’ అంటూ ఓ నెటిజన్ రీట్వీట్ చేశారు. వాహనదారుల తప్పులను నొప్పించక సరిచేస్తున్న నగర ట్రాఫిక్ పోలీసులపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. #HYDTPweCareForU We r extremely Sorry Mr. Krishna Reddy Sir. We won't let U die. We will see that U "LIVE LIKE REAL MEN". Please wear helmet & ride. 🚴♂️😀@AddlCPTrHyd pic.twitter.com/Q9NFcD4hva — HYDTP (@HYDTP) 25 April 2018 -
బతికించిన హెల్మెట్
కేసముద్రం(మహబూబాబాద్): అదుపుతప్పి రోడ్డుపక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్ర వాహనంతో పడిన ఓ వ్యక్తిని హెల్మెట్ బతికించింది. తీవ్ర గాయాలతో బావిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కల్వల గ్రామ శివారు గాంధీపురం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం..ఖమ్మం జిల్లా తిరుమరాయపాలెం మండలం తిప్పరెడ్డిడూడెం గ్రామానికి చెందిన బర్మావత్ రవి అనే యువకుడు కేసముద్రం నుంచి మహబూబాబాద్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కల్వల గ్రామశివారు గాంధీపురం దగ్గరలో మలుపు వద్ద బైక్ అదుపు తప్పడంతో వ్యవసాయబావిలోకి బైక్‌తో సహా రవి పడియాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సైతోపాటు పోలీసు సిబ్బంది, మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. తాడు సాయంతో మంచంలో క్షతగాత్రుడిని బయటకు తీశారు. కాళ్లు, చేతులకు, నడుముభాగంలో రవికి గాయాలయ్యాయి. కాగా, అతన్ని 108లో మానుకోట ఆస్పత్రికి తరలించారు. హెల్మెట్ ధరించడం వలన నీళ్లులేని బావిలో బైక్‌తోపాటు పడిన రవి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఎస్సై తెలిపారు. -
మాయదారి దూకుడు!
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : హెల్మెట్ లేకుండా బైకు నడపడమే కాదు రోడ్డుపైకి వచ్చేటప్పుడు కూడా హెల్మెట్‌ను ధరించాల్సిన రోజులొచ్చేలా ఉన్నాయి. రోడ్డుపై నడిచే సమయంలో వాహనాలపై దూసుకొచ్చే మందుబాబులు, ఆకతాయిల నుంచి మన ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే రోడ్డుపై నడవాలంటేనే జనం భయపడిపోయే పరిస్థితులు దాపురించాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టంవచ్చినట్లు బైకులు నడిపే ఆకతాయిల వల్ల రోడ్లపై రాకపోకలు చేసే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, గాయాలపాలవ్వడం సింగ్‌నగర్, పాయకాపురం పరిసర ప్రాంతాల్లో నిత్యకృత్యంగా మారింది. తప్పొకరిది.. శిక్ష మరొకరికా..? మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. అయితే ఇది మన నగర వాసులకు మాత్రం మిన‘హాయి’ంపుగా మారినట్లు కనిపిస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నెలాఖరుకోసారో, ప్రధాన సంఘటనలు జరిగిన రోజుల్లో తప్ప మిగిలిన సమయంలో ఎవరూ పట్టించుకోరనే నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఆకతాయిలు, మందుబాబులు తమకు ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడిపేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు చదువుకున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదేవిధంగా వాహనాలు నడుపుతుండటం వల్ల ఎంతోమంది జీవితాలు, వారి కుటుంబ సభ్యుల జీవితాలు అంధకారంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన సంఘటనలు ఇవిగో.. ♦ సింగ్‌నగర్ వడ్డెర కాలనీ ప్రాంతానికి చెందిన మల్లెల ప్రవన్న (15) బందరురోడ్డులోని బిషప్ హజరయ్య స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ మంగళవారం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు రేడియో స్టేషన్ వద్ద రోడ్డు దాటుతుండగా ముగ్గురు యువకులు మద్యం సేవించి ఒకే బైకుపై మితిమీరిన వేగంతో వచ్చి ఆమెను ఢీకొన్నారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయింది. దగ్గరే ఉన్న పోలీసులు చొరవచూపి ఆస్పత్రికి తరలించడం, రక్తదానం చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ♦ రెండు నెలల క్రితం వాంబే కాలనీకి చెందిన ఓ యువకుడు బైకుపై గుణదలకు వెళ్తుండగా మద్యం మత్తులో బైకు నడుపుతున్న ఓ వ్యక్తి సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై అతన్ని బలంగా ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ♦ నాలుగు నెలల క్రితం సింగ్‌నగర్ ఎల్బీఎస్ నగర్లో ఓ ఆకతాయి మితిమీరిన వేగంతో బైకు నడపడం వల్ల రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడడంతో పాటు, పక్కనే ఉన్న దుకాణంలో అద్దాలు, సామాన్లు పగిలిపోయాయి. సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, కండ్రిక ప్రాంతాల్లో తరచూ ఇదే విధంగా ప్రమాదాలు జరగడం, పలువురు గాయాలపాలవడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, పాయకాపురం, కండ్రిక, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ రోడ్లలో మందుబాబులు, ఆకతాయిలు ఆగడాలు అధికంగా ఉంటున్నాయి. స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి స్కూల్ పిల్లలు కూడా పెద్దపెద్ద బైకులు నడిపేస్తున్నారు. జనాలు తిరిగే ఈ రోడ్లపై మితిమీరిన వేగంతో రయ్‌మంటూ దూసుకువచ్చేస్తున్నారు. వీటివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, కండ్రిక ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తే ఈ అతివేగాలకు కొంతవరకు కళ్లెం వేయవచ్చు. – కృష్ణ, స్థానికుడు అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్‌లు పెట్టాలి రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు, వారిని కోల్పోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధలను చూపిస్తూ పాఠశాలలు, కళాశాలలు, మద్యం దుకాణాల వద్ద, రోడ్లపై స్క్రీన్ ద్వారా అవగాహన సదస్సులు పెట్టాలి. నిబంధనలు పట్టని వాహనచోదకులను గుర్తించి కౌన్సెలింగ్ చేస్తే బాగుంటుంది. – ఎండీ హఫీజుల్లా, స్థానికుడు -
ఫైన్ వేసినా మారడం లేదు
సాక్షి, నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ సూచించారు. హెల్మెట్లు ధరించని వారికి ఫైన్ (జరిమానా) వేస్తున్నామని, అయినా వారిలో మార్పులు రావటం లేదన్నారు. అందుకే హెల్మెట్లు ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ వాడకంపై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానంలో సీపీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. సీపీ స్వయం గా బైక్‌ను నడిపారు. కంఠేశ్వర్ కమాన్, ధర్నాచౌక్, రైల్వేస్టేషన్, బస్టాండ్, దేవిరోడ్డు చౌరస్తా, గాంధీచౌక్, నెహ్రూ పార్కు పెద్దబజార్, న్యాల్కల్ చౌరస్తా, పూలాంగ్‌చౌరస్తా, ఎల్లమ్మగుట్టచౌరస్తా, రైల్వేకమాన్, కంఠేశ్వర్ బైపాస్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం సీపీ మాట్లాడుతూ తల భాగం ఎంతో సున్నితమైందని, రోడ్డు ప్రమాదాలలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించక పోవటంతోనే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతి చెందుతున్నారని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్‌ను ధరించాలన్నారు. అదనపు ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ నాగేశ్వర్రావు, ట్రాఫిక్ ఎస్సైలు పాల్గొన్నారు. సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ పోలీస్ కమిషనర్ కార్తికేయ గురువారం మధ్యహ్నం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎస్సైలతో మాట్లాడారు. ఆదివారం శ్రీరామ నవమి పండుగ నేపథ్యలో నిర్వహించే ర్యాలీలకు బందోబస్తు చర్యలపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రామాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏడు ప్రధాన అంశాలపై కరపత్రాల విడుదల రహదారి భద్రత, ఆత్మహత్యల నివారణ వంటి ఏడు ప్రధాన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పోలీస్‌శాఖ ఏడు కరపత్రాలను విడుదల చేసింది. సీపీ కార్తికేయ గురువారం కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కళాబృందాలకు ఆయా కరపత్రాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో కళాబృందాలు పర్యటిస్తాయన్నారు. ప్రజలలో చైత్యనం వచ్చినప్పుడే ఆ ప్రాంతంలో నేరాలు తగ్గుతాయని, అందుకోసం పోలీస్‌శాఖ తరపున ఏడు అంశాలపై కరపత్రాలు రూపొందించిందని చెప్పారు. ఎస్బీ సీఐ–2 రాజశేఖర్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సాయాగౌడ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఏఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం గుండె నొప్పితో మృతి చెందిన ఏఎస్సై కుటుంబానికి సీపీ కార్తికేయ గురువారం ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. మాక్లూర్ పోలీస్‌స్టేష¯న్కు చెందిన ఏఎస్సై పోచయ్య జనవరి 11న గుండె నొప్పితో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మొత్తం ఒకరోజు వేతనాన్ని డెత్ ఫండ్ (ఆర్థిక సాయం) రూపంలో రూ.1,29,300 చెక్కును సీపీ పోచయ్య భార్య రుక్మాబాయికు అందజేశారు. ఎస్బీ సీఐ వెంకన్న, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి ఎస్ఎస్ జై కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణానికి రక్ష హెల్మెట్
నెల్లూరు(మినీబైపాస్): వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, శిరస్త్రాణం లేకుండా పట్టుబడ్డ ద్విచక్రవాహనదారులకు చట్ట ప్రకారం హెల్మెట్ ధర కన్నా ఎక్కువ మొత్తంలో జరిమానా విధించాలని, దీనిని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 26 నుంచి అమలు చేయాల్సిఉంది. కన్నవారికి కడుపుకోత జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు. వీరిలో హెల్మెట్లు ధరించకపోవడం వల్ల మృతిచెందిన వారే అధికంగా ఉంటున్నారు. హెల్మెట్ వినియోగంపై పోలీసులు, రవాణశాఖ అధికారులు వివరించినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. జిల్లాలో 5 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలున్నాయి. ప్రతినెలా 5 వేలకు పైగా కొత్తవి రోడ్ల మీదకు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఏటా 25 శాతం మంది ద్విచక్రవాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 129 ప్రకారం ప్రతి ద్విచక్ర వాహనదారుడు, అతని Ðవెనకాల కూర్చున్న వారు తప్పనిసరిగా శిరస్త్రాణం(హెల్మెట్) ధరించాల్సిఉంది. ఇదే విషయాన్ని ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినా వాహనదారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. వాహనంతోనే హెల్మెట్.. మోటార్ వాహన చట్టం 138(ఎఫ్) ప్రకారం ప్రతి డీలరు వాహనం విక్రయించేటప్పుడు వినియోగదారులకు తప్పనిసరిగా ఉచితంగా హెల్మెట్ ఇవ్వాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎఫ్) ప్రకారం 1 ఎస్ 4151 ప్రమాణాలతో ఉన్న ఐఎస్ఐ మార్కు కలిగిన హెల్మెట్లనే వాహనదారులు వినియోగించాలి. అయితే నూతన ద్విచక్ర వాహనాన్ని విక్రయించేటప్పుడు వాటికి హెల్మెట్లను జతచేసి ఇవ్వాలనే నిబంధనను డీలర్లు అమలు చేయడం లేదు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి షోరూమ్‌లను తనిఖీ చేసి హెల్మెట్లను అందిస్తున్నారా లేదా అని పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాల్సిఉంది. అలాగే వాహనదారులందరూ తప్పనిసరిగా శిరస్త్రాణాన్ని వినియోగించినప్పుడే ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 26 నుంచి హెల్మెట్ కచ్చితంగా ధరించాలి అనే నిబంధనను పూర్తిస్థాయిలో అమలు చేస్తారో లేదో వేచి చూడాలి. హెల్మెట్ లేకుంటేప్రాణాలకే ముప్పు ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ప్రమాదాలు జరిగిన సమయంలో తలపై గాయాలై మృతిచెందిన కేసులే అధికంగా ఉంటున్నాయి. దీనిపై ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం.– పి.మల్లికార్జునరావు,ట్రాఫిక్ డీఎస్పీ -
వారిపై కఠిన చర్యలు తీసుకోండి : సచిన్
న్యూఢిల్లీ : నాణ్యత లేని హెల్మెట్లను తయారీ చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. భద్రత కోసం వాడే వస్తువులు చాలా నాణ్యతగా ఉండాలని, క్రికెటర్లు మైదానంలో వాడే వస్తువులంతా నాణ్యమైనవిగా ఉండాలని సచిన్ లేఖలో ప్రస్తావించారు. ఇక దేశంలోని 70 శాతం ద్విచక్ర వాహనదారులు నకిలీ హెల్మెట్లు వాడుతున్నారని, చాలా కంపెనీలు ఎలాంటి నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా నకిలీ ఐఎస్ఐ ముద్రను ముద్రించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇవి వాహనదారుల భద్రతకు ప్రమాదమని, ప్రమాదాల తీవ్రతను మరింత పెంచేలా చేస్తాయన్నారు. నకిలీ హెల్మెట్లు తలకు అయ్యే గాయల నుంచి రక్షించలేవన్నారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా టూవీలర్స్ రైడర్సే మరణిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రజా రక్షణ కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని తాను భావిస్తున్నానని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కంపెనీల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన హెల్మెట్లు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగించేలా ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ విషయంలో తనవంతు సాయం చేస్తానని సచిన్ స్పష్టం చేశారు. నకిలీ హెల్మెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సచిన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా సచిన్ ద్విచక్రవాహన దారులు హెల్మెట్ ధరించాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
బైక్‌ను తన్నిన పోలీసు.. గర్భిణి మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: హెల్మెట్ చెకింగ్ కోసం ఆగకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంబడించి కాలితో తన్నడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ గర్భిణి మరణించింది. బైక్ నడుపుతున్న ఆమె భర్తకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో జరిగింది. తిరుచ్చిరాపల్లిలోని తువకూడీ టోల్‌ప్లాజా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా భార్యతో కలసి బైక్‌పై బయలుదేరిన రాజాను ఆపడానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కామరాజ్ యత్నించారు. కానీ రాజా బైక్‌ను ఆపలేదు. వెంటనే మరో బైక్‌పై వెంబడించిన కామరాజ్.. తిరుచ్చిరాపల్లి–తంజావూరు హైవేపై రాజా బైక్‌ను కాలితో తన్నారు. దీంతో బైక్‌పై ఉన్న దంపతులిద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల గర్భిణి ఉషాను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కామరాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉషా మృతికి సంతాపం తెలిపిన సీఎం పళనిస్వామి.. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఉష కుటుంబానికి రూ.రెండు లక్షల ఆర్థిక సాయాన్ని మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రకటించారు. -
ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయడంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కొంతమంది వీరిని తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదం పలాస సమీపంలో బుధవారం జరిగింది. పలాస మండలం కొబ్బరి చెట్లూరు జాతీయ రహదారి కూడలి వద్ద హెచ్‌సీ సి.హెచ్. శ్రీనివాసరావు ఇన్చార్జ్గా, సిబ్బంది ఎస్.గాసయ్య, జి.శ్రీనివాసరావు బుధవారం మధ్యాహ్నం 12.15 నిమిషాల సమయంలో తనిఖీలు చేస్తున్నారు. మండలంలోని దానగొర గ్రామానికి చెందిన సవర డానియల్ అటుగా వస్తున్నారు. ఇదే సమయంలో మందస మండలం కొత్తపురం గ్రామానికి చెందిన గుంట జానకీరావు, తన భార్య జానకమ్మతో పాటు మనమరాలు అవంతిక ద్విచక్రవాహనంపై వస్తున్నారు. డానియల్, జానకిరావు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పెట్రోలింగ్ సిబ్బంది వీరిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వీరు ఆగకుండా యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుంట జానకిరావుకు తలకు, నుదుటికి తీవ్రగాయాలయ్యాయి. కుడిచేయి, కుడికాలు వద్ద విరిగిపోయింది. గుంట జానకిరావు భార్య జానకమ్మ తలకు తీవ్రగాయమైంది. మనవరాలు అవంతిక క్షేమంగా బయటపడింది. క్షత్రగాత్రులను హైవే పెట్రోలింగ్ సిబ్బంది, స్థానికులు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రకాష్ వర్మ వైద్యపరీక్షలు నిర్వహించి ప్రథమ చికిత్స అందజేశారు. కాగా సవర డానియల్‌కు గాయాలు కాలేదు. -
ధోని హెల్మెట్‌పై జెండా ఎందుకు ఉండదంటే..
సాక్షి స్పోర్ట్స్: భారత క్రికెట్ ఆటగాళ్లు ధరించే హెల్మెట్లు ఎప్పుడైనా పరీక్షగా చూశారా? చూసుంటే ఏమైనా కనిపెట్టారా? సచిన్, గంగూలీ, కోహ్లీ, ఇతర ప్రముఖ ఆటగాళ్లు అర్ధ సెంచరీ, సెంచరీలు చేసిన తర్వాత హెల్మెట్‌ను ముద్దాడం చూశారా? ధోని వారిలాగే ఎప్పుడైనా చేశాడా లేదా? వారందరూ ఎందుకు అలా చేస్తారో తెలుసా? తెలియక పోతే తెలుసుకోండి. వీటన్నింటికి సమాధానం ఒక్కటే.. అదే భారత జెండా. భారత క్రికెట్ ఆటగాళ్ల హెల్మెట్లపై బీసీసీఐ లోగోతో పాటు భారతీయ జెండా ఉంటుంది. దేశం మొత్తం గర్వంగా భావించే జాతీయ జెండాను ధరించడం ఎవరైనా గొప్ప గౌరవంగా భావిస్తారు. అందుచేతనే సచిన్, సెహ్వాగ్‌లతో పాటు ఇతర ప్రముఖ ఆటగాళ్లు అందరూ సెంచరీ పూర్తి చేయగానే హెల్మెట్‌ను ముద్దాడతారు. కానీ ధోని మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాడు. అలా అని ధోనికి దేశభక్తి లేదని కాదు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. భారత కెప్టెన్‌గా అలా చేయకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. భారతీయ ప్రతీకలను అవమానించే నిరోధక చట్టం 1971 కింద ధోని క్రికెట్ ఆడుతున్నప్పుడు భారత జెండాను తలపై ధరించకూడదు. ఎందుకుంటే భారతీయ జెండాను భూమిపై పడేయడం, కాళ్ల కింద ఉంచడం వంటివి చేయడం మాతృభూమి భారతదేశాన్ని అవమానించినట్లే. దేశం మొత్తం తలెత్తి సెల్యూట్ చేయాల్సిన జెండాను నేలపై ఉంచితే, భారతదేశాన్ని అవమానపరిచినట్లే. కీపింగ్ చేస్తున్నప్పుడు ధోని కొన్ని సార్లు హెల్మెట్‌ను నేలపై ఉంచుతాడు. ఆ సమయంలో హెల్మెట్‌పై జెండా ఉంటే ధోని భారత దేశాన్ని అవమాన పరిచినట్లు అవుతుంది. ఈకారణంగానే ధోని హెల్మెట్‌పై భారత జెండా ఉండదు. 2011 వరకూ హెల్మెట్‌పై భారత జెండాను ధరించిన ధోని, ఆర్మీ లెఫ్టినెంట్‌గా గౌరవించబడినప్పటి నుంచి ధరించడంలేదు. ఇది దేశంపై ధోనికి ఉన్న గౌరవానికి చిన్న ఉదాహరణ మాత్రమే. -
హెల్మెట్‌తో ప్రాణాలకు రక్షణ
మహబూబ్‌నగర్ క్రైం: ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు ముప్పు ఉండదని ఎస్పీ బి.అనురాధ అన్నారు. హెల్మెట్ ధరించకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడమే 80శాతం ప్రమాదాలకు కారణమని ఆమె పేర్కొన్నారు. పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యాన సోమవారం నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఎస్పీ కార్యాలయంలో ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కంటే ప్రమాద కారణాలను విశ్లేషించుకుని జాగ్రత్త పడితే ఎన్నో కుటుంబాలను కాపాడొచ్చని తెలిపారు. పోలీసులందరూ తప్పక హెల్మెట్ ధరించాలని.. తద్వారా ఇతర వాహనదారులు స్ఫూర్తి పొందుతారని చెప్పారు. కాగా, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి పోలీస్ శాఖ తరఫున నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు. అయితే, అవగాహన కార్యక్రమాల ద్వారా ఆశించిన మార్పు రావడం లేదని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలపై బయటకు వెళ్లే వారు హెల్మెట్ ధరించేలా భార్యాపిల్లలు, కుటుంబీకులు గుర్తు చేయాలని కోరారు. కాగా, ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్, క్లాక్‌టవర్, అశోక్ టాకీస్, వన్‌టౌన్ వరకు సాగింది. డీఎస్పీ భాస్కర్, సీఐలు సీతయ్య, అమరేందర్నాథ్రెడ్డి, వీరేష్, దిలీప్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.1500 లకే స్పెషల్ హెల్మెట్
బెంగళూరు : ప్రమాదాలకు గురైన సమయంలో రక్షణ కోసమే కాదు.. దారి చూపేందుకు కూడా సహకరించే హెల్మెట్లు త్వరలో మార్గెట్లోకి రానున్నాయి. అంతర్గతంగా బ్లూటూత్ స్పీకర్ ఇందులో పొందుపరచబడి ఉంటుంది. దీని ద్వారా రూట్ విషయంలో వాహనదారుడికి సూచనలు అందుతుంటాయి. బెంగళూర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు దీనిని తయారు చేశారు. గుల్బర్గాలోని పీడీఏ కాలేజీలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న యోగేష్, అభిజిత్‌లు ఈ హెల్మెట్‌ను రూపొందించారు. ‘హెల్మ్ట్లో ఇన్‌బిల్ట్‌గా ఓ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది. దారి మరిచిపోయిన సందర్భంలో ఫోన్ బ్లూటూత్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌కు దీనికి అనుసంధానించే సౌలభ్యం ఉంటుంది. రూట్ తెలీక గందరగోళానికి గురయ్యే వాహనాదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అని ఆ విద్యార్థులు చెబుతున్నారు. ‘విదేశాల్లో వీటికి మంచి మార్కెట్ ఉంటుంది. కానీ, విద్యార్థుల కోరిక మేరకు 1500 రూ. దీనిని అమ్మాలని నిర్ణయించాం’ అని హెల్మెట్‌పై హక్కులు తీసుకున్న సంస్థ తెలిపింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఇది 6 గంటలు పని చేస్తుంది. ఛార్జింగ్ పోర్ట్‌తోపాటు, ముందు భాగంలో కూలింగ్ షీట్‌ను కూడా పొందుపరిచారు. త్వరలో బెంగళూర్‌తోపాటు మిగతా ప్రధాన నగరాల్లోని మార్కెట్ల్లోకి ఒకేసారి ఇవి అందుబాటులోకి రానున్నాయి. -
పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రహదారి నిబంధనలు పాటిస్తే వాహనచోదకులు కుటుంబ సభ్యులతో కలసి పువ్వులాగా నవ్వుకోవచ్చని జిల్లా ఎస్పీ గోసీనాథ్‌జట్టి సూచించారు. సోమవారం సాయంత్రం రాజ్‌విహార్‌లో వాహనదారులకు రహదారి నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ.. స్వయంగా హెల్మట్ ధరించిన ద్విచక్ర వాహనదారులు, షీటు బెల్టు పెట్టుకున్న ఫోర్వీలర్స్లకు రోజాపువ్వు, చాక్లెట్ ఇచ్చి అభినందించారు. ఇదే సమయంలో రహదారి భద్రత నియమాలను పాటించని వారికి మంత్రణం చేశారు. అంతకముందు టూటౌన్ పోలీసు స్టేషన్ నుంచి రాజ్‌విహార్ వరకు రహదారి నియమాలను పాటించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నాయన్నారు. హైవేల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలేదన్నారు. దీంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయి కుటుంబాలను వీధిపాలు చేసుకుంటన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకారం అందించాలని కోరారు .డీఎస్పీలు ఖాదర్‌బాషా, సీఎం గంగయ్య, సీఐలు రామయ్యనాయుడు, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్ ట్రాఫిక్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
సూక్ష్మ బంగారు హెల్మెట్ బహూకరణ
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : పట్టణంలోని స్వర్ణకారుడు హరి యాదవ్ సూక్ష్మ పరిమాణంలో 300 పాయింట్ల బంగారంతో చేసిన హెల్మెట్‌ను అర్బన్ సీఐ సదాశివయ్యకు బహూకరించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ఆవశ్యకతను తెలియచేస్తూ బంగారు హెల్మెట్‌ను తయారు చేసినట్లు స్వర్ణకారుడు తెలిపాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం అర్బన్ సీఐకి అందజేశాడు. -
మద్యం మత్తులో ప్రాణాలు చిత్తు
చిత్రంలో తలతెగి మొండెం కలిగిన బైక్ చూశారా.. మద్యం మత్తులో హెల్మెట్ పెట్టుకోకుండా ఎన్.బంగారయ్య (24) అనే యువకుడు ఈ నెల 16న ఆర్టీవో కార్యాలయం సమీపంలో నేరుగా విద్యుత్ స్తంభానికి బైక్‌తో ఢీకొట్టాడు. తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ప్రమాదంలోనే బైక్ ఇలా రెండు ముక్కలైంది. దీనినే ట్రాఫిక్ పోలీసులు ప్రజలందరికీ తెలిసేలా ఒక పోస్టర్లో మృతుడి ఫొటోతో పాటూ బైక్‌ను ప్రదర్శించి, వాహనచోదకుల్లో అవగాహన కల్పిస్తున్నారు. విజయనగరం టౌన్: ఆ ప్రమాదమే కాదు.. ఇప్పుడు చాలా ప్రమాదాలు మద్యం మత్తులోనే జరుగుతున్నట్టు పోస్టు మార్టం నివేదికలు తేల్చి చెబుతున్నాయి. మద్యం మత్తులో ఊగుతూ.. జోగుతూ మోటార్ బైక్‌లు నడపుతూ ఎదుటివారిని గుర్తించకుండా.. తామేమైపోతున్నామో తెలియని స్థితిలో ఏ చెట్టుకో, స్తంభానికో, లేక ఎదురుగా వస్తున్నా వారికో ఢీకొట్టి ప్రాణాలు విడుస్తున్నారు. అవతలవారి ప్రాణాలు తీస్తున్నారు. ఇరువైపుల కుటుంబాల్లోనూ విషాదం నింపుతున్నారు. మద్యం మత్తులో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారే ప్రమాదాలకు కారకులవుతుండడం పోలీసులను కలవర పరుస్తోంది. వేగంగా నడుపుతూ... మద్యం మత్తుతో పాటు యువకులు బైక్‌లను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సాధారణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు బైక్‌లపై దూసుకుపోతూ ఎదుటివారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్నిసార్లు అదుపుతప్పి డివైడర్లకు ఢీకొట్టి ప్రాణాలు విడుస్తున్నారు. నూతన సంవత్సరం రోజున అతివేగమే నలుగురు యువత ప్రాణాలను తీసినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత కుడుకు డిగ్రీకెళ్తే చాలు తల్లిదండ్రులు బైక్‌లు కొనిస్తున్నారు. డ్రైవింగ్ వచ్చా.. లైసెన్స్ ఉందా.. లేదా అన్న విషయాలు పట్టించుకోవడంలేదు. ఈ నిర్లక్ష్యమే వారి ప్రాణాలను తోడేస్తోందని పోలీసులు హెచ్చరిస్తున్నా స్పందించేవారు కరువయ్యారు. పోలీస్ కేసులు ఇలా... ♦ 2017లో ఒక వాహనం ఒకటి కన్నా ఎక్కువసార్లు ప్రమాదానికి గురైనవి 1779 వరకూ ఉన్నాయి. ప్రమాదానికి కారకులైన 210 మంది డ్రైవింగ్ లైసెన్సులను పోలీసులు రద్దుచేశారు. ♦ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారిపై 2016లో 72,371 మందిపై కేసులు నమోదు చేయగా.. 2017లో 88,722 మంది ఉన్నారు. ♦ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేసే వారి సంఖ్య 2016లో 17,178 మంది ఉండగా, 2017లో అలాంటి వారిపై 12,508 పై కేసులు నమోదు చేశారు. ♦ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2016లో 4021 నమోదుకాగా, 2017లో 5,165 నమోదయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై 2016లో 625 కేసులు నమోదు చేయగా, 2017లో 1797 కేసులు నమోదుచేశారు. -
హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా
విజయవాడ:నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఇ–చలానా ద్వారా జరిమానాలు చిత్రవిచిత్రంగా విధిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి రోజూ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్‌లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. కొందరు వాహనాలను సీజ్ చేస్తున్నారు. గురువారం వన్ ట్రాఫిక్ పోలీసులు సెక్టార్–2లో జరిపిన తనిఖీల్లో కారు నడిపే వ్యక్తికి హెల్మెట్ లేదని ఇ–చలానాపై కేసు నమోదు చేశారు. కారు నంబర్ ఏపీ16 డీ ఎం.2229ను ఆపి కాగితాలు తనిఖీ చేశారు. అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా ఏదో విధంగా జరిమానా విధించాలని భావించిన ట్రాఫిక్ సి బ్బంది ఇ–చలానాలో కేసు బుక్ చేశారు. హె ల్మెట్ లేదని ఆ కారు నడిపిన వ్యక్తిపై కేసు న మోదు చేసి రూ.135 జరిమానా విధిస్తూ ఆన్లై న్లో చలానా పంపారు. ఇది చూసిన కారు య జమాని ఆశ్చర్యపోయారు. ఈ విషయం బయటకు రావడంతో కారు నడిపే వారు విస్మయానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం ఇలా ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు. -
ఫైన్ భయం, వ్యాన్‌లో కూడా హెల్మెట్
జైపూర్ : సీటు బెల్ట్స్ పెట్టుకోకుండా.. హెల్మెట్ పెట్టుకోకుండా వ్యాన్ డ్రైవ్ చేస్తున్నారా? అయితే మీరు పోలీసుల చిక్కుల్లో పడినట్టే. ఇదేమీ ఫేక్ కాదు. నిజమే. ఓ 23 ఏళ్ల వ్యక్తి ఫోర్-వీలర్ నడుపుతూ.. హెల్మెట్ పెట్టుకోనందుకు పోలీసులు రూ.200 జరిమానా విధించారు. ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి హెల్మెట్ లేనిదే తన వ్యాన్ ఎక్కడమే మానేశాడు. భరత్‌పుర్‌లోని సెవార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కరేరా గ్రామానికి చెందిన విష్ణు శర్మ, ఆగ్రా నుంచి డిసెంబర్ 1న తన గ్రామానికి తన వ్యాన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని రోడ్డుపై అడ్డగించిన పోలీసులు, రూ.200 జరిమానా విధించారు. ఈ జరిమానాకు వారు అందించిన రశీదు చూసి విష్ణు శర్మ ఆశ్చర్యపోయాడు. హెల్మెట్ ధరించనందుకు జరిమానా విధిస్తున్నట్టు రశీదులో పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి అతను తన వ్యాన్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ప్రారంభించాడు. శర్మ చెప్పిన వివరాల ప్రకారం...తన వద్ద అన్నీ ఉన్నాయని, డ్రైవింగ్ లైసెన్సు, కాలుష్యం, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పేపర్లు ఇలా ప్రతీది తన వద్ద ఉన్నట్టు చెప్పాడు. సీటు బెల్ట్ కూడా పెట్టుకున్నట్టు పేర్కొన్నాడు. కానీ పోలీసులు జరిమానా విధించినట్టు తెలిపాడు. హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో, జరిమానా విధించినట్టు తెలిపాడు. ఇక అప్పటి నుంచి హెల్మెట్ ధరిస్తున్నానని, ఎవరికి తెలుసు? మళ్లీ పోలీసులు విధిస్తారో లేదో అని అన్నాడు. ఇదే విషయంపై హెడ్ కానిస్టేబుల్ ప్రహ్లాద్ సింగ్‌ను ఆశ్రయిస్తే, శర్మ సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు జరిమానా విధించామని, చలాన్ బుక్‌లో పొరపాటుగా హెల్మెట్ అని నమోదుచేశామన్నారు. -
‘టాస్క్’ ఇచ్చి.. నైపుణ్యం పెంచి..
హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన 22 ఏళ్ల కస్తుబ్ కౌండిన్య.. నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి 2012–16 మధ్య మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ, టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రాంలో చేరాడు. తన ఇద్దరు సహ విద్యార్థులు శ్రీకాంత్ కొమ్ముల, ఆనంద్ కుమార్‌లతో కలసి ‘జార్‡్ష ఇన్నొవేషన్స్’ పేరుతో ఓ స్టార్టప్‌ను స్థాపించారు. ఈ ముగ్గురు విద్యార్థులు రూపొందించిన ఎయిర్ కండిషన్డ్ హెల్మెట్‌కు ఎంతో ప్రాచుర్యం లభించింది. స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద వీరి పరిశ్రమ అత్యధికంగా 74 రకాల పన్నులకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అధిక ఉష్ణోగ్రతల మధ్య మైనింగ్, చమురు, షిప్పింగ్, సిమెంట్ పరిశ్రమల్లో పని చేసే కార్మికులను దృష్టిలో పెట్టుకుని వీరు ఆ హెల్మెట్‌ను రూపొందించారు. ఇందులో రెండు రకాల హెల్మెట్లు ఉండగా, ఒకసారి చార్జింగ్ చేస్తే 2 గంటలు, 8 గంటలు అవి పని చేస్తాయి. ఇదే కాన్సెప్ట్‌తో మోటార్ సైకిల్ చోదకుల కోసం ఎయిర్ కండిషన్డ్ హెల్మెట్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. 2019లో హెల్మెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కస్తుబ్ ‘సాక్షి’కి తెలిపారు. సాక్షి, హైదరాబాద్: పరిశ్రమ ఎలా స్థాపించాలి, స్థాపించిన తర్వాత విజయవంతంగా ఎలా నడపాలి.. అనే అంశాలపై తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంస్థ సరైన అవగాహన, మార్గ నిర్దేశకత్వం చేస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సహకారంతో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం అనే రెండేళ్ల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సును అంది స్తోంది. కొత్త పరిశ్రమలు స్థాపించాలనే ఆసక్తి గల ఇంజనీరింగ్ మూడో ఏడాది విద్యార్థులు ఈ కోర్సు లో చేరేందుకు అర్హులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త ఆలోచనతో ఓ ప్రోడక్ట్‌ను రూపొందించడం, దాని ఉత్పత్తికి పరిశ్రమను స్థాపించడం, విజయవంతంగా మార్కెటింగ్ చేసి లాభాలు ఆర్జించేందుకు కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు అందిస్తున్నారు. ఒప్పందంతో అందివచ్చిన అవకాశం విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు టాస్క్ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుని పలు రకాల కోర్సులు అందిస్తోంది. ఈ క్రమంలో ఐఎస్బీతో ఎంఓయూ కుదుర్చుకుని 2014లో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్ షిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఐఎస్బీలో ప్రవేశం పొందేందుకు ప్రవేశ పరీక్షలో తీవ్ర పోటీని ఎదుర్కొని సీటు సాధించడంతోపాటు కనీసం రూ.10 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాదికి కేవలం రూ.8 వేలు చొప్పున రెండేళ్లలో రూ.16 వేలు చెల్లించి ఐఎస్బీ నుంచి టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగామ్‌ను పూర్తి చేసి సర్టిఫికెట్ పొందేందుకు రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ఎంఓయూ ద్వారా అవకాశం కలిగింది. టాస్క్ ద్వారా ప్రభుత్వం ఐఎస్బీకి రూ.53 వేలు వరకు ఒక్కో విద్యార్థి తరఫున చెల్లిస్తోంది. ఇప్పటి వరకు రూ.10 కోట్ల వరకు చెల్లించింది. కఠోర పరి‘శ్రమ’ అవసరం కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్తో బయటికి రావడం అత్యంత కఠోర శ్రమతో కూడిన పని అని టాస్క్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2014–16 మధ్య కాలంలో ఈ కోర్సులో 381 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చేరగా, అందులో 41 శాతం మంది మాత్రమే విజయవంతంగా కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఇప్పటికే తొలి బ్యాచ్ నుంచి నలుగురు విద్యార్థులు పరిశ్రమలను స్థాపించి తమ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఐఎస్బీలో నేర్చుకున్న పాఠాలు, అందిపుచ్చుకున్న విషయ పరిజ్ఞానం, సర్టిఫికెట్లతో మిగిలిన విద్యార్థులు కూడా ప్రతిష్టాత్మక సంస్థల్లో కొలువు లు, ఉన్నత చదువుల సీట్లను పొందారని టాస్క్ సీఈఓ సుజీవ్ నాయర్ ‘సాక్షి’కి తెలిపారు. కోర్సులో చేరేందుకు ఇంజనీరింగ్‌లోని పది విభాగాల విద్యార్థులు అర్హులు. సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, ఏరో స్పేస్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ, ఈఈఈ, ఐటీ, మెకానికల్ బ్రాంచీలకు చెందిన 1,800 మందికి పైగా విద్యార్థులు ఇప్పటి వరకు ఈ కోర్సులో ప్రవేశం పొందగా, అందులో 36 శాతం మంది అమ్మాయిలు ఉండటం విశేషం. నాలుగు సెమిస్టర్ల కార్యక్రమం ఈ కోర్సు.. రెండేళ్ల కాల వ్యవధితో నాలుగు సెమిస్టర్లు ఉంటుంది. ఐఎస్బీ అధ్యాపకుల బృందం ఈ కోర్సులో చేరిన విద్యార్థుల కాలేజీలకు వెళ్లి వారికి పాఠాలు చెబుతుంది. ఐఎస్బీలో సైతం ఈ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు కొత్త ప్రోడక్ట్‌కు నమూనా తయారు చేసేందుకు అధ్యాపకులు మార్గదర్శకత్వం వహిస్తారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలపై పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు స్వీకరించి ప్రోడక్ట్‌కు తుది రూపు ఇచ్చేందుకు సహకరిస్తారు. ఇలా విజయవంతంగా ప్రోడక్ట్ నమూనాలకు రూపకల్పన చేసిన విద్యార్థులకు మాత్రమే ఐఎస్బీ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. పరిశ్రమను నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా అందించేందుకు టాస్క్ సహకరిస్తుంది. -
తమిళనాడులో రెచ్చిపోయిన పోలీసు
-
హెల్మెట్ ధరించలేదని తల పగులగొట్టారు
సాక్షి, చెన్నై: హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వాహన చోదకుడి తలను ఓ పోలీసు లాఠీతో పగులగొట్టాడు. కన్యాకుమారిలో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. కన్యాకుమారి జిల్లా తిరువట్టారు పోలీసుస్టేషన్ ఏఎస్ఐ దేవరాజ్ స్థానికంగా వాహనాల తనిఖీల్లో శుక్రవారం మధ్యాహ్నం నిమగ్నమయ్యారు. అటు వైపుగా హెల్మెట్ లేకుండా వచ్చిన వాహన చోదకుడ్ని అడ్డుకునే యత్నం చేశాడు. అతడు తప్పించుకునే క్రమంలో ఉండగా దేవరాజ్ తన లాఠీకి పని పెట్టాడు. ఆ బైక్‌ను వెంబడిస్తూ వెనుకవైపు కూర్చున్న రాజేష్ అనే యువకుడి తలను తన లాఠీతో పగలకొట్టాడు. తీవ్ర రక్త స్త్రావంతో ఆ యువకుడు కింద పడ్డాడు. ఏఎస్ఐ చర్యల్ని అక్కడున్న జనం నిలదీయగా, వారిపై సైతం లాఠీ ఝుళిపించడం ఉద్రిక్తతకు దారి తీసింది. జనం పెద్ద సంఖ్యలో తిరగబడడంతో అక్కడి నుంచి ఆ ఏఎస్ఐ పరుగులు తీశాడు. -
యూజ్ యువర్ హెల్మెట్
విజయవాడ: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని నగరంలో 4వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ప్రచార కార్యక్రమం చేపట్టారు. కృష్ణలంకకు చెందిన జయ చంద్రప్రసాద్ అనే బాలుడు రెండు వారాలుగా చిన్న సైకిల్‌తో హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఆ బాలుడు కమిషనరేట్‌లో సీపీ డి.గౌతం సవాంగ్‌ను కలిశాడు. ప్రతి రోజు తాను స్కూల్ నుంచి వచ్చిన తరువాత యూజ్ యువర్ హెల్మెట్ అనే బోర్డుతో హెల్మెట్ పెట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు సీపీకి వివరించాడు. ఈ సందర్భంగా సీపీ బాలుడిని అభినందించారు. ఈ బాలుడి కార్యక్రమం స్ఫూర్తిగా అందరూ హెల్మెట్ ధరించాలని కోరారు. -
జరిమానాగా హెల్మెట్!
తప్పు చేస్తే జరిమానా విధించడం పరిపాటి. కానీ నగరి పోలీసులు మాత్రం జరిమానా బదులు హెల్మెట్ అందజేస్తున్నారు. ఊరికే కాదండోయ్.. జరిమానాగా విధించిన మొత్తానికే.. నగరి: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎన్నిసార్లు పోలీసులు చెబుతున్నా కొందరు వాటిని పెడచెవిన పెడుతున్నారు. దీంతో జరిమానాలు భారీగా పెంచేశారు ట్రాఫిక్ పోలీసులు. అయితే పట్టుబడ్డప్పుడు చూసుకోవచ్చులే అనే నిర్లక్ష్యంతో కొందరు హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరుజిల్లా నగరి పట్టణ పరిధిలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై ఆదివారం పోలీసులు దృష్టి సారించారు. ఓంశక్తి ఆలయం సమీపంలోని బైపాస్ సర్కిల్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిని ఆపి జరిమానా కింద హెల్మెట్‌ను అందజేశారు. రూ.500 జరిమానాకు బదులుగా రూ.535కే హెల్మెట్ ఇవ్వడంతో వాహనదారులు జరిమానాకు బదులుగా హెల్మెట్లను కొనుగోలు చేసుకున్నారు. వాహనాలపై సుదూరం ప్రయాణించేవారు క్షేమంగా వెళ్లి తిరిగి ఇళ్లకు చేరుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ విక్రమ్ తెలిపారు. -
వాహన చోదకురాలి తిరుగుబాటు
అచ్యుతాపురం(యలమంచిలి): తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా పరిమితికి మించి అపరాధ రుసుము వసూలు చేయడం అన్యాయమంటూ ఓ వాహనచోదకురాలు పోలీసులకు ఎదురుతిరగడం చర్చనీయాంశమైంది. పైగా ఆమె పోలీసు స్టేషన్లో ఐదుగంటలపాటు నిరసన వ్యక్తం చేసి కలకలం రేపింది. వివరాలివీ.. మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన రాజాన దేవి అనే మహిళ ఆదివారం బైక్‌పై అచ్యుతాపురం మండలంలోని ఎస్ఈజెడ్ పరిశ్రమల వైపు వెళ్తోంది. వాహన తనిఖీల్లో భాగంగా అచ్యుతాపురం ఎస్ఐ దీనబంధు ఆమె బైక్‌ను ఆపి రికార్డులు చూపమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, లైసెన్స్ చూపకపోవడంతో రూ.635 పెనాల్టీ విధించారు. అయితే ఆమె పెనాల్టీ చెల్లించడానికి నిరాకరించింది. తనవద్ద అన్నిరికార్డులు ఉన్నాయని ఆమె ఎస్ఐకు తెలిపింది. హెల్మెట్ విషయానికి వస్తే రూ.100కు మించి ఫైన్ వేయడానికి లేదని వాదించింది. వాహనాన్ని నిలిపే హక్కు పోలీసులకు లేదని వాదించింది. అంతేకాకుండా వాహనాన్ని స్టేషనుకు తరలించగా, స్టేషన్లోనే ఆమె ఐదు గంటలపాటు నిరసన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ వచ్చి సంజాయిషీ ఇస్తేనే ఇంటికి వెళ్తానని భీష్మించుకు కూర్చుంది. దీంతో పోలీసులు కంగుతిన్నారు. దీనిపై ఎస్ఐ దీనబంధు మాట్లాడుతూ వాహనం తనిఖీ సమయంలో రికార్డులు చూపకపోవడంతో నిబంధనల ప్రకారం అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. ఆ తరువాత ఆమె రికార్డులను తీసుకువచ్చి చూపడంతో రుసుము తగ్గించడానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. కాగా పోలీసులంటే భయపడేలా తనిఖీలు నిర్వహిస్తున్నారని, రికార్డులున్నప్పటికీ వేలల్లో అపరాధ రుసుము వసూలు చేస్తున్నారని నిత్యం పోలీసులు వాహచోదకులను దోచుకుంటున్నారని దేవి స్టేషన్లోనే పోలీసుల తీరును ఎండగట్టింది. ఎట్టకేలకు ఆమెకు పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించేశారు. -
నేటి నుంచి నో పెట్రోల్..!
-
రేపటి నుంచి నో పెట్రోల్..!
అమరావతి : హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు, సీట్ బెల్టులు పెట్టుకోని డ్రైవర్లకు ఇధనాన్ని సరఫరా చేయరాదంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేశారు. గురువారం ఉదయం నుంచే ఈ నిబంధన అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారి భద్రతపై బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ మేరకు తీసుకున్న కఠిన నిర్ణయాలను సీఎంవో మీడియాకు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యాంశాలివి.. ⇒ హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఏపీలో ఇక తప్పనిసరి ⇒ రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు ⇒ రహదారి భద్రత కోసం వినియోగించే పరికరాల కొనుగోలుకు రూ.10 కోట్లు విడుదల ⇒ రవాణా వాహనాల యజమానులు తమ డ్రైవర్లకు ‘ఇంటి దగ్గర మీకోసం ఎదురుచూసే మనుషులున్నారు జాగ్రత్త’ అని బయలుదేరే సమయలో చెప్పాలి. ⇒ పోలీసు, రవాణా శాఖల్లో జవాబుదారితనం మరింత పెరగాలి. ⇒రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై గుర్తించిన బ్లాక్ జోన్స్‌లో అసలు ఇబ్బంది ఏమిటో సత్వరమే గుర్తించి సరిచేయాలి. దీనిపై జాతీయ రహదారులు, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయం చేసుకుని సమస్యను సత్వరం పరిష్కరించాలని సీఎం ఆదేశం ⇒ ప్రమాదాలకు కారణం అవుతున్న ఓవర్ లోడ్ ఆటోలను నియంత్రించాలి. ⇒ హదారి భద్రత పట్ల ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి. ⇒నెలవారీ సమీక్షలో అధికారుల అలసత్వం తేలితే కఠిన చర్యలు ఎక్కువ శాతం ప్రమాదాలు కాపలా లేని కూడళ్లలో జరుగుతున్నాయి, అలాంటి చోట తక్షణమే కాపలా ఏర్పాటు చేయాలి. ⇒ పట్టణ ప్రాంతాల్లో, జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశం. అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్ వినియోగించుకోవాలని సూచన. ⇒ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన శిక్షలు తప్పవు. ⇒ అన్ని స్కూల్ బస్సులకు, ఇతర పాసింజర్ వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి ⇒ రాష్ట్రంలోని అన్ని వాహనాలకు జిపీయస్ అమర్చే అంశంపై పరిశీలన ⇒ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు, ట్రామాకేర్ సెంటర్ల వివరాలు వంటి అవసరమైన సమాచారం లభించేలా ఒక ప్రత్యెక యాప్ తయారు చేయాలని సీఎం సూచన ⇒ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, పోలిస్, రవాణ శాఖలు సంయుక్తంగా పని చేయడం వల్లే ఇది సాద్యమైందని కితాబు. ⇒ ప్రమాదాల్లో వెన్నుముక దెబ్బతిని శాశ్వత వైకల్యం పొందిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశం పరిశీలన ⇒ రహదారుల భద్రతకు వినియోగిస్తున్న వాహనాలు, 108 వంటి వాహనాలన్నీ జియో ట్యాగింగ్ చేయాలని, ప్రమాద సమాచారం దగ్గరలో ఉన్న అన్ని వాహనాలకు అందేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు. -
మా ఇష్టం.. ఆపేదెవరు?
ముగ్గురు వ్యక్తులు పాతకాలం నాటి స్కూటర్లను బయటకు తీశారు. ఒక్కదానికీ నెంబర్ ప్లేట్ లేదు. ఒక్కరూ హెల్మెట్ కూడా ధరించలేదు. పైగా బరువైన బస్తాలతో దూసుకెళుతున్నారు. పోలీసులు సాధారణ వాహనదారులను రకరకాల కారణాలతో నిలపడమో.. హెల్మెట్ లేకుంటే చలాన్ విధించడమో చేస్తారు. లేదంటే వేగంగా వెళ్లేవారిని ఫొటో తీసి ఆన్లైన్లో చాలాన్ పంపిస్తారు. వీరు వెళ్లే మార్గంలో అనేక ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయి.. అక్కడ పోలీసు సిబ్బందీ ఉన్నారు. కానీ ఒక్కరూ నిలువరించలేదు. ఇదేంటని అడగనూ లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై కనిపిందీ దృశ్యం. – ఫొటో: గడిగె బాలస్వామి -
హెల్మెట్ వల్లే ప్రాణాలు నిలిచాయి
ఎస్పీ సత్యయేసుబాబు ఒంగోలు : హెల్మెట్ ధరించడం వల్లే అతని ప్రాణాలు నిలిచాయని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన మద్దాళి కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయన పనిమీద నెల్లూరు నుంచి చిలకలూరిపేటకు తన రాయల్ ఎన్ఫీల్డ్ బండిపై వెళుతుండగా తిమ్మనపాలెం సమీపంలో టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు మీద పడిపోయాడని తెలిపారు. పడిపోయిన సమయంలో కళ్యాణ్ తల బలంగా రోడ్డుమీద ఉన్న డివైడర్‌కు తగిలిందని, ఈ క్రమంలో హెల్మెట్ డ్యామేజి అయిందే కానీ, అతని తలకు ఎటువంటి గాయం కాకపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడన్నారు. అయితే భుజానికి తగిలిన గాయంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు. వాహనదారులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకే హెల్మెట్ ధరించాలని ఎస్పీ సత్యయేసుబాబు విజ్ఞప్తి చేశారు. -
హెల్మెట్ తప్పనిసరి.. లేకపోతే..
విజయవాడ: రేపటి నుంచి విజయవాడలో హెల్మెట్ ధరించటం తప్పనిసరి అని డీసీసీ కాంతిరాణా టాటా తెలిపారు. హెల్మెట్ లేని వాహనదారులకు మొదటి సారి అయితే రూ.100 జరిమానాతో వదిలి వేస్తామని చెప్పారు. మళ్లీ మళ్లీ దొరికిపోతే జరిమానా మొత్తం పెరగటంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నామని అన్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయని, ఇందులో బాధితులు అధిక శాతం ద్విచక్రవాహనదారులేనని ఆయన చెప్పారు. శిరస్త్రాణం తనిఖీలకు విజయవాడలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సిటీపోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. -
ఆఫీస్‌లో హెల్మెట్ తప్పనిసరి!!
రయ్ రయ్‌మంటూ.. దూసుకుపోయే ద్విచక్రవాహనదారుడికి... నెత్తిమీద హెల్మెట్ లేదంటే ఎక్కడోచోట బ్రేక్ పడాల్సిందే. ఫైన్ కట్టాల్సిందే. అందుకే చాలా మంది తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకునే ప్రయాణాలు చేస్తుంటారు. అదే అన్నివిధాలా సురక్షితం కూడా!! కానీ బీహార్‌కు చెందిన ఆ ప్రభుత్వ ఉద్యోగులకి బైక్ దిగి.. ఆఫీస్‌లోకి వెళ్లిన తరువాత కూడా హెల్మెట్ తీసే పరిస్థితి లేదు. అదేంటి బీహార్ పోలీసులు ఏమైనా కొత్త రూల్ తెచ్చారా!? అని ఆలోచిస్తున్నారు కదూ!?! అదే మీ ఆలోచనైతే మీరు తప్పులో కాలేసినట్లే! బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఆరెరాజ్లోని ఒక ప్రభుత్వ భవనం శిథిలావస్తకు చేరుకుని రెండేళ్లవుతోంది. ఎక్కడిక్కడ పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. అయినా సరే అక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. అందులో పనిచేసే ఉద్యోగులు ప్రాణరక్షణ కోసం హెల్మెట్లు ధరించి మరీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులు ఇంత ఇబ్బంది పడుతున్నా అక్కడి సర్కారు పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నిర్లక్ష్యం ఖరీదు...
చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నది. హెల్మెట్లు, సీటు బెల్టులు పెట్టుకోకపోవడంతో 2016లో రోజుకు 43 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 28 మంది ద్విచక్ర వాహనదారులుండగా, సీటు బెల్టు పెట్టకోని వారు 15 మంది వరకూ ఉంటారని రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 31 మంది మరణించారు. ఇది 2005లో 21 మరణాలుగా నమోదైతే 2015 నాటికి ప్రతి వంద ప్రమాదాల్లో మృత్యువాతన పడే వారి సంఖ్య ఆందోళనకరంగా 29కు చేరింది. హెల్మెట్ లేని కారణంగా సంభవిస్తున్న మరణాలపై పోలీసులు, రాష్ట్ర రవాణా సంస్థలు సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం ఇదే తొలిసారి. ప్రతి ఐదు బైక్ ప్రమాదాల మృతుల్లో ఒక మరణం హెల్మెట్ ధరించనందునే జరుగుతున్నదని ఈ తరహా మరణాలు 10.135 చోటుచేసుకున్నాయని రాష్ట్రాలు పేర్కొన్నాయి. 3818 మరణాలతో ఈ తరహా మృతుల్లో యూపీ టాప్‌లో ఉంది. ఇక తమిళనాడులో 1946, మహారాష్ట్రలో 1113 మరణాలు హెల్మెట్ ధరించని కారణంగా జరుగుతున్నాయని గణాంకాలు పేర్కొన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కార్లలో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా ఆయా ప్రమాదాల్లో గత ఏడాది 5638 మంది మరణించారు. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించడం వల్ల 42 శాతం మేర మరణాలను నివారించవచ్చని గత ఏడాది ఐక్యరాజ్యసమితి అథ్యయనం అంచనా వేసింది. -
సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత