
జయచంద్ర ప్రసాద్‌ను అభినందిస్తున్న సీపీ గౌతం సవాంగ్
విజయవాడ: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని నగరంలో 4వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ప్రచార కార్యక్రమం చేపట్టారు. కృష్ణలంకకు చెందిన జయ చంద్రప్రసాద్ అనే బాలుడు రెండు వారాలుగా చిన్న సైకిల్‌తో హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఆ బాలుడు కమిషనరేట్‌లో సీపీ డి.గౌతం సవాంగ్‌ను కలిశాడు. ప్రతి రోజు తాను స్కూల్ నుంచి వచ్చిన తరువాత యూజ్ యువర్ హెల్మెట్ అనే బోర్డుతో హెల్మెట్ పెట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు సీపీకి వివరించాడు. ఈ సందర్భంగా సీపీ బాలుడిని అభినందించారు. ఈ బాలుడి కార్యక్రమం స్ఫూర్తిగా అందరూ హెల్మెట్ ధరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment