గాయపడిన దుర్గయ్య
నాగోలు: జర్నలిస్ట్‌పై దాడిచేయమేగాక కులం పేరుతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాన్సురాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తీలో నివాసం ఉంటున్న కేదరి దుర్గయ్య ఓ పత్రికలో రిపోర్టర్ పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతను తన స్నేహిఉతుడ లింగయ్యతో కలిసి హయత్‌నగర్ నుంచి బైక్‌పై ఇంటికి తిరగి వస్తుండగా ప్రెస్ కాలనీ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు కారణమైన కారు డ్రైవర్‌ను పక్కకు జరగాలని దుర్గయ్య కోరాడు. దీంతో ఆగ్రహానికిలోనైన కారు డ్రైవర్ నెహంత్ కుమార్ దుర్గయ్యపై దాడికి దిగాడు. లింగయ్య అతడిని అడ్డుకోగా నెహంత్ కుమార్ తండ్రి విజయ్‌కుమార్ తన చేతిలో ఉన్న హెల్మెట్‌తో దుర్గయ్యపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment