
కరోనా వైరస్ కట్టడికి పోలీసులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. పంజగుట్ట లోని ఓ వ్యక్తి క్రికెట్ ఆడే సమయంలో వాడే హెల్మెట్ పెట్టుకొని రోడ్డుపైకి వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నించగా.. ఇదికూడా హెల్మెటే కదా సార్ అంటూ జవాబివ్వడంతో వదిలేశారు.
ఇరుగుపొరుగే.. తోడయ్యారు..
భర్త మృతి చెందడంతో ఇరుగు పొరుగున ఉండే మహిళలు, బంధువులు ఆమెను చివరి చూపునకు తీసుకెళ్తూ శ్రీనగర్ కాలనీలో కనిపించారు. కరోనా భయంతోమహిళలంతా మాస్కులతో అంతిమయాత్రకు తరలివెళ్లారు.
రైలు మార్గంలో.. సొంత రాష్ట్రానికి..
రైలు మార్గంలో వెళ్తే దూర భారం తగ్గుతుందని భావించిన వలస కార్మికులు రైలు పట్టాల మధ్యలో నడుచుకుంటూ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. సోమవారం మాదాపూర్ నుంచి వెస్ట్‌బెంగాల్‌కు వెళ్తుండగా ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు.- ఫొటోలు: దయాకర్ తూనుగుంట్ల