కరోనాకు తోడు అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. వర్షాల కారణంగా నిండా మునిగామని, ఆదుకోవాలని పాలకులకు విన్నవించుకుంటున్నారు. కరోనా కట్టడికి దేశంలో అమలు చేస్తున్న ఆంక్షలతో నగరాల్లో ఉపాధి లేకపోవడంతో వలస కార్మికులు గ్రామాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. మరోవైపు సూర్యుడి చుట్టూ రంగురంగుల ఇంద్ర ధనుస్సు (సన్‌హాలో) బుధవారం కనువిందు చేసింది.
1/9
నిర్ణీత సమయంలోపు స్వస్థలాలకు చేరుకోవాలని ప్రభుత్వం పోలీసులు ఎంత చెప్పినా మార్పు రావడం లేదు. లాక్‌డౌన్ మినహాయింపు సమయం తగ్గిన తర్వాత కూడా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఇలా వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. చాలా సమయం ట్రాఫిక్ నిలిచింది.
2/9
కరోనా కోరలు చాచి సిద్ధంగా ఉంది. అయినా జనాలు భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం లేదు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్ ఇలా జనాలతో కిక్కిరిసి ఇలా కనిపించింది.
3/9
విద్యుత్ దీపాల ట్రయల్ రన్‌తో బుధవారం బంగారు కాంతుల్లో మెరిసిపోతున్న యాదాద్రి క్షేత్రం
4/9
జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. బుధవారం పిట్లం–బాన్సువాడ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పంట చేతికొచ్చి రెండు నెలలైందని, ఇప్పటికే వర్షాలకు తడిసి మొలకలెత్తుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. మొలకెత్తిన జొన్నలను ప్రదర్శించారు.
5/9
ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం ముంబైలోని తూర్పు బోరివలిలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు
6/9
హైదరాబాద్: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఏర్పడిన ఇంద్రధనుస్సు అందరినీ కట్టిపడేసింది.
7/9
ముంబైలోని జై వకీల్ ఫౌండేషన్ వ్యాక్సినేషన్ సెంటర్‌లో బుధవారం టీకా తీసుకున్న అనంతరం ఫొటో దిగుతున్న ఓ దివ్యాంగుడు.
8/9
ఫొటోలో ఉన్నవి 560 మందికిపైగా కోవిడ్ బాధితులకు సంబంధించిన అస్థికలు. తమ వారి అస్థికలే అంటూ ఇంతవరకూ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అస్థికలన్నీ ఒకేసారి కావేరీ నదీజలాల్లో కలిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా బెలవకాడి గ్రామంలో బుధవారం తీసిందీ ఫొటో.
9/9
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) బయట మరమ్మతు చేసేందుకు స్పేస్‌వాక్ చేస్తున్న రష్యా వ్యోమగాములు ఒలెగ్ నోవిట్సీ, ప్యోటర్ దుబ్రోవ్. ఐఎస్‌ఎస్‌కు వచ్చాక వీళ్లకు ఇదే తొలి స్పేస్‌వాక్. కొత్త మల్టీపర్సస్ ల్యాబొరేటరీ అనుసంధానం కోసం అక్కడి పాత భాగాలను పక్కకతీస్తూ, పాత బ్యాటరీలు మారుస్తూ 7 గంటలు వారు ఐఎస్‌ఎస్ బయట గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment