Farmers Protest
-
శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్-హర్యానాలోని శంభు సరిహద్దు(Shambhu border) వద్ద 13 నెలలుగా ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రైతులు నిర్మించిన తాత్కాలిక వేదికను, టెంట్లను తొలగించారు. రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పాంధర్ సహా దాదాపు 200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ పోలీసుల చర్యలపై బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | पुलिस ने पंजाब-हरियाणा शंभू बॉर्डर पर किसानों द्वारा बनाए गए अस्थायी मंच से पंखों को हटाया। किसान यहां विभिन्न मांगों को लेकर धरने पर बैठे थे। प्रदर्शनकारी किसानों को मौके से हटाया जा रहा है। pic.twitter.com/tbZw7TDqzA— ANI_HindiNews (@AHindinews) March 19, 2025పటియాలా ఎస్ఎస్పీ నానక్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘శంభు సరిహద్దులో రైతులు చాలా కాలంగా నిరసనలు చేపడున్నారు. డ్యూటీ మేజిస్ట్రేట్(Duty Magistrate) సమక్షంలో పోలీసులు రైతులకు ముందస్తుగా హెచ్చరిక జారీచేశాకనే, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశాం. కొంతమంది రైతులను బస్సులలో వారి ఇంటికి పంపించామని అన్నారు. ఇక్కడి నిర్మాణాలు, వాహనాలను కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. రోడ్డును క్లియర్ చేసి, వాహనాల రాకపోకల కోసం తెరుస్తామన్నారు. రైతుల నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకపోవడంతో తాము ఎటువంటి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాలేదని, రైతులు తమకు సహకరించారని నానక్ సింగ్ అన్నారు.#WATCH | पुलिस ने पंजाब-हरियाणा शंभू बॉर्डर से किसानों को हटाया जो विभिन्न मांगों को लेकर धरने पर बैठे थे। pic.twitter.com/UspNUmgY5R— ANI_HindiNews (@AHindinews) March 19, 2025ఈ తొలగింపులకు ముందుగా ఇక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. శంభు సరిహద్దు వద్ద రైతులు నిర్మించిన తాత్కాలిక షెల్టర్లను కూల్చివేయడానికి బుల్డోజర్లను ఉపయోగించారు. పంజాబ్ పోలీసులు.. రైతు నాయకులను అదుపులోకి తీసుకోవడంపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ తాను పంజాబ్ ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నానని, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గుపడాలని, కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలకు పరిష్కారం దొరకాలని ఆప్ ప్రభుత్వం కోరుకోవడంలేదని ఆయన విమర్శించారు.ఇది కూడా చదవండి: సునీత లానే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ‘హీరో’ -
దలేవాల్ బతికుండాలా? చనిపోవాలా?
న్యూఢిల్లీ: రైతాంగం సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా పంజాబ్–హరియాణా సరిహద్దులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్య సాయం అందించడానికి అడ్డు తగులుతున్న రైతు సంఘాల నాయకులు, రైతులపై మండిపడింది. వారు నిజంగా దలేవాల్‌కు శ్రేయోభిలాషులు కాదని ఆక్షేపించింది. దలేవాల్‌ను ఆసుపత్రికి ఎందుకు తరలించడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నెల 31వ తేదీలోగా ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నుంచి సాయం తీసుకోవచ్చని సూచించింది. దలేవాల్‌కు వైద్య చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీక్షలో ఉన్న దలేవాల్ చుట్టూ రైతులు మోహరించారని, ఆయనను ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకుంటున్నారని, తమ ప్రభు త్వం నిస్సహాయ స్థితిలో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇదంతా జరగడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దలేవాల్ చుట్టూ కోట కట్టడానికి అనుమతి ఉందా? దీక్షా స్థలానికి భారీ సంఖ్యలో రైతు లు ఎలా చేరుకున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరోగ్యం క్షీణించి తక్షణమే వైద్య చికిత్స అవసరమైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా చుట్టుముట్టడం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. చికిత్స తీసుకోవడానికి దలేవాల్ అంగీకరించడం లేదని, ఎంత ఒప్పించినా ఫలితం ఉండడం లేదని, దీక్ష విరమిస్తే ఉద్యమం బలహీనపడుతుందని ఆయన భావిస్తున్నారని గుర్మీందర్ సింగ్ చెప్పారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని, అందుకే వెనుకంజ వేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాస నం అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభు త్వం సక్రమంగా వ్యవహరించడం లేదని పేర్కొంది. రైతు సంఘాల నాయకుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం నేరమేనని, ఆత్మహత్యకు పురికొల్పినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. దలేవాల్ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్లాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘కొందరు రైతు సంఘాల నేతల ప్రవర్తనపై మేము ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారు స్పందించడం లేదు. వారేం నాయకులు? దలేవాల్ బతికి ఉండాలని కోరుకుంటున్నారా? లేక దీక్ష చేస్తూ చనిపోవాలని కోరుకుంటున్నారా? వారి ఉద్దేశం ప్రశ్నార్థకంగా ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం విరుచుకుపడింది. సెలవు రోజునా ప్రత్యేక విచారణ సుప్రీంకోర్టుకు సాధారణంగా సెలవుదినం. రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమై విచారణ చేపట్టింది. -
రైతులపైకి టియర్‌గ్యాస్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు ప్రాంతం మళ్లీ రణరంగంగా మారింది. పంటలకు మద్దతు ధరతో సహా పలు డిమాండ్లతో రైతు సంఘాలకు చెందిన 101 మంది రైతులు మధ్యాహ్నం మరోసారి శాంతియుతంగా చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడం గత పది రోజుల్లో ఇది మూడోసారి. రైతులను అడ్డుకునేందుకు పోలీసులను భారీగా మోహరించారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అంబాలా డిప్యూటీ కమిషనర్ రైతులతో సుమారు 40 నిమిషాలసేపు చర్చలు జరిపారు. రైతుల ఆందోళనలకు సంబంధించి 18న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు సంయమనం పాటించాలని కోరారు. అయినా రైతులు ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దాంతో 17 మంది రైతులు గాయాలపాలైనట్లు సమాచారం. రైతులు తమ సొంత వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శంభు చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈనెల 17 వరకు మొబైల్, ఇంటర్నెట్‌సేవలు నిలిపివేసింది. హరియాణాకు చెందిన రెజ్లర్, కాంగ్రెస్ నేత భజరంగ్ పునియా శంభు సరిహద్దు చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. డల్లేవాల్ ఆరోగ్యం విషమం ఖన్నౌరీలో 19 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం విషమంగా మారిందని రైతు నేతలు చెబుతున్నారు. ఆయనకు చికిత్స అందించాలని కేంద్రాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. కానీ చికిత్స తీసుకునేందుకు డల్లేవాల్ నిరాకరిస్తున్నారు. ‘రైతుల కోసం దీక్ష చేస్తున్నా. వారి నడుమే చివరి శ్వాస తీసుకుంటాను’’ అని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఆయన బెడ్‌ను శుక్రవారం ఆందోళన వేదిక వద్దకే మార్చారు.16న ట్రాక్టర్ ర్యాలీ రైతులపై పోలీసుల బలప్రయోగాన్ని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పంథేర్ తీవ్రంగా ఖండించారు. ‘’మార్చ్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లే 101 మంది రైతుల కారణంగా శాంతి భద్రతలకు భంగమెలా కలుగుతుంది? పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చిస్తున్నారు. రైతుల ఆందోళనలను అణచివేయాలని ఏ రాజ్యాంగం చెప్పింది?’’ అని మీడియాతో ఆయన అన్నారు. పార్లమెంట్లో రైతుల సమస్యలపై చర్చనే జరగలేదని ఆక్షేపించారు. ‘‘మా కార్యాచరణలో భాగంగా సోమవారం పంజాబ్ మినహా మిగతా చోట్ల ట్రాక్టర్ మార్చ్ ఉంటుంది. 18న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా పంజాబ్‌లో రైల్ రోకో చేపడతాం’’ అని ప్రకటించారు. -
వైఎస్ఆర్ సీపీ ప్రజా పోరాటాలు
-
రణరంగంగా శంభు సరిహద్దు.. రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం
Live Updates..👉పంజాబ్-హర్యానా సరిహద్దులు రణరంగంలా మారాయి. రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దు వద్ద రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, రైతులు ముందుకు కదలడంతో పోలీసులు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే, వాటర్ కెనాన్లను రైతులపైకి ప్రయోగించారు. టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రులకు తరలించారు. #WATCH | Drone visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers protesting over various demands have been stopped from heading towards DelhiPolice used water cannon, tear gas to disperse the farmers. pic.twitter.com/W54KhOMqZa— ANI (@ANI) December 14, 2024#WATCH | Police use tear gas and water cannon to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/lAX5yKFarF— ANI (@ANI) December 14, 2024 #WATCH | Police use tear gas and water cannon to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/tDMTy8iGXU— ANI (@ANI) December 14, 2024#WATCH | Farmers begin their 'Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border; police personnel present at the spot pic.twitter.com/Uq8zTrbXjo— ANI (@ANI) December 14, 2024 👉పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమంలో నేడు మళ్లీ కొనసాగనుంది. ఈ మేరకు రైతులు సన్నద్దమవుతున్నారు. ఢిల్లీ చేరుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. 👉ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి బయలుదేరనుంది. ఇక, రైతుల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.#WATCH | Visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. According to farmer leader Sarwan Singh Pandher, a 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon. pic.twitter.com/Tfb1F8dSqE— ANI (@ANI) December 14, 2024👉 మరోవైపు.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. నేటి నుంచి ఈనెల 17వ తేదీ వరకు ఈ సేవలను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. 👉ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. రైతులు ఆందోళనలు చేపట్టి నేటి 307 రోజులు అవుతోంది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని మేమందరం కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ క్రమంలోనే మార్చ్ తలపెట్టాం. దేశం మొత్తం రైతులకు అండగా నిలుస్తోంది. కానీ, ప్రధాని మోదీ మాత్రం మౌనం వహిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.ఇక, ఇప్పటికే రెండు సార్లు రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. -
YSRCP పోరుబాట విజయవంతం.. వైఎస్ జగన్ ట్వీట్
-
కూటమి మోసాలపై రోడ్డెక్కిన అన్నదాతలు
-
బాబు దగా పాలనపై రైతన్న తొలిపోరు విజయవంతం
సాక్షి, అమరావతి: అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం చేపట్టిన రైతు పోరును అడ్డుకునేందుకు చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని నాయకులు, రైతులపై బెదిరింపులు.. హౌస్ అరెస్టులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా తమ డిమాండ్లు వినిపించడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ శుక్రవారం రైతులతో కలసి భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించింది. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పేర్కొంటూ అన్నదాతలతో కలసి వైఎస్సార్సీపీ నేతలు కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. కూటమి సర్కార్ దగాను నిరసిస్తూ చేపట్టిన తొలి పోరాటం గ్రాండ్ సక్సెస్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. రైతులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అభినందిస్తూ ‘ఎక్స్’ వేదికగా తన ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» దగా పాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయింది. చంద్రబాబు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరు నెలల కాలంలోనే చంద్రబాబుపై వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతకు ఇవాళ్టి కార్యక్రమం అద్దం పట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. » చంద్రబాబూ..! ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు ఎందుకు ఇవ్వడం లేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఈ–క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300–400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా? » దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొస్తే.. ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డు పడటం చంద్రబాబు రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. » మరోవైపు నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలసి చంద్రబాబు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సరి్టఫికెట్లను వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా వాటిని ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? తహశీల్దార్ కార్యాలయాలకు రమ్మని చెప్పి అక్కడ పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారితో దాడులు చేయించడం న్యాయమేనా? నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా? ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు చేయడం మీ అరాచక పాలనకు నిదర్శనం కాదా? ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? అలాంటప్పుడు నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? మీకు నచి్చనవారిని నామినేట్ చేసుకుంటే సరిపోతుందిగా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఓవైపు గప్పాలు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేయడం నిజం కాదా? అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుంది. రైతుల తరఫున ఎప్పుడూ వారికి అండగా ఉంటూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది. -
దగాకోరు పాలనపై ఛెళ్లుమన్న చర్నాకోల!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అన్నదాతలు ఆగ్రహోదగ్రులయ్యారు! టీడీపీ కూటమి సర్కారు నయవంచక పాలన, చంద్రబాబు మోసాలపై రైతన్నలు ఛర్నాకోల ఝుళిపించారు! ఎడ్ల బండ్లు.. వరి కంకులు.. ధాన్యం బస్తాలతో ‘రైతు పోరు’లో కదం తొక్కారు!! అన్నం పెట్టే రైతన్నను కూటమి ప్రభుత్వం దగా చేయటాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం నిర్వహించిన రైతు పోరుకు అన్నదాతలు ఉవ్వెత్తున తరలి వచ్చారు. ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి ర్యాలీల్లో పాల్గొన్నారు. వరి కంకులు చేతబట్టి కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్ల తరబడి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లలో డిమాండ్ పత్రాలను అందచేశారు. ధాన్యం బస్తాలను నెత్తిపై పెట్టుకుని మోస్తూ నిరసన తెలియచేశారు. కాలి నడకన కదం తొక్కారు. సీఎం.. డౌన్ డౌన్! అంటూ ఎలుగెత్తి నినదిస్తూ తమ ఆక్రందన చాటారు. భీమవరం, రాజమహేంద్రవరం, కాకినాడ, బాపట్ల, నెల్లూరు, కర్నూలు.. ఒక ప్రాంతం అనే తేడా లేకుండా కలెక్టరేట్లకు దారి తీసే ప్రాంతాలన్నీ అన్నదాతల పద ఘట్టనలతో ఎరుపెక్కాయి!! వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను ఉసిగొల్పి గృహాల్లో నిర్బంధించినా.. నిరసనలో పాల్గొనడానికి కదలి వస్తున్న రైతులపై ఖాకీలు బెదిరింపులకు దిగినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిరసిస్తూ.. అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. తక్షణమే పెట్టుబడి సాయంగా రూ.20 వేలు అందించాలని.. పండించిన ధాన్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ఉచిత పంటల బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని నినదిస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో రైతులు కదం తొక్కారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు వైఎస్సార్సీపీ నేతలతో కలసి డిమాండ్ పత్రాలు అందజేశారు. ఆరు నెలల చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు అండగా నిలుస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన తొలి పోరాటం విజయవంతమవడంతో పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిసలాడుతోంది. అక్రమ అరెస్టులు.. నిర్బంధాలతో బెదిరించినా.. కూటమి ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద అన్నదాతలకు ఇవ్వాల్సిన రూ.20 వేలు ఇంతవరకూ ఇవ్వకపోవడం.. పండించిన ధాన్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. అన్నదాతను కుడి, ఎడమల దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున రైతులతో ర్యాలీలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలతో తరలి వచ్చారు. దీన్ని పసిగట్టిన కూటమి ప్రభుత్వ పెద్దలు వైఎస్సార్సీపీ నేతలు, రైతులపై పోలీసులను ఉసిగొలిపారు. ఉదయమే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్టులు చేశారు. ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న రైతులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే పోలీసుల బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా జిల్లా కేంద్రాలకు రైతులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వైఎస్సార్సీపీ సారథ్యంలో నిర్వహించిన ర్యాలీల్లో కదం తొక్కారు. కూటమి సర్కారు మోసాలను ఎండగడుతూ అనకాపల్లి టౌన్ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ వరకూ వందలాది మంది రైతులతో కలసి కార్యకర్తలు, నాయకులు 5 కి.మీ. మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ, కర్నూలు సహా అన్ని ప్రాంతాల్లోను వరి కంకులను చేతపట్టుకుని నిరసన తెలిపారు. నెత్తిన ధాన్యం బస్తాలతో ర్యాలీ రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ధాన్యం బస్తాలు నెత్తిన పెట్టుకుని బొమ్మూరు నుంచి కలెక్టరేట్ వరకూ 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎడ్ల బండ్లపై ర్యాలీలు... నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం నగరాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఎడ్ల బండ్లపై ర్యాలీల్లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొద్దునిద్ర నటిస్తున్న ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో ఉద్రిక్తత..విజయవాడలో పోలీసు వలయాలను ఛేదించుకుని కలెక్టరేట్‌కు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో మ్యూజియం రోడ్డుకు చేరుకున్న నేతలు, రైతులను పోలీసు బలగాలు అడ్డుకుని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. గుణదలలోని తన ఇంటి నుంచి కలెక్టరేట్‌కు బయలుదేరిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను నైస్ బార్ వద్ద నడిరోడ్డుపై అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు తరలించారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును బయటికి రాకుండా అడ్డుకోవడంతో ఇంటి లోపల కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ను హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారు. పార్టీ నందిగామ ఇన్చార్జి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి తదితరులను అరెస్టు చేశారు. -
రైతు కోసం వైఎస్సార్సీపీ పోరుబాట.. వైఎస్ జగన్ ట్వీట్
చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్సీపీ బాసట.. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు.. -
రైతులపై టియర్ గ్యాస్.. ఢిల్లీ చలో వాయిదా
ఢిల్లీ : కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం ఆదివారం వాయిదా పడింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో శంభు సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి వందలాది మంది రైతులు పాదయాత్రగా ఢిల్లీ చలో కార్యక్రమాన్నిపున:ప్రారంభించారు. అయితే రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో కార్యక్రమంపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు శంభు సరిహద్దులో భారీ ఎత్తున మోహరించారు. పాదయాత్రగా తరలివస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. పాదయాత్ర సాగకుండా ఇనుపు కంచెలు ఏర్పాటు చేయడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆదివారం చేస్తున్న ఢిల్లీ చలో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ పాదయాత్రపై సోమవారం తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు సరిహద్దు నుంచి ముందుకెళుతున్న రైతులపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారురైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారుటియర్ గ్యాస్ ప్రయోగంతో రైతులు చెల్లాచెదురయ్యారు.తమకు చెప్పిన 101 మంది ఇతరులు ర్యాలో పాల్గొన్నారంటున్న పోలీసులు అందుకే అడ్డుకున్నామని సమర్థింపు #WATCH | Farmers' 'Dilli Chalo' march | Visulas from the Shambhu border where Police use tear gas to disperse farmers"We will first identify them (farmers) and then we can allow them to go ahead. We have a list of the names of 101 farmers, and they are not those people - they… pic.twitter.com/qpZM8LK1vw— ANI (@ANI) December 8, 2024 పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరు కొనసాగిస్తున్నారు.డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ ఆదివారం(డిసెంబర్8) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.#WATCH | Farmers begin their "Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border, protesting over various demands. pic.twitter.com/9EHUU2Xt1j— ANI (@ANI) December 8, 2024 ‘ఢిల్లీ చలో’ నేపథ్యంలో దేశ రాజధాని శంభు సరిహద్దు వద్ద ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొందిరైతుల ర్యాలీని అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను సిద్ధంగా ఉంచారు.#WATCH | Morning visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. A 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon according to farmer leader Sarwan Singh Pandher pic.twitter.com/NG9VfXL6cg— ANI (@ANI) December 8, 2024సరిహద్దు వద్ద కవరేజీకి మీడియాకు అనుమతి నిరాకరించిన పోలీసులుఇది పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేసి కుట్ర అని ఆరోపించిన రైతులుగత ఆందోళనల్లో మీడియా ప్రతినిధులు గాయపడ్డారంటున్న పోలీసులు#WATCH | SSP Patiala, Nanak Singh says, "Media has not been stopped. We have no such intentions. But, it was needed to brief the media. Last time we came to know that 3-4 media people were injured. To avoid that we briefed the media... We will try not to let this happen - but if… https://t.co/bStxTaLs8x pic.twitter.com/iacEB95jHQ— ANI (@ANI) December 8, 2024 నిజానికి శుక్రవారం నుంచే చలో ఢిల్లీ మలి విడత మొదలైంది.రైతుల ర్యాలీపై హర్యానా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో మొత్తం 16 మంది గాయపడ్డారు.. వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారు:రైతు నేతలుపలువురు రైతులు గాయపడడంతో శనివారం ర్యాలీని నిలిపివేశాం.తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు.మాతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే చలో ఢిల్లీని ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం. -
రైతుల ఢిల్లీ చలో వాయిదా..
farmers Protest Live Updates...👉ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఢిల్లీ మార్చ్‌పై రైతులు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో చర్చలు విఫలమైతే డిసెంబర్ 8న మార్చ్ చేస్తామని రైతులు తెలిపారు. ఢిల్లీ చలో నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉదద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. #WATCH | At the Shambhu border, farmer leader Sarwan Singh Pandher says, "Now 'Jattha' of 101 farmers will march towards Delhi on December 8 at 12 noon. Tomorrow's day has been kept for talks with the central government. They have said that they are ready for talks, so we will… pic.twitter.com/3llMjDGvsd— ANI (@ANI) December 6, 2024👉రైతుల సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఢిల్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టియర్ ప్రయోగించడంతో ఆరుగురు రైతు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. కాసేపు మేమేంతా సమావేశం కాబోతున్నాం. భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తామన్నారు. #WATCH | At the Shambhu border, Farmer leader Sarwan Singh Pandher says, "They (police) will not let us go (to Delhi). Farmer leaders have got injured, we will hold a meeting to decide the future strategy..." https://t.co/jpM65N22Po pic.twitter.com/rOnk0VXgcQ— ANI (@ANI) December 6, 2024 👉హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లోని శంభు వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో, టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు గాయపడ్డారు. దీంతో, వారికి ఆసుపతత్రికి తరలించారు. #WATCH | Police use tear gas to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/CMon3JDg3I— ANI (@ANI) December 6, 2024 👉దేశంలో రైతులు మరోసారి పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద ‘ఢిల్లీ చలో’ పేరుతో నిరసన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. అన్నదాతలను అడ్డుకోవడంతో ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ శంభు సరిహద్దుకు చేరుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బారికేడ్లతో రైతులను భద్రతా బలగాలు అడ్డుకున్నారు. మరోవైపు.. రైతులు నిరసనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.#WATCH | Drone visuals from the Shambhu border where the farmers protesting over various demands have been stopped from entering Delhi. pic.twitter.com/0aBiJTI7sS— ANI (@ANI) December 6, 2024ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అదనంగా మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు.#WATCH | At the Shambhu border, a police official says, "They (farmers) don't have permission to enter Haryana. The Ambala administration has imposed Section 163 of the BNSS..." https://t.co/zVSRcePdgO pic.twitter.com/NwkVbliejp— ANI (@ANI) December 6, 2024రైతు నాయకుడు, కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ మాట్లాడుతూ.. రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు తేకుండా కేవలం కాలినడకన పాదయాత్ర చేస్తారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి మార్చ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.#WATCH | Farmers protesting over various demands have been stopped at the Shambhu border from heading towards Delhi. pic.twitter.com/Pm3HxgR2ie— ANI (@ANI) December 6, 2024 -
రైతులపైకి టియర్ గ్యాస్
శంభు: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు శంభులోని నిరసన దీక్షా శిబిరం నుంచి కాలినడకన బయలుదేరింది. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ సంఘ్ జెండాలను చేబూనిన రైతులు కొన్ని మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ముందుకు రావద్దని పోలీసులు వారిని పదేపదే కోరారు. అయినప్పటికీ, రైతులు పలు అంచెల బారికేడ్లను దాటుకుని, వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప మేకులను, ఇనుప ముళ్ల కంచెను తొలగించారు. సిమెంట్ బారికేడ్లనూ దాటేందుకు యత్నించారు. ఇనుప కంచెను కొందరు ఘగ్గర్ నదిలోకి దొర్లించారు. దీంతో, పోలీసులు వారిపైకి పలు రౌండ్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులు టియర్ గ్యాస్ నుంచి రక్షణ కోసం తడి గన్నీ బ్యాగులతో కళ్లు, ముఖాన్ని కప్పేసుకున్నారు. బారికేడ్లపై నుంచి వస్తున్న వారిపైకి పోలీసులు లాఠీలు ఝళిపించారు. టియర్ గ్యాస్‌తో గాయపడిన కనీసం ఆరుగురు రైతులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. రైతులు గాయపడిన నేపథ్యంలో జాతాను శుక్రవారానికి నిలిపి వేస్తున్నట్లు రైతు నేత సర్వాన్ సింగ్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై చర్చించుకుని, నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంబాలా జిల్లాలో గురువారం నుంచే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడరాదని ప్రకటించారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల పరిధిలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ మార్గంలో మోహరించారు. -
రైతుల ఆందోళన.. ఉద్రిక్తత.. ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వం సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. రైతుల పాదయాత్రతో చిల్లా సరిహద్దులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. #WATCH | Noida, Uttar Pradesh: Traffic congestion seen at Chilla Border as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/A5G9JuT1KM— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 2, 2024భారతీయ కిసాన్ పరిషత్ (బికేపీ)నేత సుఖ్బీర్ ఖలీఫా మీడియాతో మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం న్యాయమైన పరిహారం, మెరుగైన ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారన్నారు. తూర్పు ఢిల్లీ పోలీసుల అధికారి అపూర్వ గుప్తా మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళనపై తమకు ముందస్గు సమాచారం అందిందని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తున్నామన్నారు.#WATCH | Uttar Pradesh: Security heightened in Noida as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/X67KeeUDba— ANI (@ANI) December 2, 2024డిసెంబరు 6వ తేదీ నుంచి తమ సభ్యులు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తారని, కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా అదే రోజు ఆయా అసెంబ్లీల వైపు పాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ తెలిపారు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
Telangana: పల్లెల్లో ఇథనాల్ చిచ్చు!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’ తెలంగాణ పల్లెల్లో చిచ్చు పెడుతోంది. పెట్రోల్‌లో కలిపేందుకు అవసరమైన ఇథనాల్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలే మొలాసిస్, ధాన్యం నుంచి అవి ఇథనాల్‌ను తయారు చేస్తాయి. అయితే రాష్ట్రంలో ఈ యూనిట్ల ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏడాది క్రితం నారాయణపేట జిల్లా చిత్తనూరులో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో.. పనులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్య రహితంగా (జీరో లిక్విడ్ డిశ్చార్జి) ఏర్పాటు కావాల్సిన ఇథనాల్ ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించట్లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీలు వాయు, జల కాలుష్యానికి కారణమై తమ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ చిత్తనూరు, దిలావర్పూర్ ప్రాంత వాసులు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రంలో 28 సంస్థలకు గ్రీన్ సిగ్నల్ విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2018లో నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీని ప్రవేశపెట్టింది. 2025–26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి ఏటా 1,080 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించింది. ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు ‘ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్’ కింద వడ్డీ రేటులో 4 శాతం నుంచి 50శాతం వరకు రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు 31 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 2018 నుంచి 2022 మధ్యకాలంలో 28 సంస్థలకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా రోజుకు 5,256 కిలోలీటర్ల (కేఎల్‌పీడీ) ఇథనాల్ తయారీ ప్రతిపాదనలను ఆమోదించింది. వీటిలో నారాయణపేట జిల్లా చిత్తనూరులో వీటిలో ప్రస్తుతం 400 కేఎల్‌పీడీ సామర్థ్యమున్న జూరాల ఆర్గానిక్ ఫార్మ్ ఒక్కటే నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో మరో ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి, నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోనూ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే కేంద్రం నుంచి ఆమోదం పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని అధికారులు చెప్తున్నారు. అనుమతులపై అధికారుల మౌనం నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ కింద ఇథనాల్ తయారీ యూనిట్లకు ఇచ్చిన అనుమతులతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ (ఐడీఆర్ యాక్ట్) కేంద్ర ప్రభుత్వ జాబితాలోకి వెళ్లిపోయిందని... దీంతో అందులో అంతర్భాగమైన ఇథనాల్ తయారీపై తమకు సమాచారం లేదని అంటున్నాయి. నిజానికి ఐడీఆర్ యాక్ట్ కేంద్ర జాబితాలోకి వెళ్లడాన్ని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ఆమోదించగా.. తెలంగాణ, ఏపీ మాత్రం దూరంగా ఉన్నాయి. మరోవైపు ఇథనాల్ తయారీని ఉమ్మడి కోటాలో చేర్చి పర్యవేక్షక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని సుప్రీంకోర్టు పది రోజుల క్రితమే ఆదేశించింది. కానీ రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఇథనాల్ యూనిట్లకు నిర్మాణ అనుమతులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని... లైసెన్సు, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో రాష్ట్రానికి సంబంధం లేదని పరిశ్రమల శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో టీజీఐపాస్ కింద ఎన్ని సంస్థలు దరఖాస్తులు చేసుకున్నాయి, వాటి స్థితిగతులు ఏమిటనే సమాచారం తమ వద్ద లేదనే పేర్కొంటున్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 1,213 సంస్థలకు 1,37,342 కేఎల్‌పీడీ సామర్థ్యం కలిగిన ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అందులో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోనే ఉన్నాయి. అవగాహన లేకనే వ్యతిరేకత అంటున్న పరిశ్రమలు ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై స్థానికులకు అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తున్నట్టు పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి. ఇథనాల్ తయారీ యూనిట్లను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు, స్థానికులు ఇటీవల హైదరాబాద్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుపై ఎదురవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అనుమతులను తిరిగి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అనుమతులిచ్చింది నాటి సర్కారేగత సర్కారు దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ సర్కారు అంటోంది. కేంద్రం కోరిన ఇథనాల్ ఫ్యూయల్ తయారీకి బదులుగా.. ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్, ఇండ్రస్టియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కాహాల్ వంటి ఇతర ఉత్పత్తులకు రాష్ట్ర మంత్రివర్గం 2022లో అనుమతి ఇచ్చిందని చెబుతోంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసీ, పర్యావరణ అనుమతులు, ఇతర ఉత్పత్తులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ అంశాల్లో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలను ఉల్లంఘించిందని అధికారులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి కేటాయింపులు మాత్రమే జరిగాయని చెబుతున్నారు. -
అన్నదాత ఆక్రందన
-
నేడు రైతుల చలో ప్రజాభవన్.. అన్నదాతలు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని ప్రతిపక్ష నేతలు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రుణమాఫీ అమలుకాని రైతులు సర్కార్‌పై పోరుకు సిద్ధమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు.పలు జిల్లాల నుంచి ప్రజాభవన్‌కు బయలుదేరిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసు తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు మాట్లాడుతూ.. మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని ప్రజాభవన్‌కు బయలుదేరాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. మేము ఏమైనా దొంగలమా లేక టెర్రరిస్టులమా?. ఎలాగైనా మేము ప్రభా భవన్ వద్దకు వెళ్తాము’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దీంతో, రుణమాఫీ కానీ రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: ఒక హైడ్రా.. ఆరు చట్టాలు! -
ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతుల ఆగ్రహం
శ్రీ సత్యసాయి, సాక్షి: తెలుగుదేశం పార్టీ హిందూపురం నియోజవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. హిందూపురం పోలీసు స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున రైతులు ధర్నాకు దిగారు. టీడీపీ నేతల కబ్జా వ్యవహారంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలంటూ రైతుల నినాదాలు చేశారు. హిందూపురంలో రూ. 2 కోట్ల విలువైన పాడి రైతుల భవనాన్ని టీడీపీ నేతలు కూల్చివేశారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించకపోవటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: సొసైటీ భవనం నేలమట్టం -
హైవేలు పార్కింగ్ స్థలం కాదు: సుప్రీం కోర్టు
ఢిల్లీ: శంభూ సరిహద్దు రహదారిని పాక్షికంగా తెరవాలని సుప్రీం కోర్టు హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు శంభూ సరిహద్దు జిల్లాలు పాటియాల, అంబాల ఎస్సీలతో భేటీ అయి వారం రోజుల లోపు శంభూ సరిహద్దు హైవేను తెరవాలని ఆదేశించింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు క్రమంలో సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. హైవేలు ఉన్నది పార్కింగ్ స్థలం కోసం కాదని పేర్కొంది. వెంటనే పంజాబ్ ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి.. హైవే మీద నిలిపిన ట్రాక్టర్లను తొలగించేలా చూడాలని సూచించింది.అత్యవసర సేవలు అంబులెన్స్ రాకపోకలు, వృద్దులు, మహిళలు, విద్యార్థినీలు, స్థానిక ప్రయాణికుల అవసరాల కోసం శంభూసరిహద్దును పాక్షికంగా ఓపెన్ చేయాలని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా రాజకీయాలతో సంబంధంలేనివారితో ఓ కమిటీ ఏర్పాటు చేసి రైతులతో చర్చలతో జరపడానికి చేసిన కృషికి ఇరు రాష్ట్రా ప్రభుత్వాలను సుప్రీకోర్టు అభినందించింది. శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాల్సిన ప్యానెల్ నిబంధనలపై కూడా ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ.. పంజాబ్, హర్యానా రైతులు పెద్దఎత్తున దేశ రాజధాని ఢిల్లీ చేరుకొవాలని ప్రయత్నించగా వారిని పోలీసులు శంభుసరిహద్దుల్లో అడ్డుకున్నారు. దీంతో ఫిబ్రవరి 13 నుంచి శంభు సరిహద్దుల్లో రైతులు తమ ట్రాక్టర్లను రహదారికి అడ్డుపెట్టి నిరసన తెలుపుతున్నారు. -
సంగారెడ్డి పెద్దపూర్‌లో టెన్షన్.. టెన్షన్
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం అధికారులు భూ సేకరణ సర్వే చేస్తున్నారు. రైతులు సర్వేను ఆడుకున్నారు. సర్వేను అడ్డు కోవడంతో అక్కడి ఉదిక్తత వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. భూ సర్వే ఆడుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి. డీసీఎంలో తరలించారు. రెండ్రోజుల క్రితం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం ప్రజాభిప్రాయ సేకరణలోను భూములు ఇవ్వబోమని రైతుల ఆందోళన చేశారు. -
కేంద్రంపై రైతులకు విశ్వాసం లేనట్లుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అపనమ్మక(విశ్వాసంలేని) పరిస్థితులున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. రాజధాని ఢిల్లీ, హర్యానాకు సరిహద్దుగా ఉన్న శంభూ ప్రాంతంలో రైతుల ఆందోళన సమయంలో బారికేడ్లు తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం(జులై 24) ఈ వ్యాఖ్యలు చేసింది.రైతుల సమస్యలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. అసలు రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటారని ప్రశ్నించింది. మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే అంపైర్‌లాంటి వ్యక్తి కావాలని కోర్టు పేర్కొంది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కాగా, రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
శంభు సరిహద్దును తెరవండి.. హర్యానాకు హైకోర్టు ఆదేశాలు
చండీగఢ్: శంభు సరిహద్దును వారం రోజుల్లోగా తెరవాలని పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బుధవారం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్-హర్యానాలను కలిపే ఈ శంభు సరిహద్దు వద్ద ఫిబ్రవరి 13న రైతులు భారీగా నిరసనలను ప్రారంభించడంతో హర్యానా ప్రభుత్వం దీనిని మూసివేసింది. గత అయిదు నెలలుగా ఈ సహరిహద్దు మూసే ఉంది. అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని రైతు సంఘాలను హైకోర్టు కోరింది.శంభు సరిహద్దు వెంబడి పబ్లిక్ ప్రజల రాకపోకలు, వాహనాలను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జూలై 6న పంజాబ్- హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయ్యింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు వారం రోజుల్లో శంభు సరిహద్దును తెరవాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది రాజధాని న్యూఢిల్లీని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లను కలుపుతున్నందున మూసివేయడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.జూలై 3న నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఒప్పించాలని హర్యానా రవాణా మంత్రి అసీమ్ గోయెల్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. అసీమ్ గోయెల్ మాట్లాడుతూ.., “రైతులు అంబాలా జిల్లా సరిహద్దులో ఉన్న శంభు గ్రామం దగ్గర అయిదున్నర నెలల క్రితం ఆందోళనను ప్రారంభించిన తర్వాత జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతుల ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఈ సరిహద్దు మూసివేశారు. ఇది సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా అంబాలాలోని వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నిర్వహించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపి శంభు సరిహద్దు గుండా రహదారిని తెరవడానికి వారిని శాంతింపజేయాలి. ఇది సమీపంలో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది, అలాగే ఇది వ్యాపారవేత్తలు తమ పనిని నిర్వహించడానికి సులభతరం చేస్తుంది” అని పేర్కొన్నారుఅయితే రైతులు రహదారిని దిగ్బంధించలేదని, ఫిబ్రవరిలో బారికేడ్లు వేసి తమ ఢిల్లీ చలో మార్చ్‌ను ప్రభుత్వమే ఆపిందని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. తమ డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు రైతులు ఢిల్లీ చలో మార్చ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 నుంచి తమ పాదయాత్రను భద్రతా దళాలు అడ్డుకోవడంతో రైతులు పంజాబ్, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసనలు చేస్తున్నారని చెప్పారు. -
‘కంగన’కు చెంపదెబ్బపై పంజాబ్ సీఎం కీలక కామెంట్స్
చండీగఢ్: బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ స్పందించారు. పంజాబ్ రైతుల పోరాటంపై కంగన చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను కానిస్టేబుల్ కొట్టిందని చెప్పారు.#WATCH | On Kangana Ranaut-CISF constable incident, Punjab CM Bhagwant Mann says, "That was anger. She (Kangana Ranaut) had said things earlier and there was anger for it in the heart of the girl (CISF constable). This should not have happened. But in reply to it, despite being a… pic.twitter.com/cFhWBw5fxb— ANI (@ANI) June 10, 2024‘అది కోపం. కంగన గతంలో మాట్లాడిన మాటలే కానిస్టేబుల్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడటం తప్పు’భగవంత్‌మాన్ మీడియాతో చెప్పారు. జూన్6వ తేదీన కంగన చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్కు వెళ్లినపుడు అక్కడున్న కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, ఆ పోరాటాన్ని కంగన కించపరిచినందుకే కొట్టానని తెలిపింది. -
రాష్ట్రవ్యాప్తంగా రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన కేసీఆర్
-
బీజేపీ ఎంపీ అభ్యర్థికి రైతుల నిరసన సెగ.. ఆయన ఏమన్నారంటే?
ఛంఢీగడ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. అమెరికాలో భారత మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ పంజాబ్‌లోని అమృత్సర్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమృత్సర్ జిల్లాలో చేపట్టిన రోడ్డు షోను రైతులు అడ్డుకున్నారు. గంగోమహాల్, కొల్లామహల్ గ్రామాల మధ్య చేపట్టిన రోడ్డు షోలో ఆయన రైతుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు. దారికి ఇరువైపుల పెద్దసంఖ్యలో చేరి.. ఆయన కాన్వాయ్ అడ్డుకొని నల్లజెండాలు ప్రదర్శిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు పంజాబ్‌లోని పలు గ్రామాల రైతులు కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘మళ్లీ అధికారంలో రావాలని బీజేపీ చేస్తోంది. అందుకే ప్రచారం మొదలుపెట్టింది. కానీ మేము ఎట్టిపరిస్థితుల్లో మా గ్రామాల్లో వారు (బీజేపీ నేతలు) ప్రచారం చేసకోవటానికి అనుమతించబోం. వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని నిరసన తెలిపిన రైతులు తెలిపారు. తరంజిత్ సింగ్ మార్చి 20న బీజేపీలోచేరిన విషయం తెలిసిందే. ఆయన పార్టీలో చేరిన పదిరోజులకు బీజేపీ అమృత్సర్ టికెట్ కేటాయించింది. రైతులు చేసిన నిరసనపై బీజేపీ ఎంపీ అభ్యర్తి తరంజిత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యం ప్రతిఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తపరచడాన్ని అనుమతిస్తుంది. అదేవిధంగా నిరసన వ్యక్తం చేయటాన్ని కూడా అనుతిస్తుంది. నన్ను ఎన్నికల కోసం ప్రచారం చేయటానికి కూడా అనుమతిస్తుంది. అయితే మేము రైతు ఆదాయం పెంచేలా ప్రణాళికలు రచిస్తాం’ అని తరంజిత్ అన్నారు. ఇటీవల నార్త్‌వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ గాయకుడు హన్స్ రాజ్ హాన్స్ కూడా రైతుల నిరసనను ఎదుర్కొన్నారు. ఆయనకు మరోసారి బీజేపీ టికేట్ ఇచ్చింది. అయితే ఈసారి ఆయన్ను ఫరిద్కోట్ నుంచి బరిలోకి దించింది. -
Farmers Protest: ‘రైల్‌రోకో’కు దిగిన రైతులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌లో భాగంగా నాలుగు గంటల పాటు నిర్వహించే రైతుల రైల్‌రోకో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌తో పాటు హర్యానాలోని పలు ప్రాంతాల్లో రైతులు రైల్‌రోకోకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు రైల్‌రోకో జరగనుంది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్తంగా రైల్‌రోకోకు పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా తమ ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Punjab: Farmers organisations hold 'Rail Roko' protest, in Amritsar. pic.twitter.com/kqmSYjd1z9 — ANI (@ANI) March 10, 2024 రైల్‌రోకోలో భాగంగా వందలాది మంది రైతులు రైల్వే ట్రాక్‌లపై కూర్చొని నిరసన తెలుపుతారని కిసాన్ మజ్దూర్ మోర్చా సర్వన్ సింగ్ పందేర్ చెప్పారు. రైతులు చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంతో పంజాబ్, హర్యానాల్లో 60 చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. మరోవైపు మార్చ్ 6వ తేదీ నుంచి రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ ర్యాలీ కొనసాగుతుండటంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. హర్యానాలోని అంబాల జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీ చేపట్టిన సందర్భంగా వారితో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. పలు పంటలకు ఐదేళ్లపాటు మద్దతు ధర ఇస్తామని ఈ చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన రైతులకు నచ్చకపోవడంతో వారు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీని మళ్లీ పునరుద్ధరించారు. ఇందులో భాగంగా రాస్తారోకోలు, రైల్‌రోకోలకు పిలుపునిచ్చి దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదీ చదవండి.. హిట్లర్ అధికారం పదేళ్లకే ముగిసింది -
Delhi Chalo: ఢిల్లీలో ‘మహా పంచాయత్’కు రైతుల పిలుపు
న్యూఢిల్లీ: పంటలకు మద్దతుధర కోసం రైతులు చేపట్టిన నిరసన మార్చ్ ఢిల్లీ ఛలో బుధవారం(మార్చ్ 6) ఉదయం మళ్లీ మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు ఢిల్లీలో కలుసుకోవడానికి రైతు సంఘాలు ప్లాన్ చేశాయి. అయితే తమ డిమాండ్లపై మార్చ్ 14న ఢిల్లీలో మహా పంచాయత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతుసంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్, రుణమాఫీ, కరెంటు ఛార్జీలు యథాతథంగా కొనసాగించడం లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌ను ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తొలి విడత విరామం ప్రకటించారు. చర్చలు విఫలమవడంతో రెండో విడత మార్చ్ కూడా ఫిబ్రవరిలోనే నిర్వహించారు. అనంతరం మూడవ విడత నిరసన మార్చ్‌ను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైతుల తాజా ఢిల్లీ ఛలో పిలుపుతో ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే టిక్రీ,సింగు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. VIDEO | Farmers' protest: Security remains tightened at Delhi's Ghazipur border. Earlier this week, the farmers had called to march towards Delhi from March 6 to press the government to fulfill their demands.#FarmersProtest pic.twitter.com/qkperoHULm — Press Trust of India (@PTI_News) March 6, 2024 ఈ సరిహద్దుల వద్ద రైతులు ఫిబ్రవరి 13 నుంచి క్యాంపులు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధర ఆఫర్‌ను రైతుసంఘాలు తిరస్కరించడంతో ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఢిల్లీ ఛలో మార్చ్‌ను రైతు సంఘాలు మళ్లీ పునరుద్ధరించాయి. ఇదీ చదవండి.. రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం -
ఇచ్చిన హామీ కోసమే ఇంత పట్టు!
వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే వారు అడుగుతున్నారని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు పది లక్షల కోట్ల వరకు ఉంటుందన్నది తప్పు. ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయలనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆర్థికశాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవటం దుర్ల భమనీ, అందులోని వ్యవసాయ ఉపాంగం గందరగోళ పరుస్తుందనీ భావించే వ్యక్తి మీరైతే గనుక... కనీస మద్దతు ధరకు ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలన్న రైతుల డిమాండ్ గురించీ, అసలు కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలన్న విషయం గురించీ రెండు వైపుల నుంచి వినవస్తున్న పూర్తి భిన్నాభి ప్రాయాలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్) వ్యవసాయ సమాచార విభాగం ప్రొఫెసర్ అశోక్ గులాటీ తనకున్న వృత్తిపరమైన సౌలభ్యం ఆధారంగా కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావనలోకి తెచ్చారు. మొదటిది, భారతదేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 27.8 శాతం మాత్రమే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ –ఎంఎస్పీ) వర్తింపు కిందికి వస్తాయి. తత్ఫలితంగా 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే ఎంఎస్పీ వల్ల లబ్ధి పొందుతున్నాయి. అత్యంత వేగంగా 8–9 శాతంతో పుంజుకుంటున్న కోళ్ల పరిశ్రమ, 7–8 శాతంతో దూకుడు మీదున్న మత్స్య పరిశ్రమ, 5–6 శాతంతో పొంగిపొర్లుతున్న పాల ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఎంఎస్పీ పరిధిలోకి రావు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా 23 రకాల దిగుబడులకు కనీస మద్దతు ధరను చట్ట పరమైన హామీగా ఇవ్వటం అన్నది ‘రైతు వ్యతిరేక చర్య’ కావచ్చునని గులాటీ అభిప్రాయం. ఎంఎస్పీ అన్నది మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్న సందర్భాలలో ప్రైవేటు వ్యాపారులు పంట దిగు బడులను కొనుగోలు చేయటానికి నిరాకరిస్తారు. ఆ కారణంగా అమ్ముడు కాని వ్యవసాయ ఉత్పత్తులు రైతుల దగ్గర భారీగా మిగిలి పోతాయి. చివరికి ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ మిగులును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. మొదటిది రైతుకు విపత్కరమైనది. రెండోది ప్రభుత్వానికి ఆర్థికపరమైన చిక్కులను తెచ్చిపెట్టి, బడ్జెట్‌నే తలకిందులు చేసేది. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ హిమాన్షు ఈ వాదనను అంగీకరించడం లేదు. వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... వాస్తవానికి గోధుమ, వరికి తప్ప మిగతా వాటికి మొదటసలు ఎంఎస్పీ అమలే కావటం లేదు. అయినప్పటికీ రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం అది! ఎంఎస్పీ అమలు వల్ల కేవలం 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందటానికి కారణం... ఆచరణలోకి వచ్చే టప్పటికి గోధుమ, వరికి తప్ప మిగతా రకాల దిగుబడులకు అది అమలు కాకపోవటమేనని హిమాన్షు అంటారు. వాటికీ అమలయ్యే పనైతే అప్పుడు లబ్ధిదారుల శాతం 30 వరకు, ఇంకా చెప్పాలంటే 40 వరకు పెరగొచ్చు. రెండోది... కోళ్లు, చేపలు, పాడి వంటి కొన్ని పరిశ్రమలు కనీస మద్దతు ధర లేకున్నా అభివృద్ధి చెందుతున్నాయంటే అర్థం పంటలకు అవసరం లేదని కాదనీ, అదొక తూగని వాదన అనీ హిమాన్షు అంటారు. మరీ ముఖ్యంగా, హిమాన్షు అనడం – ఎంఎస్పీ అనేది «ధరల స్థిరీకరణకు ఒక సాధనం అని! నిజానికి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో కనీస మద్దతు ధర సదుపాయం లేని రైతులు చాలా తక్కువ. రెండోది – ఎంఎస్పీ కనుక మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రతిదీ కొనేస్తుందని కాదు. మొదట ఆ రెండు ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించటం వరకు మాత్రమే ప్రభుత్వం ఆ పని చేయవలసి ఉంటుంది. ఒకసారి అలా చేస్తే మార్కెట్ ధరలు వాటంతట అవే పెరుగుతాయి. ఆ దశలో ప్రభుత్వ జోక్యం నిలిచి పోతుందని అంటారు హిమాన్షు. ఎంఎస్పీ అనేది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీగా ప్రజలలో ఒక భావన ఉందన్న దానిపైన మాత్రం గులాటీ, హిమాన్షు ఇద్దరూ అంగీకరిస్తున్నారు. కనీస మద్దతు ధరను వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీగా వారు భావిస్తున్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నప్పుడు అది ఆ ప్రజలు పొందుతున్న సబ్సిడీ అవుతుందని హిమాన్షు అంటారు. అలాగే ఇద్దరూ కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత తేలికైన విషయమైతే కాదని అంగీకరిస్తున్నారు. ప్రాంతానికీ ప్రాంతానికీ అంచనాలు మారుతుండటం మాత్రమే కాదు; అప్పటికి ఉన్న మార్కెట్ ధర, ఆ మార్కెట్ ధరకూ – ఎంఎస్పీకీ మధ్య ప్రభుత్వం ఎంత భారీగా వ్యత్యాసాన్ని తగ్గించాలి, ఎంతకాలం ఆ తగ్గింపు కొనసాగాలి అనే వాటి మీద అంచనాలు ఆధారపడి ఉంటాయి. హిమాన్షు మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధరకూ, ప్రభుత్వం అమ్మే ధరకూ మధ్య వ్యత్యాసమే ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు అని ఆయన అంటారు. అంటే కనీసం పాక్షికంగానే అయినా ఖర్చు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇచ్చేందుకు కాగల ఖర్చు పది లక్షల కోట్లు అన్న లెక్క స్పష్టంగా తప్పు. నిజానికి ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయల లెక్క వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలి? ఉత్పత్తి ఖర్చును, అందులో 50 శాతాన్ని లాభంగా కలిపి లెక్కించాలా? అలా చేస్తే ఆహార ద్రవ్యోల్బణం 25 నుంచి 35 శాతం పెరుగుతుందని గులాటీ అంటారు. అంతేకాక బడ్జెట్లో భారీ కేటాయింపులు అవసరమై, ప్రభుత్వ ఆహార పథకం అమలులో ఆర్థికపరమైన సంకట స్థితులు తలెత్తవచ్చు. ప్రముఖ ఆర్థికవేత్త స్వామి నాథన్ అయ్యర్ కూడా 50 శాతాన్ని లాభంగా కలిపి మద్దతు ధర ఇవ్వటం సహేతుకం కాదని అంటున్నారు. ఈ వాదనలతో హిమాన్షు విభేదిస్తున్నారు. ప్రభుత్వం చెబు తున్నట్లు ఇప్పటికే సీ2 (ఉత్పత్తి వ్యయం), అందులో 50 శాతం మొత్తాన్ని కలిపి వరికి, గోధుమలకు కనీస మద్దతు ధరలు వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ గులాటీ భయాలకు దగ్గరలో కూడా ద్రవ్యోల్బణం లాంటిదేమీ లేదని అంటున్నారు. ఇక అయ్యర్ సహేతుకం కాదన్న 50 శాతం లాభం గురించి మాత్రం, కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చన్నారు. అయితే రైతులకు తగిన ప్రతిఫలం అవసరం. అలా పొందిన ప్రతిఫలాన్ని వారు తిరిగి ఖర్చు చేయటం అన్నది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ అభివృద్ధి అక్కడితో ఆగదు అంటారు హిమాన్షు. చివరి ముఖ్య విషయం. రైతుల ఆదాయాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం... అధిక విలువ గలిగిన పంటల వైవిధ్యానికి వ్యవసాయ ప్రోత్సాహకాలను అందివ్వటం అని గులాటీ అంటారు. దీనికి స్పందనగా హిమాన్షు ఎంఎస్పీని మొత్తం 23 రకాల పంటలకు వర్తింపచేస్తే చాలు వైవిధ్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని అంటున్నారు. ఆయన అనటం... రైతులు వ్యాపారులు కూడాననీ, అందువల్ల ప్రోత్సాహాలను పొందటానికి మొగ్గు చూపుతారనీ!ఇదేమైనా మీకు ఉపకరించిందా? ఉపకరించిందనే భావిస్తాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆగిన ఢిల్లీ ఛలో! 5 పాయింట్లలో..
కీలక డిమాండ్ల సాధనలో నిన్నటి వెనక్కి తగ్గని అన్నదాతలు.. ఇప్పుడు చల్లబడ్డారా? లేకుంటే.. తమ ఆందోళనలను తీవ్ర తరం చేయబోతున్నారా? అసలు ఢిల్లీ ఛలోకి విరామం ఎందుకు ప్రకటించారు?. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఢిల్లీ ఛలో మార్చ్‌ను నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అప్పటిదాకా ఏం చేయబోతున్నారనేది కూడా చెప్పేశారు. 1. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభూ, ఖనౌరీల వద్ద భారీ సంఖ్యలో రైతులు మోహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సైతం భాష్పవాయువు ప్రయోగం.. లాఠీ ఛార్జీతో ఆ ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. అయితే ఆ వెంటనే ఢిల్లీ ఛలోను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించాయి. తమ నిర్ణయం ఏంటన్నది ఆరోజునే(29న) ప్రకటిస్తామని చెప్పారు. తదుపరి కార్యాచరణ ప్రకటించేదాకా.. అక్కడే వివిధ రూపాల్లో నిరసనలను తెలపాలని రైతులకు.. రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2. ఇవాళ క్యాండిల్ మార్చ్.. రేపు రైతుల సమస్యల మీద సెమినార్ల నిర్వహణతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ-కేంద్రం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఆపై రెండు రోజుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో వరుస సమావేశాలు జరుగుతాయన్నారు. రానున్న ఐదురోజుల్లో సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా, మరికొన్ని సంఘాలు భేటీ అయ్యి సంయుక్తంగా తదుపరి కార్యాచరణను రూపొందిస్తాయని ఆ సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు. 3. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు.. తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానివైపు వైపు రైతులు కదం తొక్కేందుకు యత్నిస్తుండగా.. గత 11 రోజులుగా భద్రతా బలగాలు వాళ్లను నిలువరిస్తూ వస్తున్నారు. ఇనుప కంచెలు, బారికేడ్లతో బలగాలు.. ట్రాక్టర్లు, వాటికి రక్షణ కవచాలతో రైతులు పోటాపోటీ ప్రదర్శనలతో యుద్ధవాతావరణాన్ని తలపించారు. ఈ క్రమంలోనే ముందుకొచ్చిన రైతులపై బలగాలు భాష్పవాయుగోళాలు ప్రయోగంతో పాటు లాఠీ ఛార్జీ చేయడం చేశాయి. అయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. 4. ఇదిలా ఉంటే.. బుధవారం జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ మృతి చెందిన తర్వాత ఆందోళనను రెండు రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్‌కరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. అయితే.. నిరసనలో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు. దీంతో రైతుల నిరసనలు మొదలయ్యాక ఇప్పటిదాకా ఐదుగురు చనిపోయారని రైతు సంఘాలు చెబుతున్నాయి. 5.ఒకవైపు చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేంద్రం చెబుతుండగా.. మరోవైపు రైతు సంఘాలు మాత్రం నిర్ణీత కాల వ్యవధితో తమకు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని.. లేకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని అంటున్నాయి. ఇంకోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్ పేర్కొన్నారు. -
రైతు సంఘాల ‘బ్లాక్‌డే’.. నేడు కీలక చర్చ
సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంభు సరిహద్దుల వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో రైతు సంఘాల నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భవిష్యత్ కార్యచరణపై రైతులు చర్చించనున్నారు. ఇక, ఈనెల 26వ తేదీన అన్ని జాతీయ రహదారులపై రైతులు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. పంబాజ్-హర్యానా సరిహద్దుల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హర్యానా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’గా పాటించాలని రైతులను కోరింది. Any more proof required ?? Haryana Police firing at Farmers.#FarmerLivesMatter#FarmerProtestInDelhi#farmersprotests2024 pic.twitter.com/hwejdZ8CoZ — Farmers_Protest 2.0 (@FarmersProtest_) February 23, 2024 మరోవైపు.. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. -
నిరసనకు రైతుల బ్రేక్! అసలేం జరిగిందంటే..
కనీస మద్ధతు ధరతో సహా 23 డిమాండ్లతో మళ్లీ ఆందోళన ప్రారంభించిన రైతన్నల్ని పోలీసులు అడ్డుకునే క్రమంలో బుధవారం ఢిల్లీ సరిహద్దు అట్టుడికి పోయింది. భాష్పవాయివు ప్రయోగంతో పాటు ఓ యువరైతు మరణించాడన్న ప్రచారంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ తరుణంలో తమది రైతుపక్ష ప్రభుత్వమని, మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించుకోగా.. ఆందోళనలకు రెండ్రోజులు విరామం ప్రకటించాయి రైతు సంఘాలు. తమ తదుపరి కార్యచరణ రూపకల్పన కోసమే రెండ్రోజులు విరామం ప్రకటించినట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ జనరల్ సెక్రటరీ శర్వాన్ సింగ్ పంథేర్ ప్రకటించారు. ఈలోగా కేంద్రం నుంచి ఏదైనా పురోగతి కనిపించకపోతే.. శుక్రవారం సాయంత్రం తర్వాయి ప్రకటన చేస్తామని చెప్పారాయన. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ఒకరోజు పార్లమెంట్‌ను సమావేశపర్చాలని ఆయన తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అదే డిమాండ్ వినిపించారాయన. బుధవారం ఉదయం ఢిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో కదిలారు. శంభూ-కనౌరీ సరిహద్దు వద్ద బుధవారం ఉదయం రైతులు బారికేడ్లను దాటే యత్నం చేశారు. వారిని నిలువరించేందుకు హర్యానా పోలీసులు మూడు రౌండ్ల టియర్ గ్యాస్ ప్రయోగం జరిపారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా.. శుభ్‌కరణ్ సింగ్(22) అనే యువకుడు మృతి చెందినట్లు, పలువురు రైతులకు గాయాలు అయినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. యువరైతు మృతి ఘటనపై పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శుభ్‌కరణ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం తర్వాత కేసు నమోదు చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చెబుతున్నారు. ఘటనపై కఠిన చర్యలు తప్పవని చెబుతూనే.. బాధిత కుటుంబాన్ని పంజాబ్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో బుధవారం రైతులు భారీ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పేరు బ్రిజ్‌పాల్ అని.. అతనూ ఓ రైతేనని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. బ్రిజ్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. అయితే హర్యానా పోలీసులు మాత్రం శుభ్‌కరణ్ సింగ్ ఘర్షణలోనే మరణించారన్న వాదనను తోసిపుచ్చారు. దాన్నొక రూమర్‌గా కొట్టిపారేశారు. ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం మొదటి నుంచి తమకు సహకరించడం లేదని హర్యానా సర్కార్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను వారు తమ వెంట తీసుకెళ్తున్నారని.. వాటిని స్వాధీనం చేసుకోవాలని పంజాబ్ బలగాలను అభ్యర్థించినా ఆ పని చేయలేదని హర్యానా పోలీసులు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ సైతం ముందుగా పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్నీ ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ‘మేం చేసిన నేరం ఏమిటి..? మిమ్మల్ని ప్రధానిని చేశాం. మమ్మల్ని అణచివేసేందుకు ఈ విధంగా బలగాలను ఉపయోగిస్తారని అనుకోలేదు. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పంజాబ్ కిసాన్ మజ్దూర్ జనరల్ సెక్రటరీ శర్వాన్ సింగ్ పంథేర్ అన్నారు. డిమాండ్ల సాధనకు రైతులు మళ్లీ ఆందోళనకు దిగడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం స్పందించారు. రైతు నేతలతో ఐదో విడత చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నాలుగో విడత చర్చల తర్వాత.. నాలుగు ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ మేరకు రైతు సంఘాల నేతలకు ఆహ్వానం పంపాం. శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం అందరికీ ఉంది’’ అని ట్వీట్ చేశారాయన. మరోవైపు నిన్న జరిగిన కేబినెట్ భేటీలో చెరుకు రైతులకు శుభవార్త చెప్పింది కేంద్రం. 2024-25 సీజన్లో చక్కెర ఎఫ్ఆర్పి(గిట్టుబాటు) ధర క్వింటాల్ కు రూ.340 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. తాము రైతుపక్ష ప్రభుత్వమని అన్నారు. ఇంకోవైపు తమ నిరసనలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతులను ఢిల్లీకి వెళ్లనివ్వకపోతే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను గ్రామాల్లోని రానివ్వబోమని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మీరట్‌లో రైతులు బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో.. కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. పంజాబ్‌లోని రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్‌ను పునఃప్రారంభించడం.. సరిహద్దులో బలగాల మోహరింపుతో ఢిల్లీకి వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షల్ని ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, NH-9లో వాహనాల రద్దీ కనిపించింది. ఇంకోపక్క.. హర్యానాతో సింగు-టిక్రీ సరిహద్దులు మూసివేత గురువారం కూడా అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. రైతుల నిరసన-బలగాల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్తతల నడము.. హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఈ నెల 23వ తేదీ వరకు ఇంటర్నెట్ సర్వీసులను రద్దును హర్యానా ప్రభుత్వం పొడిగించింది. అలాగే.. రైతులు విరామం ప్రకటించినా.. ముందు జాగ్రత్తగా సరిహద్దులో బలగాల మోహరింపును కొనసాగించనున్నట్లు వెల్లడించింది. -
ఢిల్లీ సరిహద్దుల్లో హైటెన్షన్.. యువరైతు మృతి
ఢిల్లీ:పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హర్యానా పోలీసులు రైతులపై ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్లింగ్‌లో యువరైతు మృతి చెందారు. హర్యానా కనౌరీ సరిహద్దు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 24-year-old farmer Subh Karan dies in police firing at Khanauri border. @htTweets @HTPunjab @ramanmann1974 @RakeshTikaitBKU @priyankagandhi @deependerdeswal pic.twitter.com/5yWKCtOVZ0 — Sunil rahar (@Sunilrahar10) February 21, 2024 పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ తగిలి 24 ఏళ్ల శుభ్‌కరణ్ సింగ్ కన్నుముశాడు. తీవ్రంగా గాయపడిన శుభ్ కరణ్ సింగ్‌ను స్థానిక ఆస్ప్రతికి తరలించాగా.. అప్పటికే అతను మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సరిహద్దుల్లో 160 మంది రైతులు గాయపడ్డారని పంజాబ్ పోలిసులు తెలిపారు. రైతులు బుధవారం మళ్లీ పోరుబాట పట్టారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం చేశారు. శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించారు. డ్రోన్లతో రైతులపైకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో కొందరు రైతులకు స్వల్ప గాయపడ్డారు. ఈ క్రమంలోనే యువ రైతు శుభ్‌కరణ్ సింగ్‌కు హర్యానా పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ తగిలి మృతి చెందాడు. -
ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్
Farmer's Protest 2024 Latest Updates టియర్ గ్యాస్ షెల్ తగిలి యువరైతు మృతి ఖానౌరీ సరిహద్దులో హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ వదలటం షెల్ తగిలి 24 ఏళ్ల యువరైతు మృతి. శుభ్ కరణ్ సింగ్ అనే యువ రైతును ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాల ధృవీకరణ 24-year-old farmer Subh Karan dies in police firing at Khanauri border. @htTweets @HTPunjab @ramanmann1974 @RakeshTikaitBKU @priyankagandhi @deependerdeswal pic.twitter.com/5yWKCtOVZ0 — Sunil rahar (@Sunilrahar10) February 21, 2024 కేంద్రం వాదనను తప్పుపట్టిన పంజాబ్ ప్రభుత్వం రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాలపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది సరిహద్దుల్లో రైతులు చేరడానికి పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న కేంద్రం వాదనను పంజాబ్ ప్రభుత్వం తప్పు పట్టింది హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిటం వల్ల 160 మంది రైతులు గాయపడ్డారు పంజాబ్ ప్రభుత్వం బాధ్యతతో శాంతిభద్రతలను నిర్వహిస్తోంది ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్ శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత రైతులను అడ్డుకుంటున్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా దళాలు డ్రోన్లతో రైతులపైకి టియర్ గ్యాస్ వదులుతున్న పోలీసులు కొందరు రైతులకు స్వల్ప గాయాలు రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం ఛలో ఢిల్లీ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులను చర్చలకు పిలిచిన వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ట్విట్టర్లో పోస్టు పెట్టిన అర్జున్ ముండా అయినా స్పందించని రైతులు శంభూ బార్డర్లో రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు #WATCH | Union Agriculture Minister Arjun Munda says, "...In the 5th round of meeting, we are ready to talk with farmers and discuss issues like MSP, stubble, FIR, and crop diversification. I appeal to them to maintain peace and we should find a solution through dialogue." pic.twitter.com/F17XwZs3Ur — ANI (@ANI) February 21, 2024 హర్యానా పోలీసులే టియర్ గ్యాస్ ప్రయోగించారు: పంజాబ్ డీజీపీ హర్యానా పోలీసులే కావాలని రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు. మొత్తం 14 టియర్ గ్యాస్ గుళ్లను ఇందుకు వాడారు. రైతుల నుంచి ఎలాంటి రెచ్చగొట్టే సంఘటనలు లేకపోయినా హర్యానా పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనిపై మేం మా నిరసనను హర్యానా పోలీసులకు తెలియజేశాం శంభూ సరిహద్దులో రైతులపై టియర్ గ్యాస్.. ఉద్రిక్తత చర్చలకు రావాలన్న కేంద్రం పిలుపును రైతులు పట్టించుకోలేదు పంజాబ్-హర్యానా శంభూ సరిహద్దు నుంచి ఢిల్లీ వైపునకు రైతులు కదిలారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను పేల్చారు. దీంతో అక్కడ రైతులంతా చెల్లా చెదురయ్యారు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ ఛలో.. పునఃప్రారంభం ఢిల్లీ ఛలో యాత్రను రైతులు ప్రారంభించారు ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు సరిహద్దులో మానవహారంగా పోలీసులు మోహరించి ఉన్నారు ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది ఢిల్లీ, సాక్షి: రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే నాలుగో విడత చర్చల్లో.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి ఐదేళ్లపాటు కనీస మద్దతు ధర ఒప్పందం చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే.. అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ కల్పించాల్సిందేనని పట్టుబట్టాయి రైతు సంఘాలు. దీంతో చర్చలు విఫలమై.. మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఢిల్లీ వైపు వెళ్లే.. పంజాబ్ - హర్యానా సరిహద్దు వద్ద రైతులను నిలువరిస్తున్నారు పోలీసులు. ఒకవైపు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలతో, ముళ్ల కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అదే సమయంలో.. తొలి రోజు నాటి అనుభవాల దృష్ట్యా రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెలను చేధించేందుకు జేసీబీలు, వాటిని నడిపేవాళ్లపై టియర్ గ్యాస్ ప్రభావం పడకుండా ప్రత్యేక ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో రైతులూ సిద్ధమయ్యారు. శంభు సరిహద్దు వద్ద 1,200 ట్రాక్టర్లు, 14 వేల మంది మోహరించినట్లు కేంద్రం హోం శాఖ నివేదిక రూపొందించింది. తక్షణమే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్డీయే ఎంపీల ఘెరావ్ ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) పిలుపునిచ్చింది. ఇక పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్కేఎమ్ ఇప్పటికే ప్రకించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: మళ్లీ ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా? -
కాసేపట్లో రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు బుధవారం నుంచి మళ్లీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వందలాది ట్రాక్టర్లు, జేసీబీలతో రాజధాని నగరంలోకి చొచ్చుకు వచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే రైతు నాయకులు కేంద్రానికి బుధవారం ఉదయం 11 గంటల దాకా సమయమిచ్చారు. ఈ లోపు ఏదో ఒకటి తేల్చకపోతే ఢిల్లీ ఛలో యథావిధిగా జరుగుతుందని తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. టిక్రీ, సింగు సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు. ఈ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించడమే కాక కాంక్రీట్ బారికేడ్లను అడ్డుగా ఉంచారు. రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశిస్తే నగరంలో ట్రాఫిక్ గ్రిడ్‌లాక్‌కు దారి తీస్తుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే ఘాజీపూర్ సరిహద్దును కూడా మూసివేస్తామని పోలీసులు తెలిపారు. నోయిడా, గురుగ్రామ్‌లలోనూ ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్‌లో మార్చ్ చేసేందుకు రైతులు ఇప్పటికే డిసైడయ్యారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కీలకమైన పంజాబ్, హర్యానాల సరిహద్దు అయిన శంభు బోర్డర్లో భారీగా పోలీసులు మోహరించారు. హర్యానాలోని 7 జిల్లాలో బల్క్ ఎస్ఎమ్ఎస్లతో పాటు ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసింది. ర్యాలీ చేసే రైతుల వద్ద ఉన్న జేసీబీ వంటి యంత్రాలను సీజ్ చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హర్యానా ప్రభుత్వం ఇప్పటికే కోరింది. కాగా, ఈ నెల 13న రైతులు మొదటిసారి ఢిల్లీ ఛలోకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కేంద్రం వారితో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫెయిల్ అవడంతో రైతు సంఘాలు మళ్లీ బుధవారం నుంచి ఛలో ఢిల్లీ ర్యాలీ పునరుద్ధరిస్తామని ప్రకటించారు. బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలు.. ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) పిలపునిచ్చింది. ఇక పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్కేఎమ్ ఇప్పటికే ప్రకించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. #WATCH | Farmer leader Sarwan Singh Pandher says, "...We have told the govt that you can kill us but please don't oppress the farmers. We request the Prime Minister to come forward and put an end to this protest by announcing a law on the MSP guarantee for the farmers...The… pic.twitter.com/pwBEiPH9RX — ANI (@ANI) February 21, 2024 ఇదీ చదవండి.. మరాఠాల రిజర్వేషన్‌కు ఓకే -
కేంద్రం ఆఫర్.. ఇక రైతు సంఘాలదే నిర్ణయం
ఢిల్లీ, సాక్షి: పలు డిమాండ్ల సాధనకై ఆందోళన చేపట్టిన రైతు సంఘాలతో కేంద్రం నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు(8, 12, 15 తేదీల్లో) రైతు సంఘాలతో చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి 8:15 గం. నుంచి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదనను రైతు సంఘాల ముందు ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తాయని మా బృందం ప్రతిపాదించింది. ఒప్పందం కుదిరాక ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి.. On meeting farmer leaders in connection with the ongoing protest, Union Minister Piyush Goyal says, "With new ideas and thoughts, we had a positive discussion with farmer leaders. We have together proposed a very innovative, out-of-the-box idea...The govt promoted cooperative… pic.twitter.com/KRRQR566gv — Gagandeep Singh (@Gagan4344) February 18, 2024 .. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండబోదు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తాం. మా ప్రతిపాదనలతో పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయి. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయి’’ అని మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ‘‘కేంద్రాన్ని.. పప్పు ధాన్యాలపై కనీస మద్ధతు ధర హామీ అడిగామ’’ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ మీడియాకు తెలిపారు. ఇక.. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. సోమ, మంగళవారాల్లో తమ రైతు సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం కాలయాపన విధానాలు మానుకొని, లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కంటే ముందే ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా రైతుల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ డిమాండ్ చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో కేంద్రం చర్చలు చేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధతకు ఒక ఆర్డినెన్స్, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేంద్రం పరిష్కారం చూపొచ్చని అభిప్రాయపడ్డారు. డిమాండ్లు నెరవేర్చే వరకు రైతులు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. 21న నల్ల జెండాలతో ఘెరావ్ గతంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ నెల 21న బీజేపీతో సహా అధికార ఎన్డీయే పక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు తెలుపాలని రైతులకు సూచించింది. మరోవైపు పంజాబ్‌లో బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముందు ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు 24 గంటల ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్కేఎం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు రైతుల ఆందోళన నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈనెల 19 వరకు పొడిగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లో పటియాలా, సంగ్రూర్, ఫతేగఢ్ సాహిబ్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవల రద్దును 24 వరకు పొడిగించారు. -
రైతుల ఆందోళనలు.. నేడు నాలుగో రౌండ్లో చర్చలు
ఛండీగడ్: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాలుగోసారి చర్చలు జరుపనుంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానందరాయ్‌లు నేడు ఛండీగడ్‌లో రైతులతో భేటీ కానున్నారు. మరోవైపు.. రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకు పొడిగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో రైతులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రైతు కూలీలకు పింఛను, వ్యవసాయ రుణాల మాఫీ వంటివి రైతుల ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు. ఇక, శంభు సరిహద్దుల వద్దే రైతులు బస చేశారు. -
ఢిల్లీ చలో: శంభు సరిహద్దులో రైతు మృతి
ఛండీగడ్: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, రైతుల ర్యాలీ, నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శంభు సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. మరోవైపు.. నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల ప్రకారం.. రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తకరంగా మారుతున్నాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. ఢిల్లీవైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుల నిరసనల్లో భాగంగా కొందరు వ్యక్తులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో, వారిని తరిమికొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. सिकंदर पूरी दुनिया जीत सकता था और मोदी पूरा देश भेज सकता था अगर उसने पंजाब के साथ पंगा ना लिया होता...!!!#FarmersProtest2#FarmerProtest2024#FarmersProtest MaXiMuM RePoSt 🔃 👈 👇 pic.twitter.com/kftjJy7Jhi — karaj_lahoria_ (@karajlahoria28) February 17, 2024 ఇక, శంభు సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్‌సింగ్ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు.. పంజాబ్, హర్యానా రైతులకు మద్దతు తెలుపుతూ త్రిపురలో రైతులు, సీఐటీయూ వర్గాలు ర్యాలీలు చేపట్టాయి. రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. शंभू बॉर्डर: किसान आन्दोलन में एक किसान की मृत्यु के बाद गमगीन माहौल। गुरुदासपुर के दिवंगत किसान ज्ञान सिंह को किसानों ने श्रद्धांजलि दी।#FarmersProtest #farmerprotests2024 pic.twitter.com/WwOg4rGRUH — PRAMOD KUMAR ANURAGI #d.el.ed (@KumarDheerenda) February 17, 2024 देश के प्रधानमंत्री Narendra Modi जी .... आपको किसानों से इतनी नफरत है तो सीधा तोप से उड़ा दीजिए.... क्योंकि इन अन्नदाताओं का अनाज आप खाते नहीं आपके लिए तो विदेशों से आता है..... #kisanandolan2024 #FarmersProtest #kisanmajdoorektazindabaad pic.twitter.com/eq7CmZi8cN — RAMESH BAMNAVAT MEENA (@RAMESHM81868278) February 17, 2024 ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు. VIDEO | Farmers Protest: Early morning visuals from Haryana-Punjab Shambhu border where farmers have been camping after being stopped by security forces from moving ahead to Delhi.#FarmersProtest (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aLd6lvb5Rd — Press Trust of India (@PTI_News) February 17, 2024 -
సానుకూలంగా చర్చలు.. సరిహద్దులోనే రైతులు!
తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలో యాత్ర చేపట్టిన రైతులు.. తమ నిరసనల్ని కొనసాగించాలనే నిర్ణయించారు. గురువారం అర్ధరాత్రి దాకా కేంద్రంతో జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. అయితే సానుకూలంగానే జరిగినట్లు ఇటు కేంద్రం, అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మీడియాకు తెలియజేశారు. కానీ, రైతు సంఘాలు మాత్రం కాలపరిమితితో కూడిన హామీ కోరుతున్నాయి. దీంతో ఇరువర్గాలు ఆదివారం సాయంత్రం మరోసారి భేటీ కావాలని నిర్ణయించాయి. అయితే.. తమ నిరసనలను మాత్రం కొనసాగించి తీరతామని, ఢిల్లీ మార్చ్ కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. మంగళ, బుధవారాల్లో అట్టుడికిన పంజాబ్, హర్యానా సరిహద్దులు.. చర్చల నేపథ్యంలో గురువారం కాస్త శాంతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అలాగే.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తాము వెనక్కి వెళ్లబోమని.. శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. చర్చలపై ఎవరేమన్నారంటే.. .. ఛండీగఢ్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్‌తో రైతు సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. రైతుల డిమాండ్లలో ముఖ్యమైన అంశాలపై వివరంగా చర్చించామని.. సానుకూలంగా చర్చలు జరిగాయని మంత్రి అర్జున్ ముండా మీడియాకు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం జరగబోయే చర్చలతో ఇరువైపుల నుంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. రైతు సంఘాల నేతలతో జరిగిన చర్చలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. అదే సమయంలో హర్యానా ప్రభుత్వం సరిహద్దులో వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. #WATCH | Union Ministers Piyush Goyal, Arjun Munda, Nityanand Rai and Punjab CM Bhagwant Mann hold a meeting with farmer leaders, in Chandigarh. (Video: CM Bhagawant Mann PRO) pic.twitter.com/3mCx30DXbd — ANI (@ANI) February 15, 2024 ఇక రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర(MSP), రైతుల రుణమాఫీ లాంటి అంశాలపై చర్చించినా.. కాలపరిమితితో కూడిన హామీ దొరికితేనే తాము నిరసనలు విరమిస్తామని తెలిపారు. ‘‘కేవలం చర్చల కోసమే మేం లేం. పరిష్కారం కూడా కావాలి. అందుకు సమయం కావాలి అని వాళ్లు(కేంద్ర మంత్రుల్ని ఉద్దేశిస్తూ..) కోరారు అని రైతు సంఘాల నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో.. శాంతియుతంగా నిరసనలు కొనసాగిద్దామని రైతులకు సంఘాల నేతలు పిలుపుఇచ్చారు. ఇక తమ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు విధించడం..రైతులపై భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరును వాళ్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే సమయంలో.. #WATCH | Chandigarh: After the meeting between the central government and the farmer unions concluded, farmer leader Jagjit Singh Dallewal says, "The protest will continue peacefully... We will not do anything else. We will appeal to the farmers too. When meetings are underway… pic.twitter.com/YJOZIZ8Nlm — ANI (@ANI) February 15, 2024 నేడు బంద్‌కి పిలుపు రైతు సంఘాలు శాంతియుతంగా ఢిల్లీకి యాత్ర నిర్వహిస్తామంటున్నాయి. ఇక సంయుక్త్ కిసాన్ మోర్చా ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ నేపథ్యంలో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు వ్యవసాయ పనులు మాని.. రైతులంతా రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపాలని పిలుపు ఇచ్చింది కిసాన్ మోర్చా. ఎమ్ఎస్పీ, కనీస పెన్షన్, కనీస వేతనం.. ఇలా 21 డిమాండ్ల సాధన కోసం తొమ్మిది యూనియన్ల సీనియర్ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సంయుక్త నిరసన తెలిపేందుకు సిద్దం అయ్యారు. రైతుల సంఘాలుఇచ్చిన భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. నోయిడాలో 144 సెక్షన్ విధించారు. -
వెనక్కి తగ్గని రైతులు.. రైళ్లను అడ్డుకుంటామని వార్నింగ్
సాక్షి, ఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ‘ఢిల్లీ చలో’ ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నేడు కేంద్రంలో మూడో విడతలో రైతులతో చర్చలు జరుపనుంది. కాగా, చండీగఢ్‌లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రమంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ చర్చలు జరుపనున్నారు. మరోవైపు.. కొందరు రైతులు పంజాబ్‌లో రైళ్లను అడ్డుకుంటున్నటు తెలుస్తోంది. దీంతో, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. Commuters face delays and traffic jams entering into #Delhi due to protestors; visuals from GT Karnal Road.#farmerprotests2024 #FarmersProtest pic.twitter.com/sEzleOtYkK — cliQ India (@cliQIndiaMedia) February 15, 2024 ఇదిలా ఉండగా.. ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా రైతులు మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు వద్ద వేల మంది మోహరించారు. పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. #FarmerProtest2024 #KisanAndolan2024 #farmerprotests2024 #KisanoKoNyayDo #FarmersProtest #FarmersProtest2 pic.twitter.com/BVuO288Woo — Virkempire (@virkempire) February 15, 2024 మరోవైపు.. హర్యానాలోని జింద్ జిల్లా దాతా సింగ్వాలా ఖనౌరీ సరిహద్దు వద్ద కూడా రైతులు భారీగా మోహరించి ఉన్నారు. రెండు చోట్లా బారికేడ్లను, ముళ్ల కంచెలను భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా సరిహద్దులతోపాటు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై భారీ కందకాలు తవ్వారు. ఇక, ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా, తమ డిమాండ్లు నెరవేరే వరకూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. It is not only difficult but impossible to stop the farmers. #FarmersProtest pic.twitter.com/PcQrodwaTK — Riyaz (@rz_tweetz) February 12, 2024 ఇంటర్నెట్ బంద్ రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో వాయిస్ కాల్స్ మినహా మిగతా అన్ని మొబైల్ సేవలను గురువారం వరకూ అధికారులు నిలిపివేశారు. రైతులతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఢిల్లీ చలో నిరసనలో భాగంగా సింఘా బార్డర్లో రైతుల పైకి పంపిన డ్రోన్‌ను గాలి పటంతో తిప్పికొట్టిన రైతులు. pic.twitter.com/0eJE7BsApF — Telugu Scribe (@TeluguScribe) February 15, 2024 ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 144 సెక్షన్ అమలుతోపాటు రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో బుధవారం వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. -
ఢిల్లీలో రైతుల ఉద్యమం ఇస్తోన్న సంకేతాలేంటి?
ఢిల్లీలో 2020-21లో తీవ్రస్థాయిలో ఉద్యమించి, విరమించిన రైతులు.. మళ్ళీ ఉద్యమించడానికి సిద్ధమయ్యారు. 'ఢిల్లీ చలో' పేరుతో ఆందోళన చేపట్టారు. గతంలో ఉద్యమించిన సంఘాలకుచెందినవారిలో పలువురు మళ్ళీ పోరాటబాటపట్టారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నవేళ రైతు సంఘాలు ఆందోళనకు దిగడం.. నేడు చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలకు సరిపడా ఆహారం, డీజిల్, కావాల్సిన సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకొనే రైతులు పోరుకు దిగారు.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సహా పలువురు బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని నిఘా నివేదికలు చెబుతున్నాయి. పంజాబ్, హరియాణా నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో హస్తినకు బయలుదేరారు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరేంత వరకూ దేశ రాజధానిని వీడేదిలేదని రైతులు మళ్ళీ భీష్మప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ నిరసనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆందోళనలను భగ్నం చేయడానికి, సరిహద్దుల్లోనే అడ్డుకోడానికి ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టారు. శంభు సరిహద్దు వద్ద రైతులపై భాష్పవాయివును ప్రయోగించినట్లు తెలుస్తోంది. స్మోక్ బాంబ్స్‌ను కూడా వదిలారు. దట్టమైన పొగతో ఆకాశమంతా నిండిపోయింది. ఈ ప్రభావంతో నిరసనకారులు, మీడియా ప్రతినిధులు పరుగులు పెట్టినట్లు సమాచారం. అయినప్పటికీ బారికేడ్లను బద్దలు కొట్టుకొని రాజధానిలోకి ప్రవేశించడానికే రైతులు కదం తొక్కుతున్నారు. 2020లో చేపట్టిన రైతుల ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం దిగి రావడంతో రైతు సంఘాలు అప్పట్లో విరమించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని, తమ డిమాండ్లు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని.. రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను విరమించి తీరాలన్నది ఇప్పుడు కూడా రైతు సంఘాలు చేస్తున్న ప్రధాన డిమాండ్. పంటకు కనీస మద్దతు ధర, 2020లో రైతులు పెట్టిన కేసులను ఎత్తివేయడం మొదలైన డిమాండ్లను రైతు సంఘాలు తాజాగా మరోసారి కేంద్రం ముందు పెడుతున్నాయి. ప్రస్తుతం నిరసన తెలుపుతున్న రైతులకు అప్పటి వలె ఇప్పుడు కూడా తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని భారత్ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దేశంలో అనేక రైతు సంఘాలు ఉన్నాయని, ఒక్కొక్క సంఘానిది ఒక్కొక్క సమస్య అనీ, ప్రతి సమస్యను తీర్చడం ప్రభుత్వ బాధ్యతనీ ఆయన అంటున్నారు. 'భారత్ కిసాన్ యూనియన్' ఉత్తరప్రదేశ్ కేంద్రంగా నడుస్తోన్న రైతు సంఘం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చౌదరి చరణ్‌సింగ్‌కు 'భారతరత్న' ప్రకటించింది. ఈ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుల్లో చరణ్‌సింగ్ కీలకమైన నేత కావడం ఒక విశేషం. చరణ్‌సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన వేళ దేశవ్యాప్తంగా రైతులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రశంసలు అందించిన అనందం ఇంకా పచ్చగా ఉండగానే, నేడు రైతు సంఘాలు ఆందోళనకు సిద్ధమవ్వడం బీజేపీ ప్రభుత్వాన్ని కలచివేస్తోంది. ఈ ఉద్యమం ఎటువంటి రూపు తీసుకుంటుందో? అనే భయాలు మొదలవుతున్నాయి. గతంలో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.మొత్తంగా రైతు ఉద్యమం ప్రాయోజిత (స్పాన్సర్డ్) కార్యక్రమంగానే బీజేపీ గతంలో భావించింది. ఇప్పటికీ అవే భావనలు తనకున్నాయి. సోమవారం నాడు రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపినప్పటికీ అవి విఫలమైనాయి. మార్కెట్ ఒడుదుడుకులతో సంబంధం లేకుండా పంటకు కనీస మద్దతు ధర కల్పించడం, ఆ దిశగా చట్టం చేయడం అనే అంశాలలో ఇరువైపుల ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఎం.ఎస్.పి, స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు, పంట రుణాల మాఫీకి సంబంధించి చట్టపరమైన హామీలు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటుచేస్తామని కేంద్రం చెప్పిన మాటల పట్ల రైతు సంఘాలకు విశ్వాసం కుదరడం లేదు. నేడు మళ్ళీ ఆందోళనల పర్వం ప్రారంభించడానికే రైతులు సిద్ధమవుతున్నారు. అప్పట్లో ఆందోళనల్లో మరణించిన రైతు కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించినా, ఇంతవరకూ అందకపోవడం కూడా ఆగ్రహానికి మరో కారణం. వివాదాస్పద విద్యుత్ చట్టం 2020ని రద్దు చేయడం, దీని వల్ల కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరంచేస్తే, తమకు అందే రాయితీలు పోతాయని రైతులు భయపడుతున్నారు. భూసేకరణ చట్టం 2013ను పునర్నిర్మించడం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలగడం మొదలైనవి రైతులు చేస్తున్న డిమాండ్లు. ఈ డిమాండ్ల నడుమ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా అగ్గికి ఆజ్యం పోసినట్లవుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధరపై ఇంత హడావిడిగా చట్టాన్ని తీసుకురాలేమన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. ఇది ఇలా ఉండగా... ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులకు భరోసా ఇచ్చేలా మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిపించి తీరుతామని రాహుల్ అంటున్నారు. ప్రస్తుతం మళ్ళీ పైకి లేచిన రైతు ఆందోళనల వెనక కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాల కుట్రలు, కొందరి పెట్టుబడులు, కొన్ని ఉగ్రసంస్థల హస్తాలు ఉన్నాయని బీజేపీకి చెందిన నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మొన్ననే రైతు సంఘ వ్యవస్థాపకుడు, దివంగత నేత చరణ్‌సింగ్‌తో పాటు, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌కు కూడా బీజేపీ ప్రభుత్వం 'భారతరత్న' ప్రకటించడం గమనార్హం. ఏది ఏమైనా, 'ఢిల్లీ చలో' ఆందోళన బీజేపీకి కొత్త తలనొప్పి. మొత్తంగా చూస్తే, దేశ వ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో వున్న రైతు సమస్యలను పునఃసమీక్ష చేయాల్సిన బాధ్యత కేంద్రానికి వుంది. రైతు సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపించడం అత్యంత ముఖ్యమైన అంశం. అన్నదాత కంట కన్నీరు ఏ పాలకునికైనా శాపమై నిలుస్తుంది. కర్షకుడి హర్షం చూసినదే నిజమైన ప్రజాప్రభుత్వం. నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయదారుల సమస్యల వైపు ప్రత్యేకమైన దృష్టి సారించి, దేశాన్ని అన్నపూర్ణగా నిలబెడుతుందని ఆశిద్దాం. -మాశర్మ -
రాజకీయ ప్రలోభాలకు లోనుకావొద్దు: రైతు సంఘాలకు కేంద్రం హితవు
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ఛలో పేరిట ఆందోళనలను తీవ్రతరం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్న తరుణంలో కేంద్రం స్పందించింది. మరోసారి చర్చలకు రావాలని రైతు సంఘాల్ని ఆహ్వానించింది. తమతో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా.. ఈ నెల 16వ తేదీన భారత్ బంద్‌కు కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్ బంద్ ప్రకటించిన కాసేపటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మీడియాతో మాట్లాడారు. ‘‘చర్చల ద్వారా రైతు సంఘాలు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. అంతేగానీ.. రాజకీయ పార్టీల ప్రలోభాలకు రైతు సంఘాలు గురి కావొద్దు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని గుర్తించాలి’’ అని కోరారాయన. అలాగే.. రైతుల మార్చ్ నేపథ్యంలో దేశ రాజధాని ప్రాంతంలో.. శివారుల్లో భారీగా ట్రాఫిక్ ఝామ్ ఏర్పడుతోంది. ఈ పరిణామంపైనా మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని రైతుల్ని కోరారాయన. మరోవైపు చర్చల పిలుపుపై రైతు సంఘాలు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచే పంజాబ్, హర్యానా, యూపీ నుంచి ఢిల్లీ వెళ్లే సరిహద్దులోనే ఉండిపోయారు. మంగళవారం ఉదయం నుంచే ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీకి రెండు వంద కిలోమీటర్ల పరిధిలోనే వాళ్లను నిలువరించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దులో బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. #WATCH | Farmers' protest | Tear gas shells fired to disperse the agitating farmers who were approaching the Police barricade. Visuals from Shambhu Border. pic.twitter.com/AnROqRZfTQ — ANI (@ANI) February 14, 2024 -
ఉద్రిక్తంగా మారిన రైతుల ఢిల్లీ చలో
-
ఢిల్లీ ఛలో’ యాత్ర: కేంద్రానికి రాకేశ్ టికాయత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: రైతుల ‘ఢిల్లీ ఛలో’ యాత్రతో ఢిల్లీ నగర సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. సింగు బోర్డర్ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో నిరనసన కారులు చెల్లాచెదురయ్యారు. శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. దీంతో రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల వేళ రైతుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సమస్యగా సృష్టిస్తే ఊరుకోమని అన్నారు. పలు రైతుల సంఘాలు భిన్నమైన సమస్యలపై పోరాటం చేస్తాయని తెలిపారు. కానీ, నేడు(మంగళవారం) చేపట్టిన రైతుల ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌ను సమస్యగా చిత్రీకరిస్తే ఊరుకోమని మండిపడ్డారు. తాము రైతులకు దూరంగా లేమని.. నిరసన తెలిపే రైతులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గుర్తుచేశారు. #WATCH | On farmers' 'Delhi Chalo' march, farmer leader Naresh Tikait says "Protests are underway in the entire country...The government should sit with us and hold discussions and give respect to the farmers. Government should think about this issue and try to solve this..." pic.twitter.com/2itfTQ6AlR — ANI (@ANI) February 13, 2024 అదేవిధంగా రాకేశ్ టికాయత్ సోదరుడు నరేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై చర్చ జరపాలని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపి అంతేవిధంగా రైతులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆలోచించి రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇక.. రైతుల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ‘భారత్ బంద్’ నిర్వహించాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత్ కిసాన్ యూనియన్(బీకేయూ) దేశంలోని అతిపెద్ద రైతు సమాఖ్యలలో ఒకటి. నేడు ప్రారంభమైన ‘ఢిల్లీ ఛలో’ రైతుల ఆందోళనలో అది చేరితే.. కేంద్రం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతు నిరసనకారుల్లో చర్చజరుగుతోంది. చదవండి: Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్ -
పంజాబ్, హర్యానాలో టెన్షన్.. రోడ్లపై బారికేడ్లు, ఇనుప కంచెలు..
చంఢీగఢ్: పంజాబ్, హర్యానాలో మరోసారి టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రైతులు ‘చలో పార్లమెంట్’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లపై ఆంక్షలు విధించింది. మరోవైపు.. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో రైతుల పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతులు చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో, హర్యానాలోని ఏడు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింధ్, హిస్సార్, ఫతేహబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. Modi government is he'll bent in demeaning the farmers. See how nails has been laid and cement walls has been erected as soon as agitation news of the farmers in Haryana marching towards Delhi came into light. Internet has also been shutdown in many areas of Haryana. pic.twitter.com/9PEdKVh5kC — Soumak Palit INC (@SoumakPalitINC) February 11, 2024 అలాగే, ఏడు జిల్లాల పరిధిలో ఒకేసారి భారీగా ఎస్ఎంఎస్లు పంపడంపై ఈ నెల 11 ఉదయం ఆరు గంటల నుంచి 13 రాత్రి 12 గంటల వరకూ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులు మూసివేసేందుకు హర్యానా పోలీసులు సిద్ధం అయ్యారు. కాగా, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సుమారు 200 రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్ నిర్వహించనున్నాయి. మరోవైపు, ట్రాక్టర్ ర్యాలీతో వచ్చే రైతులను అడ్డుకునేందుకు అంబాలా జిల్లాలోని రహదారులపై పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో, హర్యానా ప్రభుత్వ తీరును రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. STORY | Farmers' Delhi march: Elaborate arrangements at Punjab-Haryana borders, traffic advisory issued READ: https://t.co/q8z42FW2hE VIDEO | pic.twitter.com/xiaUKyuERH — Press Trust of India (@PTI_News) February 10, 2024 -
Delhi: రైతుల భారీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు
ఢిల్లీ: వందలాది మంది రైతులు నిరసన తెలుపుతూ.. పార్లమెంట్ వరకు చేపట్టిన ర్యాలీని నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్స్‌ను దాటడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిత్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దానికి సంబంధించన వీడియో వైరల్ మారింది. నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ రూట్లో నిరసన ర్యాలీ చేట్టవద్దని ముందుగా సమాచారం అందించినా రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. దీంతో అక్కడ అధికంగా ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. VIDEO | Hundreds of protesting farmers stopped by police near Mahamaya Flyover in Noida as they try to march to the Parliament. Farmer groups in Noida and Greater Noida have been protesting since December 2023, demanding increased compensation and developed plots for the land… pic.twitter.com/FcSN2etfyH — Press Trust of India (@PTI_News) February 8, 2024 అయితే నోయిడాలోని పలు గ్రామాల రైతుల తాము పార్లమెంట్ బయట తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతామని ప్రకటించారు. తాము ట్రాక్టర్లు, బస్సులతో రాజాధాని ఢిల్లీకి నిరసనగా ప్రవేశిస్తామని తెలిపారు. వారంతా మహామాయ ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని ఢిల్లీవైపు బయలుదేరుదామని నిర్ణయించుకున్నారు. కాగా.. ఒక్కసారిగా వందలది మంది రైతులు తమ వాహనాలతో గుమిగూడటంతో ట్రాఫిక్ అంతరాయంతో పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రైతులను ర్యాలీ ముందుకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. నివాస అవసరాల కోసం సేకరించిన మొత్తం భూమిలో 10 శాతం, 64.7 శాతం పెంచిన భూ పరిహారం, రెసిడెన్షియల్ ప్లాట్లపై వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి, ఇతర ప్రయోజనాల కోసం తమ డిమాండ్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని భారతీయ కిసాన్ ఏక్తా సంఘ్ నాయకుడు సుఖ్బీర్ యాదవ్ మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో రైతులమంతా పార్లమెంట్ వద్దకు నిరసన ర్యాలీ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. చదవండి: Delhi: కూలిన మెట్రో స్టేషన్ వాల్... పలువురికి గాయాలు! -
మద్దతు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం
యూరప్‌లో కనివిని ఎరుగని వ్యవసాయ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్‌లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించి, రొమేనియా, నెదర్లాండ్స్, పోలండ్, బెల్జియం దేశాలను కూడా తాకాయి. మరోవైపు దేశంలో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు తమ నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు కావని ఐరోపా అనుభవాలు చాటుతున్నాయి. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫలమయింది. అందుకే భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయదారుల నిరసనలు ఫ్రాన్స్‌లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించాయి. అక్కడ కోపోద్రిక్తులు అయిన రైతులు బెర్లిన్ ను దాదాపుగా స్తంభింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఈ నిరసన ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చింది. ఆగ్రహించిన రైతులు ప్యారిస్ను ట్రాక్టర్లతో ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యవసాయదారుల ప్రకంపనలు రొమేనియా, నెదర్లాండ్స్, పోలాండ్, బెల్జియంలకు కూడా విస్తరించాయి. స్పానిష్ రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులు ట్రాఫిక్ని అడ్డుకుని ప్రభుత్వ భవనాలపై పేడ చల్లుతున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, సభ్య దేశాలలో వ్యవసాయ సమాజంలో పెరుగుతున్న నిరుత్సాహాన్ని, నిరాశను గుర్తించడం ద్వారా బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ‘ఎటువంటి ప్రశ్న లేకుండా, సవాళ్లు పెరుగుతున్నాయని మేము అందరం అంగీకరిస్తాము. విదే శాల నుండి పోటీ కావచ్చు, స్వదేశంలో అధిక నియంత్రణ కావచ్చు, వాతావరణ మార్పు కావచ్చు లేదా జీవవైవిధ్యం కోల్పోవడం... పేర్కొనడానికి ఇవి కొన్ని అంశాలు’ అని ఆమె అన్నారు. కానీ సమస్యలను ప్రస్తావించడంలో ఆమె విఫలమైన విషయం ఏమిటంటే... రైతులకు భరోసా ఇవ్వకపోవటం, సరైన ధరను నిరాకరించడం పైనే ప్రధానంగా రైతుల ఆగ్రహం ఉంటోందని. ఉక్రెయిన్ (లేదా ఇతర ప్రాంతాల) నుండి వస్తున్న దిగుమతులు ధరలు తగ్గడా నికి కారణమయ్యాయి. అలాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయ వాహ నాలకు ఇస్తున్న డీజిల్ సబ్సిడీని ఉపసంహరించుకున్నారు. వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ ఆదాయం క్రమంగా క్షీణించడం. ‘మాకు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. మా ఉత్పత్తులు విలువైనవి, అవి మంచి ధరలకు విక్రయం అవాలని మేము కోరుకుంటున్నాము’ అని ఆగ్రహించిన ఒక బెల్జియన్ రైతు చెప్పాడు. వీటన్నింటికీ నిరసనగా వేలాది ట్రాక్టర్లతో ముట్టడించడానికి యూరోపియన్ రైతులను నడిపిస్తున్న నిరాశను ఆయన క్రోఢీకరించాడు. ‘మేము చనిపోవడానికి మాత్రమే ఇక మిగిలి ఉన్నాము’ అని మరొక బెల్జియన్ రైతు వ్యాఖ్యానించాడు. ఫ్రాన్ ్స రైతులలో మూడింట ఒకవంతు మంది కేవలం నెలకు 300 యూరోల (సుమారు రూ. 27,000)తో జీవిస్తున్నారనీ, ఎంపీల భత్యాలను మరో 300 యూరోలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారనీ ఒక ఫ్రెంచ్ ఎంపీ ఇటీవల అన్నారు. రైతులు నిరసనల తరుణంలో ఎంపీ లకు భత్యాల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి వాటిని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. జర్మనీలో 2016–23 సంవ త్సరాల మధ్య, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని వ్యవసాయ ఆర్థిక బారోమీటర్ సూచిక చూపిస్తోంది. రొమేనియాలో నికర వ్యవసాయ ఆదాయం 2023లో 17.4 శాతం క్షీణించింది. ఈ పరిస్థితి యూరప్‌కే పరిమితం కాదు. ‘వారు మమ్మల్ని ప్రపంచ పటం నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అమెరికాలోని చిన్న రైతులను ఉటంకిస్తూ వచ్చిన మీడియా నివేదిక లను ఇది నాకు గుర్తు చేస్తోంది. అమెరికాలో గ్రామీణ ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే 3.5 రెట్లు అధికంగా ఉండటంతో, వ్యవసాయ మాంద్యంలో పెరుగుతున్న ఆటుపోట్లను పరిష్కరించడం జాతీయ సమస్యగా మారుతోంది. భారతదేశంలో 2022లో 11,290 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పట్ల మార్కెట్లు అవగాహనతో ఉన్నట్లయితే రైతులు ప్రపంచ వ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనేవారు కాదు. ఇంకా, వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే బదులు, వ్యవసాయం నుండి రైతులను తప్పించడానికి యూరోపియన్ దేశాల ప్రభుత్వాలకు వాతావరణ మార్పు ఉపయోగపడుతోంది. ‘రైతుల నిరసనలు సమర్థనీయమైనవే’ అని రొమేనియా ప్రధాన మంత్రి మార్చెల్ చొలాకూ అంగీకరించారు. కొత్తగా నియమితులైన ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియేల్ అటల్ తమ ప్రభుత్వం ‘వ్యవసాయాన్ని అన్నింటికంటే ఉన్నత స్థాయిలో ఉంచాలని’ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి డీజిల్ సబ్సిడీని ఒకేసారి రద్దు చేయడానికి బదులుగా దశలవారీగా తొలగించాలని జర్మనీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ హామీలు ఉన్నప్పటికీ, రైతులకు భరోసాగా ఆదాయాన్ని అందించడంలో మార్కెట్ల వైఫల్యం, వ్యవసాయ రంగంలో పెరుగు తున్న నిరుత్సాహం వెనుక ఉన్న అసలు విలన్‌ను యూరోపియన్ నాయకులెవరూ ఎత్తి చూపలేకపోయారనేది వాస్తవం. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవ సాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అయివుంటే, ఐరోపా ఇప్పుడు దశాబ్దంగా ఎక్కడో ఒకచోట పునరావృతమౌతున్న రైతుల అశాంతిని ఎదుర్కొనేందుకు ఎటువంటి కారణమూ లేకపోయేది. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫల మయిందని ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి. వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడం ద్వారా ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి రూపొందించిన స్థూల ఆర్థిక విధానాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నా యని ఇది చూపిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ద్రవ్యోల్బణం యొక్క నిజమైన చోదక శక్తులైన గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచబడ్డాయి. అది స్థూల ఆర్థిక వంచన. రైతులు తరచుగా ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టంగా అర్థమైంది. 2020–22లో సంవత్సరానికి 107 బిలియన్ డాలర్ల భారీ మద్దతును గుమ్మరించినప్పటికీ (ఏదేమైనప్పటికీ, సబ్సిడీలు, ప్రత్యక్ష ఆదాయ మద్దతును అత్యధికంగా స్వీకరించే వారిలో యూరోపియన్ రైతులే ఎక్కువగా ఉన్నారు) వ్యవసాయ జనాభాను చెక్కుచెదరకుండా ఉంచడంలో విఫలమయ్యారు. 2023లో యూరోపియన్ వ్యవసాయ నిరసనల కోపాన్ని కూడా అది తగ్గించలేదు. 2024 ప్రారంభం ఆందోళన విస్తరిస్తున్నట్లు, ఇంకా తీవ్రతరం అవబోతున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని రైతు సంఘాల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుండటం ఇక్కడే నేను చూస్తున్నాను. ప్రోత్సాహకాల కోసం అడగడానికి బదులుగా, భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నారు. కనీస మద్దతు ధరని రూపొందించే ఫార్ములాకు పునర్విమర్శ అవసరం అయినప్పటికీ, మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే, వ్యవసాయ జనాభా త్వర లోనే అంతరించిపోతుందని యూరోపియన్ రైతులు అర్థం చేసు కోవాలి. వ్యవసాయాన్ని ఆచరణీయమైనదిగా మార్చడానికి, వ్యవ సాయ ధరలకు కచ్చితమైన హామీ ఇస్తూ, నిర్దేశిత ధర కంటే తక్కువ కొనుగోళ్లకు అనుమతి లభించకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధరలు మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తాయని ప్రధాన ఆర్థికవేత్తలు వాదిస్తారు. మార్కెట్లు సర్దుబాటు అవుతాయి, ఆ పేరుతో రైతులకు జీవన ఆదాయాన్ని తిరస్కరించ లేము. ధర విధానాలలో చరిత్రాత్మక దిద్దుబాటుకు ఇది సమయం. ఏ రైతూ బాధను అనుభవించకుండా లేదా అతని జీవితాన్ని బలవంతంగా ముగించకుండా ఇది నిలుపుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
Farmers movement: యూరప్‌లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్‌లో కర్నాటక రైతుల ఆందోళన
-
సన్‌ఫ్లవర్ ధరపై సమస్య..జాతీయ రహదారిని నిర్బంధించిన రైతులు
హరియాణా:సన్ఫ్లర్ (పొద్దుతిరుగుడు) పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంపై హరియాణాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీఎం మంజూరు చేసిన రిలీఫ్ ఫండ్ తక్కువగా ఉందని రోడ్లపైకి వచ్చారు. కురుక్షేత్ర జిల్లాలో నిర్వహించిన మహాపంచాయత్ తీర్మాణం మేరకు ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారిపై రైతులు బైటాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. హరియాణాలో సన్‌ఫ్లవర్‌కు కనీస మద్దతు లభించడంలేదు. మద్దతు ధర లభించని పంటలకు రాష్ట్రంలో భవంతర్ భర్తీ యోజన(బీబీవై) కింద రిలీఫ్ ఫండ్‌ను ప్రభుత్వం ఇస్తోంది. అయితే. ఈ ఏడాదికి 36,414 ఎకరాల్లో సాగు చేసిన సన్‌ఫ్లవర్ పంటకు రూ.29.13కోట్లను విడుదల చేశారు సీఎం మనోహర్ పారికర్. అయితే.. ఈ ఫండ్‌పై సంతృప్తి చెందని రైతులు ఆందోళనలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్‌ఫ్లవర్ క్వింటాల్‌కు రూ.1000ని నష్టపరిహారంగా ఇస్తోంది. కానీ రూ.6400 కనీస మద్దతు ధర ఇచ్చి సన్ఫ్లవర్ను కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక ఆరోపణల్లో ఉద్యమించిన రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా ఈ మహాపంచాయత్‌లో పాలుపంచుకున్నారు. రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా ఈ నిరసనల్లో ఉన్నారు. దీనిపై స్పందించిన సీఎం మనోహర్ పారికర్.. రైతు సంఘాలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి:'కొవిన్ యాప్‌లో వ్యక్తిగత డేటా లీక్'.. కేంద్రంపై ప్రతిపక్షాలు ఫైర్.. -
రోడ్డుపై ధాన్యం పోసి తగలబెట్టిన రైతులు..
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గణపురంలో రైతులు ఆందోళన నిర్వహించారు. రహదారిపై బైఠాయించిన రైతులు.. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. సకాలంలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిందని నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం..NWCకి ఫిర్యాదు -
గానుగుపహాడ్ క్రాస్ రోడ్ వద్ద రహదారిపై రైతుల ధర్నా
-
రైతుల పాదయాత్రకు దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్
రైతుల పాదయాత్రకు దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్ -
బీకేయూ నేత తికాయత్‌కు బెదిరింపులు
ముజఫర్‌నగర్(యూపీ): భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. రైతు సంఘాల ఆందోళనల నుంచి దూరంగా ఉండకుంటే రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబాన్ని బాంబు వేసి చంపుతామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా హెచ్చరించాడు. ఈ మేరకు రాకేశ్ తికాయత్ సోదరుడు గౌరవ్ తికాయత్, బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిని గుర్తించి, పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని భవురా కలాన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అక్షయ్ శర్మ చెప్పారు. రద్దయిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రైతు నేతల్లో రాకేశ్ తికాయత్ ఒకరు. చట్టాలు రద్దయిన తర్వాత కూడా ఆయన దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై రైతు సంఘాలు చేపట్టే నిరసనల్లో పాల్గొంటున్నారు. -
కైటెక్స్ వాస్తు కోసం భూ సర్వే
గీసుకొండ: ఓ కంపెనీ అడిగిన మేర ప్రభుత్వం భూములు కట్టబెడుతున్న వైనం వివాదాస్పదమవుతోంది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో చిన్న పిల్లల గార్మెంట్లు తయారీకి కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పార్కులో కంపెనీకి 187 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. షెడ్ల నిర్మాణం జరుగుతుండగా ప్రహరీ గోడ వంకరగా ఉందని, వాస్తు సవరించుకోవడానికి మరో 13.29 ఎకరాలు కావాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సమ్మతించిన రెవెన్యూ యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శాయంపేటహవేలి పరిధిలో కేటాయించేందుకు రైతులకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం అధికారులు సర్వేకు రాగా పోలీసులు రైతుల చేలవద్ద మొహరించారు. పోలీసులు, రెవెన్యూవర్గాలపై రైతుల ఆగ్రహం ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులపై రైతులు మండిపడ్డారు. సర్వేను నిలిపివేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళా రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలను పట్టుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు నివారించారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు సంగెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బంది సర్వే పనులను కొనసాగించారు. ‘‘ఎకరా రూ.50లక్షలుంటే మాకు పది లక్షలే ఇచ్చారు’’ కేఎంటీపీ కోసం కొంత భూమిని ఇప్పటికే ఇచ్చామని, ఎకరానికి రూ.10 లక్షల చొప్పున చెల్లించిన ప్రభుత్వం ప్రతి ఎకరానికి వంద గజాల ఇంటి స్థలం, పార్కులో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని రైతులు వాదిస్తున్నారు. తమ దగ్గర కారుచౌకగా భూములను తీసుకుని కంపెనీలకు ఐదారు రెట్ల ధరలకు అమ్ముతోందని ఆరోపిస్తున్నారు. సారవంతమైన రెండు పంటలు పండే నీటి వసతి ఉన్న తమ భూములకు ఎకరానికి సుమారు రూ.50లక్షల మేర మార్కెట్ ధర ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర తమకు సమ్మతం కాదన్నారు. -
లఖీంపూర్ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్
న్యూఢిల్లీ: రైతులతో పాటు మొత్తం 8 మందిని బలిగొన్న లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బుధవారం 8 వారాల మధ్యంతర బెయిలిచ్చింది. ‘‘పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు సమర్పించాలి. బెయిల్ సమయంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో ఉండొద్దు. ఎక్కడ ఉండేదీ ట్రయల్ కోర్టుకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. అక్కడ వారానికోసారి వ్యక్తిగతంగా హాజరై అటెండెన్స్ నమోదు చేయాలి’’ అని ఆదేశించింది. సాక్షులు తదితరులను ప్రభావితం చేయకుండా ఉండేందుకే ఈ షరతు విధిస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జె.కె.మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ను, అతని కుటుంబాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. మరో నలుగురు నిందితులకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. -
ఒక దేశం – ఒకే పువ్వు
ఎవరో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు వీచే ముందు గాలులు అనుమతి తీసుకోవాలని వీచే ముందు గాలులు తమ దిశ దశ ఏమిటో ఎటో వివరాలు తెలియ జేయాలని ఎవరో కొత్త చట్టం తెచ్చారు గాలులు ఎంత దూరం పోవాలనుకున్నాయో అవి ఎంత వేగంగా వీచాలనుకున్నాయో వివరాలు సమర్పించనిదే అనుమతి దొరకదని ఎవరో కొత్త చట్టం తెచ్చారు ఇప్పుడిక్కడ సుడిగాలులకు అనుమతి లేదు మేం కడుతున్న ఆ పేకమేడల్ని సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది అందువల్ల ఈ చట్టాలు సత్వరమే అమల్లోకొస్తున్నాయి! తమ చుట్టాలకు అనుగుణంగా ఎవరో ఇక్కడ కొత్త చట్టాలు తెచ్చారు ఒడ్డును తాకే కెరటాలక్కూడా ఒక హెచ్చరిక! ఎగిసెగిసి పడటం మళ్లీ తిరిగి వెళ్ళడం బలం పుంజుకుని మళ్లీ నీటి పిడికిళ్ళతో తిరిగి రావడం ఇవన్నీ ఇప్పుడిక కుదరదు తిరుగుబాట్లు, ఉద్యమాలు, హోరెత్తిపోవడాలు నిషిద్ధం ఎంతటి ఉధృతి ఉన్నా బుద్ధిగా ఒడ్డులోపల మాత్రమే నిశ్శబ్దంగా ప్రవహించాల్సి ఉంటుంది! తోటలోని మొక్కలన్నీ ఒకే విధంగా పూయాలని పూచే పూల రంగు కూడా ఒకటిగానే ఉండాలని కొత్త చట్టం అమలులో కొచ్చింది ఒకే రంగు మాత్రమే కాదు ఏ పువ్వు రంగు ఎంత గాఢంగా ఉండాలో కూడా వారు నియమించిన వారి అధికారులే నిర్ణయిస్తారట! ఒక దేశం – ఒకే పువ్వు!! ఈ చట్టాలు చేసిన గౌరవనీయులకు ఎవడు చెప్పాలి? తోటలో అన్ని మొక్కల పూలు ఒకే రకంగా ఉండవని – ఉండటానికి వీలే లేదని – ఒక రంగులో అనేక రంగులుంటాయని కూడా వారికి ఎవడు చెప్పాలి? గాలులు, కెరటాలు ఎవరి చట్టాలకూ లొంగవనీ గాలి ఎవరి పిడికిలిలోనో ఖైదీగా ఉండదని కెరటం ఎవరి జీవోలతోనో వెనక్కి మళ్ళదని ఎంతటి వారైనా సరే, వాటిని గమనిస్తూ వాటికి అనుగుణంగా బతకాల్సిందే తప్ప మరో మార్గం లేదని! లేకపోతే, అవి సృష్టించే సునామీలో అడ్రసు లేకుండా గల్లంతు కావల్సిందేనని నామరూపాలు లేకుండా నశించాల్సిందేనని వారికి ఎవరైనా చెప్పండి! కనీస గౌరవమైనా... కాపాడుకొమ్మని!! – డాక్టర్ దేవరాజు మహారాజు (దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమ నేపథ్యంలో) -
అన్నదాతకు అండగా.. ‘సాక్షి’ అక్షర సమరం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగించిన ఉద్యమానికి ‘సాక్షి’ అండగా నిలిచింది. భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు నిత్యం అండగా ఉంటూ ‘కథనోత్సాహం’తో అక్షర పోరు సాగించింది. ‘చిక్కుముడుల మాస్టర్ ప్లాన్’ అంటూ డిసెంబర్ 2న ప్రచురితమైన కథనంతో ముసాయిదాలోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌లో ఏముందో అంటూ ముసాయిదాలో పేర్కొన్న చాలా అంశాలను ప్రముఖంగా ప్రచురించడంతో బాధి త రైతులు జాగృతమయ్యారు. సుమారు యాభై రోజులు అలుపెరుగని పోరు సలిపారు. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలకు ప్రాధాన్యతనిస్తూ, రైతుల ఆవేదనకు ‘సాక్షి’గా నిలిచింది. ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలు, పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరి మనన్నలు అందుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. భూమికోసం సాగించిన సమరంలో తమకు దన్నుగా నిలిచిన ‘సాక్షి’కి రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. -
పరిహారం కోసం పాదయాత్ర
సాక్షి, యాదాద్రి: పరిహారం కోసం వెయ్యి మంది రైతులు రోడ్డెక్కారు. పాదయాత్రగా వచ్చి అధికారులకు మొర పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వా పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ రైతులు, ప్రజలు 52 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అధికారుల్లో చలనం లేకపోవడంతో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రాజెక్టులో మునిగిపోతున్న భూములకు, ఇళ్లకు పరిహారం, పునరావాసం, రిహాబిలిటే షన్ అండ్ రీసెటిల్మెంట్(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ డబ్బు లను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ల రద్దు! కౌన్సిళ్ల కీలక నిర్ణయం
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ జగిత్యాల: తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికీ పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. రైతుల ఉధృత ఉద్యమంతో.. కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి డీటీసీపీ, ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ సంస్థలు కలిసి ముసాయిదా రూపొందించడం, అందులో పంట భూములను పారిశ్రా మిక, వాణిజ్య జోన్లుగా చూపడాన్ని తప్పుపడుతూ రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. జెడ్పీ మాజీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి దిగారు. దీనికి వివిధ రాజ కీయ పక్షాలు మద్దతుగా నిలి చాయి. అయితే అడ్లూర్ ఎల్లా రెడ్డికి చెందిన రైతు పయ్యవుల రాములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో పోరాటం ఉధృతమైంది. చివరికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో సమీక్షించారు. అనంతరం ముసా యిదా ప్రక్రియను నిలిపివేస్తున్నామని అరవింద్‌కుమార్ ప్రక టించారు. విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసు కుని కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రైతుల భూమిని సేకరించే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయ లేదని, రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో టపాసులు కాల్చారు. ఉద్యమానికి అండగా నిలిచారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అభినందించారు. జగిత్యాల మున్సిపాలిటీలోనూ.. జగిత్యాల మున్సిపాలిటీలోనూ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ పాలకవర్గం శుక్రవారం తీర్మానించింది. జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ శివార్లలోని హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్, ధరూర్, నర్సింగాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములను రిక్రియేషన్, ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలో చేర్చారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజ లు, రైతులు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారో కోలు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, వంటావార్పుతో నిరసనలు తెలిపారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ముట్టడి, పట్టణ దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. -
జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం
సాక్షి, జగిత్యాల: మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్భందనానికి గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాలలో నలువైపులా రహదారుల దిగ్బంధం చేయనున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలకు రైతుల ప్రణాళికలు సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ వద్దంటూ రైతులకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసిస్తూ పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తమ గ్రామాన్ని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తీర్మాన ప్రతిని జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌కు ప్రజలు అందజేశారు. తిమ్మాపూర్ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై నిరసనలు ఉదృతం చేసేందుకు రైతు జేఏసీ ఏర్పాటుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. జగిత్యాల బల్దియా జారీ చేసిన ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై బుధవా రం కూడా ఆందోళనలు కొనసాగాయి. జగిత్యా ల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ రైతులు పంచాయతీ కార్యాలయం ఎదుట సమావేశమై ఆందోళన నిర్వహించారు. మరోవైపు.. మోతె, ధరూర్, తిప్పన్నపేట, నర్సింగాపూర్, హస్నాబాద్, అంబారిపేట, తిమ్మాపూర్ గ్రామాలను మాస్టర్‌ప్లాన్ నుంచి తొలగించాలని కోరుతూ మోతె సర్పంచ్ భర్త సురకంటి రాజేశ్వర్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేశారు. -
కామారెడ్డి రైతుల సంచలన నిర్ణయం.. వారు రాజీనామా చేయాలని హెచ్చరిక
సాక్షి, కామారెడ్డి: మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్ రద్దుపై పాత రాజంపేటలో 8 గ్రామాల రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, రైతుల సమావేశంలో ఎల్లుండి(గురువారం) సాయంత్రం వరకు కౌన్సిలర్ల రాజీనామాకు గడువు ఇచ్చారు. 19న విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని హెచ్చరించారు. 20వ తేదీన ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. మున్సిపల్ తీర్మానం చేయించి మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. బీజేపీ కౌన్సిలర్లు ఐక్య కార్యాచరణ కమిటీకీ రాజీనామా పత్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా.. కామారెడ్డిలో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి రామేశ్వరపల్లికి చెందిన బాలకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. నిర్మల్‌లో పాత రోడ్లనే బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
అందుకే గందరగోళం.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ఎమ్మెల్యే క్లారిటీ..
కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్‌ను మారుస్తామని చెప్పారు. గ్రీన్ జోన్ కూడా ప్రభుత్వ భూముల్లోకి మారస్తామని పేర్కొన్నారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను, ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగిస్తామని తెలిపారు. డీటీసీపీ, కన్సల్టెన్సీ అధికారుల తప్పిదంతోనే గందరళగోళం నెలకొందని గంప వివరణ ఇచ్చారు. రైతులకు చెందిన గుంట భూమి కూడా పోదని హామీ ఇచ్చారు. కౌన్సిల్ సమావేశం తర్వాత మాస్టర్‌ప్లాన్ ఫైనల్ చేస్తామన్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. స్థానిక రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ భూమి పోతోందని పెద్దఎత్తున్న ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. ప్రతిపాదిత ప్లాన్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 11 వరకు గడువు ఉందని గుర్తు చేశారు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
పొలాలను లాక్కోరు.. కేవలం ప్రతిపాదన మాత్రమే: కామారెడ్డి కలెక్టర్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ముసాయిదా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం రైతుల ఆందోళనలు నెలరోజులుగా కొనసాగుతున్నాయి. తాజాగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై కలెక్టర్ జితేష్ పాటిల్ మరోసారి వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని.. ఎవరి భూములు తీసుకోవడం లేదని వెల్లడించారు. అందరి అభిప్రాయాలను సేకరిస్తామని, ఇంకా 60 రోజులు పూర్తి కాలేదని తెలిపారు. జనవరి 11 వరకు అభిప్రాయాలు చెప్పొచ్చని కలెక్టర్ తెలిపారు. 2000 సంవత్సరం పాత మాస్టర్ ప్లాన్‌లో రోడ్లను కూడా చూపించారు. వారి భూములు పోయాయా అని ప్రశ్నించారు. ఇప్పటికీ వారిపేరు మీదే భూములు ఉన్నాయని, రైతు బంధు వస్తోందని గుర్తు చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌తో ఎవరి భూములు పోవని స్పష్టం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌పై ఇప్పటి వరకు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని,అభ్యంతరాలు చెప్పడానికి రైతులకు పూర్తి హక్కు ఉందని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూ సేకరణ కాదు. అభ్యంతరాలను పరిశీలించి అధికారులు రిమార్క్స్ రాస్తారు. మార్పులు చేర్పులు చేయడానికే డ్రాఫ్ట్. ఇది ప్రతిపాదన మాత్రమే.. మొదటి స్టేజ్‌లోనే ఉంది. ఇండస్ట్రీయల్ జోన్ ప్రకటించిన మాత్రాన పంట పొలాలను లాక్కోరు.’ అని కలెక్టర్ పేర్కొన్నారు. చదవండి: ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? కావాలనే చేశారా? -
కామారెడ్డిలో ఉద్రిక్తత.. హైకోర్టును ఆశ్రయించిన రైతులు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. జిల్లాలో మూడు రోజు కూడా రైతుల ఆందోళన కొనసాగుతోంది. కాగా, మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి రైతులు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్లో తమను సంప్రదించకుండా రీక్రియేషన్ జోన్‌గా ప్రకటించారని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ తమకు నష్టం చేసే విధంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రైతుల పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇక, అంతకముందు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ శుక్రవారం రైతులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు.. శనివారం కూడా కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన కొనసాగుతోంది. మాస్టర్ ప్లాన్ మార్చాల్సిందేనంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు కలెక్టర్ తమను కలవలేదని మండిపడుతున్నారు. కాగా, రైతుల నిరసనల నేపథ్యంలో కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక, విపక్ష నేతల పర్యటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అంతకుముందు.. కలెక్టరేట్ వద్ద పోలీసు వాహనం ధ్వంసం కేసులో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో కొందరు రైతులు, బీజేపీ నేతలు ఉన్నారు. -
బంద్ ఎఫెక్ట్.. కామారెడ్డిలో హై టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లను పోలీసులు బ్లాక్ చేశారు. రైతుల ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు రైతు జేఏసీ, కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మాస్టర్ ప్లాన్‌కు నిరసనగా శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలో బంద్ పాటించాలని రైతు ఐక్య కార్యాచారణ కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. రైతు జేఏసీ నాయకులు విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైతం జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాల చేసుకుంటూ విద్యార్థులు బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో బంద్ నేపథ్యంలో కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం, బీబీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు.. మాస్టర్ ప్లాన్ భూబాధత రైతులకు మద్దతుగా కామారెడ్డిలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలో స్వచ్చందంగా వ్యాపారులు షాపులను బంద్ చేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్న చేస్తున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదంటున్న బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రైతులకు కాంగ్రెస్ నేత షబ్బీర్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళనను అవమానించారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మాస్టర్ ప్లాన్‌ను సవరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం..రైతుల భూములను లాక్కుంటోంది. రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
Kamareddy: మాస్టర్ ప్లాన్‌పై రైతుల ఆందోళన.. కలెక్టర్ ఏమన్నారంటే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రైతులు వచ్చి వినతిపత్రం ఇవ్వచ్చని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పొచ్చని.. వాటిని పరిగణనలోకి తీసుకుంటాని తెలిపారు. అలాగే కొత్త మాస్టర్ ప్లాన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. మరోవైపు కామారెడ్డి కలెక్టరేట్ ముందు రైతులు నిరసన విరమించారు. కలెక్టర్ దిష్టిబొమ్మను రైతులు దగ్దం చేశారు. కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం కామారెడ్డి బంద్‌కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. కాగా అంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద హెటెన్షన్ నెలకొంది. కలెక్టరేట్ ముందు టెంట్ వేసి రైతులు ధర్నా చేపట్టారు. ఆందోళన విరమించి., బృందాలుగా లోపలికి రావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కోరినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. మాస్టర్ ప్లాన్‌పై స్పష్టత వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ బయటకు రావాల్సిందేనని పట్టుబట్టారు. కాగా కామారెడ్డి బల్దియాలో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పంటలు పండే భూములను ఇండస్ట్రీయల్ జోన్ కింద చూపడం, అవసరం లేని చోట్ల 100 ఫీట్ల రోడ్లు ప్రతిపాదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం రైతులు తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.అయితే మాస్టర్ ప్లాన్‌లో భూమి పోతుందని మనస్తాపంతో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో రైతులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. చదవండి: KTR: మాస్టర్‌ప్లాన్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్ -
KTR: మాస్టర్‌ప్లాన్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, కామారెడ్డి జిల్లా: మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్‌ప్లాన్ అని ఆయన స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. ప్రజల అభ్యంతరాలను ప్రజాప్రతినిధులు సమగ్రంగా సమీక్షించాలన్నారు. కాగా, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నాకు దిగారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రైతులకు సంఘీభావం తెలిపారు. కలెక్టర్ వచ్చి మెమోరాండం తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించారు. పోలీసులకు సహకరిస్తామని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. చదవండి: కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్ మాస్టర్ ప్లాన్! -
కామారెడ్డి జిల్లా అడ్లూర్‌లో ఉద్రిక్తత
-
కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్ మాస్టర్ ప్లాన్!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని అడ్లూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్‌లోని భూమి కోల్పోవడంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రాములు ఆత్మహత్యతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే, గత నెలరోజులుగా మాస్టర్ ప్లాన్‌పై కామారెడ్డి రైతులు ధర్నా చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో రాములు సూసైడ్ నోట్‌తో ఈ రగడ మరింతగా ముదిరింది. జరిగింది ఇదే.. కామారెడ్డి టౌన్: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు(42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇలి్చపూర్ వద్ద 3 ఎకరాల సాగుభూమి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో ఆయన భూమిని ఇండ్రస్టియల్ జోన్లోకి మార్చడంతో భూమి అమ్ముడుపోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు బుధవారం మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకుని బల్దియా వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరగా.. పోలీసులు కామారెడ్డి బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో రైతులు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. రైతులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. అనంతరం పోలీసులు కొత్తబస్టాండ్ వద్దనున్న మృతదేహాన్ని అశోక్‌నగర్ కాలనీ, రైల్వేగేట్, పాత బస్టాండ్ మీదుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. బల్దియా వద్ద ధర్నా తన భర్త మృతదేహన్ని అనుమతి లేకుండా పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించడంపై మృతుడి భార్య శారద నిరసన తెలిపింది. ఆమె పెద్ద కుమారుడు అభినందు, చిన్న కుమారుడు నిషాంత్, బంధువులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద ఆందోళన చేశారు. కమిషనర్ కమీషనర్ రాగానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. మద్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. ఆందోళనలో లింగాపూర్, అడ్లూర్ఎల్లారెడ్డి, ఇలి్చపూర్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న రాములు భార్య పయ్యావులు శారద కోరింది. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి, కుటుంబ సభ్యులతో కలి సి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రభుత్వం, అధి కారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామనికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఢిల్లీలో 50వేల మందితో ‘కిసాన్ గర్జన’.. మరో రైతు ఉద్యమానికి సన్నాహమా?
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెలలతరబడి వేలాది మంది రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. కానీ, కేంద్రం వైఖరిపై ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సోమవారం సుమారు 50వేల మంది రైతులు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు ఇచ్చిన ‘కిసాన్ గర్జన’ ర్యాలీ కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రైతులు. రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైతు రుణాల మాఫీ, పంటలకు సరైన ధర, పాడైన పంటలకు పరిహారం వంటి డిమాండ్లతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సమావేశం రైతలు బలాన్ని సూచిస్తుందని పలువురు తెలిపారు. మరోవైపు.. సాగు చట్టాల రద్దు సమయంలో రైతుల డిమాండ్లు తీరుస్తామని కేంద్ర ప్రభుత్వ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల అమలును గుర్తు చేసినట్లవుతోందన్నారు. బీకేఎస్ డిమాండ్లలో ప్రధానమైనవి.. ► అన్ని పంట ఉత్పత్తులపై లాభదాయకమైన ధరలు ► పంట ఉత్పత్తులపై ఎలాంటి జీఎస్టీ ఉండకూడదు ► కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్న సాయాన్ని పెంచడం ► జన్యుపరంగా మార్పు చేసిన ఆవాల విత్తనాలకు అనుమతులు ఇవ్వకూడదు ► రైతు అనుకూల ఎగుమతి, దిగుమతులు విధానాన్ని రూపొందించటం ► 15 ఏళ్ల వాహనాల తక్కు పాలసీ నుంచి రైతుల ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం కాంగ్రెస్ హెచ్చరిక.. దేశ రాజధానిలో మరోసారి భారీ స్థాయిలో రైతులు సమావేశం కావడంపై హెచ్చరికలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. గతంలో జరిగిన విషయాల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మళ్లీ ఎదురవకుండా చూసుకోవాలన్నారు. రైతుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన సమయం ఇదేనని, లేదంటే వారు మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు.. గతంలో రైతుల ఆందోళనలతో ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కిసాన్ గర్ణన వేళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రామ్‌లీలా మైదనానికి వెళ్లే దారులను మళ్లించారు. మహరాజ్ రంజీత్ సింగ్ మార్గ్, మిర్దార్ద్ చౌక్, మింటో రోడ్, అజ్మేరి గేట్, ఛమన్‌లాల్ మార్గ్, ఢిల్లీ గేట్ వంటి మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
మా భూములకూ పట్టాలు ఇవ్వండి
సాక్షి, మహబూబాబాద్: ‘తాతలు, తండ్రుల కాలం నుంచి అడవి బిడ్డలతో కలసి బతుకుతున్నాం. అడవిలోనే పుట్టాం.. ఇక్కడే పెరిగాం. మేం సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోతే ఎలా? మేము ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలి’అంటూ మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనేతర రైతులు తమ గోడు వినిపించారు. తమకు పట్టాలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డేవిడ్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో గిరిజనేతరులకు పట్టా లు ఇచ్చేందుకు సాధ్యం కాని నిబంధనలు విధించింది. దీంతో తమకు పట్టాలు వచ్చే అవకాశం లేదని భావించిన గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం ఏజెన్సీ మండలాలకు చెందిన రైతుల ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ పాటించారు. అనంతరం ట్రాక్టర్లు, ఆటోల ద్వారా పెద్ద ఎత్తున గిరిజనేతరులు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కలెక్టరేట్‌కు వెళ్తున్న ర్యాలీని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ముఖ్య నాయకులను తమ వాహనాల్లో కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం తిరిగి వారిని ర్యాలీ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజనులతో సమానంగా తమకు కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పీరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, చల్ల నారాయణరెడ్డి, కొమ్మెనబోయిన వేణు, ఖాసీం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘లఖీంపూర్ ఖేరి’ని మర్చిపోం.. కేంద్రాన్ని మర్చిపోనివ్వం
లఖీంపూర్ ఖేరి: ‘లఖీంపూర్ ఖేరి ఘటనను మేం మర్చిపోం. కేంద్ర ప్రభుత్వాన్ని మర్చిపోనివ్వం. మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించడం మినహా దేనికీ మేం ఒప్పుకోం’అని భారతీయ కిసాన్ సంఘ్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. యూపీలోని లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం లఖీంపూర్ ఖేరిలోని కౌడియాలా ఘాట్ వద్ద సమావేశమైన రైతులనుద్దేశించి తికాయత్ మాట్లాడారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతృత్వంలో నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరప తలపెట్టిన ఆందోళనల్లో మంత్రిని తొలగింపు డిమాండ్ ఉంచుతామని చెప్పారు. అక్రమ కేసులు మోపి జైళ్లలో ఉంచిన నలుగురు రైతులను విడుదల చేయాలన్నారు. ఈ నలుగురు రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయంగా అందజేస్తామని చెప్పారు. పంజాబ్ రాష్ట్రం ఫగ్వారాలో జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. అప్పటి హింసాత్మక ఘటనల్లో అమరులైన, గాయపడిన రైతుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. లఖీంపూర్ ఖేరి ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే నేరస్తుల కొమ్ము కాస్తోంది. న్యాయం జరిగేదాకా రైతుల పోరు ఆగదు. ఆందోళనలు చేస్తున్నప్పటికీ రైతుల పంటలకు కనీస మద్దతు ధర అందడం లేదు, అమరులైన రైతుల కుటుంబాలకు న్యాయం జరగలేదు’అని ట్వీట్లు చేశారు. 3 సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన లఖీంపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపైకి అజయ్ కుమారుడు ఆశిష్ కారు నడపడం, తర్వాత జరిగిన హింసలో మొత్తంగా 8 మంది చనిపోయారు. -
రైతుల ముసుగులో టీడీపీ నేతల హల్చల్
గుడివాడ: రైతుల ముసుగులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శనివారం సాయంత్రం అమరావతి రైతుల మహా పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడకు చేరుకుంది. స్థానిక శరత్ థియేటర్ వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు రాగానే టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కవ్వింపుగా ఈలలు, కేకలు వేశారు. అదే సమయంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అక్కడికి చేరుకుని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కటౌట్‌కు చెప్పు చూపించటంతో వైఎస్సార్సీపీ కార్యాలయం లోపల ఉన్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అంతలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వారిని విదదీసి.. రోప్ పార్టీతో అడ్డుగా నిలిచాయి. అయినప్పటికీ, పాదయాత్రలో పాల్గొన్న మహిళలు తొడలు కొడుతూ చిందులు వేశారు. వచ్చాం.. వచ్చాం.. గుడివాడకు వచ్చాం.. అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొడుతూ.. కేకలు వేస్తూ ముందుకు సాగారు. తాము ఎందుకు యాత్రగా వచ్చామో చెప్పకుండా గుడివాడ ప్రజలను రెచ్చగొట్టేలా మహిళలు గోల చేసిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ గుడివాడ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు వర్గీయులు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి వర్గీయులు వేర్వేరుగా బల ప్రదర్శన చేస్తూ తమ ప్రాబల్యం చాటుకునేందుకు యత్నించారు. కాగా, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని గుడివాడ చేరుకున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు అడ్డుకోగా.. వారి కళ్లుగప్పి ఓ కార్యకర్త బైక్ ఎక్కి పాదయాత్ర ప్రాంతానికి వచ్చారు. ఈ తంతు మొత్తాన్ని ఆయన తన అనుచరుడి ద్వారా వీడియో తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయించారు. -
తికాయత్.. ఓ చౌకబారు వ్యక్తి: కేంద్ర మంత్రి
లఖీమ్‌పూర్ ఖేరి(యూపీ): వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై కారు దూసుకెళ్లిన కేసులో అరెస్టయిన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్‌పై నోరు పారేసుకున్నారు. ఎనిమిది మంది మరణానికి కారకుడైన ఆశిష్‌కు తండ్రి అయిన అజయ్.. మంత్రిగా రాజీనామా చేయాలంటూ డిమాండ్చేస్తున్న తికాయత్‌ను ‘చౌక బారు వ్యక్తి’ అంటూ తక్కువచేసి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ మద్దతుదారులనుద్దేశిస్తూ అజయ్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ‘ఒకవేళ నేను మంచి వేగంతో కారులో వెళ్తున్నాను అనుకుందాం. అప్పుడు ఊర కుక్కలు వెంటబడతాయి. మొరుగుతాయి. వాటి తీరే అంత. అంతకుమించి నేను చెప్పేదేం లేదు. తికాయత్ గురించి నాకు బాగా తెలుసు. పొట్టకూటి కోసం రాజకీయాలు, ఉద్యమాలు చేస్తుంటాడు’ అంటూ ఆ వీడియోలో అజయ్ వ్యాఖ్యానించారు. అజయ్ వ్యాఖ్యానాల వీడియోపై తికాయత్ స్పందించారు. ‘ఏడాదికాలంగా కుమారుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అందుకే అజయ్ మిశ్రాకు నాపై కోపం’ అని అన్నారు. Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ - the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH — Alok Pandey (@alok_pandey) August 23, 2022 ఇదీ చదవండి: రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే -
రైతుల ‘మహాపంచాయత్’
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ (సవరణ) చట్టం–2022 రద్దుతోపాటు ఇతర డిమాండ్ల సాధనే ధ్యేయంగా మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతు సంఘాల పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. సోమవారం జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైతన్నలు తరలివచ్చారు. నగరంలో ఎక్కువ రోజులు ఉండేందుకే వారు సిద్ధపడి వచ్చినట్లు తెలుస్తోంది. తమ వెంట సంచులు, దుస్తులు తెచ్చుకున్నారు. రైతు సంఘాల నేతలు ఇచ్చిన జెండాలను చేతబూనారు. టోపీలు ధరించారు. జన్‌పథ్ మార్గంలోనూ తిరుగుతూ కనిపించారు. అన్నదాతల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు ఆరోపించారు. పోలీసులు మాత్రం ఖండించారు. మహాపంచాయత్ సందర్భంగా దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. డిమాండ్లు నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని, అందుకోసం పూర్తిస్థాయి సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నానని పంజాబ్ రైతు మాఘా నిబోరీ చెప్పారు. ప్రముఖ రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ రైతుల మహాపంచాయత్ సందర్భంగా ఢిలీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్ పాయింట్ల వద్ద 2020 నవంబర్ నాటి దృశ్యాలే మళ్లీ కనిపించాయి. ఘాజీపూర్, సింఘూ, తిక్రీ తదితర బోర్డర్ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతించారు. సరిహద్దుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరాయి. -
Mahapanchayat: ఢిల్లీలో తికాయత్ నిర్బంధం.. భారీ భద్రత
న్యూఢిల్లీ: రైతు సంఘాల సమాఖ్య ఎస్కేఎం సోమవారం(ఇవాళ) జంతర్‌మంతర్‌లో మహాపంచాయత్ తలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్‌ను ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మధు విహార్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కోరినట్లు ఆయన్ను కోరినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(శాంతి భద్రతలు) దేపేంద్ర పాఠక్ చెప్పారు. ఆయన అంగీకరించడంతో పోలీసు భద్రతతో వెనక్కి పంపినట్లు వివరించారు. దేశ రాజధానిలో అనవసరంగా గుమిగూడటాన్ని నివారించడానికే తికాయత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. రైతు గళం వినిపించకుండా చేసేందుకు కేంద్రం ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు తనను నిర్బంధంలోకి తీసుకున్నారని తికాయత్ ఆరోపించారు. ఇది మరో విప్లవానికి నాంది కానుందని, తమ పోరాటం ఆపేది లేదని ఆయన ట్వీట్ చేశారు. తికాయత్‌ను నిర్బంధించడాన్ని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఖండించారు. ఇదీ చదవండి: చెప్పుతో కొట్టి.. పరారయ్యాడు! -
కేంద్రంపై పోరుకు కదిలిన 10వేల మంది రైతులు!
లక్నో: కేంద్రానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. మూడు రోజుల పాటు చేపట్టే ఈ నిరసనల్లో పాల్గొనేందుకు సుమారు 10,000 మంది రైతులు పంజాబ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలుదేరారు. లఖింపుర్‌ఖేరీ హింసాత్మక ఘటనలకు న్యాయం చేయాలంటూ గురువారం నుంచి 72 గంటల పాటు(ఆగస్టు 18 నుంచి 20వ తేదీ) ఈ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. సీనియర్ రైతు నేతలు రాకేశ్ టికాయిత్, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రాహన్ వంటి వారు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఆందోళనల్లో సుమారు 10వేల మంది రైతులు పాల్గొంటారని భారతి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ రాయ్ తెలిపారు. కొందరు రైళ్లలో, మరికొందరు తమ సొంత వాహనాల్లో లఖింపుర్‌ఖేరీకి చేరుకుంటున్నారని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులను ఎత్తివేయాలని కోరుతున్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో లఖింపుర్‌ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా అరెస్టయ్యారు. రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది అలహాబాద్ హైకోర్టు. ఇదీ చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. -
హోరెత్తిన వరి పోరు!
సాక్షి నెట్వర్క్: కేంద్రంపై ‘వరి పోరు’లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఆందోళనలు చేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసనలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు మోకాళ్లపై కూర్చుని వడ్లు దోసిట్లో పట్టుకుని ఆందోళన చేశారు. కేంద్రం తీరు దున్నపోతుపై వానపడినట్టుగా ఉందంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ‘ధర్నా’లో దున్నపోతుపై నీళ్లు చల్లుతూ నిరసన తెలిపారు. వరి పోరులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ వాళ్లది పచ్చి మోసం: కేటీఆర్ కేంద్ర వైఖరిని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్.. వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రం కొంటుందని చెప్పి, రెచ్చగొట్టి మరీ వరి వేయించారు. ఇప్పుడు ధాన్యం కొనాలని కోరితే.. తెలంగాణను అవమానించేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. బీజేపీది పచ్చి మోసం. వారికి ఎంత బలుపు.. నూకలు తినుమన్నోళ్ల తోకలు కత్తిరిస్తం. కేంద్రం ఉప్పుడు బియ్యం ఎగుమతి చేస్తూ.. చేయడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. కేంద్ర వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టి.. రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతాం. పట్టణాల్లో యువకులు బైక్‌ర్యాలీలు నిర్వహించాలి. ఈనెల 11న ఢిల్లీలో మోదీ ఇంటికి కూతవేటు దూరంలో ధర్నా చేస్తాం. – సిరిసిల్ల నిరసనల్లో మంత్రి కేటీఆర్ మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు: హరీశ్ నాడు రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాం. నేడు తెలంగాణ రైతుల కోసం మళ్లీ రోడ్డెక్కాం. లక్ష్యాన్ని సాధిస్తాం. కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పనిచేస్తోంది. బడా కార్పొరేట్లకు లక్షల కోట్లరుణాలు మాఫీ చేశారు. రైతుల పంటను కొనాలంటే నష్టం వస్తుందంటున్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనాల్సిందే. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కాదు.. ముందు తెలంగాణ రైతుల బాధలు వినాలి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు ఆయన అచ్చే దిన్ అని అధికారంలో వచ్చారు. కానీ ఇప్పుడు జనం సచ్చే దిన్ తీసుకొచ్చారు. మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అన్నట్టు తయారైంది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కేంద్రంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు. – సిద్దిపేట దీక్షలో మంత్రి హరీశ్‌రావు మంత్రులు ఎవరేమన్నారంటే.. ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బదనాం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు. – మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో వరి కంకులతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే వెంకటవీరయ్య వనపర్తి: వరి కొనకుండా ఇబ్బందిపెడ్తున్న కేంద్రంపై రైతులు పెడుతున్న శాపం ఊరికే పోదు. కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి. – మంత్రి నిరంజన్‌రెడ్డి సంగారెడ్డి: పంజాబ్ మాదిరిగా తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించలేని రాష్ట్ర బీజేపీ నాయకులు దద్దమ్మలు – మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వరంగల్: వడ్లు కొనకుండా రైతులను మోసం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ వైఖరిని తిప్పికొట్టాలి. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ములుగు, మహబూబాబాద్: యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆపేది లేదు. – మంత్రి సత్యవతి రాథోడ్ నిర్మల్: ధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. – మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కరీంనగర్: వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దున్నపోతుపై వానపడినట్టే వ్యవహరిస్తోంది. – మంత్రి గంగుల కమలాకర్ వికారాబాద్: రాష్ట్రంలో ధాన్యం బాగా పండితే కేంద్ర పెద్దలు ఓర్వలేకపోతున్నారు. – మంత్రి సబితారెడ్డి పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేదాకా కొట్లాడుతాం. – మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజామాబాద్, కామారెడ్డి: తెలంగాణ పచ్చగా ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలకు నూకల బియ్యం అలవాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్ మాట్లాడటం దారుణం. – మంత్రి ప్రశాంత్‌రెడ్డి మహబూబ్‌నగర్: కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులపై కక్ష సాధిస్తోంది. ప్రతి గింజను కేంద్రం కొనేదాకా పోరాటం చేస్తాం. – మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నల్లగొండ: దేశంలో ఆహార పంటలపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. కేంద్రం మెడలు వంచుతారు. – మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి -
రైతు దీక్షలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
-
కరెంట్ కోతలు.. మళ్లీ మొదలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరెంటు కోతలు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. పల్లెల్లో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నారని కొన్ని రోజులుగా రైతన్న లు రోడ్డెక్కుతున్నారు. గత శని, ఆది, సోమవారాల్లో మెదక్ జిల్లా రైతులు సబ్ స్టేషన్ల ఎదుట ధర్నా చేశారు. మహబూబ్‌నగర్ రైతులు కూడా కోతలు పెడుతున్నారని చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ మాత్రం కోతలేం లేవని, సాంకేతిక కారణాలతో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఎండలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మంగళవారం ఉదయం 12.20 గంటలకు 14,160 మెగావాట్ల గరిష్ట విద్యు త్ డిమాండ్ నమోదైంది. డిమాండ్ పెరగడంతో కొరతను తీర్చుకోవడానికి పవర్ ఎక్ఛేంజీల నుంచి రాష్ట్రం ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొంటోంది. సబ్ స్టేషన్ల ఎదుట రైతుల ధర్నా రాష్ట్రంలోని 25 లక్షల బోరుబావుల కింద సాగు చేస్తున్న యాసంగి పంటలు మరో 15 రోజుల్లో చేతికొచ్చే అవకాశముంది. ఈ సమయంలో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. గత శని, ఆది, సోమవారాల్లో మెదక్ జిల్లాలో రామాయంపేట, నిజాంపేట, శివంపేట సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేశారు. ఉదయం 7.15 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసి తర్వాత సింగిల్ ఫేజ్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యవసాయ విద్యుత్‌కు కోతలు విధిస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులేమో సాంకేతిక కారణాలతో మూడ్రోజులు దాదాపు 14 గంటలు విద్యుత్ కోతలు పెట్టామని చెప్పారు. డిమాండ్ పెరుగుతుండటంతో.. రోజూ ఉదయం 7.45–8.45 గంటల మధ్య వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతున్నా గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వినియోగం పెరుగుతోంది. రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో బోర్లు వేస్తుండటంతో సాయంత్రం 6–7.30 మధ్య కూడా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ నిర్వహణలో భాగంగా సాయంత్రం 5 నుంచి ఉదయం 7 గంటల వరకు పల్లెల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను ఆపేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో విద్యుత్‌ను వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ ధరల భగభగ విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో కొరతను తీర్చుకోవడానికి తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలూ పవర్ ఎక్ఛేంజీలపై అధారపడాల్సి వస్తోంది. యూనిట్‌కు రూ.14 నుంచి రూ.20 చొప్పున ఎక్ఛేంజీలు విక్రయిస్తున్నాయి. ఒక దశలో యూనిట్‌కు రూ. 20 వరకూ ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో పేలుడు పదార్థాల కొరత ఏర్పడి దేశంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా తగ్గి విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రం రోజుకు సగటున 50 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను కొంటోంది. సోమవారం సగటున యూనిట్‌కు రూ.14.52 ధరతో 40 ఎంయూల విద్యుత్‌ను కొన్నది. ఇందులో 6.5 ఎంయూల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.20 చొప్పున కొనుగోలు చేసింది. ఈ నెల 25న రాష్ట్రం 58 ఎంయూల విద్యుత్‌ను కొని ఒక్కరోజే రూ.100 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. విద్యుత్ కోతల్లేవు డిమాండ్ పెరిగినా విద్యుత్ కోతలు విధించట్లేదు. 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ఇన్సులేటర్ కాలిపోవడంతోనే మెదక్ జిల్లాలో ఓ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. డిమాండ్ కు తగ్గట్టు నిరంతర సరఫరా కొనసాగించడానికి పవర్ ఎక్ఛేంజీల నుంచి ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొంటున్నాం. 17,000 మెగావాట్లకు డిమాండ్ పెరిగినా సరఫరాకు సిద్ధంగా ఉన్నాం. –ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పెట్టుబడి చేతికందని పరిస్థితి 24 గంటల విద్యుత్ వస్తుందనే ఆశతో ఉన్న కొద్దిపాటి ఎకరా భూమిలో వరి నాటు వేశా. విద్యుత్ కోతల వల్ల పంట ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. – ఆంజనేయులు, రైతు, చెండి, మెదక్ -
జైల్లోనే ఆశిష్ మిశ్రా
లక్నో: లఖీంపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేసినా జైలు నుంచి విడుదల కాలేదు. 2021 అక్టోబర్‌లో ఆశిష్‌ను పోలీసులు సెక్షన్ 147, 148, 149, 302, 307, 326, 34, 427, 120బీ కింద అరెస్టు చేశారు. వీటితో పాటు ఆయుధాల చట్టం కింద కూడా ఆశిష్‌పై నేరారోపణ చేశారు. తాజాగా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్లో 302, 120 బీ సెక్షన్లకు సంబంధించి వివరాల్లేవు. సెక్షన్ 302 హత్యాయత్నంకు సంబంధించినది కాగా 120 బీ సెక్షన్ క్రిమినల్ కుట్రకు సంబంధించినది. బెయిల్ ఆర్డర్లో ఈ రెండు చట్టాల గురించి పేర్కొనకపోవడంతో ఆశిష్ విడుదల జరగలేదు. దీనిపై స్పందిస్తూ బెయిల్ ఆర్డర్లో ఈ రెండు సెక్షన్లను కూడా చేర్చాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ఆశిష్ న్యాయవాది చెప్పారు. రైతు ఆందోళనల సమయంలో నలుగురు రైతుల మరణానికి కారణమయ్యాడని ఆశిష్‌పై కేసు నమోదైంది. బెయిల్ కోసం ఆశిష్ యత్నిస్తుండగా గురువారం హైకోర్టులో ఊరట దొరికింది. -
మీసం మెలేసేది రైతన్నే!
దుక్కి దున్ని.. నారు పెట్టి.. నాగలి పట్టిన రైతన్నే ఉత్తరప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి మీసం మెలేస్తున్నాడు. పోటీకి సై అంటున్నాడు. చట్టాల రూపకల్పనలో తనకూ భాగస్వామ్యం కావాలని గొంతెత్తున్నాడు. తనను పక్కనపెట్టినా, తక్కువ చేసినా తగ్గేదేలే అని హెచ్చరిస్తున్నాడు. సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం తర్వాత యూపీ రాజకీయాల్లో పెరిగిన రైతుల పాత్ర ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలున్నాయి. అక్కడంతా రైతు ఎజెండా, రైతు నేతల మద్దతు చుట్టూతే రాజకీయం గిర్రున తిరుగుతోంది. యూపీ జనాభాలో 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రతి సీటు గెలుపులోనూ వీరిపాత్రే కీలకంగా ఉండనుంది. ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రైతులను చట్టసభలకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. గ్రామీణ జనాభా ఉన్న ప్రాంతాల్లో సుమారు 250కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉండటంతో రైతు నేపథ్యం గల రాజకీయ నేతలను పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే వివిధ రంగాలకు చెందిన వారిలో రైతులే ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీకి వెళ్తున్నారు. గత 2017 ఎన్నికల్లో చట్టసభలో ఏకంగా 161 మంది రైతులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇందులో వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న ఎమ్మెల్యేలు 90 మందికి పైగా ఉండడం విశేషం. రైతుల తర్వాత అధిక సంఖ్యలో వ్యాపారులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు చట్టసభల్లో ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పార్టీలు ప్రకటించిన జాబితాల్లో 45శాతం మంది రైతులు ఉన్నారని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. రైతు ఎజెండాతోనే రాజకీయం మరోవైపు యూపీ ఎన్నికల్లో రైతు అజెండాతోనే రాజకీయ పార్టీలు బాహాబాహీకి దిగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలు, వాటిపై యూపీ రైతుల నుంచే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం కావడం, పుండుపై కారం చల్లినట్లుగా లఖీమ్‌పూర్ ఖేరీ ఘటన చోటుచేసుకోవడం, ఈ ఘటనకు బాధ్యుడైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌మిశ్రా తేనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం వంటి అంశాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకతను తప్పించుకునేందుకు బీజేపీ తమ ప్రభుత్వం చేసిన రైతు అనుకూల చర్యలను పదేపదే వల్లెవేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం రూ.36 వేల కోట్ల రుణాలు అందించామని, పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.2.21 కోట్ల మంది రైతులను చేర్చి ఇప్పటికే 28 లక్షల మందికి రూ.2,400 కోట్లు పరిహారం అందించామని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక పీఎం కిసాన్ కింద యూపీ రైతులకు రూ.41 వేల కోట్లు జమ అయ్యాయని, ఎరువుల బస్తాల ధరలను రూ.2,400 నుంచి రూ.1200కి తగ్గించిందని తమ ప్రచారాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోపక్క ఇటీవల జాట్ నేతలతో సమావేశం అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతులకు రూ.36 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, చెరకు రైతులకు రూ.1.40 లక్షల కోట్ల చెల్లింపులు చేశామని చెబుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక వెనుకబడ్డ బుందేల్‌ఖండ్ ప్రాంతానికి తాగు, సాగునీటి వసతిని పెంచేలా కెన్–బెత్వా నదుల అనుసంధానానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. మరోపక్క రైతుల్లో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని సమాజ్‌వాదీ పార్టీ–ఆర్ఎల్డీ కూటమి తన అస్త్రంగా మలుచుకుంటోంది. రైతులపై నమోదు చేసిన కేసులు, చనిపోయిన వారికి పరిహారం ఇవ్వకపోవడంపై ప్రశ్నలు సంధిస్తోంది. తాము అధికారంలోకి వస్తే 15 రోజుల్లో కేసులను మాఫీ చేయడంతోపాటు చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీనికితోడు చెరకు రైతులకు బకాయిల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, బీమా సౌకర్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇందులో ఎవరి హామీలు, ఎవరి మాటలను రైతులు నమ్ముతారన్నది బ్యాలెట్ తేల్చనుంది. బీజేపీకి కంట్లో నలుసుగా.. అధికార బీజేపీకి రైతు సంఘాల ప్రతినిధులు కంట్లో నలుసులా తయారయ్యారు. పంటలకు కనీస మద్దతు ధరపై తాజా కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడం, రైతు నేతలపై కేసుల ఉపసంహరణకు సంబంధించి నాన్చుడు ధోరణితో విసుగు చెందిన రైతు సంఘాల నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ధోరణి ఇక చెల్లదని, హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని విభజించి ఓట్లు కొల్లగొట్టే రాజకీయాలు పనిచేయవని రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించే వారికే ప్రజలు పట్టం కడతారని తేల్చిచెప్పారు. ’మిషన్ యూపీ’ ద్వారా రైతు వ్యతిరేక పాలనకు గుణపాఠం చెబుతామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఇటీవల వెల్లడించారు. ఈ ప్రకటనలు ఎంతమేర ప్రభావం చూపుతాయన్న దానిపై రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అట్టడుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, గ్రామ సీమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. మొత్తం రైతుల్లో 80 శాతం ఉన్న సన్నకారు రైతుల అభివృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం, రికార్డు స్థాయిలో పంటల సేకరణ, దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యలు మన సమష్టి విజయాలని చెప్పారు. దీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యాలకు ఇవి చోదక శక్తిగా పని చేస్తాయని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సోమవారం ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు ఘనతలను ప్రస్తావించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా గుర్తుచేశారు. గోవా విముక్తి పోరాట యోధుల స్మారకం నిర్మాణం, అఫ్గానిస్తాన్ నుంచి గురుగ్రంథ సాహిబ్ స్వరూపాలను వెనక్కి తీసుకురావడం, భారత్‌లో రైతాంగం సాధికారత కోసం సర్కారు కృషి వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా 2020–21లో రక్షణ రంగం ఆధునీకరణకు 87 శాతం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 209 రకాల రక్షణ పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్గా భావించాలని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులు నిరుపమాన సేవలందించారని కొనియాడారు. ఏడాది కంటే తక్కువ సమయంలోనే 150 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ప్రజలకు అందజేయడం గొప్ప విషయమని చెప్పారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు టీకా మొదటి డోసు, 70 శాతానికి పైగా ప్రజలు రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. 15–18 ఏళ్ల కేటగిరీకి కరోనా టీకా ఇస్తున్నట్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, వృద్ధులకు బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యిందని గుర్తుచేశారు. అతిపెద్ద ఆహార పంపిణీ పథకం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసిందని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 19 నెలల్లో 80 కోట్ల మంది లబ్ధి పొందారని, దీని కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకమని వివరించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ను తెరపైకి తెచ్చిందని తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పెదవి విరిచారు. చైనా, పాకిస్తాన్ వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రస్తావించలేదని, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ, నాగాలాండ్‌లో పౌరుల ఊచకోతపై ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. రాజ్యసభలో ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే 2021–22 నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకముందు తొలుత సభ ప్రారంభం కాగానే చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సిట్టింగ్ ఎంపీ డాక్టర్ మహేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీలు జయంత రాయ్, దేబేంద్రనాథ్ బర్మన్, ఎం.మోజెస్, గణేశ్వర్ కుసుమ్, కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పార్లమెంట్ 255వ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల జాబితాను సెక్రెటరీ జనరల్ రాజ్యసభకు సమర్పించారు. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. సభా హక్కుల ఉల్లంఘన... పెగాసస్ స్పైవేర్ సమస్యపై గత ఏడాది పార్లమెంట్లో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం సోమవారం నోటీసు సమర్పించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును ఆధారంగా నోటీసును సమర్పించినట్లు తెలిపారు. స త్యాన్ని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందన్న ఆధారాలు బహిర్గతం అయ్యాయన్నారు. పెగాసస్‌పై ప్రత్యేక చర్చ అక్కర్లేదు పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని వెల్లడించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు కోరుకుంటే ఏ అంశాన్ని అయినా లేవనెత్తవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అక్కర్లేదన్నారు. -
బడ్జెట్ సమావేశాల లైవ్ అప్డేట్స్: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
అప్డేట్స్ 04:00 PM ► కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ఇంతకు ముందు ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా లోక్‌సభలో సమర్పించారు. 12: 55 PM ► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎకానామిక్ సర్వే 2021-22 ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. 11: 55 AM ► పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల ఆజాదీకా అమృత్.. ఒక పవిత్ర మహోత్సవమని వచ్చే 25 ఏళ్లు అదే స్ఫూర్తితో మనమంతా పనిచేయాలన్నారు. అదే విధంగా, వ్యాక్సిన్‌తో కరోనాను కట్టడి చేయబోతున్నామని తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో పేదలకు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ► భారత్ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతోందన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్‌డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్ ఇండియాతో మొబైల్ పరిశ్రమ వృద్ధి చెందుతోందన్నారు. ► ఫసల్ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు. ► 7 మెగా టెక్స్టైల్ పార్క్‌లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్‌నాథ్ పేర్కొన్నారు. ► పీఎమ్‌గ్రామీణ సడక్ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ తెలిపారు. ► ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. ► భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్ ఎదుర్కోవడానికి దేశ ఫార్మారంగం ఎంతో కృషి చేసిందన్నారు. ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ► పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో తొలి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ భారత్‌లో ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. అదే విధంగా పద్మపురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లినట్లు వివరించారు. ► ప్రధాని గరీబ్‌యోజన పథకం ద్వారా 19 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో పేర్కొన్నారు. 11: 04 AM ► పార్లమెంట్లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులకు స్వాతంత్ర్య, అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 10: 54 AM ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ భవనంకు చేరుకున్నారు. 10.: 45 AM పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ఇది కీలక సమయమని, బడ్జెట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పెగాసస్, రైతు ఆందోళనలు, చైనా దురాక్రమణలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించింది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతిగా కోవింద్ చివరి ప్రసంగం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను సంయుక్తంగా ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే జూలైలో రాష్ట్రపతిగా కోవింద్ పదవీ కాలం పూర్తికానుంది. దీంతో ఈ సమావేశాలే ఆయన రాష్ట్రపతి హోదాలో చివరిగా ప్రసంగించే పార్లమెంట్ సమావేశాలు. రాష్ట్రపతి ప్రసంగానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021–22ను, మంగళవారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బుధవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే అంశంపై చర్చ ఆరంభమవుతుంది. ఈ చర్చ సుమారు 4 రోజులు జరగవచ్చు. ఫిబ్రవరి 7న ఈ చర్చకు ప్రధాని బదులిస్తారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. -
ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీపై బదిలీ వేటు
చండీగఢ్: పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాన్వాయ్‌ను అడ్డుకుని రైతులు ఆకస్మికంగా ఆందోళనకు దిగడం, ఫ్లై ఓవర్ మీదనే ప్రధాని ఆగాల్సిరావడం వంటి భద్రతా వైఫల్య ఘటనలపై పంజాబ్ రాష్ట్ర సర్కార్.. పోలీస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రధానికి సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారులను బదిలీచేశారు. బుధవారం రోజు ఘటన జరిగిన ఫిరోజ్‌పూర్ పోలీస్ పరిధి బాధ్యతలు చూసిన ఫిరోజ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ), ఐపీఎస్ అధికారి హర్మన్దీప్ సింగ్ హాన్స్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. హర్మన్దీప్ను లూథియానాలోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్బీ) మూడో కమాండెంట్‌గా బదిలీచేశారు. ఈయన స్థానంలో ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్‌ను నియమించారు. నౌనిహాల్ సింగ్, ఏకే మిట్టల్, సుఖ్చయిన్ సింగ్, నానక్ సింగ్, అల్కా మీనాలను బదిలీచేశారు. పీపీఎస్ అధికారులు హర్కమల్ప్రీత్ సింగ్, కుల్జీత్ సింగ్‌లనూ మరో చోటుకు బదిలీచేశారు. తప్పంతా ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీదే.. జాతీయ స్మారక స్తూపం వద్ద నివాళులర్పించేందుకు హుస్సైనీవాలాకు బయల్దేరిన ప్రధాని మోదీని మార్గమధ్యంలో రైతులు అడ్డుకున్న ఉదంతంపై కేంద్ర హోం శాఖకు పంజాబ్ సర్కార్ ఒక నివేదికను సమర్పించింది. జనవరి ఐదు నాటి ఘటనలో వివరణ ఇవ్వాలని బటిందా ఎస్ఎస్పీ అజయ్ మలూజాను కేంద్ర హోం శాఖ వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు శుక్రవారం పంపిన విషయం తెల్సిందే. దానిపై మలూజా ఇచ్చిన వివరణ.. హోం శాఖకు పంపిన నివేదికలో ఉంది. ఆ నివేదికలోని వివరాలు కొన్ని బహిర్గతమయ్యాయి. ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ హర్మణ్ చేసిన తప్పు వల్లే మోదీకి భద్రత కల్పన విఫలమైందని మలూజా ఆరోపించారు. హుస్సైనీవాలాకు వెళ్లే మార్గంలో బటిందా పరిధిలోని తమ పరిధి వరకూ మోదీకి రక్షణ కల్పించామని, ఫిరోజ్‌పూర్ పరిధిలోకి కాన్వాయ్ వచ్చాకే ఈ ఘటన జరిగిందని మలూజా వివరణ ఇచ్చారు. ప్రధాని రాకకు ముందు జరిగిన ఘటనలు మొదలుకుని, రైతుల ఆందోళన, ప్రధాని బహిరంగ సభకు వెళ్లకుండా వెనుతిరగడం వరకు జరిగిన ఘటనలు, వాటి పర్యవసానాలను పంజాబ్ ప్రభుత్వం క్రమపద్ధతిలో నివేదించింది. రైతుల ఆందోళన అనేది ముందస్తు వ్యూహం కాదని, హఠాత్పరిణామం అని నివేదిక పేర్కొంది. -
మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి!
న్యూఢిల్లీ/చండీగఢ్: భారీ భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. బుధవారం ప్రధాని కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గాన్ని కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్‌పై నిలిచిపోయారు. దీనిపై మండిపడిన కేంద్ర హోంశాఖ ఘటనపై తక్షణ వివరణ ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన మోహరింపులు చేయలేదని అభిప్రాయపడింది. మోదీ కాన్వాయ్‌ను ఆపి పైరియాణా సమీపంలో ఆందోళనకు దిగిన రైతులు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సహించరానిదని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానిపై భౌతికదాడికి కాంగ్రెస్ యత్నించిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ ర్యాలీకి జనాలు తగినంతగా హాజరుకాలేదనే ప్రధాని వెనుదిరిగారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటన కారణంగా ముందుగా నిర్ణయించిన ఫిరోజ్‌పూర్ ర్యాలీని ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో మోదీ దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఏం జరిగింది? హోంశాఖ కథనం ప్రకారం హుసేనీవాలా జాతీయ అమరవీరుల స్మారకం సందర్శన కోసం బుధ వారం ఉదయం ప్రధాని మోదీ పంజాబ్‌లోని భ టిండా చేరుకున్నారు. అక్కడినుంచి స్మారకచిహ్నం వద్దకు ఆయన హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. అయితే అనుకోకుండా వర్షం పడి వాతావరణం ప్రతికూలంగా మారింది. వాతావరణం అనుకూలంగా మారుతుందేమోనని ప్రధాని దాదాపు 20 నిమిషాలు వేచిచూశారు. కానీ వాతావరణంలో మార్పు కనిపించకపోవడంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రధాని రోడ్డుమార్గం ద్వారా ప్రయాణమయ్యే విషయాన్ని అధికారులు రాష్ట్ర డీజీపీకి తెలియజేసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. పోలీసుల నుంచి తగిన ధ్రువీకరణ అందిన తర్వాత ప్రధాని కాన్వాయ్ హుసేనీవాలాకు బయలుదేరింది. గమ్యానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ప్రధాని కాన్వాయ్ పైరియాణా గ్రామ సమీప ఫ్లైఓవర్‌ను చేరుకుంది. అక్కడ కొందరు రైతులు నిరసనకు దిగి రోడ్డును దిగ్భంధించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రధాని తన కాన్వాయ్‌తో ఫ్లైఓవర్‌పై దాదాపు 15–20 నిమిషాలు నిలిచిపోవాల్సి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే దేశ నాయకుడు నడిరోడ్డుపై నిలిచిపోవడాన్ని చూసి దేశం నిర్ఘాంతపోయింది. సుమారు 200 మంది రైతులు అకస్మాత్తుగా రోడ్డును నిర్భంధించారని పంజాబ్ డీఐజీ ఇందర్బీర్ సింగ్ చెప్పారు. క్రమం గా ఫ్లైఓవర్‌కు అవతల నిరసనకారులు భారీగా గుమిగూడుతుండడంతో రక్షణకు రిస్కు ఏర్పడుతుందని భావించి ప్రధాని కాన్వాయ్‌ను తిరిగి భటిండాకు మరలించాలని నిర్ణయించామన్నారు. ఆ ముగ్గురూ ఎందుకు లేరు! దేశ ప్రధాని ఒక రాష్ట్ర రాజధానికి వస్తే గవర్నర్, సీఎం, ఇతర ఉన్నతాధికారులు తప్పక ఆహ్వానం పలకాలి. అదే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పర్యటనకు వస్తే ప్రభుత్వం తరఫున సీఎం లేదా ఒక మంత్రితో పాటు ఉన్నతాధికారులు హాజరవుతారు. కలకలం రేపుతున్న ప్రధాని పంజాబ్ పర్యటనలో ఆయనకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రమే స్వాగతం పలికారు. సీఎం, సీఎస్, డీజీపీ స్వాగతించేందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి స్వాగతం పలికినా, కేంద్ర సర్వీసులకు చెందిన డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎందుకు రాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. తన సిబ్బందిలో కొందరికి కరోనా సోకడం వల్ల తాను వెళ్లలేదని సీఎం చన్నీ చెప్పారు. ఐదు ప్రశ్నలు 1. ప్రధాని ప్రయాణించే మార్గాన్ని క్లియర్ చేయడంలో పంజాబ్ పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? 2. నిరసనకారులకు ప్రధాని మోదీ రోడ్డు మార్గాన వెళుతున్నట్లు, ఫలానా రోడ్డులోనే వెళుతున్నట్లు ఎలా తెలుసు? ఎవరు ఉప్పందించారు? 3. ప్రధాని భద్రతా సిబ్బందికి రైతులు రోడ్డును దిగ్భందించారని తెలుసా? 4. ప్రధాని ప్రయాణిస్తున్న మార్గాన్ని మార్చినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ– మోదీ భద్రత చూస్తుంది) పంజాబ్ పోలీసులకు తెలిపిందా? 5. జరగబోయేదేమిటో పంజాబ్ అధికార యంత్రాంగానికి ముందే తెలుసా? ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నా.. మీ సీఎంకు థ్యాంక్స్! మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి. కనీసం నేను భటిండా విమానాశ్రయం వరకు ప్రాణాలతో వచ్చాను కదా!’’ అని ప్రధాని మోదీ పంజాబ్ అధికారులతో వ్యాఖ్యానించారు. హుసేనీవాలా అమరవీరుల స్మారకం వద్దకు బయలుదేరిన ప్రధాని, భద్రతా వైఫల్యం కారణంగా వెనుదిరిగి భటిండాకు చేరుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే ఆయన తనను కనీసం ప్రాణాలతో ఉంచారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రధాని వ్యాఖ్యల విషయం తనకు తెలియదని పంజాబ్ సీఎం చన్నీ చెప్పారు. ఒకవేళ ప్రధాని కోపంతోనో, రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య లు చేసి ఉంటే తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. సీఎం కనీసం అందుబాటులో లేరు! ఒకపక్క మార్గం క్లియర్‌గా ఉందని ప్రధాని భద్రతా దళాని (ఎస్పీజీ)కి పంజాబ్ డీజీపీ, సీఎస్ హామీ ఇచ్చారు, మరోపక్క అదే మార్గంలో నిరసనకారులకు అనుమతినిచ్చారు. పరిస్థితిని ఇంకా త్రీవం చేసేందుకు సీఎం చన్నీ కనీసం ఫోనులో అందుబాటులోకి రాలేదు, ఈ సమస్యను పరిష్కరించే యత్నాలు చేపట్టలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను నమ్మే ఎవరికైనా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు బాధను కలిగిస్తాయి. మోదీ ర్యాలీకి హాజరుకాకుండా ప్రజలను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. నిరసనకారులతో కలిసి భారీగా బస్సులను ఆపేశారు. ఇలాంటి చర్యలతో భగత్ సింగ్ తదితర దేశభక్తులకు ప్రధాని నివాళి అర్పించకుండా అడ్డుకున్నారు. వీరికి స్వాతంత్య్ర సమరయోధులపై ఎలాంటి గౌరవం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ ఇలాంటి పనులు చేస్తోంది. పంజాబ్‌లో ప్రధాని ఆరంభించాల్సిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ది పనులు వీరివల్ల ఆగిపోయాయి. కానీ మేము వీరిలాగా చౌకబారుతనంతో వ్యవహరించము. ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధికే పాటుపడతాం.’’ – బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వివరాలు ఎవరు లీక్ చేశారు? ప్రధాని మార్గాన్ని అడ్డుకున్న వ్యక్తులకు పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు సమాచారమందించారు? ప్రధాని పర్యటనకు తప్పుడు క్లియరెన్స్ ఎందుకిచ్చారు? రక్షణ వైఫల్యం జరిగిందన్న సమాచారం తర్వాత ఎందుకు ఎవరూ స్పందించలేదు? ప్రధాని మృత్యు అంచుకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందానిస్తోందా? దేశ ప్రధానిని ప్రమాదకరమైన మార్గంలో తీసుకువచ్చేలా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యత్నించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పంజాబ్ పుణ్యభూమిపై హత్యాకాండ జరపాలని యత్నించి కాంగ్రెస్ విఫలమైంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. – స్మృతీ ఇరానీ, కేంద్ర మంత్రి జరిగిన దానికి చింతిస్తున్నాం! మార్గమధ్యంలో అడ్డంకుల వల్ల ప్రధాని వెనుతిరగడంపై విచారిస్తున్నాం. ఆయన దేశానికి ప్రధాని, మేమంతా గౌరవిస్తాం. భద్రతా లోపం ఉందని చెప్పడం సరికాదు. భటిండా నుంచి పీఎం రోడ్డు మార్గంలో వెళ్తారన్న ప్రణాళికేమీ లేదు. కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రాగా ప్రధాని కాన్వాయ్‌ని మరో మార్గం ద్వారా లేదా హెలికాప్టర్ ద్వారా వెళ్లమని సూచించాం. కానీ ఆయన వెనుదిరిగారు. ఇది బాధాకరం. గతరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులను తొలగించాం. అయినాకానీ అనుకోకుండా కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రావడమనేది హానికరమేమీ కాదు. రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేశారు కానీ ఎవరికీ హాని చేయలేదు. అలాంటి వారిపై లాఠీలు ఝళిపించమని చెప్పలేను. ఫిరోజ్పూర్లో బీజేపీ ర్యాలీ కోసం 70 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే 700 మంది వచ్చారు. దీనికి నేనేమీ చేయలేను. హోంశాఖ కోరినట్లు మొత్తం çఘటనపై విచారణ చేస్తాం. రోడ్డు మార్గంలో వెళ్లాలనేది పోలీసు, ఎస్పీజీ ఇతర ఏజెన్సీల ఉమ్మడి నిర్ణయం. ఈ నిర్ణయాల్లో పోలీసుల పాత్ర చాలా పరిమితం. ఎస్పీజీ, ఐబీ తదితర కేంద్ర ఏజెన్సీలు వీటిని నిర్వహిస్తాయి. ఈ మొత్తం ఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే అతిధిపై దాడి చేయడం కన్నా చావడానికే ఒక పంజాబీ ప్రాధాన్యమిస్తాడు. – చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం -
నష్ట పరిహారం కోసం మిర్చి రైతుల ధర్నా
ఖమ్మం మయూరి సెంటర్: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించి ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడారు. అనంతరం వ్యవసాయ అడిషనల్ కమిషనర్ విజయకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. -
నవచరిత్రగా... రైతు విజయగాథ
సఫలమైన రైతుల సామూహిక శక్తికి జేజేలు. కొత్త సాగు చట్టాల రద్దు డిమాండుతో ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతు నిరసనకారుల శిబిరాలు... పంజాబ్ చరిత్రను తిరగరాస్తున్నాయి. మాదకద్రవ్యాల మత్తులో మునిగితేలుతున్న పంజాబ్ యువతను సరికొత్తగా ఆవిష్కరించిందీ రైతుల పోరాటం. ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఏమిటంటే... శిబిరాల్లోని యువత అక్కడి తాత్కాలిక లైబ్రరీల్లో వివిధ ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేస్తూ వచ్చారు. రైతులకు మద్దతిస్తూ శిబిరాలను సందర్శించిన సకల జీవన రంగాలకు చెందిన వ్యక్తులతో ఢిల్లీ సరిహద్దుప్రాంతం ఒక యాత్రా స్థలంగా మారిపోయింది. రైతుల శాంతియుత నిరసనల అనుభవం పంజాబ్ జానపద గాథల్లో భాగం కానుంది. గర్వించే ఈ వారసత్వం భవిష్యత్ తరాలకు చరిత్రగా మిగలనుంది. పంజాబ్‌లో పర్యటిస్తున్న వారు అమృత్సర్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించాలని, ప్రత్యేకించి 1919లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపి మారణకాండ సృష్టించిన జలియన్ వాలాబాగ్ని తప్పక చూడాలని చెబుతుంటారు. గత వారం ఢిల్లీ – హరియాణా సరిహద్దులో సింఘూను సందర్శించిన నాకు అదే అనుభూతి కలిగింది. శాంతియుతంగా నిరసన కొనసాగించిన రైతులు శక్తిమంతమైన భారతీయ పోలీసు రాజ్యం మెడలు వంచిన ప్రత్యక్ష సమరస్థలిని నేను అక్కడ చూశాను. నేను సోనీపట్‌లో నివసిస్తూ, అక్కడే పనిచేస్తున్నాను. 2020 నవంబర్ నుంచి సింఘూ సరిహద్దు ప్రాంతంలో సాగుతున్న రైతుల నిరసనను సందర్శించాను. ఇటీవలే రైతులు తమ నిరసనను ముగించారు. ఉత్తర ఢిల్లీలో నెలకొన్న ఈ ప్రాంతంలోనే సంవత్సరం పైగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం చేస్తూ వచ్చారు. రైతులు రహదారులను దిగ్బంధించారని అధికారులు ప్రకటిçస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వం ఇనుపతీగలు చుట్టి కాంక్రీట్ అవరోధాలను అడ్డుపెట్టిన ఢిల్లీ ప్రవేశమార్గాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మా యూనివర్సిటీ నెలకొన్న సోనీపట్‌లో నేను పనిచేస్తున్నప్పటి నుంచి వందలాది పర్యాయాలు ఇదే మార్గంలో ప్రయాణించాను. కానీ ఇప్పుడు ఇది బెర్లిన్, పాలస్తీనా గోడలపై ఉన్న చిత్రాలను ఆవాహన చేస్తున్నట్లుంది. గత సంవత్సరం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ని చేరుకోవాలని ప్రయత్నించిన రైతు నిరసనకారులను ఇక్కడే ఆపివేశారు. దాంతో వారు ఇక్కడే రోడ్లపై తిష్ఠవేయాలని నిర్ణయించుకున్నారు. వణికిస్తున్న చలి నుంచి, మండిస్తున్న ఎండ నుంచి, అకాల వర్షాల నుంచి రక్షణ పొందడానికి వీరు ట్రాక్టర్ ట్రాలీలను, తాత్కాలికంగా వెదురుతో ఇళ్లను నిర్మించుకుని ఉండసాగారు. నెలల తరబడి వారు ఇక్కడ ఇలాగే కొనసాగుతూ వచ్చారు. మేం అక్కడికి వెళ్లినప్పుడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక సూక్ష్మ ప్రపంచంతో భేటీ అయినట్లనిపించింది. ప్రతి టెంట్‌లోనూ పంజాబ్‌లోని తమ గ్రామం లేదా జిల్లా పేరును రాసి ప్రదర్శించారు. ఢిల్లీ సరిహద్దు నుంచి గురు తేజ్ బహదూర్ స్మారక చిహ్నం దాకా పన్నెండు కిలోమీటర్ల పొడవునా రైతుల శిబిరాలు నెలకొని ఉన్నాయి. వీటిని సందర్శించినవారు, కుటుంబాలు, పిల్లలు... ఆనాడు మొఘల్ పాలకులు బలిగొన్న తొమ్మిదవ సిక్కు గురువు తేజ్ బహదూర్‌కి నివాళి అర్పిస్తూ కనిపించారు. ఆయన స్మారక చిహ్నాన్ని ఇక్కడే నెలకొల్పారు. ఈ స్మారక చిహ్నం మరోసారి శక్తిమంతమైన రాజ్యంతో సాగుతున్న ప్రస్తుత రైతుల పోరాటాన్ని భావనాత్మకంగా గుర్తుచేసింది. ఢిల్లీ సరిహద్దులో శిబిరాలు ఏర్పాటు చేసుకున్న సిక్కు రైతులకు ప్రతి సౌకర్యమూ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సిక్కు సమాజం చేస్తున్న సహాయ సహకారాలతో భోజనశాలల నుండి ఉచితంగా ఆహారం అందిస్తూ వచ్చారు. రైతు ఉద్యమం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు 120 కంటే ఎక్కువ వంటశాలలు ఏర్పర్చి నిరసనకారులకు, సమీపంలోని పేదలకు తిండి పెట్టారు. రైతు నిరసనకారులను సందర్శించిన వారు అక్కడ తమకు అందించిన ఆహారాన్ని ఆరగిస్తూ, ఇతరులతో ముచ్చటలాడుతూ గడుపుతారు. మాకూ అదే అనుభూతి ఎదురైంది. రైతు నిరసనకారుల మద్దతుదారులు అక్కడ పలు క్షేత్ర ఆసుపత్రులను ప్రారంభించి శిబిరాల్లో అస్వస్థతకు గురైన వారికి ప్రాథమిక చికిత్సను, మందులను అందిస్తూ వచ్చారు. లైఫ్ కేర్ ఫౌండేషన్ హాస్పిటల్ వెంటిలేటర్లు, హార్ట్ మానిటర్లు వంటి క్రిటికల్ కేర్ సపోర్టుతో కూడిన 12 బెడ్లను ఏర్పర్చింది. నిరసన కారులకు, గుండెపోటుకు గురై బాధపడే ప్రజలకు ఇక్కడ సమర్థంగా సేవలందించారు. ఇక్కడ ఉచిత మందుల షాపు ఏర్పర్చి రైతులకు రక్తపోటు, తలనొప్పి, జ్వరాలు వచ్చినప్పుడు, పరీక్షించి అన్ని వేళలా మందులు అందిస్తూ వచ్చారు. ఆ ప్రాంతంలో మూడు చిన్న లైబ్రరీలను చూశాం. ఒక లైబ్రరీని జంగీ కితాబ్ ఘర్ (పోరాట గ్రంథాలయం) అని పిలుస్తున్నారు. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధక విద్యార్థి తన దగ్గర ఉన్న పుస్తకాలను అక్కడ ఉంచారు. శిబిరాల్లో ఉంటున్న ప్రజలు ఆలోచనలను ప్రేరేపించే సమాచారాన్ని చదవగలరని తన ఉద్దేశం. అక్కడ పంజాబీ, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లోని పుస్తకాలు కనబడ్డాయి. చైనా చరిత్రపై పలు ఆసక్తికరమైన రచనలను గ్రంథాలయంలో చూశాను. నిరుపేద చైనా రైతు బాలుడిపై కథనం చాలామందిని ఆకర్షించినట్లు అనిపించింది. ఈ చిన్ని గ్రంథాలయంలో భగత్‌సింగ్ రచనలు, భగత్‌సింగ్‌పై ఇతరుల రచనలు కూడా కనిపించాయి. ఈ లైబ్రరీ చిన్న చిన్న సదస్సులకు, స్వేచ్ఛాయుతమైన చర్చలకు చోటు ఇచ్చింది. జేఎన్‌యూ తరహా ఆలోచనా స్ఫోరకమైన చర్చలను ఇవి పోలి ఉండటం కద్దు. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇక్కడ ఒక లైబ్రరీని నెలకొల్పింది. ఇక్కడ పంజాబ్ చరిత్ర, సాహిత్యంపై పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భగత్‌సింగ్ మనవరాలిని ఆమె సొంత శిబిరంలో ఇక్కడ నేను కలిశాను. ఆమె పేరు గుర్జీత్ కౌర్. తన వయస్సు 70 ఏళ్లు. పంజాబ్ చరిత్రను తిరగరాస్తున్న ఈ శిబిరాల్లోని వృద్ధులైన నిరసనకారుల మనోభావాలను ఆమె నాతో పంచుకున్నారు. వేర్పాటువాద హింసతో చితికిపోయిన పంజాబ్ చరిత్రను ఇక్కడ తిరగరాస్తున్నారు. పంజాబ్‌లోని గ్రామాలు, పట్టణాల్లో సంవత్సరకాలంగా కొనసాగుతున్న రైతుల పోరాటం... మాదకద్రవ్యాల మత్తులో మునిగి తేలుతున్న యువతను సరికొత్తగా ఆవిష్కరించింది. గర్వించే ఈ వారసత్వం భవిష్యత్ తరాలకు అందుతుంది కూడా! ఈ కొత్త చరిత్రను నిరసనకారులే తమ కోసం రాస్తున్నారు. డాక్టర్ అమ్నీత్ కౌర్... గురుగోవింద్ సింగ్ మహిళా కాలేజీలో పాఠాలు బోధిస్తున్నారు. నెలల తరబడి ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శిబిరాల్లో ఉన్నారు. రైతుల పోరాటాన్ని ఫొటోలు, కవితల ద్వారా సంగ్రహిస్తున్నారు. ‘ఎ సైలెంట్ ఎవేకినింగ్: పవర్ ఆఫ్ ది ప్లో’ పేరిట తను రాసిన పుస్తకంలో ఈ ఉద్యమంలో మహిళలు పోషిస్తున్న విస్తృత పాత్రను ఆమె వివరించారు. రైతుల నిరసనోద్యమంలో పంజాబ్ ఆధిక్యత కనిపిస్తున్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులను ఇక్కడ నేను కలిశాను. రైతులకు మద్దతుగా కావేరీ డెల్టా ఫార్మర్స్ అసోసియేషన్ పేరిట తమిళనాడు నుంచి రైతులు వచ్చారు. జామియా యూనివర్సిటీ నుండి విదేశీ భాషల్లో పరిశోధకుడు బిహార్ నుంచి ఇక్కడికి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న హైదరాబాద్ ముస్లిం యువకుడు మరొక ‘జాతి వ్యతిరేక’ ఉద్యమంలో పాల్గొనడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు. గత సంవత్సర కాలంగా రైతులకు మద్దతిస్తూ నిరసనలో పాల్గొంటున్న సకల జీవన రంగాలకు చెందిన వ్యక్తుల సందర్శనతో ఈ నిరసన స్థలం ఒక యాత్రా స్థలంగా మారిపోయింది. నిరసన ప్రాంతాన్ని చూపించడానికి చాలామంది తమ కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చారు. నిరసన ‘గ్రామం’ మొత్తాన్ని పర్యటనలో భాగంగా చూపిస్తూ వారి అనుభవాలను పంచుకుంటూ కనిపించారు. రైతుల నిరసనోద్యమం ఇటీవలే ముగిసినందున, వారి శాంతియుత నిరసనల అనుభవం పంజాబ్ జానపద గాథల్లో భాగం కానుంది. తరాలుగా బాధిస్తున్న దేశ విభజన తాలూకు బాధాకరమైన జ్ఞాపకాల్లాగా కాకుండా, ఈ రైతాంగ నిరసనల్లో తొలి నుంచీ గర్విస్తూ పాల్గొన్న తమ అనుభవాలను భారత ప్రజలు కూడా కలకాలం గుర్తుంచుకుంటారు. డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, సోనీపట్ -
విక్టరీ హగ్; ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు!
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడాది పాటు ఉద్యమించారు. కొంపా, గోడు వదిలి.. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా లక్ష్య సాధనకు మడమ తిప్పని పోరాటం చేశారు. పాలకులు బలవంతంగా తమ నెత్తిన రుద్దాలనుకున్న శాసనాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని కేంద్రంగా ఉద్యమ జెండా ఎత్తిన అన్నదాతలు అంతిమంగా విజయం సాధించారు. భూమిపుత్రుల పోరాటంతో దిగివచ్చిన కేంద్ర సర్కారు వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. అంతేకాదు రైతులను ఆదుకునేందుకు లిఖితపూర్వక హామీలు ఇచ్చింది. (చదవండి: రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా) లక్ష్యం నెరవేరడంతో కర్షకులు హస్తిన నుంచి స్వస్థలాలకు పయనమయ్యారు. పోరాట యోధులకు ఊళ్లల్లో జనం నీరాజనాలు పట్టారు. ఏడాది పాటు ఇంటికి దూరమై ఉద్యమ నీడలో గడిపి తిరిగొచ్చిన అన్నదాతలను కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆలింగనాలతో స్వాగతించారు. అలాంటి భావోద్వేగభరిత వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఉద్యమంలో విజయం సాధించి వచ్చిన తండ్రిని అతడి కుమార్తెలు స్వాగతించిన తీరు చూపరులందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో కనిపించిన తండ్రీకూతుళ్లు ఎక్కడి వారు అనేది వెల్లడి కాకపోయినా ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు! (చదవండి: విత్తన హక్కులలో... రైతు విజయం) -
లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరిలో ముందస్తు కుట్రతోనే రైతులను బలితీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో విపక్షాలు బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని విపక్షాలు లోక్‌సభలో గట్టిగా డిమాండ్ చేశాయి. నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యులు పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసకెళ్లి మిశ్రాపై వేటు వేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. సిట్ తాజాగా వెల్లడించిన సంచలన విషయాల తాలూకు వార్తా కథనాలు కనిపించేలా ప్రతికలను చేతులతో పట్టుకొని గాల్లో ఊపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాలపై చర్చించాలని వాయిదా తీర్మానానికి రాహుల్ గాంధీ నోటీసు ఇచ్చారు. దీన్ని అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ బిర్లా వీరి డిమాండ్‌ను పట్టించుకోకుండా∙విపక్ష ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్నాహ్యం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేమైన తర్వాత ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ‘ధరల పెరుగుదలపై ముఖ్యమైన చర్చ ఉంది. ఈ అంశాన్ని చర్చకు చేపట్టాలనేది మీ డిమాండే కదా. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొండి’ అని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. అయినా లాభం లేకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. కుదించే ఆలోచన ప్రస్తుతానికి లేదు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదించే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘ధరల పెరుగుదల, ఒమిక్రాన్ ముప్పు లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలన్న విపక్షాలు తీరా ఇవి చర్చకు వస్తే పాల్గొనకుండా పారిపోవడం విడ్డూరం. ఈ అంశాల్లో మాట్లాడటానికి వారికి ఏమీ లేనట్లే కనపడుతోంది. సమావేశాల నిడివిని కుదిస్తారని పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయి’ అని విలేకరులతో అన్నారు. -
ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు
లఖీంపూర్ ఖేరి: లఖీంపూర్ ఖేరి హింసాకాండలో నిందితులు ముందస్తుగా రచించిన ప్రణాళిక, కుట్ర’తోనే నిరసన తెలుపుతున్న రైతుల పైకి వాహనాన్ని (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్– ఎస్యూవీ) నడిపారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్లో నిందితులపై ఇదివరకు నమోదు చేసిన సెక్షన్లను మార్చి మరింత తీవ్రమైన సెక్షన్లను చేర్చడానికి అనుమతించాలని ఇక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం) చింతా రామ్‌కు దరఖాస్తు చేసింది. హత్యాయత్నం సెక్షన్లను జతచేస్తామని విన్నవించింది. ఈ ఏడాది అక్టోబరు 3న లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు... మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా రైతులు నిరసన తెలిపారు. టికూనియా వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి ఎస్యూవీ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారని... ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదైంది. ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన రైతులు దాడికి దిగడంతో ఎస్యూవీ డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతో సహా 13 మంది నిందుతులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. తీవ్ర దుమారం రేగింది. బీజేపీపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్‌ను నియమించిన విషయం తెలసిందే. ముందస్తు ప్రణాళికతోనే... దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన ఆధారాలను బట్టి... ఈ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని (వీరు ఆయుధాలు కూడా కలిగి ఉన్నారని)... ప్రాణనష్టానికి దారితీసిందని సిట్ ప్రధాన దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ కోర్టుకు తెలిపారు. అందువల్ల రైతు జగ్మీత్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశిష్ మిశ్రా, తదితరులపై నమోదు చేసిన 220/221 ఎఫ్ఐఆర్లో ఐపీసీ సెక్షన్ 304ఏ (దూకుడుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణం కావడం), సెక్షన్ 338 (నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులను తీవ్రంగా గాయపర్చడం), సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్)లను తొలగించడానికి అనుమతించాలని కోరారు. వాటి స్థానంలో ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమాదకరమైన ఆయుధంతో గాయపర్చడం, ఆయుధాల చట్టంలో సెక్షన్ 3/25ని ఎఫ్ఐఆర్లో చేర్చడానికి అనుమతించాలని కోర్టును కోరారు. ఎఫ్ఐఆర్లో ఇదివరకే నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 147 (అల్లర్లు సృష్టించడం), 148 (ప్రమాదకరమైన ఆయుధాలతో అల్లర్లకు దిగడం), 120బి (కుట్రపూరిత నేరం) తదితర సెక్షన్లను సిట్ కొనసాగించింది. 13 మంది నిందితులకు జారీచేసిన వారెంట్లను సవరించాలని అభ్యర్థించింది. సీజేఎం ఆదేశం మేరకు మంగళవారం నిందితులు కోర్టుకు హాజరయ్యారు. వారెంట్లలో సెక్షన్లను మార్చడానికి సీజేఎం అనుమతించారని ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ ఎస్పీ యాదవ్ వెల్లడించారు. ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ మోదీ జీ.. మీరు మరోసారి క్షమాపణ చెప్పాల్సిన సమయమిది. అయితే దానికి ముందు తొలుత నిందితుడు (అశిష్ మిశ్రా) తండ్రి (అజయ్ మిశ్రా)కి కేంద్రమంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకండి. మత రాజకీయాలు చేసుకోండి. కానీ ఈ రోజు రాజకీయ ధర్మాన్ని పాటించండి. మీరిప్పుడు యూపీలోనే ఉన్నారు కాబట్టి మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించండి. మీ మంత్రిని తొలగించకపోవడం అన్యాయం. సరైనది కాదు!. ఒక మంత్రి రైతులను చంపేందుకు ప్రయత్నించారు. ప్రధానికి ఇది తెలుసు. పార్లమెంటులో ఆనాడు ఈ అంశాన్ని లేవనెత్తాం. కానీ చర్చిండానికి అనుమతించలేదు. గొంతునొక్కారు. – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయండి: ఎస్కేఎం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను రక్షించే ప్రయత్నాలను ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మానుకోవాలి. ఆయనను మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలి. మేము ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన ఊచకోత అనేది సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ప్రధాన సూత్రధారి అజయ్ మిశ్రా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా మంత్రిగా కొనసాగుతున్నారు. – సంయుక్త కిసాన్ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) -
అన్నదాతల ఆందోళన విరమణ
న్యూఢిల్లీ: రైతు చట్టాల రద్దు సహా పలు డిమాండ్ల సాధనకు ఏడాదిగా చేస్తున్న ఆందోళనను నిలిపివేస్తున్నట్లు 40 రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) గురువారం ప్రకటించింది. డిసెంబర్ 11 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాలను ఆందోళన చేస్తున్న రైతులు ఖాళీ చేస్తారని తెలిపింది. జనవరి 15న తిరిగి రైతు నేతలు సమావేశమవుతారని, ప్రభుత్వం తమ డిమాండ్లను ఎంతవరకు నెరవేర్చిందో చర్చిస్తారని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారానికి యత్నిస్తామని కేంద్రం నుంచి లేఖ అందడంతో ఎస్కేఎం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కేంద్రం తరఫు వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ఈ లేఖను పంపారని ఎస్కేఎం సభ్యుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు, రైతులపై కేసుల ఉపసంహరణ తదితర డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఎంఎస్పీపై నిర్ణయం తీసుకునేవరకు పంటధాన్యాల సేకరణపై యథాతధ స్థితి కొనసాగుతుందన్నారు. ఎంఎస్పీపై రైతులు లేవనెత్తిన డిమాండ్ పరిష్కరించేందకు ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ నిపుణులు, ఈ నిరసనకు నాయకత్వం వహించిన రైతు సంఘాల నేతలు ఉంటారని తెలిపింది. రైతులపై పెట్టిన పోలీసు కేసుల్ని ఉపసంహరించుకోవడానికి ఆయా రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్రం పంపిన లేఖలో వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతాలు, రైల్వేలు పెట్టిన కేసులనూ ఉపసంహరిస్తామని తెలిపింది. ఎస్కేఎంతో చర్చల అనంతరమే విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. నిరసనల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు హరియాణా, యూపీ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని తెలిపింది. పంటపొల్లాల్లో దుబ్బులను తగలబెట్టడాన్ని ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణించరని పేర్కొంది.. డిసెంబర్ 11న రైతులు తమతమ ప్రాంతాలకు విజయయాత్ర చేపడుతూ వెళ్తారు. దేశవ్యాప్తంగా నిరసన స్థలాల వద్ద ‘విజయ్ దివస్’ను నిర్వహిస్తామని ఎస్కేఎం తెలిపింది. రైతులు వెనుదిరిగినా, ఎస్కేఎం మనుగడలోనే ఉంటుందని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ఇబ్బంది పెట్టాం.. క్షమించండి! తమ నిరసనల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రజానీకానికి ఎస్కేఎం క్షమాపణలు చెప్పింది. తమది చారిత్రాత్మక విజమన్న ఎస్కేఎం నేత శివకుమార్ కాకా, తమ వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న వ్యాపారవేత్తలు, ప్రజలను మన్నింపు కోరారు. రైతు నిరసనలతో దేశ రాజధాని సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే! రైతులు తమ తమ శిబిరాలను తొలగించడం ఆరంభించారు. తమ నిరసనలకు ఫలితం దక్కడంతో రైతులు శనివారం ఉదయం సింఘు, టిక్రీ ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీని చేపట్టనున్నట్లు తెలిసింది. తమ ఆందోళన విజయవంతం కావడంతో నిరసన ప్రాంతాల్లో ఆనందం వెల్లివిరిసింది. రైతులు స్వీట్లు పంచుకుంటూ, పాటలు పాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన విరమించాలన్న రైతు సంఘాల నిర్ణయాన్ని కేంద్రం, పలు రాజకీయపార్టీలు స్వాగతించాయి. ఎందుకీ ఆందోళన? ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సరం నవంబర్ 26 నుంచి రైతులు ఆందోళనలకు దిగారు. సంవత్సరకాలంగా జరిపిన నిరసనలకు కేంద్రం దిగివచ్చి సదరు చట్టాలను రద్దు చేసింది. ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గత నెల స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే సాగు చట్టాల రద్దు బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. అయితే తమ మిగతా ఆరు డిమాండ్లను కూడా కేంద్రం పరిష్కరించాలంటూ రైతు సంఘాలు నిరసనలు కొనసాగించాయి. దీనిపై కేంద్రానికి, ఎస్‌కేఎంకు మధ్య పలు దఫాలుగా సంప్రదింపుల జరిగాయి. ఎస్‌కేఎంకు కేంద్రం గురువారం ఒక ముసాయిదా ప్రతిపాదనను పంపింది. దీనిపై చర్చించిన అనంతరం ఎస్కేఎం ఆందోళన విరమణ ప్రకటన చేసింది. రాజకీయాల్లో చేరాలనుకునే వాళ్లు వెళ్లిపోండి! ఎస్‌కేఎంను జాతీయస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని సభ్యులు భావిస్తున్నారు. సంఘంలో ఎవరైనా రాజకీయాల్లో చేరాలనుకుంటే సంఘం నుంచి వెళ్లిపోవాలని ఎస్కేంఎ కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ తేల్చిచెప్పారు. రైతు సంఘాల సమాఖ్య ఎప్పటికీ రాజకీయేతరంగానే ఉంటుందన్నారు. పంజాబ్‌లో పరిస్థితులను ప్రభావితం చేసేలా రైతు సంఘాలు రాజకీయాలపై దృష్టి పెట్టవద్దన్నారు. జనవరి 15 సమావేశంలో జాతీయ స్థాయి మోర్చాగా ఎదగడంపై చర్చిస్తామన్నారు. -
రైతు ధర్మాగ్రహ విజయం
దాదాపు 15 నెలల సుదీర్ఘకాలం... 700 మందికి పైగా రైతుల ప్రాణత్యాగం... ఎండనకా వాననకా, ఆకలిదప్పులను భరిస్తూ వేలాది రైతులు చూపిన ధర్మాగ్రహం... వృథా పోలేదు. రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అధికారిక లేఖ రూపంలో లిఖితపూర్వక హామీ దక్కింది. దాంతో, 3 నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలంటూ ఇన్ని నెలలుగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు 40కి పైగా రైతు సంఘాలకు సారథ్యం వహిస్తున్న ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) గురువారం ప్రకటించింది. అయితే, ‘ఆందోళనను విరమిస్తున్నామే తప్ప, ఉద్యమాన్ని విరమించడం లేదు. రైతు హక్కుల కోసం పోరు కొనసాగుతుంది’ అనడం గమనార్హం. జనవరి 15 దాకా గడువు పెట్టిన రైతులు, అప్పుడు ప్రభుత్వ హామీల పురోగతిని సమీక్షించి, కార్యాచరణ నిర్ణయించనున్నది అందుకే! ఏడాది పైగా ఇల్లూ వాకిలీ వదిలేసి, దేశ రాజధాని సరిహద్దుల్లో గుడారాలు వేసుకొని ఉంటున్న రైతులు ఈ 11న విజయోత్సవ ర్యాలీతో స్వస్థలాలకు పయనం ప్రారంభిస్తారు. అయితే, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం లాంటి అన్నదాతల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరనే లేదు. రైతుల మొక్కవోని దీక్ష, ముంచుకొస్తున్న పంజాబ్ – యూపీ ఎన్నికలు... కారణం ఏమైతేనేం కేంద్రం తలొగ్గి, చటుక్కున రూటు మార్చి, వివాదాస్పద రైతు చట్టాలను ఉపసంహరించుకోవడం కనివిని ఎరుగని కథ. గురుపూర్ణిమ వేళ నవంబర్ 19న సాక్షాత్తూ ప్రధాని మోదీ రైతులకు టీవీలో క్షమాపణలూ చెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు తమ అనేక డిమాండ్లలో ఒకటి మాత్రమేనంటూ నిరసనను విరమించడానికి రైతులు ససేమిరా అన్నారు. ఆరు డిమాండ్లను ఏకరవు పెడుతూ ఎస్కేఎం నవంబర్ 21న ప్రధానికి లేఖ రాసింది. దానికి ప్రతిగా ఎస్‌కేఎంకు చెందిన అయిదుగురు సభ్యుల కమిటీకి కేంద్రం తన ముసాయిదా ప్రతిపాదనను బుధవారం పంపింది. రైతు సంఘాలు కోరిన మార్పులు చేర్పులతో గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి లేఖ రూపంలో హామీ రావడంతో ఇప్పటికి రైతుల ఆందోళనకు తాత్కాలికంగా తెర పడింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సహా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన మొదలుపెట్టిన సరిగ్గా 380వ రోజున రైతులు ఇంటి దారి పట్టనున్నారు. వెనక్కి తిరిగి చూస్తే, కోవిడ్ ఫస్ట్ వేవ్ లాక్డౌన్ తర్వాత 2020 జూన్‌లో 3 వివాదాస్పద వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను సర్కారు పార్లమెంట్లో పాస్ చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ, పంజాబ్ గ్రామాల్లో చెదురుమదురుగా మొదలైన నిరసనలు క్రమంగా వేడెక్కి, పొరుగున ఉన్న హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. గత ఏడాది నవంబర్ 25న వేలాది రైతులు ఢిల్లీకి ప్రదర్శనగా రావడం, వారిని అనుమతించక పోవడంతో రాజధాని ప్రధాన ప్రవేశమార్గాలను ఆందోళనకారులు అడ్డగించడం కనివిని ఎరుగని చరిత్ర. రాజధాని వెలుపలే గుడారాలు వేసుకొని, నిరసన చేస్తున్న రైతు సంఘాల వారితో కేంద్రం 11 విడతల చర్చలు జరిపి, చట్టాల్లో మార్పులు చేస్తామంది. కానీ, చట్టాల రద్దు ఒక్కటే తమకు సమ్మతమని పట్టుబట్టి, రైతులు అనుకున్నది సాధించారు. నిజానికి, ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేళ రైతు ఆందోళనకారుల ర్యాలీలో పోలీసులతో హింసాకాండ చెలరేగింది. రైతు నిరసన దోవ తప్పినట్టు అనిపించింది. ఆ పైన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌ను బలవంతాన ఖాళీ చేయించడం లాంటి వాటితో మళ్ళీ ఉద్యమం ఊపందుకుంది. క్రమంగా నిరసనల కేంద్రం పంజాబ్, హర్యానాల నుంచి పశ్చిమ యూపీకి మారింది. ఒక దశలో సుప్రీమ్ కోర్టు సైతం జోక్యం చేసుకొని, సాగు చట్టాలపై ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాల్సి వచ్చింది. తీరా ఆ సంఘం సుప్రీమ్‌కు సమర్పించిన నివేదిక ఇప్పటికీ వెలుగు చూడలేదన్నది వేరే కథ. ఆ మాటకొస్తే సాగు చట్టాలు చేస్తున్నప్పుడు కానీ, వాటిని నవంబర్ 29న రద్దు చేస్తున్నప్పుడు కానీ పార్లమెంటులో చర్చ లేకుండా మెజారిటీతో నోరు నొక్కేశారనే అప్రతిష్ఠ మోదీ సర్కారు మూటగట్టుకుంది. చనిపోయిన రైతులకు నష్టపరిహారం మాటెత్తితే, మృతుల వివరాలు మా దగ్గర ఉండవంటూ మళ్ళీ విమర్శల పాలైంది. చివరకిప్పుడు– ఎంఎస్పీపై వేసే సంఘంలో ఎస్కేఎం నేతలకూ చోటిస్తామనీ, రైతులందరిపైనా కేసులు ఎత్తి వేసేలా చూస్తామనీ, విద్యుత్ సవరణ బిల్లులోని సెక్షన్లలో రైతు నేతలను సంప్రదించి మార్పులు చేస్తామనీ కేంద్రం హామీలు ఇవ్వాల్సి వచ్చింది. లఖిమ్‌పూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి బర్తరఫ్ డిమాండ్ ఒక్కటీ మిగిలిపోయింది. నిరసనకారులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్రం మొదటే చెప్పినా, 2016 నాటి జాట్ రిజర్వేషన్ల ఆందోళనల వేళ ఇలాగే ఇచ్చిన హామీలు నెరవేరలేదని రైతులు అనుమానించారు. అందుకు వారిని తప్పుపట్టలేం. హోమ్ మంత్రి గత వారం ఫోన్ చేసి మరీ చర్చించాల్సి వచ్చింది. హామీలిచ్చినా, అధికారిక లేఖ కావాలని రైతులు కోరారంటే, పాలకులపై పేరుకున్న అనుమానాలు అర్థమవుతున్నాయి. అయితే, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కొత్త చట్టాలని భావిస్తూ వచ్చిన రైతుల అనుమానాలు, కష్టాలు ఇంతటితో తీరేవి కావు. వారి సందేహాలను నివృత్తి చేసి, ఈ దేశంలో రైతే రాజు అనే విశ్వాసం నెలకొల్పాల్సింది పాలకులే. అందుకు ఇకనైనా ఓ సమగ్ర వ్యవసాయ విధానం దిశగా నడవక తప్పదు. ఆ ప్రయాణానికి ప్రేరేపించగలిగితే అన్నదాతల ధర్మాగ్రహ విజయం అపూర్వమవుతుంది. -
కేంద్రం లిఖిత పూర్వక హామీ.. ఆందోళన విరమించిన రైతు సంఘాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతు ఉద్యమం విజయవంతంగా ముగిసింది. డిమాండ్లపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. శుక్రవారం బిపిన్‌రావత్ అంత్యక్రియలు ఉండడంతో.. 11వ తేదీ ఉదయం 9గంటలలోపు రైతులు సింఘా బార్డర్‌ను ఖాళీ చేయనున్నారు. ఈ మేరకు రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబర్ 13న పంజాబ్ రైతులంతా గోల్డెన్ టెంపుల్ సందర్శించనున్నారు. 15న కిసాన్ సంయుక్త మోర్చా మరోసారి సమావేశం కానుంది. కాగా, గతేడాది నవంబర్ 25న రైతు ఉద్యమం మొదలైంది. రైతు ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలను రద్దు చేసింది. సాగుచట్టాల రద్దు బిల్లుకు నవంబర్ 29న పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. -
నన్ను చంపుతామని బెదిరించారు: కంగనా రనౌత్
చండీగఢ్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు రైతుల నిరసన సెగ తగిలింది. పంజాబ్‌లోని కిరాత్పూర్ సాహిబ్ సమీపంలో ఆమె కారును పెద్ద ఎత్తున రైతు నిరసనకారులు అడ్డగించారు. రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకరంగా నిరసన తెలిపిన రైతులను ఉగ్రవాదులు, ఖలిస్తానీలతో పోల్చుతూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Sanya Malhotra: చివరి బ్రేకప్ నా హృదయాన్ని కదిలించింది అయితే శుక్రవారం కంగనా ప్రయాణిస్తున్న కారును రైతులు జెండాలతో నినాదాలు చేస్తూ అడ్డగించారు. ‘నన్ను రైతు నిరసనకారులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. దూషిస్తూ.. నన్ను చంపుతామని బెదిరించారు’ అని ఆమె కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రైతు నిరసనకారులు గుంపుగా చుట్టూ చేరేసరికి ఏం చేయాలో తోచలేదని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా తనతో లేరని, తాను రాజకీయ నాయకురాలిని కాదని చెప్పారు. రైతు నిరసనకారులు తనను అడ్డిగించడాన్ని కంగనా తీవ్రంగా ఖండించారు. కేంద్రం రైతుల కోసం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. -
చనిపోయిన రైతులకు సాయం చేయలేం: కేంద్రం
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాదిగా కొనసాగుతున్న ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంత మంది రైతులు చనిపోయారనే వివరాలు తమ వద్ద లేవని పార్లమెంట్‌కు తెలిపింది. ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదన ఏమైనా ఉందా అని లోక్‌సభలో ప్రభుత్వాన్ని బుధవారం ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ‘ఉద్యమంలో చనిపోయిన అన్నదాతలకు సంబంధించి వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద ఎటువంటి రికార్డు లేదు. అందువల్ల ఆర్థిక సహాయం అన్న ప్రశ్నే తలెత్తదు’ అని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రైతుల ప్రయోజనాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని, కనీస మద్దతు ధర కల్పిస్తామని కేంద్ర సర్కారు పునరుద్ఘాటించింది. (చదవండి: రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన) కాగా, ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. (మీ పాన్ కార్డు పోయిందా? ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!) -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు రేపే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన కొత్త బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దిగువ సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో ఈ కొత్త బిల్లును అధికారులు చేర్చారు. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. ‘‘మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొందరు రైతులు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’ అని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 29న లోక్‌సభకు కచ్చితంగా హాజరు కావాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత మాత్రాన సరిపోదని, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. ట్రాక్టర్ల ర్యాలీ రద్దు ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ వరకూ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రద్దు చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేత దర్శన్ పాల్ శనివారం ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని, ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 4న రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముంబైలో ఆదివారం సంయుక్త షెట్కారీ కామ్‌గార్ మోర్చా(ఎస్ఎస్కేఎం) ఆధ్వర్యంలో కిసాన్–మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. 100కు పైగా రైతు, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. రైతుల త్యాగాలను కించపరుస్తారా?: కాంగ్రెస్ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన ‘అభ్యంతరాలు, కారణాలు’ అనే పదాల పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా కొనసాగుతున్న పోరాటంలో మరణించిన 750 మంది రైతుల త్యాగాలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. 750 మంది రైతులు మరణిస్తే, కేవలం కొందరే ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం చెప్పడం ఏమిటని నిలదీశారు. పంట వ్యర్థాల దహనం నేరం కాదు కేసుల ఉపసంహరణపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి: కేంద్రం రైతాంగం డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని నేరంగా పరిగణించరాదంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆందోళన విరమించాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), పంటల వైవిధ్యంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రధాని మోదీ హామీ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లిండంపైనా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతా రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రైతన్నలు పెద్ద మనసు చేసుకొని, పోరాటం ఆపేసి, ఇళ్లకు తిరిగి వెళ్లాలని తోమర్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల దక్కే ప్రయోజనాల గురించి కొందరు రైతులను ఒప్పించలేకపోయామని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. -
కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్ 6న హాజరవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభకు చెందిన ‘శాంతి, సామరస్యం కమిటీ’ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆక్షేపించింది. డిసెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఓ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. సిక్కు మతస్థులను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా కంగన అభివర్ణించినట్లు ఫిర్యాదుదారులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి పోస్టులు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని, ఓ వర్గం ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తాయని రాఘవ్ చద్ధా పేర్కొన్నారు. శాంతి, సామరస్యం కమిటీని ఢిల్లీ అసెంబ్లీ 2020లో ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది. -
27న భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి
ఘజియాబాద్: వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడే ఆగవని, భవిష్యత్తు కార్యాచరణను ఈనెల 27న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ బుధవారం తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చేసిన వాగ్దానాలపై కూడా మోదీ సర్కారును నిలదీస్తామన్నారు. ‘శనివారం మేము సమావేశం కానున్నాం. అక్కడ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాం. జనవరి 1 నుంచి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అదెలా చేస్తారో చెప్పాలని మేము ఆయన్ని అడుగుతాం’ అని తికాయత్ ట్వీట్ చేశారు. కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికాలంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు
లక్నో: దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ కోరారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందని, తమతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత, విత్తనాలు, పాడి పరిశ్రమ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌కు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మద్దతు పలికారని తికాయత్ గుర్తుచేశారు. ఇదే డిమాండ్‌ను తాము లేవనెత్తుతున్నామని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఉగ్రవాదితో సరిపోల్చారు. లఖీమ్‌పూర్ ఖేరిలో రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు హాని చేస్తాయన్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని ప్రకటించిందని, సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాల గురించి కొందరికి అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామంటూ రైతుల నడుమ చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ కొందరు తామేనని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ దేశాన్ని అమ్మేస్తుంటారు సంఘర్‡్ష విశ్రామ్(కాల్పుల విరమణ)ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందని, రైతులు కాదని రాకేశ్ తికాయత్ ఉద్ఘాటించారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అప్పటిదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. దేశమంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వ్యవహార ధోరణిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. రైతుల పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వారు (ప్రభుత్వం) ఒకవైపు మిమ్మల్ని హిందూ–ముస్లిం, హిందూ–సిక్కు, జిన్నా అంటూ మభ్య పెడుతుంటారు. మరోవైపు దేశాన్ని అమ్మేస్తుంటారు’’ అని తికాయత్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పినంత మాత్రాన పంటలకు కనీస మద్దతు ధర దక్కదని అన్నారు. చట్టబద్ధత కల్పిస్తేనే దక్కుతుందని చెప్పారు. ఈ అంశంపై ఒప్పటికే కమిటీని ఏర్పాటు చేశారని, నివేదిక ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరిందని, నిర్ణయం తీసుకోవడానికి కొత్త కమిటీ అవసరం లేదని సూచించారు. నివేదిక ఇచ్చిన కమిటీలో నరేంద్ర మోదీ కూడా సభ్యుడేనని గుర్తుచేశారు. కమిటీ సిఫార్సులను ఆయన ఆమోదిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం? ప్రసార మాధ్యమాల తీరుపై రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా మీడియా కేవలం రైతులను మాత్ర మే ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారని తెలిపారు. కిసాన్ మహా పంచాయత్‌లో పలువరు రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
కేంద్రంతో అమీతుమీ.. కేసీఆర్ రెండు రోజుల హస్తిన పర్యటన
వరిసాగుపై కేంద్రం ఎందుకో సరిగా స్పందించడం లేదు. అనురాధ కార్తె శుక్రవారం ప్రారంభమైంది. ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు అయోమయంలో ఉంటరు. ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా.. యాళ్లకు నష్టపోయినం అనే మాట వస్తది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రైతులు ఏ పంట వేసుకోవాలో చెబుతాం రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలుపై మాట్లాడతామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పినట్లు మొన్న ఓ గాలివార్త వచ్చింది. ఇది అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నం. ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని నిర్ణయించాం. ఆయా కుటుంబాలను కలిసి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల సాయం చొప్పున మొత్తం రూ. 22.5 కోట్లు అందిస్తాం. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణతోపాటు నీటి వాటాలు, ఇతర సమస్యలపై కేంద్రంతో తేల్చుకునేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వెళ్లి.. ఢిల్లీ రైతుల ఉద్యమం, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ చట్టాలు తదితర అంశాలపై ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తామని వెల్లడించారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని తేల్చుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్లో పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ధాన్యంపై ఉలుకూపలుకు లేదు.. ‘తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ఎటువంటి సమాధానం వస్తలేదు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి సంవత్సరంలో ఎంత సేకరిస్తారో టార్గెట్ ఇవ్వమని అడుగుతున్నం. దాన్నిబట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మొన్న ధర్నా చేసిన రోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. ఏం మాట్లాడలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రులు, ఎంపీల బృందంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల కార్యదర్శుల బృందంతో ఢిల్లీకి వెళ్తున్నం. కేంద్ర మంత్రులతో పాటు అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోరుతం. అవసరమైతే రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాం. ఆ తరువాత రైతులకు మా విధానం ఏంటో చెపుతం..’అని సీఎం వెల్లడించారు. కేసులు ఎత్తివేయాలి..వేధింపులు ఆపాలి ‘భద్రతా బలగాల నిర్బంధం, ఒత్తిళ్లు, కేసుల నడుమ 13 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటం అద్భుత విజయం సాధించింది. చట్టాలను వెనక్కు తీసుకోవడంతో రైతుల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. ఈ ఉద్యమ సమయంలో రైతులపై దేశద్రోహం సహా వేలాది కేసులు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఇలాంటి కేసులను వెంటనే ఎత్తివేసి, రైతులపై వేధింపులను ఆపివేయాలి. కేంద్రం అనుసరించిన దుర్మార్గ విధానాలతో సుమారు 750 మంది రైతులు పోరాటంలో భాగంగా ఆత్మార్పణం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం క్షమాపణలతో చేతులు దులుపుకోకుండా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఇచ్చి ప్రజాస్వామ్యం విలువలను కాపాడాలి. రైతులపై కేసుల ఎత్తివేత, రూ.25 లక్షల సాయంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర చట్టం కోసం పార్లమెంటులో కొట్లాడుతం..’అని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కు తీసుకోవాలి ‘దళారులు, వ్యాపారుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధర కోసం దేశంలోని 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా సమయంలో ప్రధాని ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్’తరహాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఆత్మ కృషి నిర్భర్’పథకాన్ని తీసుకురావాలి. వ్యవసాయ చట్టాల తరహాలోనే పార్లమెంటులో పెట్టిన విద్యుత్ చట్టాన్ని కూడా కేంద్రం వెనక్కు తీసుకోవాలి. నూతన కరెంటు చట్టం పేరిట ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాల మెడపై కత్తి పెట్టడంతో ప్రజలు, విద్యుత్ కార్మికులలో ఆందోళన నెలకొంది. మోటార్లకు మీటర్లు పెట్టాలనే నియంతృత్వ పోకడలకు వెళితే రైతులు రోడ్లెక్కుతారు..’అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ట్రిబ్యునల్ వేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకెవడు? ‘నదీజలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కొత్త రాష్ట్రానికి నీటి వాటాతో పాటు అనేక అంశాల్లో కేంద్రం తాత్సారం చేస్తోంది. 8 ఏళ్లుగా కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటా తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకుంటున్న ప్రణాళికలు ఆలస్యమై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానిని, జలశక్తి మంత్రిని కలిసినప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కోరడంతో పాటు మూడు నాలుగు నెలల కాలవ్యవధిలో రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చాలని అడుగుతం. ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయడంలో కేంద్రానికి ఏం అడ్డం పడుతోంది. కేంద్రం రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకు ఎవడు? కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే ఆందోళనకు దిగుతాం..’అని చెప్పారు. బీసీ కుల గణన జరపాలి ‘గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై ఇప్పటికే రాష్ట్ర శాసనసభ తీర్మానాలు చేసి పంపింది. దేశంలో బీసీ కులగణనను కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలే కులం సర్టిఫికెట్లు ఇస్తున్న నేపథ్యంలో కులాల లెక్కలు దాచిపెట్టుడెందుకు ? కుల గణన చేపట్టకుంటే పెద్ద వివాదానికి దారితీస్తుంది..’అని కేసీఆర్ పేర్కొన్నారు. పిచ్చిమాటలు వినొద్దు.. రైతులు ఆగం కావొద్దు ‘స్థానిక బీజేపీ నాయకులు పిచ్చిమాటలు కట్టిపెట్టాలి. మీ బండారం బయటపడింది. మీరు చేసిన తప్పులకు ప్రజల ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాలి. చిల్లరగాళ్లు చెప్పే మాటలకు రైతులు ఆగం కావద్దు. ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చే క్రమంలో తొందరపడవద్దు. వానాకాలం ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు 6,600 కేంద్రాలు ఏర్పాటు చేసి డబ్బులు ఇస్తున్నం. వర్షాలు పడుతున్నందున కోతలు కోయనివారు రెండు మూడు రోజులు ఆగాలి. లేదంటే ధాన్యం రంగు మారి నష్టపోవలసి వస్తుంది. కోసిన వారు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. యాసంగిలోనూ రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు సిద్ధం చేస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఏ పంటలు వేసుకోవాలో రైతులకు చెపుతం..’అని అన్నారు. ఎన్నికలు ఉన్నందునే వ్యవసాయ చట్టాలు వెనక్కి ‘దేశంలోని ప్రజలకు ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. దేశంలో బియ్యం తినే జనం ఎక్కువ. మన రాష్ట్రంలోనే పీడీఎస్ కింద 25 లక్షల టన్నుల బియ్యం అవసరం. 58.66 లక్షల ఎకరాల్లో వరి సాగైందని కేంద్రమే చెపుతోంది. కేంద్రంపై పోరాటంలో ఏ సమయంలో ఎవరిని కలుపుకొనిపోవాలో వారిని కలుపుకొనివెళతాం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునే మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. దేశంలో ఆయన్ను ఎవరూ నమ్మడం లేదు..’అని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎన్ని‘కలవర’మేనా!
ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నా... అసలు ఆదో సమస్య కాదన్నట్లే వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ... దాని ప్రస్తావనే రానిచ్చేవారు కాదు. కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలు ఆందోళన చేస్తున్న రైతులను దేశద్రోహులు, విదేశీ నిధులతో కృత్రిమ ఉద్యమాలు నడుపుతున్నారని ఆరోపించే దాకా వెళ్లారు. మరి ఇప్పుడు ఆకస్మాత్తుగా మోదీ ఎందుకు జాతిముందుకు వచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా దేశానికి క్షమాపణ చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... అహంకారిగా ముద్రపడుతున్నా, ఒంటెత్తు పోకడలు పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైనా... ఆత్మావలోకనం చేసుకున్న సందర్భాలు, వెనక్కితగ్గిన ఉదంతాలు చూడలేదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరి తాజా వెనుకడుగు మాత్రం కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వేసిందేనని చెప్పొచ్చు. వచ్చే ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి– మార్చి నెలల్లో) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా రైతు ఆందోళనల్లో పశ్చిమ యూపీ, పంజాబ్, హరియాణా రైతులే ముఖ్య భూమిక పోషించారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో వెంటనే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం వెలువడింది. ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది సుస్పష్టం. సామాన్య ప్రజానీకంలో ధరాఘాతంతో పెల్లుబికిన ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించగలిగామని భావించిన బీజేపీ వ్యూహకర్తలు... రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులపైకి దృష్టి మళ్లించారు. ఆజ్యం పోసిన హరియాణా హరిణాయా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రైతులపై దాడులు చేయాల్సిందిగా పరోక్షంగా బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టడం, అరునెలలు జైలులో ఉండొస్తే నేతలు అవుతారని ఉద్భోదించడం... రైతులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. కర్నాల్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అయూష్ సిన్హా రైతుల తలలు పగలగొట్టండని పోలీసులు ఆదేశాలు ఇస్తున్న వీడియో వైరల్ కావడం... పోలీసు లాఠీచార్జీలో 10 మంది రైతులు రక్తమోడగా... తర్వాత అందులో ఒకరు మరణించిన విషయం తెలిసిందే. ఇవన్నీ బీజేపీపై రైతుల ఆగ్రహాన్ని పెంచుతూ పోయాయి. హిమాచల్ ఓటమి... మరో కనువిప్పు ఇటీవలి ఉప ఎన్నికల్లో కొంచెం అటుఇటుగా అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల హవాయే కనపడింది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ దారుణంగా దెబ్బతింది. అంతుకుముందు నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గిన మండీ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కోల్పోయింది. అలాగే ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. ఇది కమలనాథులకు కనువిప్పు కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్‌లో నాలుగు స్తంభాలాట! రైతు ఉద్యమంలో సిక్కులు ముందువరుసలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రైతు చట్టాలపై ఎన్డీయేతో తమ సుదీర్ఘ బంధాన్ని శిరోమణి అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళితులు ఉండటంతో బీఎస్పీతో అకాలీదళ్ జట్టుకట్టింది. మరోవైపు కాంగ్రెస్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా, దళితుడైన చన్నీని సీఎంగా పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో జట్టు కడతానని బహిరంగంగానే ప్రకటించారు. ఈ కొత్త కూటమి ఏమేరకు ప్రభావం చూపుతుందనే పక్కనబెడితే పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారనున్నాయి. అకాలీదళ్‌తో పాత అనుబంధం దృష్ట్యా హంగ్ అసెంబ్లీ వస్తే కెప్టెన్–బీజేపీ కూటమి ఎన్నోకొన్ని సీట్లతో కింగ్‌మేకర్ పాత్రను ఆశించొచ్చు. పశ్చిమంతో మొదలై పాకుతుందని...! పశ్చిమ యూపీలోని ఆరు రీజియన్లలో (26 జిల్లాల్లో) మొత్తం 136 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఏకంగా 103 అసెంబ్లీ స్థానాల్లో విజయం కేతనం ఎగురవేసింది. (27 లోక్‌సభ స్థానాల్లో 20 కాషాయదళానికే దక్కాయి). మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా 312 చోట్ల నెగ్గి ఘన విజయం సాధించింది. రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాట్లు పశ్చిమ యూపీలో బలంగా ఉన్నారు. 18–20 శాతం దాకా ఉంటారు. 49 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల జనాభా 30 శాతం పైనే. 25 స్థానాల్లో ముస్లిం– జాట్లు కలిస్తే... జనాభాలో సగం కంటే ఎక్కువే ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 5న కిసాన్ సంయుక్త్ మోర్చా... ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన మహా పంచాయత్‌కు అనూహ్యంగా లక్షలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇదే వేదిక పైనుంచి రాకేశ్ తికాయత్ బీజేపీ విభజన రాజకీయాలను ఎండగడుతూ... రైతుల ప్రయోజనాల దృష్ట్యా హిందూ– ముస్లింలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని నినదించారు. ఇకపై రైతు వేదికల పైనుంచి ‘అల్లా హు అక్బర్’, ‘హరహర మహదేవ్’ నినాదాలను వినిపించి సామరస్యాన్ని చాటుతామని నొక్కిచెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో పనిచేస్తామన్నారు. త్యాగిలతో కలిపి వెనుకబడినవర్గాలైన సైనీ, కశ్యప్, గుజ్జర్లను కలుపుకొనిపోతే రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావించారు. సమాజ్‌వాదితో ఆర్ఎల్డీ జతకట్టడం ఈ ప్రాంతంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ. క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు బీజేపీ వ్యూహకర్తలకు ఉలికిపాటుకు గురిచేశాయి. నష్టనివారణ చర్యలకు దిగారు. సెప్టెంబరు 14న ప్రధాని మోదీ జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరిట యూనివర్శిటీ శంకుస్థాపన చేశారు. పశ్చిమ యూపీలో బలపడుతున్న రైతు ఐక్యతకు... సామాజికవర్గాల పునరేకీరణ తోడై... మొత్తం ఉత్తరప్రదేశ్‌కు పాకితే తట్టుకోవడం కష్టమనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చారు. అసలే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తారు. అందుకే కాషాయదళం భేషజాలను పక్కనబెట్టి... పోల్ మేనేజ్మెంట్కుదిగింది. మృత చట్టాలే... ఖననం చేసేద్దాం! కార్పొరేట్ మిత్రులకు లబ్ధికొరకే వ్యవసాయ చట్టాలను తెచ్చారని... తీవ్ర అపవాదును మూటగట్టుకొన్న బీజేపీ నిజానికి వీటి ద్వారా సాధించింది ఏమీలేదు. 11 దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు జరిపిన కేంద్రం మొండిగా వ్యవహారించింది. ‘ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా... (చట్టాల రద్దు మినహా)’ ఏమైనా అడగండి... చర్చలకు సిద్ధం అంటూ పాడినపాటే పాడింది. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమే తప్ప తాము మరోటి కోరుకోవడం లేదని రైతులూ తేల్చిచెప్పడంతో చర్చల్లో ఏమీ తేలలేదు. నిజానికి సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ఈ ఏడాది జనవరి 12నే ‘స్టే’ విధించింది. కోర్టులో వ్యవహారం ఎప్పటికి తేలుతుందో తెలియదు. కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న చట్టాల కోసం పార్టీ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టడం వివేకవంతమైన చర్య కాదనేది బీజేపీ పెద్దలు నిర్ణయానికి వచ్చి... మోదీ ‘ఇమేజ్’కు భిన్నంగా వెనక్కి తగ్గుతూ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలతో ఊదరగొడుతున్న బీజేపీకి యూపీలో తాజా నిర్ణయం ఏమేరకు కలిసొస్తుందో కాలమే చెప్పాలి. –నేషనల్ డెస్క్, సాక్షి -
విజయ సారథులు వీరే
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒక డాక్టర్, ఒక రిటైర్డ్ టీచర్, ఆర్మీలో పని చేసిన వ్యక్తి , ఢిల్లీ పోలీసు మాజీ కానిస్టేబుల్ ఇలా ఎందరో ఉన్నారు. ఏడాది పాటు ఉద్యమాన్ని సజీ వంగా నిలిపి ఉంచడానికి వీరంతా పాటుపడ్డారు. రాకేశ్ తికాయత్ భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాకేశ్ తికాయత్ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోశారు. ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ అయిన ఆయన కరకు ఖాకీలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉద్యమం నీరుకారిపోతున్న సమయంలో ఉద్వేగభరిత ప్రసంగాలతో నిరసనకారుల్లో మళ్లీ ఉత్తేజాన్ని నింపారు. 52 ఏళ్ల వయసున్న తికాయత్ ప్రభుత్వంతో చర్చల్లోనూ కీలకపాత్ర పోషించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిరసనలు చేపడితే కేంద్రం దిగి వస్తుందన్న వ్యూహాన్ని రచించి ప్రభుత్వంలో కదలిక తెచ్చారు. దర్శన్పాల్ వృత్తిరీత్యా డాక్టర్ అయిన దర్శన్పాల్ దేశవ్యాప్తంగా రైతు సంఘాలను ఏకం చేశారు. 40 రైతు సంఘాలను ఒకే గూటికి తీసుకువచ్చి కిసాన్ ఏక్తా జిందాబాద్ నినాదంతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అఖిల భారత సంఘర్‡్ష సమన్వయ కమిటీ సభ్యుడైన దర్శన్ పాల్ పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జోగిందర్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) అధ్యక్షుడు అయిన జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు. రైతు సంఘాల్లో అత్యధికం సింఘూ సరిహద్దుల్లోనే ఉద్యమిస్తే టిక్రీలో ఉద్యమాన్ని జోగిందర్ సింగ్ ఒంటిచేత్తో నడిపించారు. రైతు నిరసనల్లో దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. రైల్ రోకోలు, బీజేపీ నేతల ఘొరావ్లలో జోగిందర్ సింగ్ ఎప్పుడూ ముందుండేవారు. బల్బీర్ సింగ్ రాజేవాల్ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు అయిన బల్బీర్ సింగ్ రాజేవాల్ సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడడంలో దిట్ట. 78 ఏళ్ల వయసున్న ఈ రైతు నాయకుడు కేంద్ర మంత్రులతో చర్చల సమయంలో తమ వాదనల్ని గట్టిగా వినిపించేవారు. అంతేకాదు రైతులు చేయాల్సిన నిరసనలపై బల్బీర్సింగే ప్రణాళికలు రచించి ముందుకి నడిపించారు. సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలన్ స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్ అయిన 71 ఏళ్ల సుఖ్‌దేవ్ సింగ్ పోలీసులతో ఘర్షణలు జరిగినప్పుడల్లా తానే ముందు ఉండేవారు. ఛలో ఢిల్లీ ఆందోళన సమయంలో పోలీసులకు ఎదురెళ్లి నిలుచున్న సాహసి. బీకేయూ, ఉగ్రహాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుఖ్‌దేవ్ సహ రైతులకు రక్షణగా ఎప్పుడూ తానే ముందుండేవారు. -
‘దీక్షా’దక్షతకు సలాం
ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్ మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే ఆ ఒక్క డిమాండ్ సాధన కోసం రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా, హింస చెలరేగినా వాహనాలే యమపాశాలై ప్రాణాలు తీసినా అదరలేదు, బెదరలేదు, వెనకడుగు వెయ్యలేదు ఎండనక వాననక, గడ్డకట్టించే చలిని లెక్కచేయక కరోనా మహమ్మారికి బెదిరిపోక ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా మకాం వేసి చివరికి ఎలాగైతేనేం కేంద్రం మెడలు వంచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటం పంజాబ్‌లో మొదలై హరియాణాకి వ్యాపించి, ఉత్తరప్రదేశ్‌లో హింసకు దారి తీసి దేశవ్యాప్తంగా అన్నదాతల్ని ఏకం చెయ్యడంతో కేంద్రం దిగొచ్చింది. కరోనాని లెక్కచేయకుండా, చలి ఎండ వాన వంటి వాతావరణ పరస్థితుల్ని తట్టుకొని, భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, రోడ్లపైనే నిద్రించి మొక్కవోని దీక్షతో ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలో రైతన్నలు చివరికి విజయం సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020 జూన్‌లో వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంతో ఈ చట్టాలను దొడ్డదారిలో తెచ్చింది తమ పుట్టి ముంచడానికేనని రైతన్నలు బలంగా నమ్మారు. కిసాన్ సంఘర్‡్ష సమన్వయ కమిటీ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను ఆమోదించడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్3 న వివిధ రైతు సంఘాలు చేసిన రైతు నిరసనలు మొదట్లో పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమయ్యాయి. నవంబర్ 25న రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దానిపై పడింది. కేంద్ర ప్రభుత్వం పదకొండు రౌండ్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడాదిన్నర పాటు చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనలకు కూడా రైతులు అంగీకరించలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ తలవంచమంటూ పోరుబాట పట్టారు. ప్రతీ దశలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా పైపైకి లేచింది. ఒక్కో ఎదురుదెబ్బ తగిలినప్పుడలా మరింత బలం పుంజుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా 40 సంఘాలకు చెందిన రైతులు ‘సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)’ పేరిట ఒకే గొడుకు కిందకు వచ్చి ఢిల్లీ, హరియాణా, యూపీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ వద్ద శిబిరాలు వేసుకొని అక్కడే మకాం వేశారు. కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన రైతులు సామూహిక వంటశాలలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ అన్న నినాదం ఢిల్లీలో మారుమోగడమే కాదు, అదే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎర్రకోట సాక్షిగా మలుపు తిరిగిన ఉద్యమం ఒకానొక దశలో సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నీరుగారిపోతుందని అందరూ భావించారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస, ఘర్షణలు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతమంది నిరసనకారులు ఎర్రకోట గోడలు మీదుగా ఎక్కి సిక్కు మతం చిహ్నమైన నిషాన్ సాహిబ్ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో రాజధాని రణరంగంగా మారింది. రైతు ఉద్యమం ఖలిస్తాన్ వేర్పాటువాద చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రైతులు సరిహద్దులు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పెట్టుకున్న కన్నీళ్లు మళ్లీ ఉద్యమ నిప్పుకణికని రాజేసాయి. ఇంటి బాట పట్టిన నిరసనకారులందరూ తిరిగి ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేశారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పోరాటంలో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో 700 మందికి పైగా రైతులు మరణించారు. మరెందరో రైతులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. యూపీకి వ్యాపించి, రణరంగంగా మారి: ఆ తర్వాత నుంచి రైతు సంఘం నాయకులు పక్కా ప్రణాళికతో రహదారులు దిగ్బంధించడం, రైలు రోకోలు, నిరసన ర్యాలీలు, బ్లాక్ డే వంటివి చేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాకేశ్ తికాయత్ ర్యాలీలు చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రైతు ఉద్యమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ పాప్ స్టార్ రిహన్నా దీనిపై మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటూ లేవనెత్తిన ప్రశ్నతో అంతర్జాతీయంగా అన్నదాతలకు మద్దతు లభించింది. టీనేజీ పర్యావరణవేత్త గ్రేటా థెన్‌బర్గ్ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు లాయర్ అయిన మీనా హ్యారిస్ వంటివారు రైతుల గళానికి బలంగా నిలిచారు.మే 27న రైతు ఉద్యమానికి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డే పాటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో 200 మందికిపైగా రైతులు జంతర్మందర్ దగ్గర కిసాన్ సంసాద్ నిర్వహించారు. సెప్టెంబర్5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో రైతు సంఘం నాయకులు బలప్రదర్శన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదీ తమ బలం అంటూ చూపించారు. ఇక యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకి వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతన్నలపై ఎస్యూవీ దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు బలి కావడం , ఆ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రైతులపై ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఉద్యమం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉండడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఏడాది పాటు జరిగిన జరిగిన ఉద్యమం విజయతీరాలకు చేరుకుంది. సుప్రీం నిలిపివేసినా... ఉద్యమం ఆగలేదు! వ్యవసాయ చట్టాలపై ఒకవైపు రైతులు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 11న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించడానికి ఈ ఏడాది జనవరి 7న సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేయడానికి జనవరి 11న అంగీకరించింది. ఆ మర్నాడు జనవరి 12న వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ నిపుణులు అనిల్ ఘన్వత్, అశోక్ గులాటీ, ప్రమోద్ జోషిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికని మార్చి 19న సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాని ప్రక్రియను పూర్తి చేస్తే ఇక న్యాయస్థానంలో కేసే ఉండదు. ఆ పిటిషన్లన్నీ ప్రయోజనం లేకుండా మిగిలిపోతాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
అన్నదాతల అలుపెరుగని పోరాటం.. వ్యవసాయ చట్టాల కథేంటంటే
అన్నదాతల ఆగ్రహానికి కారణమైన... వారిని అలుపెరుగని పోరాటానికి కార్యోన్ముఖులను చేసిన మోదీ సర్కారు తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలేమిటి? వాటిని కేంద్రం ఎలా సమర్థించుకుంది? రైతుల అభ్యంతరాలేమిటో చూద్దాం... 1. ది ఫార్మర్స్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్– ఎఫ్‌పీటీసీ) యాక్ట్ రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్ కమిటీలు వసూలు చేసే సెస్‌ను రద్దు చేసింది. ప్రభుత్వ వాదన: రైతులు స్థానిక వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా... తమ ఉత్పత్తులను డిమాండ్ ఉన్నచోటికి తరలించి మంచి ధరకు అమ్ముకోవడానికి ఈ చట్టం వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ మార్కెట్ల (ఈ– మార్కెట్లు)లోనూ అమ్ముకోవచ్చు. ఎక్కడో హరియాణాలో ఉన్న వ్యాపారి కూడా ఆన్లైన్ ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో సరుకు కొనుగోలు చేయవచ్చు. ప్యాన్ కార్డులు, ఇతర చట్టబద్ధ ధ్రువపత్రాలు ఉన్నవారెవరైనా సులువుగా ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు రంగంలోకి సులువుగా ప్రవేశించవచ్చు. రైతుల అభ్యంతరం: స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది. వ్యవసాయ మార్కెట్లు లేకపోతే కనీస మద్దతు గ్యారెంటీ ఏముంటుంది? అడిగే దిక్కెవరు? మూడు నుంచి ఐదెరకాల చిన్న కమతాలు ఉన్న రైతులు పంటను రవాణా ఖర్చులు భరించి ఎక్కడో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమయ్యే పనేనా? కొనుగోలు ఒప్పందంలో ఏదైనా వివాదం తలెత్తినా సమస్య పరిష్కారం కోసం సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చని చట్టంలో ఉంది... సామాన్య రైతులను ఆ స్థాయి అధికారిని కలుసుకొనే అవకాశం ఉంటుందా? నిర్ణీత వ్యాపార లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేని వ్యక్తులు వ్యాపారంలోకి వస్తే... రైతులు మోసపోయే అవకాశాలుంటాయి. 2. ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, 2020 ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు. ప్రభుత్వ వాదన: రైతులు తమ పంట ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకొనే వీలు కలుగుతుంది. ముందస్తు ఒప్పందాల ద్వారా ఎవరికైనా అమ్ముకోవచ్చు. చట్టాల చట్రం నుంచి రైతుకు విముక్తి లభిస్తుంది. రైతుల భయం: వ్యవసాయరంగం కార్పొరేటీకరణకు ఇది బాటలు వేస్తుంది. బడా కంపెనీలదే గుత్తాధిపత్యం అవుతుంది. కనీసం మద్దతు ధర అనే భావన ప్రశ్నార్థకం అవుతుంది. కాంట్రాక్టు వ్యవసాయ విధానంలో సన్న, చిన్నకారులు రైతులు దోపిడీకి గురయ్యే ఆస్కారం ఉంటుంది. రైతుకు లభించే అమ్మకపు ధర మీద నియంత్రణ లేకపోతే... రైతుల బతుకులు గాలిలో దీపాలవుతాయి. వివాదాలు తలెత్తితే బడా కార్పొరేట్ కంపెనీలను ఎదురించి సామాన్య రైతు నిలబడగలడా? 3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020 నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు. మొత్తానికి ఈ నిబంధన మూలంగా రైతులపై పెద్దగా ప్రభావం ఉండదు కాని వినియోగదారులకు చేటు చేసేదే. పరిమితి లేకపోతే భారీగా నిల్వలు చేయడం ద్వారా బడా వ్యాపారులు కృతిమ డిమాండ్‌ను సృష్టించి నిత్యావసరాల ధరలను పెంచే ముప్పు పొంచి ఉంటుంది. జూన్ 5 2020: మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్‌సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయింది. సెప్టెంబర్ 27: రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
3 వ్యవసాయ చట్టాలు రద్దు
న్యూఢిల్లీ: రైతన్నల డిమాండ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్టు దిగొచ్చారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్ల డించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఒక వర్గం రైతులే వ్యతిరేకించారు ‘‘రైతులతోపాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చాం. దేశంలోని రైతులు.. ప్రధానంగా సన్నకారు రైతులు గరిష్టంగా లబ్ధి పొందుతారని ఆశించాం. కానీ, ఈ చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించలేకపోయాం. అనుమానాలను నివృత్తి చేసేందుకు పవిత్ర హృదయంలో మొదలుపెట్టిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొవ్వొత్తి కాంతి లాంటి స్పష్టమైన నిజాన్ని అర్థమయ్యేలా వివరించలేకపోయాం. సాగు చట్టాల వ్యవహారంలో దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా. వాస్తవానికి ఎన్నెన్నో రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురోగమన దృక్పథం ఉన్న రైతులు కొత్త సాగు చట్టాలకు అండగా నిలిచారు. ఒక వర్గం రైతన్నలు మాత్రమే వ్యతిరేకిస్తూ వచ్చారు. వారు కూడా మనవాళ్లే కాబట్టి ఒప్పించేందుకు పదేపదే ప్రయత్నించాం. చట్టాల అమలును రెండేళ్లపాటు నిలిపివేస్తామని చెప్పాం. అభ్యంతరాలున్న అంశాల్లో సవరణలు చేస్తామని సూచించాం. సుప్రీంకోర్టు కూడా సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. మనమంతా కలిసి ముందుకు సాగుదాం నేడు గురు నానక్ జన్మించిన రోజు. ఒకరిపై నిందలు వేయడానికి ఇది సందర్భం కాదు. దేశ ప్రజలను నేను చెప్పేది ఏమిటంటే 3 సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం. గురుపూరబ్ పర్వదినాన్ని పురస్కరించుకొని నా విన్నపాన్ని మన్నించి, రైతు సోదరులు ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లాలి. కుటుంబాలను కలుసుకోవాలి. జీవితంలో కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలి. మనమంతా మళ్లీ కొత్తగా ముందుకు సాగుదాం. పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు దేశంలో రైతాంగం సాధికారతే లక్ష్యంగా వ్యవసా య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు చేపట్టబోతున్నాం. జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. ఈ తరహా వ్యవసాయంలో సహజ ఎరువులు, స్థానిక విత్తనాలే ఉపయోగిస్తారు. మారుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు తీసుకొస్తాం. కనీస మద్దతు ధర(ఎం ఎస్పీ)ను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. ఎంఎస్పీతోపాటు జీరో బడ్జెట్ ఆధారిత సాగుపై నిర్ణయాలు తీసుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారు. రికార్డు స్థాయిలో సేకరణ కేంద్రాలు ఐదు దశాబ్దాల నా ప్రజాజీవితంలో అన్నదాతల వెతలను దగ్గరగా గమనిస్తూనే ఉన్నాను. వారికి ఎదురవుతున్న సవాళ్లు, కష్టనష్టాలు నాకు తెలుసు. మూడు కొత్త సాగు చట్టాల లక్ష్యం ఏమిటంటే రైతులను బాగు చేయడమే. ప్రధానంగా సన్నకారు రైతులకు సాధికారత కల్పించాలని ఆశించాం. 2014లో ‘ప్రధాన సేవకుడి’గా ప్రజలకు సేవలు చేసుకునేందుకు దేశం నాకు అవకాశం ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అప్పటినుంచే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. సన్నకారు రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఏకంగా ఐదు రెట్లు పెంచేశాం. ప్రతిఏటా రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన ధర దక్కేలా చర్యలు తీసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయాలను బలోపేతం చేశాం. వెయ్యికి పైగా మండీలను (వ్యవసాయ మార్కెట్లు) ఈ–నామ్(ఎలక్ట్రానిక్–నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్)తో అనుసంధానించాం. పంటలను దేశవ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించుకోవడానికి రైతులకు ఒక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ మార్కెట్లలో సదుపాయాలను మెరుగు పర్చడానికి కోట్లాది రూపాయలు వెచ్చించాం. పంటలకు కనీస మద్దతు ధరను పెంచడమే కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పంటల సేకరణ కేంద్రాల సంఖ్యను రికార్డు స్థాయిలో పెంచాం. దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నన్ని సేకరణ కేంద్రాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేవు. రైతాంగం ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం తన కృషిని చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉంటుంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. -
రాహుల్ చెప్పిందే నిజమయ్యింది.. వైరలవుతోన్న ట్వీట్
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేంగా దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న దీక్షకు కేంద్రం తల వంచింది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా ప్రకటించారు. కేంద్ర నిర్ణయంపై అన్నదాతలు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సాగు చట్టాలపై గతంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ప్రస్తుతం మరోసారి వైరలవుతోంది. 2021, జనవరి 14న రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం తప్పక వెనక్కి తీసుకుంటుంది’’ అన్నారు. ఇక మోదీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. (చదవండి: పురిటి బిడ్డ పురోగమనం!) ఇక సాగు చట్టాల రద్దుపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘అన్నదాతలు తమ స్యతాగ్రహంతో కేంద్రం అహంకారాన్ని తలదించారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘సాగు చట్టాల రద్దుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ప్రకాశ్ దివాస్ నాడు శుభవార్త విన్నాం. రైతులకు వ్యతిరేకంగా ఉన్న సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు నేడు తగిన ఫలితం లభించింది. దేశ రైతులకు సెల్యూట్’’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. Mark my words, the Govt will have to take back the anti-farm laws. pic.twitter.com/zLVUijF8xN — Rahul Gandhi (@RahulGandhi) January 14, 2021 (చదవండి: Three Farm Laws: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం) आज प्रकाश दिवस के दिन कितनी बड़ी ख़ुशख़बरी मिली। तीनों क़ानून रद्द। 700 से ज़्यादा किसान शहीद हो गए। उनकी शहादत अमर रहेगी। आने वाली पीढ़ियाँ याद रखेंगी कि किस तरह इस देश के किसानों ने अपनी जान की बाज़ी लगाकर किसानी और किसानों को बचाया था। मेरे देश के किसानों को मेरा नमन — Arvind Kejriwal (@ArvindKejriwal) November 19, 2021 ‘‘కేంద్ర క్రూరత్వానికి చలించకుండా అలుపెరగని పోరాటం చేసిన అన్నదాతలకు హృదయపూర్వక అభినందనలు. ఇది మీ విజయం. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నా సానుభూతి’’ అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. My heartfelt congratulations to every single farmer who fought relentlessly and were not fazed by the cruelty with which @BJP4India treated you. This is YOUR VICTORY! My deepest condolences to everyone who lost their loved ones in this fight.#FarmLaws — Mamata Banerjee (@MamataOfficial) November 19, 2021 చదవండి: Blackday: దేశ జెండా మోసి అలసిపోయాం -
Three Farm Laws: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
PM Modi Announced Withdraws Three Farm Laws: రైతుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ‘రైతులు ఆందోళన విరమించాలి. మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాం. శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదురెట్టు పెంచాం.తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. రైతులను ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలి. 2014లో నేను తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచీ మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించింది. మనదేశంలో 80 శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. రైతుల కష్టాలను దగ్గరుండి చూశాను. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయనున్నాం’ అని మోదీ తెలిపారు. 2020లో మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం. తీసుకొచ్చింది. ఇవి వివాదాస్పదంగా ఉండటంతో రైతులు రోడ్డెక్కారు. వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా రైతులు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అదే సమయంలో ఈ చట్టాలు రైతులను కార్పొరెట్లకు బానిసలను చేస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేశాయి. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చిన కేంద్రం.. రైతు చట్టాలను రద్దు చేసింది. ఈ మేరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. -
Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆశిష్ రైతులపై కావాలనే కాల్పులు జరిపినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఆశిష్‌తోపాటు అంకిత్‌దాస్ కూడా కాల్పులు జరిపినట్లు ఎఫ్ఎస్ఎల్ తమ నివేదికలో పేర్కొంది. రైతులపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. చదవండి: మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..! -
‘కళ్లు పీకి.. చేతులు విరుస్తా’ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీఘర్: హర్యానా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకించిన వారి కళ్లు పీకి, చేతులు విరుస్తానని హెచ్చరించారు. ఓ పబ్లిక్ మీటింగ్‌లో అరవింద్ శర్మ మాట్లాడుతూ.. తాము మరో 25 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని, కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావటానికి చక్కర్లు కొడుతునే ఉంటుందని ఎద్దేవా చేశారు. రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలోని ఓ ఆలయానికి వచ్చిన బీజేపీ నేత మనీష్ గ్రోవర్‌ను శుక్రవారం రైతు బయటకు రాకుండా అడ్డగించారు. రైతు నిరసనకారులపై నిరుద్యోగ తాగుబోతులని మనీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు నిరసనకారులు మనీష్ గ్రోవర్ ఆలయం నుంచి బయటకు రాకుండా సుమారు 8 గంటలు అడ్డుకున్నారు. తమకు క్షమాపణ చేప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో మనీష్ రైతులకు చేతులు జోడించిన క్షమాపణ చేప్పారు. కానీ తాను అక్కడ ఉన్నవారు అభివాదం చేయమంటే చేశానని.. క్షమాపణ చేప్పలేదని మాట మార్చారు. మనీష్ గ్రోవర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పత్రిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అభ్యంతం వ్యక్త చేస్తూ విమర్శలు గుప్పించారు. -
బీజేపీ ఎంపీ రామచందర్ జాంగ్రాకి రైతు నిరసన సెగ
-
Haryana: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కారు ధ్వంసం
ఛండీఘర్: బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా కారును హర్యానాలోని హిసార్‌లో కొంతమంది రైతు నిరసనకారులు ధ్వంసం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రాను పెద్దఎత్తున రైతులు నల్ల జెండాలు పట్టుకొని, నిరసన తెలుపుతూ అడ్డగించారు. ఈ క్రమంలోనే కొంతమంది నిరసనకారులు ఆయన కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. అయితే ఎంపీ రామ్ చందర్ జాంగ్రా గురువారం దీపావళి వేడుకల్లో పాల్గొని.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు.. నిరుద్యోగ తాగుబోతులని వివాదాస్పత వ్యాఖ్యలు చేశారు. దీంతో శుక్రవారం రైతులు ఎంపీని హిసార్‌లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ అడ్డగించారు. రైతుల నిరసన కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా మాట్లాడుతూ.. ‘నేను పాల్గొన్న ఓ ప్రైవేట్ కార్యక్రమం ముగిసిన అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లుతున్నాను. ఇంతలోనే కొంతమంది నిరసనకారులు కర్రలతో నా కారును ధ్వంసం చేశారు’ అని పేర్కొన్నారు.అదేవిధంగా ఈ ఘటన తనపై అత్యాప్రయత్నం వంటిదని, దుండగులను కఠినంగా శిక్షించాలని ఎంపీ రామ్ చందర్ జాంగ్రా రాష్ట్ర డీజీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తాను హాజరైన కార్యక్రమం రాజకీయమైనది కాదని తెలిపారు. హర్యానాలో సోదరభావం తగ్గుతోందని, సామాజిక అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాదిన్నర నుంచి సుప్రీం కోర్టు నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధించిందని, రైతులు ఎందుకు నిరసన తెలుతున్నారని ప్రశ్నించారు. -
చట్టాల రద్దుపై కేంద్రానికి తికాయత్ అల్టిమేటం
ఘజియాబాద్: వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ తేల్చిచెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 దాకా గడువు ఇస్తున్నామని చెప్పారు. అప్పటిలోగా మూడు చట్టాలకు మంగళం పాడకపోతే ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ఒకవేళ ఆ చట్టాలను ఈరోజే రద్దు చేస్తే పోరాటాన్ని ఇప్పుడే ఆపేస్తామని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి నవంబర్ 26న సంవత్సరం పూర్తికానుంది. -
నవంబర్ 26లోపు దిగిరావాలి.. లేకుంటే...
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నవంబర్ 26లోగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే ఢిల్లీ సరిహద్దులో నిరసనలు ఉధృతం చేస్తామని రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ హెచ్చరించారు. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు మొదలై దాదాపు ఏడాది కావొస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ అల్టిమేటం జారీచేశారు. ‘కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు సమయం ఇస్తున్నాం. నవంబర్ 27 నుంచి రైతులు గ్రామాల నుంచి ట్రాక్టర్లలో ఢిల్లీ చుట్టుపక్కల జరుగుతున్న నిరసన ప్రదేశాల వద్దకు చేరుకుంటారు. భారీ సంఖ్యలో తరలివచ్చే రైతులతో నిరసన ప్రదర్శనలు మరింత ఉధృతం అవుతాయ’ని రాకేష్ టికాయిత్ పేర్కొన్నారు. (చదవండి: పెరుగుతున్న పెట్రోలు ధర.. నిండుతున్న కేంద్ర ఖజానా) రైతు సంఘాల నుంచి గత రెండు రోజుల్లో కేంద్రానికి జారీ అయిన రెండో హెచ్చరిక ఇది. ఢిల్లీ సరిహద్దుల నుంచి నిరసనకారులను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్‌గా మారుస్తామని ప్రభుత్వాన్ని ఆదివారం రాకేష్ టికాయిత్ హెచ్చరించారు. నిరసన స్థలంలో తమ గుడారాలను తొలగించడానికి ప్రత్నిస్తే.. పోలీసు స్టేషన్లు, కలెక్టరేట్ల వద్ద టెంట్లు వేస్తామన్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు చట్టాలు తమ ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని పేర్కొంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు.. తిక్రీ, సింగు, ఘాజీపూర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర సర్కారు మాత్రం ఈ చట్టాలు రైతులకు అనుకూలమని వాదిస్తోంది. కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా ఫలించలేదు. (చదవండి: ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!) -
టిక్రిలో రాకపోకల పునరుద్ధరణ
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనలకు వేదికైన టిక్రిలో పోలీసులు బారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు. శుక్రవారం నుంచి బారికేడ్లను తొలగించడం ప్రారంభించిన పోలీసులు ఢిల్లీ–రోహ్తక్ హైవే మీద ఉన్న టిక్రిలో పనులు శనివారానికి పూర్తయ్యాయి. రైతు సంఘాల నాయకులు, పోలీసుల మధ్య చర్చలు జరిగిన తర్వాత అక్కడ మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ‘‘రైతు సంఘాల నాయకులతో చర్చించాం. హరియాణాకు వెళ్లే మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాం. ఆ మార్గంలో రాకపోకలు మొదలయ్యాయి’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పర్వీందర్ చెప్పారు. రైతు సంఘం నాయకులు కొన్ని సమయాల్లో మాత్రమే రాకపోకలను అనుమతిస్తామని అంటున్నారని, తాము మాత్రం 24 గంటలు ట్రాఫిక్ తిరిగేలా రహదారిని పునరుద్ధరించామని చెప్పారు. ఆ రోడ్డుపై చిన్న వాహనాలు రాకపోకలు సాగించవచ్చునని సింగ్ వివరించారు. టిక్రి రహదారిపై రాకపోకల్ని పునరుద్ధరించడంతో ఢిల్లీ నుంచి హరియాణా మీదుగా రాజస్థాన్‌కు వెళ్లేవారికి ప్రయాణం సులభతరంగా మారుతుంది. మరోవైపు ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మీదనున్న ఘజియాపూర్లో బారికేడ్లు, వైరింగ్లను తొలగించినప్పటికీ సిమెంట్ బారికేడ్లు, తాత్కాలిక శిబిరాలను తొలగించాల్సి ఉంది. అది పూర్తయితే ఆ మార్గంలో కూడా రాకపోకలకు అనుమతిస్తామని పర్వీందర్ తెలిపారు. రైతులకు నిరసనలు చేసే హక్కు ఉన్నప్పటికీ, నిరవధికంగా రహదారుల్ని మూసివేయకూడదంటూ సుప్రీంకోర్టు అక్టోబర్ 21న రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించే ప్రాంతాల్లో బారికేడ్లను ఎత్తివేస్తున్నారు. తమ పోరాటాన్ని ఇకపై ఎలా కొనసాగించాలో వ్యూహరచన చేస్తున్నట్టు రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ చెప్పారు. -
నిరవధిక దిగ్బంధనాలు సబబు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: నిరసనల పేరుతో నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే ఈ విధంగా నిరవధికంగా రహదారులు దిగ్భంధనం సరికాదని దేశరాజధాని సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్లో గత 11 నెలలుగా ధర్నాను కొనసాగిస్తున్న రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ రహదారులు బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. రైతులు రహదారులను బ్లాక్ చేయడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల్ని పోలీసులు నిలువరించిన తర్వాత రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించిందని రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేన్నారు. ఈ ర్యాలీలో 5 లక్షల మంది పాల్గొన్నారని, దీనిపై ఎందుకు సుమోటోగా విచారణ చేపట్టడం లేదు, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రైతుల సంఘాలు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. ‘‘ఇదే అంశంపై వేర్వేరు పిటిషన్లు కోర్టు ముందుండటంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని లేదా ఈ ధర్మాసనమే వాటినీ విచారించాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే... ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రెండు వారాల్లో రిజాయిండరు దాఖలు చేయండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనలు చేయడం ఏంటి?’ అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
Uttarpradesh: లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ ఘటనపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరపున హరీష్ సాల్వే.. ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కాగా, ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు హరిష్ సాల్వేని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. నలుగురిని అరెస్ట్ చేశామని యూపీ అడ్వకేట్ జనరల్ హరీష్ సాల్వే తెలిపారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీల్డుకవర్లో ధర్మాసనం ముందు ఉంచామని హరిష్ సాల్వే తెలిపారు. మరికొన్ని వీడియోలున్నాయని, అవి దర్యాప్తునకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్.. నివేదికను సీల్డుకవర్లో ఇవ్వాలని తాము కోరలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి 1 గంట వరకు ఎలాంటి నివేదిక అందలేదని సుప్రీంకోర్టు జస్టిస్ రమణ తెలిపారు. కాగా, తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. చదవండి: Jammu Kashmir: జమ్మూలో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి -
బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు నిరసనగా రైతు సంఘాలు సోమవారం చేపట్టిన రైల్ రోకో కారణంగా దేశవ్యాప్తంగా 293 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 150 గూడ్స్ రైళ్లకు ఆటంకం ఏర్పడగా వీటిలో 75 వరకు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్న రైళ్లు ఉన్నట్టు సమాచారం. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నేడు రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పంజాబ్‌లోని ఫిరోజిపూర్ డివిజన్లోని నాలుగు రైల్వే విభాగాలు రైతుల ఆందోళనతో స్తంభించాయని అధికారులు తెలిపారు. ఫిరోజ్‌పూర్ నగరంలోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా విభాగం, మొగాలోని అజిత్వాల్ వద్ద ఉన్న ఫిరోజ్‌పూర్-లూధియానా విభాగంపై నిరసనల ప్రభావం పడిందని వెల్లడించారు. మిశ్రాను అరెస్ట్ చేసే వరకు విశ్రమించం: తికాయత్ 'రైల్ రోకో' ఆందోళన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, తదుపరి వ్యూహం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడైన అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిందితుడిగా ఉన్న అజయ్ మిశ్రాకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, కేంద్రం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన నిర్దోషిగా తేలితే మళ్లీ మంత్రి కట్టబెట్టుకోవచ్చని తికాయత్ అన్నారు. (చదవండి: హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు) -
రైతుల రైల్ రోకో.. ‘అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందే’
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత తీవ్రతరమైంది. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కొనసాగనున్న రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర రైల్వే జోన్లో ఎనిమిది రైళ్లు నియంత్రించబడుతున్నాయని ఉత్తర రైల్వే సీఆర్పీఓ సోమవారం తెలిపింది. (చదవండి: లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడిక్కడే రైళ్లను అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. యూపీలోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హింస, ఆ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా ఇప్పటికీ కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగుతుండటాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా సోమవారం నాడు దేశ వ్యాప్త రైల్ రోకో చేపట్టింది. (చదవండి: నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు రైల్ రోకో ఉంటుందని, అన్ని రాష్ట్రాల్లో స్థానిక రైతు సంఘాలు ఆ ఆరు గంటలపాటు రైలు పట్టాలపైనే నిరసనలు తెలుపుతారని కిసాన్ మోర్ఛా తెలిపింది. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో న్యాయం జరిగేవరకు పోరాడతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. చదవండి: Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’ Punjab: Farm law protestors sit on the railway track at Devi Dasspura village in Amritsar following the farmer's union call for 'Rail Roko Andolan' today pic.twitter.com/lQrKImJKso — ANI (@ANI) October 18, 2021 -
రైతు శిబిరం వద్ద యువకుడి అనుమానాస్పద మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ శిబిరం వద్ద యువకుడి దారుణ హత్య ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రైతు నిరసన శిబిరం వద్ద అనుమానాస్పద మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. నిహాంగ్ సిక్కులే ఆ వ్యక్తిని హతమార్చారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. దీనిపై ఒకప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి : తగ్గేదే..లే అంటున్న వరుణ్: బీజేపీకి షాక్, సంచలన వీడియో సోనిపట్ జిల్లా కుండ్లిలోని రైతు నిరసన వేదిక వద్ద యువకుడి మృతదేహం పోలీసు బారికేడ్‌కు వేలాడుతూ కనిపించింది. బాధితుడిని లఖ్వీర్ సింగ్‌గా గుర్తించారు. ఎడమ మణికట్టు తెగిపడి రక్తపు మడుగులో ఉన్న వైనం ఆందోళన రేపింది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసినందుకు నిహాంగ్‌లు లఖ్బీర్ సింగ్‌ను కొట్టి చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దీనిపై హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. చేతులు, కాళ్లు నరికివేసి ఉన్న మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసున్నతాధికారి హన్సరాజ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్ నిమిత్తం సోనిపట్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనేదానిపై ఆరా తీస్తున్నామన్నారు. సుమారు గత ఏడాది కాలంగా వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ వద్ద జరిగిన హింసలో రైతులు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతను రాజేసింది. రైతుల్ని కారుతో గుద్ది హత్య చేశారన్న ఆరోపణలపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలంలో గురువారం పోలీసులు సీన్ రీక్రియేషన్ కార్యక్రమన్ని కూడా చేపట్టారు. At about 5 am today, a body was found hanging with hands, legs chopped at the spot where farmers' protest is underway (Kundli, Sonipat). No info on who's responsible, FIR lodged against an unknown person. Viral video is a matter of probe, rumours will linger: DSP Hansraj pic.twitter.com/IfWhC2wW4l — ANI (@ANI) October 15, 2021 -
‘ఒక్కరి కోసం పార్టీ పరువు బజారుకీడ్చారు’.. బీజేపీకి తిప్పలు తప్పవా?
(వెంకటేష్ నాగిళ్ల- సాక్షిటీవీ న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి): లఖింపూర్ ఖేరి ఘటన తమ కొంప ముంచేలా ఉందని బిజెపి నేతలు వాపోతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి గుదిబండగా మారే అవకాశాలున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడి కాన్వాయ్ దూసుకెళ్లి నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశమంతటిని కదిలించింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తనయుడు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించేంతవరకు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రైతుల విషయంలో దారుణంగా వ్యవహరించిన తండ్రి, కొడుకులిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిన బిజెపి ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. (చదవండి: బడితెపూజ∙తప్పదు!) ఈ వైఖరిపై బిజెపిలో అంతర్గతంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వ్యక్తిని కాపాడే క్రమంలో పార్టీ పరువు బజారుకీడ్చారని పలువురు నేతలు మండిపడుతున్నారు. అయితే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూపిలో యోగి ప్రభుత్వం ఇప్పటికే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అరోపణలు ఎదుర్కొంటోంది. వివేక్ దూబే ఎన్ కౌంటర్ సహా గతంలో బ్రాహ్మణులకు దక్కిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి వుంది. (చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు) దీన్ని అధిగమించేందుకే రాష్ట్ర క్యాబినెట్‌ను విస్తరించి బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాదకు మంత్రివర్గంలో చేర్చుకుంది. అలాగే కేంద్రంలో అజయ్ మిశ్రాకు సహయమంత్రి పదవి ఇచ్చి కీలకమైన హోంశాఖను అప్పజెప్పారు. అయితే అజయ్ మిశ్రా తన దుందుడుకు వ్యవహరంతో రైతులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దాంతో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన రైతులపై కాన్వాయ్‌ను నడిపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఆయన పార్టీకి లేని తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఆయనపై వెంటనే వేటు వేస్తే ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల కోపం చల్లార్చేందుకు తీసుకున్న చర్యలు నిష్ఫలమవుతాయి. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేంతవరకు యోగి ప్రభుత్వం వెయిట్ చేసింది. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేయడంతో ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై ఇప్పటికిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రాజీనామా చేయించడం లేక మరోటా అనేది తేల్చే అవకాశముంది. ఏది ఏమైనా ఒక సమస్యను పరిష్కరించుకునేందుకు అధిష్టానం ప్రయత్నిస్తే, వారే మరో అతిపెద్ద సమస్యను బిజెపికి సృష్టించారు. దాని ఫలితంగా ఎన్నికల్లో బిజెపి నష్టపోయే పరిస్థితి తలెత్తింది. (చదవండి: అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు) -
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ఇతర హత్యల కేసుల్లోనూ నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై వేరే దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని, అప్పటిదాకా ఆధారాలను భద్రంగా ఉంచాలని డీజీపీకి కోర్టు మాటగా చెప్పాలని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనను సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేశామని చెప్పారు. 8 మంది మృతికి కారణమైన ఘటనలో సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. బాధితుల శరీరాల్లో బుల్లెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు హరీష్ సాల్వే చెప్పగా.. ఇదే కారణంతో అరెస్టు చేయలేదా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామంటూ అక్టోబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా, లఖీపూర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలను జస్టిస్ ఎన్.వి.రమణ కలుస్తారంటూ ఓ ఆంగ్ల పత్రిక ట్వీట్ చేయడంపై సీజేఐ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదేసమయంలో ఈ రకంగా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న తాను లక్నోకు ఎలా వెళ్లగలని ప్రశ్నించారు. మిశ్రాను తొలగించకపోతే 18న రైల్ రోకో: కిసాన్‌మోర్చా లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను ఈ నెల 11వ తేదీలోగా పదవి నుంచి తొలగించకపోతే 18న రైల్ రోకో చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితులను వారం రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్బంధిస్తామని దళిత నేత, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ఆశిష్‌ను అరెస్టు చేసేదాకా నిరాహార దీక్ష కొనసాగిస్తానని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఆయన శుక్రవారం నిరాహార దీక్ష ప్రారంభించారు. సమన్లకు స్పందించని ఆశిష్ శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ యూపీ పోలీసులు జారీ చేసిన సమన్లకు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా స్పందించలేదు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసు జారీ చేశారు. ఆశిష్ అనారోగ్యం కారణంగా శుక్రవారం పోలీసుల విచారణకు రాలేకపోయాడని అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరిని ప్రతిపక్ష నేతలు సందర్శిస్తుండడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా స్పందించారు. వారిది రాజకీయ పర్యాటక కార్యక్రమం(పొలిటికల్ టూరిజం) అని ఎద్దేవా చేశారు. -
యూపీ సర్కార్ తీరును తప్పుబట్టిన సుప్రీం
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. మంత్రి కుమారుడి అరెస్టుకు ఎందుకు వారెంట్ జారీ చేయలేదని జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో మృతుల శరీర భాగాల్లో బుల్లెట్ గాయాలు లేవని తేలిందని యూపీ సర్కార్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. అందుకనే ఆశిష్‌ను అరెస్టు చేయలేదని, విచారణకు హాజరు కావాలని నోటీసులు మాత్రమే ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. సాల్వే వ్యాఖ్యలపై స్పందించిన సీజేఐ ఎన్వీ రమణ నిందితులందరికీ చట్టం ఒకేలా వర్తిస్తుందని అన్నారు. నోటీసులు ఇచ్చి ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. (చదవండి: బెంగళూరులో కుప్పకూలిన మరో భవనం) ఈక్రమంలో 8 మంది మృతికి కారణమైన లఖింపూర్ కేసును కావాలంటే సీబీఐకి బదిలీ చేయొచ్చని సాల్వే సుప్రీం కోర్టుకు సమాధానం ఇచ్చారు. అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. అయితే, సీబీఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదన్నారు సీజేఐ ఎన్వీ రమణ. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేశారు. (చదవండి: సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా) -
ఆప్ నిరసన: వాటర్ కెనాన్స్ ప్రయోగించిన పోలీసులు
ఛండిగడ్: ఛండిగడ్ రాజ్ భవన్ ఎదుట ఆప్ నిరసన చేపట్టింది. లఖీమ్‌పూర్ ఖేరీ రైతుల మృతి ఘటనకు ఆప్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఆందోళకరంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు నిరసనకారులపై వాటర్ కెనాన్స్‌ను ప్రయోగించారు. -
Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతు మరణాల ఘటనపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ ఘటనలో ఉన్నట్లు ఒక్క ఆధారం చూపిన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కారు అదుపు తప్పి రైతులపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటన సమయంలో కారులో తన కుమారుడు లేడని అన్నారు. ఘటన తర్వాత కారుపై దాడిచేయడంతో డ్రైవర్ గాయపడ్డాడని తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై నిరాధార అరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. బీజేపీ అధిష్టానం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. చదవండి: రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు ఆదివారం బన్బీర్పూర్ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అజయ్ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా రైతులు తెలిపిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది మృతి చెందారు. లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్యూవీ (మహీంద్రా థార్)లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేరులేదు. -
Lakhimpur Incident: ‘మృతుల కుటుంబాలకు రూ.45లక్షల పరిహారం’
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఆదివారం లఖీమ్‌పూర్ ఖేరీలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.45లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి జిల్లాలో రైతు ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. కేంద్రమంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహంతో వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్ మృతి చెందారు. సోమవారం లఖీమ్‌పూర్ ఖేరీలో ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు మృతి చెందారు. -
లఖీమ్‌పూర్ ఖేరీలో ఉద్రిక్తత: ప్రియంక గాంధీని అడ్డుకున్న పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనను ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. లఖీమ్‌పూర్ ఖేరీలో రాజకీయ నేతల ప్రవేశంపై పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. లఖీమ్‌పూర్‌ఖేరీ వెళ్లేందుకు కాంగ్రెస్ నేత ప్రియంక గాంధీ యత్నించారు. దీంతో ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ అనంతరం ఆయన ఇంటి ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం దేశవ్యాప్తంగా రైతులు సంఘాలు ఆందోళనలకు పిలుపినిచ్చాయి. లఖీమ్‌పూర్ ఖేరీ ఘటనపై రైతులు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిన్న కేంద్రమంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహంతో వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్ మృతి చెందారు. -
Lakhimpur Kheri Violence: కేంద్రమంత్రి కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు సహా 14 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా టెనిపై హత్య కేసు నమోదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: లఖీమ్‌పూర్ ఖేరీలో ఉద్రిక్తత: ప్రియంక గాంధీని అడ్డుకున్న పోలీసులు ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ అయిన అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు బన్బీర్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. మంత్రి అజయ్ మిశ్రా వెంట ఆయన కొడుకు ఆశిష్ సైతం కాన్వాయ్‌లో ఉన్నారు. మంత్రులు పాల్గొనబోయే కార్యక్రమంలో నిరసన తెలిపేందుకు భారతీయ కిసాన్ యూనియన్‌కి చెందిన పలువురు రైతులు నల్ల జెండాలతో బయల్దేరారు. మార్గమధ్యంలో టికోనియా-బన్బీర్పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలు ఇచ్చారు. అదే సమయంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అక్కడి రైతుల మీదుగా దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మంత్రి కుమారుడే వాహనాన్ని నడుపుతున్నాడని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. చదవండి: రైతుల ఆందోళనలో ఘర్షణ.. 8 మంది మృతి -
జైలుకెళ్లండి.. నేతలవుతారు..
చండీగఢ్: జైలుకెళ్లి వస్తే నేతలవుతారంటూ హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు నిరసనలు జరుగుతున్న చోట్లకు బీజేపీ కార్యకర్తలు 500, 700, 1,000 చొప్పున గుంపులుగా వెళ్లాలని అన్నారు. రైతుల ‘భాష’లోనే వారికి సమాధానం చెబుదాం అని చెబుతున్న వీడియో వైరల్ అయింది. అందులో ఆయన ఇంకా మాట్లాడుతూ. ఒక వేళ జైలుకెళ్లిన బాధపడవద్దని, జైలుకెళ్తే మహా అయితే నెలో, మూడు నెలలో ఉంటారని, కానీ ఆ తర్వాత పెద్ద నేతలవుతారని అన్నారు. చరిత్రలో పేర్లు నిలిచిపోతాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రైతులపై దాడులు చేయాలంటూ రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. ఇలా చేయడానికి మోదీ–నడ్డాల అనుమతి తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేసింది. హింసను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చెబుతుంటే ఇక రాష్ట్రంలో రాజ్యాంగం ఎలా నడుస్తుందని ప్రశ్నించింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) నేత అభయ్ సింగ్ చౌతాలా దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి మీద దేశద్రోహం కింద కేసు పెట్టాలని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
రైతుల ఆందోళనలో ఘర్షణ.. 8 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి జిల్లాలో రైతు ఆందోళన కార్యక్రమం చివరకు హింసాత్మకంగా మారింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ అయిన అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు బన్బీర్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. మంత్రి అజయ్ మిశ్రా వెంట ఆయన కొడుకు ఆశిష్ సైతం కాన్వాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు పాల్గొనబోయే కార్యక్రమంలో నిరసన తెలిపేందుకు భారతీయ కిసాన్ యూనియన్‌కి చెందిన పలువురు రైతులు నల్ల జెండాలతో బయల్దేరారు. మార్గమధ్యంలో టికోనియా–బన్బీర్పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలు ఇచ్చారు. అదే సమయంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అక్కడి రైతుల మీదుగా దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మంత్రి కుమారుడే వాహనాన్ని నడుపుతున్నాడని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. కార్లు తగులబెట్టిన రైతులు ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న రైతులు ఆశిష్ వాహనంతో పాటు మూడు కార్లకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. రాళ్లు విసిరారు. పరిస్థితులు అదుపు తప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీసీ) ప్రశాంత్ కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. విషయం తెలిసిన వెంటనే రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ లఖిమ్‌పూర్ ఖేరికి వెళ్లారు. అదంతా కుట్ర: అజయ్ మిశ్రా నిరసనలు తెలుపుతున్న రైతుల మీదుగా తన కుమారుడు కారు నడిపించాడన్న ఆరోపణల్ని మంత్రి అజయ్ మిశ్రా తోసిపుచ్చారు. ‘ఈ ఘటన జరిగిన సమయంలో నా కుమారుడు అసలు ఇక్కడ లేడు. ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉంది. తమకు మద్దతు పలికేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనంపై రైతులు రాళ్లతో దాడి చేశారు. దీంతో వారి వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. వాహనం రైతులపై పడడంతో నలుగురు రైతులు మరణించారు. ఆగ్రహించిన రైతులు బీజేపీ కార్యకర్తలను చావబాదారు. దీంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఆ వాహన డ్రైవర్ చనిపోయారు’ అని మంత్రి వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. యూపీ సీఎం రాజీనామా చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్‌చేశారు. ‘ కొందరు రైతులపై కాల్పులు జరిగినట్లు మాకు సమాచారం అందింది. ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు’ అని తికాయత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల మరణాలకు కారకులైన మంత్రి, మంత్రి కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ కదం తొక్కిన రైతన్న
చండీగఢ్: ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ పంజాబ్, హరియాణాల్లో శనివారం రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్త రూపం దాల్చాయి. హరియాణా సీఎం ఖట్టర్ నివాసంతోపాటు రెండు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్లను రైతులు దిగ్బంధించారు. ఈ సందర్భంగా పోలీసులతో తలపడ్డారు. బారికేడ్లను సైతం రైతులు లెక్కచేయకపోవడంతో పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. సాధారణంగా పంజాబ్, హరియాణాల్లో అక్టోబర్ ఒకటో తేదీన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి. కానీ, ఇటీవలి భారీ వర్షాల కారణంగా దిగుబడుల్లో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వం అక్టోబర్ 11వ తేదీకి కొనుగోళ్లను వాయిదా వేయడం అన్నదాత ఆగ్రహానికి కారణమైంది. కర్నాల్‌లో సీఎం ఖట్టర్ నివాసాన్ని ముట్టడించిన రైతులు, షాహాబాద్, పంచ్‌కులలోని బీజేపీ నేతలు, హరియాణా మంత్రి సందీప్ సింగ్ నివాసం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో ఢీకొట్టి పగులగొట్టారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ధాన్యం నింపిన ట్రాక్టర్ ట్రాలీలను అడ్డుగా పెట్టారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనన్లను ప్రయోగించారు. నేటి నుంచి కొనుగోళ్లు çపంజాబ్, హరియాణాలో ధాన్యం కొనుగోళ్లు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర ఆహార శాఖ తెలిపింది. ధాన్యం దిగుబడులతో రైతులు ఇప్పటికే మండీల వద్ద వేచి చూస్తున్నారని వారికి ఇబ్బందులు తొలగించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కేంద్రం సానుకూలంగా స్పందించినందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయి. -
మీ నిరసనలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతినివ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ‘ఇప్పటికే మీ ధర్నాలతో ఢిల్లీ గళం నొక్కేశారు. ఇంకా నగరం లోపలికి కూడా వస్తారా?’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిరసన తెలిపే హక్కు ఉండొచ్చు. అదే సమయంలో పౌరులందరికీ నగరంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగడానికి సమాన హక్కులుంటాయి. వాటిని కాలరాయకూడదు’అని కోర్టు హితవు పలికింది. జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం రైతులు చేస్తున్న ధర్నాలతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదో తెలుసుకున్నారా? అని ప్రశ్నించింది. రైతుల నిరసనలతో ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయని పేర్కొంది. రైతులు ఇప్పటికే సాగు చట్టాలను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ నిరసనలెందుకు? అని ప్రశ్నించింది. కోర్టులపై రైతులు నమ్మకం ఉంచాలని హితవు పలికింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టుని ఆశ్రయించిన రైతులు , దాని సత్వర విచారణకు మళ్లీ కోర్టుకి వెళ్లొచ్చని, ఇలా సత్యాగ్రహాలు చేయడం వల్ల ఒరిగేదేమిటని పేర్కొంది. శాంతియుతంగానే రైతులు నిరసన చేస్తారని రైతు సంఘాల తరఫున హాజరైన లాయర్ ప్రశ్నించగా ఆయనపై విరుచుకుపడింది. ‘శాంతియుతంగా నిరసనలంటే ఏమిటి? మీరు జాతీయ రహదారులను దిగ్బంధిస్తారు. రైళ్లను అడ్డుకుంటారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ శాంతియుత నిరసనలంటే ఎలా?’అని బెంచ్ ప్రశ్నించింది. -
సరిహద్దుల దగ్గర స్తంభించిన భారీ ట్రాఫిక్
-
Farmers Protest: రైతు నిరసనలకు 300 రోజులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేపట్టిన నిరసనలు బుధవారానికి 300 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చ సభ్యులు మాట్లాడుతూ.. లక్షలాది మంది రైతుల ఆవేదనను తమ నిరసనలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల్ని ఢిల్లీ సరిహద్దులకు చేర్చి 300 రోజులైందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులు తమ నిరసనను శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని అన్నారు. తమ డిమాండ్లు ఏమిటో ప్రధాని మోదీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు. రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. దేశంలో జరిగే ఎన్నికల్లో రైతులు ఓట్లు వేసే వారే గెలుస్తున్నారని, అంత లోతుగా రైతులు వేళ్లూనుకొనిపోయిన వ్యవస్థ భారత్‌ది అని పేర్కొన్నారు. ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చ ‘భారత్ బంద్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిపింది. చదవండి: కశ్మీర్లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు -
రైతుల ఆందోళనలతో ప్రతికూల ప్రభావమెంత?
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు పారిశ్రామిక, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయని, ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో కరోనా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ, యూపీ, హరియాణా, రాజస్తాన్ ప్రభుత్వాలకు, పోలీస్ చీఫ్‌లకు కేంద్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో కరోనా ప్రొటోకాల్స్ ఉల్లంఘన, తదుపరి పరిణామాలు, వివిధ రంగాలపై ఆందోళనల ప్రభావంపై నివేదికలు సమర్పించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, హోంశాఖ, ఆరోగ్య శాఖలను కమిషన్ ఆదేశించింది. రైతు ఆందోళనలపై పలు ఫిర్యాదులు కమిషన్‌కు అందాయని, వీటి కారణంగా దాదాపు 9వేల కంపెనీల యూనిట్లపై ప్రభావం పడిందని తెలిపింది. నిరసనలతో రవాణా రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని, పేషంట్లు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, పాదచారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయని కమిషన్ తెలిపింది. మార్గాల మూసివేతతో ఆయా ప్రాంతాల్లోని స్థానికులు ఇళ్లకు చేరుకోకుండా అడ్డుకున్నారని తెలిపింది. వీటిపై తీసుకున్న చర్యలను నివేదించాలని 4 రాష్ట్రాలను కోరింది. శాంతియుత పద్ధతుల్లో ఆందోళన జరిపే హక్కు అందరికీ ఉందని, కానీ ఈ విషయంలో మానవహక్కుల అంశం ముడిపడి ఉన్నందున జోక్యం చేసుకోవాల్సి వస్తోందని వివరించింది. రైతు ఆందోళనలతో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలపై, ఉత్పత్తి, రవాణాపై, ఇతర ఇబ్బందులపై సమగ్ర నివేదికను అక్టోబర్ 10 నాటికి సమర్పించాలని ఐఈజీ(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్)ను కమిషన్ ఆదేశించింది. నిరసన ప్రదేశంలో హక్కుల కార్యకర్త గ్యాంగ్ రేప్‌కేసులో పరిహారంపై ఝజ్జర్ డీఎం ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని, అక్టోబర్ 10 నాటికి తప్పక రిపోర్టు సమర్పించాలని పేర్కొంది. ఈ నిరసన కార్యక్రమాలతో సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి ఎదురైన సమస్యల గురించి ఒక సర్వే నిర్వహించి నివేదికనివ్వాలని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌ను కమిషన్ కోరింది. -
‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి: సీఎం యూటర్న్
చండీగఢ్: మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు సంవత్సరానికి పైగా పోరాడుతున్న రైతులపై తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనపై యూటర్న్ తీసుకున్నారు. రైతుల నిరసన కార్యక్రమాలతో తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఇష్టమొచ్చినట్టు చేసుకోండి.. కానీ పంజాబ్‌లో ఎందుకు’ అని ప్రశ్నించారు. కేంద్రంపై పోరాడేందుకు ఢిల్లీలో ఉద్యమం చేయాలని సూచించారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు రైతులు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించాలని చెప్పారు. రాష్ట్రంలో కాదని పేర్కొన్నారు. పంజాబ్‌కు ఎందుకు నష్టం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హరియాణా, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేసుకోండి అని సూచించారు. రైతులు ఢిల్లీ, హరియాణాలోని 113 ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు అని తెలిపారు. ‘మీ ఆందోళనతో రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడడం ఆందోళనకరం’ అని ఆరోపించారు. రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్ పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సీఎం అమరీందర్‌సింగ్ ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. నల్ల చట్టాల రద్దుకు రైతులు పంజాబ్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పది నెలలుగా రైతులు నల్ల చట్టాల రద్దుకు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలతో తమకు మద్దతు ధర దక్కదని.. వ్యవసాయం కార్పొరేటు పరం అవుతుందనే ఆందోళనతో రైతులు ఉద్యమ బాట పట్టారు. -
పురిటి బిడ్డ పురోగమనం!
రైతాంగ పోరాటం దేశంలో కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశ రాజధాని, పరిసరాలను దాటి విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ (అనుబంధ అంశాల) చట్టాలకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం, ఇప్పటికే పలు ఆటుపోట్లను చవిచూసింది. దేశంలో ఎక్కడికక్కడ నిరసించినా... ఢిల్లీని చుట్టుముట్టి ఓ ఆందోళన నిరవధికంగా సాగుతోంది. ఏకరీతిన నవమాసాలు గర్భస్థ స్థితిలో ఢిల్లీ, శివార్లకే పరిమితమైన శైశవ దశ నుంచి... ఆందోళన తాజాగా గడపదాటుతోంది. మహాపంచాయతీల రూపంలో అడుగు బయటకు వేసింది. వారం కిందటి ముజఫర్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్), నిన్నా ఇవాళ్టి కర్నల్(హర్యానా) రైతు ఆందోళనలు సంకేతం. వారం కింద, మితిమీరిన పోలీసు లాఠీ దెబ్బకు ఒకరు మరణించి, పదిమంది రైతులు గాయపడ్డ దాష్టీకాన్ని నిరసించిన ఆందోళన, హర్యానా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలో రోజురోజుకు బలపడుతోంది. వివిధ రాష్ట్రాలకు, జిల్లా కేంద్రాలకు విస్తరించే రైతు ఉద్యమ కార్యాచరణ ఐక్య పోరాట వేదిక, ఇతర రైతు సంఘాల వ్యూహాల్లో రూపుదిద్దుకుంటోంది. పాలకపక్షమైన భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికినా... ఉద్యమాన్ని నిరాఘాటంగా సాగించిన రైతు సంఘాలు, ఇంతకాలం వ్యూహాత్మకంగా రాజకీయ పక్షాలను దూరం పెట్టాయి. తమ వేదికలనెక్కనివ్వలేదు! అందుకే, ఎంతో విశ్వసనీయత పొంది ప్రపంచ దృష్టిని ఆకర్షించిందీ ఉద్యమం. కానీ, ఉత్తరాది వివిధ రాష్ట్రాలు ఎన్నికలకు సమాయత్తమౌతున్న ప్రస్తుత తరుణంలో... ఆయా పార్టీలు రైతాంగ ఉద్యమాంశాన్ని ఇప్పుడు తమ ప్రచారాస్త్రంగా మలచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. చిత్రమేమంటే, పాలకపక్షం బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ రైతు విభాగమైన భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) కూడా దేశవ్యాప్త నిరస నల కార్యాచరణ ప్రారంభించింది. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కాలని, చట్టబద్దత కావా లని కోరుతూ, మచ్చుకి 500 జిల్లా కేంద్రాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టింది. ఇది వ్యూహాత్మక చర్య అన్నది ప్రత్యర్థుల వాదన! ఒక మహాఉద్యమం నుంచి, మూడు చట్టాలు ఎత్తివేయాల్సిందేననే తమ ప్రధాన డిమాండ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ అని, ఇన్నాళ్లు రైతు సంఘలెన్నింటినో ఏకీకృతం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) అంటోంది. వారు సెప్టెంబరు 27న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చి ఉన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి, మరోవైపు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఒత్తిడి పెరుగుతోంది. రైతు సంఘ నాయకులు, కేంద్ర ప్రభుత్వం... ఇరువురితో సంప్రదింపులు జరిపి, నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టే ఏర్పాటు చేసిన సంఘ సభ్యుడొకరు, సుప్రీం ప్రధాన న్యాయ మూర్తికి తాజాగా లేఖ రాసి సంచలనం సృష్టించారు. తామిచ్చిన నివేదికను బయటపెట్టాలని, ప్రతిష్టంభనను తొలగించి, సమస్యను పరిష్కరించేట్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయ స్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. తగిన సంప్రదింపులు లేకుండా, తమ ప్రయోజనాలకు వ్యతి రేకంగా తెచ్చిన ఆ మూడు చట్టాలను ఎత్తివేయాల్సిందేనని రైతాంగం పట్టుబట్టడంతో పోరాటం తీవ్రరూపం దాల్చినపుడు, గత జనవరిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. చట్టాల అమలును పక్కనపెట్టమని కేంద్రాన్ని ఆదేశించింది. చట్టాలను మాత్రం ఎత్తివేసేది లేదని కేంద్రం భీష్మించి, ప్రతిష్టంభన ఏర్పడటంతో సుప్రీం ఒక కమిటీని నియమించి రెండు మాసాల్లో నివేదిక ఇవ్వాలంది. మార్చి 19న సీల్డు కవర్లో ఆ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను సుప్రీం ఇంతవరకు విప్పలేదు. చట్టాలు రైతు వ్యతిరేకమైనందున వాటిని పూర్తిగా ఎత్తివేయాలనేది ఒక వాదనైతే, అంత అవసరం లేదు సవరిస్తే చాలనేది మరోవాదన. మెజారిటీ రైతు సంఘాలు చట్టాలను ఎత్తివేయాలనే కోరుతున్నాయి. భారత్ కిసాన్ సంఘ్ మాత్రం, ఆ మేరకు సవరిస్తే చాలంటోంది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదనేది పాలకపక్షపు అనుకూల రైతు సంఘం వాదన. రైతుకు గిట్టుబాటు ధర (ఆర్పీ) లభించాలని, శాస్త్రీయంగా దాన్ని ఖరారు చేసి, వ్యవసాయో త్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియకు చట్టబద్ధత తీసుకురావాలని ఈ సంఘం కోరు తోంది. ప్రభుత్వమైనా, ప్రయివేటు వ్యాపారులైనా... రైతు ఉత్పత్తుల్ని ముందే ఖరారు చేసిన గిట్టు బాటు ధరకు తగ్గి కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించి, ఆ మేర శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తోంది. పెరిగే పెట్టుబడి వ్యయాన్ని, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని సదరు గిట్టుబాటు ధర ఖరారు చేయాలనే వాదన సముచితం. అది లేక, దేశానికి అన్నం పెట్టే రైతు నానాయాతన అనుభవించాల్సి వస్తోంది. రైతు ఆదాయం రెట్టింపేమో కానీ, ఉత్పత్తి వ్యయంలో 40, 50 శాతం కూడా లభించక రైతు అప్పుల్లో పడి కునారిల్లుతున్నాడు. తమనీ దుస్థితికి తెచ్చిన పాలకపక్షాల పట్ల ఆగ్రహమే కాకుండా తమ శ్రమశక్తిని దోచుకోజూస్తున్న కార్పొరేట్లపై కోపం కూడా రైతు ఉద్యమానికి కొత్త ఊపిరులు పోస్తోంది. కేంద్రం, అది తెచ్చిన కొత్త చట్టాలే ఊతంగా... వ్యవసాయోత్పత్తులతో పాటు, వాటి నిల్వ, మార్కెటింగ్ రంగాల్లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వస్తున్న కార్పొరేట్ శక్తులనూ రైతు ఉద్యమాలు లక్ష్యం చేసుకుంటున్నాయి. మద్దతు పెరగటంతో బలోపేతమౌతున్నాయి. రేపటి పరిస్థితేమిటో వేచి చూడాల్సిందే! -
రైతుల నిరసన: కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తక్షణమే ఈ కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ ఏడాదిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్న గోధుమ మద్దతు ధరను 2 శాతం అనగా 40 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఈ ఏడాది క్వింటాల్ గోధుమ కనీస మద్దతు ధరను 2,015 రూపాయలుగా నిర్ణయించింది కేంద్రం. ప్రపంచంలో గోధుమ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. అలానే బార్లీపై 35 రూపాయల ధర పెంచుతూ.. క్వింటాల్ బార్లీ మద్దతు ధర 1,635 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. అలానే చెరుకు రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. క్వింటాల్ చెరకుకు మద్దతు ధరను 290 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జౌళి రంగంలో ఐదేళ్లలో 10,683 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం ప్రతి ఏటా మద్దతు ధరను నిర్ణయిస్తూ.. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటుంది. దానిలో భాగంగానే ఈ ఏడాదికి గాను పలు పంటల మద్దతు ధరలను కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. (చదవండి: బియ్యం, గోధుమల్లో ‘డి’ విటమిన్! ) అలానే ఈ ఏడాదికి గాను ఆవాల మద్దతు ధరను కేంద్రం 400 రూపాయలు పెంచి.. క్వింటాల్ ధర 5,050 రూపాయలుగా ప్రకటించింది. కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేసేందుకు నిర్ణయించే ధర. ప్రస్తుతానికి ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ ఏడాదికి సంబంధించి కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: రైతుకు మద్దతు ధర అసాధ్యమా? -
కర్నాల్‌లో నిషేధాజ్ఞలు మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత
కర్నాల్(హరియాణా): హరియాణాలోని కర్నాల్‌లో మినీ సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామన్న రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నిర్వహిం చతలపెట్టిన రైతు ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ అమల్లోకి తెచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్‌నూ నిలిపేశారు. కర్నాల్‌లో నలుగురుకి మించి వ్యక్తులు గుమిగూడటం కుదరదంటూ నిషేధాజ్ఞలు జారీచేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తు చర్యగా ఆంక్షలు అమల్లోకి తెచ్చామని అదనపు డీజీపీ(లా అండ్ ఆర్డర్) నవ్‌దీప్ సింగ్ చెప్పారు. రైతు ఆందోళన సందర్భంగా తప్పుడు వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయకుండా ఆపేందుకు కర్నాల్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎంఎస్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సేవలను స్తంభింపజేస్తారు. పొరుగున ఉన్న కురుక్షేత్ర, కైథాల్, జింద్, పానిపట్ జిల్లాల్లోనూ ఈ సేవలనుæ నిలిపేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలనూ రప్పించారు. గత నెల 28న కర్నాల్‌లో బీజేపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయల్దేరిన రైతులు.. జాతీయరహదారి వెంట ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్నారంటూ వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో 10 మందికిపైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించారు. లాఠీచార్జి కారణంగా ఆయన మరణించారని రైతు సంఘాలు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. లాఠీ చార్జిని నిరసిస్తూ మినీ–సెక్రటేరియట్‌ను ముట్టడి స్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటించడం తెల్సిందే. ముందుగా కర్నాల్‌లో భారీస్థాయిలో పంచాయత్‌ను నిర్వహిస్తామని, తర్వాత మినీ– సెక్రటేరియట్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ చెప్పారు. -
లాఠీఛార్జిపై రైతుల ఆగ్రహం
చండీగఢ్: కర్నాల్‌లో రైతులపై పోలీస్ లాఠీచార్జికి నిరసనగా పంజాబ్ రైతులు రోడ్లను దిగ్బంధించి, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలపాటు సాగిన ఆందోళనలతో ప్రధాన హైవేలపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. శనివారం కర్నాల్‌లో బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా హైవేపైకి భారీగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 10 మంది రైతులు గాయపడిన విషయం తెలిసిందే. కర్నాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆదివారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) ఆయుష్ సిన్హాను ఆయన సర్కారీ తాలిబన్‌గా పేర్కొన్నారు. ‘మీరు మమ్మల్ని ఖలిస్తానీ అంటే, మేం మిమ్మల్ని సర్కారీ తాలిబన్లని అంటాం. ఇలాంటి వారిని మావోయిస్టు ప్రాంతాలకు పంపించాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం కర్నాల్‌లో సమావేశం కానున్నట్లు హరియాణా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చెప్పారు. ఇలా ఉండగా, రైతులపై పోలీస్ లాఠీచార్జిని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ సమర్ధించుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపు తామని మాటిచ్చిన రైతులు.. ఆ తర్వాత హైవేను దిగ్బంధించి, పోలీసులపైకి రాళ్లు రువ్వారన్నారు. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులను ప్రేరేపించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హామీ ఇచ్చారు. -
రైతులపై లాఠీచార్జ్: సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మళ్లీ రైతుల రక్తం చిందింది. దేశం సిగ్గుతో తలవంచుకుంటోందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్న ఒక రైతు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా రక్త మోడుతున్న రైతు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (రాబోయే మునిసిపల్ ఎన్నికల గురించి చర్చించడానికి) నేతృత్వంలోని సమావేశానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనకు దిగారు రైతులు. కర్నాల్‌లోని ఘరౌండ టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వేలాదిగా తరలివచ్చిన రైతులు రోడ్ల మీద మంచాలు వేసుకొని కూర్చొని మరీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఓసీ ధంకర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకు పడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. ఈ లాఠీఛార్జ్ ఘటనలో పలువురు రైతులు తీవ్రంగా గాయ పడ్డారు. దీంతో పోలీసుల దమనకాండను నిరసిస్తూ పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశామని పోలీసు అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రధాన రోడ్లు ,హైవేలను దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా సంఘం నేతలు పిలుపు నిచ్చారు. అలాగే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, గాయపడిన వారికి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీలతో క్రూరంగా దాడి చేసారనీ, వందలాది మంది రైతులను అరెస్టు చేశారని ఎస్కేఎం నేత దర్శన్ పాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు రోడ్లన్నీ బ్లాక్ చేయాలని బీకేయూ నాయకుడు రాకేశ్ తికాయత్ కోరారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసే వరకు రహదారుల దిగ్బంధనం కొనసాగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. -
సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం !
న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృత స్థాయికి తీసుకెళ్లాలని రైతు సంఘాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులోభాగంగా సెప్టెంబర్25వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయించాయి. గురువారం ఢిల్లీ దగ్గర్లోని సింఘు సరిహద్దు వద్ద ప్రారంభమైన అఖిలభారత రైతు సమ్మేళనం ఈ మేరకు తీర్మానించింది. సాగు చట్టాలపై పోరుకు 9 నెలలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రెండ్రోజుల రైతు సమ్మేళనాన్ని గురువారం భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ లాంఛనంగా ప్రారంభించారు. ‘తొమ్మిది నెలలుగా ఉద్యమిస్తున్నా.. రైతులతో ఫలప్రదమైన చర్చలకు మోదీ సర్కార్ ముందుకు రాకపోవడం చాలా దారుణం. అయినా మేం మా ఉద్యమపథాన్ని వీడేదే లేదు. ఈ కాలంలో మేమేం కోల్పోయామో, మేం సంఘటితంగా ఏమేం సాధించామో సర్కార్‌కు తెలిసేలా చేస్తాం’ అని రాకేశ్ తికాయత్ అక్కడి రైతులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ రైతు సమ్మేళనంలో 22 రాష్ట్రాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికుల సంఘాలు, సంస్థల తరఫున నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 18 అఖిలభారత కార్మిక సంఘాలు, తొమ్మిది మహిళా సంఘాలు, 17 విద్యార్థి, యువజన సంఘాల తరఫున వందలాది మంది రైతులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. సమ్మేళనంలో తొలి రోజున మూడు వేర్వేరు సెషన్స్ నిర్వహించినట్లు సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పేర్కొంది. పారిశ్రామిక రంగ కార్మికులు, వ్యవసాయ రంగ కార్మికులు, గ్రామాల్లోని పేదలు, గిరిజనుల సమస్యలనూ ఆయా సెషన్స్‌లో చర్చించారు. సమ్మేళనంలో నిర్వహణ కమిటీ కన్వీనర్ ఆశిష్ మిట్టల్ సంబంధిత ముసాయిదాను రైతు నేతల ముందుంచారు. ‘మోదీ సర్కార్ రైతుల డిమాండ్లకు తలొగ్గి వివాదాస్పద చట్టాలను రద్దుచేసేలా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఉద్యమాన్ని ఉధృతస్థాయికి తీసుకెళ్లాలి’ అని సమ్మేళనంలో తీర్మానించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు హానికరమని ఈ సందర్భంగా ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సూర్య నారాయణ, రావుల వెంకయ్య, ఝాన్సీ, తెలంగాణ నుంచి టి.సాగర్, ప్రభు లింగం, కె.రంగయ్య, అచ్యుత రామారావు, జక్కుల వెంకటయ్య, రాంచందర్, గోపాల్ పాల్గొన్నారు. -
అన్నదాతల ఆందోళన.. ఫర్నీచర్ ధ్వంసం
రాయగడ: ఒడిశాలోని రాయగడ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అయితే సకాలంలో డిమాండ్‌కు సరిపడా ఎరువులను రైతులకు సరఫరా చేయడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో ఎరువుల కోసం నవరంగపూర్, రాయగడ జిల్లాల రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రాయగడ జిల్లా కొలనార సమితిలోని బొడిఖిల్లాపొదోరొ, తెరువలి, ఖెదాపడ, డుమురిగుడ, కార్తీకగుడ, కిల్లగుడ, గడ్డి శెశిఖల్, దొందులి పంచాయతీలకు చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. చదవండి: మైనర్ బాలిక కిడ్నాప్.. నోటిలో గుడ్డలు కుక్కి .. వ్యవసాయం పనులు ప్రారంభించామని, సకాలంలో రావాల్సిన ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మరో వారంలో అందకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించాలని కోరుతూ కలెక్టర్ సరోజ్‌కుమార్ మిశ్రాకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేకపోవంతో ఏడీఎంఓ సోమనాథ్ ప్రధాన్‌కు దాఖలు చేశౠరు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి దుస్సాసన్ ప్రహరాజ్ను రైతులంతా చుట్టుముట్టారు. దీనిపై స్పందించిన ఆయన... ఎరువుల కొరత ఉన్న ప్రాంతాలకు వారం రోజుల్లో సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల కోసం ఏకరవు.. జయపురం: నవరంగపూర్ జిల్లా ఝోరిగాం గొడౌన్‌కు యూరియా చేరిందని తెలియగానే వందలాది మంది రైతులు పోటెత్తారు. సుమారు 2వేల మంది అక్కడికి చేరుకోగా.. ప్రతి ఒక్కరికీ రెండు బస్తాల చెప్పున ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. అయితే కేవలం 1600 బస్తాలు మాత్రం అందుబాటులో ఉండటంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో భగ్గుమన్న రైతులు.. గోదాంను చుట్టుముట్టారు. కార్యలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఉమ్మరకోట్ ఎస్డీపీఓ దినేష్ చంద్రానాయక్, ఎస్ఐ నట్వర నందొ, ఝోరిగాం సమితి వ్యవసాయశాఖ అధికారి సునీత సింగ్, తహసీల్దార్ హృషికేష్ గోండ్ ఘటనా స్థలానికి చేరుకొని, రైతులకు నచ్చచెప్పారు. చివరకు ఒక్కో బస్తా చెప్పున అందించడంతో వారంతా శాంతించారు. చదవండి: స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ! -
ఎన్నికల్లో తప్పని రైతుల సెగ
ఆగస్ట్ తొమ్మిదో తేదీని క్విట్ ఇండియా దినోత్సవంగా పాటిస్తున్నాం. 1942లో ఇదేరోజున బ్రిటిష్ పాలనకు వ్యతి రేకంగా క్విట్ ఇండియా ఉద్యమం మొదలై, అనంతర పరిణామాల్లో ఇంగ్లిష్ వారు భారతదేశాన్ని వదలడమూ, దేశం స్వాతంత్య్రం పొందడమూ జరిగాయి. అదే తరహాలో మొన్న ఆగస్ట్ 9న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసిస్తున్న రైతులు ‘మోదీ గద్దె దిగాలి’ అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించారు. ఇది జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవ కాశం ఉంది. వచ్చే ఏడాది వరుసగా మార్చి, మే నెలల్లో శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటగా ఈ ప్రభావం పడనుంది. గతేడాది నవంబర్ 26న మొదలైన రైతుల నిరసన పోరాటం, తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికీ, రైతులకు ప్రాతినిధ్యం వహి స్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకూ మధ్య జరిగిన పదకొండు దశల చర్చలు కూడా ఫలవంతం కాలేదు. వ్యవసాయ చట్టాలను అమలుచేసి తీరాలని కేంద్రమూ, వాటిని వెంటనే రద్దు చేయాలని రైతుసంఘాలూ– ఇరుపక్షాలూ కూడా తమ వైఖరికే కట్టుబడి ఉండటంతో ఏ రాజీకి రాలేకపోయాయి. పదకొండో దశ చర్చలు జనవరి 22న విఫలమయ్యాక మళ్లీ చర్చలకు కేంద్రం ఏ ముందడుగూ వేయలేదు; రైతులు తమ నిరసననూ వీడలేదు. తమను తాము ఐక్యంగా ఉంచుకుంటూనే, కేంద్ర ట్రేడ్ యూనియన్లు, ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొంటూ పద్ధతి ప్రకారం దశల వారీగా రైతులు తమ నిరసనను సజీవంగా ఉంచుతున్నారు. ఢిల్లీ మూడు సరిహద్దులు– సింఘు, తిక్రీ, ఘజియాబాదుల్లో ధర్నాలు కొనసాగిస్తూనే దేశంలోని అన్ని రాష్ట్రాలూ జిల్లాలూ బ్లాకు ల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిపారు. భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వర్షాకాల సమావేశాలు జరుగుతున్న దేశ పార్లమెంటుకు కొన్ని వందల మీటర్ల దూరం లోనే, నిరసనగా జంతర్ మంతర్‌లో రైతుల పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. రెండూ నేటితో ముగియనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రైతులు తమ పోరాటానికి కొత్త మలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత కిసాన్ సభ సారథ్యంలో సమావేశమై క్విట్ మోదీ ఉద్యమాన్ని ప్రారంభించారు. సుమారు 40 రైతు సంఘాలు అందులో భాగమయ్యాయి. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. రానున్న కాలంలో జిల్లాలవారీగా కూడా ఇవి ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయికీ పోరాటాన్ని చేర్చాలనేది వీరి లక్ష్యం. జాతీయ రాజకీయాలను రైతుల పోరు ఇదివరకే ప్రభావితం చేసింది. అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించి మనలేని స్థాయికి ఈ పోరాటం చేరింది. లోక్‌సభ, రాజ్యసభ రెండింటా కూడా రైతుల సమస్యలను లేవనెత్తడానికి విపక్షాలు ప్రయత్నించడం, సభా వ్యవహారాలకు చాలాసార్లు ఆటంకం కలగడం చూశాం. రైతుల ఉద్యమం రాజకీయాలకు అతీతంగానే కొనసాగుతున్నప్పటికీ, రైతు సంఘాలు తమ డిమాండ్లు నెరవేరేలా అన్ని రాజకీయ పార్టీల మద్దతును కోరడమే కాకుండా, పశ్చిమ బెంగాల్ సహా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని కూడా రైతులకు పిలుపునిచ్చాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణ మూల్ కాంగ్రెస్‌ను ఓడించి, పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ విఫలం కావడం చూశాం. నిరసన చేస్తున్న రైతుల్లో సింహభాగం పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడంతో మోదీ వ్యతిరేక ఉద్యమం ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ ప్రభావకారి కానుంది. గత ఎనిమిది నెలల నిరసన కాలంలో ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇది అంత సులభంగా వారి మనోఫలకాల్లోంచి తొలిగేది కాదు. ఇప్పటికే పంజాబ్ స్థానిక సంఘాల ఎన్నికల్లో రైతులు ఎలాంటి పాత్ర పోషించారో చూశాం. బీజేపీకి వ్యతిరేకంగా వారు ఇచ్చిన ఆగ్రహపూరిత ప్రకటనల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేకపోయారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చాక, బీజేపీకి సంప్రదాయ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి రైతుల సమస్యల మీద ప్రచారం చేస్తోంది. అలాగే ఇతర రెండు ప్రధాన పార్టీలు– అధికారంలో ఉన్న కాంగ్రెస్, విపక్షం ఆమ్ ఆద్మీ కూడా రైతులకు మద్దతిస్తున్నాయి. అంటే పంజాబ్ ఎన్నికల్లో రైతుల నిరసనోద్యమం ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. – జ్ఞాన్ పాఠక్ -
సభాపతి పైకి పేపర్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బుధవారం ఎలాంటి చర్చలు లేకుండా గురువారానికి వాయిదా పడింది. ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు సభాకార్యక్రమాలు జరగకుండా ఆందోళన కొనసాగించారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్స్థానంపైకి విసరడం కలకలం సృష్టించింది. రెండు సభలు పలుమార్లు వాయిదా పడినా విపక్షాల నిరసన ఆగకపోవడంతో సభాధిపతులు మరుసటిరోజుకు సభలను వాయిదా వేశారు. పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుపడుతూ విపక్ష సభ్యులు సమావేశాలు జరగకుండా ఆందోళన జరుపుతున్న సంగతి తెలిసిందే! బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. కానీ వెంటనే విపక్షాలు తమ ఆందోళనను ఆరంభించాయి. పలువురు సభ్యులు సభ వెల్‌లోకి చేరుకొని నినాదాలతో సభను అడ్డుకున్నారు. కానీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన హౌస్ప్రొసీజర్స్ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ కనిపించారు. ఎట్టకేలకు వర్షాకాల సమావేశాలు ఆరంభమైన తర్వాత తొలిసారి లోక్‌సభలో క్వశ్చన్ అవర్ జరిగినట్లయింది. అనంతరం స్పీకర్ సభను వదిలివెళ్లగా డిçప్యూటీ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభా నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఈ సమయంలో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కొందరు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు, ప్లకార్డులు చింపి లోక్‌సభ స్పీకర్స్థానం పైకి విసిరేశారు. కాంగ్రెస్‌కు చెందిన గుర్జీత్ ఔజాలా, ప్రతాపన్, హిబి ఈడెన్ తదితరులు పేపర్లు చింపి స్పీకర్ స్థానం మీదకు, ట్రెజరీ బెంచ్‌ల మీదకు విసిరారు. సాయంకాలానికీ సభలో నిరసనలు ఆగకపోవడంతో గురువారానికి సభను వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యసభలో కొనసాగిన నిరసనలు పెగసస్, రైతు చట్టాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన రాజ్యసభలో బుధవారం కొనసాగింది. అయితే ఆందోళనల నడుమ సభ జువెనైల్ జస్టిస్ సవరణ చట్టం 2021కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. బుధవారం రాజ్యసభ సభాధిపతి వెంకయ్య జీరోఅవర్‌ను ఆరంభించారు. కాంగ్రెస్, టీఎంసీ, ఇతర విపక్ష సభ్యులు నినదిస్తూ సభను అడ్డుకున్నారు. కొందరు ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా వెంకయ్య అడ్డుకున్నారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే వెంకయ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. కానీ విపక్ష సభ్యులు స్లోగన్లు ఉధృతం చేసి సభను అడ్డుకున్నారు. ఈ సమయంలో సభ్యులు ముందే అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. అనంతరం తిరిగి సభ వాయిదా పడింది. అదనపు వ్యయానికి సభామోదం ప్రభుత్వం అదనంగా రూ.23వేల కోట్ల వ్యయం చేసుకునేందుకు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 17వేల కోట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖకు కేటాయించారు. దీన్ని కోవిడ్ సంబంధిత వ్యయాలకు ఉపయోగిస్తారు. రూ. 2050 కోట్లు పౌరవిమానయాన శాఖకు వెళ్తాయి. -
ఉద్యమానికి ఊతం ‘రైతన్న’: ఆర్ నారాయణమూర్తి
‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటం ఇతివృత్తంగా ‘రైతన్న’ చిత్రాన్ని రూపొందించాను. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాను’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఈ సినిమా కార్యక్రమంలో రైతు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘రైతులకు కావాల్సింది ఒకే ధర, ఒకే మార్కెట్ కాదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటాలు సాగిస్తున్న అన్నదాతలపై ‘రైతన్న’ తీశాను. సమాజంలోని అట్టడుగు వర్గాల్లో 75 శాతం మందికి సినిమానే వినోదం. సినిమా థియేటర్లు పునఃప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘రైతు ఉద్యమానికి ‘రైతన్న’ సినిమా గొప్ప ఊతం ఇస్తుంది’’ అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు . ‘‘రైతులే ప్రధానాంశంగా నారాయ ణమూర్తి సినిమా తీయడం గొప్ప విషయం’’ అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు అన్నారు. రైతు సంఘాల నాయకులు ఆర్. వెంకయ్య, వై. కేశవరావు, జమలయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు మద్దతుగా రాహుల్ ట్రాక్టర్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఐదో రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆయన స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యకతిరేకతంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీకి రాహుల్ గాంధీ మద్దతు పలికారు. అయితే పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే పార్లమెంట్ భవనంలోకి అనుమతి ఉండటంతో రాహుల్ గాంధీ ట్రాక్టర్‌ను లోపలకి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆయన ట్రాక్టర్ మీద నుంచే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించిన సమస్యను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లిందని, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ఉభయ సభల్లో చర్చించడానికి అనుమతించడం లేదని మండిపడ్డారు. దేశంలోని రైతులు తీవ్రంగా అణచివేయబడుతున్నారని, అందుకే తాను రైతుల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా పాల్గొన్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు.. నల్ల చట్టాలని వాటిని వెంటనే కేంద్రం వెనక్కు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాలను రైతుల కోసం కాకుండా కొంతమంది కార్పొరేట్ వ్యాపారుల కోసం తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. ఈ నల్ల చట్టాలను ఎందుకు తీసుకువచ్చారో దేశంలోని ప్రజలకు తెలుసన్నారు. పార్లమెంట్ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు రణదీప్ సుర్జేవాలా, బీవీ శ్రీనివాస్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై స్వరం పెంచిన ప్రతి ఒక్కరినీ మోదీ ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాబోయే తరాల కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అరెస్టులు చేసినా చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. -
రైతు ఉద్యమానికి మద్దతుగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ
-
8 నెలలు పూర్తి.. నేడు ‘మహిళా కిసాన్ సంసద్’
-
8 నెలలు పూర్తి.. నేడు ‘మహిళా కిసాన్ సంసద్’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు దేశ రాజధానిలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 26న ప్రారంభమైన రైతుల ఆందోళనలకు నేటితో 8 నెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుల దీక్షకు మద్దతుగా మహిళా రైతులు సోమవారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్నారు. కిసాన్ సంసద్ పేరిట మహిళా రైతులు ఆందోళన చేపట్టనున్నారు. ఈ క్రమంలో కిసాన్ సంయుక్త మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా రైతులకు చెందిన పలు కాన్వాయ్‌లు సోమవారం ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని.. మహిళా కిసాన్ సంసద్ పేరిట నిరసన తెలుపుతారు అని పేర్కొంది. భారతీయ వ్యవసాయ రంగంలో మహిళా రైతు పాత్రను ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం అని ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రైతులు జంతర్ మంతర్ వద్ది కిసాన్ పార్లమెంటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు 200 మంది రైతుల పార్లమెంటు వెలుపల కూర్చుని నిరనస తెలుపుతారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ రైతుల ఉద్యమం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.