
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆశిష్ రైతులపై కావాలనే కాల్పులు జరిపినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఆశిష్‌తోపాటు అంకిత్‌దాస్ కూడా కాల్పులు జరిపినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ తమ నివేదికలో పేర్కొంది.
రైతులపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే.
చదవండి: మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..!
Comments
Please login to add a commentAdd a comment