Ashish
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ
దెయ్యాన్ని చూసి భయపడే కథలు చాలానే ఉన్నాయి. కానీ దెయ్యాన్ని ఇష్టపడి, తనతో ప్రేమలో పడటం ఎప్పుడైనా చూశారా? అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా లవ్ మీ: ఇఫ్ యూ డేర్. టీజర్, ట్రైలర్‌తో బాగుందనిపించిన ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్షమైంది. కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. హారర్ సినిమాలను ఇష్టపడేవారు వెంటనే సినిమాపై ఓ లుక్కేయండి..కథేంటంటే..అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) యూట్యూబర్స్. మూడనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహలను పోగొట్టేలా వీడియోలు తీస్తూ ఉంటారు. ఓసారి ప్రతాప్.. తమ ఊరిలో జరిగిన మిస్టరీ ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ అపార్ట్మెంట్లో దెయ్యం ఉందని, అక్కడికి వెళ్లినవారిని అది చంపేస్తుందని తెలుసుకుంటాడు. అది విన్న అర్జున్.. ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే! చదవండి: హత్యపై దర్శన్ కుమారుడు కామెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర -
ఓటీటీకి బేబీ హీరోయిన్ మూవీ.. అప్డేట్ వచ్చేసింది!
యంగ్ హీరో ఆశిష్, బేబి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'లవ్ మీ'. ఇఫ్ యూ డేర్ అనేది సబ్ టైటిల్. మే 25న ఈ మూవీ థియేటర్ల రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. హారర్ రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమాను అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయంపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశముంది. కాగా.. దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు.Get ready to be spooked and enchanted by #GhostLove! Brace yourself for chills and thrills in the ultimate love story. 🥶❤️#LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆' coming soon on @PrimeVideoIN! @AshishVoffl @iamvaishnavi04 @iamsamyuktha_ @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu… pic.twitter.com/edT60T2o1c— Dil Raju Productions (@DilRajuProdctns) June 12, 2024 -
‘లవ్ మీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ గ్యాప్‌లో లవ్ మీ చేశా: ఆశిష్
ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఆశిష్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘లవ్ మీ’లో నేను అర్జున్ అనే యూ ట్యూబర్ పాత్ర చేశాను. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం నా పాత్రకు ఉన్న ఓ లక్షణం. ‘లవ్ మీ’లో హారర్ అనేది ఓ భాగం మాత్రమే. ఇందులో మంచి లవ్‌స్టోరీ, చక్కని ఎమోషన్స్ ఉన్నాయి. కీరవాణి, పీసీ శ్రీరామ్గార్లు ఈ సినిమా ఒప్పుకోవడం మా తొలి విజయంగా భావించాం. కథలో పట్టు లేకపోతే వారు ఒప్పుకునేవారు కాదు కదా. ‘లవ్ మీ’కు సీక్వెల్ చేయవచ్చు. కానీ అది ‘దిల్’ రాజుగారి చేతిలో ఉంది. ‘రౌడీ బాయ్స్’ తర్వాత యాభైకి పైగా కథలు విన్నాను. అలా నా రెండో చిత్రంగా ‘సెల్ఫిష్’ స్టార్ట్ చేశాం. కానీ ఈ మూవీలోని క్యారెక్టర్‌ను మరింత బాగా చూపించవచ్చని కథపై మళ్లీ వర్క్ స్టార్ట్ చేశాడు ఈ చిత్రదర్శకుడు కాశీ. ఈ గ్యాప్‌లో నేను ‘లవ్ మీ’ చేశాను. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’లో సినిమా కమిట్ అయ్యా. మరో రెండు కథలు విన్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
‘లవ్ మీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
దెయ్యాన్ని ప్రేమించిన హీరో.. లవ్ మీ ట్రైలర్ చూశారా?
దెయ్యంతో ప్రేమ.. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ..! ఈ కాన్సెప్ట్‌తో వస్తోన్న క ఒత్త మూవీ లవ్ మీ. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ గురువారం (మే 16న) రిలీజైంది. రోజూ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు ఒక అలారం మోగుతుంది. రాత్రి 8 గంటలకు..ఆ సమయానికి ఎవరు ఏ పనిలో ఉన్నా అందరూ టంచనుగా ఆ టైంకు ఇంటి తలుపును మూసేస్తారు. కానీ ఓ ఆడపిల్ల మాత్రం గది తలుపు తెరిచి చూసి కెవ్వుమని అరుస్తుంది. ఆ వెంటనే హీరో ఇంట్రడక్షన్ వేశారు. ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది. అక్కడ డేంజర్ వెళ్లొద్దు అంటే అటే వెళ్లాలనిపిస్తుందంటూ తన స్వభావాన్ని ట్రైలర్లో చూపించాడు. దెయ్యంతో లవ్అందుకే అందరూ భయపడే దెయ్యంతో ప్రేమలో పడతాడు. దెయ్యం చంపుతుందని అందరూ హెచ్చరించినా హీరో మాత్రం ఆ ఘోస్ట్ ప్లేస్‌లోకి వెళ్తాడు. చివరికి ఆ దెయ్యం అర్జున్ పీక పట్టుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. మరి ఈ మనిషి-దెయ్యం ప్రేమకథ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మే 25 వరకు ఆగాల్సిందే! మే 25న రిలీజ్అంటే సరిగ్గా మరో తొమ్మిది రోజుల్లో ప్రేక్షకులను భయపెట్టేందుకు లవ్ మీ థియేర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్‌ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు -
Ashish Chanchlani: టాలెంట్‌తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్‌తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్‌కి వెల్‌నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్‌లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్‌తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్‌తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్‌కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్‌స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్‌కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్‌గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
ఇదొక కొత్త ప్రయత్నం
ఆశిష్, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘లవ్ వీ’. ‘ఇఫ్ యు డేర్’ (నీకు ధైర్యం ఉంటే...) అనేది ఉపశీర్షిక. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రావాలి రా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదబాద్‌లో జరిగింది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను చెబోలు అమల, గోమతీ అయ్యర్, అదితీ భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్విన్, సాయి శ్రేయ ఆలపించారు. ‘‘ఓ ఘోస్ట్ లవ్‌స్టోరీ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రం యూనిట్ పేర్కొంది. ‘‘లవ్ మీ ఒక కొత్త ప్రయత్నం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
దయాగుణ సంపన్నుడు
పేదింటి భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు ఆకలితో ఉన్నారు. ‘పిల్లలు ఆకలితో ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు. సహాయం చేయండి’ అని ఆశిష్ అనే యువకుడిని అడిగారు ఆ దంపతులు. పదో పరకో వారి చేతిలో పెట్టి తన దారిని తాను వెళ్లిపోలేదు ఆశిష్. దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి వారు కోరిన పదార్థాలు తినిపించాడు. ఆ తరువాత వారిని ఆటో ఎక్కించి డ్రైవర్‌కు తానే డబ్బులు ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియా యూజర్ల నుంచి భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే పదిలక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే వారి ఆకలి తీర్చడం మాత్రమే కాదు మీ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు అని ధైర్యం చెప్పడం కూడా’ అని రాశాడు ఆశిష్. ‘దయాగుణానికి ఉన్న గొప్పదనం ఏమిటంటే వినికిడి శక్తి లేని వారు కూడా వినగలరు. కంటిచూపు లేని వారు కూడా చూడగలరు. దయాగుణాన్ని మించిన సంపద లేదు’ అని ఒక యూజర్ రాశాడు. -
యూరేక మూమెంట్ కాస్త.. 'మెటామ్యాన్గా'
'వచ్చిన 'ఐడియా'కు ఒక రూపం ఇచ్చి లాభదాయక కంపెనీగా నిర్మించడం అనేది అంత సులభం కాదు. దారి కనిపించినట్లుగానే ఉంటుంది. గమ్యం చేరడం మాత్రం సులువు కాదు, ఎంటర్ప్రెన్యూర్ కలలు కనే యువతరం తమకు వచ్చిన ఐడియాకు సంబంధించి అన్ని కోణాల్లో హోంవర్క్ చేస్తే సూపర్ సక్సెస్ సాధించవచ్చని నిరూపించింది బెంగళూరుకు చెందిన 'మెటామ్యాన్' స్టార్టప్. 'మన దేశంలో పురుషులకు జువెలరీ బ్రాండ్స్‌కు సంబంధించి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి' అనే మాట బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి నోట విన్న తరువాత అనీల్ షెట్టీ తన స్నేహితుడు హర్ష్ మస్కరతో కలిసి 'మెటా మ్యాన్' పేరుతో డిజైన్-ఓరియెంటెడ్ 'డైరెక్ట్-టు-కన్జ్యూమర్ బ్రాండ్' (డీ2సీ)కి శ్రీకారం చుట్టాడు. ప్రారంభించిన ఆరు నెలలోనే ఈ బ్రాండ్ సూపర్ డూపర్ హిట్ అయింది.' లండన్‌కు చెందిన మార్కెట్ రిసెర్చ్ కంపెనీ 'యూరోమానిటర్ ఇంటర్నేషనల్' అంచనా ప్రకారం మెన్ జువెలరీకి సంబంధించి ఇండియా థర్డ్-లార్జెస్ట్ మార్కెట్‌గా ఎదగనుంది. 'మెటామ్యాన్'కు ముందు సునీల్ షెట్టితో కలిసి మాట్లాడాడు అనీల్. ఈ ఆలోచన నచ్చడంతో కంపెనీ ఫౌండింగ్ మెంటర్, ఇన్వెస్టర్‌గా ఉండడానికి ముందుకు వచ్చాడు సునీల్ షెట్టి. హిప్ హప్ జువెలరీ ధరించడం అనేది ఇండియాలో బలపడుతున్న ట్రెండ్ అయినప్పటికీ ఏవో కొన్ని తప్ప తగినన్నీ ఆప్షన్స్ లేవు. ఈ లోటును భర్తీ చేయడానికి 'మెటామ్యాన్'తో ముందుకు వచ్చి సక్సెస్ అయింది. ట్రెండ్‌తో పాటు బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో బ్రాస్ లెట్స్, చైన్స్, రింగ్స్.. మొదలైన వాటిని డిజైన్ చేయించారు. సందర్భానికి తగినట్లుగా డైలీ ఆఫీస్ వియర్, క్యాజువల్ వియర్, స్పోర్ట్స్ వియర్, ట్రావెల్ వియర్.. మొదలైన వాటిని డిజైన్ చేయించారు. 'మెటామెన్' పీసెస్లు ఫిల్మ్ ఫేర్, లైఫెస్టైల్ ఏసియాలాంటి మ్యాగజైన్లలో కని పించడంతో వాటికి మరింత ప్రాచుర్యం వచ్చింది. ఈ కంపెనీ ఏంజెల్ ఇన్వెస్టర్ జాబితాలో సునీల్ షెట్టితో పాటు నిఖిల్ కామత్ (జెరోద), కేఎల్ రాహుల్ (ఇండియన్ క్రికెటర్), ఆశిష్ (బుక్ మై షో), ప్రశాంత్ ప్రకాష్ (యాక్సెల్ పాట్నర్స్), సుజిత్ కుమార్ (ఉడాన్), హర్షిల్ మాధుర్, శశాంక్ కుమార్ (రేజర్‌పే) చేరారు. రాబోయే ఆరు నెలల కాలంలో రెండు వందల కొత్త ప్రాడక్ట్స్ డిజైన్ చేయడానికి రెడీ అయింది మెటామ్యాన్. 2024లో దుబాయ్, ఇండోనేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలలో తమ బ్రాండ్‌ను విస్తరించే పనిలో ఉంది. అనీల్ షెట్టికి ఫ్యాషన్ నుంచి పాలిటిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు ఎన్నో రంగాలపై ఆసక్తి ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కల ఉంది. తన కలను నిజం చేసుకునే దారిని వెదుక్కునే క్రమంలో అనీలకు సునీల్ షెట్టి మాటలు దారి చూపించాయి. పురుషుల యాక్సెసరీస్, జువెలరీ మార్కెట్లో గెలుపు జెండా ఎగరేసేలా చేశాయి. 'ఆసియాలోని లీడింగ్ జెన్ జెడ్ జువెలరీ బ్రాండ్‌గా ఎదగాలనేది మా లక్ష్యం అంటున్నాడు 'మెటామ్యాన్' కో-ఫౌండర్ అనీల్ శెట్టి. యూరేక మూమెంట్.. యూరేక మూమెంట్ అనేది ఏ వ్యక్తికి అయినా ఏదో ఒక సమయంలో వస్తుంది. తల్లి నెక్లెస్‌ను మెడలో ధరించిన సునీల్ షెట్టిని చూసిన తరువాత నాకు ఐడియా వచ్చింది. మెన్ జువెలరీ అనేది మన దేశంలో వినూత్న కాన్సెప్ట్. ఐడియా కొత్తగా ఉన్నంత మాత్రాన సక్సెస్ కావాలని లేదు. 360 డిగ్రీ కోణంలో ఆలోచించి మంచి, చెడులపై ఒక అవగాహనకు వచ్చాం.. ఫ్యాషన్ జువెలరీ ధరించాలనే ఆసక్తి పురుషులకు ఉన్నప్పటికీ అట్రాక్టివ్, క్వాలిటీ డిజైన్లు వారికి కనిపించడం లేదు. ఈ లోటును పూరించేలా మా జువెలరీని డిజైన్ చేసి సక్సెస్ సాధించాం. - అనీల్ షెట్టి, మెటామ్యాన్, కో-ఫౌండర్ -
Colonel Manpreet Singh Funeral: జై హింద్ పాపా!
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...! చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్‌తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే. గుండెలవిసేలా రోదించిన భార్య మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు. మూడో తరం సైనిక వీరుడు మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది! -
టాప్ టెక్నీషియన్స్‌తో వచ్చేస్తున్న ‘రౌడీ బాయ్స్’ హర్షిత్ రెడ్డి
‘రౌడీ బాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా మూడో చిత్రం సోమవారం ఆరంభమైంది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు. ‘‘రొమాంటిక్ హారర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ‘రౌడీ బాయ్స్’తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆశిష్ ప్రస్తుతం నటిస్తున్న ‘సెల్ఫిష్’ 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడో సినిమాగా రూ΄పొందుతున్న ఈ రొమాంటిక్ హారర్ లవ్ స్టోరీ కోసం ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్. ఈ సినిమా ప్రారంభోత్సవానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కెమెరా: పీసీ శ్రీరామ్. -
పక్కింటివాడని మాట్లాడటమే ఆమెకు శాపమైంది.. అసలేం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఇంటి ముందే నివాసం ఉంటున్న ఓ మహిళను యువకుడు కాల్చి చంపాడు. అనంతరం, యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, వీరిద్దరూ కొన్నేళ్ల క్రితం జిమ్‌లో కలుసుకున్నట్టు.. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో మృతురాలు రేణు(40) కుటుంబంతో కలిసి నివసిస్తోంది. రేణుకు వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. ఇక, వీరి ఇంటి సమీపంలోనే ఆశిష్ కూడా ఉంటున్నాడు. కాగా, దాదాపు రెండేళ్ల క్రితం వీరిద్దరూ అక్కడున్న ఓ జిమ్‌లో కలుసుకున్నారు. దీంతో, వీరి మధ్య పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కాదు.. ఆశిష్ దారుణానికి ఒడిగట్టాడు. కాగా, గురువారం సాయంత్రం రేణు ఇంటికి వెళ్లిన ఆశిష్.. ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రేణును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక, అప్పటికే రేణు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా డీసీపీ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. దుబ్రీ పోలీసు స్టేషన్ పరిధిలో హత్య జరిగినట్టు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశాం. మృతిరాలిని రేణుగా, నిందితుడిని ఆశిష్‌గా గుర్తించామన్నారు. ఆశిష్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడు అప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈ లోకానికి వీడ్కోలంటూ..అమ్మా, గురు మామా క్షమించండి -
స్టైలీష్‌గా ఆశిష్..ఆకట్టుకుంటున్న ‘సెల్ఫీష్’ కొత్త పోస్టర్
‘రౌడీబాయ్స్’ తోనే నటుడిగా సత్తా చాటిన యంగ్ హీరో ఆశిష్ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నేడు(మే 14) ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. (చదవండి: భద్రాద్రి రాముడికి ప్రభాస్ భారీ విరాళం ) ఈ పోస్టర్లో ఆశిష్ మాస్ లుక్‌లో స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆశిష్‌కు జోడిగా ఇవానా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, చంద్రబోస్ లిరిక్ రైటర్‌గా, ఎస్ మణికంధన్ సినిమాటోగ్రఫీగా పని చెస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. -
కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు చూడరు
‘‘ప్రేక్షకులకు విజయవంతమైన సినిమా ఇవ్వడం అంత తేలిక కాదు. ‘బలగం, దసరా, విరూ పాక్ష’.. ఇలా కొత్తదనంతో నూతన దర్శకులు తీసిన చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి. కొత్తదనం లేని సినిమాలు చూడటానికి రెడీగా లేరు.. అది ఇవ్వడానికి రాత్రీపగలు కష్టపడాల్సిందే’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆశిష్, ఇవానా జంటగా కాశీ విశాల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సెల్ఫిష్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్‌పై ‘దిల్’ రాజు–శిరీష్ నిర్మిస్తున్నారు. ఆశిష్ పుట్టినరోజు (మే 1)ని పురస్కరించుకుని ‘సెల్ఫిష్’లోని ‘దిల్ ఖుష్..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. మిక్కీ జె. మేయర్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, జావేద్ అలీ పాడారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను, సుకుమార్ సపోర్ట్‌గా ఉంటాం. కానీ, ప్రేక్షకులకు నచ్చాల్సింది మాత్రం ఆశిష్. దాని కోసం తను కష్టపడాలి’’ అన్నారు. ‘‘సెల్ఫిష్’ కోసం నేను, కాశీ ప్రాణం పెట్టి కష్టపడుతున్నాం’’ అన్నారు ఆశిష్. ‘‘మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది’’ అన్నారు విశాల్ కాశీ. ఈ చిత్రానికి సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి. -
లఖీంపూర్ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్
న్యూఢిల్లీ: రైతులతో పాటు మొత్తం 8 మందిని బలిగొన్న లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బుధవారం 8 వారాల మధ్యంతర బెయిలిచ్చింది. ‘‘పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు సమర్పించాలి. బెయిల్ సమయంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో ఉండొద్దు. ఎక్కడ ఉండేదీ ట్రయల్ కోర్టుకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. అక్కడ వారానికోసారి వ్యక్తిగతంగా హాజరై అటెండెన్స్ నమోదు చేయాలి’’ అని ఆదేశించింది. సాక్షులు తదితరులను ప్రభావితం చేయకుండా ఉండేందుకే ఈ షరతు విధిస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జె.కె.మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ను, అతని కుటుంబాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. మరో నలుగురు నిందితులకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. -
ఇంకెన్నాళ్లు కస్టడీలో ఉంచుదాం?.. సుప్రీంకోర్టు ఘాటు స్పందన
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి కేసులో నిందితుడు, కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ కుమారుడు ఆశిశ్ మిశ్రాకు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. కేసు విచారణ లఖీంపూర్ ఖేరి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో చాన్నాళ్లుగా కొనసాగుతుండటంపై అసహనం వ్యక్తంచేసింది. ‘212 మంది సాక్షులను విచారించాలంటున్నారు. అయితే, ఏడాదికిపైగా ఆశిశ్ జైలులోనే ఉన్నాడు. అతడిని ఎంతకాలం కస్టడీలో ఉంచుదాం. నిందితులకూ హక్కులుంటాయి. బెయిల్, హక్కులు వంటి అంశాల్లో సమతుల్యం పాటించాల్సిందే. ఎప్పటిలోగా కేసు విచారణ ముగిస్తారో తేల్చండి’ అని జిల్లా జడ్జిని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రైతులపైనుంచి కారు దూసుకెళ్లాక కారులోని వ్యక్తులపై జరిగిన దాడిలో ముగ్గురు మరణించిన మరో కేసులో త్వరగా అఫిడవిట్ సమర్పించాలని యూపీ సర్కార్ తరఫున హాజరైన అదనపు మహిళా అడ్వొకేట్ జనరల్ గరిమా ప్రసాద్‌కు సూచించింది. జిల్లా కోర్టులో విచారణ డిసెంబర్ 16న మొదలవుతుందని గరిమా చెప్పారు. మరోవైపు యూపీ సర్కార్ మాత్రం నిందితుడికి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కోరుతూ వస్తోంది. -
తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్‌పై..
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. (క్లిక్: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ) -
లఖింపూర్ ఘటన.. కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్ నిరాకరణ
లక్నో: కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది అలహాబాద్ హైకోర్టు. బెయిల్ కోరుతూ ఆశిష్ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆశిష్ మిశ్రా. నిరసనలు చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఈ దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గేతేడాది అక్టోబర్ 9నే అరెస్టయిన ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆశిష్ బెయిల్‌ను రద్దు చేసింది. మంత్రి కుమారుడు అయినందుకు కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా అదే కారణంతో ఆశిష్‌కు బెయిల్ నిరాకరించింది. చదవండి: ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్ -
‘సెల్ఫిష్’ చిత్రం ప్రారంభం
-
ఆశిష్‌కి ఈ సినిమా ఓ సవాల్
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆశిష్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’ శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, తమిళ స్టార్ ధనుష్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ.– ‘‘రౌడీ బాయ్స్’తో మా ఆశిష్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తనకు టైలర్ మేడ్. కానీ ఈ సినిమా తనకు ఓ చాలెంజ్లాంటిది. నేను, సుకుమార్ ‘ఆర్య’ (2004) సినిమాకు పని చేశాం. ఇన్నేళ్లకు ‘సెల్ఫిష్’కు మేం పని చేయడం ఆనందంగా ఉంది. ‘సెల్ఫిష్’ ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. స్టోరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
Boxing Tourney: ‘పసిడి’కి పంచ్ దూరంలో...
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత బాక్సర్లు పసిడి పతకానికి పంచ్ దూరంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆశిష్ (75 కేజీలు), గోవింద్ (48 కేజీలు), వరీందర్ సింగ్ (60 కేజీలు)... మహిళల విభాగంలో మోనిక (48 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో ఆశిష్ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై, గోవింద్ 4–1తో ఎన్గుయెన్ లిన్ ఫుంగ్ (వియ త్నాం)పై నెగ్గగా... వరీందర్‌కు తన ప్రత్యర్థి అబ్దుల్ (పాలస్తీనా) నుంచి ‘వాకోవర్’ లభించింది. మోనిక 5–0తో ట్రాన్ థి డియెక్ కియు (వియత్నాం)పై గెలిచింది. భారత్‌కే చెందిన అమిత్ (52 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
జైల్లోనే ఆశిష్ మిశ్రా
లక్నో: లఖీంపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేసినా జైలు నుంచి విడుదల కాలేదు. 2021 అక్టోబర్‌లో ఆశిష్‌ను పోలీసులు సెక్షన్ 147, 148, 149, 302, 307, 326, 34, 427, 120బీ కింద అరెస్టు చేశారు. వీటితో పాటు ఆయుధాల చట్టం కింద కూడా ఆశిష్‌పై నేరారోపణ చేశారు. తాజాగా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్లో 302, 120 బీ సెక్షన్లకు సంబంధించి వివరాల్లేవు. సెక్షన్ 302 హత్యాయత్నంకు సంబంధించినది కాగా 120 బీ సెక్షన్ క్రిమినల్ కుట్రకు సంబంధించినది. బెయిల్ ఆర్డర్లో ఈ రెండు చట్టాల గురించి పేర్కొనకపోవడంతో ఆశిష్ విడుదల జరగలేదు. దీనిపై స్పందిస్తూ బెయిల్ ఆర్డర్లో ఈ రెండు సెక్షన్లను కూడా చేర్చాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ఆశిష్ న్యాయవాది చెప్పారు. రైతు ఆందోళనల సమయంలో నలుగురు రైతుల మరణానికి కారణమయ్యాడని ఆశిష్‌పై కేసు నమోదైంది. బెయిల్ కోసం ఆశిష్ యత్నిస్తుండగా గురువారం హైకోర్టులో ఊరట దొరికింది. -
ఓటీటీకి రౌడీ బాయ్స్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!, ఎక్కడంటే..
Rowdy Boys Movie Ready To Streaming On OTT: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వారసుడిగా ఆయన సోదరుడు శిరీష్ తనయుడు అశిష్ హీరోగా పరిచమైన చిత్రం ‘రౌడీ బాయ్స్’. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. హుషారు ఫేం శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. చదవండి: ‘కచ్చా బాదం’ పాటకు అర్హ డ్యాన్స్, వీడియో షేర్ చేసి మురిసిపోయిన బన్నీ ఈ చిత్రంలో ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి రిలీజ్ రెడీ అవుతోంది. తాజా బజ్ ప్రకారం.. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 యాప్‌లో మార్చి 4 నుంచి రౌడీ బాయ్స్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్, విక్రమ్, కార్తిక్ రత్నం, తేజ్ కురపాటి తదితరులు ఈ సినిమాలో నటించారు. చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!, ఎక్కడంటే.. -
యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్ నిందితుడికి బెయిల్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ సింసాత్మక ఘటనలోని నిందితుడికి బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత అక్టోెబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి.. రిమాండ్‌కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. కాగా ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో 2021 అక్టోబర్ 3న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకుపోవడంతో రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే ఉద్ధేశ్య పూర్వకంగానే రైతులపైకి ఆశిశ్ మిశ్రా తన కారును పొనిచ్చాడని ఇటీవలే కమిటీ పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ ఇప్పటికీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
సంక్రాంతి సెకండ్ విన్నర్ మాదే!
‘‘రౌడీ బాయ్స్’ ఆశిష్‌కి తొలి చిత్రం. నా దృష్టిలో తను ఇప్పుడు ఒక నటుడు. ఒక్క సినిమాకే హీరో అని అనను.. ప్రేక్షకులు తనని బాగా ఆదరించినప్పుడే హీరో’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రౌడీ బాయ్స్’ ఆశిష్‌కు చక్కటి శుభారంభం. తొలి సినిమా అయినా నటన, డ్యాన్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్లో ఆకట్టుకున్నాడని అందరూ ప్రశంసిస్తున్నారు. మా సినిమా కథ, పాత్రలతో యువతరం కనెక్ట్ అవుతుండటంతో విడుదల నుంచి ఇప్పటివరకూ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో ఐదు రోజుల్లో ఏడుకోట్ల గ్రాస్, నాలుగున్నర కోట్ల షేర్ లభించింది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం హ్యాపీ. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ మా సినిమాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాం. తెలంగాణలో కంటే ఆంధ్రాలో వసూళ్లు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలకు మంచి స్పందన లభిస్తుండటంతో మ్యూజికల్ కాంటెస్ట్ పెట్టి ఈవెంట్ నిర్వహించబోతున్నాం. ఈ సంక్రాంతి తొలి విన్నర్ ‘బంగార్రాజు’ సినిమానే. రెండో స్థానం ‘రౌడీ బాయ్స్’ది. ‘సెల్ఫిష్’ పేరుతో తెరకెక్కనున్న ఆశిష్ రెండో చిత్రానికి సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకుడు. సుకుమార్ డైలాగ్స్ అందిస్తారు. ‘ఆర్య’ తర్వాత నేను, సుకుమార్ కలిసి చేస్తున్న చిత్రమిది (నిర్మాతలుగా).. అందుకే బాధ్యతగా భావిస్తున్నాం’’ అన్నారు. -
హీరోగా మారడానికి 25 కేజీల బరువు తగ్గాను
ఆశిష్‌ను పెద్ద దర్శకుడితో లాంచ్ చేయవచ్చు. ఆశిష్ లాంచ్‌కు పెద్ద డైరెక్టర్ని పెడదామని శిరీష్ కూడా అన్నాడు. కానీ దానికి నేను వ్యతిరేకం. పెద్ద డైరెక్టర్ అయితే డబ్బు కోసమో, ఆబ్లిగేషన్ కోసమో చేస్తాడు. నాకు ఈ రెండూ ఇష్టం లేవు. ఓ కుర్రాడితో సినిమా చేస్తున్నప్పుడు ఓవర్ బడ్జెట్ పెట్టాలని నాకు లేదు. ఓ కొత్త యాక్టర్‌లానే ఆశిష్‌ను ఎదగనివ్వాలని అనుకున్నాను’’ అని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. Producer Speech About Rowdy Boys Movie Hero: ‘దిల్’ రాజు సోదరుడి కుమారుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీబాయ్స్’. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఇప్పటి స్టార్ హీరోలు కొందరు ఒకప్పుడు మా నిర్మాణ సంస్థ నుంచే లాంచ్ అయ్యారు. అయితే ఆశిష్‌కు నేను ఎవరితో పోలికలు పెట్టను. ఎవరి బ్రాండ్ వారిది. ఇండస్ట్రీలో ప్రస్తుతం 20 మంది హీరోలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా వస్తారు.. వస్తూనే ఉంటారు. కానీ ఇందులో ఎంతమంది హీరోలు నిలబడతారు అనేది వారి హార్డ్ వర్క్, స్క్రిప్ట్ సెలక్షన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఆశిష్‌కు స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో నేను ఉన్నాను కాబట్టి సహాయం చేస్తాను. మూడు నాలుగు సినిమాల తరవాత తనే ఫలానా కథ నచ్చిందని చెప్పేస్తాడు. మంచి కంటెంట్‌కు ఆర్టిస్ట్ కష్టం తోడైతేనే ఆడియన్స్‌కు ఆ ఆర్టిస్ట్ ఎక్కువగా రీచ్ అవుతారని నేను నమ్ముతాను. నా సక్సెస్ రీజన్ కూడా అదే. నేను కూడా స్టోరీలను పట్టుకునే ఇప్పుడు నిర్మాతగా ఈ స్థాయికి చేరుకున్నాను. నా కెరీర్ స్టార్టింగ్‌లో నా మొదటి తొమ్మిది సినిమాలకు ఏ స్టార్ హీరో లేడు. ‘బృందావనం’తో ఎన్టీఆర్ రూపంలో ఆ సమయంలో నాకో స్టార్ హీరో దొరికారు. అప్పటివరకు నేను అప్‌కమింగ్ నిర్మాతగానే కెరీర్లో ముందుకు వెళ్లాను. అదే నా ఫిలాసఫీ. ఇప్పుడు ఆశిష్ కూడా అలానే ఎదగాలని కోరుకుంటున్నాను. ‘ఆశు డ్యాన్స్ బాగా చేస్తున్నాడు... వాడ్ని హీరో చేయండి’ అని నా భార్య అనేవారు. వాడిని అడిగితే, నటనపై ఆసక్తి ఉంది అన్నాడు. ‘ఆసక్తి ఉంటే సరిపోదు. చాలా కష్టపడాలి. మా బ్యాకప్ ఒక సినిమా లేదా రెండు సినిమాలకే ఉపయోగపడుతుంది. ఈలోపు నువ్వు నీ ప్రతిభతో ఆడియన్స్, దర్శకులు, రైటర్స్‌కు రీచ్ కాలేకపోతే నువ్వే ఇబ్బంది పడతావ్’ అని ఆశిష్‌కు చెప్పాను. ఇక ‘రౌడీబాయ్స్’ సినిమా టార్గెట్ యూత్. హర్ష తన లైఫ్‌లోని సంఘటనలతో ఈ సినిమా కథ చెప్పారు... నచ్చింది. ఓకే చేశాను. ఆశిష్ నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు. డ్యాన్సులు చేస్తాడు. ఇక ‘దిల్’ రాజుగారి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతాయనే ఓ బ్రాండ్ ఉంది. కానీ ‘ఏంటి.. ‘దిల్’ రాజు ఎప్పుడూ క్లాసులు పీకుతాడు’’ అనుకున్నవారు కూడా ఉన్నారు. నేను కూడా ఒకే ధోరణిలో సినిమాలు చేస్తే ఆగిపోవాల్సి వస్తుంది. జనరేషన్ మారుతోంది. నాకు కష్టం అనిపించినా ఎక్కడో దాటాలి. ‘రౌడీబాయ్స్’లో ఉన్న ముద్దు సన్నివేశాన్ని ట్రైలర్లోనే చూపించి ఆడియన్స్‌ను ప్రిపేర్ చేశాం. కథ డిమాండ్ చేయడంతో కొన్ని ముద్దు సన్నివేశాలు పెట్టడం జరిగింది. ఓటీటీ వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. నేనూ కథల్ని బట్టి మారుతూ ఉండాలి. ఈ మార్పులో నా ఫస్ట్ స్టెప్ ‘రౌడీబాయ్స్’ సినిమా’’ అన్నారు. అంతా పాజిటివ్... ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిగారితో గురువారం చిరంజీవిగారు సమావేశమయ్యారు. ఈ సమావేశంపై నాకు పూర్తి అవగాహన లేదు. అయితే అంతకుముందు మేం చిరంజీవిగారితో మాట్లాడాం. ఇండస్ట్రీ సమస్యలపై ఆయనకు ఓ అవగాహన ఉంది. చిరంజీవిగారు వెళ్లారు కాబట్టి ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్ముతున్నాను. త్వరలో అంతా పాజిటివ్‌గా జరుగుతుంది. సహనంగా ఉండకుండా కొందరు ఏదో మాట్లాడుతున్నారు. దానివల్ల సమస్యలు జటిలం అవుతున్నాయే కానీ పరిష్కారం కావడం లేదు. పాతిక కిలోల బరువు తగ్గాను – ఆశిష్ ‘‘ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీల్లో నేను డ్యాన్స్ చేసేవాడిని. డ్యాన్స్‌లో అల్లు అర్జున్‌గారు నా ఫేవరెట్. నేను హీరో అవ్వాలనుకుంటున్న విషయాన్ని ఇంట్లో వారికి ప్రూవ్ చేసిన తర్వాత నా జర్నీ స్టార్ట్ చేశాను’’ అన్నారు ఆశిష్. ఇంకా మాట్లాడుతూ – ‘‘అరుణ భిక్షు, సత్యానంద్‌గార్ల దగ్గర, బాంబేలో నటనలో శిక్షణ తీసుకున్నాను. అయితే అనుభవం కోసం ‘కేరింత’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ‘రౌడీ బాయ్స్’ షూటింగ్ ముందు రోజే సీన్ పేపర్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యేవాడిని. రొమాంటిక్ సీన్స్ కాస్త ఇబ్బందిగా అనిపించాయి. నాకు రొమాంటిక్ అండ్ కాలేజ్ స్టోరీలంటే ఇష్టం. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తే అలా వెళ్తాను. హీరోగా మారడానికి 25 కేజీల బరువు తగ్గాను. ఈ సినిమా కెమెరామేన్ మదిగారు చెప్పిన నా లోపాలను సరిదిద్దుకుంటూ యాక్టర్‌గా మెరుగుపడ్డాను. నా తర్వాతి చిత్రం కాశీ దర్శకత్వంలో ‘సెల్ఫిష్’ టైటిల్‌తో చేస్తున్నాను’’ అన్నారు. -
రౌడీ బాయ్స్ దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
లిప్‌లాక్ ట్రోలింగ్‌పై స్పందించిన అనుపమ!
కథ నచ్చితే చాలు స్టార్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేసేందుకు సై అంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ క్రమంలో దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న 'రౌడీ బాయ్స్' సినిమాలో అనుపమ అతడితో జోడీ కట్టింది. ఇటీవల రిలీజైన ట్రైలర్లో ఈ కుర్రహీరోతో లిప్‌లాక్ సీన్లలో నటించింది మలయాళ కుట్టి. ఇది ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతావా? అంటూ ఆమెను ఓ ఆటాడుకుంటూ మీమ్స్ వదిలారు. తాజాగా అనుపమ, ఆశిష్ ఈ ట్రోలింగ్‌పై స్పందించారు. ముద్దు సన్నివేశాలపై వచ్చిన మీమ్స్ చూసి గట్టిగా నవ్వేశారు. అయితే అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నందుకు సారీ చెప్పిన అనుపమ ఇకపై ఆశిష్‌ను టచ్ చేయనని స్పష్టం చేసింది. ఇకపోతే సినిమాలో ముద్దులిచ్చుకుంది తాము కాదని తమ పాత్రలని చెప్పుకొచ్చింది. ఆ సీన్లు ఎందుకున్నాయో సినిమా చూశాక జనాలకే అర్థమవుతుందని తెలిపింది. రౌడీ బాయ్స్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 థియేటర్లలో రిలీజ్ కానుంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘రౌడీ బాయ్స్’తో రామ్ చరణ్ సందడి
-
ప్రతిభే కాదు.. క్రమశిక్షణా ముఖ్యం: రామ్‌చరణ్
‘‘ఇండస్ట్రీలోనే కాదు.. ఏ రంగంలో అయినా ప్రతిభ ఒక్కటే కాదు.. క్రమశిక్షణ ముఖ్యం. క్రమశిక్షణ ఉంటే అవకాశాలు తెచ్చిపెడుతుంది. ప్రతిభ ఉండీ క్రమశిక్షణ లేకుంటే వేస్ట్. మా నాన్నగారు(చిరంజీవి) నాకు డ్యాన్స్, యాక్టింగ్ నేర్పలేదు.. క్రమశిక్షణే నేర్పారు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్’లో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘రౌడీ బాయ్స్’కి అద్భుతమైన పాటలిచ్చిన దేవిశ్రీగారికి థ్యాంక్స్. చదవండి: 'ఆర్ఆర్ఆర్' వాయిదా పై స్పందించిన రామ్ చరణ్ హర్ష.. ఈ సంక్రాంతి నీదే. ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్లో ఆశిష్లోని ఫైర్, ఎనర్జీ, డ్యాన్స్, క్యూట్ నెస్ కనిపించాయి. రాజు, లక్ష్మణ్గార్లు ఉండటం వల్లనో, నేను, మహేశ్ బాబు, ప్రభాస్ సపోర్ట్ చేయడం వల్లనో గొప్ప స్థాయి రాదు.. నీ కష్టమే(ఆశిష్) నిన్ను నిలబెడుతుంది. ప్రతి రోజూ వర్కవుట్స్ చేయడం, సమయానికి సెట్స్‌లో ఉండటం, షూటింగ్ చేయడం బోరింగ్‌గా ఉంటుంది. అయినా ఈ రోజు సక్సెస్ అయిన వారంతా అదేపని చేశారు. యాక్టింగ్ కుటుంబం నుంచి వచ్చిన నేను ‘సైరా’ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినా నా మనసంతా నటనవైపే ఉంటుంది. చదవండి: అప్పుడు భయపడ్డాను.. కానీ ఆ అనుభవం ఉపయోగపడింది: నాగ చైతన్య మీ నాన్న, మీ బాబాయ్ ప్రొడక్షన్లో ఉన్నారు కాబట్టి నువ్వు(ఆశిష్) యాక్టింగ్పైనే దృష్టిపెట్టు. అనుపమా మంచి నటి. ఈ సంక్రాంతికి మా ‘ఆర్ఆర్ఆర్’ రాకపోయినా బాధగా లేదు.. ఎందుకంటే మూడున్నరేళ్లు కష్టపడ్డ సినిమా కరెక్ట్ టైమ్‌లో రావాలి. ఎప్పుడు రావాలన్నది రాజమౌళి, దానయ్యగార్లు నిర్ణయిస్తారు. నన్ను ఆశీర్వదించి నట్లే ఆశిష్‌ని కూడా ఆశీర్వదించండి.. ‘రౌడీ బాయ్స్’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ వేడుకలో డైరెక్టర్స్ వేణు శ్రీరాం, అనిల్ రావిపూడి, ‘ఆదిత్య’ మ్యూజిక్ ఆదిత్య, నిరంజన్, మాధవన్, పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, కృష్ణకాంత్, శ్రీమణి, సహ నిర్మాత హర్షిత్, సింగర్స్ మంగ్లీ, రోల్ రైడా, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రౌడీ బాయ్స్‌ను ‘ప్రేమదేశం’తో పోలుస్తున్నారు, కానీ
‘‘రౌడీ బాయ్స్’ను చాలామంది ‘ప్రేమదేశం’ చిత్రంతో పోలుస్తున్నారు. నా జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ‘రౌడీ బాయ్స్’ను తెరకెక్కించాను’’ అని డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీహర్ష మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘హుషారు’ సక్సెస్ తర్వాత ‘దిల్’ రాజుగారు పిలిచి, కాలేజ్ నేపథ్యంలో ఏదైనా కథ ఉందా? అని అడిగారు. అప్పుడు ‘రౌడీ బాయ్స్’ లైన్ చెప్పాను. ఆ తర్వాత కథను పూర్తిస్థాయిలో వర్కౌట్ చేశాక ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తాడని ‘దిల్’ రాజుగారు అన్నారు. ఆశిష్ కొత్తవాడైనా అనుభవం ఉన్న యాక్టర్లా చేశాడు. రాజుగారు ఈ సినిమాకి స్పెషల్ కేర్ తీసుకోవడం కాస్త ఒత్తిడిగా అనిపించింది కానీ ఫిల్మ్‌మేకింగ్ పరంగా ఏ ఇబ్బందీ లేదు. ప్రతి కాలేజ్‌లో ఫ్రెషర్స్ డే పార్టీ ఉంటుంది. అదే ఫారిన్లో అయితే ‘ఫ్రాన్ నైట్’ అని కపుల్స్‌తో సెలబ్రేట్ చేస్తారు. దీని ఆధారంగానే ఈ సినిమాలో డేట్‌నైట్ కాన్సెప్ట్ ఉంటుంది. హీరో ఎంత క్రేజీగా ఉంటాడో అందుకు అపోజిట్‌గా హీరోయిన్ మెచ్యూర్డ్‌గా ఉండాలి. తెలుగు వచ్చిన హీరోయిన్ అయితే బాగుంటుందనిపించి అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకున్నాం. ఈ సినిమా అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువగా నచ్చుతుంది. ఇందులో విక్రమ్ పాత్ర ఫుల్‌లెంగ్త్‌లో ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. నా తర్వాతి ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ‘రౌడీ బాయ్స్’ రిలీజ్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి’’ అన్నారు. -
తెలుగు సినిమాలు గెలవాల్సిన సమయమిది
‘‘ఈ సంక్రాంతికి చాలా సినిమాలొస్తున్నాయి.. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా, ఆ సినిమా అని కాదు.. తెలుగు సినిమాలు గెలవాల్సిన సమయమిది. మొత్తం తెలుగు సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్క తెలుగే కాదు.. అన్ని భాషల్లోని సినిమాలు బాగుండాలి.. మళ్లీ జనాలు థియేటర్లకు రావాలి’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘డేట్ నైట్..’ అంటూ సాగే పాటను అల్లు అర్జున్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘నా ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలుపెట్టా. ‘దిల్’ రాజుగారు నా ప్రయాణంలో ఒక భాగం. ఆయన లేకుంటే ‘ఆర్య’ లేదు. ‘రౌడీ బాయ్స్’ ఫంక్షన్ నాకు చాలా ప్రత్యేకం, స్వీట్ మెమొరీ. ఇది నా కుటుంబ వేడుక.. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఊరు వెళ్లాల్సినా ఇక్కడికొచ్చాను.. అది నేను చేస్తున్న ఫేవర్ కాదు.. నా బాధ్యత. ఆశిష్‌ని లాంచ్ చేస్తున్న ఈ వేడుకలో నేనూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ చూస్తుంటే ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాల్సిన సినిమా జనవరి 14నే విడుదల చేస్తున్నట్లు ఉంది. శ్రీహర్ష, ఆశిష్, యూనిట్‌కి ఆల్ ది బెస్ట్. లవ్ సాంగ్‌లో ఆశిష్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు. లాక్డౌన్ తర్వాత డిసెంబరులో విడుదలైన సినిమాలు (అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్) సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చాలా బాగుంది. నాని, సాయిపల్లవి నటన బాగుంది. డైరెక్టర్ రాహుల్ బాగా తీశాడు. ఎవరైనా సినిమా చూడకుండా ఉంటే ఓటీటీలో వచ్చినప్పుడైనా చూడండి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2004 జనవరి 1న ‘ఆర్య’ సినిమాలోని ‘తకదిమితోం తకదిమి తోం..’ పాట వైజాగ్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆశిష్‌కి ఏడేళ్లు. ఆ పాటకి బన్ని(అల్లు అర్జున్) డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తున్నాడు. అలాంటిది ఆశిష్ హీరోగా నటించిన సినిమాలోని డ్యాన్స్ సాంగ్‌ను బన్నీ విడుదల చేయడం నిజంగా ఆశిష్ జీవితంలో మరచిపోలేని రోజు. ఈ సంక్రాంతికి మా బ్యానర్ నుంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ వస్తోంది. ‘ప్రేమదేశం, తొలిప్రేమ, ఆర్య, హ్యాపీడేస్’ ఇలా ఔట్ అండ్ ఔట్ యూత్ కంటెంట్ చిత్రమిది. హర్ష రెండుమూడేళ్లు ప్రయాణం చేసి ఆశిష్ భవిష్యత్తుకు ‘రౌడీ బాయ్స్’ లాంటి మంచి సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్స్. మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కుటుంబ విలువలతో సాగుతాయి. కానీ ‘రౌడీ బాయ్స్’ కోసం కొన్ని హద్దులు దాటాం. మా సంస్థ నుంచి సంక్రాంతికి ఇప్పటి వరకూ 5 సినిమాలొస్తే అన్నీ హిట్ అయ్యాయి.. ఈ ‘రౌడీ బాయ్స్’ కూడా హిట్ కొడితే సెకండ్ హ్యాట్రిక్ పూర్తి చేసినట్టు అవుతుంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆశిష్ మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్ అన్నకి చాలా అంకితభావం, కమిట్మెంట్ ఉంది.. అలాంటి డెడికేషన్ ఉంటేనే సినిమాల్లోకి రావాలని ‘ఆర్య’ సమయంలో ఫిక్స్ అయ్యాను. ఆయన డ్యాన్స్‌తో పోలిస్తే నా డ్యాన్స్ కొంచెమే అనిపిస్తోంది. ఆయన ఎప్పటి నుంచో పాన్ ఇండియా స్టారే’’ అన్నారు. ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరం జన్, మాధవన్ పాల్గొన్నారు. -
మా ఫ్యామిలీ నుంచి హీరో పరిచయం అవడం హ్యాపీగా ఉంది: దిల్ రాజు
ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ మాట్లాడుతూ– ‘‘కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రౌడీ బాయ్స్’. యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం నిర్మించాం. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయమవుతుండటం హ్యాపీగా ఉంది. ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్స్, నటన ఆకట్టుకుంటాయి’’ అన్నారు. -
రౌడీ బాయ్స్: బృందావనం లిరికల్ సాంగ్ రిలీజ్
Rowdy Boys: Anupama Parameswaran Amazing in Brindavanam: దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి తొలి డెబ్యూ సినిమా రౌడీ బాయ్స్. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా బృందావనం అనే సాంగ్‌ను విడుదల చేశారు. సుద్దాల అశోక్ లిరిక్స్ అందించగా, మంగ్లీ తన వాయిస్‌తో మరోసారి ఆకట్టుకుంది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ప్రమాదం కాదు.. పథకం ప్రకారమే చంపేశారు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. ఆందోళన చేస్తున్న రైతులను చంపాలన్న ఉద్దేశంతోనే ఈ మారణ హోమానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతో సహా నిందితులపై మోపిన అభియోగాలను సవరించాలని సిట్ అధికారులు న్యాయమూర్తికి లేఖ రాశారు. నిందితులపై పెట్టిన ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలను సవరించి... హత్యానేరం మోపాలని కోరారు. లఖింపూర్ ఖేరీ ఘటన ప్రమాదవశాత్తు జరలేదని, పథకం ప్రకారం జరిగిందని విచారణాధికారి విద్యారామ్ దివాకర్ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన లఖింపూర్ జిల్లా కోర్టు నిందితులందరినీ మంగళవారం న్యాయస్థానానికి పిలిపించింది. కాగా, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఈరోజు జైలులో తన కుమారుడు ఆశిష్ మిశ్రాను కలిశారు. (చదవండి: మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!) అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి తన కారుతో ఆశిష్ మిశ్రా దూసుకురావడంతో నలుగురు అన్నదాతలు, జర్నలిస్ట్ చనిపోయారు. తర్వాత ఆందోళన కారులు జరిపిన దాడిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతోపాటు ఇతర నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. (చదవండి: సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు!) -
భారత్ ఫైనాన్షియల్ ఎండీ, ఈడీల రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భాగమైన భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో శలభ్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సీఎఫ్‌వో ఆశీష్ దమానీ తమ పదవులకు రాజీనామా చేశారు. పోటీ కంపెనీ అయిన సూక్ష్మ రుణాల సంస్థ స్పందన స్ఫూర్తిలో (ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్) వారు చేరనున్నట్లు సమాచారం. సక్సేనా, దమానీ నవంబర్ 25న తమ తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఎక్సే్చంజీలకు బీఎఫ్ఐఎల్ సోమవారం తెలియజేసింది. తాత్కాలికంగా ఈడీ హోదాలో జే శ్రీధరన్‌ను, రోజు వారీ కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీనివాస్ బోనం ను నియమించినట్లు పేర్కొంది. సక్సేనా, దమానీల విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. సక్సేనాను ఎండీ–సీఈవోగా, దమానీని ప్రెసిడెంట్–సీఎఫ్‌వోగా నియమించినట్లు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ఎల్ నవంబర్ 22న ప్రకటించింది. అయితే, వారు తమ సంస్థలో రాజీనామా చెయ్యలేదంటూ ఆ మరుసటి రోజైన నవంబర్ 23న బీఎఫ్ఐఎల్ తెలిపింది. ఒకవేళ చేస్తే.. నిర్దిష్ట షరతులకు అనుగుణం గా వారు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు పీరియడ్, పోటీ సంస్థలో చేరకూడదు వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటికైతే మాత్రం వారిద్దరూ తమ సంస్థలోనే కొనసాగుతున్నారని బీఎఫ్ఐఎల్ స్పష్టం చేసింది. కస్టమర్ల సమ్మతి లేకుండా సాంకేతిక లోపం వల్ల 84,000 రుణాలు మంజూరైన అంశంపై సమీక్షలో సహకరిస్తామంటూ వారు చెప్పినట్లు పేర్కొంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సక్సేనా, దమానీకి వర్తింపచేసే నిబంధనల అమలుపై బీఎఫ్ఐఎల్ వివరణ ఇవ్వలేదు. -
Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆశిష్ రైతులపై కావాలనే కాల్పులు జరిపినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఆశిష్‌తోపాటు అంకిత్‌దాస్ కూడా కాల్పులు జరిపినట్లు ఎఫ్ఎస్ఎల్ తమ నివేదికలో పేర్కొంది. రైతులపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. చదవండి: మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..! -
బీజేపీ అనే వైరస్‌కు వ్యాక్సిన్ మమతే.. అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు
అగర్తలా: తృణమూల్ కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి రజీబ్ బెనర్జీ, త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అశిష్‌దాస్ శనివారం త్రిపురలోని అగర్తలాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ గూటికి చేరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. 2011, 2016లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన రజీబ్ గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి దోమ్జూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తృణమూల్ అధికారంలోకి రావడంతో బీజేపీ నుంచి మళ్లీ మాతృసంస్థకి చేరుకున్నారు. గోవా నుంచి త్రిపుర వరకు పార్టీని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అగర్తాలలో తృణమూల్ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈసారి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, రైట్ అందరినీ మట్టికరిపిస్తామని అభిషేక్ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ అనే వైరస్‌కి వ్యాక్సిన్ ఒక్కటే ఉంది. దాని పేరు మమతా బెనర్జీ. త్రిపుర ఓటర్లు ఆ వైరస్‌కి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి. మొదటిది వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండో డోసు ఇవ్వాలి’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అగర్తలా ర్యాలీ నిర్వహించాలని గత కొద్ది రోజులుగా టీఎంసీ ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అడ్డు చెబుతూ వస్తోంది. కరోనా నిబంధనల వల్ల ర్యాలీలకు అనుమతించేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో టీఎంసీ కోర్టుకెళ్లింది. చివరికి త్రిపుర హైకోర్టు ర్యాలీకి అనుమతించింది. -
‘రౌడీబాయ్స్’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ సందడి
-
మేమిద్దరం ఇండస్ట్రీకి రావాలని కలలు కనేవాళ్లం: విజయ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, ఫస్ట్సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. ‘ప్రేమ ఆకాశమైతే...’ అంటూ సాగే ఈ పాటే యంగ్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. శ్రీమణి రాసిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చగా జస్ప్రీత్ జస్జ్ ఆలపించారు. చదవండి: ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..! ఈ పాట విడుదల అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ‘‘హర్ష, నేను ఇండస్ట్రీలోకి రావాలని కలలు కనేవాళ్ళం. హర్షకు కాలేజ్ మీటర్ బాగా తెలుసు. హర్ష దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘హుషారు’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నా. ఇక తొలి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను ఆశిష్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ‘పెళ్ళి చూపులు’ స్ట్రాంగ్‌గా గుర్తుండిపోయింది. ఆశిష్‌లో నాకో సిన్సియారిటీ కనిపిస్తుంది. ‘రౌడీ బాయ్స్’ స్టార్ట్ కావడానికి ముందు ఓసారి నన్ను కలిశాడు. అతనిలో నటన పట్ల ఆసక్తి, తపన కనిపించాయి. ఆశిష్... మీ నాన్న (శిరీష్), బాబాయ్ (‘దిల్’ రాజు) చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. నువ్వు.. వారు గర్వపడేలా చేస్తావని ఆశిస్తున్నాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ప్రభాస్ బర్త్‌డే: రాధే శ్యామ్ నుంచి రానున్న బిగ్ సర్ప్రైజ్ -
సీన్ రీక్రియేషన్.. లఖీమ్‌పూర్‌కు ఆశిష్ మిశ్రా
అఖీమ్‌పూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన కార్యాచరణను వేగవంతంగా చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు, ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతోపాటు ఇదే కేసులో అరెస్టు చేసిన మరో ముగ్గురిని గురువారం ఘటనా స్థలానికి తీసుకొచి్చంది. హింసకు దారితీసిన పరిణామాలను తెలుసుకొనేందుకు లఖీమ్‌పూర్‌లో చోటుచేసుకున్న వరుస ఘటనలను రీక్రియేట్ చేసింది. రైతుల స్థానంలో కొన్ని బొమ్మలను పెట్టి, వాహనంతో ఢీకొట్టించినట్లు తెలుస్తోంది. పటిష్టమైన భద్రత మధ్య నిందితులను టికోనియా–బన్బరీపూర్ రోడ్డులో ఘటనా స్థలానికి చేర్చారు. అక్టోబర్ 3న జరిగిన ఘటనపై వారిని ప్రశ్నించారు. అంతకముందు అధికారులు జిల్లా జైలుకు చేరుకొని, నిందితులు దాస్, లతీఫ్, భారతిని తమ కస్టడీలోకి తీసుకొని, లఖీమ్‌పూర్‌కు బయలుదేరారు. ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను పోలీసు కార్యాలయం నుంచి తీసుకొచ్చారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రం లఖీమ్‌పూర్ సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 3న రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం చెలరేగిన హింసాకాండలో మరో నలుగురు బలయ్యారు. వీరిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. -
పోలీస్ కస్టడీకి ఆశిష్
లఖీమ్‌పూర్‌ఖేరి/బహ్రెయిచ్: లఖీమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈనెల 3వ తేదీన జరిగిన ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాను పోలీసులు 14 రోజుల రిమాండ్ కోరగా.. 12 నుంచి 15వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిందని అధికారులు తెలిపారు. 15వ తేదీ ఉదయంతో రిమాండ్ గడువు ముగియనుంది. ఈ సమయంలో ఆశిష్ మిశ్రాను ఇబ్బందిపెట్టరాదనీ, విచారణ సమయంలో లాయర్ ఆయన పక్కనే ఉంటారని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చింతారాం షరతు విధించారు. అంతకుముందు, ఓ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. టింకోనియాలో నేడు అంతిమ్ అర్థాస్ లఖీమ్‌పూర్ ఖేరిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు మంగళవారం అంతిమ్ అర్థాస్ (అంతిమ ప్రార్థన) జరుపుతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తెలిపింది. అసువులు బాసిన రైతులకు నివాళులర్పించేందుకు మంగళవారం షహీద్ కిసాన్ దివస్‌గా పాటించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా రైతులు తమ నివాసాల వెలుపల కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని కోరింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న టికోనియా గ్రామంలో జరిగే అంతిమ ప్రార్థన కార్యక్రమానికి రాకేశ్ తికాయత్ సహా రైతు నేతలు తరలిరానున్నారు. ఇలా ఉండగా, లఖీమ్‌పూర్‌ఖేరి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సోమవారం లక్నోలో జీపీవో పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. -
ఆ సమయంలో ఆశిష్ ఎక్కడ?
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనలో హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సిట్ విచారణలో పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు చాలా ప్రశ్నలకి ఆయన సమాధానమే ఇవ్వలేదని సమాచారం. నలుగురు రైతుల్ని బలిగొన్న వాహనం దూసుకుపోయిన ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఎక్కడ ఉన్నాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల్లో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు లఖీమ్‌పూర్ ఖేరిలో హింస చెలరేగినప్పుడు తాను అక్కడికి 4–5 కి.మీ. దూరంలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల వద్ద ఉన్నట్టుగా ఆశిష్ విచారణలో వెల్లడించారు. అజయ్ మిశ్రా స్వగ్రామమైన భవానీపూర్‌లో నిర్వహించిన ఈ రెజ్లింగ్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవడానికి కేంద్ర మంత్రి వెళుతుండగానే అక్టోబర్ 3న హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ఎదుట లొంగిపోయిన ఆశిష్‌ని 12 గంటల సేపు ప్రశ్నించిన తర్వాత శనివారం అర్ధరాత్రి దాటాక మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా... అతనిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్పీ యాదవ్ చెప్పారు. తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేశారు. ఆ మూడు పాయింట్లు.. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన మూడు పాయింట్లు గమనిస్తే ఆశిష్ వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని అర్థమవుతోందని సిట్ పోలీసులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం... ► లఖీమ్‌పూర్ ఖేరిలో వాహనం దూసుకుపోయిన ఘటన జరిగినప్పుడు తాను రెజ్లింగ్ కార్యక్రమంలో ఉన్నానని ఆశిష్ చెప్పారు. అయితే రెజ్లింగ్ కార్యక్రమం దగ్గర పహారాగా ఉన్న పోలీసు సిబ్బంది ఆశిష్ ఆ కార్యక్రమానికి వచ్చినప్పటికీ 2 నుంచి 4 గంటల మధ్య కనిపించకుండా పోయారని వెల్లడించారు. ► ఆశిష్ మిశ్రా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆయన ఉండే ప్రాంతాన్ని పరిశీలిస్తే ఆ సమయంలో హింసాకాండ జరిగిన స్థలంలోనే ఉన్నారని తేలింది. ఇదే విషయాన్ని సిట్ అధికారులు నిగ్గదీసి అడిగితే ఆశిష్ మళ్లీ మాట మార్చి ఆ సమయంలో తాను తమ రైస్‌మిల్లుకి కూడా వెళ్లానని, హింస చెలరేగిన ప్రాంతానికి అది దగ్గరలో ఉందని, ఈ రెండు ప్రదేశాలు ఒకే మొబైల్ టవర్ కిందకి వస్తాయంటూ వాదించారు. ఈ రెండు అంశాలూ ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా ఉండబట్టే అరెస్టు జరిగిందని సమాచారం. ► రైతుల ఊసే లేకుండా దాఖలు చేసిన రెండో ఎఫ్ఐఆర్ (డ్రైవర్‌ను, బీజేపీ కార్యకర్తలను ఆందోళనకారులు కొట్టి చంపిన కేసు)లో పరిశీలించినా ఆశిష్ అన్నీ నిజాలు చెప్పడం లేదని అర్థమవుతుంది. రైతుల మీదకి దూసుకుపోయిన వాహనం తనదేనని అంగీకరించిన ఆశిష్ ఆ సమయలో తాను అందులో లేనని మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్లో ఆశిష్ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవింగ్ సీటులో ఉన్నది ఆశిష్ కాదని, అతని డ్రైవర్ హరిఓం అని చెబుతున్నారు. డ్రైవింగ్ సీటులో డ్రైవర్ హరిఓం ఉన్నాడని, అతను తెల్ల చొక్కా లేదంటే కుర్తా ధరించాడని ఎఫ్ఐఆర్లో కూడా రాశారు. వీడియో పరిశీలనలో కూడా తెల్లచొక్కా ధరించిన వ్యక్తే నడుపుతున్న పోలీసులు గుర్తించారు. అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన డ్రైవర్ మృతదేహంపై పసుపు చొక్కా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆశిష్ వాస్తవాలు దాచి పెడుతున్నారని తెలుస్తోందని సిట్ పోలీసుల వాదనగా ఉంది. -
‘రౌడీ బాయ్స్’ మూవీ టైటిల్ సాంగ్ విడుదల
‘‘ప్రేమదేశం, హ్యాపీ డేస్’ చిత్రాలు యువతను షేక్ చేశాయి. ఆశిష్‌తో మేం సినిమా అనుకున్నప్పుడు అలాంటి ఔట్ అండ్ ఔట్ కాలేజ్ యూత్ స్టోరీ కావాలని శ్రీహర్షను అడిగాను. తన కాలే జ్ లైఫ్‌లో జరిగిన çఘటనలతో కథ రాసుకుని, ‘రౌడీ బాయ్స్’ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి (శిరీష్ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విక్రమ్ మరో హీరో. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో కలసి ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘రౌడీ బాయ్స్’ టైటిల్ సాంగ్‌ను వైజాగ్‌లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నాలుగేళ్ల జర్నీ ఈ చిత్రం. రెండు కాలేజీల మధ్య జరుగుతుంది. రౌడీ బాయ్స్ గుడ్ బాయ్స్ ఎలా అయ్యారనేదే కథ. దసరాకు సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. శ్రీహర్ష, ఆశిష్, విక్రమ్, ‘ఆదిత్య’ నిరంజన్, రోల్ రైడా పాల్గొన్నారు. -
హీరోగా దిల్‌రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్‌లుక్ రిలీజ్
‘‘హీరోగా చాలామంది వస్తారు. కానీ సక్సెస్ కావడం కష్టం. ఇది ఆశిష్‌కు బిగ్ టార్గెట్. ఎంత జడ్జ్మెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు పాస్ మార్కులు వేసేంతవరకు టెన్షన్ పడతాం. ఆశిష్‌ను లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ సినిమాకు కాస్త ఎక్కువ టెన్షన్ పడుతున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ‘రౌడీ బాయ్స్’ అక్టోబరులో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకులు వీవీ వినాయక్, మోషన్ పోస్టర్‌ను సుకుమార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘హీరోగా సక్సెస్ కాకపోతే మరో ఆప్షన్ పెట్టుకోవాలని ఆశిష్‌ను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆశిష్ డ్యాన్స్, ఎనర్జీ లెవల్స్ బాగుంటాయి. సక్సెస్ అవుతాడనే నమ్మకం ఉంది. దర్శకుడు హర్ష బాగా తీశాడు. సక్సెస్ఫుల్ సినిమా తీశానని నిర్మాతగా నేనూ నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘ఒకవేళ ఫెయిల్ అయితే ఆశిష్ దేనికైనా ప్రిపేర్డ్‌గా ఉండాలని ‘దిల్’ రాజు చెబుతున్నాడు. కానీ ఆశిష్‌కు ఏ ఆప్షన్స్ అవసరం లేదు. కొన్ని సీన్స్ చూశాను. బాగా చేశాడనిపించింది’’ అన్నారు వినాయక్. ‘‘రౌడీ బాయ్స్’లో కొన్ని రొమాంటిక్ సీన్స్ చూశాను. ఆశిష్ బాగా చేశాడు’’ అన్నారు సుకుమార్. ‘‘నేను యాక్టర్ కావాలని ఫస్ట్ కోరుకున్నది అనితా (‘దిల్’ రాజు మొదటి భార్య) ఆంటీ. ఆమె లేరు. యాక్టర్‌గా నన్ను గుర్తించిన అనిరతా ఆంటీకి ధన్యవాదాలు’’ అన్నారు ఆశిష్. ‘‘రౌడీ బాయ్స్’ విడుదల తర్వాత ఆశిష్ ఫాదర్ శిరీష్ అని చెప్పుకుంటారు. ఆ రేంజ్లో ఆశిష్ నటించాడు’’ అన్నారు హర్ష. ఈ కార్యక్రమంలో నిర్మాతలు లక్ష్మణ్, లగడపాటి శ్రీధర్, శిరీష్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ పాల్గొన్నారు. చదవండి : ముచ్చటగా మూడోసారి!..బుట్టబొమ్మతో బన్నీ స్టెప్పులు మోహన్ లాల్, మమ్ముట్టిలకు యూఏఈ అరుదైన గౌరవం -
సీతారాం ఏచూరి కొడుకు మృతి: ప్రముఖుల సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి కుమారుడు మృతి చెందడం విచారకరం. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇటీవల ఆశిష్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఆశిష్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీతారాం ఏచూరి ట్విటర్లో పేర్కొన్నారు. Condolences to Shri Sitaram Yechury Ji and his family on the tragic and untimely demise of his son, Ashish. Om Shanti. — Narendra Modi (@narendramodi) April 22, 2021 ప్రముఖల సంతాపం ► సీపీఎం నేత సీతారాం ఏచూరి పెద్దకుమారుడి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబానికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచివేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2021 ► ఆశిష్ ఏచూరి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘డియర్ కామ్రేడ్ సీతారాం, మీ నుంచి ఆశిష్ దూరమైనందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్లిష్టమైన సమయంలో మా ఆలోచనలు మీకు, మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాయి’అని ఆయన ట్వీట్ చేశారు. ► కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ సీపీఎం నేత సీతారాం ఏచూరి పెద్దకుమారుడి మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. ‘ఈ వార్త వినటం చాలా విచారకరం.తల్లిదండ్రులకు ఇంత కంటే పెద్ద నష్టం మరోటి ఉండదు.ఈ నష్టం పూడ్చలేనిది. దు:ఖాన్ని తట్టుకునే శక్తిని కలిగిఉండండి. ఈ బాధకరమైన సమయంలో నా హృదయం బరువెక్కింది’ అని ఆయన ట్వీట్ చేశారు. ► ఆశిష్ ఏచూరి మృతి పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) నేత కవితా కృష్ణన్ విచారం వ్యక్తం చేశారు. ‘డియర్ కామ్రేడ్, ఈ విషాదం గురించి విని షాక్‌కు గురయ్యాము. మీకు, మీకు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఆమె ట్వీట్ చేశారు. ► ఆశిష్ ఏచూరి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. -
కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి మరణించారు. ఇటీవల ఆశిష్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఆశిష్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీతారాం ఏచూరి ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఈ రోజు ఉదయం నా పెద్ద కొడుకు ఆశిష్ ఏచూరీ కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. ఆశిష్‌ను బతికించడానికి చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మాకు అండగా నిలిచారు’ అని ఆయన ట్వీట్ చేశారు. 34 ఏళ్ల ఆశిష్ ఓ ప్రముఖ వార్తాపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. It is with great sadness that I have to inform that I lost my elder son, Ashish Yechury to COVID-19 this morning. I want to thank all those who gave us hope and who treated him - doctors, nurses, frontline health workers, sanitation workers and innumerable others who stood by us. — Sitaram Yechury (@SitaramYechury) April 22, 2021 మరో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో మరో కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి డాక్టర్ ఎ.కె.వాలియా గురువారం మృతి చెందారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనకు చికిత్స అందించడం కోసం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. వాలియా వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చదవండి: రాష్ట్రాలకు రూ.400లకు డోసు -
దీన స్థితి: ప్రముఖ నటుడు మృతి
ముంబై: బాలీవుడ్ నటుడు ఆశిష్ రాయ్(55) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ఉదయం 3.45 నిమిషాల ప్రాంతంలో ఆయన కుప్పకూలిపోయారు. గత కొన్ని నెలలుగా డయాలసిస్ జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది అనుకునేలోపే ఇలా జరిగిపోయింది. ఆయన సోదరి కోల్‌కతా నుంచి సాయంత్రం ఇక్కడికి వస్తారు. అప్పుడే అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతాయి’’ అని పేర్కొన్నారు. కాగా సినీ, టీవీ ఆర్టిస్టు అసోసియేషన్(సింటా) ఆశిష్ రాయ్ మృతిపై సంతాపం వ్యక్తం చేసింది. ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా, అశ్విని చౌదరి సహా నటులు సూరజ్ థాపర్, ఆసిఫ్ షేక్, టినా ఘాయ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. (చదవండి: మరో విషాదం : కమెడియన్ కన్నుమూత) ఇక పలు సినిమాల్లో నటించిన ఆశిష్ రాయ్.. బనేగీ అప్నీ బాత్, ససురాల్ సిమర్ కా, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ వంటి హిందీ హిట్ సీరియల్స్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. కాగా కిడ్నీలు పాడైపోవడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనను.. బిల్లు కట్టలేదన్న కారణంతో ఈ ఏడాది జూన్‌లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆశిష్ రాయ్.. పెద్ద మనసుతో తనను ఆదుకోవాల్సిందిగా అభిమానులు, సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు. తన వద్ద డబ్బు లేదని, కానీ బతకాలని ఉందంటూ తన దీనస్థితిని వివరించారు. సల్మాన్ ఖాన్ వంటి అగ్ర నటులను కూడా సాయం కోసం అర్థించానని, అయినా ఫలితం లభించలేందంటూ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశిష్ చెప్పుకొచ్చారు. -
చైనా నుంచి భారత్‌కు వాన్‌వెలక్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో చైనా నుంచి దిగ్గజ కంపెనీలు తరలిపోతున్నాయి. తాజాగా వాన్‌వెలక్స్ బ్రాండ్ పేరుతో సౌఖ్యవంతమైన పాదరక్షలు తయారు చేసే జర్మనీకి చెందిన కాసా ఎవర్జ్ జీఎమ్‌బీహెచ్ ఈ జాబితాలో చేరింది. ఏడాదికి 30 లక్షల పాదరక్షల తయారీని ఈ కంపెనీ చైనా నుంచి భారత్‌కు తరలిస్తోంది. ఆరంభంలో ఈ కంపెనీ రూ.110 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నదని లాట్రిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, సీఈఓ ఆశీష్ జైన్ పేర్కొన్నారు. వాన్‌వెలక్స్ బ్రాండ్‌కు భారత్‌లో లైసెన్సీ సంస్థగా లాట్రిక్ ఇండస్ట్రీస్ వ్యవహరిస్తోంది. లాట్రిక్ సంస్థ ఏడాదికి 10 లక్షల పాదరక్షలను కాసా ఎవర్జ్‌కు తయారు చేస్తోంది. రెండేళ్లలో ఏర్పాటు...: ఏడాదికి 30 లక్షలకు పైగా పాదరక్షలు ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రెండేళ్లలో ఏర్పాటు చేయనున్నామని ఆశీష్ జైన్ వెల్లడించారు. పాదరక్షల తయారీలో కార్మికులు, ముడి పదార్థాలు కీలకమన్నారు. ఈ రెండు అంశాల్లో భారత్ ఆకర్షణీయంగా ఉండటంతో చైనా నుంచి భారత్‌కు తన ప్లాంట్‌ను కాసా ఎవర్జ్ కంపెనీ తరలిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో భారత్ భవిష్యత్ తయారీ కేంద్రంగా అవతరించనున్నదని వ్యాఖ్యానించారు. 80 దేశాల్లో విక్రయాలు...: కాసా ఎవర్జ్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18 ప్లాంట్లు ఉన్నాయి. 12 లైసెన్సీ సంస్థలతో 80 దేశాల్లో విక్రయాలు జరుపుతోంది. భారత్‌లో 2019లో ఈ బ్రాండ్ పాదరక్షల విక్రయాలు మొదలయ్యాయి. -
గౌరవ్, ఆశిష్ శుభారంభం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు గౌరవ్ సోలంకి, ఆశిష్ కుమార్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల 57 కేజీల తొలి రౌండ్ బౌట్లో గౌరవ్ 5–0తో అకైల్బెక్ ఎసెన్బెక్ ఊలు (కిర్గిస్తాన్)పై, 75 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత ఆశిష్ 5–0తో కాన్ చియా వీ (చైనీస్ తైపీ)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ మిరాజిజ్‌బెక్ (ఉజ్బెకిస్తాన్)తో గౌరవ్; ఒముర్బెక్ బెక్జిగిత్ ఊలు (కిర్గిస్తాన్)తో ఆశిష్ తలపడతారు. మహిళల విభాగంలో లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు)... పురుషుల విభాగంలో సతీశ్ కుమార్ (+91 కేజీలు) ఒలింపిక్ బెర్త్‌లకు విజయం దూరంలోనే ఉన్నారు. ఈ విభాగాల్లో ఎంట్రీల సంఖ్య తక్కువగా ఉండటం... నాలుగేసి బెర్త్‌లు ఉండటంతో భారత బాక్సర్లు ఓ విజయం సాధిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
పబ్‌లో వీరంగం; పరారీలో ఆశిష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌లో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్, అతని స్నేహితులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక మద్యం బాటిళ్లతో దాడికి యత్నించారని బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశిష్ గౌడ్ స్నేహితులు ముత్తంగికి చెందిన గౌండ్ల శ్రీకాంత్ అలియాస్ బిన్ను, ఇస్నాపూర్‌కు చెందిన పూసాని పవన్ కుమార్ గౌడ్‌ను బుధవారం అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అశిష్ గౌడ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా బాధితురాలు సంజన బుధ వారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిస్ట్రీ పబ్‌లోని సీసీ పుటేజీని చూపించాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని, తాను గుర్తించకుండా నిందితులను ఎలా అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఒకపక్క దిశ హత్యోందంతో మహిళల భద్రతపై ఆందోళన జరుగుతుండగా పోలీసులు ఈ కేసులో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకుడి కుమారుడు కావడం వల్లే అశిష్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. అశిష్ గౌడ్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, భారతీయ యువ మోర్చా నుంచి ఆశిష్‌ను బీజేపీ ఇప్పటికే తొలగించింది. మహిళల భద్రతకు, సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. స్త్రీలపై ఎటువంటి దాడులు చేసినా సహించబోమని సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఎం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత వార్తలు పబ్‌లో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన
సాక్షి, హైదరాబాద్ : పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంజన బుధవారం మరోసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే పోలీసులు సంజనను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచారా లేక, కేసు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఆదివారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌కు వెళ్లిన తనను.. ఆశిష్ చెప్పలేని రీతిలో దూషించినట్టు సంజన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్ తమపైకి ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడని.. ఆ ప్రమాదం నుంచి తన స్నేహితురాలు తృటిలో తప్పించుకుందని ఆమె తెలిపారు. దీంతో తాము పోలీసులకు ఫోన్ చేశామని చెప్పారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆశిష్ ఖండించారు. తను నోవాటెల్‌కు వెళ్లిన విషయం వాస్తమమేనని.. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశిష్ చెప్పారు. చదవండి : నందీశ్వర్ గౌడ్ కుమారుడిపై కేసు నమోదు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు
సాక్షి, హైదరాబాద్ : వేధింపులకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ ఖండించారు. నోవాటెల్ హోటల్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశీష్ గౌడ్ చెప్పారు. మరోవైపు ఆశీష్ గౌడ్ తమతో అసభ్యం ప్రవర్తించడమే కాకుండా, మద్యం బాటిళ్లతో దాడి చేసి...మొదటి అంతస్తు నుంచి తోసివేసే ప్రయత్నం చేశారంటూ బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన ఆదివారం మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆశీష్ గౌడ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: సంజనాతో మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్య ప్రవర్తన -
నన్నే గుర్తు పట్టలేదా అంటూ వీరంగం..
సాక్షి, హైదరాబాద్ : పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌లోయువతులపై వీరంగం సృష్టించాడు. దీంతో బాధితురాలు బిగ్ బాస్ –2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బిగ్ బాస్–2 కాంటెస్టెంట్ అన్నె సంజన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్‌లతో కలిసి ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లింది. మొదటి అంతస్తులోని టేబుల్ వద్ద ఉండగా కింది ఫ్లోర్లో ఉన్న అశిష్ గౌడ్ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్ గౌడ్ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను ఇగో ఎక్కువ .. ఎందుకు గుర్తు పడతావంటూ చెప్పలేని రీతిలో దూషణలకు దిగాడు. అంతటితో ఆగక ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడు. వి.సంజన అనే యువతి తృటిలో తప్పించుకుంది. సంజన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహితుడు రమేష్ అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. అక్కడే ఉన్న బౌన్సర్ అజార్ పట్టించుకోకపోవడంతో అశీష్ మరింత రెచ్చిపోయాడు. 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూ మ్కు ఫోన్ చేయడంతో 15 నిమిషాల వ్యవధిలో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బౌన్సర్లు యువతులను వెనక ద్వారం వద్ద ఉంచి అశిష్ గౌడ్ అతని స్నేహితులను ప్రధాన ద్వారం నుంచి బయటకు పంపారు. సంజనతో పాటు మరో మగ్గురు స్నేహితులు కలిసి తెల్లవారు జామున 4.30 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 354, 354ఏ, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాటిళ్లు విసిరి, తోసేశాడు... గుర్తు పట్టలేదన్నందుకు మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడని బాధితురాలు అన్నె సంజన ‘సాక్షి’కి తెలిపారు. బూతులు తిడుతూ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. ఆర్టిస్ట్రి పబ్ యాజామాన్యానికి కాల్ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాస్ సీసీ పుటేజి స్పష్టంగా లేదని చెబుతున్నాడని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని అశిష్ గౌడ్ చాలా మందితో ఫోన్లు చేయిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఆ పబ్‌కు నిబంధనలు వర్తించవు... నోవాటెల్ వీకెండ్లో పబ్‌లకు రాత్రి 1 గంటలకు పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతి వీకెండ్లో తెల్లవారు జామున 3.30 గంటల వరకు నోవాటెల్‌లోని అర్టిస్ట్రీ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గలాట జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్వో టీ పోలీసులు పబ్‌లపై నిఘా ఉంచుతున్నారు. తెల్లవారుజాము వరకు ఆర్టిస్ట్రీ పబ్ నడిచినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. స్నేహితుడి కూతురితో అసభ్య ప్రవర్తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు మైనర్ బాలికకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ హాబీబుల్లా ఖాన్ తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్ రాయల్ డిమ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహ్మద్ వాహిదోద్దిన్ (43) హరియంత్ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్నేళ్లనుంచి మహ్మద్ వాహిదోద్దీన్ ఖాన్‌కు పంకజ్‌తో స్నేహం ఏర్పడింది. వాహిదోద్దీన్ తరచుగా ఇసామియా బజార్లో ఉంటున్న పంకజ్ ఇంటికి వచ్చి వెళ్లుతున్నాడు. దీంతో ఇంటర్మీడియట్ చదువుతున్న పంకజ్ కూతురు (17)తో వాహీదోద్దీన్ పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా, మందలించినా వాహిదోద్దీన్ ఖాన్‌లో ఏమాత్రం మార్పురాలేదు. శనివారం రాత్రి పంకజ్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు వాహిదోద్దిన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. -
ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు రెండు రజతాలు
ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో ఫౌద్ మీర్జా... టీమ్ విభాగంలో ఫౌద్ మీర్జా, రాకేశ్, ఆశిష్, జితేందర్ సింగ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. 1982 ఆసియా క్రీడల్లో రఘువీర్ సింగ్ తర్వాత 36 ఏళ్లలో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున పతకం నెగ్గిన ప్లేయర్‌గా ఫౌద్ మీర్జా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఈవెంట్లో మీర్జా 26.40 జంపింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. యొషియాకి (జపాన్–22.70 పాయింట్లు) స్వర్ణం సాధించాడు. -
ఆర్మీ శిబిరానికి ఆమె తండ్రి పేరు
భారత్, చైనా సరిహద్దుల్లో.. కొన్ని వేల అడుగుల ఎత్తులో.. అంతకంటే ఎత్తుకి సమున్నతంగా ఎదిగిన తన తండ్రి గొప్పతనాన్ని తెలుసుకున్న ఆ ఆర్మీ ఆఫీసర్ ఆనందానికి అవధులే లేవు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఒక యువ లేడీ లెఫ్ట్‌నెంట్ ఇటీవల తవాంగ్ సెక్టార్లో బాధ్యతలు స్వీకరించింది. విధి నిర్వహణలో భాగంగా సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న కైఫోకు చేరుకుంది. అక్కడ ఒక ఆర్మీ శిబిరానికి ఆశిష్ టాప్ అని పేరు ఉండడం గమనించింది. సహజ సిద్ధమైన ఆసక్తితో అక్కడే విధుల్లో ఉన్న సైనికుల్ని ఆశిష్ అంటే ఎవరని ప్రశ్నించింది. వారిచ్చిన సమాధానం ఆమెకు నోట మాట రాకుండా చేసింది. ఆ ఆశిష్ ఎవరో కాదు. ఆమె కన్నతండ్రి. అసోం రెజిమెంట్‌లో ఆశిష్ దాస్ కల్నల్‌గా రిటైరయ్యారు. ఒక కల్నల్‌గా తన తండ్రి ఏ స్థాయికి చేరుకున్నాడో తెలుసుకున్న ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన కుటుంబానికి చెందిన ఒక రహస్యం తెలుసుకొని సంభ్రమాశ్చర్యానికి లోనైంది. ఆ లేడీ ఆఫీసర్ భావసంచలనాన్ని గమనించిన ఆర్మీ సిబ్బంది ఆమె తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. ఏకంగా ఆర్మీ శిబిరానికే ఒక అధికారి పేరు పెట్టారంటే అదేమీ ఆషామాషీ విషయం కాదు. చైనా కుటిల బుద్ధిని ఆశిష్ దాస్ ఎలా తిప్పికొట్టారో తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1986 లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ వెంబడి మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సమ్డ్రోంగ్ చూ లోయలో హెలిపాడ్లు, ఇతర శాశ్వత నిర్మాణాలకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిని అడ్డుకోవడానికి అప్పటి ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ కె సుందర్జీ అత్యంత రహస్యంగా ఆపరేషన్ ఫాల్కన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌కు ఆశిష్ దాస్ నేతృత్వం వహించారు. నెత్తురు గడ్డకట్టే చలిలో డ్రాగన్ దేశం ఆక్రమణలను తిప్పికొట్టడానికి వీరోచిత పోరాటమే చేశారు. చైనా సైన్యం కాల్పులు తెగబడుతుంటే ఆత్మరక్షణ కోసం ఒక బంకర్ నుంచి మరో బంకర్లోకి వెళ్లి తలదాచుకున్నారు. ఆ తర్వాత ఆశిష్ దాస్ తానే ప్రాణాలను పణంగా పెట్టి చైనా ఆర్మీపై కాల్పులు జరిపాడు. ఆశిష్ దాస్ ధాటికి డ్రాగన్ సైన్యం తోకముడిచింది. ఈ పోరాటం క్రమంలో ఆశిష్ దాస్, మరికొందరు సైనికులకు తిండి కూడా దొరకలేదు.. ఆకలికి మలమల మాడిపోయారు. కొన్నిసార్లు ఎలుకల్ని పట్టి తిని కడుపునింపుకున్నారు. అయినా తమ పోరాట స్ఫూర్తిని వదలుకోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఆశిష్ దాస్ సేవలకు గుర్తుగా ఆయన పదవీవిరమణ చేసిన తర్వాత అక్కడ సైనిక శిబిరానికి ఆశిష్ టాప్ అని పేరు పెట్టారు. అయితే ఈ విషయం ఆయనకు కూడా చాలా ఆలస్యంగా 2003 సంవత్సరంలో తెలిసింది. ఒక కల్నల్‌గా తాను చేసిన పోరాటాన్ని తన కుమార్తెకు ఎప్పుడూ చెప్పలేదని, ఎందుకంటే అప్పటికి ఆమె ఇంకా పుట్టలేదని దాస్ చెప్పుకొచ్చారు. అలా కన్నతండ్రి గురించి ఏమీ తెలీకపోవడంతో ఆశిష్ టాప్ అన్న పేరు చూడగానే ఆ యువ లెఫ్ట్‌నెంట్ ఆనందంతో కన్నీటిపర్యంతమైంది. -
పిల్లాడిని చంపి నెలరోజులు సూట్‌కేసులోనే..
సాక్షి, న్యూఢిల్లీ : ఏడు సంవత్సరాల బాలుడిని చంపి... నెల రోజుల పాటు సూట్‌కేసులోనే దాచిన ఘటన నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని స్వరూప్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అవదేశ్ శాక్య(27) అనే యువకుడు తాను అద్దెకున్న ఇంట్లోని ఆశీస్(7) అనే బాలుడిని జనవరి 6న హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నెలరోజుల పాటు సూట్‌కేసులోనే దాచి పెట్టాడు. తన కొడుకు కనిపించడం లేదని ఆశీష్ తండ్రి కరణ్ సింగ్ స్వరూప్‌నగర్ పోలీసుస్టేషన్లో జనవరి 6న ఫిర్యాదు దాఖలు చేశాడు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు, ఇంట్లో అద్దెకున్న అవదేశే ఈ హత్య చేసినట్టు తేల్చారు. ఆశీష్ తల్లిదండ్రులు అవదేశ్‌తో మాట్లాడవద్దని చెప్పేవారని, దానితో వారిపై కసితో అవదేశ్ ఈ అకృత్యానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. అవదేశ్‌ను అతని ఇంట్లోనే అరెస్ట్ చేసినట్టు నార్త్‌వెస్ట్ డీసీపీ అస్లమ్ ఖాన్ చెప్పారు. బాలుడి మృతదేహాన్ని ఎక్కడైనా పారేసి, డబ్బు కోసం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేయాలనుకుంటున్నట్టు అవదేశ్ పోలీసుల ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. మూడు సంవత్సరాలు కరణ్ ఇంట్లో అద్దెకు... అవదేశ్ యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడని పోలీసులు చెప్పారు. అతను మూడు సంవత్సరాలుగా కరణ్ సింగ్ ఇంట్లో అద్దెకు ఉన్నాడని, ఈ మూడు సంవత్సరాల కాలంలో కరణ్ సింగ్, అతని కుటుంబసభ్యులకు అవదేశ్ సన్నిహితుడయ్యాడని తెలిపారు. కొన్ని నెలల కిందట అవదేశ్ ఇల్లు ఖాళీ చేసి అదే ప్రాంతంలో ఉన్న మరో ఇంటికి మారాడని వారు చెప్పారు. ఇల్లు మారిన తర్వాత కూడా కరణ్ సింగ్ ఇంటికి అవదేశ్ వచ్చి పోతుండేవాడు. అయితే కరణ్ సింగ్ తన కొడుకును అవదేశ్‌తో కలవనిచ్చేవాడు కాదని పోలీసు అధికారి చెప్పారు. జనవరి 6న అశీష్, అవదేశ్ ఇంటికి వచ్చి తన తండ్రి అతనితో మాట్లాడవద్దని చెప్పాడని తెలిపాడు. దీంతో అవదేశ్ ఒళ్లు తెలియని ఆగ్రహంతో ఆశీష్‌ను మప్లర్‌తో చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో దాచిపెట్టాడు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా తల్లిదండ్రుల పక్కనే... ఆశీష్‌ను చంపిన తరువాత కూడా అవదేశ్ ఏమీ తెలియని వాడిలా కరణ్ సింగ్ ఇంటికి రాకపోకలు సాగించాడు. తన కొడుకు కనిపించకుండా పోయాడని కరణ్ సింగ్ పోలీసుకలకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు కూడా అతని వెంట అవదేశ్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా.. దాని గురించి అడిగిన పొరుగు వారికి ఇంట్లో ఎలుకలు చ్చాయని అతను బుకాయించాడు. ఆశీష్ కోసం గాలిస్తూ పోలీసులు ఆ ప్రాంతలో నిరంతరం తచ్చాడుతుండటంతో తాను మృతదేహాన్ని మరో చోటికి తీసుకెళ్లి పారేయలేకపోయాయని అవదేశ్ అంగీకరించాడు. అవదేశ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని, అతను సివిల్ సర్వీసు పరీక్షలు రాస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతను మూడు సార్లు ప్రిలిమినరీ, రెండు సార్లు మెయిన్స్ పరీక్షలు రాశాడని పోలీసులు తెలిపారు. -
చెస్ విజేతలు ఆశిష్, సాహిత్య
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన హైదరాబాద్ జిల్లా అండర్-15 బాలబాలికల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆశిష్ రెడ్డి, సాహిత్య విజేతలుగా నిలిచారు. దోమలగూడలోని ఏవీ కాలేజిలో హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగారుు. అలాగే బాలుర విభాగంలో ఆర్ఎస్ ఆర్మోల్ రెండో స్థానంలో, తరుణ్, అఖిల్ కుమార్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో సారుుప్రియ, జి.చందన రెండు, మూడు స్థానాలు సాధించారు. -
మెడికోలకు రూ.4 లక్షల జరిమానా
- వీధికుక్కను వేధించిన కేసులో తీర్పు సాక్షి ప్రతినిధి, చెన్నై రోగులకు ప్రాణాలు పోసే వైద్యవృత్తిని అభ్యసిస్తున్న ఇద్దరు మెడికోలు వీధికుక్కపై రాక్షసంగా ప్రవర్తించిన ఫలితంగా రూ.4 లక్షలు జరిమానా చెల్లించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై కున్రత్తూరుకు చెందిన సుదర్శన్, ఆశిష్ అనే ఇద్దరు వైద్య విద్యార్థులు ఒక వీధికుక్కను మూడో అంతస్తుపై నుంచి కిందకు విసిరివేశారు. ఈ వికృతచేష్టను మొబైల్లో చిత్రీకరించి ఆనందించారు. అంతేగాక ఈ దృశ్యాన్ని వాట్సాప్‌లో పెట్టి పలువురికి తమ ఘనతను చాటుకున్నారు. ఆరు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. జంతుసంక్షేమ సంఘం ప్రతినిధి ఆంథోనీ సదరు మెడికోలను గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు మెడికోలు శ్రీపెరంబుదూరు న్యాయస్థానంలో లొంగిపోయారు. వీరిద్దరినీ మెడికల్ కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. అదృష్టవశాత్తు తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బైటపడిన కుక్కకు జంతుప్రేమికులు భద్ర అని పేరుపెట్టి అత్యున్నత చికిత్స అందజేశారు. కుక్క చికిత్సకు అయిన ఖర్చును, అపరాధం చెల్లించేలా మెడికోలను ఆదేశించాల్సిందిగా మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చెరి రూ.2 లక్షలను జంతు సంరక్షణ కేంద్రానికి చెల్లించాల్సిందిగా కోర్టు నియమించిన విచారణ బృందం మెడికోలను ఆదేశించింది. రూ.4 లక్షలను చెల్లించారు. దీంతో మెడికోల సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి అడ్మిషన్ కల్పించాల్సిందిగా వైద్యకళాశాల యాజమాన్యాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. -
ఎక్కడ చూసినా ఆయన భార్య ఫోటోలే!
బెంగళూరు: ఓ ఫోటోగ్రాఫర్‌కు అనుకోని అరుదైన గౌరవం దక్కింది. దీపావళి రోజు అతను సరదాగా సెల్ ఫోన్ లో తీసిన తన భార్య ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ హోర్డింగ్‌లలో కనిపిస్తోంది. సెలబ్రిటీల ఫోటోల మాదిరిగా పెద్ద నగరాల్లో ఎక్కడచూసినా తన భార్య ఫోటో.. అదీ తను కళాత్మకంగా తీసిన ఆ ఫోటో కనిపిస్తుండటంతో ఫోటోగ్రాఫర్గానే కాదు భర్తగానూ మురిసిపోతున్నాడు అతడు. బెంగళూరుకు చెందిన ఆశిష్ పర్మార్ వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్. దీపావళీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా ఆశిష్ తన భార్య రైనా నన్నయ్య ఫోటోను ఐఫోన్ 6ఎస్ కెమెరాలో బంధించాడు. చేతుల్లో దీపాన్ని పట్టుకొని, ఆ దీపపు వెలుగులు ఆమె ముఖంపై పడుతున్నట్లుగా కనిపిస్తున్న రైనా నన్నయ్య ఫోటోను ఇప్పుడు యాపిల్ సంస్థ తన ప్రచార కార్యక్రమానికి ఉపయోగిస్తోంది. యాపిల్ సంస్థ నిర్వహించిన 'షాట్ ఆన్ ఐఫోన్ 6ఎస్' ప్రచార కార్యక్రమానికి ఐ ఫోన్‌తో తీసిన ప్రపంచంలోని ఉత్తమ ఫోటోలను ఎంపిక చేశారు. దీనిలో మొత్తం 53 ఉత్తమ ఫోటోలను ఎంపిక చేయగా అందులో ఆశిష్ తీసిన ఫోటో ఎంపికైంది. దీంతో యాపిల్ సంస్థ తన పలు ముఖ్యనగరాల్లో రైనా ఫోటోలను తమ ప్రచార కార్యక్రమం కోసం వాడుకుంటోంది. నగరంలో అక్కడక్కడ తళుక్కుమంటున్న ఆ ఫోటోలను చూసిన ఆ దంపతులు సంతోషంలో మునిగితేలుతున్నారు. దీనిపై ఆశిష్ మాట్లాడుతూ.. 'ద షాట్ ఆన్ ఐఫోన్ 6ఎస్' ప్రచార కార్యక్రమం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందరూ ఫోన్ చేస్తుండటంతో ఉదయం నుండి నా ఫోన్ మోగుతూనే ఉంది. మీడియా వారు ఇంటర్వ్యూల కోసం సంప్రదిస్తున్నారు. యాపిల్ ప్రచారకార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినందుకు ఫోటో గ్రాఫర్గానే కాదు భర్తగానూ సంతోషంగా ఉంది' అని వెల్లడించారు. -
పుట్టింది ఎందుకో తెలిసింది వీళ్లకి
పుట్టిన రోజు పండుగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసే సరికి ఏజ్ బార్ అయిపోతుంది. ఎంజాయ్మెంట్ తప్ప మరొకటి తెలియని ఈ యూత్‌కు మాత్రం పుట్టింది ఎందుకో ఇప్పుడే తెలిసింది. పుట్టిన రోజు వేడుకను డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటూ పెరుగుతున్న వయసుకు అర్థం చెబుతున్నారు. బర్త్ డేని పార్టీలతోనే వెళ్లదీయకుండా.. పదిమందికీ సాయం చేస్తూ నలుగురు నచ్చే విధంగా జరుపుకుంటున్నారు. తమ పుట్టిన రోజును కాస్త డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం అంటున్న సోమాజిగూడలోని రూట్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు.. ఆ విశేషాలను క్యాంపస్ కబుర్లలో పంచుకున్నారు. భువనేశ్వరి ఆయుష్: నవంబర్ 16 నా బర్త్‌డే.. వెరీ స్పెషల్ డే. ఆ రోజు నేను లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గరున్న గోశాలకు వెళ్తాను. ఆవులకు ఇష్టమైన దాణా తీసుకెళ్లి నా చేతులతో వాటికి పెడతాను. అక్కడే చాలా టైం గడుపుతాను. సాయంత్రం ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్. అవ్ని: ఓ వావ్.. రియల్లీ యువర్ గుడ్. ఓకే..నా బర్త్‌డే జూన్ 28. ఆశిష్: మేడమ్ ఇయర్ కూడా చెప్పాలి. అవ్ని: థ్యాంక్స్ ఫర్ ద సజేషన్. నో వే. నేను మాత్రం బర్త్‌డే రోజు పొద్దున్నే గుడికి వెళ్తాను. లాస్ట్‌టైం గుడి దగ్గరున్న బెగ్గర్స్‌కు పళ్లు, స్వీట్లు పంచాను. ప్రతిసారీ ఇలాగే అని కాదు. ఒక్కోసారి ఒక్కోలా ప్లాన్ చేసుకుంటాను. ఆశిష్: నో పార్టీ..నో ఎంజాయ్. అవ్ని: చెప్పా కదా.. అప్పటికి ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను. ధనలక్ష్మి అగర్వాల్: నేను మాత్రం బర్త్ డే సెలబ్రేషన్స్‌కు వ్యతిరేకం. ఎందుకంటే మన జీవితంలో ఒక ఇయర్ లాస్ అయిన రోజు అది. అలాగని ఆ రోజు నేను మూడీగా ఏమీ ఉండను. మా ఇంటికి దగ్గరగా ఉన్న చారిటీ హోమ్‌లో స్వీట్లు పంచుతాను. అలాగే దీపావళి పండుగ రోజు కూడా నేను ఇంట్లో ఉండను. స్వీట్లు పట్టుకుని ఆశ్రమాలకు వెళ్లిపోతాను. నవ్య: సో గుడ్. అంతకు మించి సెలబ్రేషన్ ఏముంటుంది ధనలక్ష్మి. జూలై 5 నా బర్త్‌డే. నేను నా బ్రదర్‌తో స్నేహితులను తీసుకుని కేఎఫ్‌సీకి వెళ్లాను. బండి పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే అక్కడే గోడ పక్కన చిరిగిపోయిన బట్టలతో ఓ పెద్దాయన కనిపించాడు. నేను దగ్గరికెళ్లి డబ్బులిస్తుంటే తీసుకోలేదు. అన్నయ్య తన జర్కిన్ ఇస్తుంటే వద్దన్నాడు. ఏం కావాలని అడిగితే అన్నం అన్నాడు. ముందు అతని కోసం ఆర్డర్ చేసి తర్వాత మేం తిని ఇంటికి వచ్చాం. నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎమ్మెస్ పల్లవి: అఫ్కోర్స్.. ఎంజాయ్మెంట్ మహా అయితే రోజుల జ్ఞాపకమే. కానీ ఇలాంటి పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేను మా ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ కొనిపెడుతుంటాను. ఆదిత్య: యా.. ఆ రోజుకే కాదు, ఆ రోజు చేసిన పనికి కూడా స్పెషల్ మెమొరీ ఉంటుంది. మా ఇంట్లో మేం ట్విన్స్. చెల్లి ఐశ్వర్య నేను జనవరి 19న గ్రాండ్‌గా బర్త్‌డే చేసుకుంటాం. అమ్మానాన్న, బాబాయి అందరూ మాకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తారు. మొన్నటిసారి ఇంట్లో సెలబ్రేషన్స్‌తో పాటు డెఫ్ అండ్ డమ్ స్కూల్‌కు వెళ్లి స్వీట్లు పంచాం. నిజానికి ఇలా ప్రతిసారి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్‌కి అందరికీ ఇలాంటి ఆలోచనలున్నాయి. నవ్య: యా.. ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. ఆదిత్య: ఆలోచన వస్తే చాలు.. మన పుట్టినరోజు వేడుక పేదవాడి జీవితంలో వెలుగులు నింపే వేదికగా మార్చే ఐడియాలు బోలెడు వస్తాయి. సత్యం: పార్టీలు, పబ్‌లు, ఎంజాయ్మెంట్లు ఎప్పుడైనా ఉంటాయి కదా! బర్త్‌డే.. అనేది మనతో పాటు మన ఇంట్లోవాళ్లకి కూడా స్పెషల్ కదా. ఆదిత్య: డెఫినెట్లీ.. వాళ్ల ఏర్పాట్లు వారికుంటాయి. మా ఇంట్లో అయితే రాత్రి పన్నెండింటికి కేక్ రెడీ చేసేస్తారు. గిఫ్ట్‌లు కూడా రెడీ చేసి ఉంచుతారు. అవ్ని: నాకు ఈసారి మా డాడ్ ఆక్టీవా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇచ్చే సర్ప్రైజ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆశిష్: ఓ.. గ్రేట్ ఈసారి నీకెన్ని గిఫ్ట్‌లు వచ్చాయి అవ్ని. అవ్ని: నో.. చెప్పను. సత్యం: నా బర్త్‌డే ఫిబ్రవరి 1. ముందు గుడికి వెళ్తాను. తర్వాత ఓల్జేజ్ హోమ్‌కు వెళ్లి అక్కడే కొంత టైం స్పెండ్ చేస్తా. సాయంత్రం ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్తాను. సుదీప్తి: నేనైతే నా ప్రతి బర్త్ డే రోజు ఓ మొక్క నాటుతాను. శశి: వావ్.. మీ ఇంట్లో ఎన్ని చెట్లున్నాయి. సుదీప్తి: 23. ఆశిష్: ఓ.. నీ ఏజ్... సుదీప్తి: నో ఇట్స్ నాట్ మై ఏజ్. నేను ఒక్కోసారి రెండు మూడు చెట్లు కూడా నాటుతాను. ఎనీ వే ఈ సందర్భంగా నేను అందరికీ ఇచ్చే బెస్ట్ సజేషన్. ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటండి. ఆయుష్: యా.. ఇట్స్ రియల్లీ గుడ్ ఐడియా. నీడ్ ఆల్సో. -
అన్నయ్యే అన్నీ..
రాజన్న సినిమాలో ‘అమ్మా అవని..’ అంటూ అభినయించిన బాలనటి అనీ అంటే ఆ అన్నకు ప్రాణం. ఎంతలా అంటే ఆ ముద్దుల చెల్లెలు పేరును చేతిపై టాటూ వేయించుకునేంత. అనీ తొమ్మిదో తరగతి చదువుతుంటే.. అన్నయ్య ఆశిష్ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. ఏజ్ గ్యాప్ ఏడేళ్లున్నా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చెల్లెలి వల్లే తమ ఫ్యామిలీకి గుర్తింపు వచ్చిందంటాడు ఆ అన్న. నాకు అన్నీ అన్నయ్యే అంటుంది చెల్లి. అలగడం హాబీగా ఉన్న చెల్లిని ఓదార్చడం అన్నకు ఇష్టం. టీవీలో యాంకర్లను చూసి.. అద్దం ముందు చెల్లెలు చేసే అభినయం మరింత ఇష్టం. చెల్లెలు గిఫ్ట్‌గా ఇచ్చిన షర్ట్ వేసుకుంటే ఎక్కడ పాడైపోతుందోనని.. బీరువాలో భద్రంగా దాచుకోవడం ఎంతో ఇష్టం. చిన్న వయసులోనే ఎంతో పరిణ తితో ఆలోచించే అనీ.. తనకు అక్కలా మాట్లాడుతుందని మురిసిపోతూ చెప్తాడు ఆశిష్. నటన తన చెల్లికి దేవుడిచ్చిన వరమని చెబుతున్న ఆశిష్.. అనీ పెద్దయిన తర్వాత మంచి నటిగానో.. యాంకర్గానో స్థిరపడాలని కోరుకుంటున్నాడు. షూటింగ్‌లతో అన్నయ్యను మిస్సయినా.. ఆయన పంచే అనురాగాన్ని మాత్రం మిస్సయ్యేది లేదంటోంది అనీ. రాఖీ పండుగ రోజు షూటింగ్‌కు వెళ్లాల్సి రావడం బాధగా ఉంటుందని చెబుతోంది. ‘ఆ రోజు అన్నయ్య నిద్ర లేవక ముందే చేతికి రాఖీ కట్టి ముద్దు పెట్టి షూటింగ్‌కు వెళ్లిపోతాను. నేను షూటింగ్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి మరీ అన్నయ్య మంచి గిఫ్ట్ ఇస్తాడు’ అని ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అనీ మనముందుంచింది. -
ఆశిష్ మెరిసినా గెలవని శ్రీచైతన్య
సాక్షి, హైదరాబాద్: ఆశిష్ (5/56) అద్భుత బౌలింగ్‌తో రాణించినా శ్రీచైతన్య జట్టు బ్యాటింగ్ వైఫల్యంతో కంగుతింది. కోకాకోలా అండర్-16 ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్ (బేగంపేట్) జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. ఆశిష్ ధాటికి జట్టులో ఒక్క రాజశేఖర్ రెడ్డి (84) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీచైతన్య టెక్నో స్కూల్ 5 వికెట్లకు 146 పరుగులే చేసింది. యశ్ కపాడియా 36 పరుగులు చేశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆదిలాబాద్: 166 (సైఫ్ 50, అరుణ్ 60), లిటిల్ ఫ్లవర్ జేసీ: 114 (కార్తీక్ 3/15) జాన్సన్ గ్రామర్ స్కూల్: 131/7 (సన్నీ 37, హర్ష 32 నాటౌట్; దుర్గేశ్ 3/32), సెయింట్ మేరీస్ జేసీ: 145/4 (రుత్విక్ 78 నాటౌట్, భవిక్ త్రివేది 37; తరుణ్ 4/35) వెస్లీ జేసీ: 270/6 (వినీత్ 108, శ్రీనాథ్ 50), సెయింట్ జాన్స్ జేసీ: 272/5 (నికిల్ జైస్వాల్ 100, శిరీశ్ 70, నికిల్ పార్వాణి 47 నాటౌట్; చందన్ సహాని 3/68).