40 Years Old Woman Renu Shot Dead Outside House In Delhi Dabri Area, Details Inside - Sakshi
Sakshi News home page

ఆమెను కాల్చి తాను ఆత్మహత్య.. ఇద్దరూ పక్కింటి వారే.. ఏం జరిగింది?

Published Fri, Jul 28 2023 11:08 AM | Last Updated on Fri, Jul 28 2023 11:46 AM

Renu Shot Dead Near House In Delhi Dabri Area - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఇంటి ముందే నివాసం ఉంటున్న ఓ మహిళను యువకుడు కాల్చి చంపాడు. అనంతరం, యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, వీరిద్దరూ కొన్నేళ్ల క్రితం జిమ్‌లో కలుసుకున్నట్టు.. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. 

వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో మృతురాలు రేణు(40) కుటుంబంతో కలిసి నివసిస్తోంది. రేణుకు వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. ఇక, వీరి ఇంటి సమీపంలోనే ఆశిష్‌ కూడా ఉంటున్నాడు. కాగా, దాదాపు రెండేళ్ల క్రితం వీరిద్దరూ అక్కడున్న ఓ జిమ్‌లో కలుసుకున్నారు. దీంతో, వీరి మధ్య పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కాదు.. ఆశిష్‌ దారుణానికి ఒడిగట్టాడు. 

కాగా, గురువారం సాయంత్రం రేణు ఇంటికి వెళ్లిన ఆశిష్‌.. ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రేణును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక, అప్పటికే రేణు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా డీసీపీ హర్షవర్ధన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దుబ్రీ పోలీసు స్టేషన్‌ పరిధిలో హత్య జరిగినట్టు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశాం. మృతిరాలిని రేణుగా, నిందితుడిని ఆశిష్‌గా గుర్తించామన్నారు. ఆశిష్‌ను అరెస్ట్‌ చేసేందుకు వెళ్లగా.. అతడు అప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఈ లోకానికి వీడ్కోలంటూ..అమ్మా, గురు మామా క్షమించండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement