woman shot dead
-
పక్కింటివాడని మాట్లాడటమే ఆమెకు శాపమైంది.. అసలేం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఇంటి ముందే నివాసం ఉంటున్న ఓ మహిళను యువకుడు కాల్చి చంపాడు. అనంతరం, యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, వీరిద్దరూ కొన్నేళ్ల క్రితం జిమ్‌లో కలుసుకున్నట్టు.. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో మృతురాలు రేణు(40) కుటుంబంతో కలిసి నివసిస్తోంది. రేణుకు వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. ఇక, వీరి ఇంటి సమీపంలోనే ఆశిష్ కూడా ఉంటున్నాడు. కాగా, దాదాపు రెండేళ్ల క్రితం వీరిద్దరూ అక్కడున్న ఓ జిమ్‌లో కలుసుకున్నారు. దీంతో, వీరి మధ్య పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కాదు.. ఆశిష్ దారుణానికి ఒడిగట్టాడు. కాగా, గురువారం సాయంత్రం రేణు ఇంటికి వెళ్లిన ఆశిష్.. ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రేణును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక, అప్పటికే రేణు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా డీసీపీ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. దుబ్రీ పోలీసు స్టేషన్ పరిధిలో హత్య జరిగినట్టు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశాం. మృతిరాలిని రేణుగా, నిందితుడిని ఆశిష్‌గా గుర్తించామన్నారు. ఆశిష్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడు అప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈ లోకానికి వీడ్కోలంటూ..అమ్మా, గురు మామా క్షమించండి -
గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్..
చండీగఢ్: పంజాబ్ పాటియాలలో షాకింగ్ ఘటన జరిగింది. దుక్నివరణ్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవిస్తున్న ఓ మహిళపై అక్కడి సేవాదార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు షూట్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని పర్మీందర్ కౌర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమె వయసు 32 ఏళ్లు. పెళ్లికాలేదు. గురుబక్ష్ కాలనీలో నివాసముంటోంది. ఆదివారం సాయంత్రం గురుద్వారా ఆవరణలో మద్యం సేవించింది. ఈ సమయంలో ఆమెను చూసిన సాగర్ మల్హోత్రా అనే సేవాదార్ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనితో ఆమె వాగ్వాదానికి దిగింది. అనంతరం పర్మీందర్ కౌర్‌ను గురుద్వారా మేనేజర్ దగ్గరకు తీసుకెళ్తుండగా.. ఈ సమయంలో అక్కడున్న మరో సేవాదార్ మహిళ తీరుపై ఆగ్రహంతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సాగర్ మల్హోత్రాకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
ప్రియురాలితో కలిసి భర్తే చంపించాడు
సాక్షి, న్యూఢిల్లీ : వాయువ్య ఢిల్లీలో కలకలం రేపిన స్కూలు టీచర్ హత్య కేసును ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన సునీత(38), మంజీత్(38) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కాగా మంజీత్.. ఏంజెల్ గుప్తా అనే మోడల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా సునీత అడ్డు తొలగించుకోవాలని భావించిన మంజీత్ ప్రియురాలితో కలిసి పథకం రచించాడు. కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చాడు. ఈ క్రమంలో స్కూలు టీచరుగా పనిచేస్తున్న సునీత.. సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తున్న సమయంలో దుండగులు ఆమెపై మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతిచెందారు. కాగా ఈ కేసులో మంజీత్, అతడి ప్రియురాలు ఏంజెల్ గుప్తాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పరారీలో ఉన్న కిరాయి హంతకుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. -
అత్యాచారాన్ని అడ్డుకుందని.. తలలో కాల్చేశారు!
మేఘాలయలో దారుణం జరిగింది. అత్యాచార ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఓ మహిళ తలపై తుపాకి పెట్టి జీఎన్ఎల్ఏ ఉగ్రవాదులు కాల్చిపారేశారు. దాంతో ఆమె తల ఛిద్రమైపోయి.. అక్కడికక్కడే మరణించింది. ఈ దుర్ఘటన మేఘాలయలోని దక్షిణ గారో హిల్స్ జిల్లాలో గల రాజా రోంగట్ ప్రాంతంలో జరిగింది. ఆ మహిళ ఇంట్లో తన భర్త, పిల్లలతో ఉండగా నలుగురైదుగురు సాయుధ జీఎన్ఎల్ఏ ఉగ్రవాదులు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ప్రవపేశించారు. భర్తను, ఐదుగురు పిల్లలను లోపల ఓ గదిలో పెట్టి తాళం వేసి, మహిళను బయటకు లాక్కొచ్చారు. ముందుగా ఆమెపై దాడిచేసి, వేధించారు. ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయగా, పాయింట్ బ్లాంక్ రేంజిలో ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిళ్లతో కాల్చేశారు. దాంతో ఆమె తల రెండు ముక్కలైపోయిందని ఐజీ (ఆపరేషన్స్) జీహెచ్‌పీ రాజు తెలిపారు. ఈ సంఘటనను ఆ ప్రాంత ఎంపీ పీఏ సంగ్మా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, గతంలో ఎప్పుడూ ఇలా లేదని ఆయన అన్నారు. పరిస్థితులను చక్కదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. -
తుపాకితో కాల్చి.. పీక పిసికి మేనత్తను చంపిన అల్లుడు
కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ కుర్రాడు తన మేనత్తను పిస్టల్‌తో కాల్చి, పీక పిసికి మరీ చంపేశాడు! ఈ దారుణ సంఘటన తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పూర్ ప్రాంతంలో జరిగింది. నిందితుడికి మేనత్త భర్తతో కొన్నాళ్ల క్రితం తీవ్ర వాగ్వాదం జరిగిందని, అదే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అంటున్నారు. హతురాలు కవిత తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె మేనల్లుడు రాజా (21) ఆవేశంగా వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఆమె పిల్లలు బంధువుల ఇంట్లో ఉండగా, భర్త ఉద్యోగం పనిమీద బయటకు వెళ్లారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, రాజా ఇంట్లోకి దూసుకెళ్లి, ఆమెతో గొడవ పడ్డాడు. ఆ సమయంలోనే పిస్టల్ తీసి ఆమెను కాల్చాడు. అయితే, కవిత చేయి అడ్డం పెట్టగా ఆమె ముంజేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ వెంటనే అతడు ఆమె పీక పిసికి చంపేశాడు. తుపాకి కాల్పుల శబ్దం విన్న ఇరుగుపొరుగులు అక్కడు చేరుకుని, అతడిని పట్టుకోడానికి ప్రయత్నించారు. కానీ, అతడు వాళ్లను కూడా కాల్చేస్తానంటూ తుపాకితో బెదిరించి అక్కడినుంచి పారిపోయాడు. కవితకు భర్త రవి, ఇద్దరు పిల్లు ఉన్నారు. రవి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. రాజా చెడు తిరుగుళ్లు తిరుగుతూ, ఇంట్లో పెద్దలతో తరచు వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలియడంతో రవి కొంతకాలం క్రితం రాజాను తిట్టి, కొట్టారు కూడా. తన ఇంటికి మళ్లీ రావద్దని కూడా హెచ్చరించారని, అందువల్లే అతడు ఆవేశానికి గురై ఇలాంటిపని చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు.