తుపాకితో కాల్చి.. పీక పిసికి మేనత్తను చంపిన అల్లుడు | Woman shot at, strangled by nephew in east delhi | Sakshi
Sakshi News home page

తుపాకితో కాల్చి.. పీక పిసికి మేనత్తను చంపిన అల్లుడు

Published Mon, Nov 25 2013 9:35 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

Woman shot at, strangled by nephew in east delhi

కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ కుర్రాడు తన మేనత్తను పిస్టల్తో కాల్చి, పీక పిసికి మరీ చంపేశాడు! ఈ దారుణ సంఘటన తూర్పు ఢిల్లీలోని త్రిలోక్పూర్ ప్రాంతంలో జరిగింది. నిందితుడికి మేనత్త భర్తతో కొన్నాళ్ల క్రితం తీవ్ర వాగ్వాదం జరిగిందని, అదే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అంటున్నారు. హతురాలు కవిత తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె మేనల్లుడు రాజా (21) ఆవేశంగా వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఆమె పిల్లలు బంధువుల ఇంట్లో ఉండగా, భర్త ఉద్యోగం పనిమీద బయటకు వెళ్లారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, రాజా ఇంట్లోకి దూసుకెళ్లి, ఆమెతో గొడవ పడ్డాడు. ఆ సమయంలోనే పిస్టల్ తీసి ఆమెను కాల్చాడు. అయితే, కవిత చేయి అడ్డం పెట్టగా ఆమె ముంజేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ వెంటనే అతడు ఆమె పీక పిసికి చంపేశాడు. తుపాకి కాల్పుల శబ్దం విన్న ఇరుగుపొరుగులు అక్కడు చేరుకుని, అతడిని పట్టుకోడానికి ప్రయత్నించారు. కానీ, అతడు వాళ్లను కూడా కాల్చేస్తానంటూ తుపాకితో బెదిరించి అక్కడినుంచి పారిపోయాడు.

కవితకు భర్త రవి, ఇద్దరు పిల్లు ఉన్నారు. రవి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. రాజా చెడు తిరుగుళ్లు తిరుగుతూ, ఇంట్లో పెద్దలతో తరచు వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలియడంతో రవి కొంతకాలం క్రితం రాజాను తిట్టి, కొట్టారు కూడా. తన ఇంటికి మళ్లీ రావద్దని కూడా హెచ్చరించారని, అందువల్లే అతడు ఆవేశానికి గురై ఇలాంటిపని చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement