Gautam Gambhir announces East Delhi Cricket League: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తూర్పు ఢిల్లీ క్రికెట్ లీగ్‌ను ఆరంభించనున్నట్లు వెల్లడించారు. సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా శుక్రవారం ప్రకటించారు. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన ఆటగాడిగా(కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ జట్ల మాజీ కెప్టెన్) పేరొందిన గౌతం గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తన నియోజకవర్గంలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేసిన గంభీర్.. దీనిని ప్రపంచస్థాయి మైదానంగా తీర్చిదిద్దామని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పు ఢిల్లీ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి జట్లను ఎంపిక చేసి.. ఈస్ట్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా నవంబరు రెండో వారంలో ఈ టోర్నీని ప్రారంభించనున్నట్లు సమాచారం. 17- 36 ఏళ్ల మధ్య వయస్కులైన క్రికెటర్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు
అత్యాధునికంగా యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్
రంజీ ట్రోఫీ నిర్వహణ స్థాయికి తగ్గట్లు యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. రెండు డ్రెస్సింగ్‌రూంలు, హైమాస్ట్ లైట్స్, ఆరు పిచ్‌లు, ప్రాక్టీసు పిచ్‌లు, డిజిటల్ స్కోరు బోర్డు డిస్‌ప్లే, కానపీ, జాగింగ్ ట్రాక్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు 9 కోట్ల 25 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. క్రికెట్‌తో పాటు ఆర్చరీ కోసం కూడా దీనిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: T20 World Cup: అతడు తోలుబొమ్మ.. జట్టులో మార్పులు తథ్యం.. వీళ్లను తీసుకోవాలి!
I PROMISE TO DELIVER! 🇮🇳
World Class Stadium ready at Yamuna Sports Complex! East Delhi Cricket League to start very soon! #DelhiNeedsHonesty pic.twitter.com/DpYJ1xUET2
— Gautam Gambhir (@GautamGambhir) September 10, 2021
Comments
Please login to add a commentAdd a comment