Gautam Gambhir Plans T20 Tournament From 10 Constituencies Of East Delhi - Sakshi
Sakshi News home page

Gautam Gambhir: ఐపీఎల్‌ తరహాలో లోకల్ టీ20 లీగ్‌ను ప్లాన్‌ చేసిన గంభీర్‌

Published Mon, Aug 9 2021 11:57 AM | Last Updated on Mon, Aug 9 2021 4:24 PM

Gautam Gambhir Plans T20 Tournament, Featuring 10 Constituencies Of East Delhi - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఐపీఎల్‌ తరహాలో ఓ లోకల్‌ టీ20 టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు రచించాడు. తూర్పు ఢిల్లీలోని 10 నియోజకవర్గాల మధ్య ఈ క్రికెట్ టోర్నీని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభమైపోయాయి. ఇక టోర్నీ వివరాల్లోకి వెళితే.. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడిన ముగ్గురు సెలెక్టర్లు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో ట్రయల్స్‌ అనంతరం సెలెక్షన్ల ప్రక్రియ మొదలవుతోంది.

ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు 17 సంవత్సారాలు నిండినవారై ఉండాలి. అలాగే 36 ఏళ్లకు మించి ఉండకూడదు. ప్రతి జట్టు బేస్ ధర నిర్ణయించిన తరువాత ఆటగాళ్ల వేలం జరుగనుంది. అంతేకాకుండా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేయడం, క్రికెట్ కిట్లు అందించడం, ఇతర సౌకర్యాలకు ఏ లోటూ రాకుండా చూడడం జరుగుతుందని గంభీర్ వెల్లడించారు. ఈ టోర్నీ అక్టోబర్‌ చివరి వారంలో మొదలై.. నవంబర్‌ వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement