T20 league
-
భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ టెండుల్కర్.. అభిమానులకు పండుగే!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్- International Masters League) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాదే ఆరంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులేవీ లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎమ్ఎల్ ఆరంభ, ముగింపు తేదీలను ప్రకటించారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి 22న మొదలై.. మార్చి 16న ఫైనల్‌తో పూర్తవుతుందని తెలిపారు. ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ20 లీగ్ జరుగనుంది.భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక ఈ టీ20 లీగ్‌లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం. భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.మరోవైపు.. వెస్టిండీస్ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్ లారా, శ్రీలంక టీమ్‌కు కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా బృందానికి షేన్ వాట్సన్, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికా టీమ్‌కు జాక్వెస్ కలిస్ సారథ్యం వహించనున్నారు. ఆ ముగ్గురు కీలకంకాగా ఐఎమ్ఎల్కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. లీగ్ కమిషనర్‌గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎమ్ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐఎమ్ఎల్ పాలక మండలిలో గావస్కర్‌తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఉన్నారు. కాగా గతేడాది నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్‌ను ఎట్టకేలకు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.వేదికలు అవే?ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌కు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు.. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కూడా ఆరంభం కానుండటం.. అందులోనూ సచిన్ టెండుల్కర్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగడం.. క్రికెట్ ప్రేమికులకు డబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు.చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్: ఒక్క ఫోర్ లేదు! అన్నీ సిక్సర్లే!
వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ కీరన్ పొలార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 52 పరుగులు సాధించి సత్తా చాటాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ మేరకు తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీకాగా సీపీఎల్ తాజా ఎడిషన్‌లో పొలార్డ్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లూసియా కింగ్స్ సొంత మైదానంలో మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 34), జె.చార్ల్స్(14 బంతుల్లో 29) శుభారంభం అందించగా.. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన చేజ్ 40 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా భనుక రాజపక్స(29 బంతుల్లో 33) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. ట్రిన్‌బాగో బౌలర్లలో సునిల్ నరైన్, వకార్ సలామ్‌ఖీల్ రెండేసి వికెట్లు తీయగా.. టెర్రాన్స్ హిండ్స్, పొలార్డ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆకాశమే హద్దుగా పొలార్డ్ఈ క్రమంలో లూసియా కింగ్స్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్‌బాగోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(15 బంతుల్లో 16), సునిల్ నరైన్(8 బంతుల్లో 14) విఫలమయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ షకెరె పారిస్ 33 బంతుల్లో 57 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.సిక్సర్ల వర్షంమిగతా వాళ్లలో నికోలస్ పూరన్(17), కేసీ కార్టీ(15) పూర్తిగా నిరాశపరచగా.. పొలార్డ్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఆల్‌రౌండర్. ఏడు సిక్సర్ల సాయంతో 19 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పందొమ్మిదో ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆఖరి ఓవర్లో అకీల్ హొసేన్ ఫోర్ బాదడంతో.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ట్రిన్‌బాగో గెలుపు ఖరారైంది. లూయిస్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.సెయింట్ లూయీస్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్కోర్లులూయీస్ కింగ్స్- 187/6 (20 ఓవర్లు)నైట్ రైడర్స్- 189/6 (19.1 ఓవర్లు)ఫలితం- కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం.టాప్‌లో అమెజాన్ వారియర్స్కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మూడు విజయాల(ఆరు పాయింట్లు)తో పట్టికలో టాప్‌లో ఉండగా.. బార్బడోస్ రాయల్స్ రెండింట రెండు గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ట్రిన్‌బాగో నైట్ రైడర్స్మూడింట రెండు గెలిచి మూడు, ఆంటిగ్వా-బర్బుడా ఫాల్కన్స్ ఆరింట రెండు గెలిచి నాలుగు, సెయింట్ లూసియా కింగ్స్ నాలుగింట రెండు గెలిచి ఐదు, సెయింట్ కిట్స్- నెవిస్ పేట్రియాట్స్ ఆరింట ఒకటి గెలిచి అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! Kieron Pollard is awarded @Dream11 MVP! Well done Polly 🙌🏾 #CPL24 #SLKvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Dream11 pic.twitter.com/AASf9KO7mC— CPL T20 (@CPL) September 11, 2024 -
అభిమానులకు శుభవార్త!.. శిఖర్ ధావన్ రీఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. తాను ఇంకా ఫిట్‌గానే ఉన్నానని.. ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)లో భాగం కానున్నట్లు ధావన్ వెల్లడించాడు.వినోదం పంచేందుకు సిద్ధంరిటైర్మెంట్ తర్వాత కూడా తాను ఆటగాడిగా ముందుకు సాగేందుకు దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నాడు. క్రికెట్ తన జీవితంలో భాగమని.. త్వరలోనే తన స్నేహితులతో కలిసి మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నట్లు తెలిపాడు. తన అభిమానులకు వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నానని.. వారితో కలిసి కొత్త జ్ఞాపకాలు పోగు చేసుకునేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు గబ్బర్ తెలిపాడు.రిటైర్మెంట్ అనంతరంఇందుకు సంబంధించి శిఖర్ ధావన్ పేరిట ఎల్ఎల్సీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తాను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. పద్నాలుగేళ్లకు పైగా టీమిండియా క్రికెటర్‌గా కొనసాగిన ఈ మాజీ ఓపెనర్‌కు గత రెండేళ్లుగా అవకాశాలు కరువయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ జట్టులో పాతుకుపోగా.. గబ్బర్‌కు నిరాశే ఎదురైంది.ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ధావన్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, క్రికెటర్‌గా మాత్రం తాను కొనసాగుతానని.. అందుకు లెజెండ్స్ లీగ్ రూపంలో కొత్త అవకాశం వచ్చిందని తాజాగా వెల్లడించాడు. కాగా 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2022లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. మొత్తంగా టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు ధావన్.లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆరు జట్లుటీ20 ఫార్మాట్లో నిర్వహిస్తోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భిల్వారా కింగ్స్, గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్‌స్టార్స్, అర్బనైజర్స్ హైదరాబాద్ పేరిట ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్ సహా విదేశీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, ఉపుల్ తరంగ, డ్వేన్ స్మిత్, మార్టిన్ గప్టిల్ తదితరులు భాగమవుతున్నారు. తాజాగా శిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే, అతడు ఏ జట్టుకు ఆడనున్నది తెలియాల్సి ఉంది. సెప్టెంబరులో ఈ లీగ్ ఆరంభం కానుంది. -
BCCI: ఐపీఎల్ మాదిరే మరో టీ20 లీగ్? లెజెండ్స్ స్పెషల్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాదిరే మరో ఫ్రాంఛైజీ లీగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శ్రీకారం చుట్టనుందా?.. వేలం ప్రాతిపదికన ఆటగాళ్లను కొనుగోలు చేసి.. జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనుందా?.. అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అయితే, ఈ టీ20 లీగ్ రిటైర్ అయిన క్రికెటర్ల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకోనుందని సమాచారం.బీసీసీఐ ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకున్న క్రికెటర్లు.. పేరుప్రఖ్యాతులతో పాటు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఇక టీమిండియా వెటరన్లు సైతం ఈ లీగ్ ద్వారా ఇంకా యాక్టివ్ క్రికెటర్లుగా కొనసాగుతూ తమలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.లెజెండ్స్ స్పెషల్?అయితే, ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లలో కొందరు లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి మాజీలు ఇందులో భాగమవుతున్నారు. అయితే, ఇలా ప్రైవేట్ లీగ్‌లలో కాకుండా బీసీసీఐ నేతృత్వంలోని లీగ్‌లో ఆడాలని భారత మాజీ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షాను కలిసి తమ మనసులో మాటను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రపోజల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మేము కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చుబీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు మహిళా ప్రీమియర్ లీగ్(WPL) కూడా నిర్వహిస్తోంది. ఇక ఈసారి ఐపీఎల్ మెగా వేలం కూడా జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు లీగ్‌ల నిర్వహణతో పాటు వేలానికి సంబంధించిన పనులతో బీసీసీఐ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్లు ప్రతిపాదించినట్లుగా లెజెండ్స్ లీగ్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, భవిష్యత్తులో మాత్రం ఈ లీగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐతో అన్ని సంబంధాలు తెంచుకున్న క్రికెటర్లు మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ లీగ్‌తోనే మరోసారి సత్తా చాటాలని మాజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: సౌరవ్ గంగూలీ -
సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రకటించింది. కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్తో పాటు 12 మంది సభ్యులను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.అదేవిధంగా ఏడుగురు ఆటగాళ్లను సన్‌రైజర్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో పాటు డేవిడ్ మలన్, ఎం డేనియల్ వోరాల్, డమ్ రోసింగ్టన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, బ్రైడన్ కార్స్‌లు ఉన్నారు.మరోవైపు వచ్చే ఏడాది సీజన్ కోసం రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), జాక్ క్రాలే (ఇంగ్లండ్)లతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్తగా ఒప్పందం కుదర్చుకుంది. అదేవిధంగా ప్రోటీస్ ఆటగాడు డేవిడ్ బెడింగ్హామ్ సన్‌రైజర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. ఇక తొలి రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టునే ఛాంపియన్స్‌గా నిలిచింది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదేఐడైన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), జోర్డాన్ హెర్మన్, పాట్రిక్ క్రూగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సైమన్ హార్మర్, లియామ్ డాసన్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), కాలేబ్ సెలెకా, ఆండిల్ సిమెలన్. -
రీఎంట్రీలో పేలని పాకెట్ డైనమైట్
దాదాపు మూడు నెలల విరామానంతరం కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. రీఎంట్రీలో తుస్సుమనిపించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్.. రూట్ మొబైల్ లిమిటెడ్ జట్టుతో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌కు మెరుపు అరంభమే లభించినప్పటికీ.. ఆతర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసిన అతను.. మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన ఇషాన్.. వికెట్‌కీపింగ్‌లో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను ఇద్దరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. సుమిత్ క్యాచ్ పట్టిన ఇషాన్.. సయన్ మొండల్‌ను స్టంపౌట్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రూట్ మొబైల్ లిమిటెడ్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 193 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇషాన్ జట్టు ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఇషాన్... టీమిండియా తరఫున తన చివరి టీ20ని 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి సిరీస్ మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆతర్వాత రంజీల్లో ఆడి ఫామ్‌ను నిరూపించుకోవాలని బీసీసీఐతో పాటు చాలా మంది మాజీలు సూచించినా పెడచెవిన పెట్టిన ఇషాన్.. తాజాగా బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దిగొచ్చి స్థానిక డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఇషాన్ తీరుతో గుర్రుగా ఉన్న బీసీసీఐ అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
విజృంభించిన మనీశ్ పాండే.. రాణించిన కరుణ్ నాయర్
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహారాజా టీ20 ట్రోఫీ-2023ని హుబ్లీ టైగర్స్ గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్స్‌లో టైగర్స్ టీమ్.. మైసూర్ వారియర్స్‌ను 8 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్.. మొహమ్మద్ తాహా (40 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (23 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో తాహా, మనీశ్‌లతో పాటు కృష్ణణ్ శ్రీజిత్ (31 బంతుల్లో 38; 5 ఫోర్లు), మాన్వంత్ కుమార్ (5 బంతుల్లో 14; 2 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మైసూర్ వారియర్స్ బౌలర్లలో కార్తీక్ 2, మోనిస్ రెడ్డి, సుచిత్, కుషాల్ వధ్వాని తలో వికెట్ పడగొట్టారు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మైసూర్ వారియర్స్.. ఇన్నింగ్స్ ఆరంభంలో రవికుమార్ సమర్థ్ (35 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (20 బంతుల్లో 37; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు. అయితే ఆఖర్లో హుబ్లీ టైగర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మైసూర్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 195 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. హుబ్లీ బౌలర్లలో మాన్వంత్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప 2, మిత్రకాంత్, కరియప్ప చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
40 బంతుల్లో శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్న నాయర్.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 40 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. నాయర్‌కు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim — CricTracker (@Cricketracker) August 28, 2023 నాయర్ విధ్వంసం ధాటికి గుల్భర్గా బౌలర్లు అభిలాష్ షెట్టి (4-0-63-1), విజయ్‌కుమార్ వైశాక్ (4-0-45-0), అవినాశ్ (3.4-0-44-1), నొరోన్హా (2-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 249 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుల్భర్గా.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గుల్భర్గా ఇన్నింగ్స్‌లో చేతన్ 28, ఆనీశ్ 23, నొరోన్హా 39 నాటౌట్, స్మరణ్ 0, అమిత్ వర్మ 11, హసన్ ఖలీద్ 4 నాటౌట్ పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి, గౌతమ్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, టెస్ట్‌ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్‌పై తన తొలి ట్రిపుల్ సెంచరీని (309) (భారత్ తరఫున మొట్టమొదటిది), 2008లో సౌతాఫ్రికాపై తన రెండో ట్రిపుల్ హండ్రెడ్ను (319) బాదాడు. ఆ తర్వాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్‌ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
రెచ్చిపోయిన రసెల్, రూథర్‌ఫోర్డ్.. కెనడా టీ20 లీగ్ విజేత మాంట్రియాల్ టైగర్స్
కెనడా టీ20 లీగ్ 2023 ఎడిషన్ (మూడో ఎడిషన్.. 2018, 2019, 2023) విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచింది. సర్రే జాగ్వార్స్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన ఫైనల్లో మాంట్రియాల్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (29 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కడ దాకా నిలిచి మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించి మాంట్రియాల్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఓపెనర్ జతిందర్ సింగ్ (57 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), అయాన్ ఖాన్ (15 బంతుల్లో 26; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంట్రియాల్ బౌలర్లలో అయాన్ అఫ్జల్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. కార్లోస్ బ్రాత్‌వైట్, అబ్బాస్ అఫ్రిది, ఆండ్రీ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. Montreal Tigers - Champions of GT20 Canada Season 3 🙌 The Montreal Tigers unleashed a loud Roar and clinched the Title 🏆#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/paLAtYBa1U — GT20 Canada (@GT20Canada) August 6, 2023 అనంతరం అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ సున్నా పరుగులకే వికెట్ కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. అయితే కెప్టెన్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. స్రిమంత (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), దిల్‌ప్రీత్ సింగ్ (15 బంతుల్లో 14; 2 ఫోర్లు) సాయంతో స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించాడు. 60 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో మాంట్రియాల్ 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. The Moment, the Feels, and the Celebrations ❤️#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals pic.twitter.com/ONOQtgOKSK — GT20 Canada (@GT20Canada) August 7, 2023 ఈ దశలో వచ్చిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.. దీపేంద్ర సింగ్ (16 రిటైర్డ్), ఆండ్రీ రసెల్‌ల సాయంతో మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. జాగ్వార్స్ బౌలర్లలో కెప్టెన్ ఇఫ్తికార్ అహ్మద్ (4-0-8-2) అద్భుతంగా బౌల్ చేయగా.. స్పెన్సర్ జాన్సన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ ఆధ్యాంతం రాణించిన రూథర్‌ఫోర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶 Dean Jones - Most Valuable Player ✅ Finals Man of the Match ✅ Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT — GT20 Canada (@GT20Canada) August 7, 2023 -
విండీస్ ఆటగాడి ఒంటరి పోరాటం.. 5 వికెట్లతో చెలరేగిన అఫ్రిది
గ్లోబల్ టీ20 కెనడా లీగ్-2023లో భాగంగా వాంకోవర్ నైట్స్‌తో నిన్న (ఆగస్ట్ 5) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మాంట్రియాల్ టైగర్స్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తద్వారా లీగ్‌లో రెండో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి జరిగే ఫైనల్లో మాంట్రియాల్ టైగర్స్.. సర్రే జాగ్వార్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐదేసిన అఫ్రిది.. క్వాలిఫయర్స్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్.. అబ్బాస్ అఫ్రిది (4-0-29-5) ధాటికి నిర్ణీత ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. అఫ్రిది ఐదు వికెట్లతో చెలరేగగా.. అయాన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. వాంకోవర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (33 బంతుల్లో 39; 2 ఫోర్లు, సిక్స్), కోర్బిన్ బోష్ (28 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు) హర్ష్ ధాకర్ (21 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేయగా.. కెప్టెన్ వాన్ డర్ డస్సెన్, నజీబుల్లా గోల్డెన్ డకౌట్లయ్యారు. రెచ్చిపోయిన రూథర్‌ఫోర్డ్.. 138 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ అతి కష్టం మీద 9 వికెట్లు కోల్పోయి మరో 3 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. విండీస్ ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (34 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటిరిపోరాటం చేసి మాంట్రియాల్‌ను గెలిపించాడు. అతనికి దీపేంద్ర సింగ్ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు), ఆండ్రీ రసెల్ (11 బంతుల్లో 17; ఫోర్, 2 సిక్సర్లు), అయాన్ అఫ్జల్ (14 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) సహకరించారు. వీరు మినహా జట్టులోకి మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వాంకోవర్ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఫేబియన్ అలెన్, కోర్బిన్ బోష్ తలో 2 వికెట్లు, రూబెన్ ట్రంపెల్మెన్ ఓ వికెట్ పడగొట్టారు. -
భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే ఉతికారేశాడు
సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ ఉత్కర్ష పవార్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. తన ప్రదర్శన కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. కానీ పెళ్లి కారణంగా రుతురాజ్ తప్పుకోవడంతో అతని స్థానంలో యశస్వి జైశ్వాల్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్ చాంపియన్‌షిప్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. జూన్ 3-4 తేదీల్లో వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్ 2023)లో బరిలోకి దిగాడు. పుణే ఫ్రాంచైజీ పుణేరి బప్పా జట్టు రూ.14.8 కోట్లతో రుతురాజ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. కాగా ఎంపీఎల్ 2023లో భాగంగా గురువారం రాత్రి పుణేరి బప్పా, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య ఆరంభ మ్యాచ్ జరిగింది. మరో విశేషమేమిటంటే రుతురాజ్ ఈ మ్యాచ్‌లో తన భార్య ఉత్కర్ష పవార్ జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగాడు. కాగా ఉత్కర్ష పవార్ సీఎస్కే స్టాప్ సిబ్బందిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె జెర్సీ నెంబర్ 13.. రుతురాజ్ జెర్సీ నెంబర్ 31.. కానీ నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్ తన భార్యపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె జెర్సీ నెంబర్ అయిన 13తో బరిలోకి దిగాడు. భార్య జెర్సీతో బరిలోకి దిగిన రుతురాజ్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 22 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించిన రుతురాజ్ ఓవరాల్‌గా 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కొల్హాపూర్ టస్కర్స్ విధించిన 145 పరుగుల టార్గెట్‌ను 29 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో రుతురాజ్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు. 16 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ 42.14 సగటుతో 590 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2019 నుంచి సీఎస్కే తరపున ఆడుతున్న రుతురాజ్ 1797 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక టీమిండియా తరపున 9 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన రుతురాజ్ ఒక ఫిఫ్టీ సాయంతో 135 పరుగులు చేశాడు. ⭐️⭐️⭐️⭐️⭐️ Our rating for @Ruutu1331 Also, the number of 6️⃣s he hit tonight! . .#MPLonFanCode pic.twitter.com/SA1h1h6VdT — FanCode (@FanCode) June 15, 2023 చదవండి: ఆఫ్గన్‌తో ఏకైక టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ -
IPL: ఐపీఎల్ కాదు.. అంతకు మించి! వారికి మాత్రం నో చెప్పలేమన్న బీసీసీఐ!
ప్రపంచంలోని టీ20 లీగ్‌లన్నింటిలో ఐపీఎల్‌ది ప్రత్యేక స్థానం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఇతర లీగ్‌లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తూ.. అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ గత పదిహేనేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందీ ఐపీఎల్. ఎక్కడా లేని క్రేజ్ పదహారవ ఎడిషన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్ల స్టార్డమ్ పెంచడం సహా.. అసోసియేట్ దేశాల క్రికెటర్లకు కూడా కావాల్సినంత గుర్తింపు దక్కేలా చేస్తోంది. క్రికెట్‌ను కేవలం ఆటలా కాకుండా మతంలా భావించే కోట్లాది మంది అభిమానులున్న భారత్‌లో ఐపీఎల్‌కు దక్కుతున్న ఆదరణ మరే ఇతర దేశాల లీగ్‌లకు కూడా లేదు. అలాంటిది సౌదీ అరేబియా.. ఐపీఎల్‌ను మించేలా ధనిక లీగ్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తామంటూ చేసిన ప్రకటన చేసిందన్న వార్త క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. సౌదీ సంచలనం? ఫార్ములా వన్ రేసులతో పాటు క్రిస్టియానో రొనాల్డో వంటి పాపులర్ స్టార్లను తమ ఫుట్‌బాల్ లీగ్‌లలో ఆడిస్తూ వార్తల్లో నిలుస్తున్న సౌదీ.. క్రికెట్‌పై కూడా దృష్టి సారించినట్లు ఆ వార్తా కథనాల సారాంశం. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూని మించిన లీగ్‌తో సంచలనం సృష్టించాలని సౌదీ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అవును.. వాళ్లకు ఆసక్తి ఉందన్న ఐసీసీ ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గ్రెగ్ బార్క్లే.. ‘‘అవును.. సౌదీ క్రికెట్‌పై ఆసక్తి కనబరుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. క్రికెట్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తిగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలను సంప్రదించి.. తమతో కలిసి టీ20 లీగ్‌లో భాగం కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలితో కూడా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వచ్చాయి. వారికి మాత్రం నో చెప్పలేము ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భారత క్రికెటర్లెవరూ ఇతర దేశాల లీగ్‌లలో ఆడటం లేదు. అయితే, ఫ్రాంఛైజీలు సదరు లీగ్‌లో పాల్గొనాలా లేదా అన్నది ఓనర్ల ఇష్టం. ఫ్రాంఛైజీ ఓనర్లను అయితే మేము ఆపలేం కదా! అది వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్‌లలో భాగమయ్యాయి. వారికి మేము నో చెప్పలేదు. ప్రపంచంలోని ఏ లీగ్‌లోనైనా పాల్గొనే స్వేచ్ఛ వారికి ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా భారత క్రికెటర్లను విదేశీ టీ20 లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే. అంతసీన్ లేదు! ఒకవేళ ఆటగాళ్లెవరైనా పాల్గొనాలని భావిస్తే మాత్రం బోర్డుతో సంబంధాలన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఫ్రాంఛైజీలు మాత్రం సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్‌లలో పెట్టుబడులు పెట్టినప్పటికీ ఐపీఎల్‌కు క్రేజ్ ముందు ఈ లీగ్‌లు పూర్తిగా తేలిపోతున్నాయి. నిజానికి టీమిండియా క్రికెటర్లు లేకుండా సౌదీ టీ20 లీగ్ ప్రవేశపెట్టినా ఆదరణ విషయంలో ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం ఉండదు. చదవండి: ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ.. గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ.. -
క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉసేన్ బోల్ట్
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చేది చిరుత పులిని తలపించే వేగం. ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ పరుగుల వీరుడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అథ్లెట్‌గా రిటైర్ అయిన బోల్ట్ త్వరలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. చిన్నప్పటి నుంచి ఉసేన్ బోల్ట్‌కు క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. క్రికెట్‌పై అమితమైన ప్రేమ ఉన్నప్పటికి పరిస్థితుల దృష్యా అథ్లెట్‌గా మారాల్సి వచ్చింది. తాజాగా క్రికెటర్ అవ్వాలన్న కలను బోల్ట్ త్వరలో నెరవేర్చుకోబోతున్నాడు. ఇప్పటికే క్రికెటర్‌గా మారడానికి క్రికెట్ కోచింగ్ పాఠాలు వింటూ ప్రాక్టీస్‌లో బిజీ అయ్యాడు. ఇండియా మొట్టమొదటి లైవ్ డిజిటిల్ స్పోర్ట్స్ ఛానెల్ ‘పవర్ స్పోర్ట్స్’ ఆధ్వర్యంలో గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో బోల్ట్ ఆడనున్నాడు. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు బోల్ట్‌కు ఆహ్వానం పంపారు. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకూ ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనబోతున్నాయి. మొదటి ఎడిషన్ ఇండియాలో జరపనున్న నిర్వాహకులు ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూఎస్ఏ, కెనడా, సౌతాఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా లీగ్‌లో పాల్గొననున్న ఎనిమిది జట్లకు ఇండియన్ సప్పైర్స్, ఆస్ట్రేలియాన్ గోల్డ్స్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరీస్, సౌతాఫ్రికా ఎమెరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్ అని పేర్లు పెట్టారు. కాగా ఉసేన్ బోల్ట్‌తో పాటు మునాఫ్ పటేల్, యూసపఫ్ పఠాన్, గుల్భాద్దిన్ నైబ్, ఏంజెలో మాథ్యూస్,ఇయాన్ బెల్ వంటి మాజీ క్రికెటర్లు కూడా గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నారు. -
సౌతాఫ్రికా కొత్త టీ20 లీగ్ పేరు ఖరారు
CSA T20 League: క్రికెట్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభంకానున్న నయా టీ20 లీగ్‌కు పేరు ఖరారైంది. క్రికెట్ సౌతాఫ్రికా ఈ లీగ్‌కు 'ఎస్ఏ20' లీగ్‌గా నామకరణం చేసింది. ఈ మేరకు సీఎస్ఏ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఆరు జట్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఏ20 లీగ్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ యాజమాన్యాలే దక్కించుకోవడంతో క్రికెట్ ప్రేమికలు ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పిలుచుకుంటున్నారు. ఐపీఎల్ తరహాలోనే ఎస్ఏ20లోనూ ఆటగాళ్లను వేలం ద్వారానే దక్కించుకోనున్నారు. సెప్టెంబర్ 19న ఎస్ఏ20 లీగ్ వేలం ప్రక్రియ మొదలవుతుందని సీఎస్ఎ అధ్యక్షుడు, ఎస్ఏ20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు. 2023 జనవరి 23 నుంచి ఎస్ఏ20 లీగ్ ప్రారంభమవుతుందని స్మిత్ సూచనప్రాయంగా వెల్లడించాడు. కాగా, ఈ లీగ్ కోసం ఆయా ఫ్రాంచైజీలు డ్రాఫ్ట్ రూపంలో ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎస్ఏ20 లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీల వివరాలు.. - ఎంఐ కేప్‌టౌన్ (ముంబై ఇండియన్స్) - జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) - పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్) - ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) - సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (సన్ రైజర్స్ హైదరాబాద్) - డర్బన్ (లక్నో సూపర్ జెయింట్స్) చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై -
జట్టును ప్రకటించిన దుబాయ్ క్యాపిటల్స్.. శ్రీలంక కెప్టెన్‌తో పాటు!
యూఏఈ టీ20 లీగ్ లో దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీని ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జీఎంఆర్ గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్ కోసం దుబాయ్ క్యాపిటల్స్ తమ జట్టును గురువారం ప్రకటించింది. విండీస్ పవర్ హిట్టర్ రోవ్మాన్ పావెల్, శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక వంటి ఆటగాళ్లతో దుబాయ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా రోవ్మాన్ పావెల్ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: రోవ్‌మన్ పావెల్, హజ్రతుల్లా జజాయ్, డేనియల్ లారెన్స్, జార్జ్ మున్సే, భానుక రాజపక్సే, నిరోషన్ డిక్వెల్లా, సికందర్ రజా, దాసున్ షనక, ఫాబియన్ అలెన్, ఇసురు ఉదానా, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీర, ఫ్రెడ్ క్లాస్సేన్,ముజారబానీ చదవండి: IND vs ZIM: వన్డేల్లో ధావన్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన! -
CSA T20: జట్టు పేరు, ఇద్దరు ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన సన్‌రైజర్స్!
South Africa T20 League- Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ క్రికెట్ మార్కెట్లో అడుగుపెడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది ఈ లీగ్ ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనబోయే ఆరు ఫ్రాంఛైజీలలో ఒకటైన పోర్ట్ ఎలిజబెత్‌ను సన్‌రైజర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌గా నామకరణం చేసింది. అదే విధంగా వేలం కంటే ముందే తాము ఒప్పందం కుదుర్చుకున్న ఇద్దరు ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. దక్షిణాఫ్రికా టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎయిడెన్ మార్కరమ్‌తో పాటు డెత్‌ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్టు ఒట్నీల్ బార్టమన్(అన్క్యాప్డ్)ను సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. హైదరాబాద్ తరఫున ఎయిడెన్ మార్కరమ్ ఐపీఎల్లో ఇప్పటికే సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2022తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతడు తాజా ఎడిషన్‌లో 381 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2021 నుంచి దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు నాలుగు అర్ధ శతకాలు బాదాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. డెత్‌ఓవర్ల స్పెషలిస్టు ఇక ఒట్నీల్ విషయానికొస్తే.. 29 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు రైట్ ఆర్మ్ పేసర్‌గా రాణిస్తున్నాడు. సీఎస్ఏ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీలో నార్తర్న్ కేప్నకు ప్రాతినిథ్యం వహించాడు. డెత్‌ఓవర్ల స్పెషలిస్టుగా అతడికి పేరుంది. ఇప్పటి వరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడిన అన్క్యాప్డ్ ప్లేయర్.. 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో గతేడాది పాకిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా జట్టుకు ఎంపికైనప్పటికీ అనారోగ్య కారణాల వల్ల దురదృష్టవశాత్తూ జట్టుకు దూరమయ్యాడు. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నిబంధనల ప్రకారం వేలం కంటే ముందే ఆరు జట్లు ఐదుగురు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇందులో ఒకరు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్, మరొకరు ప్రొటిస్ అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా.. View this post on Instagram A post shared by Sunrisers Eastern Cape (@sunrisersec) -
ఆటగాళ్లకు కోట్లలో ఆఫర్.. సొంత లీగ్‌కు తూట్లు పొడిచే యత్నం!
క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్వహించే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)కు ఆటగాళ్లు తూట్లు పొడిచే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది యూఏఈ వేదికగా జనవరిలో ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ 20) ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో కోట్ల రూపాయలు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను ఆడించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడే 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐఎల్టీలో ఆడేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారత కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రతీఏటా బీబీఎల్ డిసెంబర్లో మొదలై.. ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ 13న మొదలుకానున్న బీబీఎల్ ఫిబ్రవరి 4 వరకు జరగనుంది.ఇదే సమయంలో ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ 20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి ఎడిషన్ జరగనుంది. మొత్తం ఆరుజట్లు ఉండగా.. ఈ జట్లను దాదాపు ఐపీఎల్‌తో సంబంధమున్న సంస్థలే కొనుగోలు చేయడం విశేషం. యూఏఈ వేదికగా జరుగుతున్న తొలి సీజన్‌ను విజయవంత చేసేందుకు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని అన్ని జట్లు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడుతున్న 15 మంది ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లకు బీబీఎల్ వదిలేసి.. ఐఎల్టీ లీగ్‌లో పాల్గొనేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈ టి20 లీగ్‌లో ఒక్కో టీమ్‌కి 2.5 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్లు) పర్సు వాల్యూని కేటాయించారు. దీంతో స్టార్ ప్లేయర్లను 450000 డాలర్లు (దాదాపు 3.5 కోట్లు) ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐపీఎల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ మిగిలిన క్రికెట్ లీగులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. పొరుగుదేశం పాక్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధికంగా చెల్లించే మొత్తం రూ.1.9 కోట్లు మాత్రమే... ఐపీఎల్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. దీంతో యూఏఈ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్లు, బిగ్‌బాష్ లీగ్ ఆడకుండా అదే సమయంలో యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు 15 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు రూ.4 కోట్ల దాకా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆశచూపిస్తున్నారని సమాచారం. రూ.4 కోట్లంటే ఐపీఎల్లో అన్క్యాప్డ్ రిజర్వు ప్లేయర్‌కి ఇచ్చే మొత్తం. అయితే బీబీఎల్ ద్వారా వచ్చే దానితో పోల్చుకుంటే, ఆసీస్ క్రికెటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తమే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకి భయం పట్టుకుంది. అయితే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే అనుమతి తప్పనిసరి. కానీ బిగ్‌బాష్ లీగ్‌లో ఆటగాళ్లకు అలాంటి అవసరం లేదు. లీగ్‌లో ఆడాలా వద్దా అనేది ఆటగాళ్ల నిర్ణయానికే వదిలేస్తుంది అక్కడి సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా). అందుకే 2014 నుంచి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు బీబీఎల్ ఆడింది లేదు. వార్నర్ ఒక్కడే కాదు.. చాలా మంది ఆసీస్ క్రికెటర్లు బీబీఎల్‌ను మధ్యలోనే వదిలేసి వేరే లీగ్ ఆడేందుకు వెళ్లిపోతుంటారు. ఆసీస్ క్రికెటర్లు ఆ డబ్బుకి ఆశపడి యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకుంటే, స్టార్ ప్లేయర్లు లేకుండా బీబీఎల్‌ని నిర్వహించాల్సి ఉంటుంది. మిగిలిన దేశాల ప్లేయర్లు కూడా యూఏఈ టీ20 లీగ్ ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తే బీబీఎల్ నిర్వహణే కష్టమైపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోందట ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బీసీసీఐ మాదిరిగానే తమ ప్లేయర్లు, విదేశీ టీ20ల్లో లీగుల్లో పాల్గొనకుండా నియంత్రించాలనే ఆలోచనలో కూడా సమాచారం. ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి యూఏఈ నుంచి 7 లక్షల డాలర్లు (దాదాపు 5.5 కోట్లు) ఆఫర్ వచ్చిందని, అలాగే ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి కూడా దాదాపు రూ.6 లక్షల డాలర్లకు పైగా ఆఫర్ వచ్చందని... ఈ ఇద్దరూ యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాని అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. చదవండి: NED vs NZ: పసికూనపై కివీస్ ప్రతాపం.. సిరీస్ క్లీన్‌స్వీప్ Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! -
CSA T20 League: డర్బన్ ఫ్రాంచైజీ కోచ్‌గా ప్రొటిస్ మాజీ క్రికెటర్
South Africa T20 League- Lance Klusener: దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో పాల్గొనబోతున్న డర్బన్ ఫ్రాంచైజీకి మాజీ క్రికెటర్ లాన్స్ క్లూస్నర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ యజమానులైన ఆర్పీజీ గ్రూప్ డర్బన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. క్లూస్నర్ దక్షిణాఫ్రికా తరఫున 49 టెస్టులు, 171 వన్డేలు ఆడాడు. 2004లో చివరిసారి సఫారీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన అనంతరం అతను కోచ్‌గా మారాడు. కాగా వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో ఈ టీ20 లీగ్ నిర్వహించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ప్రణాళికలు సిద్ధం చేసోతంది. ఇక ఇందులో మొత్తం ఆరు జట్లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ ఫ్రాంఛైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. చదవండి: IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్.. తొలి భారత ఆటగాడిగా! -
దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ టీమ్‌పై రిలయన్స్ కన్ను!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. క్రికెట్ ప్రపంచంలో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన టీ20 లీగ్ టీమ్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో తమ ముంబై ఇండియన్స్ టీమ్ బ్రాండ్ మరింత ప్రాచుర్యంలోకి రాగలదని పేర్కొంది. యూఏఈ టీ20 లీగ్‌లో కూడా ఒక టీమ్‌ను దక్కించుకుంటున్నట్లు రిలయన్స్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీని కూడా కలిపితే మూడు దేశాల్లో తమకు టీ20 టీమ్‌లు ఉన్నట్లవుతుందని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియో ఇనిస్టిట్యూట్ ప్రారంభం.. రిలయన్స్ ఏర్పాటు చేసిన జియో ఇనిస్టిట్యూట్‌లో తొలి బ్యాచ్‌కు తరగతులు ప్రారంభమయ్యాయి. దేశీయంగా అత్యుత్తమ ప్రమాణాలతో ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. ముంబై శివార్లలో 800 ఎకరాల విస్తీర్ణంలో జియో ఇనిస్టిట్యూట్ ఏర్పాటైంది. దీని కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 1,500 కోట్లు వెచ్చించింది. అంతర్జాతీయంగా పేరొందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ మొదలైన వాటితో జియో ఇనిస్టిట్యూట్ భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి. -
సౌతాఫ్రికా టి20 లీగ్‌లో ఆడనున్న ఎంఎస్ ధోని?
ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి సీజన్ ప్రారంభించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) కసరత్తులు చేస్తోంది. టోర్నీలో మొత్తం ఆరు జట్లు ఉండగా.. కేప్‌టౌన్‌ను-ముంబై ఇండియన్స్, జోహన్నెస్‌బర్గ్- చెన్నై సూపర్ కింగ్స్, డర్బన్- లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజిబెత్- ఎస్ఆర్హెచ్, ప్రిటోరియా-ఢిల్లీ క్యాపిటల్స్, పార్ల్- రాజస్తాన్ రాయల్స్ దక్కించకున్నాయి. కాగా జోహన్నెస్‌బర్గ్‌ను దక్కించుకున్న సీఎస్కే నుంచి ఇంకో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సీఎస్కే తరపున విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన ఎంఎస్ ధోని సౌతాఫ్రికా టి20లీగ్‌లో ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్కేతో ఉన్న అనుబంధం దృశ్యా ప్రొటిస్ టి20 లీగ్‌లో ఆడనున్నట్లు తెలిసింది. ఇది నిజమైతే మాత్రం సీఎస్కే కొనుగోలు చేసిన జోహన్నెస్‌బర్గ్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఐపీఎల్లో ధోని ఎంత సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కేలో కొనసాగిన ధోని జట్టును నాలుగుసార్లు విజేతగా(20210, 2011,2018, 2021).. మరో ఐదుసార్లు రన్నరప్‌గా(2008,2012,2013,2015,2019) నిలిపాడు. 2010, 2014లో ధోని సీఎస్కేకు చాంపియన్స్ లీగ్ టి20 టైటిల్స్ అందించాడు. గత ఐపీఎల్ సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. కానీ అంచనాలకు భిన్నంగా దారుణంగా విఫలమైన సీఎస్కే నిరాశపరిచింది. దీంతో సీజన్ మధ్యలోనే జడ్డూ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మళ్లీ ధోనినే కెప్టెన్సీ అందుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్ ధోనికి ఆఖరిదని అంతా భావించినప్పటికి.. ఆ వార్తలను ఖండించిన ధోని తర్వాతి సీజన్లోనూ ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ -
పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే
క్రికెట్లో అత్యంత విజయవంతమైన లీగ్‌గా పేరు పొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). క్యాష్‌రిచ్ లీగ్‌గా ముద్రించుకున్న ఈ టోర్నీ ఆటగాళ్లకు కాసుల పంట పండిస్తుంది. వేలంలో కోట్ల రూపాయలను గుమ్మరించే ఐపీఎల్ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌ల్లోనూ తమ హవాను చూపించడం మొదలెట్టాయి. ఇప్పటికే యూఏఈ వేదికగా జరిగే టి10 లీగ్, యూఎస్ఏ వేదికగా జరిగే టి20 లీగ్‌లో జట్లను కొనుగోలు చేయడంలో మన ఫ్రాంచైజీలు ముందు వరుసలో ఉంటాయి. తాజాగా సౌతాఫ్రికా టి20 లీగ్ పేరిట క్రికెట్ సౌతాఫ్రికా టోర్నీని ప్లాన్ చేసింది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిల్లో టోర్నీ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కాగా ఇందులో మొత్తం ఆరు టీమ్‌లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం విశేషం. ఆ ఆరు జట్లు ఏంటంటే.. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్గా ఉన్నాయి. ఫ్రాంచైజీల పేర్లు కొనుగోలు చేసినవి కేప్‌టౌన్ ముంబై ఇండియన్స్ జోహన్నెస్‌బర్గ్ చెన్నై సూపర్ కింగ్స్ డర్బన్ లక్నో సూపర్ జెయింట్స్ పోర్ట్ ఎలిజిబెత్ ఎస్ఆర్హెచ్ ప్రిటోరియా ఢిల్లీ క్యాపిటల్స్ పార్ల్ రాజస్తాన్ రాయల్స్ దీంతో పేరుకు సౌతాఫ్రికా టి20 లీగ్‌లా కనిపిస్తున్నప్పటికి పరోక్షంగా మరో ఐపీఎల్‌ను తలపిస్తోందనే చెప్పొచ్చు. ఇప్పటికైతే సిటీల పేర్లనే ఫ్రాంచైజీలుగా పిలుస్తున్నప్పటికి మరికొన్ని రోజుల్లో టోర్నీకి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి కానుంది. ఆ తర్వాత టోర్నీలో పాల్గొనబోతున్న ఫ్రాంచైజీల పేర్లు మారనున్నాయి. ఇక గ్రేమి స్మిత్‌ను ఈ టోర్నీకి కమిషనర్‌గా నియమించింది క్రికెట్ సౌతాఫ్రికా. బ్రాడ్కాస్ట్ హక్కులకు సంబంధించి క్రికెట్ సౌతాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకున్న సూపర్ స్పోర్ట్స్ చానెల్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. చదవండి: Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జై షా చెప్పిందే నిజమైంది.. ఐపీఎల్‌పై ఐసీసీ కీలక నిర్ణయం -
కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
క్రికెట్లో అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తర్వాత ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్), టి10 లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక వీటి జాబితాలోకి సౌతాఫ్రికా కూడా చేరనుంది. క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సౌతాఫ్రికా టి20 లీగ్ పేరిట కొత్త టోర్నీని నిర్వహించనుంది. ఈ టోర్నీ వెనుక పరోక్షంగా ఐపీఎల్ ప్రాంచైజీలు ఉండడం విశేషం. మొత్తం ఆరు టీమ్‌లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం విశేషం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ పేర్లతో ఉన్న ప్రాంచైజీలను ముంబై ఇండియన్స్, సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేశాయి. ఈ కొత్త టి20 లీగ్‌కు ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు గ్రేమీ స్మిత్‌ను కమిషనర్‌గా ఎంపిక చేసింది. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, కామెంటేటర్‌గా, అంబాసిడర్‌గా, కన్సల్టెంట్‌గా ఎన్నో ఘనతలు సాధించిన స్మిత్.. తాజాగా సీఎస్ఏలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్(డీఓసీ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సౌతాఫ్రికాలో క్రికెట్‌ను జాతీయంగా మరింత పటిష్టంగా తయారు చేయాలని.. కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడానికే ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు సీఎస్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా టి20 లీగ్ కమిషనర్‌గా ఎంపికైన స్మిత్ స్పందించాడు. ''కొత్త తరహా టోర్నీకి కమిషనర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా. సౌతాఫ్రికా క్రికెట్‌కు పనిచేయడానికి ఎంత సమయమైనా సంతోషంగా కేటాయిస్తా. ఇలాంటి పోటీతత్వం ఉన్న కొత్త టి20 లీగ్‌ను నడిపించేందుకు దైర్యం కావాలి. అది ఉందనే నమ్ముతున్నా. దేశవాలీ క్రికెట్లో మనకు తెలియని అద్బుత ఆటగాళ్లను వెలికి తీయాలనేదే సీఎస్ఏ ప్రధాన ఉద్దేశం. అందుకే సౌతాఫ్రికా టి20 లీగ్‌ను ప్రారంభించనుంది. ఆరంభ దశలో సక్సెస్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోలెట్సీ మోసికీ కొత్త బాధ్యతలు తీసుకున్న గ్రేమీ స్మి్త్‌కు శుభాకాంక్షలు తెలపగా.. దక్షిణాఫ్రికాకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు స్మిత్‌ను అభినందనల్లో ముంచెత్తారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ టోర్నీ జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ రెండు నెలల విండో క్రికెట్‌కు అనుమతించాలని బీసీసీఐ ఐసీసీని కోరగా.. అందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐపీఎల్‌కు ఆటంకం లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించాలని సీఎస్ఏ భావిస్తోంది. ఇక గ్రేమి స్మిత్ దక్షిణాఫ్రికా తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అంతేగాక ఆల్‌టైమ్ టెస్టు కెప్టెన్లలో స్మిత్ పేరు కూడా ఉంటుంది. సౌతాఫ్రికాకు 54 టెస్టుల్లో విజయాలు అందించి.. అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా స్మిత్ రికార్డు సృష్టించాడు. 2003లో షాన్ పొలాక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న స్మిత్.. 2014లో తాను రిటైర్ అయ్యే వరకు టెస్టు కెప్టెన్‌గా కొనసాగడం విశేషం. ఇక బ్యాటింగ్‌లోనూ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్స్ జాబితాలో స్మిత్ పేరు కచ్చితంగా ఉంటుంది. 2002-2014 వరకు సౌతాఫ్రికా తరపున స్మిత్ 117 టెస్టుల్లో 9265 పరుగులు, 197 వన్డేల్లో 6989 పరుగులు, 33 టి20ల్లో 982 పరుగులు సాధించాడు. స్మిత్ ఖాతా 27 టెస్టు సెంచరీలు, 10 వన్డే సెంచరీలు ఉన్నాయి. చదవండి: యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు -
UAE T20 League: యూఏఈ టి20 లీగ్‌లో ఐదు జట్లు మనవే
UAE's International League T20: ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే యూఏఈ టి20 లీగ్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 6న టోర్నీ ప్రారంభమై ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం 6 జట్లు లీగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిలో భారత్‌కు చెందిన సంస్థలే 5 టీమ్‌లను కొనుగోలు చేయడం విశేషం. ఐపీఎల్ టీమ్‌లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నైట్‌రైడర్స్ గ్రూప్, జీఎంఆర్ మూడు జట్లను ఎంచుకోగా... అదానీ స్పోర్ట్స్‌లైన్, క్యాప్రీ గ్లోబల్ కూడా భారతీయ కంపెనీలే. మరో టీమ్‌ను మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన లాన్సర్ క్యాపిటల్స్ చేజిక్కించుకుంది. ఇప్పటికే ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అను భవం ఉన్న యూఏఈ బోర్డు తమ సొంత లీగ్‌ను కూడా విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉంది. చదవండి: World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత -
క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ తరహాలో మరో లీగ్
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో మరో టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ క్రికెట్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో జరుగనుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్‌ను వచ్చే ఏడాది (2023) జనవరిలో నిర్వహించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు ఒక్కో జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్ దశకు చేరుకుంటాయి. ఇక్కడ ఈ మూడు జట్లు ప్రతి జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ స్టేజీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. 3 నుంచి 4 వారాల పాటు సాగే ఈ లీగ్‌లో మొత్తం 33మ్యాచ్‌లు జరుగుతాయి. ఐపీఎల్ తరహాలో ఈ లీగ్‌లోనూ ప్రతి జట్టులో నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లు (విదేశీ) ఉంటారు. వేలం ప్రక్రియ ద్వారా ఆటగాళ్ల కొనుగోలు జరుగుతుంది. వేలం తేదీలు, మ్యాచ్‌ల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఈ లీగ్ విజయవంతమైతే తదనంతరం మహిళల టీ20 లీగ్ కూడా ప్రారంభిస్తామని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. కాగా, ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దేశాల్లో ఇదివరకే టీ20 లీగ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్ శర్మ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేసిన యువీ -
2016 టి20 ప్రపంచకప్ హీరోకు వింత అనుభవం..
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్కు వింత అనుభవం ఎదురైంది. గాయం కారణంగా జట్టుకు ఆరు నెలలపాటు దూరమైన బ్రాత్‌వైట్ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి డొమొస్టిక్ క్రికెట్లో బిజీగా ఉన్నాడు. తాజాగా బ్రాత్‌వైట్ బర్మింగ్హమ్ డిస్ట్రిక్ట్ ప్రీమియర్ లీగ్‌లో నోల్ అండ్ డోరిడ్జ్ సీసీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆరు నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రాత్వైట్కు నిరాశే ఎదురైంది. లీమింగ్టన్ సీసీతో మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ తొలి బంతికే ఔటయ్యాడు. భారీషాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి గోల్డెన్‌డక్ అయ్యాడు.ఆ తర్వాత బౌలింగ్‌లోనూ బ్రాత్‌వైట్ పెద్దగా రాణించలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా నిరాశజనక ప్రదర్శనతో రోజును ముగించే పనిలో ఉన్న బ్రాత్వైట్కు మరొక బిగ్‌షాక్ తగిలింది. తనకు ఎంతో ఇష్టమైన కారును కూడా ఎవరో దొంగలించారు. ఈ విషయం తెలుసుకున్న బ్రాత్‌వైట్ ట్విటర్లో తెగ బాధపడిపోయాడు. ''నిన్నటి రోజు నాకు పీడకల లాంటిది.. ఆరు నెలల తర్వాత మ్యాచ్ ఆడాను.. డకౌట్ అయ్యాడు.. బౌలింగ్ వేశాను.. అందులోనూ నిరాశే ఎదురైంది.. ఇక రోజు చివరలో నా కారును ఎవరో దొంగతనం చేశారు.. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. ఇన్ని చెత్త విషయాల మధ్య ఒక మంచి విషయం ఏంటో చెప్పనా.. మరుసటిరోజు తెల్లవారుజామునే సూర్యుడు మెరుస్తూ నాకు వెల్కమ్ చెప్పాడు.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా బ్రాత్‌వైట్ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన దశలో బ్రాత్‌వైట్ నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్ రెండోసారి టి20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బ్రాత్‌వైట్ విండీస్ తరపున 3 టెస్టులు, 44 వన్డేలు, 41 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: BCCI: 'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు' Wasim Jaffer: 'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్కే పరిస్థితి ఇదే What a day yesterday - First time bowling in a game after injury for six months 💩 - First ball duck from a long hop 😫 - Car stolen 🤬 But you know what , woke up this morning , Sun is shining and giving thanks 🙏🏾 — Carlos Brathwaite (@CRBrathwaite26) April 17, 2022 Carlos Braithwaite Golden Duck for Knowle & Dorridge today 😳 pic.twitter.com/92P8fIcpSm — Will (@Will27375624) April 16, 2022 -
క్రీజులోకి వస్తూనే ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్స్ చేశాడు
క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్‌మన్ బంతి ఎదుర్కొవడానికి ముందు గార్డ్ ఇవ్వడం ఆనవాయితీ. రైట్ హ్యాండ్ అయితే రైట్గార్డ్.. లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ గార్డ్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాటర్ మాత్రం ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్ చేశాడు. ఎంసీఏ టి20 క్లబ్స్ ఇన్విటేషన్ 2020లో భాగంగా కేఎల్ స్టార్స్, రాయల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రాయల్ వారియర్స్ వికెట్ కీపర్ హరీందర్‌జిత్ సింగ్ కొత్త బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చాడు. వాస్తవానికి హరీందర్‌జిత్ రైట్ హ్యాండ్ బ్యాటర్. కానీ బ్యాటింగ్ గార్డ్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ గార్డ్ చూపించాడు. ఇది చూసిన అంపైర్ కూడా ఆల్రైట్ అన్నాడు. కేఎల్ స్టార్స్ కెప్టెన్ కూడా హరీందర్‌జిత్ బ్యాటింగ్ శైలికి అనుగుణంగా ఫీల్డర్లను సెట్ చేశాడు. బౌలర్ బంతి విసరడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. అప్పటివరకు లెఫ్ట్‌హ్యాండ్ ఆర్డర్లో ఉన్న హరీందర్ జిత్.. ఒక్కసారిగా రైట్‌హ్యాండ్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది చూసిన మనకు షాక్.. మైదానంలో ఉన్న ఆటగాళ్లు కూడా షాక్ తిన్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నవ్వులు విరపూశాయి. కేఎల్ స్టార్స్ కెప్టెన్ కూడా ఫీల్డింగ్ ఆర్డర్ మార్చాడు. అలా అంపైర్‌తో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను వస్తూనే ఫూల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను హరీందర్ జిత్ షెకాన్ ట్విటర్లో షేర్ చేశాడు. '' నేను క్రికెట్ ఆడుతున్న ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటిది ఇంతకముందు ఎప్పుడు జరగలేదు.. నాతోనే ఇది సాధ్యమైంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాయల్ వారియర్స్ 51 పరుగుల తేడాతో కేఎల్ స్టార్స్‌పై విజయం సాధించింది. ఆటగాళ్లను ఫూల్ చేసిన హరీందర్‌జిత్ షెకాన్ 48 బంతుల్లో 56 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అతని స్కోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ వారియర్స్ 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది. 125 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయల్ వారియర్స్ 74 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: World Cup 2022: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్... గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో! IPL 2022: ఇదేం షాట్ అయ్యా యష్ ధుల్ .. నేనెక్కడా చూడలే.. బంతిని చూడకుండానే! Never seen anything like this before in all my years of cricket 🤣🤣 Just wait for it..🤣 pic.twitter.com/HOO82voD5y — Harinder Sekhon (@harinsekhon9) March 21, 2022 -
Andre Fletcher: దూసుకొచ్చిన బంతి.. కుప్పకూలిన వెస్టిండీస్ బ్యాటర్.. అయితే..
BPL 2022: వెస్టిండీస్ బ్యాటర్ ఆండ్రీ ఫ్లెచర్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఖుల్నా టైగర్స్, చట్టోగ్రామ్ చాలెంజర్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఖుల్నాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్లెచర్‌కు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయమైంది. ప్రత్యర్థి జట్టు బౌలర్ రహమాన్ రజా సంధించిన బంతి మెడకు బలంగా తాకడంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఫ్లెచర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఖుల్నా టైగర్స్ మేనేజర్ తెలిపారు. ‘‘తనకు ఎటువంటి ప్రమాదం లేదు. ముందు జాగ్రత్త చర్యగానే ఆస్పత్రికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం బాగానే ఉన్నాడు’’ అని పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టైగర్స్‌కు ఓటమే ఎదురైంది. 25 పరుగుల తేడాతో చిట్టోగ్రామ్ చాలెంజర్స్.. టైగర్స్‌పై విజయం సాధించింది. ఒక వికెట్ తీయడంతో పాటుగా.... 34 పరుగులతో అజేయంగా నిలిచిన బెన్నీ హావెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. స్కోర్లు: చిటోగ్రామ్- 190/7 (20) టైగర్స్- 165/9 (20) -
కొత్త జట్ల కొనుగోలుపై షారుక్, ముంబై ఇండియన్స్ ఆసక్తి !.. ఐపీఎల్ కాదు
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ కొత్తగా ప్రారంభించిన టి20 లీగ్‌లో కేకేఆర్ సహా యజమాని షారుక్ ఖాన్ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై షారుక్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. షారుక్‌తో పాటు ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కూడా టి20 లీగ్‌లో జట్ల కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అందింది. దీంతోపాటు నాలుగుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్కే మొదట్లో ఆసక్తి కనబరిచినా.. తాజాగా పక్కకు తప్పుకున్నట్లు తెలిసింది. చదవండి: MS Dhoni: సాక్షి ధోని బర్త్‌డే వేడుకలు.. అదరగొట్టిన ధోని బిగ్‌బాష్ లీగ్ జట్టు సిడ్నీ సిక్సర్స్ కూడా కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఇక ఆగస్టులో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రీమియర్ లీగ్ టి20 పేరిట క్రికెట్ లీగ్‌ను రిజిస్టర్ చేసింది. దీనికి యూఏఈ జాతీయ చిహ్నం అయిన ఫాల్కన్‌ను సింబల్‌గా లోగోను తయారు చేసింది. ప్రతీ ఏడాది జనవరి- ఫిబ్రవరి నెలలో టోర్నమెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు ఉండనున్నాయి. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు -
ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్‌ను ప్లాన్ చేసిన గంభీర్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఐపీఎల్ తరహాలో ఓ లోకల్ టీ20 టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు రచించాడు. తూర్పు ఢిల్లీలోని 10 నియోజకవర్గాల మధ్య ఈ క్రికెట్ టోర్నీని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభమైపోయాయి. ఇక టోర్నీ వివరాల్లోకి వెళితే.. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడిన ముగ్గురు సెలెక్టర్లు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో ట్రయల్స్ అనంతరం సెలెక్షన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు 17 సంవత్సారాలు నిండినవారై ఉండాలి. అలాగే 36 ఏళ్లకు మించి ఉండకూడదు. ప్రతి జట్టు బేస్ ధర నిర్ణయించిన తరువాత ఆటగాళ్ల వేలం జరుగనుంది. అంతేకాకుండా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేయడం, క్రికెట్ కిట్లు అందించడం, ఇతర సౌకర్యాలకు ఏ లోటూ రాకుండా చూడడం జరుగుతుందని గంభీర్ వెల్లడించారు. ఈ టోర్నీ అక్టోబర్ చివరి వారంలో మొదలై.. నవంబర్ వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నాడు. -
ఆంధ్ర క్రికెటర్లు భారత జట్టులోకి ఎంపికవ్వాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడుతున్న యువ ఆటగాళ్లు భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ఆకాంక్షించారు. యువ క్రికెటర్లలను ప్రోత్సహించడంలో, వారికి తగిన అవకాశాలు ఇవ్వడంతో ఏసీఏ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర టి20 లీగ్‌ను ఆయన ఆర్డీటీ మైదానంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ నవంబర్ 8 వరకు జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. తొలి రోజు మ్యాచ్‌ల్లో కింగ్స్ ఎలెవన్‌పై 6 వికెట్లతో టైటాన్స్ ఎలెవన్ గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో చార్జర్స్ ఎలెవన్ జట్టు 56 పరుగులతో లెజెండ్స్ ఎలెవన్‌ను ఓడించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏసీఏ రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్, సీఈఓ వెంకటశివారెడ్డి, ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి, అండర్–14 ఆంధ్ర జట్టు సెలెక్టర్ ప్రసాద్‌రెడ్డి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, మాజీ క్రికెటర్ షాబుద్దీన్ తదితరులు హాజరయ్యారు. -
కీపర్ రాకెట్ త్రోకు దిమ్మతిరిగింది
-
కీపర్ రాకెట్ త్రోకు దిమ్మతిరిగింది
చెస్టర్ లీ స్టీట్: ఇంగ్లండ్‌లో జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‌లో దుర్హామ్ వికెట్ కీపర్ ఫర్హాన్ బెహర్డియన్ విసిరిన అద్భుతమైన త్రోకు లీసెస్టర్‌షైర్ కెప్టెన్ కొలిన్ అకర్మ్యాన్కు దిమ్మతిరిగింది. నాన్‌స్టైకర్ ఎండ్‌వైపు రాకెట్ వేగంతో విసిరిన ఆ త్రో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయయింది. లీసస్టర్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేసే క్రమంలో ఇన్నింగ్స్ 9 ఓవర్ రెండో బంతికి అకర్‌మ్యాన్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. బంతిని హిట్ చేసి పరుగు కోసం యత్నించే సమయంలో రనౌట్ అయ్యాడు. కాగా, అప్పటికే బంతిని పట్టుకున్న కీపర్ బెహర్దియన్.. ఆ బంతిని వేగంగా నాన్‌స్టైకర్ ఎండ్ వైపు ఉన్న వికెట్లపైకి విసిరాడు. అంతే అకర్‌మ్యాన్ క్రీజ్‌లోకి చేరేలోపే వికెట్లు ఎగిరిపడటంతో భారంగా పెవిలియన్‌కు చేరాడు. అకర్‌మ్యాన్ పది పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో దుర్హామ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఆ తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దుర్హామ్ జట్టు 15. 2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
లంక అంటూ పంజాబ్‌లో ఆడించారు...
న్యూఢిల్లీ: శ్రీలంకకు చెందిన రెండు జట్లు మొనరగల హార్నెట్స్, వెల్లవాయ వైపర్స్... ఇరు జట్ల మధ్య టి20 లీగ్ మ్యాచ్. పలు సోషల్ మీడియా సైట్లలో ప్రత్యక్ష ప్రసారం కూడా. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్లో స్కోరు కార్డు. వేదిక శ్రీలంకలోని బదుల్లా పట్టణం. కామెంటేటర్ కూడా ‘ఇక్కడ బదుల్లాలో మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది, వాతావరణం బాగుంది’ అంటూ వ్యాఖ్యానం. పైగా అక్కడక్కడా శ్రీలంక ప్రముఖ మొబైల్ కంపెనీ డైలాగ్‌కు చెందిన బ్యానర్లు కూడా... కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే వుంది. ఈ మ్యాచ్ జరిగింది లంకలో కాదు. భారత్‌లోనే... చండీగఢ్‌కు 16 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారిపై ఉన్న సవారా గ్రామంలో మ్యాచ్ నిర్వహించారు. యువా టి20 లీగ్ పేరుతో ఈ టోర్నీ జరుగుతున్నట్లు కొందరు చెప్పారు. కానీ కరోనా కట్టుబాట్ల నేపథ్యంలో ఒక మ్యాచ్ ఎలా సాధ్యమంటూ వివరాల్లోకి వెళితే ఇది బయటపడింది. ఆన్లైన్ బెట్టింగ్ కోసమే ఇలాంటి మ్యాచ్ ఆడించినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆడింది అంతా పంజాబ్ కుర్రాళ్లే. శ్రీలంకలో గుర్తింపు పొందిన క్లబ్ యువా పేరు వాడుకొని కొందరు తెలివిగా ఇలా చేసినట్లు తెలిసింది. లంక బోర్డు తమకు టోర్నీ నిర్వహణ కోసం అధికారికంగా అనుమతి కూడా ఇచ్చినట్లు చూపించడంతో ప్రత్యక్ష ప్రసారానికి ‘ఫ్యాన్‌కోడ్’ అనే సైట్ ముందుకు వచ్చింది. దీనిపై ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఎవరూ ఇందులో పాల్గొనలేదు కాబట్టి తాము ఎలాంటి చర్య తీసుకోలేమని బీసీసీఐ స్పష్టం చేయగా... శ్రీలంక కూడా తమకు, ఈ టోర్నీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ప్రత్యక్ష ప్రసారం చేసిన ‘ఫ్యాన్ కోడ్’ మాతృసంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ కాగా...వారికి చెందిన బ్రాండ్, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’ ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటి. దీనికి ధోని అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. -
సూపర్ స్మాష్‌లో ‘సూపర్ మ్యాన్’ క్యాచ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వేదికగా ముగిసిన సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో వెల్లింగ్టన్ విజేతగా నిలిచింది. ఆక్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ వెల్లింగ్టన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా, ఆక్లాండ్ ఫీల్డర్ కాచోపా పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ముందుగా వెల్లింగ్టన్ బ్యాటింగ్‌కు దిగిన క్రమంలో ఓపెనర్ డెవాన్ కాన్వే(49) మిడ్ ఆఫ్ మీదుగా షాట్ ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కాచోపా గాల్లోకి ఎగిరిమరీ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. మెక్లీన్గన్ బౌలింగ్‌లో పవర్ ఫుల్ డ్రైవ్ కొట్టాడు. అంతే వేగంగా స్పందించిన కాచోపా కాస్త ఎడంగా వెళుతున్న బంతిని వెంటాడి మరీ పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా, ఆక్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. Craig Cachopa's 'flying' catch in the #SuperSmashNZ final is 🤯pic.twitter.com/Zd9XhtHsWT — T20 World Cup (@T20WorldCup) January 19, 2020 -
పంజాబ్ ఊపిరి పీల్చుకో.. అతడొస్తున్నాడు
హైదరాబాద్: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా పెర్త్ స్కాచర్స్ తరుపున ఆడుతున్న ఈ పేసర్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. బీబీఎల్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-పెర్త్ స్కాచర్స్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆ సంఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ క్రిస్టియాన్ లాంగాన్ వైపు భారీ షాట్ కొట్టాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్ గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన క్రిస్టియాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది. దీంతో ఈ స్టన్నింగ్ క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక తాజాగా ముగిసిని ఐపీఎల్ వేలంలో క్రిస్ జోర్డాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 3 కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌కు జోర్డాన్ రూపంలో బౌలర్‌తో పాటు మంచి ఫీల్డర్ దొరికాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘పంజాబ్ ఊపిరి పీల్చుకో.. మిమ్మల్ని గెలిపించడానికి జోర్డాన్ వస్తున్నాడు’ అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ 185 పరుగులకే పరిమితమై ఓటమిచవిచూసింది. ఐపీఎల్లో అంతగా మంచి రికార్డులు లేని జోర్డాన్ ఈసారి పంజాబ్ తరుపున ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. తాజాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని నయా పంజాబ్ జట్టు వచ్చే సీజన్లో శక్తిమేర పోరాడాలని భావిస్తోంది. Chris Jordan, just wow! 🤯 pic.twitter.com/yVH67BZpdq — ICC (@ICC) December 21, 2019 -
క్రికెట్ ఫీల్డ్‌లోనే మ్యాజిక్ చేశాడు!
పారీ(దక్షిణాఫ్రికా): భారత్‌తో ఇటీవల జరిగిన ఒక టీ20లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షమ్సీ విన్నూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. శిఖర్ ధావన్ వికెట్‌ను తీసిన తర్వాత షమీ తన కాలి షూను తీసి చెవి దగ్గర పెట్టుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అది అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు షమ్సీ. మాన్షి టీ20 లీగ్‌లో భాగంగా పారీ రాక్స్ తరఫున ఆడుతున్న షమీ.. బుధవారం డర్బన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో సెలబ్రేషన్స్‌కు మ్యాజిక్ జోడించాడు. షమ్సీ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అదే సమయంలో ముందుగా చేతుల్లోకి ఒక క్లాత్ తీసుకున్న షమ్సీ.. దానిని స్టిక్‌గా మార్చాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం షమ్సీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలానే చేశాడు. నవంబర్ నెలలో ఈ లీగ్‌లో జోజి స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం షమ్సీ ఇదే తరహా మ్యాజిక్‌తో అభిమానుల్ని అలరించాడు. ప్రస్తుత మ్యాజిక్ వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో డర్బన్ హీట్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పారీ టీమ్ 195 పరుగులు చేయగా, డర్బన్ హీట్ 18.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్(97 నాటౌట్), డేవిడ్ మిల్లర్(40)లు డర్బన్ హీట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. WICKET! A bit of magic from @shamsi90 🎩 #MSLT20 pic.twitter.com/IxMqRYF1Ma — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) December 4, 2019 -
ఎలాగైనా బౌలింగ్ చేస్తా.. వికెట్ తీస్తా!
కేప్‌టౌన్: క్రికెట్లో రెండు చేతులతో బౌలింగ్ చేయడం చాలా అరుదు. గతంలో శ్రీలంక స్పిన్నర్ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు అదే తరహా బౌలింగ్‌తో మరొక బౌలర్ వచ్చేశాడు. తనకు కుడి-ఎడమ తేడా లేదంటున్నాడు దక్షిణాఫ్రికా గ్రెగొరీ మహలోక్వానా. రెండు చేతులతో బౌలింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎంతో శ్రమిస్తేకానీ ఇలా బౌలింగ్ చేయలేదు. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎమ్జాన్సీ టీ20 సూపర్ లీగ్‌లో గ్రెగొరీ రెండు చేతులతో బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా సాధించాడు. కేప్‌టౌన్ బ్లిట్జ్ తరఫున ఆడుతున్న గ్రెగొరీ.. ఆదివారం డర్బన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధించాడు. తొలుత కుడి చేతి బౌలింగ్ చేసి ఓపెనర్ సారే ఎర్వీని ఔట్ చేసిన గ్రెగొరీ..ఆపై ఎడమ చేతితో బౌలింగ్ చేసి డానే విలాస్‌ను బోల్తా కొట్టించాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో కేప్‌టౌన్ బ్లిట్జ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్ ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, డర్బన్ హీట్ ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేసింది. WICKET | SJ Erwee c Linde b Mahlokwana 16 (23b 1x4 0x6) SR: 69.56 Will the ambidextrous Mahlokwana be able to take a left handed and a right handed wicket today?#MSLT20 pic.twitter.com/rkw29YIb3g — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) November 17, 2019 WICKET | DJ Vilas b Mahlokwana 8 (10m 8b 0x4 0x6) That's Mahlokwana's second of the day. His first wicket was bowled Right handed and now he gets a wicket with the quicker left arm.#MSLT20 pic.twitter.com/Gey4JPypq1 — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) November 17, 2019 -
యువీతోనే ఆఖరు!
న్యూఢిల్లీ: విదేశాల్లో టి20 టోర్నీలు ఆడేందుకు భారత క్రికెటర్లెవరికీ ఇకపై నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ)లు ఇవ్వమని క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) తెలిపింది. కెనడాలో జరిగిన గ్లోబల్ టి20లో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు అనుమతించిన బోర్డు... ఇదే ఆఖరి ఎన్ఓసీ అని తేల్చిచెప్పింది. సీఓఏ సభ్యుడొకరు మాట్లాడుతూ ‘యువీకి ఎన్ఓసీ ఇచ్చాం. ఇక్కడితోనే సరిపెట్టాలనుకుంటున్నాం. ఇకమీదట ఏ భారత క్రికెటర్ విదేశీ లీగ్‌లో ఆడేందుకు ఎన్ఓసీ ఇవ్వబోం’ అని అన్నారు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారులు విస్మయం ప్రకటించారు. రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లను ఇక ఏ టోర్నీలోనూ ఆడకుండా చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బోర్డులో సరైన పాలక వ్యవస్థ లేకపోతే ఇలాంటి అనిశ్చిత నిర్ణయాలే వస్తాయని ఓ అధికారి అన్నారు. మరో అధికారి మాట్లాడుతూ ‘ఒక దేశానికి రిటైర్ అయినంత మాత్రాన మొత్తం భౌగోళిక ప్రాంతానికి రిటైర్మెంట్ ప్రకటించినట్లు కాదు. ఒక దేశపు రిటైర్డ్ క్రికెటర్లను అనుమతించడమనేది నిర్వాహకుల ఇష్టం. ఇందులో ఏమైన సమస్య ఉం టే ఐసీసీ చూసుకుంటుంది. కానీ మనమే ఆడించకుండా నిర్ణయం తీసుకోవడం అవివేకం’ అని అన్నారు. -
టీ20 క్రికెట్ చరిత్రలో నయా రికార్డు
లీసెస్టర్: టీ20 క్రికెట్ చరిత్రలో నయా రికార్డు లిఖించబడింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కొలిన్ అక్రమాన్ ఏడు వికెట్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విటలిటీ బ్లాస్ టీ20 లీగ్‌లో భాగంగా లీసెస్టర్ షైర్ కెప్టెన్ కొలిన్ ఆక్కర్మాన్ ఏడు వికెట్లతో చెలరేగిపోయాడు. బుధవారం వార్విక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో కొలిన్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థి జట్టులోని మైకేల్ బర్గెస్, సామ్ హైన్, విల్ రోడ్స్, లియామ్ బ్యాంక్స్, అలెక్స్ థామ్సన్, హెన్రీ బ్రూక్స్, జీతన్ పటేల్ వికెట్లు సాధించాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో వార్విక్ షైర్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లీసెస్టర్ షైర్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. హరీ స్విండెల్స్(63), లూయిస్ హిల్(58)లు హాఫ్ సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఆపై 190 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన వార్విక్ షైర్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై సామ్ హైన్(61), ఆడమ్ హోస్(34)లు ఆదుకోవడంతో ఆ జట్టు మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తరుణంలో కొలిన తన బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. అతనికి ధాటికి వార్విక్షైర్ 17.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. 0️⃣3️⃣4️⃣W0️⃣1️⃣0️⃣1️⃣1️⃣1️⃣1️⃣1️⃣W2️⃣W0️⃣W0️⃣W1️⃣1️⃣W1️⃣W Colin Ackermann takes 7/18 - the best bowling figures in T20 history ➡️ https://t.co/afo2WOG7iX pic.twitter.com/BLgpf0H2F1 — Vitality Blast (@VitalityBlast) August 7, 2019 -
మా డబ్బులిస్తేనే ఆడతాం!
బ్రాంప్టన్ (కెనడా): ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టి20 లీగ్‌ల నిర్వహణలో ఇది మరో కోణం! ప్రముఖ క్రికెటర్లు ఎంతో మంది పాల్గొంటున్న కెనడా గ్లోబల్ టి20 లీగ్‌లో బుధవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్లో భాగంగా మాంట్రియల్ టైగర్స్, టొరంటో నేషనల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే హోటల్ నుంచి స్టేడియంకు బయల్దేరే సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ ఆడమంటూ ఒక్కసారిగా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించారు. లీగ్ నిర్వాహకులు తమకు భారీ మొత్తం బాకీ ఉన్నారని, తమ డబ్బుల విషయం తేలిస్తే తప్ప టీమ్ బస్సు ఎక్కమని వారంతా భీష్మించుకున్నారు! గ్లోబల్ లీగ్‌కు చెందిన కొందరు వ్యక్తులు క్రికెటర్లను ఒప్పించే ప్రయత్నం చేసినా వారంతా గట్టిగా పట్టుబట్టారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆటగాళ్లంతా హోటల్లోనే ఆగిపోవడంతో అంతా గందరగోళంగా మారిపోయింది. టోర్నీ ప్రసారకర్తలు ‘సాంకేతిక కారణాలతో మ్యాచ్ ఆలస్యం’ అంటూ తమ చానల్లో స్క్రోలింగ్ నడిపిస్తూ పాత మ్యాచ్‌లను ప్రసారం చేస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. చివరకు సుదీర్ఘ చర్చల అనంతరం సమస్య పరిష్కృతమైంది. టొరంటో టీమ్‌లో యువరాజ్ సింగ్, బ్రెండన్ మెకల్లమ్, పొలార్డ్, మెక్లీనగన్ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కాగా, మాంట్రియల్ జట్టులో జార్జ్ బెయిలీ, డిక్వెలా, సునీల్ నరైన్, తిసార పెరీరావంటి గుర్తింపు పొందిన క్రికెటర్లు ఉన్నారు. ఈ టోర్నీకి ఐపీఎల్ తదితర లీగ్‌ల తరహాలో కనీసం దేశవాళీ టి20 మ్యాచ్ గుర్తింపు కూడా లేదు. -
బాదుడు షురూ చేసిన ఏబీ!
43 బంతుల్లో 88 పరుగులు 6ఫోర్లు, 5 సిక్సర్లు. రిటైర్మెంట్ అనంతరం కూడా తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్ తర్వాత తొలిసారి ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో మిడిలెస్సెక్స్ తరుపున మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ధాటికి ప్రత్యర్థి బౌలర్లు పసిపిల్లలయ్యారు. లార్డ్స్ వేదికగా ఎస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మిడిలెస్సెక్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్సెక్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెస్సెక్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో డేవిడ్ మలాన్‌తో కలిసి డివిలియర్స్ రెచ్చిపోయాడు. వీర్దిదరూ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే మిడిలెస్సెక్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక తొలిసారి టీ20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన డివిలియర్స్‌కు అక్కడి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఇక ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ ఆటకు సంబంధించిన వీడియోను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. -
అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో
ముంబై: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ మంగళవారం జరిగిన టీ20 ముంబై లీగ్ మ్యాచ్‌లో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ(23 పరుగులు, ఒక వికెట్)తో తమ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్ట్రన్, ట్రింఫ్ నైట్ ముంబై నార్త్ ఈస్ట్ జట్లు తలపడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ట్రింఫ్ నైట్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 56 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 90 పరుగులు సాధించాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆకాశ్ టైగర్స్‌కు ఆకర్షిత్ గోమల్(41), కౌస్తుభ్ పవార్(34) శుభారంభాన్ని అందించారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఆకాశ్ టైగర్స్ 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. ట్రింఫ్ నైట్ జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లోనూ రాణించిన అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
ఆంధ్ర టి20 లీగ్‌కు సై
సాక్షి, విజయవాడ: బీసీసీఐ పరిధిలోని కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల తరహాలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కూడా తొలిసారి సొంత టి20 లీగ్‌ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు నగరాలు ఫ్రాంచైజీలుగా జూన్‌లో టోర్నీ జరుగుతుందని ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు రంగరాజు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం పేర్లతో జట్లు ఉంటాయి. వన్డే వరల్డ్ కప్ జరిగే సమయంలోనే భారత్ మ్యాచ్‌లు ఆడని రోజుల్లో లీగ్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలను సొంతం చేసుకునేందుకు ఏసీఏ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించిందని, మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏసీఏ కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ చెప్పారు. సీనియర్ క్రికెటర్లతో యువ ఆటగాళ్లు కలిసి ఆడేందుకు ఇది మంచి అవకాశం ఇస్తుందని, దాదాపు వంద మంది క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆంధ్ర లీగ్ వేదికగా నిలుస్తుందని కూడా ఆయన అన్నారు. తమిళనాడు, కర్ణాటక, ముంబై ప్రీమియర్ లీగ్‌లు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందగా... గత ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా బోర్డు అనుమతితో తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించింది. -
లీగ్‌లో సొంత ఆటగాళ్లనే ఆడించండి!
ముంబై: దేశంలో వేర్వేరు రాష్ట్ర క్రికెట్ సంఘాలు నిర్వహిస్తున్న లీగ్ టోర్నీలపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇష్టారాజ్యంగా వాటిని నిర్వహించేందుకు వీలు లేకుండా కొత్త నిబంధనలు రూపొందించింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఇప్పటికే సూపర్ సక్సెస్ కాగా... కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ క్రికెట్ సంఘం కూడా బోర్డు అనుమతితో తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించింది. ఇకపై అసోసియేషన్ పరిధిలోని ఆటగాళ్లతోనే ఈ లీగ్‌ను నిర్వహించాలని, కోచ్‌లు, సహాయక సిబ్బంది సహా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటివారితో ఒప్పందం చేసుకోరాదని స్పష్టం చేసింది. అవినీతి కార్యకలాపాలకు అవకాశం లేకుండా కచ్చితంగా ఏసీయూ నిబంధనలు పాటించాలని, జట్టు యజమానులకు ‘మెంటర్’, ‘కోచ్’లాంటి పేర్లతో ఆటగాళ్లు ఉండే ప్రాంతానికి సంబంధించి అక్రిడేషన్లు ఇవ్వరాదని కూడా ఆదేశించింది. ఆటగాళ్లకు 30 వేల రూపాయలకు మించిన బహుమతులు ఏమైనా వస్తే వెంటనే తెలియజేయాలని కూడా పేర్కొంది. దీంతో పాటు ఎప్పుడు పడితే అప్పుడు లీగ్‌ను కొనసాగించకుండా కచ్చితమైన తేదీలు పాటించాలని కూడా చెప్పింది. -
ఘనం... స్మిత్ పునరాగమనం
టొరంటో: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌కు ఏడాది పాటు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గ్లోబల్ టి20 లీగ్‌లో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కొనసాగుతుండగా... మరోవైపు ఈ లీగ్‌లో బరిలోకి దిగిన అతను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టొరంటో నేషనల్స్ తరఫున ఆడిన స్మిత్ (41 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. అతనితోపాటు ఆంటోన్ డేవ్‌సిచ్ (44 బంతుల్లో 92 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్ ఆరు వికెట్ల తేడాతో వాంకోవర్ నైట్స్‌పై విజయం సాధించింది. మొదట వాంకొవర్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎవిన్ లూయిస్ (55 బంతుల్లో 96; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), రసెల్ (20 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అదరగొట్టారు. అనంతరం టొరంటో నేషనల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి గెలిచింది. -
డేవిడ్ వార్నర్ ప్రాక్టీస్ ఇలా..
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తిరిగి మైదానంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించాడు. దీనిలో భాగంగా రన్నింగ్‌తో ప్రాక్టీస్ ప్రారంభించిన వీడియోను వార్నర్ తన ఇన్స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. జూన్ చివరి వారంలో కెనడాలో జరిగే టీ20 గ్లోబల్ లీగ్‌లో వార్నర్ ఓ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నాడు. త్వరలో ఈ లీగ్ కోసం వార్నర్ కెనడా బయలుదేరనున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్ మైదానంలో కసరత్తులు చేస్తున్నాడు. ‘తిరిగి మైదానంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఈ సెషన్ కాస్త కష్టంగానే గడిచింది. ముందుకు కొనసాగుతాను’ అని పేర్కొన్న వార్నర్ తాను ప్రాక్టీస్‌లో పాల్గొన్న వీడియోను పంచుకున్నాడు. ఈ ఏడాది మార్చి చివరి వారంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని వార్నర్ ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. కాగా, కొద్ది రోజుల క్రితం క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 గ్లోబల్ లీగ్‌లో పాల్గొనేందుకు వార్నర్‌కు క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో వార్నర్ ప్రాక్టీస్‌ను షురూ చేశాడు. -
డేవిడ్ వార్నర్ తిరిగి మైదానంలోకి...!
-
మళ్లీ బ్యాట్ పట్టనున్న స్టీవ్ స్మిత్
మెల్బోర్న్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న గ్లోబల్ టి20 కెనడా లీగ్‌లో ఈ స్టార్ బ్యాట్స్‌మన్ బరిలో దిగనున్నాడు. ఈ లీగ్‌లో క్రిస్ గేల్, రసెల్, సామీ, సునీల్ నరైన్, మలింగ, క్రిస్ లిన్, డేవిడ్ మిల్లర్, ఆఫ్రిది మార్క్యూ ప్లేయర్లుగా అందుబాటులో ఉన్నారు. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఫైనల్ జూలై 16న జరుగనుంది. ‘కెనడా క్రికెట్లో ఇది అతిపెద్ద అడుగు. గ్లోబల్ టి20 లీగ్ ద్వారా అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లను అతి దగ్గరగా చూసే అవకాశం కెనడా ప్రేక్షకులకు లభించనుంది’ అని క్రికెట్ కెనడా అధ్యక్షుడు రంజిత్ సైనీ తెలిపారు. దక్షిణాప్రికా పర్యటనలో మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఉదంతం వెలుగు చూడటంతో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించింది. రెండేళ్లపాటు నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉంచడంతో పాటు 100 గంటలు కమ్యూనిటీ క్రికెట్‌కు స్వచ్ఛంద సేవ చేయాలని కూడా పేర్కొంది. ఈ సందర్భంగా విదేశీ లీగ్‌ల్లో ఆడటంపై సీఏ ఎలాంటి పరిమితి విధించలేదు. అయినప్పటికీ బీసీసీఐ అతన్ని ఐపీఎల్లో ఆడటానికి అనుమతించలేదు. -
అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన బీసీసీఐ
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ సక్సెస్‌తో అన్ని దేశాలు ఆ దిశగా లీగ్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 5 నుంచి 24 వరకు షార్జా వేదికగా టీ20 లీగ్ (ఏపీఎల్) నిర్వహించేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు తమ టోర్నీలో ఆడేందుకు అనుమతించాలని బీసీసీఐని కోరింది. ఈ ఏసీబీ విన్నపాన్ని బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది. తమ ఆటగాళ్లు ఐపీఎల్లో మినహా మరే ఇతర టీ20 లీగ్ లోనూ ఆడరని స్పష్టం చేసింది. మీరు నిర్వహించే లీగ్‌కు అనుమతిస్తే... ఇతర దేశాలు కూడా అడుగుతాయని.. దానికి తాము సిద్ధంగా లేమని చెప్పింది. ఒక్క ఆటగాడిని అనుమతించినా... అందరినీ అనుమతించాల్సి వస్తుందని తెలిపింది. కనీసం బీసీసీఐ కాంట్రాక్టులో లేని ఆటగాళ్లనైనా పంపాలని ఏసీబీ కోరగా.. దానికి కూడా బీసీసీఐ ఒప్పుకోలేదు. తమ ఆటగాళ్లను పంపకపోయినా ఏసీబీకీ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ‘భారత్ ఎప్పుడూ అఫ్గనిస్తాన్‌కు అండగా ఉంటుంది. ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులు భారత ఆటగాళ్లను తమ టీ20 లీగ్‌కు అనుమతించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో తమ ఆటగాళ్లను అనుమతించడం కష్టమని చెప్పాం. ఒకవేళ అనుమతిస్తే అన్ని దేశాలకు అనుమతిచ్చినట్లు అవుతుందని’ ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. అయితే బీసీసీఐ గతేడాది తొలిసారి ఒక యూసఫ్ పఠాన్‌కు మాత్రమే హాంగ్ కాంగ్ లీగ్ ఆడేందుకు అనుమతిచ్చింది. కానీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. -
ఇక ముంబై టి20 లీగ్
ముంబై: క్రికెట్ లీగ్‌ల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో లీగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు ప్రాంతీయ లీగ్‌ల వంతు వచ్చినట్లుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టి20 క్రికెట్ లీగ్‌లు మొదలైనట్లే... తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలోనూ ‘టి20 ముంబై లీగ్’కు రంగం సిద్ధమైంది. ముంబై క్రికెట్ సంఘం సౌజన్యంతో ‘ప్రాబబిలిటీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో మొదలవనున్న ఈ లీగ్‌కు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 11 నుంచి 21 వరకు వాంఖెడే స్టేడియంలో ఈ ‘టి20 లీగ్’ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ ‘ముంబైకి ఇలాంటి లీగ్‌ల అవసరం ఎంతో ఉంది. సుదీర్ఘ కాలంగా ముంబై క్రికెటర్లే పెద్ద సంఖ్యలో భారత క్రికెట్లో ప్రధాన పాత్ర పోషించారనేది వాస్తవం. ఈ స్థానిక లీగ్‌లో ‘బ్రాండ్ అంబాసిడర్’గా నేనులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. తమ సత్తా చాటేందుకు కుర్రాళ్లకు ఇది చక్కని వేదిక’ అని అన్నారు. ముంబై గల్లీ కుర్రాళ్లు శివాజీ పార్క్, క్లబ్‌ల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వేదికైన వాంఖెడేలో మెరిసేందుకు ఇది మంచి అవకాశమని సచిన్ అన్నారు. -
మరో వివాదంలో సల్మాన్‌బట్
కరాచి: పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ మరోసారి ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. గతంలో స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న ఈ క్రికెటర్ తాజాగా యూఏఈలో జరిగిన ఓ వివాదాస్పద మ్యాచ్‌లో ఆడటంతో చిక్కుల్లో పడ్డాడు. దుబాయ్ వేదికగా ఇటీవల ముగిసిన అజ్మన్ ఆల్‌స్టార్స్ టి20 లీగ్‌లోని ఓ మ్యాచ్‌పై అనుమానాలు తలెత్తడంతో ఐసీసీ విచారణ జరుపుతోంది. దీనిపై బట్ స్పందిస్తూ... ‘అది ఓ ఔత్సాహిక స్థాయి టోర్నీ అనే విషయం అక్కడికి వెళ్లాకే నాకు తెలిసింది. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అనంతరం నేను సాధ్యమైనంతవరకు వివాదాల నుంచి దూరంగా ఉంటున్నాను’ అని అతను స్పష్టం చేశాడు. -
మళ్లీ బిగ్‌బాష్‌లో గేల్!
ఆస్ట్రేలియా టి20 లీగ్ బిగ్‌బాష్‌లో వచ్చే సీజన్లోనూ వెస్టిండీస్ స్టార్ గేల్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు తెలిపింది. గత సీజన్లో టీవీ వ్యాఖ్యాతను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినందుకు గేల్‌పై విమర్శలు వచ్చాయి. లీగ్ నుంచి అతణ్ని బహిష్కరించాలనే డిమాండ్ కూడా వినిపించింది. అయితే అదంతా గతమని తమ జట్టుకు గేల్ అవసరమని రెనెగేడ్స్ తెలిపింది. -
బిగ్‌బాష్‌లో గేల్ కొనసాగొచ్చు: సీఏ
మెల్బోర్న్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తమ బిగ్‌బాష్ టి20 లీగ్‌లో కొనసాగవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. గత సీజన్ సందర్భంగా గేల్ ఓ మహిళా రిపోర్టర్‌తో అనుచితంగా ప్రవర్తించడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. 10 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. సీఏ నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటామని, మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి అరోపణలు ఎదుర్కొనే ఆటగాడిని నిరోధించగలమని... ఇతరత్రా కారణాలతో నిషేధించలేమని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. బిగ్‌బాష్, దేశవాళీ క్రికెట్లో ఆడొద్దని ఎవరు పడితే వారు నిర్ణయించలేరని సదర్లాండ్ చెప్పారు. దీనిపై అతను ప్రాతినిధ్యం వహించే మెల్బోర్న్ రెనెగేడ్స్ తేల్చాల్సి వుంటుందని ఆయన చెప్పారు. -
టి20 లీగ్‌ల వల్ల దెబ్బే!
ద్వైపాక్షిక సిరీస్‌లపై రిచర్డ్సన్ ఆందోళన లండన్: ఐపీఎల్, బిగ్‌బాష్, సీపీఎల్‌లాంటి టి20 లీగ్ వల్ల భవిష్యత్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లకు ముప్పు తప్పదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ హెచ్చరించారు. అయితే యాషెస్, భారత్ ఆడే సిరీస్‌లకు మినహాయింపు ఉంటుందన్నారు. వాస్తవంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని ఉండాలన్న అంశంపై జూన్‌లో బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చించామని చెప్పిన ఆయన అక్టోబర్‌లో జరిగే సమావేశంలో దీనిపై మరోసారి మాట్లాడతామన్నారు. ‘యాషెస్, భారత్‌తో ఇతర పెద్ద దేశాలు ఆడే కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉంది. అయితే మిగతా సిరీస్‌ల్లో టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. దీనివల్ల ఆయా సిరీస్‌ల నుంచి అనుకున్నంత డబ్బులు, ప్రజాదరణ లభించడం లేదు. దేశవాళీ టి20లు విజయవంతంకావడంతో గత ఎనిమిదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. వీటికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మద్దతు లభిస్తుంది. ప్రపంచకప్‌లాంటి కొన్ని ఐసీసీ ఈవెంట్లపై కూడా మంచి ఆసక్తినే చూపిస్తున్నారు. కానీ ఎఫ్టీపీలో భాగంగా ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లకే డిమాండ్ లేకుండా పోతోంది’ అని రిచర్డ్సన్ వివరించారు. ఈ సిరీస్‌లకు ఆదరణ పెరగాలంటే మంచి షెడ్యూల్‌తో పాటు మార్కెట్‌ను విస్తృతంగా పెంచుకోవడం ఒక్కటే పరిష్కారమన్నారు. -
మాజీలతో మరో లీగ్
దుబాయ్: ఓవైపు సచిన్, వార్న్ కలిసి లెజెండ్స్ టి20 లీగ్ ప్రారంభిస్తుంటే... మరోవైపు దుబాయ్‌లో మాజీ క్రికెటర్లతో మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) పేరుతో మరో లీగ్ ప్రారంభం కాబోతోంది. దుబాయ్ క్రికెట్ బోర్డు అనుమతితో జరగనున్న ఈ లీగ్ 2016 ఫిబ్రవరిలో మొదలవుతుంది. మొత్తం 90 మంది మాజీ క్రికెటర్లతో ఆరు జట్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. లారా, వసీం అక్రమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ఇందులో ఆడతారు. జీఎం స్పోర్ట్స్ అనే సంస్థ పదేళ్ల పాటు ఈ లీగ్ నిర్వహణకు అనుమతి తీసుకుంది. డీన్‌జోన్స్ దీనిని పర్యవేక్షిస్తారు. -
సచిన్, వార్న్‌ల ఆధ్వర్యంలో టి20 లీగ్!
సిడ్నీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కలిసి ఓ సరికొత్త టి20 లీగ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇం దులో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లే ఆడనున్నారు. ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక కథనం ప్రకారం.. క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్ పేరిట సచిన్, వార్న్ కలిసి 28 మంది ప్రముఖ మాజీలకు మ్యాచ్‌కు 25 వేల డాలర్ల చొప్పున ఆఫర్ చేశారు. 42 నెలల కాలంలో 15 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసీస్ నుంచి బ్రెట్ లీ, పాంటింగ్, గిల్‌క్రిస్ట్, మెక్‌గ్రాత్, ఇంగ్లండ్ నుంచి మైకేల్ వాన్, ఫ్లింటాఫ్, దక్షిణాఫ్రికా నుంచి కలిస్‌ను లీగ్ కోసం సంప్రదించినట్టు పేర్కొంది. ‘వార్న్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నప్పటికీ ఈ ఆలోచనకు పూర్తిగా మద్దతిస్తున్నాడు. ఈ ఏడాదే తను, సచిన్ కలిసి లీగ్‌ను ప్రారంభిస్తున్నట్టు సమాచారమిచ్చాడు’ అని ఆ పత్రిక పేర్కొంది. మరోవైపు ఈ ఆఫర్‌ను లీ మేనేజర్ మ్యాక్స్‌వెల్ ధృవీకరించాడు. అంగీకారం కోసం క్రికెట్ ఆస్ట్రేలియాను సంప్రదించామని పేర్కొన్నారు. మూడున్నరేళ్ల పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లీగ్ జరుగుతుందని, సెప్టెంబర్‌లో జరుగబోయే ప్రారంభ లీగ్ అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, షికాగోలలో నిర్వహిస్తారని పత్రిక కథనం.