
సల్మాన్ బట్
కరాచి: పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ మరోసారి ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. గతంలో స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న ఈ క్రికెటర్ తాజాగా యూఏఈలో జరిగిన ఓ వివాదాస్పద మ్యాచ్‌లో ఆడటంతో చిక్కుల్లో పడ్డాడు. దుబాయ్ వేదికగా ఇటీవల ముగిసిన అజ్మన్ ఆల్‌స్టార్స్ టి20 లీగ్‌లోని ఓ మ్యాచ్‌పై అనుమానాలు తలెత్తడంతో ఐసీసీ విచారణ జరుపుతోంది.
దీనిపై బట్ స్పందిస్తూ... ‘అది ఓ ఔత్సాహిక స్థాయి టోర్నీ అనే విషయం అక్కడికి వెళ్లాకే నాకు తెలిసింది. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అనంతరం నేను సాధ్యమైనంతవరకు వివాదాల నుంచి దూరంగా ఉంటున్నాను’ అని అతను స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment