సీఎస్‌కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ ఉత్కర్ష పవార్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. తన ప్రదర్శన కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. కానీ పెళ్లి కారణంగా రుతురాజ్ తప్పుకోవడంతో అతని స్థానంలో యశస్వి జైశ్వాల్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్ చాంపియన్‌షిప్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. జూన్ 3-4 తేదీల్లో వీరి వివాహం జరిగింది.
వివాహం అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్ 2023)లో బరిలోకి దిగాడు. పుణే ఫ్రాంచైజీ పుణేరి బప్పా జట్టు రూ.14.8 కోట్లతో రుతురాజ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. కాగా ఎంపీఎల్ 2023లో భాగంగా గురువారం రాత్రి పుణేరి బప్పా, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య ఆరంభ మ్యాచ్ జరిగింది.
మరో విశేషమేమిటంటే రుతురాజ్ ఈ మ్యాచ్‌లో తన భార్య ఉత్కర్ష పవార్ జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగాడు. కాగా ఉత్కర్ష పవార్ సీఎస్‌కే స్టాప్ సిబ్బందిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె జెర్సీ నెంబర్ 13.. రుతురాజ్ జెర్సీ నెంబర్ 31.. కానీ నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్ తన భార్యపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె జెర్సీ నెంబర్ అయిన 13తో బరిలోకి దిగాడు.
భార్య జెర్సీతో బరిలోకి దిగిన రుతురాజ్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 22 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించిన రుతురాజ్ ఓవరాల్‌గా 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కొల్హాపూర్ టస్కర్స్ విధించిన 145 పరుగుల టార్గెట్‌ను 29 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్‌లో రుతురాజ్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు. 16 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ 42.14 సగటుతో 590 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2019 నుంచి సీఎస్‌కే తరపున ఆడుతున్న రుతురాజ్ 1797 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక టీమిండియా తరపున 9 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన రుతురాజ్ ఒక ఫిఫ్టీ సాయంతో 135 పరుగులు చేశాడు.
⭐️⭐️⭐️⭐️⭐️ Our rating for @Ruutu1331
— FanCode (@FanCode) June 15, 2023
Also, the number of 6️⃣s he hit tonight!
.
.#MPLonFanCode pic.twitter.com/SA1h1h6VdT
చదవండి: ఆఫ్గన్‌తో ఏకైక టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment