half century
-
యాభైఏళ్ల రాజీనామా
కొణిదెల శివ శంకర వరప్రసాద్.... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో చిరంజీవి అసలు పేరు ఇదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా శివ శంకర వరప్రసాద్‌గా రంగస్థలంపై ‘రాజీనామా’ అనే నాటకంతో మొదలైన ఆయన నట ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘1974లో నర్సపూర్‌లోని వైఎన్ఎమ్ కళాశాలలో బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నప్పుడు రంగస్థలం మీద నేను వేసిన తొలి నాటకం ‘రాజీనామా’. కోన గోవిందరావుగారు రచించారు. నాకు నటుడిగా తొలి గుర్తింపు ఇచ్చింది ‘రాజీనామా’. అది కూడా బెస్ట్ యాక్టర్‌గా అవార్డు రావడం ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది. 1974–2024... యాభై సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది’’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్ళు’. ఈ సినిమాకి గూడ΄ాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ సినిమా మొదట రిలీజ్ అయింది. ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబరు 22న విడుదల కాగా ‘పునాది రాళ్ళు’ 1979 జూన్ 21న రిలీజ్ అయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. -
ఆదుకున్న ములానీ
సాక్షి, అనంతపురం: ఆల్‌రౌండర్ షమ్స్ ములానీ (174 బంతుల్లో 88 బ్యాటింగ్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దులీప్ ట్రోఫీలో భాగంగా భారత్ ‘డి’తో గురువారం మొదలైన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట... ములానీ చక్కటి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (7)తో పాటు మరో ఓపెనర్ ప్రథమ్ సింగ్ (7) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో 21 పరుగులకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37; 5 ఫోర్లు, ఒక సిక్సర్), శాశ్వత్ రావత్ (15) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే కుమార్ కుశాగ్ర (28) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో తనుశ్ కొటియాన్ (53; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి షమ్స్ ములానీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. టాపార్డర్ సత్తా చాటలేకపోయిన చోట సంయమనంతో క్రీజులో నిలిచి ఒక్కో పరుగు జోడి స్తూ స్కోరు బోర్డు ను ముందుకు నడిపించాడు. అతడికి తనుశ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి షమ్స్ ములానీతో పాటు ఖలీల్ అహ్మద్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) అర్‡్షదీప్ (బి) విద్వత్ 7; మయాంక్ (సి) సామ్సన్ (బి) విద్వత్ 7; తిలక్ వర్మ (సి) శ్రేయస్ (బి) సారాంశ్ జైన్ 10; రియాన్ పరాగ్ (సి) పడిక్కల్ (బి) అర్‡్షదీప్ 37; శాశ్వత్ రావత్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ రాణా 15; కుశాగ్ర (సి) యశ్ దూబే (బి) అర్‡్షదీప్ 28; షమ్స్ ములానీ (బ్యాటింగ్) 88; తనుశ్ (సి) అర్‡్షదీప్ (బి) సౌరభ్ 53; ప్రసిద్ధ్ కృష్ణ (సి) (సబ్) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 8; ఖలీల్ అహ్మద్ (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: (82 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–18, 2–21, 3–65, 4–69, 5–93, 6–144, 7–235, బౌలింగ్: హర్షిత్ రాణా 16–4–49–2; విద్వత్ 14–5–30–2; అర్‡్షదీప్ 18–3–73–2; సారాంశ్ జైన్ 14–3–55–1; సౌరభ్ కుమార్ 20–1–65–1. -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్!
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్‌లో.. రెండో ఇన్నిం గ్స్‌లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.బంగ్లాతో సిరీస్‌లో చోటు దక్కాలంటే..కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.వరుస మ్యాచ్‌లలో విఫలంఅయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఇండియా-డి జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో అభిషేక్ పొరల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అక్షర్ ఆల్‌రౌండ్ షోతోఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్‌తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్‌దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్‌దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్ -
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్జీ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించారు. ఇందులో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో చేలరేగాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన 15 ఓవర్లో వరుస బంతుల్లో నికోల పూరన్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నారు. కేవలం 29 బంతుల్లో 75 పరుగులు నికోలస్ పూరన్ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. చివరికీ నువాన్ తుషార బౌలింగ్‌లో ఔటై వెనుదిరిగారు. అయితే ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు లక్నో సూపర్ జైయింట్స్కు సైతం దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేనట్లే. ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న లక్నోకు రన్‌రేట్ లేకపోవడం వారి అవకాశాలు దెబ్బతీసింది. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదు. కాగా.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. మరో స్థానం కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడుతున్నాయి. "De chauka de chakka. Aaj ho jaye, ho jaye, Dhoom Dhadaka" pic.twitter.com/f0gZiT3kjz— Lucknow Super Giants (@LucknowIPL) May 17, 2024 -
Ramakrishna Math: రామకృష్ణ మఠంలో స్వర్ణోత్సవ సంబరాలు!
హైదరాబాద్: రామకృష్ణమఠం 50 వసంతాలు పూర్తిచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి. భాగ్యనగరంలో 1973లో రామ కృష్ణ మఠం స్థాపించారు. దోమల్‌గూడలో ఉన్న ఈ మఠం 2023 డిసెంబర్లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయింది. స్వర్ణోత్సవాల సందర్భంగా.. ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద.. మూర్తిత్రయం ఆదర్శాలతో ప్రపంచ వేదికలపై భారతీయతను చాటుతున్న మహోన్నత సేవా సంస్థ రామకృష్ణ మఠం. మానవసేవే.. మాధవ సేవగా ఇటు ఆధ్యాత్మిక సౌరభాలను, అటు సామాజిక సేవను నలుదిశలా వ్యాప్త చేస్తోంది. స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శ్రీశ్రీ చండీ హోమం, భజనలు, మ్యూజిక్ కన్సార్ట్, బహిరంగ సభ వంటి ఈ ఆధ్యాత్మిక సంబరాల్లో పాల్గొనాల్సిందిగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధ మయానంద పిలుపునిచ్చారు. ఇవి చదవండి: Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్ -
గోల్డెన్ బాబీ
50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలీవుడ్ బంపర్ హిట్ చిత్రం బాబీ (1973) కి సంబంధించిన జ్ఞాపకాలు, తెలిసిన విషయాలు, తెలియని విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాగా ఇష్టపడి చేసిన సినిమా పరాజయం పాలైతే లేచి నిల్చోవడానికి, అడుగులు వేయడానికి, పరుగులు తీయడానికి శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే ‘ఎలాగైనా హిట్టు కొడతాను’ అనే కసి ఉండాలి. ‘మేరా నామ్ జోకర్’ సినిమాతో పరాజయం, అప్పుల పాలైన రాజ్ కపూర్‌లో ఆ కసి దండిగా ఉంది. కసి సంగతి సరే, ఇప్పుడొక సూపర్స్టారుడు కావాలి కదా. అప్పుల పాలైన తనతో సినిమా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ‘ఇక అంతా అయిపోయింది. మిగిలింది ఏమీలేదు’ అనుకున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుందట. ఆ ధైర్యంతోనే కుమారుడిని హీరోగా పెట్టి ‘బాబీ’ తీసి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు రాజ్ కపూర్. ఆర్కే స్టూడియోస్‌కు ఇది మకుటాయమాన చిత్రం అయింది. రిషి కపూర్, డింపుల్ కపాడియాలను ఎక్కడికో తీసుకెళ్లింది. ‘బాబీ’ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే...కమర్శియల్ రోమాంటిక్ ఫిల్మ్ ‘ఫార్మట్’ను సెట్ చేసింది. మినీ–స్కర్ట్స్, హాట్ ప్యాంట్స్, లెదర్ ఔట్ఫిట్స్, వోవర్ సైజ్డ్ గ్లాసెస్, పోల్క–డాటెడ్ నాటెడ్ టాప్స్ మన దేశంలోని ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్‌ను మోసుకొచ్చాయి. -
'అర్ధ శతాబ్దం' తరువాత.. మళ్లీ కలుసుకున్న మా జ్ఞాపకాలు !
ఖమ్మం: చిన్నతనంలో కలిసి చదువుకున్నారు... ఆతర్వాత ఉన్నత చదువులు, ఆపై ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారందరూ మళ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకుని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సమ్మేళనంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి సైతం పాల్గొని మాట్లాడారు. తల్లాడలోని జెడ్పీహెచ్ఎస్లో 1973–74 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు యాభై ఏళ్ల తర్వాత ఖమ్మంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ బ్యాచ్‌కు పాఠాలు బోధించిన సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకుని ఇక్కడే గురువుగా పాఠాలు బోధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇన్నాళ్లకు కలుసుకున్న పూర్వ విద్యార్థులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని.. చదువుకున్న పాఠశాల అభ్యున్నతికి తోడ్పాటునందించాలని సూచించారు. పూర్వ సమాజం పూనుకుంటేనే విద్యారంగం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అనంతరం గురువులు రామచంద్రమూర్తితో పాటు చిమ్మపూడి శ్రీరామమూర్తి, కె.శ్రీనివాసరావు, జె.సత్యనారాయణ, నారాయణరెడ్డి తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్ ప్రసాద్, పూర్వ విద్యార్థులు అనుమోలు బుద్దిసాగర్, బేబి శంకర్, ఎన్.సత్యనారాయణ, మంగపతిరావు, జి.సునంద, పూనాటి పిచ్చయ్య, భాస్కర్‌రావు, శంకర్రావు, నంబూరు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
సినీ కెరీర్లో అరుదైన మైల్స్టోన్ చేరుకున్న ఈ ఐదుగురు
యాభైలో పడ్డారంటే యాభై ఏళ్ల వయసులో పడ్డారనుకుంటున్నారేమో! ఆ మాటకొస్తే.. ధనుష్, విజయ్ సేతుపతి, అంజలికన్నా సీనియర్ ఆర్టిస్ట్ అయిన సిమ్రానే ఇంకా వయసు పరంగా యాభై టచ్ అవ్వలేదు. ఆమె యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేస్తే.. ఇంకో అయిదు అదనంగా అంటే... సేతుపతి నలభై అయిదు టచ్ చేశారు. అంజలి నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా. ఈ అయిదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాల్లోకి వెళదాం... రెండు దశాబ్దాల్లో రెండోది రెండు దశాబ్దాల కెరీర్లో నటుడు– నిర్మాత ధనుష్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పా. పాండి’ (2017). ఈ సినిమా తర్వాత మరో సినిమా కోసం దర్శకుడిగా ధనుష్ మెగాఫోన్ పట్టాలనుకున్నారు. ‘నాన్ రుద్రన్’గా ప్రచారం జరిగిన ఈ సినిమా ఎందుకో సెట్స్‌పైకి వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఇది ధనుష్ కెరీర్లో 50వ సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఉంటుందట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. మహారాజా హీరో.. విలన్.. సపోర్టింగ్ యాక్టర్... ఇలా పాత్రకు తగ్గట్టు ఇమిడిపోతూ విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. కెరీర్లో విజయ్ సేతుపతి 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. ఆయన 50వ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నితిలన్ సామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్, బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది. లా స్టూడెంట్ దక్షిణాదిలో నటిగా అంజలికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి కెరీర్లో హాఫ్ సెంచరీ కొట్టారు. అదేనండీ.. యాభై సినిమాల మైల్స్టోన్కు చేరుకున్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ వేలాయుధం దర్శకత్వంలో ‘ఈగై’ అనే ఓ కోర్టు డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అంజలికి 50వది. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రంలో అంజలి లా స్టూడెంట్‌గా నటిస్తున్నారని, సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. గ్రీన్ అమ్యూస్మెంట్ ప్రొడక్షన్స్, డీ3 ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సిమ్రాన్ శబ్దం సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలోనే కాదు..ఉత్తరాదిలో కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సిమ్రాన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సిమ్రాన్ కీలక పాత్ర చేస్తున్న మూవీల్లో ‘శబ్దం’ ఒకటి. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా కీలక పాత్రధారులు. సిమ్రాన్‌కు తమిళంలో ఇది 50వ సినిమా కావడం విశేషం. ప్రేమకోసం... దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే..’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో చాలా సినిమాలే చేశారు భరత్. తెలుగులో మహేశ్‌బాబు ‘స్పైడర్’, సుధీర్‌బాబు ‘హంట్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కాగా భరత్ కెరీర్లో రూపొందిన 50వ సినిమా ‘లవ్’. వాణీ భోజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్పీ బాలా దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. -
జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం
మిర్పూర్: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు మెరిసింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 108 పరుగులతో ఘనవిజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న జెమీమా 86 పరుగులు చేయడంతో పాటు బంతితో రాణించి 3 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 228 పరుగులు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (78 బంతుల్లో 86; 9 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన 22 ఏళ్ల జెమీమా 2019 తర్వాత మళ్లీ వన్డేల్లో అర్ధ సెంచరీ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (58 బంతుల్లో 36; 4 ఫోర్లు), హర్లీన్ (36 బంతుల్లో 25) కూడా రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్, నహీదా అక్తర్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 35.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. ఫర్జానా హఖ్ (47; 5 ఫోర్లు), రీతూ మోని (27; 3 ఫోర్లు), ముర్షిదా ఖాతూన్ (12; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జెమీమా తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో 3.1 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. లెగ్ స్పిన్నర్ దేవిక వైద్య 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. మేఘన సింగ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మలకు ఒక్కో వికెట్ లభించింది. 8⃣6⃣ runs with the bat 👏 4️⃣ wickets with the ball 😎@JemiRodrigues' all-round performance makes her the Player of the Match 👌🏻#TeamIndia win by 108 runs in the second ODI 👏 Scorecard - https://t.co/6vaHiS9Qad #BANvIND pic.twitter.com/CuUNtJpFOo — BCCI Women (@BCCIWomen) July 19, 2023 చదవండి: Stuart Broad: 600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్‌గా -
మేజర్ లీగ్ క్రికెట్ 2023.. సిక్సర్లతో విరుచుకుపడిన పాక్ ఆల్‌రౌండర్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తున్నాయి. పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) తర్వాత పాక్ జట్టుకు చెందిన చాలా మంది ఆటగాళ్లు మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇమాద్ వసీమ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకోగా.. తాజాగా పాక్ ఆల్‌రౌండర్ షాబాద్ ఖాన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. లీగ్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోరే అండర్సన్(52 బంతుల్లో 91 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(30 బంతుల్లో 61 పరుగులు, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 31 పరుగులతో ఆడుతున్నాడు. సరబ్జిత్ లడ్డా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తొలుత స్ట్రెయిట్ సిక్సర్ సంధించిన షాదాబ్.. ఆ తర్వాత డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీ తరలించాడు. అనంతరం రెండు వరుస బంతులను సిక్సర్లను సంధించాడు. షాదాబ్‌ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. టిమ్ డేవిడ్ 53 నాటౌట్, డెవాల్డ్ బ్రెవిస్ 32, నికోలస్ పూరన్ 40, కీరన్ పొలార్డ్ 48 పరుగులు చేశారు. అయితే చివర్లో ఒత్తిడికి లోనైన ముంంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగుల వద్ద ఆగిపోయింది. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో కార్మీ లి రౌక్స్, లియామ్ ప్లంకెట్లు చెరో రెండు వికెట్లు తీశారు. Feels good to contribute to a win in @SFOUnicorns first MLC match. pic.twitter.com/q8vKYEc0DW — Shadab Khan (@76Shadabkhan) July 15, 2023 చదవండి: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్ సీరియస్! -
భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే ఉతికారేశాడు
సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ ఉత్కర్ష పవార్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. తన ప్రదర్శన కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. కానీ పెళ్లి కారణంగా రుతురాజ్ తప్పుకోవడంతో అతని స్థానంలో యశస్వి జైశ్వాల్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్ చాంపియన్‌షిప్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. జూన్ 3-4 తేదీల్లో వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్ 2023)లో బరిలోకి దిగాడు. పుణే ఫ్రాంచైజీ పుణేరి బప్పా జట్టు రూ.14.8 కోట్లతో రుతురాజ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. కాగా ఎంపీఎల్ 2023లో భాగంగా గురువారం రాత్రి పుణేరి బప్పా, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య ఆరంభ మ్యాచ్ జరిగింది. మరో విశేషమేమిటంటే రుతురాజ్ ఈ మ్యాచ్‌లో తన భార్య ఉత్కర్ష పవార్ జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగాడు. కాగా ఉత్కర్ష పవార్ సీఎస్కే స్టాప్ సిబ్బందిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె జెర్సీ నెంబర్ 13.. రుతురాజ్ జెర్సీ నెంబర్ 31.. కానీ నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్ తన భార్యపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె జెర్సీ నెంబర్ అయిన 13తో బరిలోకి దిగాడు. భార్య జెర్సీతో బరిలోకి దిగిన రుతురాజ్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 22 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించిన రుతురాజ్ ఓవరాల్‌గా 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కొల్హాపూర్ టస్కర్స్ విధించిన 145 పరుగుల టార్గెట్‌ను 29 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో రుతురాజ్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు. 16 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ 42.14 సగటుతో 590 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2019 నుంచి సీఎస్కే తరపున ఆడుతున్న రుతురాజ్ 1797 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక టీమిండియా తరపున 9 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన రుతురాజ్ ఒక ఫిఫ్టీ సాయంతో 135 పరుగులు చేశాడు. ⭐️⭐️⭐️⭐️⭐️ Our rating for @Ruutu1331 Also, the number of 6️⃣s he hit tonight! . .#MPLonFanCode pic.twitter.com/SA1h1h6VdT — FanCode (@FanCode) June 15, 2023 చదవండి: ఆఫ్గన్‌తో ఏకైక టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ -
512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఎన్నోసార్లు జట్టుకు ఆపద్బాందవుడయ్యాడు. తన ఇన్నింగ్స్‌లతో ఎన్నోసార్లు టీమిండియాకు విజయాలు అందించాడు. కెరీర్ ఆరంభంలో మూడు ఫార్మాట్లలో ఆడిన రహానే క్రమంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అయినా సంప్రదాయ ఫార్మాట్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. ఎంత బాగా ఆడినా ఏదో ఒక దశలో ఒక బ్యాడ్‌ఫేజ్ అనేది ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. అజింక్యా రహానేకు కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. రెండేళ్ల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే ఘోర ప్రదర్శన కనబరిచాడు. అంతే దెబ్బకు టీమిండియాలో చోటు కోల్పోయాడు. జాతీయ జట్టుకు దూరమైనప్పటికి రహానే పెద్దగా బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం మళ్లీ తనను వెతుక్కుంటూ వస్తుందని నమ్మాడు. అందుకు తగ్గట్టుగానే దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోపీ సహా మిగతా టోర్నీల్లో పాల్గొని సెంచరీలతో చెలరేగినా రహానేకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఐపీఎల్ 2023 సీజన్ వచ్చింది. రహానేను పెద్దగా ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో సీఎస్కే రూ. 50 లక్షల కనీస ధరకే రహానేను సొంతం చేసుకుంది. అయితే రహానే అప్పటికే పరుగుల దాహంతో ఉన్నాడు. ఆకలి మీద ఉన్న సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో అప్పటికి ఎవరికి తెలియదు. కానీ రహానేను సీఎస్కే కెప్టెన్ ధోని నమ్మాడు. ధోని నమ్మకాన్ని రహానే నిలబెట్టాడు. గతంలో ఐపీఎల్ ఆడినప్పటికి రహానేలో ఇంత వేగవంతమైన ఆట ఎప్పుడు చూసింది లేదు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన రహానే 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో చూపెట్టిన సూపర్ ఫామ్ రహానేను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ సమయంలో ఏప్రిల్ 23న మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. ''ఇది సరిపోదు.. నా బెస్ట్ ఇంకా రావాల్సి ఉంది'' అంటూ కామెంట్ చేశాడు. అలా 512 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే సరికొత్తగా కనిపించాడు. ఐపీఎల్ తన ఆటతో దూకుడుగా కనిపించిన అదే రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో శాంతంగా కనిపించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ కొత్త రహానేను చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. తొలుత జడేజాతో కలిసి 70 పరుగులు జోడించిన రహానే.. ఆపై శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏకంగా 109 పరుగులు జోడించి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒక దశలో 200 లోపే చాప చుట్టేస్తుందనుకున్న తరుణంలో శార్దూల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానే టీమిండియా పరువు కాపాడాడు. చివరికి 129 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 89 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తన బెస్ట్ ఇవ్వాల్సి ఉంది అని చెప్పిన మాటకు కట్టుబడి తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన రహానే రెండు వారాల వ్యవధిలోనే అభిమానులకు తనలోని డబుల్ వర్షన్ చూపించాడు. 96 at Durban 118 at Wellington 103 at Lord's 147 at Melbourne 126 at Colombo 108* at Jamaica 81 at Nottingham 112 at Melbourne 89 at Oval The crisis man at Overseas, Rahane. pic.twitter.com/LW52iqOAtH — Johns. (@CricCrazyJohns) June 9, 2023 TAKE A BOW, AJINKYA RAHANE. 89 in 129 balls with 11 fours and a six. An innings to remember on the Test return, what a knock. He made a grand comeback! No words can describe his contribution today. pic.twitter.com/N4QsbvWiVz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే -
రీఎంట్రీలో ఆపద్భాందవుడి పాత్ర.. భారత్ తరపున తొలి బ్యాటర్‌గా
టీమిండియా స్టార్ అజింక్యా రహానే టెస్టు పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. దాదాపు 512 రోజుల తర్వాత నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ ద్వారా టెస్టు ఆడుతున్న రహానే అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో రహానే ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తూ సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. ఆసీస్ పేసర్ల దాటికి బ్యాటింగ్ చేయడానికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. రహానే టెస్టు కెరీర్లో ఇది 26వ అర్థశతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే అజింక్యా రహానే టీమిండియా తరపున డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్థసెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 2021లో టీమిండియా కివీస్‌తో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినప్పటికి ఆ మ్యాచ్‌లో ఒక్క భారత్ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ అందుకోలేకపోయాడు. అప్పటి మ్యాచ్‌లోనూ రహానే 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. తాజాగా ఆసీసీతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుదేలైనప్పటికి రహానే ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తూ టీమిండియాను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్ సీఎస్కే తరపున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రహానే అదే ఫామ్‌ను ఇక్కడా కంటిన్యూ చేయడం సంతోషదాయకం. టి20ల్లో తన వేగవంతమైన ఆటతో అలరించిన రహానే టెస్టులకు వచ్చేసరికి తనలోని టెస్టు స్పెషలిస్ట్‌ను బయటికి తీశాడు. #WATCH | The Oval, London: This has been a pleasant and surprising morning as yesterday we had a very disappointing result. Shardul Thakur is batting very maturely and the result we have now is that they (Rahane and Thakur) have given us a fighting chance. Yesterday it looked… pic.twitter.com/56I8gMWmCz — ANI (@ANI) June 9, 2023 -
ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ సీఎస్కేతో జరిగిన ఫైనల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన మెరుపులతో ఆకట్టుకున్నాడు. Photo: IPL Twitter అయితే సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్‌ను నిధానంగా ఆరంభించినప్పటికి అసలు సమయంలో తనలోని డేంజరస్ బ్యాటర్‌ను వెలికి తీశాడు. సాహా ఔటైన తర్వాత గేర్ మార్చిన సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్ సహా మూడు ఫోర్లు కలిపి 20 పరుగులు పిండుకున్నాడు. 31 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన సాయి సుదర్శన్.. తర్వాతి 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో సాయి సుదర్శన్ ఐపీఎల్లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు మనీష్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తరపున పంజాబ్ కింగ్స్‌పై 94 పరుగులు చేశాడు. 2012 ఫైనల్లో సీఎస్కేపై కేకేఆర్ తరపున మన్విందర్ బిస్లా 89 పరుగులు చేశాడు. అయితే రజత్ పాటిదార్(ఆర్సీబీ తరపున 112 నాటౌట్ వర్సెస్ కేకేఆర్) సెంచరీ చేసినప్పటికి అది ఫైనల్ మ్యాచ్ కాదు.. ఎలిమినేటర్‌లో పాటిదార్ సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్లో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాయి సుదర్శన్ దక్కించుకున్నాడు. Photo: IPL Twitter ► ఇక ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్‌గా సాయి సుదర్శన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకముందు షేన్ వాట్సన్ 117 పరుగులు నాటౌట్(2018లో ఎస్ఆర్హెచ్తో ఫైనల్లో) తొలి స్థానంలో, రెండో స్థానంలో సీఎస్కే తరపున వృద్ధిమాన్ సాహా 115 పరుగులు పంజాబ్ కింగ్స్ తరపున, 2014లో కేకేఆర్‌పై ఫైనల్లో, మురళీ విజయ్ 95 పరుగులు(సీఎస్కే), మనీష్ పాండే(94 పరుగులు, కేకేఆర్) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ ఫైనల్లో 50 ప్లస్ స్కోరు చేసిన రెండో యంగెస్ట్ బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇవాళ సీఎస్కేతో ఫైనల్లో (47 బంతుల్లో 96 పరుగులు) 21 ఏళ్ల 226 రోజుల వయసులో సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు. తొలి స్థానంలో మనన్ వోహ్రా 2014లో 20 ఏళ్ల 318 రోజుల వయసులో; శుబ్‌మన్ గిల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో(2021లో సీఎస్కేతో జరిగిన ఫైనల్లో కేకేఆర్ తరపున) మూడో స్థానంలో, రిషబ్ పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో(2020లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున) నాలుగో స్థానంలో ఉన్నాడు. Sai Sudharsan masterclass in the IPL 2023 Final. pic.twitter.com/SiRywPhOqz — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 చదవండి: శుబ్‌మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా -
అదరగొట్టినా.. పాపం ఎండ వేడిమికి తట్టుకోలేకపోయాడు
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్ 16వ సీజన్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆదివారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న డికాక్ ఆ తర్వాత జట్టుతో కలిసినప్పటికి విదేశీ కోటాలో కైల్ మేయర్స్, స్టోయినిస్, నికోలస్ పూరన్, మార్క్‌వుడ్‌లు ఉండడంతో డికాక్ దాదాపు 10 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందరూ మంచి ప్రదర్శన కనబరుస్తుండడంతో ఎవరిని తీయాలో కేఎల్ రాహుల్‌కు అర్థం కాలేదు. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ కేఎల్ రాహుల్ తాజాగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో డికాక్ తుది జట్టులోకి వచ్చాడు. గతేడాది ఫామ్‌ను కంటిన్యూ చేసిన డికాక్.. వచ్చీ రావడంతోనే అర్థసెంచరీతో మెరిశాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు ఎండవేడిమి ఎక్కువగా ఉంది. దీనికి తోడు మ్యాచ్ మధ్యాహ్నం జరగడంతో స్టేడియంలో వడగాలులు వీచాయి. ఎండ వేడిమికి భరించలేని డికాక్ డీ హైడ్రేట్ అయినట్లు కనిపించాడు. అందుకే ఫిఫ్టీ మార్క్ అందుకున్నప్పటికి.. సీజన్లో తొలి అర్థసెంచరీ అయినప్పటికి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు. సింపుల్‌గా బ్యాట్ పైకెత్తిన డికాక్ నీరసంగా స్ట్రైక్ ఎండ్‌వైపు నడవడం కనిపించింది. అంతకముందు బ్రేక్ సమయంలోనూ డికాక్ ప్లూయిడ్స్ తీసుకోవడం కనిపించింది. దీన్నిబట్టి డికాక్ చాలా అలిసిపోయినట్లు అనిపించింది. ఓవరాల్‌గా 41 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 𝗕𝗮𝗰𝗸 𝘄𝗶𝘁𝗵 𝗮 𝗯𝗮𝗻𝗴 👊💥 Quinton de Kock marks his return to #TATAIPL action with a blistering 50 #GTvLSG #IPLonJioCinema #IPL2023 | @QuinnyDeKock69 pic.twitter.com/V1YuVeBOoX — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: తీసేస్తారన్న సమయంలో ఆడతాడు.. అదే ప్రత్యేకత! -
తొలి ఫిఫ్టీ.. ఐదేళ్ల క్రితం అరంగేట్రం, గిల్‌క్రిస్ట్‌కు వీరాభిమాని
ఆర్సీబీ ఆల్‌రౌండర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో తొలి అర్థసెంచరీ సాధించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన మహిపాల్ లామ్రోర్ 29 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే మహిపాల్ లామ్రోర్ 2018లోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అయితే ఐదేళ్లకు గానూ ఐపీఎల్లో అర్థసెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇక మహిపాల్ లామ్రోర్ ఆస్ట్రేలియా మాజీ విధ్వంకర ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు వీరాభిమాని. అతని విధ్వంసకర ఆటతీరును చూస్తూ పెరిగిన లామ్రోర్ ఇవాళ దేశవాలీ క్రికెట్లో తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ సీజన్లో దేశవాలీ క్రికెట్లో లామ్రోర్ వరుసగా 69, 55, 46, 85, 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 95 లక్షలకు మహిపాల్ లామ్రోర్‌ను దక్కించుకుంది. Mahipal Lom-ROAR🔥#DCvRCB #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @RCBTweets pic.twitter.com/j6KNm2pEU9 — JioCinema (@JioCinema) May 6, 2023 Lomror was 10*(9) at the end of the 13th over. Lomror finished on 54*(29) after the 20th over. One of the best knocks by an uncapped player in IPL 2023. pic.twitter.com/fY1bzlNLR4 — Johns. (@CricCrazyJohns) May 6, 2023 చదవండి: కోహ్లి అరుదైన ఫీట్.. రికార్డులు కొట్టడానికే పుట్టాడా? -
ఏడో నెంబర్లో వచ్చి అదరగొట్టాడు.. ఎవరీ అమన్ హకీమ్ ఖాన్?
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మరో ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చి అద్భతుమైన ఫిఫ్టీతో అలరించాడు అమన్ హకీమ్ ఖాన్. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. రిపల్ పటేల్‌లో కలిసి ఏడో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. కాగా బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై 43 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన అమన్ హకీమ్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్లో ఏడు.. అంతకంటే ఎక్కువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఫిఫ్టీ మార్క్ అందుకున్న మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకముందు అక్షర్ పటేల్ (54 పరుగులు వర్సెస్ ముంబై ఇండియన్స్, 2023), క్రిస్ మోరిస్(52 పరుగులు వర్సెస్ ముంబై ఇండియన్స్, 2017), అమన్ హకీమ్ ఖాన్(51 పరుగులు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఉన్నారు. ఎవరీ అమన్ హకీమ్ ఖాన్ ? ముంబైకి చెందిన అమన్ హకీమ్ ఖాన్ 2020-21 విజయ్ హజారే ట్రోఫీ ద్వారా 2021లో మార్చి 9న లిస్ట్ -ఏ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20 క్రికెట్లో అడుగుపెట్టాడు. 2022 నవంబర్‌లో శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ అమన్ హకీమ్ ఖాన్‌ను ట్రేడింగ్ చేసుకుంది. Stood up when the chips were down - well batted, Aman Khan 👏🫡#GTvDC #IPLonJioCinema #TATAIPL | @delhicapitals pic.twitter.com/FofyAPkqVk — JioCinema (@JioCinema) May 2, 2023 చదవండి: రీఎంట్రీ అదుర్స్.. వంద వికెట్ల క్లబ్లో మోహిత్ శర్మ -
పంజాబ్ ఓడినా తాను గెలిచాడు.. ఎవరీ అథర్వ తైదే?
లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో మరో సంచలనం పుట్టుకొచ్చాడు. మ్యాచ్‌లో పంజాబ్ ఓడినప్పటికి తాను మాత్రం గెలిచాడు. కొండంత లక్ష్యం కనబడుతున్నా ఏ మాత్రం బెదరక ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. అతనే అథర్వ తైదే. 23 ఏళ్ల తైదే పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్లో తొలి అర్థసెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 66 పరుగులు చేసిన తైదే.. 26 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లక్నో 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎవరీ అథర్వ తైదే? మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన అథర్వ తైదే 2018-19సీజన్లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్- ఏ క్రికెట్లో విదర్భ తరపున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు. ఇక 2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20 క్రికెట్లో అడుగుపెట్టాడు. 2022లో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ కింగ్స్ అథర్వ తైదేను కొనుగోలు చేసింది. 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 887 పరుగులు, 24 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 758 పరుగులతో పాటు 8 వికెట్లు, 33 టి20 మ్యాచ్‌ల్లో 774 పరుగులతో పాటు 10 వికెట్లు తీశాడు. A well made FIFTY by Atharva Taide off 26 deliveries. Live - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/P3iMu1KQu6 — IndianPremierLeague (@IPL) April 28, 2023 Time and Taide wait for no man 😉#IPLonJioCinema #PBKSvLSG #TATAIPL #IPL2023 pic.twitter.com/OMsyXX67z3 — JioCinema (@JioCinema) April 28, 2023 చదవండి: లక్నో సూపర్ జెయింట్స్‌ది రికార్డే.. ఆర్సీబీని మాత్రం కొట్టలేకపోయింది -
ఏమా విధ్వంసం.. ఇలా ఆడితే డికాక్‌కు కష్టమే!
ఐపీఎల్ 16వ సీజన్లో కైల్ మేయర్స్ తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌తోనే ఐపీఎల్లో డెబ్యూ ఇచ్చిన మేయర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కైల్ మేయర్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన మేయర్స్ ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 44 పరుగుల వద్ద సిక్సర్ బాదిన మేయర్స్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే 24 బంతుల్లోఈ సీజన్లో మేయర్స్‌కు ఇది నాలుగో అర్థసెంచరీ కాగా.. మొత్తంగా 8 మ్యాచ్‌లాడిన మేయర్స్ 297 పరుగులు చేశాడు. అయితే కైల్ మేయర్స్ తన సూపర్ ఫామ్ కనబరుస్తుండడంతో క్వింటన్ డికాక్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. మేయర్స్ తప్పించే సాహసం కేఎల్ రాహుల్ చేయడం లేదు. ఒకవేళ కైల్ మేయర్స్ విధ్వంసం ఇలాగే కొనసాగితే మాత్రం డికాక్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు. It's Diwali in Mohali, courtesy Kyle Mayers 🔥🎇🎆#IPLonJioCinema #TATAIPL #PBKSvLSG pic.twitter.com/1MLi05NlBj — JioCinema (@JioCinema) April 28, 2023 చదవండి: పంజాబ్, లక్నో మ్యాచ్‌కు పొంచిఉన్న ముప్పు.. ఏ క్షణమైనా! -
క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. క్రికెట్ దేవుడు!
-
#AjinkyaRahane: 'కుర్రాళ్లు కూడా దిగదుడుపే.. చెడుగుడు ఆడాడు'
అజింక్యా రహానే.. ఈ పేరు చెప్పగానే ప్రశాంతతకు మారుపేరు.. అని ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ ఆడిన మ్యాచ్‌లో రహానే ఆట చూసిన వారెవరైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అలా సాగింది రహానే ఆటతీరు. ఏమని చెప్పగలం.. ఎంతని చెప్పగలం.. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అసలు ఆడుతుంది రహానేనా లేక ఇంకెవరైనా అనే అనుమానం కూడా కలగక మానదు. అంతలా విధ్వంసం చేసి పారేశాడు. చినుకు చినుకు గాలి వానలా మారి తుఫాను విధ్వంసంతో విరుచుకుపడిందన్నట్లుగా రహానే ఇన్నింగ్స్ సాగింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానే మొత్తంగా 29 బంతుల్లో 71 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే తుఫానుకు ముందు ప్రశాంతత అన్నట్లుగా సీఎస్కే ఇన్నింగ్స్ 13 ఓవర్ ముగిసే సరికి రహానే 14 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత నుంచి రహానే విధ్వంసం మొదలైంది. ఓవర్‌కు సిక్సర్ లేదా ఫోర్ అన్నట్లుగా సాగింది అతని ఇన్నింగ్స్. 14 బంతుల్లో 19 పరుగులు చేసిన రహానే.. తాను ఎదుర్కొన్న చివరి 15 బంతుల్లో 60 పరుగులు బాదాడు. దీన్నిబట్లే రహానే విధ్వంసం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో దక్కించుకున్న సీఎస్కేకు అతను రెట్టింపు న్యాయం అందిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రహానే తన ముందు కుర్రాళ్లు కూడా దిగదిడుపూ అని నిరూపించాడు. 🔥 We are using 'Ridiculous' and 'Rahane' in one sentence... who would have thunk!? 🤯#KKRvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ajinkyarahane88 pic.twitter.com/zXhhtfIFlv— JioCinema (@JioCinema) April 23, 2023 -
కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో మూడో క్రికెటర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్ సాధించాడు. ఓపెనర్‌గా 50 ప్లస్ స్కోర్లు ఎక్కువసార్లు నమోదు చేసిన మూడో ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. రాహుల్ ఓపెనర్‌గా 34సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్(34 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు) రికార్డును బ్రేక్ చేసి మూడో స్థానంలోకి వచ్చాడు. కాగా గంభీర్ ప్రస్తుతం లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 57 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. వార్నర్ తర్వాత శిఖర్ ధావన్ 48 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. -
'ఆ నవ్వుకే పడిపోయాడనుకుంటా..'
ఐపీఎల్16వ సీజన్లో భాగంగా ఆర్సీబీ రెండో విజయాన్ని నమోదు చేసింది. రెండు వరుస పరాజయాలతో డీలా పడిన ఆర్సీబీ సొంతగ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలిచింది. కోహ్లి అర్థసెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ తడబడినప్పటికి ఆఖర్లో షాబాజ్ అహ్మద్, అనూజ్ రావత్‌లు విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌కు కోహ్లి భార్య అనుష్క శర్మ హాజరైంది. ఈ క్రమంలో కోహ్లి హాఫ్ సెంచరీ చేయగానే తన భర్తను అభినందిస్తూ అనుష్క చిరునవ్వుతో ఇచ్చిన స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోహ్లి కూడా ఫిఫ్టీ కొట్టగానే అనుష్క ఉన్న స్టాండ్స్‌వైపు తన బ్యాట్‌ను చూపిస్తూ మురిసిపోయాడు. ఇక అభిమానులు దీనిపై స్పందిస్తూ.. ''కింగ్ ఎప్పుడు తన క్వీన్‌ను ఎప్పుడు నిరాశపరచడు''.. ''బహుశా ఆ నవ్వుకే కోహ్లి పడిపోయి ఉంటాడు.. దటీజ్ కింగ్ కోహ్లి#KIngKohli #ViratKohli '' అంటూ కామెంట్ చేశారు. #ViratKohli notches up a hat-trick of 50s at the Chinnaswamy stadium in #IPL2023 🔥#RCBvDC LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPLonJioCinema #TATAIPL | @imVkohli @RCBTweets pic.twitter.com/5erkCUFJ9O— JioCinema (@JioCinema) April 15, 2023 A king never disappoints his queen❤️❤️ #bleedred #rcb #ViratKohli #kingkohli #ViratKohli𓃵 #IPL2023 #TATAIPL #RCBvDC @DevgunUjjwal pic.twitter.com/KwhrCnf1ZI— AnOrdinaryViratian (@satviksharma05) April 15, 2023 -
#HarryBrook: 13.25 కోట్లు దండగన్నారు.. ఇప్పుడు చెప్పండి!
టెస్టులాడే ఆటగాడిని ఐపీఎల్‌కు తీసుకొచ్చారు.. 13.25 కోట్లు పెట్టి కొంటే దారుణంగా విఫలమవుతున్నాడు.. ఎస్ఆర్హెచ్ ఇలాంటి వారిని ఎందుకు కొనుగోలు చేస్తుందో అర్థం కాదు.. ఇవి తొలి మూడు మ్యాచ్‌ల్లో హ్యారీ బ్రూక్ విఫలమైనప్పుడు వచ్చిన విమర్శలు. సోషల్ మీడియాలో అయితే బ్రూక్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా కెప్టెన్ మార్క్రమ్ సహా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ అతనిపై నమ్మకముంచింది. ఎట్టకేలకే శుక్రవారం(ఏప్రిల్ 14) కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రూక్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తనను విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. టెస్టు మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్‌కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్ ఆ ఫేజ్‌ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. బ్రూక్ ఫామ్‌లోకి కాస్త అతన్ని ఆపడం ఎవరి తరం కాదు.. ఓపెనింగ్‌లో పంపింస్తే రాణించే అవకాశం ఉంటుంది అని ఒక మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. అందుకే ఓపిక ఉండడం చాలా అవసరం అని అంటారు. ఏమో బ్రూక్ ఇకపై తన విశ్వరూపం చూపించే అవకాశం ఉందేమో. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ హ్యారీ బ్రూక్ తొలుత విఫలమయ్యాడు. ఒకసారి కుదురుకున్నాకా అతనికి అడ్డు లేకుండా పోయింది. పీఎస్ఎల్లో 10 మ్యాచ్‌లాడిన బ్రూక్ ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి 262 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా ఓడుతుందా అన్నది పక్కనబెడితే.. బ్రూక్ లాంటి ఆటగాడు ఫామ్‌లోకి రావడం ఎస్ఆర్హెచ్కు కొండంత బలం. రానున్న మ్యాచ్‌ల్లో అతను కీలకంగా మారే అవకాశం ఉంది. -
ఒక్క హాఫ్ సెంచరీతో రెండేళ్ల నిరీక్షణకు తెర
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో ఎట్టకేలకు హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న రోహిత్ నిరీక్షణకు తెరదించాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ అర్థసెంచరీతో రాణించాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన రోహిత్ మునుపటి ఫామ్‌ను గుర్తుచేస్తూ చెలరేగాడు. ముఖ్యంగా నోర్ట్జే 150 కిమీవేగంతో వేసిన బంతిని తన ట్రేడ్‌మార్క్ సిక్సర్‌తో మెరిశాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో రోహిత్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అయితే రోహిత్ ఓపెనర్‌గా ఫిఫ్టీ సాధించి రెండేళ్లు అయిపోయింది. చివరగా 2021 ఐపీఎల్ సీజన్లో అర్థసెంచరీ మార్క్ సాధించిన రోహిత్‌కు మళ్లీ అర్థసెంచరీ సాధించడానికి 24 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్లో ఒక అర్థసెంచరీకి ఎక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకున్న ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ తర్వా మయాంక్ అగర్వాల్(2011-15) 21 ఇన్నింగ్స్‌లు, మురళీ విజయ్(2014-16) 20 ఇన్నింగ్స్‌లు ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన డికాక్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆదివారం సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో.. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్లో ఈ ఘనత సాధించిన జాబితాలో డికాక్ ఐదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ కేవలల 12 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇక రెండో టీ20లో డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్ 9 పోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌పై దక్షిణాఫ్రికా రికార్డు విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది. చదవండి: SA vs WI: టీ20 మ్యాచ్‌లో 517 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలు! ఇదే తొలిసారి That was special 🔥#SAvWI #BePartOfIt pic.twitter.com/rruu4aYa0h — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 -
డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ క్రికెటర్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తొలి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్.. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ను అందుకుంది. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో డంక్లీ ఈ ఫీట్ అందుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా డంక్లీ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా 28 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులతో విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా రేణుకా ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టిన డంక్లీ.. ప్రీతిబోస్ వేసిన ఐదో ఓవర్లో విశ్వరూపం చూపించింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకొని అర్థసెంచరీ మార్క్‌ను అందుకుంది. ఇక మహిళల టి20 క్రికెట్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఇక సోఫియా డంక్లీ ఇంగ్లండ్ తరపున 44 టి20ల్లో 652 పరుగులు, 28 మ్యాచ్‌ల్లో 746 పరుగులు, మూడు టెస్టుల్లో 152 పరుగులు చేసింది. -
ఫోర్లతో హర్మన్ హల్చల్.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ఫిఫ్టీ
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో తొలి అర్థశతకం నమోదైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లీగ్‌లో తొలి ఫిఫ్టీ సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ 22 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకుంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వేగంగా ఆడిన హర్మన్ వరుస బౌండరీలతో విరుచుకుపడింది. బౌండరీల రూపంలోనే 44 పరుగులు వచ్చాయంటే ఆమె ఎంత దూకుడుగా ఆడిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక హర్మన్ ఇన్నింగ్స్ ఒక్క సిక్సర్ లేకుండా కేవలం బౌండరీలు మాత్రమే ఉండడం విశేషం. మ్మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. -
అన్నీ తానై.. కష్టకాలంలో అర్థసెంచరీ
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కష్టకాలంలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో పుజారా అర్థశతకంతో మెరిశాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 45.1 ఓవర్లో 108 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. పుజారా టెస్టు కెరీర్లో ఇది 35వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. పిచ్‌పై బంతి అనూహ్యంగా టర్న్ అవుతుండడంతో ఎలా బ్యాటింగ్ చేయాలో అర్థం కాక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుజారా మాత్రం తన విలువేంటో చూపిస్తూ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 2021 ఏడాది నుంచి చూసుకుంటే టెస్టుల్లో పుజారా బ్యాటింగ్ సగటు తొలి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్‌లోనే ఎక్కువగా ఉంది. 2021 నుంచి చూసుకుంటే తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సగటు 19.04 ఉంటే(22 ఇన్నింగ్స్‌లు).. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52.06(19 ఇన్నింగ్స్‌లు) సగటు ఉండడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా ఎదురీదుతోంది. టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. పుజారా 52 పరుగులతో ఆడుతూ ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్ -
సిక్సర్‌తో ఫిఫ్టీ.. పూర్తిస్థాయి బ్యాటర్‌గా మారిపోయాడు
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మరోసారి ఆపద్భాంధవుడయ్యాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ తానున్నాంటూ మరోసారి టీమిండియాను ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ టెస్టులో మరో అర్థసెంచరీ నమోదు చేశాడు. బ్యాటర్లంతా విఫలమైన చోట అక్షర్ 95 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తన స్కోరు 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు అక్షర్ కుహ్నేమన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్థసెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. తొలి టెస్టులోనూ టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు అక్షర్ పటేల్ 84 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. టీమిండియా 400 పరుగులు దాటగిలిగిందంటే అదంతా అక్షర్ పటేల్, జడేజాల చలువే. ఆ తర్వాత అశ్విన్, జడ్డూ స్పిన్ మాయాజాలంతో టీమిండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో విఫలమైనా బ్యాటింగ్‌లో మెరిసి జట్టు విజయంలో అక్షర్ పటేల్ తన వంతు పాత్ర పోషించాడు. అయితే కెరీర్ మొదట్లో అక్షర్ పటేల్ కేవలం బౌలింగ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మారిపోయాడు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మాత్రం అక్షర్ పటేల్‌లో పూర్తిస్థాయి బ్యాటర్ కనిపిస్తున్నాడు. బ్యాటర్లంతా విఫలమైన చోట ఆసీస్ బౌలర్లను పరీక్షిస్తూ బ్యాటింగ్ కొనసాగించిన అక్షర్ ఇన్నింగ్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే మూడో స్పిన్నర్‌గా జట్టులో ఉన్న అక్షర్ పటేల్‌కు బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా దక్కడం లేదు. అశ్విన్, జడేజాలు ప్రభావం చూపిస్తున్న చోట అక్షర్ మాత్రం తన బౌలింగ్ పదును చూపించడంలో విఫలమవుతున్నాడు. అక్షర్ పటేల్ లెఫ్టార్మ్ బౌలర్.. జడేజా కూడా లెఫ్టార్మ్ బౌలరే.. మరి జడ్డూ వికెట్లు తీస్తుంటే అక్షర్ మాత్రం ఎందుకు తీయలేకపోతున్నాడనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే బౌలింగ్‌లో విఫలమైనప్పటికి బ్యాటర్‌గా రాణిస్తుండడంతో అక్షర్ పటేల్ స్థానం జట్టులో ప్రస్తుతానికి పదిలంగానే కనిపిస్తుంది. కానీ మూడో స్పిన్నర్ ప్రభావం చూపాలని జట్టు మేనేజ్మెంట్ యోచన చేస్తే మాత్రం అక్షర్ పటేల్‌పై వేటు పడే అవకాశం ఉంది. Dilli dhamaaka ft. Axar 🎇😎#INDvAUS #AxarPatelpic.twitter.com/yUE4xcIDLy — SunRisers Hyderabad (@SunRisers) February 18, 2023 5⃣0⃣ & counting ✅@akshar2026 smacks a MAXIMUM to bring up his half-century in style 👌🏻👌🏻 Follow the match ▶️ https://t.co/hQpFkyZGW8…#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/noVvVrEbAX — BCCI (@BCCI) February 18, 2023 చదవండి: IND VS AUS 2nd Test Day 2: అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు -
ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు
నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలుత బంతితో ఐదు వికెట్లు తీసిన జడ్డూ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అర్థసెంచరీతో రాణించాడు. 66 పరుగులతో నాటౌట్‌గా ఉన్న జడ్డూ మూడోరోజు ఆటలో సెంచరీ చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. జడ్డూ ఎప్పుడు సెంచరీ లేదా అర్థసెంచరీ బాదినా బ్యాట్‌ను కత్తిలా తిప్పడం(Sword Celebration) బాగా ఫేమస్ అయ్యింది. నిజంగా జడ్డూ తిప్పినంత అందంగా ఎవరు తిప్పలేరు అన్నట్లుగా అతని కత్తిసాము ఉంటుంది. దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే గాయంతో జడేజా దాదాపు ఆరు నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ సమయంలో అతని కత్తిసాము సెలబ్రేషన్‌ను అభిమానులు చాలా మిస్సయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఆ దర్శనం కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికి మధ్యలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. 240 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన దశలో జడేజాకు అక్షర్ తోడయ్యాడు. ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు అజేయంగా జోడించారు. ప్రస్తుతం టీమిండియా రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. And the trademark celebration is here 😀😀@imjadeja 💪 Live - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/Q1TPXZVLfE — BCCI (@BCCI) February 10, 2023 చదవండి: ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు -
కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన చందర్‌పాల్ కుమారుడు
జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు తొలి రోజు ఆటకు వర్షం దెబ్బ కొట్టింది. బులవాయోలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులు సాధించింది. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ కుమారుడు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (170 బంతుల్లో 55 బ్యాటింగ్; 8 ఫోర్లు) కెరీర్లో రెండో అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (138 బంతుల్లో 55 బ్యాటింగ్; 2 ఫోర్లు) కూడా క్రీజులో ఉన్నాడు. -
IND VS NZ 2nd ODI: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
3 వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 13 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లు వికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. -
రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..?
గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత మునపటి టచ్‌లో కనబడిన హిట్ మ్యాన్.. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 67 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే.. నిన్న (జనవరి 9) రోహిత్ అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్ చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. మ్యాజిక్ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్.. ఫిఫ్టి పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ పేరును స్మరిస్తూ, చాలాకాలం తర్వాత చేసిన కీలక హాఫ్ సెంచరీని మ్యాజిక్కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Dedicating this 50 for his pet dog who passed away this week. Rohit is an emotion for cricketing fans!! Love this celebration from skipper.#RohitSharma #INDvSL #RohitSharma𓃵 pic.twitter.com/c7EHEmsFjc — sportsbuzz (@cricket_katta11) January 10, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్, శుభ్‌మన్ గిల్ (70)లు హాఫ్ సెంచరీలతో రాణించగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్) శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by Ritika Sajdeh (@ritssajdeh) -
Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు
టి20 ప్రపంచకప్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్ విజయంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పాత్ర కీలకం. ఇన్నింగ్స్‌లో చివరి వరకు మూలస్తంభంలా నిలబడిన స్టోక్స్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అయితే ఇక్కడ మనకు తెలియని విషయమేంటంటే.. స్టోక్స్ టి20 కెరీర్లో ఇదే తొలి అర్థసెంచరీ కావడం. 48 టి20 మ్యాచ్‌ల కెరీర్లో స్టోక్స్ ఇంతవరకు ఒక్క హాఫ్ సెంచరీ కొట్టలేకపోయాడు. దీనికి చాలా కారణాలున్నాయి. స్టోక్స్ ఎక్కువగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ టాపార్డర్ చాలా వరకు మ్యాచ్‌లను పూర్తి చేస్తూ రావడంతో స్టోక్స్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఈసారి మాత్రం టాపార్డర్ విఫలం కావడంతో తనలోని బ్యాటర్‌ను బయటకు తీశాడు బెన్ స్టోక్స్. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ ఆల్‌రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పాడు. ఎట్టకేలకు టి20 ప్రపంచకప్‌లో అదీ ఫైనల్లో తొలి అర్థసెంచరీ చేయడమే గాక జట్టున విశ్వవిజేతగా నిలిపిన ఘనత స్టోక్స్‌కే దక్కుతుంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన స్టోక్స్ అనతికాలంలో గొప్ప ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో స్టోక్స్‌దే కీలకపాత్ర. ఆనాటి ఫైనల్లో అతను ఆడిన 84 పరుగుల ఇన్నింగ్స్ ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపింది. తాజాగా మరోసారి ఆఖరి వరకు క్రీజులో నిలిచి పొట్టి ఫార్మాట్లో రెండోసారి ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపాడు. స్టోక్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 86 టెస్టులు, 105 వన్డేలు, 48 టి20 మ్యాచ్‌లు ఆడాడు.ఇక టి20, టెస్టులపై దృష్టి సారించేందుకు స్టోక్స్ ఈ ఏడాది ఆరంభంలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో -
PAK Vs NZ: ఫామ్ కోల్పోయిన బాబర్‌తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత
ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టి20 ప్రపంచకప్‌లో తొలిసారి మెరిశాడు. కీలకమైన సెమీస్ పోరులో బాబర్ అర్థసెంచరీతో రాణించాడు. ఈ ప్రపంచకప్‌లో బాబర్ తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 0, 4, 4, 6, 25 పరుగులు చేశాడు. అలాంటి బాబర్ చేత ఫిఫ్టీ కొట్టించిన ఘనత న్యూజిలాండ్‌కే దక్కుతుంది. ఓవరాల్‌గా 42 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజం ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు పెద్ద బలం అని చెప్పొచ్చు. ఇక న్యూజిలాండ్‌కు బ్లాక్‌క్యాప్స్ అనే ముద్ర ఊరికే రాలేదన్న అంశాన్ని తాజా మ్యాచ్‌తో మరోసారి నిరూపించారు. లీగ్ దశలో టాప్ ప్రదర్శన కనబరిచే కివీస్‌ది మళ్లీ అదే పాత కథ. నాకౌట్ మ్యాచ్‌ల్లో చతికిలపడుతుందనే అపవాదును న్యూజిలాండ్ మరోసారి నిజం చేసింది. తాజాగా బుధవారం పాకిస్తాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్ నిరాశజనక ఆటతీరును ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో ఓ మెస్తరు స్కోరు సాధించిన కివీస్.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఇద్దరి మధ్య వంద పరుగుల భాగస్వామ్యం నమోదు కావడంతో ఇద్దరే మ్యాచ్ గెలిపిస్తారా అన్న సందేహం కూడా కలింగింది. అయితే బాబర్ 53 పరుగులు చేసి ఔటైనప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చదవండి: డారిల్ మిచెల్ ఫిప్టీ; అప్పుడు గెలిపించాడు.. మరి ఇప్పుడు! -
డారిల్ మిచెల్ ఫిప్టీ; అప్పుడు గెలిపించాడు.. మరి ఇప్పుడు!
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు. డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు అంటే న్యూజిలాండ్ కచ్చితంగా ఫైనల్ వెళుతుంది అని అభిమానులు పేర్కొంటున్నారు. మిచెల్ సెమీస్‌లో అర్థసెంచరీ వెనుక ఒక చిన్న కథ దాగుంది. అదేంటంటే గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో ఆడిన సెమీఫైనల్లో డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు. ఆ మ్యాచ్‌లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మిచెల్ కివీస్‌ను దగ్గరుండి గెలిపించాడు. దీంతో కివీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా మిచెల్ అర్థసెంచరీ చేశాడు. దీంతో అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కొందరు ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ విషయం పక్కనబెడితే.. డారిల్ మిచెల్ మాత్రం టి20 ప్రపంచకప్‌లో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా మిచెల్ నిలిచాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 72 పరుగులు నాటౌట్.. తాజా వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో సెమీస్‌లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంతకముందు టీమిండియా నుంచి విరాట్ కోహ్లి 2014లో సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో 72 నాటౌట్, ఆ తర్వాత 2016 టి20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై 89 నాటౌట్ చేశాడు. ఇక క్రిస్ గేల్ 2009లో శ్రీలంకతో సెమీస్‌లో 63 నాటౌట్, 2012లో ఆస్ట్రేలియాపై 75 నాటౌట్ రెండు అర్థసెంచరీలు సాధించాడు. చదవండి: ఐదు మ్యాచ్‌లుగా ఒక్క వికెట్ లేదు.. ఒక్క రనౌట్‌తో -
సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు
టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ టి20 క్రికెట్లో ఎదురులేకుండా సాగిపోతున్నాడు. దూకుడే మంత్రంగా సాగుతున్న సూర్యను ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టతరంగా మారింది. సూపర్-12 గ్రూప్-2లో ఆదివారం జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోహ్లి, రోహిత్‌లు విఫలమైన వేళ కేఎల్ రాహుల్‌తో కలిసి సూర్యకుమార్ జింబాబ్వే బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 23 బంతుల్లోనే అర్థశతకం సాధించిన సూర్యకుమార్ ఓవరాల్‌గా 25 బంతుల్లో 61 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు కొట్టాడు. అవి ఒకసారి పరిశీలిద్దాం. ► టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తరపున అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాబితాలో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ 23 బంతుల్లో ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. సూర్య కంటే ముందు ఈ జాబితాలో యువరాజ్ సింగ్ రెండుసార్లు(2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో, 2007లో ఆస్ట్రేలియాపై 20 బంతుల్లో) హాఫ్ సెంచరీ సాధించగా.. కేఎల్ రాహుల్ 2021లో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో 18 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు. ► ఒక టి20 వరల్డ్‌కప్‌లో 100 కంటే ఎక్కువ బంతులాడి అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన జాబితాలో సూర్యకుమార్ అగ్రస్థానంలో నిలిచాడు. 2022 టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ 193.96 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక 2010 టి20 ప్రపంచకప్‌లో మైక్ హస్సీ 175.70 స్ట్రైక్‌రేట్‌తో, 2012లో లూక్ రైట్ 169.29 స్ట్రైక్‌రేట్‌తో, 2022లో గ్లెన్ ఫిలిప్స్ 163.86 స్ట్రైక్‌రేట్‌తో, 2007 టి20 ప్రపంచకప్‌లో కెవిన్ పీటర్సన్ 161.81 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ► ఇక టి20 క్రికెట్లో టీమిండియా తరపున చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ మూడో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్ చివరి ఐదు ఓవర్లలో 56 పరుగులు రాబట్టుకున్నాడు. ఇంతకుముందు ఆసియాకప్ 2022లో ఆఫ్గన్‌పై కోహ్లి 63 పరుగులు రాబట్టగా.. 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 58 పరుగులు పిండుకున్నాడు. -
PAK Vs SA: పాక్ తరపున రెండో బ్యాటర్‌గా..
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు సౌతాఫ్రికాతో మ్యాచ్ చాలా కీలకం. ప్రొటిస్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఓడితే మాత్రం పాకిస్తాన్ ఇంటిబాట పట్టాల్సిందే. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశ నుంచి 185 పరుగులు చేయగలిగింది. పాక్ మిడిలార్డర్ మహ్మద్ నవాజ్(28 పరుగులు), ఇప్తికర్ అహ్మద్(51), షాదాబ్ ఖాన్(52) చెలరేగారు. ఈ నేపథ్యంలోనే షాదాబ్ ఖాన్ టి20 క్రికెట్లో పాకిస్తాన్ జట్టు తరపున అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరపున టి20ల్లో అత్యంత తక్కువ బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన రెండో బ్యాటర్‌గా షాదాబ్ ఖాన్ నిలిచాడు. సౌతాఫ్రికాపై 20 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న షాదాబ్ ఖాన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక తొలి స్థానంలో షోయబ్ మాలిక్ ఉన్నాడు. 2021 టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 18 బంతుల్లోనే ఫిప్టీ సాధించాడు. వీరిద్దరి తర్వాత ఉమర్ అక్మల్ 2010లో ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్ సాధించి మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలోనూ ఉమర్ అక్మలే ఉన్నాడు. 2016లో న్యూజిలాండ్‌పై 22 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో పాకిస్తాన్ మరో రెండు రికార్డులు బద్దలు కొట్టింది. ► సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇప్తికర్ అహ్మద్-షాబాద్ ఖాన్ జంట ఆరో వికెట్‌కు 35 బంతుల్లో 82 పరుగులు జోడించారు. టి20 క్రికెట్లో పాకిస్తాన్‌కు ఏ జట్టుపై అయినా ఆరో వికెట్‌కు ఇదే అత్యుత్తమం. ఇంతకముందు 2019లో శ్రీలంకపై ఆసిఫ్ అలీ- ఇమాద్ వసీమ్ జంట ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. మిస్పా ఉల్ హక్- షోయబ్ మాలిక్ 2012లో ఇంగ్లండ్‌పై ఆరో వికెట్‌కు 56 బంతుల్లో 71 పరుగులు జోడించి మూడో స్థానంలో నిలిచారు. ► ఇక పాకిస్తాన్ ఒక టి20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత 142 పరుగులు జోడించడం ఇదే తొలిసారి. చదవండి: మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా? -
రాణించిన కుశాల్ మెండిస్.. భవితవ్యం ఇక బౌలర్ల చేతిలో
టి20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, శ్రీలంకల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-12లో అడుగుపెడితే.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. ఈ నేపథ్యంలోనే గురువారం జరుగుతున్న క్వాలిఫయింగ్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(44 బంతుల్లో 79, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరవగా.. చరిత్ అసలంక 31 పరుగులు, బానుక రాజపక్స 19 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే , పాల్ వాన్ మీక్రెన్లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫ్రెడ్ క్లాసెన్, టిమ్ వాన్‌డర్ గగ్టెన్లు తలా ఒక వికెట్ తీశారు. లంక ఇన్నింగ్స్‌ను పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్‌లు ఆరంభించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించాకా 14 పరుగులు చేసిన నిస్సాంక వాన్ మీక్రెన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత దనుంజయ డిసిల్వా తొలి బంతికే ఔట్ అయి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక కుశాల్‌కు చరిత్ అసలంక(31 పరుగులు) తోడవ్వడంతో లంక స్కోరు ముందుకు కదిలింది. నాలుగో వికెట్‌కు కుశాల్, అసలంకలు కలిసి 60 పరుగులు జోడించారు. ఆ తర్వాత బానుక రాజపక్స వచ్చి స్కోరును పెంచే వేగంలో 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే కుషాల్ మెండిస్ కూడా వెనుదిరిగాడు. చివర్లో షనక, హసరంగాలు తలా ఇన్ని పరుగులు చేయడంతో లంక 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. చదవండి: కిందా మీదా పడి చివరకు ఎలాగోలా! 'టైటిల్ గెలవాలంటే చేయాల్సింది చాలా ఉంది' -
చెలరేగిన సూర్యకుమార్.. తగ్గేదే లే
టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ తన బ్యాటింగ్ జోరును కంటిన్యూ చేస్తున్నాడు. ఎవరు విఫలమైన తాను మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో సూర్య కుమార్ మరోసారి ఫిప్టీతో అలరించాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో సరిగ్గా 50 పరుగులు చేసిన సూర్యకుమార్ కేన్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అయితే బ్యాటింగ్ చేసినంతసేపు సూర్య తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ఈ ప్రపంచకప్‌లో సూర్యకుమార్ టీమిండియాకు కచ్చితంగా పెద్ద వెన్నముక అవడం గ్యారంటీ. ఇప్పటికే ఈ ఏడాది టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో సూర్యకుమార్ తొలి స్థానంలో నిలిచాడు. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 59 పరుగులకే టాప్ స్కోరర్ కాగా.. సూర్యకుమార్ 50 పరుగులు చేసి ఔటైనప్పటికి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. దినేశ్ కార్తిక్ 20 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్‌లు తలా ఒక వికెట్ తీశారు. Suryakumar Yadav show, this is just incredible consistency, fifty from 32 balls. pic.twitter.com/dzsQuwSrm4 — Johns. (@CricCrazyJohns) October 17, 2022 -
అర్థశతకంతో చెలరేగిన కేఎల్ రాహుల్
T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థ శతకంతో అలరించాడు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఉతుకుడే లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన కేఎల్ రాహుల్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టీమిండియా స్కోరు 59 పరుగులు ఉంటే.. అందులో రాహుల్‌వే 50 పరుగులున్నాయి. దీన్నిబట్టే కేఎల్ రాహుల్ విధ్వంసం ఏ రేంజ్లో కొనసాగిందనేది అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ రోహిత్ కూడా రాహుల్‌కే స్ట్రైక్ ఇచ్చేందుకు ఆసక్తి చూపాడు. ఒక రకంగా చెప్పాలంటే కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ను రోహిత్ ఎంజాయ్ చేశాడనే చెప్పొచ్చు. చదవండి: ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు.. ఒకవేళ పుంజుకుంటే! -
తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పాండిచ్చేరితో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (41 బంతుల్లో 57; 1 ఫోర్, 4 సిక్స్‌లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. మికిల్ జైస్వాల్ (25 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా రాణించాడు. కాగా తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం తన అర్థసెంచరీతో జట్టుకు విజయం అందించేదాకా వదల్లేదు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 20 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్ తరఫున భగత్ వర్మ, తిలక్ వర్మ, సీవీ మిలింద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరోవైపు ఇండోర్‌లో ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చదవండి: భారత సంతతి క్రికెటర్‌పై 14 ఏళ్ల నిషేధం -
India vs Zimbabwe 1st ODI: శుభారంభం ఓపెనర్లతోనే...
వరుస పర్యటనలో, వరుస సిరీస్ వేటలో భారత్ శుభారంభం చేసింది. చాలా కాలం తర్వాత పునరాగమనం చేసిన దీపక్ చహర్ (3/27) బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్‌ను బెంబేలెత్తిస్తే... విజయవంతమైన గిల్–ధావన్ ఓపెనింగ్ జోడి మరొకరికి చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. హరారే: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ అజేయ అర్ధసెంచరీల కంటే కూడా దీపక్ చహర్ స్పెల్ (7–0–27–3) ఈ మ్యాచ్‌లో హైలైట్. ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన చహర్ పిచ్ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొని వైవిధ్యమైన బంతులతో టాపార్డర్‌లో ఏ ఒక్కరిని పట్టుమని 10 పరుగులైనా చేయనివ్వలేదు. ఛేదన సులువయ్యేందుకు అతని స్పెల్ కారణమైంది. ఇదే పిచ్‌పై రెండు వారాల క్రితం వరుస మ్యాచ్‌ల్లో 290, 303 పరుగులు నమోదయ్యాయి. సులువుగా ఛేదించడం కూడా జరిగింది. అలాంటి పిచ్‌పై చహర్ బౌలింగ్ అసాధారణమనే చెప్పాలి. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రెగిస్ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్ ఎన్గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇవాన్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మన బౌలింగ్‌కు కాస్త ఎదురు నిలిచారు. స్పిన్నర్ అక్షర్ పటేల్, సీమర్లు దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 30.5 ఓవర్లలో అసలు వికెట్టే కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (72 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), ధావన్ (113 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభించింది. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. చహర్ దెబ్బకు ‘టాప్’టపా వికెట్లు కొత్త బంతితో దీపక్ చహర్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇన్నోసెంట్ కైయా (4)ను కీపర్ క్యాచ్‌తో పంపాడు. తన మరుసటి ఓవర్ తొలి బంతికి మరుమని (8)ని కూడా కీపర్ క్యాచ్‌తోనే పెవిలియన్ చేర్చాడు. వెస్లీ మదెవెర్ (5)ను ఎల్బీగా ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లో సిరాజ్... సియాన్ విలియమ్స్ (1) వికెట్ తీశాడు. జింబాబ్వే 31 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్ సంగతి ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చూసుకోవడంతో ఒక దశలో జింబాబ్వే 110/8 స్కోరుతో ఆలౌట్‌కు దగ్గరైంది. బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇద్దరే పూర్తి చేశారు టాపార్డర్‌లో ఓపెనింగ్‌ను ఇష్టపడే కెప్టెన్ రాహుల్ తను కాదని విజయవంతమైన ధావన్–గిల్ జోడితోనే ఓపెన్ చేయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శిఖర్–శుబ్‌మన్ జోడీ ఈ రెండు నెలల్లో మూడో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. విండీస్ గడ్డపై కనబరిచిన జోరునే జింబాబ్వేపై కూడా కొనసాగించారు. మైదానంలో బౌండరీలు, భారత్‌కు పరుగులు వస్తున్నాయి కానీ పాపం ఆతిథ్య బౌలర్లకే వికెట్ గగనమైంది. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లతో వేయించిన ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. ముందుగా ధావన్ (76 బంతుల్లో 5ఫోర్లతో) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 20వ ఓవర్లో 100 పరుగులు దాటింది. శుబ్‌మన్ కూడా (51 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని చేరేందుకు 30.5 ఓవర్లే సరిపోయాయి. దాదాపు 20 ఓవర్ల ముందే ఇద్దరే బ్యాటర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: కైయా (సి) సామ్సన్ (బి) చహర్ 4; మరుమని (సి) సామ్సన్ (బి) చహర్ 8; వెస్లీ (ఎల్బీ) (బి) చహర్ 5; సియాన్ విలియమ్స్ (సి) ధావన్ (బి) సిరాజ్ 1; సికందర్ రజా (సి) ధావన్ (బి) ప్రసిధ్ 12; చకాబ్వా (బి) అక్షర్ 35; రియాన్ బర్ల్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 11; ల్యూక్ జాంగ్వే (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఇవాన్స్ నాటౌట్ 33; రిచర్డ్ (బి) ప్రసిధ్ 34; విక్టర్ (సి) గిల్ (బి) అక్షర్ 8; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–26, 3–31, 4–31, 5–66, 6–83, 7–107, 8–110, 9–180, 10–189. బౌలింగ్: దీపక్ చహర్ 7–0–27–3, సిరాజ్ 8–2–36–1, కుల్దీప్ 10–1–36–0, ప్రసిధ్ 8–0–50–3, అక్షర్ 7.3–2–24–3. భారత్ ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 81; శుబ్‌మన్ గిల్ నాటౌట్ 82; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 192. బౌలింగ్: రిచర్డ్ ఎన్గరవా 7–0–40–0, విక్టర్ 4–0–17–0, ఇవాన్స్ 3.5–0–28–0, సియాన్ 5–0–28–0, సికందర్ రజా 6–0–32–0, ల్యూక్ జాంగ్వే 2–0–11–0, వెస్లీ 2–0–16–0, రియాన్ బర్ల్ 1–0–12–0. -
PIN:భారత దేశం.. ఇవాళ మరో మైలురాయి కూడా!
స్పెషల్: స్వతంత్ర భారతావని 75 ఏళ్ల వసంతం పూర్తి చేసుకుంది. దేశం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇవాళ మన దేశం మరో మైలురాయిని దాటిందన్న విషయం మీకు తెలుసా?.. అదీ తపాలా వ్యవస్థ ద్వారా!. పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్(PIN)కు సరిగ్గా ఇవాళ్టికి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. లెటర్లు, కొరియర్లు, ఇతర పోస్టల్ ఐటెమ్స్ పంపడానికి ఈ నెంబర్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే కదా. ఈ పిన్ను 1972, ఆగస్టు 15న మొదలుపెట్టారు. ఇంతకీ ఇది ఎలా పుట్టింది? ఇది రావడానికి ఎవరి కృషి దాగుంది? తదితర విషయాలు చూద్దాం. Postal Identification Number నే ఏరియా కోడ్ లేదంటే జిప్ కోడ్ అని కూడా పిలుస్తారు. ఈ నెంబర్ వల్లే పోస్టల్ డిపార్ట్మెంట్కు, పోస్ట్‌మ్యాన్‌కు ఉత్తరాలు సరఫరా చేయడం సులభం అవుతోంది. ► పిన్ కోసం కృషి చేసిన వ్యక్తి.. శ్రీరామ్ భికాజి వెలెంకర్. ఫాదర్ ఆఫ్ పిన్‌గా ఈయనకు పేరు ముద్రపడిపోయింది. మహారాష్ట్రకు చెందిన ఈయన కేంద్ర సమాచార శాఖలో అదనపు కార్యదర్శిగా, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్బోర్డులో సీనియర్ సభ్యుడిగా కొనసాగారు. సంస్కృత కవి అయిన వెలెంకర్కు 1996లో రాష్ట్రపతి అవార్డు దక్కింది. 1999లో ఆయన కన్నుమూశారు. ► భారతదేశం అంతటా అనేక స్థలాల పేర్లను నకిలీ చేయడం వలన పిన్ కోడ్ అవసరం ఏర్పడింది. ప్రజలు వివిధ భాషలలో చిరునామాలను కూడా వ్రాసేవారు, ఇది చిరునామాలను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. అందుకే కోడ్ సిస్టమ్ వల్ల.. పోస్ట్‌మెన్ చిరునామాను సరైన వ్యక్తులకు అందించడంలో సహాయపడింది. ► ఆరు నెంబర్ల పిన్ కోడ్‌లో.. ఫస్ట్ డిజిట్ జోన్‌ను సూచిస్తుంది. ► రెండవది.. సబ్ జోన్‌ను సూచిస్తుంది. ► మూడవది.. జిల్లాను అదీ సదరు జోన్ పరిధిలోనే ఉందని తెలియజేస్తుంది. ► చివరి మూడు డిజిట్స్ మాత్రం.. సంబంధిత పోస్టాఫీస్‌ను తెలియజేస్తుంది. ► పోస్టల్ రీజియన్ కార్యాలయం.. ప్రధాన పోస్టాఫీస్‌కు ప్రధాన కేంద్రం లాంటిది. ► భారతదేశంలో ఎనిమిది ప్రాంతీయ మండలాలు, ఒక ఫంక్షనల్ జోన్ (భారత సైన్యం కోసం) సహా తొమ్మిది పోస్టల్ జోన్లు ఉన్నాయి. ► ఇండియా పోస్ట్ ప్రకారం.. దేశం మొత్తం 23 పోస్టల్ సర్కిల్స్‌గా విభజించబడి ఉంది. ప్రతీ సర్కిల్‌కు హెడ్‌గా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఉంటాడు. ► PIN prefix లిస్ట్‌లో.. 50 అనే సంఖ్య టీజీ అనేది తెలంగాణను, 51-53 మధ్య ఏపీని సూచిస్తుంది. ► డెలివరీ కార్యాలయం జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO), ప్రధాన కార్యాలయం (HO) లేదా సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే సబ్-ఆఫీస్ (SO) కావచ్చు. ► సాధారణంగా చాలామంది ఆశువుగా పిన్ నెంబర్ అనేస్తుంటారు. కానీ, పోస్టల్ విషయంలో పిన్ నెంబర్ అని రాయకూడదు.. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ లేందటే పిన్ అని మాత్రమే రాయాలి. ఇదీ చదవండి: ‘ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి’ -
దంచికొట్టిన సూర్యకుమార్.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ
వెస్టిండీస్ సిరీస్‌కు రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో టీమిండియా ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన సూర్యకుమార్ యాదవ్ తొలిసారి విజృంభించాడు. మంగళవారం రాత్రి జరిగిన మూడో టి20లో సూర్యకుమార్ కీలక అర్థ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా సూర్యకుమార్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. విండీస్ గడ్డపై ఒక టీమిండియా బ్యాటర్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. తద్వారా కరేబియన్ గడ్డపై టీమిండియా తరపున రిషబ్ పంత్ పేరిట ఉన్న రికార్డును సూర్యకుమార్ బద్దలు కొట్టాడు. అయితే తొలి రెండు టి20ల్లో ఓపెనర్‌గా ఘోరంగా విఫలం కావడంతో సూర్య ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. అయితే వాటిన్నింటికి అతను తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఇదంతా సూర్య ఇంటికి కొత్త లగ్జరీ కారు వచ్చిన వేళా విశేషమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అవునండీ మన సూర్య ఇంటికి కొత్త ఎస్యూవీ లగ్జరీ కారు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని సూర్యకుమార్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ''రెడీ ఫర్ డెలివరీ టాప్జాబ్ బడ్డీ'' అని క్యాప్షన్ కనిపిస్తుంది. కాగా టీమిండియా, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ సూర్యకుమార్ ఏడాదికి రూ.20 కోట్ల పైనే అర్జిస్తున్నాడు. సూర్య ఇంట్లో ఇప్పటికే చాలా కార్లు కలెక్షన్గా కలిగి ఉన్నాడు. బీఎండబ్ల్యూఈ 5 సిరీస్, ఆడీ ఏ6, రేంజ్ రోవర్, హుండాయ్ ఐ20, ఫార్చూనర్లు ఉన్నాయి. తాజాగా ఎస్యూవీ లగ్జరీ కారు కొత్తగా వచ్చి చేరనుంది. కార్లతో పాటు సుజుకీ హయాబుసా, హార్లీ డేవిడ్సన్ బైక్‌లు కలిగి ఉన్నాడు సూర్యకుమార్. ఇక సూర్యకుమార్ టీమిండియా తరపున 13 మ్యాచ్‌ల్లో 340 పరుగులు.. 20 టి20ల్లో 561 పరుగులు సాధించాడు. చదవండి: రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్ సూర్యకుమార్ మెరుపులు.. మూడో టి20లో భారత్ ఘన విజయం -
సిక్సర్‌తో పంత్ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా!
లీస్టర్‌షైర్, టీమిండియాల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అర్థసెంచరీతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌లో సూపర్ సిక్సర్ బాదిన ఆడిన పంత్ 72 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఓవరాల్‌గా 87 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. మరి తాజా ఇన్నింగ్స్‌తో పంత్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా అని అభిమానులు కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లీస్టర్‌షైర్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ 76, రిషి పటేల్ 34, రోమన్ వాకర్ 34, లుయిస్ కింబర్ 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 246 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. 5️⃣0️⃣ for @RishabhPant17! 👏 A top edged sweep flies for 6️⃣ and helps Pant reach a 𝐦𝐚𝐠𝐧𝐢𝐟𝐢𝐜𝐞𝐧𝐭 half-century. 🧹 🦊 LEI 204/6 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/DdQrXej7HC👈 🦊 #IndiaTourMatch | #LEIvIND | #TeamIndia pic.twitter.com/MndQrfAm1n — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 24, 2022 చదవండి: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్.. దిగ్గజాల సరసన చోటు IND Vs LEIC: పుజారా డకౌట్.. షమీ వింత సెలబ్రేషన్ -
37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి
స్వీట్ సిక్స్టీన్ ఇయర్స్ కెరీర్... 2006లో భారత్ తరఫున ఆడిన తొలి టి20 నుంచి 2022లో ఆడిన ప్రస్తుత మ్యాచ్ వరకు తన బ్యాటింగ్‌లో పదును తగ్గలేదని దినేశ్ కార్తీక్ నిరూపించాడు. ఐపీఎల్ ఫామ్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కార్తీక్ కొనసాగించగలడా అనే సందేహాలకు మెరుపు బ్యాటింగ్‌తో అతను సమాధానమిచ్చాడు. చూడచక్కటి షాట్లు ప్రదర్శించి 37 ఏళ్ల వయసులో సెలక్టర్లకు ప్రపంచకప్‌లో స్థానం కోసం సవాల్ విసిరాడు. 16 ఏళ్ల కెరీర్లో దినేశ్ కార్తిక్.. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20లో మెయిడెన్ అర్థ సెంచరీ సాధించాడు. 27 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న కార్తిక్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో దూకుడుగా ఆడి అర్థ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే దినేశ్ కార్తిక్ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా తరపున టి20లో అర్థసెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా దినేశ్ కార్తిక్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కార్తిక్ వయసు 37 ఏళ్ల 16 రోజులు. 2018లో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన టి20 మ్యాచ్‌లో ధోని 36 ఏళ్ల 229 రోజుల వయసులో తన కెరీర్లో రెండో అర్థసెంచరీ అందుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా నుంచి ధోనినే పెద్ద వయస్కుడిగా ఉన్నాడు. తాజాగా కార్తిక్ ధోనిని అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఇక శిఖర్ ధావన్ 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 35 ఏళ్ల ఒక రోజు వయసులో అర్థసెంచరీ అందుకొని కార్తిక్, ధోని తర్వాతి స్థానంలో నిలిచాడు. తన కెరీర్లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న కార్తిక్ ఇలాగే ఆడితే టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక మ్యాచ్ ఫినిషర్‌గా మారే అవకాశముంది. కార్తిక్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు కామెంట్స్‌తో రెచ్చిపోయారు. 37 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్నాడు.. డీకేతోని అట్లుంటది మరి.. ధోనికి సరైన వారసుడు దొరికాడు.. టీమిండియాకు మరో బెస్ట్ ఫినిషర్ దినేశ్ కార్తిక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. .@DineshKarthik was the pick of the #TeamIndia batters and was our top performer from the first innings of the fourth @Paytm #INDvSA T20I. 👍 👍 A summary of his knock 🔽 pic.twitter.com/L5ngT7WE5B — BCCI (@BCCI) June 17, 2022 చదవండి: కార్తీక్, ఆవేశ్ఖాన్ల జోరు.. నాలుగో టి20లో టీమిండియా ఘన విజయం -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు సాధించిన బాబర్.. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా తొమ్మిది ఫిప్టీ ప్లస్ స్కోర్లను నమోదు చేసిన తొలి ఆటగాడిగా బాబర్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. స్కోర్లు పాకిస్తాన్: 275/8 వెస్టిండీస్: 155/10 ఫలితం: 120 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం మూడు ఫార్మాట్లలో గత తొమ్మిది ఇన్నింగ్స్‌లలో బాబర్ సాధించిన స్కోర్లు ►196 వర్సెస్ ఆస్ట్రేలియా (2వ టెస్టు - మార్చి 12) ►67, 55 వర్సెస్ ఆస్ట్రేలియా (3వ టెస్టు - మార్చి 21) ►57 వర్సెస్ ఆస్ట్రేలియా (తొలి వన్డే - మార్చి 29) ►114 వర్సెస్ ఆస్ట్రేలియా (రెండో వన్డే - మార్చి 31) ►105( నాటౌట్) వర్సెస్ ఆస్ట్రేలియా(మూడో వన్డే-ఏప్రిల్ 2) ►66 వర్సెస్ ఆస్ట్రేలియా(ఏకైక టీ20-ఏప్రిల్ 5 ) ►103 వర్సెస్ వెస్టిండీస్ (తొలి వన్డే - జూన్ 8) ►77 vs వెస్టిండీస్ (రెండో వన్డే - జూన్ 10) చదవండి: PAK vs WI: వెస్టిండీస్‌పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం.. -
ఎస్ఆర్హెచ్పై వార్నర్ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తన పాత టీమ్ ఎస్ఆర్హెచ్పై వార్నర్ విరుచుకుపడిన తీరు అద్భుతమని చెప్పాలి. ఆరంభంలో ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభించిన వార్నర్.. ఆ తర్వాత గేర్ మార్చి ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ ఓవరాల్‌గా 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నప్పటికి వార్నర్ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టి20 క్రికెట్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. ఎస్ఆర్హెచ్పై చేసిన హాఫ్ సెంచరీ వార్నర్ ఖాతాలో 84వది. తద్వారా క్రిస్ గేల్(83 అర్థసెంచరీలు) పేరిట ఉన్న రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. వార్నర్, గేల్ తర్వాత టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లి 77 హాఫ్ సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్ టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ 70 అర్థసెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా టి20 కెప్టెన్ రోహిత్ శర్మ 69 హాఫ్ సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాదు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనే వార్నర్ మరో రికార్డు అందుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మార్క్రమ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన వార్నర్.. టి20 క్రికెట్లో 400వ సిక్సర్‌ను పూర్తి చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: David Warner: సెంచరీ చేయకపోయినా పంతం నెగ్గించుకున్న వార్నర్! -
సెంచరీ చేయకపోయినా పంతం నెగ్గించుకున్న వార్నర్!
ఐపీఎల్లో ఒక స్టార్ ఆటగాడు ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారడం సర్వ సాధారణం. కానీ ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ మాత్రం కాస్త ఢిఫెరెంట్ అని చెప్పాలి. సరిగ్గా ఏడాది క్రితం ఎస్ఆర్హెచ్లో వార్నర్‌కు చాలా అవమానాలు జరిగాయి. కెప్టెన్సీ పదవి తొలగించడం.. ఆపై జట్టులో చోటు కోల్పోవడం.. ఆఖరికి డ్రింక్స్ బాయ్‌గా సేవలందించిన వార్నర్‌ను చూసి సొంత అభిమానులే ఎస్ఆర్హెచ్ వైఖరిని తప్పుబట్టారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు ఐపీఎల్లో విజేతగా నిలిపిన వ్యక్తిని అవమానకర రీతిలో జట్టు నుంచి బయటకు పంపించారు. అయితే వార్నర్ ఇదంతా పట్టించుకోలేదు. అవకాశం వచ్చినప్పుడు తాను స్పందిస్తానని స్వయంగా పేర్కొన్నాడు. కట్‌చేస్తే.. మెగావేలంలో రూ. 6 కోట్లకు డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. సీజన్లో కాస్త లేటుగా జాయిన్ అయినప్పటికి వార్నర్ మంచి ఫామ్ కనబరిచాడు. లీగ్‌లో మూడు అర్థసెంచరీలు సాధించిన వార్నర్.. తాజాగా తన పాత టీమ్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మరోసారి మెరిశాడు.ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వార్నర్.. ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చాడు. సీజన్లో సూపర్‌హిట్ బౌలింగ్‌తో మెరుస్తున్న ఉమ్రాన్ మాలిక్‌ను వార్నర్ ఒక ఆట ఆడుకున్నాడు. ఓవరాల్‌గా 58 బంతుల్లో 92 పరుగులు చేసిన వార్నర్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. సెంచరీ చేసే అవకాశం రాకపోయినప్పటికి వార్నర్ ఒక రకంగా తన పంతం నెగ్గించుకున్నాడనే చెప్పాలి. వాస్తవానికి వార్నర్ సెంచరీ చేయాలనుకుంటే రోవ్‌మన్ పావెల్ అవకాశం ఇచ్చేవాడే. కానీ వార్నర్ తన సెంచరీ కంటే జట్టు స్కోరు పెంచడమే ముఖ్యమని భావించాడు. . అందుకే పావెల్‌ను చివరి ఓవర్ మొత్తం ఆడమని ముందే చెప్పాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆఖరి ఓవర్లో రోవ్‌మెన్ పావెల్ 6,4,4,4 సహా మొత్తం 19 పరుగులు పిండుకున్నాడు. ఈ నేపథ్యంలో పావెల్ బౌండరీ కొట్టిన ప్రతీసారి.. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లవైపు చూస్తూ వార్నర్ గట్టిగా అరుస్తూ పావెల్‌ను ఎంకరేజ్ చేశాడు. వార్నర్ తీరు చూస్తే తనను అవమానించిన ఎస్ఆర్హెచ్కు తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు. ఇది చూసిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్.. వార్నర్ ప్రత్యర్థి ఆటగాడైనా సరే.. మన వార్నర్ అన్న మొత్తానికి పంతం నెగ్గించుకున్నాడంటూ కామెంట్స్ చేశారు. డేవిడ్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి -
హమ్మయ్య.. ఎట్టకేలకు 15 ఇన్నింగ్స్‌ల తర్వాత
ఐపీఎల్ 2022 సీజన్లో విరాట్ కోహ్లి ఎట్టకేలకు హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ అందుకున్నాడు. సీజన్ ఆరంభం నుంచి విఫలమవుతూ వచ్చిన కోహ్లి.. గుజరాత్‌తో మ్యాచ్‌లో కాస్త నిలకడ ప్రదర్శించాడు. మ్యాచ్‌లో నిధానంగా ఆడినప్పటికి 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. ఓవరాల్‌గా 53 బంతుల్లో 6 ఫోర్లు,ఒక సిక్సర్‌తో 58 పరుగులు సాధించాడు. కాగా కోహ్లి అర్థసెంచరీ మార్క్ అందుకోవడానికి 15 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 50ప్లస్ స్కోరు సాధించడానికి కోహ్లి ఎక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకోవడం ఇది రెండోసారి. ఇంతకముందు 2009, 2010 ఎడిషన్స్‌లో కోహ్లకి 18 ఇన్నింగ్స్‌ల పాటు అర్థసెంచరీ చేయలేకపోయాడు.ఇక కోహ్లి ఐపీఎల్లో ఫిప్టీ ప్లస్ స్కోరు సాధించే క్రమంలో మూడోసారి అత్యంత తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో(53 బంతుల్లో 58 పరుగులు, 109.43 స్ట్రైక్‌రేట్‌తో), 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై (48 బంతుల్లో 55 పరుగులు, 114.58 స్ట్రైక్‌రేట్‌తో), 2020లో సీఎస్కేపై (43 బంతుల్లో 50 పరుగులు, 116.28 స్ట్రైక్‌రేట్‌తో) సాధించాడు. -
కసిమొత్తం చూపిస్తున్నాడు.. హార్దిక్ పాండ్యాకు ఇదే తొలిసారి
ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పాండ్యా మరో సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో నడిపించాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లో అర్థశతకం మార్క్ సాధించాడు. ఇక ఓవరాల్‌గా పాండ్యా మ్యాచ్‌లో 52 బంతుల్లో 87*పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కాగా పాండ్యాకు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్లో పాండ్యా ఇలా వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా టీమిండియా జట్టులో లేడు. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న హార్దిక్.. గుజరాత్ టైటాన్స్ తరపున మాత్రం కసి మొత్తం చూపిస్తున్నాడు. రానున్న టి20 ప్రపంచకప్ 2022 దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా మళ్లీ జట్టులోకి తిరిగి రావాలని పాండ్యా టార్గెట్‌గా పెట్టుకున్నాడు. -
కెప్టెన్‌గా తొలి అర్థసెంచరీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు
ఐపీఎల్ 2022లో శ్రేయాస్ అయ్యర్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరిసిన అయ్యర్ 54 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా అయ్యర్‌కు కేకేఆర్ కెప్టెన్‌గా ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. కాగా కెప్టెన్‌గా హాఫ్ సెంచరీ అందుకున్న అయ్యర్ జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. Courtesy: IPL Twitter 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 171 పరుగులకే ఆలౌట్ అయి 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒక దశలో నితీష్ రాణా(30) సహకరించడం.. అయ్యర్ బాగా ఆడుతుండడంతో కేకేఆర్ లక్ష్యం దిశగా సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ దెబ్బ తీశాడు. మొదట అయ్యర్ రూపంలో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న కుల్దీప్ ఆ తర్వాత మరో మూడు వికెట్లు తీసి.. ఓవరాల్‌గా 4-35-0-4తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పృథ్వీ షా 51, వార్నర్ 61 పరుగులు చేయగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ 22*, శార్దూల్ ఠాకూర్ 29* రాణించారు. శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ కోసం క్లిక్ చేయండి చదవండి: Ajinkya Rahane: మూడుసార్లు తప్పించుకున్నాడు.. ఏం ప్రయోజనం! IPL 2022: చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు -
కోట్లు పెట్టి కొన్నందుకు ఎట్టకేలకు మెరిశాడు..
ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్ వైస్‌కెప్టెన్ అభిషేక్ శర్మ తొలిసారి మెరిశాడు. 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అభిషేక్ 25 మ్యాచ్‌ల తర్వాత కెరీర్లో మెయిడెన్ అర్థసెంచరీ సాధించాడు. సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 32 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ ఐపీఎల్లో ఇప్పటివరకు ఉన్న అత్యధిక స్కోరును అధిగమించాడు. 2018లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్‌కు అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లోనే 19 బంతుల్లో 46 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. విచిత్రమేంటంటే.. తొలి మ్యాచ్ మినహా మళ్లీ అభిషేక్ రాణించింది లేదు. ఆ తర్వాత ఆడిన 24 మ్యాచ్‌ల్లో 30 నుంచి 40లోపే ఎక్కువసార్లు ఔటయ్యాడు. ఇక మెగావేలంలో అభిషేక్ శర్మను ఎస్ఆర్హెచ్ రూ. 6.5 కోట్లు పెట్టి దక్కించుకుంది. అయితే సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కోట్లు పెట్టి కొన్నందుకు ఇంత దరిద్రంగా ఆడతారా అంటూ అతనిపై విమర్శలు వచ్చాయి. అయితే అభిషేక్ శర్మ మాత్రం ఇది పట్టించుకోకుండా తన ఆటను కొనసాగించాడు. సీఎస్కేతో మ్యాచ్ ద్వారా ఎట్టకేలకు తొలిసారి తన ఆటేంటో చూపించాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: నటరాజన్ సూపర్ డెలివరీ.. గైక్వాడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్.. వీడియో వైరల్! Ravi Shastri: 'తమాషానా.. అలాంటి క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించాలి' -
'ఏం ఆడుతున్నావని విమర్శించారు'.. బ్యాట్‌తోనే సమాధానం
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తొలిసారి మెరిశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పృథ్వీ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాడు. ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసిన పృథ్వీ షా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే 7 ఫోర్లు , ఒక సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత ఒక ఫోర్, మరో సిక్స్ బాదిన పృథ్వీ 34 బంతుల్లో 61 పరుగుల చేసి కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఇన్నింగ్స్ 4వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదిన పృథ్వీ.. ఆవేశ్ ఖాన్‌కు చుక్కలు చూపించాడు. మధ్యలో ఇన్నింగ్స్ 6 ఓవర్లో ఆండ్రూ టై వేసిన ఒక బంతి పృథ్వీ షా పొత్తి కడుపు కింద బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పృథ్వీ నొప్పిని బరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించాడు. కాగా పృథ్వీ ఇన్నింగ్స్‌పై అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. '' ఏం ఆడుతున్నావని విమర్శించినవారికి పృథ్వీ షా తన బ్యాటింగ్‌తోనే సమాధానమిచ్చాడు.'' అంటూ కామెంట్ చేశారు. పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: Nari Contractor: టీమిండియా మాజీ కెప్టెన్ తలలో మెటల్ ప్లేట్.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు! Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్‌చేస్తే -
ఎంట్రీతోనే అదరగొట్టిన కమిన్స్.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట్స్‌మన్ పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న కమిన్స్ ఎంట్రీతోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోసిన కమిన్స్ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ధాటికి కేకేఆర్ 162 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు ఓవర్లు ఉండగానే అందుకుంది. ఈ నేపథ్యంలోనే కమిన్స్ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో అర్థసెంచరీ సాధించిన ఆటగాడిగా కమిన్స్.. కేఎల్ రాహుల్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. 14 బంతుల్లో కమిన్స్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా.. కేఎల్ రాహుల్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లోనే ఫిప్టీ సాధించాడు. వీరి తర్వతి స్థానంలో యూసఫ్ పఠాన్(2014లో ఎస్ఆర్హెచ్పై) 15 బంతుల్లో అందుకొని రెండో స్థానంలో ఉండగా.. సునీల్ నరైన్(2017లో ఆర్సీబీపై) 15 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకొని జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక కమిన్స్ ముంబైపై మంచి రికార్డు ఉంది. అతని చివరి మూడు ఇన్నింగ్స్‌లు పరిశీలిస్తే వరుసగా.. 33, 53*,56* పరుగులు ఉన్నాయి. చదవండి: IPL 2022: రోహిత్ శర్మ ఆడడం మరిచిపోయావా .. ఏమైంది నీకు! -
ఐపీఎల్ చరిత్రలో సంజూ శాంసన్ అరుదైన ఫీట్..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2022ను తనదైన శైలిలో ప్రారంభించాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. జైశ్వాల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో సంజూ అరుదైన ఫీట్ సాధించాడు. ఒక జట్టు తరపున ఆరంభ మ్యాచ్‌లోనే వరుసగా మూడు సీజన్ల పాటు కనీసం అర్థసెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం. 2020లో సీఎస్కేతో ఆడిన తొలి మ్యాచ్‌లో 32 బంతుల్లో 74 పరుగులు, 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 119 పరుగులు.. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో శాంసన్ 27 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. సంజూ శాంసన్ ఇన్నింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: IPL 2022: వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా -
ఇది ధోని అంటే.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు
ధోని పని అయిపోయింది అంతా భావిస్తున్న వేళ దనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని తర్వాతి మ్యాచ్‌లోనే తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. 2 పరుగులు చేయడానికి 10 బంతులు తీసుకున్న ధోని.. తర్వాతి 48 పరుగులను 24 బంతుల్లోనే సాధించాడు. ఓవరాల్‌గా ధోని 38 బంతుల్లో 7 ఫోర్లు , ఒక సిక్స్ సాయంతో 50 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో ధోనికి ఇది 24వ హాఫ్ సెంచరీ. కాగా ధోని మూడేళ్ల తర్వాత ఫిప్టీ మార్క్ అందుకోవడం విశేషం. అంతకముందు 2019లో బెంగళూరు ఆర్సీబీపై 48 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: వారెవ్వా షెల్డన్ జాక్సన్.. ఏమా మెరుపు వేగం -
రెచ్చిపోయిన మొయిన్ అలీ.. 8 సిక్సర్లతో అర్థ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో(బీపీఎల్ 2022) ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. కొమిల్లా విక్టోరియన్స్, కుల్నా టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అయితే 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 35 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న మొయిన్ అలీ.. 8 సిక్సర్లతో ఫిఫ్టీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత ఒక సిక్స్, ఒక ఫోర్ బాది మొత్తం 75 పరుగులు రాబట్టాడు. అతనికి జతగా డుప్లెసిస్ 38 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కుల్నా టైగర్స్ 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. తిసార పెరీరా 26 పరుగులతో టాప స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్లో గత సీజన్లో సీఎస్కే తరపున దుమ్మురేపిన మొయిన్ అలీని ఆ జట్టు రిటైన్ చేసుకుంది. Moeen Ali madness in BPL scored 50 from just 23 balls with 8 sixes 🔥🤯#BPL2022 #Cricketpic.twitter.com/LDyUrAPstd — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 11, 2022 -
సెంచరీ మిస్సయ్యాడు.. అయినా రికార్డు అందుకున్నాడు
విరాట్ కోహ్లి మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో 79 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బ్యాట్స్‌మన్ వరుసగా విఫలమైన చోట కోహ్లి మాత్రం మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సెంచరీ చేసి రెండేళ్లు కావొస్తుండడంతో ఈసారి ఇక సెంచరీ కచ్చితంగా కొడుతాడు అనుకున్న సమయంలో 79 పరుగుల వద్ద రబడ బౌలింగ్‌లో వెర్రియేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఒక రికార్డు అందుకున్నాడు. రెండేళ్లుగా సెంచరీ లేని కోహ్లి అప్పటినుంచి ఆడిన టెస్టుల్లో చూసుకుంటే అత్యధిక స్కోరు 74గా ఉంది. 2020 జనవరిలో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ స్కోరు చేశాడు. తాజాగా కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో 79 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించాడు. -
విధ్వంసం సృష్టించిన శ్రీలంక ఆల్ రౌండర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ..
Thisara Perera scores a half century as Jaffna Kings defeat Colombo Stars by 93 runs: లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ కెప్టెన్ తిసార పెరీరా విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 5 సిక్సర్లు, మూడు ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. దీంతో కొలంబో స్టార్స్‌పై జాఫ్నా కింగ్స్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జఫ్నా కింగ్స్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్లలో కోహ్లర్-కాడ్మోర్(44), మాలిక్(44), బండారా(42)పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్టార్స్ జాఫ్నా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. కొలంబో స్టార్స్ బ్యాటర్లలో ఆషాన్ ప్రియాంజన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాఫ్నా బౌలర్లలో మహేశ్ తీక్షణ,వహాబ్ రియాజ్ చెరో నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
బాబర్ అజమ్ హాఫ్ సెంచరీ .. పాపం ప్రకృతి సహకరించడం లేదు
Fans Troll Babar Azam Getting Half Century Mark But Play Stops.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అర్థశతకం సాధించాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. వాస్తవానికి టి20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన బాబర్ అజమ్ ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బాబర్ అజమ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఇరు జట్ల మధ్య మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దాదాపు రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోగా.. మూడోరోజు నుంచి ఆట కొనసాగింది. చదవండి: IND vs SA: రహానే, గిల్‌కు షాక్.. ఆకాశ్ చోప్రా ఫేవరెట్ జట్టులో దక్కనిచోటు కాగా మూడోరోజు ఆటలో పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజమ్ అర్థసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. అయితే అతను ఫిప్టీ మార్క్ చేరిన కాసేపటికే బ్యాడ్‌లైట్ పేరుతో ఆట ఆగిపోయింది. దీంతో బాబర్‌ను మరోసారి టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఆడుకున్నారు. ''టి20 ప్రపంచకప్ తర్వాత బాబర్‌కు ఏది కలిసిరావడం లేదు.. ముందు టి20 సిరీస్‌లో పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో బాబర్ అజమ్ ఫిప్టీ సాధించినప్పటికి ప్రకృతి అతనికి సహకరించడం లేదు.'' అంటూ ట్రోల్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో నాలుగోరోజు లంచ్ విరామం తర్వాత పాకిస్తాన్ 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 76, అజర్ అలీ 56 పరుగులు చేసి ఔటవ్వగా.. ప్రస్తుతం పవాద్ అలమ్ 19, మహ్మద్ రిజ్వాన్ 26 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: AUS vs ENG Ashes Series: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం Raining.. Match stopped#PakvsBan pic.twitter.com/lGVV583wZg — Ali Hasan (@AaliHasan10) December 4, 2021 -
సాహా ఎట్టకేలకు.. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే
Wriddiman Saha Half Century Mark After 2017 Since 11 Tests.. టీమిండియా వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ఎట్టకేలకు రాణించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్థ సెంచరీతో రాణించాడు. 126 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్స్ సహాయంతో 61 పరుగులతో నౌటౌట్‌గా నిలిచిన సాహా.. టీమిండియాకు మంచి ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. అయ్యర్ తర్వాత మంచి ఇన్నింగ్స్‌తో మెరిసిన సాహాకు టెస్టుల్లో ఇది ఆరో అర్థసెంచరీ. కాగా సాహా టెస్టుల్లో అర్థ సెంచరీ చేసి నాలుగేళ్లవుతుంది. 2017లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సాహా ఆఖరిసారిగా అర్థ సంచరీ చేశాడు. అప్పటినుంచి తాను ఆడిన 11 టెస్టుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సాహాపై ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగోరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. 2 పరుగులు చేసిన ఓపెనర్ యంగ్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆట ఐదోరోజులో న్యూజిలాండ్ గెలవాలంటే 280 పరుగులు అవసరం కాగా.. టీమిండియా 9 వికెట్లు కావాలి. -
ఫిప్టీ కొట్టాడు.. తన స్టైల్లో మళ్లీ తిప్పేశాడు
Ravindra Jadeja Signature Sword Celebration.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫన్ క్రియేట్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన జడేజా బ్యాటింగ్‌లో సెంచరీ.. హాఫ్ సెంచరీ కొట్టినప్పుడల్లా బ్యాట్‌ను కత్తిలాగా తిప్పడం అలవాటుగా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలాసార్లు వైరల్ అయ్యాయి. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా మరోసారి అర్థ శతకం సాధించాడు. అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 100 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్క్‌ను అందుకున్న జడేజాకు టెస్టుల్లో ఇది 17వది. జడేజా ఫిఫ్టీతో పాటే టీమిండియా తొలిరోజు ఆట ముగిసింది. అయితే పెవిలియన్‌కు వెళ్తూ వెళ్తూ.. జడేజా తన స్టైల్లో బ్యాట్‌ను కత్తిలా తిప్పి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Shreyas Iyer: డెబ్యూతోనే అదరగొట్టిన అయ్యర్.. పుజారా, రహానేలకు హెచ్చరిక! ఇక మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 75*, రవీంద్ర జడేజా 50* పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరిమధ్య ఇప్పటివరకు ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతకముందు శుబ్‌మన్ గిల్ 52 పరుగులు చేసి ఔట్ కాగా.. మిగతా టీమిండియా బ్యాటర్స్‌లో రహానే 35, పుజారా 26, మయాంక్ 13 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 3 వికెట్లు తీశాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే His Sword Celebration 🔥😍 50* for Sir Ravindra Jadeja 💥#jadeja | #INDvNZ | @imjadeja pic.twitter.com/olq9B4NpBP — Ashwath MSDian™💛 (@ashMSDIAN7) November 25, 2021 -
సంగక్కర తర్వాత కేన్ విలియమ్సన్ మాత్రమే
Kane Williamson 2nd Captain To Score Half Century T20 WC Finals.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. కీలకమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిసిన విలియమ్సన్ టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇక విలియమ్సన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. -
T20 WC 2021: స్కాట్లాండ్ తరపున తొలి బ్యాటర్‌గా రికార్డు
T20 WC 2021 Richie Berrington.. స్కాట్లాండ్ బ్యాటర్ రిచీ బెర్రింగ్టన్ అరుదైన ఘనత అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ తరపున అర్థ సెంచరీ మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. పపువా న్యూ గినియాతో జరుగుతున్న గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రిచీ బెర్రింగ్టన్ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 70 పరుగులు చేసిన రిచీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్‌కు దక్కని హ్యాట్రిక్ ఇక పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్ బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ 17 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ క్వాలిఫయర్ పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకొని సూపర్ 12 దశ అర్హతకు మరింత దగ్గరైంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. నార్మన్ వనూహ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 4 వికెట్లతో సత్తా చాటాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. Richie Berrington is the first Scotland batsman to score a fifty in the T20 World Cups.#T20WorldCup #Scotland #PapuaNewGuinea #SCOvPNG #RichieBerrington pic.twitter.com/Iq76fPEUQD — CricTracker (@Cricketracker) October 19, 2021 -
భారత్ 377/8 డిక్లేర్డ్.. రాణించిన దీప్తి శర్మ
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 276/5తో శనివారం ఆటను కొనసాగించిన భారత మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 145 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాపై భారత్‌కిదే అత్యధిక స్కోరు. ఆ్రస్టేలియా గడ్డపై విదేశీ జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఓవర్‌నైట్ బ్యాటర్ దీప్తి శర్మ (167 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను జులన్ గోస్వామి (2/27), పూజా వ్రస్తాకర్ (2/31) ఇబ్బంది పెట్టారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (27 బ్యాటింగ్; 3 ఫోర్లు), గార్డ్నర్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఆ్రస్టేలియా మరో 85 పరుగులు చేయాల్సి ఉంది. నేడు ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్ గెలవాలంటే మాత్రం... ఆదివారం జరిగే మూడు సెషన్స్‌లోనూ బౌలర్లు అద్భుతంగా రాణించాలి. తొలి సెషన్లో ఆస్ట్రేలియాను 228 పరుగులలోపు ఆలౌట్ చేయాలి. అప్పుడు ఆ జట్టు ఫాలోఆన్ ఆడే అవకాశం ఉంటుంది. చివరి రెండు సెషన్స్‌లో (దాదాపు 60 ఓవర్లలో) మరోసారి ఆస్ట్రేలియాను 150లోపు ఆలౌట్ చేయగలిగితే భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకోగలదు. -
వార్నర్ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు
Jason Roy Maiden Fifty In SRH Debute Match.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ జేసన్ రాయ్ అద్భుత అర్థ సెంచరీతో మెరిశాడు. కాగా జేసన్ రాయ్‌కు ఎస్ఆర్హెచ్ తరపున ఇదే తొలి మ్యాచ్. కాగా తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకం సాధించిన రాయ్ చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో లేని వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్ ఫోర్లు, సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. మొత్తం 42 బంతులెదుర్కొన్న జేసన్ రాయ్ 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 82 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్ 36, లామ్రోర్ 29 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ విజయం దిశగా పయనిస్తుంది. 18 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. -
Jonny Bairstow: రెండేళ్ల తర్వాత మళ్లీ అదే లార్డ్స్‌లో
లార్డ్స్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు టెస్టుల్లో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విచిత్రమేమిటంటే.. బెయిర్ స్టో టెస్టుల్లో చివరి అర్థ సెంచరీ నమోదు చేసింది లార్డ్స్ మైదానంలోనే. 2019లో లార్డ్స్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బెయిర్ స్టో 52 పరుగులు చేశాడు. రెండేళ్ల తర్వాత అర్థ సెంచరీ మార్క్‌ను అందుకోవడంతో బెయిర్ స్టో తన బ్యాట్‌ను డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడం వైరల్‌గా మారింది. కెప్టెన్ రూట్ కూడా బెయిర్ స్టోను అభినందిస్తూ హగ్ చేసుకున్నాడు. కాగా బెయిర్ స్టో ఇంగ్లండ్ తరపున 76 టెస్టుల్లో 4307 పరుగులు, 89 వన్డేల్లో 3498 పరుగులు, 57 టీ20ల్లో 1143 పరుగులు చేశాడు ఇక టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతుంది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జో రూట్ 89 పరుగులతో సెంచరీకి చేరువ కాగా.. జానీ బెయిర్ స్టో 51 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ రెండు.. షమీ ఒక వికెట్ తీశాడు. -
India vs England: మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు
వొర్సెస్టర్: స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో కెప్టెన్ మిథాలీ రాజ్ భారత మహిళల జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. మిథాలీ అజేయ అర్ధ సెంచరీ (86 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు) సాధించడంతోపాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దాంతో చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మహిళల జట్టుపై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు), కెప్టెన్ హీతర్ నైట్ (46; 4 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు స్మృతి మంధాన (49; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (19; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. జెమీమా (4) విఫలమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (16), దీప్తి శర్మ (18; 1 ఫోర్) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్ గెలుపుపై అనుమానాలు తలెత్తాయి. అయితే అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న మిథాలీ... స్నేహ్ రాణా (22 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించింది. చివర్లో స్నేహ్ అవుటవ్వగా... భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులుగా ఉంది. చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు పరుగులు రాగా... మూడో బంతిని బౌండరీ బాదిన మిథాలీ భారత్‌కు విజయాన్ని కట్టబెట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడటంతో సిరీస్‌ను 1–2తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. మిథాలీ మైలురాయి: ఈ మ్యాచ్ మిథాలీకి చిరస్మరణీయ మ్యాచ్ అయ్యింది. ఆమె వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరుకున్నపుడు మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అవతరించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్; 10,273 పరుగులు) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. ప్రస్తుతం మిథాలీ మూడు ఫార్మాట్లలో కలిపి 10,337 పరుగులు (11 టెస్టుల్లో 669; 217 వన్డేల్లో 7,304; 89 టి20 మ్యాచ్‌ల్లో 2,364 పరుగులు) చేసింది. -
WTC Final: మూడేళ్ల తర్వాత టీమిండియా చెత్త రికార్డు
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ పైనల్లో టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడు కూడా అర్థసెంచరీ మార్క్‌ను చేరుకోలేకపోయాడు. పంత్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సరైన ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి నానా కష్టాలు పడింది. ఇంతకముందు 2018లో ఇంగ్లండ్ గడ్డపైనే లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా నుంచి ఒక్క అర్థ సెంచరీ నమోదు కాలేదు. ఇక టీమిండియా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా ఓవర్‌నైట్ స్కోరు 64/2 తో ఆరో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే పుజారా, కోహ్లిల రూపంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్కడినుంచి ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేయని టీమిండియా 170 పరుగులకే చాప చుట్టేసింది. పంత్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ 30 పరుగులు చేశాడు. మొత్తంగా 138 పరుగుల లీడ్ సాధించిన టీమిండియా కివీస్ ముందు 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కాగా కివీస్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవన్ కాన్వే(19), టామ్ లాథమ్(9) పరుగులు చేసి ఔటవ్వగా.. కేన్ విలియమ్సన్(8), రాస్ టేలర్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: గ్రౌండ్‌లోనే టవల్ చుట్టుకున్న షమీ.. కారణం ఏంటంటే WTC Final: కివీస్ ఈ పాటికే గెలవాల్సింది.. -
ఇంగ్లండ్ 207/3
మాంచెస్టర్: వెస్టిండీస్ చేతిలో తొలి టెస్టు ఓటమి తర్వాత రెండో టెస్టును ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. డామ్ సిబ్లీ (253 బంతుల్లో 86 బ్యాటింగ్; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (159 బంతుల్లో 59 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 126 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో ఛేజ్కు 2 వికెట్లు దక్కాయి. రెండు బంతుల్లో 2 వికెట్లు... వర్షం కారణంగా తొలి రోజు ఆట గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంగ్లండ్ ఓపెనర్లు బర్న్స్ (15), సిబ్లీ తడబడుతూనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొద్ది సేపటికే స్పిన్నర్ ఛేజ్‌తో బౌలింగ్ చేయించిన విండీస్ వ్యూహం ఫలించింది. ఛేజ్ తన తొలి ఓవర్లోనే బర్న్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెంటనే లంచ్‌ను ప్రకటించగా... ఆ సమయానికి ఇంగ్లండ్ 13.2 ఓవర్లలో 29 పరుగులు చేసింది. అయితే విరామం తర్వాత ఆతిథ్య జట్టుకు మరో షాక్ తగిలింది. తొలి బంతికే జాక్ క్రాలీ (0) లెగ్‌స్లిప్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే స్కోరు 29/2గా ఉన్న దశనుంచి రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఇంగ్లండ్‌ను ఆదుకున్నాయి. ముందుగా సిబ్లీ, కెప్టెన్ జో రూట్ (23) కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. తొలి టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పేసర్ గాబ్రియెల్ 7 ఓవర్లు మాత్రమే వేసి గజ్జల్లో గాయంతో కొద్ది సేపు తప్పుకోవడం విండీస్ బౌలింగ్‌ను బలహీనపర్చింది. అయితే జోసెఫ్ అల్జారి చక్కటి అవుట్‌స్వింగర్‌తో రూట్‌ను అవుట్ చేయడంతో 52 పరుగుల మూడో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెర పడింది. శతక భాగస్వామ్యం... టీ విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 112 పరుగులకు చేరింది. మూడో సెషన్ మొదలయ్యాక సిబ్లీ 164 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సిబ్లీ, స్టోక్స్ కలిసి చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. పట్టుదలగా ఆడి క్రీజ్‌లో పాతుకుపోయిన వీరిద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. 68 పరుగుల వద్ద సిబ్లీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో హోల్డర్ జారవిడవగా...కొద్ది సేపటికే 119 బంతుల్లో స్టోక్స్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఈ జోడీని విడదీసేందుకు విండీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయారు. -
విండీస్‌కు ఆధిక్యం
సౌతాంప్టన్: తొలి టెస్టు మూడోరోజూ వెస్టిండీస్‌దే పైచేయి. ఆతిథ్య ఇంగ్లండ్ బౌలర్లపై బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో విండీస్ ఆధిక్యంలో పడింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), వికెట్ కీపర్ డౌరిచ్ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 318 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 114 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/49), అండర్సన్ (3/62) ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి గండికొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. బర్న్స్ 10 పరుగులతో, సిబ్లీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 99 పరుగుల వెనుకంజలో ఉంది. బ్రాత్‌వైట్ అర్ధ శతకం... ఓవర్‌నైట్ స్కోరు 57/1తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన వెస్టిండీస్‌ను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ బ్రాత్‌వైట్, షై హోప్ బాధ్యతగా నడిపించారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టు స్కోరు వందకు చేరింది. దీనికి కాసేపటికే హోప్ (16; 1)ను డామ్ బెస్ ఔట్ చేసి ఇంగ్లండ్ శిబిరాన్ని ఊరడించాడు. రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక పట్టు బిగిద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశల్ని క్రీజులోకి వచ్చిన బ్రూక్స్ (39; 6 ఫోర్లు), చేజ్ (47; 6 ఫోర్లు) వమ్ము చేశారు. మొదట బ్రూక్స్ అండతో బ్రాత్‌వైట్ ఫిఫ్టీ పూర్తయింది. వీరి జోడీ సాఫీగా సాగుతున్న తరుణంలో బ్రాత్‌వైట్‌ను స్టోక్స్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే జట్టు స్కోరు 150కి చేరుకుంది. 159/3 స్కోరు వద్ద విండీస్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఆదుకున్న డౌరిచ్... అనంతరం వెస్టిండీస్ కాస్త తడబడింది. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయింది. బ్రూక్స్‌ను అండర్సన్... బ్లాక్‌వుడ్ (12; 2 ఫోర్లు)ను బెస్ ఔట్ చేశారు. అయితే చేజ్‌కు వికెట్ కీపర్ డౌరిచ్ జతయ్యాక ఇన్నింగ్స్ మళ్లీ గాడిన పడింది. ఇద్దరు ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. చేజ్ నిష్క్రమించగా... డౌరిచ్ టెయిలెండర్ల అండతో అర్ధసెంచరీ సాధించాడు. జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. కాసేపటికే ఇంగ్లండ్ సారథి స్టోక్స్... జోసెఫ్ (18; 3 ఫోర్లు)తో పాటు డౌరిచ్నూ ఔట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. గాబ్రియెల్ (4)ను మార్క్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో విండీస్ ఆలౌటైంది. మూడో రోజు కూడా అంపైరింగ్ పేలవంగా ఉంది. లెక్కకు మిక్కిలి తప్పుడు నిర్ణయాలతో విసుగు తెప్పించారు. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 204 ఆలౌట్ వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 318 ఆలౌట్ (బ్రాత్‌వైట్ 65, డౌరిచ్ 61, చేజ్ 47; స్టోక్స్ 4/49, అండర్సన్ 3/62); ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 15/0 (బర్న్స్ 10 బ్యాటింగ్, సిబ్లీ 5 బ్యాటింగ్). -
కోహ్లీ హాఫ్ సెంచరీ; తొలిరోజు స్కోరు..
పుణె : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటిరోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. 91 బంతుల్లో 8 ఫోర్లతో విరాట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 23వ అర్ధసెంచరీ. అనంతరం కొద్దిసేపటికి తగిన వెలుతురు లేక అంపైర్లు తొలిరోజు ఆటను 85.1 ఓవర్ల వద్ద నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 273 - 3 గా ఉంది. విరాట్ కోహ్లీ 63 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రహానే 18 పరుగులతో (70 బంతులు) తగిన సహకారాన్ని అందిస్తున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 బంతుల్లో 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు ముందు భారత ఓపెనర్ మయాంక్అగర్వాల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. -
రోహిత్ శర్మ రికార్డులు
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ సీజన్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. సీఎస్కేపై 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 7 అర్ధసెంచరీలు బాదాడు. డేవిడ్ వార్నర్ (6), శిఖర్ ధావన్(6), కోహ్లి (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న రికార్డును రోహిత్ శర్మ సవరించాడు. 17 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. యూసఫ్ పఠాన్, ఎంఎస్ ధోని (16)లను అధిగమించి టాప్కు దూసుకెళ్లాడు. సురేశ్ రైనా 14 సార్లు, గౌతమ్ గంభీర్ 13 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నారు. విరాట్ కోహ్లి, అజింక్య రహానే 12 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నారు. లక్కీ చెపాక్..! చెపాక్ స్టేడియం రోహిత్ శర్మకు కలిసొచ్చింది. ఈ మైదానంలో అతడు బరిలోకి దిగిన ఆరు సార్లు విజయాన్ని అందుకున్నాడు. డెక్కన్ చార్జర్స్ తరపున రెండు సార్లు(2008, 2010), ముంబై ఇండియన్స్ ఆటగాడిగా (2012, 2013), కెప్టెన్‌గా (2015, 2019) నాలుగు పర్యాయాలు గెలుపు దక్కించుకున్నాడు. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో చేసిన అర్థసెంచరీ చెపాక్‌లో రోహిత్‌కు మొదటిది కావడం విశేషం. -
సరైన ఆరంభం లభించింది
దాదాపు 18 సంవత్సరాల తర్వాత భారత టెస్టు క్రికెట్ జట్టులో అచ్చ తెలుగు కుర్రాడు కనిపించాడు... దేశవాళీలో నిలకడైన ఆటతో సెలక్టర్ల మనసులు గెలుచుకున్న ఆ అబ్బాయి గాదె హనుమ విహారి. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో చోటు దక్కించుకున్న విహారి తన తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ధసెంచరీతో మెరిసి ఈ ఘనత సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించి రెగ్యులర్ సభ్యుడిగా జట్టులో చోటు నిలబెట్టు కోవాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఓవల్ టెస్టు ముగిశాక స్వస్థలం చేరుకున్న విహారి తన తొలి టెస్టు అనుభవం గురించి ‘సాక్షి’తో మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే... ఓవల్ టెస్టు అరంగేట్రంపై... గొప్ప అనుభూతి. ఎప్పటికైనా దేశం తరఫున ఆడాలని నేను పెట్టుకున్న లక్ష్యం ఆ రోజు పూర్తయింది. టెస్టు ఆరంభానికి రెండు రోజుల ముందే నేను అరంగేట్రం చేయబోతున్నట్లుగా చెప్పారు. నిజానికి నేను జట్టులోకి ఎంపికైనా ఫైనల్ ఎలెవన్‌లో చోటుపై నాకూ సందేహముంది. అవకాశం వస్తుందని ఊహించలేదు. అది తెలిసిన తర్వాత చాలా ఉద్వేగానికి లోనయ్యాను. అయితే అదే అనుభూతితో ఎక్కువ సేపు ఉండిపోలేం కదా. వెంటనే బాధ్యత కూడా గుర్తుకొచ్చింది. నా స్థానం ఖరారైందని తెలిసిపోయింది కాబట్టి ఇక వేరే ఆలోచనలను పక్కన పెట్టి... తొలి మ్యాచ్‌లో బాగా ఆడాలని పట్టుదలగా నిర్ణయించుకున్నా. మ్యాచ్ ప్రదర్శనపై... సంతృప్తిగా ఉంది. తొలి టెస్టు కాబట్టి సహజంగానే ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా. కానీ ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. హాఫ్ సెంచరీతో కెరీర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక సమయంలో మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని భావించినా అది సాధ్యం కాలేదు. అనూహ్యంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఆటలో ఇలాంటివి సహజమే. మన ప్రయత్న లోపం లేకుండా శ్రమించాలి. సరైన సమయంలో నాకు అవకాశం దక్కిందని భావిస్తున్నా. మరీ కుర్రాడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త మెచ్యురిటీ వచ్చిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో అడుగు పెట్టడం మానసికంగా ఎంతో మేలు చేస్తుంది. ఆంధ్రకు మారడంపై... నిజాయితీగా చెప్పాలంటే ఆ నిర్ణయం నాకు ఉపకారం చేసింది. జట్టు మారే సమయంలో కొంత రిస్క్ అవుతుందని అనిపించినా చివరకు ఆంధ్ర తరఫున ఆడాలనే నిర్ణయించుకున్నా. ఈ రెండేళ్లు బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ఎంతో పరిణతి సాధించాను. మంచి అవకాశాలు దక్కడంతో పాటు దాదాపు ప్రతీ జట్టుపై భారీగా పరుగులు సాధించగలిగాను. ఇప్పుడు టీమ్‌లోకి వచ్చాను కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైందిగానే భావిస్తున్నా. నన్ను తీర్చిదిద్దడంలో హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ పాత్ర కీలకం కాగా... కొన్నాళ్లుగా ఇక్బాల్ అకాడమీ కూడా ప్రాక్టీస్ చేసేందుకు నాకు అండగా నిలిచింది. నా కెరీర్లో తొలి కోచ్‌లాంటి ఆర్. శ్రీధర్ నేను జట్టులోకి వచ్చినప్పుడు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఉండటం నాకు మానసికంగా అదనపు బలాన్ని ఇచ్చింది. బౌలింగ్‌లో వికెట్లు తీయడంపై... బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో పాటు ఇది బోనస్‌లాంటిది. కొత్తగా భిన్నంగా ప్రయత్నించకుండా నా సహజమైన శైలిలో ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేశాను. వరుసగా రెండు బంతుల్లో అదీ జో రూట్, కుక్ వికెట్లు తీయడం చాలా గొప్పగా అనిపించింది. కొంత అదృష్టం కూడా కలిసొచ్చిందని చెప్పగలను. రెండో ఇన్నింగ్స్‌లో తీసిన 3 వికెట్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 2013 ఐపీఎల్లో గేల్‌ను నేను ఔట్ చేసిన తరహాలోనే సరిగ్గా కుక్ కూడా ఔటైనట్లు (కట్ చేయబోయి కీపర్‌కు క్యాచ్) చాలా మంది గుర్తు చేసుకున్నారు. దేశవాళీ ఆటపై... 2012 అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా మొదటిసారి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆరేళ్లుగా నేను కఠోర సాధన చేశాను. ఏకాగ్రత చెదరకుండా, కెరీర్లో మరింత ఎదగాలనే ఏకైక లక్ష్యంతో పట్టుదలగా ఆడుతూ పోయాను. భారీగా పరుగులు సాధించడంపై తప్ప మరే అంశంపై దృష్టి పెట్టలేదు. అది ఇప్పుడు ఫలితాన్ని అందించింది. దేశవాళీ క్రికెట్లో బాగా ఆడితే కచ్చితంగా అవకాశం లభిస్తుందని నేను నమ్మాను కాబట్టి దానినే పాటించాను. ఆస్ట్రేలియా సిరీస్ అవకాశాలపై... ఇప్పుడే అంత దూరం ఆలోచించడం లేదు. అలా చేస్తే ఏకాగ్రత కోల్పోతాను. ప్రస్తుతానికి నా ఆట ఏమిటో అంతా చూశారు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో సిరీస్ ఉంది. అందులో కూడా ఎంపికై సత్తా చాటాలని భావిస్తున్నా. ఆసీస్ టూర్‌కు ఎంపికైతే మరో గొప్ప అవకాశం దక్కినట్లే. ఇప్పుడైతే విజయ్ హజారే వన్డే టోర్నీకి సిద్ధమవుతున్నాను. –సాక్షి, హైదరాబాద్ -
ఆ విషయం ముందే తెలుసు!
అగ్ర కథానాయకిగా రాణిస్తానని తనకు ముందే తెలుసు అని చెప్పింది నటి హన్సిక. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి కథానాయకిగా సెటిల్ అయిన నటి హన్సిక. ముఖ్యంగా కోలీవుడ్‌లో మాప్పిళ్లై చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆపై వరుసగా అవకాశాలను అందుకుని, దర్శకుల హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఖాతాలో విజయాల శాతమే అధికం అని చెప్పవచ్చు. మొత్తం మీద అర్ధశతకానికి రీచ్ అయిన ఈ అమ్మడి ఖాతాలో మహా అనే చిత్రం అర్ధశతకంగా నమోదు అవుతోంది. త్వరలో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆనందంలో తుల్లిపోతున్న హన్సిక మాట్లాడుతూ 50వ చిత్రంలో నటించబోతుండడం చాలా సంతోషంగా ఉందంది. మహా చిత్ర కథ హీరోయిన్ సెంట్రిక్తో కూడి ఉంటుందని చెప్పింది. ఇలాంటి కథా చిత్రంలో నటించడం ఇదే ప్రప్రథమం అని తెలిపింది. అందుకే ఇందులో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంది. ఈ చిత్రం బాగా వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పింది. మహా చిత్ర దర్శకుడు జమీల్ తనకు ముందే తెలుసని, బోగం చిత్రాలకు తామిద్దరం కలిసి పని చేశామని చెప్పింది. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను చెప్పడానికి ఆరు నెలలు ఎదురు చూశారని, తాను బిజీగా ఉండడంతో ఆయన్ని కలిసి కథ వినడం కుదరలేదని తెలిపింది. ఎట్టకేలకు ఒక సమయంలో దర్శకుడు తనను కలిసి కథ వినిపించారని, అయితే అప్పుడు అందులో నటించడానికి అంగీకరించలేదని అంది. రెండవసారి మరోసారి కథ చెప్పినప్పుడు ఓకే చెప్పానంది. అయితే ముందు కథ విన్నప్పుడే మహా చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి సక్సెస్ఫుల్ హీరోయిన్ని అవుతానని తనకు ముందే తెలుసని చెప్పింది. ఎందుకంటే తాను కఠినంగా శ్రమిస్తానని అంది. అందుకే తనను మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని, ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నటిస్తానని, అగ్ర కథానాయకినవుతానని తెలుసంది. ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని చెప్పింది. పలువురు లెజెండ్స్‌ను కలిసి మాట్లాడుతున్నానని, తప్పులు చేయడం సహజం అని, అయితే తప్పు చేశానే అని దాన్నే తలుచుకుని బాధ పడుతూ కూర్చునే మనస్తత్వం తనది కాదని చెప్పింది. తాను గత ఏడాది మాత్రమే 19 చిత్రాల అవకాశాలను నిరాకరించినట్లు చెప్పింది. ఇంతకుముందు ఏడాదికి 8 చిత్రాల వరకూ చేసేదాన్నని, ఇప్పుడు ఏడాదికి 4 చిత్రాలే చేస్తున్నానని తెలిపింది. అలాగని పనిలేకుండా ఖాళీగా ఉంటున్నట్లు భావించరాదని అంది. ప్రస్తుతం రెండు చిత్రాలను పూర్తి చేసి మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు హన్సిక తెలిపింది. -
అందువల్లే బాగా బ్యాటింగ్ చేశా: రాహుల్
ఇండోర్: రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం ఇండోర్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చడంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ పాత్ర మరువరానిది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ సాధించిన ఈ విజయంలో రాహుల్ పాత్ర కీలకం. అజేయ అర్ధ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. అద్భుతమైన బౌండరీలతో చివరివరకూ కొనసాగి జట్టుకు విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది 84 పరుగులు సాధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ... ‘నేను చేసిన హాఫ్ సెంచరీల్లో నాకు నిజంగా తృప్తినిచ్చిన మొదటి అర్ధ శతకం ఇదే. జట్టును గెలిపించడం కోసం చివరి వరకూ ఆడాను. ఐపీఎల్ నా ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇంకా బాగా రాణించి మా జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని భావిస్తున్నాను. నాపై నేను నమ్మకం ఉంచడం వల్లే ఇంత బాగా ఆడగలిగాను. అందుకే మరీ జాగ్రత్తగా ఆడకుండా మంచి షాట్స్‌ను కొట్టగలిగాను. టి20ల్లోనూ బాగా రాణిస్తాననే నమ్మకం కలిగింద’ని అన్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో తనకు మద్దతుగా నిలిచిన బ్యాట్సమెన్ నాయర్, స్టోనిస్లకు గురించి చెబుతూ.. ‘నాకు జతగా ఎవరైనా ఉంటే బాగుండు అన్పించింది. ఆ విషయంలో కరుణ్, స్టోనిస్‌లు చాలా బాగా తోడ్పడ్డారు. వారు కూడా మంచి స్కోరు సాధించార’ని అన్నాడు. రాహుల్‌కు జతగా కరుణ్ నాయర్(31), స్టోనిస్(23 నాటౌట్)లు ఆకట్టుకున్నారు. -
రాహుల్ జిగేల్
మెరుపు షాట్లు... వీర విజృంభణ... తుఫాన్ ఇన్నింగ్స్ వంటి వర్ణనల కలబోతతో... కేఎల్ రాహుల్ విరుచుకు పడిన వేళ... ఢిల్లీ డేర్ డేవిల్స్ను బోల్తా కొట్టించి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ గెలుపు బోణి కొట్టింది. విధ్వంసకర ఆటతో పదకొండేళ్ల ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన (14 బంతుల్లో) అర్ధ శతకం నమోదు చేసిన రాహుల్ ఇన్నింగ్స్‌కు... కరుణ్ నాయర్ సమయోచిత ఆట తోడవడంతో కింగ్స్ ఎలెవన్ గెలుపు దిశగా అలవోకగా సాగిపోయింది. వీరిద్దరి దూకుడు ముందు లక్ష్యం చిన్నబోగా గంభీర్ సేన చేసేదేమీ లేకపోయింది. మొహాలీ: కొత్త కెప్టెన్ అశ్విన్ సారథ్యంలో సొంతగడ్డపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ శుభారంభం చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (16 బంతుల్లో 51; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను 6 వికెట్లతో ఓడించింది. కీలక సమయంలో కరుణ్ నాయర్ (33 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని మరో 7 బంతులు ఉండగానే అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కెప్టెన్ గంభీర్ (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం సాధించాడు. పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ (2/33), ముజిబుర్ రహమాన్ (2/28) రాణించగా, అశ్విన్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. రాహుల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ధనాధన్ ఇన్నింగ్స్... లక్ష్యం... 167. ప్రత్యర్థి జట్టులో బౌల్ట్, షమీ, అమిత్ మిశ్రా వంటి బౌలర్లు ఉన్నా రాహుల్ ఎదుట అంతా తేలిపోయారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే అతడు 16 పరుగులు బాదేశాడు. 2వ (షమీ) ఓవర్లో 11, 3వ (మిశ్రా) ఓవర్లో 24 పరుగులతో 14 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. ఈ క్రమంలో యూసుఫ్ పఠాన్ (15 బంతుల్లో 2015 సన్‌రైజర్స్‌పై) పేరిట ఉన్న ఐపీఎల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు. మూడు ఓవర్ల అనంతరం పంజాబ్ స్కోరు 52 కాగా... అందులో రాహుల్‌వే 51 పరుగులు కావడం తానెంతగా వీర విహారం చేశాడో చెబుతోంది. ఈ జోరు చూస్తే పంజాబ్ 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేస్తుందా? అనిపించింది. అయితే రాహు ల్తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7)ను వరుస ఓవర్లలోఅవుట్ చేసి ఢిల్లీ బౌలర్లు పరువు దక్కించుకున్నారు. వన్‌డౌన్‌లో వచ్చిన యువరాజ్ సింగ్(12) తడబడుతున్నా... కరుణ్ నాయర్ స్వేచ్ఛగా ఆడటంతో పంజాబ్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నాయర్ అవుటైనా.. మిల్లర్ (24 నాటౌట్), స్టొయినిస్ (22 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ముజిబుర్ రికార్డు ఈ మ్యాచ్‌తో అఫ్గానిస్తాన్‌కు చెందిన స్పిన్నర్ ముజిబుర్ రహమాన్ (17 ఏళ్ల 11 రోజులు) ఐపీఎల్ టోర్నీలో బరిలో దిగిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు సర్ఫరాజ్ ఖాన్ (17 ఏళ్ల 277 రోజలు) పేరిట ఉండేది. సంక్షిప్త స్కోర్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్: 166/7 (20 ఓవర్లలో) (గంభీర్ 55, రిషభ్ పంత్ 28, మోరిస్ నాటౌట్ 27; అశ్విన్ 1/23, మోహిత్ శర్మ 2/33, ముజిబుర్ 2/28), పంజాబ్ కింగ్స్ ఎలెవన్: 167/4 (18.5 ఓవర్లలో) (కేఎల్ రాహుల్ 51, కరుణ్ నాయర్ 50, మిల్లర్ నాటౌట్ 24, స్టొయినిస్ నాటౌట్ 22; బౌల్ట్ 1/34, మోరిస్ 1/25, క్రిస్టియాన్ 1/12, తేవటియా 1/24).