Fans Troll Babar Azam Getting Half Century Mark But Play Stops.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అర్థశతకం సాధించాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. వాస్తవానికి టి20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన బాబర్ అజమ్ ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బాబర్ అజమ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఇరు జట్ల మధ్య మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దాదాపు రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోగా.. మూడోరోజు నుంచి ఆట కొనసాగింది.
చదవండి: IND vs SA: రహానే, గిల్‌కు షాక్.. ఆకాశ్ చోప్రా ఫేవరెట్ జట్టులో దక్కనిచోటు
కాగా మూడోరోజు ఆటలో పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజమ్ అర్థసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. అయితే అతను ఫిప్టీ మార్క్ చేరిన కాసేపటికే బ్యాడ్‌లైట్ పేరుతో ఆట ఆగిపోయింది. దీంతో బాబర్‌ను మరోసారి టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఆడుకున్నారు. ''టి20 ప్రపంచకప్ తర్వాత బాబర్‌కు ఏది కలిసిరావడం లేదు.. ముందు టి20 సిరీస్‌లో పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో బాబర్ అజమ్ ఫిప్టీ సాధించినప్పటికి ప్రకృతి అతనికి సహకరించడం లేదు.'' అంటూ ట్రోల్స్ చేశారు.
ఇక మ్యాచ్‌లో నాలుగోరోజు లంచ్ విరామం తర్వాత పాకిస్తాన్ 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 76, అజర్ అలీ 56 పరుగులు చేసి ఔటవ్వగా.. ప్రస్తుతం పవాద్ అలమ్ 19, మహ్మద్ రిజ్వాన్ 26 పరుగులతో ఆడుతున్నారు.
చదవండి: AUS vs ENG Ashes Series: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం
Raining.. Match stopped#PakvsBan pic.twitter.com/lGVV583wZg
— Ali Hasan (@AaliHasan10) December 4, 2021
Comments
Please login to add a commentAdd a comment