ఖమ్మం: చిన్నతనంలో కలిసి చదువుకున్నారు... ఆతర్వాత ఉన్నత చదువులు, ఆపై ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారందరూ మళ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకుని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సమ్మేళనంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి సైతం పాల్గొని మాట్లాడారు.
తల్లాడలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 1973–74 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు యాభై ఏళ్ల తర్వాత ఖమ్మంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ బ్యాచ్‌కు పాఠాలు బోధించిన సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకుని ఇక్కడే గురువుగా పాఠాలు బోధించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇన్నాళ్లకు కలుసుకున్న పూర్వ విద్యార్థులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని.. చదువుకున్న పాఠశాల అభ్యున్నతికి తోడ్పాటునందించాలని సూచించారు. పూర్వ సమాజం పూనుకుంటేనే విద్యారంగం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అనంతరం గురువులు రామచంద్రమూర్తితో పాటు చిమ్మపూడి శ్రీరామమూర్తి, కె.శ్రీనివాసరావు, జె.సత్యనారాయణ, నారాయణరెడ్డి తదితరులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్ ప్రసాద్, పూర్వ విద్యార్థులు అనుమోలు బుద్దిసాగర్, బేబి శంకర్, ఎన్.సత్యనారాయణ, మంగపతిరావు, జి.సునంద, పూనాటి పిచ్చయ్య, భాస్కర్‌రావు, శంకర్‌రావు, నంబూరు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment