నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. ఎన్నికల సామగ్రి వచ్చేసింది! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. ఎన్నికల సామగ్రి వచ్చేసింది!

Nov 14 2023 1:56 AM | Updated on Nov 14 2023 10:11 AM

- - Sakshi

జిల్లాకు చేరిన పోలింగ్‌ కంపార్ట్‌మెంట్లు, ఇతర సామగ్రి

సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది. దీంతో పోలింగ్‌ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఇక ఎన్నికల సంఘం నుండి పోలింగ్‌ సామగ్రి సోమవారం జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా పోలింగ్‌ సామగ్రిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ పరిశీలించారు. పోలింగ్‌ రోజు ఉపయోగించే కంపార్ట్‌మెంట్లు, ఫారాలు, విధివిధానాలతో రూపొందించిన పుస్తకాలు, కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే బ్యానర్లు ఇతరత్రా సామగ్రి మొత్తం చేరాయని తెలిపారు. కాగా, పోలింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు వెల్ఫేర్‌ కిట్లు అందజేయనున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌, వివిధ శాఖల అధికారులు అజయ్‌కుమార్‌, కె.శ్రీరామ్‌, రాంబాబు, మదన్‌గోపాల్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: అఫిడవిట్‌లో తప్పిదం! కానీ ఎన్నికల నిబంధనల మేరకు ఒకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement