breaking news
Khammam District Latest News
-
అప్రమత్తత, క్రమశిక్షణతో విధులు
ఖమ్మంక్రైం: సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మంలో ఆదివారం పర్యటించనుండగా భద్రతా విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సీపీ సునీల్‌దత్ ఆదేశించారు. ఖమ్మంలో పోలీసు ఉద్యోగులతో శనివారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి అప్రమత్తంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని తెలిపారు. అనంతరం హెలీప్యాడ్, కాన్వాయ్, పార్కింగ్ స్థలాల వద్ద విధులపై సీపీ సూచనలు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏసీపీలు వసుంధరయాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సతీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్‌దత్ -
పాలేరు సిగలో అభివృద్ధి మాల..
● మంత్రి పొంగులేటి చొరవతో వేగంగా పనులు ● రూ.19.90 కోట్లతో మార్కెట్, రూ.25 కోట్లతో నర్సింగ్ కాలేజీ సిద్ధం ● జేఎన్టీయూ భవనం, లింక్ కెనాల్, ఆస్పత్రికి నేడు సీఎం శంకుస్థాపన సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో రూ.వందల కోట్ల నిధులు మంజూరవుతుండగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధి జరుగుతోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించడమే కాక ఇంకొన్ని పనులను శంకుస్థాపన చేయనున్నారు. అందుబాటులోకి నర్సింగ్ కాలేజీ ఏదులాపురం మున్సిపల్ పరిధి మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాల భవనం నిర్మాణం పూర్తయింది. ఐదెకరాల్లో ఈ భవనం నిర్మించారు. విద్యార్థుల సౌకర్యం కోసం ఒకే ప్రాంగణంలో మూడు అంతస్తులతో కాలేజీ బ్లాక్, నాలుగు ఫ్లోర్లతో హాస్టల్ బ్లాక్ నిర్మించారు. జలసవ్వడి ఏటా మున్నేరు నది నుంచి సుమారు 50–60 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూ రు వద్ద ఉన్న చెక్‌డ్యామ్ నుంచి గ్రావిటీ ద్వారా పాలేరు లింక్ కెనాల్‌కు తరలించేందుకు నిర్ణయించారు. ఇలా 4,500 క్యూసెక్కుల నీటి తర లింపునకు 9.6కి.మీ. కెనాల్ నిర్మాణానికి రూ.162.54 కోట్లు కేటాయించారు. ఈ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. మున్నేటి నీరు వస్తే సాగర్ ఆయకట్టు పరిధి పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న భూములు, ఎగువ భాగాన 40వేల ఎకరాల ఎన్నెస్పీ ఆయకట్టులో సాగు సాఫీగా జరుగుతుందని, పాలేరు రిజర్వాయ ర్ ద్వారా రెండు మెగావాట్ల జల విద్యుదుత్పత్తికి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. కెనాల్ నిర్మాణంతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగనుంది. 100 పడకల ఆస్పత్రి పాలేరు నియోజకవర్గంలో పీహెచ్‌సీలు ఉన్నా వంద పడకల ఆస్పత్రి లేకపోవడంతో నాలుగు మండలాలకు మధ్యలో ఆస్పత్రి నిర్మించనున్నారు. కూసుమంచి మండలం గట్టుసింగారంలో నిర్మాణానికి రూ.45.50 కోట్లు కేటాయించారు. అధునాతనంగా జేఎన్టీయూ కళాశాల పాలేరు నియోజకవర్గ పరిధిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రస్తుతం వైటీసీ భవనంలో కొనసాగుతోంది. ఈనేపథ్యాన మద్దులపల్లిలో 30 ఎకరాలు సేకరించి సొంత భవన నిర్మాణాలకు రూ.108.64 కోట్లు కేటాయించారు.ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాలను విడదీసి 2018లో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుచేశారు. ఈమేరకు 23.28 ఎకరాల్లో రూ.19.90 కోట్ల నిధులతో మూడు కవర్ షెడ్లు, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్స్, వేబ్రిడ్జితో పాటు కార్యాలయ భవనం నిర్మించారు. ఇక్కడ సీసీఐ, సివిల్ సప్లయీస్ ద్వారా పంట ఉత్పత్తులను సేకరించనున్నారు. పాలేరు నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా తాము పండించిన ఉత్పత్తులను విక్రయించడానికి ఈ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది. -
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ టోర్నీ ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–14 నెట్‌బాల్ టోర్నమెంట్ శనివారం వీ.వీ.పాలెంలోని సెడార్ వ్యాలీలో పాఠశాలలో ప్రారంభమైంది. హార్వెస్ట్ విద్యాసంస్థల అధిపతి పి.రవిమారుత్, వీ.వీ.పాలెం సర్పంచ్ కాపా ఆదినారాయణ, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వై.రామారావు, నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్.దీప్తి ప్రారంభించిన ఈ టోర్నీలో పాత పది జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు లీగ్ కం నాకౌట్ విధానంలో పోటీలు జరుగుతాయని టెక్నికల్ కమిటీ బాధ్యులు పీ.వీ. రమణ, బి.నాగయ్య తెలిపారు. -
నాలుగు గంటల పాటు సీఎం పర్యటన
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 10–45గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11–45గంటలకు మద్దులపల్లిలోని జేఎన్టీయూ నిర్మాణ ప్రదేశం వద్ద హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశాక సభలో ప్రసంగిస్తారు. ఆతర్వాత శ్రీశ్రీ సర్కిల్లోని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహానికి చేరుకుని భోజనం అనంతరం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ మైదానంలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభకు హాజరవుతారు. సభలో ప్రసంగించాక మధ్యాహ్నం 3–50గంటలకు హెలికాప్టర్లో మేడారం బయలుదేరతారు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగులేటి ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపల్ పరిధిలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యాన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. హెలీప్యాడ్, పైలాన్, నర్సింగ్ కళాశాల వద్ద చేసిన ఏర్పాట్లను పరిశీలించాక ఆయన మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్
నేలకొండపల్లి: గ్రామపంచాయతీ నిధులు డ్రా చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అన్నిరకాల నిధులకు ఇద్దరు సంతకాలు చేసిన చెక్కులనే ఆమోదించాలని డీటీఓ, అన్ని సబ్ ట్రెజరీలతో పాటు బ్యాంక్ మేనేజర్లకు సూచనలు అందాయి. ఈమేరకు జిల్లాలోని 571 గ్రామపంచాయతీల సర్పంచ్, ఉపసర్పంచ్లు తమ సంతకాలు ఇచ్చేందుకు మండల పరిషత్ కార్యాలయాలకు వచ్చారు. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే నూతన పాలకవర్గాల నేతృత్వాన అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల మంజూరు మొదలుకానుంది. కాగా, పంచాయతీ ఖాతాలు, రికార్డులన్నీ కార్యదర్శుల కస్టడీలోనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జమలాపురంలో అభిషేకం, నిత్యకల్యాణం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, ఆలయ ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు పాల్గొన్నారు. 23 నుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు రేపు వంద పడకల ఆస్పత్రి ప్రారంభం మధిర: మధిరలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని ఈనెల 19వ తేదీన సోమవారం ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈనేపథ్యాన సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం నుంచి ఫర్నిచర్, వైద్య పరికరాలు, మందులను శనివారం నుంచి నూతన భవనంలోకి తరలిస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభం కాగానే ఆ భవనం నుంచే వైద్యసేవలు అందుతాయి. -
ఉత్సవ సంబురం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరం ఎరుపురంగు పులుముకుంది. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఆదివారం సాయంత్రం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరగనుంది. ఈనేపథ్యాన ఎర్ర జెండాల రెపరెపలు, తోరణాలు, ఫ్లెక్సీలతో నగరం అరుణవర్ణం పులుముకుంది. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధుల రాక మొదలైంది. విప్లవ గుమ్మం విప్లవోద్యమాలకు ఖమ్మం నగరం సాక్ష్యంగా నిలిచింది. దేశ స్వాతంత్య్రానికి ముందు ఆ తర్వాత ఎన్నో ఘటనలకు వేదికై ంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం దాకా ఇక్కడి కమ్యూనిస్టులు కీలకంగా నిలిచారు. తీవ్ర నిర్బంధాలు ఎదురైనా తెలంగాణ సాయుధ పోరాట సమయాన గ్రామగ్రామాన ఎర్ర జెండా రెపరెపలాడింది. ఎందరో యోధులు సాయుధ పోరాటంలో పాల్గొనగా.. కొందరు జిల్లా నేతలు ప్రాణాలు అర్పించారు. అలాగే, 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎర్ర జెండా నీడన పోరాటాలు చేశారు. జిల్లాకు గోదావరి జలాల తరలింపు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం కోసం సీపీఐ పోరాటాలు నిర్వహించింది. ఎటు చూసినా అరుణ తోరణాలు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఆహ్వాన సంఘం తరఫున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 60 అడుగుల డిజిటల్ వేదిక సిద్ధం చేసి 40 వేల మందికి సరిపడా కుర్చీలు వేశారు. అంతేకాక కళాకారుల ప్రదర్శనలకు మరో వేదిక ఏర్పాటుచేశారు. ఇక నగరమంతటా ఎర్ర తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆహ్వాన సంఘం కార్యదర్శి బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, ఆహ్వాన సంఘ బాధ్యులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రదర్శనలతో ప్రారంభమై.. సీపీఐ శతాబ్ది సభ సందర్భంగా ఖమ్మంలో మూడు వైపుల నుంచి ప్రదర్శనలు రానున్నాయి. బాగం హేమంతరావు నేతృత్వాన పెవిలియన్ మైదానం వద్ద నుంచి, డి.రాజా, కూనంనేని సాంబశివరావు, ఎస్కే.సాబీర్ పాషా, జమ్ముల జితేందర్‌రెడ్డి నేతృత్వాన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, మహ్మద్ మౌలానా, దండి సురేష్ నేతృత్వంలో మూడో ప్రదర్శన ఖమ్మం నయాబజార్ కళాశాల నుంచి మొదలవుతుంది. ఈ ప్రదర్శనల్లో కార్యకర్తల కవాతుతో పాటు బంజారా, కోయ నృత్యాలు, వృత్తి సంఘాల ప్రదర్శనలు ఉంటాయి. సభకు అతిరథ మహారథులు ఖమ్మంలో సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. అలాగే, కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు వేదికను పంచుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రదర్శనలు ప్రారంభమై మూడు గంటలకు మైదానానికి చేరతాయి. సీపీఐ జాతీయ నాయకులు అమర్ జిత్ కౌర్, బీకే.టాంగో, రామకృష్ణ పాండా, అనిరాజా, గిరిశర్మ, కె.ప్రకాష్‌బాబు, సందేష్ కుమార్, సంజయ్‌కుమార్, పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ హాజరుకానున్నారు. కాగా, సభ ఏర్పాట్లను శనివారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, నాయకులు హేమంతరావు తదితరులు పరిశీలించారు.నేడు సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ -
కమ్యూనిస్టులంటే దేశ భక్తులు
● వందేళ్ల సీపీఐ ప్రస్థానంలో అనేక అనుభవాలు ● నేడు లక్షలాది మంది పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ ● దేశ, విదేశాల నుంచి హాజరుకానున్న ప్రతినిధులు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘నిర్బంధాల్లో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ జైలులో పురుడుపోసుకుంది. 1925 డిసెంబర్ 26న కాన్పూరు వేదికగా ఆవిర్భవించిన సీపీఐలో నాయకులు త్యాగాలు చేయడమే కాక జైలు శిక్ష అనుభవించడంతో పాటు వీరమరణం పొందారు. దేశం, ప్రజల కోసం పోరాడి మరణించినవాళ్లు ఏ పార్టీలో ఉండరు. అందుకే కమ్యూనిస్టులంటే దేశ భక్తులు. అలాంటి పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఖమ్మంలో నిర్వహిస్తున్నాం. కమ్యూనిస్టు ఉద్యమాలకు ఖమ్మం కీలకం కావడం, రెండు రాష్ట్రాలే కాక వివిధ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుండడం, రవాణా సౌకర్యం ఉండడంతో ఈ వేదిక ఎంచుకున్నాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఏర్పాట్లపై శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. లక్షలాది మందితో.. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సభలకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. తొలి రోజైన ఆదివారం బహిరంగ సభకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ మైదానంలో ఏ మూలన కూర్చున్నా వక్తల ప్రసంగం వినిపించేలా ఎల్ఈడీ తెరలు పెట్టించాం. వందేళ్ల సభ నేపథ్యాన పార్టీ శ్రేణుల్లో ఎప్పుడూ లేనంత సంతోషం కనిపిస్తోంది. ప్రముఖ నేతల రాక శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 20న సెమినార్ ఏర్పాటు చేశాం. ఈ సెమినార్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు సీపీఎం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఎంఏ.బేబి, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్ భట్టాచార్య, జి.దేవరాజన్.. ఇలా ఐదు లెప్ట్ పార్టీల నుంచి ముఖ్య నేతలు ప్రసంగిస్తారు. ‘భారత దేశ పరిస్థితులు–వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై ఈ సెమినార్ కొనసాగుతుంది. ఆదివారం బహిరంగ, 19న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశం, 20న సెమినార్, 21న జాతీయ కౌన్సిల్ సమావేశంతో సభలు ముగుస్తాయి. తొలి రోజు సభకు సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరవుతారు. కమ్యూనిస్టులు ఒకటవాలి.. సీపీఐ వందేళ్ల ప్రస్థానంలో అనేక అనుభవాలున్నాయి. ఈ కాలంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే, ఇంకొన్ని రాష్ట్రాల్లో రాలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు పార్టీనే. అప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేవు. అయితే, కమ్యూనిస్టులు, ఆర్ఎస్ఎస్ భావజాలం పూర్తిగా భిన్నమైనది. ఆర్ఎస్ఎస్ గిరి గీసుకొని మతం పేరుతో దేశంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. కమ్యూనిస్టులుగా మేం మాత్రం మతమైనా, దేవుడైనా ఎవరి విశ్వాసాలకు భంగం కలగవద్దని, అందరూ కలిసి ఉండాలని చెబుతున్నాం. అనునిత్యం ప్రజల్లో ఉంటున్నందునే కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు క్రియాశీలకంగా ఉంది. అనేక పార్టీలు పుట్టాయి, పోయాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికీ ఉంటుంది. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట పరిశ్రమల్లో కార్మికులు ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు దేశంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు ఒకటవ్వాలి. కార్మిక వర్గం ఒక్కటై ఉద్యమాలు మరింత పెంచితే ప్రజల్లో ఉత్సాహం రావడంతో పాటు కార్మికులకు న్యాయం జరుగుతుంది. తొలుత సీపీఐ, సీపీఎం కలిస్తే.. ఆ తర్వాత మిగతా పార్టీలు కలవడానికి వీలుంటుంది. పెరుగుట విరుగుటకే.. ఎస్ఐఆర్ పేరుతో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో లక్షల ఓట్లను బీజేపీ ప్రభుత్వం తొలగిస్తోంది. ఈ క్రమాన బీజేపీ ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. పెరుగుట విరుగుటకే అన్నట్లుగా బీజేపీ వాళ్లు ఎంత పెరిగినట్లు చూపించుకుంటున్నా చివరకు ప్రజల చేతిలో పరాభవం తప్పదు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓట్లు తీసేస్తున్నారు. కొన్నేళ్లుగా ఉన్న ఊరిలో ఉన్న ఓటర్లు కూడా ఏదో ఒకటి సమర్పించాలని చెబుతున్నారు. ఇలా చేయకపోతే ఓట్లు తీసేస్తున్నారు. బీజేపీ ఇలా గారడీల ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతోంది.ఒకప్పుడు ప్రజల డిమాండ్ మేరకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఆలోచన చేసి నాటి విశాలాంధ్రకు మద్దతు తెలిపాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు సీపీఐ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. ఇక్కడి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఐ వారి సమస్యలు, ఆలోచనలు, నిర్ణయాలను ప్రాతిపదికగా తీసుకుంటూ ముందుకెళ్తుంది. వందేళ్ల అనుభవం పార్టీ సొంతం కావడంతో.. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో లెఫ్ట్ పార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటన్నది ఈ సభల్లో చర్చిస్తాం. వీటిని ఎలా అధిగమించాలి, పోరాటాలతో ఎలా ముందుకెళ్లాలని కార్యాచరణ రూపొందించుకుంటాం. -
రేసులో ఎవరెవరు?!
● ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు చోట్ల మహిళలకే పీఠం ● మున్సిపాలిటీల్లో చైర్మన్లతో పాటు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు ● దీటైన అభ్యర్థుల కోసం పార్టీల ఆరాసాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పార్టీల వారీగా ఎవరు బరిలో ఉండనున్నారో తేలనుంది. అయితే గెలుపు గుర్రాల కోసం రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీలో చైర్మన్ గిరీ లక్ష్యంగా అనుకూలమైన స్థానాలపై పలువురు కన్నేయడంతో పోటీ నెలకొంది. ఐదు మున్సిపాలిటీలు.. జిల్లాలోని పాత మున్సిపాలిటీలు సత్తుపల్లి, మధిర, వైరాకు తోడు కొత్తగా ఏర్పడిన ఏదులాపురంలో చైర్మన్ పదవులు ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యాయో శనివారం తేలింది. సత్తుపల్లి, మధిర, వైరా చైర్మన్ పదవి జనరల్ మహిళకు, ఏదులాపురం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, కల్లూరు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అలాగే వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించారు. వార్డుల్లో మహిళల రిజర్వేషన్‌ను కలెక్టరేట్లో పార్టీల ప్రతినిధుల సమక్షాన లాటరీ ద్వారా ఖరారు చేశారు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో పలువురు పోటీకి సై అంటుండగా.. మరికొందరు ఆశలు తలకిందులయ్యాయని నిర్వేదంలో మునిగిపోయారు. రిజర్వేషన్లు తేలడంతో ఎక్కడ ఎవరిని బరిలోకి దించాలి.. చైర్మన్ పీఠాన్ని ఎలా దక్కించుకోవాలి.. అందుకు సమర్థులెవరు అన్న కోణంలో ఆరా తీయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు నిమగ్నయ్యారు. సీపీఎం, సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్రసీ కూడా బలమున్నచోట పోటీకి సన్నద్ధమవుతున్నాయి. పొత్తులపై స్పష్టత లేకపోవడంతో ఎవరికి వారు గతంలో ఎక్కడ పోటీ చేశాం.. ఇప్పుడు పోటీ చేస్తే బలాబలాలు ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేకున్నా ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ కూడా ఖరారు చేశారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న జిల్లాకు రానున్న నేపథ్యాన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి శుక్రవారం ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ సీఎం పర్య టన నేపథ్యాన బందోబస్తు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్ ఏర్పాటుపై సూచనలు చేశారు. విధుల్లో పాల్గొనే అధికారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, శాఖల వారీగా అభివృద్ధిపై నివేదికలు సిద్దం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. 1,800 మంది పోలీసులతో బందోబస్తు ఖమ్మంక్రైం: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా 1,800 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. బందోబస్తులో ఖమ్మంతో పాటు భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ఉద్యోగులు పాల్గొంటారని పేర్కొన్నారు. అంతేకాక స్పెషల్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్, రోప్ పార్టీ, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు ఉంటాయని తెలిపారు. ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి మధిర: మధిరలో నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 19న ప్రారంభించనున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆస్పత్రిని పరిశీలించిన ఆయన వసతుల కల్పనపై ఆరా తీశారు. అలాగే, ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. గోశాలలో మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖమ్మంఅర్బన్: మిస్టర్ ఇండియా–2015, మిస్టర్ వరల్డ్–2016 విజేత రోహిత్ ఖండేల్వాల్ ఖమ్మం గొల్లగూడెంలోని ఓం శ్రీకృష్ణ గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గోశాలలో పూజలు చేసి గోవులకు దాణా తినిపించగా.. గోసంరక్షణ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు చెప్పారని గోశాల బాధ్యుడు కేసా హనుమంతురావు తెలిపారు. 2015లో మిస్టర్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన రోహిత్, 2016 మిస్టర్ వరల్డ్ పోటీల్లోనూ టైటిల్ కైవసం చేసుకున్న తొలి ఆసియా వాసిగా చరిత్ర సృష్టించారు. -
ముంపు నుంచి శాశ్వత విముక్తి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమధిర: వైరా నది వరద ముంపు నుంచి మధిరకు శాశ్వతంగా విముక్తి కల్పించేలా రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈమేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. అంతేకాక క్షేత్రస్థాయిలో మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద పరిశీలించిన డిప్యూటీ సీఎం.. వర్షాకాలంలో వచ్చే వరద ఆధారంగా రిటైనింగ్ వాల్ ఎత్తు ఎంత ఉండాలనే అంశంపై చర్చించారు. అలాగే వైరా నదిపై మధిర నుంచి మడుపల్లి వరకు బ్రిడ్జి నిర్మాణ అవకాశాలపై ఆరా తీశారు. రిటైనింగ్ వాల్, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి సర్వే నిర్వహించి నివేదిక రూపొందించాలని తెలిపారు. రిటైనింగ్ వాల్, బ్రిడ్జి నిర్మాణానికి ఎంత భూమి సేకరించాల్సి వస్తుందో నివేదికలో పొందుపర్చాలని చెప్పారు. మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా చేపడుతున్న పనులు వేగంగా జరిగేలా యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, మధిర అభివృద్ధి అడ్వైజరీ కమిటీ సభ్యులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మిరియాల రమణగుప్తా, రంగా శ్రీనివాసరావు, బెజవాడ రవిబాబు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే, క్యాంపు కార్యాలయంలో మధిరకు చెందిన వ్యాపారులతో డిప్యూటీ సీఎం భేటీ అయి సమస్యలపై ఆరా తీశారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. 50మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో మెరుగైన పాలన అందించేలా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం మధిర మున్సిపాలిటీ పరిధిలో 50 మంది ఓటర్లకు గాను ఒక ఇన్‌చార్జ్‌ను నియమించగా వారితో ఆలయ సమీపాన సమావేశమై పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు రమణగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
రెక్కలు విప్పిన పందెం కోళ్లు
సత్తుపల్లి: భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడు రోజులు పందెంరాయుళ్ల హడావుడి అంతాఇంతా కాదు. క్షణాల్లో రూ.లక్షలు రావటం.. మరుక్షణంలో సర్వం కోల్పోయిన వారు బాధతో తిరుగుముఖం పట్టారు. వ్యవసాయ సీజన్ కావడంతో అందరి వద్ద చేతిలో డబ్బు ఉండడంతో తెలంగాణ – ఏపీ సరిహద్దుల్లో జరిగిన పందెం బరులకు పరుగులు తీశారు. ఏపీలోని మంత్రుల స్థాయి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం పందేల నిర్వాహకులకు ఉండడంతో పండుగ మూడు రోజులు ఆటంకం లేకుండా బిర్రులు కళకళలాడాయి. వీఐపీల తాకిడి సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్రాకు సరిహద్దున ఉండడంతో బిర్రుల వద్ద సత్తుపల్లితో పాటు జిల్లా వాసుల సందడి కనిపించింది. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పందాలను తిలకించేందుకు జిల్లా వాసులు క్యూ కట్టారు. టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నూజివీడు సమీపంలోని మీర్జాపురం బిర్రు వద్ద కనిపించారు. నలువైపులా భారీ స్క్రీన్లు మీర్జాపురం, విస్సన్నపేట మండలం తాతకుంట్ల, దెందులూరులో స్టేడియంలను తలపించేలా బిర్రులు ఏర్పాటుచేయడమే కాక నలువైపులా పందెంరాయుళ్లకు కనిపించేలా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక చింతలపూడి నియోజకవర్గంలోని సీతానగరం, రాఘవపురం, శివాపురం, చింతంపల్లి, తిరువూరు నియోజకవర్గంలోని కాకర్ల, పుట్రేల, చాట్రాయి, నర్సింహారావుపాలెంల్లోనూ పందేలు చూసేందుకు, కాసేందుకు తెలంగాణ వాసులు వెళ్లారు. రూ.లక్షలు దాటి రూ.కోట్లలో దింపుడు పందెం, ఎత్తుడు పందెం, ఐదెచ్చు.. ఆరేచ్చు.. పందెం ఓకేనా.. అంటూ బిర్రుల్లో కేకలతో హోరెత్తించారు. మీర్జాపురంలో తొలిరోజు ఆరు పందేలు రూ.25లక్షలు వేయడంతో దీనిని తిలకించేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు. గతంతో పోలిస్తే ప్రవేశాన్ని కట్టుదిట్టం చేయడంతో పాస్‌లు లేనివారు ఇబ్బంది పడ్డారు. అయినా రూ.కోట్లల్లో నగదు చేతులు మారింది. సంప్రదాయ కోడి పందేల మాటున రూ.కోట్లల్లో పేకాట జూదం సైతం నడిచింది. లోనా.. బైటా పేకాటతో క్షణాల్లో రూ.లక్షలు చేతులు మారాయి. బిర్రుల్లో కోడి పందెం తర్వాత స్థానంలో మూడురోజులు రాత్రీపగలు తేడా లేకుండా జూదం నడిచింది. జూదరులకు నిర్వాహకులే భోజనాలు, మద్యం సరఫరా చేయడం గమనార్హం. అంతేకాక కోడి పందేల శిబిరాల వద్ద గుండు పట్టాలు, పులి,మేకా జూదం, నెంబర్లు ఆట విచ్చలవిడిగా నిర్వహించారు. చూడటానికి చిన్నజూదంలా కన్పించినా ఇక్కడ కూడా రూ.లక్షల్లో చేతులు మారడంతో పలువురు సర్వం కోల్పోయారు. -
కోసల రామా.. కౌసల్యా తనయా..
భద్రాద్రి రామయ్యకు ఘనంగా విశ్వరూప సేవభద్రాచలం: భద్రగిరిలో మాత్రమే ప్రత్యేకమైన విశ్వరూప సేవ భక్తులను అలరించింది. మహాదర్బార్ సేవలో ఆశీనులైన అర్చనామూర్తులు, సర్వదేవతల నడుమ కొలువుదీరిన సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను భక్తజనం దర్శించుకున్నారు. ధూప, దీప నైవేద్యాలు, చుట్టూ 108 మంది అర్చనామూర్తుల నడుమ జగాలను ఏలే జగదభి రాముడికి జరిగిన ‘మహా దర్బార్’ ఆధ్యాత్మికతను చాటింది. గరుత్మంతుడి వాహనంపై రాజాధిరాజుగా భద్రాచల రామయ్య దర్శనంతో భద్రగిరి పులకించింది. భద్రాచలంలోనే ప్రత్యేకం.. ముక్కోటి ఉత్సవాలు ముగిశాక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాత్రమే బహుళ ద్వాదశి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. సంవత్సర కాల పూజల్లో దొర్లే దోషాల నుంచి ప్రాయశ్చిత్తం కోసం శ్రీ సీతారామలక్ష్మణ స్వామి, ఆలయం ప్రాంగణంలోని ఉపాలయాల్లో ఉండే అర్చనా మూర్తులను ఒకే చోటకు చేర్చి ఏకకాలంలో సేవలను నిర్వహించడం ఈ విశ్వరూప సేవ విశిష్టత. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గర్భగుడి నుంచి మంగళవాయిద్యాల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చి దీపారాధన, మహాప్రభుతోత్సవం జరిపారు. పూజల అనంతరం స్వామికి ప్రత్యేక కదంబ ప్రసాదం నివేదించారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సర్వ బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కాగా, విశ్వరూప సేవను పురస్కరించుకుని బేడా మండపాన్ని విద్యుత్ దీపాలు, షామియానాలతో అలంకరించారు. స్థానాచార్యులు రామచంద్ర.. రఘువీర.. రామచంద్ర.. రణధీర తదితర కీర్తనలను ఆలపిస్తుండగా, భక్తులు శ్రీరామయనమః అంటూ శ్రుతి కలిపారు. ఈఓ కొల్లు దామోదర్‌రావు దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు, ఈఈ రవీందర్, ఏఈవోలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
క్షతగాత్రుల్లో మరొకరు మృతి
● మూడుకు చేరిన మృతుల సంఖ్య ఖమ్మంఅర్బన్: పండుగ సందర్భంగా ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్న నలుగురు స్నేహితులు కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో తొలుత ఇద్దరు మృతి చెందగా, చికిత్స పొందుతున్న ఇంకొకరు మృతి చెందాడు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఖమ్మం వైఎస్సార్ కాలనీకి చెందిన దోమల మధు, కోట మధు, జి.శ్రావణ్ (25), బానోతు రాము స్నేహితులు కాగా కొందరు కార్ డ్రైవర్లుగా, మరికొందరు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా బుధవారం కారులో రఘునాథపాలెం వైపు వెళ్లి వస్తుండగా మెడికల్ కాలేజీ నిర్మాణ ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయాన అతివేగంగా ఉండడంతో స్తంభం విరిగిపోగా, కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనాస్థలిలోనే కారు నడుపుతున్న దోమల మధు, ఆస్పత్రికి తరలించేలోగా కోట మధు మృతి చెందాడు. ఇక జి.శ్రావణ్, బానోతు రాముకు తీవ్రగాయాలు కాగా శ్రావణ్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రోడ్డుప్రమాదంలో వృద్ధుడు..పెనుబల్లి: మండలంలోని శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద శుక్రవారం గుర్తు తెలియని కంటైనర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా పెనుబల్లికి చెందిన మారుతి నారాయణ(70)కు తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లిలో తన కుమార్తె వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరడడంతో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అరగంటసేపు పైగా వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. ఇక తుమ్మలపల్లి శివారులో వీఎం బంజర వైపు వస్తున్న కారును ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో బైౖక్పై వెళ్తున్న మండాలపాడు వాసి సన్నల మారేశ్వరరావుకు గాయాలయ్యాయి. ఆయనను ఎస్సై వెంకటేష్ పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని చనుబండ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబల్లికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు చిలక బత్తుల చెన్నారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన బైక్‌పై ్ప విస్సన్నపేట వెళ్లి వస్తుండగా కారు ఢీకొట్టడంతో చెన్నారావుతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. -
మూడు తరాల ఆత్మీయ సమ్మేళనం
వైరారూరల్: నలుగురు ఒక దగ్గర కూర్చుని మంచీచెడు మాట్లాడుకోవాలనుకున్నా ఉరుకుల పరుగుల యుగంలో సాధ్యపడడం లేదు. అలాంటిది ఒకరు, ఇద్దరు కాదు మూడు తరాల చెందిన 250 మంది ఒకచోటకు చేరడం విశేషం. వైరా మండలంలోని కేజీ సిరిపురానికి చెందిన ఐనాల గురువయ్య–కనకమ్మ కుటుంబీకులు సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఈ సందర్భంగా తొలితరం వారు తమ జ్ఞాపకాలను నేటి తరానికి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని తిరువూరు, పీకే బంజర, అమ్మపాలెం, ఎల్లంపేట, మహబూబాబాద్, మరిపెడ, అబ్బాయిపాలెం, చిల్లంచర్ల తదితర ప్రాంతాల్లో స్థిరపడిన ఐనాల కుటుంబీకులు ఈ సమ్మేళనానికి పిల్లాపాపలతో హాజరుకావడమే కాక రోజంతా ఆటపాటలతో సందడి చేశారు. -
● రామారావు హత్య కేసులో పోలీసుల నిర్ణయం? ● 18మందిలో ఎందరు అంగీకరిస్తారని ఉత్కంఠ ● లేకపోతే హత్య కేసులో ముందుకు సాగని దర్యాప్తు
మరోమారు ‘పాలిగ్రాఫ్’ నోటీసులుచింతకాని: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందనే చర్చ జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్ 31న పాతర్లపాడు గ్రామంలోని ఇంట్లోనే రామారావును గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో హత్య జరగడం, దీనిపై రాజకీయ ఆరోపణలు రావడంతో పోలీసులు సవాల్‌గా స్వీకరించి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినా ఫలితం కానరాలేదు. ఈక్రమాన పాలిగ్రాఫ్ పరీక్షలు(లై డిటెక్టర్) నిర్వహించేందుకు మొగ్గుచూపిన పోలీసులు.. అనుమానితులు, సాక్షులుగా ఉన్న 24 మంది పేర్లతో ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హత్యకు గురైన రామారావు భార్య, కుమారుడు, కుమార్తె, అల్లుడితో పాటు కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన నాయకుల పేర్లు ఉన్నా కొందరే అంగీకరించడంతో పోలీసులు మిగతా వారికి రెండో సారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. కొందరే ఓకే.. పాలిగ్రాఫ్ పరీక్షకు పోలీసులు కోరిన 24మంది జాబితా నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురే అంగీకరించారు. దీంతో వీరిని బెంగళూరు పంపించగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల ఆధ్వర్యాన పాలిగ్రాఫ్ పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన 18మందిలో కుటుంబసభ్యులు, సీపీఎం నాయకులు తదితరులు పాలిగ్రాఫ్ పరీక్షకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు మరో మారు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రామారావు హత్య కేసులో కుటుంబీకులు, సీపీఎం శ్రేణులే బాధితులైనప్పుడు పరీక్షలకు ఎలా అంగీకరిస్తామని పార్టీ నాయకులు ప్రశ్ని స్తున్నారు. వీరికి మరోమారు నోటీసులు ఇచ్చినా స్పందన రాకపోతే రామారావు హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోతుందా, పోలీసులు ప్రత్యామ్నా య దారులు వెతుకుతారా అనేది తేలాల్సి ఉంది. ఆరుగురికి వైద్య పరీక్షలు పాలిగ్రాఫ్ పరీక్షకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఆరుగురికి బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో గురువారం వైద్యపరీక్షలు నిర్వహించారు. పాలిగ్రాఫ్ పరీ క్షలో భాగంగా మంగళ, బుధవారం ప్రాథమిక సమాచారం సేకరించిన నిపుణులు పరీక్షలు చేయించారు. అనంతరం రోజుకు ఇద్దరు చొప్పున పాలి గ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
లక్ష్యానికి దూరమే..
● ముగింపు దశకు చేరిన ధాన్యం కొనుగోళ్లు ● జిల్లాలో 4లక్షల మె.టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ● ఇప్పటివరకు 2,51,472.840 మె.టన్నులే కొనుగోలుఖమ్మం సహకారనగర్: ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తుండగా ప్రక్రియ ముగింపు దశకు చేరింది. జిల్లాలో 331 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. కొన్నాళ్లుగా పలు కేంద్రాలకు ధాన్యం నిలిచిపోవడంతో 250 కేంద్రాలను మూసివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 21మండలాల పరిధిలో 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ 43,176మంది రైతుల నుంచి 2,51,472.840మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేయగలిగారు. ప్రణాళికాయుతంగా... జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను అధికార యంత్రాంగం ప్రణాళికాయుతంగా చేపట్టింది. గతంలో మాదిరిగా కాకుండా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించటంతో పాటు రైతులకు ఇబ్బంది రాకుండా చూశారు. వర్షం వస్తుందనుకున్న సమయంలో జాగ్రత్తలపై సూచనలు చేయడమే కాక అవసరమైనన్ని గన్నీసంచులు, టార్ఫాలిన్లు సమకూర్చారు. అయితే, 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంలో 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా రైతులు తీసుకురాలేదు. ఇప్పటికే కొనుగోళ్లు చివరి దశకు చేరినందున లక్ష్యం చేరడం కష్టమేనని తెలుస్తోంది. ప్రభుత్వం సన్నధ్యానానికి మద్దతు ధరతో పాటు బోనస్ ప్రకటించినా కల్లాలోనే వ్యాపారులు అదే స్థాయిలో నగదు చెల్లించడంతో రైతులు అటే మొగ్గు చూపినట్లు తెలిసింది. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే బాధ తప్పుతుందనే భావనతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించడంతోనే ప్రభుత్వ కేంద్రాలకు అనుకున్న లక్ష్యం మేర ధాన్యం రాలేదని తెలుస్తోంది. అయిపోయినట్టే.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వారం, పది రోజులో ముగిసే అవకాశం ఉంది. మొత్తం 331 కేంద్రాలను గాను 250కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. మిగతా కేంద్రాలకు కూడా రైతులు రాకపోగా, గతంలో కొనుగోలు చేసిన ధాన్యమే నిల్వ ఉంది. ఈ ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించాక ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించనున్నారు. కొనుగోలు కేంద్రాలు 331 సేకరించిన ధాన్యం 2,51,472.840 మె. టన్నులు ధాన్యం అమ్మిన రైతులు 43,176మంది ధాన్యం విలువ రూ.600,76,86,148 ఇప్పటివరకు చెల్లింపులు రూ.530,37,33,249 -
ప్రారంభానికి ముందే ప్రమాదాలు
వైరా/తల్లాడ: ఖమ్మం – దేవరపల్లి మార్గంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డు హైవే ప్రారంభానికి ముందే ప్రమాదాలు మొదలయ్యాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యాన హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు హైవేను ఎంచుకుంటున్నారు. అయితే, ఇంకా ప్రారంభించపోవడంతో ప్రమాద హెచ్చరికలు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోగా, పొగ మంచుతో శుక్రవారం ఉదయం రెండు ప్రమాదాలు జరిగాయి. ఎదురెదురుగా కార్లు ఢీ వైరా వైపు నుంచి కారులో తిరువూరు వెళ్తున్న బి.రమేష్.. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా కారును ఎదురుగా ఢీకొట్టాడు. ఘటనలో ఇన్నోవాలో ఉన్న శ్రీనివాస్‌తో పాటు రమేష్‌కు సైతం తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో ఖమ్మం తరలించారు. పొగమంచు తీవ్రతతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. ఇక తల్లాడ– కల్లూరు సమీపాన కేశ్వాపురం వద్ద మొక్కలకు నీళ్లు పట్టేందుకు వచ్చిన ట్యాంకర్‌ను హైవేపై నిలిపారు. పొగ మంచుతో ఇది కనిపించక హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఆ వెనకాల వచ్చిన మరో కారు మొదటి కారును ఢీకొంది. దీంతో ముందు కారులో ఉన్న హైదరాబాద్‌కు ఒకే కుటుంబీకులు జె.శ్రీనివాసరావు, జె.జయలక్ష్మి, జె.ప్రణతికి తీవ్ర గాయాలు కాగా, వెనక కారులో నలుగురికి సైతం గాయాలయ్యాయి. తల్లాడ ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ చేరుకుని క్రేన్ సాయంతో కార్లను తొలగించి, క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై రెండు ఘటనల్లో పలువురికి గాయాలు -
డీడీఎన్ అర్చక సంఘంపై దుష్ప్రచారం మానుకోవాలి
ఖమ్మంగాంధీచౌక్: ధూప దీప నివేదన(డీడీఎన్) రాష్ట్ర అర్చక సంఘంపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నావజ్జల ప్రసాద్‌శర్మ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మునగలేటి రమేష్‌శర్మ, మరిగంటి భార్గవాచార్యులు సూచించారు. ఖమ్మంలో శుక్రవారం వారు మాట్లాడుతూ కొందరు అర్చకులు పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి దేవాదాయ శాఖపై పెత్తనం చెలాయించడమే కాక ధూప దీప నివేదన పథకంపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ సంఘం అర్చకులకు ఉద్యోగ భద్రత, వేతన పెంపు కోసం సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. వైరా నదిలో వ్యక్తి గల్లంతు వైరారూరల్: మండలంలోని గన్నవరంలో జాలిముడి ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న వైరా నదిలో ప్రమాదవశాత్తు పడిన వ్యక్తి గల్లంతయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అనంతగిరికి చెందిన షేక్ నాగుల్ మీరా(32) సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల కల్లూరు మండలం చిన్నకోరుకొండిలోని అత్తగారింటికి వెళ్లాడు. పండుగ ముగిశాక ద్విచక్ర వాహనంపై శుక్రవారం అనంతగిరి వెళ్తుండగా మార్గమధ్యలో వైరా లోలెవల్ వంతెనపై వాహనం అదుపు తప్పినట్లు తెలిసింది. దీంతో నాగుల్‌మీరా వైరా నదిలో పడడంతో గల్లంతయ్యాడు. ఈ మేరకు వైరా ఎస్సై పుష్పాల రామారావు చేరుకుని వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు తెలుసుకుని నాగుల్‌మీరా కుటుంబానికి సమాచారం ఇచ్చి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. టీజీబీలో చోరీకి విఫలయత్నం కల్లూరు రూరల్: కల్లూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. బ్యాంకు కిటికీ చువ్వలు తొలగించి లోనకు ప్రవేశించాక లాకర్ గది తాళాలు సైతం పగలగొట్టాడు. అయితే, బ్యాంకు మొత్తం కలియదిరిగినా చోరీకి అవకాశం లేకపోవడంతో నిందితుడు వెనుతిరిగాడు. బ్యాంకుకు గురువారం సెలవు కావడంతో శుక్రవారం ఉదయం వచ్చిన ఉద్యోగులు చోరీకి జరిగిన యత్నాన్ని గుర్తించారు. ఆపై బ్యాంకు మేనేజర్ తన్నీరు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదుతో కల్లూరు పోలీసులు, ఖమ్మం సీసీఎస్ పోలీసులు బ్యాంకులో పరిశీలించగా, కేసు దర్యాప్తు చేసుకున్నట్లు ఎస్సై హరిత తెలిపారు. గంజాయి స్వాధీనం చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం సమీపాన ఐదుగురి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. గ్రామసమీపంలోని వెంచర్లో ఖమ్మం నగరానికి చెందిన ఐదుగురు అనుమానితులు ఉన్నారని అందిన సమాచారంతో తనిఖీల చేపట్టరు. ఈ సందర్భంగా వారి నుంచి 65 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కిన్నెరసానిలో సందడి పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో సంక్రాంతి సందడి నెలకొంది. గురు, శుక్రవారం పర్యాటకులు తరలివచ్చారు. జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 750 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.63,525 ఆదాయం లభించింది. 580మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌కు రూ.35,040 ఆదా యం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో రెండు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం పంచామృతాభిషేకం జరిపారు. తొలుత అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతం అభిషేకపూజలు, పంచహారతులు, నీవేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. షార్ట్‌సర్క్యూట్‌తో షాపు దగ్ధం బోనకల్: మండలంలోని జానికీపురంలో శుక్రవారం టీవీలు రిపేర్ చేసే షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకుంది. గ్రామానికి చెందిన వెంకటనారాయణ షాపులో మధ్యాహ్నం సమయాన మీటర్ వద్ద మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మధిర అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహంనతో చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటికే షాపులో రూ.లక్ష విలువైన సామగ్రి కాలిపోయాయని యజమాని వెంకటనారాయణ వెల్లడించాడు. -
రక్షణలో కమ్యూనిస్టులు
దేశ సంపదఖమ్మంమయూరిసెంటర్: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం నిర్వహిస్తున్న సభ చరిత్రలో నిలిచిపోనుందని, ఈ చారిత్రక ఘట్టంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ఖమ్మం సభ కమ్యూనిస్టుల పురోగమనం, ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. సంపూర్ణ స్వాతంత్య్రం నినాదం లక్ష్యంతో పోరాడిన ఏకై క పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమే కాగా.. అధికారంలో ఉన్నా, లేకున్నా తమ నినాదాలే పాలకుల విధానాలుగా మారాయని, పోరాటాల కారణంగానే చట్టాలు అమలయ్యాయని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనన్నారు. దేశ సంపద రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణను కమ్యూనిస్టులు బాధ్యతగా స్వీకరించారని.. లేకపోతే ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వేలు, కోల్ ఇండియా ఎప్పుడో ప్రైవేట్ శక్తుల పరమయ్యేవని తెలిపారు. రెండో శతాబ్దంలోనూ ప్రజా పోరాటాలు శతాబ్దకాలం పాటు పోరాటం సాగించిన సీపీఐ.. రెండో శతాబ్దంలోనూ ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ కార్యదర్శి ప్రకాష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 డిసెంబర్ 24 శతాబ్ది ఉత్సవాలు కాన్పూర్‌లో మొదలుకాగా, కమ్యూనిస్టు ఖిల్లా ఖమ్మంలో ముగియనున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ సమితి సభ్యుడు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్కే.జానీమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, బిజి.క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కూనంనేని, హేమంతరావు తదితరులు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో సభాస్థలిని పరిశీలించి సూచనలు చేశారు. -
చైర్మన్ రిజర్వేషన్
ఎవరికో !సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు మాత్రం మిగిలింది. ఇది కూడా ముగిస్తే బరిలో నిలిచేందుకు రాజకీయ పార్టీల్లోని ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పురపాలక శాఖ రాష్ట్రస్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేయడమే కాక మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపుపై మార్గదర్శకాలు, నిబంధనలను విడుదల చేసింది. వీటి ఆధారంగా వార్డు, చైర్మన్ స్థానం ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది. వార్డు రిజర్వేషన్లను స్థానికంగా, చైర్మన్ రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ప్రకటించనున్న నేపథ్యాన ఆశావహులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు కూడా ఖరారైతే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది. రిజర్వేషన్లపై కసరత్తు జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల పరిధిలో చైర్మన్ స్థానం, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుందో స్పష్టత వచ్చింది. ఆపై ఏ వార్డు ఏ కేటగిరీకి అనేది తేల్చాల్సి ఉంది. ఈమేరకు నిబంధనలను అనుసరించి ఏ వార్డు, ఏ చైర్మన్ స్థానం ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక జనాభాను ప్రాతిపదికగా తీసుకునేలా చర్యలు చేపట్టారు. 50 శాతం మించకుండా.. రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఉండేలా అధికారులు ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏ కేటగిరీలో జనాభా ఎంత, ఆ నిష్పత్తి ప్రకారం ఎన్ని స్థానాలు కేటాయించాలనే అంశాలను శాసీ్త్రయంగా లెక్కిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా ప్రతీ విభాగంలోనూ కచ్చితంగా 50 శాతం సీట్లు మహిళలకు చెందుతాయి. రాష్ట్రస్థాయిలో చేసిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని స్థానికంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ ఆమోదంతో నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిష్పత్తి లేకున్నా ఒక్క సీటైనా.. ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే గణాంకాలను రిజర్వేషన్ల కేటాయింపునకు ప్రాతిపదికగా తీసుకుంటోంది. మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, అనంతరం బీసీలకు వార్డుల రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. అయితే, ఎక్కడైనా జనాభా తక్కువగా ఉండి ఒక్క సీటు కూడా రాకపోయినా కనీసం ఒక్క వార్డునైనా ఈ వర్గాలకు కేటాయించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఆపై బీసీ రిజర్వేషన్లను డెడికేషన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా నిర్ణయిస్తారు.ఓవైపు రిజర్వేషన్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతుండగా.. మరోవైపు ఆశావహులు లెక్కల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రకటించిన రిజర్వేషన్లను అనుసరించి తమ మున్సిపాలిటీ, వార్డు ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుందనే అంచనాలపై అనుచరులతో చర్చిస్తున్నారు. రిజర్వేషన్ తమకు అనుకూలంగా ఉంటుందా, లేదా అనే ఆలోచనలతో సతమతమవుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో అత్యధిక శాతం మంది చైర్మన్ గిరీపైనే కన్నేయడం.. కాంగ్రెస్ పార్టీలో వీరి సంఖ్య మరింతగా ఎక్కువగా ఉండడంతో చర్చలన్నీ ఈ పీఠంపైనే జరుగుతున్నాయి. రిజర్వేషన్ల అంశం తేలితే తమ నేతలను కలిసి టికెట్లు దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ తమకు కలిసి రాకపోతే ఏం చేయాలనే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నారు. చైర్మన్‌తోపాటు వార్డులు కూడా ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతాయనే అంశంపై ముందస్తుగానే అంచనా వేసే పనిలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో ఆశావహుల ఆసక్తి -
కల నెరవేరేనా?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలతోపాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరికొన్ని మండలాల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా ఆమోదానికి నోచుకోలేదు. అలాగే, ప్రజల నుంచి కూడా మండలాల ఏర్పాటుకు డిమాండ్లు వచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆ అంశం మరుగున పడింది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రకటన చేయడంతో కొత్త మండలాల కోసం ఎదురుచూస్తున్న ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్ని అటు... ఇంకొన్ని ఇటు జిల్లాల పునర్విభజన సమయాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త మండలాలు ఏర్పడ్డాయి. 2016లో ఖమ్మం జిల్లా విడిపోయి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా రూపాంతరం చెందాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాలు ఉండగా, కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొన్ని కలవడంతో 21 మండలాలతో ఖమ్మం, 23 మండలాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. అలాగే, వైరా డివిజన్ స్థానంలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. అదే సమయాన మరికొన్ని మండలాలకు అధికారులు కసరత్తు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఏర్పాటు చేయాల్సిందే.... ప్రజల నుంచి కొన్ని.. పాలనా సౌలభ్యం కోసం అధికారుల తరఫున మరికొన్ని మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. కానీజిల్లాల పునర్విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ డిమాండ్లపై దృష్టి సారించకపోవడంతో నిలిచిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు, సుబ్లేడు గ్రామాలకు సంబంధించిన నివేదిక తయారు చేయాలని సూచించడంతో పాటు ఏది మండల కేంద్రంగా చేస్తే బాగుంటుందో నిర్ణయిస్తామని తెలిపారు. మరోసారి ఆశలు చాన్నాళ్లుగా కొత్త మండలాల అంశం మరుగున పడింది. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనతో చర్చ మొదలైదిం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మండలాల ఏర్పాటుకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. వీటిలో కొన్ని మండలాలు తప్పక ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రానికి వెళ్లేందుకు దూరాభారం అవుతున్నందున మండలం ఏర్పాటుతో సౌలభ్యంగా ఉంటుందని చెబుతున్నారు. శాసీ్త్రయంగా.. మండలాల ఏర్పాటుకు శాసీ్త్రయత ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. డిమాండ్ ఉన్నచోటల్లా ఏర్పాటుచేయకుండా.. అక్కడ మండల ఆవశ్యత, ఉపయోగాలు, ప్రజల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలనే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాక అసెంబ్లీలో చర్చించి అందరి సలహాలతో మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఇందుకోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిషన్ ఆరునెలల పాటు పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక నిర్ణయం వెలువడనుంది. మండలం కొత్త మండలం ఖమ్మంరూరల్ ఎం.వెంకటాయపాలెం తిరుమలాయపాలెం బచ్చోడు / సుబ్లేడు సత్తుపల్లి గంగారం వేంసూరు అడసర్లపాడు పెనుబల్లి లంకపల్లి కల్లూరు చెన్నూరు తల్లాడ అన్నారుగూడెం అశ్వాపురం మొండికుంట ఇల్లెందు కొమరారం / రొంపేడు టేకులపల్లి బోడు అశ్వారావుపేట వినాయకపురం -
ఏదులాపురం అభివృద్ధి నా బాధ్యత
● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పలు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటిఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దేలా అభివృద్ధి చేయడం తన బాధ్యత అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 50కి పైగా వెంచర్లు ఉన్నందున రోడ్లు, డ్రెయినేజీలు, రక్షిత తాగునీటి పథకాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఏదులాపురం అభివృద్ధి కోసం ఉద్యోగులు ఏకమై సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. అయితే, చెప్పినవన్నీ చిన్న సమస్యలే అయినందున పరిష్కరించడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో అభివృఽధ్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే రూ.15.77కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినందున మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈకార్యక్రమాల్లో మద్దులపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ బైరు హరినాధ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.విజయ్, ఎర్రమళ్ల శ్రీనివాస్‌తో పాటు శంకర్, పెరుమాళ్లపల్లి శ్రీనివాస్, బండి జగదీష్, తోట చినవెంకటరెడ్డి, దండ్యాల వెంకటేశ్వర్లు, బానోత్ భాస్కర్, చెన్నబోయిన వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఏదులాపురం మున్సిపల్ పరిధిలో పర్యటించనున్న నేపథ్యాన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సీపీ సునీల్‌దత్‌తో కలిసి పరిశీలించారు. మద్దులపల్లి మార్కెట్ సమీపాన సభాస్థలి, నర్సింగ్ కళాశాల వద్ద వాహనాల పార్సింగ్ ప్రాంతాన్ని పరిశీలించి సూచనలు చేశారు. ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ పైలాన్ శనివారం వరకు సిద్ధమవుతుందని, హెలీప్యాడ్ వద్ద వీవీఐపీలు, మంత్రుల, సీఎం కాన్వాయ్ వాహనాలు మాత్రమే అనుమతించి.. మిగిలిన ప్రజాప్రతినిధుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సంఘటిత పోరాటాలతో హక్కుల సాధన
కారేపల్లి: ప్రజల్లో విద్వేషాలు సృష్టించి విభజించి పాలించాలని పాలకులు కుట్ర పన్నుతున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఐక్యంగా ఉంటూ సంఘటిత పోరాటాలతో హక్కులను సాధించుకోవాలని సూచించారు. కారేపల్లి మండలం టేకులగూడెంలో మాస్‌లైన్, పీవైఎల్, పీఓడబ్ల్యూ, పీడీఎస్‌యూ ప్రజాసంఘాల ఆధ్వర్యాన గ్రామపంచాయతీ పాలకవర్గం సన్మానసభ నిర్వహించారు. అలాగే, సర్పంచ్‌గా గుమ్మడి సందీప్, ఉప సర్పంచ్ బిక్కసాని భాస్కరరావు, పాలకవర్గం ఆధ్వర్యాన నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశాక గుమ్మడి నర్సయ్య, రంగారావు మాట్లాడారు. ఓయూ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ, మాస్‌లైన్, ప్రజాసంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు చండ్ర అరుణ, టి.ఝాన్సీ, గోకినపల్లి లలిత, కాంపాటి పృధ్వీ, ఎన్వీ.రాకేష్, తేజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’లో కీలక అడుగు
● కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు ● 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు వార్డులు ● డెడికేషన్ కమిటీ సిఫారసులతో బీసీలకు కేటాయింపుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతుండగా.. అధికారులు ఒక్కో ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితా ప్రకటించారు. ఇటీవల పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా కూడా విడుదలైంది. ఇంతలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి మున్సిపల్ శాఖ కార్యదర్శి టీ.కే.శ్రీదేవి పేరిట జాబితా విడుదలైంది. అటు జనాభా.. ఇటు కమిషన్ వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల విషయాన వేర్వేరు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రకటించారు. బీసీల విషయానికొచ్చేసరికి డెడికేషన్ కమిటీ సిఫారసులను ఆధారంగా తీసుకున్నారు. కాగా, కేటగిరీల వారీగా మొత్తం రిజర్వేషన్లను ప్రకటించగా, ఏయే డివిజన్ / వార్డు ఎవరికి అనేది జిల్లా అధికారులు ఖరారు చేయనున్నారు. జాబితాలో ఖమ్మం కూడా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియడానికి ఇంకా సమయం ఉంది. అయితే, అన్ని మున్సిపాలిటీలతో పాటే ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకోసం పాలకవర్గాన్ని రద్దుచేయాలని మెజార్టీ సభ్యులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం ఎటూ తేలకముందే తాజా రిజర్వేషన్ల జాబితాలో ఖమ్మం కార్పొరేషన్‌కు కూడా చోటు కల్పించడం విశేషం. ఇక కోర్టు కేసుల కారణంగా మణుగూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం లేనందున జాబితాలో చోటు దక్కలేదు. -
పండుగ వేళ విషాదం..
● విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ● ఘటనలో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలుఖమ్మంఅర్బన్: కారు డ్రైవర్లు, రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న నలుగురు మిత్రులు పండుగ వేళ కలుసుకున్నారు. మూడు రోజులు సంతోషంగా గడుపుదామని భావిస్తుండగానే ప్రమాదం వారిని వెంటాడింది. వీరు వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. ఇంకో ఇద్దరు తీవ్రగాయాల పాలైన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఖమ్మం వైఎస్సార్ కాలనీకి చెందిన నలుగురు యువకులు చిన్నతనం నుంచే స్నేహితులు కాగా డ్రైవర్లుగా, ఇతర పనుల్లో స్థిరపడ్డారు. అంతా కలిసి బుధవారం కారులో రఘునాథపాలెం వైపు వెళ్లి వస్తున్నారు. ఈక్రమాన బైపాస్‌లో నూతన మెడికల్ కాలేజీ నిర్మాణ ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు వెంట విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారు వేగం తాకిడికి స్తంభం విరిగిపోగా, వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో కారు నడుపుతున్న దోమల మధు(23) అక్కడికక్కడే మృతి చెందగా కోట మధును ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. అలాగే, జి.శ్రావణ్, బానోతు రాములుకు తీవ్రగాయాలు కాగా శ్రావణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. కోట మధు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఆయన తండ్రి గురుస్వామి మూడు నెలల క్రితమే బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. మృతులిద్దరూ అవివాహితులు కావడం, చేతికొచ్చి న కుమారుల మృతితో వారి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యాన పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మధిర సమగ్రాభివృద్ధే లక్ష్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర: మధిర పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధి 8వ వార్డు సాయినగర్‌లో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశాక మాట్లాడారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలించిన ఇన్చార్జ్ కలెక్టర్, సీపీ ఖమ్మంరూరల్: ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యాన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం, ప్రారంభోత్సవాలకు హాజరుకానుండడంతో ఆయా ప్రాంతా ల్లో పరిశీలించి మాట్లాడారు. నర్సింగ్ కళాశాల సమీపాన హెలీప్యాడ్‌ను త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, జిల్లాలో జరుగుతున్న అభివృధ్ధి పనులపై శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు రూపొందించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరు హరినాధ్‌బాబు, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తంబూరు దయాకర్‌రెడ్డి, నాయకులు చెన్నబోయిన వెంకటరమణ, తోట చినవెంకటరెడ్డి పాల్గొన్నారు. 10మంది ఎల్టీలు ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రికి పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా వేయికి పైగా ఎల్టీ పోస్టులు భర్తీ చేశారు. వీరిలో పది మందిని జిల్లాకు కేటాయించగా బుధవారం సూపరింటెండెంట్ జి.నరేందర్‌కు రిపోర్ట్ చేశారు. -
గాలి ‘పాఠాలు’
ఖమ్మం మయూరిసెంటర్: గాలిపటం ఎగురవేయడమంటే చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ సరదానే! సంక్రాంతి వస్తుండగానే గాలిపటాలు అమ్మకాలు మొదలై.. పండుగ సెలవులు రాగానే జోరందుకుంటాయి. గాలిపటం తయారీ, కన్నాలు పెట్టి దారం కట్టడం, ఎగురవేయడంలో పిల్ల లకు పెద్దలు సలహాలు ఇస్తుంటారు. అయితే, ఇందులో ప్రతీ అంశంలో గణితం, సైన్స్ సూత్రాలు సమ్మిళతమై ఉంటాయని మీకు తెలుసా!? అవేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.. దారం.. కీలకం గాలిపటం ఎంత అందంగా ఉన్నా అది ఎగరాలంటే దారమే కీలకంగా నిలుస్తుంది. దారం తయారీకి పిండి, గాజు పొడి, రంగులు ఇవన్నీ సమపాళ్లలో కలపాలి. ఇందులో కాస్త ఎక్కువైనా, తక్కువైనా దారం బలం సరిగ్గా ఉండదు. దారం మందం, పొడవు సరిగ్గా అంచనా వేయడం ద్వారా నిష్పత్తులు, శాతాలపై అనుభవం వస్తుంది. అయితే, గతంలో చాలామంది ఇళ్లలో దారాలు ప్రత్యేకంగా సిద్ధం చేసుకునేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్‌గానే లభిస్తున్నాయి. కన్నాలు కుదరాల్సిందే.. పతంగి ఎగురవేయడంలో కన్నాలు ప్రధానం. బెజ్జాలు సరిగ్గా వేయకపోతే గాలిపటం ఓ వైపు వంగుతూ సరిగ్గా ఎగరదు. రెండు కన్నాలు సమాన పొడవులో ఉండేలా చూడాలి. ఇది తెలిస్తే కొలతల ప్రాధాన్యత, కోణాల గణితంపై అవగాహన వస్తుంది. గాలివాటం గుర్తింపు గాలిపటం, దారం సిద్ధం చేసుకున్నాక ఎగురవేయడంలోనూ సరైన అంచనా ఉండాల్సిందే. గాలి వేగం, మార్గాన్ని సరిగ్గా అంచనా వేస్తే గాలిపటం సులువుగా ఎగురేయొచ్చు. అంతేకాక గాలి దిశ ఆధారంగా దారం వదలాలా, దింపాలా అన్నది నిర్ణయించుకోవచ్చు. గాలి బలంగా ఉన్నప్పుడే దారం వదులుతూ.. తగ్గగానే పట్టి ఉంచాలి. ఈ క్రమంలో పిల్లలు భౌతికశాస్త్రం(ఫిజిక్స్)లోని వేగం, బలం, దిశ అంశాలను అర్థం చేసుకుంటారు. జాగ్రత్తలు... పతంగులు ఎగురవేయడం అందరికీ సరదానే అయినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా తప్పనిసరి. అంచు గోడలు ఉన్న డాబాలపైనే ఎగురవేయడం, విద్యుత్ తీగలకు దూరంగా ఉండడం.. ప్రమాదకారిగా మారిన చైనా మాంజా వాడితే నష్టాలపై పిలల్లకు వివరించాలి. తద్వారా వారికి భద్రతా చర్యలు కూడా తెలిసొస్తాయి. -
ఆకాశపు అంచులకు...
● దశాబ్దాల ‘గాలిపటం’ ప్రస్థానం ● తొలినాళ్లలో కాగితాలతోనే పతంగుల తయారీ ● నేడు ప్లాస్టిక్ కవర్లు, వివిధ ఆకృతుల్లో సిద్ధం ఖమ్మంమయూరిసెంటర్: సంక్రాంతి వస్తే ఇంట్లో పిండివంటల ఘుమఘుమల స్థాయిలోనే గాలిపటాలు ఎగురవేసే వారి సందడి కూడా మొదలవుతుంది. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎగురవేసే గాలిపటాలతో పండుగ మూడు రోజులు ఆకాశం కొత్త అందాలను సంతరించుకుంటుంది. అయితే, గాలిపటం తయారీ వెనుక కొన్ని తరాల శ్రమ, దశాబ్దాల అనుభవం దాగి ఉంది. కేవలం వెదురు బద్ధలు, కాగితాలతో అద్భుత ఆకారాలు సృష్టించే కళాకారుల జీవితం రంగుల కావ్యం కాకున్నా లాభాలు ఆశించకుండా ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారు పలువురు ఉన్నారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా పతంగులు తయారురుచేసి విక్రయించిన పలువురు.. ఇప్పుడు వివిధ ఆకృతుల్లో గాలిపటాలను హోల్‌సేల్‌గా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తాతల కాలం నాటి వారసత్వం చాలాచోట్ల గాలిపటాల తయారీ అనేది వ్యాపారంగా కాకుండా కుటుంబ వారసత్వంగా కొనసాగుతోంది. ‘మా తాత ఈ పని మొదలుపెట్టారు, ఇప్పుడు మేము చేస్తున్నాం’ అని గర్వంగా చెప్పే కుటుంబాలు ఖమ్మంలో ఎన్నో ఉన్నాయి. నైజాం కాలం నాటి నుంచి నేటి వరకు మారుతున్న కాలానికి అనుగుణంగా గాలిపటాల రూపాలను మారుస్తూ వీరు ఏటా సంక్రాంతి సమయాన అమ్మకాలు చేపడుతున్నారు. అయితే, దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నవారికి ఇప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయి. చేతితో చేసే గాలిపటాల కంటే మిషన్లతో తయారయ్యేవి వచ్చాయి. కాగితం, రసాయనాలు, వెదురు ధరలు పెరగడం వల్ల లాభాలు తగ్గాయి. కేవలం సంక్రాంతి సమయంలోనే డిమాండ్ ఉండడంతో మిగతా సమయాన ప్రత్యామ్నాయ పనులు వెతుక్కోవాల్సి వస్తోంది. శ్రమతో కూడిన సృజన గాలిపటం తయారీ వెనుక ఏకాగ్రత, శ్రమ ఉంటాయి. బరువు తక్కువగా ఉంటూనే గాలిలో ఎగురుతున్నప్పుడు విరిగిపోకుండా సరైన వెదురును ఎంచుకోవాల్సిఉంటుంది. దీన్ని సన్నని బద్ధలుగా చెక్కడం ఒక నైపుణ్యం. టిష్యూ పేపర్ లేదా ప్లాస్టిక్ షీట్లను సరైన కోణంలో అతికించడంపైనే గాలిపటం ఎలా ఎగురుతుందనేది ఆధారపడి ఉంటుంది. నా చిన్నతనంలో కాగితాలతో తయారుచేసిన గాలిపటాలు రూ.1లోపే అమ్మేవాళ్లం. ఇప్పుడు ధర పెరగడమే కాక ఆకృతి, వాడే కాగితం మారింది. అయినా ఏటా సంక్రాంతికి గాలిపటాలు విక్రయించడం ఆనందంగా ఉంటుంది. – కె.బ్రహ్మయ్య, ఖమ్మంనా చిన్నతనంలో మా నాన్న పండుగ పతంగులు అమ్మేవారు. నేను 1989 నుంచి విక్రయిస్తున్నా. తొలుత రిక్కాబజార్లో బయ్యా అనే వ్యక్తి వద్ద తెచ్చేవాళ్లం. పిల్లలు పతంగి ఎగురవేస్తుంటే మాకూ సంతోషమవుతుంది. – కొండ వెంకటేశ్వర్లు, చర్చి కాంపౌండ్, ఖమ్మం -
అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
కారేపల్లి: బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపను మండలంలోని బస్వాపురం వద్ద కారేపల్లి అటవీశాఖ ఉద్యోగులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రిజిల్లా టేకులపల్లి నుంచి కారేపల్లి మండలం మీదు గా బొలేరో వాహనంలో కొందరు కలపను ఖమ్మం వైపు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలి సింది. ఈ వాహనాన్ని కారేపల్లిలోని ఫారెస్టు రేంజ్ కార్యాలయానికి తరలించి విచారణ చేపడుతున్నారు. అయితే, వివరాలను గోప్యంగా ఉంచడం, మీడియాకు సమాచారం ఇవ్వకపోవడంతో అటవీ అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దారి పంచాయితీలో దాడినేలకొండపల్లి: దారి పంచాయితీ విషయమై జరిగిన గొడవలో కుటుంబంపై దాడి చేయగా ముగ్గురికి గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన జోగుపర్తి నాగేశ్వరరావుకు మండ్రాజుపల్లి కొత్తూరుకు చెందిన రైతుల మధ్య పొలా లకు వెళ్లే దారి విషయమై గొడవలు జరుగుతున్నా యి. ఈక్రమాన మంగళవారం నాగేశ్వరరావు కోడలు అనూష, అత్త లక్ష్మి, మనవరాలు చరణ్య పొలం వద్దకు వెళ్లి వస్తుండగా మండ్రాజుపల్లి కొత్తూరుకు చెందిన శ్రీనివాసరావు తదితరులు అడ్డగించి దాడి చేశారని తెలిపారు. ఇంతలోనే చెన్నారం గ్రామస్తులు వస్తుండగా వారు వాహనాల్లో పారిపోయారని పేర్కొన్నారు. దాడిలో ముగ్గురు గాయపడగా ఘటనపై అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు ఖమ్మంక్రైం: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరిపై ఖమ్మం టూటౌన్ పోలీసులు మంగళవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన కిషోర్‌రెడ్డి వద్ద లెనిన్‌నగర్ వాసి అషారఫ్ చైనా మాంజాను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి 40బండిళ్ల చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అషారప్ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న కిషోర్‌రెడ్డి కోసం గాలిస్తున్నామని టూ టౌన్ పోలీసులు తెలిపారు. -
సిరిపురం మేజర్ కాల్వకు బుంగ
తల్లాడ: సాగర్ ప్రాజెక్టు పరిధి మండలంలోని సిరిపురం మేజర్ కాల్వకు మంగళవారం బుంగ పడింది. గోపాలపేట సమీపంలో కాల్వ ఒకటో కిలోమీటర్ వద్ద బుంగ పడగా సాగునీరు వృథాగా పోతోంది. సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా కాల్వ యూటీ రివిట్మెంట్ను తొలగించడంతో కాలువ కట్ట బలహీనమైన బుంగ పడింది. ఈ సమాచారం అందుకున్న ఎన్నెస్పీ అధికారులు కాల్వకు నీటి పారుదలను 90 క్యూసెక్కుల నుంచి 70 క్యూసెక్కులకు తగ్గించారు. బుంగను బుధవా రం పూడ్చనున్నట్లు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం రాక
మధిర: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం మధిర రానున్నారు. ఈ సందర్భంగా మధిరలోని క్యాంపు కార్యాలయంలో జరిగే భోగి సంబురాల్లో భట్టి విక్రమార్క పాల్గొంటారు. అలాగే, గురువారం కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న భట్టి విక్రమార్క, శుక్రవారం సైతం పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఆరు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు కొణిజర్ల: కొణిజర్ల మండలం ఉప్పలచలకలో ఆరు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు మంగళవా రం ప్రారంభమయ్యాయి. గ్రామసర్పంచ్ గుగులోతు చందు శారద నేతృత్వాన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈపోటీలను బీఆర్ఎస్ నాయకులు చిరుమామిళ్ల రవికిరణ్, లకా వత్ గిరిబాబు ప్రారంభించి మాట్లాడారు. నాయకులు పోట్ల శ్రీను, దేవుళ్ల వీరన్న, బానోత్ రవీందర్, భూక్యా మాన్సింగ్, తులిసింగ్, కృష్ణమూర్తి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. కళాకారులకు పుట్టినిల్లు కొమరారంమాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఇల్లెందురూరల్: కళాకారులకు కొమరారం పుట్టినిల్లు వంటిదని, అలాంటి గ్రామంలో జన్మించి, తన పూర్వీకుల ఆనవాయితీని పుణికిపుచ్చుకున్న సాయిలు సినీ దర్శకుడిగా ఎదగడం హర్షణీయమని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ప్రజాకవి జయరాజు అన్నారు. కొమరారంలో రాజు వెడ్స్ రాంబాబు చిత్ర దర్శకుడు కాంపాటి సాయిలు అభినందన సభ మంగళారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కళలపై అభిమానంతో చిరుప్రాయం నుంచే ఆసక్తి చూపిన సాయిలు తనకంటూ ఒక గుర్తింపు కోసం హైదరాబాద్‌లో మకాం వేసి నిరంతర సాధన, కఠోర శ్రమతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నారని, ఈ ప్రయాణంలో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, నాయిని రాజు, ఆజ్మీర బిచ్చా, కాంపాటి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంస్కృతికి అద్దం పడుతోందిభద్రాచలంటౌన్ : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మ్యూజియం గిరిజనుల జీవనశైలి, ఆచార వ్యవహారాలకు అద్దం పడుతోందని ఆస్ట్రేలియా పర్యాటకురాలు రాబిన్ జెపరి ప్రశంసించారు. హైదరాబాద్‌కు చెందిన తన మిత్రులతో కలిసి మంగళవారం ఆమె శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మ్యూజియాన్ని తిలకించాక మాట్లాడుతూ.. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతిని నేటి తరానికి తెలిసేలా కళాఖండాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా గిరిజన పూర్వీకుల పనిముట్లు, చరిత్రను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వివరించడం పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు రుచికరంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అద్భుతమైన రీతిలో మ్యూజియాన్ని తీర్చిదిద్దిన పీఓ బి.రాహుల్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మ్యూజియం నిర్వాహకుడు వీరస్వామి, మాధవి తదితరులు పాల్గొన్నారు. 23నుంచి రామదాసు జయంతి ఉత్సవాలు నేలకొండపల్లి: శ్రీసీతారామచంద్రస్వామి పరమ భక్తగ్రేసరుడైన కంచర్ల గోపన్న(భక్త రామదాసు) జయంతి ఉత్సవాలు ఆయన స్వగ్రామంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు వివరాలను విద్వత్ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి మంగళవారం వెల్లడించారు. రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలో ఏటా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, స్థానిక భక్తరామదాసు విద్వత్ కళాపీఠం, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యాన ఉత్సవాలు నిర్వహిస్తారు. గతంలో మాదిరిగానే ఈసారి 23నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సమావేశంలో నంచర్ల దేవీప్రసాద్, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అటవీ సంరక్షణపై ముగ్గుల పోటీలు
ఖమ్మంవ్యవసాయం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరూవాడ ముగ్గుల పోటీలు జరుగుతుండగా అటవీ శాఖ వినూత్న రీతిలో పోటీలు నిర్వహించింది. వన్యప్రాణులు, వృక్షాల సంరక్షణే ఇతివృత్తంగా ఖమ్మంలోని అటవీ శాఖ కార్యాలయాల సముదాయంతో పాటు పులిగుండాల, నీలాద్రి అర్బన్ పార్క్‌ల్లో నిర్వహించిన పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పొల్గొన్నారు. వన్యప్రాణులు, అటవీ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందజేశాక డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడారు. సంప్రదాయ కళల ద్వారా ప్రజలకు పర్యావరణ బాధ్యతను గుర్తు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఎఫ్డీఓ మంజుల, అధికారులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించిన డీఎఫ్ఓ -
ఎన్ని కేసులు పెట్టినా భయపడం..
ఖమ్మంమయూరిసెంటర్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో కేడర్ ముందుకు సాగుతుందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కారుమూరువెంకటరెడ్డి తెలిపారు. ఖమ్మంలో వైఎస్సా ర్, వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానులను మంగళవారం పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడా రు. జిల్లాకుచెందిన మంత్రి,ఆయన కుమారుడు తప్పు డు కేసులు బనాయించడం మానేసి జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వైఎస్సార్సీపీ ఇక్కడ లేకపోయినా జగన్ అభిమానులను చూసి భయపడే పరిస్థితి వచ్చిందంటే వారి పని తీరు అర్థమవుతోందన్నారు. ఖమ్మంలో పార్టీ లేకపోయినా జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించడం, ర్యాలీ టీడీపీ ఆఫీస్ ముందు రోడ్డుపై వెళ్తే 11 మందిపై అక్ర మ కేసులు పెట్టారని ఆరోపించారు. అంతేకాక వేడుకలకు డబ్బులు ఎవరైనా పంపించారా.. ప్రతిపక్ష పార్టీ పంపించిందా అంటూ పోలీసులు ఇంటరాగేషన్ చేశారని మండిపడ్డారు. ఖమ్మం టూ టౌన్ సీఐ ముగ్గురిని విపరీతంగా కొట్టారని ఆరోపించారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన.. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తుండగా కోడి, మేకను కోస్తే కేసులు పెడుతూ మనుషుల పీకలు కోసిన తెలుగుదేశం వాళ్లను మాత్రం వదిలేస్తున్నారని వెంకటరెడ్డి విమర్శించారు. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ హత్య, నంద్యాల జిల్లా మచ్చమర్రిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితులు బయ ట తిరుగుతున్నారనితెలిపారు. కాగా, ఖమ్మం వైఎస్సా ర్ కాంగ్రెస్‌కు పెట్టని కోటగా నిలుస్తోందని, తెలంగాణ ప్రజలకు వైఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై విపరీతమైన అభిమానం ఉందని, అభిమానులందరికీ జగన్ అండగా నిలుస్తారని తెలిపారు. జగన్ అభిమానులు గంగరబోయిన రవి, యర్రా నాగరాజురెడ్డి, మర్రిశ్రీనివాస్,ఆలస్యం సుధాకర్, సరి కొం డ రామరాజు, గణపారపు మురళిని వెంకటరెడ్డి పరా మర్శించగా, ఏపీ మాజీ మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, నాయకులు నెల్లూరి రమేష్, లక్కినేని సుధీర్‌బాబు, ఆలస్యం రవి, కన్నెబోయిన సీతరామయ్య, బోనగిరి వెంకటరమణ, ఆదూరి రాజవర్ధన్‌రెడ్డి వాలూరి సత్యనారాయణ, ఆలస్యం నర్సయ్య, కంభం నవీన్, బూరగడ్డ లక్ష్మీనారాయణ, బాలాజీ, కాకుమాని నర్సిరెడ్డి, వాకా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
ఇప్పటికై నా మిస్టరీ వీడేనా ?
● సీపీఎం నేత రామారావు హత్య కేసు విచారణలో మరో అడుగు ● 24మందికి టెలిగ్రాఫ్ టెస్ట్‌కు కోర్టు అనుమతి ● అంగీకరించి బెంగళూరు వెళ్లిన ఆరుగురు కాంగ్రెస్ నాయకులుచింతకాని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు మిస్టరీ ఇప్పటికై నా వీడుతుందా.. దర్యాప్తు ఇంకొన్నాళ్లు సాగుతుందా అన్న చర్చ మొదలైంది. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన ఆయనను ఇంట్లోనే గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన గుర్తు తెలియని దుండగులు కత్తులతో అత్యంత దారుణంగా హతమార్చారు. ఇది జరిగి 75రోజులు కావొస్తుండగా.. ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో సహా మొత్తం 30మంది పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా పురోగతి కానరాలేదు. ఈ నేపథ్యాన పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అనుమానితులు, సాక్షులు, కుటుంబసభ్యులతో సహా మొత్తం 24 మందికి పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ ఖమ్మం మూడో అదనపు ప్రథమశ్రేణి న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు నుంచి నోటీసులు గతనెల మొదటి వారంలో పోలీసులు పిటీషన్ దాఖలు చేయగా పాలిగ్రాఫ్ పరీక్షకు హాజరయ్యేందుకు సమ్మతి తెలియజేయాలని 24 మందికి ఈనెల 5వ తేదీన కోర్టు నుంచి నోటీసులు జారీ చేశారు. ఇందులో రామారావు కుటుంబసభ్యులు నలుగురితో పాటు సీపీఎం, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీరిలో కుటుంబ సభ్యులు సహా మరో వ్యక్తి కోర్టు నోటీసులు తీసుకోలేదు. ఇక నోటీసులు తీసుకున్న 19మంది జనవరి 7వ తేదీన కోర్టుకు హాజరైనా ఆరుగురు కాంగ్రెస్ నాయకులు పాలిగ్రాఫ్ పరీక్షకు అంగీకరించారు. బెంగళూరుకు ఆరుగురు... పాలిగ్రాఫ్ పరీక్షా కేంద్రం హైదరాబాద్‌లో లేకపోవడంతో బెంగళూరులోని కేంద్రానికి రావాలని కాంగ్రెస్ నాయకులు ఆరుగురికి సూచించగా సోమవారం బయలుదేరారు. వీరికి మంగళవారం నుంచి పాలిగ్రాఫ్ పరీక్షలు మొదలుపెట్టగా రోజుకు ఇద్దరు చొప్పున పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రామారావు హత్య జరిగిన రోజు ఆయన భార్య స్వరాజ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్‌రావు, కాండ్ర పిచ్చయ్య, మద్దినేని నాగేశ్వరరావు, కంచుమర్తి రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది. పాలిగ్రాఫ్ పరీక్షకు బెంగళూరు వెళ్లిన వారిలో కేసు నమోదైన ఐదుగురితో పాటు గ్రామానికే చెందిన గుగ్గిళ్ల రాధాకృష్ణ ఉన్నారు. ఈ పరీక్ష తర్వాత దర్యాప్తులో అడుగు ముందుకు పడుతుందా, లేదా అనేది తేలనుంది. -
సీపీఐ శతాబ్ది సభ.. అందరి పండుగ
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాలు సబ్బండ వర్గాల సంబురమని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. ఈనెల 18న పార్టీ శతాబ్ది ఉత్సవాల సభ జరగనున్న నేపథ్యాన మంగళవారం ఖమ్మం బైపాస్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద ఎర్ర బెలూన్లకు సీపీఐ జెండాలు కట్టి గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పార్టీ పని చేస్తోందన్నారు. తద్వారా దున్నే వానికి భూమి, బ్యాంకుల జాతీయీకరణ జరిగిందని, శ్రమ దోపిడీ నుంచి కార్మికులకు విముక్తి కలిగినా మళ్లీ మతోన్మాద శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. ఈనేపథ్యాన సమరశీల పోరాటాలకు ప్రజలను సంసిద్ధులను చేసేందుకే శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి, మేకల శ్రీనివాసరావు, ఏనుగు గాంధీ, బిజి.క్లెమెంట్, శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, శతాబ్ది ఉత్సవాల సభ ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీ ఖమ్మం సీపీఐ కార్యాలయం నుంచి బైపాస్ రోడ్డు, బస్‌డిపో, మయూరిసెంటర్, వైరా రోడ్డు, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్, ఎన్టీఆర్ విగ్రహం, బైపాస్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు మాట్లాడగా నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, బానోత్ రాంకోటి, బాగం ప్రసాద్, ఏలూరి భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు -
రీజియన్‌లో ప్రథమ స్థానంలో పాల్వంచ ఎల్పీజీ సెంటర్
అభినందించిన భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అన్ని విభాగాల రీజినల్ పరిధిలో డొమెస్టిక్ సిలిండర్ల విక్రయాల్లో ప్రథమస్థానంలో నిలిచిన పాల్వంచ ఎల్పీజీ సెంటర్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణకు అవార్డు అందించారు. హెచ్‌పీసీఎల్ కంపెనీ విజయవాడ రీజినల్ కార్యాలయంలో ఆర్ఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సమీక్షలో రీజినల్ మేనేజర్ పంకజ్ చౌదరి, డీజీఎం రాహుల్ సింఘ్, ఏరియా సేల్స్ మేనేజర్ పవన్ నరేశ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. మిగతా డిస్ట్రిబ్యూటర్లు పాల్వంచ ఎల్పీజీ సెంటర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాగా, అనంతుల లక్ష్మీనారాయణను మంగళవారం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తన చాంబర్లో అభినందించి మాట్లాడారు. వినియోగదారులకు గ్యాస్‌ను సకాలంలో సరఫరా చేయాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, డీసీఎస్ఓ ప్రేమ్‌కుమార్‌తోపాటు త్రినాథ్‌బాబు, రజిత, నరేశ్, మెకానిక్ ప్రకాష్ పాల్గొన్నారు. -
అమ్మగారికీ దండం పెట్టు..!
● సంస్కృతిని కాపాడుతున్న కుటుంబాలు ● చిన్నప్పటి నుంచే శిక్షణ.. కుటుంబమంతా ఆధారం ● పూర్వంతో పోలిస్తే ఆదరణ లేదని ఆవేదన ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, పిండి వంటలే కాక ఇంటి ముందుకు గంగిరెద్దులు వస్తేనే సంక్రాంతి పండుగ పరిపూర్ణమైనట్లు భావిస్తారు. వేకువజామున గంగిరెద్దు వాకిట్లోకి వస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మిక. అయితే, గంగిరెద్దులను ఆడించే కుటుంబాలు పొట్టకూటి కోసం ఇతర వృత్తులు ఎంచుకుంటుండగా కొందరు మాత్రం ఇదే వృత్తిగా జీవనం సాగిస్తుండడంతో సంస్కృతి కొనసాగుతోంది. – పాల్వంచరూరల్సంక్రాంతి వస్తుందనగానే గంగిరెద్దుల వాళ్లు డూడూ బసవన్నలను ముస్తాబు చేసి పల్లె, పట్నం తేడా లేకుండా వస్తుంటారు. ఇంటి ముందుకు వచ్చి ‘అయ్యగారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి సలాం చేయ్’ అంటూ వారు చేసే సూచనలతో బసవన్నలు తలాడిస్తుండడం ఆకట్టుకుంటుంది. గంగిరెద్దులను ఆడించే వారి జీవన శైలి విచిత్రంగా ఉంటుంది. తాత, ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్న కొందరికి సొంత ఇళ్లు లేకపోగా, ఊరి చివర డేరాలు వేసుకుని జీవిస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వచ్చే కొద్దోగొప్పో సంపాదనతో పొట్టపోసుకుంటారు. వీరి నెత్తిన తలపాగ, కోరమీసాలు, చెవులకు కమ్మల జోడు, చేతులు, కాళ్లకు కడియాలకు తోడు రంగురంగుల దుస్తులు ధరించి బుర్ర డోలు, శంఖు, సన్నాయి వాయిస్తూ వినూత్నంగా కనిపిస్తారు. గంగిరెద్దుల వారి జీవితాలకు కొన్నేళ్లుగా ఆదరణ కరువైంది. అయినా వృత్తి వీడని పలువురు పండుగ వేళ వేకువజామున చలిలో గంగిరెద్దులతో ఇంటింటికీ వస్తున్నారు. పండుగ సందర్భంగా ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చే వీరు కొద్దిపాటి ఆదాయంతో కొన్నినెలలు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆ తర్వాత కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. ఇంకొందరు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దశదిన కర్మ వంటి కార్యక్రమాలకు కూడా వెళ్తున్నారు. గంగిరెద్దులను నమ్ముకున్న వారు ఉమ్మడి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ తదితర మండలాల్లో జీవనం సాగిస్తున్నారు. ఈమేరకు గంగిరెద్దులు విన్యాసాలు చేసేలా చిరుప్రాయం నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పరుగులు పెట్టించడంతో పాటు సూచన ఇవ్వగానే తల ఊపేలా తర్ఫీదు ఇస్తారు. అంతేకాక కొందరు కింద పడుకుని తమపై గంగిరెద్దు నిలుచునేలా శిక్షణ ఇస్తుండగా.. ఈ విన్యాసాలు గగుర్పాటును కలిగిస్తాయి.గంగిరెద్దులతోనే సంక్రాంతి కళతాత ముత్తాతల నుంచి ఆచారంగా గంగిరెద్దులు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నాం. సంక్రాంతి సమయంలో కొద్దోగొప్ప ఆదాయం వస్తుంది. మిగిలిన రోజుల్లో సాయం దక్కదు. ఇతర పనులు చేయలేక ఇందులోనే కొనసాగుతున్నాం. – వెంకన్న, రాజాపురం -
సెమీఫైనల్స్‌లోనూ మాదే విజయం
సత్తుపల్లి: పదేళ్లు పరిపాలించి ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీ గ్రామపంచాయతీల్లో ఎన్నికల్లో పట్టుమని పది సర్పంచ్ స్థానాలను కూడా గెలుచుకోలేకపోయిందని రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. అయినా సెమీఫైనల్స్‌గా నిలిచే మున్సిపల్ ఎన్నికల్లో ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నా ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సన్మాన సభ మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69శాతం సర్పంచ్ పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కాయని.. కొన్ని చోట్ల అధికార పార్టీలో పోటీతోనే పంచాయతీలు కోల్పోయామని పేర్కొన్నారు. అయితే, ఓడిన సర్పంచ్ అభ్యర్థులు, టికెట్లు రాని వారు నిరుత్సాహపడాల్సిన పని లేదని భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని తెలిపారు. ఇదేసమయాన గెలిచిన సర్పంచ్‌లు పొరపాట్లకు తావివ్వకుండా మంచిగా పని చేయాలని, సమస్యలు ఎదురైతే ఎమ్మెల్యేతో పాటు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు చేజిక్కించుకుంటామని మంత్రి వెల్లడించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ జీపీ ఎన్నికల్లో విజయం స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులతోనే నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తాం తప్ప సిఫార్సులు ఉండవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజాదేవి, ఎండీ.కమాల్‌పాషా, చల్లగుళ్ల నర్సింహారావు, గాదె చెన్నారావు, ఎస్కే. మౌలాలీ, నారాయణవరపు శ్రీనివాస్, పింగళి సామేలు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, తోట సుజలారాణి, శివవేణు, చందు పాల్గొన్నారు. -
‘సీతారామ’తో సస్యశ్యామలం
● మంచుకొండ లిఫ్ట్‌తో రఘునాథపాలెంకు సాగు కళ ● ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల సాక్షిప్రతినిధి, ఖమ్మం/ రఘునాథపాలెం: ‘సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తాం. ఎన్నెస్పీ ఆయకట్టుకు కూడా సీతారామ జలాలు వస్తాయి. మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం ఎన్నెస్పీ నీళ్లు వస్తున్నా.. త్వరలోనే రఘునాథపాలెం మండలానికి సీతారామ ప్రాజెక్టు జలాలు కూడా వస్తాయి’ అని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై రూ.66.33 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ప్రారంభించిన మంత్రి నీటి విడుదల అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రఘునాథపాలెం మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజీతో పాటు ప్రాధాన్యత కలిగిన స్వామి నారాయణ స్కూల్ వచ్చిందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహకానికి ఈ మండలం ఎగువన ఉండడంతో సాగునీటి సౌకర్యం లేనందున ఎత్తిపోతల పథకం నిర్మించామని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో తన చేతుల మీదుగా 300 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు. బుగ్గవాగు ద్వారా గ్రావిటీతో రఘునాథపాలెం మండలంలోని చెరువులకు కూడా నీళ్లు వచ్చేలా పనులు చేపడుతామని.. తద్వారా అటు కృష్ణా, ఇటు బుగ్గవాగు జలాలకు తోడు సీతారామ ప్రాజెక్టు నీరు కూడా వస్తే రఘునాథపాలెం మండలం సాగునీటి కళ సంతరించుకుంటుందని మంత్రి తెలిపారు. గత ఏడాది ఇదేనెల 13వ తేదీన శంకుస్థాపన చేసి మళ్లీ ఇదేరోజు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించిన మంత్రి... సాగుకు జలాలు వచ్చినందున రైతుల ఇళ్లల్లో సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాన్ని యజ్ఞంలా చేశా.. తపస్సులా, యజ్ఞంలా రాజకీయాలు చేశానని మంత్రి తుమ్మల వెల్లడించారు. కులమతాలు, పార్టీలు చూడకుండా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నారు. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో జిల్లా ప్రగతిపథంలో కొనసాగుతోందని చెప్పారు. ఉమ్మడి జిల్లాను సాగులో నెంబర్‌వన్‌గా నిలపడమే తన ఆశయమన్నారు. ఆయిల్‌పామ్ సాగులో మూడేళ్లలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లను తుమ్మల సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేయర్ పునుకొల్లు నీరజ, జల వనరుల శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈలు అనన్య, ఝాన్సీ ఖమ్మం మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, దీపక్‌చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు నాయకులు మానుకొండ రాధాకిషోర్, సాదు రమేష్‌రెడ్డి, తాతా రఘురాం, వాంకుడోత్ దీప్లానాయక్, తుపాకుల యలగొండ స్వామి పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలి
● లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండగా మారుస్తాం ● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ సూపర్‌బజార్(కొత్తగూడెం): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు 42 శాతంగా పెంచాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విస్మరిస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనానికి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే బీసీ సమాజం అడ్డుకొని తీరుతుందని స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్లు పెంచేలా ఈనెల 28నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచి చట్టం చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అకినీడు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు తోట దేవీప్రసన్న, పి.వీరబాబు, మడత వెంకట్‌గౌడ్, మిట్టపల్లి సాంబయ్య, సోమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఐజీ ఫ్లాట్లకు 18వరకు దరఖాస్తుల స్వీకరణ
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం శ్రీరామ్‌నగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన ఎల్ఐజీ ప్లాట్ల కోసం ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ జీవీ.రమణారెడ్డి తెలిపారు. అల్పాదాయ వర్గాలకు మాత్రమే కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తు గడువు పొడిగించామని పేర్కొన్నారు. ఫ్లాట్లకు సంబందించి అప్రోచ్ రోడ్డు సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 18వ తేదీలోగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఆపై 19వ తేదీన బ్లాక్‌ల వారీగా కాకుండా అన్ని ఫ్లాట్లకు కలిపి లాటరీ నిర్వహిస్తామని తెలిపారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు ఖమ్మంరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 18న జిల్లాకు రానుండగా పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఏదులాపు రం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి మార్కెట్ ఆవరణలో హెలీప్యాడ్ నిర్మాణం, సభ నిర్వహణకు ఏర్పాట్లను పోలీసు కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. సీఎం పర్యటనలో భాగంగా ఏదులాపురంలో జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, రూ.25కోట్లతో నిర్మించిన మద్దులపల్లి మార్కెట్ యార్డు, రూ.18కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాలను ప్రారంభించాక మార్కెట్ ఆవరణలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బస్తీ దవాఖానాల్లో నాణ్యమైన సేవలు ఖమ్మం అర్బన్: బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, ఉద్యోగులు పనిచేయాలని డీఎంహెచ్ఓ డి.రామారావు సూచించారు. ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సాఆర్ నగర్‌లోని బస్తీ దవాఖానాను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజువారీ ఓపీ, ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించాక డీఎంహెచ్ఓ మాట్లాడారు. మాతా–శిశు సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ద్వారా ఓపీ సేవలను నిరంతరం నిర్వహించాలని తెలిపారు. అలాగే, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. పురాతన సామగ్రిని పరిశీలించిన ఏడీ నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం వద్ద అభివృద్ధి పనుల సందర్భంగా చేపడుతున్న తవ్వకాల్లో పురాతన కాలం నాటి వస్తువులు బయటపడుతున్నాయి. ఈనేపథ్యాన పురావస్తు శాఖ అిసిస్టెంట్ డైరెక్టర్ డి.బుజ్జి మంగళవారం వీటిని పరిశీలించారు. సామగ్రి ఏ కాలం నాటివి, వాటి ప్రత్యేకతలపై అధికారులతో చర్చించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ బౌద్ధక్షేత్రం వద్ద పనులు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక తవ్వకాల్లో బయటపడిన సామగ్రిని భద్రపరుస్తున్నామని వెల్లడించారు. ఆనందంగా పండుగ జరుపుకోండి ● పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఖమ్మంక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరపున పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా, సాంప్రదాయ రీతిలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్వస్థలాలు, యాత్రలకు వెళ్లే వారు విలువైన వస్తువులను భద్రపర్చుకోవా లని సూచించారు. ఎక్కడైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే స్థానికులు డయల్ 100కి తెలియజేయాలని కోరారు. గాలిపటాలు ఎగురవేసే వారు చైనా మాంజా వినియోగించి ఇతరులకు ముప్పు కలిగించొద్దని సీపీ సూచించారు. -
ఎంవీఐ కార్యాలయాన్ని వైరాలోనే కొనసాగించాలి
వైరా: మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని బోనకల్‌కు తరలించాలనే ఆలోచన మానుకుని వైరాలోనే కొనసాగించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వైరాలోని సీపీఎం కార్యాలయంలో చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణా ల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, టీడీపీ నాయకులు మోత్కూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. వైరా, తల్లాడ, కొణిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, చింతకాని మండలాల వాహనదారులకు వైరా లోనే ఎంవీఐ కార్యాలయం ఉంటేనే సేవలు సులభమవుతాయని తెలిపారు. మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బోనకల్లో సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయించుకునే అవకాశమున్నందున వైరా కార్యాలయాన్ని తరలించొద్దని కోరారు. ఈ సమావేశంలో తాళ్లపల్లి కృష్ణ, బాణాల శ్రీనివాసరావు, షేక్ లాల్ మహ్మద్, శ్రీనివాసరావు, మనుబోలు వెంకటకృష్ణ, ఏదునూరి శ్రీను, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం టూర్.. ఖరారు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న జిల్లాలో పర్యటించనున్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ఆయన... అదేరోజు మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిసింది. అంతేకాక ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇందులో సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభ, పాలేరు నియోజవర్గంలో సీఎం పర్యటన ఖరారైనా, ఉమ్మడి జిల్లా నేతల భేటీపై స్పష్టత రావాల్సి ఉంది. ముందుగానే ఒక విడత.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదలైంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం నేపథ్యాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, ఎన్నికల షెడ్యూల్ రాకముందే పర్యటనలు చేపట్టాలనే భావనతో ఈనెల 16న ఆదిలాబాద్‌లో సీఎం ప్రచారపర్వం మొదలుకానుంది. ఇక ఈనెల 18న ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జరగనున్నందున ఆ సభకు హాజరుకావడంతో పాలేరు నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయాలనే భావనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక విడత సీఎం ప్రచారం చేసినట్లవుతుందనే భావనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. పాలేరులో శంకుస్థాపనలు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి 18వ తేదీన పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, 100 పడకల ఆస్పత్రి నిర్మాణాలకు శంకుస్థాపన చేశాక మద్దులపల్లి మార్కెట్‌ను ప్రారంభిస్తారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉండడంతో సీఎం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు సత్తుపల్లి, వైరా, మధిర, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనేపథ్యాన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పర్యటనలో ఉమ్మడి జిల్లా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమవుతారని తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకోగా, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలని ముఖ్యనేతలకు సీఎం సూచిస్తారని సమాచారం. అయితే, ఈ సమావేశానికి సంబంధించి జిల్లా నేతలకు ఇప్పటివరకైతే అధికారిక సమాచారం అందలేదని తెలిసింది. సీపీఐ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ బాధ్యులు ఉత్సవాల ముగింపు సందర్భంగాఈనెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రముఖులు హాజరవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేసినందున సీఎం రేవంత్‌రెడ్డిని సైతం సీపీఐ నేతలు ఆహ్వానించారు. దీంతో ఆయన సుముఖత తెలపడంతో సీఎం జిల్లా పర్యటన ఖరారైంది.ఈనెల 18న ఖమ్మంకు రేవంత్‌రెడ్డి -
నానాటికీ పెరుగుతున్న నిర్బంధం
● చారిత్రక మలుపుగా నిలవనున్న ఖమ్మం సభ ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఖమ్మంమయూరిసెంటర్: బీజేపీ పాలనలో నిర్బంధం పెరుగుతుండగా, బూటకపు ఎన్కౌంటర్లలో ఓ పక్క హతమారుస్తూనే ప్రశ్నించే వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో నిర్బంధాలకు గురి చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. కాగా, ఖమ్మంలో ఈనెల 18న జరిగే సీపీఐ శత వసంతాల సభ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలవడమేకాక ప్రజా ఉద్యమాలకు కీలక మలుపు కానుందని చెప్పారు. నేరాలు, దోపిడీ రూపు మారినా వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని కూనంనేని స్పష్టం చేశారు. దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత పురోగమనానికి ఊతంగా నిలుస్తుందని తాము భావిస్తుండగా, ప్రజలు సైతం ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. ఈనెల 18న జరిగే సభలో సౌహార్థ సందేశాలు ఇచ్చేందుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారని చెప్పారు. అలాగే, 20న ‘భారతదేశం – వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై జరిగే జాతీయ స్థాయి సెమినార్లో వామపక్షాల నేతలు డి.రాజా, ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్ భట్టాచార్య, జి.దేవరాజన్ తదితరులు పాల్గొంటారని వివరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ కౌన్సిల్ సమావేశాలు కూడా మూడు రోజులు ఖమ్మంలో జరగనున్నాయని కూనంనేని వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చికెన్ ధరలకు రెక్కలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో చికెన్ ధర పెరుగుతోంది. కొద్దినెలల క్రితం కిలో చికెన్(స్కిన్లెస్) ధర రూ.200 ఉండగా, నెల క్రితం రూ.220 నుంచి రూ.250 వరకు పలికింది. ఇక క్రిస్మస్ పండుగ నాటికి రూ.270, ఈనెల మొదట్లో రూ.280కి చేరగా ఇప్పుడు రూ.300, అంతకు మించి ధరతో విక్రయిస్తున్నారు. ఇక స్కిన్‌తో రూ.270, లైవ్ బర్డ్ ధర రూ.150 ఉంటోంది. సంక్రాంతి పండుగ నాటికి ధర పెరుగుతుందని, తెలంగాణ మహాజాతర మేడారం సమయానికి కొండెక్కే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్ వినియోగం పెరిగినా ఆ స్థాయిలో ఉత్పత్తి లేకపోవడం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. రెండు నెలల క్రితం డిమాండ్ లేక.. చికెన్‌కు రెండు నెలల క్రితం డిమాండ్ లేకపోవడంతో పౌల్ట్రీ ఫారాల యజమానులకు నష్టం ఎదురైంది. దీంతో ఆ సమాయన ఉత్పత్తి తగ్గించగా ప్రస్తుతం డిమాండ్ తగినట్లు సరఫరా చేయలేకపోతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం ఆర్డర్లు పెరిగినా ఆ స్థాయిలో ఉత్పత్తి లేక కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. ప్రస్తుతం పండుగలు, శుభకార్యాల కారణంగా చికెన్ వినియోగం పెరిగింది. ఇదే సమయాన పరిశ్రమల వద్ద లైవ్ బర్డ్ ధర పెరగడం చికెన్ ధరపై ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో నిత్యం 80 – 90 టన్నుల వరకు చికెన్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా. జిల్లా కేంద్రంలోనే 30 – 35 టన్నుల వినియోగం ఉంటుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల్లో 60 లక్షలకు పైగా కోళ్లను పెంచేందకు అవకాశం ఉన్నా గత అనుభాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం 30 – 35 లక్షలకు మించడం లేదు. కోళ్ల ఉత్పత్తిలో ప్రధానమైన దాణా, పిల్లల ధరలు పెరగడం కూడా చికెన్ ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు. దాణాలో ప్రధానమైన మొక్కజొన్న వంటి పంటల ఉత్పత్తి తగ్గిపోవటంతో ధర పెరిగింది. ఇక హేచరీస్‌లో కోడి పిల్లకు రూ.25 నుంచి రూ.30 ఉన్న ధర ప్రస్తుతం రూ.40గా పైగా పలుకుతుంది. ఇవేకాక పౌల్ట్రీ ఫారాల నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. చికెన్ ధర బాగా పెరిగింది. కేజీ ధర రూ.300 ఉండడంతో ప్రతీ ఆదివారం కొనలేని పరిస్థితి ఉంది. మరోపక్క మటన్ ధర సామాన్యులకు అసలే అందుబాటులో లేదు. ఇప్పుడు చికెన్ ధర కూడా పెరగడంతో సామాన్యులపై భారం పడినట్టే. – సోమారపు సుధీర్, ప్రకాష్‌నగర్, ఖమ్మం రెండు నెలల క్రితం కోళ్ల ఉత్పత్తి పెరిగి చికెన్ ధరలు పడిపోయాయి. తక్కువ ధరలకు కోళ్లను విక్రయించాల్సి రావడంతో నష్టం కారణంగా ఉత్పత్తి తగ్గించారు. దీంతో ప్రస్తుత డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక చికెన్ ధరపై ప్రభావం పడుతోంది. – రావి బాబూరావు, పౌల్ట్రీ ఫాం యజమాని, ఖమ్మం -
ఉద్యమాలను నడిపించేది కలాలే
ఖమ్మంమయూరిసెంటర్: పీడన, నిర్బంధాల నుంచే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని.. ఆ ఉద్యమాలను నడిపించేది కవుల కలాలేనని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు. ప్రజలే ఇతివృత్తంగా నిర్బంధాలకు వ్యతిరేకంగా వచ్చేదే సరైన కవిత్వమని ఆయన పేర్కొన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం, సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన సోమవారం ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తొలుత 60మంది కవుల రచనలతో రూపొందించిన ‘నూరేళ్ల అరుణ కేతనం’ కవితా సంకలనంతో పాటు అభ్యుదయ రచయితల సంఘం(అరసం) బాధ్యుడు కోంపెల్లి రామయ్య రచించిన ‘నా గమ నం’ కవితా సంపుటిని సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించాక మాట్లాడారు. వెలకట్టలేని త్యాగాలు చేసే కమ్యూనిస్టులు సమాజ మార్పును కోరుకుంటారని తెలిపారు. ‘దొంగ ఓట్లు.. దొంగనోట్లు ఇచ్చు రాజ్య ము, రాజ్యమా?’ అని శ్రీశ్రీ చెప్పినట్లుగా మారిన పరిస్థితుల్లో ఓట్లు, సీట్లతో కమ్యూనిస్టుల బలాన్ని అంచనా వేయలేమని పేర్కొన్నారు. త్యాగధనులు అరుదు కావచ్చు కానీ కరువు లేదని, కమ్యూనిస్టుల రూపంలో త్యాగధనులు సజీవంగానే ఉన్నారని తెలిపారు. కమ్యూనిస్టులకు బలమే లేదంటున్న వారు కమ్యూనిస్టులను చూసి ఎందుకు భయపడుతున్నారని అశోక్‌తేజ ప్రశ్నించారు. మోడీ, అమిత్‌షా ఎందుకు టార్గెట్లు విధించి మరణ శాసనం రాస్తున్నారో చెప్పాన్నారు. పాటకు పదునెక్కువ.. వంద ఉపన్యాసాల కంటే ఓ పాట ప్రజలను ఎక్కువగా ఆలోచింపజేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించేది కళా రూపాలేనని పేర్కొన్న ఆయన సాహిత్యం ప్రజా ఉద్యమాలకు దిక్సూచిగా ఉండాలన్నా రు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యయం అనేక ఒడుదొ డుకులను ఎదుర్కొన్నా అనేక విజయాలను సాధించిందని తెలిపారు. అనంతరం కవులను సత్కరించారు. అరసం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కేవీఎల్, కమిటీ కన్వీనర్ లెనిన్ శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి దండిసురేష్తో పాటు పల్లెర్లవీరస్వామి, రాపో లు సుదర్శన్, నిధి, సాధనాల వెంకటస్వామినా యుడు, రౌతు రవి, మువ్వా శ్రీనివాసరావు, సునంద, కొంపెల్లి రామయ్య, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, జమ్ముల జితేందర్‌రెడ్డి, శింగు నర్సింహారావు, సీహెచ్.సీతామహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వరి పంటకు నీరు అందక రైతుల ఆందోళన
తల్లాడ: ఎన్ఎస్పీకాల్వల ద్వారా పంటలకు సరిపడా నీరు సరఫరా చేయాలని కోరుతూ పలువురు రైతులు నిరసన తెలిపారు. వరిపైరుకు నీరందకు పొలాలు బీటలు వారుతున్నందున వారబందీ విధానం ఎత్తి వేసి నిరాటంకంగా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తల్లాడ మండలం సిరిపురం మేజర్ పరిధి తెలగవరం మైనర్ కాల్వ, రేజర్ల సబ్ మైనర్కాల్వకింద 2,200ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వల పరిధి లో రెండు వేల ఎకరాల్లో నెల నుంచి వరి సాగు చేస్తుండగా నీరందకపోవడంతో రైతులు ఆందోళనకు దిగా రు. బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, గాంధీనగర్‌తండా, రేజర్ల గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ పొలాల్లో కూర్చుని అధికారులు వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఎన్నెస్పీ డీఈ శ్రీనివాసరావు.. ఏఈ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి రైతులతో మాట్లాడారు. ఈనెల 14 నుంచి వారబందీ ప్రకారం తెలగవరం, రేజర్ల సబ్ మైనర్‌కు వరుసగా నాలుగు రోజుల పాటు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. -
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సవారీ
వైరా: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ఇంకొన్ని చోట్ల పెండింగ్ ఉన్నా చాలా ప్రాంతాల్లో మాత్రం రహదారి సిద్ధమైంది. ఈనేపథ్యాన హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న ఏపీ వాసులు పలువురు ఈ రహదారిని ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా వాహనాలు ఖమ్మం మీదుగా మళ్లిస్తుండడంతో వైరా సమీపాన సోమవరం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి చేరుకుంటున్నారు. వైరా నుండి జంగారెడ్డిగూడెం వరకు ఎన్హెచ్ఏఐ అధికారులు వాహనాలను అనుమతిస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నారు. 162.10 కి.మీ. నిడివితో నిర్మాణం ఖమ్మం నుంచి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వరకు యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మిస్తున్నారు. ఈ హైవే పొడవు 162.10 కి.మీ. కాగా, ఖమ్మం జిల్లాలో సుమారు 105 కి.మీ. ఉంది. అయితే, ఖమ్మం సమీపాన మున్నేటిపై వంతెన, ధంసలాపురం వద్ద రైల్వేలైన్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగతాచోట్ల రహదారి, డివైడర్ల నిర్మాణం పూర్తికావడంతో ఇతర పనులను కూడా త్వరగా పూర్తిచేసి ఒకటి, రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. రద్దీ కారణంగా మళ్లింపు ఏపీలో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునే అక్కడి ప్రజలు హైదరాబాద్ నుంచి వేలాదిగా బయలుదేరారు. ఈనేపథ్యాన సూర్యాపేట మీదుగా వెళ్లే రహదారిపై రద్దీ పెరగడంతో అక్కడి పోలీసులు ఏపీలోని పలు ప్రాంతాల వారికి ఖమ్మం మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో సూర్యాపేట మీదుగా ఖమ్మం చేరుకుంటున్న వాహనదారులు బైపాస్ పైనుంచి వైరాకు చేరుకుని మండలంలోని సోమవరం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేకి చేరుతున్నారు. గత మూడు రోజులుగా భారీసంఖ్యలో వాహనాలు గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు వెళ్తున్నాయి. హైవే అధికారికంగా ప్రారంభం కాకపోవడంతో టోల్ గేట్లు కూడా లేనందున ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. -
కంటికి అడ్డుగా కణితి..
తల్లిదండ్రుల వినతితో గ్రామస్తుల చేయూత పెనుబల్లి: కంటికి అడ్డుగా కణితి ఉండటంతో చిన్నారి నరకం చూస్తోంది. ఈ కణితి తొలగింపునకు చేయాల్సిన శస్త్రచికిత్సకు దాతలు సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు గ్రామానికి చెందిన కంచు నాగరాజు – తిరుపతమ్మ దంపతులు కూలి పనులతో జీవ నం సాగిస్తున్నారు. వీరి నాలుగేళ్ల కుమార్తె వర్షిణి ఏడాది వయస్సులోనే కంటి పక్కన కణితి ఏర్పడి పెరుగుతూ వచ్చింది. మందులు వాడినా తగ్గకపోవడంతో ఆపరేషన్ చేయాల ని, అందుకు రూ.5 లక్షలు వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. రోజూ పనికి వెళ్తే తప్ప జీవనం సాగించలేని పేదలు కావడంతో దాతలను ఆశ్రయించగా రూ.66వేలు జమ చేసి కాంగ్రెస్ నాయకుడు అలుగోజు చిన్న నర్సింహాస్వామి చేతుల మీదుగా సోమవారం అందచేశారు. చిన్నారి శస్త్రచికిత్స కోసం అవసరమైన నగదు ఇవ్వాలనుకునే దాతలు 955309 5875 సెల్‌నంబర్‌కు పంపించాలని నాగరాజు దంపతులు కోరారు. చూస్తుండగానే కుప్పకూలిన వ్యక్తి కానిస్టేబుల్ సీపీఆర్ చేసినా దక్కని ఫలితం నేలకొండపల్లి: నేలకొండపల్లిలో ఓ వ్యక్తి అంతా చూస్తుండగా కుప్పకూలగా, ప్రాణాలను కాపాడేందుకు కానిస్టేబుల్ సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ముదిగొండకు చెందిన రమేష్(59) రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత పనులపై సోమవారం నేలకొండపల్లి వచ్చాడు. ఇక్కడ ప్రధాన సెంటర్లో నిలబడి ఉండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ చరణ్‌సింగ్ ఆయనకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
యువత బలోపేతం కావాలి
ఖమ్మం రాపర్తి నగర్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సోమవారం యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వివేకానంద చిత్రపటానికి జిల్లా యువజన, క్రీడా శాఖాధికారి టి.సునీల్‌రెడ్డి స్వామి వివేకానంద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుడి స్ఫూర్తితో యువత స్వశక్తిపై ఆధారపడుతూ బలోపేతం కావాలని, తద్వారా మరికొందరికి అండగా నిలవాలని సూచించారు. క్రీడా శిక్షకులు ఎండీ.గౌస్, మేనేజర్ ఉదయ్‌కుమార్, జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కె.ఉమాశంకర్‌తో పాటు పి.హరిబాబు, షఫీ అహ్మద్, శైలజ, చందన, టి.నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా డెయిరీలో సభ్యత్వం తీసుకోండి
చింతకాని: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులంతా ఇందిరా మహిళా డెయిరీలో సభ్యత్వం కలిగి ఉండాలని డీఆర్డీఓ సన్యాసయ్య సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం జరిగిన చింతకాని, బోనకల్ మండలాల ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డెయిరీ ప్రారంభ దశలో ఉన్నందున మహిళలు సమష్టిగా కష్టపడితే త్వరలోనే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు, సీ్త్ర నిధి బకాయిల వసూళ్లపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఇంకా ఈ సమావేశంలో డెయిరీ ఏపీఓ నర్సింహులు, సీ్త్ర నిధి రీజనల్ మేనేజర్ రవీందర్ నాయక్, డీపీఎం ఆంజనేయులుతో పాటు లింగం వీరమ్మ, నాగపుల్లారావు, వెంకటేశ్వర్లు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలు వెల్లడించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
భార్య సోదరుడిని ఘటనలో భాగం చేసిన ప్రధాన నిందితుడు ఖమ్మంక్రైం: ఖమ్మం కస్పాబజార్‌లో ఈనెల 9వ తేదీన మహిళను హతమార్చినఘటనలో ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశా రు. ఈమేరకు సీఐ కరుణాకర్ వెల్లడించిన వివరాలు.. భద్రాద్రి జిల్లా పాల్వంచ ప్రాంతానికి చెందిన మాడెం ప్రమీల– నరసింహారావు పాల్వంచలోని చాకలి బజార్లో బొమ్మ శ్రావణ్ ఇంట్లో నివాసం ఉండేవారు. వీరిద్దరు విడిపోయా క ప్రమీల భద్రాచలంలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా శ్రవణ్ తరచూ వెళ్లి వచ్చేవాడు. ఈనేపథ్యాన తనతో పాటు పనిచేసే కృష్ణ వద్ద శ్రవణ్‌కు రూ.లక్ష అప్పు ఇప్పించగా ఆ డబ్బు ఎంతకూ ఇవ్వకపోవడంతో అడుగుతుండగా మనస్పర్థలు పెరిగాయి. దీనికితోడు శ్రవణ్ ఆమెను లైంగికంగా వేధిస్తుండడంతో ఖమ్మం వచ్చి బట్టల షాప్‌లో పనిచేస్తూ మేదరబజార్‌లో జీవిస్తోంది. ఈక్రమాన తనను దూరం పెట్టి, నరసింహారావుతో మళ్లీ ఆమె మాట్లాడుతోందని శ్రవణ్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకుని తన భార్య సోదరుడైన గడిదాసు రాజేష్‌ను కలిశాడు. ప్రమీల కారణంగానే తమ సంసారంలో గొడవలు జరుగుతున్నాయని నమ్మించి హత్యకు ఒప్పించా డు. ఈక్రమంలో 9వ తేదీన ఇద్దరూ ద్విచక్రవాహనంపై పాల్వంచ నుంచి ఖమ్మం వచ్చి రాత్రి ఆమె షాపు నుంచి నివాసానికి వెళ్తుండగా అడ్డుకున్నారు. శ్రవణ్ ఆమెను గట్టిగా పట్టుకోగా రాజేష్ కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆపై ఎవరు గుర్తుపట్టకుండా ఆమె వద్ద గుర్తింపు కార్డు, స్మార్ట్ వాచ్, రక్తపు మరకలు అంటిన దుస్తులను తీసుకెళ్లి దూరంగా పడేశారు. అదేరోజు రాత్రి రాజేష్ పోలీసులకు చిక్కగా పరారీలో ఉన్న శ్రవణ్‌ను సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. -
తలసేమియా రహిత సమాజమే లక్ష్యం
ఖమ్మంవైద్యవిభాగం: చిన్నారులు తలసేమియా వ్యాధి బారిన పడకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కృషి చేస్తోందని అధ్యక్షురాలు డాక్టర్ రెహానా బేగం తెలిపారు. ఖమ్మంలో సోమవారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన శిబిరంలో జాతీయ తలసేమి యా వెల్ఫేర్ సొసైటీ వైద్యులు చిన్నారులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెహానా బేగం మాట్లాడుతూ తలసేమియాను అరికట్టడానికి వివాహానికి ముందే అవసరమైన పరీక్షలు చేయించుకునేలా యువతకు అవగాహన కల్పిస్తామని తెలి పారు. ఖమ్మం సీటీసీ అడిషనల్ డీసీపీ విజయ్ బాబు మాట్లాడుతూ చిన్నారులకు అవసరమైన రక్తం శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం జాతీయ తలసేమియా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఎస్.అరోరా మాట్లాడు తూ తెలంగాణలో తలసేమియా చిన్నారులకు అందుతున్న సేవలు అద్భుతమని కొనియాడారు. అలాగే, సంకల్ప సంస్థ చేయూతతో చిన్నారులకు సమయానికి రక్తం, మందులు సమకూర్చడం అభినందనీయమన్నారు. సంస్థ అధ్యక్షురాలు పి.అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరరావుతో పాటు డాక్టర్ డి. నారాయణమూర్తి, డాక్టర్ లక్ష్మీదీప, డాక్టర్ నరేష్, పి.పావని, పి.రవిచందర్, పి.ఉదయ్‌భాస్కర్, పి. వంశీకిరీటి తదితరులు పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా మందులతో ముప్పు
● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● శాటిలైట్ ద్వారా పంటల తెగుళ్ల గుర్తింపు మొదలు రఘునాథపాలెం: పురుగు మందులు, రసాయన ఎరువుల విచ్చలవిడిగా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతినడమే కాక ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఓ రైతుగా యూరియా, పురుగుమందుల అధిక వినియోగానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో రైతులకు డ్రోన్ పరిజ్ఞానంపై సోమవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఎరువులు, పురుగు మందులతో భూమి నిస్సారంగా మారుతున్న నేపథ్యాన ప్రతీ రైతు మట్టి పరీక్షలు చేయించి అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. ఇదే సమయాన సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని తెలిపారు. కాగా, శాటిలైట్ ద్వారా పంటల్లో తెగుళ్లను గుర్తించే ప్రక్రియ కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని, ఆతర్వాత రాష్ట్రమంతా మట్టి ఆరోగ్యాన్ని నమోదు చేసే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక డ్రోన్ల వినియోగంతో అవసరమైన చోట, అవసరమైన మేరకే పురుగు మందులు చల్లడం వల్ల ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఈ విషయంలో కూడా సాంకేతికత ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన రఘునాథపాలెం మండలం రాములు తండా వద్ద రూ.2.50 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పాల్గొనగా మంత్రి మాట్లాడుతూ ఏకగ్రీవంగా పాలకవర్గాలు ఎన్నికై న గ్రామాలకు రూ.10 లక్షల గ్రాంట్ అందిస్తామని తెలిపారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పుల్లయ్య, మధుసూదన్, ఆర్డీవో నర్సింహారావు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ ఆశోక్‌కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు దిరిశాల వెంకటేశ్వర్లు, ప్రియాంక, బానోతు వెంకట్రాం, సాధు రమేష్‌రెడ్డి, తాతా రఘురాం, మందడపు సుధాకర్, తుపాకుల యలగొండ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘ఎత్తిపోతలు’ ప్రారంభం
● ‘మంచుకొండ’తో తీరనున్న రైతుల కల ● కృష్ణా జలాలకు స్వాగతం పలకనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావురఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం వీవీ. పాలెంలో సాగర్ కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10గంటలకు ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభిస్తారు. ఆతర్వాత మంచుకొండ డెలివరీ పాయింట్ వద్ద కృష్ణా జలాలకు స్వాగతం పలికి రైతులతో సమావేశం కానున్నారు. చిరకాల కోరిక ఎత్తిపోతల పథకం నిర్మాణంతో రఘునాథపాలెం మండల రైతుల చిరకాల కల నెరవేరనుంది. సాగర్ ప్రధాన కాలువ పక్కనే ప్రవహిస్తున్నా రఘునాథపాలెం మండలం ఎగువ ప్రాంతంలో ఉండడంతో పంటల సాగుకు భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యాన మండలానికి సాగర్ జలాలు అందించేలా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జనవరి 13న ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయగా శరవేగంతో పనులు పూర్తిచేసి ఈ ఏడాది అదేరోజు ప్రారంభిస్తుండడం విశేషం. శంకుస్థాపన అనంతరం ఆరునెలల్లోనే ప్రాథమిక పనులన్నీ పూర్తిచేసి ట్రయల్‌రన్ విజయవంతంగా చేపట్టారు. ఇప్పుడు సబ్‌స్టేషన్ ఏర్పాటవడంతో మంగళవారం అధికారికంగా ప్రారంభిస్తున్నారు. మండలానికి సాగర్ జలాలు అందించేలా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. విజయవంతం చేయాలి బీడు భూములను పచ్చగా మార్చే లక్ష్యంగా మంత్రి తుమ్మల కృషితో ఎత్తిపోతల పథకం సిద్ధమైందని ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం ప్రా రంభోత్సవ ఏర్పాట్లను సోమవారం పరిశీలించాక ఆయన తుమ్మల యుగంధర్‌తో కలిసి మాట్లాడారు. పథకం ప్రారంభోత్సవానికి రైతులు, ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షుదు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్‌రెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, తాతా రఘురాం, రావూరి సైదబాబు, వాంకుడోత్ దీపక్ పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పాత ఎంపీడీఓ కాంప్లెక్స్ వద్ద మున్సిపల్ కార్యాలయ భవనం, బస్టాండ్ ఎదుట వెజిటబుల్ మార్కెట్, పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, గుర్రాలచెరువు పాత జీపీ కార్యాలయం సమీపాన రోడ్లు, డ్రెయినేజీలకు, ధనికుంట చెరువు వద్ద ట్యాంక్‌బండ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తా రు. ఆతర్వాత నియోజకవర్గంలో నూతనంగా ఎంపికై న సర్పంచ్ల అభినందన సభలో పాల్గొంటారు. అనంతరం దమ్మపేటలో మందలపల్లి క్రాస్ వద్ద డివైడర్లు, సీసీ డ్రెయిన్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత సత్తుపల్లిలో నూతనంగా ఎంపికై న గ్రామపంచాయతీ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొంటారు. రేక్ పాయింట్‌కు 2,680 మె.టన్నుల యూరియా చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఇఫ్కో కంపెనీకి చెందిన 2,680.02 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,610.02 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 450 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 620 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఆయా జిల్లాల గోదాములకు పంపించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు.సీఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మహబూబ్ బోనకల్: కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల(సీఆర్పీ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జానకీపు రం గ్రామానికి చెందిన షేక్మహబూబ్పాషా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో సోమవా రం జరిగిన సీఆర్పీల రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ సీఆర్పీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు అథ్లెట్ల ఎంపికఖమ్మంస్పోర్ట్స్: ఆదిలాబాద్‌లో ఈనెల 18న జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవా రం జరిగిన ఎంపిక పోటీలకు 43 మంది బాలు రు, 39మంది బాలికలు హాజరయ్యారు. అండర్–8బాలుర విభాగంలో ఎం.వివేక్, విశ్వన్, అండర్–10బాలుర విభాగంలో ఎం.పూజిత్, ఇమీష్ప్రీత్, ఉత్తేజ్, అండర్–12 బాలురలో జె. లోకేష్, ఉపేక్షిత్వర్మ, అండర్–14లో కె. వేణు, తీమంత్, అండర్–20 విభాగంలో కె.మస్తాన్ ఎంపికయ్యారు. ఇక బాలికల విభాగంలో అండర్–10 నుంచి డి.లలిత, ఆర్.లికిత, తరుణి, అండర్–12లో జి.భాగ్యలక్ష్మి, బి.రుతిక, భవిత, అండర్–14లో ఎస్.భార్గవి, టి.రేష్మ, కె.సంజన, అండర్–20లో హర్షిత, ఓ.బింద్య ఎంపికయ్యారు. ఈ ఎంపిక పోటీలను కోచ్ గౌస్, తదితరులు పర్యవేక్షించారు. మధిరలో దొంగల హల్చల్ మధిర: మధిరలో పలు చోట్ల ఆదివారం రాత్రి చోరీలు జరగడం స్థానికుల్లో కలకలం రేపుతోంది. ఆజాద్ రోడ్డులో ఓ వ్యక్తి ఇటీవల కొనుగో లు చేసిన ఆటో చోరీ దుండగులు అదే ఆటోలో రాయపట్నం సెంటర్లోని కూల్‌డ్రింక్ షాప్‌లో రూ.10వేల నగదు, సిగరెట్ పెట్టెలు, కూల్‌డ్రింక్ బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అలాగే, అంబేద్కర్ సెంటర్, పాత ఆంజనేయస్వామి టెంపుల్ ఏరియాల్లోని పలుషాపుల్లో చోరీ జరగగా బాధితులు సోమవారం మధిర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుల గుర్తింపునకు చర్యలు చేపట్టామని సీఐ రమేష్ తెలిపారు. చెట్టును ఢీకొట్టిన కారు : మహిళ మృతి తిరుమలాయపాలెం: బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై కుమారుడి కారులో వస్తున్న మహిళ కొద్ది సేపట్లో ఇంటికి చేరుతుందనగా ప్రమాదంలో మృత్యువాత పడింది. ఖమ్మం శాంతినగర్‌కు చెందిన సయ్యద్ రజియాసుల్తానా(61) తన కుమారుడు రఫీయుద్దీన్తో కలిసి వరంగల్‌లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అక్కడి నుంచి ఆదివారం రాత్రి ఇంటికి వస్తుండగా మండలంలోని పాతర్లపాడు స్టేజీ వద్ద కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొట్టింది. ఘటనలో రజియాకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తిరుమలాయపాలెం పోలీసులు తెలిపారు. -
జిల్లాలో 9,844 మె.టన్నుల యూరియా
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. అన్ని మండలాల్లో రైతులకు యూరియా సాఫీగా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నందున రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. వేగంగా బౌద్ధక్షేత్రం అభివృద్ధి పనులు నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రంలో అభివృద్ధి పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా వేగంగా చేపడుతున్నట్లు పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ తెలిపారు. బౌద్ధక్షేత్రం వద్ద జరుగుతున్న పనులు, ఇటీవల బయటపడిన పురాతనకాలం నాటి మట్టి కుండను పరిశీలించాక ఆయన మాట్లాడారు. క్షేత్రం వద్ద తవ్వకాల్లో లభించే సామగ్రిని భద్రపరుస్తుండగా, అభివృద్ధి పనుల సమయాన ఆనవాళ్లకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్మాణాలు ఆనాటి రూపంలోనే చేపట్టేలా నిపుణుల సలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్లునర్సింగ్ నాయర్, శంకర్‌తో పాటు స్థానికులు పసుమర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మామిడి రైతులకు రాయితీపై కవర్లు ఖమ్మంవ్యవసాయం: మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు పండ్ల నాణ్యత దెబ్బతినకుండా కాపాడుకునేలా రాష్ట్రప్రభుత్వం 50శాతం రాయితీపై కవర్లు అందిస్తోందని జిల్లా ఉద్యానాధికారి ఎంవీ.మధుసూదన్ తెలిపారు. తెగుళ్లు సోకి కాయలు పాడు కాకుండా, పక్షులు, కోతుల రక్షించుకునేలా ఈ కవర్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఒక కవర్ ధర రూ. 2.50లు కాగా రాయితీపై రూ.1.25కు ప్రభుత్వం అందిస్తుందని, ఎకరాకు 8వేల కవర్ల చొప్పున గరిష్టంగా ఐదెకరాలకు వరకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ఉద్యానవన అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాలేరు నియోజవర్గ రైతులు 89777 14104 నంబర్లో, ఖమ్మం నియోజకవర్గంతో పాటు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల రైతులు 89777 14103లో, మధిర నియోజకవర్గ రైతులు 89777 1413, వైరా నియోజకవర్గంతో పాటు సత్తుపల్లి, వేంసూరు మండలాల రైతులు 89777 14114 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. వైభవంగా శ్రీనివాస కళ్యాణం వేంసూరు: సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు జరిపించారు. వేంసూరు మండలం గూడురు దాసాంజనేయ స్వామి ఆలయ ప్రాగణంలో సోమవారం తాతా మోహన్‌రావు ఆధ్వర్యాన ఈ కల్యాణ వేడుక నిర్వహించారు. తొలుత గ్రామ దేవతలకు 108 బిందెల జలాలతో అభిషేకం చేశారు. అనంతరం టీటీడీ అర్చకులు పరుచూరి మాదావచార్యులు, వ్యాఖ్యాత శ్రీమన్నారాయణ ప్రసాదాచార్యుల ఆధ్వర్యాన స్వామి కల్యాణం జరిపించారు. సీఐ లక్ష్మణరావుతో పాటు సరిత, చెన్నారావు, అశోక్, యేలాద్రి, అయ్యదేవర సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం మార్కెట్‌కు సెలవులు ఖమ్మంవ్యవసాయం: సంక్రాంతి పండుగ, వారాంతం సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు ప్రకటించారు. ఈనెల 14న బుధవారం భోగి, 15న గురువారం మకర సంక్రాంతి, 16న శుక్రవారం కనుమతో పాటు 17న శనివారం, 18న ఆదివారం వారాంతపు సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. తిరిగి 19వ తేదీ సోమవారం నుంచి పంటల క్రయవిక్రయాలు జరుగుతాయని మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్‌లో మహిళలకు పెద్దపీట
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మం రూరల్/కొత్తగూడెంఅర్బన్/పాల్వంచరూరల్ : మహిళా సాధికరతే లక్ష్యంగా, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదేసమయాన కాంగ్రెస్ పార్టీలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సాయిప్రభాత్నగర్తో పాటు కొత్తగూడెం, పాల్వంచలో సోమవారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను ఆయన ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, తన సతీమణి మాధురితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వాతావరణం ఉట్టిపడేలా మహిళలు అందమైన ముగ్గులు వేశారని అభినందించారు. అలాగే, భద్రాద్రి డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవీప్రసన్న ప్రమాణ స్వీకారంలో కూడా మంత్రి పాల్గొని మాట్లాడారు. దేవీప్రసన్న నియామకంతో తమ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు మంజూరు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యుత్ వినియోగదారులకు లేఖలు
● రాయితీల వివరాలతో డిప్యూటీ సీఎం పేరిట ముద్రణ ● లబ్ధిదారులకు అందిస్తున్న ఉద్యోగులురఘునాథపాలెం/ఖమ్మం వ్యవసాయం: విద్యుత్ రాయితీ పొందుతున్న లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరిట నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా, రాయితీపై విద్యుత్ అందించే గృహజ్యోతి, వ్యవసాయ వినియోగదారులకు డిస్కం సంస్థల ద్వారా ఈ లేఖల పంపిణీ మొదలైంది. వినియోగదారులతో ప్రత్యక్ష బందాలను బలోపేతం చేసుకోవడం కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. వినియోగదారుల పేరు, సర్వీస్ నంబర్ పొందుపర్చిన లేఖలను వారి ఇళ్లకు వెళ్లి డిస్కం అధికారులు, ఉద్యోగులు అందజేస్తున్నారు. జిల్లాలో లేఖల పంపణీని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సోమవారం రఘునాథపాలెం మండలం వీవీ.పాలెంలో ప్రారంభించారు. జిల్లాలోని గృహజ్యోతి వినియోగదారులకు 2,46,855 సర్వీసుల ద్వారా రూ.200.53 కోట్ల సబ్సిడీ అందుతుండగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం ద్వారా 1,18,231 సర్వీసులకు రూ.619.55 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందని ఎస్ఈ తెలిపారు. వీవీ.పాలెంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ కాపా ఆదినారాయణ, గ్రామ కార్యదర్శి కృష్ణ, ఏఈ నాగేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. ● విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరుతో ముద్రించిన లేఖల పంపిణీ సోమవారం జిల్లాలో మొదలైంది. ఇందులో ఉచిత, సబ్సిడీ విద్యుత్ వివరాలతో పాటు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ లేఖలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి కూడా ఎస్ఈ శ్రీనివాసాచారి, అధికారులు అందించి సత్కరించారు. -
బీఆర్ఎస్ హయాంలోనే మధిర అభివృద్ధి
మధిర: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మధిర మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నా రు. మధిరలోని పార్టీ కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా మధిరలో జరిగినా అభివృద్ధి కానరావడం లేదని తెలిపారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురైనా మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇదే స్ఫూర్తి మున్సిపల్ ఎన్నికల్లో నమోదు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లడమే కాక భట్టి సంతకంతో కూడిన గ్యారంటీ కార్డు ఇచ్చిన విషయాన్ని వివరించాలని తెలిపారు. దీని స్థానంలో బాకీ కార్డు ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. కాగా, మధిరలో 100 పడకల ఆస్పత్రిని బీఆర్ఎస్ హయాంలో నిర్మిస్తే ఇప్పుడు ప్రా రంభించి క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని నామా ఎద్దేవా చేశారు. తొలుత టీడీపీ నాయకులు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరాగా వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు.మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు -
వనరుల సద్వినియోగమే లక్ష్యం
నా భర్త ప్రభుత్వ ఉపాధ్యాయు డు. ఆయన సేవాగుణం స్ఫూర్తితో టీటీసీ పూర్తి చేసిన నేను పజ్రలకు సేవా చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. సింగరేణి షేప్ నిధులతో గ్రామంలో రహదారులు, భవనాలు నిర్మించారు. ప్రభుత్వం మంజూరు చేసే ప్రతీ పైసా గ్రామస్తులకు ప్రయోజనం చేకూర్చేలా వార్డు సభ్యులు, గ్రామపెద్దల సలహాలతో సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. యువత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రతీ గ్రామసభకు వారిని ఆహ్వా నించి మేథావులతో వారిలో చైతన్యం కల్పిస్తాం. – భూక్య అనూష, రొంపేడు సర్పంచ్, ఇల్లెందు మండలం -
ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
నూరుశాతం ఆదివాసీలు ఉంటున్న మా పంచాయతీలో యువతను సన్మార్గంలో నడిపించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచారు. ఎంఏ బీఈడీ పూర్తి చేసిన నేను యువత విద్యాభివృద్ధి కోసం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు బడిఈడు పిల్లలందరూ బడికి వెళ్లేలా చైతన్యం కల్పిస్తాం. పంచాయతీకి మంజూరయ్యే ప్రతీపైసా వినియోగంలో గ్రామస్తులను భాగస్వాములను చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. – ముక్తి రమేష్, మర్రిగూడెం సర్పంచ్, ఇల్లెందు మండలం -
అభివృద్ధిలో ఖమ్మం ముందంజ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడిఖమ్మం అర్బన్: నివాసయోగ్య నగరంగా రాష్ట్రంలోనే ఖమ్మం ముందు వరుసలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 54వ డివిజన్లో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పార్కును మెరుగైన నిర్వహణతో పాటు సీసీ కెమెరాలు, గ్రాస్ కార్పెట్ వంటి అదనపు సౌకర్యాలతో మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. రోడ్లను ఆక్రమించకుండా ప్రజలు సహకరించాలని, పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రోడ్ల విస్తరణతో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధితో పాటు వ్యాపారాలు మెరుగుపడతాయని తెలిపారు. రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. జాతీయ రహదారులు ఖమ్మం మీదుగా వెళ్తున్నాయని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ ఖమ్మాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర జనాభా ఐదు లక్షలకు చేరిందని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు, డ్రెయిన్లు, రోడ్లు, పేదలకు ఇళ్లు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ రూ.93.70 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ పార్క్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో ఫుట్‌పాత్‌లు, పార్కుల నిర్మాణం సహా అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంత రావు, కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల నరేంద్ర, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈ ధరణికుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, సాధు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
హస్తగతమే లక్ష్యంగా...
యువత విజేత.. నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇటీవల ఎన్నికై న యువ సర్పంచ్‌లపై ప్రత్యేక కథనం. ● కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ● మున్సిపోల్స్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల నజర్ ● ఒక్కో వార్డుకు ఐదుగురి పేర్లతో జాబితా ! ● షెడ్యూల్ వెలువడగానే అభ్యర్థుల ప్రకటన సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఒక దఫా సమావేశం నిర్వహించారు. వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూడా ఆయా మున్సిపాలిటీలపై నజర్ పెట్టారు. జిల్లాలోని సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, మధిర, కల్లూరు మున్సిపాలిటీల్లో పోటీకి కాంగ్రెస్ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కో వార్డుకు ఐదుగురు చొప్పున ఆశావహుల జాబితా తయారీకి కసరత్తు సాగుతోంది. అభ్యర్థుల గుర్తింపు పూర్తి చేశాక షెడ్యూల్ వెలువడిన వెంటనే బరిలో ఉండేదెవరో ప్రకటించనున్నారు. ఎన్నికలు జరిగే సత్తుపల్లి, వైరా, మధిర, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలపై ముగ్గురు మంత్రులు దృష్టి సారించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికలపై కసరత్తు చేశారు. అలాగే రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న ఈ రెండేళ్ల కాలంలో మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన రహదారులు, డ్రెయినేజీలు, వీధిదీపాలు, తాగునీటి పైపులైన్ల వంటివి ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అన్వేషణ ప్రారంభించింది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతుండడంతో అభ్యర్థి గుర్తింపు మరికొంత అనుకూలంగా మారుతుందనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఆర్థిక, అంగ, జనబలం ఉన్నవారి కోసం వెదుకులాట ప్రారంభించింది. అన్ని రకాలుగా అనుకూలమైన అభ్యర్థులు దొరికితే వారినే బరిలో దింపాలని నిర్ణయించింది. మంత్రులతో పాటు సత్తుపల్లి, వైరా, కల్లూరు మున్సిపాలిటీల ఎన్నికలపై ఆయా ఎమ్మెల్యేలు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితోపాటు ఐదుగురి చొప్పున కో ఆర్డినేషన్ కమిటీలు వేశారు. వీరి నేతృత్వంలో వార్డుల వారీగా అభ్యర్థుల గుర్తింపు చేపడుతున్నారు. ఒక్కోవార్డుకు ఐదుగురు ఆశావహులను ఎంపిక చేసి, ఆ జాబితాను పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు, మంత్రులకు అందజేస్తారు. దీంతో ఆశావహులు తమ బలాబలాలను కమిటీలకు తెలియజేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ పరిణామాలతో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికే కీలకమని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం ఆశావహుల జాబితాలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ కానీ, నోటిఫికేషన్ కానీ విడుదల కాలేదు. అయితే అందరికన్నా ముందుగానే ఆ పార్టీ అభ్యర్థుల వేట ప్రారంభించింది. నోటిఫికేషన్ వెలువడేలోపు వార్డుల్లో నియమించిన కమిటీలు ఐదుగురు ఆశావహులతో జాబితా తయారు చేయనుండగా.. అభ్యర్థుల ప్రకటనకు మాత్రం సమయం పట్టనుంది. కమిటీలు పంపిన జాబితాను పరిశీలించి నోటిఫికేష న్ వెలువడిన వెంటనే అన్ని అర్హతలు గల వారిని ప్రకటించాలని పార్టీ యోచిస్తోంది. -
నిజాయతీ పాలన అందిస్తా..
తొలి ప్రయత్నంలోనే సర్పంచ్‌గా ఎన్నికవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎంబీఏ పూర్తి చేశాను. గ్రామంలోని యువత అందరి ప్రోత్సాహంతో అవినీతికి తావు లేకుండా నిజాయతీ పాలన అందిస్తా. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మహనీయులు చెప్పిన మాటలు నిజం చేసే దిశగా తొలి అడుగు వేశాను. వచ్చే ఐదేళ్లలో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, డ్రెయినేజీలు, అంతర్గత సిమెంట్‌రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తా. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు సాయశక్తుల కృషి చేస్తా. – బొడ్డు రోజాలక్ష్మి, సర్పంచ్, బుగ్గపాడు, సత్తుపల్లి మండలం -
చికిత్స పొందుతున్న కూలీ మృతి
రఘునాథపాలెం: కడుపునొప్పి తాళలేక పురుగులమందు తాగిన కూలీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆదివారం రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌షరీఫ్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా దవరికు గ్రామానికి చెందిన అరవింద్ హరిరాథోడ్ (36) కూలీ పనుల నిమిత్తం భార్య అర్చనభాయ్తో కలిసి ఏటా రఘునాథపాలెం మండలం పుఠానితండాకు వస్తున్నాడు. ఈ క్రమంలో అరవింద్ రోజూ అధికంగా మద్యం సేవించేవాడని, తరచూ కడుపునొప్పి వస్తోందని భార్య వద్ద డబ్బులు తీసుకెళ్లి మద్యం తాగేవాడని తెలిసింది. శనివారం మధ్యాహ్నం తీవ్రంగా కడుపునొప్పి వస్తోందని వైద్యుడికి చూపించుకుంటానని భార్య అర్చన వద్ద రూ.500 తీసుకుని వెళ్లిన అరవింద్.. రాత్రి వచ్చాడు. పురుగులమందు వాసన రావడంతో భార్య విచారించగా.. పురుగులమందు తాగినట్లు చెప్పాడని, వెంటనే ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. కోడిపందేల స్థావరంపై దాడులుతల్లాడ: మండలంలోని బాలాపేట శివారులో కోడిపందేల స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు. నిందితుల నుంచి రూ.19,050నగదు, 4కోళ్లు, 12కత్తులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించా రు. కోడి పందేల నిర్వాహకుడు వేముల శ్రీనుపై గతంలో కూడా ఇలాంటి కేసు లు ఉన్నట్లు గుర్తించామని, ఇతడిపై సస్పెక్ట్ షీట్ తెరుస్తామని ఎస్ఐ వివరించారు. సీపీ ఆదేశాల మేరకు గతంలో కోడి పందేలు, జూదం నిర్వహించిన వారిని గుర్తించి బైండోవర్ చేస్తునట్లు పేర్కొన్నారు. ఈజీ మనీ పేరుతో మోసంకారేపల్లి పోలీసులకు ఏపీవాసుల ఫిర్యాదు కారేపల్లి: ఈజీగా మనీ సంపాదించటంఎలా..? ఏటీఎం (ఎనీటైంమనీ) పేరుతో ఆన్లైన్లో 3 నెలల కోర్సు నేర్పిస్తా మని నమ్మబలికి, కోర్సు కోసం ఫీజు వసూలు చేసి తర్వాత తప్పించుకు తిరుగుతున్న ఓ యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన 9 మంది యువకులు ఆదివారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం కారేపల్లిలో నివాసం ఉంటున్న సదరు యూట్యూబర్ ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, ఆందోళనకు దిగారు. ‘బిగ్గెస్ట్ స్కామర్ ఇన్ తెలంగాణ స్టేట్.. బానోత్ సాయినాథ్’అని ఫ్లెక్సీలో రాశారు. సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు ఆందోళనకారులకు సర్దిజెప్పారు. ఎస్ఐ బి.గోపిని వివరణ కోరగా.. ఆంధ్ర నుంచి 9 మంది యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని, యూట్యూబర్ వద్ద నుంచి తమ డబ్బులు ఇప్పిస్తేచాలని తెలిపారని చెప్పారు. బాధితులను ఆంధ్రలోని తమ పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని సూచించానని పేర్కొన్నారు. -
మాంజా మనకొద్దు..
ఖమ్మంగాంధీచౌక్: సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ఈ పండగ వేళ పిల్లలు మొదలు యువత, పెద్దల వరకు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పిల్లలు సంక్రాంతి పండుగను పతంగుల పండగ అని కూడా పిలుచుకుంటారు. సరదాగా ఎగుర వేసే ఈ గాలిపటాలను కొందరు పందేలుగా, పోటీలతో ఎగుర వేస్తున్నారు. ఈ పందేలు, పోటీలు ఎదుటి వారి గాలి పటాలను తెంచే విధంగా సాగుతున్నాయి. నూలు వంటి దారాలతో ఎగుర వేసే ఈ పతంగులను కాల క్రమంలో మాంజాలతో ఎగుర వేస్తున్నారు. చైనాలో నైలాన్, సింథటిక్ దారంతో ఈ మాంజాను తయారు చేస్తారు. ఈ మాంజా తయారీలో గాజును వాడుతారు. చైనా మాంజాలు పర్యావరణంతోపాటు మనుషులు, పక్షులు, జంతువుల ప్రాణానికి హానికరం. దీంతో ఈ మాంజాలను నిషేధించారు. అయినప్పటికీ ఈ మాంజాను వివిధ పరిశ్రమల్లో వినియోగం పేరిట విక్రయిస్తూనే ఉన్నారు. గుజరాత్, ఢిల్లీ, సూరత్, మీరట్, ముంబై ద్వారా దేశవ్యాప్తంగా విక్రయాలు జరుగుతున్నాయి. మాంజా నిషేధం ఉన్నప్పటికీ ఇక్కడ సంక్రాతి వేళ ఉన్న డిమాండ్ ఆధారంగా రహస్యంగా విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. నిషేధంపై ప్రచారం జాతీయ హరిత ట్రిబ్యునల్, తెలంగాణ ప్రభుత్వం సింథటిక్/గ్రాసుతో తయారు చేసిన మాంజాలను నిషేధించింది. ఈ మాంజాలను తయారు చేసినా, విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వ శాఖలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. పోలీస్ శాఖ ఇప్పటికే మాంజాల విక్రయాలు, వినియోగంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో అక్కడక్కడా మాంజాలను గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మన జిల్లాలో అటవీ శాఖ మాంజాల నిషేధంపై రూపొందించిన పోస్టర్ల ద్వారా ప్రచారం సాగిస్తోంది. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ పక్షులకు, మానవాళికి ప్రమాదకరమైన, ప్రాణహానిని తలపెట్టే మాంజాలను వినియోగిస్తే చట్టపరమైన చర్య లు, శిక్షలు ఉంటాయని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రమాకరమైన మాంజాలను విక్రయించినా, వినియోగించినా కమాండ్ కంట్రోల్ నంబర్ 08742 295323కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రధానంగా తల్లితండ్రులు పిల్లలు గాలిపటాల కొనుగోళ్లు, ఎగుర వేయడంపై దృష్టి సారించాలని సూచించారు. -
సేవా సంకల్పంతో ముందుకు..
ప్రజాసేవలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేసిన నా మామయ్య, మాజీ సర్పంచ్ తమ్మినేని నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. బీటెక్ పూర్తి చేసిన నేను ఆధునిక విధానాలు, కొత్త ఆలోచనలతో గ్రామాభివృద్ధికి పాటుపడి గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా చూస్తాను. నిధులను సద్వినియోగం చేస్తూ.. పాలక మండలి సభ్యులను సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. – తమ్మినేని ప్రియాంక, చింతగుర్తి సర్పంచ్, రఘునాథపాలెం మండలం -
నేడు నృసింహస్వామి గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన ‘స్వాతి’ సందర్భంగా ప్రతీ నెల నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో బాగంగా సోమవారం సాయంత్రం 5:30 గంటలకు నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(గుట్ట) చుట్టూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ధనుర్మాస ఉత్సవాల నేపథ్యంలో ఉదయం స్వామి వారికి శ్రీ పుష్పయాగం చేస్తారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ గావిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు కొండపై ఉన్న ప్రత్యేక వేదికపై భక్తుల కరతాళ ధ్వనుల మధ్య అర్చకులు స్వాతి నక్షత్ర జ్యోతిని వెలిగిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్ రావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. నేడు ఉమ్మడి జిల్లాలో పొంగులేటి పర్యటనఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిప్రభాత్ నగర్లో పర్యటించనున్నారు. 2.15 గంటలకు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ, 3.40 గంటలకు కొత్తగూడెంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు డీసీసీ అధ్యక్షురాలు దేవీప్రసన్న ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. 5.45 గంటలకు పాల్వంచ, 6.45 గంటలకు కొత్తగూడెంలో పర్యటిస్తారు. రాత్రి 9.30 గంటలకు కల్లూరు మండలం నారాయణపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. ప్రశాంతంగా టెట్ఖమ్మం సహకారనగర్ : టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఆదివారం రెండు సెషన్లలో ప్రశాంతంగా జరిగింది. మొదటి సెషన్లో 1,070 మందికి గాను 949 మంది, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 1,264 మందికి గాను 1,027 మంది అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ చైతన్య జైనీ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ‘నూరేళ్ల అరుణ కేతనం’ ఆవిష్కరణఖమ్మంమయూరిసెంటర్ : నూరేళ్ల అరుణ కేతనం కవితా సంకలనాన్ని సోమవారం ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించనున్నారు. ఖమ్మం డీపీఆర్సీ భవనంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నవచేతన విజ్ఞాన సమితి సభ్యులు బాగం హేమంతరావు, అభ్యుదయ రచయితల సంఘం బాధ్యులు పల్లేరు వీరస్వామి, రాపోలు సుదర్శన్, కేవీఎల్తో పాటు జిల్లాకు చెందిన సాధనాల వెంకటస్వామినాయుడు, మువ్వా శ్రీనివాసరావు, లెనిన్ శ్రీనివాస్, రౌతు రవి, కొంపెల్లి రామయ్య, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, రవిమారుత్, సీతారాం, ప్రసేన్, ఐ.వి. రమణారావు తదితరులు హాజరు కానున్నారని నిర్వాహకులు వెల్లడించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ కవితా సంకలనాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ‘వనజీవి’ స్ఫూర్తితో మొక్కలు నాటాలి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వనజీవి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నిర్మిస్తున్న బయోపిక్‌లో భాగంగా హైదరాబాద్ ముచ్చింతల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వనజీవి పాత్రధారిగా నటిస్తున్న బ్రహ్మాజీతో కలిసి మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక చైతన్యం కలిగించే మంచి కార్యక్రమాల వైపు ప్రజలను మళ్లించే సినిమాలు నేటి తరానికి ఎంతో అవసరమని తెలిపారు. అలాంటి సినిమా కేవలం వినోదమో, సరదానో కాకుండా విజ్ఞానాన్ని, సమాజానికి మంది సందేశం అందించేలా ఉండాలన్నారు. వనజీవి రామయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమా తీయడం అభినందనీయమని తెలిపారు. -
అమ్మా.. నాకు దిక్కెవరు..
ఖమ్మంక్రైం : చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు.. తల్లితోనే తన జీవితం, తల్లి వెంటే తాను అన్నట్టుగా గడిపాడు. తినడానికి తిండి, ఉండడానికి గూడు కూడా లేదు. దీంతో తన కొడుకు పస్తులుండకుండా ఆ తల్లి నిత్యం భిక్షాటన చేస్తూ బాలుడి కడుపు నింపేది. అయితే ఆ చిన్నారిపై విధి వక్రీకరించింది. యాచనతో తన కడుపు నింపే తల్లిని కూడా దూరం చేసింది. విషాదకరమైన ఈ ఘటన ఖమ్మం రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మోతె లక్ష్మి( 40), లక్ష్మణ్ దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు. ఐదేళ్ల క్రితం లక్ష్మణ్ అనారోగ్యంతో మృతిచెందడంతో కుమారుడు కిట్టూను పోషించేందుకు లక్ష్మి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో కొడుకుతో సహా ఖమ్మం వచ్చి కూలీ పనులు చేస్తూ కాలం గడుపుతుండగా ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో భిక్షాటన చేస్తూ కిట్టూను పోషించేది. కాగా, ఆమె పరిస్థితి విషమించి ఆదివారం ఖమ్మం రైల్వే స్టేషన్లో తనువు చాలించింది. ఈ విషయం తెలియని తొమ్మిదేళ్ల కిట్టూ తల్లిని ఎంత లేపినా లేవకపోవడంతో బిగ్గరగా రోదిస్తుండగా ప్రయాణి కులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే లక్ష్మి మృతిచెందింది. పక్కనే కూర్చుని రోదిస్తున్న కిట్టూను వివరాలు అడగగా తన పేరు, వివరాలు తెలిపాడు. తనకు ఒక మేనత్త ఉందని, ఆమె ఆచూకీ తెలియదని చెప్పాడు. దీంతో బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించిన పోలీసులు బంధువుల ఆచూకీ కోసం కోదాడ పోలీసులను సంప్రదించారు. అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు సాయంతో మృతదేహన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు.తల్లి మృతదేహం వద్ద బాలుడి రోదన -
హరిదాసు వేషధారణతో ప్రచారం
కూసుమంచి: రహదారి ప్రమాదాల నివారణ, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేట జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ హరిదాసు వేషధారణతో అవగాహన కల్పించారు. ఆదివారం కూసుమంచిలో ఆయన ‘నో డ్రగ్స్.. సేవ్ లైఫ్’ నినాదంతో ప్రచారం చేపట్టారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కన్న తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తున్నారని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో పయనించాలని, ఆందుకు వారిలో మానసిక పరివర్తన కలగాలని పేర్కొన్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణకు బాధ్యత తీసుకోవాలన్నారు. కాగా, సమాజ హితానికి పాటుపడుతున్న ఆయన్ను పలువురు ఈ సందర్భంగా అభినందించారు. -
సామాజిక మార్పుకు యువతే శక్తి..
ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న నేను యువతే సామాజిక మా ర్పుకుశక్తి అన్ననమ్మకంతో ప్రజా సేవ కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. ఎలాంటి పైరవీలు, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను. బుగ్గవాగుపై వంతెన నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడంతో పాటు మంత్రి తుమ్మల, మండల అధికారుల సహకారంతో పెద్దగా గుర్తుంపులేని మా గ్రామానికి ప్రత్యేకత చాటేలా ప్రయత్నిస్తా. – భూక్యా రమణ, వీఆర్ బంజర్ సర్పంచ్, రఘునాథపాలెం మండలం -
కబడ్డీ విజేత ‘రాజస్తాన్’
పినపాక: జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాజస్తాన్ జట్టు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో తెలంగాణ జట్లు నిలిచాయి. ఈ నెల 7 నుంచి మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో నిర్వహిస్తున్న 69వ జాతీయస్థాయి అండర్ –17 కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఫైనల్స్‌లో తలపడిన రాజస్తాన్ – ఉత్తరప్రదేశ్ జట్లు 28 పాయింట్లతో సమానంగా నిలవగా, ఎంపైర్లు ఇరుజట్లతో మాట్లాడి చెరో ఐదు రైడ్స్ కల్పించారు. ఉత్తరప్రదేశ్ జట్టు 5 రైడ్స్‌లో నాలుగు పాయింట్లు సాధించింది. రాజస్తాన్ జట్టు 6 పాయింట్లు సాధించి రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానం దక్కించుకుంది. అంతకుముందు మూడో స్థానం కోసం తెలంగాణ – హరియాణా జట్లు పోటీపడ్డాయి. అయితే ఈ పోటీ ప్రారంభం నుంచీ వివాదాస్పదంగానే సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలబడి సమాన పాయింట్లు ఉన్న సమయంలో.. ఎంపైర్లు తెలంగాణ జట్టుకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ హరియాణా జుట్టు కోర్టు నుంచి నిష్క్రమించింది. దీంతో తెలంగాణ జట్టును విజేతగా ప్రకటించడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. క్రీడల నిర్వహణలో తలెత్తిన వివాదాలు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు ఆదివారం వివాదాల మధ్య ముగిశాయి. రాజస్తాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ జట్లలో కొందరు అనర్హులు ఉన్నారని ఫిర్యాదులు అందగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులు, డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి, డీఈవో నాగలక్ష్మి విచారణ చేపట్టారు. వేలిముద్రలు, బరువు తదితర వివరాల ఆధారంగా కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ జట్లలో ఒక్కొక్కరు అనర్హులున్నట్లు గుర్తించారు. వారిని తొలగించి, తిరిగి పోటీలు నిర్వహించారు. సెమీఫైనల్లో హరియాణాపై రాజస్తాన్ విజయం సాధించింది. విజేతలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, జాతీయ క్రీడల సమైక్య పరిశీలకుడు నిర్మల్ జాందే ట్రోఫీ, మెమెంటోలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ నాగలక్ష్మి, బీటీపీఎస్ సీఈ బుచ్చన్న, కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది విశ్వభారత్ రెడ్డి, మౌరీ టెక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
మెగా వైద్యశిబిరం విజయవంతం
కల్లూరురూరల్: మండలంలోని చండ్రుపట్లలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. గ్రామానికి చెందిన కాటంనేని ముత్తయ్య, ద్రౌపది జ్ఞాపకార్థం ప్రముఖ లాయర్ కాటమనేని రమేశ్ లండన్‌లో డాక్టర్‌గా స్థిరపడిన కాటమనేని రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం నిర్వహించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, పీడియాట్రీషియన్, చర్మవ్యాధి, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్‌కు సంబంధించి రోటరీక్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, హాస్టల్ ప్రైమ్ హాస్పిటల్స్ హైదరాబాద్, బసవతారకం కేన్సర్ ఆస్పత్రుల వైద్య నిపుణులచే ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించి మందులు పంపిణీ చేశారు. చండ్రుపట్లతో పాటు రఘునాథబంజరు, రఘునాథగూడెం, కల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. సామాజిక సేవలో పాల్గొనాలి.. సామాజిక సేవ కార్యక్రమాల్లో వైద్యులు భాగస్వాములు కావాలని కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్ కోరారు. చండ్రుపట్లలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించిన కాటమనేని రమేశ్, కాటమనేని రవీంద్రకుమార్‌ను అభినందించారు. ఏసీపీ వసుంధరయాదవ్ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాటమనేని విజయలక్ష్మి, వల్లభనేని భాస్కర్‌రావు, రాధాకృష్ణ, రవి పాల్గొన్నారు. పరిశీలించిన సబ్ కలెక్టర్ అజయ్, ఏసీపీ వసుందర -
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి..
గతేడాది డిగ్రీ పూర్తి చేసిన నన్ను గ్రామస్తులే సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ప్రోత్సహించి గెలిపించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామంలో రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ లైటింగ్, కల్వర్టు నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ, ఐటీడీఏ జీపీఎస్ పాఠశాలకు కొత్త భవనం కోసం ఇటీవల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారెకు విన్నవించాం. సమగ్ర అభివృద్ధి కోసం ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. పురోగతి సాధించాలంటే యువతను చైతన్యవంతులుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – చిప్పల పండురెడ్డి, మొద్దులమడ సర్పంచ్, అశ్వారావుపేట మండలం -
మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు
దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించారు. మండలంలోని గండుగులపల్లిలో ఉన్న మంత్రి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని స్థానాల్లోను కాంగ్రెస్ పార్టీ గెలిచేలా ప్రణాళికలు రూపొందించాలని, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రంగా జనార్ధన్ రావు, మురళీకృష్ణ, ముళ్లపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ప్రైడ్ ఆఫ్ భారతరత్న అవార్డు బహూకరణకల్లూరు రూరల్ : వినూత్న బోధనా పద్ధతులు అవలంబించడంతో పాటు సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం ఎండీ మౌలాలిని ప్రైడ్ ఆఫ్ భారతరత్న అవార్డు వరించింది. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు అవార్డు ప్రదానం చేశారు. గణిత బోధనలో వినూత్న పద్ధతులు, ప్రత్యేకంగా మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో గణిత భయాన్ని తొలగించినందుకు గాను ఈ అవార్డు బహూకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, తెలుగు సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి.రామకృష్ణ గౌడ్, జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ శ్రీనివాసరాజు ఈ అవార్డును అందజేశారు. వంతెనపై ట్రాఫిక్ జామ్వైరారూరల్: మండలంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ స్తంభించింది. వైరా వైపు నుంచి తల్లాడ వైపు వెళ్తున్న ఒక భారీ వాహనం వంతెనపైకి రాగానే ముందు టైరు పంక్చర్ కావడంతో ఆగిపోయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా సుమారు అటు, ఇటు కిలో మీటర్ మేర ట్రాఫి క్ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంక్చర్ అయిన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మూడేళ్ల తర్వాత కుటుంబం చెంతకు.. ఖమ్మంఅర్బన్: మూడేళ్ల కిందట తప్పిపోయిన ఓ వృద్ధురాలు.. ఆదివారం తిరిగి కుటుంబం చెంతకు చేరింది. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు పరిసర ప్రాంతాల్లో 2023 జూలైలో సుమారు 70 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధురాలు తిరుగుతుండగా కానిస్టేబుల్ ఇచ్చిన సమాచా రం మేరకు అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు ఆశ్రమానికి తరలించి వైద్య చికిత్స అందించా రు. ఇటీవల కోలుకున్న వృద్ధురాలు తన పేరు మధు వెంకటలక్ష్మి అని.. వివరాలు చెప్ప డంతో అన్నంఫౌండేషన్ సిబ్బందిఇంటర్నెట్ ద్వారా ఆచూకీ గాలించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశంజిల్లా, కంభం మండలం అని గుర్తించి, అక్కడి ఎస్ఐకి వా ట్సాప్ ద్వారా ఫొటో, వివరాలు పంపించారు. అక్కడి పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యుల ఆచూకీ లభించింది. వీడియో కాల్ ద్వారా తల్లిని గుర్తించిన చిన్న కుమారుడు చిన్న గురవయ్య తన చెల్లెలితో కలిసి ఖమ్మం చేరుకొని, ఆధార్‌కార్డు తదితర ఆధారాలు చూపించడంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు వెంకటలక్ష్మిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
హెచ్డబ్ల్యూవోస్ ఫోరం ఆధ్వర్యాన ముగ్గుల పోటీలు
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ల (టీహెచ్డబ్ల్యూవో) ఫోరం ఆధ్వర్యాన శనివారం ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంపు ఎస్సీ బాలుర కాంప్లెక్స్ వసతిగృహం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడు కోటపాటి రుక్మారావు ఆధ్వర్యాన జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని మహిళా వసతిగృహ సంక్షేమ అధికారులు పాల్గొనగా విజేతలకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమంలో హెచ్డబ్ల్యూవోలది కీలకపాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్, హెచ్‌డబ్ల్యూవోల ఫోరం బాధ్యులు ఎర్ర రమేశ్, లలితకుమారి, తాళ్లూరి శ్రీకాంత్, రాధికారెడ్డి, మృదుల, ఎన్.విజయ, ఎన్.నాగేశ్వరరావు, ఎం.కోమలి, సీహెచ్.నాగమణి, పి.మాధురి, సరస్వతి, అస్రపు నిషాబేగం, సునీత, వరలక్ష్మి, వినోద, పూలన్‌దేవి, అనీపూన్, శ్రీలత, శివ, స్టాలిన్, కరుణాకర్, నరేశ్, శ్రీనుబాబు, సిబ్బంది అంజమ్మ, తిరుపతిరావు, అజారుద్దీన్, నరేశ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
పందెం పిలుస్తోంది..
సత్తుపల్లి: సంక్రాంతి పండుగ వస్తుందంటే.. కోడి పందేల సందడే సందడి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర, వైరా నియోజకవర్గాలు ఏపీకి సరిహద్దుగా ఉండడంతో చాలామంది పందేలు చూసేందుకు వెళ్తుంటారు. ఇదే సమయాన పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే బిర్రులను సత్తుపల్లి పరిసర ప్రాంత వాసులే ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. కొందరు ఏపీలోని నూజివీడు సమీపాన మీర్జాపురంలో బిర్రు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద బిర్రుగా ప్రచారం జరుగుతోంది. క్రికెట్ స్టేడియాన్ని తలపించేలా చేపట్టిన నిర్మాణం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీవీఐపీల కోసం సోఫాలు, గ్లాస్ ఫిటింగ్‌తో ఏసీ చాంబర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఏలూరు జిల్లా దెందులూరులో మినీ స్టేడియంతో పాటు వీఐపీల కోసం ఏసీ కంటెయినర్లు సిద్ధం చేసినట్లు సమాచారం. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో రాత్రి పందేలు కొనసాగేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారని సమాచారం. రూ.25 లక్షల నుంచి.. ఈసారి కోడి పందేలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మీర్జాపురంలో రూ.25 లక్షల పందేలు, రూ.9 లక్షలు, రూ.6 లక్షల బిర్రులు నడిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దెందులూరు, విస్సన్నపేటలో కూడా రూ.5 లక్షలకు తగ్గకుండా పందేలు వేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రా ప్రాంతంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఉండకపోవడంతో సురక్షితంగా పందేలు వేయొచ్చు, చూడొచ్చనే భావనతో పలువురు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కాగా, జూదరులు పలువురు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తూ ఏ సమయాన, ఏ నక్షత్రంలో ఏ రంగు పుంజు పొడుస్తుంది.. యజమాని పేరులోని మొదటి అక్షరాన్ని అనుసరించి ఏ పుంజుపై పందెం కాస్తే గెలుస్తామో చూసుకుంటారు. రూ.కోట్లలో పేకాట కోడి పందేల మాటున రూ.కోట్లలో పేకాట నడుస్తుందని ప్రచారం. కోడి పందేలు ఓ ఎత్తయితే రాత్రి, పగలు తేడా లేకుండా విద్యుత్ జనరేటర్లు అమర్చి మరీ లోనా.. బయట పేకాట నిర్వహిస్తుండటంతో రెప్పపాటులోనే రూ.కోట్లు చేతులు మారి జూదరులు వీధినపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కాకుండా గుండు పట్టాలతో జూదం నిర్వహిస్తారు. పండుగ మూడు రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడురోజులు పందేలకు అడ్డూ అదుపు ఉండదు. సంకలో కోడి పుంజు పట్టుకొని పరుగులు పెడుతూ జూదరులు కన్పిస్తుంటారు. ఆంధ్రా సరిహద్దులోని మామిడితోటలు చిన్న పందేలకు నిలయంగా మారుతాయి. పందేల స్థావరాల వద్దే మద్యం, బిర్యానీ, మాంసం విక్రయాలు సాగుతుంటాయి. సంక్రాంతికి వచ్చేయండి.. -
గణనకు సిద్ధం
● జంతు సర్వేకు అటవీ శాఖ సన్నాహాలు ● జిల్లా అడవిలో ఈనెల 20 నుంచి 25 వరకు లెక్కింపు ● అటవీ శాఖ సిబ్బందితోపాటు ఔత్సాహిక వలంటీర్లకూ అవకాశం ● ఎప్పటికప్పుడే ఏఐటీఈ యాప్‌లో నమోదుపాల్వంచరూరల్: పులులు, జంతువుల లెక్క తేల్చేందు కు అటవీశాఖ సిద్ధమైంది. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలోని పాల్వంచ అభయారణ్యం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు అటవీ డివిజన్లలో 24 రేంజ్‌ల పరిధిలోని 700 బీట్లలో 1,200 మందితో లెక్కింపునకు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్ వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో గణన చేపడతారు. పులులతోపాటు శాకాహార, మాంసాహార జంతువులెన్ని ఉన్నాయనే వివరాలు సైతం సేకరిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి ఈ సర్వే నిర్వహిస్తారు. లెక్కింపు ఇలా.. ప్రతీరోజు బీట్‌కు ఇద్దరు చొప్పన ఐదు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ లెక్కిస్తుంటారు. నిర్దేశించిన బీట్‌లో ఏడు రోజులపాటు పులుల పాదముద్రలు, పెంటికలు, వెంట్రుకలు తదితర గుర్తులు సేకరించిన తర్వాత జంతువుల గణన చేపడుతారు. ఈ లెక్కింపు ఆధారంగానే భవిష్యత్‌లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పులులు, జంతు గణన సందర్భంగా సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఏఐటీఈ(ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్) యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో పొందుపరుస్తారు. సర్వే సిబ్బందికి టీషర్టులు, క్యాప్లతో పాటు ఓ కిట్గ్యాగ్ ఇస్తారు. అందులో పేపర్, పెన్ను, జిప్‌లాక్(ఆనవాళ్ల సేకరణకు ఉపయోగించే పదార్థం) ఉంటాయి. కాగా, సర్వేపై సిబ్బందికి మరోసారి అవగాహన కల్పించేందుకు ఈనెల 12న అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో రేంజర్లతో, 17న కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని గట్టుమల్ల బీట్‌లో స్థానిక సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆభయారణ్యంలో పెరిగిన జంతువులు కిన్నెరసాని అభయారణ్యంలో జీవవైవిధ్యంతో పాటు జంతువుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండడంతో వాటి సంతతి పెరుగుతోంది. గత జంతుగణన సమయంలో ఎలుగుబంట్లు 412, చుక్కుల దుప్పులు 4,278, కొండగొర్రెలు 659, అడవి పిల్లులు 674, అడవిగేదెలు 1,892, కణుజులు 508తో పాటు తోడేళ్లు, నక్కలు, కుందేళ్లు, అలుగు, మూషిక జింకలను గుర్తించారు. కాగా, ఒకప్పుడు అభయారణ్యంలో ఐదు పులు లు, 14 చిరుతలు ఉండగా అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఒక పులి మాత్రమే సంచరిస్తోంది. ఈ ఏడాది లెక్కింపు పూర్తయితే కానీ ఏయే జంతువులు ఎన్ని ఉన్నాయనే వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక మూషిక జింకలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే సంచరిస్తున్నాయని గుర్తించిన అటవీ శాఖ వాటి సంరక్షణకు చర్యలు చేపడుతోంది.జిల్లాలోని 550 బీట్లలో పులు లు, జంతు గణనను పకడ్బందీగా నిర్వహించబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా 75 నుంచి 100 మంది వలంటీర్లను తీసుకుంటున్నాం. ఈ గణనలో అటవీ సిబ్బంది 900 మంది పాల్గొంటారు. వీరికి తోడుగా బేస్ క్యాంప్ సిబ్బంది, వాచర్లు ఉంటారు. డీఆర్ఓలు, బీట్ అధికారులు, వలంటీర్లు బీట్‌కు ఇద్దరు చొప్పున ప్రతీ రోజు 5 కిలోమీటర్ల చొప్పున లెక్కిస్తారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు లెక్కించి, ఆ తర్వాత యాప్‌లో నమోదు చేస్తారు. –జి.కృష్ణాగౌడ్, భద్రాద్రి డీఎఫ్ఓ -
పతంగుల దుకాణాల్లో తనిఖీ
సత్తుపల్లిటౌన్/ముదిగొండ: చైనా మాంజాను నిషేధించిన నేపథ్యాన సత్తుపల్లిలోని పలు దుకాణాల్లో శనివారం అటవీ శాఖాధికారులు తనిఖీ చేశారు. పతంగులు ఎగుర వేసేందుకు చైనా మాంజా వాడితే వన్యప్రాణులతో పాటు ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని రేంజర్ స్నేహలత తెలిపారు. ఈ మేరకు కాటన్ దారాలనే పతంగులకు వాడాలని స్పష్టం చేశారు. ఎవరైనా చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌ఓలు నర్సింహ, నాగరాజు, బీట్ ఆఫీసర్లు చెన్నకేశవరెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, ముదిగొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని కిరాణా, ఫాన్సీ షాపుల్లో ముదిగొండ సీఐ ఓ.మురళి ఆదేశాలతో ఎస్ఐ అశోక్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఎవరు కూడా చైనా మాంజా అమ్మొద్దని, అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామని అవగాహన కల్పించారు. -
నమ్మకం పేరిట నయవంచన
ఖమ్మంక్రైం: భర్తకు దూరమైన మహిళకు సోదరుడిలా అండగా ఉంటానని నమ్మంచి.. సాయం చేస్తున్నట్లు నటించాడు. ఆ వ్యక్తి అసలు స్వరూపం తెలియక ఆయన వ్యాపారం కోసమంటూ సదరు మహిళ డబ్బు, బంగారం ఇవ్వడమే కాక మరికొందరి నుంచి అప్పులు ఇప్పించింది. ఆపై ఆయనలో మృగం మేల్కొనడంతో ఇది తప్పు అని వారించినా వినకపోగా ఊరు మారినా విడవకుండా మరో వ్యక్తితో కలిసి దారుణంగా హతమార్చాడు. ఖమ్మంలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.భర్తతో విభేదాలు సృష్టించి..కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన ప్రమీల (35) తల్లిదండ్రులు మృతి చెందటంతో భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం రేగళ్లలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంది. అదే ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ మాడెం నరసింహారావుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2010లో వివాహం చేసుకుని పాల్వంచలో నివాసం ఉన్నారు. అక్కడ నరసింహారావు స్నేహితుడైన బొమ్మ శ్రావణ్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయనను ప్రమీల అన్నయ్య అని పిలిచేది. కొంతకాలానికి నరసింహారావు దంపతుల మధ్య విబేధాలు రాగా ఇందుకు శ్రావణే కారణమని తెలిసింది. ఆపై ప్రమీల భద్రాచలంలో ఇల్లు అద్దెకు తీసుకుని బట్టల దుకాణంలో పనిచేసేది. అక్కడకు వెళ్లే శ్రావణ్ సోదరుడిలా అండగా ఉంటానని నమ్మించడంతో ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బుతో పాటు మరికొందరి దగ్గర అప్పు ఇప్పించింది. ఆ తర్వాత ప్రమీలపై కన్నేసిన ఆయన దంపతుల మధ్య అగాధం మరింత పెంచడంతో ఆమె మార్పును కనిపెట్టి హెచ్చరించింది. ఆపై భద్రాచలంలో పోలీస్‌స్టేషన్‌లో శ్రావణ్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రమీల భద్రాచలం నుంచి పండితాపురంలోని బాబాయి, పిన్ని వద్దకు, అనంతరం ఖమ్మం వచ్చి కస్బాబజార్లోని షాపింగ్ మాల్లో పనిచేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఆమైపె కక్ష పెంచుకున్న శ్రవణ్ తన బావమరిది, కొత్తగూడెంలోని రామవరం వాసి, రౌడీషీటర్ అయిన రమేశ్‌తో శుక్రవారం ఖమ్మం వచ్చాడు. రాత్రి ఆమె షాపింగ్ మాల్ నుంచి హాస్టల్‌కు వెళ్తుండగా దూరంగా నిల్చుని రమేశ్‌ను ముందుకు పంపించినట్లు తెలిసింది. అక్కడ రమేశ్ ఆమెతో గొడవ పడి గొంతుతో పాటు పలుచోట్ల పొడవగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. అయితే, చాలాసేపు ఆమె తనను హత్య చేయొద్దని రమేశ్, శ్రావణ్‌ను బతిమాలినట్లు సమాచారం. ఆ సమయాన వచ్చిన ఓ వృద్ధురాలిని సైతం నిందితులు బెదిరించినట్లు తెలిసింది. చిన్న గల్లీ కావడంతో హత్య విషయం ఆలస్యంగా బయటపడగా ఏసీపీ రమణమూర్తి, వన్‌టౌన్ సీఐ కరుణాకర్ చేరుకుని పారిపోయిన రమేశ్‌ను జూలురుపాడు వద్ద అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ్ కోసం గాలిస్తున్నారు. ప్రమీల మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించగా ఆమె భర్త శ్రీనివాసరావు పాల్వంచకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాడు. కాగా, ఖమ్మంలో మహిళల హత్యలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఐద్వా నాయకులు మార్చురి వద్ద ఆందోళన చేపట్టారు. -
ఖో–ఖో జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక
కల్లూరు: కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో శనివారం ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఖో–ఖో బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు 78 మంది బాలురు, 60 మంది బాలికలు హాజరుకాగా ఖో–ఖో అసోసియేషన్ బాధ్యుల పర్యవేక్షణలో జట్ల ఎంపిక కొనసాగింది. కాగా, క్రీడాకారులకు పరిపూర్ణ కిషోర్‌రెడ్డి భోజనం, పీఈటీ నరాల సాంబశివరెడ్డి, బానోతు చిరంజీవి క్రీడాకారులకు దుస్తులు సమకూర్చారు. కార్యక్రమంలో ఖో–ఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీర రాఘవయ్యతో పాటు సున్నం ప్రసాద్, కృష్ణయ్య, వెంకటేశ్వరరావు, కాంట్రాతి రాధాకృష్ణ, తలపరెడ్డి గౌతమ్‌రెడ్డి, ఎం.గోపాల్, నవీన్, పాషా,కోటి, అనంతలక్ష్మి, తులసి పాల్గొన్నారు. అయ్యప్ప శోభాయాత్రకు రాష్ట్రవాసుల ఎంపిక ఖమ్మంఅర్బన్: కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆభరణాల శోభాయాత్రలో పాల్గొనే అవకాశం తెలంగాణ నుంచి పలువురు భక్తులకు దక్కింది. అలంగాడ్ యోగం ట్రస్ట్ ఆధ్వర్యాన నిర్వహించే యోగం పెట్ట పురప్పడ్ శోభాయాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి 25 మందిని ఎంపిక చేసినట్లు అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ రాష్ట్ర అధ్యక్షుడు, అలంగాడ్ యోగం ట్రస్ట్ పోషకుడు టీ.వీ.పుల్లంరాజు తెలిపారు. అలువాలోని మణప్పురం మహాదేవుడి ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర ఎరుమేలి వరకు కొనసాగుతుందని వెల్లడించారు. శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయానికి కానుకలను ఊరేగింపుగా తీసుకువెళ్లే ఈ సంప్రదాయాన్ని పెట్ట పురప్పడ్గా వ్యవహరిస్తారని తెలిపారు. సర్కారు బడుల మూసివేతకు కుట్ర ● ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ భద్రాచలంటౌన్: రేషనలైజేషన్ సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. భద్రాచలంలో శనివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధుల కోత, ఖాళీల భర్తీ చేపట్టకుండా పేదలకు విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ – 2025 బిల్లుతో విద్యను కాషాయీకరణ చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణను ప్రతీ ఒక్కరు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎం.రామాచారి, అధ్యక్షుడిగా జి.హరిలాల్, ప్రధాన కార్యదర్శిగా వి.వినోదిని, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు వై.అశోక్‌కుమార్, ఎ.సోమయ్య, కె.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా సంజయ్టేకులపల్లి : బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ (బీఏఎన్ఏఈ ) జాతీయ ఉపాధ్యక్షుడిగా మండలంలోని బోడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోత్ సంజయ్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం నవీ ముంబైలో జరిగిన ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎన్నుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. సంజయ్ హైదరాబాద్‌లోని ఏఐఎంఎల్ వొక్సెన్ యూనివర్సిటీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు. హోటల్లో చోరీ తిరుమలాయపాలెం: మండలంలోని కేశ్వాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న హోటల్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పిండిప్రోలుకు చెందిన ఉడుగుల భిక్షం హోటల్ నిర్వహిస్తుండగా, సమీప బంధువు మృతి చెందడంతో శుక్రవారం వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వచ్చాడు. అప్పటికే హోటల్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో పరిశీలించగా నగదు, మద్యం బాటిళ్లు, సిగరెట్లు చోరీ అయినట్లు గుర్తించారు. సుమారు రూ.15 వేల విలువైన సామగ్రి చోరీ అయినట్లు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేడే తుది పోరు
పినపాక: మండలంలోని ఈ–బయ్యారంలో జరుగుతున్న జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆయా మ్యాచ్‌ల్లో జట్లు హోరాహోరీగా పోటీపడగా తెలంగాణ, హరియాణా, ఉత్తరప్రదేశ్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఆదివారం సెమీఫైనల్లో ఉత్తర్‌ప్రదేశ్‌తో తెలంగాణ తలపడనుంది. కాగా, క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడిన ఆంధ్రప్రదేశ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. చిరుజల్లులతో నిలిచిన ఆట క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటక – రాజస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే, ఆ సమయాన చిన్నపాటి వర్షం జల్లు పడడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆదివారం ఉదయం ఈ రెండు జట్ల నడుమ క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించి గెలిచిన జట్టుతో హరియాణా జట్టుకు సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో గెలిచిన జట్టుకు యూపీ – తెలంగాణ మధ్య జరిగే సెమీస్‌లో విజేతతో ఫైనల్స్ నిర్వహించాకవిజేత ఎవరో తేలనుంది. ఒక్క పాయింట్‌తో సెమీస్‌కు దూరం క్రీడల్లో ఒక్క పాయింట్ కూడా ఎంత ముఖ్యమో కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. అదే పరిస్థితి శని వారం తమిళనాడు జట్టుకు ఎదురైంది. హరి యాణా – తమిళనాడు జట్లు క్వార్టర్స్‌లో హోరాహోరీగా తలపడ్డాయి. తమిళనాడు 50 పాయింట్లు చేయగా హరియాణా 51 పాయింట్లు సాధించడంతో సెమీస్ కు దూసుకెళ్లింది. ఒక్క పాయింట్ తేడాతో ఓడిన తమిళనాడు సెమీస్ అవకాశాలు దూరం చేసుకున్నట్లయింది. కాగా, టోర్నీ తుది దశకు చేరడంతో అభిమానులు తెలంగాణ జట్టుకు ఈలలు, కేకలతో మద్దతు తెలుపుతున్నారు. కాగా, పంజాబ్‌పై గెలిచి సెమీస్‌కు చేరిన తెలంగాణ జట్టు క్రీడాకారులు సంబురాలు చేసుకున్నారు. -
రెండేళ్లలో రూ.12 కోట్ల నిధులు
● మీటర్ గ్యాప్ లేకుండా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మం అర్బన్: పాలేరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఖమ్మం కార్పొరేషన్ విద్యానగర్ కాలనీ అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.12 కోట్ల నిధులు మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంకా అవసరమైన నిధులు మంజూరు చేసి మీటర్ ఖాళీ లేకుండా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యానగర్ కాలనీలో రూ.4 కోట్ల నిధులతో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ఏర్పడి పదేళ్లు దాటినా గత పాలకులు అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.కోట్లాది నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల జారీతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడగా కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, ఆర్డీఓ జి.నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ డి.సైదులు, నాయకులు మద్దినేని బేబీస్వర్ణకుమారి పాల్గొన్నారు.ఖమ్మంరూరల్: కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ఏదులాపురం మున్సిపాలిటీ గొల్లగూడెంలో రూ.42.26 కోట్లు, పెదతండాలో రూ.14కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ అభివృద్ధి పనులపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్‌బాబు, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ పి.రాంప్రసాద్, నాయకులు బండి జగదీష్, తోట చినవెంకటరెడ్డి, చింతమళ్ల రవికుమార్, బండి సతీష్, వెంపటి రవి, ధరావత్ రాంమ్మూర్తినాయక్, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
గోకులరామంలో రామయ్య ‘విలాసం’
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం విలాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పగల్ పత్తు, రాపత్తు సేవలు పూర్తయ్యాక స్వామికి వివిధ ప్రాంతాల్లో మూడు రోజులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. తొలిరోజు శనివారం ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న గోకుల రామంలో నేత్రపర్వంగా జరిపించారు. స్వామివారిని ప్రత్యేక వాహనంలో కొలువుదీర్చి మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ వేడుకగా గోకులరామం వేదికపైకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, హారతి సమర్పించారు. మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన.. అంతరాలయంలోని మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాతసేవ, సేవా కాలం, ఆరాధన చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణం నిర్వహించారు.వైభవోపేతంగా ప్రారంభమైన విలాసోత్సవాలు -
కొత్త.. కిలకిలలు
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధి పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, చంద్రుగొండ మండలాల్లో 35వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పులిగుండాల అటవీ ప్రాంతం(కనకగిరి గుట్టలు)లో అరుదైన పక్షులు ఆవాసం ఏర్పాటుచేసుకున్నాయి. భిన్నమైన వృక్షాలు, మొక్కలే కాక జలపాతాలు, జలాశయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాక మచ్చల జింకలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, సాంబార్ వంటి జంతువులతో పాటు అరుదైన పక్షి జాతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. భిన్నమైన పక్షి జాతులు పులిగుండాల అటవీ ప్రాంతంలో వాతావరణం, వృక్ష సంపద, నీటి వనరుల కారణంగా భిన్నజాతుల పక్షులు జీవనం సాగిస్తున్నాయి. కొన్ని స్థిరనివాసం ఏర్పాటుచేసుకోగా, మరికొన్ని పక్షులు సీజన్ల వారీగా వచ్చివెళ్తున్నాయని గుర్తించారు. ఆగ్నేయాసియా, ఈశాన్య భారత దేశంలో మాత్రమే నివసించే ప్లమ్ హెడెడ్ పారకీట్(చిలుక జాతి) పక్షిని ఈ అడవుల్లో ఇటీవల గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా అడవుల్లో నివసించే షిక్రా పక్షి కూడా సంచరిస్తున్నట్లు తేలింది. ఇవికాక ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ పక్షి ఇక్కడ తరచుగా కనిపిస్తోంది. కామన్, వైట్–త్రోటెడ్, పైడ్, బ్లూ– ఎర్ట్ కింగ్ఫిషర్లు కూడా ఉన్నాయి. పెద్దనీటి పక్షులుగా చెప్పుకునే హెరాన్లు ఇక్కడి సరస్సుల్లో కనిపిస్తున్నాయి. వీటిలో పర్పుల్ హెరాన్, గ్రే హెరాన్లు ఉన్నాయి. ఇంకా టికెల్స్ బ్లూ ఫ్లై క్యాచర్, ఏషియన్ బ్రౌన్ ఫ్లై క్యాచర్ వంటి పేర్ల కలిగిన పక్షి జాతులు ఉన్నట్లు నిపుణులు, అటవీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు సైబేరియా నుంచి ఆస్ప్రె(గద్ద జాతి) పక్షులు, యూరప్ నుంచి నాలుగు రకాల గోరింకలు చలికాలంలో వచ్చి ఫిబ్రవరిలో వెళ్తుంటాయని తేలింది. పక్షి వీక్షణ కేంద్రంగా అభివృద్ది పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేస్తూనే అరుదైన పక్షులు ఉన్నందున పక్షి వీక్షణ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. మిరాకీ, అటవీ బర్డ్స్ ఎన్జీవోస్ సంస్థలు ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. చలికాలంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఇక్కడ మకాం వేసి అత్యాధునిక పరికరాలతో పక్షులను పరిశీలిస్తూ అందులో అరుదైన రకాలను గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యాన సాధారణంగా ఉండే పక్షులతో పాటు మొత్తంగా 370 రకాల పక్షులు ఈ అడవుల్లో ఉన్నట్లు మిరాకీ సంస్థ బాధ్యులు చెబుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు పక్షులు, జంతువులకు ఆవాసంగానే కాక ప్రత్యేక అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో పులిగుండాలకు సందర్శకులు పెరుగుతున్నారు. ఈనేపథ్యాన పక్షులు, జంతుల ప్రేమికుల కోసం అటవీ అధికారులు బర్డ్ వాక్, నేచర్ వాక్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బర్డ్ వాక్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 60మందికి హాజరయ్యారు. ఈ ప్రాంతం 27 కి.మీ. రహదారితో ఉండడంతో సఫారీ వాహనాలను సమకూర్చగా, బోటింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది.వైట్ త్రోటెడ్ కింగ్ఫిషర్బ్లాక్ వింగ్డ్ సిల్ట్ఏసియన్ బ్రౌన్ ఫ్లై క్యాచర్అరుదైన పక్షుల ఆవాసంగా పులిగుండాల భిన్నమైన పక్షులు, వన్యప్రాణులతో పాటు వివిధ రకాల వృక్ష జాతులతో ప్రత్యేకతను సంతరించుకున్న పులిగుండాల అటవీ ప్రాంతం అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టాం. అటవీ ప్రాంతం, జలాశయాలు ఉన్నందున భిన్నమైన పక్షులు ఆవాసం ఏర్పాటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నిపుణులు పరిశోధనలు చేస్తుండగా పక్షి వీక్షణ కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నాం. – సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీ అధికారి -
నేటి నుంచి మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం 54వ డివిజన్ వీడీవోస్ కాలనీలోని ఎన్టీఆర్ పార్క్ ను మంత్రి ప్రారంభిస్తారు. అలాగే, సోమవారం ఉదయం రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో వ్యవసాయ స్ప్రేయర్ డ్రోన్ల అవగాహన సదస్సులో పాల్గొన్నాక రాములు తండాలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక 13వ తేదీ మంగళవారం ఉదయం రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెం గ్రామంలో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి, పథకం డెలివరీ పాయింట్ వద్ద రైతులతో సమావేశమవుతారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు ఖమ్మంక్రైం: పక్షులు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను పతంగులు ఎగురవేసేందుకు విక్రయించినా, వినియోగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ హెచ్చరించారు. చైనా మంజా(సింథటిక్, దారం, గాజుపొడి) చాలా ప్రమాదకరమని తెలిపారు. దీని కారణంగా మనుషులు, పక్షులు ప్రమాదంలో పడుతున్నందున నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు విక్రయ, వినియోగదారులకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ పంచామృతంతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆతర్వాత పల్లకీసేవ చేశారు. ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టసవరణలపై 20న నిరసనలు ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంత పేదల కోసం కాంగ్రెస్ హయాంలో రూపొందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ గాంధీ పేరును తొలగించడమే కాక చట్టసవరణతో పేదలకు పథకాన్ని దూరం చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు 20వ తేదీన జిల్లాలో నిరసనలు చేపడతున్నట్లు తెలిపారు. ఆరోజు జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు వడ్డేబోయిన నరసింహా రావు, దొబ్బల సౌజన్య, ముల్లపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా సాధనలో ప్రభుత్వం విఫలం
పాల్వంచ: రైతాంగానికి కావాల్సిన యూరియా కొరత కేంద్రం సృష్టిస్తే, కేంద్రంపై పోరాడి సరిపడా యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసి అధికారిలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా నేటీకి పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఆయిల్ సంపదను దోపిడీ చేసే లక్ష్యంతోనే వెనుజువెలాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడికి పాల్పడ్డారని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. తనను మోదీ కూడా సంతోష పెట్టలేదని ట్రంప్ పరోక్ష బెదిరింపులకు గురి చేస్తున్నారని, అయినా ప్రధాని మోదీ స్పందించలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నీళ్లు కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు కేజీ రామచంద్రన్, కె.రంగయ్య, గోకినపల్లి వెంకటేశ్వర్లు, చండ్ర అరుణ, చిన్న చంద్రన్న, ముద్ద భిక్షం, కల్పన, రాము, రాజు, కృష్ణ పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్అశ్వారావుపేటరూరల్: గిరిజన బాలికను గర్భవతిని చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల లోపు గిరిజన బాలిక గత దసరా పండుగ సెలవులకు ఇదే మండలంలోని ఓ గ్రామంలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చి కొంతకాలం ఇక్కడే ఉంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యువకుడు ఎం.అరవింద్ బాలికను మాయమాటలతో పరిచయం చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి కాగా, శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి దమ్మపేట కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి● మరొకరికి తీవ్ర గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టేకులపల్లి మండలం సులానగర్‌కు చెందిన చిలకబత్తిని రవి (42) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన గనమల్ల భిక్షం తీవ్రంగా గాయపడ్డాడు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వారం రోజులు అక్కడే పనిచేసి శనివారం బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో సమ్మక్క గద్దెల సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో తీవ్రగాయాలై రవి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గాయాలైన భిక్షంను సీఐ టి.సురేష్ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాటుసారా స్వాధీనం నేలకొండపల్లి: నేలకొండపల్లి ఎకై ్సజ్ సర్కిల్ అధికారులు పలు ప్రాంతాల్లో శనివారం తనిఖీలు నిర్వహించగా.. శంకరగిరి తండాలో పది లీటర్ల నాటుసారా పట్టుబడింది. స్కూటీతోపాటు పార్వతిని అదుపులోకి తీసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశామని, సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన బెల్లం వ్యాపారి వెంకటరమణ పరారీలో ఉన్నాడని సీఐ ఎస్.రమేశ్ తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐ లత, సిబ్బంది శ్రీనివాస్, సంపూర్ణ, బలరాం, వినీత్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో అంతస్తు నుంచి పడి కార్మికుడు మృతి ఖమ్మంఅర్బన్: ఖమ్మం గోపాలపురంలోని నాలుగు అంతస్తుల భవనంపై ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీన్దయాల్శర్మ (21) కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జయనగర్‌కాలనీలో నివాసముంటున్న ఆయన ఒక మేసీ్త్ర వద్ద ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. రోజులాగే ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న నాలుగో అంతస్తు నుంచి పడడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని శర్మ బంధువు దామోదర్శర్మ పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మంఅర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
కొండంత అండ
ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్రూ.66కోట్ల అంచనాలతో... మండల వ్యాప్తంగా 64 చెరువులకు సాగర్ జలాలు అందాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తొలుత రూ.66కోట్ల అంచనాలతో ప్రణాళిక రూపొందించినా అన్ని చెరువులకు నీరు అందడానికి పైపులైను విస్తరణ తప్పనిసరి కావడంతో రూ.100 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.66 కోట్లతో పూర్తయిన మొదటి దశ పనులను ప్రారంభిస్తే 36 చెరువులకు నీరు అందనుంది. ఇక మండలంలో చిట్టచివరన అత్యధికశాతం గిరిజనులు ఉన్న పంగిడి వైపు మరో 18 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి రూ.34 కోట్లు విడుదలైతే ఇంకొన్ని చెరువులకు నీరు చేరుతుంది. ప్రస్తుతం తొమ్మిది కిలోమీటర్ల ప్రధాన పైప్‌లైన్ పనులు పూర్తికాగా, మంచుగొండ వద్ద డెలివరీ పాయింట్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి గ్రావిటీ విధానంలో 25 కి.మీ. పైప్‌లైన్‌తో చెరువులకు నీరు అందించనున్నారు. ఐదు పైపులైన్ల ద్వారా సాగే ఈ నీటితో తొలి దశలో 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కాగా, వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వ నుంచి ఒక్కో మోటార్ ద్వారా 13 క్యూసెక్కుల చొప్పున మూడింటి ద్వారా 39 క్యూసెక్కుల నీటిని పైపులైన్లు ద్వారా చెరువులకు తరలించనున్నారు. ఈ పథకం ప్రారంభంతో మండలంలోని రైతులకు సాగునీటి సమస్యలు తీరడమే కాక భూగర్భజలాలు పెరుగుతాయని, తద్వారా బోర్లు, బావుల ద్వారా పంటలు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు.సరైన సాగునీటి వనరులు లేక ఇబ్బంది పడుతున్న రఘునాథపాలెం మండల రైతుల చిరకాల స్వప్నం నెరవేరుతోంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయింది. ఈ పథకాన్ని మంత్రి 13వ తేదీన ప్రారంభించనుండగా.. తొలిదశలో మండలంలోని 36చెరువులకు సాగర్ జలాలు చేరనున్నాయి. తద్వారా ఆయకట్టుకు నీరు అందడమే కాక భూగర్భ జలాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. – రఘునాథపాలెంఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ఏకై క గ్రామీణ మండలమైన రఘునాథపాలెంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు వీ.వీ.పాలెం మీదుగా సాగే సాగర్ ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిర్ణయించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం పేరిట ఈ పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశాక మంత్రి నిరంతరం పర్యవేక్షిస్తూ నిధులు మంజూరు చేయించడంతో రికార్డు సమయంలో పూర్తయింది. పనులు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే మెయిన్ పైప్‌లైన్ నిర్మాణం పూర్తి చేయడమే కాక తాత్కాలిక మోటార్లతో ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తవడంతో మూడు మోటార్లు ఏర్పాటు చేయగా నీటి సరఫరాకు పథకం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. సిద్ధమైన మంచుకొండ ఎత్తిపోతల పథకం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ఈనెల 13న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనుండడంతో జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు శనివారం పరిశీలించారు. వీవీపాలెం వద్ద ఉన్న పంప్‌హౌస్, మోటార్లు, సబ్‌స్టేషన్, మంచుకొండలో డెలివరీ పాయింట్‌ను పరిశీలించిన ఆయన ఇంజనీర్లకు సూచనలు చేశారు. శాఖ అధికారులు అనన్య, ఈలు ఝాన్సీ, ఉదయ్‌ప్రతాప్ పాల్గొన్నారు. -
ముగిసిన క్రీడాజ్యోతి ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్/కల్లూరు/తల్లాడ/సత్తుపల్లిటౌన్/ వేంసూరు/కారేపల్లి: సీఎం కప్ క్రీడాపోటీలను పురస్కరించుకుని జిల్లాలో రెండురోజులుగా నిర్వహిస్తున్న క్రీడాజ్యోతి ర్యాలీ శుక్రవారం ముగిసింది. రెండో రోజు కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కొనసాగిన ర్యాలీ సాయంత్రం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకుంది. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్ మాట్లాడుతూ జిల్లా యువత క్రీడా పోటీల్లో ఉత్సాహంతా పాల్గొని సత్తా చాటాలని సూచించారు. డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 17నుంచి మొదలయ్యే పోటీల్లో పాల్గొనేందుకు అన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కోచ్‌లు ఎం.డీ.గౌస్, కె.క్రిస్టోఫర్‌బాబు, ఉదయ్‌కుమార్, ఆదర్శ్‌కుమార్, సాంబమూర్తి, బాగం నీరజాదేవి, ఆలకుంట నర్సింహారావు, పత్తిపాటి నివేదిత, పసుపులేటి వీరరాఘవయ్య, రాధాకృష్ణ, తులసి, అప్పారావు, పద్మ, మహేష్, సురేష్‌బాబు, బి.వెంకటేశ్, పకృద్దీన్, మాణిక్‌రావు, రాంమోహన్ రావు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, సోందు, దుగ్గిరాల జయరాజు, యాకూబ్‌పాషా, మూర్తి, వెంకట్, లక్ష్మణ్, కృష్ణయ్య, విజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారులపై మరింత భద్రత
సత్తుపల్లిటౌన్/కల్లూరురూరల్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల కట్టడికి మరిన్ని భద్రతా చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ సూచించారు. కల్లూరులోని ప్రధాన సెంటర్, పెనుబల్లి జంక్షన్, లంకపల్లి, కిష్టారం వై జంక్షన్, తాళ్లమడ బ్రిడ్జి, ఏన్కూరులో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆమె వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాప్‌లో నమోదు చేసి నివారణ చర్యలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తొలుత జీబ్రా క్రాసింగ్‌లు, రంబుల్ స్ట్రిప్స్, మార్కింగ్‌లు, సూచిక బోర్డులు, ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఐఆర్‌ఏడీ జిల్లా మేనేజర్ హరిబాబు, నేషనల్ హైవే ఇంజనీర్ కిరణ్, సత్తుపల్లి ఎంవీఐ జేఎన్.శ్రీనివాస్, ఆర్అండ్బీ శాఖ ఇంజనీర్ నాగేశ్వరరావు, సీఐ శ్రీహరి, కల్లూరు ఎస్సై హరిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
ఖమ్మం సహకారనగర్: రోడ్డు ప్రమాదాల నియంత్రించడాన్ని అందరూ బాధ్యతగా భావించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం పెట్రోల్ బంక్ నిర్వాహకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందితే ఆయనపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుందని తెలిపారు. పెట్రోల్ బంక్ల్లోకి వచ్చి, వెళ్లే మార్గాలు ప్రధాన రోడ్డును కలిసే చోట అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. అలాగే, బంక్‌కు ఇరువైపులా 100 మీటర్ల దూరాన రోడ్డుపై బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్‌లు ఏర్పాటుచేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీఓ డి.జగదీష్, డీఎల్‌ఎంఓ ప్రవీణ్ కుమార్, ఆర్ అండ్ బీ డీఈ జి.రాధిక తదితరులు పాల్గొన్నారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25న మొదలయ్యే పరీక్షల నిర్వహణకు 66 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే హాల్‌టికెట్‌ను విద్యార్థి వాట్సప్ నకు పంపినందున తప్పులు ఉంటే సరిచేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఎంహెచ్ఓ రామారావు, సీఐ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
గిరిజనులకు ప్రత్యేకం!
● ‘ఖేలో ఇండియా’లో క్రీడాపోటీల నిర్వహణకు నిర్ణయం ● ఏడు అంశాల్లో జాతీయస్థాయి పోటీలు ● గిరిజన క్రీడాకారుల ప్రతిభకు తగిన గుర్తింపుఖమ్మం స్పోర్ట్స్: గిరిజన యువతలో సహజసిద్ధంగా దాగి ఉండే క్రీడా ప్రతిభను వెలికితీయడం, ఔత్సాహికుల ప్రతిభను తెరపైకి తీసుకురావడమే లనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఖేలో ఇండియా పోటీల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయించింది. జాతీయ స్థాయిలో కేవలం గిరిజన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేలా పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 177 జిల్లాలో గిరిజనులు ఉండగా, ప్రత్యేక పోటీలతో ప్రతిభావంతులను గుర్తించొచ్చని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ నిర్వహించనుండగా, ప్రస్తుతం వయోబేధం లేకుండా మహిళలు, పురుషులు పాల్గొనేలా ఏడు క్రీడాంశాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్‌బాల్ క్రీడాంశాలు ఉన్నాయి. తొలుత రాష్ట్రస్థాయిలో ఎంపిక రాష్ట్రస్థాయిలో ఎంపికై న క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు తీసుకుంటారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక నిష్పక్షపాతంగా ఎంపిక జరిగేలా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఒకరు, గిరిజన సంక్షేమం / సాంఘిక సాంక్షేమ శాఖ ఓ అధికారి, తెలంగాణ క్రీడా సంఘం తరపున ఇంకొకరితో పాటు ద్రోణాచార్య / అర్జున అవార్డు గ్రహీత, లేదా కోచ్‌కు ఈ కమిటీలో స్థానం కల్పిస్తారు. తుది జాబితాలో దేశవ్యాప్తంగా 2,500 మంది క్రీడాకారులకు స్థానం కల్పించడమే కాక ప్రత్యేకంగా స్పోర్ట్స్ కిట్స్ అందించనున్నారు. జాతీయస్థాయిలో ఇప్పటికే పతకాలు సాధించిన క్రీడాకారులు ప్రతిభ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఖేలో ఇండియా క్రీడల ద్వారా సత్తా చాటితే తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాక ఫెడరేషన్లు ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు తెరపైకి రాలేకపోయిన గిరిజన క్రీడాకారులకు ఇకనైనా గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉంది. – పుట్టా శంకరయ్య, జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీ సభ్యుడుగిరిజన, ఆదివాసీ జనాభా ఉమ్మడి జిల్లాలో అధికంగానే ఉంటుంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్చరీ శిక్షణకు ఖేలో ఇండియా సెంటర్ ఉండగా, కాచనపల్లి, కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూళ్లలో కూడా ఆర్చరీ శిక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యాన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన, ఆదివాసీ యువత ఇప్పటికే జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రధానంగా ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రభుత్వం, ఐటీడీఏ ప్రోత్సాహం, స్పోర్ట్స్ స్కూళ్లలో శిక్షణతో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఖేలో ఇండియాలో ప్రత్యేకంగా గిరిజనుల కోసం జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనుండడంతో వీరికి మంచి వేదికగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆలయంలో జిల్లా జడ్జి పూజలు
ఖమ్మం అర్బన్: ఖమ్మం యూపీహెచ్కాలనీలోని స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామిని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా ప్రత్యేక పూజలు అనంతరం వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం చైర్మన్ అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శి బెల్లికొండలరావు, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డితో పాటు పల్లపు సత్యం, బొల్లి కొమరయ్య, మేకల వీరన్న, పురం తిరుపతయ్య, ఐతన బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదనపు హాల్ నిర్మాణానికి శంకుస్థాపన ఖమ్మం లీగల్: ఖమ్మం కోర్టులో మహిళా న్యాయవాదులకు ప్రస్తుతం ఉన్న బార్ అసోసియేషన్ సరిపోవడం లేదు. దీంతో ర్ అసోసియేషన్ బాధ్యుల విజ్ఞప్తితో జిల్లా జడ్జి జి.రాజగోపాల్ హైకోర్టుకు లేఖ రాయగా అనుమతులు మంజూరయ్యాయి. దీంతో అదనపు హాల్ నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ బాధ్యులు తొండపు వెంకటేశ్వరరావు, గద్దెల దిలీప్, విజయశాంత, ఇందిర, నరసింహారావు, కొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లలో సీతారామ పూర్తి
● రూ.100 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ ● రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మలఅశ్వారావుపేటరూరల్: రానున్న మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టును వందశాతం పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి గోదావరి జలాలను అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్ట్ పేరుతో ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎకరా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రైతు మేళా, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు హాజరయ్యారు. ఆతర్వాత దమ్మపేట గండుగులపల్లిలో సీతారామ ఎత్తిపోతల పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు గడిచిన రెండేళ్లుగా అమలు కానీ యంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.100కోట్ల వ్యయంతో 1.30లక్షల మంది రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తామని చెప్పారు. రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి దేశంలోని 29 రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఉమ్మడి రాష్ట్రం హయాంలో కూడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరిసాగులో రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ త్వరలోనే సీతారామ 4వ పం్ప్ హౌస్‌ను పూర్తి చేసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు కూడా గోదావరి నీళ్లు అందిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ విస్తరిస్తానమి తెలిపారు. ఈకార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్ జానయ్య, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ భాషా, అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బీ గోపి తదితరులు పాల్గొన్నారు. -
సీసీఐ కేంద్రంలో అగ్ని ప్రమాదం
కారేపల్లి: కారేపల్లిలోని శ్రీలక్ష్మిప్రియా కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో కొనసాగుతున్న సీసీఐ పత్తి కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మిల్లు మిషనరీ నుంచి మొదలైన మంటలు పత్తికి అంటుకోగా ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. మిల్లు పక్కనే సుమారు వేయి క్వింటాళ్ల పత్తిపై నిప్పు రవ్వలు పడగా వర్కర్లు, సీసీఐ కేంద్రానికి వచ్చిన రైతులు పరుగులు తీశారు. ఇంతలోనే తేరుకుని పైపులతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇల్లెందు నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే 20క్వింటాళ్ల పత్తి కాలిపోయినా రూ.కోటి విలువైన బేళ్లు, సీడ్లకు నిప్పు అంటుకోక పోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా, పత్తిని బేళ్లుగా మార్చేందుకు శుభ్రం చేసే క్రమాన రాయి వంటివి వస్తే నిప్పు రవ్వలు వస్తాయని.. అది కన్వేయర్ బెల్ట్ వద్ద అంటుకోవడం ప్రమాదం కారణమై ఉండొచ్చని మిల్లు యజమాని రాహుల్ తెలిపారు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మిషనరీ బెల్టుల వద్ద నుంచి పొగ రావడాన్ని గుర్తించిన వర్కర్లు అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పినట్లయింది. ఘటనాస్థలాన్ని సింగరేణి తహసీల్దార్ రమేష్, ఎంపీఓ రవీంద్రప్రసాద్, గ్రామ కార్యదర్శులు కృష్ణవేణి, నెహ్రూ, సింగరేణి, సర్పంచ్‌లు మేదరి టోనీవీరప్రతాప్, దండు ప్రవీణ్ తదితరులు పరిశీలించారు. సీసీఐ అధికారి ఆరా ప్రమాదం జరిగిన మిల్లును సీసీఐ అధికారి గురురాజ్ కులకర్ణి పరిశీలించారు. ఇల్లెందు మార్కెట్ కార్యదర్శి నరేష్‌కుమార్‌తో కలిసి పరిశీలించిన ప్రమాదాలు వివరాలు తెలుసుకున్నాక మాట్లాడారు. ఒక ల్ రూ.25వేలు ఉంటుందని, అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పిందని పేర్కొన్నారు. శుక్రవారం 145క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, మిగతాది మిల్లు యజమాని నిల్వ చేసుకున్నాడని తెలిపారు. -
బెటాలియన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క సత్తుపల్లిటౌన్: బెటాలియన్ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక బెటాలియన్‌లో జరుగుతున్న వార్షిక క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి విజేతలకు బహుమతులు అందజేశాక మంత్రి మాట్లాడారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకుని వస్తే పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. పోలీసులు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. పూర్వీకులు ప్రకృతి సహజసిద్ధంగా లభించే కల్లు, ఇప్పసారా తాగినా ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వసుంధర యాదవ్, బెటాలియన్ కమాండెంట్ పెద్దబాబు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ పోటీల్లో విజేతగా ఖమ్మం జట్టు ఖమ్మంవ్యవసాయం: ఇటీవల నల్లగొండలో జరిగిన విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ఖమ్మం జిల్లా జటు విజేతగా నిలిచింది. జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడం ఇది ఐదోసారి కావడం విశే షం. ఈ సందర్భంగా జట్టు క్రీడాకారులను ఖమ్మం, కొత్తగూడెం ఎస్ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, మహేందర్, డీఈ బాబూరావు తదితరులు అభినందించారు. వెంకట్రామిరెడ్డికి ఉత్తమ రైతు పురస్కారం ఎర్రుపాలెం: సేంద్రియ వ్యవసాయంతో ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పి స్తున్న మండలంలోని మీనవోలుకు చెందిన రైతు కుడుముల వెంకట్రామిరెడ్డికి పురస్కారం లభించింది. ఏపీలోని గుంటూరు జిల్లా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం వడ్లమూడిలోని విజ్ఞాన్ విద్యాలయంలో పలువురు రైతులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఐసీఐఆర్ డైరెక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా వెంకట్రామి రెడ్డి పురస్కారం అందుకున్నారు . పాఠశాలకు రూ.2లక్షల విలువైన సామగ్రి పెనుబల్లి: మండలంలోని కొత్తకాయిగూడెం ఎంపీయూపీఎస్‌కు ఎన్ఓఎస్జీహెచ్ ల్యాబ్ అధినేత సత్యనారాయణరెడ్డి రూ.2లక్షల విలువైన సామగ్రి సమకూర్చారు. ఇందులో ఎస్ టైప్ కుర్చీలు, టీచర్ టేబుళ్లు, డెస్క్ బెంచీలు ఉండగా వీటిని శుక్రవారం ఎంఈఓ కావేటి మోహన్‌రావు ప్రారంభించారు. సర్పంచ్ కాలసాని తిరుపతమ్మ, మాజీ సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి, హెచ్ఎం కంకటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసమే యాత్రనేలకొండపల్లి: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పించేందుకు చిన్న జీయర్‌స్వామి సుఫలా యాత్ర చేపడుతున్నారని సిద్ధార్థ యోగా విద్యాలయం నిర్వాహకుడు ప్రకృతి వైద్యుడు రామచందర్‌రావు తెలిపారు. నేలకొండపల్లిలోని విద్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జీయర్ స్వామి చేపట్టే యాత్ర ఈనెల 20న భక్తరామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలో మొదలవుతుందని పేర్కొన్నారు. రైతులు, ప్రజల సంక్షేమం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే కాక భూమాతను రక్షించుకోవడంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కాగా, యాత్ర సందర్భంగా 20వ తేదీన విద్యాలయంలో పాతకాలపు వ్యవసాయ పరికరాలు, దేశవాళీ 150రకాల పప్పు దినుసులు, 12 రకాల వరి బియ్యం, 50 రకాల చేతి వృత్తులు, 250 రకాల ఔషధ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అర్చక సంఘం నాయకుడు తుపురాణి మధుసూధనాచార్యులు తదితరులు ఉన్నారు. -
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్దాం..
మధిర: కాంగ్రెస్ హయాంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తే మరో పార్టీకి భవిష్యత్తే ఉండదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయితే, చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోవడంలో కాంగ్రెస్ శ్రేణులు వెనుకబడగా.. మిగతా పార్టీలు కొద్దిపాటి పనులనే ప్రచారం చేసుకుంటున్నాయని చెప్పారు. ఇకనైనా అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు చేయాలని సూచించారు. మధిర పట్టణం అభివృద్ధి చెందితేనే భవిష్యత్ తరాలకు సుస్థిరమైన జీవితం సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో శుక్రవారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమైన డిప్యూటీ సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ పథకాలు మధిరలో అర్హులకు కూడా అందుతుండగా, అభిృవృద్ధి పనులకు రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నా. ఈ విషయాన్ని ప్రతీ నాయకుడు రోజుకు కనీసం పది మందికి వివరించాలని.. తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మధిరకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు డిగ్రీ, ఇంటర్, హైస్కూళ్లకు సొంత భవనాలు, పాలిటెక్నిక్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఈ పనులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. కాగా, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తయ్యాక మధిర పట్టణమంతా కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని భట్టి వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
విస్తృత ప్రచారం, జన సమీకరణే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈనెల 18న జరగనుండగా విజయవంతానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు సూచించారు. భారీ జన సమీకరణే లక్ష్యంగా ప్రచారం కొనసాగాలని తెలిపారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో కొండపర్తి గోవిందరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ ఎత్తున జన సమీకరణే లక్ష్యంగా గ్రామగ్రామాన ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే, 10న అలంకరణ కమిటీ, కమిటీల సమావేశం, 11న కాగడాల ప్రదర్శన, 12న బహిరంగ సభ జయప్రదం కోరుతూ ట్రాక్టర్ల ర్యాలీ, అదే రోజు డీపీఆర్సీ భవనంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక 13న జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఇళ్లపై సీపీఐ జెండాలు ఎగురవేయాలని, 14న గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈసమావేశం అనంతరం నాయకులు బహిరంగ సభ జరగనున్న ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కార్యదర్శులు దండి సురేష్, సాబీర్‌పాషా, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, బీజీ.కై ్లమెంట్, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీరా రామ్మూర్తి, కొండపర్తి గోవిందరావు, మేకల శ్రీనివాసరావు, పోటు పూర్ణ, చింతల రమేష్, నంబూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. 12న కవితా సంచిక ఆవిష్కరణ సీపీఐ విజయాలు, పోరాటాలపై రాసిన కవితలతో రూపొందించిన ‘నూరేళ్ల అరుణ కేతనం’ కవితా సంచికను 12వ తేదీన ఆవిష్కరిస్తామని కమిటీ బాధ్యుడు లెనిన్ శ్రీనివాస్ తెలిపారు. ఏఐటీయూసీ కార్యాలయంలో శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంచిక కోసం వంద మంది కవులు తమ రచనలను పంపించారని వెల్లడించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో బాగం హేమంతరావు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చింతకాని: వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజల కు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, అలాకాకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డి.రామారావు హెచ్చరించారు. చింతకాని పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగుల హాజరు, ఓపీ రికార్డులు పరిశీలించాక మాట్లాడారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు. గర్భిణులు ప్రభు త్వ ఆస్పత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్, సీహెచ్ఓ వీరేందర్ పాల్గొన్నారు. సొసైటీల ద్వారా రైతులకు విస్తృత సేవలు సత్తుపల్లిటౌన్: వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేలా సిద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సెక్రటరీ కె.సురేంద్రమోహన్ సూచించారు. సత్తుపల్లి పీఏసీఎస్‌ను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన యూరియా నిల్వ లు, ఇప్పటివరకు అమ్మకాలపై ఆరా తీశాక అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. అవసరం మేరకే యూరియా కొనుగోలు చేసి ఉపయోగించాలని సూచించారు. ఆతర్వాత డీసీసీబీ బ్రాంచ్‌ను పరిశీలించిన సురేంద్రమోహన్ రైతులకు ఇచ్చిన రుణాలు, లక్ష్యాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు కె.విజయ్‌కుమార్, డీసీఓ గంగాధర్, బ్యాంక్ సీఈఓ వెంకట ఆదిత్య, ఏడీ ఏ శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, మేనేజర్ కిషోర్‌కుమార్, సీఈఓ వీరస్వామితో పాటు చల్లగుండ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మల్బరీ సాగుతో మెరుగైన ఆదాయం వైరారూరల్: కర్ణాటక రైతుల మాదిరి మల్బరీ, పట్టు పరిశ్రమ ద్వారా ఇక్కడి రైతులు అధిక దిగుబడితో మెరుగైన ఆధాయం సాధించాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ రాష్ట్ర డైరెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. వైరా రెబ్బవరంలో ఒకేచోట 30 మంది రైతులు సాగు చేస్తున్న మల్బరీ క్షేత్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడా రు. ఆసక్తి ఉన్న రైతులను కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడి రైతులు అవలంబిస్తున్న విధానాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆతర్వాత రైతు సతీష్ సాగు యో గ్యం కాని చౌడు భూమిలో కొబ్బరిచెట్లు నాటడ మే కాక చేపల చెరువు తవ్వించడాన్ని పరిశీలించిన ఆమె అభినందించారు. ఈ విధానాన్ని అందరికీ వివరించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యాన అధికారి ఎం.వీ.మధుసూదన్, పట్టు పరిశ్రమ అధికారి ముత్యాలుతో పాటు అనితశ్రీ, వేణు, విష్ణు, కామేశ్వరరావు, దేవరాజు పాల్గొన్నారు. రైతులకు సరిపడా యూరియా కూసుమంచి: యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ గోపి తెలిపారు. మండలంలోని చేగొమ్మ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల సాగు, యూరియా అవసరంపై రైతులతో మాట్లాడారు. యూరియా నిల్వలు, డిమాండ్, సాగు ఆధారంగా నియోజకవర్గంలోని సబ్‌సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తుండడంతో ఇబ్బంది రాలేదని అధికారులు తెలిపారు. ఈ విధా నం బాగుందని అభినందించిన సంచాలకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్, ఏడీఏ సతీష్, ఏఓ వాణి, సీఈఓ రామకృష్ణ పాల్గొన్నారు. -
బాలికలకు భరోసా
గర్భాశయ ముఖద్వార కేన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ కేన్సర్ ఉన్నట్లు గుర్తించేలోగా తీవ్రత పెరుగుతుండడంతో అత్యాధునిక చికిత్స చేయించినా పెద్దగా ఫలితాలు ఉండడం లేదు. ఈనేపథ్యాన బాలికల దశలోనే కేన్సర్ సోకే అవకాశాలను తుంచివేయాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. బాలికలు కేన్సర్ బారిన పడకుండా కట్టడి చేసేందుకు ముందస్తుగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) వ్యాక్సిన్ సిద్ధం చేశారు. ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండగా 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల వయస్సు లోపు ఉన్న బాలికల గుర్తింపు ఇప్పటికే పూర్తిచేశారు. – ఖమ్మం వైద్యవిభాగంమహిళలే బాధితులు కేన్సర్ బాధితుల్లో పురుషుల కన్నా ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. గర్భాశయం, రొమ్ము కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోధించాలనే లక్ష్యంతో 14–15 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలకు ఉచితంగా టీకా వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ వయస్సులోనే బాలికలకు హార్మోన్ల మార్పులు జరిగే అవకాశమున్నందున ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి వెంటనే చికిత్స తీసుకోకపోతే గర్బాశయ ముఖ ద్వారా కేన్సర్‌కు దారితీసే ప్రమాదముందని గుర్తించారు. ఈనేపథ్యాన ప్రభుత్వమే ఉచితంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) టీకాలు వేయాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుండడంతో జిల్లాలో 14–15 ఏళ్ల బాలికల గుర్తింపు పూర్తి చేశారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల వారీగా సర్వే నిర్వహించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో మొత్తం 19,500 మంది బాలికలు ఉన్నట్లు గుర్తించారు. కేన్సర్‌పై పెరుగుతున్న అవగాహన జిల్లాలో గతంతో పోలిస్తే కేన్సర్‌పై అవగాహన పెరుగుతోంది. ముప్ఫై ఏళ్లు నిండిన మహిళలకు ఆరోగ్య మహిళ కార్యక్రమం అందుబాటులోకి వచ్చాక పరిస్ధితి మారింది. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఆరోగ్య మహిళ కార్యక్రమం కోసం ప్రత్యేక విభాగం ఉండడంతో మహిళలు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. 2023 మార్చి 8న ఈ కార్యక్రమం మొదలుకాగా జిల్లాలోని 12 పీహెచ్‌సీల పరిధిలో కొనసాగుతోంది. పీహెచ్‌సీల్లో సర్వైకల్, బ్రెస్ట్, ఛాతి, నోటి, థైరాయిడ్ తదితర కేన్సర్లకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానితులుగా ఎవరైనా తేలితే జిల్లా ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 6,645 మంది మహిళలకు పెద్దాస్పత్రిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా పూర్తిపరీక్షలు నిర్వహించగా 232 మందికి కేన్సర్ ఉన్నట్లు తేలింది. వీరిలో 92 మందికి బ్రెస్ట్ కేన్సర్, 72 మందికి సర్వైకల్ కేన్సర్, 22 మందికి థైరాయిడ్ కేన్సర్ ఉండగా చికిత్స నిమిత్తం ఎన్ఎంజేకు రిఫర్ చేశారు. అయితే యుక్త వయస్సు బాలికల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ మూలంగా గర్భాశయ ముఖద్వార కేన్సర్ సోకే అవకాశం ఉండడంతో తొలిదశలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయనున్నారు. తద్వారా బాలికల వయస్సు పెరిగాక కేన్సర్ బారిన పడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.సర్వైకల్ కేన్సర్ బారిన పడకుండా టీకా హెచ్‌పీవీ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ వేసేలా మా శాఖ ఉద్యోగులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాము. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలందరికీ టీకా వేయనున్నాం. ఈ వయస్సు వారు జిల్లాలో 19,500 మంది ఉండగా.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నాం. – చందూనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
మిర్చి ధరలో పురోగతి
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర ముందడుగు వేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఇన్నాళ్లు క్వింటా తేజా రకం మిర్చికి రూ.15,200 ధర దాటకపోగా శుక్రవారం ఒకేసారి రూ.15,900కు చేరింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చితో పాటు కొత్త పంటకు సైతం ఇదే ధర పలికింది. ఇది జెండాపాట ధర కాగా, నాణ్యత ఆధారంగా మోడల్ ధర రూ.15,500గా నమోదైంది. మిర్చి ధర పెరిగిన నేపథ్యాన విక్రయాలు పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 20 లక్షల బస్తాల మిర్చి నిల్వ ఉండగా, ఈ ఏడాది జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. ధర ఇలాగే కొనసాగితే సంక్రాంతి తర్వాత విక్రయాలు జోరందుకుంటాయని చెబుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే.. మిర్చ ధర పెరగడానికి సాగు విస్తీర్ణం తగ్గడమేనని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. రెండేళ్లుగా ధర తగ్గడం, తెగుళ్ల కారణంగా దిగుబడి రాకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారు. జిల్లాలో లక్ష ఎకరాల మేర సాగయ్యే మిర్చి ఈ ఏడాది 35 వేల ఎకరాలకు పడిపోయింది. ఫలితంగా తక్కువ సరుకు వచ్చే అవకాశముండడంతో ధర పెరిగిందని తెలుస్తుండగా, విదేశీ ఆర్డర్లు కూడా లభిస్తే మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు. కాగా, శుక్రవారం ఖమ్మం మార్కెట్‌కు సుమారు 10వేల బస్తాల కొత్త మిర్చిని విక్రయానికి తీసుకొచ్చారు. ఇక తాలు మిర్చి ధర కూడా గరిష్టంగా రూ.9వేలు, కనిష్టంగా రూ.7వేల వరకు పలికింది. తేజా క్వింటాకు రూ.15,900 -
ఇకపై మేమూ ఓటర్లమే!
● తీరిన కొమ్మేపల్లి కాలనీవాసుల కష్టాలు ● ఆరేళ్ల తర్వాత సమస్యకు పరిష్కారంసత్తుపల్లి: కొమ్మేపల్లి పునరావాస కాలనీ ఏర్పడి ఆరేళ్లు కావస్తోంది.. మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు ఓటు హక్కు కల్పించి సమస్యలు పరిష్కరించండి అంటూ స్థానికులు ఎవరికీ మొరపెట్టుకున్నా ఆలకించలేదు. ప్రస్తుతం ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన కథనాలతో అధికారుల్లో చలనం రాగా కాలనీలోని 449మందికి ఓటు హక్కు కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఓసీతో తరలింపు కిష్టారం పంచాయతీ పరిధిలో 449మంది ఓటర్లను కుటుంబాలతో సహా ఉండగా ఆ ప్రాంతాన్ని ఆరేళ్ల క్రితం సింగరేణి ఓసీ విస్తరణ భాగంగా సేకరించారు. ఆపై నిర్వాసితులకు సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి అయ్యగారిపేట రెవెన్యూలో ఇళ్లస్థలాలు కేటాయించగా ఇళ్ల నిర్మించుకున్నారు. అయితే, వీరి ఓట్లను కిష్టారం పంచాయతీనే కొనసాగించడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలో ఓట్లు వేయగలిగా రు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జాబితా నుంచి తొలగించిన అధికారులు మున్సిపాలిటీలో మాత్రం ఓటుహక్కు కల్పించలేదు. దీంతో మండల స్థాయి మొదలు జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోగా, తాజాగా విడుదలైన మున్సి పల్ ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ స్థానం దక్కలేదు.కిష్టారం పంచాయతీలో ఓటు తొలగించారు. మున్సిపాలిటీలో ఇవ్వాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు. చివరకు ‘సాక్షి’ పత్రికలో మా సమస్య ప్రచురితం కావడంతో ఓటు హక్కు రావడం సంతోషంగా ఉంది. – ఎస్కే.యాసిన్, కొమ్మేపల్లి కాలనీసత్తుపల్లి మున్సిపాలిటీలో ఓటర్లుగా కలపాలని ఆరేళ్ల నుంచి వేడుకుంటున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మున్సిపల్లో విలీనం చేసి సమస్యను పరిష్కరించారు. అధికారులు మున్సిపాలిటీ నుంచి మిగతా సేవలు కూడా అందించాలి. – గుర్రాల చెన్నారావు, కొమ్మేపల్లి కాలనీకొమ్మేపల్లి పునరావాస కాలనీకి చెందిన 449 మంది ఓటర్ల సమస్యపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈనెల 3న రిజర్వేషన్లపై ఉత్కంఠ, 5న కొమ్మేపల్లి కాలనీలో ఇంటింటి సర్వే, 6న ఇది ఎవరికీ పట్టని కాలనీ శీర్షికలతో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. ఈమేరకు ఆగమేఘాలపై కొమ్మేపల్లి కాలనీలో ఇంటింటి సర్వే చేసి నివేదికలు సమర్పించడంతో 449మందికి ఓటు హక్కు లభించింది. వీరిని సత్తుపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో చేర్చినట్లు మున్సిపల్ కమిషనర్ కొండ్రు నర్సింహ శుక్రవారం వెల్లడించారు. కాగా, ఈ వార్డులో ఇప్పటికే 1,923 మంది ఓటర్లు ఉండగా, కొమ్మినేపల్లి ఓటర్లతో కలిపి ఈ సంఖ్య 2,372కు చేరింది. ఈమేరకు అధికారుల ప్రకటనతో కాలనీవాసులు శుక్రవారం స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. అంతేకాక సమస్య ను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అండగా నిలి చిన ‘సాక్షి’ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. -
యూరియా కోసం బారులు
బోనకల్: మండలంలోని రావినూతల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం శుక్రవారం అన్నదాతలు బారులుదీరారు. సొసైటీ పరిధిలో రావినూతల, ఆళ్లపాడు గ్రామాల రైతులు యూరియా కోసం వచ్చారు. అయితే, 440 బస్తాల యూరియా మాత్రమే ఉండడంతో కూపన్ల ఆధారంగా పంపిణీ చేసిన అధికారులు, మిగతా వారికి శనివారం ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎల్ఐజీ ప్లాట్ల లాటరీ వాయిదా ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం శ్రీరాంనగర్‌లోని ఎల్ఐజీ ప్లాట్ల కేటాయింపునకు శనివారం డ్రా తీయాల్సి ఉండగా, వాయిదా వేసినట్లు హౌసింగ్ బోర్డు సీఈ జీవీ.రమణారెడ్డి తెలిపారు. ఇక్కడ ప్లాట్ల కోసం 23 మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ ప్లాట్లు కేటాయించనున్నా నంబర్ మాత్రం లాటరీ ద్వారానే ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ● ఎల్ఐజీ ప్లాట్లు – విల్లాల మధ్య అక్రమంగా నిర్మించిన గోడ, గేటును హౌసింగ్ బోర్డు ఈఈ అంకమరావు ఆధ్వర్యాన రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం కూల్చివేశారు. ప్లాట్ల డ్రా ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఈ గోడ నిర్మించినట్లు భావిస్తున్నారు. తహసీల్దార్ సై దులు, ఉద్యోగులు సత్యనారాయణ, పృథ్వీరా జ్,రమేష్‌నాయక్, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. -
ప్రతీ హామీని అమలు చేశాం
ఇల్లెందు/పినపాక: ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని, ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడం వల్లే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 69శాతం పంచాయతీల్లో విజయం సాధ్యమైందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తీర్పు ఇవ్వాలని కోరారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ ఆవరణలో, పినపాకలో నిర్వహించారు. ప్రజాప్రతినిధులను సన్మానించాక మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలనలో సర్పంచులు, వార్డు సభ్యులు కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి ద్వారానే ప్రజల వద్దకు చేరుతాయని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే మళ్లీ ఎన్నికలకు వస్తామని అన్నారు. మార్చి చివరి నాటికి రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాలని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఇల్లెందులో నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సీతారామ ప్రాజెక్టు చేపట్టకుండానే మొండి చేయి చూపించారని విమర్శించారు. గెలిచిన సర్పంచ్, వార్డుసభ్యులు ఇంటి వద్ద కూర్చోకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా పాటుపడాలని కోరారు. నియోజకవర్గానికి తమ ప్రభుత్వం సీతారామ నీళ్లు ఇస్తుందని, బడ్జెట్లో నిధులు కేటాయించేలా మంత్రి పొంగులేటి బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల అభ్యున్నతికి కార్యాచరణ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు గురువారం కలెక్టరేట్లో నిర్వహించగా కలెక్టర్ కేక్ కట్ చేసి మాట్లాడారు. గ్రామపంచాయ తీ ఎన్నికల కోడ్ కారణంగా నెల ఆలస్యంగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో ఉందని, త్వరలోనే దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నిధులు అందిస్తామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు పారదర్శకంగా సదరమ్ సర్టిఫికెట్ల జారీ, కంటిచూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు, వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాక ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం కేటాయించనున్నట్లు చెప్పారు. బ్యాక్లాగ్ పోస్టులు నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విజేత, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవ్, డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఫిర్యాదులన్నీ పరిష్కరిస్తాం.. ● సీజీఆర్ఎఫ్ చైర్మన్ వేణుగోపాలచారి సత్తుపల్లిరూరల్: విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తూ మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్మన్ వేణుగోపాలచారి తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విద్యుత్ విని యోగదారుల సదస్సులో పలువురు ఫిర్యాదులు అందజేశారు. వేంసూరు, సత్తుపల్లి మండలాల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించాక చైర్మన్ మాట్లాడారు. ఉద్యోగులు తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చని తెలిపారు. సదస్సులో డీఈఈ రాములు, ఏడీఈ ప్రసాద్‌బాబు, ఏఈఈలు శరత్‌బాబు, హనుమంతురావు, అనిల్, అంకారావు పాల్గొన్నారు. 20న చినజీయర్ స్వామి ‘సఫలా యాత్ర’ ఖమ్మంగాంధీచౌక్: ప్రకృతి వ్యవసాయం, ఆరో గ్యంపై అవగాహన కల్పించేందుకు తెలుగు రాష్ట్రాల్లో త్రిదండి చినజీయర్ స్వామి ‘సఫలా యాత్ర’ నిర్వహించనున్నారని జీయర్ సంస్థల సలహాదారు ఎర్నేని రామారావు తెలిపారు. ఖమ్మంలో గురువారం ఆయన మాట్లాడుతూ యాత్రలో భాగంగా ఈనెల 19న జీయర్ స్వామి ఖమ్మం జిల్లాకు చేరుకుంటారని వెల్లడించారు. భక్త రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో 20వ తేదీన ప్రకృతి వ్యవసాయంపై జరిగే సదస్సులో మాట్లాడాక రైతులతో కలిసి యాత్ర నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే, 21న ఖమ్మంలోని ఈఆర్ఆర్ రిసార్ట్స్‌లో జరిగే శ్రీగోదారంగనాథస్వామి కల్యాణ వేడుకలో పాల్గొంటారని తెలిపారు. -
జీపీఓల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ గ్రామ పాలన అధికారుల(జీపీఓ) యూనియన్ జిల్లా నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవం కాగా, టీఎన్జీవోస్, ట్రెసా జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, తుంబూరు సునీల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. జీపీఓల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా మన్నె గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా చీమల వీరబాబు, కోశాధికారిగా షేక్ జమాల్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అన్వర్ పాషా, బానోతు రవికుమార్, మహిళా అధ్యక్షురాలుగా మాటూరి మమత, తూమాటి శైలజ, అసోసియేట్ అధ్యక్షులుగా నెల్లూరి లవన్‌కుమార్ ఎన్నికయ్యారని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు జయపాల్, బొగ్గవరపు వెంకటేశ్వరరావు, కన్నేటి వీరవెంకటప్రసాద్, వసంత, షేక్ నాగుల్‌మీరా, శీలం వెంకటేశ్వర్లు, మలీద వెంకట్, అజీజ్ పాల్గొన్నారు. -
వచ్చేనెల 15నాటికి కొత్త మిర్చి యార్డు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ ఆధునికీకరణలో భాగంగా మొదటి దశ పనులు ఫిబ్రవరి 15నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. మార్కెట్లో పనులను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడారు. వచ్చే సీజన్‌కల్లా అవసరమైన అదనపు షెడ్లు, ఇతర నిర్మాణాల్లో వేగం పెంచాలని తెలిపారు. రైతులు యార్డ్‌లోకి రాగానే మంచి అనుభూతి కలిగేలా అంతర్జాతీయ స్థాయిలో వసతులు ఉండాలని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ప్రదర్శించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చాలని సూచించారు. అంతేకాక ప్రవేశ ద్వారా వద్దే ఏ షెడ్డుకు తీసుకెళ్లాలి, వేలానికి ఎంత సమయం పడుతుందనే విషయమై రైతులకు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. అలాగే, సీసీ కెమెరాల ఏర్పాటు, రైతులు బస చేసేలా వసతులు, ఆరోగ్య కేంద్రం, క్యాంటీన్, వే బ్రిడ్జిలు సిద్ధం చేయాలని సూచించారు. రెండు దశల్లో పనులు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మంలో మిర్చి యార్డు ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.155.30 కోట్లు కేటాయించగా రెండు దశల్లో పనులు చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో రూ.114.96 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని ఇప్పటికే ఏడు షెడ్లకు గాను ఐదింటి నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మిగతా పనులు త్వరగా పూర్తయ్యేలా దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, వైస్చైర్మన్లు హన్మంతరావు, తల్లాడ రమేష్, జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులు డి.పుల్లయ్య, గంగాధర్, అలీమ్, మధుసూదన్, మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ -
రిజర్వేషన్.. టెన్షన్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పటికే విడుదల కాగా ఈనెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆతర్వాత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు పురపాలక శాఖ శ్రీకారం చుడుతుంది. దీంతో ఆశావహులు చైర్మన్ పదవితోపాటు వార్డుల రిజర్వేషన్ ఎలా ఉంటుందనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో లెక్కలు వేస్తున్నారు. ప్రధానంగా చైర్మన్ గిరిపై కన్నేసిన నేతల్లో టెన్షన్ నెలకొనగా.. అంతా అనుకూలిస్తే బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. చకచకా పనులు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమేనని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు పూర్తి చేశారు. ఈనెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై కూడా పురపాలక శాఖ దృష్టి సారించింది. రిజర్వేషన్లు ఖరారైతేనే ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో త్వరగా పూర్తిచేసేలా అధికారులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. జనాభా ఆధారంగా.. మున్సిపాలిటీల్లో చైర్మన్, వార్డుల రిజర్వేషన్లను జనాభా ఆధారంగా ఖరారు చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభాలో వాటా ప్రకారం స్థానాలు కేటాయిస్తారు. ఇక బీసీ రిజర్వేషన్లను కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా లెక్కిస్తారు. ఆపై జనరల్ స్థానాలను కూడా గుర్తించాక.. అన్ని కేటగిరీ ల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయిస్తారు. ఎలా ముందుకు వెళ్లాలి? మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనుండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలోని పాత మున్సిపాలిటీలైన సత్తుపల్లి, వైరా, మధిరతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయి.. ఏ మున్సిపాలిటీ ఎవరికి రిజర్వ్ అవుతుందో అంచనా వేస్తున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని జనరల్‌కు, వైస్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు. అలాగే వైరా మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్సీకి, వైస్ చైర్మన్ బీసీకి దక్కింది. ఇక మధిర చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు, వైస్‌చైర్మన్ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈసారి ఇందులో ఎలాంటి మార్పులు జరుగుతాయో... ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ఆశావహులైన నేతల్లో ఉంది.మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో వేగం మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న ఆశావహులు రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు వేచి చూడక తప్పదు. కొందరు వార్డుల బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తుండగా, ఓ స్థాయి నేతలు మాత్రం చైర్మన్ పదవిపైనే గురి పెట్టారు. మరికొందరు కౌన్సిలర్‌గా పోటీ చేయడంతో పాటు చైర్మన్ పదవిని దక్కించుకునేలా ఇప్పటి నుంచే నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అలాగే, వార్డుల నుంచి పోటీకి సిద్ధమైన కొందరు రిజర్వేషన్ అనుకూలించకపోతే మరో వార్డు నుంచి పోటీ చేసి గెలవొచ్చా అని కూడా పరిశీలిస్తున్నారు. అవకాశం ఉంటుందని భావిస్తున్న వారు ప్రయత్నాలు చేస్తూనే, తాము పోటీ చేయాలనుకునే మున్సిపాలిటీ ఎవరికి రిజర్వ్ అవుతుందో అనుచరులతో చర్చిస్తున్నారు. వార్డుల వారీగా జనాభా ఎవరు ఎక్కువగా ఉన్నారో ఆరా తీస్తూ అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఇక కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల రిజర్వేషన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.మున్సిపాలిటీ జనరల్ బీసీజనరల్ ఎస్సీ జనరల్ ఎస్టీ జనరల్ /మహిళ /మహిళ /మహిళ /మహిళ సత్తుపల్లి 05/7 4/3 02/1 1 వైరా 3/5 4/3 2/2 1 మధిర 5/5 2/3 1/5 1 -
రైతులకు మెరుగైన సేవలు
మధిర/ఖమ్మం వైద్యవిభాగం: రైతులు, జీవాల పెంపకందారులకు పశు వైద్య సిబ్బంది ఉత్తమ సేవలు అందించాలని టీవీకే, ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వాహనాల రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్ భగీష్ మిశ్రా సూచించారు. మధిర సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశు సంవర్ధక శాఖ సంచార వాహనాల(1962)ను గురువారం ఆయన తనిఖీ చేశారు. మధిరలో గత మూడు నెలలుగా జీవాలకు చేసిన చికిత్స అందించిన టీకాలపై ఆరా తీశాక ప్రతినెలా 300 వరకు చికిత్సలు చేస్తున్న ఉద్యోగులన అభినందించారు. ఆతర్వాత 108, 102 వాహనాలను కూడా ఆయన పరిశీలించారు. వాహనాల జిల్లా మేనేజర్ ఆవులూరి దుర్గాప్రసాద్, ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, డాక్టర్ సౌజన్య, సిబ్బంది నందిని, వెంకటేశ్వర్లు, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ‘అధిష్టాన్’ బిల్లును వెనక్కి తీసుకోవాలిఖమ్మంమయూరిసెంటర్: వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు –2025ను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వంకాయల రాజు అధ్యక్షత జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ విధానాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు పేరిట రాష్ట్రాల హక్కులు కాలరాసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై ముగ్గురు మంత్రులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. నాయకులు ఉమేష్, హారీష్,వెంకటేష్, త్రినాథ్, లోకేశ్,సుశాంత్, మనోజ్, రమణ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టంఖమ్మం మామిళ్లగూడెం: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే నష్టపోయేది సామాన్య, మధ్యతరగతి ప్రజలేనని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీటీబీఈఎఫ్) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జన జాగృతి యాత్ర గురువారం సాయంత్రం ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో కలిసి హేమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని నిలిపివేయాలని, సరిపడా ఉద్యోగులను నియమించి, ఐదు రోజుల పనిదినాలు అమలుచేయాలన్నారు. హైదరాబాద్ నుంచి యాత్ర నిర్వహిస్తున్న కెనరా బ్యాంకు ఉద్యోగి ఉమామహేష్‌తో పాటు నాయకులు దండి సురేష్, సమద్, రాజేష్, వి.శ్రీకాంత్, కుమార్, శివరామకృష్ణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మూడు టిప్పర్లు సీజ్ వైరా రూరల్: మండలంలోని రెబ్బవరం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. పక్కా సమాచారంతో గురువారం తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు టిప్పర్లను సీజ్ చేయడమే కాక డ్రైవర్లు గుంపిడి సురేష్, అడప మహేష్, యజమాని పిల్లలమర్రి రాంబాబుపై కేసు నమోదుకు వైరా పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. -
తలసేమియా రహిత భారతాన్ని నిర్మిద్దాం...
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ గార్గె అన్నారు. ఖమ్మంలోని సంస్థ కార్యాలయం వద్ద గురువారం తలసేమియా చిన్నారులకు ఉచిత రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్‌గార్గె మాట్లాడుతూ తలసేమియాతో పిల్లలు జన్మించకుండా దంపతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, తలసేమియా చిన్నారులను తల్లిదండ్రులు, సమాజం భారంగా చూడకుండా రక్తదానంతో అండగా నిలవాలని తెలిపారు. ఈనెల 12న తలసేమియా జాతీయ సొసైటీ బాధ్యులు డాక్టర్ అరోరా బృందం ఆధ్వర్యాన ఖమ్మంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, చిన్నారులకు సేవలందించేందుకు ముందుకొచ్చిన పలువురిని రాజేష్‌గార్గె సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ఎన్.నర్సయ్యతో పాటు డాక్టర్ డి.నారాయణమూర్తి, డాక్టర్ లక్ష్మీదీపా, సంస్థ ఫౌండర్ పి.అనిత, బాధ్యులు పావని, పి.రవించదర్, ఉదయ్ భాస్కర్, ఎన్.ఉపేందర్, అనురాధ, షీవేన్ తదితరులు పాల్గొన్నారు. ‘సంకల్ప’ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ గార్గె -
ఉత్సాహంగా సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్/మధిర/ఎర్రుపాలెం/బోనకల్/ చింతకాని/నేలకొండపల్లి: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యాన గురువారం జిల్లాలోని పలు మండలాల్లో క్రీడాజ్యోతి ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ ర్యాలీని ఖమ్మంలో డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో సీఎం కప్ క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు ప్రతిభను మెరుగు పరుచుకునేందుకు ఈ పోటీలు వేదికగా నిలవనుండగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ నేలకొండపల్లి, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో కొనసాగగా, అధికారులు, క్రీడాకారులు స్వాగతం పలికి పాల్గొన్నారు. కాగా, పలు మండలాల్లో ర్యాలీ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు, కోచ్‌లు ఎం.డీ.గౌస్, కోచ్‌లు వీవీఎస్ మూర్తి, పరిపూర్ణాచారి, సురేష్, చంద్రకాంత్, నాగరాజు, భవ్య, నోయోల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పీఈటీలు వి.వెంకటేశ్వర్లు, ఎం.యర్రయ్య, బి.చలపతిరావు, వెంకటలక్ష్మి, కిలారు మనోహర్‌బాబు, బాబ్జీప్రసాద్, సలాది రామారావు, వీరేందర్, రమాదేవి, పుల్లయ్య, పొదిలి వెంకన్న, సయ్యద్ నవీద్‌పాషా, నారాయణ, కనకరాజు, బి.సురేందర్, బి.మురళీమోహన్రావు, రమేష్, సంపత్‌కుమార్, రమేష్, ఆర్.రాంబాబు, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, చిన్ని, ప్రవీణ్ కుమార్, చైతన్య, వేణు, సునీల్, నరసింహారావు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ అధికారుల ‘ప్రజాబాట’
ఖమ్మంవ్యవసాయం/రఘునాథపాలెం/ ముదిగొండ/బోనకల్/కల్లూరు రూరల్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించిన ప్రజాబాట కార్యక్రమం జిల్లాలో గురువారం కొనసాగింది. ఎస్ఈ మొదలు డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ అధికారులు, ఉద్యోగులు నిర్దేశించిన గ్రామాలు, ప్రాంతాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లూజ్ లైన్లు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, సక్రమంగా పని చేయని ట్రాన్స్ఫార్మర్లు, తరచూ అంతరాయాలు, నిర్వహణ లోపాలపై ఫిర్యాదులు అందాయి. అంతేకాక లో ఓల్టేజీ సమస్య పరిష్కారానకి నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, పని చేయని మీటర్లు మార్చాలని, బిల్లుల్లో తేడాలను సరిచేయాలని వినతిపత్రాలు ఇచ్చారు. ఇంకొన్నిచోట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం త్రీటౌన్ పరిధి సుందరయ్యనగర్, వ్యవసాయ మార్కెట్ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమాల్లో ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈ నంబూరి రామారావు, సబ్ డివిజనల్ ఇంజనీర్ సీహెచ్.నాగార్జున తదితరులు పాల్గొని సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఇక రఘునాథపాలెం మండలంలోని రాములుతండా, రఘునాథపాలెంల్లో నిర్వహించిన ప్రజాబాటలో ఏడీ సంజయ్‌కుమార్, ఏఈలు సతీష్, శంకర్ పాల్గొనగా సర్పంచ్‌లు జి.కృష్ణారావు, వెంకరామ్, స్థానికులు సమస్యలను వివరించారు. అలాగే, ముదిగొండలో నిర్వహించిన ప్రజాబాటలో ఏడీఈ రమ్య, సర్పంచ్ కట్టకూరి ఉపేందర్, ఉపసర్పంచ్ పార్వతి, ఏఈ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొల్గొన్నారు. ఇక బోనకల్ మండలం ముష్టికుంట్ల, కల్లూరు మండలం లక్ష్మీపురం(రాళ్లబంజరు)లో జరిగిన ప్రజా బాట కార్యక్రమాల్లో ఏడీఏ వైవీ.ఆనంద్, ఏఈలు టి.మనోహర్, మహేంద్రబాబు, సర్పంచ్‌లు పిల్లలమర్రి నాగేశ్వరావు, భూక్యా రవీంద్రబాబు, ఉద్యోగులు ఉస్మాన్‌బేగ్, బత్తుల సత్యనారాయణ, శ్రీను, జమీల్, ఏసుపాదం పాల్గొన్నారు. సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ -
ఇంకొన్ని రోజులు ఆగాలి..
● ఎస్సెస్సీ విద్యార్థుల అల్పాహారానికి నిధులు ● వచ్చేనెల 16వ తేదీ నుంచి 19 రోజుల పాటే అమలుకు నిర్ణయం ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా వివిధ కార్యక్రమాలు అమలుచేస్తూనే పదో తరగతి ఫలితాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యాన ఎస్సెస్సీ విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులకు హాజరై ఇళ్లకు వెళ్లేసరికి విద్యార్థులు ఆకలితో బాధపడకుండా అల్పాహారం అందించాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికే ప్రత్యేక తరగతులు మొదలైనా వచ్చేనెల 16నుంచి అల్పాహారం అందించాలన్న నిర్ణయంపై విద్యార్థుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఉదయం, సాయంత్రం తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి కావొస్తుండగా రివిజన్ చేయించడంతో పాటు స్లిప్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉదయం 7–45నుంచి 8–45గంటల వరకు, సాయంత్రం 4–15నుంచి 5–15గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల్లో విద్యార్థులను చదివించడమే కాక వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అయితే, ఉదయం 7–45గంటలకు పాఠశాలకు వచ్చే విద్యార్థులు సాయంత్రం 5–30గంటల వరకు ఉండాల్సి రావడం, ఆతర్వాత గ్రామీణ విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సరికి ఆలస్యమై ఆకలితో బాధపడుతున్నారు. ఈనేపథ్యాన కొన్ని పాఠశాలల్లో దాతల సాయంతో అల్పాహారం సమకూరుస్తుండగా ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లో అమలుకు నిర్ణయించింది. జిల్లాల్లో అన్ని యాజమాన్యాలు కలిపి 195 పాఠశాలల్లో 5,508మంది ఎస్సెస్సీ విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.15చొప్పున రూ.82,620 కేటాయించగా, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు అమలు కోసం 19రోజులకు రూ.15,69,780 నిధులు కేటాయించారు. ఈ నిధులు త్వరలో డీఈఓ ఖాతాలో జమ కానుండగా హెచ్ఎంల ఖాతాలకు బదలాయిస్తారు. ముందు ప్రారంభిస్తేనే... ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ నుంచే ఉదయం, సాయంత్రం ఎస్సెస్సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఇళ్లకు చేరే సరికి ఆలస్యమవుతోంది. ఈనేపథ్యాన ప్రభుత్వం ఫిబ్రవరి 19నుంచి అల్పాహారం అందించనున్నట్లు ప్రకటించింది. అలా కాకుండా ఇప్పటినుంచే అల్పాహారం అమలుకు నిర్ణయిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం పునరాలోచన చేయాలని వారు కోరుతున్నారు. -
తెలంగాణ జట్టు బోణీ
పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి అండర్ –17 బాలుర కబడ్డీ పోటీలో తెలంగాణ జట్టు బోణీ చేసింది. రెండో రోజైన గురువారం తమిళనాడు – తెలంగాణ జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఆరు పాయింట్ల తేడాతో రాష్ట్ర జట్టు గెలుపొందింది. జట్టుకు సారథ్యం వహించిన దేవరాజ్ 20 రైడ్ పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభంలో మౌరి టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రాష్ట్ర జట్టుకు యూనిఫామ్, షూ అందజేశారు. తమిళనాడుపై గెలుపొందిన రాష్ట్ర జట్టు -
రోశిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు: పీసీసీ మాజీ సభ్యుడు యడమకంటి రోశిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. నాగినేనిప్రోలులోని రోశిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి నివాళులర్పించాక ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడిగా భద్రాచలం, బూర్గంపాడులో పార్టీ అభివృద్ధికి కృషిచేశారని, దివంగత మంత్రి రాంరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. -
ఐఆర్‌ఏడీతో రోడ్డు ప్రమాదాల కట్టడి
● డేటా ఆధారంగా ప్రమాదాలకు కారణాల విశ్లేషణ ● బ్లాక్స్పాట్ల వద్ద అధికారుల పరిశీలనఖమ్మం అర్బన్/కామేపల్లి: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్(ఐఆర్‌ఏడీ) యాప్ కీలకం కానుంది. ఈ మేరకు రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు ఐఆర్ఏడీలో నమోదైన వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో రెండు రోజులుగా అధికారులు పరిశీలిస్తూ వివరాలు ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలం, సమయం, వాహనాల వివరాలు, ప్రమాదానికి కారణాలను యాప్‌లో పొందుపరిస్తే వివరాల విశ్లేషణ ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించే అవకాశముంటుందని చెబుతున్నారు. తద్వారా ఆయా ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉంటే సరిచేయడమే కాక ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురుకాకుండా నిర్వహణపై దృష్టి సారించనున్నారు. కారణాలు ఏమిటి? ఖమ్మంలోని జెడ్పీ జంక్షన్, మమత హాస్పిటల్ రోడ్, ఇల్లెందు రోడ్డులోని బూడిదంపాడు, ధంసలాపురంతో పాటు కామేపల్లి మండలంలోని ముచర్ల క్రాస్, లింగాల క్రాస్, ధంసలాపురం ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు గురువారం సంయుక్త తనిఖీలు చేపట్టారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఐఆర్‌ఏడీ డీఆర్ఎం హరిబాబుతో పాటు రవాణా, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దినెలలుగా ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలపై ఆరా తీసిన అధికారులు అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు. అప్పటికప్పుడే భద్రతా ఏర్పాట్లు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో పరిశీలన సందర్భంగా అధికారులు కారణాలపై ఆరా తీశారు. ఈమేరకు రంబుల్ స్ట్రిప్‌లు, ట్రాఫిక్ సైన్ బోర్డులు, ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుతో పాటు జీబ్రా క్రాసింగ్‌లు, మార్కింగ్ చెరిగిపోయిన చోట కొత్తగా ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేకాక పోలీసు, రవాణా, వైద్య, ఆరోగ్యం, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్న సూచనలతో ఈ తనిఖీలు చేపట్టడమే కాక పలుచోట్ల తక్షణ చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే ఖమ్మంలోని పలు రహదారులపై మార్కింగ్ వేయించారు. -
కలకోటలో చేపల చోరీకి యత్నం
బోనకల్: మండలంలోని కలకోట చెరువులో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చేపల చోరీకి యత్నించారు. అదే సమయానికి మత్స్య సహకార సంఘం సభ్యులు వచ్చేసరికి వారు పారిపోయారు. అప్పటికే పెద్దమొత్తంలో చేపలు పట్టి తరలించేందుకు సిద్ధం కాగా, వాటితో పాటు వలలను వదిలేసి వెనుదిరిగారు. ఘటనపై సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.వెంకన్న తెలిపారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి మధిర: మధిర – తొండలగోపవరం రైల్వేస్టేషన్ల మధ్య గురువారం రైలు నుంచి జారిపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం వద్ద లభించిన ఆధార్‌కార్డులోని వివరాల ఆధారంగా బిహార్ రాష్ట్రానికి చెందిన దాతీలాల్(27)గా గుర్తించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని ఆర్కే ఫౌండేషన్ బాధ్యులు సహకారంతో మధిర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించగా, వివరాల కోసం 98481 14202, 99636 41484 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు.. సత్తుపల్లిరూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేటకు చెందిన మేధమంచి వరప్రసాద్(65) గురువారం తన ద్విచక్రవాహనంపై వస్తుండగా.. సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. ఉరి వేసుకుని యువకుడి బలవన్మరణం ఖమ్మం అర్బన్: ఖమ్మం పాండురంగాపురానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసున్నాడు. పాండురంగాపురానికి చెందిన శాసనాల రాఘవేంద్ర(31) మద్యం సేవిస్తూ జులాయిగా తిరిగేవాడు. ఆయన ప్రవర్తన నచ్చక భార్య ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోగా, తల్లిదండ్రులు మరోచోట నివాసం ఉంటున్నారు. ఈక్రమాన రాఘవేంద్ర బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి మార్చురీకి తరలించినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
సత్తుపల్లి జిల్లాపై ఆశలు
● పునర్విభజనపై తాజాగా మంత్రి పొంగులేటి ప్రకటన ● కాంగ్రెస్ హామీల్లో ఉండడంతో చర్చసత్తుపల్లి: గతంలో జిల్లాల పునర్వీభజన శాసీ్త్రయంగా జరగనందున జిల్లాల పునర్విభజనపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనతో సత్తుపల్లి జిల్లాపై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను పునర్విభజన చేస్తారే తప్ప పెంచే ఆలోచన లేదని చెబుతున్నా.. కొత్తగా ఫ్యూచర్ సిటీ జిల్లా ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో సత్తుపల్లిలో చర్చ మొదలైంది. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి జిల్లాగా చేయడంతో పాటు మండలాల సంఖ్య పది నుంచి పదిహేడుకు పెంచాలని, అశ్వారావుపేటను డివిజన్‌గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక స్థానం సత్తుపల్లి నియోజకవర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి గెలిచిన జలగం వెంగళరావు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే, ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా గతంలో ఇక్కడి నుంచి గెలిచారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఇదే నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం. దీంతో జిల్లా ఏర్పాటుపై వీరి మనస్సులో ఏముందోనన్న చర్చ జరుగుతోంది. ఉద్యమానికి సహకారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కల్లూరుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ సత్తుపల్లి ఎమ్మెల్యేగా రాగమయిని గెలిపిస్తే సత్తుపల్లి జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వానికి సూచన చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీగా ఉన్నప్పుడు సత్తుపల్లి జిల్లా సాధన ఉద్యమానికి మద్దతు పలకటమే కాక అప్పటి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తటస్థ వైఖరి అవలభించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వరకే జిల్లాలు చేయాలని సూచించిన తాను 33 జిల్లాలు ఏర్పడతాయని అనుకోలేదంటూ దాటవేత వైఖరిని ప్రదర్శించారు. కాగా, సత్తుపల్లి జిల్లా సాధన ఉద్యమానికి అప్పటి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకరించారు. అంతేకాక గత ఎన్నికల సమయాన బీఆర్ఎస్ను గెలిపిస్తే సత్తుపల్లి జిల్లా హామీని నెరవేర్చేలా దృష్టికి కేసీఆర్‌కు చెబుతానని ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాగమయి దయానంద్ జిల్లా సాధన కోసం ప్రియాంక గాంధీతో ప్రకటన చేయించగా.. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఎన్నికల నినాదంగా.. ఎన్నికల సమయంలోనే సత్తుపల్లి జిల్లా ప్రతిపాదన తెరపైకి రావడం.. ఆ తర్వాత ఊసెత్తకపోవడంపై స్థానికుల్లో అసహనం వ్యక్తమవుతుంది. ఇప్పుడు కాకపోతే సత్తుపల్లి ఇంకెప్పుడు జిల్లా కాదంటూ సోషల్ మీడియాలో వేదికగా ప్రచారం చేస్తున్నారు. గతంలో జిల్లా సాధన సమితి(జేఏసీ) ఆధ్వర్యాన 129 రోజులు రిలే నిరాహార దీక్షలు, రెండు సార్లు సత్తుపల్లి బంద్ నిర్వహించిన నేపథ్యాన ఈసారైనా సానుకూల ప్రకటన వస్తుందని స్థానికులు ఎదురుచూస్తున్నారు. -
మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు
ఖమ్మం లీగల్: రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన మహిళా న్యాయవాదులకు గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రంగులతో రంగవల్లులను తీర్చిదిద్దారు. కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన పోటీల సందర్భంగా హరిదాసు ప్రదర్శన ఇవ్వగా, బార్ అసోసియేషన్ బాధ్యులు ఇందిర, విజయశాంత తదితరులు పండుగ వంటకాలు చేశారు. అనంతరం ముగ్గులను న్యాయమూర్తులు వెంపటి అపర్ణ, అర్చనాకుమారి, అఖిల, న్యాయవాది శ్రీలక్ష్మి పరిశీలించి బహుమతులు ప్రకటించారు. ఈమేరకు మంగ లక్ష్మి, ఉమారాణి, లలిత మొదటి మూడు స్థానాల్లో నిలవగా, పోలిశెట్టి పద్మావతి, ఆసియా, నజీమా, శృతి, స్వాతి ప్రత్యేక బహమతులు గెలుచుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తొండపు వెంకటేశ్వరరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన మేయర్, కార్పొరేటర్లు
● నగర అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని వినతి ● కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర అభివృద్ధికి రూ.250 కోట్ల నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో మేయర్ పునుకొల్లు నీరజ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు సీఎంను హైదరాబాద్‌లో కలిసి నిధుల మంజూరు కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే, ఎల్ఆర్ఎస్ నిధులు రూ.57 కోట్లు వినియోగించుకునేందుకు పరిపాలన అనుమతి ఇప్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. నగరంలో మౌలిక వసతులు, అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, పారిశుద్ద్యం మెరుగు పరిచేందుకు మరిన్ని నిధులు అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మేయర్ నీరజ వెల్లడించారు. కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల సమక్షాన కార్పొరేటర్లు తోట ఉమారాణి, దనాల రాధ, రుద్రగాని శ్రీదేవికి కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇటీవలే ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరగా వీరితో కలిపి ఎనిమిదికి చేరింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, నాయకులు తుమ్మల యుగంధర్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
వైరా: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ ఆదేశించారు. వైరాలోని రింగ్‌రోడ్డు సెంటర్, బస్టాండ్ ఆవరణను బుధవారం పరిశీలించిన ఆమె వాహనాల రాకపోకలు, ఇటీవల జరిగిన ప్రమాదాలపై అఽధికారులతో సమీక్షించారు. అయితే, ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లాడ రోడ్డు వైపు గేటు మూసివేతపై స్థానికులు ఫిర్యాదు చేశారు. బస్సులన్నీ ఒకవైపే వస్తుండడంతో ఇటీవల ప్రమాదాలు పెరిగాయని తెలిపారు. అనంతరం ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రమాదాల కట్టడికి అవసరమైన మార్పులు చేయాలని స్పష్టం చేశారు. ఆర్అండ్బీ డీఈ ఎం.రమేష్‌తో పాటు పోలీసు, రవాణా శాఖ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 10,345 మె.టన్నుల యూరియా
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రస్తుతం 10,345 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈమేరకు 83 పీఏసీఎస్‌ల్లో 1,169.10 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ షాపుల్లో 525.70 మెట్రిక్ టన్నులు యూరియా ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. యాసంగి సాగుకు అవసరమైన యూరియా అన్ని మండలాల్లో పంపిణీ చేస్తుండగా అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే రైతులు ఏఓలు, ఏఓఈల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. సీతారామ భూసేకరణ పూర్తి చేయాలి ఖమ్మం అర్బన్: సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి డిస్టిబ్య్రూటరీ కాల్వలకు భూసేకరణను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. సీతారామ ప్యాకేజీ–2 పరిధి కాల్వ ద్వారా కల్లూరు, పెనుబల్లి మండలాల్లో 12,454 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు. ఈమేరకు పెనుబల్లి మండలంలో భూసేకరణను ఫిబ్రవరి 3నాటికి పూర్తిచేయాలని ఆదేశించగా, కల్లూరు మండలంలో పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, సర్వేయర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 30 శాతం రక్తం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు.. ఖమ్మంవైద్యవిబాగం: ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్‌ల నిర్వాహకులు సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఇవ్వాలని డీఎంహెచ్ఓ రామారావు ఆదేశించారు. కలెక్టరేట్లో బ్లడ్ బ్యాంక్‌ల నిర్వాహకులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యాన రక్తదాన శిబిరాలు నిర్వహించినప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వడమే కాక సేకరించిన రక్తంలో 30శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు అందించాలని తెలిపారు. అలాగే, శిబిరాల సమయాన హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్ బీ పాజిటివ్ కేసులను గుర్తిస్తే ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీటీసీ సెంటర్లకు రిఫర్ చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ బి.చందునాయక్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకుల్లో నిల్వల వివరాలు ప్రదర్శించడమే కాక స్వచ్చంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగులు సుబ్రహ్మణ్యం, స్వప్నమాధురి, నాగయ్య, మెహమూద్ అలీ, వీరయ్య పాల్గొన్నారు. -
ప్రాక్టికల్స్‌కు రూ.50వేల చొప్పున నిధులు
సత్తుపల్లిటౌన్: జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం రూ.50వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని డీఐఈఓ రవిబాబు తెలిపారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో బుధవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం నాలుగు చొప్పున డిజిటల్స్ స్క్రీన్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అలాగే, వెనకబడిన విద్యార్థులకు కోసం అధ్యాపకులు ప్రతిరోజు స్లిప్‌టెస్ట్‌లు నిర్వహిస్తూ నూరు శాతం ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారని తెలిపారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామని, ఈ కెమెరాల పుటేజీ హైదరాబాద్ ఇంటర్బోర్డ్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధాననమవుతుందని తెలిపారు. కాగా, తొలిసారి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ముందస్తుగా హాల్‌టికెట్లు విడుదల చేసినందున తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఏర్పడిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాలల బాధ్యులు జీ.వీ.లింగారెడ్డి, పాలా ప్రవీణ్‌రెడ్డి, ఎం.మమంద్రారెడ్డి ఉన్నారు. డీఐఈఓ రవిబాబు -
సత్తుపల్లి జిల్లా చేయండి
సత్తుపల్లి/కల్లూరు రూరల్: జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించిన నేపథ్యాన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిసి సత్తుపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్‌తో కలిసి ఆమె సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ప్రియాంకగాంధీ జిల్లా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కొత్త మండలాల ఏర్పాటుపైనా సీఎంకు వివరించారు. ఆతర్వాత రాగమయి దంపతులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కల్లూరులో ఆస్పత్రి ప్రారంభానికి రావాలనికోరారు. ●పెనుబల్లి: మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రభుత్వం తరఫున సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని పెనుబల్లి మండలం సోమ్లానాయక్ తండాకు చెందిన మోతీకుమార్ కోరారు. ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన సీఎంను కలిసి మాట్లాడారు. తన తల్లిదండ్రులు పండ్ల విక్రయిస్తుండగా, సొంత ఇల్లు లేకున్నా అడ్డంకులను అధిగమిస్తూ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నానని తెలి పారు. ఇప్పటికే కిలి మంజారో, మౌంట్ ఎల్బ్రన్ పర్వతాలు అధిరోహించగా, ఎవరెస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీంతో సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే వినతి -
సింథటిక్ మాంజా వినియోగిస్తే నేరం
ఖమ్మంవ్యవసాయం: సింథటిక్‌తో చేసిన మాంజాను జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్రప్రభుత్వం నిషేధించినందున ఎవరైనా అమ్మినా, వినియోగించినా చర్యలు తీసుకోనున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. ఈమేరకు సమాచారం తెలియచేసేందుకు 08742–295323 నంబర్‌తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఈమేరకు అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్‌తో కలిసి డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆవిష్కరించారు. పర్యావరణం, పక్షులు, ప్రజల భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్న నిషేధిత నైలాన్ / సింథటిక్ మాంజా అమ్మినా, వినియోగించడం నేరమని పోస్టర్లను పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులు పాల్గొన్నారు. -
గొల్లగూడెం గోశాలకు రూ.1.20లక్షల వితరణ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం గొల్లగూడెంలోని ఓం శ్రీకృష్ణ గోశాల వెల్ఫేర్ సొసైటీకి ఎన్ఆర్ఐ ఫౌండేషన్, వాసవీ సేవా సభ్యులు బుధవారం రూ.1.20లక్షల విరాళం అందజేశారు. గోవుల గ్రాసం నిమిత్తం ఈ విరాళం అందజేశారని గోశాల బాధ్యులు కేసా హన్మంతరావు తెలిపా రు. ఇందుకు సహకరించిన చిట్టిమల్ల సరిత, పెర్ల మూర్తి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థినుల విరాళం ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల అభివృద్ధికి 1978–19వ బ్యాచ్ విద్యార్థినులు 65వేల విరాళం అందజేశారు. పాఠశాల అభివృద్ధి కోసం ఈ నిధులు వినియోగించాలని కోరుతూ హెచ్ఎం శైలజా లక్ష్మికి బుధవారం నగదు అందజేశారు. పూర్వ విద్యార్థినులు విజయశ్రీ, నిర్మల, సుధారాణి, లక్ష్మి, పి.ఇందిర, కె.అనురాధ, ఉమ, ప్రసన్న, దుర్గ, మాధవి, స్వర్ణలత, పద్మజ, ఝాన్సీలక్ష్మీ, కృష్ణకుమారి, ఎం.విజయలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కాల్వొడ్డు బ్రిడ్జిపై కార్లు, ఆటోలకు అనుమతి ఖమ్మంక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ పెరగనుండడంతో ఖమ్మంలోని కాల్వొడ్డు వద్ద మున్నేటి పాత బ్రిడ్జిపై కార్లు, ఆటోల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఇన్నాళ్లు ద్విచక్రవాహనాలకే అనుమతి ఉండగా, బుధవారం నుంచి 20వ తేదీ వరకు కార్లు, ఆటోలు రాకపోకలు సాగించొచ్చని వెల్లడించారు. బైపాస్ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తే ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, పాత బ్రిడ్జిపై రెండు వైపులా తవ్వి ఉన్నందున వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు. పశుసంపద.. గ్రామ ఆర్థిక బలానికి పునాది రఘునాథపాలెం: గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుసంపద కీలకంగా నిలుస్తుందని జిల్లా పశువైద్యాధికారి బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో బుధవారం పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స కోసం ఏర్పాటుచేసిన శిబిరాన్ని సర్పంచ్ కాపా ఆదినారాయణతో కలిసి ప్రారంభించాక ఆయన మాట్లాడా రు. పశుసంవర్ధక శాఖ సేవలు రైతులకు అందేలా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కృషి చేస్తే పశు సంపద వృద్ధి సాధ్యమవుతుందని తెలిపా రు. ఈ పలువురు రైతుల పశువులకు చికిత్స చేయగా, జిల్లా లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ అధికారి రూప్‌కుమార్, ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి బి.కృష్ణ, సిబ్బంది టి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వం గత ఇరవై నెలలుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో పెన్షనర్లు క్షోభకు గురవుతున్నారని, వారి కన్నీరు ప్రభుత్వానికి మంచిదికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ పెన్షనర్ల అసోసియేషన్(పీఆర్పీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి మధు అన్నారు. ఖమ్మంలోని పీఆర్టీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు, నాయకులు గంగవరపు శంకరయ్య, చలపతిరావు, నంబూరి కనకదుర్గ, కొండలరావు, సాధు లక్ష్మణ్‌రావు, గజేంద్రుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పీఆర్పీఏ జిల్లా కన్వీనర్‌గా యలమద్ది వెంకటేశ్వర్లు, కోకన్వీనర్‌గా పిల్లలమర్రి కొండలరావు ఎన్నుకున్నారు. -
55 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
తల్లాడ: తల్లాడ మండలం మల్సూర్‌తండా, మిట్టపల్లి గ్రామాల్లో అక్రమంగా నిల్వ చేసిన 55 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. మల్సూర్తండాలో భూక్యా బద్రి ఇంట్లో 45 క్వింటాళ్లు, మిట్టపల్లిలో షేక్ బడేసాహెబ్ ఇంటి వద్ద పది క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.వెంకటకృష్ణ తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది శశికుమార్, ఆంగోతు శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు. అక్రమ ఫైనాన్స్ కేసులో ఇద్దరి అరెస్ట్ ఖమ్మంఅర్బన్: చట్టవిరుద్ధంగా అధిక వడ్డీతో ఫైనాన్స్ నిర్వహిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని ఖమ్మం అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన పలువురి ఇచ్చిన ఫిర్యాదతో తనిఖీలు చేపట్టగా సారధినగర్కు చెందిన శివకుమార్, దీపాకుమారి అధికవడ్డీతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లు తేలిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణతెలిపారు. వీరి నుంచి ప్రామిసరీ నోట్లు స్వాధీ నం చేసుకోగా, పరారీలో ఉన్న మరో వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు సత్తుపల్లిరూరల్: కోడి పందేలు నిర్వహించిన వారితో పాటు ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సత్తుపల్లి సీఐ శ్రీహరి హెచ్చరించారు. గతంలో కోడి పందేలు, జూదం నిర్వహించిన వారితో పాటు ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించి తహసీల్దార్ ఎదుట 17మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. కాగా, చైనా మంజా విక్రయాలను అరికట్టేలా తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చైనా మాంజా విక్రయించడం, కొనుగోలు చేయడం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం నేరమని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జైలు శిక్షతో పాటు రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. రూ.84వేల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనంఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారయణ నేతృత్వాన ఖమ్మం పాత మున్సిపాలిటీ సమీపంలోని ఓ కిరాణం దుకాణంలో తనిఖీ చేయగా నిషేధిత, హానీకరమైన విదేశీ సిగరెట్లు అమ్ముతున్నట్లు తేలింది. దీంతో వివిధ కంపెనీలకు చెందిన రూ.84,700విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తునకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు పేర్కొన్నారు. -
కబడ్డీ.. కబడ్డీ..
పినపాక: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో బుధవారం ప్రారంభమయ్యాయి. దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి జట్లు హాజరుకాగా, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ భారతదేశంలోనే పుట్టిన సంప్రదాయ క్రీడ అన్నారు. ప్రతీఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి మారుమూల గిరిజన ప్రాంతమైన ఈ బయ్యారంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఇందుకు బాధ్యత తీసుకున్న మౌరీ టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను వారు అభినందించారు. క్రీడా పోటీల కోసం సుమారు ఆరు నెలలు శ్రమించి ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు సమర్థవంతంగా నిర్వహించడం ప్రశంసనీయమని చెప్పారు. తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను ఏర్పాటు చేస్తామని వెల్ల డించారు. కార్యక్రమంలో పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, డీఈఓ నాగలక్ష్మి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పరిశీలకులు నిర్మల్ జాందే, కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వభారత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు 14 మ్యాచ్‌లు.. జాతీయస్థాయి పోటీల్లో మొత్తం 32 జట్లు పాల్గొనగా, లీగ్ దశలో ఎనిమిది గ్రూపులుగా విభజించారు. తొలి రోజు 14 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మధ్యప్రదేశ్–చండీఘర్ జట్లు పోటీ పడగా మధ్యప్రదేశ్ జట్టు, ఆంధ్రప్రదేశ్–జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన పోటీలో ఏపీ జట్టు, పాండిచ్చేరి–పశ్చిమబెంగాల్ జట్లు పోటీ పడగా పాండిచ్చేరి, తమిళనాడు–బిహార్ జట్లు తలపడగా తమిళనాడు, కర్ణాటక–గుజరాత్ జట్ల మధ్య జరిగిన పోటీలో కర్ణాటక, మహారాష్ట్ర–కేరళ జట్లు పోటీపడగా మహారాష్ట్ర, రాజస్థాన్–ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్, హరియాణా–అసోం జట్లు పోటీ పడగా హరి యాణా, ఒడిశా–పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోటీలో పంజాబ్, త్రిపుర–మణిపూర్ జట్లు తలపడగా మణిపూర్ జట్టు గెలుపొందాయి. వీటితో పాటు సీఐఎస్సీఈ–సీబీఎస్ఈ జట్లు పోటీ పడగా సీబీఎస్ఈ, ఢిల్లీ–జమ్మూ కశ్మీర్ జట్లు పోటీ పడగా ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్– సీబీఎస్ఈ వెల్ఫేర్ జట్లు పోటీ పడగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్–ఛత్తీస్‌గఢ్ జట్లు తలపడగా ఛత్తీస్‌గఢ్ విజయం సాధించాయి. -
ఆశ పడితే.. ఊచలే !
● సైబర్ నేరాల నిధులకు ఖాతాలు అప్పగింత ● ఉచ్చులో చిక్కుకున్న అమాయకులు ● ఇప్పుడు ముఖం చాటేస్తున్న సూత్రధారులుసత్తుపల్లి: సైబర్ నేరగాళ్ల లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే, సూత్రధారులు, పాత్రధారులు పాత నేరస్తులే అవుతుండడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.14కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్ల వెనుక సత్తుపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. కాంబోడియా కేంద్రంగా ఈ నేరానికి పాల్పడగా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన దాసరి మణిరాం, శివకృష్ణ, బ్రహ్మనాయుడు, పవన్‌కల్యాణ్‌ను రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ను కోర్టు అనుమతితో సత్తుపల్లి రూరల్ పోలీసులు రెండు రోజులు విచారించి తిరిగి జిల్లా జైలుకు పంపించారు. అయితే సైబర్ నేరాలకు పాల్పడిన వారు తెలివిగా పలువురి అకౌంట్లను సేకరించి డబ్బు జమ చేయగా.. వారిని విచారిస్తుండడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఈ కేసులో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతుండగా, పోట్రు కల్యాణ్ తదితరుల కోసం గాలిస్తున్నారు. బెట్టింగ్ అప్పులు తీర్చి.. అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తి సత్తుపల్లిలో చదివాక పీజీ చేశాడు. ఆ సమయంలో సత్తుపల్లిలోని ప్రముఖ పాఠశాల బాధ్యుడి కుమారుడితో స్నేహం ఏర్పడింది. అశ్వారావుపేట యువకుడు విద్యాభ్యాసం తర్వాత పొట్టకూటి కోసం ఆటో నడుపుతూ క్యాటరింగ్ చేస్తుండగా బెట్టింగ్ వ్యసనంతో రూ.4 లక్షల అప్పులయ్యాయి. ఆ సమయాన సైబర్ నేరాల్లో కీలక వ్యక్తి కలిసి తనతో ఉన్నవాళ్లంతా డబ్బు సంపాదించారని, తనతో వస్తే బాకీలు తీరుస్తానని నమ్మించి హైదరాబాద్‌లోని తన ఆఫీస్‌లో ఉద్యోగం ఇచ్చాడని తెలిసింది. ఆపై ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ మోసాల్లో శిక్షణ ఇవ్వగా వ్యవహారమంతా అశ్వారావుపేట వాసి పేరిట నడవడంతో ఆయన ఇప్పుడు కేసు నమోదైంది. కేసు నుంచి బయట వేయమని బాధ్యుల కుటుంబీకులను కోరితే బుకాయిస్తున్నారని ఆయన తల్లి వాపోతోంది. ప్రధాన నిందితులు మాత్రం రూ.కోట్లు కొల్లగొట్టి జల్సాలు చేస్తుండగా.. వీరి ఆగడాలపై నోరు మెదిపేందుకు కమీషన్ కోసం ఆశపడిన వారు జంకుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అప్పనంగా వచ్చే కమీషన్‌కు కక్కుర్తిపడిన కొందరు ఆధార్, పాన్‌కార్డులను ఆర్థిక నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. సత్తుపల్లి డివిజన్లో పలు వురు ఇలా ఖాతా వివరాలు ఇచ్చాక అందులో నేరగాళ్లు డబ్బు జమ చేయించడంతో పోలీసు ల విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. నిందితులు రూ.లక్షకు రూ.20వేలు కమీషన్ కింద మినహాయించుకొని మిగిలిన డబ్బు ఇవ్వాలనే నిబంధనతో ఖాతాలు సేకరించినట్లు సమాచారం. వేంసూరు మండలం రాజుగూడెంకు చెందిన ఓ వ్యక్తి ఈ తరహా అకౌంట్లు తెరిపించి డబ్బు బదలాయించిన తర్వాత కొందరు డబ్బులు వాడుకోవటంతో వారిని చితకబాది రికవరీకి ప్రయత్నించినట్లు తెలిసింది. -
జీఆర్‌సీలతో మహిళలకు భరోసా
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబాల్లో వేధింపులు, సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న మహిళలకు తక్షణ సాయం అందించేందుకు జండర్ రిసోర్స్ సెంటర్లు(జీఆర్సీ) ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రత్యేక నిధులు కేటాయించడమే కాక బాధితులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వేధింపుల నుంచి విముక్తి గ్రామీణ ప్రాంత మహిళలు గృహహింస, ఇతర వేధింపులకు గురైనా ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చట్టపరమైన అవగాహన లేక మౌనంగా భరిస్తున్నారు. ఇలాంటి వారికి జీఆర్సీలు పరిష్కారం చూపనున్నాయి. సెర్ప్ సీఈఓ ప్రత్యేక కార్యాచరణతో జీఆర్సీలపై జిల్లాల వారీగా మండల సమాఖ్యలు, ఏపీఎంలు, సీఓలు, సీసీలు, ఓబీలకు శిక్షణ ఇస్తున్నారు. నాలుగు మండలాలు ఎంపిక తొలి విడతగా జిల్లాలో జీఆర్‌సీల ఏర్పాటుకు నాలుగు మండలాలను ఎంపిక చేశారు. బోనకల్, మధిర, కల్లూరు, ఖమ్మం రూరల్ మండలాల్లో సెంటర్ల ప్రారంభానికి ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను సెంటర్లో వసతుల కల్పనకే కాక బాధితుల సహాయ, సహకారాల కోసం వెచ్చించనున్నారు. తొలుత ఈ సెంటర్లను మండల సమాఖ్య కార్యాలయంలోనే నిర్వహిస్తారు. ఫిర్యాదులు, సేవలు.. జీఆర్సీల్లో సఖి భరోసా సెంటర్ మాదిరిగానే ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు బాధితులకు తక్షణ సేవలు అందిస్తారు. బాధితులకు అవసరమైన న్యాయ సలహాలు, వైద్యసేవలను అందజేస్తారు. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొనే వారికి నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. అలాగే, పోలీస్, ఆశ, అంగన్వాడీలు, ఎస్‌హెచ్‌జీ సభ్యుల ద్వారా మహిళా హక్కులు, చట్టాలపై గ్రామాల్లో అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఇలాంటి వ్యవస్థలు గ్రామీణ స్థాయికి చేరడం ద్వారా మహిళలు ఆర్థికంగానే కాక సామాజికంగా ధైర్యంగా ఉంటారని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి సెర్ప్‌లో భాగమైన జండర్ విభాగం ద్వారా జీఆర్సీ(జండర్ రిసోర్స్ సెంటర్)ల నిర్వహణను మహిళా సంఘాల సభ్యులు, సమాఖ్యలకు అప్పగిస్తున్నట్లు డీఆర్డీవో ఆర్.సన్యాసయ్య వెల్లడించారు. ఖమ్మం టీటీడీసీలో నాలుగు మండలాల సమాఖ్యలు, ఓబీలు, ఏపీఎం, సీఓలు, సీసీలకు బుధవారం ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. లింగ వివక్ష, దాడుల సమయాన మహిళలకు అండగా నిలుస్తూ, సెంటర్ల ద్వారా అందే సేవలను గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, వైద్య, మహిళ శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహిళలకు అవసరమైన సలహాలు, సేవలను అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో సెర్ప్ జండర్ అడ్వైజర్, ట్రైనర్ జమున జీఆర్‌సీల నిర్వహణపై శిక్షణ ఇవ్వగా, అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ, డీపీఎం ఆంజనేయులు, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యంతరాలు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగా జిల్లానుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కుముదిని మాట్లాడుతూ ఈనెల 12న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా విడుదల చేసి, 13వ తేదీన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రటించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితాలపై 192 అభ్యంతరాలు అందగా, 129 పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, డీపీఓ రాంబాబు, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, సంపత్, నర్సింహ, రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
గ్యారంటీలు ఏవీ?
సాక్షిప్రతినిది, ఖమ్మం: ‘ఎన్నికల సమయంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్న మల్లు భట్టివిక్రమార్క గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి. వంద రోజుల తర్వాత మా ప్రభుత్వం రాగానే అందులోని హామీలన్నీ నెరవేరుస్తాం అన్నారు. రెండేళ్లు గడిచినా ఆ 420 హామీలు ఏమయ్యాయి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ మద్దతుతో జిల్లాలో గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం బుధవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించగా కేటీఆర్ మాట్లాడారు. రూపురేఖలు మార్చింది కేసీఆరే.. ఖమ్మంలో రహదారుల విస్తరణ, డివైడర్లు, జంక్షన్ల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని కేటీఆర్ తెలిపారు. లకారం చెరువు అభివృద్ధి, కొత్త బస్టాండ్, కేఎంసీ భవనం, ఐటీ హబ్ నిర్మాణాలు కేసీఆర్ ఘనతేనని చెప్పారు. కానీ తుమ్మల హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెబుతున్నా... 2014లో ఆయన ఓడిపోతే మిత్రుడు కదా అని కేసీఆర్ తీసుకొచ్చి మంత్రిని చేశాడని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పూర్తయ్యేదని తెలిపారు. కేసీఆరే అభ్యర్థిగా భావించండి.. త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్‌గా భావించి ఓట్లు వేయాలని కోరారు. జిల్లా ప్రజలు ‘పోతే గీతే మా ఎమ్మెల్యే పోతడు, కేసీఆర్ అయితే ఉంటారు కదా’ అని అనుకోవడంతోనే సీట్లు పోయాయని తెలిపారు. ఈసారి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 7 – 8 అసెంబ్లీ స్థానాలు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల ఇళ్లు తిరుగుతున్న మంత్రి.. ఖమ్మంలో మంత్రి బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మంకు తాను వస్తున్నట్లు తెలిసి ముగ్గురు కార్పొరేటర్లను సీఎం దగ్గర కూర్చోబెట్టాడని తెలిపారు. అయితే, ఎందరిని ఎత్తుకెళ్లినా ప్రజల మద్దతు తమకు ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా 127 మంది సర్పంచ్‌లు, 156 మంది ఉపసర్పంచ్లు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉంది.. ఖమ్మం వస్తుంటే నాయకన్ గూడెం వద్ద స్వాగతం పలికిన వారిలో రైతులు యూరియా బస్తా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగితే ‘పాలిచ్చే గేదెను వద్దనుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నాము’ అని వాపోయారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనిపిస్తోందని తెలిపారు. సుమారు 7.5 లక్షల ఎకరాల కొత్త, పాత ఆయకట్టుకు సాగునీరు అందించేలా కేసీఆర్ డిజైన్ చేసిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి ప్రాజెక్టు గొప్పతనాన్ని చెప్పకుండా కాల్వలు తవ్వలేదని మాట్లాడారని పేర్కొన్నారు. ఇల్లెందు లాంటి ప్రాంతాలకు నీళ్లు వెళ్లకుండా వారే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, బానోతు చంద్రావతి, నాగేశ్వరరావు, హరి ప్రియ, వెంకటేశ్వర్లు, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు కమల్‌రాజు, కూరా కుల నాగభూషణం, నాయకులు దిండిగాల రాజేందర్, గుండాల కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.రూట్ సర్వేలో పాల్గొన్న ఆర్ఎం సరిరామ్, డిపో మేనేజర్లుడిప్యూటీ సీఎంతో పాటు ఇక్కడి ఇద్దరు మంత్రులు పంచాయతీ ఎన్నికల ట్రైలర్‌తో భయపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. గెలిచిన సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరితేనే పథకాలు, నిధులు ఇస్తామని మభ్యపెడితే భయపడొద్దని సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. -
‘యాంత్రీకరణ’ రేపు పునఃప్రారంభం
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఈనెల 9న పునః ప్రారంభించనుండగా, ఈ వేడుకకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని ఆయిల్‌ఫెడ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, అశ్వారావుపేట ఏజీ కాలేజీ ఏడీ డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. వ్యవసాయ కళాశాలలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారని, తద్వారా రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందుతాయని చెప్పారు. అదేరోజు ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతు మేళా కూడా నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్, విశ్వవిద్యాలయం డీడీ గోపి హాజరవుతారని వివరించారు. దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేయనున్న లీఫ్ అండ్ సాయిల్ టెస్ట్(భూసార పరీక్ష కేంద్రం) ల్యాబ్, స్థానిక వ్యవసాయ కళాశాలలో జీవ వైవిధ్యానికి సంబంధించిన బయోపార్క్, కళాశాలలో రూ.5కోట్లతో అదనపు బాలికల వసతి భవనానికి, రూ.3కోట్లతో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. సమావేశంలో ఆయిల్‌ఫెడ్ ఓపీడీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, ఏడీఏ రవి, హెచ్ఆర్ఎస్ హెడ్ శాస్త్రవేత్త శ్రీనివాస్, ఆయిల్‌ఫెడ్ మేనేజర్లు నాగబాబు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. హాజరుకానున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్ -
ఇసుక అక్రమ రవాణాకు ‘చెక్’పోస్ట్
తిరుమలాయపాలెం: అనుమతి లేకుండా ఇసుక తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సీపీ సునీల్‌దత్ ఆదేశాలతో మండలంలోని పాలేరు ఏటి నుండి ఇసుక అక్రమ రవాణా జరగకుండా కాకరవాయిలో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. కొంత కాలంగా మండలంలోని ముజాహిదిపురం పాలేరు ఏటితో పాటు హైదర్‌సాయిపేట పడమటితండా, అజ్మీరాతండా ఆకేరు నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా తరలిస్తున్నారు. పలుమార్లు పోలీసులు కేసులు నమోదు చేసినా రవాణా ఆగడం లేదు. దీంతో నిరంతరం నిఘా కోసం కాకరవాయిలో చెక్‌పోస్టు ఏర్పాటుచేసి ఏఆర్ కానిస్టేబుళ్లతో 24గంటల పాటు గస్తీ కాస్తున్నట్లు ఎస్సై కె.జగదీశ్ తెలిపారు. కాగా, హైదర్‌సాయిపేట పడమటితండాలోనూ నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. -
కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
● చైనా మాంజా విక్రయాలు, వినియోగం నేరమే ఖమ్మంక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు నిర్వహించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషన ర్ సునీల్‌దత్ హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో పందేలు, పేకాట స్థావరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాల ని అధికారులను ఆదేశించారు. అలాగే, పక్షులతో పాటు ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజా విక్రయించినా, వినియోగించి నా కఠినంగా వ్యవహరిస్తామని సీపీ తెలిపారు. సింథటిక్ దారం, గాజు పొడితో చేసే ఈ మాంజాతో పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడమే కాక మనుషులకు గాయాలయవుతాయని వెల్లడించారు. దీని విక్రయం, వినియోగం వివరాలు తెలిస్తే ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. ఈసీఆర్ విద్యార్థులకు వరం ఖమ్మం సహకారనగర్: ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వరంలా నిలుస్తోందని డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఖమ్మం అర్బన్ ఎమ్మార్సీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండో విడతగా 30 రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం తొలిదశతో విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం గణనీయంగా పెరిగినందున రెండో విడతపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాగా, వచ్చేనెలలో జరగనున్న ఎఫ్ఎల్ఎస్ సర్వేలో జిల్లా అగ్రస్థానాన నిలిచేలా కృషి చేయాలని ఆమె తెలిపారు. సూచించారు. ఈ సమావేశంలో సీఎంఓ ప్రవీణ్‌కుమార్, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజ లక్ష్మీ, హెచ్ఎంలు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. పేరు పెట్టండి.. బహుమతి పట్టండి!ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్‌కు కొత్త పేరు, ట్యాగ్‌లైన్ కోసం ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి పోటీల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. పార్క్‌కు కొత్త పేరు, ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌తో పాటు లోగో రూపకల్పన కోసం పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10నుంచి 20వ తేదీ వరకు ఆసక్తి ఉన్న వారు సూచనలు పంపించాలని వెల్లడించారు. ఉత్తమ పేరు, ట్యాగ్‌లైన్‌కు రూ.4 వేల నగదు బహుమతి, ఉత్తమ లోగోకు రూ.4వేల బహుమతి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎఫ్డీఓ మంజుల, జలవనరులశాఖ ఈఈ వెంకట్రామ్, డీఏఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి ఖమ్మంలీగల్: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కల్ప న సూచించారు. ఈనెల 9వ తేదీ వరకు జరగనున్న రహదారి భద్రతా కార్యాచరణ పోస్టర్లను మంగళవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్లు, కార్లు నడిపే వారు సీట్‌బెల్ట్ తప్పక ధరించడంతో పాటు పరిమిత వేగంతో నడిపితే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. అంతేకాక ప్రయాణ సమయంలో అవసరమైన అన్ని పత్రాలను వెంట తీసుకెళ్తే తనిఖీల సమయాన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ జగదీష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో కార్యదర్శులదే కీలకపాత్ర
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ అభివృద్ధిలో కార్యదర్శులదే కీలకపాత్ర అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–4 కార్యదర్శులుగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంగళవారం అందజేశాక కలెక్టర్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామాల్లో పచ్చదనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వంద శాతం పన్నులు వసూలు చేస్తూనే ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ పంచాయతీ అధికారి రాంబాబు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో యూరియా పంపిణీకి సమగ్ర చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. యాసంగి పంటల సాగుకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నందున దుష్ప్రచారాలను రైతులు నమ్మొద్దని సూచించారు. అన్ని మండలాల్లో పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచి పంపిణీకి ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 11,817 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 25,773 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని పేర్కొన్నారు. జిల్లా యంత్రాగం నిరంతరం పర్యవేక్షిస్తున్నందున రైతులు అపోహలకు గురికావొద్దని, ఎక్కడైనా సమస్య ఎదురైతే ఏఓ, ఏఈఓల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. కలెక్టర్ అనుదీప్ -
లెర్నింగ్ లైసెన్స్‌తో పాటు హెల్మెట్లు
ఖమ్మంక్రైం: రవాణా శాఖలో ఏజెంట్ల దందాను అరికట్టేందుకు వాహనదారులు తమ పనుల కోసం నేరుగా వచ్చేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈక్రమంలోనే నేరుగా దరఖాస్తు చేసుకుని వచ్చి లెర్నింగ్ లైసెన్స్ పొందిన పలువురికి జిల్లా రవాణా శాఖ అధికారి జగదీష్ మంగళవారం లైసెన్స్ కాపీతో ప్రోత్సాహకంగా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వాహనదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని నేరుగా కార్యాలయానికి రావాలని సూచించారు. కాగా, రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిబంధనలపై పరీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీఏ సభ్యుడు వెంకన్న, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలతతో పాటు రవిచంద్రన్, రమేష్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
పుర పోరుకు అడుగులు..
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026తొలి అంకం పూర్తయినట్టే... జిల్లాలో సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీలకు పాలకవర్గాల గడువు ముగియగా.. కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలు నూతనంగా ఎర్పడ్డాయి. వీటిలో ఓటర్ల ముసాయిదా జాబితాలు విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా 117 వార్డుల్లో 1,42,901 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలతో మున్సిపాలిటీల్లో ఎన్నికల కళ రాగా, ప్రజలు పరిశీలించి ఓటు హక్కు ఉందా, లేదా.. ఏ వార్డులో ఉందని ఆరా తీస్తున్నారు. వార్డులు మారాయి.. ముసాయిదా ఓటరు జాబితాపై మార్పులు, చేర్పులపై వినతులు స్వీకరించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 100 అభ్యంతరాలు అందగా ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించారు. అత్యధికంగా వైరా మున్సిపాలిటీలో 30 ఫిర్యాదులు అందాయి. చాలా కుటుంబాల్లో ఒకరి ఓటు ఓ వార్డులో, ఇంకొకరి ఓటు మరో వార్డులో వచ్చినందున సరిచేయాలని కోరారు. మధిర మున్సిపాలిటీలో కూడా ఇదే తరహా వినతులు అందాయి. ఇళ్లు మారిన వారు తమ ఓటు హక్కును ప్రస్తుత వార్డుకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. కల్లూరు మున్సిపాలిటీలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేరే వార్డులో ఉన్నాయని 19 అభ్యంతరాలు నమోదయ్యాయి. వీటిని పరిశీలించిన అధికారులు ప్రస్తుతం వారు ఉంటున్న వార్డుకే ఓటు హక్కు బదలాయించడంపై దృష్టి సారించారు. అంతటా ఎన్నికల మూడ్.. ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసినప్పటి నుంచి మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. జాబితాలు పరిశీలించిన రాజకీయ నాయకులు తమ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎవరివైనా పేర్లు లేవా అని ఆరా తీస్తున్నారు. అంతేకాక ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎవరు ఎవరికి ఓటు వేసే అవకాశం ఉందో కూడా పరిశీలిస్తున్నారు. ఈనెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో తమ సీటు కోసం నేతలు, ప్రజాప్రతినిదులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలనే అంశంపై దృష్టి సారించాయి.ముసాయిదా ఓటర్ల జాబితాపై అందిన అభ్యంతరాలతో పాటు మార్పులు, చేర్పులను అధికారులు పరిష్కరిస్తున్నారు. అలాగే, సోమవారం మున్సిపాలిటీల్లో పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే, మంగళవారం జిల్లాస్థాయిలో సమావేశం పూర్తయింది. ఈ సమావేశాల్లో అందిన సలహాలను కూడా పరిగనణలోకి తీసుకుని 10వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.ముసాయిదా ఓటర్ల జాబితాపై 100 అభ్యంతరాలు -
చరిత్రలో నిలిచిపోయేలా సభ
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈనెల 18న ఖమ్మంలో జరగనుండగా, చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ జాతీయ సమితి సభ్యుడు, ఉత్సవాల ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే సభకు అన్ని రాష్ట్రాల నుంచి సీపీఐ నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు. సభ జయప్రదం కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నామని, 9న ఖమ్మంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, 10 నుంచి 14 వరకు కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. అంతేకాక ఈనెల 12న డీపీఆర్సీ భవనంలో జరిగే కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు సుద్దాల అశోక్‌తేజ, కేవీఎల్ తదితరులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇప్పటికే సేకరించిన వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి రచనలతో ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు. అలాగే, ఈనెల 17న జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం, 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఇక 20వ తేదీన ‘దేశంలో వామపక్ష ఉద్యమం – ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై జరిగే జాతీయ స్థాయి సెమినార్లో అన్ని వామపక్షాల జాతీయ నాయకులు పాల్గొంటారని బాగం వివరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు ఏపూరి లతాదేవి, జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఐ శత వార్షిక సభ ఆహ్వాన సంఘం కార్యదర్శి బాగం -
వైద్యసేవల్లో ఆశాల పాత్ర కీలకం
కొణిజర్ల: వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాల విజయవంతంలో ఏఎన్ఎం పాత్ర ముఖ్యం కాగా, వైద్యసేవల్లో ఆశా కార్యకర్తల సేవలు కీలకంగా నిలుస్తున్నాయని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. కొణిజర్ల పీహెచ్సీలో మంగళవారం ఆశా డే సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రజలకు వైద్యసేవలు సాఫీగా అందాలంటే ఆశాల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంపు, నవజాత శిశువుల సంరక్షణ, వంద శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నేటి నుంచి కబడ్డీ కూత
పినపాక: జాతీయస్థాయి అండర్ – 17 బాలుర కబడ్డీ పోటీలకు పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్ధమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రీడా ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు, సుమారు 500 మంది వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సింగరేణి సహకారంతో క్రీడా ప్రాంగణం, పార్కింగ్ పరిసరాల్లో భారీ ఎల్ఈడీ లైట్లు అమర్చారు. పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 33 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలిరాగా, మణుగూరు రైల్వే స్టేషన్లో వారికి నిర్వాహకులు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇసుక తిన్నెల్లో సాధన.. కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ముందుగానే చేరుకున్న తెలంగాణ రాష్ట్ర జట్టు మంగళవారం గోదావరి ఇసుక తిన్నెల్లో సాధన చేసింది. మరికొన్ని రాష్ట్రాల వారు వ్యాయామం, యోగా వంటివి చేశారు. క్రీడాకారులకు అధికారులతో పాటు మౌరీ టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల వారికి అనుగుణంగా అల్పాహారంలో బ్రెడ్, జామ్, గుడ్లు, సాంబార్, ఇడ్లీ, పూరి వంటి రుచికరమైన వంటలు అందించారు. మధ్యాహ్నం, రాత్రి రోటీలు, చపాతి, సబ్జి, దాల్ ఫ్రై, రైస్, కర్డ్ రైస్ వంటివి సమకూర్చారు. -
సంక్రాంతికి వచ్చేయండి!
● 1,368 బస్సు సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు ● ఖమ్మం రీజియన్‌లో ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ● ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు నిర్వహణ ఖమ్మంమయూరిసెంటర్: సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సిద్ధమైంది. పండుగకు సొంత గ్రామాలకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి 1,368బస్సు సర్వీసుల నిర్వహణకు సన్నాహాలు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి పండుగకు ముందుగానే ప్రత్యేక సర్వీసులు మొదలుపెట్టాలని నిర్ణయించగా, ఈ బస్సులు 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే, అదనపు సర్వీసుల్లో సాధారణ చార్జీల కన్నా అదనంగా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. డిమాండ్ ఆధారంగా రిజర్వేషన్ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయితే, 11, 17వ తేదీల్లో మహాలక్ష్మి సర్వీసులు(పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్) బస్సుల్లో కాకుండా ఇతర సర్వీసుల్లో అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా.. విద్యా, ఉద్యోగ, వృత్తి వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఉంటున్న వారు సంక్రాంతికి సొంత ఊర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విద్యాసంస్థలకు ఈనెల 10నుంచి సెలవులు మొదలుకానుండగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల కోసం ఈనెల 9 నుండి 15వ తేదీ వరకు 799 సర్వీసులు నడిపిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్‌కు 569 బస్సు సర్వీసులు ఉంటాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే అదనంగా బస్సులు నడిపేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు. రిజర్వేషన్ సౌకర్యం సంక్రాంతి పండుగకు ఆర్టీసీ నడిపించే అదనపు బస్సులకు సంస్థ రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాకు 365 రిజర్వేషన్ సర్వీసులను, తిరుగు ప్రయాణంలో 236 రిజర్వేషన్ సర్వీసులు నడిపిస్తారు.తేదీ రిజర్వేషన్ నాన్ మొత్తం రిజర్వేషన్ 9 68 80 148 10 68 80 148 11 68 88 156 12 68 88 156 13 68 88 156 14 15 20 35 15 10 20 30 ఇక తిరుగు ప్రయాణంలో ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్‌కు ఈనెల 16న రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ కలిపి 90 సర్వీసులు నడిపిస్తారు. అలాగే, 17వ తేదీన 138, 18వ తేదీన 173, 19వ తేదీ 128, 20వ తేదీన 40 సర్వీసులు నడిపించేలా ప్రణాళిక రూపొందించారు.సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చే వారి కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తాం. ఏపీకి వెళ్లే ప్రయాణికులు కూడా ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే అవకాశం ఉండడంతో ఈ ఏడాది సర్వీసుల సంఖ్య పెంచాం. ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఎంచుకునేలా ప్రచారం చేస్తాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్, ఆర్టీసీ -
చిత్తడి నేలల గుర్తింపునకు కార్యాచరణ
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపునకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన వెట్ ల్యాండ్ కమిటీ సమావేశంలో డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వెట్ ల్యాండ్ పరిమితి, ప్రాంతం స్పష్టంగా తెలిసేలా సర్వే శాఖ సహకారంతో నోటిఫికేషన్ రూపొందించాలని తెలిపారు. పట్టా భూముల సర్వే నెంబర్లు స్పష్టంగా తెలిసేలా పొందుపర్చాలని చెప్పారు. కాగా, చిత్తడి నేలలు నోటిఫికేషన్ ద్వారా భూమి యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నేలల్లో స్వభావ మార్పు చేయకుండా, నిర్మాణ వ్యర్థాలు, శుద్ధి చేయని వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ విషయమై గ్రామ సభలు నిర్వహించి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ చిత్తడి భూముల జియో ట్యాగింగ్ చేస్తున్నామని, ఆయా భూముల్లో నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఉండదని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, ఎఫ్డీఓ మంజుల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
కొత్త మిర్చి వస్తోంది..
● ఖమ్మం మార్కెట్‌కు నానాటికీ పెరుగుతున్న సరుకు ● తొలి కోత మైలకాయ విక్రయానికే మొగ్గు ● దేశీయ డిమాండ్ మేరకే ధరలుఖమ్మంవ్యవసాయం: తెలుగు రాష్ట్రాల్లో ‘తేజా’ మిర్చి కొనుగోళ్లకు పేరున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొద్ది రోజులుగా సరుకు రాక క్రమంగా పెరుగుతోంది. సాధారణంగా సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి కోతలు, విక్రయాలు మొదలవుతాయి. కానీ రెండేళ్లుగా ముందస్తు సాగుతో జనవరి ఆరంభం నాటికే కోతలు ప్రారంభమవుతున్నాయి. ఏటా మిర్చి సాగు సెప్టెంబర్‌లో మొదలుకావాల్సి ఉండగా జూలైలోనే నారు పోసి, ఆగస్టు నుంచి సాగు చేస్తుండడంతో ముందస్తు కోతకు వస్తోంది. డిసెంబర్ చివరి వారం నుంచి అరకొరగా అమ్మకాలు మొదలై జనవరి ఆరంభానికి పెరుగుతున్నాయి. నిత్యం 30వేల బస్తాలు గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు పలువురు మెరుగైన ధర కోసం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. జిల్లాలో 48 కోల్డ్ స్టోరేజీలే కాక పరిసర జిల్లాల కోల్డ్ స్టోరేజీల నుంచి సైతం రైతులు శాంపిళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. నిల్వ మిర్చి నిత్యం 15 వేల బస్తాల వరకు వస్తుండగా, మరోపక్క కొత్త మిర్చి 12వేల నుంచి 15 వేల బస్తాలు వరకు తీసుకొస్తున్నారు. మైలకాయ కావడంతో.. మిర్చి కోతలు మూడు నుంచి నాలుగు సార్లు సాగుతాయి. మొదట కోసే మిర్చిని మైలకాయ చెబుతూ నిల్వ చేయడానికి వీలులేక విక్రయానికి తీసుకొస్తున్నారు. పూర్వం మైలకాయను చేన్లలోనే వదిలేసినా ఇప్పుడు డిమాండ్ ఆధారంగా అమ్ముతున్నారు. ఖమ్మం జిల్లాలో 35 వేల ఎకరాల్లో మిర్చి సాగు కాగా, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్లగొండ, హనుమకొండ జిల్లాల నుంచి సైతం తేజా రకం మిర్చి ఖమ్మం మార్కెట్‌కు వస్తోంది. గిట్టుబాటు కాని ధర ప్రస్తుతం పలుకుతున్న ధర మిర్చి రైతులకు గిట్టుబాటయ్యేలా కానరావడం లేదు. ఏటేటా మిర్చి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువులతో పాటు పురుగుల మందు భారం పడుతుండడంతో ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ పెట్టుబడి ఆధారంగా క్వింటాకు రూ.20 వేల ధర ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతుండగా.. ఆ పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్‌పై ఆశలు పెట్టుకుంటున్నారు. తేజా మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. ప్రధానంగా చైనా దేశానికి ఇక్కడి నుంచి పలువురు వ్యాపారులు ఎగుమతి చేసేవారు. మూడేళ్ల క్రితం ఓ దశలో క్వింటా మిర్చికి రూ.25 వేల వరకు పలికి సగటున రూ.20వేల ధర కొనసాగింది. కానీ ఆతర్వాత ధరలు తగ్గుతూ గత ఏడాది బాగా పడిపోయాయి. నాణ్యత ఆధారంగా రూ.12వేల నుంచి రూ.15,500కు మించి పలకపోవడంతో వ్యాపారులు ఆర్డర్లు ఉంటే కొనుగోలు చేస్తున్నారు. ఇక దేశీయంగా రూ.15వేల నుంచి రూ. 15,500 వరకు ధర పలుకుతుండడంతో నాణ్యత ఆధారంగా ఖమ్మంలో గరిష్టంగా రూ.14,800, మోడల్ ధర రూ.14,400, కనిష్టంగా రూ.7వేలుగా నిర్ణయిస్తున్నారు. ఇక్కడి వ్యాపారులు పలువురు మిర్చిని కొనుగోలు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. -
బాలికల విభాగంలో చాంపియన్‌గా అశ్వారావుపేట జట్టు
ముగిసిన అగ్రి స్పోర్ట్స్ మీట్అశ్వారావుపేటరూరల్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల నుంచి 400 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా వాలీబాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్, చెస్, పుట్‌బాల్, ఖోఖో, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం, లాంగ్ జంప్తోపాటు మరికొన్ని పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో రాజేంద్రనగర్ జట్టు, బాలికల విభాగంలో అశ్వారావుపేట జట్టు చాంపియన్‌గా నిలిచాయి. విజేతలు వీరే.. బాలుర విభాగం వాలీబాల్ పోటీల్లో రాజేంద్రనగర్‌పై జగిత్యాల, బాస్కెల్ బాల్లో రాజేంద్రనగర్‌పై పాలెం, షటిల్ బ్యాడ్మింటన్‌లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, టేబుల్ టెన్నిస్‌లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, చెస్ పోటీల్లో రాజేంద్రనగర్‌పై వరంగల్, క్యారమ్స్‌లో వరంగల్‌పై రాజేంద్రనగర్, క్రికెట్ పోటీల్లో జగిత్యాలపై రాజేంద్రనగర్, పుట్‌బాల్‌లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, ఖోఖో పోటీల్లో పాలెంపై సిరిసిల్ల, టగ్ ఆఫ్ వార్‌లో సంగారెడ్డిపై సిరిసిల్ల జట్లు గెలుపొందాయి. పరుగు పందెం(100 మీటర్లు)లో అశ్వారావుపేట, సంగారెడ్డి, జగిత్యాల విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో .. వాలీబాల్‌లో రాజేంద్రనగర్‌పై సంగారెడ్డి, క్యారమ్స్‌లో సైఫాబాద్‌పై అశ్వారావుపేట, టేబుల్ టెన్నిస్‌లో రాజేంద్రనగర్‌పై అశ్వారావుపేట, టెన్నికాయిట్‌లో సైఫాబాద్‌పై అశ్వారావుపేట, షటిల్ బ్యాడ్మింటన్‌లో రాజేంద్రనగర్‌పై సిరిసిల్ల, చెస్‌లో వరంగల్‌పై జగిత్యాల, బాస్కెట్ బాల్లో వరంగల్‌పై అశ్వారావుపేట, ఖోఖోలో అశ్వారావుపేట–సిరిసిల్ల సంయుక్తంగా విజయం సాధించాయి. టగ్ ఆఫ్ వార్‌లో ఆదిలాబాద్‌పై వరంగల్, పరుగు పందెం(100 మీటర్లు)లో ప్రథమ స్థానంలో రాజేంద్రనగర్, ద్వితీయ స్థానంలో జగిత్యాల, తృతీయ స్థానంలో అశ్వారావుపేట, అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో ఎం రచన(అశ్వారావుపేట) విజేతగా నిలిచారు. విజేతలకు మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. జయశంకర్ యూనివర్సిటీ డీఎస్ఏ చల్లా వేణుగోపాల్ రెడ్డి, అబ్జర్వర్ మధుసూదన్‌రెడ్డి, డీన్ హేమంత్‌కుమార్, ప్రొఫెసర్లు రాంప్రసాద్, శిరీష, నాగాంజలి పాల్గొన్నారు సాగర్ కాల్వలో దూకి మహిళ ఆత్మహత్య కొణిజర్ల: ఓ మహిళ సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తనికెళ్లకు చెందిన పొట్లపల్లి పార్వతి(52)కి భర్త మృతి చెందగా, పిల్లలు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతోంది. ఈక్రమాన మంగళవారం బోనకల్ బ్రాంచ్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలిస్తుండగా పెద్దగోపతి లాక్‌ల వద్ద మృతదేహం లభ్యమైంది. మృతురాలి అక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. లాడ్జిలో వ్యభిచారం ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ లోని పోస్టాఫీస్ సమీపాన ఓ లాడ్జిలో త్రీటౌన్ పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు విటులు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మోహన్‌బాబు తెలిపారు. హాటల్ మేనేజర్ శ్రీకాంత్‌పై కేసు నమోదు చేయగా, రూ.5,100 స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. -
బొమ్మ కాలేజీకి మరో పేటెంట్
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విభాగం నుంచి పేటెంట్ లభించిందని చైర్మన్ బొమ్మ రాజేశ్వరావు తెలిపారు. ఏపోవర్డ్(ప్రొటీన్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ అపరేటస్) పేరిట కృత్రిమ మేధస్సు ఆధారిత గణన నమూనాలను ఉపయోగించి ప్రొటీన్ల నిర్మాణాన్ని కచ్చి తంగా గుర్తించే అంశానికి పేటెంట్ మంజూరు చేశారని వెల్లడించారు. వరుసగా నాలుగు పేటెంట్లు సాధించడం తమ కాలేజీకి గర్వకారణమని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభాస్కరరావుతో పాటు సంతోష్, కిరణ్ జ్యోతి, సాయి సంధ్య, అనిత, మృదుల, సిద్ధార్థ్, భార్గవి, ముస్కాన్, మనోహర్, కార్తీక్ ఇందులో పాలుపంచుకున్నారని వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, ఉదారు శ్రీధర్, మాధవి, అనూష, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్నదానానికి రూ.లక్ష వితరణ మధిర: మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవా లయంలో ప్రతీ శనివారం జరిగే అన్నదానానికి తల్లపురెడ్డి నాగిరెడ్డి సతీమణి కృష్ణకుమారి జ్ఞాపకార్ధం రూ.1,00,116ను అందజేశారు. ఈ నగదును ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లాది వాసుకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు రేగళ్ల సునీత, కొంగర మురళి తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్ డైరెక్టర్ కుటుంబానికి... ఖమ్మం అర్బన్: ఖమ్మం పాండురంగాపురంలోని చైతన్య హైస్కూల్ డైరెక్టర్ షేక్ అక్బర్ ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు పూర్వ విద్యార్థులు 60మంది సేకరించిన రూ. 1,01,500 నగదును వారి కుటుంబానికి మంగళవారం అందజేశారు. విద్యాబుద్ధులు నేర్పి తాము జీవితంలో స్థిరపడడానికి అక్బర్ పాటుపడ్డారని గుర్తు చేసుకున్నారు. జాతర ఆదాయం.. రూ.1.57 లక్షలు అధికం పెనుబల్లి: మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరలో షాపుల ఏర్పాటుకు మంగళవారం వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్మేందుకు గత ఏడాది రూ.1.61లక్షలు పలకగా ఈసారి రూ.2.01లక్షలకు చేరింది. ప్రసాదం అమ్మకానికి గత సంవత్సరం రూ.2.10లక్షలు వస్తే ఈసారి రూ.2.61లక్షలకు, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునే హక్కు గత ఏడాది రూ.34వేలు పాడితే ప్రస్తుతం రూ.77వేలకు చేరింది. ఇక తలనీలాలు పోగు చేసుకునే హక్కు గత ఏడాది రూ.30వేలైతే ప్రస్తుతం రూ.33వేలు, సైకిల్ స్టాండ్ గత ఏడాది రూ.1.03లక్షలు ఉంటే ఈ ఏడాది రూ.1.10లక్షలు, కోనేటి పూజలు గత సంవత్సరం రూ.13వేలు పలికితే ఈసారి రూ.26వేలకు చేరింది. ఫలితంగా మొత్తం ఆదాయం గత ఏడాది కంటే రూ.1.57లక్షలు పెరిగిందని, దేవాదాయ శాఖ పరిశీలకులు ఆర్.సమత తెలిపారు. ఈఓ ఎన్.రజినికుమారి తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొనడంతో మహిళ మృతి వైరా: ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టగా ఓ మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం గ్రామ సమీపాన జరిగింది. జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఆటోను మధిర వైపు నుంచి వైరా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ట్రాలీ ఆటోలో ఉన్న వడ్డాది వెంకటరత్నం(37) మృతి చెందగా, ఆటో నడుపుతున్న ఆమె భర్త రాముకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కాగా, వెంకటరత్నం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తుంది. భర్త రాము ట్రాలీ ఆటోలో పరుపులు అమ్మి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.రామారావు తెలిపారు. -
అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సెల్ సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఎస్సీలకు పెద్దపీట వేయడమే కాక ఎస్సీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు చెప్పారు. అనంతరం జీపీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన 70మందిని సత్కరించారు. ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ దర్జీ చెన్నారావు, నాయకులు దాసరి దానియేలు, కొత్తా సీతారాములు, వేజెండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, మూడుముంతల గంగరాజు యాదవ్, ముళ్లపూడి సీతారాములు, కొండూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ


