ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రతీ అంశాన్ని కీలకంగా పరిగణిస్తూ విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావాలనే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయాన ఉపాధ్యాయుల పదోన్నతుల అంశంపై సైతం దృష్టి పెట్టింది. ఈక్రమంలోనే పదోన్నతుల కల్పనకు ముందు టెట్ నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పదోన్నతి కల్పించేందుకు టెట్ అర్హతను తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తుండగా, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలో 4,785మంది ఉపాధ్యాయులు
జిల్లాలోని 1,232 ప్రభుత్వ పాఠశాలల్లో 4,785మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో టెట్ పూర్తయిన ఉపాధ్యాయులు సుమారు 300మంది ఉన్నట్లు తెలుస్తోంది. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేయాలనే భావనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో చర్చ మొదలైంది. 2012కు ముందు టెట్ లేకపోవడంతో జిల్లాలో సుమారు 4వేల మంది ఉపాధ్యాయులకు పదో న్నతులకు అర్హత కోల్పోతారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగ ణించి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేకంగా ఉండాలి..
ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం... టీచర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా పదోన్నతులు కల్పిస్తేనే అర్హుల కు లబ్ధి జరుగుతుందని మరికొందరు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment