changes
-
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం పాత విమానాలకు మార్పులు చేయిస్తాం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది. రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది. 35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు. ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్‌వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్‌బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది. -
ఎక్స్ బయో మళ్లీ మార్చిన మస్క్
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్) శాఖకు అధిపతిగా ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మళ్లీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో వివరాలను మార్చారు. ఆయన అకౌంట్ తెరవగానే పేరు కింద కొత్తగా ‘‘వైట్‌హౌస్ టెక్ సపోర్ట్’’అనే పదాన్ని చేర్చారు. ప్రపంచ ప్రఖ్యాత సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలుచేసి దానికి ‘ఎక్స్’అని పేరు మార్చినప్పటికీ నుంచీ మస్క్ ‘ఎక్స్’లో క్రియాశీలకంగా పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. వైవిధ్యభరితంగా, వివాదాస్పదంగా, నవ్వు తెప్పించేలా పోస్ట్‌లు పెడుతూ సోషల్‌మీడియా వేదికపై ఎప్పుడూ ఫేవరెట్‌గా నిలుస్తున్నారు. అందర్నీ ఎగతాళి చేస్తానని చెప్పుకుంటూ గతంలో తన బయోలో చీఫ్ ట్రోల్ ఆఫీసర్(సీటీఓ) అని రాసుకొచ్చారు. బరాక్ ఒబామా కాలంలో యునైటెడ్ స్టేట్స్ డిజిటల్ సర్విస్(యూఎస్డీఎస్)గా మొదలైన అమెరికా ప్రభుత్వ శాఖకు ట్రంప్ తాను అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)గా పేరు మార్చారు. ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గిస్తూ, కొన్ని శాఖలకు నిధుల అనవసర, అధిక కేటాయింపులను తగ్గిస్తూ, ప్రాధాన్యతగల శాఖలకు కేటాయింపులు పెంచుతూ ఈ డోజ్ నిర్ణయాలు తీసుకుని అధ్యక్షుడికి సలహాలు, సూచనలు, సిఫార్సులు చేస్తుంది. డోజ్‌కు ప్రస్తుతం మస్క్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ‘‘యూఎస్డీఎస్ ఇప్పుడు డోజ్గా మారాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకే మార్చాశాం. అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ వ్యవస్థలన్నింటినీ ఆధునీకరిస్తాం’’అని మస్క్ అన్నారు. వైట్‌హౌస్‌పై మస్క్ కన్ను ! ‘‘డోజ్ విభాగం తెగ పనిచేస్తోంది. వారానికి మేం 120 గంటలు పనిచేస్తున్నాం’’అని గత వారం మస్క్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికా మేగజైన్ ‘వైర్డ్’సైతం ఇలాగే స్పందించింది. ‘‘వాస్తవానికి మస్క్ అక్కడేం చేయట్లేడు. వాషింగ్టన్ డీసీలోని డోజ్ ప్రధాన కార్యాలయంలో నిద్రపోతున్నాడు’’అని ఒక కథనంలో పేర్కొంది. అసలు పనిపై దృష్టి తగ్గించేసి అమెరికా అధ్యక్ష భవనంలో పాగా వేసేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నాడని వార్తలొచ్చాయి. వైట్‌హౌస్‌లోని వెస్ట్ వింగ్ అయిన ఓవెల్ ఆఫీస్‌లో తన పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అయితే దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘మస్క్, ఆయన బృందానికి వేరే చోట వేరే ఆఫీస్ సిద్ధంచేస్తాం. ఆ ఆఫీస్ ఓవెల్ ఆఫీస్‌లో భాగంగా ఉండబోదు. ఓవెల్ ఆఫీస్ కేవలం అధ్యక్షుడిగా కార్యనిర్వాహణ ఉత్తర్వులు ఇవ్వడానికే వినియోగిస్తా’’అని ట్రంప్ స్పష్టంచేశారు. -
టీడీఎస్‌లో మార్పులు.. అద్దె ఆదాయంపై భారీ ఊరట
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో టీడీఎస్‌కి కీలక మార్పులను ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు, ఇళ్లు, భవనాలపై అద్దె ఆదాయాన్ని పొందేవారికి భారీ ఊరట కల్పించారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచారు."ఇది టీడీఎస్ వర్తించే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా చిన్న చెల్లింపులను స్వీకరించే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది" అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రేట్ల సంఖ్యను తగ్గించడం, పరిమితి మొత్తాలను పెంచడం ద్వారా టీడీఎస్ ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేసే ప్రణాళికలను కూడా ఆమె వివరించారు.టీడీఎస్‌లో ప్రధాన మార్పులు ఇవే..సీనియర్ సిటిజన్లకు పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంపుఅద్దె ఆదాయంపై టీడీపీ పరిమితి వార్షికంగా రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు.లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద చెల్లింపులపై వసూలు చేసే టీసీఎస్ పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుపాన్ కార్డు లేని పన్ను చెల్లింపుదారులకు అధిక టీడీఎస్ నిబంధన వర్తిస్తుంది. విద్యా రుణాల చెల్లింపులపై టీసీఎస్ పూర్తీగా తొలగింపుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
బడ్జెట్: ఆదాయపు పన్నుల్లో అనూహ్య మార్పులు?
"మనం వికసిత్ భారత్ దిశగా అడుగులేస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశాలు దేశానికి కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందించాలి. అలాగే అందరికి సిరిసంపదలు సమకూర్చే ఆ మహాలక్ష్మి దేవికి వినమ్రంగా చేతులెత్తి మొక్కుతున్నా.. మధ్య తరగతి వర్గాలు, పేదలకు ఆ మాత ప్రత్యేక ఆశీర్వాదాలు అందించాలి".నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విలేకర్లతో అన్న మాటలివి. ఈ మాటల్ని తేలిగ్గా తీసిపారేయకూడదు. వాటిని విశ్లేషిస్తే ఎన్నో పరమార్ధాలు ధ్వనిస్తాయి.ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో పేద, మధ్య తరగతి వర్గాలకు ఏదో కచ్చితమైన మేలు జరగబోతోందనే విషయం ప్రధాని మాటల్లో పరోక్షంగా ధ్వనించిందనే చెప్పొచ్చు.మోదీ 3.O సర్కారు కొలువు తీరిన తర్వాత వస్తున్న తొట్టతొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దీంతో ఈ బడ్జెట్‌కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అంతే కాదు.. ఈసారి విస్తృత స్థాయిలో పన్ను సంస్కరణలు చోటుచేసుకోవచ్చని, ఆదాయపు పన్నుల్లో అనూహ్య మార్పులకు ఆస్కారం ఉందనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.బడ్జెట్ అనేసరికి ఆశలు సహజం.ముఖ్యంగా మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు తమకు మేలు చేసే నిర్ణయాల కోసం ఎప్పటికప్పుడు ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆదాయపు పన్నుల విషయంలో వీరి అంచనాలు కోటలు దాటుతాయి. వాస్తవానికి నిజాయతీగా పన్ను చెల్లించే వర్గం ఏదైనా ఉందా? అంటే అది ఉద్యోగులే. వీరికి జీతభత్యాలు చెల్లించేటప్పుడే టీడీఎస్ రూపంలో పన్ను వసూళ్లు జరిగిపోతాయి. కానీ ట్యాక్స్‌ల విషయానికొస్తే మాత్రం ఏళ్ల తరబడి స్వల్ప మార్పులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఫలితంగా అధిక పన్నులు చెల్లిస్తూ, అక్కరకు రాని ఆదాయాలతో మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు అల్లాడుతూనే ఉంటున్నాయి. కాబట్టి పన్ను రేట్లు తగ్గించడం, ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా గట్టి ప్రయోజనమే దక్కాలని ఈ వర్గాలు కోరుకోవడంలో తప్పు లేదు. పన్నుల విషయానికొస్తే..* కొత్త స్లాబ్ ప్రకారం ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. ఆదాయాలు పెరిగినప్పటికీ, రేట్లు పెరిగి, ఖర్చులూ విస్తృతమైన నేపథ్యంలో ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారికి ఖర్చు పెట్టే సామర్ధ్యం పెరిగి, ఆర్ధిక వ్యవస్థ పురోగమించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.* పాత, కొత్త పన్ను విధానాలు రెంటిలోనూ స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం... పాత పన్ను విధానం ప్రకారం రూ.50,000 వరకు, కొత్త ట్యాక్స్ స్లాబుల ప్రకారం రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తోంది.* రూ. 10 లక్షలవరకు పన్నులు ఉండకూడదని, రూ.15 లక్షలు పైబడి రూ.20 లక్షల లోపు ఆదాయాలకు 25% రేటుతో ఓ కొత్త స్లాబ్ ప్రవేశపెట్టాలని మరికొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.* రూ. 15 లక్షలు పైబడిన అధికాదాయ వర్గాల వారి నుంచి ప్రస్తుతం 30% పన్ను వసూలు చేస్తూండగా... దీన్ని రూ.18 లక్షలకు, ఇంకా వీలైతే రూ. 20 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. అంటే కొత్త ట్యాక్స్ విధానంలో మరిన్ని మినహాయింపులు, డిడక్షన్లు ఇవ్వాలని కూడా కోరుతున్నారు.* మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల ప్రధాన కల సొంత ఇంటిని సమకూర్చుకోవడం. ఇందుకోసం వాళ్ళు రుణాలపైనే ఆధారపడతారు. కొత్త విధానం ప్రకారం.. తొలిసారి ఇల్లు కొనుక్కునేవాళ్లకు ఈ రుణాల తిరిగి చెల్లింపులో అసలు మొత్తంపై ప్రస్తుతం సెక్షన్ 80 సీ కింద లభిస్తున్న డిడక్షన్ ను రూ. 1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని వీరు కోరుతున్నారు. అలాగే సెక్షన్ 24 బీ కింద వడ్డీ తగ్గింపు పరిమితిని కూడా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రస్తుతం క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ విధానం అందుబాటులో ఉంది. దీన్ని తమకూ వర్తింప చేయాలని ఆశిస్తున్నారు.పాత విధానంలో ప్రస్తుత స్లాబ్ రేట్లురూ. 2,50,000 వరకు 0రూ. 2,50,001 - రూ. 5,00,000: 5% రూ. 5,00,001 - రూ. 10,00,000: 20%రూ.10,00,000 పైన: 30 %కొత్త విధానంలో ప్రస్తుత స్లాబు రేట్లురూ .3,00,000 వరకు: 0%, రూ. 3,00,001 - 7,00,000: 5%, రూ. 7,00,001 - 10,00,000: 10%, రూ. 10,00,001 - 12,00,000: 15%, రూ. 12,00,001 - 15,00,000 : 20% రూ. 15,00,001 ఆపైన: 30%.ఆదాయం రూ. 7 లక్షలు మించకపోతే... అదనంగా రూ. 25,000 వరకు ట్యాక్స్ రిబేటు కూడా లభిస్తుంది. * వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయం రూ. లక్షల లోపు ఉంటే 87A సెక్షన్ కింద రిబేటు పొందవచ్చు. అంటే వారు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. మోదీ నిన్న చెప్పినట్లు.. ఆ లక్ష్మీ కటాక్షం సీతారామన్ చేతుల్లోంచి పేద, మధ్యతరగతి.. ఉద్యోగ వర్గాలకు ఎంతవరకు సిద్ధిస్తుందో చూద్దాం.-బెహరా శ్రీనివాస రావు, ఆర్ధిక నిపుణులు. -
ప్రపంచ ఎకానమీపై ట్రంప్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి పగ్గాలు చేపట్టడమనేది అంతర్జాతీయ భౌగోళిక–రాజకీయాల్లో మార్పులకు దారి తీయొచ్చని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఎకానమీ, వ్యాపారాలపై గణనీయమైన ప్రభావాలు పడొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న పరిణామాలను విశ్లేషించిన సందర్భంగా బిర్లా ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2025లో ప్రపంచంలో అనిశ్చితి, అనూహ్యమైన, సాంప్రదాయానికి భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని బిర్లా చెప్పారు. ఒకవైపు అవకాశాలు మరోవైపు అనిశ్చితి ఉంటుందన్నారు. భారత్ వెలుపల అమెరికా తమకు అతి పెద్ద మార్కెట్ అని, అక్కడ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశాలు అందిపుచ్చుకోనున్న భారత్ .. పుష్కలంగా పారిశ్రామిక సామర్థ్యాలున్నా అంతగా గుర్తింపునకు నోచుకోని భారత్.. ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని బిర్లా చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్‌కి రావడం మంచి పరిణామమని, త్వరలోనే ప్రపంచంలోనే పావు వంతు ఐఫోన్లు భారత్‌లోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ ఆటోమొబైల్, సిమెంటు పరిశ్రమ మొదలైనవన్నీ అంతర్జాతీయంగా ఎదుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాల్లో టెక్నాలజీ విప్లవం చోటు చేసుకుందని.. దీనితో ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ తగు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తోందని తెలిపారు. రాబోయే దశాబ్దంలో ప్రపంచాన్ని ఏకం చేయగలిగే శక్తిగా టెక్నాలజీని వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ : వాళ్లకి నష్టం, భారతీయులకు ఇష్టం!
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కొత్త నియమాలు ఈ రోజు (జనవరి 17, 2025) అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కీలకమైన, మంచి వేతనాలను అందుకునే ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వారి ఉద్యోగ స్థితి ఆధారంగా అమెరికాలో ఉండటానికి అనుమతి లభిస్తుంది.పదవీ విరమణ అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో తుది వలస విధాన సంస్కరణలలో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకీకరించడమే కాకుండా సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మాత్రమే మరిన్ని అవకాశాలందించే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు సమాచారం. దీని వల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ H-1B ఫైనల్ రూల్ , H-2 ఫైనల్ రూల్ ప్రకారం, H-1B నాన్-ఇమ్మిగ్రెంట్ , H-2 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ల నిబంధనలు మారతాయి. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించిన H-1B వీసా ప్రోగ్రామ్ మార్పులు భారతీయులకే ఎక్కువ.2023లో H-1B వీసా హోల్డర్లలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయ నిపుణులు ఉన్నందున, ఈ మార్పులు వారికే ఎక్కువప్రయోజనం చేకూరుస్తాయి.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) "H-1B తుది నియమం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా, ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడానికి మెరుగైన యజమానులను అనుమతించేందుకు H-1B ప్రోగ్రామ్‌ను ఆధునీకరిస్తుందని వెబ్సైట్లో అని పేర్కొంది. హెచ్-1బీ వీసా కీలక మార్పులు హెచ్-1బీ వీసా ప్రక్రియ మరింత సులభతరం అయ్యింది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను 'స్పెషాలిటీ ఆక్యుపేషన్' కింద నియమించుకోవడం కంపెనీలకు ఇక సులభతరం. కంపెనీలు వారి నిర్దిష్ట శ్రామిక శక్తి అవసరాల ఆధారంగా H-1B కార్మికులను నియమించుకోవచ్చు, F-1 విద్యార్థి వీసాల నుంచి హెచ్-1బీ వీసాలకు మారడం ఈజీ. ప్రాసెసింగ్ జాప్యం కూడా తగ్గుతుంది. యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.జనవరి 17, 2025 నుండి కొత్త రూల్ ప్రకారం ఫారం I-129 తప్పనిసరి అవుతుంది. హెచ్-1బీ వీసా ప్రక్రియను సరళీకృతం చేసే దిశగానే దీన్ని తీసుకొచ్చింది. అయితే మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించేందుకే ఈ మార్పులని విమర్శలు వినబడుతున్నాయి. హెచ్-1బీ వీసా మార్పులు అమెరికా ఉద్యోగులకు నష్టమని, అమెరికన్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని విమర్శించారు. మరోవైపు రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్పులను ఎంతవరకు అంగీకరిస్తారు? తిరిగి ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ..బెస్ట్ టిప్స్!
చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా ముఖ్యం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. 2025లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, జీవనశైలి మార్పులు ఆరోగ్యంపై ఎంత ప్రభావితం చేస్తాయనే దానిపై పెరుగుతున్న అవగాహనతో, ప్రోటీన్లు, ఒమేగా-3లు, విటమిన్లు , ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలకు ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇదే మన భవిష్యత్ ఆనందానికి, ఆరోగ్యానికి బలమైన పెట్టుబడి.పోషకాహారం అంటే కేలరీలను లెక్కించడం గురించి మాత్రమే కాదు. అది శరీరానికి ఎంత అవసరమో తెలుసుకోవడం. ఆరోగ్యంగా ఉండటానికి శక్తితోపాటు సూక్ష్మపోషకాల కోసం సరైన మాక్రోన్యూట్రియెంట్లు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అబాట్, న్యూట్రిషన్ బిజినెస్, మెడికల్ & సైంటిఫిక్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి ఠాకూర్. ఆహారపు అలవాట్ల పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నందున, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన ఆహార విధానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా నోటి పోషక పదార్ధాలు (ONS) పోషకాహార లోపాలను పూరించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతంది. ముఖ్యంగా ఆకలి లేని వారికి, పోషకాహార లోపం ఉన్నవారికి,పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు ఇది సాయపడుతుంది.పోషకాహారం & అభివృద్ధి చెందుతున్న పోషక అవసరాలను అర్థం చేసుకోవడంపోషకాహారం అంటే ఏంటి అనేది అస్పష్టంగా ఉండిపోతున్నప్పటికీ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం చాలా అవసర అనేది మనందరికీ తెలుసు. శాకాహారం పాలియో డూట్, గ్లూటెన్-రహిత , కీటో డైట్ వంటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో దేన్ని ఎంచుకోవాలనేది కష్టంగా అనిపించినా, సమతుల్యమైన ఆహారం అందరికీ శ్రయస్కరం అనేది అధ్యయనాలతోపాటు అందరూ అంగీకరించే విషయం.ఎదుగుతున్న క్రమంలో వివిధ దశల ఆధారంగా పోషక అవసరాలు పెరుగుతాయి. ఉదాహరణకు, పిల్లలకు పెరుగుదలకు అధిక మొత్తంలో కొన్ని పోషకాలు అవసరం, పెద్దలు కండబలం, ఎముక సాంద్రతను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. అదే వద్ధులైతే కండరాల నష్టాన్ని నివారించేలా, ఎక్కువ ప్రోటీన్ , అభిజ్ఞా పనితీరును నిర్వహించడానికి విటమిన్‌డీ, బీ 12 అదనపు విటమిన్లు అవసరం పడుతుంది. ఈ మార్పులను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది.పెద్దల ఆహారం-ముఖ్యమైన పోషకాలుప్రోటీన్: ఇది కండరాల మరమ్మత్తుకు పెరుగుదలకు మద్దతు ఇస్తుంది . పప్పు (కాయధాన్యాలు), చిక్పీస్, కిడ్నీ బీన్స్ (రాజ్మా), పనీర్ (కాటేజ్ చీజ్), గుడ్లు ,చికెన్ ద్వారా దీన్ని పొందవచ్చు.కార్బోహైడ్రేట్లు: శరీరానికి ప్రాథమిక శక్తి వనరు అయిన కార్బోహైడ్రేట్లు సాధారణంగా బియ్యం, గోధుమ రోటీ, పోహా, ఓట్స్, చిలగడదుంపల్లో లభిస్తాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి అవిసె గింజలు (ఆల్సి), వాల్నట్లు, ఆవనూనె , ఇండియన్ మాకేరెల్ (బంగ్డా) లేదా రోహు వంటి చేపల ద్వారా అందుతాయి.ఫైబర్: ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి తృణధాన్యాలు, జామ ,ఆపిల్ వంటి పండ్లు, పాలకూర , బ్రోకలీ వంటి కూరగాయలు, ఇంకా సైలియం పొట్టు (ఇసాబ్గోల్)లో లభిస్తుందివిటమిన్లు:విటమిన్ డి: ఎముకల ఆరోగ్యానికి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. పాలు, పెరుగు,సూర్యకాంతి ద్వారా పొందవచ్చువిటమిన్ ఇ: యాంటీఆక్సిడెంట్, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, ఆవ ఆకూరలో ఉంటుంది.విటమిన్ సి: రోగనిరోధక పనితీరుకు,ఆరోగ్యానికి అవసరం, నారింజ ,యు నిమ్మకాయలు, ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ), జామ వంటి సిట్రస్ పండ్లలో లభిస్తుందివిటమిన్ బి6: మెదడు ఆరోగ్యం , జీవక్రియకు ముఖ్యమైనది, అరటిపండ్లు, బంగాళాదుంపలు, పొద్దుతిరుగుడు విత్తనాలలో లభిస్తుందివిటమిన్ బి12: నాడీ పనితీరుకు, రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు,బలవర్థకమైన తృణధాన్యాలలో లభిస్తుందిఖనిజాలు:కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది, పాలు, పెరుగు, రాగి (Finger millets) నువ్వుల గింజల్లో ఎక్కువ లభిస్తుంది.ఐరన్: జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. పాలకూర, మెంతి ఆకులు ((Fenugreek), బెల్లం (గుర్), పప్పుధాన్యాలు (పప్పు) ద్వారా లభిస్తుందిజింక్: రోగనిరోధకశక్తి, గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, చిక్పీస్ . బజ్రా వంటి తృణధాన్యాలలో లభిస్తుంది.రోజువారీ భోజనం ఎలా ఉండాలంటే..సామెత చెప్పినట్టుగా "రాజులాగా అల్పాహారం, యువరాజులాగా భోజనం, బిచ్చగాడిలా రాత్రి భోజనం’’ ఉండాలి. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. కొవ్వులు జీర్ణం కావడం కష్టం కాబట్టి, వాటిని అల్పాహారం , భోజనంలో తీసుకోవాలి. అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం తేలిగ్గా ఉండాలి. ఆహారానికి మధ్యలోచాలా విరామం తర్వాత తీసుకునే భారమైన అల్పాహారం శక్తివంతమైందిగా ఉండాలి. అయితే పరగడుపున శరీరంలోని మలినాలను బైటికి పంపేందుకు గోరువెచ్చని నీరుతాగిలి. సీజన్‌ను బట్టి కూరగాయలు, పప్పుధాన్యాల నుండి తయారు చేసిన పోహా, ఉప్మా, దోస, ఇడ్లీ లేదా చీలా పవర్పేక్డ్ కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవచ్చు.2025లో చిన్న చిన్న మార్పులు, భారీ లాభాలు చిన్న మార్పులు మన మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయిసమతుల ఆహారంపై దృష్టిపెట్టడంప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడంహైడ్రేడెట్గా ఉండటం, అంటే రోజుకు సరిపడినన్ని నీళ్లు తాగడం.పోషకాహారం తీసుకుంటూ ఎముకలు కండరాల బలాన్ని పెంచుకునేందుకు క్రమం తప్పని వ్యాయామం. ఆరోగ్య సంరక్షణలో శారీరక శ్రమ చాలా కీలకం. వారానికి కనీసం రెండుసార్లు బలమైన వ్యాయామాల వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది. నడక, ఈత లేదా యోగా వంటివి ఫిట్‌నెస్‌కు దోహదం చేస్తాయి.ఈ ఏడాదిలో ఆరోగ్యకరమైన జీవనంపై దృష్టి పెడదాం. శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని, చురుకునిచ్చే వ్యాయామాలను, సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించే మార్పులను స్వీకరిద్దాం. తద్వారా సమిష్టిగా జీవితాన్ని ఆరోగ్యకరంగా, సంతోష కరంగా మార్చుకుందాం. ఇదీ చదవండి: కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం -
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుజనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)కోల్‌కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.కార్ల ధరలుమారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.రేషన్ కార్డులకు ఈ-కేవైసీరేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్‌కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.పెన్షన్ ఉపసంహరణ నిబంధనలుపెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది.ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాసులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..యూపీఐ పరిమితి పెంపుయూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.యూఎస్ వీసా రూల్స్నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. -
ఈపీఎఫ్‌వోలో కొత్త ఏడాది ముఖ్యమైన మార్పులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్గదర్శకాలు, విధానాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. వీటిలో చాలా మార్పులు రాబోయే కొత్త సంవత్సరంలో అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. వీటితోపాటు పలు కొత్త సేవలను పరిచయం చేయనుంది. పీఎఫ్ ఖాతాదారులకు సౌకర్యాన్ని మెరుగుపరచడమే ఈ అప్డేట్ల ప్రధాన లక్ష్యం. కొత్త ఏడాదిలో ఈపీఎఫ్‌వోలో వస్తున్న ముఖ్యమైన మార్పులు.. చేర్పులు ఏంటన్నది ఇక్కడ తెలుసుకుందాం.ఉద్యోగి కంట్రిబ్యూషన్ పరిమితిఈపీఎఫ్వో ముఖ్యమైన అప్డేట్లో ఉద్యోగుల ఈపీఎఫ్ ( EPF ) కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు ఒకటి. ప్రస్తుతం, ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్ ఖాతాకు కేటాయిస్తున్నారు. ఈ బేసిక్ వేతనాన్ని రూ. 15,000 లుగా ఈపీఎఫ్‌వో నిర్దేశించింది. దీనికి బదులుగా ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా ఈపీఎఫ్ ఖాతాకు కేటాయించుకునేలా కొత్త ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పదవీ విరమణ నిధిని భారీగా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెలవారీ పెన్షన్ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది.ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుఈపీఎఫ్వో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును ఏటీఎం ( ATM ) కార్డ్‌తో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో చందాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బును పొందడానికి 7 నుండి 10 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది.ఈపీఎఫ్‌వో ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు తమ డిపాజిట్లను సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తన ఐటీ (IT) వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ అప్‌గ్రేడ్ 2025 జూన్ నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత, సభ్యులు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లు, మెరుగైన పారదర్శకత, మోసపూరిత కార్యకలాపాల తగ్గుదలని ఆశించవచ్చు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ( ETF ) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుండి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్, స్టూడెంట్స్, టీచర్స్ ఈవెంట్ గిన్నిస్ బుక్‌లో శాశ్వతంగా లిఖించదగ్గ కార్యక్రమమని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. శనివారం బాపట్ల మున్సిపల్ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ దేశంలో నంబర్ వన్ అయిందంటే తాను అమలు చేసిన విజనేనన్నారు. ఇప్పుడు 2047 విజన్ తెచ్చానన్నారు. ప్రైవేట్ పాఠశాలలకంటే బెటర్‌గా ప్రభుత్వ పాఠశాలల పిల్లలను చదివిస్తామన్నారు. ఏడాదికి మూడు సార్లు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏటా డిసెంబర్ 7న మెగా ఈవెంట్ నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోని అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. తన హయాంలో 11 డీఎస్సీలు నిర్వహించి.. 1.50 లక్షల మందికి టీచర్ పోస్టులు ఇచ్చామన్నారు. 16,347 మెగా డీఎస్సీ పోస్టులు జూన్ నాటికి భర్తీ చేస్తామన్నారు. ఇక నుంచి ఏటా డీఎస్సీ ఉంటుందన్నారు. 117జీవో 4 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు రాని పరిస్థితి ఉందన్నారు. రాబోయే ఏడాదికి పాఠశాలల్లో పెనుమార్పులు తెస్తామన్నారు. కాగా సభకు చ్చిన ఓ విద్యార్థి తండ్రి గుండెపోటుకు గురైతే నడిపించుకుంటూ తీసుకెళ్లడం ఆందోళనకు గురి చేసింది. సభకు ఎనిమిదో తరగతి చదువుతున్న సాహుల్ అనే విద్యార్థి తండ్రి పఠాన్‌బాజీ హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హైస్కూలుకు పిలిపించారు. సీఎం వచ్చే వరకు అందరినీ అక్కడి నుంచి లేవకుండా ఉంచారు. కనీసం ఫ్యాన్లు కూడా వేయలేదు. ఈ వాతావరణం మధ్య ఇమడలేక 11 గంటల సమయంలో పఠాన్‌బాజీ గుండెపోటుకు గురయ్యాడు. అక్కడే మెడికల్ క్యాంపు ఉన్నప్పటికీ వీల్‌చైర్ కూడా లేకపోవటం, అంబులెన్సు లేకపోవటంతో బాధితుడిని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. -
మనిషి చనిపోయాక ఏమవుతుంది? కీలక విషయాలు చెప్పిన సీనియర్ నర్సు
మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది? ఆత్మలున్నాయా? ఇలాంటి సందేహాలు సాధారణంగా చాలా మందికి వస్తాయి కదా. దీనిపై పురాణాల్లో ప్రస్తావనలు, సైన్స్ రచనల్లో కొన్ని కీలక విషయాలు న్నప్పటికీ అమెరికాకు చెందిన సీనియర్ నర్సు కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కెరీర్లో అనేక మరణాలను చూసిన ఆమె, మరణం చుట్టూ కొన్ని అపోహలు, భయాల్ని తొలగించాలనే లక్ష్యంతో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై వెలుగులోకి తెచ్చిన అంశాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ఇంటెన్సివ్ కేర్‌లో విస్తృతమైన అనుభవం ఉన్న నర్సు జూలీ మెక్‌ఫాడెన్, మరణం తర్వాత సంభవించే శారీరక మార్పులపై కొన్ని విషయాలను తాజాగా వివరించింది. చనిపోవడం గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఉద్దేశంతో ఈమె ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే మరణం తరువాత ఏమి జరుగుతుందనే అంశంపై చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.నర్స్ జూలీ అందించిన వివరాల ప్రకారం, మరణించిన వెంటనే శరీరం 'రిలాక్స్' అవుతుంది. సహజమైన రిలాక్సేషన్ ప్రక్రియకు లోనవుతుంది. మరణం తరువాత శరీరం కుళ్లిపోవడంలో ఇదే మొదటి దశ, దీనిని హైపోస్టాసిస్ అంటారు. అందుకే కొంత మందికి మూత్ర విసర్జన, ప్రేగు కదలికలు ఉండవచ్చు లేదా ముక్కు, కళ్ళు లేదా చెవుల నుండి ద్రవాలు స్రవిస్తాయి. ఆ తరువాత అన్ని కండరాలు, వ్యవస్థలు రిలాక్స్ అయిపోతాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోతుందిమరణం తర్వాత ఒక్కో శరీర స్పందన భిన్నంగా ఉంటుంది. అల్గోర్ మోర్టిస్ అనే శీతలీకరణ ప్రక్రియ కొందరికి వెంటనే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో ఒకటి లేదా రెండు గంటలదాకా ఆలస్యం కావచ్చు. ఈ ప్రక్రియలో సగటున, శరీర ఉష్ణోగ్రత గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది.ఎవరికీ తెలియని విషయంనర్స్ జూలీ ప్రకారం, శరీరంలోని గురుత్వాకర్షణ కారణంగా రక్తం కింది వైపు కదలడం ప్రారంభమవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. దీన్నే లివర్ మోర్టిస్ అంటారు. అలాగే సాధారణంగా మన ఆప్తులు చనిపోయిన తరువాత చాలాసేపు బాడీని ఇంట్లో ఉంచుకుంటాం. అపుడు వారి బాడీ తిప్పి చూసినా, పాదాలను గమనించినా మొత్తం ఊదారంగు లేదా నల్లగా మారిపోతుంది. దీనికి కారణం రక్తం కిందికి ప్రవహించడమే.శరీరం గట్టిపడుతుందిజీవక్రియ ప్రక్రియల ఆగిపోవడం వల్ల కండరాలు గట్టిపడతాయి. ఇది (రిగర్ మోర్టిస్) సాధారణంగా పోస్ట్‌మార్టం తర్వాత 2-4 గంటలలోపు ప్రారంభమవుతుంది. అయితే ఇది వివిధ భౌతికఅంశాలపై ఆధారపడి 72 గంటల వరకు కూడా సమయం పట్టవచ్చు. శరీరం బరువెక్కిపోతుంది.బాడీ చల్లగా అయిపోతుంది దాదాపు 12 గంటల తర్వాత, జీవక్రియ ఆగిపోవడంతో ఉష్ణోగ్రత నియంత్రణ ఆగిపోతుంది. వైటల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోతుంది. దీంతో బాడీ చల్లగా అయిపోతుంది. కుళ్ళిపోవడంలో చివరి దశ మొదలైనట్టు అన్నమాట. కుళ్ళిపోవడం అనేది ఒక సాధారణ భాగం. అయితే ఈ ప్రక్రియ మొదలు కాకముందే అంత్యక్రియలు జరిగిపోతాయి కాబట్టి చాలా అరుదుగా ఈ విషయాన్ని మనం గమనిస్తాం అని నర్స్ జూలీ వెల్లడించింది. -
Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ ఇకపై 60 రోజులే
సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనలను భారతీయ రైల్వే మార్చింది. ప్రస్తుతం నాలుగు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. దీన్ని 60 రోజులకు కుదించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని 60 రోజులకు తగ్గిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకు ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి 120 రోజులు కాగా, ఇప్పుడు అది 60 రోజులకు తగ్గింది. ఈ నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి బుక్ చేసుకొనే టికెట్లపై అమలుకానుంది. ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదా రైల్వే టికెట్ కౌంటర్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి షార్ట్ రూట్ రైళ్లకు ఈ నిర్ణయం వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో విదేశీ పర్యాటకులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. రిజర్వు టికెట్లు అధికంగా రద్దు అవుతుండటం, ప్రయాణికులు రాక సీట్లు, బెర్తులు ఖాళీగా ఉండిపోతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ కాలపరిమితిని తగ్గించామని రైల్వే పేర్కొంది. ప్రస్తుతం కాన్సిలేషన్స్ 21 శాతం ఉంటున్నాయని, 4–5 శాతం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నా.. ప్రయాణం చేయడం లేదని వివరించింది. దీనివల్ల దళారులు సీట్లను అమ్ముకుంటున్నారని, రైల్వే సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడానికే అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితిని 120 నుంచి 60 రోజులకు కుదించామని తెలిపింది. -
వీలునామాను మార్చవచ్చా? ఎన్నిసార్లు మార్చవచ్చు!
నేను ఇదివరకే వీలునామా రాసి ఉంచాను. అలా వీలునామా రాసిన విషయం నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామాను మార్చాలను కుంటున్నాను. వీలవుతుందా? – పి. కోటేశ్వరరావు, విజయవాడమీరు సంపాదించిన ఆస్తులపై, మీకు సంక్రమించిన ఆస్తులపై వీలునామా రాయడం అనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మీరు కావాలి అంటే మార్చుకోవచ్చు. అయితే అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలోనే మీరు వీలునామా రాసిన విషయాన్ని, అందులోని అంశాలను, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. మీ వీలునామాలో మీరు కావాలి అంటే ‘మరలా ఒకసారి కూడా వీలునామా మార్చవచ్చును’ అని, అలా మార్చక΄ోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుంది అని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాసిన విషయాన్ని ఇప్పటికే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా ΄÷ందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచుగా చూస్తుంటాం. అలాంటి వీలునామాలు కోర్టు కేసులలో బలమైన అంశాలుగా పరిగణించబడవు. వీలునామాలో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి గార్డియన్‌ను నియమించటం, శానిటీ ఓత్ (చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చుతప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా చెల్లుబడి అయేలా మెరుగైన వీలునామాను మీ దగ్గరలోని లాయర్‌తో రాయించుకుని, వీలునామాలో మీరు పొందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే మీ తదనంతరం కూడా అందరికీ అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు అనుకున్న విధంగా మీ వీలునామా అమలుకు నోచుకుంటుంది.– శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshi.family3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
మార్పు మనుగడ కోసమే...
జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులకు మనం ఏ విధంగా స్పందిస్తాం... వాటిని ఏ కోణంలో చూస్తామనే విషయం మీదే మన అభివృద్ధి, ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.. మనసు బాగోలేనపుడు చాలా విషయాలను మనం సమస్యలుగా చూస్తాం.. ప్రశాంతంగా ఉన్నపుడు అవే పరిస్థితులను సవాళ్లుగా భావిస్తాం. అందువల్ల మన అభివృద్ధి ఏదైనా అది మనం ఆయా సమస్యలను స్వీకరించే స్థితి మీదే ఆధార పడి ఉంటుంది..మనిషి జీవితం పూల పాన్పు కాదు.. అదేవిధంగా ముళ్ళ కిరీటం కూడా కాదు.. ఈప్రాథమిక సూత్రాన్ని అవలోకనం చేసుకుని మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించినపుడే మన జన్మకు సార్ధకత లభిస్తుంది.. బతుకూ పండుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు వెరుస్తూ, మార్పును ఆహ్వానించకపోతే అది మనలో ఆత్మన్యూనతను పెంచుతుంది. ఒక పనిలో విఫలమైనపుడు దానిలో ఎందుకు విఫలమయ్యామా... అని బుర్ర బద్దలు కొట్టుకుని మనసు పాడు చేసుకునే కన్నా, ఏం జరిగినా అది మన మంచికోసమేనని ఆత్మను సంతృప్తి చేసుకుంటే మనసు కుదుట పడుతుంది. ఆనందం సొంతమవుతుంది. జీవితంలో ఎదురయ్యే మార్పును ఎప్పటికప్పుడు ఆహ్వానించి, దానిని మన జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి తప్ప, ఆత్మన్యూనతతో కుంగి పోకూడదు.కనుక మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సహజమైన ప్రక్రియ... పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మనలో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా సంఘపరంగా, ఆత్మపరంగా ఇంకా అనేకానేక కోణాలలో, అనేకానేక స్థితులలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి... అనివార్యం గా ఇలా మనలో జరిగే ప్రతి ఒక్క మార్పునూ మనం అంగీకరించాలి.కురుక్షేత్ర సంగ్రామంలో తాను అస్త్ర సన్యాసం చేస్తానని అర్జునుడు చింతించినపుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. మార్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, ఇది çసృష్టి ధర్మమని, మార్పును అంగీకరించినపుడే భవిష్యత్ నిర్దేశం కలుగుతుందని బోధించాడు. అలా శ్రీ కృష్ణభగవానుడి స్ఫూర్తితో అర్జునుడు యుద్ధం చేసి ధర్మ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించాడు.ప్రతి ఒక్కరూ మార్పును అంగీకరించాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా వేగంగా దూసుకువెళ్లాలి. ఉన్నతంగా ఎదగాలనే వారు.. మనతో మనం పోటీ పడాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. మార్పును అంగీకరించకపోతే, మన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంటుంది. కనుక మొదట్నుంచీ తల్లిదండ్రులు మార్పుకు అనుగుణంగా జీవితాలను మలచుకోవాలనే దృక్పథాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. వర్తమాన ప్రపంచానికి, పరిస్థితులకనుగుణంగా వారికి వారు నైపుణ్యాలు పెంచుకునే విధంగా ్రపోత్సహించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా ఇవ్వాలి అలాగే, వారి వ్యక్తిత్వాలు, ్రపాధాన్యతలు, పరిమితులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. కుటుంబాలు, పాఠశాలలు పిల్లల సామర్థ్యం, ఉత్సుకత, సృజనాత్మకత, అలవాట్లను పిల్లల భావి జీవితానికనుగుణంగా తీర్చిదిద్దినపుడు జీవితంలో వస్తున్న మార్పులను అంగీకరించే సామర్థ్యాన్ని ΄÷ంది, పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారన్న వాస్తవాన్ని గుర్తించి మసలుకోవాలి. దాసరి దుర్గాప్రసాద్ -
ఎక్కువ ఖాతాలున్నా.. ప్రయోజనాలు సున్నా
ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తున్నా కానీ, ఇతర పెట్టుబడి సాధనాల ప్రాధాన్యాన్ని విస్మరించలేం. పెట్టుబడులు అన్నింటినీ ఒక్క చోటే పెట్టేయడం రిస్క్ పరంగా అనుకూలం కాదు. వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గించుకుని, మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అందుకే ఒకవైపు ఈక్విటీల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నప్పటికీ.. మరోవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇప్పటికీ ఎంతో మందికి ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాలుగా కొనసాగుతున్నాయి. రిస్క్‌లేని హామీతో కూడిన ఈ పథకాలు ముఖ్యమైన జీవిత లక్ష్యాలకు చేదోడుగా నిలుస్తాయనడంలో అతిశయం లేదు. అయితే ఇందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్సీ పరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం. పీపీఎఫ్ ఒక్కటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునే ఆరి్థక సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత మరో ఐదేళ్ల పాటు గడువును పొడిగించుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపే కాకుండా, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంది. ఈ ప్రయోజనమే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇది చూసే కొంత మంది ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లో ఒకటి, బ్యాంక్‌లో ఒకటి తెరుస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఒకరి పేరిట ఒక పీపీఎఫ్ ఖాతానే ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయగలరని కేంద్ర ఆరి్థక శాఖ జూలై 12న ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఒకటికి మించిన ఖాతాలను గుర్తించినట్టయితే అందులో ఒక దానిని ప్రాథమిక ఖాతాగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండో ఖాతాలో జమలపై ఎలాంటి వడ్డీ రాదన్నది తాజా ఉత్తర్వుల సారాంశం. ఒకవేళ రెండు ఖాతాలున్నట్టు తేలితే రెండో ఖాతాలోని జమలను మొదటి ఖాతాకు బదిలీ చేస్తారు. ఒక ఆర్థిక సంత్సరంలో గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలకు మించి జమ చేసినట్టయితే, అదనంగా ఉన్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా వెనక్కిచ్చేస్తారు. రెండు కంటే ఎక్కువ ఖాతాలున్నట్టు తేలితే అప్పుడు ప్రారంభించిన తేదీ నుంచి సున్నా వడ్డీయే లభిస్తుంది.పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాలు... కొంత మంది పిల్లల పేరుతోనూ ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరుస్తున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. ఒక మైనర్ (బాలుడు/బాలిక) పేరిట ఒక పీపీఎఫ్ ఖాతాకే పరిమితం కావాలి. ఇలా ఒక మైనర్ పేరిట ఒకటికి మించి ఉన్న ఖాతాలను ఇరెగ్యులర్ (అక్రమం) అకౌంట్లుగా గుర్తిస్తారు. అప్పుడు మైనర్ పేరిట ఉన్న ఖాతాల్లో ఒకదానిని మెయిన్ అకౌంట్‌గా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఖాతాకు నిబంధనల మేరకు ప్రస్తుత వడ్డీ రేటు అమలవుతుంది. ఒకటికి మించి అదనంగా ఉన్న ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4 శాతం చొప్పున 18 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తారు. 18 ఏళ్లు నిండగానే మేజర్ అయిన తర్వాత సాధారణ పీపీఎఫ్ ఖాతా కింద దాన్ని పరిగణిస్తారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ ఖాతాపై చర్యలు ఉంటాయి. నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిజానికి ఇద్దరు పిల్లలు ఉంటే విడిగా ఇద్దరి పేరిట రెండు ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. అయినప్పటికీ, తన పేరుతో, తన పిల్లల పేరుతో ఇలా అన్నింటిలోనూ గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేసుకోరాదు. పీపీఎఫ్ ఖాతాను తాత, బామ్మ, అమ్మమ్మలు (గ్రాండ్ పేరెంట్స్) నిర్వహించరాదు. కేవలం తల్లిదండ్రులు మరణించి, పిల్లలకు ఆధారంగా మారిన వారే చట్టబద్ధ సంరక్షకులుగా వ్యవహరించడానికి అనుమతి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన... సుకన్య సమృద్ధి యోజన ఎంతో ప్రాచుర్యం పొందిన పథకం. రోజుల శిశువు నుంచి పదేళ్లలోపు కుమార్తెల పేరిట ఖాతా తెరిచి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఇది కొనసాగుతుంది. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాకు 8.2 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఇందులో చేసే పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇందులో రాబడులపైనా పన్ను లేదు. ఒక కుటుంబం తరఫున గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిటే సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడానికి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను (ఎస్ఎస్ఏఎస్) బాలిక తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తెరవడానికి అనుమతి ఉంటుంది. అయితే, కొందరు మనవరాలి పేరిట కూడా ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పిల్లలకు సహజ సంరక్షకులు అయిన తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయిన వారే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒకవేళ మనవరాలి పేరిట తాత, అమ్మమ్మ, బామ్మలు తెరిచినట్టు గుర్తించినట్టయితే అప్పుడు సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులకు బదిలీ అవుతుంది. ఒక కుటుంబానికి రెండుకు మించి ఖాతాలున్నట్టు తేలితే అదనంగా ఉన్న వాటిని మూసివేస్తారు. వాటిలో జమ చేసే మొత్తాలపై వడ్డీ రాదు.నేషనల్ సేవింగ్స్ స్కీమ్... ఎంతో పాపులర్ అయిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. గతంలో ఏదైనా పోస్టాఫీస్ శాఖలో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ప్రారంభించేందుకు అవకాశం ఉండేది. దీన్ని 2002 నుంచి నిలిపివేశారు. కాకపోతే అప్పటికే తెరిచిన ఖాతాలను కొనసాగించేందుకు అనుమతించారు. 1990 ఏప్రిల్ 2కు ముందు తెరిచిన మొదటి ఖాతాకు ప్రస్తుత పథకం రేటు, రెండో ఖాతాకు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా రేటు (4 శాతం)కు అదనంగా 2 శాతం చెల్లిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఈ రెండు ఖాతాలకు ఎలాంటి వడ్డీ రాదు. 1990 ఏప్రిల్ 2 తర్వాత తెరిచిన నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలకు సైతం అక్టోబర్ నుంచి ఎలాంటి వడ్డీ చెల్లించరు. దీంతో ఈ ఖాతాలను మూసివేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎన్ఆర్ఐలు అలా చేయడం కుదరదు..ఎన్ఆర్ఐ హోదాను వెల్లడించకుండా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం చెల్లదు. అలాంటి ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ రేటు 4 శాతమే అమలవుతుంది. అది కూడా 2024 సెపె్టంబర్ 30 వరకే. ఆ తర్వాత నుంచి బ్యాలన్స్‌పై వడ్డీ రాదు. నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అనుమతి లేదు. ‘‘భారత్‌లో పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత విదేశాలకు వెళ్లి ఎన్ఆర్ఐగా మారితే 15 ఏళ్ల గడువు ముగిసేంత వరకు ఆ ఖాతాను కొనసాగించొచ్చు. అందులో చేసే పెట్టుబడులకు ఇతరులకు మాదిరే వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే, నాన్ రీపాట్రియేషన్ నిబంధనల కిందే వీరు పీపీఎఫ్ ఖాతాను కొనసాగించుకోగలరు. అంటే గడువు ముగిసిన తర్వాత వచ్చే మెచ్యూరిటీని ఎన్ఆర్ఐ తన విదేశీ ఖాతాకు బదిలీ చేసుకోవడం కుదరదు. లేదా విదేశీ కరెన్సీలోకి మార్చుకోవడం కుదరదు. తన నివాస హోదాలో మార్పు చోటుచేసుకున్న వెంటనే సంబంధిత వ్యక్తి బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు తెలియజేయడం తప్పనిసరి’’ అని స్టెబుల్ ఇన్వెస్టర్ వ్యవస్థాపకుడు దేవ్ ఆశిష్ తెలిపారు.మార్గం ఉంది.. పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే.. అప్పుడు దంపతులు ఇద్దరూ తమ పేరిట పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉంటే భార్య, భర్త చెరొక పీపీఎఫ్ ఖాతా తెరిచి గరిష్ట పరిమితి మేరకు ఒక్కో ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాను ఐదేళ్లు నిండిన తర్వాత వైద్య పరమైన అవసరాల కోసం మూసివేసేందుకు అనుమతి ఉంటుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
PM Narendra Modi: ఫిన్‌టెక్ ప్రోత్సాహానికి పాలసీల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పాలసీల్లో తగు మార్పులు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో భాగంగా ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం, దేశీయంగా పరిశోధనలు.. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ. 1 లక్ష కోట్లు కేటాయించడం, వ్యక్తిగత డేటా భద్రత చట్టం రూపకల్పన వంటి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అంకుర సంస్థలను దెబ్బతీసే సైబర్ మోసాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని నియంత్రణ సంస్థలకు సూచించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2024లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు. ఆర్థిక సేవలను అందరికీ అందుబాటలోకి తేవడంలో ఫిన్‌టెక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గడిచిన పదేళ్లలో 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని ఆయన ప్రశంసించారు. డిజిటల్ టెక్నాలజీతో పారదర్శకత పెరిగిందని, దీనికి నగదు బదిలీ పథకంలాంటివి నిదర్శనమని వివరించారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ త్రయంతో నగదు లావాదేవీలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగభాగం భారత్‌లోనే ఉంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, పండుగల వేళ దేశ ఎకానమీ, క్యాపిటల్ మార్కెట్లలో వేడుకల వాతావరణం నెలకొందని చెప్పారు. అధునాతన టెక్నాలజీలు, నిబంధనలతో ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పారదర్శకమైన, సమర్ధమంతమైన భారీ యంత్రాంగాలను రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు. గూగుల్ పేలో యూపీఐ సర్కిల్.. జీఎఫ్ఎఫ్ సందర్భంగా గూగుల్ పే యూపీఐ సర్కిల్‌ను ఆవిష్కరించింది. బ్యాంకు ఖాతాలను లింక్ చేయకుండానే డిజిటల్ చెల్లింపులు చేసేందుకు యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా యాడ్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అటు ఈ–రూపీ (యూపీఐ వోచర్లు), రూపే కార్డులకు సంబంధించి మొబైల్ ఫోన్ ద్వారా ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను, యూపీఐ లైట్లో ఆటోపే ఆప్షన్‌ను కూడా గూగుల్ పే ఆవిష్కరించింది. -
గ్యాస్ నుంచి ఆధార్ వరకు.. వచ్చే నెలలో మార్పులు
ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుండి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు మీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం..ఎల్పీజీ ధరలుప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య, డొమెస్టక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.సీఎన్జీ, పీఎన్జీ రేట్లుఎల్పీజీ ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా సవరిస్తాయి. అందువల్ల, ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ కార్డ్‌లను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్ కార్డ్‌లకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.క్రెడిట్ కార్డ్ నియమాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుండి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్లను మాత్రమే పొందగలరు. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు.మోసపూరిత కాల్స్ నియమాలుమోసపూరిత కాల్స్, సందేశాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.డియర్నెస్ అలవెన్స్కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
జీఎస్టీ స్లాబ్‌ల్లో మార్పులు..!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి స్లాబ్ విధాన మార్పుసహా పలు అంశాలపై సంబంధిత రేట్ల హేతుబద్ధీకరణ మంత్రివర్గ కమిటీ (జీవోఎం) కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు అవసరంపై సమీక్ష నిర్వహించి ఆయా అంశాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు సమర్పించాలని పన్ను అధికారుల కమిటీని కోరింది.ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ అంశాన్ని కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో లేవనెత్తడం గమనార్హం. అయితే ఈ అంశాన్ని తదుపరి డేటా విశ్లేషణ కోసం కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. సెప్టెంబరు 9న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 54వ అత్యున్నత స్థాయి సమావేశంనేపథ్యంలో తాజా మంత్రివర్గ కమిటీ సమావేశం జరిగింది.జీవోఎం కన్వీనర్‌గా తన మొదటి సమావేశం అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘జీఎస్టీ పన్ను స్లాబ్‌లలో మార్పు చేయరాదని కొంతమంది జీవోఎం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరుగుతాయి, ఆపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత జీఎస్టీ విధానంలో సున్నా, 5, 12, 18. 28 శాతం ఐదు విస్తృత పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. లగ్జరీ– డీమెరిట్ వస్తువులపై అత్యధికంగా 28 శాతం రేటు కంటే ఎక్కువ సెస్‌ను విధిస్తున్నారు. -
వక్ఫ్ బోర్డులోకి మహిళలు, ముస్లిమేతరులు !
న్యూఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులకు కేంద్రం నడుంబిగించింది. ఇందులోభాగంగా వక్ఫ్ బోర్డుల పాలనా వ్యవహారాల్లో మహిళలు, ముస్లి మేతరులకు చోటు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం,1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్,1995గా మార్చుతూ వక్ఫ్ (సవరణ)బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సంబంధిత బిల్లు వివరాలు మంగళవారం లోక్‌సభ సభ్యులకు అందాయి. ఆ బిల్లులోని అభ్యంతరాలు, అందుకు కారణాల జాబితా ప్రకారం ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని తొలగించనున్నారు. ఏదైనా ఆస్తి వక్ఫ్‌కు చెందినదిగా నిర్ణయించే అధికారం ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకే ఉంది. ఇంతటి అపరిమిత అధికా రాలను తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో భిన్న వర్గాలకు, ముస్లిం పురుషులతోపాటు మహిళలు, ముస్లిమేత రులకూ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ముస్లింలలో బోరా, అగాఖనీల కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ ఔఖాఫ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కనీసం ఐదేళ్లుగా ఇస్లామ్ మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తిని దానంగా ఇస్తేనే దానిని ‘వక్ఫ్’గా పేర్కొనాలని ‘వక్ఫ్’ పదానికి బిల్లు కొత్త నిర్వచనం ఇచ్చింది. -
తెలంగాణ సెక్రటేరియట్.. సీఎం పీఆర్వో గది మార్పు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనం ఆరవ అంతస్తులో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆరవ అంతస్తులోని సీఎం పౌర సంబంధాల కార్యాలయాన్ని తాజాగా మార్చారు. శుక్రవారం(జులై 19) వరకు ఆరవ అంతస్తు లోని 7వ గదిలో పీఆర్వో ఆఫీసు కార్యకలాపాలు నడిచాయి. శనివారం నుంచి పీఆర్వో ఆఫీసును అయిదవ అంతస్తుకు షిఫ్ట్ చేశారు.ఇక నుంచి ఐదవ అంతస్తులోని ఐదవ నెంబర్ గదిలో ఇక మీదట సీఎం సీపీఆర్ఓ, పీఆర్వోలు పనిచేయనున్నారు. గతంలో ఉన్న లాంజ్‌ను వీఐపీల కోసం కేటాయించారు. -
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే లక్నో విచ్చేసిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.ఓబీసీల్లో పట్టుండంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌర్యకు, సీఎం ఆదిత్యనాథ్‌కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు కేబినెట్ మీటింగ్‌లకు మౌర్య హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.ఈ కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్‌గా వెళ్లే అవకాశముంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. యూపీలో సీట్లు కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మ్యాజిక్‌ఫిగర్‌ను దాటలేక ఎన్డీఏ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్‌లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్‌యాక్టివ్‌గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
అయోధ్యలో మూడు కీలక మార్పులు
అయోధ్యలో కొలువైన బాలక్ రాముని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. తాజాగా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు భక్తుల సౌలభ్యం కోసం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులలో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపతాయని ట్రస్టు భావిస్తోంది.ఇకపై ఆయోధ్య రామాలయానికి వచ్చే ప్రముఖులకు, సెలబ్రిటీస్‌కు చందనం రాయడం లేదా తిలకం పెట్టడం లాంటివి చేయరు. చరణామృతం(తీర్థం) ఎవరికీ ఇవ్వరు. అలాగే అక్కడి పూజారులకు దక్షిణ ఇవ్వకూడదు. దానిని విరాళం రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది.రామాలయంలో భక్తులందరినీ సమానంగా చూడడం లేదనే ఆరోపణలు వస్తున్న దరిమిలా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తున్నాయి. వారికి గంధం పూస్తున్నారు. తిలకం దిద్దుతున్నారు. చరణామృతం అందజేస్తున్నారు. ఈ విధానాన్ని ఇప్పుడు ట్రస్ట్ రద్దు చేసింది. ఇకపై రామాలయానికి వచ్చే ఎవరినీ ప్రత్యేకంగా గుర్తించరు. రామభక్తులందరినీ సమానంగానే పరిగణించనున్నారు. -
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. -
TG: రాష్ట్ర చిహ్నం మార్పు.. చార్మినార్ ముందు కేటీఆర్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్రలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర చిహ్నం మారుస్తోందని దుయ్యబట్టారు. చార్మినార్ ముద్రను తీసేయడం హైదరాబాదీలను అవమానించడమే.. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు.మరోవైపు, రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని... కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని మండిపడ్డారు.World over, Charminar has been the icon/symbol of Hyderabad for centuriesWhen one thinks of Hyderabad, they cannot but think of Charminar which has all the qualities of a UNESCO world heritage site Now Congress Government wants to remove the iconic Charminar from the state… pic.twitter.com/SQVxQAI6lL— KTR (@KTRBRS) May 30, 2024 -
డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఆయా కోర్సులను డిజైన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్‌కు సమాంతరంగా డిగ్రీ, పీజీ కోర్సులను తీర్చిదిద్దాలని యూజీసీ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. ఈ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే పలు కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులు తీసుకొస్తున్నారు.తాజాగా బీఎస్సీలో బయో మెడికల్ కోర్సును, బీకాంలో ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కోర్సులను పరిచయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఏ ఆనర్స్లోనూ ఎనలైటికల్ కంప్యూటర్స్ కోర్సులను తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. విస్తరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించేందుకు బయో మెడికల్ కోర్సు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. డిగ్రీ తర్వాత చేసే పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ స్కిల్ ప్రాధాన్యత పెంచాలని భావిస్తున్నారు. ఎమ్మెస్సీ డేటా సైన్స్‌లో మార్పులు.. » పీజీ కోర్సులకు జవసత్వాలు అందించే యోచనలోనూ కసరత్తు జరుగుతోంది. ఎంఎస్సీ డేటా సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ వంటి కోర్సుల్లో మార్పులు చేశారు. పుస్తకాల ద్వారా సంపాదించే పరిజ్ఞానం తగ్గించి, పరిశ్రమల్లో నేరుగా విజ్ఞానం పొందే విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలని యూజీసీ సూచిస్తోంది. పీజీ తర్వాత పరిశోధన రంగానికి ఆయా విద్యార్థులు వెళ్లేలా నూతన విధానంపై కసరత్తు చేయాలని సూచించింది. దీనిపై ఈ విద్యా సంవత్సరంలోగా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని యూజీసీ భావిస్తోంది. ఉపాధే లక్ష్యంగా... » కొన్నేళ్లుగా విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే, వీరిలో 90 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 20 వేల మంది ఇతర రాష్ట్రల్లోని డీమ్డ్ వర్సిటీల్లోకి వెళ్తున్నారు. 40 వేల మంది వరకూ ఇంటర్‌తో విద్య ముగించి ఏదో ఒక వృత్తి, ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ఇక బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా 2.20 లక్షల వరకూ ఉంటుంది. ఇందులోనూ కంప్యూటర్ నేపథ్యం ఉన్న బీకాం, హానర్స్ బీఏ వంటి కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉన్న పరిజ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. బీఎస్సీ చేసిన విద్యార్థులు కూడా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల వైపు చూస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ చేసినా పెద్దగా ఉద్యోగాలు ఉండవని, లెక్చరర్‌గా వెళ్లేందుకు మాత్రమే ఇది తోడ్పడుతుందనే భావన యువతలో ఉంది. దీంతో డిగ్రీ చేసినా పీజీకి వెళ్లడం లేదని ఇటీవల యూజీసీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి ఇప్పుడున్న సంప్రదాయ కోర్సులైన బీఏ కోర్సుల్లో చేరే వాళ్లే తక్కువగా ఉంటుంటే, ఎంఏ వరకూ వెళ్లాలనుకునే వారి సంఖ్య ఇంకా తక్కువ. గ్రూప్స్, సివిల్స్ రాయాలనుకునే విద్యార్థులు ఇటువైపు వెళ్తున్నారు. ఈ మూడు ప్రధాన కోర్సులకు కలిపి రాష్ట్రంలో 50 వేల కనీ్వనర్ కోటా సీట్లు ఉంటే, గడచిన విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు 20,484 మంది మాత్రమే. అందుకే ఇలాంటి కోర్సులను కొత్త పద్ధతుల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆకర్షితులవుతారనేది ఉన్నత విద్యా మండలి ఆలోచన. బీకాంలో కంప్యూటర్ అనుసంధానం చేయడం, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ రంగంలో ఉపాధి పోటీని నిలబెట్టుకునే కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటిని ఆయా రంగాల్లో పరిశ్రమల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేలా మార్పులు తెస్తున్నారు. -
ఐటీ రిటర్న్స్.. కీలక మార్పులు
ITR filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. వ్యక్తులు, వ్యక్తిగత సంస్థలు లేదా సంఘాలు జూలై 31 లోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.ఐటీఆర్-1 ఫారంఅత్యధిక పన్ను రిటర్న్స్ ఐటీఆర్-1 (ITR-1) ఫారం ద్వారానే దాఖలవుతాయి. దీన్ని సహజ్ ఫారం అని కూడా పిలుస్తారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50 లక్షలకు మించని వ్యక్తులు ఈ కేటగిరీ కింద రిటర్న్స్ ఫైల్ చేయడానికి అర్హులు. జీతం, ఒకే ఇంటి ఆస్తి, కుటుంబ పెన్షన్, వ్యవసాయం (రూ. 5,000 వరకు), పొదుపు ఖాతాల నుంచి వడ్డీ, డిపాజిట్లు (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్/కోఆపరేటివ్ సొసైటీ), ఆదాయపు పన్ను రీఫండ్ వడ్డీ.. ఇలా వివిధ మార్గాలలో లభించే ఆదాయంపై పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.ITR-1కి చేసిన కీలక మార్పులు2024-25 అసెస్మెంట్ ఇయర్‌కి గానూ ఐటీఆర్-1 ఫారం దాఖలులో ఆదాయపు పన్ను శాఖ పలు కీలక మార్పులు చేసింది. అవేంటంటే..ITR-1 ఫారమ్‌ను ఫైల్ చేసే వ్యక్తులు తమ పన్ను రిటర్న్ ఫైలింగ్‌లో తమకు ఇష్టమైన పన్ను విధానాన్ని పేర్కొనాలి.సెక్షన్ 115BACలో ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రవేశపెట్టిన సవరణలను అనుసరించి కొత్త పన్ను విధానం ఇప్పుడు డిఫాల్ట్ పన్ను విధానం. వ్యక్తులు, హోచ్యూఎఫ్లు, ఏఓపీలు, బీఓఐలకు కొత్త పన్ను విధానం స్వయంచాలకంగా వర్తిస్తుంది. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలనుకునే వారు సెక్షన్ 115BAC(6) నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టంగా తెలియజేయాలి.వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం కాకుండా ఇతర ఆదాయం ఉన్న వ్యక్తులు సెక్షన్ 139(1) ప్రకారం సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లో తప్పనిసరిగా తమ ప్రాధాన్య పన్ను విధానాన్ని పేర్కొనాలి.ఆర్థిక చట్టం 2023 ద్వారా ప్రవేశపెట్టిన సెక్షన్ 80CCH ప్రకారం.. 2022 నవంబర్ 1, ఆ తర్వాత అగ్నిపథ్ స్కీమ్‌లో చేరి అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వ్యక్తులు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేసిన మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపునకు అర్హులు.ఈ మార్పునకు అనుగుణంగా, ITR-1 ఫారంను కొత్త కాలమ్‌ను పొందుపరుస్తూ సవరణలు చేశారు. సెక్షన్ 80CCH కింద మినహాయింపు కోసం అర్హత ఉన్న మొత్తానికి సంబంధించిన వివరాలను కొత్త ఐటీఆర్-1 ఫారం ద్వారా పన్ను చెల్లింపుదారులు అందించాల్సి ఉంటుంది. -
ఆధార్.. అప్‘లేట్’
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డు అప్డేట్కు ‘తిరస్కరణ’తిప్పలు తప్పడం లేదు. ఒకటి రెండుసార్లు చేర్పులుమార్పులు చేసుకుంటే ఆ తర్వాత ఆప్డేషన్ ప్రక్రియ తిరస్కరణకు గురవుతోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి పరుగులు తీసి పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆధార్‌కార్డులో అప్డేషన్ సమస్యగా తయారైంది. చిన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకోవడంతో ఆ తర్వాత బయోమెట్రిక్ గుర్తింపు సమస్యగా మారింది. మరోవైపు చిన్నచిన్న తప్పిదాలు సైతం ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నదానికి కూడా హైదరాబాద్‌కు తరలిరావడం పేదలకు భారంగా మారుతోంది. ఏదీ..ఎలా మార్చుకోవచ్చు అంటే... ఆధార్‌కార్డు అనేది గుర్తింపును చూపే ముఖ్యమైన సాధనంగా మారింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధా ర్కార్డులో చేర్పులు మార్పులపై కొన్ని నిబంధనలు విధించింది. ఆధార్ కార్డులో ఓ వ్యక్తి తన పేరు, జన్మదినం, జెండర్ వంటి వాటిని మార్చుకోవడం అప్డేట్ చేసుకునేందుకు పరిమితి విధించింది. ► యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌కార్డులో పేరును కేవలం రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంటి పేరు, స్పెల్లింగ్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. ► ఆధార్ కార్డులో డేట్ఆఫ్బర్త్ కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. దీనికీ కొన్ని షరతులు ఉన్నాయి. ఎన్రోల్మెంట్ సమయంలో ఇచి్చన తేదీకి కేవలం మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. డేట్ మార్చుకోవాలనుకునే వారు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆధారాలు సమరి్పంచాలి. ► ఆధార్ కార్డులో జెండర్ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ► ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ నమోదు కేంద్రంలో ఫొటో అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మార్చుకోవడం కుదరదు. ► అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాలి. ప్రాంతీయ కార్యాలయంలోనే ఆధార్‌కార్డులో పేరు, పుట్టిన తేదీ వివరాలు, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చేందుకు వీల్లేదు. పరిమితి దాటిన తర్వాత ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఇందుకు ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ–మెయిల్, పోస్ట్ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. యూఆర్ఎన్ స్లిప్, ఆధార్ వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలను జత చేస్తూ ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా స్పష్టంగా వివరించాలి. జూన్ 14 వరకు ఉచిత అప్డేట్కు అవకాశం పదేళ్లు దాటిన ఆధార్‌కార్డుల అప్డేట్ తప్పనిసరి. ఆధార్ జారీ తర్వాత చాలామంది అప్డేట్ చేసుకోలేదు. వీరి కోసం యూఐడీఏఐ ఉచితంగానే..ఆధార్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం కలి్పంచింది. కొంతకాలంగా గడువు పొడిగిస్తూ వస్తోంది. ఈసారి జూన్ 14 వరకూ ఆన్లైన్లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. చిరునామా, పేర్లలో అక్షర దోషాలు సరిచేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ సమరి్పంచి ఆప్డేట్ చేసుకోవాలి. అప్డేట్కు ప్రయత్నిస్తే తిరస్కరించి రద్దు చేశారు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాను. దరఖాస్తు నింపి ఇవ్వగా అప్లోడ్ చేశారు. కొద్ది రోజులకు రిజెక్ట్ అయ్యిందనే మెసేజ్ వచి్చంది. మళ్లీ దరఖాస్తు చేయగా ఆధార్ రద్దు అయ్యిందని చెప్పారు. హైదరాబాద్‌లోని రీజనల్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ చెక్ చేసి కొత్త కార్డు జారీ చేస్తామని చెప్పి దరఖాస్తు తీసుకున్నారు. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. – అక్షర, స్టూడెంట్, కామారెడ్డి జిల్లా నెలరోజుల నుంచి తిరుగుతున్నా... ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. సరిచేసుకునేందుకు రీజినల్ కార్యాలయం చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్నా. సరైన పత్రాలు సమర్పించి అప్లోడ్ చేయించినా కార్డు రాలేదు. – సాయికుమార్, వికారాబాద్ జిల్లా పేరు మారడం లేదు ఆధార్ కార్డులో పేరు మార్చుకునేందుకు రెండు నెలల నుంచి రీజినల్ కార్యాలయానికి తిరుగుతున్నాను. వచి్చన ప్రతిసారి కావాల్సిన పత్రాలు సమరి్పంచినా కార్డులో పేరు మాత్రం మారడం లేదు. – బాషా, కర్నూలు -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్‌ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అందుకే నా పేరులో మా అమ్మ పేరు పెట్టుకున్నా!
‘‘నేను సినిమా కెరీర్ప్రాంరంభించినప్పటి నుంచి మా అమ్మ పేరు (విజయ దుర్గ) మీద నిర్మాణ సంస్థ ఆరంభించాలని ఉండేది. అందుకే అమ్మ పేరు మీద విజయదుర్గప్రో డక్షన్స్నుప్రాంరంభించి, ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్‌తో కలిసి ‘సత్య’ షార్ట్ ఫిలిం నిర్మించాను. మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. అందుకే నా పేరును సాయిధరమ్ తేజ్ నుంచి సాయిదుర్గ తేజ్‌గా మార్చుకున్నాను’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో సాయిదుర్గతేజ్, ‘కలర్స్’ స్వాతి జంటగా హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన షార్ట్ ఫిలిం ‘సత్య’. ఈ చిత్రం ప్రెస్మీట్లో సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘సత్య’ దాదాపు 25 ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. అవార్డులు కూడా వచ్చాయి’’ అన్నారు. ‘‘సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని చేసిన సినిమా ‘సత్య’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఇప్పటివరకు మా చిత్రానికి 25 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అన్నారు నవీన్ విజయకృష్ణ. -
రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు: ఖర్గే
బెంగళూరు: దేశ రాజ్యాంగాన్ని మార్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దీనిని సమైక్యంగా ఉండి, గట్టిగా ఎదుర్కోలేకపోతే దేశంలో నియంతృత్వపాలన తథ్యమని ఆయన హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని మార్చేసేందుకు, పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గట్టిగా, ఐక్యంగా నిలబడకుంటే, దేశంలో నియంతృత్వం రావడం ఖాయం. నియంతృత్వం కావాలనుకుంటున్నారా లేక న్యాయంతో కూడిన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా, అన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రాజ్యాంగం మనుగడ సాధించిన పక్షంలో దేశం ఐక్యంగా ముందుకు సాగుతుంది. ప్రజాస్వామ్యం ఉంటే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించగలుగుతారు. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించడం లేదు, రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. అందుకే, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, దానికి కట్టుబడి ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఒక భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని వదులుకుని కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు లేదా ప్రభుత్వాలను ఎందుకు పడగొడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధమైందని నిలదీశారు. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు దేశంలో నియంతృత్వం రావచ్చని అన్నారు. ప్రభుత్వ గ్యారెంటీయే కనీసం బీజేపీ ప్రభుత్వ గ్యారెంటీయే అని చెప్పకుండా మోదీ తన గ్యారెంటీ అని చెప్పుకోవడం ఏమిటన్నారు. ‘అది నీ గ్యారెంటీ ఎలా అవుతుంది? అది నీది కాదు. ప్రజలు డబ్బుతో అమలు చేసే గ్యారెంటీ’’ అన్నారు. -
‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి
ముంబై: యూపీఐ హ్యాండిల్ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కి ఆర్బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్ వెబ్సైట్ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థను ఎన్పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్‌ను మైగ్రేట్ చేసే క్రమంలో పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్లుగా (పీఎస్పీ) 4–5 బ్యాంకులను ఎన్పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది. తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్‌కు మాత్రమే మైగ్రేషన్ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్‌లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్‌లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. -
Forbes India 30 Under 30 2024: నెక్ట్స్ వేవ్ వ్యవస్థాపకులకు ఫోర్బ్స్ ఇండియా గుర్తింపు
హైదరాబాద్: హైదరాబాద్ కి చెందిన అంకుర సంస్థ నెక్ట్స్ వేవ్ వ్యవస్థాపకులు శశాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్లకు 2024 సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచి్చనందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వీరు ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కు చెందిన శశాంక్ గుజ్జుల ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవగా.. ఏలూరుకు చెందిన అనుపమ్ పెదర్ల ఐఐటీ ఖరగపూర్లో బీటెక్ పూర్తి చేశాడు. పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో లేకపోవడంతో వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నట్టు గుర్తించిన వీరు, సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. గొప్ప ఉద్యోగావకాశాలను కాదనుకొని గోదావరిఖనికి చెందిన రాహుల్ అత్తులూరితో కలిసి నెక్ట్స్వేవ్ను స్థాపించారు. యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీలలో నైపుణ్యాలు పెంపొందిస్తూ ఐటీ ఉద్యోగాలు సొంతం చేసుకునే దిశగా వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మూడేళ్లలోనే దేశ విద్యా రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్సŠట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల నిధులను సొంతం చేసుకుంది. బహుళజాతి సంస్థలు సహా 1700 లకు పైగా కంపెనీలు వేలాది నెక్ట్స్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. ఈ సందర్భంగా నెక్సŠట్ వేవ్ సహ వ్యవస్థాపకుడు శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ ‘‘నెక్ట్స్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని గొప్ప అవకాశాలకు సొంతం చేసుకునేలా యువతని సిద్ధం చేయడంపైనే ఉండేది. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహంగా మా లక్ష్యం వైపు అడుగు వేయడానికి తోడ్పడుతాయి’’అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను దేశంలోని నలుమూలలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని నెక్ట్స్ వేవ్ మరో సహ వ్యవస్థాపకుడైన అనుపమ్ పెదర్ల చెప్పారు. -
TS గవర్నమెంట్ కీలక నిర్ణయం! ఉపాధ్యాయుల్లో ఆందోళన..
ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రతీ అంశాన్ని కీలకంగా పరిగణిస్తూ విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావాలనే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయాన ఉపాధ్యాయుల పదోన్నతుల అంశంపై సైతం దృష్టి పెట్టింది. ఈక్రమంలోనే పదోన్నతుల కల్పనకు ముందు టెట్ నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పదోన్నతి కల్పించేందుకు టెట్ అర్హతను తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తుండగా, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 4,785మంది ఉపాధ్యాయులు జిల్లాలోని 1,232 ప్రభుత్వ పాఠశాలల్లో 4,785మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో టెట్ పూర్తయిన ఉపాధ్యాయులు సుమారు 300మంది ఉన్నట్లు తెలుస్తోంది. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేయాలనే భావనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో చర్చ మొదలైంది. 2012కు ముందు టెట్ లేకపోవడంతో జిల్లాలో సుమారు 4వేల మంది ఉపాధ్యాయులకు పదో న్నతులకు అర్హత కోల్పోతారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగ ణించి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఉండాలి.. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం... టీచర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా పదోన్నతులు కల్పిస్తేనే అర్హుల కు లబ్ధి జరుగుతుందని మరికొందరు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే..
ప్రతి ఏడాది మునుపటి సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుంది. 2024 కూడా అంతే. 2023తో పోలిస్తే కొన్ని మార్పులు సహజం. ఇవన్నీ అందరి జీవితాలపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. ఆర్థిక అవగాహనతో సమాజంలో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి. అయితే జనవరి 1, 2024 నుంచి వచ్చే కొన్ని ప్రధాన మార్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. పెరిగిన కార్ల ధరలు టాటా మోటార్స్, మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా వంటి చాలా ఆటో కంపెనీలు జనవరి 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతామని ప్రకటించాయి. అధిక ఇన్పుట్ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశాయి. ధరల పెంపు దాదాపు 2-3 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని మోడళ్లకు అధిక ధరల పెంపు ఉండవచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. యూపీఐ ఐడీలు రద్దు ఆన్లైన్ పేమెంట్ యాప్‌లైన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లలోని యూపీఐ ఖాతాను ఒక సంవత్సరం పాటు ఉపయోగించకుంటే, ఇక నుంచి అది పనిచేయదు. ఇలాంటి ఐడీలను జనవరి ఒకటో తేదీ నుంచే డీయాక్టివేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి ఈ ఏడాది నవంబర్ ఏడో తేదీన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటన జారీ చేసింది. లావాదేవీలు నిర్వహించని కస్టమర్ల ఫోన్ నంబర్లతో మోసాలు జరగకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. కావాలంటే వాటిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది. సులభమైన భాషలో బీమా వివరాలు 2024 జనవరి 1 నుంచి ఆరోగ్య బీమా పాలసీదారుల కోసం రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లను (సీఐఎస్) విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. కస్టమర్లు పాలసీలోని ముఖ్య విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా చేయడం దీని లక్ష్యం. సులభమైన భాషలో అన్నింటినీ వివరించాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్! డిజిటల్ కేవైసీ ఇకపై మొబైల్ కనెక్షన్ల కోసం సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే విధానం మారుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఆదేశాల ప్రకారం.. కస్టమర్లకు సిమ్ కార్డ్‌లను విక్రయించే ముందు వారి ఫిజికల్ వెరిఫికేషన్‌ను దశలవారీగా తొలగించాలని టెలికమ్యూనికేషన్ కంపెనీలను ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. కస్టమర్లు తమ ఫొటో గుర్తింపు రుజువును చూపించి, డిజిటల్‌గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. సిమ్ కార్డ్ మోసాలను అరికట్టడానికి ఈ చర్య ఒక మార్గమని డాట్ వివరించింది. -
సరికొత్త దారిలో సర్కారీ చదువులు
ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. అయితే ఈ వర్సిటీల్లో చదివించేందుకు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం. సీటు తెచ్చుకోండి.. రూ.1.25 కోట్లు మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం. జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బెస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగితే వారి బతుకులతో పాటు రాష్ట్ర రూపురేఖలు మార్చే లీడర్ షిప్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు మన పిల్లల్ని చేయిపట్టుకుని మరీ పైకి తీసుకుని పోయే అవకాశాలు ఇస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. దేశ భవిష్యత్‌ను, తల రాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య దాకా 55 నెలల పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేశాం. ఏకంగా రూ.73 వేల కోట్లు విద్యా రంగానికే ఖర్చు చేశానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యా రంగంలోనే కాకుండా వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ప్రతి రంగంలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. 8,09,039 మంది పిల్లలకు మంచి చేసేలా రూ.7,47,920 మంది తల్లుల ఖాతాల్లో రూ.583 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా 27.61 లక్షల మంది పిల్లల పూర్తి ఫీజులు రూ.11,900 కోట్లు చెల్లిస్తూ తల్లిదండ్రులపై భారం పడకుండా ఒక మేనమామలా ఆదుకున్నానని చెప్పారు. పిల్లలపై బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల భారం పడకూడదని వసతి దీవెన ద్వారా అండగా ఉంటూ రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలనే తాపత్రయంతో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మొత్తంగా రూ.16,175 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు, డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలి. అలా ఆ కుటుంబాల తలరాతలు మారాలనే తపనతో అడుగులు వేస్తున్నాం. 2017–18కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజులు రూ.1,777 కోట్లను మనందరి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో సంస్కరణలు ♦ నాడు–నేడుతో బడుల రూపురేఖలను మార్చుతూ ఉన్నత విద్యపై ధ్యాస పెట్టి సంస్కరణలు తీసుకువచ్చి కరిక్యులంలో మార్పులు చేశాం. పిల్లలు ఏం చదువుతున్నారు.. అని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి మీ జగన్ మామ పాలనలోనే జరిగింది. తొలిసారి డిగ్రీలో కూడా ఆన్లైన్ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. ఏకంగా 10 నెలల ఇంటర్న్‌షిప్‌తో జాబ్ ఓరియంటెడ్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేశాం. ♦ మన పిల్లలు ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో చదువులుండాలనే తపనతో అంతర్జాతీయంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, ఎంఐటీ, హార్వర్డ్, ఎల్బీఎస్, ఎల్ఎస్సీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వచ్చేందుకు హైడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యాం. తద్వారా ఆన్లైన్లో ఆ కోర్సులు తీసుకొస్తూ ఏఐని అనుసంధానం చేస్తూ డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ పేద విద్యార్థులు మన పిల్లలు.. ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితేనే వేగంగా ఎదగగలుగుతారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలో భాగమైనప్పుడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ముందు వరుసలో ఉంటాం. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఒక పేజీ ఇంగ్లిష్, ఒక పేజీ తెలుగుతో బై లింగ్వల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా మెరుగైన చదువు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉండే.. రూ.15 వేలు ఆన్లైన్లో చెల్లిస్తే తప్ప రాని బైజూస్ కంటెంట్‌ను మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వ తరగతి.. ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్ రూంలో ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చి డిజిటల్ బోధనను తీసుకువచ్చాం. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు సీబీఎస్ఈతో మొదలై ఐబీ వరకు వెళుతున్న ఈ ప్రయాణం పిల్లలందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దే వరకు సాగుతుంది. 3వ తరగతి నుంచి టోఫెల్ సబ్జెక్ట్‌ను తీసుకువచ్చి క్లాస్ టీచర్ లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేయడం వరకు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వాళ్ల జగన్ మామ ఎంతో తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యా నేను పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. నేను ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో చిన్నప్పటి నుంచి కలగనేదాన్ని. జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టకుండా చదువుకుంటున్నాను. మొత్తం ఫీజు మీరే (సీఎం) కట్టారు. వసతి దీవెన ఎంతో ఉపయోగపడింది. మీ వల్ల అందరం బాగా చదువుకోగలుగుతున్నాం. మీ వల్ల నేను మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఆ క్రెడిట్ అంతా మీదే సార్. – ప్రిన్స్ ఏంజిల్, బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని, నరసాపురం మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారన్నా నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బీటెక్ చదువుతున్నా. నెల్సన్ మండేలా చెప్పినట్టు విద్య అనే ఒక ఆయుధం మాత్రమే మన భవిష్యత్‌ను మారుస్తుంది అన్న మాటను మీరు నిజం చేశారు. మీరు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ వర్సిటీల్లో మాదిరి సిలబస్ తీసుకొచ్చారు. మహిళా సాధికారత, విద్య.. ఈ రెండు జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మీరు ఈ రెండింటినీ సాధించారు. మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్యూ సార్. – నవ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, భీమవరం మార్పును గమనించండి ♦ దేశ భవిష్యత్‌ను మార్చగలిగేది చదువు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి. ఈ రోజు మనందరి ప్రభుత్వం రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. తేడాను మీరే గమనించాలి. చదువు అనేది తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను మార్చాలన్నా, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా, వెనుకబడిన కులాల తలరాతను మార్చాలన్నా, దేశ భవిష్యత్‌ను మార్చాలన్నా.. ఆ శక్తి కేవలం చదువుకే ఉంది. అందుకే 55 నెలల ప్రయాణంలో విద్యా రంగంలో విప్లవాత్మక అడుగులు వేశాం. ♦ నాడు–నేడుతో బడులు బాగుపడిన తీరుతెన్నులు గమనించాలి. ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరుముద్ద మీద ఫోకస్ పెట్టాం. పిల్లలు బాగా చదవాలని, వారిని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ప్రభుత్వ బడులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు తీసుకువచ్చి రూపురేఖలు మార్చుతున్నాం. ♦ ఒక్క విద్యా రంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. కేవలం 55 నెలల కాలంలోనే ఇన్ని మార్పులు జగన్ చేయగలిగినపుడు గత పాలకులు 14 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారో మీరే ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన గుర్తు తెచ్చుకోండి. -
‘బాబు-పవన్‌ల కుతంత్రాలు.. సీఎం జగన్‌కు తిరుగేలేదు’
విశాఖపట్నం, సాక్షి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైనాట్-175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని.. అందుకే పార్టీలో మార్పులని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో అసంతృప్తులు పార్టీని వీడడం షరా మామూలుగా జరిగేదేనని అన్నారాయన. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో మీడియాతో వంశీకృష్ణా యాదవ్ పార్టీ మారిన సంగతిపైనా స్పందించారు. ఎక్కడైతే మార్పు అవసరమని భావించామో అక్కడే ఇంఛార్జిలను మారుస్తున్నాం. ముందు పని చేసిన నాయకులు కొత్తవాళ్లకు సహకరించాలని సీఎం జగన్ కూడా చెప్పారు. ఎంతమంది ఉన్నా.. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి వంశీకి(వంశీకృష్ణ యాదవ్‌ను ఉద్దేశించి..) ఎమ్మెల్సీ ఇప్పించాం. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలి. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా మాకు ఇబ్బందేం లేదు అని అన్నారాయన. పవన్, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌కు తిరుగు లేదని, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే సీఎం అవుతారు అని సుబ్బారెడ్డి చెప్పారు. అందుకే రాజధాని ఆలస్యం న్యాయస్థానాల పరిధిలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే విశాఖపట్నం రాజధాని మార్పు ఆలస్యం అవుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సమస్యను అధిగమిస్తామని.. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగిస్తారని వైవీ సుబ్బారెడ్డి కుండబద్ధలు కొట్టారు. -
విద్యుత్ శాఖలో భారీ మార్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సర్కారు విద్యుత్ శాఖలో భారీగా మార్పులు చేపట్టింది. ఆయా విద్యుత్ సంస్థల సారథ్య బాధ్యతల్లో ఉన్న రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారుల (నాన్ ఐఏఎస్)ను తొలగించి.. ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్‌తోపాటు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ఇన్చార్జి డైరెక్టర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని ఇంధనశాఖ కార్యదర్శిగా నియమించారు. అంతేగాక రాష్ట్ర విద్యుత్ శాఖలో కీలకమైన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో, జెన్కోలకు సీఎండీగా దాదాపు పదేళ్లు కొనసాగిన డి.ప్రభాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. దీంతో సర్కారు కొత్త సీఎండీని నియమించింది. ముర్తుజా రిజ్వీ 2013 జూలై 2 నుంచి 2014 జూలై 19 వరకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా వ్యవహరించారు. యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు కీలకమైన ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను ప్రభుత్వం నియమించింది. గత ఎనిమిదేళ్లుగా ఈ పోస్టులో కొనసాగిన సి.శ్రీనివాసరావుకు ఉద్వాసన పలికింది. డిస్కంలకు యువ అధికారులు: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు అధిపతులుగా యువ ఐఏఎస్ అధికారులను సర్కారు నియమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముషార్రఫ్ అలీ ఫారూఖీని.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్‌రెడ్డిని నియమించింది. ఐటీ–ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ ఝాను ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా బదిలీ చేసింది. టీఎస్ఎన్పిడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు తన పదవికి రాజీనామా చేయగా, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఇప్పటివరకు పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో రఘుమారెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆయనను తప్పించారు. ఇక కేంద్ర డెప్యుటేషన్ నుంచి తిరిగొచ్చి వెయిటింగ్లో ఉన్న కాటా ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. వెయిటింగ్లో ఉన్న బి.గోపికి వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. త్వరలో కొత్త డైరెక్టర్లు కూడా..! రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కొత్త సీఎండీలను నియమించిన ప్రభుత్వం.. త్వరలో కొత్త డైరెక్టర్లను సై తం నియమించనున్నట్టు చర్చ జరుగుతోంది. ప్ర స్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్కోలో ఆరుగు రు, టీఎస్ఎస్పీడీసీఎల్లో ఏడుగురు, టీఎస్ఎన్పి డీసీఎల్‌లో ఆరుగురు డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వారిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి, మరికొందరు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కొన్ని సంస్థల్లో నిర్దేశిత సంఖ్యకు మించి డైరెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న డైరెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిసింది. -
స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే!
న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్‌లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది. చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్‌లను విశ్లేషించారు... ► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది ► దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి ► జ్ఞాపకశక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి ► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి ► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి ► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి ► ముఖ్యంగా ‘ట్యాబ్’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. ► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. ► డిజిటల్ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్ రచయిత, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు. -
మార్పుతో మేలు జరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి జరిగే జేఈఈ మెయిన్స్‌లో గణనీయమైన మార్పులు తెచ్చారు. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కొన్ని టాపిక్స్ ఎత్తేశారు. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్‌కు ఇప్పటికే విద్యార్థులు సన్నద్ధమయ్యారు. ఈ దశలో సిలబస్ మార్పులను ఎన్టీఏ ప్రకటించడంతో ఇది రాష్ట్ర విద్యార్థులపై కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సిలబస్ నుంచి తొలగించిన టాపిక్స్‌కు కూడా విద్యార్థులు ప్రిపేరయ్యారు. ఇప్పుడు వాటిని తప్పించడంతో మిగిలిన టాపిక్స్‌లో పోటీ తీవ్రంగా ఉండే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సిలబస్‌తో ఇంటర్ చేసే వాళ్లు మరికొంత శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే వారంతా ఏప్రిల్‌లో జరిగే రెండో దశ మెయిన్స్‌కు హాజరు కావడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగేనా? సిలబస్ తగ్గించడంతో ఈసారి మెయిన్స్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కటాఫ్ మార్కుల విషయంలోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి జేఈఈ రాసేవారి సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతోంది. 2014లో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుకాగా 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉండగా ప్రస్తుతం 1.30 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలు ఉండగా 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. రాష్ట్ర ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. సిలబస్ కఠినంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుసరించే సిలబస్ చదివితే తప్ప మెయిన్స్ గట్టెక్కలేమనే భావన విద్యార్థుల్లో ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్‌ను ఎంచుకుంటున్నారు. సిలబస్‌లో మార్పులు తేవడంతో ఈసారి జేఈఈ రాసే వారి సంఖ్య కొంతమేర పెరిగే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. మేథ్స్ ఇక కఠినం కానట్టేనా? కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ రాస్తున్న వారు ఎక్కువగా గణితం కష్టంగా ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా స్కోర్ చేస్తున్న అనుభవాలున్నాయి. ఫిజిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇది దక్షిణాది విద్యార్థులకన్నా ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులను కలవరపెడుతోంది. మేథ్స్‌లో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు పట్టు ఉంటోంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సరైన శిక్షణ అందుకోలేకపోతున్నారు. జేఈఈలో ఇచ్చే గణితంలో సుదీర్ఘ ప్రశ్నలుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మేథ్స్‌లో ట్రిగ్నామెట్రిక్ ఈకే్వ షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ప్రిన్సిపుల్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ వంటి టాపిక్స్ వచ్చే అవకాశం లేదని ఎన్టీఏ తెలిపింది. దీనివల్ల తేలికగానే జేఈఈ మెయిన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
రాహుల్ పర్యటనలో మార్పు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనలో మార్పులు జరిగాయి. వాస్తవానికి ఈనెల 1, 2 తేదీల్లో ఆయన రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించాల్సి ఉన్నా ఒకరోజు ముందుగానే వచ్చారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌లో జరిగిన పాలమూరు ప్రజాభేరి సభకు ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ హాజరుకావాల్సి ఉంది. రాహుల్ ఢిల్లీలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి హాజరై బుధవారం మధ్యాహ్నానికి రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ, ప్రియాంకకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రాహుల్ సీఈసీ సమావేశాన్ని రద్దు చేసుకుని కొల్లాపూర్ బహిరంగ సభకు హాజరయ్యారు. అనంతరం రాత్రికి హైదరాబాద్‌లో బస చేశారు. బుధవారం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ పట్టణాల్లో రాహుల్ ప్రచారం నిర్వహించనున్నారు. తొలుత కల్వకుర్తి సభలో పాల్గొని, ఆ తర్వాత జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్‌కు హాజరవుతారు. అక్కడి నుంచి షాద్‌నగర్‌లో పాదయాత్ర చేసి అక్కడ జరిగే కార్నర్ మీటింగ్‌కు హాజరవుతారు. తర్వాత ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. కాగా, రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన 2వ తేదీ షెడ్యూల్‌ను రాహుల్ వాయిదా వేసుకున్నారు. మూడో తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ ముగిశాక మరోమారు రాహుల్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. -
హైకోర్టు ‘రోస్టర్’లో సమూల మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు విచారించే సబ్జెక్టుల్లో (రోస్టర్‌లో) సమూల మార్పులు జరిగాయి. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు వచ్చిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మార్పులు చేశారు. కొత్త న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లకు సీనియర్ న్యాయమూర్తుల పక్కన ధర్మాసనాల్లో స్థానం కల్పించారు. జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌కు సింగిల్ జడ్జిగా బాధ్యతలు అప్పగించారు. కీలకమైన బెయిల్ పిటిషన్లను ఎవరూ ఊహించని విధంగా న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు అప్పగించారు. వీటితోపాటు 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలను కూడా జస్టిస్ మల్లికార్జునరావు విచారించాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాలు సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు ముందు లిస్ట్ అయ్యాయి. అలాగే కీలకమైన క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతలను జస్టిస్ బీఎస్ భానుమతికి అప్పగించారు. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్లతో పాటు అధికరణ 226 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్లను సైతం ఆమే విచారిస్తారు. ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2022 తరువాత దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ భానుమతే విచారిస్తారు. మరో కీలకమైన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు సంబంధించిన కేసులను జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుకు కేటాయించారు. అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణాలతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1411, మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344ను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ నిమ్మగడ్డ విచారణ జరుపుతారు. రోస్టర్ అమల్లోకి వచ్చే సోమవారం నాడే టీడీపీ నేతల వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ ముందుకు విచారణకు రానున్నాయి. పురపాలక శాఖ, ఏపీసీఆర్డీఏ, ఏఎంఆర్డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారిస్తారు. రెవెన్యూ, భూ సేకరణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవికి అప్పగించారు. మొన్నటివరకు బెయిల్ పిటిషన్లను విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డికి ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లను కొట్టేయాలని కోరుతూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ల విచారణ బాధ్యతలు అప్పగించారు. 2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను కూడా జస్టిస్ సురేష్‌రెడ్డి విచారిస్తారు. మొన్నటి వరకు క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, కంపెనీ కేసులు, ఒరిజినల్ సివిల్ సూట్ల కేసులను అప్పగించారు. జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2020, 2021 సంవత్సరాల్లో దాఖలైన వ్యాజ్యాలను కేటాయించారు. ఒకట్రెండు రోజుల్లో రోస్టర్‌లో స్వల్ప మార్పులు హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీపై వేరే హైకోర్టులకు వెళుతున్నందున ఈ రోస్టర్‌లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. వారు వెళ్లిన తరువాత తాజా రోస్టర్‌లో కేటాయించిన సబ్జెక్టులను ఇతర న్యాయమూర్తులకు కేటాయిస్తారు. అలాగే కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ జి.నరేంద్ర ఇక్కడ ప్రమాణం చేసిన తరువాత ఆయనకు కొన్ని సబ్జెక్టులను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో తాజా రోస్టర్‌లో కొద్దిపాటి మార్పులు చేయనున్నారు. -
అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలు, రూ.2000 నోట్ల డిపాజిట్ వంటి ఆర్థికంగా ముఖ్యమైన పలు అంశాలకు డెడ్‌లైన్ సెప్టెంబర్ 30తో ముగియనుంది. అలాగే పలు కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లకు నామినీల చేర్పు ప్రస్తుతం ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినీలను చేర్చడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత డెబిట్‌లకు వేలు లేకుండా ఫోలియోలు ఫ్రీజ్ అవుతాయి. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) కొత్త టీసీఎస్ నియమాలు క్రెడిట్ కార్డ్‌లపై విదేశీ ఖర్చులు రూ. 7 లక్షలు దాటితే 20 శాతం టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది. వైద్య లేదా విద్యా ప్రయోజనాల కోసం రూ. 7 లక్షలకు మించి ఖర్చు చేస్తే 5 శాతం టీసీఎస్ విధిస్తారు. ఇక విదేశీ విద్య కోసం రుణాలు రూ.7 లక్షల పరిమితి దాటితే 0.5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ కరెంట్ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులకు లబ్ధిదారుని నామినేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. మార్కెట్ రెగ్యులేటర్ సర్క్యులర్ ప్రకారం.. 'ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల అసెస్మెంట్ ఆధారంగా నామినేషన్ వివరాల ఎంపిక (అంటే నామినేషన్ లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి డిక్లరేషన్ అందించడం) గడువు తర్వాత అప్డేట్ చేయడానికి వీలుండదు. వాటాదారుల నుంచి స్వీకరించిన ప్రతిపాదనలు, ఖాతాల స్తంభనకు సంబంధించి 2022 ఫిబ్రవరి 24 నాటి సెబీ సర్క్యులర్‌లోని 3 (ఎ) పేరా, 2021 జూలై 23 నాటి సెబీ సర్క్యులర్‌లోని పేరా 7లో పేర్కొన్న నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. రూ. 2,000 నోట్ల మార్పిడి రూ.2000 నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ రూ.2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 30ని డెడ్ లైన్ గా నిర్ణయించింది. ఇప్పటికీ తమ వద్ద రూ. 2,000 నోట్లు ఉన్న వారు గడువు తేదీలోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి ఆధార్ నుంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు కోసం జనన ధృవీకరణ పత్రాలను సింగిల్ డాక్యుమెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. -
దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు
ఢిల్లీ: ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. ఎందుకంటే చాలా వెబ్సైట్లు తమ పేర్లలో .ఇన్ అనే డొమైన్‌ను వాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఇండియా పేరు ఉంది కాబట్టే ఇండియా స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన ఐఎన్‌లను ఆయా వెబ్సైట్ల పేరు చివరన పెట్టుకున్నాయి. .ఇన్ డొమైన్‌ను కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్(టీఎల్‌డీ) అంటారు. దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మారితే .ఇన్ అనే డొమైన్ భారత్ అనే కొత్త పేరును ప్రతిబింబించదు. అçప్పుడు భారత్ అనగానే ఠక్కున స్ఫురించేలా కొత్త టీఎల్‌డీ(డొమైన్)కు మారితే బాగుంటుంది. భారత్ ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లోని బీహెచ్ లేదా బీఆర్ ఇంగ్లిష్ అక్షరాలతో కొత్త డొమైన్‌ను వాడాలి. అంటే .బీహెచ్ లేదా .బీఆర్ అని ఉంటే సబబుగా ఉంటుంది. కానీ ఈ రెండు డొమైన్లను ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించారు. దీంతో వెబ్సైట్ పేరు చూడగానే ఇది భారత్‌దే అని గుర్తుపట్టేలా ఉండే కొత్త డొమైన్ మనకిప్పుడు అందుబాటులో లేదు. అదే ఇప్పుడు అసలు సమస్య. ఎన్ఐఎక్సై్స వారు ఇన్‌రిజిస్ట్రీ సంస్థ ద్వారా .ఇన్ డొమైన్‌ను రిజిస్టర్ చేశారు. ప్రత్యేకమైన అవసరాల కోసం ఇందులోనే సబ్‌డొమైన్‌లను సృష్టించి కొన్ని సంస్థలకు కేటాయించారు. ఉదాహరణకు జీఓవీ.ఇన్ అనే డొమైన్‌ను భారత ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకుంటున్నాయి. ఎంఐఎల్.ఇన్ అనే డొమైన్‌ను దేశ సైన్యం వినియోగిస్తోంది. ఒక్కో డొమైన్ ఒక్కో దేశాన్ని వెంటనే స్ఫురణకు తెచ్చేలా ప్రాచుర్యం పొందాయి. ఉదాహరణకు .సీఎన్ అనగానే చైనా వెబ్సైట్లు, .యూఎస్ అనగానే అమెరికా వెబ్సైట్లు, .యూకే అనగానే బ్రిటన్ వెబ్సైట్లు గుర్తొస్తాయి. భారత్‌లోని చాలా ప్రముఖమైన వెబ్సైట్లు సైతం తమ ఐడెంటిటీ(గుర్తింపు)ను నిలబెట్టుకున్నాయి. మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఒక్కసారిగా డొమైన్ మారిపోతే కొత్త డొమైన్‌తో ఆయా వెబ్సైట్లకు మళ్లీ అంతటి గుర్తింపు రావడం చాలా కష్టం. .బీహెచ్, .బీఆర్ మనకు రావేమో!.బీహెచ్, .బీఆర్ అనే భారత్‌కు సరిగ్గా సరిపోతాయి. కానీ ఇప్పటికే .బీహెచ్ను బహ్రెయిన్ దేశానికి, .బీఆర్‌ను బ్రెజిల్ దేశానికి, .బీటీను భూటాన్‌కు కేటాయించారు. దీనికి మరో పరిష్కారం ఉంది. డొమైన్లోని అక్షరాలను పెంచుకుని .BHARAT, లేదా .BHRT అనే కొత్త డొమైన్‌కు తరలిపోవడమే. కొత్త డొమైన్‌కు మారినాసరే ఆయా వెబ్సైట్లు పాత డొమైన్లనూ కొనసాగించవచ్చు. వీటి నిర్వహణలో వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే ఆయా సంస్థల అసలు వెబ్సైట్ ఏది అనేది గుర్తించడం కష్టమవుతుంది. నకిలీ వెబ్సైట్ల బెడద ఒక్కసారిగా పెరిగిపోతుంది. బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి సమస్య తలెత్తితే ఇక అంతే సంగతులు. కొత్త డొమైన్ ప్రాచుర్యం పొందాక పాత డొమైన్లకు.. ఇవి ఏ దేశానికి చెందినవబ్బా ? అనే కొత్త అనుమానం నెటిజన్లకు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే డొమైన్ పేరు సమస్య ఒక్కటే పొంచి ఉంది. నిజంగానే దేశం పేరు మారితే ఇలాంటి కొత్త రకం సమస్యలు ఏమేం వస్తాయో ఇçప్పుడే చెప్పలేం. చూద్దాం.. ఈ డొమైన్ల కథ ఏ మలుపు తిరుగుతుందో! ఇదీ చదవండి: తెరపైకి భారత్..! -
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
సేత్వార్ సమస్యలకు ‘చెక్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సేత్వార్ నమోదులో జరిగిన పొరపాట్లను సవరించి ఒక సర్వే నంబర్లోని భూముల హెచ్చుతగ్గులను నమోదు చేసేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చి న కొత్త ఆప్షన్లపై భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు గురువారం సమాచారం పంపారు. వాస్తవానికి, ధరణి పోర్టల్‌లో సర్వే నంబర్లలోని భూములను నమోదు చేసే విషయంలో కొన్నిచోట్ల పొరపాట్లు జరిగాయి. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న వాస్తవ భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దీంతో ఆ భూమి నమోదైన మేరకు మాత్రమే రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వడంతోపాటు క్రయవిక్రయ లావాదేవీలకు ధరణి పోర్టల్ అనుమతినిచ్చి ంది. తద్వారా ఆ భూమిలో ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులకు పాసు పుస్తకాలు రాకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు సేత్వార్ నమోదు, సవరణలకు ధరణి పోర్టల్‌లో అవకాశం ఇవ్వడంతో ఈ సమస్యకు చెక్ పడుతుందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయేతర భూములను ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మేందుకు, కొనేందుకు అవకాశముంది. కానీ, ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇప్పటివరకు ఒక్కరి పేరు మీదనే జరిగేవి. దాన్ని మార్చడం ద్వారా ఒకరి కంటే ఎక్కువ మంది భూమి అమ్మేందుకు, భూమి కొనేందుకు అవకాశం కలగనుంది. ఇక, భూసేకరణ సమయంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన లావా దేవీల సగటు విలువను లెక్కించి పరిహారాన్ని రైతుకు చెల్లిస్తారు. దీనికి అవసరమైన మార్కెట్ విలువ సర్టిఫికెట్‌ను ధరణి పోర్టల్ ద్వారా ఇచ్చే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భూములను మార్ట్గేజ్ (తనఖా) చేసుకునేందుకు అడుగుతున్న కుల ధ్రువీకరణ పత్రం అవసరం లే కుండా మార్పులు చేశారు. సదరు భూ యజమాని ఎస్టీ అని సంబంధిత తహసీల్దార్ నమోదు చేస్తే సరిపోయేలా మార్పు చేశారు. టీఎం 33 మాడ్యూల్లో.. ధరణి పోర్టల్‌లో రైతులు ఎక్కువగా ఉపయోగించుకునే టీఎం33 మాడ్యూల్‌ను తాజా మార్పుల్లో మరింత సులభతరం చేశారు. ఉదాహరణకు గతంలో టీఎం 33 ద్వారా పేరు మార్పు చేయాలనుకుంటే ఆ పేరుతోపాటు ఇతర వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే ఇతర వివరాల నమోదులో పొరపాట్లు దొర్లి కొత్త సమస్యలు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు టీఎం33 మాడ్యూల్ ద్వారా పేరు, లింగం, ఆధార్, కుల కేటగిరీల్లో ఏది అవసరమైతే దాన్ని మాత్రమే సరిదిద్దుకునేలా, ఇతర వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేశారు. పాసుపుస్తకాల దిద్దుబాటు క్రమంలో కలెక్టర్లు వెనక్కు పంపిన దరఖాస్తుల వివరాలకు సంబంధించిన రిపోర్టు అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు ఎక్సెల్ ఫార్మాట్లో ఆ రిపోర్టు అందుబాటులో ఉండేలా ధరణి పోర్టల్‌లో మార్పులు చేయడం గమనార్హం. అదేవిధంగా గ్రామ పహాణీలు కలెక్టర్‌తోపాటు సీసీఎల్ఏ లాగిన్‌లో కూడా అందుబాటులో ఉండేలా మార్పులు చేశారు. -
ఖాతాదారులకు అలర్ట్: పోస్టాఫీసుల్లో కొత్త మార్పులు
Post Office Account New Rules: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీసులకు దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ ఉంది. మారుమూల గ్రామాల్లోనూ శాఖలు ఉన్నాయి. కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోస్టాఫీసుల ద్వారానే అమలవుతున్నాయి. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులు కూడా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ల ఓపెనింగ్, విత్‌డ్రాయల్, వడ్డీ లెక్కింపు, చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితి పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితిని పెంచారు. ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులు మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుండేది. ఇప్పుడు మార్చిన నిబంధనల ప్రకారం, జాయింట్ అకౌంట్‌ను ముగ్గురు వ్యక్తులు కలిసి తెరవవచ్చు. నగదు విత్‌డ్రా సేవింగ్స్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రాకు సంబంధించి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కోసం కస్టమర్లు ఫారం-2, అకౌంట్ పాస్‌బుక్ సమర్పించేవారు. ఇక నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే ఫారం-3ని నింపి, పాస్‌బుక్‌తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు, చెల్లింపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ లెక్కింపు, చెల్లింపులోనూ కీలక మార్పులు వచ్చాయి. దీని ప్రకారం ప్రతి నెలా 10వ తేదీ నుంచి ఆ నెలలో చివరి రోజు వరకు ఉన్న అతి తక్కువ డిపాజిట్ మొత్తం మీద 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి, ఆ సంవత్సరం చివరిలో సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ, సంవత్సరం పూర్తి కాకముందే ఖాతాదారు మరణిస్తే, సేవింగ్స్ అకౌంట్ మూసివేసిన నెలకు ముందు నెలాఖరులో ఆ వ్యక్తి ఖాతాలోకి వడ్డీ డబ్బును జమ చేస్తారు. -
పేర్లు తొలగిస్తే చరిత్ర మారదు
శ్రీనగర్: ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలకున్న నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పేర్లను తొలగించినంత మాత్రాన చరిత్ర దాగదు, మారదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందని ప్రతి నేత పేరును కనిపించకుండా చేస్తోందని ఆయన విమర్శించారు. అయితే, చరిత్ర ఎన్నటికీ మారదు, శాశ్వతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి, ఎన్సీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లాను అందరూ పిలుచుకునే షేర్ అనే పేరును ‘షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’నుంచి అధికారులు తొలగించడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మొఘలుల 800 ఏళ్ల పాలనను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించింది. దానర్థం వారు లేనట్లేనా? తాజ్ మహల్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్‌మినార్.. తదితర చారిత్రక నిర్మాణాలకు కారకులెవరని చెబుతారు?, మనం, వాళ్లు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం, అది మారదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’అని అబ్దుల్లా పేర్కొన్నారు. -
WC 2023: అక్టోబర్ 14న భారత్ vs పాకిస్తాన్
ముంబై: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 9 మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. అహ్మదాబాద్‌లో నవరాత్రి ఉత్సవాలు... కోల్‌కతాలో కాళీ మాత పూజల కారణంగా తప్పనిసరిగా రెండు మ్యాచ్‌ల తేదీలలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీని వల్ల ఇతర మార్పులు కూడా అవసరం కావడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో ఏడు మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చింది. దీని ప్రకారం టోర్నమెంట్కే హైలైట్ మ్యాచ్ అయిన భారత్, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన పోరును ఒకరోజు ముందుగా అక్టోబర్ 14న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో కూడా అక్టోబర్ 12న జరగాల్సిన పాకిస్తాన్–శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10కి మారింది. అక్టోబర్ 10న ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డే అండ్ నైట్‌గా జరగాల్సిన మ్యాచ్‌ను డేగా నిర్వహిస్తారు. -
పాత జోనల్ విధానంలో మార్పులు
సాక్షి, అమరావతి: పాత జోనల్ విధానంలో మార్పులు చేసి కొత్త జిల్లాలతో కొత్త జోన్లు, మల్టీజోన్ ఏర్పాటుచేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికత, జోనల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉన్నందున.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కొత్త జోన్లు, మల్టీజోన్ ఏర్పాటుచేసేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల (1975)కు సవరణ చేసేందుకు ప్రతిపాదిత అంశంపై సీఎస్ సమీక్షించారు. స్థానికత, ప్రతిపాదిత నూతన జోనల్ విధానం తదితర అంశాలపై సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి. భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెఎచ్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. రహదారుల కోత నివారణ.. ఇక రాష్ట్రంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోత నివారణకు కూడా ప్రభుత్వం త్వరలో ముగింపు పలకనుంది. ఇందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) సాంకేతికతతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ అంశంపైనా శుక్రవారం సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. ఈ విధానంలో రోడ్లు నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలపై ఆయన చర్చించారు. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా, వర్షాలుపడినా, వరదలు వంటి విపత్తులు వచ్చినా నదీతీర ప్రాంతాల్లోని రోడ్లు తరచూ కోతకు గురవుతున్నాయి. ఈ సమస్య తీర ప్రాంత జిల్లాల్లో దశాబ్దాలుగా ఎదురవుతోంది. ఇలా రహదారుల విధ్వంసంతో ప్రభుత్వానికి రూ.వేలకోట్ల నష్టం జరుగుతోంది. ఇకపై రోడ్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా వనరుల కొరతతో పాటు వాటి జీవితకాలాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫుల్ డెప్త్ రిక్లమేషన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో పాత రోడ్డును యంత్రాల సాయంతో రెండు నుంచి మూడు అడుగుల లోతు తవ్వుతారు. ఆ తర్వాత సిమెంట్, కెమికల్‌తో మిక్స్‌చేసి చదును చేస్తారు. ఆపై ఒకదానిపై మరొక లేయర్‌ను నిర్మిస్తారు. ఇవి సాధారణ రోడ్లు కంటే 15 నుంచి 20 ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. పైగా ఈ విధానంలో రోడ్లు నిర్మిస్తే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల ఈఎన్సీలు తదితరులు పాల్గొన్నారు. -
ఏఐతో బీమా రంగంలో పెను మార్పులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ (ఏఐ)తో బీమా రంగంలో పెను మార్పులు వస్తున్నాయని డిజిట్ ఇన్సూరెన్స్ హెడ్ (అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగం) విశాల్ షా తెలిపారు. విస్తృతమైన డేటాబేస్లను విశ్లేషించి వివిధ రిస్కులను మదింపు చేసేందుకు, సముచితమైన ప్రీమియంలను నిర్ణయించేందుకు బీమా సంస్థలు ప్రస్తుతం ఏఐ ఆధారిత అల్గోరిథమ్స్‌ను ఉపయోగిస్తున్నాయని వివరించారు. అలాగే మోసపూరిత క్లెయిమ్‌లను కూడా వీటితో గుర్తించగలుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు, కస్టమర్లకు సరీ్వసులను మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు వినియోగంలోకి వచి్చనట్లు షా తెలిపారు. తక్షణం సమాధానాలిచ్చేలా, పాలసీల ఎంపికలు, కోట్ జనరేషన్ మొదలైన అంశాల్లో కస్టమర్లకు సహాయపడేలా వీటి శిక్షణ ఉంటోందన్నారు. అలాగే కీలకమైన క్లెయిమ్‌లకు సంబంధించి మదింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీమా సంస్థలు ప్రత్యేక అల్గోరిథమ్‌లను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మోటర్ బీమా విషయానికొస్తే వాహనాలను వ్యక్తిగతంగా పరీక్షించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఇమేజ్ రికగి్నషన్ టెక్నాలజీ ద్వారా నష్టాన్ని అంచనా వేయడంలోనూ ఏఐ సహాయపడుతోందని షా చెప్పారు. బీమా రంగంలో భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించడంలో తోడ్పడటం ద్వారా వినూత్న ఉత్పత్తులను రూపొందించేందుకు కూడా అడ్వాన్స్డ్ అనలిటిక్స్, మెషిన్ లెరి్నంగ్ అల్గోరిథమ్‌లు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. -
వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నూర్‌బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా ఇకపై వైఎస్సార్ షాదీ తోఫా కింద ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలోని ముస్లింలకు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. ఇస్లాం మతాన్ని ఆచరించే నూర్‌బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులను బీసీ–బీగా పరిగణిస్తుండటంతో వారికి రూ.50వేలు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు కూడా వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని దూదేకుల ప్రతినిధులు ఇటీవల సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా వీరిని ముస్లింలుగానే పరిగణించి లబ్ధిని చేకూర్చేలా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై ఆ వర్గాలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపాయి. చదవండి: సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు -
ఇద్దరు యువతుల ప్రేమ పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. ఆ సంబంధిత ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. బరేలీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని బరేలీలో ఇద్దరు అమ్మాయిలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయూ ప్రాంతానికి చెందినవారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ జంటలోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. డిజిస్ట్రేషన్ ద్వారా వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష పాండే తెలిపారు. ఇలాంటి కేసు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. ఇదీ చదవండి: అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్.. అసలే పేషెంట్.. మళ్ళీ పేషెంట్ అయ్యాడు.. -
బీజేపీ రాష్ట్ర శాఖలకు కొత్త సారథులు
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని అధికార బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. దీంతో, త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీకి కొత్త సారథులను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని, ఏపీ చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరిని నియమించింది. అదేవిధంగా, పంజాబ్ బాధ్యతలు సునీల్ జాఖడ్‌కు, జార్ఖండ్ చీఫ్‌గా బాబూలాల్ మరాండీకి బాధ్యతలు అ ప్పగిస్తున్నట్లు బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ బాధ్యతలను ఓబీసీ నేత ఈటెల రాజేందర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా అధికార భారత రాష్ట్ర సమితిని దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ మార్పులు చేపట్టినట్లు భావిస్తున్నారు. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. ఈమె యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్‌కు పగ్గాలు అప్పగించింది. అదేవిధంగా, జార్ఖండ్‌లో గిరిజన నేత, సీఎం హేమంత్ సోరెన్‌ను ఢీకొట్టేందుకు అదే వర్గానికి చెందిన మాజీ సీఎం మరాండీని రంగంలోకి దించింది. మరాండీ తన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్)ను 2020లో బీజేపీలో విలీనం చేశారు. -
మణిపూర్ సీఎంను తొలగించండి
న్యూఢిల్లీ: మణిపూర్‌లో దాదాపు రెండు నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని మోదీ మౌనం దాల్చడమేంటని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మణిపూర్ గురించి ప్రధాని మోదీ నిజంగా ఆందోళన చెందుతున్నట్లయితే ముందుగా చేయాల్సింది ఆ రాష్ట్ర సీఎంను తొలగించడమేనన్నారు. మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం ఆ విషయాన్ని కప్పిపుచ్చు కోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పలు ట్వీట్లు చేశారు. ‘గడిచిన 55 రోజుల్లో మణిపూర్ గురించి ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఏం చెబుతారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మోదీ జీ నిజంగా మణిపూర్‌లో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నట్లయితే, అక్కడి బీజేపీ సీఎంను ముందుగా తొలగించండి’అని పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాద సంస్థల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో సంభాషణలు జరిపి, ఉమ్మడి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని ప్రభుత్వానికి ఖర్గే సూచించారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణానికి వీలు కల్పించాలి. ప్రజలకు నిత్యావవసర వస్తువులను అందుబాటులోకి తేవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలి’అని ఖర్గే పేర్కొన్నారు. -
ముందు అక్కడ అధికార మార్పు కోసం ప్రయత్నించండి సార్!
ముందు అక్కడ అధికార మార్పు కోసం ప్రయత్నించండి సార్! -
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీపై వ్యతిరేకత ఉంది
ఔరంగాబాద్: ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇదే కొనసాగితే దేశం రాబోయే ఎన్నికల్లో మార్పును చూస్తుందన్నారు. ఈ విషయం చెప్పడానికి జ్యోతిష్యుని అవసరం లేదని, కర్ణాటక ఫలితాలు పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఔరంగాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే విషయమై ప్రశ్నించగా తనతోపాటు తమ పార్టీ మిత్రపక్షాలు కూడా అదే కోరుకుంటున్నాయని తెలిపారు. అయితే.. కర్ణాటక ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఒకేసారి రెండు ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ సిద్ధపడ దని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు పెట్టుబడి సాయంలో ‘తెలంగాణ మోడల్’పై ఆయన స్పందిస్తూ.. చిన్న రాష్ట్రం కాబట్టి అది సాధ్యమయ్యిందని, దానికి బదులుగా రైతులకు మౌలిక వసతుల కల్పనకు నిధులను వెచ్చిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ప్రతి చిన్న ఘటనకూ మతం రంగు పులుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి సంకేతం కాదన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై శరద్‌పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఇంతవరకూ ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయలేదని, చెరుకు రైతులకు మద్దతు ధరలేదని, ఈ విషయంలో రైతుల పోరాటానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. -
దశాబ్దంలోనే భారత్‌లో ఎంతో మార్పు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కింద భారత్ పదేళ్లలోనే ఎంతో మార్పు చెందినట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని, ఆసియా, ప్రపంచ వృద్ధిని నడిపించే కీలక దేశంగా అవతరించినట్టు తన తాజా నివేదికలో ప్రస్తావించింది. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) భారత్ తన సామర్థ్యాల మేరకు ఫలితాలను చూపించలేదని, ఈక్విటీ వ్యాల్యూషన్లు గరిష్టాల్లో ఉన్నాయన్న విమర్శలను తోసిపుచ్చింది. ఈ తరహా దృక్పథం గత తొమ్మిదేళ్లలో చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణలను విస్మరించడమేన పేర్కొంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థకు తోడు, గత 25 ఏళ్లలో గొప్ప పనితీరు చూపిన స్టాక్ మార్కెట్‌ను నిదర్శనాలుగా ప్రస్తావించింది. 2013తో పోలిస్తే ఇప్పుడున్న భారత్ భిన్నమైనదిగా పేర్కొంది. (సెబీ షాక్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ రద్దు) ఇవీ మార్పులు..: 2014లో ప్రధానిగా మోదీ కొలువుదీరిన తర్వాత చోటు చేసుకున్న పది పెద్ద మార్పులను మోర్గాన్ స్టాన్లీ ప్రస్తావించింది. పోటీ దేశాల స్థాయిలో కార్పొరేటు పన్నును తగ్గింపు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం అతిపెద్ద సంస్కరణలుగా పేర్కొంది. జీఎస్టీ కింద పన్నుల ఆదాయం క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. అలాగే, జీడీపీలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండం ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధీకరణ చెందుతుందనడానికి నిదర్శంగా పేర్కొంది. ఎగుమతుల్లో భారత్ వాటా రెట్టింపై 2031 నాటికి 4.5%కి చేరుకుంటుందని అంచనా వేసింది. తలసరి ఆదాయంలో వృద్ధి ప్రస్తుతం భారత్‌లో తలసరి ఆదాయం 2,200 డాలర్లుగా (రూ.1,80,400) ఉంటే, 2032 నాటికి 5,200 డాలర్లకు (రూ.4,26,400) పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. ఇది బారత్‌లో వినియోగ పరంగా పెద్ద మార్పునకు కారణమవుతుందని అంచనా వేసింది. మరిన్ని బిజినెస్వార్తలు,ఎకానమీ గురించిన వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఆధార్ బిగ్ అప్డేట్ ఒక్క ఫోన్ తో ఆధాార్ సమస్యలకు చెక్
-
డిగ్రీలో సమూల మార్పులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా డిగ్రీలో సరికొత్త మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. విద్యార్థులు కోరుకున్న సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘బకెట్’విధానాన్ని తీసుకొస్తున్నామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో గురువారం మండలి కార్యాలయంలో కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌సహా ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాందీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో సమావేశం నిర్వహించింది. సమావేశ వివరాలను లింబాద్రి మీడియాకు వివరించారు. నచ్చిన కోర్సు... ♦ ఇప్పటి వరకూ డిగ్రీ కోర్సులు మూస విధానంలో ఉండేవి. బీఏ హెచ్‌పీపీ తీసుకుంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు మాత్రమే చదవాలి. అయితే కొత్త విధానంలో ఏ, బీ, సీ, డీ బకెట్లుగా సబ్జెక్టులను విడగొడతారు. వీటిల్లో వేటినైనా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు... ఎ గ్రూపులో అరబిక్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ, లిటరేచర్ ఇలా కొన్ని సబ్జెక్టులుంటాయి. బి గ్రూప్‌లో ఎకనామిక్స్, హిందీ, ఇంగ్లిష్, తెలుగు, సాహిత్యం, ట్రావెల్ టూరిజం వంటి కొన్ని కోర్సులుంటాయి. ఇలా సి, డీ గ్రూపుల్లోనూ కొన్ని కోర్సులుంటాయి. విద్యార్థులు ఏవేని మూడు బకెట్స్ నుంచి ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ♦ డిగ్రీలో క్రెడిట్ సిస్టమ్ అమలు చేయడం వల్ల ప్రతీ దాన్ని క్రెడిట్ విధానంలో కొలుస్తారు. బకెట్ విధానం వల్ల బీఏ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సు, సాహిత్యం, మరే ఇతర కోర్సు అయినా చేయవచ్చు. ♦ ఈ విధానం క్షేత్రస్థాయిలో అన్ని కాలేజీల్లో ఎలా అమలు చేయాలనే దానిపై మండలి ఓ కమిటీని నియమించి, దాని సూచనల మేరకు మార్పులు చేస్తుంది. విభిన్న సబ్జెక్టులతో డిగ్రీ చేసిన విద్యార్థికి మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యం వచ్చే వీలుంది. మరికొన్ని మార్పులు ♦ విద్యార్థి కాలేజీలోనే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా దేశ, విదేశాల్లో ఎక్కడైనా ఒక కోర్సు చేసే వీలుంది. దానికి సంబంధిత సంస్థలే పరీక్షలు నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను ఆయా సంస్థలకు బదలాయిస్తాయి. ♦ డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్ అనుబంధ కోర్సులను సబ్జెక్టులుగా తీసుకురానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోర్సుల బోధనకు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కాలేజీ మొదలయ్యే నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జూలై నుంచే డిగ్రీ క్లాసులు మొదలవ్వాలని తీర్మానించారు. ♦ కోవిడ్ మూలంగా చాలామంది విద్యార్థుల్లో అభ్యసన నష్టాలు కన్పిస్తున్నాయి. వీటిని పూడ్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి పక్కా ప్రణాళికను త్వరలో ఖరారు చేయబోతున్నారు. -
5జీతో విద్య, వైద్యంలో పెను మార్పులు
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులతో హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ మొదలైన విభాగాల్లో భారీ మార్పులు రాగలవని టెలికం సంస్థ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. వీటితో నగరాలు స్మార్ట్‌గా, సొసైటీలు సురక్షితమైనవిగా మారగలవని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆకాశ్ అంబానీ ఈ విషయాలు చెప్పారు. ఆరోగ్యసంరక్షణ రంగంలో 5జీ వినియోగంతో అంబులెన్సులు డేటా, వీడియోను రియల్ టైమ్‌లో వైద్యులకు చేరవేయగలవని, రిమోట్ కన్సల్టేషన్లు, వేగవంతమైన రోగనిర్ధారణ విధానాలతో మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం విషయానికొస్తే వాతావరణం తీరుతెన్నులు, నేలలో తేమ స్థాయి, పంటల ఎదుగుదల మొదలైన వాటి గురించి డేటా ఎప్పటికప్పుడు పొందడం ద్వారా సరైన సాగు విధానాలు పాటించేందుకు వీలవుతుందని ఆకాశ్ చెప్పారు. అంతిమంగా సమాజంపై 5జీ, అనుబంధ టెక్నాలజీలు సానుకూల ప్రభావాలు చూపగలవని వివరించారు. -
AP: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు
సాక్షి, అమరావతి: మా అబ్బాయికి ఉద్యోగం ఉందనో లేదంటే ఇన్‌కం టాక్స్ కడుతున్నారనో మాకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు.. ఈ తరహా కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న వారికి ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ప్రాతిపదికగా తీసుకుంటున్న నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల డేటాలో మార్పులు, చేర్పులకు వీలు కల్పించింది. ఆ సర్వే డేటాలో.. పెళ్లైన రెండు మూడు జంటలు కూడా ఒకే కుటుంబంగా నమోదై ఉండి.. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివాసముంటుంటే.. వారిని వేర్వేరు కుటుంబాలుగా వర్గీకరించేందుకు అవకాశం కల్పించింది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలను పొందొచ్చని గ్రామ, వార్డు సచివాలయ అధికారులు వెల్లడించారు. ఆ కారణంతో ప్రభుత్వ పథకాలకు పలువురు దూరం ప్రభుత్వం 2019 ఆగస్టులో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాక.. వలంటీర్ల ఆధ్వర్యంలో నవశకం సర్వే నిర్వహించింది. వలంటీర్లు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి, ఆ ఇంటి పెద్ద లేదా ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ కుటుంబ వివరాలను నమోదు చేశారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.67 కోట్ల కుటుంబాలున్నట్టు ఆ సర్వే తేల్చింది. నవశకం పేరుతో జరిగిన ఆ సర్వే వివరాల డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల వివరాలను ఆ నవశకం డేటాలో పేర్కొన్న కుటుంబాల వారీగా సభ్యుల వివరాలతో అధికారులు పోల్చి చూస్తున్నారు. అయితే, అప్పట్లో ఒకే కుటుంబంగా తమ వివరాలను నమోదు చేసుకున్న వారు పలు చోట్ల ఇబ్బంది పడుతున్నారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారనో, లేదంటే ఇన్‌కం ట్యాక్స్ కడుతున్నారనో, లేదా కారు ఉందనో, లేదంటే వ్యక్తిగత పేరుతో ఎక్కువ ఆస్తి నమోదై ఉందనో.. ఇలా పలు కారణాల వల్ల ఆ కుటుంబంలోని మిగతా వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. దీంతో కుటుంబ సభ్యుల వివరాల విభజనకు అవకాశం కలి్పంచాలని వారు ప్రభుత్వానికి అర్జీలిస్తూ వస్తున్నారు. ఇలాంటి వినతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రావడంతో ప్రభుత్వం నవశకం సర్వే డేటాలో కుటుంబ వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. ఆ ఆరింటిలో ఏదో ఒక ఆధారం తప్పనిసరి.. నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోదలచిన వారు ఆరు రకాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. సర్వే డేటాలో.. ఇప్పుడు ఒకే కుటుంబంగా పేర్కొంటున్న వారిలో పెళ్లై వేరుగా ఉంటున్న వారు.. వివాహ ధ్రువీకరణ పత్రం, లేదంటే ఆధార్, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీకార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, పాస్‌పోర్టుల్లో భర్త లేదా భార్య పేర్లు ధ్రువీకరించేలా ఉంటే.. ఆ కుటుంబ సభ్యులను మరో కుటుంబంగా గుర్తిస్తారు. అయితే, ఆయా ధ్రువీకరణ పత్రాలుండటంతో పాటు ఆ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వేరుగా నివాసం ఉండాలి. చదవండి: మోదీకి ఆ సలహా ఇచ్చింది నేనే.. జనం చెవుల్లో బాబు పువ్వులు ప్రయోగాత్మక పరిశీలన అనంతరం.. నవశకం సర్వే డేటాలో కుటుంబ సభ్యుల వర్గీకరణను ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఒక మండలంలో, పట్టణ ప్రాంతంలో ఒక నగర కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకం(పైలెట్)గా పరిశీలన పూర్తి చేశారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం, వైఎస్సార్ జిల్లా కడప నగర కార్పొరేషన్‌ను ఇందుకు ఎంపిక చేశారు. మొదటి దశలో.. పెళ్లైన వారి వివరాల ప్రకారం మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. మరో రెండు దశల్లో వితంతు, విడాకులు తీసుకున్న వారిని వేరే కుటుంబాలుగా గుర్తించే ప్రక్రియ కూడా ఈ రెండు ప్రాంతాల్లో శుక్రవారం నుంచే ప్రయోగాత్మకంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. -
జోషిమఠ్ బాటలో...
ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కొండల్లో రాళ్లు, మట్టి వదులుగా మారి ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తోందన్న భయంతో స్థానికులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ జూలై 2020 నుంచి మార్చి 2022 మధ్య చేసిన అధ్యయనంలో జోషిమఠ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏడాదికి 6.5 సెంటీమీటర్లు కుంగిపోతున్నట్టుగా గుర్తించారు. ఒకప్పుడు ఇళ్లకు చిన్న పాటి చీలికలు కనిపించేవి. ఇప్పుడు భారీగా పగుళ్లు మాదిరిగా ఏర్పడుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆఫీసు వేళలు మారాలి పని విధానంలోనూ మార్పులు కావాలి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి తమ రోజూవారీ విధులు, వృత్తిగత జీవితంలో గుణాత్మక మార్పులు కోరుకుంటున్నారు. ఆఫీస్ వేళలు–పనివిధానంలో మార్పులు జరగాలని భారత్‌లోని మెజారిటీ ఎంప్లాయిస్ గట్టిగా అభిలషిస్తున్నారు. కార్యాలయ పనివేళల నియమాలు అనేవి తాము కోరుకున్నట్టుగా రూపొందించేందుకు యాజమాన్యాలు ఒప్పుకుంటే జీతాలు తగ్గించుకోవడమే కాదు ఇతర అంశాల్లోనూ రాజీపడేందుకు సిద్ధమంటున్నారు. ►మొత్తంగా 17 దేశాల్లోని 33 వేలమంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వే అధారంగా...ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ‘పీపుల్స్ ఎట్ వర్క్ 2022 @ ఏ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ’ ఓ నివేదికను రూపొందించింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. పనిగంటల్లో, విధులు నిర్వహించే విధానంలో వెసులుబాటు ఉండాలని ప్రతి పది మందిలో ఏడుగురు కోరుకున్నట్టు తేలింది. రోజూవారీ చేసే పనిగంటలపై తమకు పూర్తి పట్టు ఉండాలని భారత్‌లోని 76.07 శాతం ఉద్యోగులు స్పష్టం చేశారు. వర్క్ ఫ్రం హోం లేదా ఇల్లు, ఆఫీసుల మధ్య ఎంచుకునే అవకాశం, వారంలో సగం రోజులు ఆఫీసు, సగం రోజులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తే తమకిచ్చే జీతంలో కొంత తగ్గించుకునేందుకు, ఇతర అలవెన్సుల్లో రాజీపడేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో ఆఫీసు నుంచే పనిచేయాలని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్న పక్షంలో కొత్త కొలువులు వెతుక్కుంటామంటూ 76.38 శాతం భారత ఉద్యోగులు పేర్కొన్నట్టు ఈ రిపోర్ట్ తెలిపింది. వర్క్ ఫ్రంహోం సందర్భంగా తమ సేవలను మంచి గుర్తింపు లభించిందని 73 శాతం, నైపుణ్యాల మెరుగు, శిక్షణా అవసరాలు వంటి వాటిపై యాజమాన్యాలతో చర్చించగలిగామని 74 శాతం చెబుతున్నారు. మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు, మెంటల్ హెల్త్‌ను కాపాడుకునేందుకు ఇంటినుంచి పనిచేయడం ఉపయోగపడిందని 56 శాతం అభిప్రాయపడ్డారు. çసాÜంప్రదాయ ‘నైన్ టు ఫైవ్’ఉద్యోగుల టైమింగ్స్ స్థానంలో సృజనాత్మకతతో కూడిన మరింత వినూత్న ప్రత్యామ్నాయాలను వారు కోరుకుంటున్నారు. ►కోవిడ్ మహమ్మారి కాలంలో తీవ్రమైన మానసిక సంఘర్షణ, ఒత్తిళ్లను ఎదుర్కున్నందున చేసే ఆఫీసుపని– గడిపే రోజూవారీ జీవితం మధ్య మంచి సమతూకంతో పాటు ఒత్తిళ్లు లేని పనివిధానం కోరుకుంటున్నారు’అని ఏడీపీ సౌతీస్ట్ ఏషియా, ఇండియా ఎండీ రాహుల్ గోయల్ చెప్పారు. గతంలో ఆచరణ సాధ్యం కాదని భావించిన వారానికి 4 రోజుల పని విధానం అమలు, ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యం కల్పించడం ద్వారా ఆయారంగాల్లోని ఉత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులను ఆకర్షించే అవకాశముందని గోయల్ అభిప్రాయపడ్డారు. ఐటీ అనే కాదు ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఐటీ అనే కాకుండా అన్ని రంగాల ఉద్యోగులు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కోరుకుంటున్నారు. జాబ్ ఇంటర్వ్యూలప్పుడే జీతం ప్యాకేజీ కంటే కూడా వర్క్ ప్రం హోం, హైబ్రిడ్ వర్కింగ్ ఇస్తేనే చేరతామంటున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా తమకు తోచిన పద్ధతుల్లో పనివేళలు అడుగుతున్నారు. కనీసం వారానికి రెండురోజులైనా ఇంటినుంచి పని విధానం ఉందా లేదా అని ఆరాతీస్తున్నారు. ట్రైనీలు, ఎంట్రీలెవల్ ఎంప్లాయిస్ కూడా దీనినే కోరుతున్నారు. – డా. బి. అపర్ణరెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్!
ముంబై: ఆన్లైన్లో కేవైసీ (ఖాతాదారుల వివరాలు) వెరిఫికేషన్ పూర్తి చేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయొచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కేవైసీ ధృవీకరణ లేదా అప్డేషన్ కోసం కస్టమర్లు కచ్చితంగా శాఖకు రావాలంటూ బ్యాంకులు డిమాండ్ చేయజాలవని, అలాంటి నిబంధనేదీ పెట్టలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అలాగే సెంట్రల్–కేవైసీ (సీ–కేవైసీ) పోర్టల్‌లో తమ వివరాలను అప్లోడ్ చేసిన కస్టమర్లను కూడా బ్యాంకులు.. వెరిఫికేషన్ కోసం అడగనక్కర్లేదని తెలిపారు. అలాంటి సందర్భాల్లో కస్టమర్లు తమ కేవైసీ వివరాలను సీ–కేవైసీ పోర్టల్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటూ అధికారిక ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబరు ద్వారా బ్యాంకుకు మెయిల్ లేదా మెసేజీ పంపించవచ్చని దాస్ పేర్కొన్నారు. -
ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తేవాలనుకుంటున్న ఈ బోధనా విధానం ప్రకారం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోనే ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే మార్కులు ఇస్తారు. అలాగే ఆఖరి సంవత్సరంలో మరో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాలనే షరతు పెట్టనున్నారు. ఎందుకీ మార్పు...? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో 12 శాతం మంది మాత్రమే స్కిల్డ్ జాబ్స్ పొందుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సర్వేలో ఇది స్పష్టమైంది. కంప్యూటర్ సైన్స్‌లో కనీసం కోడింగ్ కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అధ్యయనంలో వెల్లడైంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రణాళిక లేదని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల కోసం స్థానికంగా నిపుణుల కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బోధన స్థాయిలోనూ పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు ఉండాలని ఏఐసీటీఈ సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత కొంతకాలంగా సరికొత్త బోధన ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడది ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. నాణ్యమైన విద్య, తక్షణ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్నత విద్యలో మార్పులతోపాటు ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంజనీరింగ్ విద్యలో ఫీల్డ్ అనుభవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే దీని భాగస్వామ్యాన్ని పెంచనున్నాం. నవీన దృక్పథంతో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే ఇంటర్నల్ మార్కులను 20 నుంచి 40కి పెంచాం. ఎక్స్‌టర్నల్స్ 60 మార్కులకు ఉండేలా మార్పులు చేశాం. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్ చేయడం, సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ తీసుకురావడాన్ని తప్పనిసరి చేస్తున్నాం. ఇవన్నీ ఇంజనీరింగ్ విద్య నాణ్యతను పెంచుతాయని, మార్కెట్లో మంచి నిపుణులుగా విద్యార్థులను నిలబెడతాయని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ -
ఏ ‘వెలుగులకు’ ఈ కొత్త చట్టం?
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 2014 నుంచీ జరుగుతున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నప్పటికీ ఈ దఫా మాత్రం 2003 నాటి విద్యుత్ చట్టంలో మార్పులు చేయాలనే పట్టుదలను కేంద్రం కనబరుస్తోంది. ప్రధానంగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నాయనీ, దాని నుంచి బయటపడవేసేందుకే ఈ కొత్త చట్టమనే అభిప్రాయాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ పెద్దలు చెబుతున్నారు. ఇది అంతి మంగా డిస్కంలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకేనని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు–2022పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యుత్ చట్టం–2003లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తెచ్చేందుకు 2014 నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై గతంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. 2019లో కూడా మరోసారి ప్రయత్నం జరిగింది. మెజార్టీ రాష్ట్రాలు, విద్యుత్ ఉద్యో గులు, రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరోసారి కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మాత్రం వ్యతిరేకతను లెక్క చేయకుండా చట్టం చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. మరోసారి అదే వ్యతిరేకత వచ్చిన ఫలితంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు –2022 కాస్తా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చెంతకు చేరింది. అయినప్పటికీ గెజిట్ల జారీ ద్వారా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తూ కేంద్రం ముందుకే అడుగులు వేస్తోంది. దేశంలోని డిస్కంల ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లకు చెల్లించాల్సిన బకాయిల వ్యవహారం కేంద్రానికి కొత్త మార్పులకు ఊతమిస్తోందని చెప్పకతప్పదు. 1998–99 నుంచి విద్యుత్ రంగంలో తెచ్చిన కాలానుగుణ సంస్కరణలు డిస్కంలు, జెన్ కోలను కాపాడలేకపోయావనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. దేశ వ్యాప్తంగా 57 డిస్కంలు ఏకంగా 1.40 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. ఇందులో ఆయా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం రూ.76 వేల కోట్లు ఉండగా... మిగిలిన 64 వేల కోట్ల మేర ఆయా ప్రభుత్వశాఖలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు. అయితే, విద్యుత్‌ను తీసుకున్నందుకుగానూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్కో)లకు డిస్కంలు రూ.1.10 లక్ష కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. అటు డిస్కంలు, ఇటు జెన్కోలను కాపాడే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త చట్టం తెస్తున్నామనేది కేంద్ర పెద్దల ఉవాచ. విద్యుత్ పంపిణీ రంగంలో కేవలం ఒకరే కాకుండా ఎక్కువ మంది ఉండాలనీ, తద్వారా డిస్కంలలో పోటీతత్వంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయనీ కేంద్రం చెబుతోంది. అందుకే డిస్కంలల్లో ప్రైవేటీకరణకు తాజా చట్టం తెరలేపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో ప్రైవేటు డిస్కంలు సేవలందిస్తు న్నాయి. ఇక ఒడిశాలో ఏకంగా 4 ప్రైవేటు డిస్కంలు విద్యుత్ పంపిణీ రంగంలో పనిచేస్తున్నాయి. అయితే, మరింత విస్తృతంగా కొత్త నెట్ వర్క్ అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌లోనే ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకే కొత్త చట్టం వస్తోందని తెలు స్తోంది. దీనితో పాటు కొత్త చట్టంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. అవి: 1. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్, సభ్యుల నియామకానికి త్రిసభ్య కమిటీ స్థానంలో నలుగరు సభ్యుల కమిటీని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ ప్రతి నిధి ఇందులో భాగస్వామ్యం కానున్నారు. తద్వారా రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం తలదూర్చనుందన్న విమర్శలు వస్తున్నాయి. 2.ఒక రాష్ట్రం కాకుండా 2,3 రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌ను రాష్ట్రాల ఈఆర్సీలు కాకుండా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈ ఆర్సీ) ఇవ్వనుంది. తద్వారా రాష్ట్రాల ఈఆర్సీల పాత్ర నామ మాత్రంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3.విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే వ్యయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే నేరుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధికారం జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ల చేతుల్లోకి వెళ్లనుంది. తద్వారా రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఎస్ఎల్డీసీ) అధికారం కుంచించుకుపోనుందన్న ఆందోళన నెలకొంది. 4. ప్రస్తుతం ఉన్న చట్టంలో యూనివర్సల్ సప్లై ఆబ్లిగేషన్ అనే నిబంధన ఉంది. ఒక రైతు కోసం కూడా కొత్తగా లైన్ల అవసరం ఏర్పడితే డిస్కంలు వేయా ల్సిందే. తాజా చట్టంలో ఈ ఆబ్లిగేషన్‌ను తొలగించారు. తద్వారా సామాన్య వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చట్టంపై మరింత లోతైన చర్చ జరగాల్సిందేనన్న వైఎస్సార్సీపీ అభిప్రాయా నికి సానుకూల స్పందన వస్తోంది. అనుమానాలు నిజమేనా? ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్ చట్టం–2003లో రూపొందిం చారు. కాలక్రమంలో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సవరణలు చేసి కొత్త బిల్లును తెరమీదకు తెచ్చింది ఇప్పుడే. అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్‌రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త బిల్లు ముందుకు వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ బిల్లులోని కొన్ని అంశాలు కేంద్ర వైఖరిపై అనుమానం వ్యక్తం చేసే విధంగానే ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం సెక్షన్ 14, 42లల్లో ఏమని పేర్కొన్నారంటే... ‘‘విద్యుత్ సరఫరా, పంపిణీ, ట్రేడింగ్ కోసం ఏ సంస్థకైనా, ఏ వ్యక్తికైనా సంబంధిత కమిషన్ లైసెన్స్‌ను జారీచేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ పొందిన సంస్థ లేదా వ్యక్తులు తమ పరిధిలోని వినియోగ దారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ నెట్వర్క్ (విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) వగైరా)ను సొంతంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.’’ అయితే, కొత్త బిల్లులో ఈ రెండు క్లాజ్‌లలో మార్పులు చేస్తున్నారు. ఎటువంటి లైసెన్సు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో పాటు, ఇప్పటికే ప్రభుత్వరంగ డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే వెసులుబాటును కల్పించారు. ఈ రెండు క్లాజులలో చేయనున్న మార్పులను గమనిస్తే ప్రైవేటు సంస్థలకు విద్యుత్ పంపిణీ రంగంలోకి బార్లా తలుపులు తెరుస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ప్రస్తుతం మునిసిపాలిటీ/ జిల్లా పరిధిలో మాత్రమే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులకు అవకాశం ఉండేది. తాజాగా సెప్టెంబరు 8వ తేదీ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో మాత్రం మునిసిపాలిటీ/ మూడు జిల్లాలతోపాటు ఏదైనా పేర్కొన్న చిన్న ప్రాంతంలో కూడా విద్యుత్ పంపిణీ లైసెన్సును పొందే అవకాశం ఉందని పేర్కొంది. ((తద్వారా కేంద్రం తాజా అడుగులు మరింత ఆందోళనను పెంచే విధంగానే ఉన్నాయని చెప్పకతప్పదు.)) విస్తృత చర్చ జరగాల్సిందే! ఏడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా 52 అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలకూ అధికారం ఉంటుందని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ జాబితాలో విద్య, ధరల నియంత్రణ, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ వంటి అంశాలతో పాటు విద్యుత్ కూడా ఒక అంశం. ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఏవైనా మార్పు చేర్పు లతో పాటు కొత్త చట్టాలు చేసే సమయంలో రాష్ట్రాల అభిప్రాయం కూడా కేంద్రం తీసుకోవడం పరిపాటి. ముసాయిదా విద్యుత్ (సవ రణ) నిబంధనలు–2022 విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై అనేక పార్టీలు గుర్రుమంటున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై కొత్త చట్టం తెస్తున్న నేపథ్యంలో దీనిపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ప్రతిపాదించిన బిల్లులో ఉన్న లోపాలు, చేయాల్సిన మార్పులపై కూడా తన అభిప్రాయాన్ని పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. భిన్న అభిప్రాయాలు, అనుమానాల నేపథ్యం లోనే పార్లమెంటులో ఆగస్టు 8న కేంద్రం ఈ ముసాయిదాను ప్రవేశ పెట్టింది. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో చివరకు విద్యుత్‌పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ముందు ఉంచనున్నట్టు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. దీంతో వివాదం కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగింది. విశాల ప్రజానీకంలో నెలకొన్న సందే హాల నివృత్తి తర్వాతే కేంద్రం ముందుకు వెళితే ఆమోదయోగ్యంగా ఉంటుంది. – కె.జి. రాఘవేంద్రారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ -
National Education Policy–2020: సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. కొత్త మార్పులు ఏమిటంటే.. విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది. విద్యార్థుల టాలెంట్‌ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్‌ను సీబీఎస్ఈ జారీ చేస్తుంది. -
చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !
Megastar Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు ఉన్నాయి. సోమవారం (జులై 4) 'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి పేరు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోమవారం విడుదలైన 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో చిరంజీవి పేరు ఇంగ్లీషు లెటర్స్‌లో అదనంగా 'E' అనే అక్షరం దర్శనమిచ్చింది. దీంతో చిరు MEGASTAR CHIRANJEEVIకి బదులుగా MEGASTAR CHIRANJEEEVI అని మార్చుకున్నట్లు పుకార్లు రచ్చ చేశాయి. అంతేకాకుండా ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను చిరంజీవి సన్నిహితులు, గాడ్ ఫాదర్ చిత్రబృందం ఖండిస్తున్నారు. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఎడిటింగ్ చేసేటప్పుడు జరిగిన తప్పు మాత్రమే అని, చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకులేదని చెబుతున్నారు. ఎడిటింగ్ తప్పిదం వల్లే అదనంగా ఇంకో E అక్షరం యాడ్ అయిందే తప్ప న్యూమరాలజిస్ట్‌ల సలహా అస్సలు తీసుకోలేదని తెలిపారు. అలాగే మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చిత్రబృందం పేర్కొంది. అయితే ఈ వార్తపై చిరంజీవి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి -
మధ్యవర్తిత్వంతో న్యాయవ్యవస్థలో మార్పులు
కెవాడియా (గుజరాత్): మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా కోర్టు కేసుల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
డిజిటైజేషన్‌తో బ్యాంకింగ్‌లో పెను మార్పులు
న్యూఢిల్లీ: డిజిటైజేషన్, కొంగొత్త టెక్నాలజీలు.. బ్యాంకింగ్ రంగంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఖర్చులు తగ్గించి, సర్వీసులను విస్తృతంగా అందించేందుకు తోడ్పడుతున్న డిజిటల్ విప్లవానికి దేశీ బ్యాంకులు అలవాటు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా సర్వీసులు అందించడంపై బ్యాంకులు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటోందని ఖారా చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీల వినియోగంపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ‘పరిశ్రమలు, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను డిజిటల్ ఆవిష్కరణలు మార్చేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఈ మార్పులు మరింత వేగవంతం అవుతున్నాయి. ప్రస్తుతం డిజిటైజేషన్, డిజిటల్ ఆవిష్కరణలనేవి బ్యాంకింగ్ పరిశ్రమకు వ్యూహాత్మక ప్రాధాన్యత అంశాలుగా మారాయి‘ అని ఖారా వివరించారు. మారే పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ విధానాలకు వేగంగా మళ్లాల్సిన అవసరాన్ని బ్యాంకులు గుర్తించాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడం, వినియోగించుకోవడం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు వంటివి డిజిటల్ రుణాల వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఖారా పేర్కొన్నారు. రుణాల ప్రక్రియ కూడా డిజిటల్‌గా మారాలి.. ప్రస్తుతం పేమెంట్ వ్యవస్థ డిజిటల్‌గా మారిందని, ఇక రుణాల విభాగం కూడా డిజిటల్‌గా మారాల్సిన సమయం వచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా చెప్పారు. బ్యాంకులు దీనిపై కసరత్తు చేస్తున్నాయని వివరించారు. ఇప్పటికే కొన్ని రుణ ఉత్పత్తుల డిజిటైజేషన్‌ను మొదలుపెట్టాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్ పరిశ్రమలో టెక్నాలజీ, ఆవిష్కరణల వినియోగం క్రమంగా పెరుగుతోందని, కరోనా వైరస్ మహమ్మారి రాకతో ఇది మరింత వేగం పుంజుకుందని మెహతా తెలిపారు. మరోవైపు, భారత్ చాలా వేగంగా డిజిటల్ ఆధారిత ఎకానమీగా రూపాంతరం చెందుతోందని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) కంట్రీ హెడ్ (ఇండియా) వెండీ వెర్నర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫిన్‌టెక్ వినియోగం భారత్‌లోనే ఉందని, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాలు కూడా ఈ విషయంలో ముందుంటున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో ఫిన్‌టెక్ మార్కెట్ 50–60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని.. ఇది మరింతగా వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లో చేసిన పలు మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ల రవాణా .. రెస్టారెంటు సర్వీసులు మొదలైన వాటిని అందించే ఈ–కామర్స్ కంపెనీలు ఈ సేవలపై పన్నులు చెల్లించాల్సి రానుంది. ఇక పాదరక్షలు, టెక్స్టైల్ రంగాలకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలకు 12 శాతం, కాటన్ మినహా అన్ని రకాల టెక్స్టైల్ ఉత్పత్తులకు (రెడీమేడ్ గార్మెంట్స్ సహా) 12 శాతం జీఎస్టీ వర్తించనుంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలు గానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉంటుంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆహార డెలివరీ సేవలు అందించే ఈ–కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి .. ఆయా హోటల్స్ నుంచి జీఎస్టీ వసూలు చేసి, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇన్వాయిస్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు జీఎస్టీ వసూలు చేస్తున్న నేపథ్యంలో అంతిమంగా కస్టమరుపై అదనపు భారం పడదు. జీఎస్టీ డిపాజిట్ బాధ్యతలను మాత్రమే ఫుడ్ డెలివరీ సంస్థలకు బదలాయించినట్లవుతుంది. -
నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
Major Changes That Will Set In From November 1: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే మనం వెంటనే అప్రమత్తమైపోతాం. ఇంటి అద్దె బిల్లులు , చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున పూర్తి చేస్తాం. అంతేందుకు ప్రభుత్వాలు కూడా ఒకటో తేదీనే పలు ముఖ్యమైన కార్యక్రమాలను చేపడుతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెస్తాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల నవంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.ఇక నవంబర్ 1 నుంచి సామాన్యులపై గ్యాస్ బండ మోత కూడా మోగనుంది. చదవండి: దివాళీ ఎఫెక్ట్ : తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే నవంబర్ 1 నుంచి మారనున్న రూల్స్..! ఎల్పీజీ డెలివరీ సిస్టమ్ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే నెల నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ కోసం వినియోగదారులు కచ్చితంగా వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అందించాల్సి ఉంటుంది.డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC)లో భాగంగా ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో ఈ మార్పు రానుంది. డిపాజిట్లు, ఉపసంహరణలపై ఛార్జీలను సవరించనున్న పలు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిర్దేశిత పరిమితిని మించి డిపాజిట్, డబ్బును విత్‌డ్రా చేయడం కోసం నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఛార్జీలు సేవింగ్స్ ఖాతాదారులతో పాటు వేతన ఖాతాదారులకు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యాక్సిస్ , సెంట్రల్ బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే టైమ్ టేబుల్ దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్లో మార్పులు చేయబోతోంది. నవంబరు 1 నుంచి పలు రైళ్లకు కొత్త టైమ్‌టేబుల్ ప్రకటించనుంది. భారతీయ రైల్వేస్ ప్రకారం... 13 వేల ప్యాసింజర్ రైళ్లు , 7 వేల గూడ్స్ రైళ్లు టైమింగ్స్‌లో మార్పు రానున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ ధరలు గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కారణంగా..చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగితే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు రానున్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై కీలక వ్యాఖ్యలు చేసిన పేటీఎమ్..! -
ఇంటర్ ఫస్టియర్: టైంటేబుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. 29, 30 తేదీల్లో పరీక్షలను రద్దు చేశారు. ఈ తేదీల్లో జరిగే పరీక్షలు 31 నుంచి జరుగుతాయి. హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు శక్రవారం ఓ ప్రకటనలతో తెలిపింది. దీంతో నవంబర్ 2తో ముగియాల్సిన పరీక్షలను ఇంకోరోజు పొడిగించారు. సవరించిన టైం టేబుల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. -
ఆర్టీసీ నష్టాలకు వాస్తు దోషమా? బస్‌భవన్‌కు వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు వారికి తోచిన రీతిలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వాస్తును కూడా వారు అనుసరిస్తున్నారు. తాజాగా బస్‌భవన్‌కు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రధాన మార్గం వైపు ఉన్న గేటును మూసేశారు. ఈ మార్గానికి సరిగ్గా వెనకవైపు చిన్న రోడ్డుపై ఉన్న మరో గేటును వినియోగిస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం సంధ్య థియేటర్ ముందు నుంచి వెళ్లే రోడ్డు ప్రధానమైంది కావడంతో ఇంతకాలంగా ఆ వైపు గేటునే ప్రధాన ద్వారంగా వినియోగిస్తూ వస్తున్నారు. అయితే ఇది దక్షిణ ముఖంగా ఉండడంతో వాస్తుకు అనుకూలంగా లేదన్న ఉద్దేశంతో తాజాగా ఈ మార్పు చేశారు. కొత్తగా వినియోగించే గేటు ఈశాన్యం వైపు ఉంది. ప్రస్తుతం వాహనాలన్నింటిని ఆ గేటు నుంచే అనుమతిస్తున్నారు. కొత్త ఎండీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన రోజున నూతన గేటులోంచే లోనికి వచ్చారు. ఇదిలా ఉండగా సజ్జనార్ రాకముందే వాస్తు మార్పు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు దానిని అమలులోకి తెచ్చామని ఓ అధికారి పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
మీ ఆధార్ కార్డు ఒరిజినలేనా? ఇలా చెక్ చేస్కోండి
నకిలీ వ్యవహారాలు మామూలు జనాలకు పెద్ద ఇబ్బందులే తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీదానికి ముడిపడి ఉన్న ఆధార్ విషయంలోనూ ఫేక్ కుంభకోణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఆధార్ తీసుకుంటున్నవాళ్లు, లేదంటే మధ్యవర్తి ద్వారా కార్డులు సంపాదించుకుంటున్న వాళ్లు.. తమ 12 డిజిట్ నెంబర్లను ఆధార్ నెంబర్‌గా ఫిక్స్ అయిపోయి అన్నిచోట్లా సమర్పిస్తుంటారు. అయితే ఈ విషయంలో యూఐడీఏఐ ప్రజల కోసం ఓ అలర్ట్‌ను జారీ చేసింది. Aadhar Card Alert: ఆధార్‌ను ఎక్కడైనా సమర్పించే ముందు అసలేనా? నకిలీనా? ఒక్కసారి తనిఖీ చేస్కోమని చెప్తోంది. లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతోంది. ఇందుకోసం resident.uidai.gov.in/verify లింక్‌కు వెళ్లాలి. ఆపై కార్డుపై ఉన్న 12 అంకెల డిజిట్‌ను ఎంటర్ చేయాలి. కింద ఉన్న సెక్యూరిటీ కోడ్ లేదంటే క్యాప్చాను క్లిక్ చేసి వెరిఫై కొట్టాలి. అప్పుడు ఆ ఆధార్ నెంబర్ ఒరిజినలేనా? అసలు ఉందా? అనే వివరాలు కనిపిస్తాయి. చాలామంది ఆధార్ అప్డేట్స్, మార్పుల విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. కానీ, చిన్న చిన్న మార్పులు, సవరణల కోసం ఆన్లైన్లోనే వెసులుబాటు కల్పిస్తోంది యూఐడీఏఐ. ఇక అప్డేషన్, మొత్తంగా మార్పుల కోసం మాత్రం తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. ► ఆధార్ కార్డ్‌పై అడ్రస్ సవరణ కోసం ఆన్లైన్లో వెసులుబాటు కల్పించింది యూఐడీఏఐ ► అడ్రస్ మార్పు కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ అంటే.. దగ్గర్లోని ఆధార్ సెంటర్ ఈ సౌకర్యం కల్పిస్తోంది. సవరించడం ఎలాగో తెలుసా? ► ఫొటో మార్చుకోవడానికి కూడా రీజియన్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషాల్లో ఫొటో మార్చుకోవచ్చు ఇలా ► ఆధార్ కార్డు మీద పేరును రెండు సార్లు మార్చుకోవడానికి వీలుంటుంది. ► డేట్ ఆఫ్ బర్త్, జెండర్(ఆడ/మగ/ట్రాన్స్‌జెండర్) ఒక్కసారే మారతాయి. పుట్టినతేదీ మార్చుకోవాలా? ► జెండర్ మార్పునకు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ► మొబైల్ నెంబర్‌కు తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. లేదంటే మార్పులేవీ జరగవు. క్లిక్ చేయండి: ఇంట్లో నుండే ఆధార్ అప్డేట్ చేసుకోండి ఇలా! ► ఒకవేళ మొబైల్ నెంబర్ వేరే వాళ్లది ఉన్నా.. పాత నెంబర్‌ను మార్చుకోవాలనుకున్నా అప్డేట్ చేసుకోవచ్చు. స్థానిక పోస్ట్ మ్యాన్ లేదా పోస్టు మాస్టర్ కు ఫోన్ చేసి కోరితే ఇంటికే వచ్చి ఈ సేవలు అందిస్తారు. అయితే ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది అమలు అవుతుండడం విశేషం. గ్రామీణ ప్రాంతాల వాళ్లు మాత్రం మండల కేంద్రాలకు ‘క్యూ’ కట్టాల్సి వస్తోంది. ► సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ ద్వారా (SSUP) https://ssup.uidai.gov.in/ssup/ లింక్ క్లిక్ చేసి సంబంధిత స్కాన్ డాక్యుమెంట్లు సమర్పించి చిన్న చిన్న మార్పులు చేసుకునే వీలు మాత్రమే. సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు. ► ముఖ్యమైన విషయం ఏంటంటే.. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్నెంబర్, ఈ-మెయిల్, ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్, ఫొటోగ్రాఫ్.. ఇలాంటి వివరాల అప్డేషన్ కోసం పర్మినెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్‌ను సంప్రదించాల్సిందే. ► సంబంధిత ఫామ్స్ అన్నీ యూఐడీఏఐ వెబ్సైట్లోనే దొరుకుతాయి కూడా. ఒకవేళ పొరపాటున పరిమితులు మించిపోతే ఎలా?.. ఆ టైంలో ఆధార్ ఎన్రోల్మెంట్ లేదంటే అప్డేట్ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం. అక్కడ తప్పిదానికి గల కారణాలు, వివరణలు, పొరపాట్ల సవరణకు సంబంధించిన వివరాలు, సరైన ప్రూవ్స్ సేకరిస్తారు( సంబంధిత ఫామ్స్ ద్వారా). ఆ వివరాలన్నింటిని హెల్ప్ డెస్క్‌కు పంపిస్తారు. అవసరం అయితే ఆఫీసులకు పిలుస్తారు. ఆపై వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అవసరం అనుకుంటే అదనపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు అప్డేట్ లేదంటే మార్పులకు జెన్యూన్ రీజన్ అని తెలిస్తేనే.. ఆ రిక్వెస్ట్‌ను టెక్ సెంటర్‌కు ప్రాసెసింగ్/రీప్రాసెసింగ్ పంపిస్తారు. ఈ ప్రాసెస్ సాగడానికి కచ్చితంగా ఎన్నిరోజులు పడుతుందనేది చెప్పలేం. ఒక్కోసారి ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయినా ఆగిపోవచ్చు!. -
వచ్చే పదేళ్లు ‘ఇండియాస్ టెకేడ్’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితుల్లో ఏర్పడే కొత్త సవాళ్లను అధిగమించేలా ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతిక రంగంలో పరిశోధన, అభివృద్ధికే పెద్ద పీట వేయాలన్నారు. అందుకే రానున్న పదేళ్ల కాలాన్ని ‘ఇండియాస్ టెకేడ్’ అని పిలుచుకోవచ్చునని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే వందకుపైగా ఐఐటీల డైరెక్టర్లలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. విద్యారంగంలో పెట్టే ప్రతీ పైసా సామాజిక పెట్టుబడి అని అన్న ప్రధాని స్తోమత, సమానత్వం, నాణ్యత, అనుసంధానం అన్నవే ఉన్నత విద్యను ముందుకు నడిపిస్తాయన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా దృష్టి సారించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కోవిడ్ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ టెక్నాలజీ సంస్థలు చేసిన పరిశోధన, అభివృద్ధిని ప్రధాని కొనియాడారు. యువ టెక్కీలు అత్యంత వేగంగా సాంకేతికంగా పరిష్కార మార్గాలు సూచించడంతో ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృత్రిమ మేధ, స్మార్ట్ వేరబుల్స్, డిజిటల్ అసిస్టెంట్లు సామాన్య మానవుడికి చేరాలా ఉన్నత విద్యలో సాంకేతికను ప్రవేశపెట్టాలన్నారు. కృత్రిమ మేధతో కూడిన విద్యపైనే ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. సమావేశానంతరం ప్రధాని వాటి వివరాలను ట్వీట్ చేశారు. ముప్పు తొలగిపోలేదు: ప్రధాని మోదీ కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతుండడంపై ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనాపై పోరు సాగుతోందని, ఈ సమయంలో చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సహచరులతో సమావేశం సందర్భంగా ప్రజలు గుంపులుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన ప్రస్తావించారు. చాలామంది మాస్క్‌ల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారని ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. సమయానికి కార్యాలయాలకు రావాలని, ప్రజలకు సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రులకు ప్రధాని ఉద్బోధించారు. గతంలో ఆయా శాఖలు నిర్వహించిన మంత్రులను కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకోవాలన్నారు. పనే ముఖ్యమని, మీడియా దృష్టిని ఆకర్షించాలనే విషవలయంలో పడవద్దని, అనవసర ప్రకటనలు చేయవద్దని మంత్రులకు సూచించారు. -
నా కెరీర్లో ప్రధానంగా మూడు మార్పులొచ్చాయ్: సమంత
‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను సమంత మాయ చేసిందనే చెప్పాలి. సినీ పరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్, సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించింది ఈ చెన్నై బ్యూటీ. ప్రస్తుతం సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఫ్యాన్సును సంపాదించుకున్న సామ్ ఇటీవల వెబ్‌సిరీస్‌లోనూ అడుగు పెట్టి అక్కడ కూడా తన హవా కొనసాగిస్తోంది. తాజాగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సామ్ తన కెరీర్ ప్రారంభించి 11 సంవత్సరాలు కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తనలో వచ్చిన మూడు ప్రధాన మార్పులను చెప్పుకొచ్చింది. సామ్ ఆ ఇంటర్వ్యూలో.. కెరీర్ పరంగా తాను చాలా అంటే చాలా కష్టపడి పనిచేసే వ్యక్తినని, అదే సమయంలో కాస్త అభద్రతా భావం, అనేక స్వీయ సందేహాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. నా సినీ కెరీర్లో ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్న కొద్ది వాటిని అధిగమించడం నేర్చుకుంటూ, అదే క్రమంంలో నా అభద్రతాభావాలను తగ్గించుకోవడమే గాక పెద్ద రిస్క్‌లు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పుడు తనపై నమ్మకంగా ఉందని, ముందున్న భయాలు, అభద్రతాభావాలను పక్కన పెట్టేసి, పెద్ద రిస్క్‌లనైనా తీసుకోవడం లాంటి మూడు ప్రధాన మార్పులు తనలో వచ్చాయని సామ్ చెప్పుకొచ్చింది. -
ఏపీ శాసనమండలిలో మారనున్న సమీకరణాలు