హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ (ఏఐ)తో బీమా రంగంలో పెను మార్పులు వస్తున్నాయని డిజిట్ ఇన్సూరెన్స్ హెడ్ (అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగం) విశాల్ షా తెలిపారు. విస్తృతమైన డేటాబేస్‌లను విశ్లేషించి వివిధ రిస్కులను మదింపు చేసేందుకు, సముచితమైన ప్రీమియంలను నిర్ణయించేందుకు బీమా సంస్థలు ప్రస్తుతం ఏఐ ఆధారిత అల్గోరిథమ్స్‌ను ఉపయోగిస్తున్నాయని వివరించారు. అలాగే మోసపూరిత క్లెయిమ్‌లను కూడా వీటితో గుర్తించగలుగుతున్నట్లు చెప్పారు.
మరోవైపు, కస్టమర్లకు సరీ్వసులను మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్లు వినియోగంలోకి వచి్చనట్లు షా తెలిపారు. తక్షణం సమాధానాలిచ్చేలా, పాలసీల ఎంపికలు, కోట్ జనరేషన్ మొదలైన అంశాల్లో కస్టమర్లకు సహాయపడేలా వీటి శిక్షణ ఉంటోందన్నారు. అలాగే కీలకమైన క్లెయిమ్‌లకు సంబంధించి మదింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీమా సంస్థలు ప్రత్యేక అల్గోరిథమ్‌లను ఉపయోగిస్తున్నాయని చెప్పారు.
మోటర్ బీమా విషయానికొస్తే వాహనాలను వ్యక్తిగతంగా పరీక్షించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఇమేజ్ రికగి్నషన్ టెక్నాలజీ ద్వారా నష్టాన్ని అంచనా వేయడంలోనూ ఏఐ సహాయపడుతోందని షా చెప్పారు. బీమా రంగంలో భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించడంలో తోడ్పడటం ద్వారా వినూత్న ఉత్పత్తులను రూపొందించేందుకు కూడా అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, మెషిన్ లెరి్నంగ్ అల్గోరిథమ్‌లు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment