insurance sector
-
బడ్జెట్లో పన్ను లాభాలు కల్పించాలి
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక బడ్జెట్లో పన్ను లాభాలు, ప్రోత్సాహకాలు కల్పించవలసిందిగా దేశీ బీమా రంగ కంపెనీలు ఆర్థిక శాఖను కోరుతున్నాయి. బీమా పాలసీల కొనుగోలుదారులకు పన్ను లాభాలు, విక్రయ సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాయి. భారత బీమా అభివృద్ధి, అధికారిక నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏఐ) గణాంకాల ప్రకారం 2023–24లో దేశీయంగా బీమా విస్తృతి 3.7 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన 4 శాతంతో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది. జీవిత బీమా రంగంలో 3 శాతం నుంచి 2.8 శాతానికి వెనకడుగు వేయగా.. ఇతర బీమా పరిశ్రమలో విస్తృతి యథాతథంగా 1 శాతంగానే నమోదైంది. కొత్త తరహా పాలసీలతో బీమా పరిశ్రమకు ప్రోత్సాహకాలివ్వడం ద్వారా మరింతమంది కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీమా సంస్థలకు వీలుంటుందని జోపర్ సహవ్యవస్థాపకుడు, సీవోవో మయాంక్ గుప్తా పేర్కొన్నారు. కొత్తతరహా పాలసీల సృష్టి, పంపిణీలో టెక్నాలజీ వినియోగానికి బీమా కంపెనీలను అనుమతించవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. విభిన్న బీమా పాలసీలతోపాటు.. ఫైనాన్షియల్ ప్రొడక్టులను సైతం విక్రయించేందుకు వీలు కల్పిస్తే పంపిణీ వ్యయాలు తగ్గుతాయని తెలియజేశారు. అంతేకాకుండా పాలసీలు, ప్రొడక్టులు మరింత అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా జీవిత బీమా మరింతమందికి అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు రీన్యూబయ్ సహవ్యవస్థాపకుడు, సీఈవో బాలచందర్ శేఖర్ పేర్కొన్నారు. బీమా పాలసీల కొనుగోలులో పన్ను మినహాయింపులు ప్రకటించడం ద్వారా ప్రోత్సాహాన్నిందించాలని కోరారు. తద్వారా భద్రత, దీర్ఘకాలిక మూలధనానికి వీలుంటుందని తెలియజేశారు. అతితక్కువ విస్తృతిగల గ్రామీణ ప్రాంతాలలో బీమాకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో అత్యధిక సంస్కరణలకు వీలున్నట్లు ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుప్ రావు పేర్కొన్నారు. ఐఆర్డీఏఐ ఇప్పటికే ‘2047కల్లా అందరికీ బీమా’ పేరుతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రస్తావించారు. వెరసి బీమా కంపెనీలు అందుబాటులో కొత్తతరహా పాలసీలకు రూపకల్పన చేయవలసి ఉన్నట్లు తెలియజేశారు. దేశీయంగా దేశీయంగా 26 జీవిత బీమా కంపెనీలు, 25 సాధారణ బీమా సంస్థలకుతోడు స్టాండెలోన్ ఆరోగ్య బీమా సంస్థలు 8 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా 2024 మార్చి31కల్లా.. 12 రీఇన్సూరెన్స్, విదేశీ రీఇన్సూరెన్స్ బ్రాంచీలు, రెండు ప్రత్యేక సంస్థలు రిజిస్టరై ఉన్నాయి.జీ20 దేశాలలో భారత్ భేష్ బీమా రంగంలో జీ 20 దేశాలలోకెల్లా భారత్ వేగవంత వృద్ధి సాధిస్తున్న మార్కెట్‌గా నిలుస్తున్నట్లు స్విస్ రే నివేదిక అంచనా వేసింది. 2025–29 మధ్య కాలంలో వార్షికంగా సగటున ప్రీమియంలో 7.3 శాతం పురోగతితో ముందు నిలవగలదని అభిప్రాయపడింది. రానున్న ఐదేళ్లలో నిజ ప్రాతిపదికన(ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి) జీవిత బీమా, ఇతర బీమా కలిపి మొత్తం ప్రీమియం పరిమాణం సగటున ఏటా 7.3 శాతం పుంజుకోవచ్చని అంచనా వేసింది. జీవిత బీమా ప్రీమియంలు 6.9 శాతం, నాన్‌లైఫ్ ప్రీమియంలు 7.3 శాతం చొప్పున వృద్ధి సాధించలగలవని అభిప్రాయపడింది. కాగా.. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు బడ్జెట్లో తిరిగి పెట్టుబడులు ప్రకటిస్తే సానుకూల పరిణామంకాగలదని ఇక్రా లిమిటెడ్ ఫైనాన్షియల్ రంగ రేటింగ్స్ విభాగం హెడ్ నేహా పారిఖ్ అంచనా వేశారు. వీటి బలహీన సాల్వెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఇది ప్రయోజనకరంగా నిలవగలదని పేర్కొన్నారు. బీమా రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రధానంగా తక్కువ విలువగల పాలసీలకు బూస్ట్ లభిస్తుందని తెలియజేశారు. ఇది బీమా విస్తృతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. -
యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో హత్య
న్యూయార్క్: అమెరికాలో ఆరోగ్యరంగ దిగ్గజం యునైటెడ్‌హెల్త్ గ్రూప్ సంస్థలో ఇన్సురెన్స్ విభాగమైన యునైటెడ్‌హెల్త్‌కేర్ సంస్థకు సీఈఓగా సేవలందిస్తున్న బ్రియాన్ థాంప్సన్ హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం అమెరికాలోని మిడ్‌టౌన్ మన్హాట్టన్లో గుర్తుతెలియని ఆగంతకుడు కాల్పులు జరిపాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన థాంప్సన్పైకి గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టు దర్యాప్తు అధికారి చెప్పారు. -
ఇక బీమాలో 100% ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచడంతో పాటు పెయిడప్ క్యాపిటల్‌ను తగ్గించే దిశగా బీమా చట్టం 1938 నిబంధనలను సవరించేలా కేంద్ర ఆర్థిక శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. ప్రజలందరికీ బీమాను అందుబాటులోకి తెచ్చేందుకు, పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమ అభివృద్ధికి, వ్యాపార ప్రక్రియలను క్రమబదీ్ధకరించేందుకు ఇవి దోహదపడతాయని ఆర్థిక సేవల విభాగం తెలిపింది. ప్రతిపాదనల ప్రకారం బీమాలో ఎఫ్‌డీఐల పరిమితిని ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నారు. అలాగే, కాంపోజిట్ లైసెన్సు జారీ కోసం నిర్దిష్ట నిబంధనను చేర్చనున్నారు. ప్రతిపాదిత సవరణలపై సంబంధిత వర్గాలు డిసెంబర్ 10లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. దేశీయంగా ప్రస్తుతం 25 జీవిత బీమా కంపెనీలు, 34 సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. మరిన్ని సంస్థలు రావడం వల్ల బీమా విస్తృతికి, అలాగే మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనకు దోహదపడగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
బీమా రంగంలోకి సెంట్రల్ బ్యాంక్
ముంబై: పీఎస్‌యూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బీమా బిజినెస్‌లోకి ప్రవేశించేందుకు ఆర్బీఐ నుంచి అనుమతిని పొందింది. జనరాలి గ్రూప్‌తో భాగస్వామ్య ప్రాతిపదికన బీమాలోకి ప్రవేశించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం భాగస్వామ్య సంస్థ(జేవీ)కు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ(ఎఫ్జీఐఐసీఎల్), ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎఫ్జీఐఎల్ఐసీఎల్)లలో వాటాల కొనుగోలుకి సెంట్రల్ బ్యాంక్‌ను కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అక్టోబర్‌లోనే అనుమతించింది.రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఈఎల్)కు చెందిన జీవిత, సాధారణ బీమా వెంచర్లో వాటా కొనుగోలుకి ఈ ఏడాది ఆగస్ట్‌లో విజయవంత బిడ్డర్‌గా ఎంపికైనట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొన్న సంగతి తెలిసిందే.. -
‘అందరికీ బీమా’.. 100% ఎఫ్‌డీఐలు రావాల్సిందే..
ముంబై: ప్రజలందరికీ 2027 నాటికల్లా బీమా రక్షణ కల్పించాలన్న లక్ష్యం సాకారం కావాలంటే ఇన్సూరెన్స్ రంగంలోకి భారీగా పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా తెలిపారు.ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించాల్సి ఉంటుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బీమా విస్తృతిని పెంచేందుకు ఈ రంగంలో మరిన్ని సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. 2000 నుంచి భారత్‌లో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను క్రమంగా అనుమతిస్తున్నారు.ప్రస్తుతం జనరల్, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని వంద శాతానికి పెంచిన పక్షంలో దేశీయంగా వచ్చే పెట్టుబడులకు కూడా కొంత దన్ను లభించగలదని పాండా చెప్పారు. మరోవైపు, బీమా సుగమ్ ప్లాట్‌ఫాం అనేది పాలసీదార్లకు సమగ్రమైన పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరిస్తూ బీమా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని ఆయన పేర్కొన్నారు. -
బీమాలోకి మరిన్ని కంపెనీలు రావాలి
ముంబై: ఇన్సూరెన్స్‌లో ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలున్న నేపథ్యంలో మరిన్ని దిగ్గజ సంస్థలు ఈ రంగంలోకి రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబశీష్ పాండా సూచించారు. కొత్త సంస్థలు మార్కెట్లో ప్రవేశించేందుకు వీలుగా నిబంధనలను కూడా సరళతరం చేశామని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘‘మేమైతే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాం. కంపెనీలే మరింత సమయం కోరుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కన్సాలిడేషన్ కన్నా మార్కెట్లో మరిన్ని సంస్థలు వచ్చేలా చూసేందుకే ఐఆర్డీఏఐ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. భారత బీమా రంగంలో అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఇటీవలే జపాన్, యూరప్, అమెరికాలో రోడ్‌షోలు నిర్వహించామని వెల్లడించారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యేలా మరిన్ని సంస్థలను ఐఆర్డీఏఐ ప్రోత్సహిస్తోందని పాండా చెప్పారు. దీనితో పారదర్శకత పెరుగుతుందని, అంతిమంగా షేర్హోల్డర్లు అలాగే పరిశ్రమకు ప్రయోజనం చేకూరగలదని పేర్కొన్నారు. దేశీయంగా 140 కోట్ల మంది పైగా జనాభా ఉన్న నేపథ్యంలో మొత్తం బీమా సంస్థలు డెభ్భైకి పైగా ఉన్నా .. ఇంకా వ్యాపార అవకాశాలు ఎక్కువే ఉన్నాయని పాండా చెప్పారు. జీఎస్టీ తగ్గింపు వార్తలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ బీమా పాలసీలు అందరికీ అందుబాటు స్థాయిలో ఉండేలా చూడాలనేదే ఐఆర్డీఏఐ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, పన్నుల తగ్గింపు ఒక్కటే దీనికి పరిష్కారం కాదని తెలిపారు. -
ఎల్ఐసీ పెట్టుబడులపై లాభాల పంట
కొంతమేర పెట్టుబడుల విక్రయం ∙అయినప్పటికీ పెరిగిన విలువ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పలు దిగ్గజ కంపెనీలలో గల వాటాలను కొంతమేర విక్రయించింది. ఇందుకు స్టాక్ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరుగు తీస్తుండటం ప్రభావం చూపింది. అయినప్పటికీ గతేడాది ఎల్ఐసీ పెట్టుబడుల విలువ ఏకంగా 37 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! వివరాలు చూద్దాంస్టాక్ ఎక్సే్ఛంజీలకు దాఖలైన సమాచారం ప్రకారం ఎల్ఐసీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలలో అత్యధిక పెట్టుబడులను కలిగి ఉంది. ఈ బాటలో టాటా, అదానీ గ్రూప్‌లలోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది. గత వారాంతానికల్లా దిగ్గజ కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 4.39 లక్షల కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన విలువతో పోలిస్తే ఇది 37.5 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో పెట్టుబడులు 34 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో పెట్టుబడులను గతేడాది 6.37 శాతం నుంచి 6.17 శాతానికి తగ్గించుకుంది. ఇదేకాలంలో టాటా గ్రూప్ కంపెనీలలో వాటా 4.22 శాతం నుంచి 4.05 శాతానికి నీరసించింది. వీటి విలువ రూ. 1.29 లక్షల కోట్లు. ఇక అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ వాటా 4.27 శాతం నుంచి 3.76 శాతానికి దిగివచి్చంది. వీటి విలువ 49 శాతం దూసుకెళ్లి రూ. 64,414 కోట్లను తాకింది. ఎన్ఎస్ఈలో బుధవారం ఎల్ఐసీ షేరు 1.5% బలపడి రూ. 1,048 వద్ద ముగిసింది. ఈ ధరలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 6.62 లక్షల కోట్లను అధిగమించింది.ప్రభుత్వం సైతం నిజానికి పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎల్ఐసీ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. రూ. 1,050 సమీపంలో కదులుతోంది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. దీంతో ఎల్ఐసీలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంది. వీటిని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో సరికొత్త గరిష్టాన్ని అందుకుంటూ జోరు చూపుతున్నాయి. దీనికితోడు ఏడాది కాలంలో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు వేలంవెర్రిగా లాభాల పరుగు తీస్తున్నాయి. వెరసి ప్రభుత్వం వీటిలో కొంతమేర వాటాల విక్రయాన్ని చేపడితే.. సులభంగా బడ్జెట్ ప్రతిపాదిత డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బీమా రంగంలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు
న్యూఢిల్లీ: బీమా రంగం నుంచి రానున్న కాలంలో మరికొన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ కావొచ్చని, విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు చోటు చేసుకుంటాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ అంచనా వేసింది. 2022–23లో బీమా రంగంలో రూ.1,930 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ మెరుగైన వృద్ధి అవకాశాలు బీమా కంపెనీల నిధుల సమీకరణకు మద్దతునిస్తోందని, దీంతో బలహీన అండర్ రైటింగ్ లాభదాయకతను అవి అధిగమించగలుగుతున్నాయని తెలిపింది. 2022–23లో బీమా రంగం చెల్లించిన మూలధనం రూ.75,300 కోట్లకు పెరిగిందని, 2021–22 నాటికి ఇది రూ.73,400 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2.6 శాతం వృద్ధి చెందింది. ఇదే తరహాలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు, ఐపీవోలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు, దీంతో భారత బీమా రంగం క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యత మెరుగుపడుతుందని తెలిపింది. విదేశీ బీమా సంస్థలు భారత బీమా మార్కెట్లో తమ పెట్టుబడులను కొనసాగిస్తాయని, ఇప్పటికే భారత కంపెనీలతో ఉన్న జాయింట్ వెంచర్లలో వాటా పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తాయని అంచనా వేసింది. విదేశీ బీమా సంస్థల భాగస్వామ్యంతో క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యం, పరిపాలనా ప్రమాణాల పరంగా ప్రయోజనాలు లభిస్తాయని వివరించింది. భారత బీమా సంస్థల్లో విదేశీ బీమా కంపెనీలు వాటాలు పెంచుకోవడం మార్కెట్‌కు క్రెడిట్ పాజిటివ్‌గా పేర్కొంది. మొత్తం మీద 2022–23లో బీమా రంగం లాభదాయకత సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్‌లు పెరిగిపోతుండడంతో సాధారణ బీమా రంగం ఫలితాలు ప్రతికూలంగానే ఉన్నట్టు తెలిపింది. స్థిరమైన ధరల పెరుగుదలతో ఈ రంగం అండర్‌రైటింగ్ పనితీరు, లాభదాయకత గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా వేసింది. -
సైబర్ బీమాకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ బీమాకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఏటా 27–30% వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో సైబర్ బీమా మార్కెట్ పరిమాణం 50–60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) స్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా 27–30% మేర చక్రగతిన వృద్ధి చెందుతోంది. ‘సైబర్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 3–5 ఏళ్లలో ఇదే స్థాయి వృద్ధి కొనసాగే అవకాశం ఉంది‘ అని నివేదికలో పేర్కొంది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో పాటు సరఫరా వ్యవస్థ, రిటైల్, ఫైనాన్స్ వంటి డిజిటైజేషన్ అధికంగా ఉండే విభాగాలు సైబర్ క్రిమినల్స్‌కు లక్ష్యాలుగా ఉంటున్నట్లు తెలిపింది. కాబట్టి, మిగతా రంగాలతో పోలిస్తే సైబర్ బీమాను తీసుకోవడంలో ఈ విభాగాలు ముందుంటాయని పేర్కొంది. పలువురు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఐఎస్వో)తో నిర్వహించిన సర్వే ఆధారంగా డెలాయిట్ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకులు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ వచ్చే దశాబ్ద కాలంలో సైబర్ బీమా గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ (రిస్క్ అడ్వైజరీ) ఆనంద్ వెంకట్రామన్ తెలిపారు. విక్రేతలు, కొనుగోలుదారుల అవసరాల మేరకు పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రాబోయే మూడేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు రక్షణ కలి్పంచుకునేందుకు సర్వేలో పాల్గొన్న సీఐఎస్‌వోల్లో 70% మంది మరింత ఎక్కువ వ్యయం చేయడానికి మొగ్గు చూపారు. ► గణనీయంగా వినియోగదారుల డేటాబేస్లు ఉన్న కొన్ని పెద్ద కంపెనీలు తమ డిజిటల్ ఇన్ఫ్రా బడ్జెట్లను పెంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చుకునేందుకు మరింత ఇన్వెస్ట్ చేయడానికి బదులు బీమా కవరేజీని పెంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ► దేశీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ వృద్ధి గతి ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండనుంది. కంపెనీలు డిజిటల్ పరిపక్వతను సాధించే వేగం, డిజిటైజేషన్ .. కఠినతరమైన సైబర్ చట్టాల అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంప్రదాయేతర సంస్థలైన టెక్నాలజీ కంపెనీల్లాంటివి కూడా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ప్రవేశించడం వీటిలో ఉండనున్నాయి. ► సైబర్ బీమాను ఒక వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూసే ధోరణి పెరగాలి. డిజిటైజేషన్ వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగు స్థాయిలో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడం తప్పనిసరి అనేది కంపెనీలు గుర్తించాలి. ► సమగ్ర రిసు్కల నిర్వహణలో సైబర్ రిసు్కలు ప్రధానమైనవని గుర్తించి బోర్డులు, సీఈవోలు సైబర్‌సెక్యూరిటీ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ► బీమా పాలసీలను సరళతరం చేయడంతో పాటు వివిధ కవరేజీల గురించి కొనుగోలుదార్లలో అవగాహన పెంచేందుకు బీమా కంపెనీలు కృషి చేయాలి. ► పౌరుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన డేటా రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలి. -
ఏఐతో బీమా రంగంలో పెను మార్పులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ (ఏఐ)తో బీమా రంగంలో పెను మార్పులు వస్తున్నాయని డిజిట్ ఇన్సూరెన్స్ హెడ్ (అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగం) విశాల్ షా తెలిపారు. విస్తృతమైన డేటాబేస్లను విశ్లేషించి వివిధ రిస్కులను మదింపు చేసేందుకు, సముచితమైన ప్రీమియంలను నిర్ణయించేందుకు బీమా సంస్థలు ప్రస్తుతం ఏఐ ఆధారిత అల్గోరిథమ్స్‌ను ఉపయోగిస్తున్నాయని వివరించారు. అలాగే మోసపూరిత క్లెయిమ్‌లను కూడా వీటితో గుర్తించగలుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు, కస్టమర్లకు సరీ్వసులను మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు వినియోగంలోకి వచి్చనట్లు షా తెలిపారు. తక్షణం సమాధానాలిచ్చేలా, పాలసీల ఎంపికలు, కోట్ జనరేషన్ మొదలైన అంశాల్లో కస్టమర్లకు సహాయపడేలా వీటి శిక్షణ ఉంటోందన్నారు. అలాగే కీలకమైన క్లెయిమ్‌లకు సంబంధించి మదింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీమా సంస్థలు ప్రత్యేక అల్గోరిథమ్‌లను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మోటర్ బీమా విషయానికొస్తే వాహనాలను వ్యక్తిగతంగా పరీక్షించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఇమేజ్ రికగి్నషన్ టెక్నాలజీ ద్వారా నష్టాన్ని అంచనా వేయడంలోనూ ఏఐ సహాయపడుతోందని షా చెప్పారు. బీమా రంగంలో భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించడంలో తోడ్పడటం ద్వారా వినూత్న ఉత్పత్తులను రూపొందించేందుకు కూడా అడ్వాన్స్డ్ అనలిటిక్స్, మెషిన్ లెరి్నంగ్ అల్గోరిథమ్‌లు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. -
సహారా లైఫ్ విలీనం కాదు.. పాలసీల బదిలీ
న్యూఢిల్లీ: సహారా లైఫ్‌ను తాము విలీనం చేసుకోవడం లేదని ఎస్బీఐ లైఫ్ స్పష్టం చేసింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశాల మేరకు సహారా లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని పాలసీ దారుల ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో సంస్థ జారీ చేసిన పాలసీలు, వాటి ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకోవాలంటూ గత శుక్రవారం ఐఆర్డీఏఐ ఎస్బీఐ లైఫ్‌ను ఆదేశించడం గమనార్హం. మెరుగైన సేవలు అందిస్తామని సహారా లైఫ్ పాలసీదారులకు ఎస్బీఐ లైఫ్ అభయమిచ్చింది. ‘‘సహారా లైఫ్ పాలసీలను మా వ్యవస్థతో అనుసంధానించేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాం. పూర్తి స్థాయి ఏకీకరణకు కొంత సమయం పడుతుంది. సహారా లైఫ్ పాలసీదారులు 1800 267 9090 టోల్ ఫ్రీ నంబర్లో లేదా ట్చజ్చిట్చ జీజ్ఛఃటbజీ జీజ్ఛ. ఛిౌ. జీn మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని ఎస్బీఐ లైఫ్ సూచించింది. సహారా లైఫ్ కొత్తగా పాలసీలను విడుదల చేయరాదని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. తగినంత సమయం, తగినన్ని అవకాశాలు కల్పించినప్పటికీ తమ ఆదేశాలను పాటించడంలో., పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ విఫలమైందని ఆఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
అంకిత భావమే అమోఘ విజయం
నలుగురు నడిచే దారిలో నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దారి మార్చి వెళ్లే వారికి మాత్రం సవాలక్ష ప్రశ్నలు ఎదురొస్తుంటాయి. వాటికి అదేపనిగా సమాధానాలు చెప్పడం కంటే ఎంచుకున్న దారిలో వేగంగా నడవడానికే కొద్దిమంది ప్రాధాన్యత ఇస్తారు. అంకిత్ అగర్వాల్ ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ద్వారా ఇన్సూరెన్స్ సెక్టార్లో గెలుపు జెండా ఎగరేశాడు... ‘మన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌తో పనిలేదు’ అనే అంకిత్ అగర్వాల్ హరియాణా, రాజస్థాన్‌లోని ఎన్నో పట్టణాలు, గ్రామాలు తిరిగాడు. మూడు వేలమందికి పైగా ఇన్సూరెన్స్ ఏజెంట్లను కలిశాడు. ‘ఇన్సూరెన్స్ దేఖో’ ప్రారంభించడానికి ముందు ఊరూవాడా అనే తేడా లేకుండా కాలికి బలపం కట్టుకొని తిరిగాడు అంకిత్. ‘ఇన్సూరెన్స్ దేఖో’కు సంబంధించిన ఆలోచనలను ఇతరులతో, మిత్రులతో పంచుకునేప్పుడు ‘పిచ్చి ముదిరింది’ అన్నట్లుగా చూసేవాళ్లు. ‘హాయిగా ఉద్యోగం చేసుకోక ఏమిటీ కర్మ’ అని మందలించేవాళ్లు కొందరు. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో ఎంబీఏ(ఫైనాన్స్) చేశాడు అంకిత్. అమెరికాలోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ యూబీఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి అంకిత్ రాజీనామా చేసి, ఇన్సూర్టెక్ స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘తెలివి తక్కువ పనిచేశావు’ అన్నవాళ్లే ఎక్కువ. ఇన్సూరెన్స్ సెక్టార్‌లోకి అడుగు పెట్టిన తరువాత ఆఫ్‌లైన్(ఇన్సూరెన్స్ ఏజెంట్స్) సామర్థ్యాన్ని, ఆన్లైన్లో తనకు పనికివచ్చే సాంకేతికతను బాగా ఉపయోగించుకున్నాడు అంకిత్. ‘ఇన్సూరెన్స్ ఏజెంట్ల బ్యాగులు ఖాళీగా ఉండాలని మొదటి లక్ష్యంగా నిర్ణయించుకున్నాను’ నవ్వుతూ అంటాడు అంకిత్. ఎందుకంటే, సంప్రదాయ ఇన్సూరెన్స్ ఏజెంట్ల బ్యాగ్‌లు నోటుబుక్స్, బోలెడు డాక్యుమెంట్స్‌తో నిండిపోయి భారంగా ఉంటాయి! అందుకే స్మార్ట్‌ఫోన్ ప్లస్ యాప్ ద్వారా ఆ బ్యాగులు తేలికయ్యేలా చేయడంలో అంకిత్ విజయం సాధించాలనుకున్నాడు. అయితే అంకిత్ వేసే ప్రతి అడుగులో ప్రతికూల మాటలు వినిపించేవి. అవేమీ పట్టించుకోకుండా ‘మొదటి దశలో ఏజెంట్. ఆ తరువాత టెక్’ అంటూ తన దారిలో తాను వెళ్లాడు అంకిత్. ‘ఆర్మీ ఆఫ్ ఏజెంట్స్’ పేరుతో యువబృందానికి తయారుచేసుకొని గట్టి శిక్షణ ఇచ్చాడు. ఈ బృందంలో ఎక్కుమందికి ఇన్సూరెన్స్‌కు సంబంధించిన విషయాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ప్రసిద్ధ నినాదం ‘రోటీ కప్డా మకాన్’లో ‘బీమా’ చేర్చి తన బృందంతో ఊరూవాడా తీసుకెళ్లాడు అంకిత్. గురుగ్రామ్(హరియాణా) కేంద్రంగా చిన్నగా మొదలైన ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ప్రయాణం పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించింది. తమ అవసరాలకు సరిపోయే పాలసీలను ఎంచుకోవడంతో పాటు ఎన్నో విధాలుగా వియోగదారులకు దారి చూపే నేస్తంగా మారింది ఈ ఇన్సూర్టెక్ స్టార్టప్. ‘పిచ్చి అగర్వాల్’ అని చాటుమాటుగా వెక్కిరించినవాళ్లే ఈ విజయం చూసి ‘అగార్వల్ మెథడ్’ అని గొప్పగా పిలుచుకునేవారు! ‘ఇన్సూరెన్స్‌దేఖో అనేది ఇన్సూరెన్స్ సెక్టార్లో భారీ మార్పు తీసుకురావడమే కాదు సామాజిక ప్రభావాన్ని కలిగించింది’ అంటాడు కార్దేఖో గ్రూప్ కో–ఫౌండర్ అమిత్ జైన్. ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ఇటీవల ముంబైకి చెందిన ఎస్ఎంఈ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ ‘వెరాక్’ను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చింది. ఎంతోమంది యంగ్‌స్టర్స్ అంకిత్‌ను ‘వన్–పాయింట్ అడ్వైజ్’ అడుగుతుంటారు. అతడి నోటి నుంచి వచ్చే ‘అంకితభావం’ అనే జవాబును ఊహించడం కష్టం కాదేమో! నా కంపెనీ లాభాలతో దూసుకుపోతుంది అని చెప్పడం నా లక్ష్యం కాదు. నా అసలు సిసలు విజయం ఆరులక్షల గ్రామాల్లోకి ఇన్సూరెన్స్‌ను తీసుకెళ్లడం. – అంకిత్ అగర్వాల్ -
కమీషన్లపై బీమా కంపెనీలకు స్వేచ్ఛ
న్యూఢిల్లీ: కమీషన్ల పరంగా పరిమితులను బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా కంపెనీలు తమ పాలసీలను విక్రయించే మధ్యవర్తులకు కమీషన్లు చెల్లిస్తుంటాయి. ఈ భారం పరోక్షంగా పాలసీదారులపైనే పడుతుంది. అందుకే లోగడ ఈ విషయంలో ఐఆర్డీఏఐ పరిమితులు పెట్టింది. తాజాగా వీటిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. మధ్యవర్తులకు ఎంత కమీషన్ చెల్లించాలన్నది బీమా కంపెనీలే నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. కాకపోతే పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఇది ఉండాలని స్పష్టం చేసింది. పాలసీదారులు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కమీషన్ పాలసీని ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్ రూపొందించుకోవాలంటూ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కమీషన్లలో సౌలభ్యం ఉంటే అది దేశంలో బీమా కవరేజీ వ్యాప్తికి దోహదపడుతుందని, వ్యయాల పరంగా సామర్థ్యాలను పెంచుతుందని పేర్కొంది. బోర్డు స్థాయిలో నిర్ణయించే కమీషన్ అనేది తాజా నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్వహణ వ్యయ పరిమితుల పరిధిలోనే ఉండాలని స్పష్టంగా నిర్ధేశించింది. నూతన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నోటిఫికేషన్ తేదీ నుంచి ప్రతి మూడేళ్లకోసారి నిబంధనలను సమీక్షిస్తామని ఐఆర్డీఏఐ ప్రకటించింది. ఇప్పటి వరకు బీమా కంపెనీలు చెల్లించే కమీషన్లను ఉత్పత్తుల వారీగా ఐఆర్డీఏఐ నిర్ణయిస్తోంది. తాజా సవరణలు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయాన్ని ఐఆర్డీఏఐ వ్యక్తం చేసింది. నూతన వ్యాపార నమూనాలు, ఉత్పత్తులు, వ్యూహాల అభివృద్ధికి వీలు కల్పిస్తాయని పేర్కొంది. సవరించిన నిర్వహణ వ్యయ పరిమితులు, కమీషన్ పరిమితులు అనేవి సరైన మార్గంలో ఉన్నాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. -
బీమా రంగంలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: బీమా రంగం వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయని.. విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు ఇక ముందూ కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిక పెట్టుబడుల అవసరం ఉన్న ఈ రంగంలో దీర్ఘకాల లక్ష్యాలతో.. ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీలతో ప్రవేశించే కొత్త కంపెనీలకూ చోటు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ విలీనం చేసుకోవడానికి ఇటీవలే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి మంజూరు చేయడం, అంతకుముందు పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంచనా వేస్తున్నాయి. ఈ విధమైన లావాదేవీలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిష్కరించే విషయంలో సాయానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సైతం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఈ కమిటీతో విలువ మదింపుపై అధికారులకు శిక్షణ ఇప్పించనుంది. బలమైన అండర్ రైటింగ్ విధానాలు, బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలంగా ఎదుగుతాయని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ ఆనంద్ పెజావర్ తెలిపారు. భారత్‌లో బీమా రంగం విస్తరణకు అపార అవకాశాలున్నందున, ఎన్ని సంస్థలు అయినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వరుస విలీనాలు.. ప్రస్తుతం 24 జీవిత బీమా కంపెనీలు, 31 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య బీమా సంస్థలు కూడా కలిసే ఉన్నాయి. గతేడాది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో విలీనం కావడం గమనార్హం. అంతకుముందు 2020లో అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్డీఎఫ్సీ ఎర్గో విలీనం చేసుకుంది. 2016లో ఎల్అండ్టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో 49 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ ఎర్గో సొంతం చేసుకుంది. ‘‘విస్తరణకు భారీ అవకాశాలున్నందున, జీవిత బీమా, జనరల్ బీమాలో టాప్–10 కంపెనీలు 90 శాతం లాభాల వాటాను కలిగి ఉంటాయి’’అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ అవినాష్ సింగ్ తెలిపారు. విస్తరణ మార్గాలు.. ఈ రంగంలో పనిచేసే కంపెనీలకు అదనపు నిధుల అవసరం ఉంటుందని, ఎప్పటికప్పుడు అవి నిధులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
సాధారణ బీమా రంగంలోకి పేటీఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ఉన్న పేటీఎం.. సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించేందుకు కావాల్సిన లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేయనున్నట్టు వెల్లడించింది. బీమా కంపెనీలో 74 శాతం ముందస్తు ఈక్విటీ కలిగి ఉంటామని కంపెనీ స్పష్టం చేసింది. సాధారణ బీమా విభాగంలో అపార వ్యాపార అవకాశాల నేపథ్యంలో తమ ప్రణాళిక విషయంలో గట్టి నమ్మకంతో ఉన్నట్టు వివరించింది. రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్టు పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. కాగా, రుణ వ్యాపారం రూ.20,000 కోట్ల వార్షిక రన్ రేట్ కలిగి ఉందని పేటీఎం వెల్లడించింది. ఏప్రిల్‌లో రూ.1,657 కోట్ల విలువైన రుణాలను కస్టమర్లకు అందించినట్టు వివరించింది. గత నెలలో పేటీఎం వేదికగా జరిగిన లావాదేవీలు రూ.95,000 కోట్లకు చేరుకున్నాయి. నెలవారీ యూజర్ల సంఖ్య 7.35 కోట్లుగా ఉంది. -
ఏప్రిల్‌లో నియామకాల జోరు
ముంబై: వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడుతున్న నేపథ్యంలో నియామకాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో హైరింగ్ 15% పెరిగింది. మాన్స్టర్ ఇండియా తమ పోర్టల్‌లో నమోదయ్యే ఉద్యోగాల వివరాలను విశ్లేషించి, రూపొందించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ సూచీ (ఎంఈఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో (బీఎఫ్ఎస్ఐ) నియామకాలు అత్యధికంగా 54% వృద్ధి చెందాయి. కోవిడ్ మహమ్మారితో కుదేలైన రిటైల్ రంగంలో హైరింగ్ రెండంకెల స్థాయి వృద్ధితో గణనీయంగా కోలుకుంది. 47% పెరిగింది. అలాగే తయారీ రంగం, ట్రావెల్ .. టూరిజం, ఎగుమతులు.. దిగుమతులు మొదలైన విభాగాలు కూడా మెరుగుపడ్డాయి. రెండేళ్ల తర్వాత మళ్లీ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. తయారీ రంగంలో నియామకాలు 35% మేర పెరిగాయి. ఆంక్షల సడలింపుతో రిటైల్‌కు ఊతం.. బీఎఫ్ఎస్ఐలో ఉద్యోగాల కల్పన యథాప్రకారంగానే కొనసాగుతుండగా, పలు భౌతిక స్టోర్స్ తిరిగి తెరుచుకోవడంతో రిటైల్ రంగంలోనూ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ప్రథమ శ్రేణి నగరాల్లో హైరింగ్ జోరుగా ఉండగా, ద్వితీయ శ్రేణి మార్కెట్లో నియామకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ముంబైలో హైరింగ్ డిమాండ్ అత్యధికంగా 29% స్థాయిలో నమోదైంది. కోయంబత్తూర్ (25% అప్), చెన్నై (21%), బెంగళూరు (20%), హైదరాబాద్ (20%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఎల్ఐసీ ఐపీవోపై ప్రభుత్వం దృష్టి
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో ప్రభుత్వం ప్రణాళికలకు తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి ధరల శ్రేణితోపాటు.. పాలసీదారులు, రిటైలర్లకు డిస్కౌంట్, రిజర్వ్ చేయనున్న షేర్ల సంఖ్య తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలను త్వరలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేయనున్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తుండటంతో ప్రస్తుతం ప్రభుత్వం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలియజేశాయి. ముసాయిదా పత్రాలకు సెబీ నుంచి ఆమోదముద్ర పడటంతో తుది పత్రాల(ఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయవలసి ఉన్నట్లు పేర్కొన్నాయి. 5 శాతం వాటా: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా దిగ్గజం ఎల్ఐసీలో ప్రభుత్వం 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఫిబ్రవరి 13న ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయగా.. ఈ వారం మొదట్లో సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో ఆర్హెచ్పీను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన రూ. 78,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని అందుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. -
బీమా నుంచి ఫ్యూచర్ గ్రూప్ ఔట్!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ తాజాగా బీమా రంగం నుంచి బయటపడే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. సమయానుగుణంగా భాగస్వామ్య సంస్థ(జేవీ) ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో తమకు గల వాటాను విక్రయించాలని భావిస్తోంది. ఈ జేవీలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్‌నకు 49.91 శాతం వాటా ఉంది. దీనిలో 25 శాతం వాటాను జేవీలో మరో భాగస్వామి నెదర్లాండ్స్‌కు చెందిన జనరాలి పార్టిసిపేషన్స్కు విక్రయించనున్నట్లు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. దాదాపు రూ. 1,253 కోట్ల విలువలో నగదు రూపేణా వాటాను విక్రయించనున్నట్లు తెలియజేసింది. -
బీమా కంపెనీలు.. వీటిపై దృష్టి పెట్టాలి
కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కస్టమర్ల ధోరణులు చాలా వేగంగా మారాయి. నిత్యావసరాల షాపింగ్, ఉద్యోగ విధుల నిర్వహణ మొదలుకుని ఆర్థిక లావాదేవీల వరకూ అన్నింటి నిర్వహణకు కొత్త విధానాలకు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదిన్నర కాలంగా డిజిటల్ సేవలు, కస్టమర్ సర్వీస్, అండర్‌రైటింగ్ తదితర విభాగాల్లో బీమా రంగం కూడా ఈ మార్పులను కొంత మేర చవిచూసింది. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు మారిపోతున్న కస్టమర్ల ధోరణులపై బీమా కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాల్సి రానుంది. అలాగే, బీమా సంస్థలు మరింత విస్తృతమైన పాత్ర పోషించాల్సి వస్తుంది. క్లెయిముల సమయంలో చెల్లింపులు జరిపే సంస్థలుగా మాత్రమే మిగిలిపోకుండా, సంరక్షించే .. అనుకోని అవాంతరాలను నివారించగలిగే భాగస్వామిగా మారాల్సి ఉంటుంది. కొత్త కస్టమర్లలో ప్రధానంగా కొన్ని ధోరణులు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. అంతా డిజిటల్ ప్రస్తుతం అన్ని వయస్సుల వారు కూడా డిజిటల్ విషయంలో మిలీనియల్ యువత ఆలోచన ధోరణులకు తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో లావాదేవీల నిర్వహణ ఎంత సులభతరంగా ఉంది, ఎంత వేగంగా చేయగలుగుతున్నారు అన్నవి కీలకంగా మారతాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు డేటాను వినియోగించడం, డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాల్సి ఉంటుంది. మరింత కోరుకుంటున్న కస్టమర్లు కస్టమర్ల కొనుగోలు ధోరణుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. కస్టమైజేషన్‌కు ప్రాధాన్యం పెరిగిందే. రాబోయే రోజుల్లో ఒకే ఉత్పత్తిని అందరికీ ఉపయోగించవచ్చంటే కుదరదు. పాలసీదారు తగినంత జీవిత బీమా కవరేజీతో పాటు నిర్దిష్ట రిస్కులకు కూడా కవరేజీ కోరుకుంటారు. పాలసీదారుల వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లుగా వైవిధ్యమైన, సరళమైన, కొంగొత్త పథకాలను అందించడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. మరోవైపు, పలువురు కస్టమర్లు అనుభూతికి ప్రాధాన్యమిచ్చే వారై ఉంటున్నారు. సత్వరం స్పందించడం, వేగంగా పరిష్కార మార్గం చూపడం, భారీ స్థాయి సెల్ఫ్–సర్వీస్ సామర్థ్యాలు మొదలైనవి వీరు కోరుకుంటారు. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కస్టమర్లకు తలెత్తబోయే అవసరాలను ముందస్తుగానే గుర్తించగలిగి, తగు వ్యూహాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రస్తుతం కస్టమర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా సరే చిటికె వేయగానే సర్వీసులు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. సులభతరమైన ప్రక్రియలు, డిజిటల్ మాధ్యమాల వినియోగం రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. దీంతో బీమా సంస్థలు మరిన్ని విధాలుగా కస్టమరుకు చేరువలో ఉండాలి. భౌతికమైన బ్రాంచీలు, ఫోన్ ఆధారిత కాంటాక్ట్ సెంటర్లు, చాట్‌బాట్స్, వాయ్సాప్, మొబైల్ యాప్స్, సోషల్ మీడియా ఇలా అన్ని చోట్ల అందుబాటులో ఉండగలగాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత మహమ్మారి పరిణామాల నేపథ్యంలో కస్టమర్లలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారే తమ అవసరాలను అర్థం చేసుకునే కంపెనీలకు వారు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపత్యంలో జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీలు పరస్పరం తమ అనుభవాల ఆధారంగా కాంబో పథకాల్లాంటివి మరింతగా అందుబాటులోకి తేవాలి. కస్టమర్ బీమా అవసరాలన్నీ ఒకే చోట తీరేలా చూడగలగాలి. ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా కస్టమర్లను ప్రోత్సహించడం, రిస్కులు తగ్గించుకునే క్రమంలో బీమా సంస్థలు.. పలు వెల్నెస్ పార్ట్‌నర్స్‌తో చేతులు కలపవచ్చు. కాలానుగుణంగా ఏదేమైనా ఆరోగ్యం, సౌకర్యం, సరళత్వం ప్రాతిపదికగా సానుకూల అనుభూతి కలిగించే మార్పుల ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. రిస్కులను తగ్గించడంతో పాటు విలువ ఆధారిత సేవలను అందించడంలో విభిన్నమైన పథకాలు అందించడంపై బీమా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మారే కాలానికి అనుగుణంగా తామూ మారడం బీమా కంపెనీలకు ఎంతో కీలకం. -
ఎల్ఐసీ ఐపీవోకు మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం 10 మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. జాబితాలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజరీ అండ్ సెక్యూరిటీస్ ఇండియా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా క్యాపిటల్ ఉన్నాయి. ఎల్ఐసీ ఐపీవోను నిర్వహించేందుకు ప్రభుత్వం బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్సహా మరికొంతమంది ఇతర సలహాదారులను ఎంపిక చేసినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇష్యూకి న్యాయసలహాదారుల నియామకానికి కూడా బిడ్స్ స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. వీటి దాఖలుకు ఈ నెల 16న గడువు ముగియనుంది. ఈ బాటలో ఇప్పటికే ఎల్ఐసీ విలువను నిర్ధారించేందుకు మిల్లీమ్యాన్ అడ్వయిజర్స్ ఎల్ఎల్పీ ఇండియాను ప్రభుత్వం ఎంపిక చేసుకుంది.11 -
ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు క్యూ
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు క్యూ కడుతున్నాయి. సుమారు 16 సంస్థలు ఇందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) వద్ద మంగళ, బుధవారాల్లో ఈ కంపెనీలు ప్రెజంటేషన్ ఇవ్వనున్నాయి. 23న ఐపీవో నిర్వహణ వివరాలు ఇవ్వనున్న విదేశీ బ్యాంకర్ల జాబితాలో బీఎన్పీ పరిబాస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డీఎస్పీ మెరిల్ లించ్, గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజర్స్ ఉన్నాయి. ఈ బాటలో 24న యాక్సిస్ క్యాపిటల్, డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కొటక్ మహీంద్రా క్యాపిటల్, ఎస్బీఐ క్యాపిటల్ ప్రెజంటేషన్‌ను ఇవ్వనున్నాయి. -
బీమాకు పెట్టుబడుల ధీమా!
న్యూఢిల్లీ: దేశీయంగా బీమా కంపెనీలకు పెట్టుబడులపరమైన తోడ్పాటు లభించేలా ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచే బిల్లుకు పార్లమెంటు సోమవారం ఆమోదముద్ర వేసింది. వాయిస్ వోట్ ద్వారా లోక్‌సభలో దీనికి ఆమోదం లభించింది. ఇప్పటిదాకా జీవిత బీమా, సాధారణ బీమా విభాగాల్లో ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా చట్టం 1938ని సవరిస్తూ ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ (సవరణ) బిల్లు 2021కి రాజ్యసభ గతవారమే ఆమోదముద్ర వేసింది. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం .. బీమా కంపెనీలు మరిన్ని నిధులు సమీకరించుకునేందుకు, ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తోందని, తమంతట తాము నిధులు సమీకరించుకోవాల్సిన ప్రైవేట్ సంస్థలకు ఎఫ్‌డీఐల పరిమితి పెంపుతో కొంత ఊతం లభించగలదని ఆమె తెలిపారు. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ సిఫార్సులు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. గతంలో బీమా రంగంలో 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 2015లో 49%కి పెంచగా.. తాజాగా దాన్ని 74 శాతానికి పెంచినట్లు తెలిపారు. కంపెనీలకు కోవిడ్ కష్టాలు.. సాల్వెన్సీ మార్జిన్ల నిర్వహణకు (జరపాల్సిన చెల్లింపులతో పోలిస్తే అసెట్స్ నిష్పత్తి) సంబంధించి బీమా కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని మంత్రి చెప్పారు. ‘బీమా సంస్థలు.. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు.. నిధుల సమీకరణపరంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కష్టాలు దీనికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకలాపాల వృద్ధికి అవసరమైన పెట్టుబడులు రాకపోతే పరిస్థితి మరింత కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది‘ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఏడు ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో మూడు కంపెనీల్లో సాల్వెన్సీ మార్జిన్లు నిర్దేశించిన స్థాయికన్నా తక్కువ ఉన్నాయని మంత్రి చెప్పారు. అయితే, వాటికి కావాల్సిన అదనపు మూలధనాన్ని సమకూర్చడం ద్వారా అవి ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం తగు సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఏయూఎం.. 76 శాతం అప్.. 2015 నుంచి బీమా రంగంలోకి రూ. 26,000 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని, నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) పరిమాణం గడిచిన అయిదేళ్లలో 76 శాతం పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా కంపెనీల సంఖ్య 53 నుంచి 68కి పెరిగిందని, గత అయిదేళ్లలో 6 కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయని వివరించారు. బీమా సంస్థల్లో 74% ఎఫ్డీఐలనేది గరిష్ట పరిమితి మాత్రమేనని, ఆయా కంపెనీలు దీన్ని కచ్చితంగా ఆ స్థాయికి పెంచుకోవాలనేమీ లేదని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐని పెంచేలా సీతారామన్ ప్రతిపాదన చేశారు. బిల్లులో ప్రత్యేకాంశాలు.. ► బీమా సంస్థలు.. పాలసీదారుల సొమ్మును భారత్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు తీసుకెళ్లేందుకు కుదరదు. లాభాల్లో కొంత భాగాన్ని భారత్‌లోనే అట్టే ఉంచాలి. ► బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్మెంట్లో కీలక సభ్యులు స్థానిక భారతీయులే ఉండాలి. డైరెక్టర్లలో కనీసం 50 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. ఇన్ఫ్రా కోసం నాబ్‌ఫిడ్ బిల్లు.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ (డీఎఫ్ఐ) ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) బిల్లు 2021ని సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రూ. 20,000 కోట్లతో ఏర్పాటయ్యే డీఎఫ్ఐ రాబోయే కొన్నేళ్లలో రూ. 3 లక్షల కోట్ల దాకా నిధులు సమీకరించవచ్చు. తద్వారా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద దాదాపు 7,000 ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ఇది తోడ్పడనుంది. మరోవైపు, మైనింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలకు ఉద్దేశించిన గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు 2021ని ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఆమోదించింది. -
బీమాపై ‘విదేశీ’ ముద్ర
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 74 శాతానికి పెంచే ప్రతిపాదనను బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. మన దేశంలో బీమా ఉత్పత్తుల విస్తరణ ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండడంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కాకపోతే ఎఫ్‌డీఐ పెంపు అనంతరం కూడా బీమా కంపెనీల బోర్డుల్లో మెజారిటీ డైరెక్టర్లు, యాజమాన్యంలో కీలకమైన వ్యక్తులు అందరూ భారతీయులే ఉండాలన్న ‘కంపెనీ నిర్మాణాన్ని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. బీమా చట్టం 1938ను సవరించడం ద్వారా బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రస్తుత 49% నుంచి 74%కి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. తగిన రక్షణలతో విదేశీ యాజమాన్యాన్ని, నిర్వహణను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని చివరిగా 2015లో అప్పటి వరకు ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం జరిగింది. మన దేశంలో జీవిత బీమా ఉత్పత్తుల వ్యాప్తి జీడీపీలో 3.6 శాతంగా ఉండగా, ప్రపంచ సగటు 7.13 శాతంతో పోలిస్తే తక్కువలో ఉండడం గమనార్హం. అదే సాధారణ బీమా విషయంలో ప్రపంచ సగటు 2.88 శాతం అయితే, మన దేశంలో మాత్రం వ్యాప్తి 0.94 శాతంగానే ఉంది. -
ఎఫ్‌పీఐల డార్లింగ్.. బీమా!
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బీమా కంపెనీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి రికార్డు స్థాయిలో రూ.16,976 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,331 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 13 రెట్లు అధికం. సాధారణంగా ఎఫ్‌పీఐలు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీరు బీమా రంగ కంపెనీల్లో అదే పనిగా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే.. ఈ రంగంలోని వృద్ధి అవకాశాల పట్ల వారు ఎంతో బుల్లిష్‌గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఈ ఏడాది ఏప్రిల్– ఆగస్ట్ మధ్య కాలంలో మన ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ కాలంలో వారు రూ.30,011 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అయినా, ఇదే కాలంలో బీమా రంగ కంపెనీల్లో నికరంగా రూ.5,203 కోట్లను వారు ఇన్వెస్ట్ చేశారు. జీవిత, సాధారణ బీమా విభాగంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ లిస్టయిన ప్రముఖ కంపెనీలు. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ప్రభుత్వరంగ సంస్థ. సెబీ నిబంధనలు అనుకూలం... ‘‘గత 4–6 త్రైమాసికాలుగా ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్స్టిట్యూషన్లు బీమా కంపెనీల షేర్లను భారీగా కొంటున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ముందస్తు కమీషన్ల చెల్లింపులను నిషేధిస్తూ సెబీ తెచ్చిన నిబంధనలు బీమా రంగ కంపెనీలకు అనుకూలంగా మారాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ పరిశోధన విభాగం అధిపతి దీపక్ జసాని విశ్లేషించారు. అంటే బీమా కంపెనీల కమీషన్ల చెల్లింపులపై ఇటువంటి ఆంక్షలేమీ లేకపోవడం సానుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది 10 నెలల కాలంలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది బీమా రంగమే. 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఎఫ్‌పీఐలు రూ.24,714 కోట్లను వీటిల్లో ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రైవేటు బీమా రంగ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల వాటా ఏడాది క్రితం ఉన్న 3 శాతం నుంచి అక్టోబర్ చివరికి 12 శాతానికి చేరుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. అందుకే ఏడాది క్రితం ఈ కంపెనీలో 4.45 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల వాటా ఏకంగా 23.72 శాతానికి పెరిగిపోయింది. దీర్ఘకాలంలో భారీ అవకాశాలు ‘‘మారుతున్న జీవనశైలి పరిస్థితులు, అధిక రక్షణ అవసరమన్న అవగాహన విస్తృతం అవుతుండడం (ముఖ్యంగా యువతరంలో) బీమా కంపెనీలకు వ్యాపార అవకాశాలను పెంచుతోంది. ఫలితంగా వాటి మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. బీమా రక్షణ అంతరం అత్యధికంగా మన దేశంలో 92 శాతంగా ఉంది. బీమా అన్నది దీర్ఘకాలానికి సంబంధించినది. ఈ రంగం వృద్ధి అవకాశాలు ఎఫ్‌పీఐలను ఆకర్షించాయి’’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. మరోవైపు బీమా రంగ కంపెనీల రెండో త్రైమాసిక వ్యాపారంలో వృద్ధి స్వల్పంగానే నమోదైంది. ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య ఆరునెలల కాలానికి చూస్తే మాత్రం నూతన వ్యాపార ప్రీమియంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎస్బీఐ లైఫ్ నూతన వ్యాపార విలువలో 33 శాతం వృద్ధిని ఏప్రిల్ – సెప్టెంబర్ కాలంలో చూపించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నూతన వ్యాపార విలువ ఇదే కాలంలో 20 శాతం పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. -
బీమా అంతటికీ పోర్టబిలిటీ..?
• ప్రస్తుతానికి మాత్రం హెల్త్ పాలసీలకు... • సాధారణ, జీవిత, వాహన బీమాకు ఇంకా లేదు • అమలు చేస్తే బీమా కంపెనీలకు రేటింగ్ పెరుగుతుంది • బీమా పరిశ్రమపై నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేదు • ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యాఖ్యలు • హైదరాబాద్‌లో పీఎన్బీ మెట్‌లైఫ్ వీఆర్ సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్, బ్యాంకింగ్ రంగాలకు మాత్రమే అందుబాటులో ఉన్న పోర్టబిలిటీ సేవలు బీమా రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమేఅందుబాటులో ఉన్న పోర్టబిలిటీ సేవలు సాధారణ, జీవిత, వాహన వంటి అన్ని రకాల బీమా పాలసీలకూ వర్తింపజేయాల్సిన అవసరం చాలా ఉందని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్టీఎస్ విజయన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంశంపై చర్చ జరుగుతోందని.. ఎలాంటి విధానపరమైన నిర్ణయాలూ ఇంకా తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం రెన్యూవల్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉన్నపోర్టబిలిటీ అవకాశం ప్రీమియం చెల్లింపులు, పాలసీ ఎంపిక సమయంలోనూ అందిస్తే కస్టమర్ తనకు నచ్చిన బీమా కంపెనీని ఎంచుకునే వీలుంటుందని తెలియజేశారు. సోమవారమిక్కడ పీఎన్బీ మెట్లైఫ్కార్యాలయంలో వర్చువల్ రియాలిటీ (వీఆర్) సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న బీమా సంస్థతో సంతృప్తి చెందని కస్టమర్ ఎలాంటి ప్రయోజనాలను కోల్పోకుండాపాలసీని ఇతర బీమా సంస్థకు... అది కూడా ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా బదిలీ చేసుకునే అవకాశం పోర్టబిలిటీతో ఉంటుందని తెలియజేశారు. మరోవైపు పోర్టబిలిటీతో కస్టమర్లు బీమాసంస్థలకు రేటింగ్, ర్యాంకింగ్ ఇచ్చే అవకాశముంటుందని దీంతో బీమా సంస్థల మధ్య సానుకూల పోటీతత్వం పెరగడంతో పాటూ లావాదేవీల్లో పారదర్శకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం చెల్లింపు గడువు పెంపు.. రూ.1,000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం బీమా పరిశ్రమపై పెద్దగా లేదని, ఎందుకంటే ఈ రంగంలో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా, ఎలక్ట్రానిక్ లావాదేవీల రూపంలోనే లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయని విజయన్చెప్పారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం రెన్యూవల్ కస్టమర్ల మీద పడకూడదనే ఉద్దేశంతో జీవిత బీమా పాలసీల రెన్యూవల్ సమయాన్ని మరో 30 రోజులకు పొడిగించినట్లు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 8– డిసెంబర్31తో ముగిసే అన్ని రకాల జీవిత బీమా పాలసీ ప్రీమియం రెన్యూవల్ కస్టమర్లకు ఇది వర్తిస్తుందని తెలియజేశారు. గతేడాది నవంబర్ నాటితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి జీవిత బీమా కొత్త ప్రీమియం చెల్లింపుల్లో38 శాతం వృద్ధి నమోదైందని ఐఆర్డీఏఐ (లైఫ్) మెంబర్ నీలేశ్ సాథే చెప్పారు. వీఆర్ సేవలు ప్రారంభం: ఆధునిక సాంకేతిక సేవలను బీమా వినియోగదారులకూ అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా బీమా పరిశ్రమలో వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీని తీసుకొచ్చామని పీఎన్బీమెట్లైఫ్ సీఈవో, ఎండీ తరుణ్ ఛుగ్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కత్తా, జమ్ము, చంఢీఘడ్, లక్నో, అహ్మదాబాద్, పుణే 10 నగరాల్లోని 15 బ్రాంచీల్లో వీఆర్ సేవలు అందుబాటులోఉన్నాయి. రెండో దశలో దేశంలోని అన్ని పీఎన్బీ మెట్‌లైఫ్ బ్రాంచీలకు విస్తరిస్తామని పేర్కొన్నారు.