న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం 10 మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. జాబితాలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజరీ అండ్ సెక్యూరిటీస్ ఇండియా, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా క్యాపిటల్ ఉన్నాయి.
ఎల్‌ఐసీ ఐపీవోను నిర్వహించేందుకు ప్రభుత్వం బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌సహా మరికొంతమంది ఇతర సలహాదారులను ఎంపిక చేసినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇష్యూకి న్యాయసలహాదారుల నియామకానికి కూడా బిడ్స్ స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. వీటి దాఖలుకు ఈ నెల 16న గడువు ముగియనుంది. ఈ బాటలో ఇప్పటికే ఎల్‌ఐసీ విలువను నిర్ధారించేందుకు మిల్లీమ్యాన్ అడ్వయిజర్స్ ఎల్‌ఎల్‌పీ ఇండియాను ప్రభుత్వం ఎంపిక చేసుకుంది.11
Comments
Please login to add a commentAdd a comment