PSU
-
3 రోజుల్లో 1,802 పాయింట్లు అప్
ముంబై: ప్రధానంగా పీఎస్‌యూ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లకు పెరిగిన డిమాండ్‌తో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ 598 పాయింట్లు జంప్‌చేసి 80,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్ల వృద్ధితో 24,457 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,802 పాయింట్లు జమ చేసుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 701, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున ఎగశాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 81,000 సమీపాని(80,949)కి చేరింది. గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్లు వెలుగులో నిలిచినట్లు పేర్కొన్నారు.బ్లూచిప్స్ బలిమి..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా 2.5 శాతం జంప్‌చేయగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఆటో, ఐటీ 0.5 శాతం బలపడగా.. ఎఫ్ఎంసీజీ 0.4 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్ 6 శాతం జంప్‌చేసింది. ఎన్టీపీసీ, అదానీ ఎంటర్, యాక్సిస్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, అ్రల్టాటెక్, ఓఎన్జీసీ, సిప్లా, బీఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.7–1 శాతం మధ్య లాభపడ్డాయి.అయితే ఎయిర్టెల్, హీరోమోటో, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ 1.5–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. మార్కెట్ల బాటలో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1% ఎగశాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి రూ. 3,665 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం గమనార్హం! దేశీ ఫండ్స్ రూ. 251 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ⇒ వారాంతాన 40 శాతం ప్రీమియంతో లిస్టయిన ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ ఇంట్రాడేలో మరో 19 శాతం జంప్‌చేసి రూ. 264ను తాకింది. చివరికి ఈ షేరు 16 % లాభంతో రూ. 258 వద్ద ముగిసింది.⇒ గత నెల 27న లిస్టయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 142 వద్ద నిలిచింది. ఈ షేరు ఐపీవో ధర రూ. 108.బంపర్ లిస్టింగ్లుసీ2సీ అడ్వాన్స్డ్ చిన్న తరహా కంపెనీ(ఎస్ఎంఈ).. సీ2సీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ బంపర్ లిస్టింగ్ సాధించింది. ఇష్యూ ధర రూ.226తో పోలిస్తే 90% ప్రీమియంతో రూ.429 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5 శాతం లాభంతో రూ.451 వద్ద ముగిసింది.రాజ్‌పుటానా బయోడీజిల్ ఎస్ఎంఈ సంస్థ రాజ్‌పుటానా బయోడీజిల్ లిస్టింగ్ అదిరింది. ఇష్యూ ధర రూ. 130తో పోలిస్తే 90% ప్రీమియంతో రూ. 247 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5% లాభంతో రూ. 259 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో సన్నాహాలు
ముంబై: పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా పునరుత్పాదక రంగ కంపెనీ రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తద్వారా 2022లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ తదుపరి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరతీయనుంది. నిధులను సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తదితర భవిష్యత్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలకు పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఐపీవో కోసం ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ను షార్ట్‌లిస్ట్ చేసింది. -
ఐడీబీఐపై ఫెయిర్‌ఫాక్స్ కన్ను
ముంబై: పీఎస్‌యూ.. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకి కెనడియన్ పీఈ దిగ్గజం ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదు రూపేణా చెల్లించేందుకు డీల్ కుదుర్చుకోవడం ద్వారా బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఫెయిర్‌ఫాక్స్ అధినేత బిలియనీర్ ప్రేమ్ వత్సా ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం కొనుగోలు తదుపరి సైతం బ్యాంక్ గుర్తింపును కొనసాగించేందుకు అంగీకారాన్ని తెలపనుంది. రెండు వారాల క్రితమే ఆర్థిక శాఖకు ఫెయిర్‌ఫాక్స్ తాజా ప్రతిపాదనలు చేరాయి. నిజానికి షేర్ల మారి్పడి ద్వారా బ్యాంకు కొనుగోలు ఒప్పందానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం ఇందుకు సన్నద్ధంగా లేదు. దీంతో నగదు చెల్లింపును ఫెయిర్‌ఫాక్స్ తెరపైకి తీసుకువచి్చంది. కెనడా, భారత్‌ల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎస్బీ విలీనం దేశీయంగా సీఎస్బీ బ్యాంక్‌కు ఫెయిర్‌ఫాక్స్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఐడీబీఐను సొంతం చేసుకుంటే సీఎస్బీ ప్రమోటర్‌గా కొనసాగేందుకు వీలుండదు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక ఇన్వెస్టర్ రెండు బ్యాంకులకు ప్రమోటర్‌గా వ్యవహరించేందుకు అనుమతి లభించదు. వెరసి ఐడీబీఐలో సీఎస్బీ బ్యాంకును విలీనం చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 90,440 కోట్లుకాగా.. సీఎస్బీ విలువ రూ. 6,000 కోట్లు మాత్రమే. కొంతకాలం ఐడీబీఐను విడిగా కొనసాగించాక తదుపరి దశలో సీఎస్బీ బ్యాంకులో విలీనం చేసేందుకు గతంలో ఫెయిర్‌ఫాక్స్ ప్రతిపాదించింది. అయితే విస్తారిత కార్యకలాపాలు కలిగిన ఐడీబీఐ బ్యాంక్ గుర్తింపు రద్దుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ప్రతిపాదనలను తాజాగా సవరించింది. ఐడీబీఐ బ్యాంకులో సీఎస్బీ విలీనానికి ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి సమ్మతిని పొందే ప్రయత్నాల్లో ఉంది. వాటా విక్రయానికి ప్రభుత్వం తెరతీశాక ఐడీబీఐ బ్యాంక్ షేరు రూ. 60 నుంచి రూ. 84 వరకూ బలపడింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐపై కన్నేసిన కొటక్ మహీంద్రా బ్యాంక్.. సవరించిన ఆఫర్ ద్వారా ఫెయిర్‌ఫాక్స్‌కు చెక్ పెడుతుందా లేదా అనేది వేచిచూడవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఈసారి బీమా సంస్థలకు అదనపు మూలధనం లేనట్లే..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగంలోని (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలకు కేంద్రం నుంచి అదనపు మూలధనం లభించకపోవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ అవసరాలకు తగినన్ని నిధులు ఆయా సంస్థల దగ్గర ఉండవచ్చని, ఈసారి ఒక కంపెనీ నుంచి కేంద్రానికి డివిడెండ్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. మూడు పీఎస్‌యూ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం గతేడాది రూ. 5,000 కోట్ల మేర మూలధనం సమకూర్చింది. అయితే, 2023–24 బడ్జెట్లో మాత్రం బీమా కంపెనీలకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం బీమా సంస్థలు తాము చెల్లించాల్సి వచ్చే క్లెయిమ్ మొత్తాలకన్నా కొంత ఎక్కువగా మూలధన నిల్వలను ఉంచుకోవాలి. ఒకవేళ తీవ్రమైన పరిస్థితులేమైనా తలెత్తితే అన్ని క్లెయిమ్‌లను చెల్లించగలిగేందుకు (సాల్వెన్సీ మార్జిన్) ఈ నిధులు ఉపయోగపడతాయి. ప్రస్తుతం దేశీయంగా నాలుగు పీఎస్‌యూ బీమా సంస్థలు ఉండగా.. వాటిలో న్యూ ఇండియా అష్యూరెన్స్ మాత్రమే మెరుగ్గా రాణిస్తోంది. 2024 మార్చి నాటికి మూడు పీఎస్‌యూ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు రూ. 17,200–17,500 కోట్ల మేర నిధులు అవసరమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2020–21లో మూడు పీఎస్‌యూ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం రూ. 9,950 కోట్లు కేటాయించింది. -
రైట్స్ ఇష్యూ బాటలో ఐవోసీ
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు రైట్స్ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. ఇటీవలే భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ఇందుకు బోర్డు అనుమతిని సాధించగా.. నంబర్ వన్ చమురు కంపెనీ ఐవోసీ ఇందుకు తెరతీయనుంది. రైట్స్ ఇష్యూ చేపట్టే ప్రతిపాదనపై బోర్డు ఈ నెల 7న సమావేశంకానున్నట్లు బీపీసీఎల్ తాజాగా పేర్కొంది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా తాజా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్‌యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా.. రైట్స్ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్‌కు సబ్స్క్రయిబ్ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. రూ. 18,000 కోట్లకు సై పీఎస్‌యూ దిగ్గజం బీపీసీఎల్ బోర్డు గత నెల(జూన్) 28న రైట్స్ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ఇంధన రంగ పీఎస్‌యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపాదించింది. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్‌యూ హెచ్‌పీసీఎల్ ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 0.8 శాతం బలపడి రూ. 95.40 వద్ద ముగిసింది. -
కోల్ ఇండియా ఆఫర్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు తొలి రోజు భారీ డిమాండ్ నెలకొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి గురువారం ఏకంగా రూ. 6,500 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీలో 3 శాతం వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ చేపట్టింది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. గురువారం(1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైంది, నేడు(శుక్రవారం) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విండో ఓపెన్ కానుంది. తొలి రోజు ప్రభుత్వం 8.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 28.76 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అంటే 3.46 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 4,158 కోట్లు అందనున్నాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లో తొలి పీఎస్యూలో డిజిన్వెస్ట్మెంట్కు తెరలేచింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో గురువారం కోల్ ఇండియా షేరు బీఎస్ఈలో 4.4 శాతం పతనమై రూ. 231 వద్ద ముగిసింది. బుధవారం ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ప్రభుత్వం ఓఎఫ్ఎస్ను ప్రకటించింది. -
కోల్ ఇండియా @ రూ. 225
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. నేడు(జూన్ 1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం(2న) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపడుతోంది. ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం తొలుత 1.5 శాతం వాటాకు సమానమైన 9.24 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అత్యధిక స్పందన లభిస్తే మరో 1.5 శాతం వాటాను సైతం విక్రయించేందుకు గ్రీన్ షూ ఆప్షన్ ఎంచుకుంది. వెరసి కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వం విక్రయిస్తున్న వాటాకు రూ. 4,158 కోట్లు లభించనున్నాయి. వెరసి ఈ ఏడాది(2023–24) తొలిసారి పీఎస్యూలో ప్రభుత్వం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. బీఎస్ఈలో బుధవారం కోల్ ఇండియా షేరు 1.3 శాతం నష్టంతో రూ. 241 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. -
దెబ్బకు దిగొచ్చిన ప్రైవేటు బంకులు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్‌ను రిటైల్‌గా విక్రయించే రిలయన్స్ బీపీ, నయారా ఎనర్జీ సంస్థలు ఏడాది తర్వాత మార్కెటింగ్ ధరలను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం ఇవి ప్రభుత్వరంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీ పెట్రోల్ బంకులతో పోలిస్తే కాస్త అధిక రేట్లకే అమ్మకాలు సాగించాయి. అయినా కానీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే గణనీయ నష్టాలను చవిచూశాయి. దీనికి కారణం ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏడాదికి పైగా ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు దిగి రావడంతో రిలయన్స్–బీపీ, నయారా ఎనర్జీ, షెల్ సంస్థలు ప్రభుత్వరంగ సంస్థలు అనుసరిస్తున్న మార్కెట్ ధరలకే విక్రయించడం మొదలుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా గత ఆరు వారాల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో నష్టాలు కూడా తగ్గిపోవడంతో పీఎస్‌యూ పెట్రోల్ బంకుల్లో విక్రయించే రేట్లనే రిలయన్స్ బీపీ, షెల్, నయారా అనుసరిస్తున్నాయి. నయారాకు దేశవ్యాప్తంగా 86,855 పెట్రోల్ పంపులు ఉన్నాయి. మార్చి నెల నుంచే మార్కెట్ రేట్లకు విక్రయాలు మొదలు పెట్టింది. రిలయన్స్ బీపీ సంస్థకు 1,555 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఈ నెల నుంచి డీజిల్‌ను మార్కెట్ ధరలకు (ప్రభుత్వరంగ సంస్థలు పాటించే) విక్రయాలు చేస్తోంది. రిలయన్స్ బీపీ సంస్థ ప్రత్యేకమైన డీజిల్‌ను మన దేశంలో విక్రయిస్తోంది. మన దేశ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా, మెరుగైన మేలేజీ వచ్చేలా అడిటివ్స్ కలిపి విక్రయిస్తోంది. -
ఐఆర్సీటీసీలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: రైల్వే రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్సీటీసీలో ప్రభుత్వం 5 శాతంవరకూ వాటాను విక్రయించనుంది. ఇందుకు షేరుకి రూ. 680 ఫ్లోర్ ధరను ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా 2.5 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇన్వెస్టర్ల నుంచి అధిక స్పందన లభిస్తే మరో 2.5 శాతం వాటాను సైతం ఆఫర్ చేయనుంది. వెరసి 4 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు సమకూరే వీలుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 735తో పోలిస్తే ఇది 7.5 శాతం డిస్కౌంట్. నేడు సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం రిటైలర్లకు ఓఎఫ్ఎస్ అందుబాటులోకి రానుంది. వాటా విక్రయ నిధులు ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్‌కింద జమకానున్నాయి. -
పీఎస్‌యూ వాటాల విక్రయంపై దృష్టి
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలలో కొద్దిపాటి వాటాల విక్రయంపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ఇంధన దిగ్గజం కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్‌తోపాటు ఎరువుల కంపెనీ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్)లను ఇందుకు పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా సరికొత్త గరిష్టాలకు చేరిన నేపథ్యంలో ఇందుకు తెరతీయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా జనవరి–మార్చి కాలంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలియజేశాయి. రైల్వే రంగ పీఎస్‌యూసహా 5 కంపెనీలలో 5–10% వాటా విక్రయించే ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫర్ ఫర్ సేల్: పీఎస్‌యూలలో వాటాల విక్రయానికి ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లలో ఆశావహ పరిస్థితులు నెలకొన్న కారణంగా ప్రభుత్వానికి కనీసం రూ. 16,500 కోట్లవరకూ లభించవచ్చని అంచనా. ఆర్థిక వ్యవస్థ పటిష్టత, నిధుల సమీకరణ వంటి అంశాలు ప్రభుత్వానికి మద్దతివ్వగలవని నిపుణులు భావిస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో పెరుగుతున్న సబ్సిడీ బిల్లుకు తద్వారా కొంతమేర చెక్ పెట్టవచ్చని విశ్లేషిస్తున్నారు. కాగా.. పీఎస్‌యూ వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 65,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. షేర్లు జూమ్ గత ఏడాది కాలాన్ని పరిగణిస్తే కోల్ ఇండియా షేరు 46%, ఆర్సీఎఫ్ 58% దూసుకెళ్లాయి. ఇక తాజాగా ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా షేరు రూ. 232 వద్ద నిలవగా.. హింద్ జింక్ రూ. 297 వద్ద, ఆర్సీఎఫ్ రూ. 120 వద్ద ముగిశాయి. -
ఏపీ, తెలంగాణలోని బీఎస్ఎన్ఎల్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ఐదు రాష్ట్రాల పరిధిలో తనకున్న ఖరీదైన 13 ప్రాపర్టీలను ఎంఎస్టీసీ సహకారంతో డిసెంబర్ 5న వేలం వేయనుంది. ఈ ఆస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ మొత్తం 14 ప్రాపర్టీలను వేలానికి గుర్తించగా, వీటి విలువ రూ.20,160 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం, కొండపల్లి, తెలంగాణలోని పటాన్చెరులో ఉన్న ఆస్తులు కూడా వేలానికి రానున్నాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
సీఈఎల్ విక్రయానికి స్వస్తి
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. సీఈఎల్ కొనుగోలుకి బిడ్‌ను గెలుపొందిన కంపెనీ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) వద్ద అపరిష్కృతంగా ఉన్న న్యాయ వివాద విషయాన్ని వెల్లడించకపోవడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాఖ(డీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే కంపెనీ కొనుగోలుకి ఢిల్లీకి చెందిన నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ రూ. 210 కోట్ల విలువైన బిడ్‌ను దాఖలు చేయడం ద్వారా గెలుపొందింది. దీంతో గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం సీఈఎల్ విక్రయానికి అనుమతించింది. అయితే ఈ ఏడాది జనవరిలో బిడ్డర్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పలు ఆరోపణల మధ్య ప్రభుత్వం ఎల్వోఐ జారీని పక్కనపెట్టింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ఎన్సీఎల్టీ వద్ద పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాన్ని బిడ్డర్ వెల్లడించకపోవడంతో సీఈఎల్ విక్రయాన్ని రద్దు చేసేందుకు నిర్ణయించింది. చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
మా భూములు వెనక్కిచ్చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు ప్రారంభించాలని లేని పక్షంలో ఆయా భూములను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూలు) కేంద్రం అమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా మోదీ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఆస్తులను అమ్ముకునే పనిలో ఉందని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ‘అడ్డికి పావుశేరు’రీతిన అమ్ముకుంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు సంబంధించి ఎన్నో రాజ్యాంగబద్ధ హామీల అమలును పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల విలువైన సంస్థల విక్రయం దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్న హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోదీ ప్రభుత్వం అమ్ముతోందని తెలిపారు. ఈ అరు సంస్థలకు గత రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7,200 ఎకరాల భూమిని కేటాయించాయని, ఇప్పుడు వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుందని, ఇక బహిరంగ మార్కెట్లోనైతే రూ.40 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృధ్ది జరగాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో గతంలో ఆయా కంపెనీలకు అత్యంత తక్కువ ధరకు, అనేక సందర్భాల్లో ఉచితంగానే ప్రభుత్వాలు భూములు కేటాయించాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ఆస్తులు తెలంగాణ ప్రజల హక్కు కేంద్ర ప్రభుత్వం విక్రయించాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేట్ పరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్మడమేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్రానికి, రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. అమ్మొద్దు..పునరుద్ధరించండి తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిపై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి బదులు వాటిని పునరుద్ధరించి బలోపేతం చేయాలని కోరారు. అలా కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటామంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. పాత పరిశ్రమలను ప్రారంభించే వీలు లేకుంటే, ఆ భూములను రాష్ట్రానికివ్వడం ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీత
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నర్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్టీల్ శాఖ తాజాగా వెల్లడించింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసే బాటలో కంపెనీకి చెందిన వాటాదారులు, రుణదాతలతో నేడు(7న) సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్ఎస్పీని పూర్తిస్థాయిలో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లు ఒక అధికారిక ప్రతిలో స్టీల్ శాఖ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ సమీపంలో 3 మిలియన్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యంతో ఎన్ఎస్పీ ఏర్పాటవుతోంది. 1,980 ఎకరాలలో యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకు రూ. 23,140 కోట్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు 2020 అక్టోబర్‌లో కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. తద్వారా కంపెనీలో కేంద్రానికున్న మొత్తం వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుడికి విక్రయించనుంది. మంగళవారం నిర్వహించనున్న సమావేశాలకు స్టీల్ శాఖ అదనపు కార్యదర్శి రాశికా చౌబే అధ్యక్షత వహించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం నీరసించి రూ. 125 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ కొత్త ప్రాజెక్టులు షురూ
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ సుమారు రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. దీంతో 7.5 మిలియన్ టన్నుల చమురు, 1 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జత కలవనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముంబై హై క్షేత్రాల జీవితకాలాన్ని హెచ్చించడం ద్వారా ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ముంబై హై సౌత్ పునరాభివృద్ధి నాలుగో దశలో భాగంగా రూ. 3,740 కోట్లను వెచ్చించగా, ముంబై హైవద్ద క్లస్టర్–8 మార్జినల్ ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టుపై రూ. 2,292 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులను చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జాతికి అంకితం చేసినట్లు పేర్కొంది. -
ఎన్పీఏల విక్రయానికి ఎస్బీఐ రెడీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్పీఏలు)గా మారిన 12 ఖాతాలను విక్రయించే సన్నాహాల్లో ఉంది. తద్వారా రూ. 820 కోట్ల రుణాలను రికవర్ చేసుకోవాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ ఆస్తుల విక్రయంపై బ్యాంకు విధానాల ప్రకారం నియంత్రణ సంస్థల నిబంధనలకులోబడి వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. మార్చి– ఏప్రిల్ 13 మధ్య విక్రయించేందుకు 12 ఎన్పీఏ ఖాతాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు(ఏఆర్‌సీలు), ఎన్బీఎఫ్సీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇవీ ఖాతాలు: ఎస్బీఐ విక్రయించనున్న ఎన్పీఏ ఖాతాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌వర్త్ ఉర్జా అండ్ మెటల్స్(దాదాపు రూ. 397 కోట్ల రుణాలు) ఖాతాను ఈ నెల 29న ఈఆక్షన్కు పెట్టనుంది. ఇందుకు రిజర్వ్ ధర రూ. 85 కోట్లుగా ప్రకటించింది. రూ. 186 కోట్ల బకాయిలుగల బాలసోర్ అలాయ్స్కు రూ. 178.2 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఈ బాటలో రూ. 122 కోట్ల బకాయిలుగల మరో ఆరు ఎన్పీఏ ఖాతాలను 30న ఈవేలం వేయనుంది. మిగిలిన నాలుగు ఎన్పీఏ ఖాతాలకు ఏప్రిల్ 13న వేలం నిర్వహించనుంది. వీటి మొత్తం బకాయిలు రూ. 125.3 కోట్లు. -
ఎల్ఐసీ ఐపీవోపై ప్రభుత్వం దృష్టి
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో ప్రభుత్వం ప్రణాళికలకు తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి ధరల శ్రేణితోపాటు.. పాలసీదారులు, రిటైలర్లకు డిస్కౌంట్, రిజర్వ్ చేయనున్న షేర్ల సంఖ్య తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలను త్వరలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేయనున్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తుండటంతో ప్రస్తుతం ప్రభుత్వం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలియజేశాయి. ముసాయిదా పత్రాలకు సెబీ నుంచి ఆమోదముద్ర పడటంతో తుది పత్రాల(ఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయవలసి ఉన్నట్లు పేర్కొన్నాయి. 5 శాతం వాటా: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా దిగ్గజం ఎల్ఐసీలో ప్రభుత్వం 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఫిబ్రవరి 13న ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయగా.. ఈ వారం మొదట్లో సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో ఆర్హెచ్పీను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన రూ. 78,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని అందుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. -
నాల్కో హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 831 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,415 కోట్ల నుంచి రూ. 3,845 కోట్లకు జంప్ చేసింది. తాజాగా వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇప్పటికే రూ. 2.50 డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో నాల్కో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 119 వద్ద ముగిసింది. -
బీవోఐ జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. 1,027 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 541 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 12,311 కోట్ల నుంచి రూ. 11,211 కోట్లకు క్షీణించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 3,739 కోట్ల నుంచి రూ. 3,408 కోట్లకు బలహీనపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.25 శాతం నుంచి 10.46 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు మాత్రం 2.46 శాతం నుంచి 2.66 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,810 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 335 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.66 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం పతనమై రూ. 56.4 వద్ద ముగిసింది. -
వొడాఫోన్-ఐడియాలో వాటా: మాంచి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
Govt Not Interested in Supervising Vodafone Idea Operations: భారత టెలికాం రంగంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న వొడాఫోన్-ఐడియా తన మేజర్ వాటాను కేంద్రం చేతికి అప్పగించింది. దీంతో కార్యనిర్వాహణ, కీలక నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకోనుందని.. మంచిరోజులు రాబోతున్నాయంటూ కంపెనీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో కేంద్రం ఆ ఆశలపై నీళ్లు జల్లింది. కంపెనీలో మేజర్ వాటా దక్కించుకున్నప్పటికీ.. వొడాఫోన్ ఐడియా కంపెనీ కార్యకలాపాల పర్యవేక్షణ, నిర్వహణలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు బోర్డు నిర్ణయాలను సైతం ప్రభావితం చేయబోదని పేర్కొంది. వొడాఫోన్-ఐడియాను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. బోర్డు సీటుపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. నష్టాల్లో ఉన్న టెల్కో స్థిరపడిన వెంటనే.. నిష్క్రమించాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇక వొడాడియా ఆఫర్ చేసిన వాటాను.. ప్రభుత్వ ఈక్విటీగా మార్చే విధానంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపనుందని అధికారులు వెల్లడించారు(దాదాపు ఖరారైనట్లే!). మొత్తం వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చేయగా.. రూ. 16,000 కోట్లకుగానూ 35.8 శాతం వాటాను వొడాఫోన్-ఐడియా కంపెనీ, కేంద్రానికి అప్పజెప్పేందుకు సిద్ధమైంది. దీంతో కంపెనీలో గరిష్ఠ వాటా దక్కడంతో.. మొత్తం నిర్వహణ ప్రభుత్వమే చూసుకోనుందంటూ(మరో బీఎస్ఎన్ఎల్గా మారనుందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు సైతం) కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ చేతికి మేజర్ వాటాను అప్పజెప్పడం ద్వారా లబ్ధి పొందవచ్చని భావించిన కంపెనీకి.. అధికారుల తాజా ప్రకటనతో నిరాశే ఎదురైంది. కేవలం టెలికాం సంస్కరణల ప్యాకేజీ ద్వారా లిక్విడిటీకి తీసుకురావడం, టెలికాం కంపెనీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటం లాంటి చర్యలకు మాత్రమే ప్రభుత్వం పూనుకోనుందట. ఇక ఓటింగ్ హక్కులు, PSU(పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్)గా మార్చడం, డైరెక్టర్ల బోర్డులో స్థానం పొందడంలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేదనే స్పష్టత లభించింది. మరోవైపు ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకే ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.దీంతో కంపెనీ ఇక మీదట కూడా స్వతంత్రగా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే.. కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించించింది. ఇందులో భాగంగానే టెలికం కంపెనీలు.. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. అలా ఐడియా-వొడాఫోన్ నుంచి కేంద్రం వాటా రూపంలో ఆఫర్ అందుకుంది. సంబంధిత పూర్తి కథనం: ప్రభుత్వం చేతికి వొడాఐడియా! -
అమ్మకానికి మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు!
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ తాజాగా ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్(పీడీఐఎల్)తోపాటు హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో వాటా విక్రయానికి తెరతీసింది. ఇందుకు అనుగుణంగా ఈ పీఎస్‌యూల కొనుగోలుకి ఆసక్తిగల కంపెనీల నుంచి గ్లోబల్ బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. బిడ్స్ దాఖలుకు 2022 జనవరి 31 చివరి తేదీగా ప్రకటించింది. పీఎస్‌యూల ప్రయివేటైజేషన్‌లో భాగంగా కొనుగోలుకి ఆసక్తి(ఈవోఐ)ని వ్యక్తం చేసేందుకు 45 రోజులకుపైగా గడువును ఇచ్చినట్లు దీపమ్ ట్వీట్ చేసింది. మినీరత్న కేటగిరీ–1 కంపెనీ పీడీఐఎల్ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. కంపెనీ ప్రధానంగా డిజైన్, ఇంజినీరింగ్, కన్సల్టెన్సీ, తత్సంబంధిత ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సర్వీసులను అందిస్తోంది. ఇక హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఇప్పటివరకూ ఎస్యూయూటీఐతో కలిపి సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 9,330 కోట్లు సమకూర్చుకున్నట్లు ఈ సందర్భంగా దీపమ్ వెల్లడించింది. చదవండి: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు -
క్యూ2 లో సెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ రంగ స్టీల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 రెట్లు ఎగసింది. రూ. 4,339 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 437 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 17,098 కోట్ల నుంచి రూ. 27,007 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,734 కోట్ల నుంచి రూ. 21,289 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో 4.468 మిలియన్ టన్నుల స్టీల్‌ను తయారు చేయగా.. 4.280 ఎంటీ స్టీల్‌ను విక్రయించినట్లు సెయిల్ తెలియజేసింది. సెప్టెంబర్‌కల్లా స్థూల రుణాలు రూ. 35,350 కోట్ల నుంచి రూ. 22,478 కోట్లకు క్షీణించాయి. వెరసి తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ. 12,872 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 115 వద్ద ముగిసింది. -
పీఎస్‌యూల నుంచి రూ. 2,593 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలు ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్(పీజీసీఐఎల్) సంయుక్తంగా ప్రభుత్వానికి రూ. 2,593 కోట్ల డివిడెండ్‌ను అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22)గాను ఎన్టీపీసీ రూ. 1,560 కోట్లు, పీజీసీఐఎల్ రూ. 1,033 కోట్లు చొప్పున ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ పీఎస్‌యూల నుంచి డివిడెండ్ల రూపేణా ప్రభుత్వానికి రూ. 7,515 కోట్లు అందినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మరోపక్క ప్రభుత్వ రంగ కంపెనీలలో మైనారిటీ వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 9,110 కోట్లు సమకూర్చుకున్నుట్లు తెలియజేశారు. -
వైజాగ్ స్టీల్ విక్రయానికి సలహా సంస్థల క్యూ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)లో కేంద్ర ప్రభుత్వానికి గల 100 శాతం వాటా విక్రయ లావాదేవీని చేపట్టేందుకు ఐదు కంపెనీలు బిడ్ చేసినట్లు దీపమ్ తాజాగా వెల్లడించింది. జాబితాలో యర్నెస్ట్ అండ్ యంగ్‌సహా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డెలాయిట్ టచ్ తోమత్సు, జేఎం ఫైనాన్షియల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ చేరినట్లు వెబ్సైట్లో పేర్కొంది. రేసులో నిలిచిన అడ్వయిజర్ కంపెనీలు ఈ నెలాఖరులోగా దీపమ్ వద్ద ప్రజెంటేషన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించేందుకు జులై 7న ఆసక్తి గల కంపెనీల నుంచి దీపమ్ బిడ్స్‌ను ఆహా్వనించింది. ఇందుకు తొలుత ప్రకటించిన గడువును జూలై 28 నుంచి ఆగస్ట్ 26 వరకూ పొడిగించింది. వాటా విక్రయ లావాదేవీ నిర్వహణకు దీపమ్ ఒకే అడ్వయిజర్ సంస్థను ఎంపిక చేయనుంది. సలహా సంస్థ వైజాగ్ స్టీల్‌తోపాటు.. అనుబంధ కంపెనీలలోనూ వాటా విక్రయ వ్యవహారాన్ని చేపట్టవలసి ఉంటుంది. కాగా.. మరోవైపు న్యాయ సలహాదారుగా వ్యవహరించేందుకు సైతం ఐదు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ కంపెనీలు కూడా ఈ నెల 30న దీపమ్‌కు ప్రతిపాదనలు అందించవలసి ఉంటుంది. వీటిలో చాందియోక్ అండ్ మహాజన్, ఎకనమిక్ లాస్ ప్రాక్టీస్, జే సాగర్ అసోసియేట్స్, కొచ్చర్ అండ్ కంపెనీ, లింక్ లీగల్ ఉన్నాయి. జనవరిలోనే.. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్(సీసీఈఏ) ఈ ఏడాది జనవరి 27న రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్)లో పూర్తి వాటా విక్రయానికి ముందస్తు అనుమతిని మంజూరు చేసింది. ప్రైవేటైజేషన్ ద్వారా అనుబంధ సంస్థలతోపాటు వైజాగ్ స్టీల్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. -
15 వరకే ఎయిరిండియా గడువు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి బిడ్స్ దాఖలు గడువు ఈ నెల 15తో ముగియనున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ప్రాథమిక బిడ్స్ దాఖలుకు ఇంతవరకూ ఐదుసార్లు గడువును పొడిగించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. గతేడాది డిసెంబర్లో టాటా గ్రూప్‌సహా పలు కంపెనీలు ప్రాథమిక బిడ్స్ దాఖలు చేశాయి. ఎయిరిండియా కొనుగోలుకి అర్హత సాధించిన కంపెనీలకు వర్చువల్ డేటా రూమ్(వీడీఆర్) ద్వారా తగిన సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది. ప్రాథమిక బిడ్స్ విశ్లేషణ తదుపరి ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్స్‌కు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. వీటికి సెపె్టంబర్ 15 వరకూ గడువును ప్రకటించింది. గడువు ముగిశాక ప్రభుత్వం రిజర్వ్ ధరపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా భారీ నష్టాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఎయిరిండియా విక్రయం డిసెంబర్ చివరికల్లా పూర్తయ్యే వీలున్నట్లు వివరించాయి. -
ఎల్ఐసీ ఐపీవోకు మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం 10 మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. జాబితాలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజరీ అండ్ సెక్యూరిటీస్ ఇండియా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా క్యాపిటల్ ఉన్నాయి. ఎల్ఐసీ ఐపీవోను నిర్వహించేందుకు ప్రభుత్వం బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్సహా మరికొంతమంది ఇతర సలహాదారులను ఎంపిక చేసినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇష్యూకి న్యాయసలహాదారుల నియామకానికి కూడా బిడ్స్ స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. వీటి దాఖలుకు ఈ నెల 16న గడువు ముగియనుంది. ఈ బాటలో ఇప్పటికే ఎల్ఐసీ విలువను నిర్ధారించేందుకు మిల్లీమ్యాన్ అడ్వయిజర్స్ ఎల్ఎల్పీ ఇండియాను ప్రభుత్వం ఎంపిక చేసుకుంది.11 -
బీవోబీ, యూ గ్రో నుంచి ప్రథమ్ రుణాలు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) తాజాగా ఫిన్‌టెక్ కంపెనీ యూ గ్రో క్యాపిటల్‌తో చేతులు కలిపింది. తద్వారా ప్రథమ్ పేరుతో రుణాలను అందించనుంది. యూ గ్రో క్యాపిటల్ సహకారంతో ఎంఎస్ఎంఈ రంగంలోని సంస్థలకు రూ. 1,000 కోట్లను రుణాలుగా విడుదల చేయనున్నట్లు బీవోబీ తెలియజేసింది. బీవోబీ 114వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రథమ్ పేరిట రుణాల జారీని చేపట్టినట్లు చిన్న సంస్థలకు రుణాలందించే టెక్ ఆధారిత ప్లాట్‌ఫామ్.. యూ గ్రో క్యాపిటల్ పేర్కొంది. సహరుణ విడుదల కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు అవసరాలకు అనుగుణంగా(కస్టమైజ్డ్) రుణాలను పోటీస్థాయి వడ్డీ రేట్లతో అందించనున్నట్లు తెలియజేసింది. రూ. 50 లక్షల నుంచి ప్రారంభించి రూ. 2.5 కోట్ల వరకూ రుణాలను మంజూరు చేయనున్నట్లు వివరించింది. 8 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గరిష్టంగా 120 నెలల కాలావధితో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. సహరుణ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కె. పేర్కొన్నారు. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. -
బ్రిటానియా- కేఐవోసీఎల్ పతనం
విదేశీ ప్రతికూలతల కారణంగా ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 240 పాయింట్లు జంప్‌చేసి 40,671ను తాకింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 11,932 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ.. అంచనాలను చేరకపోవడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క ఈక్విటీ షేర్ల బైబ్యాక్ నిర్ణయాలు నిరాశపరచడంతో మెటల్, మైనింగ్ రంగ పీఎస్‌యూ కేఐవోసీఎల్ లిమిటెడ్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వెరసి ఈ రెండు షేర్లూ లాభాల మార్కెట్లోనూ భారీ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 495 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 3,419 కోట్లను తాకింది. అమ్మకాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చూపనప్పటికీ వ్యయాల నియంత్రణ, తగ్గిన ముడి సరుకుల ధరలు కంపెనీ లాభదాయకత మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బ్రిటానియా షేరు 5 శాతం పతనమై రూ. 3,583 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3,575 వరకూ వెనకడుగు వేసింది. కేఐవోసీఎల్ లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పీఎస్‌యూ కేఐవోసీఎల్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 110 ధర మించకుండా 1.41 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 2.28 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 156 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేఐవోసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరువుకావడంతో రూ. 123 దిగువన ఫ్రీజయ్యింది. -
బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్!
న్యూఢిల్లీ: నాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ వంటి బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎఫ్ఎస్ను చేపట్టాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం భావిస్తోంది. నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో), కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఎన్బీసీసీ(ఇండియా), భారత్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్.. ఈ కంపెనీలు ఓఎఫ్ఎస్ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రభుత్వానికి 52–82 శాతం రేంజ్లో వాటాలున్నాయి. అయితే ఈ కంపెనీల ఓఎఫ్‌ఎస్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు మార్కెట్ స్థితిగతులు బాగా ఉంటేనే ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి రాగలదు. బీపీసీఎల్, ఎయిర్ ఇండియాల వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకవపోచ్చు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యసాధనలో రూ.87,000 కోట్ల మేర కోత పడనున్నది. -
ప్రైవేటు కంపెనీల మాదిరే
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూ) సైతం ప్రైవేటు కంపెనీల మాదిరే పాలనా ప్రమాణాలను అనుసరించే విధంగా ఉండాలని సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. సీవీసీ, కాగ్, సీబీఐ దర్యాప్తు వంటివి తరచుగా ప్రభుత్వరంగ సంస్థల నిర్ణయాల్లో అతి జాగ్రత్త లేదా నిర్ణయాలు నిలిచిపోవడానికి కారణమవుతున్నాయని, ఇలా కాకుండా చూసి, ప్రైవేటు సంస్థల మాదిరే పనిచేసే వాతావరణం కలి్పంచాలని పేర్కొంది. భారత ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయంగా పోటీ పడగలవని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ‘ది రైజ్ ఆఫ్ ఎలిఫెంట్:ఎన్హాన్సింగ్ కాంపిటీటివ్నెస్ ఆఫ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలపై రూపొందించిన పరిశోధన నివేదికను విడుదల చేశారు. -
స్టాక్స్..రాకెట్స్!
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం, వాణిజ్య యుద్ధ భయాలు, జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల డౌన్‌గ్రేడింగ్ వంటి గడ్డు పరిస్థితుల్లోనూ నిఫ్టీ గతేడాది దీపావళి (2018 నవంబర్ 7) నుంచి ఈ ఏడాది అక్టోబర్ 15 దాకా సుమారు 11% రాబడులిచ్చింది. కానీ మిడ్‌క్యాప్ సూచీ 6%, స్మాల్‌క్యాప్ సూచీ 10% మేర క్షీణించాయి. అయితే, రియల్టీ 14%, బ్యాంకెక్స్ 13%, ఆయిల్ అండ్ గ్యాస్ 13% పెరిగాయి. ఇక సంవత్ 2076లో ఆశావహ పరిస్థితులే కనిపిస్తున్నాయన్నది బ్రోకరేజీ సంస్థల మాట. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22 శాతానికి తగ్గించడం, తయారీ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడం సెంటిమెంటును మెరుగుపరుస్తాయన్నది వారి అంచనా. ఈ నేపథ్యంలో నిఫ్టీ 14,000 పాయింట్లకు , సెన్సెక్స్ 46,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. ‘సంవత్ 2076’లో ఐటీ, మెటల్, ఫార్మా, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లకు దూరంగా ఉండటమే మంచిదన్నది బ్రోకరేజీ సంస్థల సూచన. ప్రైవేట్ బ్యాంకులు, బీమా సంస్థలు, ఎఫ్ఎంసీజీ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నాయి. ఆ సిఫారసుల వివరాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... బ్రోకరేజి సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 469 టార్గెట్ ధర రూ. 550 ఇతరత్రా సవాళ్లు, కొత్తగా బయటికొస్తున్న మొండిపద్దులకు సంబంధించి మిగతా బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంకు పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆదాయాలను మెరుగుపర్చుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. రుణ వితరణకు సంబంధించి వార్షిక ప్రాతిపదికన 2019–21లో 17 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చు. హెచ్‌యూఎల్ ప్రస్తుత ధర రూ. 2,143 టార్గెట్ ధర రూ. 2,265 మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వేగంగా మార్పులు, చేర్పులు చేసుకోగల సామర్థ్యాలు, ప్రీమియమైజేషన్ ట్రెండు పటిష్టంగా ఉండటం, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవటం వంటివి ఈ సంస్థకు సానుకూలాంశాలు. లార్జ్ క్యాప్ కన్జూ మర్ సంస్థల్లో హెచ్‌యూఎల్ ఆదాయాలు మరింత మెరుగ్గా నమోదయ్యే అవకాశాలున్నాయి. టైటాన్ ప్రస్తుత ధర రూ. 1,334 టార్గెట్ ధర రూ. 1,435 సొంతంగా అమలు చేస్తున్న వ్యూహాలు, నియంత్రణ వ్యవస్థ పరంగా సానుకూలాంశాలు టైటాన్ వృద్ధికి దోహదపడనున్నాయి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రూప్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) అమ్మకాల వృద్ధిలో జ్యుయలరీ విభాగం వాటా 60% పైగా ఉంది. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎస్బీఐ ప్రస్తుత ధర రూ. 282 టార్గెట్ ధర రూ. 350 నిర్వహణ పనితీరు స్థిరంగా ఉంది. ఆదాయాలు మెరుగుపడతాయి. అలాగే, ఎన్సీఎల్టీకి చేరిన మొండిపద్దుల నుంచి కూడా భారీ రికవరీలకు గణనీయమైన అవకాశాలున్నాయి. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత ధర రూ. 2,103 టార్గెట్ ధర రూ. 2,600 లిక్విడిటీ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ.. తక్కువ వ్యయాలతో నిధులు సమీకరించుకోగలగడం, మార్కెట్ షేరు పెంచుకోగలగడం దీనికి సానుకూల అంశాలు. 2019–2022 మధ్య ఏయూఎం వృద్ధి వార్షిక ప్రాతిపదికన 14 శాతం స్థాయిలో ఉండొచ్చని, నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ: రెలిగేర్ బ్రోకింగ్ హావెల్స్ ఇండియా ప్రస్తుత ధర రూ. 665 టార్గెట్ ధర రూ. 795 కొంగొత్త ఉత్పత్తులతో పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంఈజీ రంగంలో అత్యధికంగా మార్కెట్ వాటా, పటిష్టమైన నెట్వర్క్ దీనికి లాభించే అంశాలు. పండుగ సీజన్ డిమాండ్‌తో రాబోయే రోజుల్లో పనితీరు మరింత మెరుగుపడవచ్చు. రుణభారం తక్కువగా ఉండటం, రాబడులు మెరుగ్గా ఉండటం కలిసొస్తాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ధర రూ. 578 టార్గెట్ ధర రూ. 695 ఆటో పరిశ్రమలో మందగమ నం కారణంగా ఏడాది కాలంగా ఈ షేరు కరెక్షన్కు లోనయ్యింది. వర్షపాతం బాగుండటం, ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉండటం, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు ట్రాక్టర్ పరిశ్రమ రికవరీకి తోడ్పడగలవని అంచనా. ఫోర్డ్ ఇండియాతో జట్టు కట్టడం .. ఎంఅండ్ఎం పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టపర్చుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడానికి, భారత్ నుంచి ఎగుమతులు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. మారికో ప్రస్తుత ధర రూ. 393 టార్గెట్ ధర రూ. 451 సమీప భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీకి సవాళ్లు ఉన్నప్పటికీ.. క్రమంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవచ్చు. సానుకూల అంచనాల కారణంగా 13–15 శాతం మేర ఆదాయ వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది. కొత్త ఉత్పత్తులు, కొన్ని విభాగాల్లో అగ్రస్థానం ఉండటంతో పాటు కొబ్బరి ధరలు తగ్గుతుండటం.. కంపెనీ మార్జిన్లపరంగా సానుకూల అంశాలు. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 699 టార్గెట్ ధర రూ. 780 పెరిగే డిమాండ్‌కు తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త ఉత్పత్తులు, నెట్వర్క్ పటిష్టపర్చుకోవడం సానుకూల అంశాలు. మున్ముందు రూమ్ ఏసీలు, ఎయిర్ కూలర్లకు డిమాండ్‌తో వోల్టాస్ విక్రయాలు గణనీయంగా పెరగవచ్చు. తీవ్ర పోటీ ఉన్నా రూమ్ ఏసీల విభాగంలో వోల్టాస్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. బ్రోకరేజి సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుప్రీం ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,173 టార్గెట్ ధర రూ. 1,420 దేశీయంగా అతి పెద్ద ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఒకటి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, అన్ని ప్రాంతాల్లో తాగు నీటి వసతి కల్పించడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపర్చడం వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పైపుల రంగానికి .. తద్వారా ఈ సంస్థకు సానుకూల అంశాలు. 2019–21 మధ్య కాలంలో కంపెనీ ఆదాయాలు 13 శాతం పైగా వృద్ధి చెందగలవని అంచనా. యునైటెడ్ బ్రూవరీస్ ప్రస్తుత ధర రూ. 1,337 టార్గెట్ ధర రూ. 1,620 దేశీ బీరు మార్కెట్లో 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. పటిష్టమైన బ్రాండ్స్, విస్తృతమైన నెట్వర్క్ దీనికి బలం. ఇతర ఉత్పత్తుల రేట్ల పెంపుతో పాటు ప్రీమియం బ్రాండ్స్ విక్రయాలు మెరుగుపడనుండటం సంస్థకు సానుకూలం. కొత్తగా క్రాఫ్ట్ బీరు, నాన్–ఆల్కహాల్ బెవరేజెస్ వ్యాపారాలు కూడా సంస్థకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కాన్సాయ్ నెరోలాక్ ప్రస్తుత ధర రూ. 545 టార్గెట్ ధర రూ. 620 దేశీయంగా అతి పెద్ద ఇండస్ట్రియల్ పెయింట్ కంపెనీ. ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగంలో 35 శాతం, మొత్తం పెయింట్స్ మార్కెట్లో 14 శాతం వాటా ఉంది. పట్టణీకరణ, రీపెయింటింగ్కు డిమాండ్‌తో పాటు మెరుగైన వర్షపాతం, అందరికీ ఇళ్ల పథకాలు మొదలైనవి పెయింట్ పరిశ్రమకు, ఈ సంస్థకు సానుకూల అంశాలు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు కోత కూడా కంపెనీకి లాభిస్తుంది. డాబర్ ఇండియా ప్రస్తుత ధర రూ. 465 టార్గెట్ ధర రూ. 550 పలు రకాల ఉత్పత్తులతో.. వివిధ విభాగాల్లోకి కంపెనీ విస్తరించింది. మూడు బ్రాండ్స్ (రియల్, వాటికా, ఆమ్లా) టర్నోవరు రూ. 1,000 కోట్ల పైగా ఉంటుండగా, రూ. 100 కోట్ల పైగా టర్నోవరుండే బ్రాండ్స్ 16 దాకా ఉన్నాయి. పతంజలి నుంచి పోటీ తగ్గి గత కొద్ది త్రైమాసికాలుగా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తోంది. జేకే సిమెంట్ ప్రస్తుత ధర రూ. 1,117 టార్గెట్ ధర రూ. 1,260 గ్రే సిమెంట్ విభాగంలో టాప్ సంస్థల్లో ఇదొకటి. వైట్ సిమెంట్‌లో మార్కెట్ లీడరు. ఉత్తర, దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. వైట్ సిమెంటు విభాగంలో అగ్రస్థానంలో ఉండటం, కార్పొరేట్ ట్యాక్స్ కోత దీనికి లాభించగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ : ఏంజిల్ బ్రోకింగ్ మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 7,469 టార్గెట్ ధర రూ. 8,552 ప్యాసింజర్ వాహనాల విభాగంలో 52 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ ప్రీమియం కస్టమర్లను కూడా ఆకర్షిస్తోంది. ఆటోమొబైల్ రంగం రికవర్ అయ్యే క్రమంలో ముందుగా అవకాశాలను అందిపుచ్చుకునే సత్తా ఉండటం దీనికి సానుకూలం. జీఎంఎం ఫాడ్లర్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా తదితర రంగాల్లో రసాయనాల ప్రాసెసింగ్‌కు ఉపయోగించే గ్లాస్ లైన్డ్ (జీఎల్) స్టీల్ పరికరాల ఉత్పత్తిలో దేశీయంగా అగ్రస్థానంలో ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలకు సరిపోయేలా ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. మధ్యకాలికంగా జీఎల్యేతర వ్యాపారాలను కూడా మెరుగుపర్చుకుంటోంది. లార్సన్ అండ్ టూబ్రో ప్రస్తుత ధర రూ. 1,425 టార్గెట్ ధర రూ. 1,850 ఇన్ఫ్రా, హైడ్రోకార్బన్, సర్వీసుల విభాగాలతో దేశీయంగా అతి పెద్ద ఈపీసీ కంపెనీ. వివిధ అనుబంధ సంస్థల ద్వారా ఐటీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. దేశ, విదేశాల్లో రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఆర్డర్లతో పటిష్టంగా ఉంది. ప్రభుత్వం ఇన్ఫ్రాపై దృష్టి, కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు వంటివి సంస్థకు లాభించేవి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,229 టార్గెట్ ధర రూ. 1,390 డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతోంది. నగరాలు కానిచోట కొత్త శాఖల సంఖ్యను మరింతగా పెంచుకోవడం, పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను 4 రెట్లు పెంపు, వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ క్లయింట్స్ సంఖ్య రెట్టింపు వంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది. మెరుగైన మార్జిన్లు నమోదు చేయగలుగుతోంది. బ్లూ స్టార్ ప్రస్తుత ధర రూ. 795 టార్గెట్ ధర రూ. 867 భారత్‌లో ఏసీలు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఒకటి. రూమ్ ఏసీల మార్కెట్లో ప్రతి ఏడాది తన మార్కెట్ వాటాను పెంచుకుంటూనే ఉంది. ఫలితంగా కంపెనీ మొత్తం ఆదాయంలో కూలింగ్ ప్రొడక్ట్స్ డివిజన్ వాటా పదేళ్లలో రెట్టింపైంది. ఇదే జోరు భవిష్యత్తులో కూడా కొనసాగనున్నది. రెండేళ్లలో ఆదాయం 11 శాతం చొప్పున వృద్ధి చెందగలదని అంచనా. మార్జిన్లు వచ్చే ఏడాది 7%కి పెరగవచ్చు. గోల్డ్ రన్.. రూ. 41,500కు చేరే అవకాశం అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత దీపావళి నుంచి చూస్తే ఈక్విటీలపై 10 శాతం మేర రాబడులు రాగా.. పసిడి 21 శాతం దాకా లాభాన్నిచ్చింది. అయితే, ధరతో పాటు దిగుమతి సుంకాలూ పెరిగిపోవటం పసిడికి కొంత ప్రతికూలమే. 2019లో దిగుమతులు 12 శాతం తగ్గగా.. పండుగ సీజన్లో కూడా డిమాండ్ ఒక మోస్తరుగానే ఉంది. వాణిజ్య యుద్ధభయాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. వేగం తగ్గినా.. పసిడి పరుగు కొనసాగుతుందనే అంచనాలున్నాయి. ప్రధాన ఎకానమీల్లో మందగమనం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు, సెంట్రల్ బ్యాంకులు ఉదార విధానాలు కొనసాగించనుండటం పసిడి ధరకు మద్దతుగా నిలవవచ్చు. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాలు తగ్గిపోతే పసిడి కొంత కరెక్షన్కు లోనైనా.. రూ.35,500 మద్దతును నిలబెట్టుకోగలిగితే మళ్లీ గత గరిష్ట స్థాయి రూ.39,500ను తాకవచ్చు.. ఆ పైన వచ్చే 12 నెలల్లో రూ. 41,500కి కూడా చేరవచ్చు. -
ఆ వాటాలు... ప్రత్యేక ఫండ్‌లోకి!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల అమలుకు కేంద్రం కసరత్తు చే స్తోంది. ఇందులో భాగంగా పది ప్రభుత్వ రంగ సంస్థల్లోని షేర్లను స్పెషల్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు (ఎస్‌ఎన్‌ఐఎఫ్) బదలాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ రూపొందిస్తున్న ప్రతిపాదనను త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంస్థల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ కనీసం 25 శాతం ఉండాలన్న సెబీ నిబంధన అమలుకు వాస్తవానికి 2017 ఆగస్టు 21తో గడువు ముగిసింది. అయితే, సెబీ దీన్ని ఆ తర్వాత మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ డెడ్‌లైన్ కూడా దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థల్లో వాటాల విక్రయం సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతో ఎస్‌ఎన్‌ఐఎఫ్‌లోకి ఆ షేర్లను బదలాయించాలని భావిస్తోంది. లిస్టులోని కంపెనీలవే .. సెబీ నిబంధనల ప్రకారం కేంద్రం తన వాటాలను 75 శాతానికి తగ్గించుకోవాల్సిన పది కంపెనీల్లో కోల్ ఇండియా, ఎంఎంటీసీ మొదలైనవి ఉన్నాయి. ఐటీడీసీ, ఎంఆర్‌పీఎల్, హిందుస్తాన్ కాపర్, ఎన్ఎల్సీ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్), ఎస్‌జేవీఎన్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ), కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐవోఎస్‌ఎల్), మద్రాస్ ఫెర్టిలైజర్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఏఎంకే నిర్ణయాధికారం .. ఆర్థిక శాఖ రూపొందిస్తున్న నోట్ ప్రకారం చూస్తే.. ఏయే సంస్థల్లో వాటాలను ఎస్‌ఎన్‌ఐఎఫ్‌కు బదలాయించాలనే దానిపై డిజిన్వెస్ట్‌మెంట్ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) నిర్ణయం తీసుకోనుంది. కేంద్రానికి కోల్ ఇండియాలో 78.32 శాతం, ఎన్ఎల్సీలో 84.04 శాతం వాటాలు ఉన్నాయి. వీటిల్లో వాటాల విక్రయం కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే రోడ్‌షోలు నిర్వహిస్తోంది. ఇది కుదరని పక్షంలో ఎస్‌ఎన్‌ఐఎఫ్‌లోకి ఆయా వాటాల బదలాయింపుపై ఏఎం నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో సెబీ నిర్దేశించిన పది శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల అమలు కోసం 2013లో అప్పటి ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఐఎఫ్ ఏర్పాటు చేసింది. అప్పట్లో ఖాయిలాపడిన ఆరు సంస్థలు.. ఫ్యాక్ట్, హిందుస్తాన్ ఫొటో ఫిలిమ్స్ మాన్యుఫాక్చరింగ్, హెచ్ఎంటీ, స్కూటర్స్ ఇండియా, ఆండ్రూ యూల్ అండ్ కంపెనీ, ఐటీఐల్లో 10 శాతం వాటాలను ఎస్‌ఎన్‌ఐఎఫ్‌కు బదలాయించింది. తాజాగా కొత్త నిబంధనలకు డెడ్‌లైన్ దగ్గరపడుతుండటంతో మరికొన్ని సంస్థల్లో మరిన్ని వాటాలను దీనికి బదలాయించాలని యోచిస్తోంది. స్వతంత్ర ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ నిర్వహణలో ఎస్‌ఎన్‌ఐఎఫ్ ఉంటుంది. ఇందులోకి బదిలీ అయిన షేర్లను అయిదేళ్ల వ్యవధిలోగా విక్రయించాల్సి ఉంటుంది. తద్వారా వచ్చిన నిధులను సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వినియోగిస్తుంది. -
ఖాయిలా పీఎస్‌యూల మూసివేత వేగవంతం
న్యూఢిల్లీ: ఖాయిలాపడిన, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) మూసివేతకు, వాటి స్థిర.. చరాస్తుల విక్రయానికి నిర్దిష్ట కాలవ్యవధులు నిర్దేశించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను బుధవారం ఆమోదించింది. నష్టాల్లోని పీఎస్‌యూల మూసివేత ప్రణాళికల అమల్లో జాప్యాన్ని తగ్గించేందుకు ఇవి తోడ్పడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. మార్గదర్శకాల ప్రకారం మూతబడే పీఎస్‌యూల స్థలాల వినియోగానికి సంబంధించి ముందుగా అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం లభిస్తుంది. అలాగే, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రస్తుతం ఏ పేస్కేల్‌లో ఉన్నప్పటికీ... 2007 నాటి నోషనల్ పే స్కేల్ ఆధారంగా సిబ్బంది అందరికీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం వర్తింపచేసేలా ప్రభుత్వం ఏకీకృత విధానం రూపొందించింది. -
అత్యంత లాభదాయక పీఎస్‌యూ ఐవోసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోకెల్లా (పీఎస్‌యూ) అత్యంత లాభసాటి కంపెనీగా చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అగ్రస్థానంలో నిల్చింది. దీంతో ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీని అధిగమించి వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిల్చినట్లయింది. టర్నోవరుపరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఉంటున్న ఐవోసీ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 21,346 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఓఎన్జీసీ రికార్డు లాభాలతో చాన్నాళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఒక దశలో ప్రభుత్వ రంగానికి చెందిన మొత్తం మూడు చమురు మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) నికర లాభాలన్నింటినీ మించిన స్థాయిలో ఓఎన్జీసీ లాభాలు ఉండేవి. కానీ మూడేళ్ల క్రితం అత్యంత లాభసాటి కంపెనీ హోదాను రిలయన్స్, టీసీఎస్లకు సమర్పించుకుంది. వరుసగా మూడోసారి రిలయన్స్.. ఇక దేశీయంగా అన్ని కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ సంస్థ ఏకంగా రూ. 36,075 కోట్ల నికర లాభం ప్రకటించింది. అటు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. రూ. 25,880 కోట్ల నికర లాభంతో దేశంలో అత్యంత లాభదాయక కంపెనీల జాబితాలో రెండో స్థానంలో నిల్చింది. -
పీఎస్‌యూల్లో ఓపెన్, దూరవిద్య డిగ్రీలకు ఓకే
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీలో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీచేసే ఓపెన్, దూరవిద్య డిగ్రీలు, డిప్లొమాలను అంగీకరించాలని కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ)ను ఆదేశించింది. ఓపెన్, దూరవిద్య విధానంలో పొందిన డిగ్రీలు, డిప్లొమాలను పీఎస్‌యూలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి సుబ్రమణ్యం ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల విభాగం కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖపై సదరు విభాగం స్పందిస్తూ... పీఎస్‌యూల్లో బోర్డు కంటే తక్కువస్థాయి ఉద్యోగాల భర్తీని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంట్రప్రైజెస్(సీపీఎస్ఈ) చేపడతాయని పేర్కొంది. -
భారీ నష్టాల పీఎస్‌యూల్లో ఎయిరిండియా, బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా మెరుగైన పనితీరు కనపర్చాయి. అత్యధిక లాభాలు ఆర్జించిన టాప్ 3 సంస్థలుగా నిల్చాయి. మరోవైపు బీఎస్ఎన్ఎల్, ఎయిరిండియా, ఎంటీఎన్ఎల్ మాత్రం భారీ నష్టాలతో అధ్వాన్న పనితీరు చూపాయి. 2016–17 ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) పనితీరుపై కేంద్రం నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మంగళవారం దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సర్వే నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం నష్టాలు నమోదు చేసిన 82 కంపెనీల మొత్తం నష్టాల్లో టాప్ 10 సంస్థల వాటా ఏకంగా 84 శాతం మేర ఉంది. ఇక ఈ టాప్ 10 సీపీఎస్ఈల నష్టాల్లోనూ బీఎస్ఎన్ఎల్, ఎయిరిండియా, ఎంటీఎన్ఎల్ వాటానే 56 శాతంగా ఉంది. లాభాల్లోకి హెచ్‌పీసీఎల్, ఎంఆర్‌పీఎల్.. 2016–17లో అత్యధికంగా లాభాలు ఆర్జించిన అగ్రశ్రేణి 10 కంపెనీల మొత్తం లాభాల్లో ఇండియన్ ఆయిల్ వాటా సుమారు 20 శాతం, ఓఎన్జీసీ 18 శాతం, కోల్ ఇండియా వాటా సుమారు 15 శాతం ఉంది. టాప్ 10 లాభసాటి సీపీఎస్ఈల జాబితాలో కొత్తగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) వచ్చి చేరాయి. అయితే, హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రం లిస్టులో స్థానం కోల్పోయాయి. 174 లాభసాటి సీపీఎస్ఈల మొత్తం లాభాల్లో టాప్ 10 కంపెనీల లాభాల వాటా సుమారు 64 శాతంగా ఉంది. 2015–16లో నష్టాలు నమోదు చేసిన హిందుస్తాన్ కేబుల్స్, భెల్, ఓఎన్జీసీ విదేశ్ సంస్థలు మళ్లీ గత ఆర్థిక సంవత్సరంలో లాభాల్లోకి మళ్లాయి. అయితే వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, ఎస్టీఎస్ఎల్, ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ తదితర సంస్థలు టాప్ 10 నష్టాల సీపీఎస్ఈల జాబితాలో చేరాయి. 2016– 17లో మొత్తం 257 పీఎస్‌యూల నికర లాభం రూ. 1,27,602 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ. 1,14,239 కోట్లతో పోలిస్తే 11.7 శాతం వృద్ధి నమోదైంది. -
బ్యాంకుల బంద్; సేవలు నిల్!
ముగిసిన పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల ఒకరోజు సమ్మె న్యూఢిల్లీ: ఉద్యోగుల సమ్మెతో మంగళవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేటు బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. నగదు బదిలీలు, చెక్కుల క్లియరెన్స్, నగదు జమలు, ఉపంసహరణలు తదితర సేవలకు అంతరాయం కలిగింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మాదాబాద్, బెంగళూరు, పాట్నా, చెన్నై, పుణె, జైపూర్ తదితర నగరాల్లో సమ్మె ప్రభావం పూర్తిగా కనిపించింది. ముఖ్యంగా ఏటీఎంలలో నగదు లేక జనం ఇబ్బందులు పడ్డారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల్లో మాత్రం సేవలు యథావిధిగా కొనసాగాయి. బ్యాంకుల విలీనాలు సహా పలు అంశాలపై వివిధ బ్యాంకు ఉద్యోగుల ఉమ్మడి సంఘమైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం దీనిపై మాట్లాడుతూ... ‘‘మరింతగా బ్యాంకు సేవల అవసరం ఉన్న ఈ సమయంలో బ్యాంకుల స్థిరీకరణ, బ్యాంకుల విలీనాల గురించి ప్రభుత్వం మాట్లాడుతోంది. బ్యాంకుల విలీనాలతో బ్యాంకు శాఖలు మూతపడతాయి. అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న ఎస్బీఐ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయడం వల్ల రిస్క్ కూడా పెరుగుతుంది’’ అని ప్రభుత్వ తీరును విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల గ్రాట్యుటీని తక్షణమే రూ.20 లక్షలకు పెంచాలని ఆల్ ఇండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఫ్రాంకో డిమాండ్ చేశారు. -
ఐపీఓకు ఆరు పీఎస్‌యూలు
► అన్నీ లాభాల్లో నడుస్తున్నవే ► ఆరులో నాలుగు రక్షణ రంగానివి ► మర్చంట్ బ్యాంకులకు ఆహ్వానం లిస్ట్ కానున్న పీఎస్‌యూలు ఇవే.. ♦ ఎంఎస్టీసీ ♦ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ♦ భారత్ డైనమిక్స్ ♦ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ ♦ మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ ♦ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ న్యూఢిల్లీ: స్టాక్మార్కెట్లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థలను లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్)లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఆరు పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆరు పీఎస్‌యూలు– ఎంఎస్టీసీ, నెప్‌కో, భారత్ డైనమిక్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్– లాభాలార్జిస్తున్న పీఎస్‌యూలు కావడం విశేషం. ఈ ఆరు పీఎస్‌యూల్లో నాలుగు రక్షణ రంగానికి చెందినవి ఉన్నాయి. మర్చంట్ బ్యాంకర్ల కోసం అన్వేషణ... ఈ ఆరు కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్)లకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించే, న్యాయ సలహా ఇచ్చే సంస్థలను ఎంపిక చేసే ప్రయత్నాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ప్రారంభించింది. ఆసక్తి గల సంస్థలు వచ్చే నెల 2లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఆరు పీఎస్‌యూల్లో కేంద్ర ప్రభుత్వానికి వంద శాతం వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ.46,500 కోట్లు, వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంఎస్టీసీ ఈ మినీరత్న పీఎస్‌యూ ఉక్కు శాఖ అధీనంలో ఉంది. ఈ ట్రేడింగ్ కంపెనీ ఉక్కు, పెట్రో కెమికల్ రంగాలకు ముడి పదార్థాల తోడ్పాటునందిస్తోంది. ఈ–కామర్స్ సేవలను కూడా అందిస్తోంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి కంపెనీ అధీకృత వాటా మూలధనం రూ.50 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.60 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ నెట్‌వర్త్ రూ.732 కోట్లు. నెప్‌కో నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(నెప్‌కో) కూడా మినీ రత్న పీఎస్‌యూనే. విద్యుత్తు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ఈ కంపెనీ జల, బొగ్గు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5,220 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఈశాన్య రాష్ట్రాల విద్యుత్తు అవసరాల్లో 40% ఈ సంస్థే తీరుస్తోంది. కంపెనీ అధీకృత వాటా మూలధనం రూ.5,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.373 కోట్ల నికర లాభం ఆర్జించింది. నెట్‌వర్త్ రూ.5,988 కోట్లు. భారత్ డైనమిక్స్ ఇది కూడా మినీ రత్న పీఎస్‌యూనే. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1970లో స్థాపితమైన ఈ కంపెనీ గైడెడ్ మిస్సైళ్లను, ఇతర రక్షణ రంగ సంబంధిత పరికరాలను తయారు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 31నాటికి కంపెనీ అధీకృత వాటా మూలధనం రూ.125 కోట్లుగా, చెల్లించిన ఈక్విటీ మూలధనం రూ.122 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.563 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ నెట్‌వర్త్ రూ.1,652 కోట్లు. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ కంపెనీ కూడా రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1934లో ప్రారంభమైన ఈ కంపెనీని 1960లో ప్రభుత్వం టేకోవర్ చేసింది. యుద్ధనౌకలు, నావికా దళం, తీరప్రాంత గస్తీ దళాలకు అవసరమైన నౌకలను తయారు చేస్తోంది. ఈ కంపెనీ అధీకృత మూలధనం రూ.125 కోట్లుగా, చెల్లించిన ఈక్విటీ మూలధనం రూ.124 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.161 కోట్ల నికర లాభం సాధించింది. కంపెనీ నెట్‌వర్త్ రూ.1,064 కోట్లు. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ ఈ కంపెనీ కూడా మినీరత్న పీఎస్‌యూనే. దేశపు వ్యూహాత్మక అవసరాలను తీరుస్తోంది. మూడు భారీ యుద్ధ నౌకలను, ఒక జలాంతర్గామిని నిర్మిస్తోంది. 1934లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్రారంభమైన ఈ కంపెనీని కేంద్రప్రభుత్వం 1960లో టేకోవర్ చేసింది. ఈ ఏడాది మార్చి 31నాటికి ఈ కంపెనీ అధీకృత మూలధనం రూ.324 కోట్లుగా, చెల్లించిన ఈక్విటీ మూలధనం రూ.249 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.249 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ నెట్‌వర్త్ రూ.2,846 కోట్లు. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) రక్షణ రంగ అధీనంలోని ఈ కంపెనీ లోహాలు, మిశ్రమ లోహాలను తయారు చేస్తోంది. దిగుమతి చేసుకుంటున్న లోహాలు, మిశ్ర లోహాలకు ప్రత్యామ్నాయాలను అందించడానికి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, లోహాల విషయమై స్వావలంబన సాధించడానికి ఈ కంపెనీని స్థాపించారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి కంపెనీ అధీకృత మూలధనం రూ.200 కోట్లుగా, చెల్లించిన మూలధనం రూ.187 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.118 కోట్ల నికర లాభం ఆర్జించింది. నెట్‌వర్త్ రూ.577 కోట్లుగా ఉంది. -
గతవారం బిజినెస్
నియామకాలు దేశీ అతిపెద్ద వాణిజ్య సంస్థ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐఓసీ) చైర్మన్‌గా సంజీవ్ సింగ్ నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఈయన ఐఓసీలో రిఫైనరీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా సంజీవ్ సింగ్ జూన్ 1 లేదా తదనంతరం పదవీ బాధ్యతలు చేపడతారు. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్మన్‌గా అజయ్ త్యాగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తొమ్మిదవ చైర్మన్‌గా త్యాగి వ్యవహరించనున్నారు. మెగా చమురు పీఎస్‌యూ వచ్చేస్తోంది! అంతర్జాతీయ స్థాయిలో మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం త్వరలోనే సాకారం కాబోతోంది. చమురుగ్యాస్ ఉత్పత్తిలో అగ్రగామి ఓఎన్జీసీ.. చమురు మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ.44,000 కోట్లు (6.6 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రానికి హెచ్పీసీఎల్లో 51.11 శాతం వాటా ఉంది. ఒప్పందంలో భాగంగా దీన్ని ఓఎన్జీసీ కొనుగోలు చేయనుంది. అయితే, సెబీ నిబంధనల ప్రకారం ఇతర హెచ్‌పీసీఎల్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు.. డిజిటలైజ్! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తన ఏజెంట్లకు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను అందించాలని భావిస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న ఎల్ఐసీ ఏజెంట్లు సంవత్సరానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ప్రీమియం కలెక్ట్ చేస్తున్నారు. ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వ్యూహంలో భాగంగా ఎల్ఐసీ తొలిగా 1.5 లక్షల మంది ఏజెంట్లకు పీవోఎస్ మెషీన్లను అందించనుంది. దీంతో ప్రీమియం వసూళ్లు డిజిటలైజ్ కానున్నవి’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. భారత్‌కు నోకియా ఫోన్లు ఐకానిక్ ‘నోకియా–3310’ మళ్లీ భారత్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది వచ్చే త్రైమాసికంలో భారతీయులకు అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్కు సంబంధించి నోకియాతో పదేళ్ల వరకు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్లను భారత్‌లో విక్రయించనుంది. ఇది నోకియా–3310 ఫోన్‌తోపాటు నోకియా–6, నోకియా–5, నోకియా–3 వంటి ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా ఆవిష్కరించింది. ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్ జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ ఎన్‌హెచ్‌పీసీ 81 కోట్ల షేర్లను (దాదాపు 7.33 శాతం వాటా) బైబ్యాక్ చేయనున్నది. ఒక్కో షేర్‌ను రూ.32.25 ధరకు బైబ్యాక్ చేస్తామని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. ఈ బైబ్యాక్ విలువ రూ.2,616 కోట్లు. గత నెల 7న జరిగిన డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో తీర్మానానికి అనుగుణంగా ఈ బైబ్యాక్ జరుగుతుందని ఎన్‌హెచ్‌పీసీ వెల్లడించింది. ఈ బైబ్యాక్ ఆఫర్‌ను ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నిర్వహిస్తుందని పేర్కొంది. లక్ష్యాన్ని దాటిన ద్రవ్యలోటు... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి ముగిసే నాటికే లక్ష్యాన్ని దాటిపోయింది. 2016–17 బడ్జెట్ ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.33 లక్షల కోట్లు కాగా, జనవరి నాటికి రూ.5.64 లక్షల కోట్లకు చేరింది. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 105.7 శాతానికి చేరినట్లయ్యింది. డొకోమోతో వివాదానికి ’టాటా’! జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో వివాదానికి టాటా గ్రూప్ ముగింపు పలకనుంది. తమ టెలికం జాయింట్ వెంచర్ సంస్థ నుంచి డొకోమో వైదొలిగే విషయంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న న్యాయ వివాదంపై కోర్టు వెలుపల సెటిల్మెంట్కు అంగీకరించినట్లు టాటా సన్స్ ప్రకటించింది. ఈ కేసులో డొకోమోకు 1.18 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7,900 కోట్లు) పరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. అంచనాలు మించిన వృద్ధి... జీడీపీ వృద్ధి రేటు మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో అంచనాలను మించింది. ఏడు శాతంగా నమోదయ్యింది. నోట్ల రద్దు ప్రకటన... సేవలు, తయారీసహా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం భయాలు... దీనితో వృద్ధి రేటు తగ్గిపోతుందన్న అంచనాల నేపథ్యంలో తాజాగా కేంద్ర గణాంకాల శాఖ ప్రకటించిన అంచనాలు ఆర్థిక విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 6.1–6.8 శాతం మధ్య వుండగలదంటూ పలు ఏజెన్సీలు వేసిన అంచనాల్ని తాజా గణాంకాలు మించడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రమోటర్ల వాటా విక్రయం! డీఎల్ఎఫ్ కంపెనీ ప్రమోటర్లు, తమ రెంటల్ విభాగంలో 40 శాతం వాటాను విక్రయించనున్నారు. తమ రెంటల్ విభాగం, డీసీసీడీఎల్ (డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్)లో 40 శాతం వాటాను సింగపూర్‌కు చెందిన జీఐసీకు ప్రమోటర్లు విక్రయించనున్నట్లు డీఎల్ఎఫ్ తెలిపింది. డీల్ విలువ రూ.12,000–13,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. మౌలిక రంగ ఉత్పత్తి నెమ్మది... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 37 శాతం వాటా కలిగిన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి జనవరిలో తగ్గింది. 3.4 శాతంగా ఇది నమోదయ్యింది. ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి ఇదే తొలిసారి. 2016 డిసెంబర్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి 5.6 శాతం. జనవరి 2016లో ఈ రంగాల వృద్ధిరేటు 5.7 శాతం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య చూస్తే... వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. మోబిలియో సేల్స్ నిలిపివేసిన హోండా జపాన్ కార్ల కంపెనీ హోండా తన మోబిలియో వాహన విక్రయాలను ఆపేసింది. ఈ కారుకు డిమాండ్ లేకపోవడం, కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. ఈ మోడల్లో కొత్త వేరియంట్‌ను తెచ్చేదీ లేనిదీ మరో రెండు నెలల్లో నిర్ణయిస్తామని పేర్కొంది. గత నెలలో ఒక్క కారును కూడా అమ్మలేకపోయామని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ మధ్యంతర డివిడెండ్ రూ.3 హెచ్డీఎఫ్సీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నెల 20 నుంచి డివిడెండ్ చెల్లింపులు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇంతే మొత్తం డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ క్యూ3లో ఈ కంపెనీ మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.14,989 కోట్లకు, నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.2,729 కోట్లకు పెరిగాయి. ఫిబ్రవరిలోనూ తయారీ స్పీడ్: నికాయ్ నికాయ్ మార్కెట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రకారం... తయారీ రంగం వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ మెరుగుపడింది. జనవరిలో 50.4 పాయిం ట్ల వద్ద ఉన్న సూచీ, ఫిబ్రవరిలో 50.7 పాయింట్లకు పెరిగింది. డీల్స్.. ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రావిడెన్స్ సంస్థ అమ్మేసింది. ఈ విక్రయం విలువ రూ.1,288 కోట్లని అంచనా. ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజంట్ జపాన్‌కు చెందిన బ్రిలియంట్ సర్వీసెస్ కంపెనీని కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన ఎస్పీసీ ఇంటర్నేషనల్‌లో మెజారిటీ వాటాను టీవీఎస్ లాజిస్టిక్స్‌కు చెందిన ఇంగ్లండ్ అనుబంధ కంపెనీ టీవీఎస్ రికో సప్లై చెయిన్ సర్వీసెస్ చేజిక్కించుకుంది. డీల్ విలువ రూ.165 కోట్లు. -
ఓఎన్జీసీ చేతికి హెచ్‌పీసీఎల్!
⇒ మెగా చమురు పీఎస్‌యూ వచ్చేస్తోంది! ⇒ డీల్ విలువ రూ.44,000 కోట్లుగా అంచనా... ⇒ ప్రభుత్వానికి చెందిన 51.1 శాతం వాటా ⇒ కొనుగోలుకు త్వరలో కేబినెట్ నోట్... ⇒ మరో 26 శాతం ఓపెన్ ఆఫర్‌కు అవకాశం విలీన వార్తల నేపథ్యంలో సోమవారం హెచ్‌పీసీఎల్ షేరు ధర 2% క్షీణించి రూ.560 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.56,859 కోట్లుగా ఉంది. ఇక ఓఎన్జీసీ షేరు కూడా స్వల్పంగా 0.61% నష్టంతో రూ.194 వద్ద స్థిరపడింది. దీని మార్కెట్ విలువ రూ. 2,49,543 కోట్లు. న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం త్వరలోనే సాకారం కాబోతోంది. ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థ(ఆయిల్ పీఎస్‌యూ)ల విలీనాలు చేపడతామంటూ తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చనుంది. చమురు–గ్యాస్ ఉత్పత్తిలో అగ్రగామి ఓఎన్జీసీ.. చమురు మార్కెటింగ్ కంపెనీ హెచ్పీఎసీఎల్ను కొనుగోలు చేసే అవకాశం ఉందని సోమవారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ.44,000 కోట్లు(6.6 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రానికి హెచ్పీసీఎల్లో 51.11 శాతం వాటా ఉంది. ఒప్పందంలో భాగంగా దీన్ని ఓఎన్జీసీ కొనుగోలు చేయనుంది. అయితే, సెబీ నిబంధనల ప్రకారం ఇతర హెచ్‌పీసీఎల్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీ ఓపెన్ఆఫర్ను ప్రకటించాల్సి ఉంటుంది. సిద్ధమవుతున్న కేబినెట్ నోట్... ప్రతిపాదిత విలీనానికి సంబంధించి కేబినెట్ నోట్ సిద్ధం అవుతోందని సమాచారం. అయితే, దీనికి రెండు అంచెల్లో కేబినెట్ ఆమోదం అవసరమవుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ముందుగా ఓఎన్జీసీలో తనకున్న 51.11 శాతం వాటాను విక్రయించేందుకు, ఆతర్వాత ఓఎన్జీసీ ఈ వాటా కొనుగోలు కోసం నిధులను ఖర్చుచేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. సోమవారం నాటి హెచ్‌పీసీఎల్ షేరు ధర ప్రకారం ప్రభుత్వ వాటా 51.11 శాతానికి గాను ఓఎన్జీసీ రూ.29,128 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరో 26 శాతం ఓపెన్ ఆఫర్ కోసం రూ.14,817 కోట్లు వెచ్చించాలి. మొత్తంమీద ఈ డీల్ విలువ సుమారు రూ.44,000 కోట్లుగా లెక్కతేలుతోంది. ఆప్షన్లు తక్కువే... ‘ఈ విలీనాలకు సంబంధించి ఆప్షన్లు తక్కువే. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ను ఓఎన్జీసీతో విలీనం చేయడం ఇందులో ఒకటి. ఐఓసీ, ఆయిల్ ఇండియాలను కలిపేయడం రెండో ఆప్షన్. అయితే, దీనివల్ల చమురు మార్కెటింగ్ రంగంలో రెండే కంపెనీలు ఉన్నట్లవుతుంది. కస్టమర్లకు ఇంధనం కొనుగోలులో చాయిస్ ఉండదు. అందుకే హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్జీసీతో విలీనం చేసి.. బీపీసీఎల్‌ను ప్రత్యేకంగానే కొనసాగించడం మంచిది. బీపీసీఎల్ అనుబంధ సంస్థ భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్‌ను పటిష్టం చేసే వీలుంటుంది. ఈ ప్రణాళిక ప్రకారమైతే ఐఓసీ, ఓఎన్జీసీ–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఇలా 3 చమురు రిటైలర్ల సేవలు లభిస్తాయి’ అని సంబంధిత ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. మూడో అతిపెద్ద రిఫైనరీగా... హెచ్‌పీసీఎల్‌ను విలీనం చేసుకోవడం ద్వారా ఓఎన్జీసీకి 23.8 మిలియన్ టన్నుల వార్షిక చమురు రిఫైనింగ్ సామర్థ్యం జతవుతుంది. దీనిద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), ఐఓసీ తర్వాత దేశంలో మూడో అతిపెద్ద రిఫైనరీగా ఓఎన్జీసీ–హెచ్‌పీసీఎల్ అవతరిస్తుంది. దేశంలో చమురు–గ్యాస్ రంగంలో ప్రస్తుతం ప్రధానంగా ఆరు పీఎస్‌యూలు ఉన్నాయి. ఇందులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లు చమురు ఉత్పత్తిని చేపడుతున్నాయి. ఇండియన్ ఆయిల్(ఐఓసీ), హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్)లు పెట్రోఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఉన్నాయి. ఇక గెయిల్ గ్యాస్ రవాణా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇవికాకుండా ఓఎన్జీసీ విదేశ్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్(సీపీసీఎల్), నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ(ఎంఆర్‌పీఎల్)లు కూడా ఉన్నాయి. ఇవి ప్రధాన చమురు పీఎస్‌యూలకు అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఎంఆర్పీఎల్లో మెజారిటీ వాటా ఇప్పటికే ఓఎన్జీసీ చేతిలో ఉంది. ఎంఆర్‌పీఎల్ రిఫైరింగ్ సామర్థ్యం 15 మిలియన్ టన్నులు. ఈ డీల్‌ద్వారా విదేశీ చమురు–గ్యాస్ నిక్షేపాలు, ఆస్తుల కొనుగోలు విషయంలో ప్రపంచ దిగ్గజాలతో పోటీపడేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కూడా తట్టుకోవడానికి వీలవుతుందనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద చమురు–గ్యాస్ ఉత్పత్తి సంస్థగా, అత్యధిక లాభాలను నమోచేస్తున్న కంపెనీగా ఓఎన్జీసీ నిలుస్తోంది. 12 ఏళ్ల క్రితమే బీజం... వాస్తవానికి పీఎస్‌యూ ఆయిల్ కంపెనీల విలీనాలకు 12 ఏళ్ల క్రితం బీజం పడింది. అప్పటి యూపీఏ సర్కారు హయాంలో పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న మణిశంకర్ అయ్యర్ ఈ ప్రతిపాదనను 2004లో తెరపైకి తీసుకొచ్చారు. దీనిప్రకారం.. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లను ఓఎన్జీసీతో విలీనం చేయడం... ఓఐఎల్‌ను ఐఓసీలో కలిపేసే ప్రణాళికలను రూపొందించారు. అదేవిధంగా ఆయిల్ పీఎస్‌యూల అనుబంధ సంస్థల్లో కోచి రిఫైనరీని బీపీసీఎల్‌తో, చెన్నై పెట్రోలియంను ఐఓసీతో విలీనం చేయాలని కూడా భావించారు. అయితే, 2015 సెప్టెంబర్‌లో ఒక అత్యున్నత స్థాయి కమిటీ మాత్రం ఈ ప్రతిపాదనలకు మొగ్గుచూపలేదు. దీనికిబదులు చమురు పీఎస్‌యూల్లోని ప్రభుత్వ వాటాలను ఒక ప్రొఫెషనల్ ట్రస్ట్‌కు బదలాయింది... వాటికి మరింత స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలని సూచించింది. అయితే, మోదీ సర్కారు మాత్రం విలీనాలకే సై అంది. పీఎస్‌యూ ఆయిల్ కంపెనీలను విలీనం చేసి ప్రపంచ స్థాయి మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పే ప్రతిపాదనను 2017–18 బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. -
లాభదాయక పీఎస్‌యూల లిస్టింగ్
• నిర్దిష్ట గడువులోగా పూర్తి • ‘దీపం’ కార్యదర్శి నీరజ్ గుప్తా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికను రూపొందిస్తోంది. గత ఎనిమిదేళ్లలో కేవలం ఆరు పీఎస్‌యూలు మాత్రమే లిస్టింగ్ కావడం దీనికి ప్రధాన కారణం. దీంతో నిర్దిష్ట కాలావ్యవధిలోగా లాభాల్లో ఉన్న అన్ని పీఎస్‌యూల(భారీ, మధ్య స్థాయి సంస్థలు) పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ)ను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి నీరజ్ గుప్తా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ముఖ్యంగా పీఎస్‌యూల కార్యకలాపాల్లో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసమే లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లన్నీ లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా మూడేళ్ల ఆడిటెడ్ అకౌంట్లు, తగినంత మంది స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన పూర్తిస్థాయి బోర్డులను అమల్లోకి తీసుకురావడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, ఎంతకాలంలో దీన్ని పూర్తిచేస్తారనేది గుప్తా వెల్లడించలేదు. దీపంలో మరో సీనియర్ అధికారి మాత్రం గరిష్టంగా మూడేళ్లలో లాభాల్లో ఉన్న సీపీఎస్ఈల లిస్టింగ్ ప్రక్రియను ముగించాల్సిందేనని పేర్కొనడం గమనార్హం. డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం పేరును మోదీ సర్కారు ‘దీపం’గా మార్చిన సంగతి తెలిసిందే. కాగా, 2017–18 బడ్జెట్లో సీపీఎస్ఈల లిస్టింగ్‌కు సబంధించి స్పష్టంగా దిశానిర్ధేశం చేసిన విషయాన్ని గుప్తా ప్రస్తావించారు. చిన్న కంపెనీల లిస్టింగ్ అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ‘2009 నుంచి ఇప్పటివరకూ కేవలం ఆరు పీఎస్‌యూలు మాత్రమే లిస్టయ్యాయి. ఇందులో 2009 లో రెండు, 2010లో మూడు, 2012లో ఒకటి చొప్పున ఉన్నాయి. ఇక 2012లో నాలుగు కంపెనీలకు అనుమతి లభించినప్పటికీ.. ఇప్పటిదాకా ముందడుగు పడలేదు. 2014–16 మధ్య అసలు ఒక్క పీఎస్‌యూ కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాలేదు. అందుకే ఈ ప్రక్రియ కోసం ఒక కచ్చితమైన కార్యాచరణ అవసరం’ అని గుప్తా తేల్చిచెప్పారు. -
పీఎస్‌యూ ఆయిల్ సంస్థలకు కొత్త అన్వేషణా క్షేత్రాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, సన్ ఫార్మా డైరెక్టర్లు ఏర్పాటు చేసిన కొత్త కంపెనీ సన్ పెట్రోకెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్ తదితర కంపెనీలకు ప్రభుత తాజా వేలంలో చిన్న స్థాయి ఆయిల్, గ్యాస్ అన్వేషణా క్షేత్రాలు దక్కాయి. మొత్తం 46 క్షేత్రాలకుగాను ప్రభుత్వం గతేడాది వేలం నిర్వహించింది. 34 క్షేత్రాలకు బిడ్లు రాగా.... ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ వీటిలో 31 క్షేత్రాల బిడ్లను ఖరారు చేసి కాంట్రాక్టులకు కట్టబెట్టింది. బీపీసీఎల్‌కు చెందిన భారత్ పెట్రో రీసోర్సెస్ లిమిటెడ్‌కు 4, హెచ్‌పీసీఎల్ సబ్సిడరీ ప్రైజ్ పెట్రోలియంకు 3, ఐవోసీకి 3, సన్ పెట్రోకెమికల్స్‌కు ఒకటి దక్కాయి. నిప్పన్ పవర్, హార్డీ ఎక్స్‌ప్లోరేషన్, అదానీ వెల్స్పన్ తదితర కంపెనీలకు మిగిలినవి లభించాయి. -
డిజిన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయాధికారం...ఇక మంత్రుల చేతికి..!
• ప్రత్యామ్నాయ యంత్రాంగానికి కేబినెట్ ఆమోదముద్ర... • కమిటీలో ఆర్థిక, రవాణా, పీఎస్‌యూలకు చెందిన మంత్రులకు చోటు • 5 ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీల్లో వాటా అమ్మకానికి సై న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్) జోరు పెంచేందుకు మోదీ సర్కారు కొత్త విధానానికి తెరతీసింది. వాటా అమ్మకాలకు సంబంధించిన అధికారాలన్నీ మంత్రుల బృందానికి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) బుధవారం ఆమోదముద్ర వేసింది. డిజిన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయాలు తీసుకునే ఈ మంత్రుల బృందంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, సంబంధిత పీఎస్‌యూలకు సంబంధించిన మంత్రులు ఉంటారు. ఏదైనా సీపీఎస్యూలో వాటా విక్రయానికి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత.. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియపై నిర్ణయాలన్నీ మంత్రుల బృందమే తీసుకుంటుంది. వాటా విక్రయించే తేదీ, షేరు ధర ఖరారు, ఎన్నిదశల్లో వాటా విక్రయించాలి ఇతరత్రా అంశాలన్నీ నిర్ణయిస్తుంది. ‘నిర్దిష్ట సీపీఎస్యూలో ప్రభుత్వ వాటా 51 శాతానికి తగ్గకుండా, యాజమాన్య నియంత్రణను సర్కారు చేతిలో ఉండేవిధంగానే వాటా విక్రయాలు జరుగుతాయి. దీనిప్రకారం ఆయా సంస్థల్లో ఎంత వాటా విక్రయించాలనేది ఇకపై ప్రత్యామ్నాయ యంత్రాంగమే నిర్ణయిస్తుంది’ అని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. జాప్యాలు, ఊహాగానాలను తగ్గించేందుకే... డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో జాప్యాలు, విధానపరమైన అంశాలపై ఊహాగానాలను తగ్గించడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ప్రస్తుత 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.56,500 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.36,500 కోట్లను మైనారిటీ వాటా అమ్మకాల రూపంలో.. మిగతా రూ.28,000 కోట్లను వ్యూహాత్మక విక్రయాల ద్వారా సమీకరంచాలనేది ప్రభుత్వ ప్రణాళిక. కాగా, ఆర్థిక సంవత్సరం మరో రెండున్నర నెలల్లో ముగియనుండగా... ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ.23,500 కోట్ల నిధులను మాత్రమే సమీకరించగలిగింది. లిస్టింగ్ బాటలో సాధారణ బీమా కంపెనీలు... ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల్లో వాటా అమ్మకానికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రతిపాదనకు కేబినెట్ లైన్‌క్లియర్ చేసింది. ఈ రంగంలో ఉన్న మొత్తం ఐదు ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ‘తాజా ఈక్విటీ జారీ లేదా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వాటా విక్రయం ఉండొచ్చు. ఈ కంపెనీల్లో ప్రభుత్వ వాటాను ఇప్పుడున్న 100 శాతం నుంచి దశలవారీగా 75 శాతానికి తీసుకురావడమే మా లక్ష్యం’ అని కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో చెప్పారు. వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వ మూలధన నిధులపై ఆధారపడటాన్ని తగ్గించి... స్టాక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణను ప్రోత్సహించడం, కార్పొరేట్ నైతిక నియమావళిని మెరుగుపచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం వాటా విక్రయానికి ఓకే చెప్పిన పీఎస్‌యూ సాధారణ బీమా కంపెనీల్లో... న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(జీఐసీ)ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 52 బీమా కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో 24 జీవిత బీమా వ్యాపారంలో, 28 కంపెనీలు సాధారణ బీమా రంగంలో ఉన్నాయి. కాగా, భారతీయ జాయింట్ వెంచర్లలో విదేశీ బీమా కంపెనీల వాటా(ఎఫ్‌డీఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఇప్పటికే మోదీ సర్కారు ఆమోదం తెలిపింది. ‘ఎలక్ట్రానిక్స్’కు రాయితీల పరిమితి రూ.10,000 కోట్లు న్యూఢిల్లీ: దేశీయంగా నెలకొల్పే ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లకు రాయితీల పరిమితిని రూ.10,000 కోట్లుగా కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు ప్రత్యేక రాయితీ ప్యాకేజీ పథకం(ఎంఎస్ఐపీఎస్)లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఈ స్కీం కింద కొత్త కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలకు దరఖాస్తుల అనుమతి గడువును ఏడాదిన్నరపాటు కుదించారు. ‘ఎంఎస్ఐపీఎస్ స్కీమ్‌లో సవరణ ప్రకారం ఇకపై ప్రతిపాదనలను 2018 డిసెంబర్ వరకూ అనుమతించనున్నాం. అదేవిధంగా ప్రోత్సాహకాల పరిమితి రూ.10,000 కోట్లుగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటివరకూ స్కీమ్‌లో దరఖాస్తులకు వీలుంటుంది’ అని కేబినెట్ సమావేశం అనంతరం ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు చెప్పారు. ఒకవేళ పెట్టుబడి బిలియన్ డాలర్ల కంటే అధికంగా ఉంటే దానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ ఆమోదం తెలుపుతుందని ఆయన వెల్లడించారు. 2015 ఆగస్టులో ఈ స్కీమ్‌కు సవరణ చేస్తూ 2020 జూలై 27 వరకూ పొడించారు. చిన్న సంస్థలకు ప్యాకేజీ... దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు చేయూతనిచ్చేందుకు కేంద్రం ఒక ప్యాకేజీని ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థలకు నిధుల కల్పన కోసం క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ కింద మూలనిధి(కార్పస్)ని పెంచేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. దీనిప్రకారం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌లో రుణాలను రెట్టింపు చేయనున్నారు. ఇప్పటివరకూ రూ. కోటి వరకూ రుణాలిస్తుండగా.. ఇకపై రూ.2 కోట్ల వరకూ లభిస్తుంది. తాజా నిర్ణయంతో కార్పస్ ఇప్పుడున్న రూ.2,500 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెరగనుంది. దీనికి నిదులను కేంద్రమే సమకూర్చుతుంది. ఎఫ్‌సీఐకి రూ.45,000 కోట్ల ఎన్ఎస్ఎస్ఎఫ్ రుణం... ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)కి జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి(ఎన్ఎస్ఎస్ఎఫ్) నుంచి రూ.45,000 కోట్ల రుణం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆహార సబ్సిడీ అవసరాల కోసం ఎఫ్‌సీఐ ఈ నిధులను ఉపయోగించుకోనుంది. కాగా, 4 రాష్ట్రాలు(అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాలకు ఎన్ఎస్ఎస్ఎఫ్ రుణాల నుంచి మినహాయింపునిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
‘వ్యూహాత్మక’ విక్రయానికి ఓకే
పీఎస్యూలపై కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మెజారిటీ వాటాల (వ్యూహాత్మక) విక్రయానికి తిరిగి కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో గురువారం ఇక్కడ సమావేశమైన కేబినెట్ ఇందుకు ఆమోదముద్ర వేసింది. సమావేశం తరువాత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు ఈ విషయం తెలిపారు. లాభాల్లో ఉన్న సంస్థల్లో వాటాల విక్రయాలు కూడా ఉంటాయని ఇప్పటికే ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వాటాల విక్రయాలకు సిద్ధమవుతున్న కంపెనీలు ఏమిటన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘ఆయా సంస్థల వాటాల్ని వేలంలో ఉంచినప్పుడే ఈ విషయం వెల్లడవుతుంది’ అని అన్నారు. విక్రయాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులు అన్నింటినీ కేబినెట్ పరిశీలించిందని పేర్కొన్నారు. వాటాల అమ్మకానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని కూడా తెలిపారు. పెట్టుబడుల ఉపంసంహరణల విభాగం, ఆయా మంత్రిత్వశాఖలు పరిశీలించిన తర్వాత, వాటాల విక్రయాలకు సంబంధించి కంపెనీ వ్యవహారాలను వేర్వేరుగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాటాల విక్రయాలకు ధర మదింపు గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘ఒక నిర్దిష్ట పక్రియలో ఇది ఉంటుంది. ఇక్కడ పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది’ అని అన్నారు. రేటు నిర్ణయానికి సూత్రాలు ఖరారు! విక్రయించాల్సిన ధర విషయంపై ఐదు విధానాలు రూపొందాయి. ఆయా రంగాల్లో సమాన హోదాలో ఉన్న ఇతర కంపెనీలకు సంబంధించిన ధర, క్యాష్ ఫ్లో బ్యాలెన్స్ షీట్, అసెట్ విలువ, వ్యాపార లావాదేవీ విలువల వంటివి వీటిలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక వాటాల విక్రయాలకు వివిధ రంగాల్లోని 12 కంపెనీలను గుర్తించినట్లు సమాచారం. పన్నెండేళ్ల తరువాత.. దాదాపు పన్నెండేళ్ల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. వ్యూహాత్మక వాటాలను ప్రైవేటు కంపెనీలకు విక్రయించడం ద్వారా నిధుల సమీకరణే కాకుండా ఆయా సంస్థల పనితీరు విషయంలో అత్యున్నత స్థాయి సామర్థ్యం, వ్యాపారతత్వం, పారదర్శకత తీసుకుని రావాలన్నది కేంద్రం లక్ష్యం. నీతి ఆయోగ్ చేసిన సిఫారసుల మేరకు ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) ఇప్పటికే వ్యూహాత్మక డిజిన్వెస్ట్మెంట్కు ఒక నమూనాను ఖరారు చేసిందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మొత్తంమీద తాజా జాబితాలో లాభదాయక భారత్ ఎర్త్ మూవర్స్ అండ్ సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్‌తో పాటు, నష్టాల్లో ఉన్న స్కూటర్స్ ఇండియా కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 బడ్జెట్ ప్రసంగంలో వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20,500 కోట్ల సమీకరణలను లక్ష్యంగా నిర్దేశించారు. 2003-04లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జెసాప్ అండ్ కోలో చివరిసారి వ్యూహాత్మక వాటా విక్రయాలను చేపట్టింది. 1999-2000లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తొలి మెజారిటీ వాటా విక్రయాలు జరగడం గమనార్హం. 1999-2000, 2003-04 మధ్యకాలంలో ప్రభుత్వం 16 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.6,344 కోట్లు సమీకరించింది. వీటిలో పెట్రో రిటైలర్ ఐబీపీ లిమిటెడ్, ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్, వీఎస్ఎన్ఎల్, హిందుస్తాన్ జింక్ వంటి సంస్థలు ఉన్నాయి. -
పిలుస్తున్నాయి పీఎస్‌యూ'లు!
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మంచి వేతనం ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లో ఉద్యోగం చేజిక్కించుకోవాలని ఆకాంక్షిస్తారు. ఇలాంటి వారికిగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)మంచి మార్గం. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎస్సీ తదితర సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వరంగ యూనిట్లలో ఉద్యోగాలకు కూడా గేట్ స్కోర్ ప్రామాణికంగా మారింది. దీంతో ఈ పరీక్షకు ప్రాధాన్యం పెరిగింది. గేట్-2017 స్కోర్ ఆధారంగా వివిధ పీఎస్‌యూలు నియామకాలకు శ్రీకారం చుట్టాయి.ఈ క్రమంలో ప్రత్యేక కథనం.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మహారత్న కంపెనీలు (భెల్, గెయిల్, ఎన్టీపీసీ..), నవరత్న కంపెనీలు (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్..), మినీరత్న కంపెనీలు (బార్క్, ఏఏఐ..) కార్పొరేట్ సంస్థలతో పోటీగా ఆకర్షణీయమైన వేతనాలు, సౌకర్యాలతో నియామకాలు చేపడుతున్నాయి. అభ్యర్థులు తాము ఇంజనీరింగ్‌లో చదువుతున్న కోర్ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలోనే పనిచేసే అవకాశంతోపాటు, సంతృప్తినిచ్చే పని సంస్కృతిని పీఎస్‌యూలు అందిస్తున్నాయి. గ్రూప్-ఎ స్థాయి పోస్టులైన సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ఎఫ్ఐ (టెలీ), సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (క్రిప్టో), ఎస్ఆర్వో (ఎస్ అండ్ టీ) నియామకాలకు కూడా గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్.. జేటీవోల భర్తీకి కూడా గేట్‌ను ఆధారంగా చేసుకుంటోంది. గేట్-2017 ద్వారా 35-40 పీఎస్‌యూలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. గేట్లో జనరల్ కేటగిరీలో 500-1000 లోపు ర్యాంకు సాధిస్తే తదుపరి దశకు ఏదో ఒక సంస్థ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్కోర్ సాధించడానికి ప్రయత్నించాలి. రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వార్షిక వేతనం అందించే పీఎస్‌యూల్లో మేనేజ్మెంట్ ట్రెయినీ/ఇంజనీర్ ట్రెయినీ ఉద్యోగం సంపాదించాలంటే గేట్ స్కోర్ కీలకం. తుది ఎంపికలో గేట్ స్కోర్‌కు 75%-80% వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటారు. గేట్ స్కోర్ ఆధారంగా వడపోసిన అభ్యర్థులకు పీఎస్‌యూలు రెండో దశలో గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలు, రిటెన్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. ఎంపికైనవారికి ఆకర్షణీయమైన వేతనాలతో ఆఫర్ లెటర్లు అందుతాయి. గ్రూప్ డిస్కషన్ (జీడీ) తుది ఎంపికలో గ్రూప్ డిస్కషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆయా సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను జీడీ ద్వారా పరీక్షిస్తాయి. ఇందులో అభ్యర్థులకు ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి, 10-15 నిమిషాలు చర్చించమంటారు. జీడీ ద్వారా భావ వ్యక్తీకరణ (communication), నాయకత్వ(leadership), బృంద స్ఫూర్తి (team spirit), సృజనాత్మక (ఛిట్ఛ్చ్టజీఠ్ఛి) తదితర నైపుణ్యాలను పరిశీలిస్తారు. గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ గ్రూప్ టాస్క్‌లో భాగంగా అభ్యర్థులకు ఒక టాస్క్ ఇచ్చి, దానికి సమాధానాలు కూడా ఇస్తారు. వీటి నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకొని, దాన్ని సమర్థించడానికి కారణాలు వివరించాల్సి ఉంటుంది. చివర్లో వ్యక్తిగత మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా అడిగే అంశాలు.. అభ్యర్థి స్వీయ పరిచయం, బీఈ/బీటెక్ చివరి సంవత్సర ప్రాజెక్టు, తమకు పట్టున్న సబ్జెక్టు అంశాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆయా సంస్థలకు అభ్యర్థులు తమ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ప్రాక్టికల్‌గా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలి. ఇది అభ్యర్థి శ్రద్ధ, నైతికత, పరిపక్వతలను తెలియజేస్తుంది. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా విని, సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు ఒకట్రెండు మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం మంచిది. గతంలో ఆయా సంస్థలకు ఎంపికైన అభ్యర్థుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సంస్థల వెబ్సైట్లను క్షుణ్నంగా పరిశీలించాలి. గేట్-2017 ద్వారా నియామకాలు జరిపే కొన్ని సంస్థలు బీఎస్ఎన్ఎల్ (జేటీవో) ఉద్యోగం: జూనియర్ టెలికం ఆఫీసర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, సివిల్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఖాళీలు: 2510 దరఖాస్తు: 2017, జనవరి 1- జనవరి 31 వెబ్సైట్: www.externalexam.bsnl.co.in (2016, డిసెంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటుంది.) బీపీసీఎల్ ఉద్యోగం: మేనేజ్మెంట్ ట్రెయినీ. విభాగాలు: మెకానికల్/కెమికల్ అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్ 2017 స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ. దరఖాస్తు: 2017, జనవరి 1- జనవరి 31 వెబ్సైట్: www.bpclcareers.in హెచ్‌పీసీఎల్ ఉద్యోగం: గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికాం. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, జీడీ, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ. దరఖాస్తు: 2017, జనవరి 10-ఫిబ్రవరి 10 వెబ్సైట్: www.hindustanpetroleum.com/ www.hpclcareers.com ఎండీఎల్ (మజగావ్ డాక్ లిమిటెడ్) ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (టెక్నికల్) విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్ అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఖాళీలు: 8. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: 2017, జనవరి 6-ఫిబ్రవరి 6 వెబ్సైట్: www.mazagondock.gov.in కేబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగం: సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్; టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్; ఫిజిక్స్/కెమిస్ట్రీ. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పీజీ. ఖాళీలు: 8. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా. వెబ్సైట్: www.cabsec.nic.in హెచ్‌పీయూ (హర్యానా పవర్ యుటిలిటీస్) ఉద్యోగం: అసిస్టెంట్ ఇంజనీర్. విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, సివిల్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్ ఆధారంగా వెబ్సైట్: www.hvpn.gov.in -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పుడు లేదు
♦ అందుకు భారత్ సిద్ధం కాలేదన్న జైట్లీ ♦ వాటి ఆర్థిక పరిపుష్టే ధ్యేయమని ఉద్ఘాటన న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల ప్రైవేటీకరణకు భారత్ సిద్ధం కాలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. వాటికి మరింత మూల దనం కేటాయించి, ఆర్థికంగా పటిష్టం చేయడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన రూ.25,000 కోట్ల నిధులు కాకుండా, అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చడానికి సిద్ధమని కూడా ఆర్థికమంత్రి అన్నారు. ఇక ఐడీబీఐ బ్యాంక్ మినహా పీఎస్‌యూ బ్యాంకుల ప్రస్తుత పాత్ర, లక్షణాలు యథాతథంగా కొనసాగుతాయని అన్నారు. ‘‘కొన్ని బ్యాంకుల విలీనానికి ప్రయత్నం జరుగుతోంది. పోటీ పూర్వక పరిస్థితుల్లో ఇది తప్పదు. ఐడీబీఐ బ్యాంక్ విషయంలో మాత్రం వాటాను 49 శాతానికి తగ్గించుకోవడంపై మదింపు జరుగుతోంది’’ అని ఇక్కడ జరిగిన భారత్ ఎకనమిస్ట్ సదస్సులో జైట్లీ అన్నారు. ఫైనాన్షియల్ విభాగంలో ప్రైవేటీకరణ ప్రక్రియ ఎందుకు జరగడం లేదన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘‘సంస్కరణలను ఒక స్థాయికి తీసుకువెళ్లే దశలో ప్రజాభిప్రాయాన్ని తగిన విధంగా మలచాల్సి ఉంటుంది. సామాజిక రంగం అభివృద్ధికి నిధుల కల్పనాంశాలపై దృష్టి సారించాలి. ఈ విభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర గణనీయమైనది. ఒకవేళ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే, ఆయా సామాజిక రంగానికి నిధుల కల్పన ఎలా అన్న అంశంపై ఏకాభిప్రాయ సాధన అవసరం. అయితే కొన్ని నిర్దిష్ట సంస్కరణలకు మాత్రం ప్రణాళిక రూపొందించాం. ఉదాహరణకు బ్యాంకుల్లో ప్రభుత్వ హోల్డింగ్‌ను 52 శాతానికి తీసుకురావడం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఇక మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తగిన విస్తృత స్థాయి చర్యలను తీసుకుంటోందని జైట్లీ అన్నారు. జీఎస్టీ అమలు తక్షణ లక్ష్యం... వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు కేంద్రం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్న జైట్లీ, దీనివల్ల పన్ను రేట్లు దిగివస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలుకు తగిన చర్యలు తీసుకుం టున్నట్లు వెల్లడించారు. -
రత్నాలుగా ఉన్నప్పుడే...పీఎస్‌యూలను అమ్మేయాల్సింది
♦ ప్రైవేటు కంపెనీలు నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఉన్నారు ♦ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రుచిర్శర్మ... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ)ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రుచిర్ శర్మ తప్పుబట్టారు. పీఎస్‌యూలను లాభసాటిగా ఉన్నప్పుడే వాటిని ప్రభుత్వం అమ్మేసి ఉండాలని అభిప్రాయపడ్డారు. అలా చేయకపోగా, ప్రైవేటు కంపెనీలు వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూసిందని విమర్శించారు. ‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నేషన్స్: టెన్ రూల్స్ ఆఫ్ చేంజ్ ఇన్ పోస్ట్ క్రైసిస్ వరల్డ్’ పేరుతో రుచిర్ శర్మ తాజాగా రాసిన పుస్తకంలో ఈ మేరకు భారత ప్రభుత్వ విధానాలను విశ్లేషించారు. ప్రైవేటీకరణ అనే అసంబద్ధ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ‘‘పీఎస్‌యూలను విక్రయించలేదు. అలా అని వాటిని సంస్కరించనూ లేదు. దీనికి బదులు ప్రైవేటు కంపెనీలు పీఎస్‌యూలను బలహీనపరుస్తూ ఉంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది’’ అని మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ముఖ్య వ్యూహకర్త రుచిర్ శర్మ అన్నారు. పుస్తకంలోని ప్రధాన అంశాలు: 30 ఏళ్ల క్రితం భారతీయులు గగనతలంలో ప్రయాణించాలంటే ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కటే ఆధారం. కానీ, ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థల రాకతో ఎయిర్ ఇండియా వాటా 25 శాతం కంటే దిగువకు పడిపోయింది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంతో టెలికామ్ మార్కెట్‌ను ఏలి నేడు నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పరిస్థితిని కూడా ఆయన వర్ణించారు. దూకుడుగా ఉండే ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీ పడలేక బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ క్రమంగా క్షీణించిపోయారు. మోదీ పానలలో సానుకూలతలు... లోపాలు ప్రధాని మోదీ సైతం ‘దేశ సంప్రదాయ విధానమైన కాలానుగుణంగా మార్పు’ విధానానికే కట్టుబడి ఉన్నారని శర్మ పేర్కొన్నారు. ఇంధన సబ్సిడీలను తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీ వాతావరణం వంటి కొన్ని సానుకూల చర్యలను మోదీ చేపట్టినట్టు ప్రశంసించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం 75% రుణాలను నియంత్రిస్తుండడాన్ని ప్రధాన అవరోధంగా పేర్కొన్నారు. భారత్‌లో తయారీ విధానంలోనే ప్రాథమిక లోపం ఉందని, సాధారణ ఫ్యాక్టరీల ఏర్పాటు గురించి మోదీ మాట్లాడడం లేదన్నారు. -
’దీపం’ పేరుతో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ
న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణ శాఖ(డీడీ)ను ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం-దీపం)గా వ్యవహరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నుంచి ఈక్విటీల్లో పెట్టుబడుల నిర్వహణ వరకూ కార్యకలాపాల విస్తృతి నేపథ్యంలో... శాఖ పేరు మార్చారు. పీఎస్‌యూల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ.. కేపిటల్ మార్కెట్ల ద్వారా పెట్టుబడుల ఆకర్షణ వంటి పలు అంశాల్లో ప్రభుత్వానికి ఇకపై దీపం సలహాలు ఇస్తుంది. ఆర్థికమంత్రి బడ్జెట్లో ప్రకటనకు అనుగుణంగా కేబినెట్ కార్యదర్శి బుధవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. -
మోదీ ప్రతిష్ట మసకబారుతోంది
- ఓఎన్జీసీ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ, ఎన్టీపీసీ సీఎండీ అరూప్ రాయ్ చౌదరిల పదవీకాలాన్ని న్యాయబద్ధంగా కేంద్రం పొడిగించకపోవడాన్ని ఓఎన్జీసీ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తప్పుపట్టారు. పీఎస్‌యూలకు సాధికారత కల్పించడమన్నది ఒట్టి బూటకమేనని ఇలాంటి చర్యలు సూచిస్తున్నాయన్నారు. ఇలాంటివి ఆధునిక భారత నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట మసకబార్చేవిగా ఉన్నాయని శర్మ వ్యాఖ్యానించారు. వివిధ టాస్క్ఫోర్సులు, ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న శర్మ.. ప్రధానికి రాసిన లేఖలో ఈ అంశాలను ప్రస్తావించారు. అర్హతలను పక్కన పెట్టి యూపీఏ ప్రభుత్వం నియమించిందన్న ఒకే ఒక కారణంతో పీఎస్‌యూ బోర్డుల నుంచి స్వతంత్ర డెరైక్టర్లను తొలగించడం సరికాదని శర్మ అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ హయాంలో పరిపాలన అత్యంత కనిష్ట స్థాయులకు దిగజారుతోందని, పీఎస్‌యూ సిబ్బంది నైతిక స్థైర్యం తీవ్రంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. లిస్టయిన 45 పీఎస్‌యూల్లో 28 సంస్థల బోర్డుల్లో కనీసం ఒక్క స్వతంత్ర డెరైక్టరు కూడా లేరని శర్మ తెలిపారు. 2019 సెప్టెంబర్‌లో రిటైరయ్యే దాకా సెయిల్ చైర్మన్ వర్మ పదవీకాలాన్ని పొడిగించేందుకు నిరాకరించిన కేంద్రం.. తాజాగా ఎన్టీపీసీ సీఎం డీ చౌదరి పదవీకాలాన్ని కూడా పొడిగించకూడదని నిర్ణయించింది. వీరికి అరవై ఏళ్లు వచ్చే దాకా పదవీకాలాన్ని పొడి గించేందుకు ఆస్కారమున్నా కేంద్రం నిరాకరించడం సరికాదని శర్మ పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి భిన్నంగా ప్రభుత్వ రంగంలో అత్యంత సమర్థులకు సైతం అత్యున్నత పదవులను ఒక పర్యాయానికి మాత్రమే పరిమితం చేయడం వల్ల పీఎస్‌యూ అధికారులు బోర్డు స్థాయి పదవులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వీటిపై చర్చించేందుకు తనకు సమయం కేటాయించాలంటూ మోదీని శర్మ కోరారు. -
లాభదాయక పీఎస్‌యూల్లో వాటా విక్రయంపై దృష్టి
ఐపీఓ ప్రణాళికలు ఇవ్వాల్సిందిగా కంపెనీలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ: లాభాల్లో ఉన్న అన్‌లిస్టెడ్ ప్రభుత్వ రంగ కంపెనీలు(పీఎస్‌యూ), వాటి అనుబంధ సంస్థల్లో వాటా విక్రయాలపై కేంద్రం దృష్టిసారించింది. వార్షిక పనితీరు నివేదికలతో పాటు పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) ప్రణాళికలను కూడా సమర్పించాల్సిందిగా ఆయా కంపెనీలకు సూచించింది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ(డీపీఈ)కు ఇటీవలే ఆర్థిక శాఖ ఈ మేరకు సమాచారం పంపినట్లు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దాదాపు 160 లాభదాయక కేంద్ర పీఎస్‌యూల్లో కేవలం 43 మాత్రమే ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. లాభాల్లో ఉండి లిస్టింగ్‌కాని జాబితాలో వైజాగ్ స్టీల్(ఆర్ఐఎన్ఎల్), ఓఎన్జీసీ విదేశ్, కోల్ ఇండియా అనుబంధ సంస్థలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రధానంగా ఉన్నాయి. దీంతో పీఎస్‌యూలతో వార్షిక పనితీరుపై ఎంఓయూల్లో లిస్టింగ్ ప్రణాళికలను ఇకపై తప్పనిసరి చేయాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం డీపీఈకి స్పష్టం చేసింది. గడిచిన ఐదేళ్లుగా కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతూ వస్తోంది. ఈ ఏడాది(2015-16) పీఎస్‌యూల్లో వాటా అమ్మకాల ద్వారా రూ.69,500 కోట్లను సమీకరించాలనేది కేంద్రం లక్ష్యం. -
చమురు పీఎస్‌యూల్లో వాటాలు.. ప్రత్యేక సంస్థకు
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ చేయబోయే ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో(పీఎస్‌యూ) కొంత మేర వాటాలను ప్రత్యేక కంపెనీకి బదలాయించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా చమురు ధరల్లో హెచ్చుతగ్గులతో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.. తమ వాటాల విలువను కాపాడుకోవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్(ఐవోసీ), ఆయిల్ ఇండియా (ఆయిల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) తదితర పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల విక్రయంతో కనీసం రూ. 27,000 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. షేర్ల ప్రస్తుత ధరల ప్రకారం ఓఎన్జీసీలో 5% వాటాల విక్రయంతో రూ.12,000 కోట్లు, ఐవోసీలో 10% డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 10,000 కోట్లు, ఆయిల్లోనూ 10% వాటాల విక్రయంతో రూ.2,600 కోట్లు రావొచ్చని అంచనా. అలాగే, బీపీసీఎల్‌లో 3% డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 2,000 కోట్లు వస్తాయని కేంద్రం భావిస్తోంది. -
డిజిన్వెస్ట్మెంట్కు 13 సంస్థలు రెడీ!
5 నుంచి 15 శాతం వరకూ వాటాల విక్రయం న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) డిజిన్వెస్ట్‌మెంట్ తాజా జాబితాలో దాదాపు 13 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఉన్నాయి. ఈ దిశలో 5-15 శాతం మేర వాటాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ముసాయిదా కేబినెట్ నోట్ ఇప్పటికే సిద్ధమయినట్లు సమాచారం. కాగా తదుపరి జాబితా సిద్ధమయినప్పటికీ, ఏ ప్రభుత్వ రంగ సంస్థ తక్షణం మార్కెట్లోకి వస్తుందన్న విషయం తెలియలేదు. ఇందుకు సంబంధించి కేంద్రం మార్కెట్ కదలికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సంస్థలు ఇవీ... * నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్), హిందుస్తాన్ కాపర్(హెచ్‌సీఎల్), ఇండియా టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ), స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ), ఎంఎంటీసీల్లో 15% చొప్పున వాటాల విక్రయం. * ఇంజనీర్స్ ఇండియా(ఈఐఎల్), నాల్కో, ఎన్ఎండీసీ, ఇండియన్ ఆయిల్(ఐఓసీ)ల్లో 10% చొప్పున డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక. * బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్), డ్రెడ్జింగ్ కార్పొరేషన్ (డీసీఐఎల్)లో 5 శాతం వాటా విక్రయం. వాటాల విక్రయ విలువలు ఇలా...: ప్రస్తుత మార్కెట్లో ఆయా షేరు ధరల ప్రకారం ఎన్ఎఫ్ఎల్ ద్వారా రూ.240 కోట్లు, హెచ్‌సీఎల్ ద్వారా రూ.1,000 కోట్లు, ఐటీడీసీతో రూ.169 కోట్లు, ఎస్టీసీ ద్వారా రూ.140 కోట్లు, ఎంఎంటీసీకి సంబంధించి రూ.800 కోట్లు, ఈఐఎల్ ద్వారా రూ.700 కోట్లు, నాల్కో విషయంలో రూ.1,200 కోట్లు లభించనున్నాయి. ఎన్ఎండీసీ ద్వారా రూ.5,300 కోట్లు, ఐఓసీ ద్వారా రూ.9,000 కోట్లు, బీహెచ్ఈఎల్ విషయంలో రూ.2,900 కోట్లు, ఎన్టీపీసీ విషయంలో రూ.6,000 కోట్ల సమీకరణ జరగొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.41,000 కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. గత వారం ఆర్ఈసీలో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.1,550 కోట్లు సమీకరించింది. -
4 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 22,574 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, నాల్కో, బీహెచ్ఈఎల్ సంస్థలు ఉన్నాయి. ఓఎన్జీసీలో 5 శాతం వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 13,217 కోట్లు, ఎన్ఎండీసీ, నాల్కోల్లో చెరి పది శాతం వాటాల విక్రయంతో మొత్తం రూ. 6,228 కోట్లు, బీహెచ్ఈఎల్లో 5 శాతం వాటాల విక్రయంతో రూ. 3,129 కోట్లు, రాగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
వచ్చే నెల బీహెచ్ఈఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) కోసం ప్రభుత్వం కంపెనీల జాబితాను సిద్ధం చేసింది. దీని ప్రకారం ఏప్రిల్‌లో ముందుగా బీహెచ్ఈఎల్లో వాటాలు విక్రయించనుంది. తద్వారా రూ. 3,200 కోట్లు రాగలవని అంచనా వేస్తోంది. ఇప్పటికే బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి సంబంధించి లండన్, సింగపూర్, హాం కాంగ్‌లలో డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం రోడ్‌షోలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కంపెనీ షేరు ధర సుమారు రూ. 260 చొప్పున చూస్తే 12.23 కోట్ల షేర్లను విక్రయిస్తే రూ. 3,200 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వానికి బీహెచ్ఈఎల్లో 63.06 శాతం వాటాలు ఉన్నాయి. అటు ఎన్ఎండీసీ, నాల్కో, ఐవోసీ తదితర కంపెనీల్లో తలో పది శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2015-16లో పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. వివిధ పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా రూ. 41,000 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 28,500 కోట్లు రాబట్టాలని యోచిస్తోంది. -
గేట్ టాప్ స్కోర్?
ఫర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఎంటెక్, ఎంఎస్ (ఇంజనీరింగ్), ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ వంటి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి 30 వేలలోపు సీట్ల కోసం పోటీ దాదాపు పది లక్షల వరకూ ఉంటోంది. మరోవైపు నవరత్న, మినీరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికం. దీంతో గేట్లో మంచి ర్యాంక్ కోసం పోటీ నానాటికీ పెరుగుతోంది. గేట్-2015 పరీక్ష తాజాగా ముగిసింది. గేట్లో మంచి స్కోర్ అంటే ఎంత? టాప్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం లభించాలంటే.. ఎంత ర్యాంకు రావాలి? పీఎస్యూలో ఉద్యోగం వంటి వివరాలపై ఫోకస్.. ఈసారీ.. ఈసీఈదే పైచేయి గేట్-2015కు 8,89,156 మంది హాజరయ్యారు. జనవరి 31, ఫిబ్రవరి 1, 7, 8 తేదీల్లో రోజుకు రెండు స్లాట్ల చొప్పున మొత్తం 8 స్లాట్‌ల్లో 22 సబ్జెక్ట్‌ల్లో పరీక్ష జరిగింది. 2,16,367 మంది అభ్యర్థులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈసీఈ) ముందంజలో నిలిచింది. మిగతా బ్రాంచ్‌లు సీఎస్ఈకి 1,55,190; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు 1,41,799; మెకానికల్ ఇంజనీరింగ్‌కు 1,85,578; సివిల్ ఇంజనీరింగ్‌కు 90,872 మంది హాజరయ్యారు. పూర్తి స్థాయి నైపుణ్యాన్ని పరీక్షించేలా గేట్-2015 అన్ని పేపర్లలోనూ అభ్యర్థుల్లో పూర్తి స్థాయి సబ్జెక్ట్ నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉన్నాయని నిపుణుల విశ్లేషణ. న్యూమరికల్ టైప్ ప్రశ్నలు పెరగడం, సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలకు సమాన వెయిటేజీ, ప్రతి ప్రశ్నకు సాధన చేస్తేనే సమాధానం వచ్చేలా ప్రతి సబ్జెక్ట్ ప్రశ్నపత్రం ఉంది. దాంతో ఆయా అంశాలపై పూర్తి పట్టున్న అభ్యర్థులు మాత్రమే మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశముంది. ఎలిమినేషన్, గెస్సింగ్ వంటి టెక్నిక్స్ ఉపయోగిద్దామనుకున్న అభ్యర్థులకు నిరాశే ఎదురైందని నిపుణుల అభిప్రాయం. అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రశ్నల క్లిష్టత స్థాయి గతేడాది కంటే ఎక్కువగానే ఉంది. సబ్జెక్ట్‌లు, స్లాట్ల మధ్య క్లిష్టత స్థాయిలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా.. తొలి స్లాట్‌లో హాజరైన అభ్యర్థికి, చివరి స్లాట్‌లో హాజరైన అభ్యర్థికి కూడా ఒకే తీరుగా క్లిష్టత స్థాయి ఉండటం గమనార్హం. గేట్ స్కోర్‌తో ఐఐటీల్లో ఎంటెక్.. మలి దశ గేట్ స్కోర్ ఆధారంగా ఎంటెక్, ఎంఈ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఐఐటీలు.. తదుపరి దశలో వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయి. గేట్ స్కోర్‌కు 70 శాతం వెయిటేజీ; మలి దశలోని గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలకు 30 శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి. అభ్యర్థులు ప్రతి ఐఐటీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిందే! గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.వీటిల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. గేట్ స్కోర్ ఎంత ఉన్నా.. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలోనూ రాణిస్తేనే ఐఐటీల్లో సీటు ఖరారవుతోంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే వీటిలో ప్రతిభ చూపే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. గ్రూప్ డిస్కషన్లో సమకాలీన అంశాలపై చర్చించమని అడుగుతున్నారు. కాబట్టి తాజా ఆర్థిక, సామాజిక, వ్యాపార-వాణిజ్య పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం ఇప్పటి నుంచి నిరంతరం దినపత్రికలు చదవాలి, టీవీల్లో చర్చా కార్యక్రమాలను వీక్షించి సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పర్సనల్ ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు అకడమిక్ నేపథ్యం, భవిష్యత్తు లక్ష్యాలపైనే అడుగుతున్నారు. ప్రధానంగా చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, బయోడేటాలో పేర్కొన్న ఇష్టమైన సబ్జెక్ట్స్ నుంచే ఉంటున్నాయి.ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఇలాఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు కూడా గేట్ స్కోర్ ఆధారంగానే పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీటిలో సీట్ల భర్తీ సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎంటెక్ (సీసీఎంటీ) ద్వారా జరుగుతుంది. ఇందుకోసం సీసీఎంటీ త్వరలో తేదీలు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయనుంది. అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి తమ ఇన్స్టిట్యూట్ ప్రాథమ్యాలను పేర్కొనాలి. పీఎస్‌యూలకూ ప్రామాణికం గేట్ స్కోర్ దేశంలోని నవరత్న, మినీరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) ట్రైనీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇంజనీరింగ్) ఉద్యోగాల భర్తీకి గేట్ స్కోర్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్‌హెచ్‌పీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్హెచ్ఏఐ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా ఖాళీల భర్తీ చేపడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతి సంస్థ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తోంది. గేట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ; తాము సొంతంగా నిర్వహించే గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలకు 25 శాతం వెయిటేజీ కల్పించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి. 200 నుంచి 1200లోపు ర్యాంకుతో ఐఐటీల్లో గేట్ స్కోర్ ఆధారంగా ఖరారయ్యే ర్యాంకులు, ఐఐటీల ఇంటర్వ్యూ కాల్స్ ఆశించదగిన ర్యాంకుల విషయానికొస్తే..200 నుంచి 1200లోపు ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఆయా ఐఐటీల నుంచి మలి దశలో పోటీ పడే అవకాశం లభించనుందని అంచనా. దశాబ్దాలుగా పేరుగడించిన ఐఐటీ ఖరగ్‌పూర్, ముంబై, చెన్నై వంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు పొందాలంటే 500లోపు ర్యాంకుతోనే సాధ్యమని నిపుణుల అభిప్రాయం. ఇతర ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి 600 నుంచి 1000 లోపు ర్యాంకుతో మంచి స్పెషలైజేషన్‌లో ప్రవేశం లభించే అవకాశముంది. 1000 నుంచి 2000లోపు స్కోర్‌తో అప్‌కమింగ్ స్పెషలైజేషన్లలో సీటు పొందొచ్చు. పీఎస్‌యూ ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి జనరల్ కేటగిరీలో 800లోపు ర్యాంకు అవసరమని నిపుణుల అంచనా. గేట్‌కు ప్రత్యామ్నాయాలివే గేట్ స్కోర్ ఆధారంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఎంటెక్ ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించిన అభ్యర్థులు ఆ మేరకు స్కోర్ పొందలేకపోయినా నిరాశపడక్కర్లేదు. ఇప్పుడు ఎంటెక్ కోర్సును అభ్యసించేందుకు గేట్‌కు మరెన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవి.. ⇒ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లలో ర్యాంకు ద్వారా సంబంధిత రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎంటెక్ అభ్యసించొచ్చు. ⇒ రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఎంటెక్ అడ్మిషన్ కౌన్సెలింగ్ సమయంలో గేట్ స్కోర్ పొందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని అభ్యర్థులు గమనించాలి. ⇒ ట్రీపుల్ ఐటీ హైదరాబాద్ నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ద్వారా ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 10, 2015. వివరాలకు www.iiit.ac.in/admissions/pgee చూడొచ్చు. ⇒ సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ర్యాంకుతో సెంట్రల్ యూనివర్సిటీల్లో చేరొచ్చు. ⇒ అమృత యూనివర్సిటీ, నిర్మా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ స్టడీస్, థాపర్ యూనివర్సిటీల్లోనూ గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం పొందే అవకాశం ఉంది. ⇒ గేట్ స్కోర్‌తో సంబంధం లేకుండా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలు సొంతంగా నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లలో ప్రతిభ చూపి ఎంటెక్, ఎంఎస్ ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసించొచ్చు. ⇒ ఐఐటీ- చెన్నై, కాన్పూర్‌లు ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ప్రత్యేక పరీక్ష కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగ అవకాశాలు బీటెక్ అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్నత విద్యతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగావకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగంలో స్థిరపడొచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇంజనీరింగ్ ఎంట్రీ పోస్ట్‌లకు నిర్వహించే పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ పరీక్షలకు సైతం సంసిద్ధులు కావొచ్చు. స్పష్టత ఉండాలి గేట్ స్కోర్‌తో ఉన్నత విద్యతోపాటు పీఎస్‌యూల్లో ఉద్యోగం పొందొచ్చు. అభ్యర్థులు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి అనే విషయంలో స్పష్టతతో ఉండాలి. సీసీఎంటీ ద్వారా ప్రవేశాలు లభించే ఎన్ఐటీలకు సంబంధించి ప్రాథమ్యాలను పేర్కొనే విషయంలో ముందస్తు కసరత్తు చేయాలి. జీడీ/పీఐలో విజయానికి మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన అంశాలపై పరిజ్ఞానం కూడా కీలకం. - అమర్త్యసింగ్, డెరైక్టర్ (గేట్ కోచింగ్), టైమ్ ఇన్స్టిట్యూట్ మాక్ సెషన్స్‌తో మరింత ప్రయోజనం గేట్ అభ్యర్థులు మలి దశలో విజయానికి మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్‌కు హాజరవ్వాలి. పీఎస్‌యూల్లో ఉద్యోగాల కోసం సబ్జెక్ట్‌పై పరిపూర్ణత సాధించాలి. పీఎస్‌యూ ఇంటర్వ్యూల్లో టెక్నికల్ సెషన్ పేరుతో ప్రత్యేకంగా సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించేలా చిన్నపాటి రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఐఐటీలు, ఇతర ఇన్స్టిట్యూట్లలో ఎంపిక ప్రక్రియకు సంబంధించి సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు కాంటెంపరరీ ఇష్యూస్‌పై అవగాహన అవసరం. ఇంజనీరింగ్‌తో అనుసంధానమైన సమకాలీన పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. - ఎ. సునీల్ వర్మ, గెయిల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (గేట్-2014 మెకానికల్ 4వ ర్యాంకు) సరైన ప్రణాళికతో వ్యవహరించాలి ఇంటర్వ్యూలో అకడమిక్ ప్రశ్నలను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి. ‘ఇష్టమైన సబ్జెక్ట్? లేదా ఈ స్పెషలైజేషన్నే ఎంచుకోవడానికి కారణం? అనే రెండు ప్రశ్నలకు ఇచ్చే జవాబులు ఇంటర్వ్యూలో కీలకం. బీటెక్ ప్రాజెక్ట్ వర్క్ నుంచి కూడా ప్రశ్నలు అడగొచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అకడమిక్ అంశాలన్నింటిని ఔపోసన పట్టాలి. - వై.వి. గోపాల కృష్ణమూర్తి,ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. -
ఐటీ పరిమితి రూ. 5 లక్షలకు పెంచాలి
న్యూఢిల్లీ: వేతన జీవులకు ఊరటనిచ్చే విధంగా రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షల దాకా పెంచాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని అభ్యర్ధించాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో 11 ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు కార్మిక సంఘాల విజ్ఞప్తులను సమర్పించారు. ఖాయిలా పడినప్పటికీ మళ్లీ మెరుగుపడే అవకాశాలున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని బడ్జెట్లో ప్రకటించాలని అభ్యర్థించారు. ద్రవ్యోల్బణ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అటు కమోడిటీల్లో ఫార్వర్డ్ ట్రేడింగ్‌ను నిషేధించాల ని, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు.. సుంకాలను క్రమబద్ధీకరించాలని ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రక్షణ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడానికి తాము వ్యతిరేకమని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.రైల్వేను ప్రైవేటీకరించం..: కాగా రైల్వేని గానీ కోల్ ఇండియాను గానీ ప్రైవేటీకరించే యోచనేదీ లేద ని అరుణ్ జైట్లీ మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఆదాయం పెంచుకోవడం కోసం అధిక పన్నులు వడ్డించడానికి తాము వ్యతిరేకమని జైట్లీ చెప్పారు. -
నేడు 8బ్యాంకుల సీఎండీ పోస్టులకు ఇంటర్వ్యూలు
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల సీఎండీ పోస్టుల భర్తీకి శుక్రవారం (నేడు) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 19 మంది అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు. ఇంటర్వ్యూలకు కేంద్రం ఇటీవల మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. మూడు కమిటీల సగటు మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన, ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని నియామకాల బోర్డ్ అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల జాబితాలో దేనా బ్యాంక్ సీఎండీ అశ్వనీ కుమార్, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ బీకే బాత్రా, ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్కే కల్రాలూ ఉన్నారు. ఇప్పటికే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు (దేనా బ్యాంక్) సీఎండీగా ఉన్న ఒక అధికారి, ఈ తరహా ఇంటర్వ్యూకు హాజరుకావడం ఇదే తొలిసారి. పైన పేర్కొన్న ముగ్గురి పేర్లూ విజిలెన్స్ క్లియరెన్స్ తరువాత చివరి నిముషంలో ఖరారయ్యాయి. మిగిలిన 16 మంది పేర్లూ ముందుగానే షార్ట్‌లిస్ట్ అయ్యాయి. బ్యాంకులు ఇవీ..: పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ , యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల సీఎండీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వచ్చే నెలలో విజయాబ్యాంక్ సీఎండీ పోస్ట్ కూడా ఖాళీ అవుతుంది. -
బాబోయ్... బకాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరుగుతున్న నిరర్థక ఆస్తులతో ప్రభుత్వరంగ బ్యాంకులు తీవ్రంగా సతమతమవుతున్నాయి. మొండిబకాయిల కేసుల్లో చిక్కుకుని పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీల రాజీనామాలు, అరెస్టులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో స్పష్టమవుతోంది. యునెటైడ్ బ్యాంక్‌లో ఎన్పీఏలు ఒక్కసారిగా పెరిగిన కారణం వల్ల ఆ బ్యాంక్ సీఎండీ అరెస్ట్ జరిగితే, పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకున్న భూషణ్ స్టీల్ కంపెనీ రుణాల పునర్ వ్యవస్థీకరించడం కోసం లంచం తీసుకుంటూ సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రూ. 40,000 కోట్ల రుణాలు కలిగిన భూషణ్ స్టీల్ దివాళా తీస్తే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులను అధికంగా భయపెడుతోంది. దేశీయ కార్పొరేట్ ఎన్‌పీఏలోనే అతిపెద్దవిగా రికార్డులకు ఎక్కిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 7,500 కోట్లు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 4,000 కోట్ల ఎన్పీఏలు భూషణ్ స్టీల్ ముందు దిగదుడుపే. అందుకే బ్యాంకులు ఇప్పుడు భూషణ్ స్టీల్ రుణాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు ఈ రుణాల వసూలుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి. చివరకు భూషణ్ స్టీల్ వ్యవహారం ఎటు దారితీస్తోందనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో కొంత నయం ఆర్థిక మందగమనం ప్రభావం రుణ చెల్లింపులపై స్పష్టంగా కనిపించింది. గత నాలుగేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు మూడు రెట్లు పెరిగాయి. 2010-11లో పీఎస్‌యూ బ్యాంకుల స్థూల మొండి బకాయిల విలువ రూ. 71,080 కోట్లుగా ఉంటే 2013-14కి రూ. 2.16 లక్షల కోట్లకు పెరిగాయంటే పరిస్థితులు ఎంత దయనీయంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. కాని ఇదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల వృద్ధి కేవలం 26 శాతంగానే ఉంది. 2011-12లో రూ. 17,972 కోట్లుగా ఉన్న ఎన్పీఏలు, గత మార్చి నాటికి రూ. 22,744 కోట్లకు చేరాయి. ఇచ్చిన రుణాల విలువ పెరగడం వల్ల ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏ విలువ పెరిగినట్లు కనిపిస్తున్నా, మొత్తం విలువలో ఎన్పీఏల వాటాను చూస్తే స్వల్పంగా తగ్గడం విశేషం. 2011 మార్చినాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.84 శాతంగా ఉంటే అది డిసెంబర్, 2013 నాటికి 5.07 శాతానికి చేరింది. ఇదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏ 2.29 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయి. ప్రభుత్వ బ్యాంకులపై రాజకీయ ఒత్తిళ్లు ఎన్పీఏలు పెరగడానికి ఒక కారణంగా బ్యాంకు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అదే ప్రైవేటు బ్యాంకుల్లో రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, ఏదైనా ఒక అకౌంట్ ఎన్పీఏగా మారుతుంటే ముందుగానే వడ్డీ పెంచడం లేదా చెల్లించాల్సిన బకాయిని మొత్తానికి కలిపి రుణ కాలపరిమితిని పెంచుతూ పునర్ వ్యవస్థీకరించడం చేస్తున్నాయని, దీంతో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల శాతం తక్కువగా ఉందంటున్నారు. ఎన్పీఏలు భారీగా పెరిగిపోవడానికి ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఆగిపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల పనులు మధ్యలో ఆగిపోవడంతో వాటికిచ్చిన రుణాల్లో అత్యధిక శాతం ఎన్పీఏలుగా మారాయి. 2011 మార్చిలో ఇన్ఫ్రా విభాగంలో 3.23 శాతంగా ఉన్న ఎన్పీఏలు గత మార్చినాటికి ఏకంగా 8.22 శాతానికి ఎగబాకింది. వీటితోపాటు స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో కూడా ఎన్పీఏలు భారీగా పెరిగాయి. వృద్ధి బాట పడితేనే... ఆర్థిక వృద్ధి మందగమనం వల్లే నిరర్థక ఆస్తులు పెరిగాయని, ఒక్కసారి తిరిగి వృద్ధి బాటలోకి పయనిస్తే ఎన్‌పీఏల్లో తగ్గుదల నమోదవుతుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇక్కడ నుంచి తగ్గడమే కాని పెరిగే అవకాశం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగిపోయిన ఇన్ఫ్రా ప్రాజెక్టులను వేగంగా పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకుంటే మొండిబకాయిల చిక్కులు సగం తీరినట్లేనని వెల్లడించాయి. -
మార్కెట్లోకి పీఎస్‌యూల నగదు నిల్వలు!
బడ్జెట్లో ప్రకటించే అవకాశం... న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలకోసం ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల వద్దనున్న మిగలు నగదు నిల్వలను మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)లలో ఇన్వెస్ట్ చేసేలా అనుమతించాలని ప్రభుత్వానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. దీంతోపాటు పెన్షన్ ఫండ్స్ అన్నింటికీ ఒకేవిధమైన పన్నువిధానాన్ని వర్తింపజేయాలని కూడా కోరింది. ప్రధానంగా భారతీయ మార్కెట్లు విదేశీ పెట్టుబడులపై మరీ అధికంగా ఆధారపడకుండా చేయడం, దీర్ఘకాలిక పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు వీలుగా పీఎస్‌యూల మిగులు నిల్వలను ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని... వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత సీనియర్ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టే ఎంఎఫ్లకు పన్ను ప్రయోజనాలు, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) వద్దనున్న రూ.5 లక్షల కోట్లకు పైగా మూల నిధిలో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని కూడా సెబీ కోరుతోంది. మరోపక్క, కార్పొరేట్లు కూడా తమ సొంత పెన్షన్ ఫండ్లను ప్రారంభించాలని, వీటిలోని కొన్ని నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా వెచ్చించాలనేది సెబీ సూచన. దేశంలో స్టాక్ మార్కెట్లకు విదేశీ నిధులే ప్రధాన ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాప్(ప్రమోటర్లవద్దనున్న షేర్లు కాకుండా ఇన్వెస్టర్ల వద్దనున్న స్టాక్స్ విలువ)లో సగానికి సగం విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)వద్దే ఉండటం దీనికి నిదర్శనం. అంతేకాదు భారత్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసే నిధుల్లో దాదాపు సగభాగం వివిధ దేశాల్లోని పెన్షన్ ఫండ్స్ నుంచి తరలివస్తున్నాయి. భారత్‌లో మాత్రం పెన్షన్ నిధులను స్టాక్స్‌లో పెట్టుబడిగా వెచ్చించేందుకు అనుమతులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం నవరత్న, మినీరత్న కేంద్ర పీఎస్‌యూలకు మాత్రమే ప్రభుత్వ రంగ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. అలాకాకుంగా మొత్తం పీఎస్‌యూలన్నింటినీ తమ మిగులు నగదు నిల్వలను ఫండ్స్‌లో పెట్టుబడులకు అనుమతించాలనేది సెబీ వాదన. దేశంలో మొత్తం 250కిపైగా కేంద్ర పీఎస్‌యూలు ఉన్నాయి. వీటివద్దనున్న నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సుమారు రూ.3 లక్షల కోట్లుగా అంచనా. -
పీఎస్‌యూల విలీనంపై నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలకు సంబంధించిన ముసాయిదా విలీన ప్రతిపాదనలపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియుమించింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్, ఆర్థిక నిపుణుడు కె. నరసింహమూర్తిలు సభ్యులుగా ఉండే ఈ కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ షీలా బిందే చైర్మన్‌గా వ్యవహరించారు. జూన్ 2 నుంచి ఈ కమిటీ పని ప్రారంభించనుంది. -
పీఎస్‌యూ బ్యాంకులకు మరో రూ.8 వేల కోట్ల మూలధనం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనాన్ని పెంచేందుకు కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8 వేల కోట్ల అదనపు క్యాపిటల్‌ను అందించే అవకాశముంది. తాత్కాలిక బడ్జెట్లో ఇందుకు రూ.11,200 కోట్లు కేటాయించామనీ, ఇంతకంటే ఎక్కువ మొత్తం అవసరం ఉన్నప్పటికీ రూ.6,000 - 8,000 కోట్ల స్థాయిలో సమకూర్చుతామనీ ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సాంధు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో మంగళవారం ఆర్థిక మంత్రి చిదంబరం సమావేశం అనంతరం సాంధు మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేది కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వమేనని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.14 వేల కోట్ల మూలధనాన్ని పీఎస్‌యూ బ్యాంకులకు అందించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.రెండు వేల కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.1,200 కోట్లు వెళ్లాయి. గ్లోబల్ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకులన్నీ టైర్-1 క్యాపిటల్‌ను పెంచుకునే యత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ప్రమాణాల ప్రకారం భారతీయ బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల అదనపు క్యాపిటల్ అవసరమని రిజర్వు బ్యాంకు అంచనా. నిధుల సమీకరణకు హోల్డింగ్ కంపెనీలు.. విస్తరణకు అవసరమైన నిధుల కోసం హోల్డింగ్ కంపెనీ, స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పీఎస్‌యూ బ్యాంకులకు చిదంబరం సూచించారు. మార్చితో ముగిసిన క్వార్టర్లో బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) పరిస్థితి మెరుగుపడి 4.44 శాతానికి చేరిందనీ, అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.07 శాతంగా ఉందనీ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గాలి - నాయక్ కమిటీ నివేదిక ముంబై: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల్లో సర్కారు తన వాటాను 50 శాతం కంటే తక్కువ స్థాయికి తగ్గించుకోవాలని యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.జె.నాయక్ సారథ్యంలోని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సూచించింది. బ్యాంకులను ప్రస్తుతం పాలిస్తున్న తీరును విమర్శించింది. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక శాఖల పెత్తనం, సీవీసీ, కాగ్ వంటి బాహ్య సంస్థల నిఘా తదితర పరిమితులతో పీఎస్‌యూ బ్యాంకులు సతమతం అవుతున్నాయని నాయక్ కమిటీ రూపొందించిన నివేదిక పేర్కొంది. ‘పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువకు తగ్గిపోతే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల బ్యాంకులపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గకుండానే ఆ బ్యాంకుల్లో ప్రధాన వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుంది. తద్వారా బ్యాంకులు మరింత విజయవంతంగా పనిచేయడానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బ్యాంకుల పాలనా సంబంధమైన పలు విధులకు ప్రభుత్వం దూరంగా ఉండాలి. 1970, 80ల నాటికి బ్యాంకుల జాతీయకరణ చట్టాలతో పాటు ఎస్బీఐ చట్టం, ఎస్బీఐ (అనుబంధ బ్యాంకుల) చట్టాలను రద్దు చేయాలి. అన్ని బ్యాంకులనూ కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురావాలి. బ్యాంకుల్లోని ప్రభుత్వ వాటా బదిలీకోసం బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఏర్పాటుచేయాలి...’ అని కమిటీ సూచించింది. -
పీఎస్‌యూ ఫండ్స్‌కు దూరంగా ఉండండి
మూడు నెలల కాలానికి కొంత మొత్తన్ని ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. లిక్విడ్ ఫండ్, షార్ట్ టెర్మ్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్- ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలో తెలియని డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నాను. నా అంచనాల ప్రకారం.., 1.లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎస్టీసీజీ) ట్యాక్స్ 30 శాతం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) 27 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 2. షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే ఎస్టీసీజీ 30 శాతం, డీటీటీ 13 శాతం చెల్లించాలి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ మూడింటిపై ఒకే విధమైన రాబడి (8-9 శాతం)వచ్చే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమే ఉత్తమం అంటారా? -చైతన్య ప్రసాద్, విజయవాడ పన్నులకు సంబంధించి మీ అంచనాలు కరెక్టే. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి, షార్ట్‌టెర్మ్ గెయిన్స్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయంలో మీరున్నారు. ఇది సరికాదు. మీరు కనుక గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకుంటే క్యాపిటల్ గెయిన్స్ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డీడీటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే డీడీటీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీసీజీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే షార్ట్‌టెర్మ్ ఇన్‌కం ఫండ్‌లో డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. ఇలా చేస్తే మీరు 13 శాతం డీడీటీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఎస్బీఐ పీఎస్‌యూ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? తగిన మార్గం సూచించండి? - అరవింద్, హైదరాబాద్ ప్రభుత్వ రంగంలో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన ఆలోచన కాదని చెప్పవచ్చు. అనుభవమున్న ఇన్వెస్టరైతే పరిస్థితులను బట్టి తగిన మదుపువ్యూహంతో లాభాలు గడించే అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగ కంపెనీలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించినా లాభాలు రావడం అరుదైన విషయమే. ప్రభుత్వం పూర్తి స్థాయి వ్యాపార కంపెనీగా వ్యవహరించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం.. డివిడెండ్లు, సబ్సిడీల రూపంలో పీఎస్‌యూల నుంచి వీలైనంత నిధులను పిండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక ప్రత్యేకమైన పీఎస్‌యూ ఫండ్ ఉత్తమమైనదా? అధమమైనదా? అని ఇన్వెస్టర్లు ఆలోచించడం అనవసరం. మొత్తం మీద పీఎస్‌యూ స్టాక్స్ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలమైనవి కావని చెప్పవచ్చు. అందుకని పీఎస్‌యూ ఫండ్స్‌కు దూరంగా ఉండడమే మేలు.. నిలకడైన రాబడులతో భారీ నిధిని ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా డెట్ ఫండ్‌లో సిప్ విధానంలో 5 నుంచి 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? అలా అయితే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు? - ప్రీతి, విశాఖపట్టణం, నిలకడైన రాబడుల కోసం సిప్ విధానంలో డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయమే. అయితే పదేళ్ల కాలానికి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి డెట్ ఫండ్స్ కంటే ఈక్విటీ ఫండ్స్ ఉత్తమం. ఉదాహరణకు మీరొక డెట్ఫండ్లో పదేళ్ల పాటు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు 8.86 శాతం వార్షిక రాబడులు వస్తాయి. ఇదే లార్జ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 15.25 శాతం వార్షిక రాబడులు వచ్చే అవకాశాలున్నాయి. మీరు రిస్క్‌ను ఏమాత్రం భరించలేని వారైతే, మంచి రేటింగ్ ఉన్న డైనమిక్ బాండ్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టండి. వడ్డీరేట్లను బట్టి వివిధ మెచ్యూరిటీ కాల వ్యవధులున్న డెట్ ఇన్స్ట్రుమెంట్స్ల్లో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే, హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్‌తో పోల్చితే వీటిల్లో కొంచెం రిస్క్ తక్కువ. మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఏడేళ్ల కాలానికి 11.3 శాతం వార్షిక రాబడిని ఇస్తాయి. -
మహిళా గ్రూపులకు 7 శాతం వడ్డీకే రుణాలు
ముంబై: మహిళా స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ)లకు వార్షికంగా 7 శాతం వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. 150 జిల్లాలకు వర్తించే విధంగా ఆర్బీఐ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సంబంధిత జిల్లాల్లో మహిళా స్వయం సహాయక గ్రూపులకు స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజనాఆజీవికా (ఎస్జీఎస్వై) పథకం వడ్డీ రాయితీ పథకం (ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్) ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ పథకం కింద బ్యాంకులపై పడే వడ్డీ భారాన్ని (5.5 శాతం పరిమితికి లోబడి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం భరిస్తుంది. రూ. 3 లక్షల వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇకపై తీసుకునే రుణాలతోపాటు, పాత రుణాలను సైతం ఈ పథకం కిందకు మార్చడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులకూ(ఆర్ఆర్బీ) ఈ నిర్ణయం వర్తిస్తుంది. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే ఎస్‌హెచ్‌జీలకు 3 శాతం అదనపు రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్వెన్షన్ పరిమితి పొడిగింపునకు సంబంధించి అంశాన్ని ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. -
అధిక డివిడెండ్లు కావాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీ(పీఎస్‌యూ)లు ఈ ఏడాది ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లింపులను పెంచాల్సిందేనని ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ పీఎస్‌యూ చీఫ్‌లతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘గత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూలు కేంద్రానికి ఇచ్చిన డివిడెండ్లతో పోలిస్తే ఈ ఏడాది ఈ మొత్తం పెరగాల్సిందే. గతేడాదికంటే తక్కువగా చెల్లిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం’ అని చిదంబరం తేల్చిచెప్పారు. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, గెయిల్, సెయిల్, ఎన్టీపీసీ, కోల్ఇండియా తదితర భారీ పీఎస్‌యూల అధిపతులతో చిదంబరం సమావేశమయ్యారు. ఈ ఏడాది(2013-14) ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి పూర్తిగా కట్టుబడిఉన్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థిక మందగమనం కారణంగా కొన్ని విభాగాల నుంచి ఆదాయం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, అదేవిధంగా పీఎస్‌యూల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్)లో కొరతను అధిగమించాలంటే అధిక డివిడెండ్లు ఆవశ్యకమని చెప్పారు. కాగా, ఈ ఏడాది డివిడెండ్ చెల్లింపుల లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసాన్ని ఆర్థిక శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక డివిడెండ్లను కోరే అవకాశం లేదనేది ఆయా వర్గాల సమాచారం. జనవరిలో పరిస్థితిని సమీక్షించనున్నట్లు కూడా వారు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల నుంచి ప్రభుత్వానికి రూ.55,443 కోట్ల మొత్తం డివిడెండ్లు, లాభాల రూపంలో లభించింది. ఈ ఏడాది లక్ష్యం రూ.73,866 కోట్లు. పెట్టుబడులపైనా చర్చ... ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చేయూతనిచ్చే చర్యల్లో భాగంగా పీఎస్‌యూల పెట్టుబడుల ప్రణాళికలపై కూడా చిదంబరం చర్చించారు. దాదాపు అన్ని పీఎస్‌యూలు తమ పెట్టుబడి ప్రణాళికలను సాకారం చేసేదిశగా ముందుకెళ్తున్నాయని, అరడజను కంపెనీలు మాత్రం వెనుకబడినట్లు చిదంబరం ఈ సందర్భంగా చెప్పారు. జనవరిలో వీటి పనితీరును సమీక్షిస్తామన్నారు. తమ కంపెనీ పనితీరుపట్ల ఆర్థిక మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారని భేటీ అనంతరం ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ పేర్కొన్నారు. 2013-14లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులను వెచ్చించాలనేది తమ ప్రణాళిక అని, ప్రథమార్ధంలో రూ.14,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఆయన వివరించారు. సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ కూడా ఈ ఏడాది పెట్టుబడుల లక్ష్యాన్ని(రూ.11,500 కోట్లు) చేరుకుంటామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి ఆరు నెలల్లో 87 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. కాగా, ఈ ఏడాది కేంద్రం రూ.40 వేల కోట్లను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇప్పటిదాకా కేవలం రూ.1,400 కోట్లను మాత్రమే సమీకరించడం గమనార్హం. -
ఆర్డర్లలో పారదర్శకత ఏది?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) మందగమనం నుంచి ఇంకా కోలుకోలేదు. రాష్ట్రంలో అయితే నాలుగేళ్లుగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఎంఎస్ఎంఈని ఆదుకోవాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్డర్లలో పారదర్శకత లోపించింది’ అని ఫ్యాప్సీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎం.శ్రీరామ్మూర్తి అన్నారు. ఇందుకు సాక్షిలో ప్రచురితమైన కథనమే నిదర్శనమని తెలిపారు. ఆకాశ్ క్షిపణుల తయారీలో భాగంగా కొత్త వెండార్ల ఎంపిక విషయంలో బీడీఎల్ నిర్లక్ష్యంపై ఈ నెల 3న ‘ఆకాశ్’మంత అలక్ష్యం శీర్షికన సాక్షి ప్రత్యేక కథనాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఫ్యాప్సీలో శుక్రవారం జరిగిన కొనుగోలు-విక్రయందారుల సమావేశంలో సాక్షి కథనాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఘాటుగా మాట్లాడారు. వివిధ పీఎస్‌యూలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. పెద్ద సంస్థలున్నా.. పీఎస్‌యూలైన బీడీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్, డీఆర్డీవో, బీఈఎల్ వంటివి హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇక్కడి ఎంఎస్ఎంఈలు ఈ విషయంలో గర్వపడుతున్నాయని శ్రీరామ్మూర్తి అన్నారు. తయారీ రంగాన్ని కొన్ని పీఎస్‌యూలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో విభాగాల్లో సామర్థ్యం ఉన్న కంపెనీలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయని అన్నారు. ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్టులో పాలుపంచుకుని సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయని పేర్కొన్నారు. కొన్ని పీఎస్‌యూలు పాత వెండార్లతోనే సర్దుకుపోతున్నాయని, కొత్త వెండార్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటులో పూర్తిగా ఇక్కడి ఎస్ఎంఈల చొరవే కారణమని స్పష్టం చేశారు. పీఎస్‌యూలకూ సమస్యలే.. నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేసే కంపెనీలు ఇక్కడ చాలా ఉన్నాయని ‘మిధాని’ సీఎండీ ఎం.నారాయణరావు కితాబిచ్చారు. పారదర్శకత కోసం ఇ-టెండర్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు. మేధోసంపత్తి హక్కుల విషయంలో పీఎస్‌యూలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మాస్టర్ పీస్‌ను పీఎస్‌యూ రూపొందించినా చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని హక్కులు తమవని కొందరు వెండార్లు అంటున్నారని పేర్కొన్నారు. కేరళ మినరల్స్, మెటల్స్ ఉత్పత్తి చేసిన టైటానియం వైమానిక అవసరాలకు పనికొస్తుందా లేదా అని తాము పరీక్షిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో టైటానియం కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు. రక్షణ రంగంలో ఉన్న 9 పీఎస్‌యూలు ఏడాదిలోగా నూరు శాతం ఇ-టెండర్ విధానాన్ని అనుసరించనున్నాయని పేర్కొన్నారు. పీఎస్‌యూల మద్దతు లేకపోతే ఎంఎస్ఎంఈలు మనలేవని ఎన్ఐ-ఎంఎస్ఎంఈ డెరైక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. -
పడకేసిన ప్రభుత్వ షేర్లు
ముంబై: స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లు కుదేలవుతున్నాయి. మార్కెట్లో పరిస్థితులతో సంబంధం లేకుండా కేంద్రం పలు పీఎస్‌యూల్లో వాటాలను విక్రయిస్తుండటం... దీనికితోడు వాటివద్దనున్న మిగులు నిధులను ఎలాగైనా ఖజానాకు తరలించే పనిలోపడటం వంటివి ఇన్వెస్టర్లలో గుబులు రేపుతున్నాయి. దీంతో ఈ స్టాక్‌ను ఎడాపెడా అమ్మేసి వదిలించుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో మొత్తం లిస్టెడ్ పీఎస్‌యూల మార్కెట్ విలువలో సుమారు రూ.3.9 లక్షల కోట్లు ఆవిరికావడం దీనికి నిదర్శనం. బ్యాంకింగ్, చమురు-గ్యాస్, మెటల్స్ క్రాష్... కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని, ప్రమోట్ చేసిన కంపెనీలకు సంబంధించినవే పీఎస్‌యూ లిస్టెడ్ స్టాక్స్‌లో అత్యధికంగా ఉన్నాయి. ఇటీవలి స్టాక్స్‌క్రాష్‌లో కూడా 98 శాతం ఇవే కావడం గమనార్హం. ముఖ్యంగా బ్యాంకింగ్, చమురు-గ్యాస్, మెటల్, మైనింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు గత కొన్నాళ్లుగా తుక్కుతుక్కు అవుతున్నాయి. మొండిబకాయిల భయంతో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు కుదేలవుతున్నాయి. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం, స్కామ్‌ల ప్రభావంతో మెటల్, మైనింగ్ స్టాక్స్ ఆవిరయ్యేందుకు దారితీస్తోంది. ఈ రెండునెలల్లో సెన్సెక్స్ 5.5 శాతం, నిఫ్టీ 7.5 శాతం మేర క్షీణించాయి. దీనికికూడా పీఎస్‌యూ షేర్ల పతనమే ప్రధాన కారణం. జూలై ఆరంభంనుంచి మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ క్షీణతలో 90% పీఎస్యూలదే కావడం వీటి పతనం ఎలా తీవ్రంగా ఉందనేందుకు నిదర్శనం. కాగా, పీఎస్‌యూల షేర్ల పతనంలో అత్యధికంగా నష్టపోతున్నది ప్రభుత్వమే. జూన్ చివరినాటికి మొత్తం 73 లిస్టెడ్ కేంద్ర పీఎస్‌యూల్లో ప్రభుత్వానికి సగటున 72.3% వాటా ఉంది. ప్రభుత్వ స్వయంకృతాపరాధమే...! పీఎస్‌యూ షేర్లు ఇంత ఘోరంగా కుప్పకూలుతుండటానికి ప్రభుత్వం చేపడుతున్న డిజిన్వెస్ట్‌మెంటే కారణమని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఎలాగైనా నిధులను సమీకరించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఒకపక్క, వాటా అమ్మే పీఎస్‌యూల షేరు ధరలు సగానికిపైగా పడిపోయినా... దీనికంటే తక్కువ ధరకే కేంద్రం వాటాను విక్రయిస్తుండటం మొత్తం పీఎస్‌యూ స్టాక్స్‌పై ప్రభావం చూపుతోందని వారు అంటున్నారు. హిందుస్థాన్ కాపర్ ఇష్యూ ధరతో పోలిస్తే(రూ.160) ఇప్పుడు 63% పైగానే కరిగిపోయి రూ.57కు కుప్పకూలింది. ఇక ఎంఎంటీసీ ఇష్యూకు రెండు నెలల ముందు రూ.300 స్థాయి నుంచి వాటా విక్రయ సమయానికి రూ.70కి పడిపోయింది. అయినాసరే ప్రభుత్వం రూ.60 ధరకు వాటా విక్రయించింది. ఇప్పుడు ఈ షేరు రూ.45కు జారిపోయింది. మిగులు నిధులతో పుష్టిగాఉన్న కంపెనీల నుంచి డివిడెండ్లు ఇతరత్రా మార్గాల్లో సొమ్మును ప్రభుత్వం ఖజానాకు తరలించొచ్చనే భయాలూ పీఎస్‌యూ షేర్లలో అమ్మకానికి పురిగొల్పుతున్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో వాటా విక్రయానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదించడంతో ఆ షేరు ఒక్కరోజే 15 శాతంపైగా కుప్పకూలింది. మరోపక్క, భెల్ షేరూ అదేపనిగా పడుతూవస్తోంది. మూడు రోజుల క్రితం 20 శాతం క్షీణించింది. నెల రోజుల క్రితం రూ.180 స్థాయి నుంచి అడుగంటిపోయింది. .