న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్‌ను రిటైల్‌గా విక్రయించే రిలయన్స్ బీపీ, నయారా ఎనర్జీ సంస్థలు ఏడాది తర్వాత మార్కెటింగ్ ధరలను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం ఇవి ప్రభుత్వరంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీ పెట్రోల్ బంకులతో పోలిస్తే కాస్త అధిక రేట్లకే అమ్మకాలు సాగించాయి. అయినా కానీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే గణనీయ నష్టాలను చవిచూశాయి. దీనికి కారణం ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏడాదికి పైగా ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు దిగి రావడంతో రిలయన్స్–బీపీ, నయారా ఎనర్జీ, షెల్ సంస్థలు ప్రభుత్వరంగ సంస్థలు అనుసరిస్తున్న మార్కెట్ ధరలకే విక్రయించడం మొదలుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా గత ఆరు వారాల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో నష్టాలు కూడా తగ్గిపోవడంతో పీఎస్‌యూ పెట్రోల్ బంకుల్లో విక్రయించే రేట్లనే రిలయన్స్ బీపీ, షెల్, నయారా అనుసరిస్తున్నాయి. నయారాకు దేశవ్యాప్తంగా 86,855 పెట్రోల్ పంపులు ఉన్నాయి. మార్చి నెల నుంచే మార్కెట్ రేట్లకు విక్రయాలు మొదలు పెట్టింది. రిలయన్స్ బీపీ సంస్థకు 1,555 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఈ నెల నుంచి డీజిల్‌ను మార్కెట్ ధరలకు (ప్రభుత్వరంగ సంస్థలు పాటించే) విక్రయాలు చేస్తోంది. రిలయన్స్ బీపీ సంస్థ ప్రత్యేకమైన డీజిల్‌ను మన దేశంలో విక్రయిస్తోంది. మన దేశ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా, మెరుగైన మేలేజీ వచ్చేలా అడిటివ్స్ కలిపి విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment