Petrol Bunk network
-
HYD: ట్యాంకర్ డ్రైవర్ల ధర్నా విరమణ.. బంకుల వద్ద రద్దీ
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో పెట్రోల్, డీజిల్ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. ఇవి బంకులకు చేరేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో కొద్దిసేపు అక్కడ వాహనదారుల రద్దీ కొనసాగనుంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరారు. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి జైలు శిక్షను ఇటీవల కేంద్రం భారీగా పెంచింది. దీనికి నిరసనగా ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు సోమవారం(జనవరి 1) నుంచి ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. బంకుల ముందు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు అలర్డ్ అయ్యారు. తెరచి ఉన్న కొన్ని బంకుల ముందు ఒక్కసారిగా జనాలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆయిల్ ట్యాంకర్లు ధర్నా విరమించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీచదవండి..తీహార్ జైళ్లో పుట్టిన పార్టీ కాంగ్రెస్ -
ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం
ఢిల్లీ: ట్రక్ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రాత్రి 7 గంటలకు డ్రైవర్ల యూనియన్ తో చర్చలు జరుపనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించడంపై ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి ఆందోళన చేపడుతున్నారు. మంగళవారం ఆ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులను ట్రక్కు డ్రైవర్లు దిగ్బంధించారు. రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రక్కులు, ప్రైవేట్ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఇంధన కొరత.. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా చేసే ట్రక్కులు కూడా రాకపోకలను నిలిపివేశాయి. పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. బంకుల ముందు వాహనదారులు వందల మీటర్ల బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చట్టంలో మార్పులేంటి..? భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు రూపొందించింది. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఐపీసీ(భారతీయ శిక్షా స్మృతి) ప్రకారం రెండేళ్లే జైలు శిక్ష ఉండేది. కొత్త నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ -
HYD: బంకుల్లో నో పెట్రోల్.. వాహనదారుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మంగళవారం మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పెట్రోల్ బంకుల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మెకు దిగినట్లు తెలుస్తోంది. రోడ్లపై ప్రమాదానికి పాల్పడి పారిపోతే వాహన యజమానులు, డ్రైవర్లకు పదిలక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్ష విదించేలా ఇటీవలే చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలోనూ ఇది వర్తింపు ఉంటుంది కాబట్టి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగ్రహానికి గురైన ట్యాంకర్ల యజమానులు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. ఇదీచదవండి.. చలాన్ల చెల్లింపుపై వాహనదారులకు పోలీసుల హెచ్చరిక -
దెబ్బకు దిగొచ్చిన ప్రైవేటు బంకులు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్‌ను రిటైల్‌గా విక్రయించే రిలయన్స్ బీపీ, నయారా ఎనర్జీ సంస్థలు ఏడాది తర్వాత మార్కెటింగ్ ధరలను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం ఇవి ప్రభుత్వరంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీ పెట్రోల్ బంకులతో పోలిస్తే కాస్త అధిక రేట్లకే అమ్మకాలు సాగించాయి. అయినా కానీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే గణనీయ నష్టాలను చవిచూశాయి. దీనికి కారణం ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏడాదికి పైగా ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు దిగి రావడంతో రిలయన్స్–బీపీ, నయారా ఎనర్జీ, షెల్ సంస్థలు ప్రభుత్వరంగ సంస్థలు అనుసరిస్తున్న మార్కెట్ ధరలకే విక్రయించడం మొదలుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా గత ఆరు వారాల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో నష్టాలు కూడా తగ్గిపోవడంతో పీఎస్‌యూ పెట్రోల్ బంకుల్లో విక్రయించే రేట్లనే రిలయన్స్ బీపీ, షెల్, నయారా అనుసరిస్తున్నాయి. నయారాకు దేశవ్యాప్తంగా 86,855 పెట్రోల్ పంపులు ఉన్నాయి. మార్చి నెల నుంచే మార్కెట్ రేట్లకు విక్రయాలు మొదలు పెట్టింది. రిలయన్స్ బీపీ సంస్థకు 1,555 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఈ నెల నుంచి డీజిల్‌ను మార్కెట్ ధరలకు (ప్రభుత్వరంగ సంస్థలు పాటించే) విక్రయాలు చేస్తోంది. రిలయన్స్ బీపీ సంస్థ ప్రత్యేకమైన డీజిల్‌ను మన దేశంలో విక్రయిస్తోంది. మన దేశ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా, మెరుగైన మేలేజీ వచ్చేలా అడిటివ్స్ కలిపి విక్రయిస్తోంది. -
మొదటి సారి ఇంధన రంగంలోకి పీఏసీఎస్.. పెట్రోల్ బంకులు రాబోతున్నాయ్!
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఆర్థిక పరిపుష్టిపై దృష్టి సారించాయి. ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయ ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. మొదటి సారి ఇంధన రంగంలోకి ప్రవేశించాయి. సహకార పెట్రోలు బంకులు ఏర్పాటు చేసి తమ ఆర్థిక పరపతిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక్కో బంకు రూ.25లక్షలతో ఏర్పాటు ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు అనుబంధంగా 1,992 పీఏసీఎస్‌లున్నాయి. వాటిలో 1,450 పీఏసీఎస్‌లు లాభాల్లో ఉన్నాయి. మిగిలిన వాటిని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఆప్కాబ్ చేయూత నిస్తోంది. బహుళ సేవా కేంద్రాలు (ఎంఎస్సీ)గా వీటిని తీర్చిదిద్దేందుకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. స్థలాలు అందుబాటులో ఉండి స్థానికంగా ఫీజుబులిటీ కల్గిన పీఏసీఎస్‌ల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఒక్కో బంకు రూ.25లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా పీఏసీఎస్‌లకు డీలర్‌షిప్‌లు మంజూరు చేసేందుకు హెచ్‌పీసీఎల్ ముందు కొచ్చింది. బంకు నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ హెచ్‌పీసీఎల్ సమకూర్చనుంది. నిర్వహణ బాధ్యతలను పీఏసీఎస్‌లకు అప్పగిస్తారు. నిర్వహణ ఖర్చులు పోనూ నెలకు రూ.లక్షకు పైగా మిగులుతుందని అంచనా వేసు్తన్నారు. బంకుల ఏర్పాటుకు అనువుగా 96 పీఏసీఎస్‌లు తొలిదశలో బంకుల ఏర్పాటుకు అనువైన స్థలాలున్న 130 పీఏసీఎస్‌లను గుర్తించారు. వాటిలో 96 పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు ఫీజుబులిటీ ఉందని ఆయిల్ కంపెనీలు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాయి. వాటిలో ఇప్పటికే 77 పీఏసీఎస్‌లకు ఆయిల్ కంపెనీలు లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ జారీ చేశాయి. కాగా 18 పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)లు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లా పరిధిలోని కె.జగ్గవరం, ముల్లకుంట పీఏసీఎస్‌ల్లో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయగా, మిగిలిన 15 పీఏసీఎస్‌ల్లో జనవరి నెలాఖరులోగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీజుబులిటీ ఆధారంగా మిగిలిన పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. లాభాల బాట పట్టించడమే లక్ష్యం నష్టాల్లో ఉన్న పీఏసీఎస్‌లను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం. స్థలాలు అందుబాటులో ఉండి, ఫీజు బులిటీ ఉన్న పీఏసీఎస్ పరిధిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనుమతినిస్తాం. బంకులే కాదు..వారు ఏ తరహా వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చినా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆప్కాబ్ సిద్ధంగా ఉంది. –ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, ఎండీ, ఆప్కాబ్ -
ఇంత దారుణమా.. ఐదు లీటర్లకు హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మహానగరంలోని పెట్రో బంకుల చిప్ ట్రిక్స్ ఆగడం లేదు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మ్యానువల్ పెట్రోల్ బంకుల మోసాలను అడ్డుకట్ట వేసేందుకు ఎలక్ట్రానిక్, డిజిటల్ ఫిల్లింగ్ డిస్పెన్సరీ యూనిట్లు అమల్లోకి తీసుకొచ్చినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఊహకు అందని సరికొత్త మోసాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుపై ఫిర్యాదులు రావడంతో తూనికలు, సివిల్ సప్లయిస్, ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా డిస్పెన్సరీ మిషన్ సాఫ్ట్‌వేర్‌లో చిప్ అమర్చినట్లు బయటపడింది. ఐదు లీటర్ల పెట్రోల్‌కు దాదాపు 500 ఎంఎల్ తక్కువగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని బంకులపై అధికారులు దాడులు దిగినప్పటికి అప్పటికి డీలర్లు అప్రమత్తం కావడంతో ఫలితం లేకుండా పోయింది. అంతా గప్ చిప్.. పెట్రోల్ బంక్‌ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేతివాటం ‘గప్ చిప్’గా కొనసాగుతూనే ఉంది. డిజిటల్ ఫిల్లింగ్ డిస్పెన్సరీ యూనిట్లలో అడిషనల్ మైక్రో చిప్స్, రిమోట్ కంట్రోల్, సాఫ్ట్వేర్ పోగ్రామింగ్, ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ తదితర అక్రమ మార్గాలు బట్టబయలైనా తాజాగా డిస్పెన్సరీ టెక్నాలజీకి అనుగుణంగా అప్డేషన్ మెకానిజం మాత్రం ఆగడం లేదు. డిస్ప్లేలో మీటర్ రీడింగ్ కరెక్ట్‌గానే చూపిస్తున్నా తెరమాటున పెట్రోల్, డీజిల్ మెజర్మెంట్ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. డిస్పెన్సరీ మ్యానూఫ్యాక్చరింగ్ యూనిట్ మాజీ టెక్నిషియన్ల నైపుణ్యత పెట్రోల్ బంకు యాజమానులకు కాసులు కురిపిస్తోంది. డిస్ప్లేలో ఓకే...కానీ పెట్రోల్ బంక్ బాయ్ కీ బోర్డుపై బట¯న్ నొక్కి మీటర్‌ను(జీరో) సున్నా చూపించి టకీమని మనం చెప్పినంత పెట్రోలు కొడతాడు. ఫిల్లింగ్ మిషన్ డిస్ప్లే బోర్డులో మీటర్ రీడింగ్ మిల్లీ లీటర్లు... అమోంట్ కరెక్ట్‌గా ఉండటం చూసి లెక్క సరిపోయిందని నిర్ధారించుకుంటాం. డబ్బులు చెల్లించి అక్కడి నుంచి కదులుతాం. మన డబ్బుకు సరిపోనూ పెట్రోల్ మన బండి ట్యాంకులోకి పడిందని అనుకుంటే పొరపాటే... లీటరుకు 850 నుంచి 900 మిల్లీ లీటర్లే చేరుతుంది.! దీంతో 100 నుంచి 150 మిల్లీలీటర్లు నష్టపోవాల్సిందే. చేతివాటం ఇలా.. ►పెట్రోల్ బంకు ఫ్యూల్ మీటర్ (డిస్పెన్సరీ) యూనిట్లో మెజరింగ్ సిస్టమ్‌గా పనిచేసే పల్సర్ విభాగానికి సర్యూ్యట్తో కూడిన అదనపు కేబుల్‌ను అనుసంధానించి కీ ప్యాడ్ కనెక్ట్ ద్వారా పంప్‌ను ఆపరేట్ చేస్తూ సర్దుబాటు కొలతల ప్రకారం తక్కువగా పెట్రోల్, డీజిల్ డెలివరీ చేస్తూ మోసం చేస్తున్నారు. ►ఫ్యూయల్ డిస్పెన్సరీ యూనిట్‌లోని మదర్ బోర్డులో ఐసీ సర్క్యూట్ ద్వారా ‘ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్’తో అడ్జెస్ట్ చేసిన మెజర్మెంట్ ప్రకారం ఫ్యూల్ ఆయిల్ డెలివరీలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ►డిస్పెన్సరీ యూనిట్లలో సీల్‌కు సైతం సాల్టరింగ్ బాహాటంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. తూనికలు, ఆయిల్ కంపెనీల అధికారులతో పాటు ఇద్దరు టెక్నీషియల్ సమక్షంలో పంపింగ్ మిషన్‌లో మెజర్మెంట్ను పరిశీలించి మోసాలకు పాల్పడకుండా మీటరింగ్ యూనిట్, పల్సర్(సెన్సర్), మదర్ బోర్డు, కీ ప్యాడ్, కంట్రోలర్ కార్డులకు సీల్ చేస్తున్నా...బంకు నిర్వహకులు సీల్‌ను బ్రేక్ చేయడమే కాకుండా తిరిగి అదే రకమైన వైర్‌తో సీల్‌కు సాల్టరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బయట పడకుండా అప్రమత్తమే అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు డిస్పెన్సరీ యూనిట్ ఆఫ్–ఆన్‌చేసి మెజర్మెంట్లో ఎలాంటి వ్యత్యాసం కనిపించకుండా బంకు నిర్వాహకులు జాగత్త పడుతున్నారు. యూనిట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అందులో ఇనిస్టాల్చేసిన ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఎగిరిపోయి పాత మేజర్మెంట్ ప్రకారం ఆయిల్ డెలివరీ అవుతోంది. తిరిగి కొలతల హెచ్చు తగ్గుల కోసం ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం సర్వసాధారమైంది. ఇదీ నిబంధన తూనికలు కొలతల శాఖ నిబంధన ప్రకారం కనీసం 5 లీటర్లలో 25 ఎంఎల్ కంటే ఎక్కువగా షార్టేజ్ రావొద్దు. ఒక వేళ వస్తే తక్షణమే సంబంధిత డిస్పెన్సరీ నాజిల్‌ను సీజ్ చేసి నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. కాంపౌండింగ్ విధించడమే కాకుండా కొన్నిసార్లు కేసులు కూడా నమోదు చేసి కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది. -
త్వరలో మరో 46 ఆర్టీసీ బంకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ త్వరలో 46 పెట్రోల్ బంకులు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి మూడు ప్రధాన చమురు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కలిపి ఆరు బంకులు ఏర్పాటు చేయనుండగా ఇతర పట్టణాల్లో మిగతావి ఏర్పాటు చేస్తోంది. నాలుగైదేళ్ల క్రితమే పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆర్టీసీ... అప్పట్లో 73 ప్రాంతాల్లో బంకుల ఏర్పాటుకు నిర్ణయించింది. అయితే అనువైన ప్రాంతాల్లో లేకపోవడం, కోర్టు కేసులు, నిరభ్యంతర పత్రాలు రాకపోవడంతో కేవలం 23 బంకులే ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 69కి చేరుకోనుంది. ఈ కొత్త బంకులు 6 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పది చోట్ల సొంతంగా.. 46 ప్రాంతాల్లో ప్రారంభించనున్న పెట్రోల్ బంకుల్లో 10 బంకులు డిపోల పక్కనే ఉండటంతో వాటిని సొంతంగా నిర్వహిస్తే బాగుంటుందని ఆర్టీసీ భావిస్తోంది. మిగతా వాటిని సర్వీసు ప్రొవైడర్ల ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. సొంతంగా నిర్వహించడం ద్వారా స్థలాలకు చమురు కంపెనీల నుంచి లీజు అద్దెతోపాటు చమురుపై కంపెనీలు ఇచ్చే పూర్తి కమీషన్ సమకూరుతుందని ఆర్టీసీ పేర్కొంటోంది. అలాగే సర్వీసు ప్రొవైడర్లకు కేటాయించి నిర్వహించే వాటి ద్వారా సైతం చమురు కంపెనీల నుంచి లీజు అద్దె, విక్రయించే ప్రతి లీటర్ డీజిల్‌పై రూ.1.89, పెట్రోల్‌పై రూ. 2.83 చొప్పున కమీషన్ సమకూరుతుందని చెబుతోంది. దీనివల్ల సొంత స్థలాలకు రక్షణ ఏర్పడటమే కాకుండా నెలకు రూ. 2 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. చమురు కంపెనీల నుంచి నేరుగా చమురు రావడం, ఆర్టీసీ బంకులు కావడంతో కల్తీకి ఆస్కారం ఉండకపోవడం వల్ల వాహనదారుల నుంచి ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని యాజమాన్యం వ్యక్తం చేస్తోంది. భూములు కాపాడుకొనేందుకే.. రాష్ట్రంలో ఆర్టీసీకి చాలాచోట్ల ఖాళీ స్థలాలున్నాయి. వాటిల్లో కొన్ని విశాలమైనవి కాగా మరికొన్ని చిన్నచిన్న స్థలాలు. అయితే కొన్నేళ్లుగా ఆర్టీసీ స్థలాల కబ్జా యత్నాలు పెరుగుతుండటంతో వాటిని కాపాడుకొనేందుకు వీలైనన్ని చిన్న స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాస్త పెద్దగా ఉన్నవాటిల్లో కల్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్సులకు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పుడు 46 బంకుల కోసం ఒప్పందం చేసుకోగా త్వరలో మరికొన్ని స్థలాలను కూడా అందుకు సిద్ధం చేసుకుంటోంది. -
మారవా.. నారాయణా!
కదిరి: నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది.. కదిరిలోని నారాయణ పాఠశాల యాజమాన్యం తీరు. పిల్లల ప్రాణాలు పణంగా పెడుతూ ఓ పెట్రోల్ బంకు పక్కన ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను తొలగించాలని ఇప్పటికి అనేక సార్లు అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు స్వయంగా హెచ్చరించినా తీరు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు. సుమారు 3 వేల మందికి పైగా చిన్నారులు చదువుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే జరిగే నష్టం ఎవరూ ఊహించలేం. మమ్మల్నేం చేయలేరు..! పెట్రోలు బంక్ పక్కనే నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను మూసేయాలంటూ పలు విద్యార్థి సంఘాలతో పాటు కుల సంఘాల నాయకులు ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు చేపట్టారు. టీడీపీ హయాంలో ఎన్నో సార్లు నిరసనలకు దిగారు. కానీ అప్పటి ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పిన నారాయణ అవేమీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో విద్యాశాఖా మంత్రిగా ఉన్న సాకే శైలజానాథ్ స్వయంగా పాఠశాలను సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలు బంక్ పక్కనే నారాయణ స్కూల్ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. వెంటనే పాఠశాలను మూసివేయాలని కూడా ఆదేశించారు. కానీ ఆ తర్వాత చర్యలు మాత్రం శూన్యం. పాఠశాలను మూసివేయాలంటూ గతంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నాగన్నతో పాటు మరికొందరు స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు నెలల తరబడి రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నోటీసులైతే లెక్కలేనన్ని సార్లు అధికారులు పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. అయినా, వారు పాఠశాలను మూసివేయనూ లేదు. వేరే చోటుకు తరలించనూ లేదు. అడ్మిషన్లూ నిబంధనలకు విరుద్ధంగానే.. 2022–23 విద్యాసంవత్సరం మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. అయితే వేసవి సెలవుల్లోనే ఆ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇలా అడుగడుగునా నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యంపై కలెక్టర్ బసంత్‌కుమార్ అయినా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీక్ష చేపడతాం నారాయణ స్కూల్‌ను సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పటి దాకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మా మాటలు అధికారులకు చెవిటోని ముందు శంఖం ఊదినట్టు ఉన్నాయి. ఈసారి నిర్వహిస్తే పాఠశాల ముందే దీక్ష చేపడతాం. – రాజేంద్ర ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారులే మార్పించాలి గ్యాస్ సిలిండర్ పేలితేనే పెద్ద మొత్తంలో ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిన సంఘటనలున్నాయి. పెట్రోల్ బంక్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రత ఇంకెంత ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. అందుకే మా బాబును అక్కడ చేర్పించలేదు. అధికారులు ఈసారైనా ఆ బడిని మార్చేసేలా చర్యలు తీసుకోవాలి. – యాదవేంద్ర యాదవ్, కదిరి పాఠశాల నిర్వహిస్తే సీజ్ పెట్రోలు బంక్ పక్కన నారాయణ పాఠశాల నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. ఆ పాఠశాల నిర్వాహకులకు దీనిపై నోటీసులు కూడా ఇచ్చాం. ఈసారి అక్కడే పాఠశాల నిర్వహిస్తే సీజ్ చేయడం ఖాయం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అక్కడ అడ్మిషన్ చేసే ముందు ఒకసారి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. – చెన్నకృష్ణ, ఎంఈఓ, కదిరి (చదవండి: యువకుడి దారుణహత్య) -
అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం
సాక్షి, ఖమ్మం: కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల విషయం పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రతీ మీటర్‌పై వ్యాట్ రూపంలో చెల్లిస్తున్న రుసుంతో బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి చాలా మందికి తెలియదు. ఒకరిద్దరు నిబంధనల పేరుతో ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం తెలిసిందే. బంకుల వద్ద వినియోగదారులకు కొన్ని కచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలు ఏ పెట్రోల్ పంపులోనైనా అందించకపోతే మీరు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛమైన తాగునీరు.. బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందు కోసం బంకు డీలర్ ఆర్వో యంత్రం, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాల్సి ఉంది. ఏ బంకులో కూడ తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థ కు ఫిర్యాదు చేయవచ్చు. మూత్రశాలలు, మరుగుదొడ్లు.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలు చోట్ల వీటిని ఏర్పాటు చేసినా వినియోగించేందుకు నిర్వహకులు అనుమతులివ్వటం లేదు. మరికొన్ని చోట్ల అసలు కనిపించని పరిస్థితి నెలకొంది. బంకుల్లో ఇలాంటి సౌకర్యాలు లేనట్లయితే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చు. లీటర్ పెట్రోల్, లేదా డీజిల్ కొనుగోలు చేస్తే అందులో మనం బంకులకు 4 నుంచి 8 పైసల వరకు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణకు చెల్లిస్తున్నాం. ఆపదవేళ ఫోన్ సదుపాయం.. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ధ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పని లేదు. ఏదైనా పెట్రోల్ బంక్ ను సందర్శించటం ద్వారా మీరు ఏ నంబర్ కు అయినా కాల్ చేసుకోవచ్చు. ఉచితంగా గాలి నింపాల్సిందే.. టైర్లలో గాలి నింపటానికి గాలి శాతం తనీఖీ చేసుకోవటానికి అనువుగా బంకుల్లో కచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు కూడ ఓ వ్యక్తి ని అందుబాటులో ఉంచాలి. బంకులో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకున్నా, వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనీఖీ చేయాలి. ఇటీవల కాలంలో వాహనాల టైర్లకు ప్రత్యామ్నయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ట్యూబ్‌లెస్ టైర్లు వస్తున్నాయి. వాటిలో నైట్రోజన్ నింపాలి. ఫిర్యాదుల పెట్టె, ప్రథమ చికిత్స కిట్టు ఉండాలి.. ప్రతి బంకులో ఫిర్యాదు పెట్టే లేదా రిజిష్టర్‌ను అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారుడు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. ప్రథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతి బంకు వద్ధ ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ ప్రథమ చికిత్స పెట్టెలో ఆరోగ్యాన్ని రక్షించే మందులు ఉండాలి. దీంతో పాటు అన్ని మందులపై గడువు తేదీ కూడ రాసి ఉంచాలి. పాత మందులు ఉండకూడదు. నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చు.. పెట్రోల్, డీజీల్ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునేందుకు పరికరాలను సిద్ధంగా ఉంచాలి. వాటి ద్వారా నాణ్యత ను పరీక్షించేందుకు హక్కు మనకు ఉంటుంది. అదే విధంగా పెట్రోల్, డీజీల్ తక్కువగా వస్తుందనే అనుమానం వచ్చినా పరీక్షించుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ కరువు.. బంకుల వద్ద ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సిన హక్కులు ఉండి కూడ ఏ ఒక్కటి కూడ కల్పించటం లేదు. ముఖ్యంగా బంకులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వలన వారి ఇష్టారాజ్యంగా అవుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. - బచ్చలకూరి నాగరాజు, కోరట్లగూడెం అవగాహన కల్పించాలి బంకుల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అన్నింటికి కలిపి చమురుకు ధరలు చెల్లిస్తున్నారు. కానీ వాటిని మాత్రం వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. -మాదాసు శ్రీనివాసరావు, కొత్తకొత్తూరు ఫిర్యాదుల పెట్టెలు కనిపించవు బంకులపై ఫిర్యాదు చేసేందుకు కనీసం ఫిర్యాదుల పెట్టెలు కానీ, రిజిష్టర్లు కానీ బంకుల వద్ధ ఎవరికి కనిపించవు. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించరు. ప్రజల హక్కులను కూడ వినియోగించుకోలేకపోతున్నారు. బంకుల పై అధికార యంత్రాంగం ఉందా లేదా అనిపిస్తుంది. -రావెళ్ల కృష్ణారావు, మోటాపురం -
జియో-బీపీ పేరుతో రిలయన్స్ పెట్రోలు బంకులు
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన ఇంధన రిటైల్ వ్యాపారాన్ని బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ బీపీతో తుది ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆర్ఐఎల్, బీసీ సోమవారం ఒక ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం చేశాయని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. జియో-బీపీ బ్రాండ్ ఇంధన మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్ మరింత అభివృద్ది చెందనుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రెగ్యులేటరీ, ఇతర ఆమోదాలకు లోబడి, 2020 మొదటి భాగంలో జియో-బీపీ జాయింట్ వెంచర్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్లో ఆర్ఐఎల్ 51 శాతం, బీపీ 49 శాతం వాటా ఉంటుంది. ఈ వాటా కోసం బీపీ రూ.7,000 కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం ఆర్ఐఎల్కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం 5,500 పెట్రోల్ బంకులను జాయింట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తేవాలని లక్ష్యం. ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతీయ వినియోగదారులకు అధిక-నాణ్యత విభిన్న ఇంధనాలు, ఇతర సేవలను అందించనున్నామని ఆర్ఐఎల్ తెలిపింది. కాగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని మరో సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లోని సంస్థాగత భాగస్వాముల నుండి రూ .25,215 కోట్ల పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే. -
బంకు ఓపెన్!
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశీ ఇంధన రిటైలింగ్ రంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెరతీసింది. చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలను సడలించింది. దీంతో.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఇంధనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు తలుపులు తెరిచినట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ (సీసీఈఏ) బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయాలన్న లక్ష్య సాధనకు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కొత్త పాలసీ తోడ్పడనుంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగపడుతుంది. మరిన్ని రిటైల్ అవుట్‌లెట్స్ రాకతో పోటీ పెరిగి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి‘ అని సీసీఈఏ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న ఇంధన మార్కెటింగ్ నిబంధనలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2002లో అమల్లోకి వచ్చినవి. తాజాగా అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు వీటిని ప్రభుత్వం సవరించింది. ప్రస్తుత మార్పులతో పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనాల విక్రయానికీ ఊతం లభించనుంది. పెట్రోల్ బంకులపై సీసీఈఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై విడుదల చేసిన ప్రకటనలో ప్రధానాంశాలు.. ► పెట్రోల్ బంకు లైసెన్సులు పొందే సంస్థలు .. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా కొత్త తరం ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎల్ఎన్జీ, బయోఫ్యూయల్స్‌లో ఏదో ఒకదానికి అవుట్లెట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ► రూ. 250 కోట్ల నికర విలువ గల కంపెనీలు .. పెట్రోల్, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్స్‌కి అనుమతులు పొందవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంధన రిటైలింగ్ లైసెన్సు పొందాలంటే హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్స్ లేదా ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్ వంటి వాటిపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ఇంధనాల మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్న కంపెనీలకు.. ఈ నిబంధన ప్రతిబంధకంగా ఉంటోంది. ► ఇంధన విక్రయ కార్యకలాపాలు ప్రారంభించిన రిటైలర్లు.. అయిదేళ్లలోగా మొత్తం అవుట్‌లెట్స్‌లో 5% అవుట్‌లెట్స్‌ను నిర్దేశిత గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలి. లేదంటే ఒక్కో బంకుకు రూ. 3 కోట్ల మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. దిగ్గజాల ఎంట్రీకి మార్గం.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలు భారత ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్ ఎస్ఏ, సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో, బ్రిటన్ దిగ్గజం బీపీ, ప్యూమా ఎనర్జీ తదితర సంస్థలు భారత్‌లోని ఇంధన రిటైలింగ్ రంగంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌తో కలిసి టోటల్ .. 2018 నవంబర్లోనే సుమారు 1,500 పెట్రోల్, డీజిల్ విక్రయాల అవుట్‌లెట్స్ ఏర్పాటు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. పెట్రోల్ బంకుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో అటు బీపీ కూడా జట్టు కట్టింది. ప్యూమా ఎనర్జీ రిటైల్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోగా, ఆరామ్కో ఇంకా చర్చల్లో ఉంది. ప్రభుత్వ సంస్థల హవా... కంపెనీ బంకుల సంఖ్య ఐఓసీ 27,981 హెచ్‌పీసీఎల్ 15,584 బీపీసీఎల్ 15,078 రిలయన్స్ 1,400 నయారా 5,344 (గతంలో ఎస్సార్ ఆయిల్) షెల్ 160 -
వచ్చే మార్చి కల్లా పూర్తి స్థాయలో రిలయన్స్ పెట్రోల్ బంకులు
- కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: పెట్రోల్ బంక్‌ల నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో మళ్లీ ప్రారంభించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. ఈ ఏడాది మార్చి కల్లా 300 పెట్రోల్ పంపులు పనిచేస్తున్నాయని, వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం 1,400 పెట్రోల్ పంపుల నెట్‌వర్క్‌ను మళ్లీ ప్రారంభించనున్నామని కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2006లో పెట్రోల్ పంపుల నెట్‌వర్క్‌ను రిలయన్స్ ప్రారంభించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు వచ్చినట్లు రిలయన్స్‌కు ఆ వెసులబాటు లేకపోవడంతో చాలావరకూ బంకుల్ని మూసేయక తప్పలేదు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై నియంత్రణను తొలగించడంతో ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలకు సమానఅవకాశాలు కల్పించినట్లయింది.