ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం | Centre Responded On Drivers Agitation | Sakshi
Sakshi News home page

ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం

Published Tue, Jan 2 2024 4:41 PM | Last Updated on Tue, Jan 2 2024 4:51 PM

Centre Responded On Drivers Agitation - Sakshi

ఢిల్లీ: ట్రక్ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రాత్రి 7 గంటలకు డ్రైవర్ల యూనియన్ తో చర్చలు జరుపనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించడంపై ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి ఆందోళన చేపడుతున్నారు. మంగళవారం ఆ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులను ట్రక్కు డ్రైవర్లు దిగ్బంధించారు. రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రక్కులు, ప్రైవేట్ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. 

ఇంధన కొరత..
ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా చేసే ట్రక్కులు కూడా రాకపోకలను నిలిపివేశాయి. పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. బంకుల ముందు వాహనదారులు వందల మీటర్ల బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. 

చట్టంలో మార్పులేంటి..?
భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్‌ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు రూపొందించింది. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఐపీసీ(భారతీయ శిక్షా స్మృతి) ప్రకారం రెండేళ్లే జైలు శిక్ష ఉండేది. కొత్త నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement