truck driver
-
1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్
ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం మహీంద్రా గ్రూప్ ఉపకారవేతనాలు అందిస్తుంది. మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని ‘మహీంద్రా సార్థి అభియాన్’ పేరుతో స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను ప్రతిభావంతులైన 1000 మంది విద్యార్థినులకు పైచదువుల కోసం రూ.10 వేలు చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నారు.మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు వినోద్ సహాయ్ మాట్లాడుతూ..‘మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం సాయం చేస్తున్నాం. మహిళాసాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పదో తరగతి పూర్తయి పైచదువులు చదివాలనుకునే ప్రతి ట్రక్ డ్రైవర్ కుమార్తె ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000 ఇవ్వడంతోపాటు గుర్తింపు సర్టిఫికెట్ కూడా అందిస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా కావడం విశేషం అని అధికారులు తెలిపారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించిన కంపెనీ ఇప్పటివరకు 10,029 మందికి ఉపకారవేతనాలు అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 75 ట్రాన్స్పోర్ట్ హబ్‌లను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. విద్యార్థినుల మెరిట్, కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రీనింగ్ చేసి స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఇందుకోసం సంస్థ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. -
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న డ్రైవర్: ఆనంద్ మహీంద్ర ఫిదా!
ప్రస్తుతకాలంలో ఏ వృత్తిలో ఉన్నా, ఆధునిక టెక్నాలజీని, ట్రెండ్‌ని పట్టుకోవడంలోనే ఉంది సక్సెస్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, యూ ట్యూబ్ ప్రపంచానికి తన టాలెంట్ ఏంటో చూపించి సత్తా చాటుకున్నారు చాలామంది. ఇంటి వంట,ఇంటి పంట, గాత్రం,వ్యవసాయ క్షేత్రం ఇలా ఏదైనా చివరికి తమ రోజువారీ జీవితాల్లోని మామూలు అంశాలతో వైరల్ అయి పోతున్నారు. మట్టిలో మాణిక్యాల్లా యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేస్తున్నారు అలాంటి వారిలో ఒక ట్రక్ డ్రైవర్ విశేషంగా నిలుస్తున్నాడు. 1.47 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో నెటిజన్లుల చేత 'మాస్టర్‌చెఫ్' గా ప్రశంసలు పొందుతున్న కార్గో ట్రక్ డ్రైవర్ రాజేష్ రావాని గురించి తెలుసు కుందాం రండి. రాజేష్ రావాని ఒక ట్రక్ డ్రైవర్. వృత్తిపరంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ట్రక్ డ్రైవర్ నా జీవితంలో ఏముంది స్పెషల్ అనుకోలేదు. తన జీవితం నుంచే ఏదో సాధించాలనుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మార్చింది. సాధారణంగా సుదూర ప్రాంతాలకు వస్తువులను రవాణా చేసే వెళ్లే లారీ, ట్రక్ డ్రైవర్లు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే వారుమధ్యలో ఎక్కడో ఒక చోట ఆగి వండుకొని తినేలా ఏర్పాటు చేసుకుంటారు. కానీ రాజేష్ రావాని ఇంకొంచెం స్పెషల్. తనకొక స్పెషల్ కిచెన్ క్రియేట్ చేసుకుని నచ్చిన వంటల్ని, రుచికరంగా వండుకుని ఆస్వాదిస్తూ ఉంటాడు. దీన్నే స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో తీసి పోస్ట్ చేయడం షురూ చేశాడు. దీనికి కొడుకుల సాయం తీసుకున్నాడు. రాజేష్‌కు ఇద్దరు కుమారులు సాగర్, శుభం. వీరే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి ప్రోత్సహించారని ఒకసారి నెటిజన్లుతో పంచుకున్నాడు. ముఖ్యంగా సాగర్ వీలైనప్పుడు ట్రక్కుపై అతనితో పాటు వీడియోలు చిత్రీకరిస్తూ, ఎడిట్ చేస్తూ ఉంటాడని చెప్పాడు. "యూట్యూబ్ అంటే ఏమిటో కూడా తెలియదు, అబ్బాయిలే ఛానెల్‌ని ప్రారంభించారని వెల్లడించాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన పదార్థాలతో ప్రయోగాలు చేస్తూండటంతో స్పందన బాగా వచ్చింది. 2021 ఏప్రిల్‌లో తన సొంత YouTube ఛానెల్, Instagram పేజీని ప్రారంభించాడు. ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూడలేదు. తన వెళ్లే ప్రదేశాలు, వండుకునే సూపర్ వంటకాలు, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, మఠర్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకటీ రెండూకాదు రోడ్డు పక్కన జరిగిన సంఘటనలు,ఎన్నోఅద్భుతాలు వీడియోల ద్వారా నెటిజనులకు పరిచయం చేశాడు. ప్రతీ వీడియోకు లక్షలకు పైగా వ్యూస్. సబ్స్క్రైబర్లు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చారు. 786 వీడియోలు చేశాడు. 50, 60 లక్షల వ్యూస్ వచ్చిన వీడియోలున్నాయటే రాజేష వీడియోల క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by R_ Rajesh (@r_rajesh_07) ఆర్ రాజేష్ వ్లాగ్స్ ఛానెల్‌తో సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు ఆయన భాష కూడా నిజంగా సూపర్ చెఫ్లాగా ఉండటంతో ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో "మాస్టర్‌చెఫ్" , బెస్ట్ ఫుడ్ వ్లాగర్" గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు నెటిజన్లు అతని ట్రక్కును "ఫైవ్ స్టార్ రెస్టారెంట్" లేదా "చల్తా ఫిర్తా దాభా" అని పిలవడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే డ్రైవర్లు నిర్జన ప్రదేశంలో ట్రక్ చెడిపోయినప్పుడు, చెత్త రోడ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే మరమ్మత్తు ఎలా చేసుకోవాలి లాంటివాటితో పాటు తన ట్రక్కు నుండి డ్రోన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ నుండి పాట్నాకు వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్‌ను చూపించింది. ఈ క్లిప్‌కి ఐదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో అతని వంటకాలు, వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. ఎనిమిది లక్షలకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్నారు. దీంతో సంపాదన కూడా బాగానే ఉంది. రాజేష్ కుమారుడు కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే ఇపుడొక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు ఇద్దరూ. కొత్త ఇంటిపార్టీ వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. రాజేష్ సక్సెస్ జర్నీని పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను బాగా ఆకట్టుకుంది. మండే మోటివేషన్ను అంటూ రాజేష్ స్టోరీని ట్విటర్లో షేర్ చేశారు. 25 సంవత్సరాలకు పైగా ట్రక్ డ్రైవర్‌గా ఉన్న రాజేష్ రావాని, తన వృత్తికి ఫుడ్ & ట్రావెల్ వ్లాగింగ్ యాడ్ చేసి ఇపుడొక ఇంటి వాడయ్యాడు అంటూ ట్వీట్ చేశారు. -
Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది
భిన్న జీవనం జెలజ కుటుంబం ఇంట్లో కంటే రోడ్డు మీదే ఎక్కువగా ఉంటుంది. జెలజ ట్రక్ డ్రైవర్. భర్తకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. తొలత గృహిణిగా ఉన్న జెలజ మెల్లగా డ్రైవింగ్ నేర్చుకుంది. లోడు దించేందుకు కుటుంబంతో బయలుదేరి కొత్త ప్రాంతాల వీడియో చేస్తుంది. ఆమె కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ తోలింది. కూతురు తల్లితోపాటు డ్రైవింగ్ నేర్చుకుంది. ‘పుతట్టు ట్రావెల్ వ్లోగ్’ పేరుతో ఈ కుటుంబ యానం లక్షల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించింది. ఉదాహరణకు జెలజ జీవితం ఇలా ఉంటుంది. ఆమె కేరళలోని కొట్టాయం నుంచి ప్లైవుడ్ లోడ్ తీసుకుని పూణెలో డెలివరీ చేస్తుంది. కాని ఖాళీ ట్రక్కు వెనక్కు తెస్తే నష్టం. ‘ఉల్లిపాయల లోడు కశ్మీర్లో దింపుతారా’ అని పూణెలో అడుగుతారు. ‘దింపుతాను’ అని బయలుదేరుతుంది. కశ్మీర్ చేరుకుంటుంది. అక్కడ లోడ్ దొరకదు ఒక్కోసారి. ఢిల్లీ, హర్యాణ దాకా వచ్చే లోడ్ దొరుకుతుంది. ఏదో ఒక సరుకు కేరళకు దింపే బుకింగ్ వస్తుంది. ఆ లోడు తీసుకుని కేరళ చేరుకుంటుంది. ‘కేరళలో ప్రతి సంవత్సరం జారీ అవుతున్న డ్రైవింగ్ లైసెన్స్‌లలో 40 శాతం స్త్రీలవి. టూ వీలర్లు కార్లు సరే... బస్సులు కూడా కేరళలో నడుపుతున్నారు స్త్రీలు. కాని ట్రక్కు నడిపే స్త్రీలు చాలా అరుదు. అందుకే జెలజ ను చూసి అందరూ గౌరవిస్తారు’ అంటాడు రతీష్. అతడు జెలజ భర్త. ఆమె లాంగ్ డ్రైవ్‌కి బయలుదేరితే చాలాసార్లు తోడు ఉంటాడు. ఒక్కోసారి పెద్దకూతురు, భార్య డ్రైవ్ చేస్తుంటే వారికి తోడు వస్తాడు. అతను స్వయంగా డ్రైవరు. కాని తన కుటుంబ స్త్రీలు హైవేలను జయిస్తూ ఉంటే సంతోషపడతాడు. గృహిణి నుంచి డ్రైవర్‌గా రతీష్ 2003 వరకూ ఒక సాధారణ ట్రక్ డ్రైవర్. ఆ సంవత్సరం ఆరు లక్షలు లోన్ తీసుకుని ఒక భారత్ బెంజ్ ట్రక్ కొన్నాడు. కలిసొచ్చింది. తన సోదరుడితో కలిసి ఇప్పుడు 27 నేషనల్ పర్మిట్ ట్రక్కులతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. తరచూ లాంగ్ డ్రైవ్‌కి వెళ్లే రతీష్ని జెలజ ‘నేనూ నీతో రానా కొత్తప్రాంతాలు చూడాలని ఉంది’ అనడిగింది. ‘రావచ్చు. కాని నువ్వు ట్రక్కు నడపడం నేర్చుకుంటే’ అన్నాడు రతీష్. అప్పటికి జెలజ కేవలం గృహిణి. టూ వీలర్ నడపడం కూడా రాదు. ఆమె మొదట టూ వీలర్.. ఆ తర్వాత కారు నడిపి ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. భర్తను తోడు తీసుకుని స్వయంగా ట్రక్ నడుపుతూ లోడ్ డెలివరీ చేయడం ్ప్రారంభించింది. వీడియోలు చేస్తూ ‘మాది ఉమ్మడి కుటుంబం. నా మరిది, తోటికోడలు, అత్తగారు.. అందరం కలిసి ఉంటాం. అందుకే నా ఇద్దరు పిల్లలను వదిలి ట్రక్ తీసుకుని బయలుదేరుతాను’ అంటుంది జెలజ. ఆమె పెద్ద కూతురు కూడా ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. లోడ్లు దింపే పనిలో భాగంగా పర్యటనలు కూడా ఈ కుటుంబం ట్రక్కు ద్వారా ముగిస్తారు. ‘మేఘాలయా, కోల్కటా, పోర్బందర్... ఇలా ఎన్నో కొత్తప్రాంతాలు చూశాను’ అంటుంది జెలజ.. ఎక్కడకు వెళ్లినా అక్కడి విశేషాలు వీడియోలు చేస్తూ అక్కడి సంస్కృతి, అలవాట్లు తెలియచేస్తూ ఉంటుంది. రోడ్డు పక్కన ట్రక్కు ఆపి వంట చేసుకుని తోటి డ్రైవర్లతో కలిసి తినడం ఆ వీడియోలు కనపడుతుంది. ఒకసారి అత్తగారిని తీసుకుని ఆమె ట్రక్కులోనే లాంగ్ జర్నీ చేసింది. కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ నడిపి వార్తల్లోకి ఎక్కింది జెలజ . ‘వాష్‌రూమ్‌లు ఒక్కటే ఇబ్బంది. పెట్రోల్ బంకుల్లో ఉన్నవాటిని ఉపయోగిస్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో పోలీసులు పీక్కు తింటారు మామూళ్ల కోసం. మిగిలిన రాష్ట్రాలు పర్లేదు. ఇక దొంగల భయం ఉంటుంది. కాని హైవేల మీద తిరగ్గా తిరగ్గా ఆ భయం పోయింది’ అంటుంది జెలజ. -
ట్రక్కు డ్రైవర్లకు ఇక రాజభోగాలు
-
ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని కీలక నిర్ణయం
హైవేలపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు , మొదటి దశలో 1,000 భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానిమోదీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని శుక్రవారం అన్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘వాహన రంగంలో డ్రైవర్లది కీలక పాత్ర. చాలా గంటల పాటు వాహనాన్ని నడుపుతుంటారు. కానీ వాళ్లకు సరైన విశ్రాంతి ప్రాంతం దొరకడం లేదు. సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల రహదారి ప్రమాదాలకు దారి తీస్తోంది. దాంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుంది’ అన్నారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్తపథకంలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక భవనాల్లో ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వసతులు ఉండనున్నాయి. డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అన్ని వసతులు అభివృద్ధి చేయనున్నట్లు మోడీ చెప్పారు. ఈ పథకంలో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా 1,000 భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఇదీ చదవండి: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్! అక్టోబర్ 1, 2025న లేదా ఆ తర్వాత తయారు చేసే అన్ని కొత్త ట్రక్కుల్లో డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లను ఏర్పాటు చేసేలా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు రోజుల పాటు జరిగే ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో 50కి పైగా దేశాల నుంచి 800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. -
హైవేలపై డ్రైవర్లకు భవనాలు: మోదీ
న్యూఢిల్లీ: ట్రక్కులు, ట్యాక్సీ డ్రైవర్లకు జాతీయ రహదారులపై తగినంత విశ్రాంతి తదితర సౌకర్యాల నిమిత్తం కొత్త పథకం తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘ఇందులో భాగంగా తొలి దశలో అన్ని సదుపాయాలతో కూడిన 1,000 అధునాతన భవనాలు నిర్మిస్తాం. వాటిలో ఫుడ్ స్టాళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, టాయ్లెట్లు, పార్కింగ్, విశ్రాంతి స్థలాల వంటివిన్నీ ఉంటాయి’’ అని వెల్లడించారు. శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2024లో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు తీస్తోందని మోదీ అన్నారు. తాము వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పునరుద్ఘాటించారు. ఆటో, ఆటోమోటివ్ పరిశ్రమది ఇందులో కీలక పాత్ర కానుందన్నారు. దేశ మొబైల్ పరిశ్రమకు ఇది స్వర్ణయుగమన్నారు. -
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్‌ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం
ఢిల్లీ: ట్రక్ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రాత్రి 7 గంటలకు డ్రైవర్ల యూనియన్ తో చర్చలు జరుపనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించడంపై ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి ఆందోళన చేపడుతున్నారు. మంగళవారం ఆ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులను ట్రక్కు డ్రైవర్లు దిగ్బంధించారు. రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రక్కులు, ప్రైవేట్ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఇంధన కొరత.. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా చేసే ట్రక్కులు కూడా రాకపోకలను నిలిపివేశాయి. పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. బంకుల ముందు వాహనదారులు వందల మీటర్ల బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చట్టంలో మార్పులేంటి..? భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు రూపొందించింది. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఐపీసీ(భారతీయ శిక్షా స్మృతి) ప్రకారం రెండేళ్లే జైలు శిక్ష ఉండేది. కొత్త నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ -
లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..
ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకులైనా అలవొకగా ఎదుర్కొని సాధించొచ్చు అనేందుకు ఆ మహిళ నిలువెత్తు నిదర్శనం. లా చేసినా.. పరిస్థితులు తలికిందులై హేళన చేసినా.. తగ్గేదే లే అని పొట్ట పోషణ కోసం మగాడిలా కష్టపడింది. మగవాళ్లు చేసే పనిలో దూసుకుపోయింది. అడగడుగున అవహేళనలు, వెక్కిరింతలు, అసహ్యమైన చూపులు అవన్నీ పక్కకు నెట్టి తన మార్గంలో తాను అజేయంగా దూసుకుపోయింది. మహిళలు చేయలేని పని అంటూ ఏమిలేదని అందరిచేత ప్రశంసలందుకోంటోంది యోగితా రఘువంశీ. న్యాయవాది నుంచి ట్రక్ డ్రైవర్‌గా మలుపు తిరిగిన తన జీవన ప్రయాణం గురించి ఆమె మాటల్లో... లాయర్ అయినా యోగితా రఘువంశీ పొట్ట పోషణ కోసం డ్రైవర్‌గా మారింది. అదికూడా ఓ ట్రక్ డ్రైవర్‌గా ఎన్నో వేల మైళ్లు వెళ్లింది. దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల సరిహద్దులను చుట్టి వచ్చింది. పురుషులు ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ వృత్తిలో మధ్యప్రదేశ్‌కు చెందిన యోగిత రఘువంశీ గత 15 ఏళ్లుగా ఎన్నో మైళ్లు ప్రయాణించారు. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ దేశంలో సగానికి పైగా ప్రయాణించింది. యోగిత లా, బిజినెస్‌లో డిగ్రీ చేసింది కూడా. అలాగే సెలూన్, డ్రస్ డిజైన్ కోర్సులలో కూడా పనిచేసింది. న్యాయవాద వృత్తిని కొనసాగించాలని భర్త సూచించినా పట్టించుకోలేదు. భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా సంతృృప్తిగా సాగిపోతుంది కదా జీవితం అనుకుంది. అందువల్లే పెద్దగా డబ్బులు వెనకేసుకుంది కూడా లేదు. సరిగ్గా అదే సమయంలో భర్త అకాల మరణంతో ప్రశ్నార్థకంగా మారిన పిల్లల పోషణ ఆమెను స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేసేలా చేసింది. ఇక ఈ వృత్తిలో ఎన్నో మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. పైగా ఆమె ఒక్కోరోజు భోపాల్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు 11 వందల మైళ్ల దూరాన్ని కేవలం మూడు రోజుల్లోనే చేసింది. ఆ ప్రయాణంలో ఎన్నో అసభ్యకరమైన వ్యాఖ్యలు, చూపులు, ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోంటూ సాగింది. అలాగే ట్రక్ డ్రైవర్లు రాష్ట్ర సరిహద్దుల వద్ద ఎదుర్కొటున్న వేధింపులను నిర్మొహమాటంగా చెప్పింది. ఆర్టీవోలు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల కన్నా డ్రైవర్ల నుంచి రాబట్టే మాముళ్లతోనే ఇళ్లను నడుపుతున్నారని చెప్పుకొచ్చింది. ఓ ప్రముఖ రవాణా సంస్థ ఏఐటీడబ్ల్యూఏ ప్రత్యేక కార్యదర్శి సుమితా దావ్రా సమక్షంలో ఈ విషయాలన్ని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఈమేరకు యోగితా రఘువంశీ మాట్లాడుతూ..ద్వేషపూరితమైన మనుషుల మధ్య నా కెరియర్ ప్రారంభమైంది. ఇప్పుడూ నాకంటూ ఓ సొంత మార్గాన్ని ఏర్పరుచుకున్నా. అంతేగాదు పురుషుడు ఎక్కువగా ఉండే ఈ రంగంలో నమ్మకమైన శక్తిమంతమైన మహిళగా పేరుతెచ్చుకున్నా. ఒక పక్క నావృత్తి చేస్తూనే..సరిహద్దుల మధ్య ఎదరవుతున్న లింగ వివక్ష, అవినీతిపై పోరాడుతున్నా అని ధైర్యంగా చెబుతోంది యోగితా రఘువంశీ. అతేకాదు ఆమె 2006లో ట్రక్ డ్రైవర్‌గా లైసెన్స్ పొందింది. దీంతో భారతదేశంలో లైసెన్స్ పొందిన తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా యోగిత ఘనత సృష్టించింది. (చదవండి: మెషీన్స్‌కూ..మదర్‌టంగ్ కావాలోయ్!) -
లైఫ్ బోర్ కొడుతోంది, ఇలా బతకలేను.. ట్రక్కు డ్రైవర్‌గా మారిన సీఈఓ
జీవితంలో మనీ ఉంటే చాలని కొందరు భావిస్తారు. అందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తూ కోట్లు వెనకేసుకుంటుంటారు. ఇంకొందరు పైసలు మాత్రమే కాదు ప్రశాంతత కూడా కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆస్తులు, బంగ్లాలు, హోదాలు వద్దని సాధరణ జీవితంవైప మొగ్గు చూపుతుంటారు. ఇలా ఎవరికి నచ్చిన దారిలో వాళ్లు తమ గమనాన్ని నిర్ణయించుకుంటుంటారు. తాజాగా ఓ సంస్థ సీఈవో తన లైఫ్ బోరింగ్‌గా ఉందని.. ఆ జీవితానికి స్వస్తి పలుకుతూ ట్రక్కు డ్రైవర్‌గా మారాడు. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ రాస్ మొదట్లో కార్ల సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిని ప్రారంభించాడు. అంతా బాగానే సాగుతోంది, జీతం మంచిగానే సంపాదిస్తున్నాడు. అయితే అతని జీవితంలో ఏదో కోల్పోయానన్న అసంతృప్తి మాత్రం పేరుకుపోయింది. అయితే కుటుంబం గురించి ఆలోచించి ఆ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కాలక్రమంలో ఆయన ఓ సినిమా హాళ్ల సంస్థకు సీఈవోగా ఎదిగారు. హోదా, ఆస్తులు, సకల సౌకర్యాలు.. ఇలా ఎన్ని సాధించినా.. ఆయన మనసులో మాత్రం ఆ వెలితి అలానే ఉండిపోయింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సాధారణంగా, ఒత్తిడికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్నాడు. అప్పటికే గ్రెగ్‌కు ఆరు పదులు నిండాయి. అయినా వయసుకు మనసుకు సంబంధం లేదని గ్రహించాడు. ఉద్యోగాన్ని వదిలి ఓ రవాణా కంపెనీలో ట్రక్కు డ్రైవర్‌గా చేరి హ్యాపీగా జీవిస్తున్నాడు. ప్రస్తుతం గ్రెగ్‌కు 72 ఏళ్లు. 20 ఏళ్ల క్రితం రాస్ థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స చేసిన వైద్యులు కేవలం 3 నెలలు మాత్రమే బతికే అవకాశముందని చెప్పారు. అలాంటి వ్యక్తి క్యాన్సర్‌ను జయించి.. సీఈవో ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. గత 12 ఏళ్లుగా ఇలాగే జీవనం సాగిస్తున్నారు. చదవండి: ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్! -
బిపర్ జోయ్: రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం.. పోర్టులో ఇరుక్కుపోయి..
గుజరాత్: బిపర్ జోయ్ తుఫాను గుజరాత్ తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించడంతో గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని పోర్టులన్నిటి నుండి కార్యకలాపాలను నిలిపివేశారు అధికారులు. ముంద్రా, కండ్ల వంటి పోర్టుల నుండి రవాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఢిల్లీ నుండి గుజరాత్ వచ్చిన ట్రక్ డ్రైవర్ ఒకతను కండ్ల పోర్టులో ఇరుక్కుపోయాడు. తన ఇంటికి క్షేమ సమాచారం ఇవ్వడానికి కూడా వీలులేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయాడు. అతనిలాగే మరో ట్రక్ డ్రైవర్ తుఫాను ప్రభావంతో విద్యుత్తు నిలిచిపోయిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు కావాల్సిన సరుకులను ట్రక్ లో లోడ్ చేసుకుని అధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు. ఢిల్లీ నుంచి వచ్చి ఇరుక్కుపోయాను.. ఇస్మాయిల్ షేక్ అని ఒక డ్రైవర్ గురువారం ఢిల్లీ నుండి తన ట్రక్‌లో లోడ్ తీసుకొచ్చి కండ్ల పోర్టు వద్ద దించిన నాటి నుండి తుఫాను ఉధృతం కావడంతో ఎక్కడికీ కదల్లేక అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్ దగ్గర ఉండిపోయాడు. ఇంటికి ఫోన్ చేద్దామంటే ఛార్జింగ్ లేక ఫోన్ డెడ్ అయిపొయింది. ఇంట్లో మావాళ్లు న గురించి కంగారుపడుతుంటారు. ముంద్రా నుండి మళ్ళీ లోడ్ ఎత్తుకుని హర్యానా వెళ్ళవలసి ఉండగా ఈ గాలులకు ఖాళీ బండితో రోడ్డు మీదకు వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందో నాని భయంతో ఇక్కడే ఆగిపోయానని అంటున్నాడు. ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాను.. ఇదిలా ఉండగా విద్యుత్ నిలిచిపోయిన గ్రామాల్లో కరెంటును పునరుద్దీకరించడానికి అవసరమైన లోడును ఎక్కించుకుని మహమ్మద్ ఖాసం అనే మరో డ్రైవరు కూడా తుఫానులో ఇరుక్కుపోయాడు. అధికారులు ఆదేశమిస్తే తప్ప తానిక్కడ నుండి బయలుదేరలేని పరిస్థితుల్లో ఉన్నానన్నాడు. సమయం పడుతుంది.. వారం రోజులుగా గుజరాత్లో అల్లకల్లోలం సృష్టిస్తోన్న భీకర బిపర్ జోయ్ తుఫాను తీరాన్ని తాకింది. ప్రచండ వేగంతో వీస్తున్న గాలులతో పాటు భారీ వర్షం కూడా పడుతుండడంతో ప్రజల జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సుమారుగా 1000 గ్రామాలకు విద్యుత్తు అంతరాయం కలగడంతో ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. గాలుల బీభత్సానికి రోడ్లమీద చెట్లు విరిగిపడ్డాయి, కరెంటు స్తంభాలు నేలకూలాయి. గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, తుఫాను ఉధృతి తగ్గకపోవడంతో పునరుద్ధరీకరణ పనుల్లో కొంత ఆలస్యమవుతోందని అంటున్నారు అధికారులు. ఇది కూడా చదవండి: బిపర్జోయ్ విలయం.. ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు -
ఆలా లారీ లో రాహుల్
-
ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!
భారతదేశంలో ఉన్నత చదువులు చదివిన చాలా మంది విదేశలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేసి బాగా సంపాదించి జీవితంలో స్థిరపడాలని కలలు కంటూ ఉంటారు. అయితే కెనడాలో ఉన్నత చదువు చదివిన భారతీయుడు ట్రక్కు డ్రైవర్ జాబ్ చేస్తూ సంవత్సరానికి ఏకంగా రూ. 50 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2012లో కెనడాకు ఉన్నత విద్య కోసం వచ్చి చాలా కాలంగా అక్కడే స్థిరపడిన ఒక ఇండియన్ చదువు పూర్తయిన తరువాత ట్రక్కు డ్రైవర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. అయితే యితడు ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో గగన్ కల్రా - కెనడా అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. చదువు పూర్తయిన తరువాత ఉపాధి అవకాశాల కోసం చాలా అన్వేషించినట్లు, అందులో అతనికి ట్రక్కింగ్ చాలా ఆసక్తికరంగా అనిపించడంతో దానిని ఎంచుకున్నట్లు వివరించాడు. కెనడాలో చాలా ట్రక్కింగ్ కంపెనీలు తమ డ్రైవర్లకు, వారు కవర్ చేసే దూరాన్ని బట్టి డబ్బు చెల్లిస్తారు. ఒక మైలుకి 55 సెంట్లు చొప్పున ఈ ఇంజినీరింగ్ ట్రక్ డ్రైవర్ నెలకు 1700 కెనడియన్ డాలర్లను సంపాదిస్తున్నాడు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు నెలకు రూ. 4 లక్షలు, సంవత్సరానికి రూ. 50 లక్షల కంటే ఎక్కువ. ఒక వేళా కెనడాలో సొంత ట్రక్కుని కలిగి ఉంటే అంతకు మించి సంపాదించవచ్చని అతడు చెబుతున్నాడు. (ఇదీ చదవండి: ఖాతాదారులు ఎగిరి గంతేసే వార్త చెప్పిన ఆర్బిఐ.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) కెనడాలో డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ పొందడం కోసం ప్రావిన్సుల వారీగా రిక్వైర్మెంట్ మూరుతూ ఉంటాయని కూడా ప్రస్తావించారు. మొదట అతడు సుదీర్ఘ ప్రయాణాలు చేసాడు. ఇందులో భాగంగానే కెనడాలోని వివిధ ప్రాంతాలు మాత్రమే కాకుండా.. కెనడా నుంచి అమెరికాకు కూడా వెళ్ళాడు. వృత్తి రీత్యా ఇంజినీర్ అయినప్పటికీ ట్రక్కు డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అంతే కాకుండా కెనడాలో ఉన్నత విద్య చదివినవారి సంఖ్య చాలా ఎక్కువని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: వ్యాపార రంగంలో 'తల్లీ కూతుళ్ళ' విజయ ప్రస్థానం!) ట్రక్కింగ్ విషయానికి వస్తే సుదూర ప్రాంతాలకు మాత్రమే కాకుండా తక్కువ దూరాలకు ప్రయాణించే వెసులు బాట్లు ఉంటాయి. ట్రక్కు డ్రైవ్ చేసే డ్రైవర్లు చాలా వరకు ట్రక్కుల్లోనే జీవితం గడిపేస్తారు. కుటుంబాలతో గడిపే సమయం కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. ఈ వీడియోలో ట్రక్కు డ్రైవర్ జీవితం గురించి మాత్రమే కాకుండా ట్రక్కు లోపల భాగాన్ని కూడా చూడవచ్చు. ఒక డ్రైవర్ వారానికి గరిష్టంగా 70 గంటలు డ్రైవ్ చేసిన తరువాత మళ్ళీ డ్రైవ్ ప్రారభించాలంటే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఇంజనీర్ ట్రక్కు డ్రైవర్ వివరించాడు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
అమ్మ, ముగ్గురు చెల్లెళ్ల భారం... తొలుత స్కూల్ బస్ డ్రైవర్‌గా.. ఇప్పుడేమో!
ప్రతి పనిలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు నేటితరం మహిళలు. గరిటే కాదు స్టీరింగ్నూ తిప్పేస్తామని అనేక సందర్భాల్లో స్టీరింగ్‌ను చాకచక్యంగా తిప్పిచూపించిన వారెందరో. తాజాగా ఈ జాబితాలో చేరిన జాయిసీ లింగ్డో.. అతిపెద్ద సంస్థ అమెజాన్‌లో ట్రక్ స్టీరింగ్ తిప్పుతూ ఔరా అనిపిస్తోంది. ఒకచోటనుంచి మరోచోటుకు అమెజాన్ గూడ్స్‌ను రవాణా చేస్తూ అమెజాన్ ఇండియాలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా నిలిచింది . తనలాంటి వారెందరికో డ్రైవింగ్ కూడా ఒక ఉపాధి మార్గమంటూ చెప్పకనే చెబుతోంది. మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన 35 ఏళ్ల నిరుపేద మహిళే జాయిసీ లింగ్డో. ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో అమ్మ, ముగ్గురు చెల్లెళ్ల భారం జాయిసీ భుజాలపైన పడింది. దీంతో చదువుని త్వరగా ముగించేసి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించసాగింది. గువహటీలోని స్టీల్ కంపెనీతోపాటు ఇతర కంపెనీలు, స్థానిక షాపుల్లో స్టోర్ మేనేజర్‌గా పనిచేసేది. సరదాగా ప్రారంభించి... ఒకపక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క తన స్నేహితుల సాయంతో సరదాగా డ్రైవింగ్ నేర్చుకుంది. స్టీరింగ్ తిప్పడం బాగా వచ్చాక ఓ స్కూల్ బస్‌కు డ్రైవర్‌గా చేరింది. కొంతకాలం పని చేశాక అమెజాన్‌లో ట్రక్ డ్రైవర్స్‌ను తీసుకుంటున్నారని తెలిసి దరఖాస్తు చేసుకుంది. ఆరేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండడంతో అమెజాన్ కంపెనీ జాయిసీని తీసుకుంది. దీంతో అమెజాన్ ఇండియాలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్ గా నిలిచింది. గువహటీ వ్యాప్తంగా అమెజాన్ గూడ్స్‌ను సమయానికి డెలివరీ చేస్తూ మంచి డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మహిళా ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ, తనలాంటి మహిళలెందరికో కొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తోన్న జాయిసీ అమేజింగ్ డ్రైవర్‌గా పేరు తెచ్చుకుంటోంది. మనసుంటే మార్గం ఉంటుంది వివిధ ప్రాంతాలకు తిరుగుతూ కొత్త ప్రాంతాలు, కొత్త మనుషుల్ని కలవడం బాగా నచ్చింది. అందుకే డ్రైవింగ్ మీద ఉన్న ఆసక్తిని వృత్తిగా మార్చుకుని రాణించగలుగుతున్నాను. డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకోవాలనుకునేవారు ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. కొత్త ఉపాధి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి వాటిని అందిపుచ్చుకునేందుకు ఆరాటపడాలి. కొత్తదారిలో నడిచేటప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయి. సాధించాలన్న మనస్సుంటే మార్గం తప్పకుండా దారి చూపుతుంది. – జాయిసీ లింగ్డో చదవండి: Viraj Mithani: ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో Street Child World Cup 2022: వీధి బాలికల టీమ్ ఆడుతోంది చూడండి -
ట్రక్ డ్రైవర్‌కు న్యాయం జరిగింది.. 110 ఏళ్ల జైలు శిక్ష పదేళ్లకు తగ్గింపు
ట్రక్ డ్రైవర్‌కు 110ఏళ్ల జైలు శిక్ష విధించింది ఓ కోర్టు. ఈ తీర్పుపై పెద్దఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రోజెల్ అగ్యిలేరా-మెడెరోస్ అనే ఓ వ్యక్తి నడుపుతున్న ట్రక్ 2019లో అమెరికాలోని కొలరాడోలో ప్రమాదవశాత్తు లారీపైకి దూసుకేళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రోజెల్‌కు కోర్టు భారీ శిక్ష(110 ఏళ్ల కారాగారం) విధించింది. క్యూబా దేశస్తుడైన రోజెల్.. రాకీ పర్వత ప్రాంతంలో కలపను రవాణా చేసే ట్రక్ డైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తను నడుపుత్ను ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, వాహనాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాని రోజెల్ తెలిపాడు. తను కావాలని లారీని ఢికొట్టలేదని పేర్కొన్నాడు. అయితే అతని వాదనలు కొట్టిపారేసిన కొలరాడో కోర్టు.. 110 ఏళ్ల జీవితా కారాగార శిక్ష విధించింది. అతనికి విధించిన భారీ శిక్ష అన్యాయమని పెద్ద ఎత్తున కొలరాడోలో ర్యాలీలు నిర్వహించారు. ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దేషియన్ వెస్ట్ కూడా రోజెల్‌కు విధించిన శిక్ష తగ్గించాలనే పిటిషన్‌కు మద్దతు తెలిపింది. అదేవిధంగా కొలరాడోలోని ట్రక్ డ్రైవర్లు అతనికి విధించిన భారీ శిక్షకు వ్యతిరేకంగా ట్రక్‌లను నడపటం బాయ్‌కాట్ చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రోజెల్‌కు విధించిన శిక్ష అన్యాయమని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తీవ్రమైన విమర్శలు వెళ్లువెత్తున్న సమయంలో గురువారం ట్రైయర్ కోర్టు రోజెల్ కేసుపై మరోసారి విచారణ చేపట్టింది. అయితే అతనికి విధించిన 110 ఏళ్ల జైలు శిక్షను పదేళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. తాజాగా వెల్లడించిన కోర్టు తీర్పుపై రోజెల్ తల్లి ఆనందం వ్యక్తం చేసింది. -
మనోడి లక్ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేది..!
-
వైరల్: మనోడి లక్ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి..!
ప్రమాదాలనేవి ఎప్పుడు, ఏ రకంగా వస్తాయో ఎవరూ ఊహించలేం. అవి ఎదురైనప్పుడు కొందరు లక్కీగా తప్పించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ ట్రక్ డ్రైవర్ అదృష్టం బాగుండడంతో తన ట్రక్ కారణంగా ప్రాణాలు పోకుండా తప్పించుకున్నాడు. అయినా, పాపం తన ట్రక్ మీద తెచ్చిన కారుతో ముప్పతిప్పలు పడ్డాడు. ఈ ఘటన బ్రెజిల్, సావోపాలోలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్యాంపినాస్‌కు చెందిన ఓ డ్రైవర్ తన ట్రక్‌పై నల్ల కారును తీసుకెళుతున్నాడు. అతను వెళ్తున్న దారిలో ఓ చోట ఎత్తుగా ఉండడంతో పాటు రోడ్డు మలుపు తిరుగుతుండడంతో ట్రక్ మీద ఉన్న కారు సడన్‌గా కిందపడి వెనుక్క వెళ్లింది. అది గమనించిన ఆ వ్యక్తి ట్రక్‌లోంచి కిందకు దూకి కారు వెంట పరిగెత్తాడు. కారు చివరకు ఓ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. హమ్మయ్యా అనుకున్న డ్రైవర్ ట్రక్‌ను తీసుకువచ్చి కారుకు కొద్దిదూరంలో ఆపాడు. కారు టెన్షన్లో ట్రక్కు హ్యాండ్ బ్రేక్ వేయటం ఆ వ్యక్తి మర్చిపోయాడు. ఈ క్రమంలో అతడు ట్రక్ నుంచి కిందకు దిగి కారు దగ్గరకు వస్తుండగా.. ట్రక్ కిందకు దొర్లసాగింది. అతడు దాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. అది ఏకంగా దొర్లుకుంటూ కారును ఢీకొట్టింది. అయితే, ట్రక్కు, కారుకు మధ్య ఉన్న ఆ ట్రక్ డ్రైవర్ కాస్త ఉంటే ఆ రెండింటి మధ్య నలిగిపోయేవాడే. పక్కకు జరగటంతో పెనుప్రమాదం తప్పింది. ట్రక్ కారును ఢీకొట్టి వెనక్కు వెళ్లి ఇంటిని ఢీకొట్టి ఆగిపోయింది. ఈనెల 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: చిప్స్ ప్యాకెట్లో అది చూసి షాక్ అయిన కస్టమర్..! -
క్లీనర్ లేని లారీ.. నడిపేవారేరీ!
సాక్షి, అమరావతి బ్యూరో: లారీలకు రథసారథుల కొరత ఏర్పడింది. దాదాపు 15 ఏళ్లుగా డ్రైవర్ల కొరత ఎక్కువవుతోంది. ఇచ్చే జీతం కంటే.. వారికొచ్చే కమీషన్లు, ట్రిప్పుల మామూళ్లు వంటి వాటితో డ్రైవర్ల ఆదాయం మెరుగ్గా ఉండేది. మొదట్లో లారీలపై క్లీనర్లుగా చేరి ఆపై డ్రైవర్లు అయ్యేవారు. భార్యాపిల్లలకు, కుటుంబాలకు వారాల తరబడి దూరంగా ఉండాల్సి వచ్చినా.. ఆదాయం బాగుండటంతో డ్రైవర్ వృత్తి వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు ఆ వృత్తి చేపట్టేవారు తగ్గిపోయారు. పాత తరం డ్రైవర్లు వృద్ధాప్యానికి చేరుకోవడం, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు అధికంగా సంభవించడం, వారి సంతానం ఈ వృత్తిపై ఆసక్తి చూపకపోవడం, వీరి పిల్లలు చదువుకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలు, ఇతర వృత్తులు, వ్యాపారాల వైపు మళ్లడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం వంటివి డ్రైవర్ల కొరతకు కారణమవుతున్నాయి. ఇది లారీ యజమానులకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో సరుకు రవాణా చేసే లారీలు 3 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 35 శాతం లారీలకు డ్రైవర్ల కొరత ఉందని యజమానులు చెబుతున్నారు. (చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..) ఇతర రాష్ట్రాల నుంచి.. లారీ యజమానులు స్వరాష్ట్రంలో డ్రైవర్లు దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో అధిక జీతాలిచ్చి మరీ డ్రైవర్లను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారు. కొన్నాళ్లుగా బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి డ్రైవర్లు వస్తున్నారు. వీరికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు (ట్రాలీ డ్రైవర్లకు) చెల్లిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమయానికి వీరు కూడా అందుబాటులో లేక యజమానులు అవస్థలు పడుతున్నారు. స్థానిక డ్రైవర్లు, వయసు మీరిన కొందరు దూర ప్రాంతాల కంటే లోకల్ లారీల్లో తిరగడానికే ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో డ్రైవర్ల శిక్షణ కేంద్రం లారీ డ్రైవర్ల కొరత ఏర్పడుతుందని ముందుగానే ఊహించిన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడకు 32 కిలోమీటర్ల దూరంలోని అంపాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 2005లో మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించింది. 20 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు రూ.5.50 కోట్లు వెచ్చించింది. రోజుకు 8 గంటల చొప్పున 32 రోజుల పాటు పూర్తిస్థాయి డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. బయట డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఈ శిక్షణకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తే ఇక్కడ కేవలం రూ.6 వేల నామమాత్రపు ఫీజు మాత్రమే తీసుకుంటారు. ఈ ఇన్స్టిట్యూట్ కృష్ణా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లో డ్రైవర్ల కొరతను కొంతవరకు తీరుస్తోంది. క్లీనర్ల వ్యవస్థకు చెల్లు.. ఒకవైపు డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండగా మరోవైపు క్లీనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు ప్రతి లారీకి డ్రైవర్‌తో పాటు క్లీనర్ తప్పనిసరి. కానీ క్లీనర్‌గా చేరడానికి మునుపటిలా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఒక్క డ్రైవర్‌తోనే ‘బండి’ లాగిస్తున్నారు. (చదవండి: సీఎంపై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదు) -
Lockdown: కష్టాలు.. ట్రక్ డ్రైవర్‌గా మారిన నటి
షూటింగ్‌లు కలిసి రాలేదు. లాక్డౌన్లో పని లేదు. కార్తీకకు యాక్టింగ్‌తో పాటు డ్రైవింగ్ వచ్చు. ఉన్న డబ్బుతో ఒక ట్రక్ కొనింది. కూరగాయలు, పండ్లు తిప్పే బండ్లకు లాక్డౌన్ నియమాలు వర్తించవు. ఇక కార్తీక ఫుల్ బిజీ అయ్యింది. పైనాపిల్స్ చీప్‌గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు, కొబ్బరిబోండాలు సలీసుగా దొరికే చోటు నుంచి పిరిమిగా ఉండే చోటుకు సరఫరా చేస్తూ స్టార్ డ్రైవర్‌గా నవ్వులు చిందిస్తోంది. ఒక కేరళ నటి స్ఫూర్తి ఇది. అర్ధరాత్రి. కేరళలోని మలప్పురం చెక్‌పోస్ట్ దగ్గర అటుగా వచ్చిన ట్రక్‌ను పోలీసులు ఆపారు. ‘బండిలో ఏముంది?’ డ్రైవర్‌ను అడిగారు. ‘పైనాపిల్స్’ అనే సమాధానం వినిపించింది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కారణం డ్రైవింగ్ సీట్లో ఉన్నది మహిళా డ్రైవర్. జీన్స్ ప్యాంట్, షర్ట్ వేసుకుని, పైన ఖాకీ షర్ట్ వేసుకుని, టోపీ పెట్టుకుని ఉంది. ‘ఏమైంది సార్. పండ్ల బండ్లకు ప్రాబ్లం లేదు కదా. తొందరగా వదలండి. నాకు ఆలస్యమైపోతోంది’ అందా డ్రైవర్. పోలీసులు లోడ్ చెక్ చేశాక చిరునవ్వుతో ఆ బండిని వదిలారు. చిరునవ్వుతో డ్రైవర్ కూడా కదిలింది. ఆ డ్రైవర్ పేరు కార్తీక. మలయాళంలో చిన్నపాటి నటి. ∙∙ ‘చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. దాంతో పాటు డ్రైవింగ్ కూడా. రెండూ నేర్చుకున్నాను. పెద్ద లారీలు కూడా నడుపుతాను. కొన్ని సినిమాలలో యాక్ట్ చేశాను. కాని నాకంటూ గుర్తింపు రాలేదు. నా భర్త గల్ఫ్‌లో పని చేస్తాడు. నాకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ లాక్డౌన్లో ఏ పనీ లేకుండా ఉండటం సరి కాదనుకున్నాను. వెంటనే ఒక ట్రక్ కొన్నాను. నిజానికి లారీ కొందామనుకున్నాను. అంత డబ్బు లేదు. ట్రక్‌తో మొదలెట్టాను’ అంటుంది కార్తీక. కేరళలో కన్నూరుకు చెందిన కార్తీక బతుకు దేవులాటలో అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని వాజక్కులంకు షిఫ్ట్ అయ్యింది. ‘ఇక్కడ పైనాపిల్స్ చీప్. కన్నూరులో కాస్ట్లీ. ఒక వెయ్యి కిలోల పైనాపిల్స్ తీసుకుని ఐదారుగంటలు ప్రయాణించి కన్నూరుకు తీసుకెళ్లాను. లాభం వచ్చింది. అలాగే వాజక్కులం నుంచి కొబ్బరిబోండాలు కొని ఎర్నాకులంకు సరఫరా చేస్తుంటాను. నేను కిరాయికి వెళతాను. అలాగే స్వయంగా సరుకు తీసుకెళ్లి అమ్ముతాను. బాగుంది ఇప్పుడు’ అంటుంది కార్తీక. ఖాకీ షర్ట్ ధరించి, తల మీద టోపీ పెట్టుకుని ట్రక్ నడిపే కార్తీకను పెద్దగా ఎవరూ గమనించరు. షాపుల వాళ్లు గమనించినా గౌరవం ఇస్తున్నారు. అర్ధరాత్రిళ్లు, అపరాత్రుళ్లు కూడా ఆమె నిర్భయంగా హైవే మీద దూసుకెళుతూ ఉంటుంది. బతుకు స్పీడ్‌బ్రేకర్ వేసినప్పుడు కూడా జీవితం స్టీరింగ్‌ను ఎలా ఒడిసి పట్టాలో కార్తీక ఇలా మనకు చెబుతోంది. -
ఇదేం చిత్రం: హెల్మెట్ లేదని ట్రక్కు డ్రైవర్‌కు జరిమానా
భువనేశ్వర్: నిబంధనల పేరిట ట్రాఫిక్ పోలీసులు విచ్చలవిడిగా జరిమానాలు విధిస్తూ వాహనదారుల జేబుకు చిల్లు వేస్తున్నారు. ప్రశ్నిస్తే మీ రక్షణ.. మీ భద్రత కోసమే ఇలా చేస్తున్నామని బదులు ఇస్తున్నారు. అయితే ఒక్కోసారి వీరి చేష్టలు.. ప్రవర్తన.. పని ప్రజలకు చిర్రెత్తుత్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒడిశా రాష్ట్రంలో జరిగింది. హెల్మెట్ ధరించలేదని ట్రక్కు డ్రైవర్‌కు రూ.వెయ్యి జరిమానా విధించడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్కడి ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు ట్రక్కు డ్రైవర్ ప్రమోద్ కుమార్ శ్వాన్ జిల్లా కేంద్రం గంజంలోని స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు అతడి వివరాలు పరిశీలించగా ఒక జరిమానా పెండింగ్‌లో ఉందని గుర్తించారు. అదేమిటంటే ‘హెల్మెట్ లేకుండా వాహనం నడపడం’ అని ఉంది. దీన్ని చూసి ప్రమోద్ కుమార్ షాక్‌కు గురయ్యాడు. ట్రక్కు నడిపే డ్రైవర్ హెల్మెట్ ధరించడమేంటి అని సందేహం వ్యక్తం చేశాడు. ట్రక్కు వాహనం నంబర్‌పైనే హెల్మెట్ లేకుండా వాహనం నడిపాడని జరిమానా విధించడం గమనార్హం. అధికారులకు ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ డ్రైవర్ ప్రమోద్ కుమార్ రూ.వెయ్యి జరిమానా కట్టేశాడు. అనంతరం అతడి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేశారు. ‘మూడేళ్లుగా ట్రక్కు నడుపుతున్నా. నీటి సరఫరా చేసేందుకు ట్రక్కు వినియోగిస్తున్నా. నా పర్మిట్ గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాను. అక్కడ హెల్మెట్ లేకుండా ట్రక్కు నడుపుతున్నానని జరిమానా విధించారు. డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. అవసరం లేకున్నా వేధిస్తున్నారు. ఇలాంటి తప్పులను ప్రభుత్వం నిరోధించాలి’ అని ట్రక్కు డ్రైవర్ ప్రమోద్ కుమార్ మీడియాతో చెప్పాడు. -
వేధింపుల పర్వం
జైపూర్: ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి, హత్య చేసిన ఓ ట్రక్కు డ్రైవర్‌ను రాజస్తాన్‌లోని టొంక్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి, స్కూల్ వద్ద నుంచి తీసుకెళ్లిన నిందితుడు మహేంద్ర అలియాస్ ఢోలు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు చిన్నారికి తెలిసిన వ్యక్తి కావడంతో.. తల్లిదండ్రులకు చెబుతుందేమోనన్న భయంతో పాపను అక్కడే చంపేశాడని ఎస్పీ ఆదర్శ్ తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడ్డ తర్వాత రాజస్తాన్ విడిచి పారిపోవాలని భావించాడని, అయితే అలీగఢ్‌లో పట్టుపడ్డాడని వివరించారు. నిందితుడి వయసు 41 ఏళ్లు ఉంటుందని, ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఎస్పీ తెలిపారు. శనివారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత చిన్నారి కన్పించడం లేదని మొత్తం వెతికారు. మరుసటి రోజు ఉదయం స్కూల్ సమీపంలో పాప శవమై కన్పించింది. స్కూల్ బెల్టుతో మెడకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడని పోలీసులు తెలిపారు. కన్న తండ్రే కూతురిపై.. జైపూర్: సొంత తండ్రే కన్న కూతురిని గొలుసులతో కట్టేసి, హింసించి, పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డ హేయమైన ఘటన రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలో జరిగింది. తన తండ్రి వేరే మహిళతో చనువుగా ఉన్న సమయంలో తాను చూశాననే కోపంతో గొలుసులతో తన కాళ్లు, చేతులు కట్టేసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఇంటి నుంచి బాధితురాలు శుక్రవారం తప్పించుకుని తన మేనమామ పొలం దగ్గరికి వచ్చింది. అప్పటికీ తన చేతులు గొలుసులతో కట్టేసి ఉన్నాయి. జరిగిన విషయాన్ని తన మేనమామతో చెబితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ ఇంట్లో జరిగే హింసను తట్టుకోలేక బాధితురాలి తల్లి ఏడేళ్ల కిందటే నిందితుడిని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశాలో గ్యాంగ్ రేప్.. నిందితుల్లో కానిస్టేబుల్ పూరి: ఒడిశాలోని పూరీలో సోమవారం ఓ మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగింది. కాకట్‌పర గ్రామానికి చెందిన బాధితురాలు నిమపరలోని బస్టాండ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన ఓ వ్యక్తి..కాకట్‌పర తీసుకెళ్తానంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో కారులో మరో ముగ్గురు వ్యక్తులున్నారు. బాధితురాలిని ఝడేశ్వరి క్లబ్ పక్కనున్న పోలీస్ క్వార్టర్ల వద్దకు తీసుకెళ్లి ఇద్దరు రేప్ చేశారు. అక్కడ తనకు దొరికిన పర్స్‌ను బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదుచేసింది. అందులోని ఐడీకార్డుల ద్వారా నిందితుడైన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, అరెస్ట్‌చేశారు. -
కశ్మీర్లో ఉగ్రదాడులు
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరో ట్రక్ డ్రైవర్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఉదంపూర్ జిల్లాలోని కట్రాకు చెందిన నారాయణ్ దత్‌ను సోమవారం సాయంత్రం తుపాకీతో కాల్చి చంపారు. కాల్పుల శబ్దం వినగానే దగ్గర్లోనే ఉన్న సీనియర్ పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని దగ్గర్లోనే ఉన్న మరో ఇద్దరు ట్రక్ డ్రైవర్లను కాపాడారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం నలుగురు ట్రక్ డ్రైవర్లను ఉగ్రవాదులు కాల్చి చంపడం గమనార్హం. మరణించిన వారంతా కశ్మీరీయేతర ప్రాంతాలకు చెందినవారే. కశ్మీర్లో గ్రెనేడ్ దాడి.. కశ్మీర్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. నగరంలోని ఓ బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న జనాలే లక్ష్యంగా గ్రెనేడ్ విసిరారు. ఈ పేలుడులో 20 మంది ప్రజలు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన చుట్టుపక్కల్లో ప్రాంతాల్లో సోదాలు మొదలుపెట్టారు. -
ట్రక్కులో 39 మృతదేహాలు
లండన్: లండన్ దగ్గర్లో బుధవారం 39 మృతదేహాలున్న ఒక ట్రక్కు కనిపించి సంచలనానికి కారణమైంది. ఆ మృతదేహాలెవరివి, మరణాలకు కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గ్రేస్ ఏరియా ఆఫ్ ఎసెక్స్ దగ్గర్లో ఉన్న వాటర్‌గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో మృతదేహాలున్న ఒక ట్రక్కు ఉందని బుధవారం తమకు సమాచారం వచ్చిందని ఎసెక్స్ పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లు తెలిసిందని, వేల్స్‌లోని హోలీహెడ్ రేవు ద్వారా శనివారం యూకేలోకి వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు. నార్త్ ఐర్లండ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి వివరాలు రాబడ్తున్నామని ఎసెక్స్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్య్రూ మారినర్ చెప్పారు. బల్గేరియా నుంచి అక్రమంగా బ్రిటన్‌లోకి వచ్చే క్రమంలో వారు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలున్న ట్రక్ వెనుకభాగంలో మైనస్ 25 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అందులో దాక్కుని హోలీహెడ్ రేవు ద్వారా అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇలాగే ఒక లారీ వెనుకభాగంలో దాక్కుని అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ 58 మంది చైనీయులు చనిపోయారు. -
లుంగీవాలాకు కంగారు పుట్టించే వార్త..
లక్నో: హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్, సీట్ బెల్ట్ ధరించకపోతే ఫైన్.. ముగ్గుర్ని ఎక్కించుకుని తిరిగావంటే.. దెబ్బకు దేవుడు గుర్తొచ్చేంత ఫైన్. ఇప్పుడు వీటి సరసన కొత్తగా చేరిన ఆంక్ష వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇప్పటికే జూలైలో పాసయిన నూతన మోటార్ వాహన చట్టం 2019తో వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఫైన్ మోత మోగుతుందో అని భయంతో వణికిపోతున్నారు. పెరిగిన జరిమానాలు ఆ రీతిలో ఉన్నాయి మరి! ఇవేవీ చాలవన్నట్టు కొత్తగా మరో ఆంక్షను అమల్లోకి తీసుకువచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. లుంగీలు ధరించి వాహనం నడిపితే పైసా వసూలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రక్ డ్రైవర్లు లుంగీ కట్టుకుని వాహనం నడిపిస్తూ కంటపడితే రూ.2000 జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. బనియన్, లుంగీల ధారణకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. లుంగీలకు బదులుగా ఫుల్ ప్యాంట్, బనియన్లకు బదులుగా టీషర్ట్స్ ధరించాలని కోరుతున్నారు. ఈ నియమం స్కూలు వాహనాలకు కూడా వర్తిస్తుందని యూపీ ట్రాఫిక్ ఏఎస్పీ పూర్నేందు సింగ్ పత్రికాముఖంగా వెల్లడించారు. ఈ కొత్త ఆంక్షల కోసం తెలిసిన జనాలు ఇదేం విడ్డూరం అని నోరెళ్లబెడుతున్నారు. చదవండి: ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!? నూతన మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చలానాల మోత మోగుతోంది దేశంలో. కొన్ని జరిమానాలు ఏకంగా రూ.80 వేలను దాటడం గమనార్హం. ఇక వాహనాలు నడిపేవారు చెప్పులు వేసుకోకూడదు అనే నియమం ఉన్నప్పటికీ అది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. దీన్ని ఉల్లంఘిస్తే రూ.1000 చెల్లించాలి. ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించినవారికి కళ్లు తేలేసే జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఏకకాలంలో సామన్యుల నడ్డి విరుస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ నిబంధనలతో నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు లుంగీవాలాలు. చదవండి: కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్.. ‘గుండెపోటు’ -
ట్రక్ డ్రైవర్‌కు భారీ జరిమానా.. తొలి వ్యక్తిగా రికార్డ్
భువనేశ్వర్: మోటారు వాహన సవరణ చట్టం–2019 దేశ వ్యాప్తంగా వాహన దారులను బెంబేలెత్తిస్తోంది. ఏ ఒక్కటీ సరిగా లేకున్నా ట్రాఫిక్ పోలీసులు జరిమానాలతో చుక్కలుచూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏ వాహనదారుడిని కదిలించినా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకొద్ది జరిమానాలు విధిస్తూ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఓ ట్రక్ డ్రైవర్‌కు (అశోక్ జాదవ్) ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. వాహన పత్రాలు సక్రమంగా లేవని, వివిధ సందర్భాల్లో ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించారని అనేక కారణాలతో ఏకంగా రూ. 86, 500 ఫైన్ వేశారు. కొత్త మోటరు వాహన సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత అత్యధిక మొత్తం జరిమానా చెల్లించిన వ్యక్తిగా జాదవ్ నిలిచారు. ఈ ఘటన ఆదివారం ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు విధించిన జరిమానా చూసి అతను షాక్‌కి గురయ్యాడు. సాధారణ ట్రక్ డ్రైవర్‌గా బతుకునీడుస్తున్న తాను ఇంత మొత్తం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై స్థానిక ట్రాఫిక్ అధికారి మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగానే అతనికి జరిమానా విధించామని తెలిపారు. ప్రమాదాల నివారణలో భాగంగా చలానాలు విధించడాన్ని తప్పుబట్టడం లేదని, కానీ, సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న చలాన్లపై పునరాలోచించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. పోలీసులు చెబుతున్న ట్రాఫిక్ జరిమానాలు చాలా మంది నెల వేతనం కంటే అధికంగా ఉండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక నిజంగానే ఫైన్ కట్టాల్సి వస్తే తమ గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.