రోజువారిలానే ఓ డ్రైవర్ ఫుడ్ ట్రక్కును తీసుకొని వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్లాక ట్రక్కు ఒక్కసారిగా రోడ్డు మధ్యలో కూరుకుపోయింది. ఏం జరిగిందా అని దిగి చూస్తే టైర్ కింద ఓ పెద్ద కొండ చిలువ కనిపించింది. ఇది ఇక్కడికెలా వచ్చిందా అని ఆశ్చర్యపోవడం తనవంతైంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ కొండ చిలువ ప్రాణాలతో ఉండటం. ఇంకేముంది అక్కడి జనాలు ఈ ఘటనను ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు. థాయిలాండ్లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌చేస్తోంది.
గత బుధవారం చావలిథ్ థంగ్సోడా అనే డ్రైవర్ రోజువారిలా ఫుడ్ వ్యాన్‌తీసుకొని బయలు దేరాడు. కొద్ది దూరం వెళ్లాక వ్యాన్ ఎంతకు ముందుకు కదలేదు. దీంతో కిందికి దిగి చూసిన చావలిథ్‌కు 10 అడుగుల కొండ చిలువ కనిపించింది. తొలుత అది అక్కడికి ఎలా వచ్చిందా అనేది అతనికి అర్థం కాలేదు. చివరకు ట్రక్ కురుకుపోయిన రోడ్డు కింది భాగంలో కొండచిలువ నివాసం ఏర్పరుచుకున్నట్లుందని భావించి చుట్టు పక్కల వారి సాయంతో వ్యాన్‌ను ముందుకు నెట్టాడు. విచిత్రం ఏమిటంటే అది ప్రాణాలతో ఉంది వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని అడవిలో వదిలి పెట్టారు. అయితే కొద్ది సేపటికే ఆ కొండ చిలువ ప్రాణాలు విడిచింది.
Comments
Please login to add a commentAdd a comment