python
-
Manikonda: ఇంట్లోకి చొరబడిన కొండచిలువ
మణికొండ: ఓ ఇంట్లోకి 12 అడుగుల కొండ చిలువ చొరబడటంతో స్ధానికులు భయాందోళనకు గురైన ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలిజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి మంగళవారం ఉదయం కొండ చిలువ వచి్చంది. అది అప్పటికే మూడు కుక్క పిల్లలను మింగటంతో కదలలేక ఇంట్లోనే ఉండిపోయింది. కొండ చిలువను చూ సిన గణేష్ సింగ్ విషయం చుట్టు పక్కల వారికి చెప్పాడు. దీంతో స్థానికంగానే ఉన్న అమర్‌సింగ్ అనే వ్యక్తి దాన్ని పట్టుకుని బయటకు తెచ్చి అలిజాపూర్ పక్కనే ఉన్న గుట్టల్లో దాన్ని వదలిపెట్టాడు. గతంలో పలు మార్లు పాములు వచ్చాయని, కానీ ఇప్పుడు ఏకంగా 12 అడుగుల కొండ చిలువ వచి్చందని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. -
ముప్ఫై ఏళ్ల మహిళను మింగిన కొండ చిలువ
జకార్తా: ఇండోనేసియాలో మంగళవారం(జులై2) భయానక ఘటన జరిగింది. 30 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఏకంగా ఒక మహిళను చంపి మింగేయడానికి ప్రయత్నించింది. అసలు ఏం జరిగిందంటే.. ఇండోనేసియాలోని సౌత్ సులవేసిలో ఉన్న లువు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే సిరియతి అనే మహిళకు ఐదుగురు సంతానం. మహిళ తన పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని మందుల కోసం ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చింది. చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ మందుల షాపుకు వెళుతోంది. అక్కడే చెట్లపై ఉన్న భారీ కొండచిలువ మహిళపై దాడి చేసి చుట్టచుట్టి నలిపేసింది. తర్వాత మహిళను ఆమె కాళ్లదాకా మింగేసింది.ఇంతలో అదే దారిలో మహిళ కోసం వెతుకుతూ వస్తున్న భర్తకు భయానక దృశ్యం కనిపించింది. తన భార్యను కొండచిలువ కాళ్లదాకా మింగేయడం కనిపించింది. కోపంతో వెంటనే కొండచిలువను చంపి మహిళను బయటికి తీశాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. -
ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
మూడురోజులైనా ఆమె ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కనిపించకుండా పోయిన తన భార్యను వెతికే క్రమంలో.. ఆ భర్తకు గుండె బద్ధలయ్యే దృశ్యం కనిపించింది. కొండచిలువకు తన భార్య ఆహారంగా మారిందని తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. ఇండోనేషియాలో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఫరీదా అనే 45 వివాహిత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. దీంతో, గ్రామస్థులు, పోలీసుల సాయంతో మహిళ భర్త పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ చోట 5 మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ భారమైన పొట్టతో కదల్లేని పరిస్థితిలో కనిపించింది. అనుమానంతో దాని పొట్ట చీల్చి చూడగానే ఓ మహిళ తలభాగం బయటపడింది. వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీసి చూడగా.. అది ఫరీదాగా నిర్ధారణ అయ్యింది. ఒంటిపై దుస్తులు అలాగే ఉండడంతో ఆమెను గుర్తు పట్టిన భర్త కన్నీటి పర్యంతం అయ్యాడు. నిపుణులు ఏం చెప్తున్నారంటే.. సాధారణంగా కొండచిలువలు జంతువులను తప్ప మనుషులపై పెద్దగా దాడులు చేయవు. కానీ, ఇండోనేషియాలో ఈ మధ్యకాలంలో మనుషులపై దాడుల ఘటనలు పెరిగిపోయాయి. కిందటి ఏడాది ఓ రైతును ఊపిరాడకుండా చేసి తినేందుకు ప్రయత్నిస్తున్న కొండచిలువను గుర్తించి.. దానిని చంపి అతన్ని రక్షించారు. కొన్నాళ్ల కిందట ఏడు మీటర్ల పొడవున్న కొండచిలువ 54 ఏళ్ల మహిళను చంపి తినేసింది. అయితే అది జీర్ణించుకోలేకపోవడంతో.. ఆ మృతదేహం కొన్నాళ్లకు బయటపడింది. -
కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు!
ఇంతవరకు మాంసాన్ని ల్యాబ్‌లో తయారు చేయడం వంటి వాటి గురించి కథనాలు విన్నాం. దీని వల్ల శాకాహారులకు కూడా మేలు జరుగుతుంది. వారికి కావాల్సిన పోట్రీన్లు ఇలా కృత్రిమంగా తయారు చేసిన మాంసం ద్వారా అందుతుందని భావించారు కూడా. అవన్నీ పరిశోధన దశల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఇది కాదంటూ ఏకంగా కొండచిలువలనే ఆహారంగా తినమని చెబుతున్నారు. పైగా ఆరోగ్యానికి మంచిదంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎందుకిలా అన్నారంటే.. ఇంతవరకు మనుషులు మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి ఇతరత్ర మాంసాలను తినేవారు. అయితే వీటి వల్ల కేవలం వంద గ్రాములు ప్రోటీన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే వీటి కారణంగా గాలిలో 49.89 కిలోగ్రాముల కార్బన్డయాక్స్డ్ విడుదలవుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. అందువల్ల మాంసాహారం ఎక్కువుగా తినడమనేది పర్యావరణాని హానికరమని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. వీటికి బదులు కొండచిలువలు తినడం చాలా మంచిదని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఈ మేరకు తాము ఒక పొలంలో దాదాపు 12 నెలలపాటు పెంచిన రెండు కొండచిలువలపై జరిపిన అధ్యయనంలో తేలిందని సరీసృపాల నిపుణుడు డాక్టర్ డేనియల్ నాటుష్ చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇవి నీరు లేకుండా దాదాపు నెలరోజులు జీవిస్తాయట. వీటి పొలుసుల మీద ఉండే నీటితోనే అన్ని రోజుల పాటు నీరు తీసుకోకుండా బతకగలవని అన్నారు. అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు ఏం తినకుండానే బతికేస్తాయట. అలాగే పంట బాగా పండటంలో వీటి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. అలాగే ఇవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయని అన్నారు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండగలవు, పైగా బ్లర్డ్ ఫ్లూ లేదా కోవిడ్ -19 వంటి వ్యాధులను వ్యాప్తి చేయవని అధ్యయనంలో వెల్లడయ్యిందని తెలిపారు. ఈ ఆసక్తికర పరిశోధన సైంటిఫిక్ రిసెర్చ్ ప్రచురితమయ్యింది. అలాగే వీటిని ఆహారంగా తీసుకుంటే మంచి ప్రోటీన్ పుష్కలంగా అందుతుందని అన్నారు. ఒక ఏడాదిపాటు సాగిన ఈ పరిశోధనలో తాము ఈ కొండచిలువలకు ఎలుకలు, చేపలు వంటి వాటిని ఆహరంగా అందించి ఎప్పటికప్పుడూ వాటి బరువుని కొలిచే వాళ్లమని చెప్పారు. అయితే ఈ రెండు పైథాన్‌లలో ఆడ కొండచిలువ వేగంగా బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. వివి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ఏర్పడి పశువులు పెద్ద సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మాంసాహారంగా ఈ కొండచిలువలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తుల. వామ్మో కొండ చిలువ తినడమమా ఏందీ వింత పరిశోధన అని భావిస్తున్నారా?. టెన్షన్ పడొద్దు ఎందుకంటే..దీనిపై ఇంకా కూలంకషంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు పూర్తి అయ్యేతే గానీ కార్య రూపం దాల్చదు. అదీగాక కొండచిలువల పెంపకం అనే విషయంలో సాధ్యా సాధ్యాలు కూడ అంచాన వేయాల్సి ఉంటుంది. (చదవండి: 'కుమారీ ఆంటీ' లాంటీ ఇన్సిడెంట్..మరీ ఇదేమవుతుందో..!) -
కొండచిలువను పెంచుకుంటున్న హీరోయిన్!
కొండచిలువను ముట్టుకునేంత..కాదు కాదు దగ్గర నుంచి చూసేంత ధైర్యం ఉందా? భలేవాడివి బాసూ.. అదేమైనా కుక్క పిల్లా? లేదా పిల్లి పిల్లనా? ముట్టుకొని ముద్దాడడానికి? అంటారా? మీకే కాదు సహజంగా ఎవరికైనా పాములను చూడగానే భయం వేస్తుంది. ఎక్కడో దూరాన ఉన్న చిన్న పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది కొండచిలువలాంటి పాము మన దగ్గరకు వస్తే.. ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా? కానీ ఓ హీరోయిన్ మాత్రం కొండ చిలువను కుక్కపిల్ల మాదిరి ముద్దుగా పెంచుకుంటుందట. దాన్ని పట్టుకొని ముద్దులు కూడా పెడుతుందట. పాములంటే ఇష్టం సాధారణంగా సెలబ్రిటీలు కుక్కపిల్లల్ని.. ఇంకా ముద్దొస్తే పిల్లి పిల్లల్ని పెంచుకోవడం గురించి వినే ఉంటారు! కానీ అలా ముచ్చటపడి పాములను పెంచుకోవడం గురించి విన్నారా? బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్‌కి ఆ సరదా ఉందట. ఆమెకు పాములంటే పిచ్చి ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఒక బుజ్జి కొండచిలువను పెంచుకుంటోందని బాలీవుడ్లో టాక్. ఖాలీ సమయం దొరికితే ఆ కొండ చిలువతో సరదాగా ఆడుకుంటుందట. అయితే తన కొండ చిలువకు సంబంధించిన విషయాలను సుష్మిత ఎక్కడా చెప్పలేదు కానీ..ఆమె సన్నిహితుల ద్వారా మీడియాకు ఈ విషయం లీకైంది. దీన్ని సుష్మిత ఖండించకపోవడంతో బాలీవుడ్ జనాలు ఇది నిజమనే నమ్ముతున్నారు. వెబ్ సిరీస్‌లతో బీజీ బీజీ.. 1997లో రత్సగన్ అనే తమిళ్ సినిమాతో తెరంగేట్రం చేసింది సుస్మితా. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులతో నటించింది. ముఖ్యంగా ఒకేఒక్కడు సినిమాలోని షకలకా బేబీ పాటతో సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ రాణించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ పరంగా ఇప్పటికీ బీజీగా ఉన్నారు. ఆ మధ్య ఆర్య -3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి, తనదైన నటనతో ఆకట్టుకుంది. -
Video: బట్టల షోరూంలో భారీ పైథాన్
లక్నో: మీరట్‌లోని ఓ బట్టల షోరూమ్‌లో భారీ పైథాన్ కలకలం సృష్టించింది. షాప్‌లో దూరిన కొండచిలువ వినియోగదారులను భయాందోళనకు గురిచేసింది. దాదాపు 14 అడుగులు, 18 కిలోల బరువు ఉన్న పైథాన్‌ను అటవీ అధికారులు సంరక్షించి అడవిలో విడిచిపెట్టారు. #उत्तर_प्रदेश #मेरठ: दुकान में विशालकाय अजगर निकला..!! अजगर देख बाजार में मची अफरा-तफरी..!! वन विभाग की टीम ने अजगर को पकड़ा..!! मेरठ के लालकुर्ती पैठ बाजार का मामला..!! #ViralVideo pic.twitter.com/SwSLAwSpOt — MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) December 5, 2023 షోరూమ్‌లో దూరిన పైథాన్‌ను ఓ వినియోగదారుడు గుర్తించి యజమానికి తెలియజేశాడు. మొదట యజమాని దాన్ని ఎలుకగా భ్రమించాడు. కానీ వినియోగదారుడు పట్టువీడకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ పైథాన్‌ను చూసిన సిబ్బంది, వినియోగదారులు షోరూం నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని సురక్షితంగా సంరక్షించారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని వెల్లడించారు. ఇదీ చదవండి: కర్ణిసేన చీఫ్ గోగామేడి హత్య కేసులో నిందితులు వీరే..! -
అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!
ఇళ్లలోకి కొడచిలువలు రావడం అనేది ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా జరుగతుంది. అక్కడ గ్రామాలు, పట్టణాల్లోని అపార్టమెంట్లోకి కూడా కొండ చిలువలు వస్తాయి. ఎందుకంటే ఈ కొడచిలువలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. దీంతో పొరపాటున జొరబడటం లేదా అటాక్ చేయడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటన తొలిసారిగా భారత్‌లో చోటు చేసుకుంది. భారత్‌లో గ్రామాల్లోని ఇళ్ల మద్య కొండచిలువ కనపడటం అరుదు. అందులోనూ అపార్టమెంట్లోకి చొరబడటం అనేది అస్సలు జరగుదు. అలాంటిది భారత్‌లోనే ఓ అపార్ట్మెంట్లో ఈ అరుదైన ఘటన జరగడం అదర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే.ఈ అనూహ్య ఘటన మహారాష్ట్రాలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భవనంలోని అపార్టమెంట్ విండోలోకి భారీ కొండచిలువ చొరబడింది. పాపం అది ఆ విండోకి ఉండే గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగిన దాన్ని రక్షించే యత్నం చేశారు. ఒకరు కిటికిలోంచి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా మరొకరు కిటికి బయటకు వచ్చి దాన్ని ఆ గ్రిల్ నుంచి విడిపించే యత్నం చేశారు. ఐతే చివరికి ఆ కొండచిలువ ఆప్రయత్రంలో అంత ఎత్తున్న ఉన్న అపార్ట్మెంట్ నుంచి కిందకు పడిపోయింది. అయితే ఆ తర్వాత ఆ కొండచిలువ అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పామును రక్షించే యత్నం చేసిన ఆ వ్యక్తులను ప్రశంసిస్తున్నారు కానీ ఆ భారీ కొండచిలువ అంత ఎత్తు నుంచి పడిపోయింది కాబట్టి ఎన్నో రోజులు అది బతకదు అంటూ ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరూ అస్సలు అది ఎలా అపార్ట్మెంట్లోకి చొరబడిందని ప్రశ్నిస్తూ మరొకరు కామెంట్లు చేస్తూ ట్వీట్లు పెట్టారు. A huge snake was spotted at a Thane Building, it was rescued by two brave persons, rescue video. 👇. #thane #mumbai pic.twitter.com/j2ZWrs9mR9 — Sneha (@QueenofThane) September 25, 2023 (చదవండి: కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
10 అడుగుల పైథాన్‌తో పోరు..!
ముంబయి: మహారాష్ట్రాలోని థాణె జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 అడుగుల పైథాన్ ఓ ఇంటి బెడ్రూంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో కిటికి గుండా ఏకంగా బెడ్రూంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు యువకులు పైథాన్‌తో ఫైట్ చేసి చివరికి దానిని కిటికీ నుంచి కిందికి పడేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంత పెద్ద పైథాన్ ఏకంగా బెడ్రూంలోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Imagine a massive python hanging from your bedroom window. It happened in Mumbai's Thane.#Thane #Python pic.twitter.com/dbL1IIbasZ — IndiaToday (@IndiaToday) September 26, 2023 ఇదీ చదవండి: బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్ -
హసన్‌నగర్‌లో కొండ చిలువ కలకలం
రాజేంద్రనగర్: అత్తాపూర్ హసన్‌నగర్‌లో సోమవారం రాత్రి భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ప్రధాన రహదారిపై ఉన్న లారీ పార్కింగ్ అడ్డా వద్ద కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో హసన్‌నగర్ లారీ అడ్డా వద్ద డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డు పక్కన నిలుచుని ముచ్చటిస్తున్నారు. ఇదే సమయంలో ఏడు అడుగుల భారీ కొండ చిలువ లారీల మధ్య నుంచి వెళుతుండగా గుర్తించిన వారు భయంతో పరుగులు పెట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు స్నేక్ సొసైటీ సభ్యుడు జావిద్‌ను రప్పించి కొండచిలువను పట్టుకున్నారు. మంగళవారం కొండచిలువను జూపార్కు అధికారులకు అప్పగించారు. -
చికెన్ సెంటరులో కొండ చిలువ కలకలం
అనంతపురం: ఓ చికెన్ సెంటరులోకి కొండచిలువ ప్రవేశించడంతో కలకలం రేగింది. ఈ ఘటన సోమవారం పుట్టపర్తి మండల పరిధిలో జరిగింది. స్థానిక ఎనుములపల్లి చెరువు సమీపాన చిత్రావతి బైపాస్ రోడ్డుకు ఆనుకుని ముక్తార్ అనే వ్యక్తి చికెన్ సెంటరు నిర్వహిస్తున్నాడు. వెనుక ఉన్న కొండలో నుంచి ఆదివారం రాత్రి కొండ చిలువ చికెన్ సెంటరులోకి ప్రవేశించింది. నాలుగు బ్రాయిలర్ కోళ్లను తినేసిన తర్వాత నీటి డ్రమ్ములోకి చేరుకుంది. సోమవారం ఉదయం ముక్తార్ నీటి కోసం డ్రమ్ము వద్దకు వెళ్లగా..కొండ చిలువ కన్పించింది. దాదాపు తొమ్మిది అడుగుల పొడవు ఉంది. భయభ్రాంతులకు గురైన అతను చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు కూడా భయంతో పరుగులు తీశారు. చివరకు పుట్టపర్తికి చెందిన స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇవ్వడంతో అతను అక్కడికి చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నాడు. తర్వాత అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. -
చికెన్ షాపులో కొండచిలువ.. షాకైన యజమాని.. తర్వాత ఏం జరిగిందంటే?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రోజు అడవిలో ఎలుకలు, ఉడతలు తిని తిని బోర్ కొట్టిందో ఏమో ఒక కొండచిలువ చికెన్ షాప్‌లో దూరింది. చక్కగా అత్తారింటికి వచ్చిన అల్లుడిలా దర్జాలు వలకబోసి బాగా బలిసిన బ్రాయిలర్ కోళ్లను చూసి తన పంట పండిందనుకుంది. చక్కగా ఓ రెండు కోళ్లను గుటుక్కున మింగి సేదతీరింది. తెల్లారే వచ్చి చూసిన చికెన్ షాపు యజమానికి కొత్త అల్లుడిలా కోళ్ల ఫామ్ లో కొండచిలువు కనిపించింది. వెంటనే ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వచ్చిన సిబ్బంది తిన్న కోళ్లు కక్కించి బుద్ధిగా ఉండమని మళ్లీ అడవికి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో జరిగింది ఘటన. చదవండి: Telangana: నేడు, రేపు వర్షాలు -
వామ్మో.. ఎంత పెద్ద పామో!
ఆత్రేయపురం: గోదావరి వరద ప్రవాహంతో పాటు కొండ కోనల నుంచి భారీ సర్పాలు కొట్టుకుని వస్తున్నాయి. ఈ క్రమంలోనే బొబ్బర్లంక వద్ద వరద గోదావరిలో చేపలు పట్టేందుకు ఓ మత్స్యకారుడు వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కుకుంది. ఏదో ఒక పెద్ద చేప చిక్కి ఉంటుందని భావించిన మత్స్యకారుడు ఆ వలను బయటకు లాగడంతో అందులో కొండచిలువ కనిపించింది. చాలా పెద్ద పాము కావడంతో ఒకింత భయంతోనే స్థానికులు దీనిని చూసేందుకు ఎగబడ్డారు. చివరకు ఆ కొండచిలువను మత్స్యకారులు తిరిగి గోదావరిలోకే విడిచిపెట్టారు. -
19 అడుగుల పైథాన్‌తో యువకుని పోరాటం.. ఎట్టకేలకు..
అమెరికాలో భారీ పైథాన్‌ను ఓ యువకుడు పట్టుకున్నాడు. ఇది దాదాపు 19 అడుగుల పొడవు ఉంది. 56.6 కేజీల బరువు ఉంది. ఫ్లోరిడాలో ఓహియో యూనివర్శిటీకి చెందిన ఓ యువకుడు(22) దీన్ని సాహసంతో పట్టుకున్నాడు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. తెగ వైరల్‌గా మారింది. యువకులు రోడ్డుపై వెళుతుండగా.. ఓ పెద్ద పైథాన్ వారిని అడ్డగించింది. భయపడిన యువకులు కాసేపు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక లాభం లేకపోవడంతో ఓ యువకుడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అతని స్నేహితులు కూడా సహాయం చేయగా.. అందరూ కలిసి దాన్ని పట్టుకున్నారు. పైథాన్‌ను పట్టుకునే క్రమంలో ఆ యువకుడు పెద్ద యుద్దమే చేశాడు. కిందపడినప్పటికీ దాని తలను మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. View this post on Instagram A post shared by Glades Boys Python Adventures (@gladesboys) దక్షిణ ఫ్లోరిడాలో పైథాన్లు ఎక్కువగా ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు. 2020 అక్టోబర్‌లో 18 అడుగులు ఉన్న అత్యంత పెద్దదైనా బర్మీస్ పైథాన్ వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత ఇదే అత్యంత పెద్ద పైథాన్‌గా గుర్తించారు. రాత్రి సమయాల్లో సాధారణంగా రోడ్డుపైకి వస్తుంటాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా? -
కోళ్ల దొంగ దొరికింది
ఎన్టీఆర్: మండలంలోని మునగపాడు గ్రామ శివారులో పందెం పుంజులను పెంచేందుకు గ్రామానికి చెందిన కలగాని రమేష్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా మినీ కోళ్లఫారం నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఫారంలో పందెం పుంజులు కనిపించకుండా పోతున్నాయి. ఈ క్రమంలో కోళ్ల దొంగను పట్టుకునేందుకు నిర్వాహకుడు ఫారంపై నిఘా ఉంచాడు. సోమవారం మధ్యాహ్నం పందెం పుంజులను దొంగిలిస్తున్న దొంగను చూసి నిర్వాహకుడు అవాక్కయ్యాడు. తన పందెం పుంజులను దొంగిలిస్తున్నది కొండచిలువ అని గమనించాడు. అప్పటికే ఓ కోడిపుంజుని మింగి కదలలేని స్థితిలో ఉన్న కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్న రమేష్, గ్రామస్తుల సాయంతో సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
'గుడ్లను తాకితే తాటతీస్తా..!' జూ కీపర్‌పై కొండ చిలువ వీరంగం..
ఏ జంతువులోనైనా అమ్మతనం అసామాన్యమైనది. పిల్లలను రక్షించుకోవడానికి ఎంతకైన తెగిస్తుంది తల్లి. సాధారణంగా మన ఇళ్లలో ఉండే కోడిని చూడండి.. దాని పిల్లల వైపు వచ్చిన ఏ జంతువునైనా ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంది. అదీ అమ్మలోని గొప్పతనం. తాజాగా ఓ కొండ చిలువ తన గుడ్లను తీసుకోవడానికి వచ్చిన జూకీపర్‌పై విరుచుకుపడింది. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా.. గుడ్లను మాత్రం ముట్టుకోనీయలేదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) ఓ పైథాన్ అందమైన గుడ్లను పెట్టింది. అవి భారీ సైజులో ఉన్నాయి. ఓ కుప్పగా ఉన్న తన గుడ్ల చుట్టూ చుట్టకుని ఆ కొండ చిలువ పడుకుని ఉంది. జూ కీపర్ జాయ్ బ్రూవర్ అది పడుకున్న రూమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. పైథాన్‌ను ఆటపట్టించాలనుకుంటాడు. అనంతరం ఆ గుడ్లలోంచి ఓ గుడ్డును తీసుకునే ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఆ కొండ చిలువ బ్రూవర్‌ను కరవడానికి వస్తుంది. అతను ఎన్ని సార్లు ప్రయత్నించినా.. పైథాన్ మాత్రం గుడ్లను ముట్టుకోనీయదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. అమ్మతనంలోని గొప్పతనాన్ని కొనియాడారు. పైథాన్‌కు గుడ్లపై ఉన్న ప్రేమను కొనియాడుతూ కామెంట్లు పెట్టారు. అదీ.. అమ్మంటే అంటూ అని మరికొందరు స్పందించారు. ఇదీ చదవండి: ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్ వీడియో -
షాకింగ్ ఘటన: కొండచిలువనే ఆయుధంగా..వ్యక్తిపై దాడి
కొందరూ తమ పెంపుడు జంతువులను, పక్షులను ప్రేమగా చూసుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తారు. నిజానికి కొందరూ వారికేదో సరదా హాబీలా పెంచుతారు. తమకు ఇబ్బంది లేదా కష్టం అనుకుంటే వాటి ప్రాణాలు తీసేందుకు లేదా వాటిని ప్రమాదంలో పడేయడం వంటివి చేస్తారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి ఓ పెంపుడు కొండచిలువ పట్ల అలానే వ్యవహరించాడు. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కెనడాలోని టొరంటోలో ఓ వ్యక్తి తన పెంపుడు కొండచిలువను ఆయుధంగా ఉపయోగించుకుని దాడికి దిగుతాడు. పాపం ఆ వ్యక్తిని నడి రోడ్డుపై ఆ పెంపుడు పాముని తాడు మాదిరిగా చేసుకుని ఇష్టారీతిలో కొడుతుంటాడు. అవతల వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు యత్నించినా కూడా వదలకుండా అలా దాడి చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసు వాహానం అటుగా రావడంతో వెంటనే సదరు వ్యక్తిని ఆపి అదుపులోకి తీసుకున్నారు. ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని టోరంటో నివాసి 45 ఏళ్ల లారేనియో అవిలాగా గుర్తించి అరెస్టు చేయడమే గాక ఒక ప్రాణిని ఇబ్బందులకు గురి చేసినందుకు పలు కేసులు నమోదు చేసి కోర్టులో హాజర్చారు కూడా. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Dude uses his pet snake as a weapon during street fight in Toronto 😳 pic.twitter.com/T2lLKaLe4E — Crazy Clips (@crazyclipsonly) May 13, 2023 (చదవండి: పదేళ్లు జైల్లో పెట్టేలా కుట్ర! అయినా తగ్గేదేలే! నాచివరి..!: ఇమ్రాన్ ఖాన్) -
మొసలిని అమాంతం మింగేసింది కొండచిలువ..పాపం ఆ తర్వాత..
ఓ కొండచిలువ అమాంతం ఓ మొసలిని మింగేసింది. ఆ తర్వాత అదిపడ్డ బాధ అంతా ఇంతా కాదు. చివరికి కక్కలేక మింగలేక నానాపాట్లు పడి.. విగతజీవిగా మారింది. అదే సమయంలో కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి సైతం ఊపిరాడక చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన బర్మాలో చోటు చేసుకుంది. కానీ వైద్యులు ఆ రెండు జీవుల్లో ఒక్కదాన్నైనా రక్షించాలనుకున్నారు. అందులో భాగంగానే వైద్యులు కొండచిలువ పొట్టకోసి మొసలిని తీసే యత్నం చేశారు. ఐతే అది అప్పటికే చనిపోయింది. ఆ కొండచిలువ సుమారు ఐదడుగుల మొసలిని మింగేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. దాన్ని అరగించుకోలేక ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు తనకు మించి భారీగా ఉన్నవాటిని మింగితే వాటిని కొండచిలువలు ఉమ్మేస్తాయని కొందరూ చెబుతున్నారు. మరికొందరూ కొండచిలువ అలా చేయగలిగే అవకాశం ఉన్న చేయలేక చనిపోయిందని ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..) -
వామ్మో.. ప్రపంచంలో అతి పొడవైన పైథాన్ ఇదేనా?
-
వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..!
ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు చూస్తే ఒక్కోసారి గుండె ఆగినంత పని అవుతుంది. ముఖ్యంగా పాములు, అనకొండలకు సంబంధించిన దృశ్యాలు భయంకరంగా ఉంటాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ పైథాన్ వీడియోను చూస్తే మీరు హడలెత్తిపోవడం ఖాయం. సాధారణంగా అందరు పాము జాతుల్లో అనకొండ అతిపెద్దది అయి ఉంటుందని అనుకుంటారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద పాము రెటిక్యులేటెడ్ పైథాన్. దక్షిణ, ఆగ్నేయ ఆసియా వీటికి నిలయం. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఈ పాముదే. The reticulated python (Malayopython reticulatus) is a python species native to South and Southeast Asia, It is the world's longest snake pic.twitter.com/gvTWFLA3Nq — Science girl (@gunsnrosesgirl3) March 25, 2023 అత్యంత భారీ సైజులో, నమ్మశక్యంగానీ రీతిలో ఉన్న రెటిక్యులేటెడ్ పైథాన్.. ఓ ఇంట్లో తిరుగుతూ కన్పించడం నెటిజన్లను విస్మయానికి గురి చేసింది. దీన్ని చూసిన కొందరికి దిమ్మతిరిగిపోయింది. ఇది నిజంగా పామేనా లేక గ్రాఫిక్సా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ ఆయిన ఈ పాము వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో నిడివి 17 సెకన్లు మాత్రమే ఉంది. పాము మెల్లగా ఓ ఇంటి గోడపై నుంచి లోనికి వెళ్లింది. ఎంత పెద్ద ధైర్యవంతుడైనా సరే.. ఈ పాము పరిమాణాన్ని చూస్తే హడలిపోయేలా ఉంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను పోస్టు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరికొందరు హమ్మయ్య.. లక్కీగా ఈ పాము మా ఇంట్లో లేదు అని నవ్వులు పూయించారు. చదవండి: ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి.. -
బుడ్డోడి ధైర్యం సల్లగుండా.. భయం లేకుండా ఎలా కొండచిలువుతో ఆడుతున్నాడో చూడండి !
-
Viral Video: బస్సులో భారీ కొండచిలువ
-
హైదరాబాద్ నడిబొడ్డున భారీ కొండచిలువ కలకలం
-
సికింద్రాబాద్‌లో 14 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షం..
-
చెత్తను శుభ్రం చేస్తుండగా కదలికలు.. తీరా చూస్తే!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయం కాలనీ పార్కులో మంగళవారం ఉదయం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేయడంతో వాళ్లు వచ్చి కొండ చిలువను తీసుకెళ్లారు. వివరాలు.. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వెనుక వైపు ఉన్న రైల్వే కాలనీ పార్కులో మంగళవారం ఉదయం 11.45 గంటల సమయంలో పార్కులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేసేందుకు సిబ్బంది వచ్చారు. పార్కులో ఉన్న చెత్తను ఎత్తివేస్తున్న సమయంలో అందులో ఏవో కదలికలు కనిపించాయి. మెళ్లిగా చెత్తను తొలగించి చూడగా 14 ఫీట్ల భారీ కొండ చిలువ కనబడడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. కాలనీ వారి సహాయంతో స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న బృందం వెంటనే ఆ కొండ చిలువను పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం పిల్లలు, పెద్దలు పార్కులో వాకింగ్‌కు, కాలాక్షేపానికి వస్తుంటారని, ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి అపాయం జరగకపోవడం అదృష్టంగా భావిస్తున్నామని కాలనీ వాసులు చెప్పారు. ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు కాలనీ పార్కులో చెత్తచెదారాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు -
Viral Video: కొండచిలువ పాలిట క్రొక‘డై’ల్
కొండచిలువలు భారీ ఆకారంతో పొడవుగా ఉండి.. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయన్న విషయం తెలిసిందే. ఏ జంతువునైనా పూర్తిగా చుట్టేసి ఊపిరిడాకుండా చేసి చంపేస్తాయి. అయితే అప్పుడప్పుడు ఇదే కొండచిలువకు కొన్నిసార్లు మృత్యుపాశంగా మారుతుంటాయి. మింగిన జంతువులను జీర్ణించుకోలేక, కక్కలేక అవస్థపడి చివరికి అవు ప్రాణాలు విడుస్తాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ‘ఆశ లావు.. పీక సన్నం’ సామెత ఈ 18 అడుగుల బర్మీస్ పైథాన్‌కు అక్షరాలా వర్తిస్తుంది. కొండచిలువ అంటే ఏదో చిన్న జింకలు, కుందేళ్లు లాంటి వాటిని మింగాలి కానీ.. ఏదో 18 అడుగులు ఉన్నాం కదా అని.. ఐదడుగుల పొడవున్న భారీ మొసలిని మింగేసింది. చివరికి జీర్ణించుకునే శక్తి లేక కీర్తిశేషుల జాబితాలో కలిసిపోయింది. దీని కడుపులోంచి చనిపోయిన మొసలిని జియోసైంటిస్ట్ రూసీ మూరే, సైంటిస్టుల బృందం బయటకు తీసింది. ఫ్లోరిడాలో ల్యాబ్‌లో ఈ మొసలిని తీస్తున్న దృశ్యాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు మూరే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ.. షాకింగ్ వీడియో -
TS: పరిహారం కోసం వెళ్లిన పోశన్నకు షాక్
క్రైమ్: ఉన్నట్లుండి ఇంటి బయట కొట్టంలో ఉన్న గొర్రెలు మాయమైపోతూ వచ్చాయి. చివరకు ఓ కొండచిలువ వాటిని మింగేసిందని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి. నష్టపరిహారం కోరుతూ అతను ఫారెస్ట్ అధికారులను సంప్రదించాడు. అయితే ఉల్టా అతని మీదే కేసు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో షాక్ తిన్నాడు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావాల్ గ్రామానికి చెందిన పోశన్న.. ఇంటి ఆవరణలోనే సాదుకుంటున్న నాలుగు గొర్రెలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వారం రోజుల్లో ఆ నాలుగు ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతూ వచ్చాయి. ఈ క్రమంలో దొంగల పనిగా భావించిన ఆ కుటుంబం ఒక కన్నేసింది. అయితే.. అక్టోబర్ 30వ తేదీన పోశన్న భార్య ఇల్లు ఊడుస్తున్న టైంలో ఇంటి ఫెన్సింగ్‌లో ఓ భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది. దీంతో గొర్రెలను మింగింది కొండచిలువనేనని నిర్ధారించుకుని.. కోపంతో ఊరి జనం సాయంతో దానిని గొడ్డళ్లతో నరికి చంపేశాడు పోశన్న. గొర్రెలు బతికే ఉంటాయన్న ఆశతో దాని కడుపు చీల్చి చూశాడు. అయితే.. అందులో గొర్రెల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోశన్న అటవీ అధికారులను నష్టపరిహారం కోసం సంప్రదించాడు. అయితే.. నష్టపరిహారానికి బదులు.. కొండచిలువను చంపిన నేరానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో పోశన్న కంగుతిన్నాడు. -
షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ
బల్లులు, కప్పలు, ఎలుకలు, చేపలు, కీటకాలు వంటి చిన్న చిన్న జంతువులను పాములు ఆహారంగా తినడం సహజం. పెద్ద జంతువుల జోలికి అవి పోవు. అదే కొండచిలువ విషయానికొస్తే మొత్తం భిన్నంగా ఉంటుంది. ఏది దొరికితే అది ఇట్టే పట్టేసుకుంటుంది. పట్టు వదలకుండా బలంగా చుట్టుకొని ఆహారంగా చేసుకుంటుంది. ఇటీవల మొసలి, కోతి, మేకలు కొండచిలువ మింగేసిన ఘటనలు చూస్తూ ఉన్నాం. వీటిని తిన్న తర్వాత అవస్థ పడి పాము మరణించిన ఘటనలూ లేకపోలేదు. తాజాగా ఓ కొండచిలువ ఏకంగా మనిషినే మింగేసింది. 22 అడుగుల భారీ కొండచిలువ సంజీవంగా ఉన్న 54 ఏళ్ల మహిళను మింగింది. ఈ షాకింగ్ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఆగ్నేమ సులవేసి ప్రావిన్స్‌లోని మునా ద్వీపంలో తన గ్రామ సమీపంలో ఉన్న కురగాయల తోటలో పని నిమిత్తం వెళ్లిన మహిళ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తోట వద్దకు వెళ్లి వెతగ్గా మహిళకు చెందిన చెప్పులు, ఫ్లాష్‌లైట్‌తోపాటు కొన్ని వస్తువులు దొరికాయి. దీంతో మరోసారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మహిళ కోసం గాలించగా ఆమె వస్తువులు దొరికిన ప్రాంతానికి కొంత దూరంలో ఓ భారీ కొండచిలువ కనిపించింది. అది చూడటానికి ఉబ్బిన కడుపుతో ఉండటంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వెంటనే కొండచిలువను చంపి దాన్ని కోయడంతో కడుపులో నుంచి మహిళ మృతదేహం బయటపడింది. కొండచిలువ పొట్టలో మహిళ దుస్తులతో సహా చెక్కుచెదరకుండా అలాగే ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ముందుగా మహిళ తల మింగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి. కాగా ఈ ఘటన ఇప్పటిది కాదని, పాతదని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. మరికొంత మంది ఇది ఎప్పుడు జరిగిన కొండచిలువ మనుషులను మింగడం సాధారణ విషయం కాదని, ఫోటోలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు -
Viral Video: వామ్మో.. గోడపై పాకుతున్న కొండచిలువ
-
వామ్మో.. గోడపై పాకుతున్న కొండచిలువ.. ఒళ్లు జలదరించే వీడియో
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. నిత్యం ఫన్నీ, షాకింగ్, ఆశ్చర్యపరిచే లక్షల వీడియోలు నెటిజన్లను దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే భయపడకుండా ఉండలేం! తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి కూడా. తాజాగా అటువంటి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మెట్ల పక్కనున్న గోడపై ఓ భారీ కొండచిలువ పాకుతూ పైకి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత నంద తన ట్విటర్లో పోస్టు చేశారు. పైకి వెళ్లడానికి ప్రతీసారి మెట్లు అవసరం లేదు’ అనే కాప్షన్‌తో షేర్ చేశారు. 32 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మెట్లకు ఆనుకుని ఉన్న రెయిలింగ్‌పై కొండచిలువ పాకుతూ ఇంటిపై అంతస్తులోకి వెళ్తుండటంకనిపిస్తోంది. ఈ వీడియో చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ట్విటర్లో పోస్టు చేసిన గంటల్లోనే వైరల్‌గా మారింది. దీనికి వేలల్లో వ్యూస్ వచ్చాయి. అనేకమంది నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. కొండచిలువ ఎక్కుతుండటం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుందని, వీడియో తీసిన వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఓసారి వీక్షించండి. -
స్కూల్ బస్సులో దూరిన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో
ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడి పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్‌లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. రాయ్‌బరేలిలోని ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పాఠశాలకు సెలవు కావడంతో బస్సును డ్రైవర్ తన గ్రామానికి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్క్ చేశాడు. ఆ బస్సు పక్క నుంచి మేకల మంద వెళ్తుంటే బస్సులో నుంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు గమనించారు. బస్సులో ఏదో ఉందనే అనుమానంతో పరిశీలించి చూడగా.. భారీ కొండచిలువ బస్సులో తిష్ట వేసింది. ఇంజిన్ భాగం వద్ద ఓ సీట్ కింద పెద్ద కొండచిలువ దాక్కుంది. చదవండి: వైరల్: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్‌కు జో బైడెన్ సలహా సమాచారం అందుకున్న సిటీ సీఓ వందనా సింగ్, సిటీ మెజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గంటపాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు. పట్టుకున్న కొండచిలువ బరువు 80 కేజీలు, పదకొండున్నర అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. Uttar Pradesh: रायबरेली में स्कूल की बस के इंजन में विशालकाय अजगर फंसा था। कड़ी मशक़्क़त के बाद वन विभाग की टीम ने निकाला बाहर। अजगर को रस्सी के सहारे बाहर निकाला गया। इस अजगर का वजन करीब 80 किलो और उसकी लंबाई साढ़े 11 फीट है। अजगर को सुरक्षित जंगल में छोड़ दिया गया है। #Python pic.twitter.com/TAoq9aq8CP — Tanseem Haider तनसीम हैदर Aajtak (@TanseemHaider) October 16, 2022 అటవీ అధికారులు బస్సులో నుంచి కొండచిలువను తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక అధికారి స్కూలు బస్సు దిగువ నుంచి కొండచిలువను లాగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆదివారం కావడంతో పాఠశాల మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
కోతిని మింగి..చనిపోయి
దండేపల్లి (మంచిర్యాల): ఓ కోతిని మింగి... కొండచిలువ చనిపోయిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో జరిగింది. కదలకుండా పడి ఉన్న కొండచిలువ చుట్టూ కొన్ని కోతులు చేరి అరుస్తుండటంతో గ్రామస్తులు గమనించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కొండచిలువ చనిపోయి ఉంది. అది మధ్యలో ఉబ్బెత్తుగా కనిపించింది. కోతిని మింగడం వల్ల మిగతా కోతులు దాడి చేసి ఉంటాయని, ఆ దాడిలో అది చనిపోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
పైథాన్‌తో ప్రేమలో..!
సాధారణంగా మనం పామును దూరం నుంచి చూస్తేనే హడలిపోతాం.. ఆమడదూరం పరిగెత్తుతాం.. కానీ అమెరికాకు చెందిన జే బ్య్రూవర్ అనే జూ కీపర్‌కు మాత్రం ఇలాంటి భయమేమీ లేదు. పైగా అన్ని సరీసృపాలను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను నెటిజన్లతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు. తాజాగా అతను ఇంధ్రదనుస్సు రంగుల్లో ఉన్న ఓ భారీ కొండచిలువ (రెటిక్యులేటెడ్ పైథాన్) తలను సుతారంగా నిమురుతూ దాన్ని హత్తుకుంటున్న వీడియో నెటిజన్లను అవాక్కు చేసింది. అయితే ఆ కొండచిలువను మచ్చిక చేసుకోవడం అంత వీజీగా ఏమీ జరగలేదని.. ఎన్నో ఏళ్లపాటు దాన్ని కంటికి రెప్పలా చూసుకున్నానని.. అందుకే తనతో కొండచిలువ ‘స్నేహం’ చేస్తోందని వీడియోలో అతను చెప్పుకొచ్చాడు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అతను పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పటివరకు 10 లక్షలసార్లకుపైగా నెటిజన్లు వీడియోను చూసి ఫిదా అయ్యారు. ఈ వీడియోను లక్ష మందికిపైగా ‘లైక్’ చేశారు. -
వామ్మో.. సప్తవర్ణాల పైథాన్‌తో సరదాగా...!
-
మహిళ బాత్రూమ్లో భారీ పైథాన్.. ఆ తర్వాత ఏమైందంటే?
అనుకోకుండా ఓ పామును చూస్తేనే మనం భయంతో వణికిపోతాము. అలాంటిది ఇంట్లో ఉండే బాత్రూమ్లోకి ఏకంగా భారీ కొండ చిలువ ప్రవేశిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి షాకింగ్ ఘటనే థాయ్‌లాండ్‌కు ఓ మహిళకు ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. బ్యాంకాక్‌కు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉన్న బాత్రూమ్లోకి ఓ 12 అడుగుల కొండ చిలువ వెళ్లింది. ఈ క్రమంలో బాత్రూమ్లో నుంచి బయటకు వచ్చేందుకు కొండ చిలువ ప్రయత్నించింది. అయితే బాత్రూమ్ మొత్తం గ్లాస్‌తో కవర్ చేసి ఉండటంతో బయటకు రాలేకపోయింది. ఇదంతా అక్కడే ఉన్న రెండు పిల్లలు గమినిస్తూ ఉండటం వీడియోలో చూడవచ్చు. కాగా, ఇంటి సభ్యుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ టాయిలెట్ టబ్ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం ద్వారా కొండచిలువ బాత్రూమ్లోని వచ్చినట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) -
విమానంలో కొండ చిలువ పిల్లలు.. షాకైన ప్రయాణికులు
చెన్నై: థాయ్‌ల్యాండ్ దేశం నుంచి చెన్నైకి తీసుకువచ్చిన కొండచిలువలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి ఆ దేశానికి తరలించారు. వాటిని తీసుకువచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి థాయ్‌ల్యాండ్ దేశం నుంచి వచ్చిన విమానంలో విలువైన వస్తువులు తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఆ సమయంలో థాయ్‌ల్యాండ్‌కు పర్యాటక వీసాలో వెళ్లి చెన్నైకి వచ్చినా దిండుగల్‌కు చెందిన వివేక్ (29) వద్ద తనిఖీ చేయగా, ఐదు కొండ చిలువ పిల్లలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు తిరిగి థాయ్‌ల్యాండ్‌కు పంపించారు. వివేక్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విషయం ప్రయాణికులకు తెలియడంతో షాకయ్యారు. చదవండి: Flipkart: కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలో తగ్గేదేలే! -
షాకింగ్ వీడియో: భారీ కొండ చిలువతో చిన్నారి ఆటలు
చిన్న పామును చూస్తేనే భయంతో ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది భారీ కొండ చిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది. కానీ, ఓ చిన్న పాప.. భారీ కొండ చిలువతో ఆడుకుంటోంది. పడక గదిలో పాముతో చిన్నారి ఆటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాముతో చిన్నారి ఆడుకుంటున్న వీడియోను స్నేక్మాస్టర్ఎక్సోటిక్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పాప పేరు అరియానాగా తెలిసింది. ఆమెకు పాములంటే చాల ఇష్టం. పాములను తన స్నేహితులుగా చూసుకుంటుంది. వివిధ రకాల పాములతో ఆడుకుంటున్న వీడియోలు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాజాగా వైరల్‌గా మారిన వీడియోలో.. చిన్నారి బ్లాక్ పైథాన్ తోక పట్టుకుని లాగుతుంటుంది. ఆ పాము చిన్నారి నుంచి తప్పించుకుని బెడ్‌లోకి దూరేందుకు ప్రయత్నిస్తుంది. అది పడుకోవాలని భావిస్తోంది అని వీడియో క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు 20కేకుపైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల నుంచి ఆందోళన చెందుతున్న సందేశాలు వచ్చాయి. పాములు బొమ్మలు కాదని పలువురు సూచించారు. View this post on Instagram A post shared by Ariana (@snakemasterexotics) ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే? -
కొండచిలువతో పోట్లాడుతున్న కంగారు: వీడియో వైరల్
ప్రకృతి నియమం ప్రకారం ప్రతి జీవి ఏదో ఒకదానికి ఆహారమవుతుంది. ఆ తరుణంలో కొన్ని జంతువులు క్రూరంగా వేటాడటాన్ని చూస్తే చాలం భయానకంగా ఉంటుంది. ఆ క్రూర జంతువులు నుంచి ఈ జంతువు తప్పించుకుంటే బావుండును అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి జుగుప్సకరమైన సంఘటన ఈ వైరల్ వీడియోలో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక కంగారును కొండచిలువ గట్టిగా చుట్టి చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో మరో కంగారు జంప్ చేసుకుని వచ్చి మరీ తన స్నేహితుడిని విడిపించేందకు శతవిధాల యత్నిస్తుంటుంది. కానీ మరోవైపు కొండ చిలువ ఏదో విధంగా చంపి తినేందుకు చూస్తుంటుంది. కానీ కంగారు మాత్రం తనకు చేతనైనంత మేర ఆ కొండచిలువను రకరకాలుగా కొరుకుతూ తన స్నేహితుడుని విడిపించేందుకు ప్రయత్నించడం చూస్తేంటే ఒక విధమైన భావన కలుగుతుంది. కొండచిలువకు చిక్కిన ఆ కంగారు బతికితే బావుండును అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Wildlifeanimall (@wildlifeanimall) -
వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ
సాక్షి, వనపర్తి: పట్టణంలోని రాజనగరం అమ్మచెరువు కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన చేపల వలలో ఆదివారం కొండ చిలువ చిక్కింది. అటుగా వెళ్లేవారు గుర్తించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. 8 అడుగుల కొండ చిలువను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అనంతరం స్నేక్ సాగర్‌కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని సురక్షితంగా పట్టుకొని అడవిలో వదిలేశారు. చదవండి: Photo Feature: కుక్క.. కోతి సయ్యాట -
మాకు బతకాలని ఉండదా!.. కనపడితే ఖతం చేస్తున్నారు
సాక్షి ,భామిని(పార్వతిపురం మన్యం): సరీసృపాల్లో సర్పజాతిపై అవగాహన లోపంతో అవి అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. హైందవ సంప్రదాయంలో పవిత్ర స్థానం గల సర్పాలకు పూజలు, నోములు చేస్తున్న చోటే అవగాహన లోపంతో వాటిని అంతం చేసే సంస్కృతి సాగుతోంది. దెబ్బ తిన్న పాము పగ పడుతుందనే అభూత కల్పన, పాము కాటు వేస్తే విష ప్రభావంతో మరణిస్తామనే భయంతో వాటిని హతమారుస్తున్నారు. గ్రామస్తుల చేతిలో హతమైన భారీ కొండచిలువ పంట కాపాడే పాములు రైతు పండించే పంటలో నలభై శాతం స్వాహా చేస్తున్న ఎలు కలు, పందికొక్కుల నివారణ లో కీలక పాత్ర ధారి పాముకు మనుగడ కష్టమైపోతోంది. పర్యావరణ పరిరక్షణలో కీలకంగా, భూ సారాన్ని కాపాడే ముఖ్యమైన జీవిగా గుర్తింపు పొందినా వాటికి తగిన రక్షణ కరువవుతోందని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిమి సంహారక మందుల ప్రభావం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వినియోగించే క్రిమి సంహారక మందుల ప్రభావం, ఆదునిక యంత్రాల వాడకంలో పుట్టలు, తుప్పలు, దిబ్బలు లేకుండా, భూమిలో బొరియలు లేకుండా చేయడంతో పాముల సంచారం కష్టమైంది. విష సర్పాలు తక్కువ.. మన చుట్టూ తిరుగుతున్న పాములలో 80 శాతం విషంలేని సాధారణ సర్పాలే ఉన్నాయి. విçషపూరితమైనవి, ప్రాణాంతకం కలిగించేవి కొద్దిగానే ఉన్నాయి. నాలుగు రకాలైన తాచుపాము(నాగుపాము),రక్తపింజర,కట్లపాము, పొడపాములను విషసర్పా లుగా గుర్తించారు. పాము కాటుకు గురైన వ్యక్తుల్లో అత్యధికంగా భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాములపై అవగాహన అవసరం విద్యార్థి స్థాయి నుంచి పాములపై అవగాహన కల్పించాలి. అన్ని పాములు ప్రమాదరం కావని తెలియజేయాలి. పాము పగ పడుతుందనే మూఢ నమ్మకాలు విడిచి పెట్టేలా చైతన్యం కల్పించాలి. స్నేక్స్ ఫ్రెండ్లీ సొసైటీలు ఏర్పాటు కావాలి. అన్ని పాములను హరించడం తగదు. కొట్టి చంపకుండా, పట్టి దూరంగా విడిచిపెట్టాలి. అవి అంతరించకుండా చూడాలి. పాములన్నీ విషసర్పాలు కావు పాములన్నీ విషసర్పాలు కావు. అన్ని పాములకు విషం ఉండదు. పాము కాటు వేస్తే చనిపోతామనే భయం వీడాలి. ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైనా భయపడవద్దు. అందుబాటులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురండి. విషాన్ని నివారించే ఏంటీస్నేక్ వీనమ్(ఏఎస్వీ) మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు పడిన తరువాత గాయాన్ని కడగవద్దు. పాము వేసిన గాట్లు గుర్తించి విషప్రభావం లెక్కించి ఏఎస్‌వీలు వేస్తాం. – డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు,డిప్యూటీ డీఎంహెచ్ఓ,సీతంపేట పాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సర్ప జాతుల సంరక్షణకు స్నేక్ రెస్క్యూ టీం తరలి వస్తుంది. ప్రాణాపాయం లేకుండా పట్టుకుని అడవుల్లో విడిచి పెడతాం.అటవీశాఖాధికారుల సహకారంతో గ్రీన్ మెర్సీ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది.సర్పజాతులను చంపవద్దు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది.హెల్ప్‌లైన్ నంబర్ 9848414658కు తెలియ పర్చండి. పాములను చంపడం చట్టరీత్యానేరం.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు కఠిన శిక్షలు తప్పవు. – కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ వన్యప్రాణ సంరక్షణ గస్తీ బృందం చదవండి: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల వెనుక షాకింగ్ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ ప్లాన్! -
పైథాన్, చిరుతల మధ్య భీకర పోరు.. వీడియో వైరల్
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్ వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే భయపడకుండా ఉండలేం! తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి కూడా. ప్రస్తుతం అటువంటి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ చెరువులో ఆహారం కోసం వెతుకుతున్న చిరుతకు అదే సమయంలో ఒక చిన్న పైథాన్ ఎదురుపడింది. అయితే ఒక్కసారిగా చిరుత.. ఫైథాన్‌ను నోట కరిచింది. దీంతో పైథాన్ చిరుతను చుట్టేయడానికి ప్రయత్నించింది. చిరుత పంజా ముందు పైథాన్ ప్రయత్నం సాగలేదు. కొండచిలువను చిరుత నోట కరుచుకొని దగ్గరల్లో ఉన్న గట్టుపైకి ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను wild_animals_creation అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పైథాన్‌ను చిరుత ఏం చేసింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Wild life stories (@wild_animals_creation) -
షాకింగ్ ఘటన: మృతదేహం చుట్టూ 125 పాములు
అమెరికాలో ఒళ్లు గగుర్పుడిచే ఘటన చోటుచేసుకుంది. అత్యంత విషమైన 125 పాములు మధ్య ఓ వ్యక్తి విగత జీవిగా పడిఉండటం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మేరీలాండ్‌లోని చార్లెస్ కౌంటీ ప్రాంతంలో నివసించే 49 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఇంట్లో వ్యక్తి మృతదేహం కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టే 125 పాములు పాకుతూ కనిపించాయి. అందులో అత్యంత విషపూరితమైన కోబ్రాలతోపాటు, 14 అడుగుల ఓ కొండచిలువ కూడా ఉంది. అయితే ఆ సర్పాలను అతడు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అతడి మరణానికి ఇంకా కారణాలు తెలియలేదు. అయితే పాములే కాటు వేశాయా.. లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు! -
భారీకొండ చిలువతో చిన్నారి ఆటలు, చూస్తే షాకవ్వాల్సిందే!
సాధారణంగా చాలామంది పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాము ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ఇష్టపడరు. ఒక్కొసారి పాములు, కొండ చిలువలు దారితప్పి.. జనవాసాల మధ్యన, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనికి వస్తుంటాయి. లేదా చాలా తక్కువ మంది ఇళ్లలోనే పాములను పెంచుకుంటారు. అలాంటి వారు పాముకి బయపడకుండా వాటితో మంచి స్నేహాన్ని ఏర్పరుచుకుంటారు. తాజాగా ఓ చిన్నారి పెద్ద పాముతో ఎలాంటి బెరుకు లేకుండా ఆడుకుంటున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో అయిదారేళ్ల వయసున్న చిన్నారి రెడ్ కలర్ టీషర్టు ధరించి తన ఇంటి ఆవరణంలో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడి భారీ కొండ చిలువ వచ్చింది. అయితే కొండచిలువను చూసిన చిన్నారి ఏమాత్రం భయపడలేదు. పైగా నవ్వుతూ పాము దగ్గరకు వెళ్తుంది. కొండ చిలువను పట్టుకొని దానితో ఆటలాడుతుంది. ప్రశాంతంగా పాము మీద పడుకుంటుంది. చిన్నారి పక్కన పాము పాకడం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచినట్లు అనిపిస్తుంది. చదవండి: ‘మేరా ఫౌజీ అమర్ రహే’.. పెళ్లినాటి దుస్తుల్లో భర్తకు తుది వీడ్కోలు ఇక చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. కొండచిలువతో ఆడిన పసిపాప ధైర్య హృదయాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా, లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. కాగా చిన్నారి ఆడుకుంటున్న పాము శిక్షణ పొందిన పెంపుడు జంతువు అని తెలిసింది. చదవండి: ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్ చేసిన ఆసీస్ మహిళ.. ఎలాగో చూడండి..! View this post on Instagram A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world) -
వామ్మో.. కొండ చిలువలు ఒకదాని వెంట మరోకటి..
సాక్షి, వరంగల్: అడవుల్లో, చెట్లపొదల్లో ఉండే కొండ చిలువలు ఆహారం కోసం ఒకచోటునుంచి మరోచోటుకు వెళ్తుంటాయి. అలాంటి ఘటనే ఇది. బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మాందారిపేట గుట్టలోనుంచి రోడ్డు ఆవతలికి వెళ్లే క్రమంలో జాతీయ రహదారిపై రెండు కొండచిలువలు వచ్చాయి. ఒకదాని వెనకాల మరోకటి క్యూ లైన్ లాగా రోడ్డుపై నుంచి వెళ్తుండడంతో వాహనదారులు ఆపి ఆసక్తి చూస్తూ ఫొటోలు తీశారు. -
కారులో మకాం వేసిన కొండ చిలువ.. ఎంత భయంకరంగా ఉందో..
మెల్బోర్న్: సాధారణంగా చాలామంది పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాము.. ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ఇష్టపడరు. అయితే.. ఒక్కొసారి పాములు, కొండ చిలువలు దారితప్పి.. జనవాసాల మధ్యన, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనికి దారితప్పి వస్తుంటాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలను మనం చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బ్రిస్బెన్ పట్టణంలో ఉండే జోష్ కాస్ట్లీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సరదాగా క్విన్స్‌లాండ్‌కు పిక్నిక్కు వెళ్లాడు. వారు తమ వాహనాన్ని బుష్లాండ్ సమీపంలో పార్క్ చేసి బయటకు లోపలికి వెళ్లిపోయారు. పిక్నిక్లో సరదాగా గడిపిన తర్వాత.. బయటకు వచ్చారు. అప్పుడు వారు ఒక షాకింగ్ సంఘటనను చూశారు. వారు పార్క్ చేసిన కారు అద్దానికి ఒక మీటరు పొడవున్న.. కొండ చిలువ చుట్టుకుని ఉండటాన్ని గమనించారు. దీంతో ఆశ్చర్యపోయారు. జోష్ కాస్ట్లీ పాములను పడుతుంటాడు. ఇప్పటికే పాములను పట్టిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు మాత్రం.. జోష్ కాస్ట్లీ ఎందుకో ఆ కొండ చిలువను పట్టే సాహసం చేయలేదు. అతను.. పీటర్ అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. పీటర్ అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకుని సమీపంలోని అడవిలో విడిచిపెట్టాడు. గతంలో ఒక పామును పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కాస్ట్లీ.. పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత.. సమయానికి వైద్యం అందండంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ కొండ చిలువ చిత్రాన్ని కూడా.. కాస్ట్లీ తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’ ‘ నీ అదృష్టం బాగుంది..’, ‘ కారు అద్దాన్ని భలే చుట్టేసుకుందే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఇంట్లో మకాం వేసిన కొండచిలువ.. ఇంటి యజమానిని చూసి..
శివమొగ్గ( బెంగళూరు): శివమొగ్గ తాలూకాలోని మత్తూరు వద్ద శ్రీకంఠపుర గ్రామంలో ఓ ఇంట్లో పై కప్పు దూలాల వద్ద ఒక పెద్ద కొండచిలువ మకాం వేసింది. ఇంటి యజమాని చూడడంతో ఒక్కసారి దాడి చేయబోయింది. తప్పించుకున్న అతను స్నేక్ కిరణ్‌కు సమాచారం ఇచ్చాడు. స్నేక్ కిరణ్ వచ్చి దానిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. దూరంగా అడవిలో వదిలిపెట్టారు. దగ్గరిలోని అటవీప్రాంతం నుంచి ఇంట్లోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరో ఘటనలో.. సుందరమైన భాష కన్నడ బనశంకరి: భాషకు ఎలాంటి ద్వేషం లేదని, ప్రపంచంలో సుందరమైన భాష కన్నడ అని సాహితీవేత్త చెన్నబసస్ప అన్నారు. గురువారం బనశంకరిలోని శ్రీకృష్ణ పీయూ కళాశాలలో రాజ్యోత్సవాన్ని విద్యాసంస్థ చైర్మన్ డా. రుక్మాంగదనాయుడితో కలిసి చెన్నబసప్ప ప్రారంభించి మాట్లాడారు. రాజ్యోత్సవం నిత్యోత్సవం కావాలని అన్నారు. సంస్థ డైరెక్టర్ మనోహర్, ప్రిన్సిపాల్ డీఎం.గోపాల్, మల్లారి ఆర్.భట్ తదితరులు పాల్గొన్నారు. -
Viral Video: బాబోయ్! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!
-
బాబోయ్! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!
Girl Kisses and Cuddles Her Pet Snake Video: సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడం కోసం చాలామంది ఇటీవల కాలంలో పాములతో ఒళ్లు గగుర్పాటుకి గురిచేసే విధంగా రకరకాల విన్యాసాలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పైగా అవి ఒక్కొసారి వికటించి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. అంతేకాదు వాటిని పట్టుకుని డ్యాన్సుల చేయడం వంటివి కూడా చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక అమ్మాయి తన పెంపుడు పాము(కొండచిలువ)ని ముద్దుపెట్టుకున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. (చదవండి: లాక్డౌన్లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!) అయితే ఆ అమ్మాయి ఈ వీడియోలో తన పెంపుడు పామును కౌగలించుకుని మంచంపై పడుకుని ఉంటుంది. పైగా ఆ పాము తల ఆమె పెదాల దగరకు రాగానే ముద్దుపెడుతుంది. అంతే ఆ పాము ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. దీంతో ఆమె నవ్వుతూ ఐ లవ్ యూ అంటూ మళ్లీ ముద్దు పెడుతుంది. అది కూడా నేను కూడా ప్రేమిస్తున్నాను అంటూ ఆ పాము కూడా తన తలను ప్రేమగా ఆ అమ్మాయి బుగ్గ పై ఆనించింది. దీంతో నెటిజన్లు పాములు కూడ ఇంత ప్రేమగా ఉంటాయా, ఇలా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయా అంటూ ఆశ్చర్యపోతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి) -
కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి!
మనం డిస్కవరీ చానల్స్‌లో కొండచిలువ, అనకొండ లాంటి పాములు ఎలా జంతువులపై దాడి చేసి తినేస్తాయో చూసి ఉంటాం. అవి చూస్తే కాస్త రోమాలు నిక్కబొడుచుకుని వొళ్లు జలదరిస్తుంది. అచ్చం అలాంటి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అసలు ఇంతకీ ఆ ఫోటోలో ఏం ఉందంటే ఒక కొండచిలువ ఒక నక్కను గొంతు పిసికి చంపుతుంది. అసలు ఏముంది ఇందులో ఇలాంటివి చాలేనే చూశాం అంటారా!. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) అసలు విషయం ఇక్కడే ఉంది ఏంటంటే సీతాకోక చిలుక రెక్కలు విప్పుకుని కూర్చొని ఉండగా కొండచిలువ నక్కను గొంతు పిసికి చంపేసింది. అయితే అందులో సీతకోక చిలుక ఎక్కడ ఉందో చెప్పండి" అనే క్యాప్షన్‌ని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో నెటిజన్లకు ఆ ఫోటోలో సీతాకోక చిలుక ఎక్కడ ఉంది అంటూ ఆసక్తిగా వీక్షించడంతో అది కాస్త పెద్ద రసవత్తరమైన అంశంగా మారుతుంది. ఇంతకీ ఆ సీతకోక చిలుక కొండచిలువ తలపై ప్రశాంతంగా కూర్చోని ఉంటుంది. నిజానికి చాలా మంది నెటిజన్లు గుర్తించలేకపోతారు. (చదవండి: ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో) Python strangles jackal. What do you think the butterfly is saying to the python?#TiredEarth pic.twitter.com/BgEjl3aeOt — Rebecca Herbert (@RebeccaH2030) October 27, 2021 -
పది కోళ్లను తిన్న కొండచిలువ
సాక్షి, శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం, బొడ్డవర గ్రామంలోని ఎస్ఎస్ఎస్ చికెన్ షాపు వద్ద గల షెడ్డులోకి 10 అడుగుల భారీ కొండచిలువ ఆదివారం ప్రవేశించి పదికోళ్లకు పైగా తినేసి మరో రెండు కోళ్లను తీవ్రంగా గాయపరిచింది. అదే సమయంలో షాపు యజమానులు సాయి, రామసత్తి, స్థానికులు భారీ కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుడు పట్నాయక్ సహాయంతో భారీ కొండచిలువను షాపు యజమానులు పట్టుకుని గోనె సంచిలో బంధించి సమీపంలో ఉన్న గంటికొండలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సమీపంలో ఉన్న కొండపై నుంచి గెడ్డ ప్రవాహం ద్వారా భారీ కొండ చిలువ కొట్టుకుని వచ్చి చికెన్‌షాపులో ప్రవేశించి ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు. చదవండి: (విదేశీ వలస విహంగాల విలాపం.. పదుల సంఖ్యలో మృతి) భారీ కొండచిలువను పట్టుకున్న స్థానికుడు -
ఓ పక్క ఫోన్.. మరో పక్క కొండ చిలువ.. భళా బాలిక అంటున్న నెటిజన్స్
పాములంటే అందరికీ భయమే. అవి కంటికి కనపడితే చాలు పరుగుల పందెంలో పోటీలా పరుగెత్తుతాము. అయితే కొంతమంది పాములను కూడా పెంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అలాంటి పెంపుడు పాములు ఆ ఇంటి వారికి ఎటువంటి హాని కలిగించవు. అలా అని వాటితో ఏమరుపాటుగా ఉండి అవి హాని కలిగించిన ఘటనలు ఉన్నాయి. ఇందులో అంత రిస్క్ ఉండగా ఓ అమ్మాయి ఏకంగా పామును పెంచుకుంటుంది. అంతేనా తన ఒడిలో కూడా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ బాలిక తన ఇంటి వెలుపల కూర్చొని మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఓ పెద్ద కొండ చిలువ ఆ ఇంటి ప్రాంగణంలో పాకుతూ ఆ బాలిక ఒడిలో తల పెడుతుంది. ఆ బాలిక కూడా ఎలాంటి భయం, బెరుకు లేకుండా.. ఒక చేత్తో ఫోన్ ఆపరేట్ చేస్తూ మరో చేత్తో పసి పాపను తడిమినట్లుగా ఆ కొండచిలువను తడుముతూ ఉంది. ఈ వీడియో సోషల్‌మీడియోలో షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే గాక ఆ పాప ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Travel | Nature | Adventure (@yournaturegram) చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’ -
భారీ కొండ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగి.. ఆతర్వాత..
ఖమ్మం: ఒక కొండ చిలువ దారితప్పి జనావాసాల్లోకి ప్రవేశించింది. అంతటితో ఆగకుండా అక్కడి కోళ్లను మింగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. ఒక కొండ చిలువ కొత్తగూడెంలో ఉంటున్న జావీద్ అనే వ్యక్తి ఇంట్లో ప్రవేశించింది. ఆ తర్వాత అక్కడే ఉన్న రెండు కోళ్లను లటుక్కున మింగింది. ఆ తర్వాత ఎటూ కదల్లేక అక్కడే పడుకుంది. దీన్ని గమనించిన ఆ ఇంటివారు.. పాములను పట్టుకునే వారికి సమాచారం అందించారు. వారు వెంటనే జావీద్ ఇంటికి చేరుకుని కొండచిలువను బంధించారు. ఆ తర్వాత దాన్ని పైకెత్తగానే.. కొండ చిలువ మింగిన కోళ్లను బయటకు కక్కింది. ఆ తర్వాత దాన్ని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి..
గాంధీనగర్: భారీ వర్షాల కారణంగా ఒక్కొసారి అడవిలోని జంతువులు మానవ ఆవాసాల దగ్గరికి వస్తుంటాయని విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ రెండు భయంకరమైన జీవులు జనావాసాల సమీపంలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, వడోదరకు సమీపంలో ఒక చెరువు ఉంది. ఈ క్రమంలో, అక్కడి నుంచి 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి రెండు కూడా జనావాసాల్లోకి వచ్చాయి. వీటిని చూడగానే స్థానికులు భయంతో వణికిపోయారు. ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే ఆ జీవులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో కలిసి కొండచిలువ, మొసలిని బంధించారు. ఆ తర్వాత వాటిని దగ్గరలోని అడవిలోకి వెళ్లి వదిలినట్లు ఫారెస్టు అధికారి అర్వింద్ పవార్ తెలిపారు. కాగా, ఆ జీవుల నుంచి ఎలాంటి అపాయం లేకుండా రెస్క్యూ సిబ్బంది పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో..
బ్రసీలియా: సాధారణంగా అడవిలోని జంతువులు, సరీసృపాలు మానవ ఆవాసాలకు వస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. కాగా, అవి.. ఆహారం కోసం, ఆవాసం కోసం దారితప్పి మానవ ఆవాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలోని రోడ్లపై జంతువులు, పాములు రోడ్డును దాటుతూ ఒకవైపు నుంచి మరొవైపుకు వెళ్లిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా, బ్రెజిల్‌లోని హైవేపై ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక పెద్ద అనకొండ రోడ్డును దాటుకుంటు వెళ్లింది. కాగా, మొదట దీన్నిచూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, అసలే అది హైవే.. వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోంచి ఒక పదడుగుల అనకొండ బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మెల్లగా పాకుకుంటూ.. డివైడర్ ఎక్కేసింది. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లసాగింది. అనకొండ ను చూసిన ప్రయాణికులు .. తమ వాహనాలను ఆపివేసి దాన్ని తమ మొబైల్లో వీడియో తీసుకుంటున్నారు. అనకొండకు ఎవరు కూడా ఆపద తలపెట్లలేదు. వేగంగా వచ్చిన వాహనదారులు.. కార్లను రోడ్డుకు ఒకవైపు నిలిపేసి ఆ అనకొండను ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరికొందరు దూరం నుంచి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే, అనకొండ మాత్రం మెల్లగా పాకుకుంటూ.. రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి వెళ్లి అదృష్యమయ్యింది. కాగా, ఈ వీడియోను ఒక బ్రెజిల్‌లోని ఒక వ్యక్తి అనిమల్స్ వేంచర్ అనే ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి ఇతను ‘అనకొండ రోడ్డుదాటుతుంటే.. ప్రయాణికులు చూస్తు ఉండిపోయారు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఎంత బాగా పాకుకుంటూ వెళ్తుంది..’,‘అనకొండకు.. ఆపద కల్గించనందుకు ధన్యవాదాలు..’, ‘జంతువుల మనుగడకు మనుషులు సహాయపడుతున్నందుకు థ్యాంక్స్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా బ్రెజిల్ అడవులలో ఉండే అనకొండలు 550 పౌండ్ల బరువుని కల్లి ఉండి, 29 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. చదవండి: మహిళకు షాక్.. ఇంటిని బందెల దొడ్డి చేశాయ్! -
దుప్పిని మింగిన కొండచిలువ
సాక్షి, ఎర్రావారి పాళెం: చిత్తూరు జిల్లా తలకోన అటవీ ప్రాంతంలోని మొదటి వంక సమీపంలో ఓ కొండచిలువ దుప్పిని మింగేసింది. తర్వాత కదల్లేని స్థితిలో అక్కడే ఉండిపోయింది. సోమవారం మధ్యాహ్నం అటుగా వెళుతున్న తలకోన పర్యాటకులు కొండచిలువను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. చదవండి: రిజర్వేషన్ లేకుండానే రైలు ప్రయాణం -
కోతిని మింగేసిన కొండచిలువ..తరువాత ఏమైందంటే!
వడోదర: భారీ కొండచిలువ ఏకంగా ఓ కోతిని మింగేసింది. తరువాత కదల్లేక నదిలో ఉండిపోవడాన్ని అటవీ సిబ్బంది గమనించారు. పదడుగుల పొడవైన ఈ కొండచిలువను గుజరాత్ అటవీశాఖ అధికారులు మంగళవారం రక్షించారు. వడోదరలోని చిన్న నదిలో దీన్ని గుర్తించారు. ముగ్గురు రక్షకులు నది నుండి దీనిని బయటకు తీసారని, అనంతరం మింగేసిన కోతిని వాంతి చేసుకుందని గుజరాత్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పైథాన్ ఆరోగ్యం బాగానే ఉందని అటవీ అధికారి శైలేష్ రావల్ తెలిపారు. ఈ కొండచిలువను బోనులో సురక్షితంగా ఉంచినట్టు వెల్లడించారు. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామన్నారు. Gujarat Forest Department officials rescued a 10-foot long python from a small river in Vadodara. "It had swallowed a monkey and later unswallowed it. Python is in a good situation. We will release it in jungle once permission is obtained," said Shailesh Rawal, rescuer (09.08) pic.twitter.com/6DUUP00Ux9 — ANI (@ANI) August 10, 2021 -
వైరల్: మేకను మింగిన కొండచిలువ
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని భరద్వాజ తీర్థంలో 13 అడుగుల కొండచిలువ ఆదివారం మేకను మింగేసింది. అది కదలలేని స్థితిలో ఉండగా ఆలయ ఉద్యోగులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కొండచిలువను పట్టుకుని, మింగిన మేక పిల్లను కక్కించి, రామాపురం అటవీ ప్రాంతంలో వదిలివేశారు. కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. -
కొండచిలువ పాట్లు.. నాలుగు కోళ్లను మింగేసి ఎటూ కదల్లేక
బొబ్బిలి రూరల్: మండలంలో జె.రంగరాయపురంలో ఆదివారం గ్రామానికి చెందిన పూడికూర్మారావు పశువుల శాల వద్ద ఎనిమిది అడుగుల కొండచిలువ కోళ్లగూటిలో దూరి నాలుగు కోళ్లను మింగేసింది. అనంతరం ఎటూ కదల్లేక అక్కడే ఇబ్బంది పడసాగింది. గతంలో కూడా కొండచిలువలు గ్రామంలోకి వచ్చి సందర్భాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. వేగావతి నదిలో నుంచి వచ్చి ఉండొచ్చని చర్చించుకున్నారు. -
వక్క తోటలో ఆరు అడుగుల కొండచిలువ
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని ఎన్టీ రోడ్డు ఆస్పత్రి సమీపంలో ఉన్న ఓ వక్క తోటలో భారీ కొండ చిలువ కనిపించింది. మంగళవారం ఉదయం తోటకు వెళ్లిన యజమానికి కొండచిలువ కనిపించడంతో ఆయన వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన దానిని పట్టుకుని సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. కొండ చిలువ ఆరు అడుగులకు పైగా ఉందని తెలిపారు. కొండచిలువ హల్చల్ వంగర: ఎం.సీతారాంపురం గ్రామంలో మంగళవారం కొండచిలువ హల్చల్ చేసింది. పాఠశాల సమీపంలో ఉన్న చెరువును ఆనుకొని పొదల్లో చిలువను గుర్తించిన స్థానికులు.. సమీపంలో పశువులు మేతకు రావడంతో ఆందోళన చెందారు. దీంతో దానిని హతమర్చారు. -
ఎలా వచ్చిందో ఏమో.. కొండచిలువ కలకలం
సాక్షి, పోచారం: అన్నోజిగూడలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఆదివారం కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు అయిదు అడుగుల పొడవున్న ఆ పాము తావుర్యా నాయక్ అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పట్టుకొని అడవిలో వదిలేశారు. -
జూ నుంచి తప్పించుకుంది; కట్‌చేస్తే షాపింగ్‌మాల్‌లో
లూసియానా: కారా అనే 12 అడుగుల కొండచిలువ రెండు రోజుల క్రితం లూసియానాలోని బ్లూ అక్వేరియం జూ నుంచి తప్పించుకుంది. ఎంతో పకడ్బందీగా ఉండే ఎన్‌క్లోజర్ నుంచి ఎలా తప్పించుకుందో అధికారులకు అర్థం కాలేదు. పాపం రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని అధికారులు కారాను వెతికే ప్రయత్నం చేశారు. అలా చివరికి ఒక షాపింగ్‌మాల్‌లో గోడ సీలింగ్‌లో కారా దాక్కున్నట్లు వారికి తెలిసింది. ఇంకేముంది షాపింగ్‌మాల్ నిర్వాహకులు అనుమతితో వారి గోడకున్న సీలింగ్‌ను పగుగొట్టి దాని నుంచి కొండచిలువను బయటికి తీశారు. ఆ కొంచిలువ ఇక్కడే ఉంటే ప్రమాదమని.. వెంటనే బ్లూ జూ అక్వేరియంకు తరలించి పటిష్టమైన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో కథ సుఖాంతమైంది. ''మాకు కారా తప్పిపోయిందని తెలిసినప్పటి నుంచి దానిని వెతికే ప్రయత్నంలో పడ్డాం. రెండురోజుల పాటు నిద్రహారాలు మాని కారా కోసం గాలించాం. చివరికి గురువారం ఒక షాపింగ్‌మాల్‌లో చిన్న సందు ద్వారా గోడ సీలింగ్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. కారాను సురక్షితంగా బయటికి తీసి ఎన్‌క్లోజర్‌లో పెట్టేశాం'' అంటూ జూ ప్రధాన అధికారి రోండా స్వాన్సన్ చెప్పుకచ్చాడు. కాగా కారాను (కొండచిలువ) సీలింగ్ నుంచి బయటికి తీసిన వీడియోనూ బ్లూ జూ అక్వేరియం తమ ఫేస్బుక్లో షేర్ చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి. SEE THE MOMENT: Here’s video of Cara the Python was pulled out from the wall somewhere within the Mall of Louisiana. Video is from Blue Zoo Baton Rouge. @WAFB https://t.co/ziVjx9EWIW pic.twitter.com/DFdQBJAeoD — lizkohTV (@lizkohTV) July 8, 2021 -
బాత్రూంలో కొండ చిలువ.. కాటు వేయగానే షాక్‌లోకి..
కాన్బెర్రా: సాధారణంగా మనలో చాలా మంది పాములంటే తెగ భయపడిపోతుంటారు. ఒకవేళ పొరపాటున కంటపడితే వెంటనే అక్కడి నుంచి మాయమైపోతారు. ఆ తర్వాత అక్కడి, దరిదాపుల్లోకి వెళ్లటానికి సాహసం చేయరన్న విషయం తెలిసిందే. అయితే, ఒక్కొసారి పాములు, కొండ చిలువలు ఆహరం కోసం లేదా ఆవాసం కోసం మనిషి ఇళ్లలోనికి ప్రవేశిస్తున్న సంఘటనలను మనం తరచుగా చూస్తునే ఉంటాం. అయితే, తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది. వివరాలు.. కాన్‌బెర్రాలోని గ్రాజ్లో 65 ఏళ్ల ఒక వ్యక్తి ఉదయం 5 గంటలకు నిద్రలేచాడు. ప్రతిరోజు మాదిరిగా తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంకు వెళ్లాడు. ఈ క్రమంలో గత సోమవారం అతడు ఒక షాకింగ్ సంఘటన ఎదుర్కొన్నాడు. బాత్రూంలో కూర్చున్నప్పుడు ఒక కొండ చిలువ మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో కాటు వేసింది. దీంతో షాక్ కు గురైన ఆవ్యక్తి తేరుకుని వెంటనే బేసిన్ కింద చూశాడు. అక్కడ 5 అడుగుల కొండ చిలువను చూసి భయంతో వణికిపోయాడు. వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన ఇంటిపక్కన ఉండే 24 ఏళ్ల యువకుడు కొండ చిలువల్ని, పాములను పెంచుతున్నాడని గుర్తించారు. అతని అపార్ట్ మెంట్లో దాదాపు 11 రకాల విషపూరిత పాములు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే, ఈ కొండ చిలువ కాటుతో ప్రాణానికి పెద్దగా ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. ఆ వృద్ధుడిని, కాటు వేసిన కొండ చిలువ కొన్ని రోజుల ముందు తప్పిపోయిందని ఆ యువకుడు విచారణలో తెలిపాడు. కొండ చిలువ బాత్రూంలో కాటువేసిన తర్వాత అది కాలువ లోనికి వెళ్లి తప్పించుకుంది.ఆ యువకుడు నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వెంటనే పాములను పట్టేవారికి సమాచారం అందించారు. కాగా, ఆగ్నేయాసియాలో ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువలు ఉంటాయి. ఇవి మానవులకు పెద్దగా హని కల్గించవు. -
ఎంత అందంగా ఉందో.. ఇదేం వింత: 48 మిలియన్ల వ్యూస్
సాధారణంగా పాము, కొండచిలువ, అనకొండ వంటి పేర్లు వినగానే మనకు తెలియకుండానే ఒంట్లోకి భయం ప్రవేశిస్తుంది. ఆ వెంటనే ముఖం అదోలా పెడతా. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వీడియోని ఒకసారి చూస్తే.. మళ్లీ మళ్లీ వీక్షిస్తారు. ఇంత అందంగా ఉంది.. ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసే ఈ కొండచిలువ ఇంద్రధనసు మాదిరిగా పలు వర్ణాల్లో మెరిసిపోతుంది. టక్కున చూస్తే.. ఏదైనా డ్రెస్ ఏమో అనుకుంటారు. అంత అందంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. కాలీఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ ఫౌండర్ జే బ్రూవర్ వివిధ వర్ణాల్లో ఉన్న కొండచిలువకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. ఇక ఈ కొండచిలువ లేత నెమలి పించం, బంగారు వర్ణం రంగుల్లో మెరిసిపోతు నెటిజనులను ఆకర్షిస్తుంది. దీన్ని చూసిన నెటిజనులు ఇంత అందమైన కలర్ కాంబీనేషనా.. వావ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోని 48 మిలియన్ల మందికిపైగా చూడగా.. 3.3 మిలియన్ల మంది లైక్ చేశారు. చదవండి: ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది -
ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది
జకార్తా : ఎముకలను పిండి చేస్తున్న ఒత్తిడి. ఊపిరి ఆడని పరిస్థితి. కళ్లు మామూలుకంటే పెద్దవయ్యాయి. కొద్దిగా బయటకు పొడుచుకొచ్చాయి. నోరు తెరిచింది.. కీస్.. కీస్ అని అరిచింది. సహాయం కోసం అన్నట్లు చేతులు బార్లా చాచింది... ఓ కొండ చిలువ చుట్టలో నలిగి ప్రాణాల కోసం గిలగిల్లాడిన ఓ ఎలుక పరిస్థితి ఇది. కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాకు చెందిన జుల్ జుల్ఫిక్రి తన పెంపుడు కొండచిలువకు బతికున్న ఎలుకను ఆహారంగా వేశాడు. ఫొటో క్రెడిట్ (mediadrum world.com/@dzulfikri72) వెంటనే కెమెరా తీసుకుని ఫొటోలు తీయటం మొదలుపెట్టాడు. కొండచిలువ.. ఎలుకను చుట్టి, మింగేస్తున్న దృశ్యాలను ఫొటోలు తీశాడు. దాదాపు 5 నిమిషాల ఈ బతుకుపోరాటాన్ని కెమెరాలో బంధించాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఫొటోలు తీసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నా.. ఆఖరి క్షణాల్లో ఎలుక ప్రాణాలకోసం విలవిల్లాడటం చూస్తూ బాధేసింది’’ అని పేర్కొన్నాడు. ఫొటో క్రెడిట్ (mediadrum world.com/@dzulfikri72) -
Photo Feature: పెద్ద పైథాన్, ఇక్కడి నుంచి వెళ్లిపోండి!
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. అడవులు తరిగిపోతుండటంతో మూగ జీవాలు జనావాసాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. మరోవైపు గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. అంగారక గ్రహంపై ఝురోంగ్ రోవర్ తీసిన ఫొటోలను తాజాగా చైనా విడుదల చేసింది. -
తాజ్‌మహల్ వద్ద పైథాన్ హల్చల్
న్యూఢిల్లీ: సాధారణంగా తాజ్‌మహల్ సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం అనుకోని అతిధిలా ఓ పైథాన్ వచ్చేసి హల్చల్ చేసింది. తన రాకతో అక్కడి స్థానికులను, తాజ్‌మహల్ సిబ్బందిని కాసింత భయభ్రాంతులకు గురి చేసింది. వెస్ట్ గేట్ వద్ద ఉన్న పర్యాటక పోలీసు అధికారుల టికెట్ కౌంటర్ వద్ద 5 అడుగుల పొడవైన ఇండియన్ రాక్ పైథాన్‌ను చూసి జనం షాకయ్యారు. వారు వెంటనే స్పందించి సమీపంలోని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ టీంకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. పైథాన్‌ను కొన్ని గంటల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాత పక్కనే ఉన్న అడవిలోకి విడిచి పెట్టారు. వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ను సమాచారం అందించిన టూరిజం పోలీస్ కానిస్టేబుల్ విద్యాభూషణ్ సింగ్ మాట్లాడుతూ.. పైథాన్‌ను టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నట్లు మొదట స్థానిక పర్యాటకులు గుర్తించారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాలల్లో ప్రజలను అప్రమత్తం చేసి , అటు పక్క ఎవరు రాకుండా చూశాము. ఈ లోగా ఎస్ఓఎస్ రెస్క్యూ టీం రావడంతో పాముని పట్టుకోగలిగామని అన్నారు. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు ,సిఇఒ కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ..పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి సరైన సమయంలో వైల్డ్ లైఫ్ రక్షణ టీం కు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే పాములు చాలా సున్నితమైన ప్రాణులు, జాగ్రత్తగా వ్యవహరించకుండా ఉంటే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ( చదవండి: రిపోర్టర్ మైక్ లాక్కొని కుక్క పరుగో పరుగు..చివరికి ) -
వామ్మో.. కాలువలో భారీ కొండచిలువ..
సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): జిల్లాలోని కలిమెల సమితి, ఎంవీ–75 గ్రామంలో 12 అడుగుల కొండచిలువ సంచరిస్తూ కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఆ గ్రామ శివారులోని కాలువలో ఆహార అన్వేషణలో భాగంగా అక్కడ తిరుగుతున్న కొండచిలువని గ్రామస్తులు కొంతమంది చూసి, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అధికారులు చాకచక్యంతో దానిని పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
పాము నవ్వింది.. ఈ వింత ఏంటో
ఇదేందయ్యా ఇది.. పాములు కూడా నవ్వుతాయా అనుకోకండి. ఫొటోలో చూశారు కదా.. తెల్లటి పాముపై బంగారు వర్ణంలో ఉన్న బొమ్మలు. అదేనండీ నవ్వుతో కూడిన ఎమోజీలు.. ఈ పాముపై ఇలాంటి ఎమోజీలు మూడు ఉన్నాయి. అంతే ఈ పాముకు భలే డిమాండ్ వచ్చింది. ఏకంగా ఇది రూ.4.3 లక్షలకు అమ్ముడుపోయింది. అమెరికాకు చెందిన జస్టిన్ కోబిల్కా పాములను పెంచడంలో సిద్ధహస్తుడు. తెల్లరంగు కొండచిలువలపై (బాల్ పైథాన్) బంగారురంగు వచ్చేలా ప్రయోగాలు చేయడం ఇతడికి చాలా ఇష్టమట. అందుకే 20 ఏళ్లుగా ఇలాంటి కొండ చిలువలను పెంచుతున్నాడు. అయితే ఈ కొండచిలువపై ఇలా నవ్వుతున్న మూడు ఎమోజీలు మాత్రం అనుకోకుండా ఏర్పడ్డాయని, కాకతాళీయంగా వచ్చాయని, తనకు కూడా చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. సాధారణంగా తాను పెంచిన ప్రతి 20 పాములపై ఒక ఎమోజీ ఉండటం సాధారణమని, కాకపోతే మూడు ఎమోజీలు ఉండటం మాత్రం ఇదే తొలిసారని పేర్కొన్నాడు. జన్యు మార్పులు జరిగి, ఇలా పాము ఒంటిపై బంతుల ఆకారం వచ్చేలా చేస్తున్నాడు కోబిల్కా. ఈ బాల్ పైథాన్లు చాలా స్నేహంగా ఉంటాయని, మచ్చిక చేసుకోవడానికి సరైన పాములని చెబుతున్నాడు. వీటిని సులువుగా పెంచుకోవచ్చని పేర్కొంటున్నాడు. చదవండి: ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! -
5 అడుగుల విషనాగు.. ఒంటి చేత్తో పట్టుకొంది!
భువనేశ్వర్: సాధారణంగా మనలో చాలా మంది చిన్న బల్లిని చూస్తేనే అరిచి గోల గోల చేస్తుంటారు. అలాంటిది పామును చూస్తే ఇంకేమైనా ఉందా! పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఓ మహిళ మాత్రం ఐదడగుల పామును సునాయాసంగా చేత్తో పట్టుకుని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉండే స్వరూప భట్నాగర్ బయటకు వెళ్దామని ఇంటి తలుపు తీసింది. సరిగ్గా అప్పుడే అనుకోని అతిథి ఇంటికి రావడాన్ని చూసి షాక్‌కు గురైంది. వెంటనే లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. ఇంతకీ ఆ అతిథి ఏవరోకాదు.. 5 అడుగుల నాగుపాము. దాని భయంతో ఇంట్లోనే ఉండిపోయిన ఆమె ఆ సర్పం అక్కడ నుంచి వెళ్లిపోయిందా? లేదా? అని కిటికిలో నుంచి తొంగి చూసింది. ఆ నాగుపాము బయట పార్కింగ్ చేసిన ఒక స్కూటీపై ఎక్కి పడగ విప్పింది. ఇది గమనించిన స్వరూపభట్నాగర్ వెంటనే, స్నేక్ క్యాచర్ సుబేందు మల్లిక్‌కు సమాచారం అందించింది. పాములను పట్టుకొవడంలో మంచి ఎక్స్పర్ట్ అయిన సుబేంద్ క్షణాల్లో అక్కడకు చేరుకుంది. బుసలు కొడుతున్న నాగుపామును ఒక కర్ర సహయంతో పట్టుకుని అటవీ ప్రదేశంలో వదిలేసింది. సాధారణంగా పాములు ఆహరం కోసం బయట సంచరిస్తాయని, ఆ క్రమంలోనే ఇక్కడకు వచ్చి ఉంటుందని చెప్పింది. గత కొన్నిరోజులుగా ఆ పాముకు ఆహారం కరువైనట్లు కనిపిస్తోందని, దానివల్ల కొంత నీరసంగా ఉందని తెలిపింది. చదవండి: వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక.. -
వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక..
చిన్న పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి నుంచి పారిపోతాం. మళ్లీ కొద్ది రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించం. అయితే రోడ్డుపై ఒక వ్యక్తి చేతిలో కొండచిలువ, భుజంపై రామ చిలుకతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని చోటుచేసుకొంది. వివరాలు.. ఒక రోజు హేలీరోబిన్ అనే మహిళ తన మిత్రులతో కోసం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి చూస్తొంది. అప్పుడు రోడ్డుకు ఆవల ఉన్న ఒక వ్యక్తిని చూసి, ఆశ్చర్యపోయింది. వెంటనే తన చేతిలోని మొబైల్ తీసుకొని రికార్డు చేసింది.. కాగా, ఒక వ్యక్తి తన చేతిలో ఒక పెద్ద కొండచిలువను, భుజంపై రామచిలుకతో ఎంచక్కా నడుచుకొంటు వెళ్తున్నాడు. అతడిలో ఏమాత్రం భయంలేదు. తీరిగ్గా డ్యాన్స్ చేసుకొంటూ, ఫోన్ బయటకు తీసి మాట్లాడుకొంటూ వెళ్తున్నాడు. కొండ చిలువను ఒక చేతిలో నుంచి మరొక చేతిలోకి మార్చుకొంటూ ఏదో బటన్ నొక్కాల్సి వచ్చిన క్రమంలో కొండ చిలువను కిందపడేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు ఏదో ర్యాంప్‌వాక్ చేస్తున్నట్లు ఏంటా నడక అని సరదా కామెంట్లు పెడుతున్నారు చదవండి: బాత్రూమ్లో ఐదడుగుల కొండచిలువ -
గాయపడ్డ కొండ చిలువకు చికిత్స
సాక్షి, తాడేపల్లిగూడెం : వలలో చిక్కుకున్న ఓ కొండ చిలువకు పశు వైద్యాధికారి చికిత్స చేసి కాపాడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. జీలుగుమిల్లిలో శ్రీను అనే రైతు పొలానికి ఆనుకున్న ఉన్న చెరువులో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వల వేశారు. అందులో 12 అడుగుల కొండ చిలువ చిక్కడంతో వారు భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. వలలో చిక్కుకున్న కొండచిలువను గుర్తించిన శ్రీను ఈ విషయాన్ని జంగారెడ్డిగూడెం స్నేక్ సేవియర్ సొసైటీ వ్యవస్థాపకుడు క్రాంతికి తెలిపారు. అక్కడకు చేరుకున్న క్రాంతి గాయలుపాలైన కొండ చిలువను పట్టుకుని ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం స్థానిక పశు వైద్యశాలకు తీసుకు వెళ్లారు. కొండచిలువకు చికిత్స చేసిన పశు వైద్యులు తీవ్రంగా గాయం కావడంతో పదిరోజుల పాటు వైద్యం చేయాల్సి ఉందని తెలిపారు. అప్పటి వరకూ దాన్ని తాను సమరక్షిస్తూ, వైద్యం చేయిస్తానని క్రాంతి తెలిపారు. ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణలో అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు. మరో కొండచిలువ కలకలం కాగా భీమడోలు శివారు లింగంపాడు గ్రామం వద్ద పంట కాలువలో కొండచిలువ కలకలం రేపింది. 10 అడుగుల కొండచిలువ చేపల వలలో చిక్కింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో, వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
కారు ఇంజిన్‌లో కొండచిలువ.. ఎలా వచ్చిందబ్బా!
ఫ్లోరిడా : అప్పుడప్పుడు మన జీవితంలో అనుకోని ఘటనలు ఎదురవడం సహజం. తాజాగా ఫ్లోరిడాకు చెందిన మోర్ బ్లూమెన్ఫెల్డ్ అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. సరదాగా బయటికి వెళ్దామని భావించి అతను తన ఫోర్డ్ ముస్తాంగ్ కారును స్టార్ట్ చేశాడు. కానీ కారు ఇంజిన్ లైట్ పనిచేయకపోవడంతో కారు స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఇంజిన్ చెక్ చేద్దామని క్యాబిన్ ఓపెన్ చేశాడు. ఇంజిన్ క్యాబిన్ ఓపెన్ చేసి చూసిన మోర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. కారణం అప్పటికే ఇంజిన్ భాగంలో దాదాపు పది అడుగుల కొండచిలువ చుట్టుకొని ఉంది. (చదవండి : పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే) దీంతో భయాందోళనకు గురైన మోర్ వెంటనే వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి ఫోన్ చేయగా వారు స్పందించారు. ఆ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది వచ్చి కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అమెరికాలోని ఫ్లోరిడా డానియా బీచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. కాగా కొండచిలువ బర్మా ప్రాంతానికి చెందినదని అధికారులు పేర్కొన్నారు. అధికారులు కొండచిలువను కారు ఇంజిన్ నుంచి బయటకు తీస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అంత పెద్ద కొండచిలువ కారు ఇంజిన్లోకి ఎలా దూరిందబ్బా అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : పవిత్రమైన మక్కాలో కారుతో హల్చల్) -
భయానకం: మహిళ కాలుకు చుట్టుకున్న పైథాన్
కాన్బెర్రా: భయంకరమైన దృశ్యం. భారీ పైథాన్ ఓ మహిళ కాలును చుట్టేసిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ కాలును పైథాన్ చూట్టుకోవడంతో పోలీసు అధికారిని రక్షించిన వీడియోను క్వీన్స్లాండ్ పోలీసులు సోమవారం ఫేస్బుక్లో షేర్ చేశారు. వివరాలు.. చీకట్లో నడుచుకుంటు వెళ్తున్న మహిళకు పైథాన్ తన పెంపుడు పిల్లిని పట్టుకుని కనిపించింది. దీంతో ఆ పిల్లిని రక్షించబోయి పైథాన్‌కు ఆమె చిక్కింది. సదరు మహిళ కుడి కాలును చుట్టిప పైథాన్ వదలించుకోవాల్సింది పోయి ఆమె దాని తలను నిమురుతోంది. అయితే ఎంతసేపటికి ఆ పైథాన్ అలాగే చూట్టేసుకోవడంతో దానిని వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఇక అది వదలకపోవడంతో అటుగా వెళుతున్న పోలీసు అధికారిని సహాయం కోరింది. (చదవండి: సర్ప్రైజ్: ప్రతి ఒక్కరిని ఏడిపిస్తున్న వీడియో) సదరు మహిళకు అధికారిని పైథాన్‌ను వదలించుకునేందుకు సాయం చేశారు. అనంతరం సదరు అధికారిని అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా ఎవరైనా పైథాన్‌ను చూడగానే ఆందోళన చెందుతారు. అదే కాలును చుట్టేసుకుంటే భయంతో బెంబేలేత్తిపోతారు. కానీ ఈ మహిళ అలా చేయకపోగా పైథాన్‌ను తన పెంపుడు జంతువుగా చూసింది’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ పైథాన్ దాదాపు 10 అడుగుల పొడవు ఉన్నట్లుగా అధికారిని పేర్కొంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ప్రమాదకర పరిస్థితిలో భయపడకుండా ధైర్యంగా వ్యవహరించిన సదరు మహిళ తీరుకు నెటిజన్లు షాక్ అవుతూ.. ఆమెపై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. (చదవండి: సింగపూర్ సూపర్ పెంటహౌజ్ అమ్మకం) -
భారీ వర్షం.. కొట్టుకొచ్చిన కొండచిలువ
సాక్షి, హైదరాబాద్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరద నీరు చేరుకోవడంతో బస్తీల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. తాజాగా పురానాపూల్ ప్రాంతంలోకి ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దానిని పట్టుకొని సంచిలో వేసి బంధించారు. జలదిగ్బంధంలో చంద్రాయణగుట్ట వర్షం తగ్గుముఖం పట్టిన చాంద్రాయణగుట్ట పరిసరప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదలో ప్రైవేట్ బస్సులు లారీలు కార్లు ఫంక్షన్ హాల్స్ చిక్కుకున్నాయి. బుధవారం వరద కారణంగా పక్కనే ఉన్న రైస్ మిల్లు నుంచి పెద్ద ఎత్తున వరదల్లో వరి ధాన్యం కొట్టుకొచ్చింది. కొట్టుకుపోయిన కార్లు, బైకులు సరూర్‌నగర్‌లో వరద ఇంకా కొనసాగుతుంది. ఎగువ చెరువుల నుంచి వస్తున్న నీటితో సరూర్ నగర్ చెరువు నిండు కుండలా మారింది. నీరు కిందకు వదలడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో కార్లు, బైకులు, సామాగ్రి కొట్టుకుపోయాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిరుత, పైథాన్ ఫైట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
చిరుతపులి.. తన పంజాతో ఎంతంటి జంతువునైనా ఇట్టే చీల్చిపారేయగల జంతువు. కొండచిలువ.. తన బలమైన శరీరంతో చుట్టేసి ఊపిరిఆడకుండా చేయగలదు. పెద్ద జంతువునైనా అమాంతం మింగేయగలదు కూడా. ఈ రెండు శక్తివంతమైన జీవులే. అలాంటిది ఈ రెండు జీవులు కొట్లాడితే ఎలా ఉంటుంది? నున్వా నేనా అన్నట్లు తలపడితే చూస్తూ భయపడకుండా ఉండగలమా? అలాంటి వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తాయి. (చదవండి : ఒక్క వీడియో జీవితాన్ని మార్చేసింది) చిరుతపులి, కొండచిలువ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 49 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పైథాన్‌పై చిరుతపులి తెలివిగా దాడి చేస్తుంది. నెమ్మదిగా ముందుకు వెళ్లి దాని మెడభాగాన్ని నోటితో పట్టేస్తుంది. అది దానిని చుట్టుకునేందుకు ప్రయత్నించగా..చిరుత తప్పించుకుంటూ కొండచిలువను లాక్కుంటూ తీసుకెళ్లుంది. మొత్తంగా చిరుత తెలివిగా కొండచిలువను చంపేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: వైరల్: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..) -
ఊహించని ట్విస్ట్‌తో మైండ్‌బ్లాక్ ఖాయం
ఒక్క క్షణం తర్వాత ఏం జరగబోతుందనేది ఎవరైనా ఊహించగలరా.. సరదాగా ఒక పామును ఆటపట్టిద్దామనుకున్న వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైతే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు గాని.. వీడియో చివర్లో మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. (చదవండి : వైరల్ ఫొటో: అమ్మకు సలాం!) ఇక వీడియో విషయానికి వస్తే.. ఒక వ్యక్తి కొలనులో ఒక పామును చూస్తాడు. ఆ పాము అతన్ని చూసి నీటిలోకి జారుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ఆ పామును నీటి నుంచి బయటికి తీస్తాడు. దానితో అది బుసలు కొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇలా సరదాగా ఆ పాముతో కలిసి వ్యక్తి ఆటలాడుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఒక ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక పెద్ద కొండచిలువ పైనుంచి ఆ వ్యక్తి మీదకు వేగంగా దూసుకువస్తుంది. అంతే ! మైండ్ బ్లాక్ అయిన ఆ వ్యక్తి చేతిలో ఉన్న పామును వదిలేసి నీటిలోకి పడిపోతాడు. ఆ వెంటే కొండచిలువతో పాటు మరొక పాము కూడా నీటిలోకి వెళ్లిపోతాయి. ఈ థ్రిల్లింగ్ సీన్లో ఇంతకు ఆ వ్యక్తి బయటపడ్డాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇది పాత వీడియోనే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. WTF is going on here pic.twitter.com/bWy1ro8833 — The Unexplained (@Unexplained) September 24, 2020 -
హైవేపై కొండచిలువ.. ఒంటిచేత్తో
ముంబై: దారి తప్పి రోడ్డు మీదకు వచ్చిన కొండచిలువ ముంబైలో కలకలం రేపింది. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే గుండా వెళ్తున్న కారు టైర్లకు చుట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు కారును పక్కకి పార్క్ చేయించారు. రెస్క్యూ వర్కర్లకు సమాచారమివ్వగా.. వారు సురక్షితంగా దానిని బయటకు తీసి అడవిలో విడిచిపెట్టారు. ఇక సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సినీ సెలబ్రిటీ వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేయగా మూడు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ క్రమంలో.. ‘‘ఓ మైగాడ్.. కారును రివర్స్ చేయాల్సింది’’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం.. ‘‘ఇంకా లాక్డౌన్ అమల్లోనే ఉందనుకుందేమో. పాపం అందుకే రోడ్డు మీదకు వచ్చింది’’అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.(చదవండి: ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!) View this post on Instagram Rescue workers free an Indian rock python caught under the wheels of a car at Eastern Express highway in Mumbai today. A post shared by Viral Bhayani (@viralbhayani) on Sep 21, 2020 at 12:23pm PDT -
చేపల వలలో భారీ కొండ చిలువ
సాక్షి, కర్నూలు: ఆత్మకూరు మండలంలోని బైర్లూటీ సమీపంలోని సిద్ధాపురం చెరువులో మత్స్యకారులు చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కుకుంది. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. అమలాపురానికి చెందిన మత్స్యకారులు సిద్ధాపురం చెరువులో చేపలు పడుతున్నారు. ఇందులో భాగంగా వల వేశారు. ఇందులో భారీ కొండ చిలువ చిక్కుకుంది. దీన్ని గమనించిన మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని వల నుంచి కొండచిలువను బయటకు తీసి నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. (పులస @ రూ.21 వేలు) -
ప్రకాశం జిల్లాలో కొండచిలువ కలకలం
-
ప్రకాశం జిల్లాలో కొండచిలువ కలకలం
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని రాచర్ల మండలం సోమిదేవిపల్లెలో కొండచిలువ దర్శనమివ్వడంతో కలకలం రేగింది. వరిగడ్డి వాములో నక్కిన 12 అడుగులకు పైగా ఉన్న కొండచిలువ గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసింది. వెంటనే గ్రామస్తులు గిద్దలూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ కొండచిలువను దిగువమెట్ట అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. -
62 ఏళ్ల వయసులో గుడ్లను పెట్టింది..
మిస్సౌరీ : 60 ఏళ్లు దాటిన తర్వాత పైతాన్లు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయని.. సంతాన్పోత్పత్తి జరిగే అవకాశం ఉండదని పలు పరిశోధనల్లో తేలింది. కానీ 62 ఏళ్ల బాల్ పైతాన్ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా ఏడు గుడ్లను పెట్టింది. ఇక్కడ ఆశ్యర్యమేంటంటే గత 20 ఏళ్లుగా అది సంతానోత్పత్తికి దూరంగా ఉంటుంది. దీంతో పాటు అది ఎలాంటి మగ పైతాన్‌తో కలయిక లేకుండానే గుడ్లను పెట్టడం విశేషం. ఈ వింత ఘటన మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ జూలో చోటుచేసుకుంది.(చదవండి : అలా సరదాగా రేసుకు వెళ్దామా!) జూ మేనేజర్ మార్క్ వానర్ స్పందించాడు. 'ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. సాధారణంగా బాల్ పైతాన్స్ 60 ఏళ్లు పైబడితే గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి. మా జూలో ఉన్న బాల్ పైతాన్ 20 ఏళ్లకు పైగా మగ పైతాన్‌తో కలయిక జరపలేదు. అయినా 62 ఏళ్ల వయసులో గుడ్లను పెట్టింది.. బహుశా బాల్ పైతాన్ మగ పైతాన్‌కు సంబంధించిన వీర్యం తన శరీరంలో ఒకచోట నిల్వ ఉంచుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అండాన్ని విడుదల చేసి గుడ్లను పెట్టి ఉంటుంది.' అని తెలిపాడు. ఈ విషయంపై సెయింట్ లూయిస్ జూ యాజమాన్యం స్పందించింది. జూలై 23 న బాల్ పైతాన్ 7 గుడ్లను పెట్టగా.. అందులో మూడింటిని ఇన్క్యూబేటర్లో ఉంచారు. రెండింటిని జెనిటిక్ శాంపిల్స్ కోసం పరీక్షించారు. మిగతా రెండు గుడ్లలో ఉన్నవి మాత్రం చనిపోయాయని తెలిపింది. అయితే జెనటిక్ శాంపిల్స్ కోసం గుడ్లను పరిక్షించిన తర్వాత ఆసక్తికర విషయం బయటిపడింది. బాల్ పైతాన్‌లో ఎలాంటి కలయిక లేకపోయినా(సెక్య్సుయల్ లేదా అసెక్య్సుయల్) వాటిలో పునరుత్పత్తి జరుగుతుందని.. దీనినే ఫ్యాకల్టేటివ్ పార్థినోజెనిసిస్ అంటారు. ఇప్పుడు సెయింట్ లూయిస్ జూలో ఒకటే మగ బాల్ పైతాన్ ఉందని.. దాని వయసు 31 ఏళ్లని యాజమాన్యం తెలిపింది. గుడ్లు పెట్టిన ఆడ బాల్ పైతాన్‌ను 1961లో ఒక వ్యక్తి జూకు విరాళంగా ఇచ్చాడని.. అప్పటినుంచి అది ఇక్కడే పెరుగుతుందని తెలిపారు. -
తిరుమలలో భారీ కొండచిలువ కలకలం
సాక్షి, తిరుమల : తిరుమలలో చెట్టుపైకి ఎక్కిన భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కరనాయుడు కథనం మేరకు... ఎస్ఎంసీ అతిథి గృహంలో 211వ నంబర్ గదికి ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మపై పది అడుగుల భారీ కొండచిలువ చేరింది. దీంతో దాన్ని గుర్తించిన స్థానికులు, యాత్రికులు భయాందోళనకు గురై అటవీశాఖకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన విద్యుత్ శాఖకు చెందిన క్రేన్ సాయంతో కొండచిలువను చాకచక్యంగా కిందకు దించారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న భక్తులు, స్థానికులు దాన్ని ఆసక్తిగా గమనించి తమ సెల్ఫోన్లలో బంధించారు. అనంతరం కొండచిలువను అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. -
మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీసుకున్న యువకులు
-
మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీశారు..
ముంబై: జాలి లేకుండా కొందరు యువకులు ఒక కొండ చిలువను హింసించి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఘటన బోరీవాలీలోని హనుమాన తెక్డీ ఏరియాలో జరిగింది. ముంబైలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా జోరుగా వానలు కురుస్తుండటంతో కొన్ని వన్యప్రాణులు వాటి స్థావరాలను వదిలి పొడి ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక కొండ చిలువలువ నీరు లేని ఒక ప్రాంతానికి వెళ్లాలనుకుంది. అలా వెళుతున్న క్రమంలో ఆ మూగజీవి కొందరు ఆకతాయిల కంటపడింది. వారు దాన్ని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు కాళ్లతో తన్ని, చేతులతో కొట్టి అది వాళ్లకు లొంగాక దానితో సెల్ఫీలు తీసుకున్నారు. సెల్ఫీలు తీసుకున్న అనంతరం 8.5 అడుగుల కొండచిలువను ఓ సంచిలో పెట్టి దగ్గర్లోని అడవిలో వదిలేశారు. కొండచిలువను కొడుతున్నవీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణి సంరక్షణ కర్త పవన్ శర్మ ఆ వీడియో ఆధారంగా అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వాళ్లపై కేసు నమోదు చేశారు. వారిని విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: నాగుల పంచమి: కొండచిలువ కలకలం -
నాగుల పంచమి: కొండచిలువ కలకలం
సాక్షి, నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం రేపింది. ఆలయంలోని అక్షరాభ్యాస మండపం ప్రధాన ద్వారం ముందు పొడవాటి కొండచిలువ శనివారం కనిపించింది. ఈ రోజు శ్రావణమాసం మొదటి శనివారం, నాగుల పంచమి కావడంతో లింగాకారంలో కొండచిలువ దర్శనం ఇచ్చిందని భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొండ చిలువకు భక్తులు పాలు పోసి పూజలు చేశారు. దీంతో ఆలయం సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. (పులికి చెమటలు పట్టించిన పైథాన్) అదే విధంగా ఆదిలాబాద్ మండల పరిధిలోని అర్లిబి గ్రామంలో నాగుల పంచమి సందర్భంగా రెండు జంట నాగులు సయ్యాటలాడాయి. ఈ ఘటన చెక్ డ్యాం వద్ద చోటుచేసుకుంది. శనివారం నాగుల పంచమి కావడం, రెండు నాగుపాములు ఆడుతూ కనిపించడంతో స్థానికులు ఆసక్తికరంగా వీక్షించారు. -
బాసర సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం
-
బాత్రూమ్లో ఐదడుగుల కొండచిలువ
న్యూఢిల్లీ: బాత్రూమ్లో కొండచిలువ కనిపించడంతో ఓ కుటుంబం షాక్ తిన్న ఘటన న్యూఢిల్లీలోని ఓక్లహాలో చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఓ కుటుంబం ఇంట్లోకి, సరాసరి బాత్రూమ్లోకి ఐదడుగుల కొండచిలువ వచ్చి చేరింది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అనే ఎన్జీవోను సంప్రదించి వారికి సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని బాత్రూమ్లో నక్కిన కొండచిలువను పట్టుకున్నారు. అయితే అది అనారోగ్యంతో ఉన్నందువల్ల అబ్జర్వేషన్లో పెట్టినట్లు ఎన్జీవో ప్రతినిధులు తెలిపారు. వర్షాల వల్ల పాములు తరచూ ఇళ్లలోకి వస్తున్నాయని వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ ప్రతినిధి వసీమ్ అక్రమ్ పేర్కొన్నారు. వర్షపు నీరు వాటి ఆవాసాల్లోకి ప్రవేశించినప్పుడు రక్షణ కోసం పొడిగా ఉండే ప్రాంతాన్ని వెతుకుతూ, అనుకోకుండా గృహ సముదాయాల్లోకి చేరుతాయని తెలిపారు. (నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం) ఫొటో(ఏఎన్ఐ సౌజన్యంతో) పొడవైన నాగుపామును రక్షించిన అధికారులు ఒడిశాలోని బురుఝరి గ్రామంలో భారీ నాగుపాము బావిలో చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు స్నేక్ హెల్ప్‌లైన్ టీమ్‌ను ఆ ప్రాంతానికి పంపించారు. వారు సుమారు గంటపాటు కష్టపడి ఎట్టకేలకు దాన్ని బయటకు తీశారు. నాగుపాము పొడవు 12-15 అడుగులుగా ఉంది. అనంతరం దీన్ని అడవిలో వదిలిపెట్టారు. (ఒకేలా ఉండటమే కాదు ఫలితాలు కూడా ఒకటే!) -
‘కొండచిలువకు దారిచ్చిన పెద్దపులి’
-
వైరల్: పులికి చెమటలు పట్టించిన పైథాన్
సాక్షి, బెంగళూరు: పెద్దపులిని చూస్తే అడవిలోని ఏ జంతువైన ఉలిక్కిపాడాల్సిందే. ఎందుకంటే ఎంతటి ప్రాణినైనా అలవోకగా వేటాడి చంపే స్వభావం దానిది. అలాంటి పులికి దారిలో ఓ కొండచిలువ కనిపించింది. ఏ జంతువునైనా చూడగానే వేటాడి చంపే పులి కొండచిలువను చూడగానే తోకముడిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్ కబినిలోని పర్యావరణ శాస్త్రవేత్త అబ్రహం రికార్డు చేసిన వీడియోను తాజాగా ఆటవీ అధికారి సుశాంత్ నందా మంగళవారం షేర్ చేశారు. ‘కొండచిలువకు దారిచ్చిన పెద్దపులి’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 12 వేలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ‘పులి తెలివైనది.. ఆకలి తీర్చడానికి ఎన్నో హానీ చేయని జంతువుల ఉండగా ఈ పైథాన్‌పై దాడి చేసి అనవసర ప్రమాదం తెచ్చుకోవడం ఎందుకు అనుకుందేమో’, ‘పులికి కొండచిలువ ఎంతటి హానికరమైనదో తెలుసు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: ఎక్కడా చూసి ఉండరు.. ఇండియాలోనే సాధ్యం!) గతంలో అబ్రహం రికార్డు చేసిన ఈ వీడియోలో.. ‘‘నేను, నా డ్రైవర్ ఫిరోజ్‌తో కలిసి అక్కడ తిరుగుతుండగా ఒక పెద్ద పులి కనిపించింది. మేము కాసేపు దానిని అనుసరిస్తూ వెనకే వెళ్ళాము. అయితే అది వెళుతున్న మార్గంలో ఒక కొండచిలువ ఎదురైంది. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లా తిష్ట వేసిన ఆ పైథాన్‌ను చూసి ఏం చేయాలో తెలియక పులి అయోమయంలో పడింది. పెద్ద పులి జాగ్రత్తగా దాని చుట్టూ తిరుగుతూ ఆసక్తిగా చూస్తోంది. కాసేపటికి పులి రోడ్డు పక్కన పొదల్లోకి వెళ్లి దాక్కుంది. పులి పొదల వెనుక దాక్కుని కొండచిలువ కదలికలను గమనించేందుకు ప్రయత్నించింది. కాని పైథాన్ పులి మీదకు దూసుకు రావడం ప్రారంభించింది" అని చెప్పారు. ఇక్కడ పులి మీద కొండచిలువ పైచేయి సాధించినట్టు అయింది. అడవినే భయపెట్టే పులికి కొండచిలువ కాసేపు చెమటలు పట్టించింది. (చదవండి: ఆయనకు భూమి మీద ఇంకా నూకలున్నాయి) -
వణికించిన బర్మా కొండచిలువ
గువాహటి: అతి ప్రమాదకరమైన బర్మా కొండచిలువ అసోంలో కనిపించింది. కొండచిలువలు విషపూరితం కాదు. కానీ భారీ ఆకారంతో ఎదుటివారెవరైనా హడలెత్తిస్తాయి. అందులోనూ బర్మా కొండచిలువలు పరిమాణంలో మరింత పెద్దగా ఉంటాయి. (సైనికుల అంత్యక్రియలు.. చైనా అభ్యంతరం!) అసోంలోని నాగోన్ జిల్లాలోని చపనాల ప్రాంతంలో జనావాసాల మధ్య 16 అడుగులు పొడవున్న ఈ బర్మీస్ కొండచిలువ కన్పించింది. దీంతో వణికిపోయిన స్థానిక ప్రజలు వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలిపారు. హుటాహుటిన చేరుకున్న అధికారులు కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. (వీడని ఉత్కంఠ.. పంతం వీడని సచిన్) ఈ కొండ చిలువలు 10 నుంచి 15 కేజీల బరువున్న జీవులపైకి అమాంతం దూకి చుట్టేస్తాయి. ఆ జీవులకు ఊపిరాడకుండా చేసి చనిపోయిన తర్వాత మింగుతాయి. -
వణికించిన బర్మా కొండచిలువ
-
పాముతో ఫైట్, వీడు మామాలోడు కాదు!
ఫ్లోరిడా: సాధారణంగా మనలో చాలా మంది చిన్న బల్లిని చూస్తేనే అరచి గోల గోల చేస్తుంటారు. అలాంటిది పామును చూస్తే కచ్చితంగా పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఒక వ్యక్తి 17 అడుగుల భారీ పైథాన్‌తో పోరాడి దానిని పట్టుకున్నాడు. ఫ్లోరిడాలోని మైక్ కిమ్మెల్ కాంట్రాక్ట్ వేటగాడిగా పని చేస్తున్నాడు. అతడు ఎవర్‌గ్లేడ్స్‌లో ఒక భారీ పామును కనుగొన్నాడు. అయితే దానిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డానని, ఆ సమయంలో తనకి చాలా గాయాలయ్యాయని మైక్ కిమ్మెల్ తెలిపాడు. పైథాన్‌ను ఎలా పట్టుకున్నాడు, తరువాత ఏం జరిగింది అనే దానిని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరితో పంచుకున్నాడు. (వైరల్ వీడియో: ఇద్దరిపై చిరుత పంజా!) ‘నేను భయంకరమైన 17 అడుగుల భారీ పైథాన్ ఎవర్‌గ్లేడ్స్‌లో ఉందని తెలుసుకొని దానిని పట్టుకోవడానికి చిత్తడి నేలలలోకి బయలుదేరాను. ఉదయం 11 గంటలకు అది ఎక్కడ ఉందో తెలుసుకోగలిగాను. అది వెంటనే నాతో పోరాడటం మొదలు పెట్టింది. నాపై దాడి చేసింది. నన్ను గడ్డిలో పడేసింది. దానిని ఓడించడం చాలా కష్టతరంగా మారింది. అది నన్ను కాటు కూడా వేసింది. నా ముంజేతిని, భుజాలను ఆ పైథాన్ గాయపరిచింది. సుదీర్ఘ పోరాటం తరువాత నేను దానిని విజయవంతంగా పట్టుకోగలిగాను’ అని మైక్ కిమ్మెల్ పేర్కొన్నాడు. సోషల్ మీడియా పోస్ట్‌లో తన చేతికి అయిన గాయాన్ని, రక్తంతో ఉన్న తన ఫోటోను పైథాన్‌తో సహా షేర్ చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘రాక్షసిలా ఉంది. దీనిని పట్టుకున్నందుకు ధన్యవాదాలు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ఇది కచ్చితంగా చాలా భయంకరమైనది అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలిపారు. మైక్ కాంట్రాక్ట్ స్నేక్ హంటర్ కావడంతో అతనికి పాము పొడవు, ఆకృతి ఆధారంగా బోనస్ లభిస్తుంది. పాములతో పాటు ఆకుపచ్చ ఇగువానా, ఈజిప్టు పెద్దబాతులు, ఫెరల్ హాగ్స్ వంటి ఇతర జాతులను ట్రాప్ చేయడంలో కూడా మైక్ సహాయం అందిస్తుంటాడు. (సూపర్ పవర్స్ చిన్నారి, వీడియో వైరల్!) యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, స్థానికేతర బర్మీస్ పైథాన్లు దక్షిణ ఫ్లోరిడాలో వాటి సంతతిని పెంచుకొని అక్కడ ఉంటే స్థానిక జీవులను చంపేస్తున్నాయి. వీటి కారణంగా ఆ ప్రాంతంలో చాలా ప్రాణులు మరణించాయి. దీంతో సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ పైథాన్ ఎలిమినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 2,970 పైథాన్లను పట్టుకొని బంధించారు. View this post on Instagram Yesterday’s solo #Everglades islands python hunt was another one for the books! At 8am I headed out into the swamp on my 14’ jon boat in search of an invasive #ManEater and at 11am I found her.... she wasn’t coming without a fight lol. I noticed her almost immediately as soon as we crossed paths, I could barely contain my excitement. She definitely was not afraid of me and started to slowly cruise through the vegetation as I carefully walked next to her trying to gauge exactly how large she was... because of all the grass and weeds it was hard to tell but I could tell she was an absolute monster. Her being tangled in vegetation makes the capture that much more difficult, a snake this size will use the vegetation as leverage and can literally pull you into the swamp, no stopping 150lbs of SOLID muscle. I knew going for her head first would be the easiest and safest capture method but I couldn’t turn down the chance to grab her by the tail and dance with the devil herself! As soon as I grabbed ahold of her I sealed my fate lol... no turning back now, she was coming for me! She immediately started to battle it out, taking strikes and pulling me into some tall grass with her, making it difficult to dodge her strikes... she was able to successfully get a bite on me. Only got me once but that’s all it took... I was punctured quite deep on my bicep and forearm, piercing an artery and hitting some nerves, I was lucky she didn’t latch on and that I was able to pull out of it. After loosing about a gallon of blood, lol, I was able to tire her out and get her under control. I then used a snake bag I had on my waist to tourniquet my arm because I was getting worried about how much blood I was loosing, better safe then sorry. I then had to drag all 150lbs of her alive, working to control my breathing so I didn’t pass out from blood loss and the extreme heat that day, I would have been screwed. After getting her to my boat, where my suppressed .22 pistol was, I was able to euthanize her before leaving (I didn’t have the proper bags for live transport because she was too large lol). Unofficial measurement: 17’ WITH kinks #RECORDBREAKER? Videos and more info to come!! A post shared by Trapper Mike (@pythoncowboy) on Jun 9, 2020 at 5:33am PDT -
వైరల్: క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి.. కానీ..
బ్యాంకాక్: అడవిలో ఉండే చిన్న జంతువులు, పక్షులను భారీ కొండ చిలువలు నిమిషాల వ్యవధిలో మింగేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కొండ చిలువ బారినపడి ప్రాణాలతో బయటపడటం అంత సులభం కాదు. అంత దృఢంగా అవి మనుషుల్ని, జంతువులన్ని పట్టేసుకుంటాయి. అయితే, కొండ చిలువకు ఆహారమయ్యే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ఓ జింక క్షేమంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోను డుసిత్ జూ అసిస్టెంట్ డైరెక్టర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. థాయ్‌లాండ్‌లోని ఖావో ఖేవ్ ఓపెన్ జూలో తీసినట్లు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (వికలాంగుడికి శునకం అండ) ఓ భారీ పైథాన్ ఓపన్ జూలో ఉన్న ఓ రోడ్డుపై నుంచి వెళ్తున్న చిన్న జింక పిల్లను చుట్టుకొని మింగేయడానికి ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు చెట్టు కొమ్మతో కొండచిలువను కొట్టడంతో కోపంతో ఒక్కసారిగా అతనిపై దాడి చేయబోయింది. ఇక యువకుడు మరోసారి కొట్టడంతో భయంతో కొండ చిలువ జింకను వదిలి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో జింక బతికిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ అత్యంత దారుణమైన ప్రమాదం నుంచి జింక క్షేమంగా బయటపడింది’అని కామెంట్లు చేస్తున్నారు. ‘వీడియోను చూస్తున్నంత సేపు ఆ పైథాన్ జింకను మింగిస్తుందేమో అన్న భయం కలిగింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియోను 9. 4 లక్షల మంది వీక్షించగా, 17 వేల మంది లైక్ చేశారు. -
క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి..
-
లాక్‌డౌన్‌తో పాములకు నివాసంగా దుకాణాలు
సాక్షి, చిత్తూరు: లాక్డౌన్ కారణంగా జనాలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వన్యప్రాణులు యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే చాలా కాలం తరువాత కేంద్రప్రభుత్వం కొన్ని సవరణలు ఇవ్వడంతో మళ్లీ మూతబడ్డ షాపులు తెరుచుకుంటున్నాయి. తిరుమల పాపవినాశనంలోని ఒక దుకాణాన్ని 60 రోజులు తరువాత తెరిచారు. షాపు తెరిచిన వెంటనే ఒక కొండచిలువ కనిపించడంతో షాప్ యజమాని షాక్‌కు గురయ్యారు. దుకాణ యజమాని షాపుకు ఉన్న పట్టను తొలగించగా భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. లాక్డౌన్ కారణంగా 60 రోజులుగా మూతబడిన అంగళ్లను పరిశీలించడానికి యజమానులు గురువారం షాపుల వద్దకు వెళ్లారు. రెండు నెలలకు పైగా జనసంచారం లేకపోవడంతో దుకాణాల్లోనే పాములు సేద తీరుతున్నాయి. దీంతో యజమానులు భయభ్రాంతులకు గురవుతున్నారు. (వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ) -
‘అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవు’
మెల్బోర్న్ : ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లికూనను కాపాడటానికి రెండున్నర మీటర్ల పొడవైన కొండచిలువతో నగ్నంగా పోరాడాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని కునునుర్రాకు చెందిన నిక్ కియాన్స్ కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి బెడ్ మీద నిద్రపోతున్నాడు. గార్డెన్లోనుంచి ఏవో శబ్ధాలు రావటంతో నిద్రలోంచి మెలుకున్నాడు. ఏంటా అని చూస్తే.. అతని పెంపుడు పిల్లి కూన లిల్.. కొండ చిలువ బారిన పడి అరుస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే అతడు బెడ్‌పై నుంచి నగ్నంగా గార్డెన్‌లోకి పరిగెత్తాడు. ( కిచెన్‌లో బయటపడ్డ విషపూరిత పాము ) పిల్లిని పట్టుకుని దాన్ని కొండచిలువ నుంచి తప్పించటానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పాము పిల్లిని వదిలేసింది. కానీ, ఆ వెంటనే అతడి చేతిని బాగా కొరికింది. రక్తం ధారలు కడుతున్నా పట్టించుకోకుండా పిల్లి ని కాపాడానన్న ఆనందంలో మునిగిపోయాడు నిక్. ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘‘ కొన్ని సంవత్సరాలకు ముందు పాముల్ని పట్టుకోవటంలో శిక్షణ తీసుకోవటం కలిసొచ్చింది. పాము లిల్ను పట్టుకోవటం చూడగానే.. బెడ్‌పై నుంచి కిందకు దూకి గార్డెన్‌లోకి పరిగెత్తాను. అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవ’’ని చెప్పాడు. ( కిచెన్‌లో బాత్రూమ్: ‘ఓనర్‌ను జైలులో వేయాలి’ ) -
నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం
ఢిల్లీ : పైథాన్ ఒక జింకను నిమిషాల వ్యవధిలో మింగేయడం మీరెప్పుడైనా చూశారా.. ఒకవేళ చూడకపోతే మాత్రం వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ' ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఎంత ఆకలేసిందో తెలియదు గానీ బర్మెస్ జాతికి చెందిన పైథాన్ చూస్తుండగానే నిమిషాల వ్యవధిలోనే జింకను మింగేసిందంటూ' క్యాప్షన్ జత చేశాడు. ఇంతకుమందు మనం చూసిన చాలా వీడియోల్లో పైథాన్ కుందేళ్లు, ఇతర చిన్న జంతువులను తినడం చూశాము. కానీ మొత్తం రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో పైథాన్ జింకను చుట్టూసి మెళ్లిగా నోరును పెద్దది చేస్తూ చూస్తుండగానే స్వాహా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత పాములకు అంత జీర్ణశక్తి ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం తప్పకుండా కలుగుతుంది. (వైరల్: చెవిలో గూడు కట్టిన ‘స్పైడర్’) -
కొండచిలువకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కట్టుకట్టి ..
-
పాపం : కొండచిలువకు బొక్కలిరిగాయి!
మధురై : ఎముకలు విరగొట్టుకుని ఓ కొండచిలువ ఆసుపత్రి పాలైంది. దాని అదృష్టం బాగుండి సరైన సమయంలో వైద్యం అందటంతో ప్రాణాలు నిలుపుకోగలిగింది. ఈ సంఘటన తిరునల్వేలిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధురై వీరమన్నలూర్కు చెందిన ఓ రైతు తన పోలంలో ఐదు అడుగులు ఉన్న ఓ కొండచిలువను చూశాడు. ఆ వెంటనే పాములను రక్షించే సిబ్బందికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న వారు అది కదలటానికి ఇబ్బంది పడుతుండటం గమనించారు. ఆ వెంటనే దాన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కొండచిలువను పరీక్షించిన ఆర్థోపెడిస్ట్ దాని వీపు దగ్గర రెండు చోట్ల ఎముకలు విరిగినట్లు గుర్తించాడు. మనుషులకు కట్టుకట్టే విధంగా దానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కట్టుకట్టి చికిత్స చేశాడు. కొండచిలువకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఈ సంఘటనపై వణ్యప్రాణి సంరక్షణా సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. సకాలంలో దానికి చిక్సిత చేసి ఉండకపోయినట్లయితే చచ్చిపోయేదని అన్నారు. పాము కోలుకునేంతవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపారు. దానికి నయం అయిన తర్వాతే అడవిలో వదిలిపెడతామని చెప్పారు. కాగా, కొండచిలువకు కట్టుకడుతున్న ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కొండచిలువకు ఎంత కష్టం వచ్చింది
-
అయ్యో! కొండచిలువకు ఎంత కష్టం..
సిడ్నీ : సాధారణంగా కొండచిలువలు ఎలుకలు, ఇతర జంతువులను మింగేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం ఒక కొండచిలువ బీచ్ టవల్‌ను మింగి నానా అవస్థలు పడింది. అయితే దానికి ఎలాంటి హానీ కలగకుండా వైద్యులు కష్టపడి కొండచిలువ నోటి నుంచి టవల్‌ను బయటికి తీశారు. వివరాలు. ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి మోంటీ అనే కొండచిలువను పెంచుకుంటున్నాడు. ఒకరోజు దానిని సరదాగా బీచ్‌కు తీసుకెళ్లాడు. ఈలోగా కొండచిలువకు ఆకలయిందో ఏమో కానీ పక్కనే ఉన్న టవల్‌ను అమాంతం మింగేసింది. అయితే స్నాక్స్ పెడదామని భావించిన యజమానికి కొండ చిలువ నానా అవస్థలు పడుతూ కనిపించింది. దానికి ఏమైందోనని కంగారుపడిన యజమాని సిడ్నీలోని సాష్(స్మాల్ ఎనిమల్ స్పెషలిస్ట్) అనే వెటర్నరీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. పరీక్షలు చేసిన వెటర్నరీ వైద్యులు దాని కడుపులో ఒక బారీ పదార్థం ఉందని గుర్తించారు. ఎలాగోలా కష్టపడి చివరకు విజయవంతంగా కొండచిలువ కడుపులో నుంచి టవల్‌ను బయటికి తీశారు. 'మోంటీ సురక్షితంగా ఉండడం నాకు ఆనందం కలిగించింది. అది అంత పెద్ద టవల్‌ను మింగేయడంతో కంగారుపడ్డాను. కానీ వైద్యులు చాకచక్యంగా దాని కడుపులో నుంచి టవల్‌ను బయటికి తీశారు. డాక్టర్లకు నా కృతజ్ఞతలు' అంటూ యజమాని పేర్కొన్నాడు. కాగా ఈ వీడియోనూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేయడంతో పాటు ప్లాస్టిక్ వంటి పదార్థాలు మూగ జీవాలకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందో చూడండి అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. This is what plastic & other waste is doing to other species. Vets here pulling AN ENTIRE BEACH TOWEL out of a python in Australia. Imagine what we are doing. Video Not for faint hearted person. pic.twitter.com/vDgPm6CgAe — Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 28, 2020 -
భయానకం: తలక్రిందులుగా వేలాడుతూ..
దిష్టి తగలకుండా సాధారణంగా మనం ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడదీస్తాం. అయితే ఓ కొండచిలువ ఇంటిపై కప్పు నుంచి తలక్రిందులుగా వేలాడుతూ భారీ బల్లిని మింగుతున్న దృశ్యాన్ని చుశారా. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే ఈ సంఘటన అస్ట్రేలియాలోని రిటైర్మెంట్ విలేజ్‌లో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాలు.. క్వీన్ ల్యాండ్‌లోని జాతీయ పార్క్‌కు సమీపం ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కమ్యూనిటి హోమ్ టౌన్ రిటైర్మెంట్ విలేజ్‌లోని ఓ ఇంటి గుమ్మం ముందు కొండ చిలువ నోటితో బల్లిని మింగుతూ తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. దీంతో అది చూసిన ఆ ఇంటి యాజమాని ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ భయానక దృశ్యాన్ని సెల్‌ఫోన్ చిత్రీకరించి తన ఫేస్బుక్లో షేర్ చేశాడు. ‘ఓ విషరహిత సర్పం తనకిందులుగా వేలాడుతూ బల్లిని ఆహారంగా తీసుకుంటున్న అరుదైన దృశ్యం’ అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు ‘ఎంత.. అద్భుతమైన చిత్రం’, ‘ఈ విలేజ్ జాతియ పార్క్‌ను తలపించేలా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ విలేజిలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం కొత్తెమీకాదు. ఇంట్లోని సోఫాలపై, బాల్కానిలో పెంపుడు జంతువుల్లా ఎప్పుడూ మనుషుల మధ్య తిరుగుతున్న దృశ్యాలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. కాగా సౌత్ ఈస్ట్, నార్త్ ఆస్ట్రేలియాలో ఇంట్లో బిల్డింగ్‌లపై, చెట్లపై ఇవి ఇలా వేలాడుతూ ఉండటం సర్వసాధారణం. -
కొండచిలువను చుట్టి సంచీలో వేసిన మహిళ
-
20 కిలోల కొండచిలువను చుట్టి..
తిరువనంతపురం: జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను ఓ మహిళ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని చుట్టి సంచీలో వేసి.. అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. విద్యా రాజు(60) అనే మహిళ వన్యప్రాణుల సంరక్షణా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్నాకుళంలోని తరంగిణి అపార్టుమెంటు వద్దకు కొండచిలువ చేరుకుందన్న వార్త తెలుసుకుని అక్కడకు వెళ్లారు. నలుగురు వ్యక్తుల సహాయంతో కొండచిలువను పట్టుకున్నారు. దానికి హాని కలగకుండా ఓ బ్యాగులో వేసి అడవిలో వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో విద్యా రాజు ధైర్యసాహసాలు, దయాగుణంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా విద్యా రాజు భర్త నావికా దళ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గోవాలో విధులు నిర్వర్తిస్తున్న నాటి నుంచి విద్య.. వన్యప్రాణి సంరక్షకురాలిగా అవతారమెత్తారు. జవాసంలోకి వచ్చిన పాములను సంరక్షిస్తూ జంతువుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. -
వైరల్ : వామ్మో! కొండ చిలువ.. గాల్లోకి లేచి మరీ..
కొండచిలువలు నేలపై ఉండి మాత్రమే వేటాడుతాయని తెలుసు. కానీ నీటిలో ఉండి కూడా వేటాడుతాయని తాజా వీడియో ద్వారా తెలుస్తుంది. ఓ భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ జింకపిల్లను అమాంతం పట్టేసి శరీరాన్ని నుజ్జునుజ్జు చేసిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మహారాష్ట్రకు చెందిన ఏఎఫ్ఎస్ అధికారి ఒకరు ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఏముందంటే.. బురదతో నిండిన ఓ మడుగు వద్దకు నీళ్లు తాగేందుకు వచ్చిన జింకలను చూసిన కొండ చిలువ నెమ్మదిగా నీటి అడుగున ఈదుతూ ఆ జింకలను సమీపించింది. జింకలు దాన్ని గమనించకుండా నీళ్లు తాగడం కొనసాగించాయి. దీంతో కొండ చిలువ నీటి నుంచి ఒక్కసారిగా నిట్టనిలువుగా నిలుచుని జింక మెడను పట్టుకుంది. ఆ వెంటనే దాన్ని చుట్టేసి.. శరీరాన్ని నుజ్జు చేసింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఈ వీడియో ఉంది. మహారాష్ట్రలోని చందా డివిజన్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డైన దృశ్యాలుగా తెలుస్తోంది. -
వామ్మో.. పదేళ్లుగా అక్కడే ఉందా?!
సాధారణంగా ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్‌లో, సెలూన్స్ వంటి వాటిలో ఎలుకలు ఉండటం, గోడలపై బల్లులు తిరగటం సహజమైన విషయమే. అయితే చైనాలోని ఓ స్పా యాజమానికి, అక్కడి ఉద్యోగులకు భయానక ఘటన ఎదురైంది. 20 కిలోల కొండచిలువ పార్లర్ సీలింగ్ నుంచి కింద పడటంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్లో పెద్ద శబ్ధం వినబడటంతో అక్కడికి వెళ్లి చుశాడు. సుమారు 10 అడుగుల భారీ కొండ చిలువ కింద పడటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్పా యాజమానికి చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పామును పట్టుకున్నారు. నవంబర్ 12న జరిగిన ఈ ఘటన గురించి స్పా యజమాని మాట్లాడుతూ.. పదేళ్లుగా ఆ కొండచిలువ ఇక్కడే ఉంటుందని, పార్లర్ నిర్మాణ సమయంలో, మరమ్మత్తుల సమయంలో ఇక్కడ కొండచిలువను చూసినట్లు కార్మికులు చాలాసార్లు తనతో చెప్పినట్లు తెలిపాడు. అయితే దానిని పట్టుకోవడానికి పలుమార్లు యత్నించామని.. అయినా అది దొరకలేదని చెప్పాడు. ఇక ఆ భారీ పైథాన్‌ను స్థానిక వన్యప్రాణుల సంరక్షణ సంస్థకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
కోతకని వెళితే కొండచిలువ కనిపించడంతో..
సాక్షి, ప్రకాశం : మండలంలోని తాటివారిపాలెంలో సోమవారం ఉదయం వ్యవసాయం భూముల్లో కొండచిలువ కనిపించగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తాటివారిపాలెం గ్రామానికి చెందిన బాదరాజుపల్లి ఉదయమ్మ గ్రామ సమీపంలోని కొండ దిగువ భాగాన తమ వ్యవసాయ భూమిలో మినుము పంట కోసేందుకు మనుషులతో వెళ్లింది. పంట కోత సమయంలో మినప చెట్ల మధ్య చుట్టు చుట్టుకొని ఉన్న కొండ చిలువను చూసి భయంతో కోతను ఆపేసి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. అద్దంకి నుంచి తాటివారిపాలెం చేరుకున్న ఫారెస్ట్ బీట్ అధికారులు ఆంజనేయులు, శ్రీనివాసరావు 15 అడుగుల పొడవు ఉన్న కొండ చిలువను ఖాళీ గోనె సంచిలో బంధించి కొండపై భాగాన ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ మార్టూరులోని అమరావతి నూలు మిల్లులో కనిపించిన కొండచిలువ కోసం రెండు రోజులుగా వెతికినా దొరకలేదన్నారు. -
ఇంట్లో 140 పాములు.. మెడకు చుట్టుకుని..
వాషింగ్టన్ : ఇంట్లో పాములను పెంచుతున్న ఓ మహిళ జీవితం విషాదాంతమైంది. తాను ప్రేమగా పెంచుకున్న కొండచిలువ మెడకు చుట్టుకోవడంతో ఆమె దుర్మరణం పాలైంది. ఈ విషాదకర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. లారా హర్ట్(36) అనే మహిళ ఇండియానాలోని ఆక్స్ఫర్్డలో నివసిస్తోంది. పాములంటే మక్కువ కలిగిన లారా తన ఇంట్లో ఏకంగా 140 పాములను పెంచుకుంటోంది. వీటిలో ఎనిమిది అడుగుల కొండచిలువ కూడా ఉంది. కాగా బుధవారం లారా ఆకస్మికంగా మృతి చెందినట్లు పొరుగింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారా ఇంటికి వచ్చి ఆమె శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం లారా ఇంటిని వెదకగా వందల సంఖ్యలో పాములు వాళ్ల కంటపడ్డాయి. ఈ విషయం గురించి లారా పొరుగింటి వారిని ఆరాతీయగా... అవన్నీ ఆమె పెంపుడు జంతువులు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదికలో బలంగా గొంతు నులిమిన కారణంగానే ఆమె మరణించినట్లు వెల్లడి కావడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు. ఈ క్రమంలో కొండచిలువే ఆమె మరణానికి కారణమని తేలింది. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టం నివేదిక తమను ఆశ్చర్యానికి గురి చేసిందని.... పాములు పెంచుకున్న లారా జీవితం విషాదంగా ముగిసిందని పేర్కొన్నారు. ఇక విష రహిత పాములైన కొండచిలువలు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో ఎక్కువగా నివసిస్తాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 రకాల జాతుల కొండచిలువలు ఉన్నాయి. -
టిక్ టాక్ వీడియో.. నలుగురిపై కేసు
గాంధీనగర్ : టిక్‌టాక్.. ఇది ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటుంది. అయితే సరదా కోసం వాడాల్సిన ఈ వీడియో షేరింగ్ యాప్‌ను కొంతమంది అనవసర విషయాలకు ఉపయోస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు. లైక్, కామెంట్ల కోసం పిచ్చి పిచ్చి వీడియో చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా టిక్‌టాక్ మోజులో పడిన నలుగురు గుజరాత్ యువకులు బతికున్న కొండచిలువను మంటల్లో వేసి కాల్చి చంపారు. ఈ తతంగానంతా వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. వీడియోను చూసి ఫారెస్ట్ అధికారులు ఆ యువకులపై కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా యువకుల అడ్రస్ కనుగొన్న అధికారులు.. వారి ఇళ్లపై తనిఖీలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. వీడియో ఆధారంగా ఇద్దరి నిందితులను గుర్తించామని, మరో ఇద్దరి వివరాలు కూడా సేకరించి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. జంతు హింస నిరోదక చట్టం ప్రకారం.. నిందితులకు మూడు నుంచి ఏడేళ్ల శిక్షతో పాటు రూ.10వేలు నుంచి 25 వేల వరకు జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. -
భయానకం: మెడను చుట్టేసిన కొండచిలువ!
తిరువనంతపురం : పొదల్లో చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తున్న కూలీలకు కొండచిలువ భయానక అనుభవాన్ని మిగిల్చింది. అమాంతం ఓ కూలీ మెడను చుట్టేసి అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఘటన తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాలు.. నెయ్యార్ డ్యామ్ పరిసరాల్లో చెత్తను శుభ్రం చేయడానికి కొంతమంది కూలీలు మంగళవారం అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో భువనచంద్రన్ నాయర్ అనే వృద్ధుడికి అక్కడ కొండచిలువ కనిపించింది. దీంతో నెమ్మదిగా దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. అది ఒక్కసారిగా అతడి మెడను చుట్టేసింది. అంతకంతకు పట్టు బిగిస్తూ అతడి ప్రాణం తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్కడికి సమీపంలో పనిచేస్తున్న మరికొంత మంది కూలీలు నాయర్ పరిస్థితి చూసి బెంబేలెత్తిపోయారు. అనంతరం ధైర్యం కూడదీసుకుని కొండచిలువ మూతి బిగించి ఎలాగోలా దానిని నాయర్ మెడపై నుంచి లాగి పడేశారు. అనంతరం దానిని అటవీ అధికారులకు అప్పగించగా.. వారు అడవిలో వదిలేశారు. కాగా ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. #WATCH Kerala: A man was rescued from a python by locals after the snake constricted itself around his neck in Thiruvananthapuram, today. The snake was later handed over to forest officials and released in the forest. pic.twitter.com/uqWm4B6VOT — ANI (@ANI) October 16, 2019 -
ఈ దృశ్యాన్ని చూసి జడుసుకోవాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ఎవరు ఈ దృశ్యాన్ని చూసినా జడుసుకోవాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త ఆడమ్ థార్న్ ముఖానికి అద్దాల ఫేస్‌మాస్క్ ధరించి ఆరడుగుల కొండ చిలువతో చిన్న ఫైట్‌కు దిగారు. కుడి చేతిని మోచేతి వరకు గట్టిగా మడిచి దమ్ముంటే తనపై దాడి చేయమని సవాల్ చేసినట్లున్నారు. ఆ కొండ చిలువ హఠాత్తుగా పైకి లేచి బార్లా తెరిచిన నోటితో థార్న్ మోచేతిని గట్టిగా పట్టి పీకింది. ఆ మంటను పంటి భిగువున థార్న్ భరించాల్సి వచ్చింది. పాములను పట్టడంలో అపార అనుభవం కలిగిన మిత్రుడు రాబ్ అల్లేవా సమక్షంలో ఈ ఫీటు నడిచింది. గట్టిగా థార్న్ చేతిని పట్టుకున్న కొండ చిలువను రాబ్ అల్లేవా లాగేశాడు. ఈ క్రమంలో కొండ చిలువ ఆయన్ని కూడా కాటేసింది. అనంతరం కొండ చిలువ పట్టి పీకిన చోట థార్న్ కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. వీరిద్దరు ‘హిస్టరీ ఛానెల్’లో ప్రసారం చేయడం కోసం ‘కింగ్స్ ఆఫ్ పెయిన్’ పేరిట ఓ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా థార్న్ ఈ ఫీట్‌ను నిర్వహించారు. ఈ సిరీస్ డాక్యుమెంటరీలో భాగంగా వీరిద్దరు కొన్ని వందల సార్లు వివిధ రకాల పాములు, జంతువులతో ఇలా కరిపించుకున్నారు. థార్న్ వన్యప్రాణి బయోలజిస్ట్. తన మిత్రుడు రాబ్‌తో కలిసి ప్రపంచంలోని పలు దట్టమైన అడవుల్లోకి వెళ్లి వివిధ రకాల పాములు, జంతువులతోపాటు పలు రకాల కీటకాలతో కరిపించుకొని ఏది కరిస్తే ఎంత బాధ, ఎంత సేపుంటుందో ప్రజలకు తెలియజేసేందుకు ఓ 30 పాయింట్ల స్కేలును తయారు చేసి దానిపై నమోదు చేస్తూ వస్తున్నారు. 1980వ దశకంలో క్రిమికీటకాలు కరిస్తే ఎంత బాధ ఉంటుందో తెలియజేయడానికి ఎ ‘సూచిక’ను రూపొందించిన డాక్టర్ జస్టిన్ ష్మిడ్‌ను ఆదర్శంగా తీసుకొని వారు ఈ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. వారు ఇప్పటి వరకు భారీ బల్లులు, లైన్ ఫిష్‌గా వ్యవహరించే ప్రమాదకరమైన చేపలు, కొన్ని విష సర్పాలతో ఇలాంటి ఫీట్లు చేశారు. కొండ చిలువల కోరలకు విషయం ఉండక పోయిన ఓ మనిషిని చంపి తినేంతటి శక్తి ఉంటుందన్న విషయం తెల్సిందే. -
వైరల్ : కుక్క కోసం కొండచిలువతో పోరాటం
‘ఇక నా పని అయిపోయింది. ‘కుక్క చావు’ చావాల్సిందే. ఈ రోజుతో నా జీవితం ముగుస్తుంది. ఆ కొండ చిలువకు ఆహారంగా మారాల్సిందే’ అని అనుకుంది కొండ చిలువ నోటికి చిక్కిన ఓ కుక్క. ఇంతలో ముగ్గురు కుర్రాళ్లు కనిపించారు. వచ్చారు.. వచ్చారు.. నా వాళ్లు వచ్చారు. ఇక నువ్వు నన్నేం చేయలేవు అంటూ గంభీర ముఖంతో పాము వైపు చూసింది. ‘నీ వాళ్లు వస్తే నాకేంటే.. నా పట్టు విడిపించడం అంత వీజీ కాదు. నాతో పెట్టుకునే ధైర్యం వాళ్లకు లేదు. నా దగ్గర వచ్చేంత సాహసం చెయ్యలేరు’ అంటూ తన పట్టును మరింత బిగించింది ఆ కొండ చిలువ. కానీ కొండ చిలువ ఆశ అడియాశలు అయ్యాయి. కుక్క బతికింది. కుర్రాళ్లు హీరోలయ్యారు. వారు చేసిన సాహసం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారులను నెటింజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు. ఏ జంకు బెదురు లేకుండా కొండచిలువపై దాడి చేసి కుక్కను రక్షించారు. కుక్కను విడిపించడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. తమ చేతికి దొరికిన వాటిని కొండ చిలువపై విసురుతూ.. రాళ్లతో కొడుతూ, దైర్య సాహసాలు ప్రదర్శించారు. అప్పటకీ కొండ చిలువ కుక్కను విడవకపోవడంతో చిన్నారులు మరింతగా ప్రయత్నించారు. ఒకరు తోకను పట్టుకుంటే , మరొకరు కొండ చిలువ తలను పట్టుకున్నాడు. ఇంకొకరు కుక్కను జాగ్రత్తగా విడదీశారు. చివరికి ఎలాగోలా ప్రయత్నించి కుక్కను విడిపించారు. కుక్క అక్కడి నుంచి కుయ్యో.. మెర్రో.. అనుకుంటూ పరుగు పెట్టింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముగ్గురు కుర్రాళ్ల సాహసంపై నెటిజన్లు ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. రియల్ హీరోలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. -
అమ్మో! ఎంత పెద్ద కొండచిలువ
వడోదర : గుజరాత్లో శనివారం 10 అడుగులున్న కొండచిలువను వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన వ్యక్తి రోజు మాదిరిగానే శనివారం ఉదయం పొలం పనులు చూసుకునేందుకు తన ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. కాసేపటి తర్వాత ఏదో అలికిడయిన శబ్దం వినిపించడంతో చెట్ల పొదల్లోకి తొంగి చూడగా కొండచిలువ కనిపించింది. వెంటనే వైల్డ్ లైఫ్ రెస్క్యూకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని చెట్ల పొదలను తొలగించి 10 అడుగుల కొండచిలువను బయటికి తీశారు. తర్వాత ఆ కొండచిలువను అక్కడి అటవీ అధికారులకు అప్పజెప్పారు. కాగా,ఈ వీడియోనూ తీసిన ఒక మీడియా సంస్థ తమ ట్విటర్లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. -
కొండ చిలువ కలకలం
చిత్తూరు, కేవీబీపురం : గొర్రెల పాకలో కొండచిలువ కలకలం సృష్టించింది. మండలంలోని పూడిసీకేపురం గ్రామానికి చెందిన రైతుకు సుమారు 40 గొర్రెలు ఉన్నాయి. రోజు వారీగా గొర్రెలను మేపుకుని ఇంటివద్దనున్న పాకలో తోలాడు. కొంత సమయానికే పాకలో అలజడి మొదలైంది. గొర్రెలు అరవడం ప్రారంభించాయి. పరిశీలించగా సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా తిరగబడడంతో కొట్టిచంపేశాడు. భారీ కొండ చిలువను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. -
మేకపిల్లను మింగిన కొండచిలువ
కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ సింగరాలపాడు అడవిలో శనివారం కొండచిలువ మేకపిల్లను మింగింది. సింగరాలపాడుకు చెందిన మేకల కాపర్లు మేతకోసం మేకలను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. సుమారు ఆరు అడుగుల పొడవున్న కొండచిలువ ఒక మేక పిల్లని మింగింది. కాపర్లు వెంటనే కర్రలు, కత్తులతో కొండచిలువపై దాడి చేసి దాన్ని చంపారు. కొండచిలువ నోటిని చీల్చి మేకపిల్లని క్షేమంగా బయటకు తీశారు. -
వలలో చిక్కిన కొండ చిలువ
సాక్షి, బాల్కొండ: బాల్కొండ అలీం చెరువులోని చేపలు బయటకు వెళ్లకుండా అలుగుకు కట్టిన వలలో పెద్ద కొండ చిలువ చిక్కింది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల దగ్గరికి వెళితే బుసలు కొట్టడంతో వలలోనే బంధించారు. ఈ చెరువులో ఇప్పటి వరకు 8 కొండ చిలువలను చంపినట్లు మత్స్యకారులు తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పూడికతీత పనులు సక్రమంగా చేపట్టలేదన్నారు. పిచ్చి మొక్కలు అధికంగా ఉండడంతో చెరువు కొండ చిలువలకు ఆవాసంగా మారిందని చెబుతున్నారు. -
వైరల్ : బెడ్రూమ్లో కొండ చిలువ విన్యాసాలు..!
క్వీన్స్లాండ్ : పగలంతా ఉద్యోగానికి వెళ్లొచ్చి ఇంట్లో కాస్త సేద తీరుతామనుకున్న ఓ వ్యక్తికి ఊహించని అతిథి ఎదురైంది. బెడ్రూమ్లోని పడక మంచంపై దర్జాగా విన్యాసాలు చేస్తున్న ఓ భారీ కొండ చిలువ కంటబడింది. చచ్చాన్రా దేవుడా..! అనుకుంటూ అతను అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. వెంటనే ‘సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్’ అనే పాములు పట్టే సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేయడంతో వారొచ్చి ఆ కార్పెట్ పైథాన్‌ను పట్టుకెళ్లి అడవిలో వదిలేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లో గత శనివారం జరిగింది. దీని గురించి సదరు స్నేక్ క్యాచర్ చేసిన ఫేస్బుక్ పోస్టు వైరల్‌గా మారింది. ‘బుసలు కొడుతున్న ఓ భారీ పాము బెడ్రూమ్లో దర్శనమివ్వడంతో ఓ వ్యక్తి మాకు ఫోన్ చేశాడు. వెంటనే వెళ్లి ఆ పైథాన్‌ను పట్టుకున్నాం. ఇంట్లోకి పురుగుపుట్రా ఏమీ చొరబడకుండా కిటికీలు, దర్వాజాలన్నీ మూసేసినా కూడా పామెలా వచ్చిందో అంతుబట్టడం లేదని ఆ ఇంటి యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. అతను చెప్పింది నిజమే..! ఆ పాము బయటి నుంచి రాలేదు. సీలింగ్ (రూఫ్) నుంచి వచ్చి లైట్‌పై కూర్చుంది. దాని బరువుకు లైట్ విరిగిపడి బెడ్ మీద ఊడిపడింది. దాంతోపాటు పైథాన్ కూడా బెడ్‌పై చేరింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఆ కొండచిలువ నిర్భయంగా విశ్రాంతిలో మునిగిపోయింది’అని స్నేక్ క్యాచర్ పేర్కొంది. -
అమ్మో ! ఎంత పెద్ద కొండచిలువో
సాక్షి, నారాయణవనం(చిత్తూరు) : స్థానికంగా బుధవారం సాయంత్రం ఓ కొండచిలువ హల్చల్ చేసింది. స్థానిక పశువైద్యశాల సమీపంలో నీరులేని బావిలో రెండు నాగుపాము పిల్లలతో పాటు పెద్ద కొండచిలువను గ్రామస్తులు గుర్తించారు. బావి నుంచి బయటకు వచ్చిన కొండచిలువ పిల్ల పక్కనే ఉన్న మహమ్మద్‌కు చెందిన మేకపిల్లను మింగడానికి ప్రయత్నించింది. యజమాని చాకచక్యంతో మేకపిల్లను కాపాడి, పుత్తూరు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేశారు. వారు స్పందించకపోవడంతో కొండచిలువను సమీపంలోని అరుణానదిలో ముళ్లపొదల్లో వదిలేసినట్లు ఆయన చెప్పారు. -
ఆట మధ్యలో...కొండచిలువ దర్శనం
ఆడుకోవటానికి సరదాగా ఒక్కచోటికి చేరిన స్నేహితులకు భయానక అనుభవం ఎదురైంది. ఆట మధ్యలో పూల్ టేబుల్ కింద అనుకోని అతిథి వారిని పలకరించింది. బోర్డు పాకెట్లో పడిన బాల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అందులో నుంచి కొండచిలువ తల దర్శనమిచ్చింది. దీంతో బెంబేలెత్తిపోయిన ఆటగాళ్లు పాములు పట్టేవారికి సమాచారమిచ్చారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బిస్బేన్ స్నేక్ క్యాచర్స్ కొండచిలువను బయటికి తీశారు. ‘ స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటున్న సమయంలో ముచ్చటగొలిపే పాము తల కనిపిస్తే ఎలా ఉంటుంది’ అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను... ఫేస్బుక్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
సింగరేణి పార్క్ వద్ద కొండచిలువ హల్చల్
సాక్షి, చెన్నూర్(మంచిర్యాల) : ఏరియాలోని కోల్‌బెల్ట్ రహదారి పక్కనే ఉన్న సింగరేణి గ్రీన్ పార్క్ వద్ద గురువారం సాయంత్రం కొండచిలువ హల్చల్ చేసింది. పార్క్ నుంచి బయటకు వచ్చిన ఆరడుగుల పొడువు గల కొండచిలువ వర్క్‌షాపు మూలమలుపు వద్ద రోడ్డుపైకి రావడంతో రాకపోకలు సాగించే వారు భయంతో ఆగిపోయారు. వాహనాల లైటింగ్‌కు తిరిగి పార్క్‌లోకి వెళ్లిపోయింది. కొండచిలువ తిరిగి పార్క్‌లోకి వెళ్లిపోవడంతో పట్టణ ప్రజలు భయపడుతున్నారు. రోజు సాయంత్రం సమయంలో వందలాది మంది కాలక్షేపానికి పార్క్‌కు వెళతారు. అధికారులు కొండ చిలువను పట్టుకోవాలని కోరుతున్నారు. -
మొసలిని మింగిన కొండచిలువ!
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం... చూసిన వారంతా బాబోయ్! అనకుండ ఉండలేరు. కొండచిలువ మొసలికి మధ్య జరిగిన పోరాటంలో చివరికి మొసలిపై పైథాన్ గెలుపు సాధించింది. ఆలివ్ పైథాన్ మంచి నీటి మొసలితో పోరాడి చివరకు దానిని పూర్తిగా మింగేసింది. ఈ పోరాట దృశ్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి అందులో కొన్ని ఫోటోలను జీజీ వైల్డ్ లైఫ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లంతా కామెంట్లు పెట్టకుండా ఉండలేక పోతున్నారు. ‘ఇంత భయంకరమై కొండచిలువను జూలో కూడా చూడలేదని, ఇలాంటి ఘటనను దగ్గర చూసే అవకాశం కూడా ఎప్పుడు రాలేదని’ కామెంట్లు పెట్టారు. సామాజిక మాధ్యమంలో సెన్సేషనల్‌గా మారిన ఈ ఫోటోలకు ఇప్పటివరకు 23 వేల కామెంట్లు, 48 వేల షేర్లు, 23 వేల లైక్‌లు వచ్చాయి. -
మేకను మింగబోయి.. భారీ కొండచిలువ హతం
జి.సిగడాం: మేకను మింగబోయిన కొండచిలువను గ్రామస్తులు హతమార్చారు. జి.సిగడాం మండలం గెడ్డకంచరాం గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం మేకలు మేత మేస్తుండగా సుమారు 12 అడుగుల భారీ కొండ చిలువ వచ్చి మాటువేసింది. ఓ మేకపై దాడి చేసి హతమార్చి మింగేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు గుర్తించారు. వెంటనే కర్రలతో కొండచిలువను హతమార్చారు. -
కొండచిలువను బంధించిన గ్రామస్తులు
తూర్పుగోదావరి, ఆత్రేయపురం (కొత్తపేట): అంకంపాలెం గ్రామ శివారు పాటి చెరువు వద్ద గురువారం కొండచిలువ కనిపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే గ్రామస్తులు నేర్పుగా కొండచిలువను బంధించి అటవీ శాఖాధికారులకు అప్పగించారు.ప్రధానపంటకాలువ మూసివేయడంతో మత్స్య కారులు వేట సాగిస్తుంటే సుమారు 15 అడుగుల పొడవైన కొండచిలువ కాలువలో వారికి కనిపించింది. దీంతో మత్స్యకారులు కంగారు పడి పరుగులు తీశారు. గ్రామస్తులకు సమాచా రం అందడంతో పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భయాందోళనతో వారు పొలంలో ఉన్న పశువులు, కోళ్లను గ్రామంలోకి తీసుకుపోయారు. ఈ విషయం మండలం అంతా వ్యాపించడంతో పంట కాలువ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.మత్స్యకారులు, ప్రజలు చేపలుపట్టే వలతో కొం డచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కొండచిలువ మెల్లగా పంట కాలువ పైకి రావడంతో కోళ్లను పెట్టే బుట్టలో గ్రామస్తులు బంధించి అటవీ శాఖాధికారులకు తెలియజేశారు. అధికారులు గ్రామానికి చేరుకుని కొండచిలువను తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
పదిహేడు అడుగుల కొండచిలువ పట్టివేత
మియామి : ప్రపంచంలోనే తొలిసారిగా 17 అడుగుల పొడవున్న కొండచిలువను శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో 140 పౌండ్ల బరువుతో, 73 గుడ్ల పొదుగుతో ఈ భారీ పైథాన్ శాస్త్రవేత్తల కంటపడింది. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సైప్రస్ జాతీయ సంరక్షణ కేంద్రం నుంచి ఈ భారీ కొండచిలువను వెలికితీశామని శాస్త్రవేత్తలు చెప్పారు. కొండచిలువను పట్టుకునేందుకు శాస్త్రవేత్తలు నూతన ట్రాకింగ్ టెక్నాలజీని అనుసరించారని జాతీయ సంరక్షణ కేంద్రం పేర్కొంది. రేడియో ట్రాన్స్మిటర్స్ను వాడటం ద్వారా శాస్త్రవేత్తలు పైథాన్ల జాడ పసిగట్టారని తెలిపింది. శాస్త్రవేత్తల బృందం కొండచిలువలను తొలగించడంతో పాటు వీటిని తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులపై పరిశోధన, జంతు సంరక్షణ కేంద్రాలను పైథాన్లు అడ్డాగా ఎలా మలుచుకుంటున్నాయనే దానిపై లోతైన విశ్లేషణ జరపిందని వెల్లడించింది. దక్షిణ ఫ్లోరిడాలోని మియామిలో 7,29,000 ఎకరాల విస్తీర్ణంలో సైప్రస్ జాతీయ సంరక్షణ కేంద్రం విస్తరించింది. -
మనుషుల్ని మింగే కార్పెట్ కొండ చిలువ
కాన్బెర్రా : ఆస్ట్రేలియాకు చెందిన 59 ఏళ్ల హెలెన్ రిచర్డ్స్ ఫేస్బుక్ సాక్షిగా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఆమె సూచనలు చదివి ఇంతేనా.. అనుకోవండి. తన సూచనలను హెచ్చరికలుగా భావించకపోతే చావు తథ్యం అంటున్నారామే. విషయమేంటో ఆమె మాటల్లోనే.. ‘గత మంగళవారం ఉదయం వాష్‌రూమ్‌కి వెళ్లిన నాకు చావుతప్పి కన్నులొట్టబోయినంత పనైంది. ఎప్పటిలానే నా పనిలో నేనుండగా.. నా వెనక భాగాన్ని ఏదో గట్టిగా గీటింది. దాంతో భయంతో ఎగిరి దుమికాను. లెట్రిన్ బేసిన్లో కప్ప దాగుంది కావొచ్చు అనుకున్నాను. బద్ధకంతో వాష్‌రూమ్‌లో లైట్ కూడా వేసుకోకపోవడంతో.. చీకట్లో ఏమీ కనిపించలేదు. ఏమై ఉంటుందబ్బా.. అని లైట్ వేశాను. అంతే.. దిమ్మతిరిగి పోయింది..! బేసిన్లో ఉన్నది కప్ప కాదు. పొడవైన పాము. ఇక అంతే.. నోట మాట రాలేదు. చచ్చాన్రా దేవుడా అనుకున్నాను. ఒక్క నిముషం గడ్డకట్టుకుపోయాను. కాస్త ధైర్యం కూడదీసుకుని మరోసారి బేసిన్లో కొంచెం పరిశీలనగా చూశాను. మనసుకు కాస్త ఊరట కలిగింది. బేసిన్లో నక్కి.. నన్ను కాటు వేసింది విష రహితమైన కొండచిలువ అని గ్రహించాను. అయితే, అది విషం కక్కే కొండ చిలువ కాకపోయినా.. మనుషుల్ని సైతం మింగే కార్పెట్ జాతి కొండ చిలువ. నా అదృష్టం కొద్దీ అది చిన్న సైజులో ఉంది. లేదంటే.. దానికి ఆహారమయ్యేదాన్నే..’ అని తన హారిబుల్ పైథాన్ స్టోరీని చెప్పుకొచ్చారు హెలెన్. మొత్తం మీద చిన్న గాయంతో బయటపడ్డానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాగా, చాపెల్ హిల్‌లో నివాసముంటున్న హెలెన్ పిలుపుతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ ఆ కార్పెట్ పైథాన్ పట్టుకొని అడవిలో వదిలేశారు. హెలెన్ తమను సంప్రదించడం.. ఘటనా సమయంలో ఆమె భయాందోళనలన్నింటినీ కలిపి స్నేక్ క్యాచర్స్ సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేయడంతో అది వైరల్ అయింది. -
కొండచిలువతో సెల్ఫీ..
సాక్షి, హైదరాబాద్: కొండచిలువను చూస్తేనే వామ్మో అని భయపడతాం.. అలాంటిది ఓ వ్యక్తి దానిని నెల రోజులు ఇంట్లో దాయడంతోపాటు అక్రమంగా విక్రయించేందుకు యత్నించాడు. దీని కోసం ఏకంగా కొండచిలువతో సెల్ఫీ దిగి ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సదరు వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పరిధిలోని వెంకటాద్రి టౌన్షిప్లో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే షరన్ మోసెస్ అనే యువకుడు కొండచిలువతోపాటు మరో పాము (బ్రాంజ్ బ్యాక్ స్నేక్)ను అక్రమంగా విక్రయించడం కోసం తన ఇంట్లో నెలరోజులుగా దాచి ఉంచాడు. ఇదే టౌన్‌షిప్‌కు చెందిన అతని స్నేహితుడు వెనొరోస్ ప్రవీణ్ మోసెస్కి సహకరించాడు. కొనుగోలుదారులను ఆకర్షించడం కోసం ప్రవీణ్ కొండచిలువతో సెల్ఫీ దిగి.. ఫేస్బుక్, వాట్సాప్‌లో అప్లోడ్ చేశాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల అటవీశాఖ అక్రమ రవాణా బృందం నిరోధక అధికారులు తనిఖీలు చేపట్టి కొండచిలువతో పాటు, పామును స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద మోసెస్, ప్రవీణ్‌లను అరెస్ట్ చేసి రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కొండచిలువ షెడ్యూల్–1 జాతికి చెందినది కావడంతో అక్రమంగా దానిని వద్ద ఉంచుకున్నా, అక్రమ వ్యాపారం చేసేందుకు ప్రయత్నించినా మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు కనిష్టంగా రూ. 10 వేలు అపరాధ రుసుము వసూలు చేయవచ్చు. -
సీరియస్ మీటింగ్ ఇంతలో అనుకోని అతిథి..
-
అనుకోని అతిథి రాకతో పరుగో పరుగు
బీజింగ్ : సీరియస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అనుకోని అతిథి అది కూడా ఆ సమావేశంతో సంబంధం లేని వారు వస్తే కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. ఆ అతిథి కాస్తా ఏ పామో, పులో అయితే ఆ పరిస్థితి ఇక వర్ణణాతీతం. మీటింగ్ సంగతి దేవుడేరుగు ముందైతే కాలుకి బుద్ధి చెప్పి పరుగందుంకుంటారు. ఇలాంటి సంఘటనే జరిగింది చైనాలో. వివరాలు.. చైనా నాన్నింగ్ సిటీలోని ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంకు సిబ్బంది మీటింగ్‌లో భాగంగా సమావేశమయ్యారు. మీటింగ్ జరుగుతుండగా.. ఇంతలో ఆ గదిలోని పైకప్పు నుంచి ఓ ఐదు అడుగుల పైథాన్ కిందపడిపోయింది. ఇద్దరు ఉద్యోగుల మధ్య పైథాన్ పడడంతో.. సిబ్బంది అందరూ భయంతో పరుగులు పెట్టారు. ఈ గందరగోళానికి జడిసిన ఆ పైథాన్ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ లోపు సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని.. ఆ పైథాన్‌ను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి. దాంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. -
నువ్వు పులివైతే నేను కొండ చిలువ!
సాక్షి, మైసూరు : తన పరాక్రమం, రాజసంతో అడవిని ఏలే పులిరాజును ఓ కొండచిలువ తోక ముడిచేలా చేసింది. పులులకు ఆలవాలమైన మైసూరు జిల్లాలోని నాగరహళె అటవీప్రాంతంలో శనివారం జరిగిన ఈ సంఘటన పర్యాటకుల కంటపడింది. అటవీ ప్రాంతంలో గంభీరంగా నడుచుకుంటూ వెళుతున్న పెద్దపులి తన దారికి అడ్డంగా కొండచిలువ ఉండడాన్ని గమనించింది. నిదానంగా కొండచిలువను సమీపించిన పులి తన దారి నుంచి తప్పుకోవాలన్నట్లుగా పంజాతో దానిపై మెల్లగా తట్టింది. దీంతో అప్రమత్తమైన కొండచిలువ పెద్దపులిపై తిరగబడింది. మరోసారి కొండచిలువను భయపెట్టడానికి పులి ప్రయత్నించగా ఏమాత్రం వెనక్కి తగ్గని కొండచిలువ పులి మీదకు దూకే యత్నం చేసింది. దీంతో ఎందుకొచ్చిన తంటా అని అనుకున్న పెద్దపులి పక్కనుంచి వెళ్లిపోయింది. -
లండన్ వీధుల్లో కొండచిలువ హల్చల్
-
లండన్ వీధిలో పరుగులు
లండన్ : ఎటు నుంచి వచ్చిందో.. హఠాత్తుగా ఊడిపడిన ఓ కొండచిలువ లండన్ నగర వీధుల్లో హల్చల్ చేసింది. తూర్పు లండన్‌లోని ఓ వీధిలో ప్రత్యక్షమైన కొండచిలువను చూసిన స్థానికులు పరుగులు పెట్టారు. ఇంతలో అక్కడ ఆహారం తింటున్న పావురంపై దాడి చేసిన పాము దాన్ని మింగేసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న వైల్డ్‌లైఫ్ సంరక్షణ అధికారులు కొండచిలువను పట్టుకుని, సురక్షిత ప్రదేశానికి తరలించారు. తాను అటుగా నడుచుకుంటూ వెళ్తున్నానని, ఒక్కసారిగా కొండచిలువను చూసి షాక్‌కు గురయ్యాయని స్థానికుడు ఒకరు తెలిపారు. ఆ సమయంలో తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పారు. కొండచిలువ దాడి పావురం బలి కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
వంటింట్లో అనుకోని అతిథి.. షాక్ తిన్న మహిళ!
న్యూఢిల్లీ : గురుగ్రామ్‌కు చెందిన 35ఏళ్ల మహిళ టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది. గ్యాస్‌స్టవ్ వెలిగించడానికి పక్కనే ఉన్న లైటర్‌ను చేతిలోకి తీసుకుని వెలిగించే ప్రయత్నం చేసింది. వంటగదిలోని ఓ మూలనుంచి శబ్ధం రావటంతో అటుచూసింది. అంతే ఒక్కసారిగా ఆమె వెన్నులో ఒనుకు పుట్టింది. ఏకంగా 5అడుగుల కొండచిలువను వంటగదిలో చూడటంతో ఆమె నోటమాట రాలేదు. కొద్దిసేపటికి తేరుకున్న ఆమె వంటగదిలో కొండచిలువ ఉన్న సంగతి భర్తకు, పక్కింటి వాళ్లకు చెప్పింది. అందరూ ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. అంత మంది ఉన్నా ఒక్కరు కూడా పాము దగ్గరగా వెళ్లిచూసే ప్రయత్నం చేయలేదు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని భావించిన ఇంటియాజమాని వణ్యప్రాణి సంరక్షణా సిబ్బందికి ఫోన్ చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న వారు దాన్ని ఇండియన్ రాక్ పైథాన్‌గా గుర్తించారు. కొండచిలువను పట్టి సంచిలో వేసుకుని అడవిలో వదిలిపెట్టేశారు. -
తిరుమలలో భారీ కొండ చిలువ
-
16 అడుగుల భారీ కొండచిలువ హతం
వజ్రపుకొత్తూరు : గొర్రెలు, మేకలు, కోళ్లు, ఆవు దూడలను రుచి మరిగిన కొండచిలువను స్థానికులు హతమార్చారు. సుమారు 16 అడుగులు పొడవు ఉన్న కొండ చిలువ నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కృష్ణరాయపురం గ్రామంలో ఆదివారం ఉపాధి పనులు చేస్తున్న వారి చేతికి చిక్కి హతమైంది. గ్రామం చుట్టూ దట్టమైన జీడిమామిడి తోటలు, చెరువులు ఉండడంతో కొండచిలువలు అక్కడే ఉంటూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతంలో కృష్ణరాయపురం గ్రామ పరిధిలో మూడు కొండ చిలువలను హతమార్చారు. అటవీ, ఇతర అధికారులు పరిశీలించి ఈ సర్పాలను పట్టుకుని జూకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కొండచిలువ పట్టివేత
కోయిల్‌కొండ (నారాయణపేట): మండలం లోని కోత్లాబాద్ గ్రామ సమీపంలోని కొయ్యగుండుగుట్టలో రైతులు అడివి జంతువుల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కింది. శుక్రవారం విషయం తెలుసుకున్న రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సంజీవరావు, రాములునాయక్, శ్రీనివాస్ కొండచిలువను వల నుంచి వేరు చేసి పట్టుకున్నారు. కొండచిలువు సుమారు 8 అడుగుల పొడవు 10 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. కొండ చిలువును మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రికి తరలించి చికిత్స నిర్వహిస్తామన్నారు. రైతులు అడవి జంతువుల బారినుంచి తమ పంటలను కాపాడుకొనేందుకు వలలు వేస్తుంటారన్నారు. ఈ నేపథ్యంలోనే వేసిన వలకు కొండచిలువ చిక్కిందన్నారు. -
కొండచిలువ కలకలం
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన బూరుగువాడలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. విస్తారంగా వర్షాలు కురుస్తూ ముసురు కమ్ముకోవడంతో గ్రామస్తులంతా ఇళ్లలో ఉన్న సమయంలో గ్రామానికి శివారులో ఉన్న మేకల దొడ్డిలో కొండచిలువ ప్రవేశించింది. గ్రామంలోని పూనెం సింగరాజుకు చెందిన ఒక మేక, కోడిని మింగటంతో పాటు మరొక మేకను చుట్టి వేసి చంపే ప్రయత్నం చేసింది. అయితే మేకల దొడ్డిలో నుంచి మేకల శబ్దం బిగ్గరగా రావడంతో సింగరాజు హుటాహుటీన వెళ్లి చూశాడు. అప్పటికే మేకను మింగిన కొండచిలువ మరొక మేకను చుట్టి ఉండటం గమనించాడు. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారంతా అక్కడికి చేరి కొండ చిలువను హతమార్చారు. కొండచిలువ చుట్టిన మేక కూడా మృతి చెందింది. పాకలో ఉన్న రెండు మేకలు, కోడి కొండ చిలువ దాడిలో మృతి చెందాయని సింగరాజు తెలిపారు. ఇదిలా ఉండగా బూరుగువాడ సమీపంలోని కొండ ప్రాంతంలో ఇటీవల కొండ చిలువలు సంచరిస్తూ కనిపిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఒకటి మృతి చెందినప్పటికీ మరొక రెండు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నట్టు గ్రామస్తులు చెప్పారు. -
సెల్ఫీల కోసం పోటీ.. కొండచిలువ మృతి
కోల్‌కతా : సెల్ఫీల కోసం ఓ కొండచిలువ మృతికి గ్రామస్థులు కారణమయ్యారు. ఈ దారుణ సంఘటన బెంగాల్‌లోని బిర్భమ్ జిల్లా బాబీజోర్ గ్రామంలో చోటు చేసుకుంది. దాదాపు ఆరడుగుల పొడవున్న కొండచిలువ హింగ్లో నది పరివాహక ప్రాంతంలో కొందరు వ్యక్తుల కంటపడింది. కొద్ది నిమిషాల్లోనే ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది. పెద్ద ఎత్తున ఆ ప్రదేశానికి చేరుకున్న గ్రామస్థులు కొండచిలువను పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం దానితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో ప్రజల పోటీ మధ్య కొండచిలువ నలిగిపోయింది. ఎటూ కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా అయినా కూడా కనికరం లేకుండా గ్రామస్థులు దాన్ని హింసించడంతో ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై మాట్లాడిన అటవీ శాఖ అధికారులు కొండచిలువ మృతికి కారణమైన వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల క్రితం బెంగాల్లోనే సెల్ఫీల కోసం యత్నించి జాతీయ పక్షి నెమలి మృతికి కొందరు కారణమైన విషయం తెలిసిందే. అంతలోనే ఈ ఘటన జరగడం జంతువులు, పక్షుల రక్షణపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. -
వైరలవుతున్న అనకొండ గుడ్లు...?
కశ్మీర్ : గత కొన్ని రోజులుగా కశ్మీర్లో ‘అనకొండ గుడ్లు’ అనే వార్త తెగ హల్చల్ చేస్తోంది. అవును ‘అనకొండ గుడ్ల’ గురించే కశ్మీర్ ప్రజలు ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు. వివరాల ప్రకారం కొన్ని రోజుల క్రితం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఒక అనుమానాస్పద బ్యాగ్ వెలుగు చూసింది. ఆ బ్యాగ్ మీద ‘అనకొండ గుడ్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసెర్చ్, బ్రెజిల్’ అని రాసి ఉంది. అంతే కాక ‘జాగ్రత్తగా తెరవండి...చల్లని ప్రదేశంలోనే ఉంచండి, లేదంటే గుడ్లు పొదిగే ప్రమాదం ఉంది’ అని రాసి ఉంది. ఈ బ్యాగ్ కనిపించడంతో ఇన్ని రోజులుగా పుల్వామా ప్రజలను వేధిస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం కూడా దొరికినట్లయ్యింది. అదేంటంటే ఎన్నడు లేనిది కొన్నాళ్లుగా పుల్వామా జిల్లాలోని పొలాల్లో పాముల సంచారం పెరిగినట్లు స్థానికులు గుర్తించారు. దాంతో ఈ అనకొండ గుడ్లు పొదగడం వల్లే పాముల సంఖ్య పెరుగుతుందనే నిర్ణయానికి వచ్చారు స్థానికులు. అయితే కశ్మీర్ వైల్డ్ లైఫ్ డిపార్టమెంట్ అధికారులు మాత్రం ‘మాకు ఈ ప్రాంతంలో ఇంతవరకూ ఒక్క పాము కూడా కనిపించలేదు’ అని తెలిపారు. అంతేకాక ‘పాములు కనిపించడం అనేది కొత్త విషయం ఏమి కాదు. పాములనేవి ఎప్పుడైనా, ఎక్కడైనా కన్పిస్తాయి. కానీ అనకొండ గుడ్ల వల్లనే పాముల సంఖ్య పెరిగిందనడం కాస్తా ఆశ్చర్యం కలిగించే అంశమే కాక అవాస్తవం కూడా. ఎందుకంటే అనకొండ గుడ్లు పెట్టదు. స్వయంగా పిల్లలను కంటుంది’ అని తెలిపారు అధికారులు. అంతేకాక కొండ చిలువలు కూడా భారీ సైజులో ఉండటంతో జనాలు వీటినే అనకొండలుగా భావిస్తున్నారని తెలిపారు. ఇంతా జరిగినప్పటికి ఆ బ్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది, దానిలో ఉన్నవి ఏంటి అనే విషయం ఇంతవరకూ తెలియరాలేదు. ఈ విషయం గురించి నెటిజన్లు రకరకాల కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. ‘38 డిగ్రిల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అనకొండలు బతకలేవు...చనిపోతాయి. అంతేకాక అనకొండలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయి. కశ్మీర్ నదులు ఎప్పుడు గడ్డకట్టే ఉంటాయి కాబట్టి అక్కడ అనకొండలు బతికే అవకాశమే లేదు’ అని కామెంట్ చేయగా మరి కొందరు ‘అనకొండలు గుడ్లు పెట్టవు...ఒకవేళ పెట్టినా అవి పొదగాలంటే చాలా అధిక ఉష్ణోగ్రతలు కావాలి. కాబట్టి కశ్మీర్‌లాంటి ప్రాంతంలో ఆ గుడ్లు పొదిగే అవకాశమే లేదు’ అని పోస్టు చేశారు. -
ఎనిమిది అడుగుల కొండచిలువ హతం
తెర్లాం విజయనగరం : మండలంలోని వెలగవలస గ్రామంలో ఎనిమిది అడుగుల పొడవున్న కొండచిలువ మంగళవారం రైతుల చేతిలో హతమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరు రైతులు ఉద్యానవన పంటలకు సంబంధించి మొక్కలు నాటేందుకు గోతులు తవ్వేందుకు పొలానికి వెళ్లారు. గోతులు తవ్వుతుండగా పక్కనే ఉన్న తాటిచెట్ల వద్ద పెద్ద శబ్ధం రావడంతో అక్కడికి వెళ్లి చూస్తే సుమారు ఎనిమిది అడుగులపైనే ఉన్న కొండ చిలువ కనిపించింది. దీంతో భయపడిన రైతులు కర్రలతో కొండ చిలువను కొట్టి చంపేశారు. -
కొండచిలువ నోట చిక్కి.. షాకింగ్ వీడియో
ప్రాణాల కోసం ఆ మూగ జీవి పోరాటం.. ధైర్యం చేసిన ఓ బృందం సభ్యులు.. తోడుగా మరో అల్పజీవి. అంతా కలిసి కష్టపడి ఆ భారీ జీవి నుంచి దానిని విడిపించగలిగారు. అయితే చివర్లోనే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. కాస్త భయానకంగా ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యాంకాక్: సుమారు 20 అడుగులపై ఉన్న ఓ భారీ కొండచిలువ ఓ నల్లకుక్క పిల్లను మింగేందుకు యత్నించింది. ముందుగా దానిని చుట్టేసి నలిపేయటం ప్రారంభించింది. అది గమనించిన కొందరు కర్రలతో విడిపించేందుకు యత్నించారు. అది సాధ్యం కాకపోవటంతో ఓ వ్యక్తి ధైర్యం చేసి దాని తోకపట్టి లాగాడు. ఇంతలో మిగతా వారు అతనితో కలవటంతో దానిని ఈడ్చి కుక్కను లాగేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న మరో చిన్న కుక్క పిల్ల మొరుగుతూ, ఆ భారీ జీవిపై దాడి చేయాలని చూసింది. చివరకు ఎలాగోలా దాని నోటి నుంచి కుక్క పిల్లను లాగిన ఆ బృందం.. పెనుగులాటలో అది చనిపోయి ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా ఆ కుక్క పిల్ల లేచి, పక్కనే ఉన్న మరో కుక్కతో సహా అక్కడ నుంచి పరిగెత్తింది. మళ్లీ పట్టేందుకు ప్రయత్నించగా వారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. చివరకు నోటి కాడ కూడు పోవటంతో ఊసురుమనుకుంటూ ఆ కొండచిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. థాయ్‌లాండ్‌లో చియాంగ్ మయి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్కను కాపాడిన బృందాన్ని ‘ఫ్లైట్ ఆఫ్ ది గిబ్బన్స్’గా అధికారులు గుర్తించారు. -
కొండచిలువ నోట్లో కుక్క...చివర్లో ట్విస్ట్
-
చుట్టేసి ఆరగిస్తాయ్.!
ఇటీవల ఇండోనేషియాలోని మకస్పర్లో తోటలో కూరగాయలు కోయడానికి వెళ్లిన ఓ మహిళను భారీ అనకొండ మింగేసింది. అలాగే రెండ్రోజుల కిందట అసోంలో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను పట్టుకొన్న ఓ అటవీ అధికారి, దానితో సెల్ఫీ తీసుకుంటుండగా అది ఆయన మెడను చుట్టుకొని బిగించింది. చుట్టుపక్కల వారు వేగంగా స్పందించి దాని పట్టునుంచి అధికారిని విడిపించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో అనకొండ గురించి క్లుప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములున్నాయి. వీటిలో అతి పెద్దదే అనకొండ(పైథాన్). సరీసృపాల్లోని యునెక్ట్స్ ప్రజాతికి చెందిన ఇవి విషరహితం. యునెక్ట్స్ అంటే గ్రీకు భాషలో గుడ్ స్విమ్మర్(మంచి ఈతగాడు) అని అర్థం. అనకొండల రూపం, పరిమాణాన్ని బట్టి వీటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి.. గ్రీన్(ఆకుపచ్చ) అనకొండ, ఎల్లో(పసుపు) లేదా పరాగ్వేయన్ అనకొండ, బ్లాక్ స్పాటెడ్ (నల్లమచ్చల) అనకొండ, బేని లేదా బొలివియన్ అనకొండ. మనదేశంతోపాటు ఉపఖండంలో కనిపించే కొండచిలువ ఇందులో ఒకటి. దక్షిణ అమెరికాలో అత్యధికం ఒక్క అంటార్కిటాకాలో మినహా మిగిలిన అన్ని ఖండాల్లోనూ అనకొండలు ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య దక్షిణ అమెరికాలో అత్యధికం. అక్కడి వాతావరణ పరిస్థితులు దీనికి కారణం. అనకొండల్లోని నాలుగు రకాలూ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి పురాణాల్లోనూ వీటి ప్రసక్తి ఉంది. వీటికి కొన్ని అతీత శక్తుల్ని ఆపాదిస్తూ రాసిన పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనుషుల్ని తినేవిగానూ వీటిని పేర్కొన్నారు. అనకొండ పేరు మీద వచ్చిన అనేక ఇంగ్లిష్ సినిమాలకు ఇవే ప్రేరణ. చిత్తడి నేలలు, తీరాల్లో ఆవాసం అనకొండలు అన్ని ప్రాంతాల్లోనూ నివసించగలిగినప్పటికీ ఇవి ఎక్కువగా నది, సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి నేలల్లో ఉండడానికి ఆసక్తి చూపుతాయి. ఇక్కడ ఇవి సంచరించడానికి అనుకూలంగా ఉండడంతోపాటు వీటి ఆహారమైన చిన్నచిన్న జంతువులు నీళ్లు తాగేందుకు రావడం మరో కారణం. బలమైన కండరాలతో ఏర్పడిన వీటి ఆకారం నేలమీద కంటే నీటిలో చురుగ్గా ప్రయాణించేందుకు వీలుగా ఉండడమూ చెప్పుకోవచ్చు. ఇవి నీళ్లలో ఈదుతూ లేదా దాక్కొని ఉంటూ ఎక్కువ సమయం గడుపుతాయి. ప్రవాహ వేగం తక్కువగా ఉండే నదులు, జలపాతాల సమీపంలో ఎత్తైన చెట్ల కొమ్మలను చుట్టుకొనీ ఉంటాయి. ఇవి గరిష్ఠంగా 100 అడుగుల వరకూ పెరుగుతాయని వాదనలు ఉన్నప్పటికీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ప్రకారం ఇప్పటివరకు 25 అడుగుల పొడవైన అనకొండే అతి పెద్దది. అలాగే వీటి బరువు 250 కిలోల వరకూ ఉంటుందని అంచనా. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం గరిష్టంగా 45–68 కిలోల వరకు ఉన్నవాటినే ఇప్పటిదాకా గుర్తించారు. ఊపిరి ఆడకుండా .. రక్తప్రసరణ జరగకుండా.. ఏటా వసంత కాలంలో అనకొండలు జతకూడతాయి. ఆడ అనకొండలు వదిలే ఒకరకమైన ద్రవం వాసనను బట్టి మగవి వెతుక్కుంటూ వస్తాయి. గర్భస్థ కాలం ఏడు నెలలు. ఈ కాలంలో పిల్లల్ని మోసే ఆడవి వేటాడవు. ఒక్కదఫా కనీసం 30 పిల్లల్ని కంటాయి. పుట్టగానే వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. అనకొండ గరిష్ఠ జీవిత కాలం 30 ఏళ్లు. జింకలు, కుందేళ్లు, చేపలు, మొసళ్లు, తదితర జంతువుల్ని ఆహారంగా తీసుకొనే అనకొండలు.. ఆకలేస్తే మనిషి మీద దాడి చేయడానికీ వెనకాడవు. ఈ క్రమంలో ఇవి తమ ఆహారాన్ని మొదట బలంగా చుట్టుకొని ఊపిరి ఆడకుండా, రక్తప్రసరణ జరగకుండా చేస్తాయి. అవి చనిపోయాక వాటిని మింగి ఆరగిస్తాయి. అడవుల నరికివేత.. ఆవాసం ధ్వంసం సాధారణంగా అడవుల్లోనే నివసించే అనకొండలు ఇటీవల తరచూ మానవ నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పెంపుడు జంతువులు, మనుషుల మీద దాడి చేస్తున్నాయి. కలప, వ్యవసాయం కోసం అడవులను నరికివేయడంతో ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. చిత్తడి నేలలు, నదీ తీర ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు ఎక్కువ అవడంతో వీటి ఆహారమైన ఇతర జంతువుల రాక తగ్గింది. దీంతో అనకొండలు ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి చేరుతున్నాయని చెబుతున్నారు. -
రహదారిపై కొండచిలువ
గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని రహదారిపై సోమవారం రాత్రి కొండచిలువ ప్రత్యక్షమైంది. సమీపంలో నిర్జన ప్రదేశం నుంచి రహదారిపైకి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో పాత వాహనాలు ఉండడంతో వాహనాల తుప్పు తినేందుకు వెళ్తుండగా జనం గుర్తించా రు. పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ దొరకకపోవడంతో కర్రతో చంపేశారు. కాగా ప్రధాన రహదారిపై ఒక్కసారిగా కొండచిలు వ ప్రత్యక్షం కావడంతో స్థానిక ప్రజలు ఆం దోళనకు గురయ్యారు. దీంతో 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. -
కొండచిలువతో సెల్ఫీ దిగబోయి ప్రాణాలమీదకు..
-
నా దగ్గర మీ ఆటలు సాగవు..
సాక్షి, కోల్‌కతా : పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూస్కో.. లేదు పులితో ఫోటో దిగాలనుకుంటే దిగు కానీ.. నాతో మాత్రం దిగేందుకు ట్రై చేయోద్దని కొండచిలువ ఒకటి ఓ అటవిశాఖ అధికారికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. 18 అడుగుల పొడవు, 40 కేజీల బరువున్న భారీ కొండచిలువ నుంచి ఓ ఫారెస్ట్ ఆఫీసర్ అదృష్టవశాత్తూ కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పించుకున్నాడు. అతనికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంకాలం కోల్‌కతాకు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్పాయిగురి గ్రామంలోకి ఓ కొండచిలువ ప్రవేశించింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో సంజయ్ దత్త అనే అటవీ అధికారి అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో కొండచిలువను తన మెడలో వేసుకున్నారు. అంతటితో ఆగకుండా సంజయ్ దానితో పాటు గ్రామస్తులు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పైథాన్ సంజయ్ మెడను చుట్టే ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు దానిని లాగి పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లడమంటే ఇదేనేమో మరీ.. -
అదృశ్యమైన మహిళ కేసు విషాదం
-
అదృశ్యమైన మహిళ.. కొండచిలువ కడుపులో!
జకర్తా : తోటలోకి వెళ్లి అదృశ్యమైన మహిళ కేసు విషాదంగా ముగిసింది. రాకాసి కొండచిలువ ఆమెను మింగేసినట్లు ఒకరోజు తర్వాత గుర్తించారు. ఈ ఘటన ఇండోనేసియాలోని మునా ఐలాండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెర్సియపన్ లావెలా గ్రామంలో వా టిబా అనే 54 ఏళ్ల మహిళ కూరగాయలు కోసేందుకు తన తోటలోకి వెళ్లింది. అయితే రాత్రి అయినా ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా లాభం లేకపోయింది. వా టిబా కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం రోజు వారి తోటలోకి వెళ్లి చూడగా.. 7 మీటర్ల (దాదాపు 23 అడుగుల) పొడవైన రాకాసి కొండచిలువను గుర్తించారు. అయితే అది వేగంగా కదలడం లేదని, అది టిబాను మింగేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు ఆ రాకాసి కొండచిలువను చంపి, దాన్ని కోసి చూడగా అందులో వా టిబా మృతదేహం ఉండటంతో కుటుంబసభ్యులు, స్థానికులు షాకయ్యారు. పోలీస్ అధికారి హమ్కా మాట్లాడుతూ.. టిబా చెప్పులను గుర్తించి చుట్టుపక్కల వెతకగా స్థానికులకు కొండచిలువ కనిపించింది. ఆపై దాన్ని చంపి కోసి చూడగా టిబా మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా చిన్న చిన్న జంతువులను కొండచిలువలు తింటాయని, ఇక్కడ మహిళను(మనిషిని) బలితీసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్లలో ఆరు, ఏడు మీటర్ల పొడవైన కొండచిలువలు ఉంటాయని హమ్కా వివరించారు. -
మేకను చంపిన కొండచిలువ
ధారూరు వికారాబాద్ : ఏకంగా 12 అడుగుల కొండచిలువ... దానిని మనం చూస్తేనే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అది అడవిలో ఓ మేకను పట్టేసింది. కాపరి దానిని గమనించి స్థానికుల సాయం కోరాడు. సగంవరకు మింగేసిన మేకను వెనక్కి లేగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు చేసేది లేక రైతులు గొడ్డళ్లతో కొండచిలువను మధ్యలో నరికివేశారు. కొండచిలువ పొట్టలో ఉన్న మేకను బయటకు లాగారు. అయితే, అప్పటికే మేక చనిపోయింది. ఈ సంఘటన మంగళవారం ధారూరు మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు కట్ట కింద కట్ట మైసమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. -
కారు ఇంజిన్ తెరిస్తే షాక్..12 అడుగుల పాము
-
వైరల్ : ఇంజిన్‌లో 12 అడుగుల కొండచిలువ
బ్యాంకాక్ : ఇటీవల కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపైకే కాకుండా ఇండ్లలోకి, వాహనాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా థాయ్‌లాండ్‌లోని టీ నట్వజిట్ అనే షాప్ ఓనర్ కారులోకి 12 అడుగుల కొండ చిలువ దూరింది. కారు కింది భాగంలో కొండచిలువ తోక వేలాడుతుందని గమనించిన కొందరు అతనికి ఈ విషయం తెలియజేశారు. ఆందోళనకు గురైన నట్వజిట్ తన వాహనం ఇంజన్ డోర్ తెరచి చూసి షాక్ తిన్నాడు. అందులోని కొండచిలువను చూసి ఏం చేయాలో తెలీక వెంటనే ఇంజన్ డోర్‌ను మూసివేశాడు. ఈ సమాచారాన్ని వెంటనే పాములు పట్టే వారికి(రెస్క్యూ టీమ్) తెలియజేశాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సిబ్బంది నెమ్మదిగా కొండచిలువను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కాని అది ఇంజన్ చుట్టూ పెనవేసుకుని ఉండటంతో బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. చివరికి కొండచిలువను క్షేమంగా కారు నుంచి వెలుపలకు తీసి.. పొదల్లో విడిచిపెట్టారు. ఈ కొండచిలువ 12 అడుగుల పొడవు ఉండటంతో అది కారు ఇంజన్లో ఎలా పట్టిందని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నట్వజిట్ కారు నుంచి కొండచిలువను వెలుపలికి తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంత పొడవైన కొండచిలువ తన వాహనంలో ఉన్న గుర్తించలేకపోయానని నట్వజిట్ తెలిపాడు. ఈ ఘటన తనకొక పీడకలలాంటిది అని పేర్కొన్నాడు. రెస్క్యూ టీమ్ సభ్యుడు క్రిప్టల్ మాట్లాడుతూ.. కొండచిలువ 30 కేజీల బరువుందని.. దానిని సురక్షితంగా పొదల్లోకి విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు, వాతావరణ మార్పులు సంభవించినప్పుడు వెచ్చదనం కోసం కొండచిలువలు కార్ల ఇంజన్లలో దూరుతాయని తెలిపాడు. ప్రజలు తమ వాహనాలు నడిపేముందు ఒక్కసారి ఇంజన్‌ను తనిఖీ చేసుకోవాలని సూచించారు. -
చెప్పు తిని దొరికిపోయింది...!!
పెర్త్, ఆస్ట్రేలియా : దాదాపు పది అడుగుల పొడవాటి ఓ కొండ చిలువ (పైథాన్) ఇంట్లోకి ప్రవేశించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన సోమవారం పెర్త్‌లోని మౌంట్ ఒమానెయ్లో చోటుచేసుకుంది. దానిని పట్టుకునేందుకు స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తికి సమాచారమివ్వగా.. అతను వచ్చేసరికే పాము చెట్టు కొమ్మల్లోకి చేరింది. అయితే ఎలాగోలా దాన్ని పట్టుకున్న ఆ వ్యక్తి దాని కడుపులో ఏదో వస్తువుందని గ్రహించి వెటర్నరీ ఆస్పత్రి హెర్ప్ వెట్‌కు తరలించాడు. ఆ పైథాన్‌ను స్కాన్ చేయగా దాని కడుపులో చెప్పు ఉందని తేలింది. సర్జరీ చేసి దాని పొట్టలో నుంచి చెప్పును తొలగించారు. ఆపరేషన్ జరిగిన తీరును వీడియో తీసి వైద్యుడు జాన్ లీనాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కావాలంటే మీరూ చూడొచ్చు.