
ముంబై: దారి తప్పి రోడ్డు మీదకు వచ్చిన కొండచిలువ ముంబైలో కలకలం రేపింది. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే గుండా వెళ్తున్న కారు టైర్లకు చుట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు కారును పక్కకి పార్క్ చేయించారు. రెస్క్యూ వర్కర్లకు సమాచారమివ్వగా.. వారు సురక్షితంగా దానిని బయటకు తీసి అడవిలో విడిచిపెట్టారు.
ఇక సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సినీ సెలబ్రిటీ వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేయగా మూడు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ క్రమంలో.. ‘‘ఓ మైగాడ్.. కారును రివర్స్ చేయాల్సింది’’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం.. ‘‘ఇంకా లాక్‌డౌన్ అమల్లోనే ఉందనుకుందేమో. పాపం అందుకే రోడ్డు మీదకు వచ్చింది’’అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.(చదవండి: ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!)
Comments
Please login to add a commentAdd a comment