వీధుల్లో చిరు వ్యాపారాలంటే చాలా మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి సంపాదన తెలిస్తే అవాక్కవాల్సిందే. వడ పావ్ అమ్మడం ద్వారా ముంబై వీధి వ్యాపారి ఎంత సంపాదిస్తున్నారో చూపిస్తూ ఓ వ్లాగర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజనులు నోరెళ్లబెడుతున్నారు.
ముంబైలో వీధి వ్యాపారుల సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో చూపించడానికి సార్థక్ సచ్‌దేవా అనే ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ స్థానికంగా ఉన్న ఓ వడ పావ్ బండి వద్ద రోజంతా గడిపారు. ఆ రోజంతా ఎన్ని ఎంత వ్యాపారం జరిగిందో వివరిస్తూ వీడియో చేశారు.
వ్యాపారం ఎలా నిర్వహిస్తారో తెలుసుకుంటూ వీడియోను మొదలుపెట్టిన సచ్‌దేవా.. ఇంకా మధ్యాహ్నం కూడా కాకుండానే సుమారు 200 వడ పావ్‌లను విక్రయించినట్లు చెప్పుకొచ్చారు. ఇదే ఊపుతో సాయంత్రానికి మొత్తం 622 వడ పావ్‌లు అమ్ముడయ్యాయి. ఒక్కో వడ పావ్‌కు రూ.15. అంటే రోజు ఆదాయం రూ.9,300కు చేరింది. ఇది పూర్తి నెలకు లెక్కిస్తే రూ. 2.8 లక్షలు. ఖర్చులు తీసేస్తే దాదాపు రూ. 2 లక్షలు. సంవత్సరానికి రూ. 24 లక్షలు.
ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ అబ్బాయి.. నేడు బిలియనీర్ కుర్రాడు
సచ్‌దేవా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది. యూజర్లు కామెంట్లు కురిపించారు. “ఆహార బండిని పెట్టే సమయం వచ్చేసింది!” అని ఒకరు, "ఇది లొకేషన్ పవర్ " అంటూ మరొకరు.. ఇలా ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment