వీధి విక్రయదారులకు ప్రత్యేక గుర్తింపు!
• పట్టణాల్లో 3 రకాల జోన్ల ఏర్పాటు
• ప్రకటిత జోన్లలోనే వ్యాపారానికి అనుమతులు
• లైసెన్స్‌లు, గుర్తింపుకార్డులు
• జారీ చేయనున్న మున్సిపల్ అధికారులు
• పదిమంది సభ్యులతో పొదుపుసంఘం ఏర్పాటు
• సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాలిచ్చి ప్రోత్సాహం
• సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారుల ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ
పట్టణాల్లో చిరువ్యాపారం చేసుకుంటూ కాలం గడుపుతున్న వీధి విక్రయదారులకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మున్సిపల్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. అధికారులు ప్రధానంగా పట్టణాలలోని వీధి విక్రయదారులను గుర్తించడంతోపాటు వ్యాపారం చేసుకునేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయడం, లైసెన్స్‌లు జారీ చేయడం..
సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలను అందజేసి ప్రోత్సహించనున్నారు. మహబూబ్‌నగర్, బాదేపల్లి, నారాయణపేట మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బంది ఇప్పటికే సర్వే పూర్తి చేసి 1784 మంది వీధి విక్రయదారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వే రిపోర్టు ఆధారంగా బాదేపల్లి మున్సిపాలిటీ పరిధిలో 311 మంది, మహబూబ్‌నగర్‌లో 1191 మంది, నారాయణ పోటలో 282 మంది వీధి విక్రయదారులు ఉన్నట్లు తేలింది. ఇలా ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వే నిర్వహించనున్నారు.
లైసెన్స్‌లు జారీ
మెప్మా సిబ్బంది నిర్వహించిన సర్వే ఆధారంగా గుర్తించిన వీధి విక్రయదారులకు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు త్వరలో లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. వీరికి వ్యాపారాలు సాగించేందుకు స్థలాలను కేటాయించనున్నారు. లైసెన్సులు కలిగిన వారు ఇకనుంచి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వ్యాపారాలు సాగించే అవకాశం ఉంటుంది.
సంఘాల ఏర్పాటుకు కసరత్తు
జిల్లాలోని పురపాలికల్లో ఇప్పటికే గుర్తించిన వీధి విక్రయదారులతో సంఘాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరికి గుర్తింపుకార్డులు అందజేస్తారు. ప్రతి 10మంది విక్రయదారులతో ఒక పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 170కి పైగా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఇçప్పటికే మహబూబ్‌నగర్‌లో 15పొదుపు సంఘాలను అధికారులు ఏర్పాటు చేయడంతోపాటు పట్టణ వీ«ధి విక్రయదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇలా మూడు మున్సిపాలిటీల పరిధిలో మార్చి నెలాఖరు వరకు సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. వీటిలో నమోదైన సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాలు పొందే అవకాశాన్ని కల్పించనున్నారు.