ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ విఠల్ ఆచ్రేకర్ 92వ జయంతిని ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పార్క్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ‘గురు’ ఆచ్రేకర్ మొమోరియల్‌ను సచిన్ ఆవిష్కరించారు.
స్నేహితుడితో కరచాలనం
ఇక ఈ కార్యక్రమంలో సచిన్ చిన్ననాటి స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా పాల్గొన్నాడు. అయితే, సచిన్ కంటే ముందే కాంబ్లీ వేదిక మీదకు చేరుకోగా.. సచిన్ వస్తూ వస్తూ తన స్నేహితుడితో కరచాలనం చేశాడు.
చేయి వదిలేందుకు ఇష్టపడని కాంబ్లీ
అయితే, కాంబ్లీ మాత్రం సచిన్ చేతిని వదలకుండా గట్టిగా అలాగే పట్టుకున్నాడు. దీంతో పక్కనున్న వ్యక్తి కాంబ్లీ నుంచి అతడి చేతిని విడిచిపించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత సచిన్ తన కుర్చీ వద్దకు వెళ్లి కూర్చోగా.. కాంబ్లీ స్నేహితుడి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాంబ్లీపై నెటిజన్ల సానుభూతి.. ఈ పరిస్థితికి కారణం ఎవరు?
ఈ నేపథ్యంలో వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్ నాశనం చేసుకుని.. ఇలాంటి దుస్థితికి చేరుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందు వల్లే అతడి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిందన్న కాంబ్లీ సన్నిహిత వర్గాల మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాగా కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
కాగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 1993- 2000 మధ్య వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. ఇక దేశీ టోర్నీలో 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు కాంబ్లీ.
ఇదిలా ఉంటే.. 2013లో వినోద్ కాంబ్లీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటు రాగా.. ఓ పోలీస్ అధికారి గమనించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
సెంచరీ సెంచరీల వీరుడిగా సచిన్
మరోవైపు.. సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్‌కు మారుపేరుగా ఎదిగాడు. టీమిండియా తరఫున 664 మ్యాచ్‌లు ఆడి 34357 పరుగులు సాధించాడు. ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్‌గా సచిన్ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.
అంతేకాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా సచినే. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారత రత్న’తో సత్కరించింది. ఇక సచిన్, కాంబ్లీ ఇద్దరూ ఆచ్రేకర్(1932- 2019) శిష్యులే కావడం గమనార్హం.
చదవండి: WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ
#WATCH | Maharashtra: Former Indian Cricketer Sachin Tendulkar met former cricketer Vinod Kambli during an event in Mumbai.
(Source: Shivaji Park Gymkhana/ANI) pic.twitter.com/JiyBk5HMTB— ANI (@ANI) December 3, 2024
Comments
Please login to add a commentAdd a comment