Vinod Kambli
-
నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. సాయం కావాలి: వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మద్యం సేవించడం, పొగ తాగే అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందన్నాడు. అయితే, ఆరు నెలల క్రితమే ఈ చెడు వ్యసనాలను వదిలేశానని.. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా.. భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బృందం తనకు ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు కాంబ్లీ పేర్కొన్నాడు.పాతాళానికి పడిపోయాడుముంబై తరఫున టీమిండియాలో అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ.. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండుల్కర్‌కు బాల్య మిత్రుడు. సచిన్ అంతటి స్థాయికి ఎదిగే నైపుణ్యాలున్నా.. వ్యక్తిగత క్రమశిక్షణ లోపించిన కారణంగా కాంబ్లీ పాతాళానికి పడిపోయాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తుంటారు. ఇటీవల తమ ‘గురు’, ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92 జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి వినోద్ కాంబ్లీ వేదికను పంచుకున్నాడు.సాయం చేస్తాం.. కానీ ఓ షరతుఆ సమయంలో కాంబ్లీ ఆరోగ్య, మానసిక పరిస్థితిని చూసిన అభిమానులు చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం కారణంగా కుంగిపోయిన అతడి దుస్థితికి చింతించారు. ఈ నేపథ్యంలో 1983 ప్రపంచకప్ విజేత, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత ఆటగాళ్లు కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.అయితే, కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకునేందుకు సిద్ధంగా ఉంటేనే.. సాయం చేస్తామనే షరతు విధించారు. ఈ నేపథ్యంలో విక్కీ లల్వానీ యూట్యూబ్ చానెల్‌తో ముచ్చటించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ దేవ్ కండిషన్‌కు తాను ఒప్పుకొంటున్నట్లు తెలిపాడు.నా కుటుంబం నాతో ఉంది‘‘రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం నాతో ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. తొలుత సునిల్ గావస్కర్ నాతో మాట్లాడారు. ఇక అజయ్ జడేజా కూడా నాకు మంచి స్నేహితుడు.అతడు నా దగ్గరికి వచ్చాడు. నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. బీసీసీఐ నాకు సహాయం చేస్తుందని తెలుసు. మాజీ పేసర్ అభయ్ కురువిల్లా నాతో పాటు నా భార్యతోనూ టచ్‌లో ఉన్నాడు.నిజానికి నా పరిస్థితి అస్సలు బాగా లేదు. అయినప్పటికీ నా భార్య అన్నింటినీ చక్కగా హ్యాండిల్ చేస్తోంది. ఆమెకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నాకిప్పుడు ఎలాంటి భేషజాలు లేవు. ధైర్యంగా రిహాబ్ సెంటర్‌కు వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.ఇప్పుడు అన్నీ వదిలేశానుఆరు నెలల క్రితమే మద్యం, పొగ తాగటం మానేశాను. నా పిల్లల బాగుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. గతంలో నాకు చెడు అలవాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను’’ అని వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో భార్య ఆండ్రియా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం వాళ్లు సఖ్యతగా ఉంటున్నట్లు కాంబ్లీ మాటలను బట్టి తెలుస్తోంది.తొమ్మిదేళ్ల కెరీర్లోఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ.. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న భారత క్రికెటర్‌గా ఇప్పటికీ కాంబ్లీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు.చదవండి: D Gukesh Prize Money: గుకేశ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే? -
కాంబ్లీ తన ఆరోగ్యంపై బాధ్యతతో ఉండాలి: కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్, ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ సాయానికి ఎందరు ముందుకొచ్చినా... వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం పట్ల తనే శ్రద్ధ చూపెట్టాలని సూచించాడు. 52 ఏళ్ల కాంబ్లీ గతితప్పిన జీవనశైలితో పాటు మద్యానికి బానిసై తీవ్ర ఆనారోగ్యం పాలయ్యాడు.కోచింగ్ లెజెండ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకార్థం ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో కాంబ్లీ ఓ పేషంట్లా కనిపించడంతో విచారం వ్యక్తం చేసిన భారత మాజీలు, దిగ్గజాలు అతని పరిస్థితి మెరుగయ్యేందుకు తమవంతు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు.ఆ కార్యక్రమంలో సచిన్ కూడా పాల్గొని కాంబ్లీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ (1983లో) అందించిన కపిల్ దేవ్ కూడా తాజాగా కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై విచారం వెలిబుచ్చారు. ‘మేమంతా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికంటే ముఖ్యం తను కూడా తన ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లుగా నడుచుకోవాలి. తిరిగి ఆరోగ్యవంతుడయ్యేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి తనను తాను చూసుకోలేకపోతే మనం మాత్రం చేయగలిగేదేమీ ఉండదు’ అని అన్నారు.కాంబ్లీ సహచరులే కాదు... అతని సీనియర్లు, పలువురు దిగ్గజ క్రికెటర్లు అతని దీన పరిస్థితి చూసి బాధపడుతున్నారని, అతని సన్నిహితులెవరైనా బాధ్యత తీసుకొని అతను మెరుగయ్యేందుకు చొరవ చూపించాలని, రిహాబిలిటేషన్‌కు పంపి యోగక్షేమాలు చూసుకోవాలని కపిల్ సూచించారు.సచిన్ బాల్యమిత్రుడు, క్రికెట్లో సమకాలికుడు అయిన కాంబ్లీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న సంగతి మరిచి క్రమశిక్షణ లేని జీవితంతో క్రీడా భవిష్యత్తునే కాదు... తాజాగా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు.తన కెరీర్లో 104 వన్డేలాడి 2477 పరుగులు, 17 టెస్టుల్లో 1084 పరుగులు చేశాడు. కెరీర్ ముగిశాక గాడితప్పిన జీవితం వల్ల 39 ఏళ్ల వయసులోనే అతని గుండెకు 2012లోనే శస్త్రచికిత్స జరిగింది. అయినాసరే కాంబ్లీ ఏమాత్రం మారకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.చదవండి: సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత -
నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?
ఒకప్పుడు మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన స్టార్ ఆటగాడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు మంచి ఫిటెనెస్‌తో చలాకీగా ఉండే కాంబ్లీ పలు అనారోగ్య సమస్యలతో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. దిగ్గజ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి కాంబ్లీ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం కారణంగానే కాంబ్లీ పరిస్థితి గురించి ప్రపంచానికి తెలిసింది. అతడి స్థితిని చూసి అభిమానులంతా కాంబ్లీకి ఏమైందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా కాంబ్లీ తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటానికి దారితీసిన కారణాలు, అలాగే ఒకప్పుడు ఫిట్‌గా ఉండే వ్యక్తిని డిప్రెషన్ ఇంతలా కుంగదీసి అనారోగ్యం పాలు చేస్తుందా అంటే..వినోద్ కాంబ్లీ ఇలా తీవ్రమైన అనారోగ్య స్థితిలో కనిపించటం తొలిసారి కాదు. గతంలో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి. 2013లో ముంబైలో డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటుకి గురయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నాడు. ఆయన 2012లో రెండు ధమనులలో అడ్డంకులను తొలగించుకునేందుకు యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా కోలుకోలేదని కాంబ్లీ అంతరంగికులు చెబుతున్నారు. ఎందుకంటే..ఒక్కసారి గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స లేదా కొద్దిపాటి వేరే చికిత్సలు తీసుకున్నప్పుడు సమతుల్యమైన జీవనశైలిని పాటించక తప్పదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. పలు అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. డిప్రెషన్..దీనికి తోడు కాంబ్లీ తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పలు ఇంటర్వూల్లో వెల్లడించారు. సచిన్ సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నట్లు కాంబ్లీ సన్నిహిత వర్గాలు చెబుతుంటారు. కెరీర్ ఫెయిల్యూర్ తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లాడు. దీంతో వినోద్ కాంబ్లీ మద్యానికి బానిసైనట్లు తెలుస్తుంది. తాగుడు మానేయాలని చాలాసార్లు ప్రయత్నించాడని, అందుకోసం డీ అడిక్షన్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కూడా ఆయన మద్యం తాగడం మానలేదని తెలుస్తుంది. ఇక్కడ డిప్రెషన్ ఎంతటి ఫిట్నెస్తో ఉన్న వ్యక్తిని అయినా అమాంతం కుంగదీసీ చేతకాని వాడిలా కూర్చొబెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాగే మద్యం అడిక్షన్..ఇది కూడా మనిషిని పదిమంది ముందు సగౌరవంగా బతకనివ్వకుండా చేసే అతి భయనాక మహమ్మారి. దీని ముందు ఎంతటి మహమహులైనా.. నిలవలేరు. దీనికి బానిసై జీవితాలని నాశనం చేసుకున్న వారెందరో ఉన్నారు. ఇక్కడ కాంబ్లీ పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ కాంబ్లీ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంతో ఉండాలని దాదాపు 14సార్లు పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లినట్లు అతడి స్నేహితుడు అంపైర్ కుటో తెలిపారు. అంటే కాంబ్లీ ఎంతటి పరిస్థితిలో ఉన్నాడో స్పష్టమవుతోంది. ఇక్కడ ఏ మనిషి అయినా తనకు తాను బాగుండాలని గట్టిగా అనుకుంటేనే.. ఎవ్వరూ సాయం అందించినా సఫలం అవుతుంది. సగం ఆరోగ్యం నయమవ్వడానికి ఆయా వ్యక్తుల సంకల్ప బలమే ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదురయ్యే ఉద్దాన పతనాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. దేన్నైనా సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవరుచుకోండి. "దేన్ని కోల్పోయినా, మనిషి గమ్యం ఆగకూడదనేది గుర్తించుకుండి. కడ వరకు పూర్తి ఆరోగ్యంతో ఒకరి ఆసరా లేకుండా జీవనం సాగించడమే అత్యంత అదృష్టమని భావించండి. ఇలాంటి దృకప్పథం అలవాటు చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారినపడరు". అని చెబుతున్నారు మానసిక నిపుణులు. दोस्ती किसे कहते हैं, और इसके मायने क्या होते हैं…इस सचिन-कांबली के 20 सेकंड के वीडियो को देख कर समझ सकते हैं..#SachinTendulkar #VinodKambli pic.twitter.com/WqsYoHzQ3x— Dr Ajeet Hindu (@AjitSin0001) December 3, 2024 -
కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!
ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపళ్లాలు సహజం. వెలుగు వెంటే చీకటి.. సుఖం వెంటే దుఃఖం.. ఇలా ఒకదాని వెనుక మరొకటి రావడం సహజం. కానీ కొందరి జీవితంలో అంతా బాగుందనుకునేలోపే.. మొత్తం తలకిందులైపోతుంది. దర్జాగా కాలుమీద కాలు వేసుకుని బతికినవాళ్లు సైతం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకుంటారు. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుత స్థితి ఇందుకు నిదర్శనం.ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వచ్చిన మేటి ఆటగాళ్లలో కాంబ్లీ ఒకడు. భారత క్రికెట్ దిగ్గజం అంటూ నీరజనాలు అందుకుంటున్న సచిన్ టెండుల్కర్‌కు బాల్య స్నేహితుడు. రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్న వీళ్లిద్దరిలో ఒకరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే.. మరొకరు అగాథంలో కూరుకుపోయారు. ఇందుకు కారణాలు అనేకం.ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా!కాంబ్లీ కెరీర్ ఊపుమీద ఉన్నపుడు అతడి పరిస్థితి బాగానే ఉండేది. అప్పట్లో అతడి నికర ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల వరకు ఉండేదని జాతీయ మీడియా వర్గాల అంచనా. అయితే, ఇప్పుడు మాత్రం కాంబ్లీ దీనస్థితిలో కూరుకుపోయాడు. 2022 నుంచి పరిస్థితి మరీ దిగజారింది. ఇందుకు కాంబ్లీ క్రమశిక్షణా రాహిత్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి.ఏదేమైనా.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే నెలవారీ పెన్షన్ రూ. 30 వేలతో కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్‌తో కలిసి కాంబ్లీ ఒకే వేదికపై కనిపించిన తర్వాత.. మరోసారి అతడి గురించి చర్చ మొదలైంది.ముఖ్యంగా కాంబ్లీ ఆరోగ్య స్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడికి సాయం అందించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసన్ బల్విందర్ సంధు చేసిన వ్యాఖ్యలు వారికి ఊరటనిచ్చాయి.కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు 83 బ్యాచ్ సిద్ధంగా ఉందని బల్విందర్ తెలిపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లాలని భావిస్తే తప్పకుండా సాయం చేద్దామని కపిల్ దేవ్(1983 వరల్డ్‌కప్ విజేత జట్టు కెప్టెన్) నాతో చెప్పాడు. ఆర్థికంగానూ సాయం అందిద్దామన్నాడు.అయితే, అతడు రిహాబ్ సెంటర్‌కు వెళ్లినపుడు మాత్రమే అక్కడి బిల్లులు చెల్లిస్తామని.. చికిత్స పూర్తయ్యేంత వరకు ఖర్చులన్నీ భరిస్తామని చెప్పాడు. ఒకవేళ కాంబ్లీ అందుకు సిద్ధంగా లేకపోతే మేమేమీ చేయలేము’’ అని బల్విందర్ సంధు పేర్కొన్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
Vinod Kambli: కాంబ్లీకి ఏమైంది..?
-
వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి
ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ విఠల్ ఆచ్రేకర్ 92వ జయంతిని ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పార్క్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ‘గురు’ ఆచ్రేకర్ మొమోరియల్‌ను సచిన్ ఆవిష్కరించారు.స్నేహితుడితో కరచాలనంఇక ఈ కార్యక్రమంలో సచిన్ చిన్ననాటి స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా పాల్గొన్నాడు. అయితే, సచిన్ కంటే ముందే కాంబ్లీ వేదిక మీదకు చేరుకోగా.. సచిన్ వస్తూ వస్తూ తన స్నేహితుడితో కరచాలనం చేశాడు.చేయి వదిలేందుకు ఇష్టపడని కాంబ్లీఅయితే, కాంబ్లీ మాత్రం సచిన్ చేతిని వదలకుండా గట్టిగా అలాగే పట్టుకున్నాడు. దీంతో పక్కనున్న వ్యక్తి కాంబ్లీ నుంచి అతడి చేతిని విడిచిపించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత సచిన్ తన కుర్చీ వద్దకు వెళ్లి కూర్చోగా.. కాంబ్లీ స్నేహితుడి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాంబ్లీపై నెటిజన్ల సానుభూతి.. ఈ పరిస్థితికి కారణం ఎవరు?ఈ నేపథ్యంలో వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్ నాశనం చేసుకుని.. ఇలాంటి దుస్థితికి చేరుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందు వల్లే అతడి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిందన్న కాంబ్లీ సన్నిహిత వర్గాల మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాగా కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.కాగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 1993- 2000 మధ్య వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. ఇక దేశీ టోర్నీలో 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు కాంబ్లీ.ఇదిలా ఉంటే.. 2013లో వినోద్ కాంబ్లీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటు రాగా.. ఓ పోలీస్ అధికారి గమనించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.సెంచరీ సెంచరీల వీరుడిగా సచిన్మరోవైపు.. సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్‌కు మారుపేరుగా ఎదిగాడు. టీమిండియా తరఫున 664 మ్యాచ్‌లు ఆడి 34357 పరుగులు సాధించాడు. ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్‌గా సచిన్ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. అంతేకాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా సచినే. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారత రత్న’తో సత్కరించింది. ఇక సచిన్, కాంబ్లీ ఇద్దరూ ఆచ్రేకర్(1932- 2019) శిష్యులే కావడం గమనార్హం.చదవండి: WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ #WATCH | Maharashtra: Former Indian Cricketer Sachin Tendulkar met former cricketer Vinod Kambli during an event in Mumbai.(Source: Shivaji Park Gymkhana/ANI) pic.twitter.com/JiyBk5HMTB— ANI (@ANI) December 3, 2024 -
తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ అందించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందని తెలిపాడు. కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు చిన్ననాటి స్నేహితుడన్న విషయం తెలిసిందే.వీరిద్దరు కలిసి దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. టీమిండియాకు కూడా కలిసే ఆడారు. అయితే, సచిన్ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకుని భారత క్రికెట్ ఐకాన్‌గా మారగా.. వినోద్ కాంబ్లీ మాత్రం అనతికాలంలోనే కనుమరుగైపోయాడు. కెరీర్పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.ఈ క్రమంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు అతడిని చుట్టుముట్టాయి. ఇందుకు అతడి క్రమశిక్షణరాహిత్యమే కారణమని వినోద్ కాంబ్లీ సన్నిహిత వర్గాలు గతంలో వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో.. నడవడానికి కూడా శక్తి లేని కాంబ్లీ.. ఇతరుల ఆసరాతో ఓ షాపులోకి వెళ్లినట్లు కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు.. ఈ మాజీ క్రికెటర్‌కు సహాయం అందించాలంటూ సచిన్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశారు. అయితే, అది పాత వీడియో అని తాజాగా తేలింది. ఈ వీడియో చూసిన తర్వాత.. తాము వినోద్ కాంబ్లీ ఇంటికి వెళ్లామని.. అతడి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని అతడి స్కూల్‌మేట్ రిక్కీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అంపైర్ మార్కస్ తెలిపారు. నేనింకా ఫిట్‌గానే ఉన్నానుఈ క్రమంలో వినోద్ కాంబ్లీ సైతం.. ‘‘దేవుడి దయ వల్ల నేనింకా ఫిట్‌గానే ఉన్నాను. ఇప్పటికీ మైదానంలో దిగి బ్యాటింగ్ చేయగల సత్తా నాకు ఉంది’’ అని నవ్వుతూ థంబ్స్‌అప్ సింబల్ చూపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, బక్కచిక్కినట్లు కనిపిస్తున్న వినోద్ కాంబ్లీని చూసి అతడి అభిమానులు ఉద్వేగానికి లోనవుతున్నారు. అతడికి వైద్య సహాయం అవసరముందని తెలిసిపోతుందని.. దయచేసి తనను ఆదుకోవాలని మరోసారి సచిన్ టెండుల్కర్‌కు మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా 1993- 2000 మధ్య కాలంలో వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 పరుగులు సాధించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.ఇక 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున చివరి వన్డే ఆడిన వినోద్ కాంబ్లీ.. 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు. కాగా 2013లో వినోద్ కాంబ్లీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ మరుసటి ఏడాదే ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో కాంబ్లీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైనట్లు తెలుస్తోంది.@sachin_rt : plz watch #VinodKambli. Really looks in a bad shape and is in need of urgent medical help. I know you have done a lot for him but i will request you to keep your grievances aside and take up his guardianship till he gets better. Thanks 🙏pic.twitter.com/a4CbGNNhIB— Rahul Ekbote ☝️ (@rekbote01) August 9, 2024 -
నడవలేని స్థితిలో టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దీనస్థితిలో ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడు.. కనీసం తనకు తానుగా నడవలేకపోతున్నాడు. అడుగులు తడబడి కిందపడే సమయంలో పొరుగున ఉన్న వ్యక్తులు ఆసరా అందించడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ముంబై క్రికెటర్ వినోద్ కాంబ్లీ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు సహచర ఆటగాడు. సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా కాంబ్లీకి కాలం కలిసిరాలేదు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందు వల్లే అతడి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిందని కాంబ్లీ సన్నిహిత వర్గాలు సైతం గతంలో వెల్లడించాయి.ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా చిక్కుల్లో పడ్డ వినోద్ కాంబ్లీ ఇంకా కోలుకోలేదని తాజా వీడియో ద్వారా స్పష్టమవుతోంది. నరేంద్ర గుప్తా అనే ఇన్స్టాగ్రామ్ ఈ దృశ్యాలను షేర్ చేశాడు. ‘‘మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్యోగం ఏమాత్రం బాలేదు. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో తాను బాధపడుతున్నట్లు వినోద్ కాంబ్లీ చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నాడు. అనారోగ్యం వల్ల ఎన్నోసార్లు ఆస్పత్రిబారిన పడ్డాడు వినోద్.హృదయ సంబంధిత వ్యాధులతో పాటు డిప్రెషన్‌తో అతడు బాధపడుతున్నాడు. త్వరలోనే అతడు కోలుకోవాలని.. అవసరమైన సాయం అతడి అందాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర గుప్తా పేర్కొన్నాడు. టీమిండియా తరఫున 1993- 2000 మధ్య వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 పరుగులు సాధించాడు. 2000 సంవత్సరంలో భారత్ తరఫున చివరి వన్డే ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు.ఇక నాటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 92 పరుగులు సాధించాడు. కాగా 2013లో వినోద్ కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. చెంబూరు నుంచి కారులో వెళ్తున్న సమయంలో హార్ట్ అటాక్ రాగా.. ఓ పోలీస్ అధికారి గమనించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ మరుసటి ఏడాదే ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆర్థికంగా చితికిపోయినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Narendra Gupta (@narendra.g333) -
Yashasvi Jaiswal: సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును (ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు, 656) బద్దలు కొట్టిన యశస్వి.. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండింది. సచిన్.. ఆసీస్‌పై 74 ఇన్నింగ్స్‌ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్‌పై కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు. ఈ రికార్డుతో పాటు యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ బాది టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి.. టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి 1000 పరుగుల మార్కును తాకేందుకు 16 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. వినోద్ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన సచ్‌క్లిఫ్ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితా.. సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌పై 774 పరుగులు సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్‌పై 732 పరుగులు యశస్వి జైస్వాల్ 2024లో ఇంగ్లండ్‌పై 712 పరుగులు విరాట్ కోహ్లి 2014/15లో ఆస్ట్రేలియాపై 692 పరుగులు డబ్యూటీసీ 2023-25 సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు జైస్వాల్ -
సచిన్, వినోద్ కాంబ్లేల స్నేహం.. సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్
వైవిద్య భరిత ప్రేమ కథా చిత్రాలతో పాటు యాక్షన్‌తో కూడిన కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ దిట్ట. కోలివుడ్లో మిన్నలే చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తాజాగా శింబు కథానాయకుడిగా నటించిన వెందు తనిందదు కాడు చిత్రం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధ్రువనక్షత్రం చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని సుదీర్ఘకాలం తర్వాత ఈనెల 24వ తేదీన తెరపైకి రానుంది. అయినప్పటికీ ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఇందులో రాధికా శరత్‌కుమార్, సిమ్రాన్, నటుడు పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా బుధవారం ఇండియా, న్యూజిలాండ్ మధ్య సాగిన ప్రపంచ క్రికెట్ కప్ సెమీఫైనల్స్ పోటీని విశ్లేషించే విధంగా ఒక టీవీ చానల్ కార్యక్రమంలో గౌతమ్ మీనన్ పాల్గొన్నారు. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ అడిగిన పలు ప్రశ్నలకు గౌతమ్‌మీనన్ బదులిచ్చారు. ఈ సందర్భంగా క్రికెట్ నేపథ్యంలో చిత్రం చేస్తారా..? అన్న ఆర్జే బాలాజీ ప్రశ్నకు గౌతమ్ మీనన్ బదులిస్తూ ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నానని, అందుకు కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లేల మధ్య స్నేహం ఇతివృత్తంగా ఈ చిత్ర కథ ఉంటుందన్నారు. వారు క్రికెట్ క్రీడాకారులుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎలా చేరుకున్నారు అనే పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్ర కథ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో నటించే హీరోలు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా!
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులోనూ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్ కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇది అతడికి నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. బ్రూక్ ప్రస్తుతం డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అతడు 169 బంతుల్లో 184 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. బ్రూక్ ఇన్నింగ్స్‌లో 5 సిక్స్‌లు, 24 ఫోర్లు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 100.8 సగటుతో 807 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండడం విశేషం. ఈ క్రమంలో ఓ అరుదైన ఘతనను బ్రూక్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో అతడు 807 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(798పరుగులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కాంబ్లీ రికార్డు బ్రేక్‌చేశాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు నష్టపోయి 315 పరుగులు చేసింది. క్రీజులో రూట్(101),బ్రూక్ (184) పరుగులతో ఉన్నారు. చదవండి: T20 WC: అప్పుడు ధోని.. ఇప్పుడు హర్మన్! దురదృష్టం అంటే టీమిండియాదే? -
భార్యకు చిత్రహింసలు.. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు
నిత్యం వివాదాల్లో నిలిచే టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ ఆమెపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కాంబ్లీని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంబ్లీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము కాంబ్లీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే.. ప్రస్తుతం వినోద్ కాంబ్లీ తన భార్య ఆండ్రియా, కుమారుడితో కలిసి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు. శుక్రవారం ఇంట్లోనే మద్యం తాగిన మత్తులో భార్య ఆండ్రియాతో గొడవపడ్డాడు. ఆ తర్వాత మద్యం మత్తులో పాన్ హ్యాండిల్‌తో తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఆండ్రియా తెలిపింది. ఈ క్రమంలో తలకు బలమైన గాయం అయిందని ఆరోపించింది. ఆండ్రియా ఇచ్చిన సమాచారం మేరకు నివాసానికి చేరుకున్న పోలీసులు వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకొని అతని భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు అయితే 51 ఏళ్ల కాంబ్లీకి వివాదాలు కొత్తేం కావు. గతేడాది ఫిబ్రవరిలో తను నివాసముండే హౌసింగ్ సొసైటీలో గొడవ కారణంగా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం కాంబ్లీ మద్యం తాగి వాహనం నడిపి కారును ఢీకొట్టడంతో మారోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఇటీవలి కాలంలో ఆయన ఒక స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశాడు. తనకు సంపాదన లేదని, కేవలం బీసీసీఐ ఇస్తున్న పెన్షన్ పైనే ఆధారపడి జీవించాల్సి వస్తుందని తెలిపాడు. 1991లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్‌కు మంచి సన్నిహితుడు. అయితే అతని వ్యక్తిగత ప్రవర్తనతో జట్టులో చోటు కోల్పోయాడు. టీమిండియా తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. చదవండి: 'తెల్లబంతి పని పట్టా.. ఎరుపు బంతి కోసం వెయిటింగ్' 'ప్రైవసీకి భంగం'.. ఫోటోలు లీకవడంపై ఆగ్రహం -
30 ఫోర్లు, 38 సిక్సర్లతో 401 పరుగులు చేసిన యంగ్ క్రికెటర్
Tanmay Singh: 13 ఏళ్ల కుర్రాడు తన్మయ్ సింగ్.. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న అండర్-14 క్లబ్ క్రికెట్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు. ర్యాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన తన్మయ్.. 132 బంతుల్లో 30 ఫోర్లు, 38 సిక్సర్ల సాయంతో క్వాడ్రాపుల్ సెంచరీ (401) సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లను గుర్తు చేసిన తన్మయ్.. భవిష్యత్తులో టీమిండియా తరఫున ఆడేందుకు గట్టి పునాది వేసుకున్నాడు. సచిన్ (326), కాంబ్లీ (349) అండర్-14 క్రికెట్ ఆడే సమయంలో శారదాశ్రమ్ విద్యామందిర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రికార్డు స్థాయిలో 646 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. హ్యారీస్ షీల్డ్ టోర్నీలో సర్ఫరాజ్ ఖాన్ (439), పృథ్వీ షా (546) రికార్డు స్థాయి స్కోర్లు నమోదు చేశారు. तुफान धुलाई! १३ वर्षांच्या मुलाने ठोकले ३८ षटकार अन् ३० चौकार, पाडला धावांचा पाऊस#tanmay #Cricket https://t.co/ioiCVINd3X — Lokmat (@lokmat) December 19, 2022 ఈ భారీ ఇన్నింగ్స్‌ల ద్వారానే ఈ నలుగురు ముంబైకర్లు వెలుగులోకి వచ్చి ఆ తర్వాతి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలను దక్కించుకున్నారు. తన్మయ్ కూడా చిన్న వయసులోనే భారీ ఇన్నింగ్స్ ఆడి సచిన్, కాంబ్లీ, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా తరహాలో టీమిండియాకు ఆడే అవకాశాలను దక్కించుకుంటాడని ఈ ఇన్నింగ్స్ గురించి తెలిసిన అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, తన్మయ్‌తో పాటు రుద్ర బిదురి (135 నాటౌట్; 5 ఫోర్లు, 15 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడటంతో వారు ప్రాతినిధ్యం వహించిన దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్ 656 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ర్యాన్ అకాడమీ 193 పరుగులకే చాపచుట్టేయడంతో దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్ 463 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తన్మయ్ సాధించిన 401 పరుగుల్లో 226 పరుగులు సిక్సర్ల రూపంలో, 120 పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. తన్మయ్ భారీ ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ కుర్రాడు టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
Vinod Kambli: సచిన్ సహచరుడు వినోద్ కాంబ్లీకి లక్ష జీతంతో జాబ్ ఆఫర్
సచిన్ టెండూల్కర్ సహచరుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కొద్ది రోజుల క్రితం ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)కు ఏదైనా పని కల్పించాలని అభ్యర్థన చేశాడు. ప్రస్తుతం తనకు బీసీసీఐ ఇచ్చే రూ.30వేల పెన్షన్ మాత్రమే ఆధారమని ఆ సమయంలో వెల్లడించాడు. అయితే ఎంసీఏ దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక వ్యాపారవేత్త సహ్యాద్రి ఇండస్ట్రీ గ్రూప్‌లోని ఫైనాన్స్ విభాగంలో వినోద్ కాంబ్లీకి నెలకు రూ.1లక్ష జీతంతో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే కాంబ్లీ ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా, లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది. కాగా, దేశవాళీ క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాంబ్లీ.. అంతర్జాతీయ క్రికెట్లో రాణించడంలో విఫలమయ్యాడు. టీమిండియాకు 17 టెస్టులు, 104 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. కాంబ్లీ 2000లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే చాలా కాలం తర్వాత 2011లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం క్రికెట్ కామెంటర్‌గా మారాడు. అనేక మీడియా ఛానల్లలో పనిచేశారు. కాంబ్లీ కష్టాల్లో ఉన్నప్పుడు సచిన్ ఎన్నో విధాలుగా సాయపడ్డారు. అయితే, కొద్దిరోజుల క్రితం వరకు తన సహచరుడు సచిన్ టెండూల్కర్ ఏర్పాటు చేసిన అకాడమీలో కోచ్‌గా పనిచేసినా, ప్రయాణం చాలా దూరం కావడంతో అక్కడ ఉద్యోగం మానేసినట్లు కాంబ్లీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఉద్యోగం కల్పించాలని ఎంసీఏను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చదవండి: (ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. సచిన్ సహచరుడు వినోద్ కాంబ్లీ దీనావస్థ..!) -
ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. సచిన్ సహచరుడు వినోద్ కాంబ్లీ దీనావస్థ..!
టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సహచరుడు, ప్రపంచ క్రికెట్లో బ్రియాన్ లారా తర్వాత అంతటి సొగసరి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన ముంబై మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో ఎవరైనా ఊహించగలరా..? అంతటి స్టార్ ఇమేజ్ కలిగిన క్రికెటర్ ప్రస్తుతం చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్నాడంటే ఎవరైనా నమ్మగలరా..? కానీ ఇది నిజం. ప్రపంచ క్రికెట్లో 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన కాంబ్లీ రకరకాల కారణాల చేత ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయి ప్రస్తుతం పూట గడవని దీనావస్థలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాతో పంచుకున్నాడు. క్రికెట్‌కు సంబంధించి ఏదైనా పని ఉంటే ఇప్పించాలని బీసీసీఐని వేడుకుంటున్నాడు. బీసీసీఐ ఇస్తున్న ముప్సై వేల పెన్షనే తనను తన కుటుంబాన్ని బతికిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్దిరోజుల క్రితం వరకు నేరుల్లో 'టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ'లో యువ క్రికెటర్లకు మెంటార్‌గా పని చేసేవాడినని.. అయితే, నేరుల్ తను నివసించే ప్రాంతానికి చాలా దూరంగా ఉండటంతో సగం రోజు ప్రయాణానానికే సరిపోతుందని.. అందుకే తప్పని పరిస్థితుల్లో ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చొరవ తీసుకుని వాంఖడే లేదా బీకేసీ స్టేడియంలో ఏదైనా క్రికెట్‌కు సంబంధించిన పని ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని అభ్యర్ధించాడు. పెన్షన్ ఇచ్చి తనను, తన కుటుంబాన్ని పోషిస్తున్న బీసీసీఐకి జీవితకాలం రుణపడి ఉంటానని అన్నాడు. తన ఆర్థిక కష్టాల గురించి చిన్ననాటి స్నేహితుడు సచిన్‌కు తెలుసా..? అని ప్రశ్నించగా.. అతనికి తెలుసని సమాధానమిచ్చాడు. అయితే, సచిన్ నుంచి తాను ఏమీ ఆశించడం లేదని.. 'టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ'లో ఉద్యోగం ఇప్పించింది సచినేనని తెలిపాడు. సచిన్ ఇప్పటికే తనకెంతో చేశాడని.. అతనో గొప్ప స్నేహితుడని.. తన బాగు కోరే వారిలో సచిన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరఫున 17 టెస్ట్‌లు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ 3500కు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేసిన కాంబ్లీ ఖాతాలో 4 టెస్ట్ సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో కాంబ్లీ వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాడు. టీమిండియా 1996 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో లంక చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంటున్న సమయంలో కాంబ్లీ కన్నీరు పెట్టడం సగటు భారత అభిమానిని బాగా కదిలించింది. చదవండి: ధవన్‌ను ఇంతలా అవమానించడం సరికాదు.. వేరేవాళ్లయ్యుంటే రచ్చరచ్చ జరిగేది..! -
సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్
టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పతాగి వాహనం నడపడంతో పాటు ఓ కారును ఢీకొట్టినందుకుగాను అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే లాయర్ ష్యూరిటీ ఇవ్వడంతో కొద్దిసేపటికే బెయిల్‌పై విడుదల చేశారు. కాంబ్లీపై ఐపీసీ సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), 427 (నష్టం కలిగించే అల్లర్లు) కింద అభియోగాలు మోపామని బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో కాంబ్లీ వార్తల్లోకెక్కడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్ 11న అతను సైబర్ మోసానికి గురై పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన కాంబ్లీ.. 1.14 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. బ్యాంకు అధికారినని ఫోన్ చేసిన మోసగాడు.. కాంబ్లీని బురిడీ కొట్టించి అకౌంట్లో డబ్బులు మాయం చేశాడు. చదవండి: IND VS SL 3rd T20: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ -
"అతడు త్వరలోనే టీమిండియా లోకి వస్తాడు"
Vinod Kambli Hails Yash Dhull After Ranji Ton: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన యష్ ధుల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. యష్ ధుల్ త్వరలోనే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడని కాంబ్లీ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన యష్.. తమిళనాడుపై అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 150 బంతుల్లో 113 పరుగులు యష్ చేశాడు. ఇక అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా యష్ ధుల్ భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. "ఫస్ట్ క్లాస్ క్రికెట్లో యష్ ధుల్ తన కేరిర్‌ను ఘనంగా ఫ్రారంభించాడు. తొలి సెంచరీను తన దైన శైలిలో సాధించాడు. అతడు దేశీయ స్ధాయి, ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తాడని భావిస్తున్నాను. యష్ ఖచ్చితంగా భారత్ తరుపున త్వరలోనే అరంగేట్రం చేస్తాడు. కంగ్రాట్స్ మిస్టర్ ధూల్" అని కాంబ్లీ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ యష్ ధుల్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! -
అందుకే కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్: మాజీ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తుమ కెప్టెన్ అంటూ కోహ్లిని కొనియాడాడు. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించి తప్పుచేశారని అభిప్రాయపడ్డాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 113 పరుగుల తేడాతో గెలుపొంది సెంచూరియన్‌లో చరిత్ర సృష్టించింది. సఫారీల కంచుకోటలో జయకేతనం ఎగురవేసిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో కోహ్లి సారథ్యంలోని భారత జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వినోద్ కాంబ్లీ సైతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ సామాజిక మాధ్యమం ‘కూ’ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. అదే విధంగా కోహ్లి కెప్టెన్సీ గురించి ప్రస్తావిస్తూ అతడి ప్రతిభను కొనియాడాడు. ఒత్తిడిలోనూ జట్టును విజయతీరాలకు చేర్చి గొప్ప సారథిగా నిరూపించుకున్నాడన్నాడు. ఈ మేరకు... ‘‘కెప్టెన్సీ మార్పు గురించి చర్చోపర్చలు. వాతావరణం కూడా పెద్దగా సహకరించలేదు! కానీ.. మనం అద్భుతాలు చేశాం. ప్రపంచంలోని బెస్ట్ కెప్టెన్ అని తనను ఎందుకు పిలుస్తారో కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే... సిరీస్ ముగిసే లోపు పాత కోహ్లిని మనం చూస్తాం’’ అని కాంబ్లీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ కోహ్లికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తనతో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరుపకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారంటూ కోహ్లి వ్యాఖ్యానించడం వివాదానికి తెరతీసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లిన టీమిండియా కోహ్లి నేతృత్వంలో సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం. ఇక వరణుడు ఆటంకం సృష్టించినా(వర్షం కారణంగా రెండో రోజు ఆట రద్దు) పేసర్ల విజృంభణతో కోహ్లి సేన గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli- Vamika: ‘చిట్టితల్లి... నాన్న గెలిచాడు వామిక.. ఆ సంతోషం వెలకట్టలేనిది’.. వీడియో వైరల్ Cannot ask for a better end to 2021! 👏 👏@28anand captures the essence and vibes in Centurion post #TeamIndia's historic Test win at SuperSport Park. 👌 👌 #SAvIND Watch the full video 🎥 🔽https://t.co/49IFMY2Lxl pic.twitter.com/PnIaswqsH7 — BCCI (@BCCI) December 31, 2021 -
భారత మాజీ క్రికెటర్‌కి షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు.. ఫోన్లో మాట్లాడుతుండగా..
ఇంటర్నెట్ వాడకం పెరగడంతో కొందరు ఈజీ మనీ కోసం ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. వీళ్లు తమ దందా సాఫీగా సాగించేందుకు కొత్త దారులు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ జాబితాలో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ సైతం సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు కాంబ్లీ కి ఫోన్ చేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించి, ఆయన కేవైసీ సమాచారాన్ని సమర్పించాలని లేదా తను బ్యాంక్ ఖాతా రద్దు అవుతుందని తెలిపారు. వాళ్ల మాటలను నమ్మిన కాంబ్లీ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు తన ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. దెబ్బకు కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ. 1.14 లక్షల డబ్బు స్వాహ అయ్యాయి. ఈ తతంగమంతా కూడా కాంబ్లీ అతనితో ఫోన్లో మాట్లాడుతుండగానే జరిగింది. చివరికి తాను మోసపోయానని గ్రహించిన కాంబ్లీ అసలు విషయం తెలుసుకుని దగ్గర్లోనే ఉన్న బాంద్రా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు.. రివర్స్ ట్రాన్సక్షన్ ద్వారా కాంబ్లీ డబ్బును తిరిగి ఆయన ఖాతాలోకి జమచేశారు. కాంబ్లీ సచిన్ టెండూల్కర్ తో కలిసి చదువుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు సెయింట్ గ్జేవియర్స్ స్కూల్ పై ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇద్దరు భారత క్రికెట్ లోకి అడుగుపెట్టారు. కానీ ఆ తరువాత కాంబ్లీ మాత్రం పలు వివాదాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. చదవండి: Virat Kohli: "కోహ్లి ఫోన్ స్విఛ్చాఫ్.. ఏమైందో నాకు తెలియదు" -
కరోనాతో మరో స్నేహితుడిని కోల్పోయిన సచిన్
థానే: భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కరోనావైరస్ కారణంగా మరొ స్నేహితుడిని కోల్పోయారు. క్రికెట్ 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్, వినోద్ కంబ్లితో కలిసి క్రికెట్ ఆడిన విజయ్ షిర్కే కరోనా వైరస్ కారణంగా ఆదివారం(డిసెంబర్ 20) రాత్రి థానే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ విజయ్ షిర్కే వయసు 57 సంవత్సరాలు. విజయ్ షిర్కే 80వ దశకంలో సన్‌గ్రేస్ మాఫత్‌లాల్ తరఫున టెండూల్కర్, వినోద్ కాంబ్లితో కలిసి క్రికెట్ ఆడాడు. ఇప్పటికే కోవిడ్ కారణంగా అక్టోబర్‌లో సచిన్ టెండూల్కర్ తన సన్నిహితుడు అవీ కదమ్ ని కోల్పోయాడు.(చదవండి: అదే టీమిండియా కొంపముంచింది..) తన స్నేహితుడి మరణంపై వినోద్ కంబ్లి స్పందించారు.." ఇది ఎంతో విషాదకరమైన వార్త. నేను నా ప్రాణ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం. నేను, సచిన్ అతన్ని ముద్దుగా "విజ్జా" అని పిలిచేవాళ్ళం. అతను ఎప్పుడు ఉల్లాసంగా, కష్టపడి పనిచేసే వ్యక్తి" అని తాను ఆవేదన వ్యక్తం చేసాడు. విజయ్ షిర్కే మంచి ఫాస్ట్ బౌలర్. మేం ఆడుకునే రోజుల్లో చాల అద్భుతంగా బౌలింగ్ వేసేవాడు. కొద్దీ రోజుల క్రితమే అతనితో మాట్లాడాను. మేము ప్రతిరోజూ ఒకరికొకరు మెసేజ్ ల రూపంలో 'గుడ్ మార్నింగ్' చెప్పుకుంటాం. కానీ గత మూడు-నాలుగు రోజుల నుంచి నాకు అతని నుంచి మెసేజ్ లు రావడం లేదు. ఇంతలోనే ఈ చేదువార్త వినాల్సి వచ్చింది" అని బాధ పడ్డాడు. "మమ్మల్ని విడిచి చాలా త్వరగా వెళ్ళావు మిత్రమా. నీవు అక్కడ ప్రశాంతంగా ఉండాలి మిత్రమా. మీతో మైదానంలో, బయట గడిపిన గొప్ప సమయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము" అని భారత మాజీ పేసర్, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ సలీల్ అంకోలా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. విజయ్ షిర్కే సుంగ్రేస్ మాఫట్లాల్ లో అంకోలా యొక్క పేస్ బౌలింగ్ సహోద్యోగి. షిర్కే మరణం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ)కు మరో ఎదురు దెబ్బ. షిర్కే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) అండర్ -17 జట్టుకు థానేలో రెండేళ్లపాటు కోచ్‌గా పనిచేశాడు. ఆయన మరణవార్త విని ప్రముఖ క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. -
సవాల్ విసిరిన సచిన్.. వారం రోజులే గడువు!
ముంబై: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆప్త మిత్రుడు వినోద్ కాంబ్లికి ఓ సవాల్ విసిరాడు. అంతేకాకుండా ఆ చాలెంజ్‌ను కేవలం ఏడు రోజుల్లో పూర్తి చేయాలని మరో మెలిక పెట్టాడు. అయితే సచిన్ సవాల్‌ను కాంబ్లి స్వీకరించాడు. వారం రోజుల్లో సచిన్ చెప్పిన పనిని పూర్తి చేస్తానని కాంబ్లి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ ఆ చాలెంజ్ ఏంటంటే.. గతంలో బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌తో కలిసి సచిన్ 'క్రికెట్ వాలీ బీట్ పే' అనే సాంగ్‌ను పాడిన విషయం తెలిసిందే. అయితే ఆ పాటకు కేవలం ఏడు రోజుల్లో ర్యాప్ చేయాలని కాంబ్లికి సచిన్ సవాల్ విసిరాడు. ఈనెల 28 లోపూ ‘క్రికెట్ వాలీ బీట్ పే’కు ర్యాప్ సాంగ్ పాడకుంటే కాంబ్లి తనకు ఏదో రుణపడి ఉంటాడని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వీర్దిదరి సంభాషణలకు సంబంధించిన వీడియోను సచిన్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక 2017లో 'క్రికెట్ వాలీ బీట్ పే' సాంగ్ క్రికెట్ అభిమానులతో పాటు సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సాంగ్‌ను టీమిండియా తరుపున ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లకు అంకితమిస్తున్నట్టు సచిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, స్కూల్ క్రికెట్లో సచిన్-కాంబ్లిలు 664 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అప్పట్లో చరిత్ర సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. Mr. Kambli, I challenge you to do the rap of my song #CricketWaliBeat! You have 1 week. 😜 @vinodkambli349 pic.twitter.com/8zU1tVG0mh — Sachin Tendulkar (@sachin_rt) January 21, 2020 చదవండి: వడా పావ్ ఎలా తినాలో చెప్పిన సచిన్ ధావన్ స్థానంలో పృథ్వీ షా -
సచిన్ భావోద్వేగ ట్వీట్
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌కు నివాళులు అర్పించాడు. ఆచ్రేకర్ తొలి వర్ధంతిని పురస్కరించుకుని.. ‘ మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు ఆచ్రేకర్ సర్’ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా తన గురువుతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్ చేశాడు. ఇక వినోద్ కాంబ్లీ సైతం ఆచ్రేకర్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు.. ‘ అసలు మీలాంటి మెంటార్ ఎవరికీ దొరకరు. కేవలం క్రికెట్ ఎలా ఆడాలో నేర్పడమే కాకుండా... నాకు జీవిత పాఠాలు కూడా బోధించారు. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా ఆచ్రేకర్ సర్’ అని ట్వీట్ చేశాడు. కాగా కేవలం ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడినప్పటికీ తదనంతర కాలంలో గొప్ప కోచ్‌గా ఎదిగిన రమాకాంత్ ఆచ్రేకర్ గతేడాది జనవరి 2న కన్నుమూసిన విషయం విదితమే. సచిన్, వినోద్ కాంబ్లి, ప్రవీణ్ ఆమ్రే వంటి ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన ఆయనను ద్రోణాచార్య అవార్డు వరించింది. 2010లో ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా దక్కింది. ఇక తనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి.. స్కూటర్‌పై తనను ప్రాక్టీసుకు తీసుకువెళ్లిన ఆచ్రేకర్ అంటే సచిన్‌కు ఎంతో గౌరవం. ఈ క్రమంలో తనకు ఆచ్రేకర్‌తో ఉన్న అనుబంధం గురించి సచిన్ పలు వేదికలపై చెప్పుకొచ్చాడు. ఆచ్రేకర్ అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలో పలుమార్లు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పాడు. ఇక వినోద్ కాంబ్లి కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆచ్రేకర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటాడు.(చదవండి : నా వీడియోను షేర్ చేసిన సచిన్‌కు థాంక్స్) సచిన్ గురువుగా గుర్తింపు.. దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో అచ్రేకర్ క్రికెట్ అకాడమీ ఉండేది. ఆయన ఎంత మందికి శిక్షణనిచ్చినా ‘సచిన్ గురువు’గానే క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంది. సచిన్ కూడా తన సుదీర్ఘ కెరీర్లో లెక్క లేనన్ని సార్లు తన గురువును గుర్తు చేసుకునేవాడు. ఓనమాలు నేర్పిన నాటినుంచి తన చివరి టెస్టు ఆడే వరకు ప్రతీ దశలో ఆయన పాత్ర, ప్రభావం గురించి చెప్పడం టెండూల్కర్ ఏనాడూ మర్చిపోలేదు. క్రికెట్లో ఎదగాలంటే అప్పటి వరకు చదువుతున్న న్యూ ఇంగ్లీష్ స్కూల్ నుంచి శారదాశ్రమ్ విద్యామందిర్‌కు మారమని అచ్రేకరే తన శిష్యుడికి సూచించారు. ప్రతి ఏటా గురుపూర్ణిమ రోజున తన గురువును కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడం సచిన్ అలవాటుగా ఉండేది. तुमच्या आठवणी आमच्या मनात सदैव राहतील, आचरेकर सर. You will continue to remain in our hearts, Achrekar Sir! pic.twitter.com/IFN0Z6EtAz — Sachin Tendulkar (@sachin_rt) January 2, 2020 No Mentor can ever be as incredible as you are because you did not only teach me to play cricket 🏏 in the best way possible but you also taught me real life lessons. I miss you a lot, Achrekar Sir! pic.twitter.com/UVXKhZZEUo — VINOD KAMBLI (@vinodkambli349) January 2, 2020 -
‘కోచ్ వస్తున్న సంగతి సచిన్ చెప్పలేదు..’
ముంబై : క్రికెట్ లెజెండ్, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పాఠశాల స్మృతుల్ని గుర్తుచేసుకున్నాడు. తన స్కూల్‌మేట్, టీమిండియా మాజీ క్రెకెటర్ వినోద్ కాంబ్లీతో ఉన్న ఓ పాత ఫొటోను ట్విటర్లో శనివారం పోస్టు చేశాడు. తన స్నేహితుడు కాంబ్లీని ముద్దుగా ‘కాంబ్ల్యా’అని పిలుచుకునే సచిన్.. ‘‘కాంబ్ల్యా’ ఈ ఫొటో సంపాదించాడు. ఆ పాత చిలిపి జ్ఞాపకాలు మదిలో మెదిలేలా చేశాడు. స్కూల్ డేస్ అన్నీ ఒక్కసారే కళ్లముందు కదలాడాయి’ అని ట్విటర్ పేర్కొన్నాడు. స్పందించిన కాంబ్లీ.. ఆ ఫొటో వెనకున్న కథ విప్పాడు ‘మాస్టర్..! నేనూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ కైట్ వచ్చి పిచ్ మధ్యలో పడింది. దాన్ని పక్కన పడేసి నా పని నేను చూసుకోకుండా... ఎగరేయడం మొదలెట్టాను. అది గమనించిన మా కోచ్ రమాకాంత్ అచ్రేకర్ నావైపు కోపంగా వస్తున్నారు. ఆయన వస్తున్నది నేను గమనించలేదు. సార్ రావడం చూసినప్పటికీ నువ్ నాకు చెప్పలేదు. అంతే, తర్వాతేం జరగిందో తెలుసుగా..’అని ట్వీట్ చేశాడు. (చదవండి : సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్) ఇక ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు శారదాశ్రమం విద్యామందిర్‌లో పాఠశాల విద్య చదివారు. కోచ్ ఆచ్రేకర్ సూచన మేరకే వారు ఆ స్కూళ్లో చేరడం గమనార్హం. పాఠశాల స్థాయి క్రికెట్ టోర్నీలో 1988, ఫిబ్రవరిలో జరిగిన ఓ మ్యాచ్‌లో 664 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. హరీస్ షీల్డ్ టోర్నీలో సెయింట్ జేవియర్ స్కూల్‌పై ఈ ఘనత సాధించారు. సచిన్ 326 పరుగులు చేయగా.. కాంబ్లీ 349 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. This brought back memories, Master!😀 You remember this one time when we were batting & a kite fell on the pitch. I took the kite & started flying it. You saw Achrekar Sir coming my way but didn’t tell me and we both know what happened next! 😡 🥊 Aathavtay ka? https://t.co/42a0pvoQd3 — VINOD KAMBLI (@vinodkambli349) August 3, 2019 -
గంగూలీ వాదనకు కాంబ్లీ నో!
న్యూఢిల్లీ: మూడు ఫార్మాట్లకు ఒకే జట్టును ప్రకటిస్తే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి వారి నుంచి మంచి ప్రదర్శన రావడానికి ఆస్కారం ఉందన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వాదనతో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఏకీభవించలేదు. వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక సరిగా లేదంటూ పేర్కొన్న గంగూలీ.. అన్ని ఫార్మాట్లకు కలిపి ఒకే జట్టును పంపిస్తే బాగుండేదన్నాడు. అయితే దీనిపై కాంబ్లీ స్పందిస్తూ.. ఇది సరైన విధానం కాదన్నాడు. ‘ ప్రతీ ఫార్మాట్లో గెలుపు గుర్రాలు అనేవి వేరుగా ఉంటాయి. ఏ ఫార్మాట్లో ఆటగాళ్లు మెరుగనిస్తే వారిని ఎంపిక చేయాలి. అది జట్టుకు లాభిస్తుంది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేయడం తప్పుకాదు. ఇలా ఎంపిక చేయడం వల్ల ప్రధాన సిరీస్‌ల్లో ఎవరిని ఏ సందర్భంలో వాడుకోవాలో అనే విషయం తెలుస్తుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లే ఇందుకు ఉదాహరణ’ అని కాంబ్లీ పేర్కొన్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ సెలక్టర్ల బృందం విండీస్ టూర్‌కు ఆదివారం మూడు ఫార్మాట్లకు విడి విడిగా జట్టును ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రమే మూడు ఫార్మాట్లలో స్థానం దక్కించుకున్నారు. రాహుల్ చహర్(స్పిన్), నవదీప్ సైనీ(పేసర్)లకు తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత మూడు ఇన్నింగ్స్‌లో వరుస అర్ధసెంచరీలు సాధించి సత్తా చాటినా సెలెక్టర్లు అతడిని పట్టించుకోకపోవడం గమనార్హం. (ఇక్కడ చదవండి: ఎందుకలా..?: గంగూలీ ఆశ్చర్యం) -
సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్