ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వినోద్ కాంబ్లి | Vinod Kambli discharged from hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వినోద్ కాంబ్లి

Published Tue, Dec 3 2013 6:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

Vinod Kambli discharged from hospital

గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మంగళవారం డిశ్చార్జయ్యాడు.

ముంబై: గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మంగళవారం డిశ్చార్జయ్యాడు. గత శుక్రవారం కాంబ్లీ అస్వస్థతకు గురికావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. నవంబర్ 29వ తేదీన చెంబూర్‌లోని తన ఇంటి నుంచి బాంద్రాకు బయలుదేరిన కాంబ్లీకి ఛాతీలో నొప్పి రావడంతో కాంబ్లీ కారులోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే దారిలో వెళ్తున్న మాతుంగా డివిజన్ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సుజాత పాటిల్ అతన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కాంబ్లీ మాట్లాడుతూ.. 'నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగానే మెరుగైంది. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'.అని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement