
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన, ప్రసిద్ధి చెందిన ఆసుపత్రులలో ఒకటి లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ . 1978లో నాలుగు దశాబ్దాల క్రితం ముంబైలో స్థాపించిన ఐకానిక్ హాస్పిటల్‌పై పెద్ద దుమారం రేగుతోంది. లీలావతి హాస్పిటల్ ట్రస్టీలు బ్లాక్ మ్యాజిక్ గురించి షాకింగ్ ఆరోపణలు చేశారంటూ జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం ముంబైలోని ప్రతిష్టాత్మక లీలావతి హాస్పిటల్ (Lilavati Hospital)ను నిర్వహిస్తున్న లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌పై ట్రస్ట్‌లోని కొంతమంది . మాజీ ట్రస్టీలు దిగ్భ్రాంతికరమైన ఆర్థిక కుంభకోణం ఆరోపణలను గుప్పించారు అంతేకాదు రూ. 1,200 కోట్ల కుంభకోణం కేసు కూడా నమోదు చేశారు. ఈ ఆరోపణలలో మోసపూరిత ఆర్డర్లు, నిధుల దుర్వినియోగం నకిలీ సేకరణ లాంటివి ఉన్నాయి. ఫోర్జరీ, మోసం , పన్ను ఎగవేత ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆసుపత్రి కొనుగోళ్లకు సంబంధించి థర్డ్-పార్టీ డిస్ట్రిబ్యూటర్లతో అక్రమాలకు పాల్పడటం ద్వారా రూ.1,200 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది ట్రస్ట్‌లో సుదీర్ఘ న్యాయ పోరాటంలో భాగంగా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వ్యవస్థాపకుడి సోదరుడు విజయ్ మెహతా చేపట్టిన చర్యల్లో భాగంగా కిషోర్ మెహతా కుమారుడు ప్రశాంత్ మెహతా నేతృత్వంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తృతమైన ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని ఫిర్యాదు దారులు ఆరోపణ. ఈ విషయంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి , బాంద్రా పోలీస్ స్టేషన్‌లో విడివిడిగా ఫిర్యాదులు చేసింది. ఆసుపత్రి ప్రాంగణంలో పూర్వపు ట్రస్టీలు చేతబడులు (black magic) చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మానవ వెంట్రుకలు, బియ్యం, ఎముకలతో నిండిన ఎనిమిది కలశాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రశాంత్ మెహతా , అతని తల్లి చారు మెహతా కార్యాలయంలో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఆరోపణలొచ్చాయని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు.
"మేము ఆడిట్‌లు చేపట్టాము మరియు ఫోరెన్సిక్ ఆడిటర్లు ఐదు కంటే ఎక్కువ నివేదికలను సమర్పించారు, ఇది ఈ చట్టవిరుద్ధమైన ట్రస్టీల బృందం రూ. 1,500 కోట్లకు పైగా డబ్బును స్వాహా చేసి దుర్వినియోగం చేసిందని స్పష్టంగా పేర్కొంది. ఈ డబ్బును మాజీ ట్రస్టీలు స్వాహా చేశారు, వీరిలో ఎక్కువ మంది NRIలు మరియు దుబాయ్ మరియు బెల్జియం నివాసితులు," అని LKMMT శాశ్వత నివాసి ట్రస్టీ ప్రశాంత్ మెహతా విలేకరులకు తెలిపారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లతో పాటు, గుజరాత్‌లోని లీలావతి ఆసుపత్రి నుండి విలువైన వస్తువుల దొంగతనం కేసులో మరో కేసు దర్యాప్తులో ఉందని మెహతా తెలిపారు .PMLA (మనీలాండరింగ్ నిరోధక చట్టం) నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక నేరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగంగా స్పందించి, తగిన చర్య తీసుకోవాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, ఆసుపత్రి మాజీ ట్రస్టీలు ముగ్గురుపై నమోదైన రూ.85 కోట్ల మోసం కేసుపై ముంబై పోలీసుల EOW దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు మంగళవారం తెలిపారు .LKMMT ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్ 30న బాంద్రా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు EOWకి బదిలీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
లీలావతి హాస్పిటల్
లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం. 1997లో లీలావతి హాస్పిటల్ కేవలం 10 పడకలు , 22 మంది వైద్యులతో ప్రారంభమైంది. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్‌లో 323 పడకలు, అతిపెద్ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICUలు) ఒకటి, 300 కంటే ఎక్కువ మంది కన్సల్టెంట్లు, సుమారు 1,800 ఉద్యోగుల బృందంతోపాటు, ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతతో 12 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.ఒకే రోజులో, లీలావతి హాస్పిటల్ దాదాపు 1,500 మంది అవుట్ పేషెంట్లు , 200 మంది ఇన్ పేషెంట్లకు హాజరవుతారు, "సర్వేత్ర సుఖినః: సంతు, సర్వే సంతు నిరామయా", అంటే "అందరూ ఆనందంగా ... ఆరోగ్యంగా ఉండాలి", అనే నినాదంతో సేవలందిస్తోంది.
కీర్తిలాల్ మెహతా ,అతని భార్య లీలావతి మెహతా 1997లో ఈ ఆసుపత్రిని స్థాపించారు. 1978లో, కీర్తిలాల్ మెహతా లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. కీర్తిలాల్ మెహతా కుమారుడు కిషోర్ మెహతా హాస్పిటల్ ప్రాజెక్ట్‌ను రూపొందించి,దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కిషోర్ మెహతా మరణం తరువాత, అతని భార్య చారు మెహతా ఈ ఆసుపత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఈ ట్రస్టీల మధ్య గత కొన్నేళ్లు వివాదాలు, కేసులు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment