trustee
-
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత!
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ (90) కన్నుమూశారు. ఆయన 1950లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ ట్రస్ట్‌లో చేరారు. నగరంలోని సివిల్ లైన్స్‌లో గల హరిఓమ్‌నగర్ నివాసంలో ఉంటున్న బైజ్నాథ్ అగర్వాల్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. బైజ్నాథ్ అగర్వాల్ మృతిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలోలో ఇలా రాశారు.. ‘గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ మరణం విచారకరం. గత 40 సంవత్సరాలుగా గీతా ప్రెస్‌కు ధర్మకర్తగా బైజ్నాథ్ వ్యవహరించారు. ఆయన జీవితం ప్రజా సంక్షేమానికే అంకితమయ్యింది. శ్రీరాముడు తన పాదాల చెంత ఆయన ఆత్మకు చోటు కల్పించాలని వేడుకుంటున్నానని’ అన్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? गीता प्रेस, गोरखपुर के ट्रस्टी श्री बैजनाथ अग्रवाल जी का निधन अत्यंत दुःखद है। विगत 40 वर्षों से गीता प्रेस के ट्रस्टी के रूप में बैजनाथ जी का जीवन सामाजिक जागरूकता और मानव कल्याण के लिए समर्पित रहा है। उनके निधन से समाज को अपूरणीय क्षति हुई है। प्रभु श्री राम दिवंगत पुण्यात्मा… — Yogi Adityanath (@myogiadityanath) October 28, 2023 -
‘పీఎం కేర్స్’ ట్రస్టీలుగా రతన్ టాటా, సుప్రీం మాజీ జడ్జి
సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా పలువురు ప్రముఖల పేర్లను నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా పలువురు ఉన్నారు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది కేంద్రం. కొత్తగా నియామకమైన సభ్యులతో సహా పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమైన మరుసటి రోజునే ఈ ప్రకటన వెలువడింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ‘పీఎం కేర్స్ ఫండ్‌లో అంతర్గతంగా భాగమైనందుకు ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు.’ అని ఓ ప్రకటన చేసింది ప్రధాని కార్యాలయం. ఇతర ట్రస్టీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలు ఉన్నారు. మరోవైపు.. పీఎం కేర్స్ ఫండ్ సలహాదారుల బోర్డుకు కాగ్ మాజీ అధికారి రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకులు ఆనంద్ షాలను నామినేట్ చేసింది కేంద్రం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన క్రమంలో అత్యవసర సహాయ చర్యల కోసం 2020లో పీఎం కేర్స్ ఫండ్ ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని ఎక్స్ అఫీసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన వారందరికీ పన్ను మినహాయింపు వర్తింపుజేశారు. అలాగే.. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు గత ఏడాది మే 29న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4వేలకుపైగా చిన్నారుకు ఈ నిధి ద్వారా సాయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదీ చదవండి: పీఎం కేర్స్‌కు 4,345 మంది ఎంపిక -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!
సాక్షి,ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణం తరువాత ఆయన పెట్టుబడుల నిర్వహణ, ట్రస్ట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. అయితే మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం ఝన్‌ఝన్‌వాలా విశ్వసనీయ మిత్రుడు, గురువు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఝున్‌ఝున్‌వాలా ఎస్టేట్‌కు ప్రధాన ట్రస్టీగా వహిరిస్తారు. ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత పెట్టుబడులపై దమానీనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇతర విశ్వసనీయలు కల్‌ప్రజ్ ధరంషి అమల్ పారిఖ్ ఇతర ట్రస్టీలుగా ఉంటారు. ఝున్‌ఝున్‌వాలా తన గురువుగా ఆర్కె దమానీని ఎపుడూ ప్రశంసిస్తూ ఉండేవారు. తన తండ్రి, టాటాస్, విన్స్టన్ చర్చిల్, జార్జ్ సోరోస్, రాధాకిషన్ దమానీ ఈ ఐదుగురు తనకు రోల్ మోడల్స్ అనీ, వారినుంచి స్ఫూర్తి పొందానని పలు ఇంటర్వ్యూలలో ఝున్‌ఝున్‌వాలా గుర్తుచేసుకునేవారు. అందుకే విభిన్నమైన వ్యక్తిత్వాలతో, దలాల్ స్ట్రీట్‌లో ఈ రెండు బిగ్‌బుల్స్ మధ్య ఫ్రెండ్షిప్ని బాలీవుడ్ మూవీ'షోలే'లోని జై-వీరూలతో ఎక్కువగా పోలుస్తారు అభిమానులు. ఝున్‌ఝున్‌వాలా సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం,గత ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నందున ప్రతీ విషయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు ఆయన భార్య, వ్యాపారవేత్త రేఖా కూడా వ్యాపార కుటుంబానికి చెందినవారు, ఫైనాన్స్‌పై అపారమైన అవగాహన కూడా ఆమె సొంతం. దీంతోపాటు, రేఖా సోదరుడు సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే రేర్ ఎంటర్‌ప్రైజెస్‌ని ఉత్పల్ సేథ్ , అమిత్ గోలా ఆధ్యర్యంలోనే నడుస్తుంది. ఝున్ఝున్వాలాకా పెట్టుబడులపై సలహాలందించే ఉత్పల్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి సారించారు.ఇక అమిత్ గోలా ట్రేడింగ్ అంశాలపై ఆయనకు కుడిభుజంలాపనిచేసేవారు. అమిత్ ట్రేడింగ్ బుక్నికూడా నిర్వహిస్తున్నారు. కాగా ఆగస్ట్ 14న మరణించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లిస్టెడ్ , అన్‌లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులతో సహా కోట్లాది రూపాయల ఆస్తులను అతని భార్య ముగ్గురు పిల్లలకు వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్‌గా రాణిస్తున్న రాధాకిషన్ దమానీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు కూడా. రిటైల్ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్ పేరుతో ఎంట్రీ ఇచ్చి డి-మార్ట్ చెయిన్‌తో పెద్ద సంచలనమే క్రియేట్ చేశారు దమానీ. 2022 జూన్ నాటికి అవెన్యూలో దమానీ నికర విలువ రూ. 1,80,000 కోట్లకు పైమాటే. -
ట్రస్టీల మధ్య గొడవ.. విద్యార్థులను గదుల్లోనే ఉంచి
సాక్షి, మైసూరు(కర్ణాటక): ట్రస్టు సభ్యులు వారిలో వారు గొడవపడి, కళాశాలకు వచ్చిన విద్యార్థులను గదుల్లో బంధించిన ఘటన నగరంలోని విజయనగరలో ఉన్న ప్రైవేట్ పీయూ కళాశాలల్లో మంగళవారంచోటు చేసుకుంది. ట్రస్టీలు వనితా, సలోని, రునాల్, రేణుకా, అశోక్ కుమార్ అనే ఐదుమంది ట్రస్టీలు ఉన్నారు. విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులు దుర్వినియోగం చేశారని వనితా, రేణుకాను ట్రస్టు నుంచి సస్పెండ్ చేశారు. ఒక స్థలం విషయమై కూడా రేణుకాతో మిగతావారికి రగడ జరిగింది. రేణుకాకు చెందిన వారు రోజూ కళాశాల వద్దకు వచ్చి ఈ స్థలం మాది అని గొడవ చేస్తున్నారు. మంగళవారం మళ్లీ వచ్చి కాలేజీ గదులకు తాళాలు వేయడంతో పాటు టీవీ, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. డిడిపియు శ్రీనివాస్ మూర్తి వచ్చి పరిశీలించారు. విజయనగర పోలీసులు పిల్లలను బయటకు పంపి గొడవచేసిన వారిపై కేసు నమోదు చేశారు. -
‘వినాయక’ విడుదల ఎప్పుడు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరమంటే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది సంపత్ వినాయగర్ దేవాలయం. ఎంతో ప్రాశస్త్యం కలిగి భక్తుల కోర్కెలు తీర్చే మందిరంగా విలసిల్లుతోంది. 1962లో అశీలుమెట్ ప్రాంతంలో టి.ఎస్.రాజేశ్వరన్, టిఎస్.సెల్వగణేశన్, ఎస్.జి.సంబంధన్‌లు సంపత్ వినాయగర్ దేవాలయాన్ని నిర్మించారు. పోర్ట్‌లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసే ఆ ముగ్గురూ తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడి వినాయకుడికి పూజలు నిర్వహించేవారు. కాలక్రమంలో భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1967లో కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆ దేవాలయంలో శ్రీగణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. 1996లో ఎండోమెంట్స్ పరిధిలోకి వచ్చిన దేవాలయం కాలక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లేదా గ్రూప్–1 అధికారి పర్యవేక్షించే ప్రముఖ దేవస్థానంగా ఎదిగింది. ఆదాయం.. స్థిరాస్తులపై ప్రైవేటు కన్ను.. ఏడాదికి సగటున రూ. 2.50 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న దేవస్థానానికి రూ.15 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. సింహాచలం సమీపంలోని గండిగుండం వద్ద దేవస్థానం పేరిట 6.40 ఎకరాల స్థలముంది. అక్కడే మూడున్నర కోట్లతో నిర్మించిన వృద్ధాశ్రమమూ ఉంది. ఇలా కోట్ల విలువైన స్థిర, చిరాస్తులు కలిగి రోజురోజుకీ ఆదాయం వృద్ధి చెందుతున్న దేవస్థానంపై ఫౌండర్ ట్రస్టీ వారసుల కళ్ళు పడ్డాయి. ఫౌండర్ ట్రస్టీ రాజేశ్వరన్ కుమారుడు చోళన్ ఆలయాన్ని ఏకస్వామ్య ట్రస్ట్‌కు కట్టబెడుతూ ఆదేశాలివ్వాలని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను తప్పించాలని(ఈవో ఎగ్జెంప్షన్) కోరుతూ గతేడాది.. నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించాడు. ఇలా ఆయన అడిగిన వెంటనే గత డిసెంబర్లో ఈవో ఎగ్జింప్షన్ ఇస్తూ (ఈవోను బాధ్యతల నుంచి తప్పిస్తూ) టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు వచ్చాయి. వాస్తవానికి అప్పటికే ట్రస్టీ నిర్వాకం, అక్కడే పాతుకుపోయిన కొందరు అర్చకుల వ్యవహార శైలితో సంపత్ వినాయగర్ దేవస్థానం సంపన్నుల దేవాలయం(రిచ్మెన్ టెంపుల్)గా మారిపోయిందన్న వాదనలుండేవి. ఇక పూర్తిగా ఏక స్వామ్య ట్రస్టీకి బదిలీ అయితే దేవాలయ నిర్వహణ ఎటుపోతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలనే నిజం చేస్తూ దేవాలయ నిర్వహణ అస్తవ్యస్తమైందన్న విమర్శలు చెలరేగుతున్నాయి. లెక్కలేని ఆదాయం.. వాస్తవానికి ఎండోమెంట్స్ పరిధిలో లేని చిన్న చిన్న దేవాలయాల్లో కూడా పూజలు, అర్చనలు, ఇతరత్రా ఆర్జిత సేవలకు టికెట్లు విక్రయిస్తుంటారు. కానీ ఇంతటి ప్రముఖ దేవాలయంలో మాత్రం టికెట్లుండవు, ఆదాయ వ్యయాల లెక్కాపత్రం ఉండదు. ఉత్తరాంధ్రలోనే కొత్త వాహన పూజలు ఎక్కవ జరిగే దేవాలయం ఇదేనని అందరికీ తెలుసు. కానీ టికెట్లు లేకుండానే.. ప్లేటు కలెక్షన్ ద్వారా అర్చకులు అందినకాడికి వసూలు చేస్తుంటారు. 2014లోనే ఈ దేవాలయంలో ఆర్జిత సేవల టికెట్లు ప్రవేశపెట్టాలని అప్పటి అధికారులు ప్రతిపాదించి ప్రభుత్వ ఆమోదం కూడా తీసుకున్నారు. కానీ ప్రైవేటుపరం అయ్యాక ఆ ఆదేశాలన్నీ బుట్టదాఖలయ్యాయి. కుంభాభిషేకం పేరిట వసూళ్ళు.. ఈ ఆలయ కుంభాభిషేకం ప్రతి పన్నెండేళ్ళకోసారి శాస్త్రోక్తంగా నిర్వహించాలి. ఆ క్రమంలో 2002లో జరిగిన తర్వాత 2014లో నిర్వహించాలి. కానీ అప్పట్లో దేవాలయం ఎండోమెంట్స్ పరిధిలో ఉండటంతో కుంభాభిషేకం నిర్వహణపై ఎవరూ దృష్టిసారించలేదు. గతేడాది తిరిగి ప్రైవేటు గుప్పిట్లోకి వెళ్ళిన తర్వాత ట్రస్టీ చోళన్ కుంభాభిషేకంపై దృష్టి పెట్టారు. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాల పేరిట విచ్చలవిడిగా చేస్తున్న వసూళ్ళు.. లెక్కపత్రం లేకుండా స్వామి వారి ఖజానాకు జమ కాకుండా ఉండటమే వివాదాస్పదమతోంది. ఇక 2014లో జరగాల్సిన కుంభాభిషేకాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, తమకు వీలైనప్పుడు నిర్వహించ వచ్చా... అనే చర్చకు కూడా ఇప్పుడు తెరలేచింది. ఇప్పటికే కుంభాభిషేకం పేరిట సుమారు రూ.30 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. నా దృష్టికి ఫిర్యాదులు వస్తే: మంత్రి వెల్లంపల్లి సంపత్ వినాయగర్ దేవాలయానికి సంబంధించి ఫిర్యాదులు వస్తే తప్పకుండా ఏం చేయాలో ఆలోచిస్తాం. గతేడాది ప్రభుత్వం నుంచి ఏకవ్యక్తి ట్రస్టీకి ఎందుకు బదిలీ అయిందనేది పునఃసమీక్షిస్తానని రాష్ట్ర దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సాక్షి ప్రతినిధితో చెప్పారు. అక్కడ నిర్వహణ బాగోలేదు: వైఎస్సార్సీపీ నేత విజయనిర్మల సంపత్ వినాయగర్ దేవాలయం అంటే అందరికీ సెంటిమెంట్. కానీ దాని నిర్వాహణ సరిగ్గా లేదన్నది వాస్తవం. అక్కడ ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యమైపోయింది. సంపన్నుల దేవాలయమనే అపప్రద ఉంది. ఈ దేవాలయ వ్యవహారాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు సమన్వయకర్త అక్కర మాని విజయనిర్మల అన్నారు. -
నాడు ధర్మకర్త..నేడు యాచకుడు..
బాసర, న్యూస్‌లైన్ : ఆయన అమ్మవారి భక్తుడు.. ఆమె దర్శనం లేనిదే పచ్చి నీళ్లయినా ముట్టడు.. ఆయనతోపాటు తన కుటుంబం సరస్వతీ సేవలోనే తరించింది.. ఆలయ ధర్మకర్త అయ్యాడు.. దేవాలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాడు.. ఆలయ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింప జేశాడు.. నయాపైసా కూడా ఆశించలేదు.. చివరకు విధి వక్రీకరించి అందరిని పోగొట్టుకున్నాడు.. ఉన్నవారి నిరాదరణకు గురయ్యాడు.. బాసర ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్నాడు.. అతడే బాసరకు చెందిన లక్ష్మణ్! బాసరకు చెందిన లక్ష్మణ్ రెండు దశాబ్దాల క్రితం బాసర సరస్వతీ ఆలయ ధర్మకర్తగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే గడ్డెన్న ఆలయ చైర్మన్‌గా ఉన్నకాలంలో లక్ష్మణ్‌తోపాటు మరో 12 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు ఆలయ ధర్మకర్తగా పనిచేశాడు. ఆయన హయాంలో రెండంతస్తుల ధర్మశాల, ఒక అతిథి గృహం ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. మూడు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చూసేవారు. శివరాత్రి, అమ్మవారి నవరాత్రోత్సలు, జన్మదినోత్సవాలను ఆయనే దగ్గరుండి చేయించేవారు. పదవీ ఉన్నప్పుడు నయాపైసా ఆశించకుండా ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. కాలక్రమేణ బాసరలో మార్పులు వచ్చాయి. ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. అదే ఆలయం వద్ద భిక్షాటన పదవీ పోయిన కొన్నేళ్లకు లక్ష్మణ్ భార్య లక్ష్మి అకాల మరణం చెందింది. వీరి ఇద్దరు కొడుకులు పెద్ద విశ్వనాథ్, నగేశ్‌లతో కొన్ని రోజులు లక్ష్మణ్ ఉన్నాడు. పెద్దకొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అతని భార్య ఇద్దరు పిల్లను తీసుకుని వారి పుట్టింటికి వెళ్లింది. ఇక చిన్న కుమారుడికి పిల్లలు లేకపోవడం తండ్రిని పట్టించుకోకపోవడంతో ఆలయ అధికారులను లక్ష్మణ్ పనిఇప్పించాలని అడిగారు. ఆలయ అధికారులు మూడేళ్ల క్రితం వరకు రూ.3వేల జీతంతో ఎన్‌ఎంఆర్‌గా పనిచేశాడు. ఆరోగ్యం క్షీణించడం, పనిచేసే స్థోమత లేకపోవడంతో ఎన్ఎంఆర్ నుంచి అధికారులు తొలగించారు. ఎటూపోయే దారిలేక ఆలయం వద్దే భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఎవరైనా భిక్షవేస్తే తిన్నట్లు లేకపోతే కడుపుమాడినట్టే. నెలకు రూ.500 ఇవ్వండి.. : లక్ష్మణ్ నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ప్రభుత్వం పింఛన్ రూ.200 ఇస్తుంది. ఇవి సరిపోవడం లేదు. మందులకే డబ్బులు అవుతున్నాయి. పనిచేయలేని స్థితిలో ఉండటంతో భిక్షాటన చేస్తున్నా. ఆలయ అధికారులు స్పందించి నెలకు రూ.500 ఇస్తే బాగుంటుంది.