ముంబై: కొవిడ్ సమయంలో ముంబైలో జరిగిన కిచిడీ కుంభకోణం అసలు సూత్రధారి శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ అని కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ ఎంపీ సీటు నుంచి శివసేన(ఉద్ధవ్) పార్టీ తరపున పోటీ చేస్తున్న అమోల్ కీర్తికార్‌కు కిచిడీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిరుపమ్ ఈ ఆరోపణలు చేశారు.
‘నేను ఈ కుంభకోణం మీద అధ్యయనం చేశాను. సంజయ్ రౌతే ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారి అని నాకు అప్పుడు తెలిసింది. కొవిడ్ సమయంలో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నుంచి రూ.7లక్షల కాంట్రాక్టులను కూతురు, భాగస్వాముల పేర్ల మీద సంజయ్ రౌత్ తీసుకున్నారు’అని నిరుపమ్ తెలిపారు.
కాగా, కొవిడ్ సమయంలో ముంబై మునిసిపాలిటీ పరిధిలో పేదలకు ప్రభుత్వం తరపున ఉచితంగా కిచిడీ అందించింది. ఈ కిచిడీ సప్లై కాంట్రాక్టులను రాజకీయ నాయకులే తీసుకుని తక్కువ కిచిడి సరఫరా చేసి ఎక్కువ బిల్లులు పొందారని ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఇదీ చదవండి.. కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment