black magic
-
ముంబై ఆస్పత్రిలో క్షుద్ర పూజల కలకలం
ముంబై: ముంబైలోని ప్రముఖ లీలావతి ఆస్పత్రిలో క్షుద్ర పూజలు జరిగాయన్న వార్త కలకలం రేపింది. తమ కార్యాలయం ఫ్లోర్ అడుగున మానవ ఎముకలు, పుర్రెలు, వెంట్రుకలు, బియ్యం, తదితర మంత్రాలకు ఉపయోగించే సామగ్రి కనిపించినట్లు ప్రస్తుత ట్రస్టీలు ఆరోపించారు. మాజీ ఉద్యోగుల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న ట్రస్టీలు అక్కడ తవ్వి చూడగా ఇవన్నీ కనిపించాయి. ఈ తవ్వకాలను వారు చిత్రీకరించారు. ప్రశాంత్ మెహతా, ఆయన తల్లి చారు మెహతాలకు హాని తలపెట్టేందుకే మంత్రాలు చేశారంటూ పోలీసులకు ఫిర్యా దు చేశారు. కాగా, మాజీ ట్రస్టీలు రూ.1,250 కోట్ల మేర ఆస్పత్రి నిధులను పక్కదారి పట్టించారని ప్రస్తుత ట్రస్టీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. అయితే, ఇవన్నీ నిరాధార, దురుద్దేశ పూర్వక ఆరోపణలని మాజీ ట్రస్టీ విజయ్ మెహతా, ఆయన కుటుంబీకులు, సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. లీలావతి ఆస్పత్రి వ్యవస్థాపకుడు కిశోర్ మెహతా సోదరుడే విజయ్ మెహతా. ఇలా ఉండగా, 2002లో కిశోర్ మెహతా వైద్యం కోసం విదేశాలకు వెళ్లగా విజయ్ మెహతా తాత్కాలికంగా ట్రస్టీ బాధ్యతలను చేపట్టారు. ఆ సమయంలో ఫోర్జరీ సంతకాలు, తప్పుడు పత్రాలతో తన కుమారులు, సన్నిహిత బంధువులను ట్రస్టీలుగా చేర్చుకున్నారు. శాశ్వత ట్రస్టీగా ఉన్న సోదరుడు విజయ్ మెహతాను ఆ హోదా నుంచి తప్పించారు. దీనిపై సుదీర్ఘకాలం న్యాయ పోరాటం జరిగింది. చివరికి, 2016లో కిశోర్ మెహతా ట్రస్టీగా రాజీనామా చేయడంతో వివాదం ముగిసింది. 2024లో కిశోర్ చనిపోవడంతో ఆయన కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీ అయ్యారు. ప్రశాంత్ ఆస్పత్రి ఆర్థిక నిర్వహణపై పూర్తి స్థాయి ఆడిట్‌కు ఆదేశించగా భారీగా అవకతవకలు వెలుగు చూశాయి. -
Lilavati Hospital రూ. 1,200 కోట్ల స్కామ్, చేతబడులు : సంచలన ఆరోపణలు
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన, ప్రసిద్ధి చెందిన ఆసుపత్రులలో ఒకటి లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ . 1978లో నాలుగు దశాబ్దాల క్రితం ముంబైలో స్థాపించిన ఐకానిక్ హాస్పిటల్‌పై పెద్ద దుమారం రేగుతోంది. లీలావతి హాస్పిటల్ ట్రస్టీలు బ్లాక్ మ్యాజిక్ గురించి షాకింగ్ ఆరోపణలు చేశారంటూ జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం ముంబైలోని ప్రతిష్టాత్మక లీలావతి హాస్పిటల్ (Lilavati Hospital)ను నిర్వహిస్తున్న లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌పై ట్రస్ట్‌లోని కొంతమంది . మాజీ ట్రస్టీలు దిగ్భ్రాంతికరమైన ఆర్థిక కుంభకోణం ఆరోపణలను గుప్పించారు అంతేకాదు రూ. 1,200 కోట్ల కుంభకోణం కేసు కూడా నమోదు చేశారు. ఈ ఆరోపణలలో మోసపూరిత ఆర్డర్లు, నిధుల దుర్వినియోగం నకిలీ సేకరణ లాంటివి ఉన్నాయి. ఫోర్జరీ, మోసం , పన్ను ఎగవేత ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆసుపత్రి కొనుగోళ్లకు సంబంధించి థర్డ్-పార్టీ డిస్ట్రిబ్యూటర్లతో అక్రమాలకు పాల్పడటం ద్వారా రూ.1,200 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది ట్రస్ట్‌లో సుదీర్ఘ న్యాయ పోరాటంలో భాగంగా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వ్యవస్థాపకుడి సోదరుడు విజయ్ మెహతా చేపట్టిన చర్యల్లో భాగంగా కిషోర్ మెహతా కుమారుడు ప్రశాంత్ మెహతా నేతృత్వంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తృతమైన ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని ఫిర్యాదు దారులు ఆరోపణ. ఈ విషయంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి , బాంద్రా పోలీస్ స్టేషన్లో విడివిడిగా ఫిర్యాదులు చేసింది. ఆసుపత్రి ప్రాంగణంలో పూర్వపు ట్రస్టీలు చేతబడులు (black magic) చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మానవ వెంట్రుకలు, బియ్యం, ఎముకలతో నిండిన ఎనిమిది కలశాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రశాంత్ మెహతా , అతని తల్లి చారు మెహతా కార్యాలయంలో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఆరోపణలొచ్చాయని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు."మేము ఆడిట్లు చేపట్టాము మరియు ఫోరెన్సిక్ ఆడిటర్లు ఐదు కంటే ఎక్కువ నివేదికలను సమర్పించారు, ఇది ఈ చట్టవిరుద్ధమైన ట్రస్టీల బృందం రూ. 1,500 కోట్లకు పైగా డబ్బును స్వాహా చేసి దుర్వినియోగం చేసిందని స్పష్టంగా పేర్కొంది. ఈ డబ్బును మాజీ ట్రస్టీలు స్వాహా చేశారు, వీరిలో ఎక్కువ మంది NRIలు మరియు దుబాయ్ మరియు బెల్జియం నివాసితులు," అని LKMMT శాశ్వత నివాసి ట్రస్టీ ప్రశాంత్ మెహతా విలేకరులకు తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్లతో పాటు, గుజరాత్‌లోని లీలావతి ఆసుపత్రి నుండి విలువైన వస్తువుల దొంగతనం కేసులో మరో కేసు దర్యాప్తులో ఉందని మెహతా తెలిపారు .PMLA (మనీలాండరింగ్ నిరోధక చట్టం) నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక నేరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగంగా స్పందించి, తగిన చర్య తీసుకోవాలని ఆయన కోరారు.ఇదిలా ఉండగా, ఆసుపత్రి మాజీ ట్రస్టీలు ముగ్గురుపై నమోదైన రూ.85 కోట్ల మోసం కేసుపై ముంబై పోలీసుల EOW దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు మంగళవారం తెలిపారు .LKMMT ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్ 30న బాంద్రా పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు EOWకి బదిలీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.లీలావతి హాస్పిటల్లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారిక వెబ్సైట్ ప్రకారం. 1997లో లీలావతి హాస్పిటల్ కేవలం 10 పడకలు , 22 మంది వైద్యులతో ప్రారంభమైంది. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో 323 పడకలు, అతిపెద్ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICUలు) ఒకటి, 300 కంటే ఎక్కువ మంది కన్సల్టెంట్లు, సుమారు 1,800 ఉద్యోగుల బృందంతోపాటు, ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతతో 12 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.ఒకే రోజులో, లీలావతి హాస్పిటల్ దాదాపు 1,500 మంది అవుట్ పేషెంట్లు , 200 మంది ఇన్ పేషెంట్లకు హాజరవుతారు, "సర్వేత్ర సుఖినః: సంతు, సర్వే సంతు నిరామయా", అంటే "అందరూ ఆనందంగా ... ఆరోగ్యంగా ఉండాలి", అనే నినాదంతో సేవలందిస్తోంది.కీర్తిలాల్ మెహతా ,అతని భార్య లీలావతి మెహతా 1997లో ఈ ఆసుపత్రిని స్థాపించారు. 1978లో, కీర్తిలాల్ మెహతా లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. కీర్తిలాల్ మెహతా కుమారుడు కిషోర్ మెహతా హాస్పిటల్ ప్రాజెక్ట్‌ను రూపొందించి,దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కిషోర్ మెహతా మరణం తరువాత, అతని భార్య చారు మెహతా ఈ ఆసుపత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఈ ట్రస్టీల మధ్య గత కొన్నేళ్లు వివాదాలు, కేసులు నడుస్తున్నాయి. -
సీరియల్ కిల్లర్.. ఎట్టకేలకు చిక్కాడు!
ఇదో ఇంట్రస్టింగ్ కేసు. దొంగలను పట్టుకోవడానికి హీరో దొంగగా మారి వారి ఆట కట్టించడం మనం సినిమాల్లో చూశాం. ఇదే తరహాలో సీరియల్ కిల్లర్‌ని పోలీసులకు పట్టించాడో ఓ వ్యక్తి. మరింత మంది ప్రాణాలు పోకుండా కాపాడాడు. తన సోదరుడి చావుకు కారణమైన దుర్మార్గుడిని చట్టం ముందు నిలబెట్టాడు. మూడేళ్లు పాటు శ్రమించి హంతకుడిని ఆధారాలతో సహా పట్టించాడు. ఆసక్తి కలిగించే ఈ కేసులో వివరాలేంటో చూద్దాం.అసలేం జరిగింది?2021 ఆగస్టులో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని కమోద్ గ్రామంలో వివేక్ గోహిల్ అనే యువకుడు బైక్ ప్రమాదంలో చనిపోయాడు. అతడు యాక్సిడెంట్లోనే చనిపోయాడని పోలీసులతో అందరూ అనుకున్నారు. కానీ అతడి సోదరుడు జిగానీ గోహిల్(24) మాత్రం నమ్మలేదు. తన సోదరుడిది ముమ్మూటికీ హత్యేనని అనుమానించాడు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగాడు. వివేక్‌పై విషప్రయోగం చేశారని అతడు తెలుసుకున్నాడు. తన సోదరుడు చనిపోవడానికి ముందు నవల్‌సిన్హ్ చావ్డా అనే మంత్రగాడితో టచ్‌లో ఉన్నట్టు గుర్తించాడు.నైట్ ట్యాక్సీ డ్రైవర్ అవతారంతన సోదరుడిని హత్య చేసిన దుండగుడిని పట్టుకునేందుకు జిగానీ గోహిల్ నైట్ షిప్ట్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు. యూట్యూర్ కూడా అయిన నవల్‌సిన్హ్‌కు కారు ఉంది. ఉదయం అతడు కారు నడిపేవాడు. రాత్రిపూట జిగానీ కారు నడుపుతూ నవల్‌సిన్హ్‌కు దగ్గరయి, అతడి విశ్వాసం సంపాందించాడు. అతడికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకున్నాడు. అభిజీత్ సింగ్ రాజ్‌పుత్ అనే మరో వ్యక్తిని హత్య చేయడానికి నవల్‌సిన్హ్ ప్లాన్ చేశాడు. తనకు సహకరిస్తే వచ్చే డబ్బులో 25 శాతం వాటా ఇస్తానని ఆశచూపించాడు. జిగానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించడంతో నవల్‌సిన్హ్ కటకటాల పాలయ్యాడు.ముగ్గురిపై విషప్రయోగంప్రత్యేక పూజలు చేసి ధనవంతుడిని చేస్తానని సనంద్ ప్రాంతానికి చెందిన అభిజీత్ సింగ్ (29)ను నవల్‌సిన్హ్ నమ్మించాడు. నీళ్లలో విషపదార్థం కలిపి అతడిని అంతం చేసి.. డబ్బు లాగాలని పథకం వేశాడు. జిగానీ ఇచ్చిన సమాచారంలో రంగంలోకి దిగిన సక్రెజ్ ప్రాంత పోలీసులు మమత్పురాలో నవల్‌సిన్హ్‌ను అరెస్ట్ చేశారు. 2023లోనూ ముగ్గురిని ఇలాగే అతడు చంపినట్టు పోలీసులు అనుమానిస్తునారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై విషప్రయోగం చేసి చంపేసి, వారి మృతదేహాలను దుద్రేజ్ కాలువలో పడేశారు. వారు ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ నమ్మించడంతో నవల్‌సిన్హ్ తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోవడంతో పాత కేసులను కూడా పోలీసులు తిరగదోడుతున్నారు. చదవండి: రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్యనరబలి ఆరోపణలునవల్సిన్హ్ను చట్టానికి పట్టించడంలో జిగానీ పెద్ద సాహసమే చేశాడు. ట్యాక్సి డ్రైవర్‌గా అతడికి దగ్గరయి ఆధారాలు సంపాదించాడు. సరైన సమయంలో హంతకుడిని పోలీసులకు పట్టించాడు. నవల్‌సిన్హ్ కారు నుంచి పూజాసామాగ్రి, విషపదార్థంగా అనుమానిస్తున్న వైట్ పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాంత్రిక పూజలతో అమాయకులను నమ్మించి హత్య చేసిన అతడిపై సెక్షన్ 55, 318(1), (2) కింద కేసు నమోదు చేశారు. అయితే నరబలి ఇచ్చాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ నరబలి వ్యతిరేక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. -
యూపీలో ఘోరం.. స్కూల్ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరిట హథ్రాస్‌లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారు. విద్యార్ధి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందాలని స్కూల్ హాస్ట్‌లోనే బాలుడిని హత్య చేశారు. వారం కిందట జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల యజమాని జసోదన్ సింగ్‌తో, అతని కుమారుడు దినేష్ భఘేల్ పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా వెలువడిన పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు... 11 ఏళ్ల కృతార్థ్ హథ్రాస్ జిల్లాలోని రస్‌గవాన్‌లోని డీఎల్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు కాల్ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్ వద్దకు వెళ్లగా.. బాలుడిని పాఠశాల డైరెక్టర్ తండ్రి తనక ఆరులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్‌కు మీ కొడుకు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. అయితే కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.స్కూల్ డైరక్టర్ తండ్రి దినేశ్ బఘేల్‌కు క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు. బాలుడిని తొలుత స్కూల్ బయట ఉన్న గొట్టపు బావి దగ్గర చంపాలని భావించారు. కానీ హాస్టల్ నుంచి బయటకు తీసుకువెళుతుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా అక్కడే, అతడి గొంతు నులిమి చంపేశారు.స్కూల్‌కు సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. అయితే స్కూల్ సక్సెస్ కోసం క్షుద్రపూజలు చేయాలని నిందితులు గతంలో కూడా ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 6వ 9వ తరగతి స్టూడెంట్‌ని బలి ఇవ్వాలని చూశారు. కానీ విఫలం అయ్యారని తేలింది. -
కుప్పంలో క్షుద్ర పూజల కలకలం..
-
సీఎంకు చేతబడి..!
-
దెయ్యం పట్టిందని క్షుద్రపూజలు.. యువకుడు మృతి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో క్షుద్రపూజలు వికటించి ఓ యువకుడు మృతిచెందాడు. చెన్నూర్ పట్టణం బొక్కగూడెం కాలనీకి చెందిన దంపతులు దాసరి లచ్చన్న, లక్ష్మి కుమారుడు మధు (33) గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచిర్యాలలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మధుకు చేతబడి అయిందని బంధువులు చెప్పడంతో శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్ ప్రాంతానికి చెందిన క్షుద్ర మాంత్రికుడిని ఆశ్రయించారు. ఇంటి వద్ద పూజల్లో భాగంగా మధుపైనుంచి కోడిని తిప్పడంతో అది చనిపోయింది. దీంతో దెయ్యం పట్టిందని, పెద్ద పూజలు చేయాలంటూ చెప్పడంతో ఆదివారం చెన్నూర్ గోదావరి ఒడ్డున మేకతోపాటు పలు క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రితో వెళ్లారు. పూజలు చేసే క్రమంలో మాంత్రికుడు మధుకు గుగ్గిలం (సాంబ్రాణి) పొగ వేసి పైనుంచి దుప్పటి కప్పినట్లు తెలిసింది. పొగతో మధు స్పృహ కోల్పోయి కాసేపటికే మృతిచెందాడు. దీంతో సదరు మాంత్రికుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రి ఇంటికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియల కోసం గోదావరి నదికి తీసుకెళ్లారు. పోలీసులకు విషయం తెలియడంతో నది వద్దే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ వాసుదేవరావును సంప్రదించగా.. క్షుద్రపూజలతో మృతిచెందాడన్న సమాచారం మేరకు పోస్టుమార్టం చేయించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని వివరించారు. చదవండి: చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి -
‘మా ఊరి పోలిమేర–2’ రిలీజ్ ఎప్పుడంటే..
‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్స్‌లో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఊరి పోలిమేర–2’. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు 2న విడుదల చేయనున్నారు. డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ‘మా ఊరి పోలిమేర ’ కన్నా రెండో భాగం ఇంకా ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి. -
హైదరాబాద్: మంత్రాలు చేసి నా బిడ్డను చంపేశారు!
సాక్షి, హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ బస్తీలో ఆత్మహత్య చేసుకున్న టీనేజర్ వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెను క్షుద్ర పూజలు చేసి బలవన్మరణానికి పాల్పడేలా చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ ఇంటి ముందు ఎవరో క్షుద్ర పూజలు చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు స్పందించలేదని నవ్య తల్లి చెబుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది నవ్య. అయితే తమ ఇంటి ముందు వారం నుంచి ఎవరో పూజలు చేస్తున్నారని, మంత్రాలు చేసి తన కూతురిని చంపేశారని నవ్య తల్లి వాపోతోంది. ‘‘గత వారం రోజులుగా ఇంటి ముందు క్షుద్రపూజలు చేస్తున్నారు. నిమ్మకాయలు, దీపాలు, బొమ్మలు, పసుపు-కుంకుమతో పూజలు చేస్తున్నారు. వాటిని ఫొటోలు తీశాం. వాటిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. కానీ, వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. పోలీసులు చర్యలు తీసుకుని.. నిందితులను పట్టుకుని ఉంటే ఇవాళ నా కూతురు ప్రాణాలతో ఉండేదేమో అంటూ సాక్షితో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నవ్య తల్లి. బుధవారం ఉదయం కూడా నవ్య బాగానే ఉందని, తనను.. తన భర్తను పనులకు నవ్వుతూ సాగనంపిందని, ఇవాళ(గురువారం) కాలేజీకి వెళ్తానని కూడా నవ్య చెప్పిందని ఆమె జరిగిందంతా వివరించారు. మరోవైపు నవ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆత్మహత్య కేసును.. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జగిత్యాలలో క్షుద్రపూజల కలకలం.. వీడియోలు వైరల్
సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పట్టణంలోని మోతె శ్మశాన వాటికలో ఘటన జరిగింది. శ్మశాన వాటికలో శవాలను కాల్చిన చోట ఓ గుర్తు తెలియని వ్యక్తి విబూది రాసుకుని పూజలు చేస్తుండగా కొందరు యువకులు.. సెల్ ఫోన్లో చిత్రీకరించి.. అతని తరిమేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు వ్యక్తి అర్ధరాత్రి పట్టణంలోని పలు వీధుల్లో నగ్నంగా తిరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. చదవండి: మౌనికది హత్యా, ఆత్మహత్యా! పురుగుల మందు తాగితే తలపై గాయం ఎక్కడిది? -
ఏలూరు జిల్లా: విస్సన్నపేటలో క్షుద్ర పూజల కలకలం
-
ఎన్టీఆర్ జిల్లా చౌటపల్లి గ్రామంలో క్షుద్రపూజలు కలకలం
-
హైదరాబాద్ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం !
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు భయాందోళ చెందారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి హైదర్షాకోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారనే విషయం తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాఠశాలలోని సామగ్రి గది ఎదుట, సైన్స్ ల్యాబ్‌లోని రెండు ప్రాంతాలలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఎవరో దుండగులు ఈ పూజలను చేసినట్టు గుర్తించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా వీటిని చూపి భయభ్రాంతులకు గురయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మదన్ కుమార్ వీటితో ఏమి కాదని తంత్రాలు వంటివి ఏమి లేవని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. వాటిని తొలగించి పాఠశాలను శుభ్రం చేశారు. అవరణలోని సీసీ కెమెరాలను సైతం దుండగులు మాయం చేసి ఈ క్షుద్ర పూజలు గమనార్హం. చదవండి: ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత -
కేరళలో కలకలం రేపుతున్న మహిళల నరబలి.. అత్యంత క్రూరంగా..
కొచ్చి: కేరళలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయనే మూఢ నమ్మకంతో దంపతులు ఏకంగా ఇద్దరు మహిళలను బలిచ్చారు. ఈ ఘటన పత్తినంతిట్ట జిల్లాలో వెలుగు చూసింది. కోచిలోని కడవంతర, సమీపంలోని కాలడికి చెందిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్లు అమ్ముకుని పొట్టపోసుకునేవారు. వీరిలో ఒకరు జూన్, మరొకరు సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయారు. వారి సెల్ నంబర్లు, టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలిద్దరినీ పత్తనంతిట్ట జిల్లా తిరువల్లలో ఉండే మసాజ్ థెరపిస్ట్ భగావల్ సింగ్, అతడి భార్య లైలా బలి ఇచ్చినట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపన్నులు కావాలంటే నరబలి తప్పదని వారి మిత్రుడైన పెరుంబవరూర్‌కు చెందిన రషీద్ అలియాస్ ముహమ్మద్ షఫీ సలహా ఇచ్చాడు. ఇతడే బాధిత మహిళలకు డబ్బు ఆశ చూపి భగావల్ సింగ్ ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లోనే మంత్రాలు చేసి, ఒకరిని జూన్‌లో మరొకరిని సెప్టెంబర్‌లో గొంతుకోసి చంపారు. అనంతరం షఫీ సాయంతో మృతదేహాలను ముక్కలుగా నరికి సొంతింటి ఆవరణలో, ఇలాంతూర్‌లో పాతిపెట్టారు. సింగ్ దంపతులతోపాటు షఫీని మంగళవారం కస్టడీలోకి తీసుకున్నట్లు కోచి నగర పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం పీటీఐకి చెప్పారు. కాలడికి చెందిన మహిళ ఆచూకీ తెలుసుకునే క్రమంలోనే రెండో ఘటన వెలుగు చూసిందన్నారు. వీటిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీ పి.ప్రకాశ్ అన్నారు. స్థానికంగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే భగావల్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డానే విషయం నమ్మలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు. అధికార సీపీఎంకు చెందిన భగావల్ సింగ్ మహిళలను బలి ఇవ్వడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. చదవండి: లాడ్జీలో వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్ Kerala | Three people arrested for killing two people in 'human sacrifice' ritual. The incident happened in the Pathanamthitta district. The deceased women used to sell lottery tickets. The bodies were buried at a house in the district: Kochi City Police Commissioner, CH Nagaraju pic.twitter.com/mt3kqaOs1j — ANI (@ANI) October 11, 2022 -
ఖమ్మం జిల్లా తుంబూరులో క్షుద్రపూజలు కలకలం
-
‘బ్లాక్ మ్యాజిక్ నమ్మేవారిని ప్రజలు విశ్వసించరు’.. కాంగ్రెస్‌కు మోదీ చురకలు!
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టటాన్ని సూచిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్లాక్ మ్యాజిక్‌ను నమ్మేవారు ఎప్పటికీ ప్రజల నమ్మకాన్ని సంపాదించలేరని ఆరోపించారు. ‘నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన కొందరు చేతబడిని నమ్ముకుంటున్నారు. బ్లాక్ మ్యాజిక్‌ను ప్రచారం చేసే ప్రయత్నాన్ని ఇటీవల ఆగస్టు 5న చూశాం. నల్ల దుస్తులు ధరిస్తే వారి వైరాగ్య కాలం ముగిసిపోతుందని భావిస్తున్నారు. కానీ, వారు ఎంత బ్లాక్ మ్యాజిక్, చేతబడి, అతీత శక్తులను ప్రదర్శించే ప్రయత్నం చేసినా ప్రజల నమ్మకాన్ని పొందలేరు.’ అని విమర్శించారు నరేంద్ర మోదీ. మరోవైపు.. నిరసనల రోజున కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, నల్లదుస్తులు ధరించి నిరసనలు చేయటం అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపనను వ్యతిరేకించినట్లేనన్నారు. నల్ల దుస్తులు ధరించి ముందుగా ఛలో రాష్ట్రపతి భవన్ మార్చ్ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రణాళిక రచించింది. అయితే.. వారిని అడ్డుకున్న పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సహా కీలక నేతలను అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీని బలవంతంగా లాక్కెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం! హెడ్మాస్టర్ గది ముందే..
డిండి (నల్గొండ): మండల పరిధిలోని టి.గౌరారం స్జేజి వద్ద ఉన్న దొంతినేని హన్మంతురావు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా చేస్తున్న క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పాఠశాల ప్రధానోపధ్యాయుడు పంతులాల్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత తాళం వేసి ఉన్న పాఠశాలకు ఆదివారం సెలవు దినం కావడంతో అటువైపుగా ఎవరూ వెళ్లలేదు. గుర్తు తెలియని వ్యక్తులు హెచ్ఎం గది ఎదురుగా కుంకుమ,పసుపు, నిమ్మకాయలంతో చేసిన క్షుద్ర పూజలు సోమవారం పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు, విధ్యార్థులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే ఎంఈఓ సామ్యనాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు పంతులాల్ తెలిపారు. అదేవిధంగా గతంలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు,పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పాఠశాల ఆవరణలో ఏమైనా ని«ధులు ఉన్నాయా లేక ఉపాధ్యాయులు, విధ్యార్థులను భయపెట్టడానికి ఆకతాయిలు చేస్తున్న పనినా అని పలువురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాలలో చేస్తున్న క్షుద్రపూజలపై విచారణ చేపట్టామని ఎస్ఐ.సరేష్ తెలిపారు. చదవండి: సమాచారం ఇచ్చి మరీ.. స్వాతి మీ చెల్లెను చంపేశాను -
చితి పేర్చి.. నిప్పంటించి
రామాయంపేట, నిజాంపేట (మెదక్): చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఒక వృద్ధునిపై అయినవారే హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చల్మెడ గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్ సోదరి భూదేవికి ముగ్గురు కుమారులున్నారు. కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సుదర్శన్ తమపై చేతబడి చేస్తున్నాడని కొన్నేళ్లుగా భూదేవి కుటుంబ సభ్యులు అనుమానిస్తూ, అతనిపై కక్ష పెంచుకున్నారు. రెండు రోజుల క్రితం భూదేవి పెద్ద కోడలు అనారోగ్యానికి గురైంది. సుదర్శన్ చేతబడి చేశాడని అనుమానించారు. రెండు కుటుంబాల మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. శనివారం ఉదయం భూదేవి ఆమె ముగ్గురు కొడుకులు, మరికొందరు సుదర్శన్ ఇంటికి వచ్చి దొరికిన వారిని దొరికినట్లే కొట్టారు. సుదర్శన్‌ను బయటకు లాక్కొచ్చి అతడి ఇంటి ముందే కర్రలతో చితిపేర్చి పెట్రోల్ పోసి నిప్పటించారు. అదే సమయంలో ఓ కేసు విచారణ నిమిత్తం నిజాంపేట వచ్చిన పోలీసులు మంటలను ఆర్పి సుదర్శన్‌ను రక్షించారు. గాయపడిన సుదర్శన్‌ను 108 అంబులెన్సులో రామా యంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ మేజిస్ట్రేట్ బాధితుని వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు ఒక్కరు కూడా హత్యాయత్నాన్ని అడ్డుకోలేదని బాధితులు వాపోయారు. -
వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ..
స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఇలాంటి ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా చాలామంది మూడనమ్మకాలను విశ్వసిస్తున్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఈ మూఢనమ్మకాల పేరిట చేస్తున్న హింసాత్మక ఆచారాలను కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికి పాటిస్తున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే చదువుకున్న కొంతమంది కూడా వాటిని నమ్ముతుండటం కాస్త విస్మయానికి గురి చేస్తుంది. అచ్చం అలానే ఇక్కడొకప్రాంతంలో ఆచారం పేరిట మహిళలను కొరడాతో హింసిస్తుంటారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని ఒక పూజారి ‘కాటేరి’(చెడును దూరంగా ఉంచమని ప్రార్థించే దేవత)లా నల్లని దుస్తులను ధరించి మహిళలపై కొరడాతో కొడుతుంటాడు. ఆ పూజారి దృష్టిలో వాళ్లంతా చేతబడికి గురయ్యారని అర్థం. ఇతను అలా కొరడాతో కొడుతుంటే చుట్టు ఉన్న చుట్టు ఉన్న ప్రజలు ఈలలు వేస్తూ, అరుస్తే ఉత్సాహపరుస్తుంటారు. సదరు మహిళ ఆ పూజారికి చేతులెత్తి నమస్కరిస్తుంటే పూజారి దుష్టగాలి సోకకుండా ఉండేదు కోసం వారిని కొరడాతో కొడుతుంటాడు. తాజా ఘటన నమక్కల్ జిల్లా వర్దరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో చోటుచేసుకోవడంతో..అది వైరల్ అయ్యింది. ఐతే పూజారి ఇలా చేస్తే తమకెంతో మేలు జరుగుతుందని ప్రజలు చెబుతుండటం విశేషం. వాస్తవానికి రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడే ఈ ఆలయంలో తొలిసారిగా ఈ వింత ఆచారానికి సంబంధించిన ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను నెల రోజులు పాటు నిర్వహిస్తారు. (చదవండి: పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఇజ్జత్ మొత్తం పోయింది) -
చేతబడి చేశాను, కానీ నా ప్రియుడి మీద కాదు: హీరోయిన్
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. ఈ షోలో కంటెస్టెంట్లు సంచలనాత్మక సీక్రెట్లు బయటపెడుతూ సెన్సేషన్ అవుతున్నారు. తాజాగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు హీరోయిన్ పాయల్ రోహత్గి ఓ భయంకరమైన సీక్రెట్ వెల్లడించింది. '15 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఒకానొక సమయంలో నా కెరీర్ డల్ అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో కానీ నా కెరీర్‌ను పుంజుకునేలా చేయడానికి నేను చేతబడి చేశాను. ఢిల్లీలోని ఓ పూజారి సాయంతో చేతబడిలోని వశీకరణం అనే తాంత్రిక విద్యను చేశాను. కానీ దానివల్ల నాకు ఏమీ ఒరగలేదు. నా కెరీర్‌ను కాపాడుకునేందుకు వశీకరణం చేశానని ఎవరికైనా చెప్తే నన్ను చులకన చేసి మాట్లాడతారేమోనని భయపడ్డాను. బహుశా చదువుకున్న అమ్మాయిలు, ఉద్యోగం చేసే మహిళలు ఇలాంటివి నమ్మరేమో! ఒకవేళ నమ్మి చేతబడి చేయించినా ఆ విషయాన్ని గుట్టుగా దాచిపెడతారు' అని చెప్పుకొచ్చింది. ఆమె రహస్యాన్ని విని బిగ్గరగా నవ్వేసిన కంగనా.. 'నీకు అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది. నీకిలాంటి మంత్రతంత్రాలు అవసరం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఏదో చేతబడి చేశానని ఆరోపించారు. ఒక అమ్మాయి సక్సెస్ అందుకుందంటే జనాలు ఆ విజయాన్ని కూడా శంకిస్తారు. నువ్వీ సీక్రెట్ చెప్పి నీ ధైర్యాన్ని చాటుకున్నావు. కాకపోతే నువ్వు సంగ్రమ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. మరి ఇప్పుడిది విన్నాక నేనో మాంత్రికురాలిని ప్రేమించానని అతడు అనుకోడా?' అని ప్రశ్నించింది. దీనికి పాయల్ స్పందిస్తూ.. 'అతడు ఏది నమ్మాలనుకుంటున్నాడో అతడికే వదిలేస్తున్నాను. కానీ ఆ చేతబడి అతడిపై మాత్రం చేయలేదు' అని చెప్పుకొచ్చింది. చదవండి: రామ్‌చరణ్ లగ్జరీ ఇల్లు, ఫొటోలు వైరల్ రామ్ చరణ్ చేతుల మీదుగా కేజీఎఫ్ 2 ట్రైలర్ -
మోడల్ స్కూల్ ఎదుట క్షుద్రపూజల కలకలం
జైనథ్( ఆదిలాబాద్): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి క్షుద్రపూజలు నిర్వహించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి మోడల్ స్కూల్ గేటు ఎదుట మట్టి బొమ్మలకు పసుపు పూసి, నిమ్మకాయలు, గుడ్లు పెట్టి పూజలు చేశారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యార్ధులు కొంతమంది పాఠశాలకు రావడంతో క్షుద్ర పూజలు చేసిన స్థలాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తహశీల్దార్ రాఘవేంద్రరావుకు ఫోన్లో సమాచారం అందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ క్షుద్రపూజల సామగ్రిని అక్కడి నుంచి తొలగింపజేసి వాటిని కాల్చి వేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు. సోమవారం అవగాహన సదస్సు.. క్షుద్రపూజల వంటి మూఢనమ్మకాలను నమ్మరాదని తహసీల్దార్ రాఘవేంద్రరావు గ్రామస్తులకు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. సోమవారం పాఠశాలలో మూఢనమ్మకాలపై ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు. -
మంత్రాల నెపంతో 3 కుటుంబాల వెలి
గూడూరు: మంత్రాల నెపంతో మూడు కుటుంబాలను తండా నుంచి బహిష్కరించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు చెరువు కొమ్ముతండాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు మాజీ ఎంపీటీసీ జాటోతు గంగమ్మ, గుగులోతు పూల్‌సింగ్, వీరన్న తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజుల కిందట తండా మధ్యలో బొడ్రాయి ప్రతిష్టించాలని తండావాసులంతా నిర్ణయించారు. మరో రెండ్రోజుల్లో బొడ్రాయి ప్రతిష్టాపన ఉందనగా తండా వీధులన్నీ శుభ్రం చేసే పని మొదలు పెట్టారు. దీంతో అందరూ నిర్ణయించిన చోట బొడ్రాయి ప్రతిష్టించకూడదని జాటోతు గంగమ్మ, గుగులోతు పూల్‌సింగ్, వీరన్న చెప్పారు. తమ మాటను వ్యతిరేకించారని తండావాసులంతా కలిసి ఆ మూడు కుటుంబాలు మంత్రాలు వేస్తున్నాయంటూ నిందించి, వారితో ఎవరూ మాట్లాడరాదంటూ, వారి ఇళ్లు ఉండే వీధికి ఎవరూ వెళ్లకూడదని, వారు తండాలోకి రాకూడదని నిర్ణయించి దారికి అడ్డుగా ముల్లకంప, రాళ్లు వేశారు. వారు ఉపయోగించే బోర్వెల్ను పాడుచేశారు. దీంతో బాధిత కుటుంబాలు రెండ్రోజుల కిందట గూడూరు పోలీసులను ఆశ్రయించాయి. స్థానిక ఎస్సై సతీశ్‌గౌడ్ తండావాసులకు నచ్చచెప్పి వచ్చారు. అయినా తండావాసులు ఆ మూడు కుటుంబాలను కలుపుకోకుండా శనివారం బొడ్రాయి ప్రతిష్టాపన జరపాలని నిర్ణయించారు. దీంతో మానసికంగా మరింత కుంగిన బాధిత కుటుంబాలు శుక్రవారం గ్రామపంచాయతీ పెద్దలు, ఇతర తండా పెద్దలతో గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్లు మింగేసిన పోలీస్..
-
క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్లు, నిమ్మకాయ తిన్న పోలీస్.. హిజ్రాతో పాటు ముగ్గురిని..
సాక్షి, వరంగల్: ఓపక్క టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు మూఢ నమ్మకలకు ముగింపు పలకలేకపోతున్నాం. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో చేతబడులు, క్షుద్ర పూజల పేరుతో ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కాకతీయ కాలనీ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. దీంతో భయాందోళనతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్రపూజలను భగ్నం చేసి హిజ్రాతో పాటు ముగ్గురి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వరంగల్ పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహాన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆది, బుధవారాల్లో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారు. రోడ్డుపై కోడిగుడ్లు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఉండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే.. దీంతో విషయం తెలుసుకున్న వరంగల్ పోలీసులు.. బ్రిడ్జిపై పూజలు చేసి వదిలేసిన కొబ్బరికాయలు, కోడిగుడ్లు, నిమ్మ కాయలు, పూజ సామగ్రిని ఒక్కచోటకు చేర్చారు. ప్రజలు చూస్తుండగానే నారాయణ అనే హోం గార్డ్ కోడి గుడ్డును గుటుక్కున మింగేశాడు. కొబ్బరికాయ పగలగొట్టి ఆ కొబ్బరి నీళ్లని తాగాడు. అంతేకాదు పూజలు చేసిన ఆ నిమ్మకాయలను కోసి నిమ్మరసం తాగేశాడు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చదవండి: ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్ బ్రిక్స్ తయారీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ -
క్షుద్రపూజ స్థావరాలపై దాడులు
జగిత్యాలక్రైం: క్షుద్రపూజలు, బాణామతి, మంత్రతంత్రాల స్థావరాలపై జిల్లా పోలీసులు ఆదివారం ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్, మల్లాపూర్ మండలం వేంపేట శివారు, మేడిపల్లి మండలం కేంద్రం, కోరుట్ల పట్టణంలోని పలువురు ఇళ్లు, పూజాప్రాంతాలపై మధ్యా హ్నం 3.30గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఆయా ప్రాంతాల్లో 78మందిని అదుపులోకి తీసుకు న్నారు. విచారణ అనంతరం నిందితులను తహసీల్దార్ల ఎదు ట బైండోవర్ చేశారు. కాగా, మంత్రాల నెపంతో జగిత్యాల టీఆర్ నగర్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కొడుకులను ప్రత్య ర్థులు ఇటీవల దారుణంగా హతమార్చారు. రాయికల్ మం డలం జగన్నాథపూర్ గ్రామంలో మంత్రాలు, క్షుద్రపూజలు చేస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోకుంటే మరణ శిక్ష తప్ప దని బహిరంగంగా ప్రకటిస్తూ కొందరు ఇటీవల ఫ్లెక్సీ ఏర్పా టు చేయడం సంచలనం సృష్టించింది. మూఢనమ్మకాలతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, దొంగ బాబాలు, దొంగ పూజారులు, మాయగాళ్లు ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటూ, డబ్బు దండుకుంటూ సమాజంలో భయభ్రాం తులు సృష్టిస్తున్నారని కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీసుశాఖ.. రహ స్య ప్రణాళికతో జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. ఈ సందర్భంగా ఎస్పీ సింధూశర్మ మా ట్లాడుతూ మంత్రాల పేరిట ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
తీరు మారకుంటే.. ఆ ఎనిమిదిమంది మాంత్రికులను మట్టుబెడతాం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/రాయికల్ (జగిత్యాల): జగిత్యాలలో మంత్రాల నెపంతో ముగ్గురు వ్యక్తులను పాశవికంగా హతమార్చిన ఘటన మరువకముందే అలాంటి దృశ్యం పునరావృతం అవుతుందంటూ వెలిసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఇటీవల మంత్రాల నెపంతో జగిత్యాలకు చెందిన వడ్డీ వ్యాపారి జగన్నాథం నాగేశ్వర్రావు అతని ఇద్దరు కుమారులను కులసంఘం సమావేశంలోనే హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 8 మందిని అదే తరహాలో హతమారుస్తామంటూ.. శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్‌లో ఫ్లెక్సీ వెలిసింది. ఇది స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామంలో 8 మంది మాంత్రికులు ఉన్నారని, వారు తీరు మార్చుకోకపోతే చంపుతామని అందులో హెచ్చరిక ఉంది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, ఎస్సై కిరణ్‌కుమార్ ఊరిలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ఎవరికైనా ప్రాణభయం ఉన్నా, బెదిరింపులు వచ్చినా.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. దీంతో గ్రామానికి చెందిన ఎనిమిది మంది గిరిజనులు తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. (చదవండి: బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు) -
మంత్రాల నెపంతో దంపతులపై దాడి
అల్లాదుర్గం(మెదక్): మంత్రాలు(చేతబడి) చేస్తున్నారనే నెపంతో దంపతులను కరెంటు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లాదుర్గం గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. తమ పాలివారైన రమేశ్ కుటుంబం చేతబడే... కిష్టయ్య అనారోగ్యానికి కారణమని ఆరోపిస్తూ ఆయన కుటుంబీకులు ఆదివారంరాత్రి గొడవపడ్డారు. సోమవారం ఉదయం మళ్లీ గొడవకు దిగి రమేశ్‌ను, ఆయన భార్య రజితను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి నడిరోడ్డుపై స్తంభానికి వైర్లతో కట్టేశారు. కట్టెలతో కొట్టారు. పోలీసులు వచ్చి రమేశ్ దంపతులను ఆసుపత్రికి తరలించారు. రమేశ్ ఫిర్యాదు మేరకు కిష్టయ్య కొడుకులు కుమార్, నగేశ్, భేతయ్య, భార్య ఆశమ్మ, కూతురు అంబమ్మపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి జోగిపేట కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. -
దొంగ బాబా దారుణం.. మహిళ ఇంట్లో సమస్యలు తీరుస్తానని చెప్పి రెండేళ్లుగా..
ముంబై: తనకు మహిమలు ఉన్నాయని ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడతానని ఓ దొంగ స్వామీ ఒక మహిళను రూ. 32 లక్షలు మోసం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడు ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన బాబాన్ బాబూరావు పాటిల్‌ను పోలీసులు గర్తించారు. వివరాల ప్రకారం.. కాల్వ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని వాటిని తరిమివేసే శక్తి తనకు ఉందని నమ్మించాడు ఓ దొంగ బాబా. అయితే బాబా మోసాన్ని గ్రహించలేని ఆ మహిళ 2019 డిసెంబర్ నుంచి నిందితుడుకి పలు మార్లు డబ్బులు ఇచ్చింది. ఈ రకంగా పాటిల్ ఆమె నుంచి మొత్తం రూ.31.60 లక్షలతో పాటు కొన్ని ఖరీదైన వస్తువులను తీసుకున్నాడు. అయితే ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తను ఇంట్లో సమస్యలు పరిష్కారం కాకపోయే సరికి ఆ మహిళ దొంగ బాబా అసలు స్వరూపం తెలుసుకుని మోసపోయానని గ్రహించింది. దీంతో సమీప పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి జరిగినదంతా చెప్పి పాటిల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. చదవండి: స్కూల్లో ఉన్న విద్యార్థినిని బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లి లైంగిక దాడి -
దారుణం: ఆరు నెలల బిడ్డను బలి ఇచ్చిన అవ్వ
తిరువొత్తియూరు: యాభై ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం కోసం మూఢనమ్మకంతో ఆరు నెలల బిడ్డను బలి ఇచ్చిన మంత్రవాది సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా పేరావూరని, మల్లిపట్టినం చెందిన అస్రుద్ధీన్ (32) కార్మికుడు. ఇతని భార్య షాలిషా (24). వీరికి రాజామహ్మద్ అనే ఆరు నెలల ఆడబిడ్డ ఉంది. ఈ క్రమంలో నస్రుద్ధీన్ పిన్ని షర్మిల బేగం (48) తన భర్త ఆరోగ్యం బాగుపడటానికి కేరళ మంత్రవాది మహ్మద్ సలీం (48) సలహా మేరకు నస్రుద్ధీన్ కుమార్తె అయిన చిన్నారిని బలి ఇచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు షర్మిళ బేగం, అస్రుద్ధీన్, మంత్రవాది మహ్మద్‌ను శనివారం అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
షాద్ నగర్లో క్షుద్ర పూజలు..బయటపడ్డ దొంగ స్వామీజీ బాగోతం
సాక్షి, రంగారెడ్డి: పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా షాద్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులు ఓ దొంగ బాబా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా ఓ ప్రైవేట్ వెంచర్ లో ఇల్లు కట్టుకుని.. కాళికామాత విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్లేవారి కళ్లల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొడుతున్నాడు. అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు. గతంలో మధురాపూర్ గ్రామంలో ఇలాగే ప్రవర్తించగా.. గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి వెంచర్ దగ్గరకు క్షుద్ర పూజలను షిఫ్ట్ చేశాడు. తాజాగా అతని వద్దకు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూజలు చేయించడానికి తీసుకొచ్చింది. చదవండి: కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్ అయితే డబ్బులు తీసుకొని తల్లి ఆరోగ్యాన్ని నయం చేయలేదని మోపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నిందితుడు ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టింది. దీంతో శివ స్వామీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దొంగ స్వామిపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా తాను క్షుద్ర పూజలు చేయలేదని. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మంత్రిస్తానని స్వామి పోలీసులు తెలిపారు. చదవండి: మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం.. -
నా ముందు నగ్నంగా కూర్చోబెడితేనే గుప్తనిధి కనబడుతుందంటూ..!
బెంగళూరు: కంప్యూటర్లు వచ్చి ఎంతటి ఆధునిక యుగంలో జీవిస్తున్నప్పటికీ ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలను కొంతమంది విశ్వస్తున్నారంటే వాళ్లను ఏమనాలో కూడా అర్ధంకాదు. అంతేందుకు ఒక చిన్నగ్రామం సైతం అత్యంత అభివృద్ధి పదంలోకి దూసుకుపోతున్న ఇంకా ఇలాంటి అమానుష ఘటనలకు తెరలేపుతున్నవారు అక్కడక్కడ తారసపడుతునే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అచ్చం అలానే ఇక్కడొక పూజారి గుప్తనిధులంటూ ఎలాంటి పనిచేశాడో చూస్తే మనం ఏ యుగంలో ఉన్నాం అని అనిపించక మానదు. (చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!) అసలు విషయంలోకెళ్లితే... షాహికుమార్.. తమిళనాడుకు చెందినవాడు. కర్ణాటకలోని భూనహళ్లికి చెందిన వ్యవసాయదారుడు శ్రీనివాస్ అనే వ్యక్తికి ఒక పెళ్లిలో పూజలు చేసే షాహికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఈ షాహికుమార్.. శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. అయితే శ్రీనివాస్ ఇల్లు 75 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత ఇల్లు. ఈ మేరకు షాహికుమారు చాలా పాతకాలం నాటి పూర్వకాలం ఇంటిలో గుప్తనిధులు ఉంటాయని, వాటిని బయటకు తీయకపోతే చాలా ఆపదలు ఎదుర్కొంటారని శ్రీనివాస్‌తో చెబుతాడు. ఈ మేరకు షాహికుమార్ గుప్తనిధుల తీసే నిమిత్తం శ్రీనివాస్ నుంచి అడ్వాన్స్‌గా రూ 20 వేలు కూడా తీసుకున్నాడు. అయితే కోవిడ్-19 లాక్డౌన్లతో పని వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు శ్రీనివాస్‌ని కలసి పని ప్రారంభిస్తానని చెప్పాడు. పైగా ఈ గప్త నిధుల నిమిత్తం చేసే పూజల కోసం శ్రీనివాస్‌కుమార్ ఇంట్లోని ఒక గదిని ఎన్నుకున్నాడు. అంతేకాదు ఈ నిధి కనపడాలంటే ఒక స్త్రీ తన ముందు నగ్నంగా కూర్చొబెడితే గుప్తనిధి కనపడుతుందని చెబుతాడు. పైగా ఆ స్త్రీ శ్రీనివాస్ కుటుంబంలోని అమ్మాయే అయ్యి ఉండాలని పట్టుబడతాడు. దీంతో శ్రీనివాస్ ఈ పని నిమిత్తం ఒక దినసరి కూలి మహిళకు రూ.5000 ఇచ్చి ఒప్పించి తీసుకువస్తాడు. అయితే పూజారి షాహికుమార్ పనులు అనుమానస్పదంగా అనిపించి స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇస్తారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పూజారి షాహికుమార్ అతని సహాయకుడు మోహన్, తాపీ మేస్త్రీలు లక్ష్మీనరసప్ప, లోకేష్, నాగరాజ్, పార్థసారథిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడ స్థానకుల చొరవతోనే ఈ దినసరి కూలి మహిళను, ఆమె నాలుగేళ్ల కూతురును రక్షించగలిగామని చెప్పారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) -
కర్ణాటక: చేతబడికి గురైనట్లు అనుమానిస్తున్న రెండేళ్ల చిన్నారి మృతి
బెంగళూరు: కర్ణాటకలో చేతబడికి గురైనట్లు అనుమానిస్తున్న రెండేళ్ల చిన్నారి మరణించింది. బెలగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. అయితే ఇప్పటికీ ఆ చిన్నారి ఎవరనే విషయం తెలియరాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాగా సెప్టెంబర్ 24న బెలగావిలోని హల్యాలా గ్రామం వద్ద ఉన్న చెరుకు పొలంలో రెండేళ్ల బాలికను బట్టలో చుట్టి పడేసినట్లు కొంతమంది రైతులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో చేతబడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాధితురాలి ఒంటిపై సిగరెట్ పీకలు, కెమికల్స్ వాడినట్లు కనిపించడంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానించారు. కానీ ప్రాథమిక దర్యాప్తులో చిన్నారిపై అత్యాచారం జరగలేదని తేలింది. అయితే ఆసుపల్రిలోని బాలిక ముందుగా కోలుకుంటున్న లక్షణాలు కనిపించినప్పటికీ మళ్లీ సిరీయస్ అయ్యిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఇప్పటి వరకు ఎవరూ కూడా మిస్సింగ్ కేసు నమోదు చేయలేదని తెలిపారు. కూతురు మిస్ అయినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదు చేయకపోవడంతో ఈ ఘటనలో వారి పాత్ర ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారిని గుర్తించేందుకు కర్ణాటకతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు పాప ఫోటోను పంపించారు. -
నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు
డిజిటల్ కాలంలో కూడా చేతబడులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుటు, విలన్ టార్జాన్ అలియాస్ ఎదిరె లక్ష్మినారాయణ గప్తా. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా వందల సినిమాల్లో నటించాడు. ఈ క్రమంతో తన భార్య మరణంతో నటనకు బ్రేక్ ఇచ్చిన టార్జాన్ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు లక్ కూడా ఉండాలన్నాడు. చదవండి: తండ్రి బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇవ్వబోతోన్న సుస్మిత కొణిదెల ‘దేవుడు దయ వల్ల నన్ను ప్రేక్షకులు ఆదరించారు. అలా 30 ఏళ్లపాటు సినిమాల్లో నటుడిగా కొనసాగాను. సినీ కేరీర్ పరంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాని అనుకోని పరిస్థితుల వల్ల మధ్యలో బిబినెస్ మొదలు పెట్టాను. ఎందుకంటే మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుకు రూ. 2వేలు మాత్రమే ఇచ్చేవారు. అవి సరిపోక వ్యాపారం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. ఇక తనన కుటుంబం గురించి చెప్పుకొస్తూ.. తనది ఆంధ్రప్రదేశ్‌లోని పరిగి సమీపంలో రాపోలు అనే పల్లెటూరని చెప్పాడు. ‘మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్న ఊరి సర్పంచ్‌గా చేసేవారు. ఈ క్రమంలో మేమంటే పడని వారు, మా దగ్గరి బంధువులే మా కుటుంబానికి చేతబడి చేశారు. దీనివల్ల రెండేళ్లు అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం’ అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నాడు. చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు అంతేగాక ‘చేతబడి ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. మా అమ్మ, నాన్న, అన్నయ్య, నాకు చేతబడి చేశారు. దీంతో మా అన్నయ్య ఏం తిన్నా వాంతులు చేసుకునేవాడు. నాకు అయితే నీళ్లు తాగిన వెంటనే బయటకు వచ్చేవి. కడుపు నొప్పి అయితే చాలా తీవ్రంగా ఉండేది. అలా మేము 13 ఏళ్లు నరకం చూశాం. అన్ని నష్టాలే దీంతో ఉన్నవి అన్ని అమ్మేసి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఇక్కడ వచ్చాక డబ్బులు లేక తినడానికి తిండి దొరక్క కష్టాలు పడ్డాం. దీంతో ఏ పని దొరికితే అది చేసేవాళ్లం. ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్టు బిజినెస్ ప్రారంభించాం. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది’ అని పేర్కొన్నాడు. అయితే ఇప్పటికీ తన సొంత గ్రామానికి వెళ్లినప్పుడు అనారోగ్యం బారిన పడతానని. అక్కడ నీళ్లు తాగితే వెంటనే బయటకు వస్తాయని, కడుపు నొప్పి వస్తుందని చెప్పాడు. ఇప్పటికీ చేతబడులు ఉన్నాయని, మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు అన్నాడు. అమావాస్య, పౌర్ణమిలను నమ్మినప్పుడు చేతబడి ఉందని కూడా నమ్మాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: అయ్య బాబోయ్..అషురెడ్డితో ఆర్జీవీ అలా.. వీడియో వైరల్ -
మంత్రించిన యంత్రాలు.. తెరిచి చూస్తే పేలిపోతాయి
శృంగవరపుకోట: పిల్లలు కలగని దంపతులు, నిరుద్యోగులను టార్గెట్ చేసి మంత్రించిన యంత్రాల పేరుతో మోసగిస్తున్న ముగ్గురు దొంగస్వాములను ఎస్.కోట మండలం, ముషిడిపల్లి గిరిజన గ్రామంలో బుధవారం నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి దొంగస్వాములను పట్టుకున్న ముషిడిపల్లి గ్రామపెద్ద ముత్యాల సన్యాసిరావు, స్వాముల చేతిలో మోసపోయిన చీడిపాలెం గిరిజనులు చిమిడి జోగారావు, గడుబంటి రామకృష్ణ, జి.గంగరాజు, అప్పారావు, బి.గంగమ్మ, పొటుపర్తి జగన్నాథం తదితరులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఎస్.దుర్గారావు, విశాఖ జిల్లా వాడపల్లికి చెందిన సతీష్, కె.దుర్గారావు అనే ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చారు.స్వామిజీ శిష్యులమని చెప్పి గ్రామంలోని పలువురి నుంచి గిరిజన కుటుంబాల వివరాలు సేకరించారు. ఆ తర్వాత గిరిజనుల ఇళ్లకు వెళ్లి మీకు ఏళ్ల తరబడి పిల్లలు లేరని కొందరికి, మీకు ఉద్యోగాలు రాక బాధపడుతున్నారంటూ మరి కొందరికి చెప్పి కలిశారు. మీరు పడుతున్న సమస్యలను దుర్గారావు స్వామీజీ తీరుస్తారని చెప్పి రంగప్రవేశం చేయించారు. దొంగస్వామీజీ వచ్చి రూ.6వేలు చెల్లిస్తే మంత్రించిన యంత్రం, పూజ చేసిన సామగ్రి ఇస్తానని, వాటిని భద్రంగా దాచుకుంటే సమస్యలు తీరడంతో పాటు కోరికలు నెరవేరుతాయని నమ్మించి 9మంది నుంచి రూ.53వేలు వసూలు చేశాడు. మంత్రించిన యంత్రాలు, పూజాసామగ్రి గురించి ఎవరికీ చెప్పకూడదని, వాటిని తెరిచి చూస్తే పేలిపోతాయని స్వామిజీ బెదిరించాడు. నమ్మినట్లు ప్రవర్తించిన గ్రామపెద్ద దొంగ స్వామీజీ, ఇద్దరు శిష్యులు బుధవారం ఉదయం ముషిడిపల్లి గ్రామంలో ప్రవేశించి మాజీ సర్పంచ్ ముత్యాల సన్యాసమ్మ కుమారుడు ముత్యాల సన్యాసిరావును కలిసి మా వద్ద మంత్రించిన యంత్రాలను తీసుకుంటే కోరికలు వెంటనే తీరుతాయని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో సన్యాసిరావు నమ్మినట్లు ప్రవర్తించి ముగ్గురు స్వాములను గ్రామంలోని రామాలయంలోకి తీసుకువెళ్లి లోపల ఉంచి బయట తాళం వేసి ఎస్.కోట పోలీసులకు సమాచారమందించాడు. ఈ విషయం తెలిసిన తరువాత స్థానికంగా మోసపోయిన చీడిపాలెం బాధితులు, గ్రామస్తులు పెద్దఎత్తున రామాలయం వద్దకు చేరుకున్నారు. బ్రాహ్మణ వేషధారణలో తిరుగుతూ అమాయకులను మోసగిస్తున్న ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆలయ పురోహితుడు దొంతుకుర్తి సాయికుమార్ శర్మ వారిని ప్రశ్నించగా ఒకసారి బ్రాహ్మణులమని, మరోసారి విశ్వబ్రాహ్మణులమని పొంతనలేని సమాధానాలిచ్చారు. పోలీసు సిబ్బంది రామాలయం వద్దకు చేరుకుని ముగ్గురినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ పూజలు
-
భార్యకు అబార్షన్... క్షుద్రపూజల కోసం బాలిక కళ్లు పీకి..
పట్నా: సాంకేతికత ఎంత పెరుగుతున్నా తాంత్రిక, క్షుద్ర పూజల పేరిట జరిగే హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బిహార్‌లో ఓ వ్యక్తి పదేళ్ల చిన్నారిని క్షుద్ర పూజాల కోసం దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంగేర్ జిల్లాలోని ఓ గ్రామంలో దిలీప్ కుమర్ చౌదరి తన భార్యకు తరచూ అబార్షన్ అవుతుండటంతో ఆ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్నాడు. అబార్షన్ కాకుండా శాశ్వతంగా నివారించాలకున్నాడు. దాని కోసం స్థానిక తాంత్రికుడు పర్వేజ్ ఆలమ్‌ను ఆశ్రయించాడు. అయితే పదేళ్ల ఓ బాలిక రక్తం, కళ్లతో క్షుద్రపూజ చేస్తే అబార్షన్ కాకుండా నివారించవచ్చని పర్వేజ్ చెప్పాడు. ఈ క్రమంలో ఆగస్టు 4న ఓ బాలిక తన తండ్రికి భోజనం ఇచ్చి తిరిగి వస్తుండగా.. దిలిప్ కుమార్ తన స్నేహితులతో కలిసి ఆమెపై దాడి చేసి కళ్లను పీకి, రక్తం సేకరించాడు. అయితే ఆ బాలిక తిరిగి ఇంటికి ఎంతకు రాకపోవటంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మరుసటి రోజు గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయడానికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా పర్వేజ్ ఆలమ్, దిలీప్ కుమర్ చౌదరి, తన్వీర్ ఆలమ్, దశరథ్ కుమార్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే నరబలి కారణంగా తమ కుమర్తెను హత్య చేయలేదని, హత్యాచారం చేసి చంపారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
చేతబడి నెపంతో గొడ్డళ్లతో దాడి చేసి హత్య
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం శివారులో ఈ నెల 8న వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. చేతబడి నెపంతో సమీప బంధువులే దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి సీఐ వెంకన్న, ఎస్ఐ సుధాకర్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. సంస్థాన్ నారాయణపురానికి చెందిన చిలువేరు మల్లయ్యకు గ్రామంలో తన తోడపుట్టిన సోదరులు నలుగురితో పాటు బంధువులు ఉన్నారు. ఇటీవల మల్లయ్య బంధువు అయిన వినయ్‌కుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా మరో బంధువైన శివకుమార్ అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. వారి మృతికి మల్లయ్య చేతబడే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. శివకుమార్ కర్మకాండ ఈ నెల 7న సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించారు. ఆ రోజే మల్లయ్యను అంతం మొందించాలని మల్లయ్య బంధువులైన సంస్థాన్‌నారాయణపురానికి చెందిన చిలివేరు మహిపాల్, చిలివేరు వెంకటేశం, పుట్టపాకకు చెందిన నడికూడి నాగరాజులు కుట్రపన్నారు. ఈ నెల 8న శ్రీవారి వనం ప్రాంతంలో మల్లయ్య పశువులను మేపడానికి వెళ్లడాన్ని గమనించారు. పథకం ప్రకారం ముగ్గురు మల్లయ్యపై గొడ్డళ్లతో అకస్మాత్తుగా దాడి చేసి నరికి చంపారు. ముగ్గురు నిందితులను శనివారం ఉదయం చౌటుప్పల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉండగా అరెస్ట్ చేసినట్లు వివరించారు. వారి నుంచి బైక్, గొడ్డళ్లు, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముగ్గురిని నల్లగొండ కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు. -
క్షుద్ర పూజలు: యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి..
గూడూరు(పెడన)/కృష్ణా జిల్లా: క్షుద్ర పూజల పేరిట ప్రజలను నమ్మించి నిలువునా దోపిడీకి పాల్పడుతున్న ముఠా గుట్టును గూడూరు పోలీసులు రట్టు చేశారు. బందరు రూరల్ సీఐ ఎన్.కొండయ్య వెల్లడించిన వివరాల ప్రకారం గుంటూరులోని శారదానగర్ కాలనీలో నివాసం ఉండే వినుకొండ సుబ్బారావు, వినుకొండ శివపార్వతిలు క్షుద్ర పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో గూడూరు మండలానికి చెందిన యువతికి ఎవరో తాంత్రిక పూజలు జరిపారని, క్షుద్రపూజలు నిర్వహించి ఆమెకు నయం చేస్తామని నమ్మించారు. వారి మాయమాటలు నమ్మిన బాధితురాలి తల్లిదండ్రులు యువతికి పూజలు నిర్వహించడానికి అంగీకరించారు. దీంతో యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తూ వీడియోలు చిత్రీకరించారు. అప్పటి నుంచి యువతి అర్ధనగ్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ అందినకాడికి గుంజుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు మెయిల్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన గూడూరు ఎస్సై సిహెచ్.కె.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించి పట్టుకున్నట్లు సీఐ కొండయ్య వెల్లడించారు. చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసిన గూడూరు పోలీసులను సీఐ అభినందించారు. క్షుద్ర పూజల పేరిట ఎవరైనా మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తే నమ్మవద్దని సీఐ హితువు పలికారు. కార్యక్రమంలో ఎస్సై దుర్గాప్రసాద్‌సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ‘నేను నపుంసకుడిని.. తొలి రేయిలోనే భార్యకు షాక్’ విషాదం: అమ్మమ్మా.. ఎంతపని చేశావ్! -
క్షుద్రపూజలు: మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి..
యశవంతపుర: కరోనా పోవాలంటూ అపరిత వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఘటన హాసన జిల్లాలో జరిగింది. బేలూరు తాలుకా క్యాతనకెరె గ్రామం పొలిమేరలో మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి చీర, చేతి గాజులు, తాళి తొడిగి పసువు–కుంకుమతో పూజలు చేశారు. ఓ మేకను బలి ఇచ్చి అక్కడే వదిలి వెళ్లారు. గురువారం ఉదయం పూజలు, రక్తం చూసిన గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. స్థలాన్ని బేలూరు పోలీసులు పరిశీలించారు. చదవండి: యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే.. ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త -
‘బ్లాక్ మ్యాజిక్ పేరుతో బ్లాక్ మెయిల్, రూ.30 లక్షలకు డీల్’
కుషాయిగూడ: గుప్తనిధులు తీసే ముందు చేసే క్షుద్రపూజలు (బ్లాక్ మ్యాజిక్ పవర్) కోసం చేసుకున్న డీల్ కాస్తా బెడిసికొట్టింది. బ్లాక్ మెయిల్‌కు పాల్పడి అడిగిన సొమ్ము ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. వివరాలను ఆదివారం కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ వెల్లడించారు. నాగార్జునగర్ కాలనీకి చెందిన ఆంటోనీ మోసిస్ లారెన్స్ ఆలియాస్ శ్రీకాంత్ ప్యాబ్రికేషన్ పనిచేస్తూ స్థానికంగా చెగోడిల బట్టీ నిర్వహిస్తున్నాడు. గుప్తనిధులు తవ్వకాలు చేసే క్రమంలో క్షుద్రపూజలు నిర్వహించడం ప్రవృత్తిగా పెట్టుకొని పూజల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. రూ.30 లక్షలకు డీల్ ఆల్విన్‌కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ కొట్రా శ్రీనివాస్‌రెడ్డి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బిల్డింగ్ కాంట్రాక్టరు రాంమూర్తి (61) మిత్రులు. ప్రకాశం జిల్లాలో తనకు కొంత వ్యవసాయ భూమి ఉందని, అందులో గుప్తనిధులు వెలికి తీయాలంటే క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని రాంమూర్తి శ్రీనివాస్‌రెడ్డితో అన్నాడు. దీంతో తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని, ఈ నెల 5న రాంమూర్తిని కుషాయిగూడ, నాగర్జుననగర్ కాలనీలో నివసించే ఆంటోనీ లారెన్స్ ఇంటికి తీసుకెళ్లాడు. భూమికి సంబంధించిన పత్రాలు, ఫొటోలను ఆంటోనీకి చూపిన రాంమూర్తి రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ నెల 11న అమావాస్య రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 10న సాయంత్రం శ్రీనివాస్‌రెడ్డి, రాంమూర్తి బైక్‌పై కూకట్పల్లి నుంచి బయలుదేరి ఆంటోనీ ఇంటికి చేరుకున్నారు. ఆంటోనీ కొత్త నాటకానికి తెర తీశాడు. (చదవండి: ‘మాకు నచ్చిందే చెబుతాం, అది అంతే, మేమింతే’) కాళభైరవ శక్తుల పేరుతో.. భూమి పత్రాలు, ఫొటోలకు పూజలు చేసే క్రమంలో కాళభైరవ శక్తులు నా కుటుంబ సభ్యులపై పడి వారు అనారోగ్యానికి గురయ్యారని, రూ.30 లక్షల వరకు ఖర్చు అయ్యిందని, ఆ డబ్బులు ఇవ్వాలని రాంమూర్తిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. రూ.7 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. రాంమూర్తి డబ్బులు సమకూర్చే ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో కర్రలతో కొట్టారు. ఈ నెల 12న అతడిని బట్టీ వద్దకు తీసుకెళ్లారు. చెరువులో మృతదేహాన్ని పడేసి.. డబ్బులు రాకపోవడంతో రాంమూర్తిని చంపేసి అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, రూ.56 వేల నగదు తీసుకొని సమీపంలో నాగారం, అన్నారం చెరువులో మృతదేహాన్ని పడేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఆంటోనీ, శ్రీనివాస్‌రెడ్డితో పాటు వారికి సహకరించిన శాగంటి వాణిసాగర్, జిత్తుసింగ్, మనోజ్సింగ్, ఆంటోనీ భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మూడు బైక్‌లు, బంగారు గొలుసు, ఆరు సెల్ఫోన్లు, గోల్డ్ రింగ్, రూ.7 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై చిలకలగూడ, అంబర్పేట్, నాచారం పోలీస్స్టేషన్ల పరిధిలో ఆరు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. (చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..) -
దుస్తులు విప్పేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది
ముంబై : క్షుద్ర పూజల పేరిట మైనర్‌పై వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం నాగ్‌పూర్‌కు చెందిన విక్కి గణేష్ ఖప్రే అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌తో స్నేహం చేసుకున్నాడు. ప్రత్యేక పూజలు చేస్తే ఆమె అత్యంత సంపన్నురాలు అవుతుందని నమ్మబలికాడు. ఇందు కోసం తాము చెప్పినట్లు చేయాలని కోరాడు. ‘‘ పూజల్లో భాగంగా దుస్తులు విప్పేస్తే.. 50 కోట్ల రూపాయల డబ్బుల వర్షం కురుస్తుంది’’ అని చెప్పాడు. అయితే దీనిపై అనుమానం వ్యక్తం చేసిన మైనర్ అతడికి దూరంగా ఉండసాగింది. అయినప్పటికి విక్కి.. మైనర్‌పై ఒత్తిడి తేసాగాడు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. విక్కిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. చదవండి : రోడ్లపై యువతుల దందా.. -
కుట్ర.. యువతితో పూజ చేయిస్తామని..
సాక్షి, పెద్దపల్లి: డబ్బు కోసం క్షుద్రపూజలు నిర్వహించి ఓ యువతిని బలి ఇచ్చేందుకు కుట్ర పన్నిన వ్యక్తులను పెద్దపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఆరుగురు సభ్యుల బృందంలో నలుగురిని అరెస్ట్ చేయగా,మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బండ తిరుపతికి బాగా ఆస్తి పాస్తులు ఉండడంతో అతడి నుంచి డబ్బులు రాబట్టేందుకు.. క్షుద్రపూజలు చేస్తే ఇంకా బాగా సంపాదించవచ్చని అతడి స్నేహితుడు ఆరేపల్లి రాజేందర్ సలహా ఇచ్చాడు. మహారాష్ట్రలోని బాబాలు పూజలు చేస్తారని, నరబలి ఇస్తారని తెలిపాడు. రాజేందర్ మాటలు నమ్మిన తిరుపతి క్షుద్ర పూజలకు అంగీకరించాడు. దీంతో రాజేందర్ తన స్నేహితులైన చందపల్లికి చెందిన ఆర్ఎంపీ ఉప్పు కుమార్, అదే గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి మంతెన శ్రీనివాస్‌ను సంప్రదించాడు. బండ తిరుపతి నుంచి డబ్బులు రాబట్టే పథకాన్ని వారికి వివరించాడు. తర్వాత నలుగురూ కలసి క్షుద్రపూజలకు ఏర్పాట్లు చేపట్టారు. మహారాష్ట్రలోని బాబాతో సంప్రదింపులు.. క్షుద్ర పూజల కోసం రాజేందర్ మహారాష్ట్రకు చెందిన బాబా రమేశ్‌చావ్లాదేవ్‌ను సంప్రదించాడు. పూజలకు ఇద్దరు మహిళలు, ఒక అవివాహిత యువతి కావాలని అతను తిరుపతికి సూచించాడు. వారిని చీకటిగదిలో కూర్చోబెట్టి పూజ చేస్తే కనక వర్షం కురుస్తుందని నమ్మించాడు. దీంతో బండ తిరుపతి ఇందుకు ఏర్పాటు చేయాలని రాజేందర్, కుమార్, శ్రీనివాస్‌కు సూచించాడు. ఆర్ఎంపీ కీలకపాత్ర.. ఆర్ఎంపీ కుమార్ క్షుద్ర పూజల కోసం చందపల్లికి చెందిన తొగరి సరిత, భూతం మల్లమ్మను సంప్రదించాడు. ఈ అమావాస్య రోజు మహా రాష్ట్రకు చెందిన బాబా నిర్వహించే పూజల్లో పాల్గొంటే రూ.2 లక్షల చొప్పున ఇస్తామని నమ్మిం చాడు. మరో పెళ్లికాని యువతిని తీసుకురావాలని సూచించారు. ఆమెకు రూ.20 లక్షలు, బంగారం ఇస్తామని తెలిపాడు. దీంతో తొగరి సరిత, భూతం మల్లమ్మ చందంపల్లికే చెందిన ఆర్కుటి సరితను సంప్రదించారు. అమావాస్య రోజు పూజలు నిర్వహించేందుకు ఆమె కూతురును పంపించాలని కోరారు. ఇందుకు రూ.20 లక్షల నగదు, బంగారం ఇప్పిస్తామని తెలిపారు. మొదట అంగీకారం.. అనుమానంతో ఫిర్యాదు డబ్బు, బంగారంపై ఆశతో ఆర్కుటి సరిత తన కూతురు (20)ని క్షుద్ర పూజలకు పంపించేందుకు మొదట అంగీకరించింది. ఈ విషయాన్ని కూతురుకు కూడా చెప్పింది. ఈ క్రమంలో త్వరగా డబ్బు, బంగారం ఇవ్వాలని తొగరి సరిత, భూతం మల్లమ్మతోపాటు ఆర్ఎంపీ కుమార్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే డబ్బులు చెల్లించకపోవడం, అమావాస్యనాటికి కూతురును సిద్ధం చేయాలని వారు ఆర్కుటి సరితపై ఒత్తిడి తేవడంతో పూజలో నరబలి కూడా ఉంటుందని ఆమెకు అనుమానం కలిగింది. దీంతో విషయాన్ని తన భర్తకు చెప్పింది. వారు కుమార్‌ను నిలదీయడంతో విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు. దాంతో తమ కూతురు ప్రాణాలకు ముప్పు ఉందన్న అనుమానంతో ఆర్కుటి సరిత, ఆమె భర్త ఈ నెల 8న పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలపన్ని పట్టుకున్న పోలీసులు.. పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఎస్సై రాజేశ్ నిందితు లను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందిం చారు. నిందితులకు అనుమానం రాకుండా వారిపై నిఘా ఉంచారు. ఎస్సై రాజేశ్ బుధవారం సిబ్బందితో వెళ్లి ఆరెపల్లి రాజేందర్, మంతెన శ్రీనివాస్, బండ తిరుపతి, ఉప్పు కుమార్‌ను అరెస్ట్ చేశారు. తొగరి సరిత, భూతం మల్లమ్మ పరారీలో ఉన్నారు. నిందితులను డీసీపీ కార్యాలయంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రజల అమాయ కత్వం, ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కొంతమంది ఇలాంటి మోసా లకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షుద్ర పూజలు చేస్తే సంపద కలుగుతుందనే అభూత కల్పనను నమ్మవద్దని పేర్కొన్నారు. క్షుద్రపూజలు, నరబలి జరగకుండా ముందస్తుగా నిందితులను పట్టుకున్న ఎస్సై రాజేశ్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
అత్యాచారం, హత్య.. ఆపై ఊపిరితిత్తులు తీసి
లక్నో: హథ్రాస్ దారుణం మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. అక్కడితో ఊరుకోక బాధితురాలి ఊపిరితిత్తులను బయటకు తీసి వాటితో క్షుద్ర పూజలు నిర్వహించారు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం యూపీలోని ఘతంపూర్లో ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు.. మరణించిన చిన్నారి దీపావళి పండుగ నాటి సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పండుగ హడావుడిలో ఉండగా.. బాలిక టపాకుల కోసం బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలన్ని గాలించారు. సమీపంలో ఓ అడవి ఉంటే అక్కడ కూడా వెతికారు. కానీ చీకటి పడటంతో సరిగా కనపడలేదు. ఆదివారం ఉదయం అడవి గుండా వెళ్తున్న కొందరికి అత్యంత దారుణ స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. కొద్ది దూరంలో ఓ చెట్టు దగ్గర బాలిక చెప్పులు, బట్టలు కనిపించాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంకుల్ కుర్లి, బీరన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల దర్యాప్తులో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. తమ బంధువు పరశురామ్ అనే వ్యక్తి సంతానం లేక బాధపడుతున్నాడని తెలిపారు. పిల్లల కోసం తాంత్రిక పూజ చేసేందుకు నిర్ణయించాడు. ఇందుకు గాను ఓ చిన్నారిని బలి ఇవ్వాలని భావించాడు. దీని గురించి బంధువులు అంకుల్ కుర్లి, బీరన్‌లకు తెలిపాడు. పరుశురామ్‌కు సాయం చేయాలని భావించిన నిందితులు శనివారం టపాకులు కొనడానికి బయటకు వచ్చిన చిన్నారిని కిడ్నాప్ చేసి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి చంపేసి.. ఆమె ఊపిరితిత్తులను బయటకు తీసి పరశురామ్‌కు ఇచ్చారు. దాంతో అతడు తాంత్రిక పూజ నిర్వహించాడు. నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పరశురామ్, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తొలుత అతడు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి నేరం ఒప్పుకున్నాడు. ఇక విచారణంలో పరశురామ్ తనకు 1999లో వివాహం అయ్యింది కానీ ఇంతవరకు సంతానం లేకపోవడంతో తాంత్రిక పూజలు నిర్వహించానని.. అందులో భాగంగానే చిన్నారిని కిడ్నాప్ చేయాల్సిందిగా బంధువులు అంకుల్, బీరాన్‌లను కోరానని తెలిపాడు. పోలీసులు నిందితుల మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. (చదవండి: యూపీలోనే ఎక్కువ.. ఎందుకిలా?) ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దారుణాన్ని తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితులకు త్వరగా శిక్ష పడటం కోసం కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. -
రోగం పోతుందంటూ మంత్రాలు, కానీ..
-
రోగం పోతుందంటూ మంత్రాలు, కానీ..
సాక్షి, హైదరాబాద్: మంత్రాలతో రోగం మాయం చేస్తానని చెప్పి ఓ మంత్రగాడు నిండు ప్రాణం బలి తీసుకున్నాడు. మంత్రగాన్ని నమ్మినందుకు తన భర్తను బలి తీసుకున్నాడని మృతుడి భార్య ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం వెలిగొండ గ్రామంలో నివాసిస్తూ లారీలో లోడింగ్‌లో దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న మహేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో (కడుపు నొప్పి) తో బాధపడుతునాడు. ఎన్ని ఆసుపత్రులు జబ్బు తగ్గకపోవడంతో వారి బంధువుల సలహా మేరకు నంది వనపర్తిలో శ్రీహరి అనే మంత్రగాడి దగ్గరకు ఈ నెల 24న వెళ్లారు. ఒక రోజు మంత్రాలు వేసి పటం గీసి నేను బాగు చేస్తానంటూ 20వేల రూపాయల వసూలు చేశాడు. రూ.10 వేలు అడ్వాన్స్‌గా మహేష్ ముట్టజెప్పాడు. శ్రీహరి ఇంటిదగ్గరే మంత్రాల సామాగ్రితో కొన్ని కార్యక్రమాలు చేశారని మహేష్ బంధువులు తెలిపారు. దాంతో మహేష్ రోగం మరింత ముదిరి ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నందివనపర్తి గ్రామంలో ప్రాణాలు విడిచాడు. రోగం నయం చేస్తానని నమ్మించి ప్రాణాలు తీసిన శ్రీహరి పై చర్యలు తీసుకోవాలని మహేష్ భార్య శివారని పోలీసులను వేడుకున్నారు. మాయమాటలతో భర్తను కోల్పోయానని కన్నీరుమున్నీరయ్యారు. ఏడు నెలల క్రితమే మహేష్, శివారని వివాహం జరిగిది. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. కాగా, శివారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అపార్ట్మెంట్లోకి అనుమతి లేదన్నందుకు దారుణం) -
మగబిడ్డ కోసం అత్తాకోడళ్ల దారుణం
పాట్నా : మగబిడ్డ పుడతాడన్న మూఢనమ్మకంతో నాలుగేళ్ల మగ పిల్లాడిని బలి ఇచ్చిన ఘటనలో అత్తాకోడళ్లకు మరణశిక్ష విధించింది కోర్టు. దోషులిద్దరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి లవ్‌కుశ్ కుమార్ సోమవారం తీర్పునిచ్చారు. 2017 సెప్టెంబర్ 5న గోపాల్‌గంజ్ జిల్లాలోని చితౌనాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మగపిల్లాడు లేని సన్‌కేశా అనే మహిళ మగ పిల్లాడిని బలి ఇస్తే తనకు బాబు పుడతాడని నమ్మింది. ఇందుకోసం అత్త దుర్గావతి సహాయం తీసుకుంది. ఇద్దరూ కలిసి అదే ప్రాంతంలో ఉండే కుమార్ అనే నాలుగేళ్ల పిల్లాడిని బలి ఇచ్చారు. అనంతరం శవాన్ని ఇంటికి కొద్ది దూరంలో విసిరేశారు. కొద్దిరోజుల తర్వాత దర్యాప్తులో భాగంగా వీరి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు రక్తపు బట్టలు, వేట కొడవళ్లు లభించాయి. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సుశాంత్‌పై క్షుద్రపూజలు చేయించింది’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ అనుమానపు నీడలు అలుముకుంటూనే ఉన్నాయి. రియాపై రోజుకొక అభియోగం మోపుతున్నారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రియా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా వేరే మందులను సుశాంత్‌కు ఇచ్చిందని అతడి ఫిజికల్ ట్రైనర్ కూడా తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా సుశాంత్ చావుకు రియానే కారణమంటూ పలువురు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. సుశాంత్ కుటుంబం కూడా రియాపై అనేక ఆరోపణలు చేస్తోంది. తాజాగా సుశాంత్ సోదరి మితు సింగ్ సుశాంత్ ప్లాట్‌లో క్షుద్ర పూజలు జరిగాయని, ఒక తాంత్రికుడిని పిలిపించి రియా ఇదంతా చేసిందని ఆరోపించారు. అదేవిధంగా సుశాంత్ స్నేహితుడు నీలోత్పల్ కూడా క్షుద్రపూజల విషయంలో విచారణ జరిపించాలని కోరారు. సుశాంత్ మరణంపై దర్యాప్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీకి మితు సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. చదవండి: నాపై భయంకరమైన వార్తలు రాస్తున్నారు: రియా -
కృష్ణంపాలెంలో చేతబడి కలకలం
పశ్చిమగోదావరి ,జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని కేతవరం పంచాయతీ కృష్ణంపాలెంలో చేతబడి పూజలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఐదుగురు వ్యక్తులను పట్టుకుని శనివారం అర్ధరాత్రి జంగారెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారు. గత వారం రోజులుగా ఒక ఇంటిలో రాత్రివేళల్లో పెద్దగా శబ్దాలు వినపడటం, మంత్రాలు చదవడం వంటివి జరుగుతూ వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి వలంటీర్ల సహాయంతో పూజలు చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో మాలలు, పుర్రె దండలు, తాయిత్తులు పసుపు, కుంకుమ వంటివి లభించడంతో చేతబడి చేస్తున్నారని అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పూజలు చేస్తున్నవారంతా పలు ప్రాంతాల నుంచి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని జంగారెడ్డిగూడెం పోలీసులు తెలిపారు. -
చేతబడి చేస్తున్నారని భార్యాభర్తలను..
భువనేశ్వర్: చేతబడి చేస్తున్నారన్న నెపంతో భార్యాభర్తలను గ్రామస్తులు గొడ్డలితో నరికి చంపారు. ఈ దుర్ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి సమితిలోని పెండ్రాల్‌గుడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. పెండ్రగుడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి కొంతమంది చిన్నారులు తీవ్రఅనారోగ్యం బారినపడి చనిపోతున్నారు. దీనికి కారణం ఆ గ్రామంలోని భార్యాభర్తలు సోమ మాఢి(50), శుక్ర మాఢి(45)లని గ్రామానికి చెందిన కొంతమంది అనుమానించారు. వారు చేసే చేతబడి కారణంగానే పిల్లలు మరణిస్తున్నారని, ఎలాగైనా వారిని అంతమొందించాలని గ్రామానికి చెందిన ముక్కా మడకామి, లక్ష్మా మడకామి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అనుకున్నదే తడవుగా రాత్రి సోమ మాఢి, శుక్ర మాఢి నిద్రిస్తున్న సమయంలో వారిపై గొడ్డలితో దాడికి ఎగబడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన వారిద్దరూ రక్తపుమడుగులో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. -
చేతబడి చేశాడన్న అనుమానంతో..
పశ్చిమగోదావరి, వేలేరుపాడు: చేతబడి చేశాడన్న అనుమానంతో సోమవారం అర్ధరాత్రి వేలేరుపాడు మండలం రామవరం ఊటగుంపు గ్రామంలో కురసం సీతారాముడు(50)అనే గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామవరం ఊటగుంపు గ్రామానికి చెందిన సీతారాముడు చేతబడులు చేస్తాడని గ్రామస్తులకు కొన్నేళ్లుగా అనుమానం ఉంది. రెండు నెలల క్రితం అనారోగ్యంతో గ్రామంలోని ముచిక సురేష్, బందం జోగయ్య అనే ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. అయితే ముచిక సురేష్‌కు, సీతారాముడికి నిత్యం గొడవలు జరుగుతుండేవి. రెండు నెలల క్రితం ముచిక సురేష్ కామెర్ల వ్యాధితో మృతి చెందగా, ఇరవై రోజుల క్రితం బందం జోగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. జోగయ్య పెద్దకార్యం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆచారం ప్రకారం పెద్ద దినానికి పేతర కుండలు(ముంతలు) మహిళలు తీసుకెళ్లారు. కుండలు తీసుకెళ్లే మహిళలకు పూనకం వచ్చి సీతారాముడు చేతబడి చేయడం వల్లే ఇద్దరు గిరిజనులు మృతి చెందారని చెప్పడంతో గ్రామస్తులు మరింత కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న సీతారాముడిని సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. తనకే పాపం తెలియదని సీతారాముడు ఎంత ప్రాధేయపడినా వినకుండా గొంతు భాగంలో కత్తులతో నరికారు. దీంతో సీతారాముడు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కుక్కునూరు సీఐ బాలసురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడుగురు గ్రామస్తులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చేతబడి నెపంతో అమానుషం..
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: శాస్త్రసాంకేతిక విజ్ఞానం ఎంతగానో విస్తరిస్తోంది. సోషల్‌మీడియా ద్వారా మరెన్నో విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. అయినా ఇంకా మూఢనమ్మకాల ప్రభావం మాత్రం అక్కడ కనిపిస్తూనే ఉంది. చేతబడి... చిల్లంగి... వంటి అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అనుమానంతో తోటివ్యక్తిని గాయపర్చి... ఆయన మరణానికి కారణమైన సంఘటన ఒకటి మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట సీఐ రమేష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని డుమ్మంగి పంచాయతీ టెంకసింగి గ్రామానికి చెందిన కొండగొర్రి ప్రకాష్ బామ్మర్ది శంకరరావుకు గడచిన మూడు నెల లుగా అరోగ్యం బాగుండటం లేదు. ఆస్పత్రు ల చుట్టూ తిప్పినా ఫలితం కానరాలేదు. దీని కంతటికీ కారణం గ్రామానికి చెందిన తోయక నరసింహులు(55) అనే వ్యక్తి చేతబడి చేయడమేనని అనుమానించిన ప్రకాష్ ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో గ్రామం బయట ప్రధాన రహదారిలో కాపు కాసి... అటుగా వచ్చిన నరసింహులుపై కర్రతో దాడిచేశాడు. ఆయన కిందపడిపోవడంతో అదే అదనుగా భావించి ఇంటికి వెళ్లి ఓ కత్తిపట్టుకొని వచ్చి తల భాగంపై దాడిచేయగా నరసింహులు కుప్పకూలిపోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన నరసింహులు భార్య ఆరాలు, పెద్ద కొడుకు సురేష్‌పైనా ప్రకాష్ కత్తితో దాడి చేసి, గ్రామస్తులు గమనించి వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై స్పృహ లేకుండా పడి ఉన్న నరసింహులును కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యం నిమిత్తం భద్రగిరి సీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. ఆయన భార్య ఆరాలు చేతికి కత్తి గాయాలు కావడంతో ఆమెను ఏరియా ఆస్పత్రిలో, కొడుకు సురేష్‌కు మెడపై గాయమవ్వటంతో భద్రగిరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం నరసింహు లు మృతదేహాన్ని స్వగ్రా>మానికి తరలిస్తామ ని సీఐ తెలిపారు. నరసింహులుకు సురేష్‌తో పాటు మరో కొడుకు విజయ్, కూతురు కళ్యాణి ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామంలో మంగళవారంచోటు చేసుకున్న ఈ సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
స్వామీజీ వేషం.. ఆత్మ పేరుతో మోసం
చిత్తూరు, మదనపల్లె టౌన్ : అతడిది స్వామీజీ వేషం.. నమ్మించి మోసం చేయడం..భూతవైద్యం పేరు తో లక్షలు దండుకోవడం అతడి అకృత్యాలు. ఈ క్రమంలోనే ఓ మహిళను మోసగించి కటకటాల పాలయ్యాడు. మృతి చెందిన ఆమె భర్త ఆత్మ ఇంట్లో తిరుగుతోందని.. ఆ దెయ్యాన్ని వెళ్లగొడతానని నమ్మించి ఆరు లక్షల రూపాయలు లాక్కుని మాయమయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతని వ్యవహారం బయటపడింది. వన్ టౌన్ సీఐ తమీమ్ అహ్మద్, ఎస్ఐ లోకేష్ మంగళవారం విలేకరులకు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ, రాయునిచెరువు వడ్డిపల్లె(ఆర్సీ వడ్డిపల్లె)కు చెందిన లేట్ వెంకటప్ప కుమారుడు డేరంగుల రామకృష్ణ అలియాస్ రామకృష్ణ స్వామిజీ(47) ఒకప్పుడు చిన్న చిన్న కూలి పనులతో కాలం వెళ్లదీసేవాడు. 15 ఏళ్ల క్రితం గుప్తనిధుల ముఠాలో చేరి జిల్లాతో పాటు పలు మండలాల్లో గుప్త నిధులను వెలికితీసేవాడు. అక్కడ నకిలీ విగ్రహాలను పెట్టి జనాన్ని నమ్మించి రూ.లక్షలు దండుకునేవాడు. ఇంతటితో ఆగకుండా స్వామిజీ వేషంతో భూతవైద్యాలు చేసేవాడు. ఇదిలా ఉండగా.. మదనపల్లె బుగ్గకాలువకు చెందిన షేక్ హసీనా భర్త మస్తాన్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇంటిలో మస్తాన్ ఆత్మ తిరుగుతోందని, గుప్త నిధులు ఉండడం వల్లే అలా జరుగుతోందని ఆమెను నమ్మించాడు. తాను ఎంతో మందికి భూతవైద్యం చేసి దెయ్యాలను వెళ్లగొట్టానని.. అలా ఇక్కడ కూడా చేస్తానని ఆమెను నమ్మించి రూ.6 లక్షలు తీసుకున్నాడు. తరువాత స్వామిజీ కనిపించకుండా మాయమయ్యాడు. అనుమానించిన బాధితురాలు మోసపోయానని నాలుగు రోజుల క్రితం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పట్టణంలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి కల్యాణ మండలం సర్కిల్ వద్ద కారులో వెళుతుండగా పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. -
పశ్చిమ గోదావరిలో చేతబడి కలకలం
-
అర్థరాత్రి దున్నపోతును బలి ఇచ్చి...
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలులో చేతబడి కలకలం రేపుతోంది. ఓ మహిళ చేతబడి చేస్తూ జామాయిల్ తోటలో దున్నపోతును బలిఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఒక బాలుడి బొమ్మని చిత్రీకరించి దాని ముందు గొయ్యి తవ్వి నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో క్షుద్రపూజలు చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు గత మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారు. క్షుద్రపూజలు చేసినట్లు భావిస్తున్న మహిళకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. తోటలోకి తీసుకెళ్లి సామాగ్రి అంతా కాల్చి తగులబెట్టారు. వారం రోజుల నుంచి గ్రామంలో చేతబడి జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ విషయం బయట పడింది. దున్నపోతు తల నరికి గొయ్యి తీసి పెట్టడంత, క్షుద్రపూజు చేసిన సామాగ్రిని గోతిలో పాతిపెట్టిన విషయాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. చేతబడి కలకలం స్థానికులను భయానికి గురి చేస్తోంది. -
చేతబడి నెపంతో మహిళ ఇంటిపై దాడి
కాకినాడ క్రైం: నగరపాలక సంస్థ పరిధిలోని కొత్త కాకినాడలో కోనాడ పాపమ్మ తన ఇంట్లో ఎనిమిది నెలలుగా చేతబడి, క్షుద్రపూజలు చేస్తూ అనేక మంది మరణానికి కారణమైందంటూ స్థానికులు గురువారం ఆమె ఇంటిపై దాడి చేశారు. ఆమె చేసే పూజల కారణంగా ఆ ప్రాంతంలో దాదాపు 10 మంది వరకు మరణించారని బాధిత కుటుంబాలవారు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నకిలే రాజేశ్వరి అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆగ్రహించిన స్థానికులు పాపమ్మ ఇంటిపై దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న ఆమె అల్లుడు శ్రీను అడ్డుపడి పోలీసులకు ఫోన్ చేయడంతో టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పాపమ్మను పోలీసు స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. గ్రామ పెద్దలు, మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వస్తే సమస్యను పరిష్కరిస్తామని చెçప్పుకొచ్చారు. అయినా ప్రజలు పోలీసుల మాటను లెక్క చేయకుండా ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంట్లో క్షుద్రపూజలకు ఉపయోగించే తాయెత్తులు, భయానకంగా ఉండే బొమ్మలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 12 రోజుల క్రితం కోనాడ సూరిబాబు చేతబడి వల్లే చనిపోయాడని, ఇప్పుడు నకిలే రాజేశ్వరిని చంపేందుకు ప్రత్నిస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. క్షుద్రపూజలు కోసం ప్రశ్నిస్తే తనని చంపేస్తానని రెండు నెలల క్రితం బెదిరించిందని కోనాడ అప్పన్న తెలిపాడు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రాజేశ్వరి అత్త రమణమ్మ మాట్లాడుతూ వడ్డీ వ్యాపారం చేసే పాపమ్మ సకాలంలో డబ్బు చెల్లించని వారిపై చేతబడి ప్రయోగం చేస్తుందని ఆరోపించింది. తన కోడలు రాజేశ్వరిని తన ఇంటికి రప్పించుకొని క్షుద్రపూజలు చేసిందని, బుధవారం తన కోడలు పాపమ్మ ఇంటికి వెళ్లిపోతానని, అక్కడే తాను పూజలు చేసుకుంటానని చెప్పిందన్నారు. వెళ్లవద్దంటూ తాను చెప్పినా వినకుండా గురువారం ఉదయమే పాపమ్మ ఇంటికి వెళ్లిందని, అర్ధగంట తరువాత తిరిగి వచ్చి ఇంట్లో ఉరేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించిందని రమణమ్మ వివరించింది. ఇదే విధంగా 12 రోజుల క్రితం కోనాడ సూరిబాబు కూడా పాపమ్మ క్షుద్ర పూజలు వల్లే ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని, అతనికి ఎటువంటి చెడు అలవాట్లులేవని గ్రామస్తులు చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు గ్రామస్తులకు వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు గ్రామపెద్దల చొరవతో పోలీసులు గ్రామస్తులతో సమావేశమయ్యారు. పాపమ్మ ఇంట్లో ఉన్న బొమ్మలు, ఇతర సామగ్రిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని, పాపమ్మతో ఎవరూ గొడవకు దిగవద్దని పోలీసులు చెప్పారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పాపమ్మను తక్షణం తమ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు పట్టించుకోకపోతే తామంతా ఏకమై ఆమెను ఈ ప్రాంతానికి రాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ప్రజలు ఒప్పుకోకపోవడంతో పోలీసులు సాయంత్రం 5 గంటల తరువాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రిపోర్టు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోవడంతో ఆరు గంటల హైడ్రామాకు తెరపడింది. ప్రజలు మాత్రం పాపమ్మను తమ ప్రాంతంలోకి రానిచ్చేదిలేదంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే పాపమ్మను పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో మీ అంతు చూస్తాను, నెలకు ఇద్దరు, ముగ్గుర్ని చంపేస్తానంటూ పోలీసులు ఎదుటే గ్రామస్తులను బెదిరించడం కొసమెరుపు. -
అమ్మో భూతం..!
రాయగడ: జిల్లాలోని ఆదివాసీలను మూఢ నమ్మకాలు ఇంకా వీడడం లేదు. భూతం, పిశాచం, గాలి సోకడం వంటి వాటిని నమ్ముతూ భూత వైద్యులను ఆశ్రయించడం ఇంకా మానడం లేదు. తాజాగా బిసంకటక్ సమితిలోని చాటికోన గ్రామంలో పాఠశాలలో 7,8 తరగతులు చదువుతున్న ఐదుగురు బాలికలు మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి సమయంలో పాఠశాల ఆవరణలో ఉన్న మర్రిచెట్టు కింద ఆడుకుంటుండగా ఒక్కసారిగా వారంతా మాకు భూతం సోకింది. రమ్మంటోంది. మేము వెళ్లిపోతాం అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ చెట్టుకింద పడి కాళ్లూచేతులు కొట్టుకోవడం, జుత్తు పీక్కోవడం వంటి చేష్టలు చేస్తూ వింతగా ప్రవర్తించారు. మర్రిచెట్టు కింద భూతం సోకిందని చెప్పిన విద్యార్థులు దీంతో తోటి విద్యార్థులు తక్షణం ఉపాధ్యాయులకు తెలియజేయడంతో ఉపాధ్యాయులు కూడా వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న భూత వైద్యుడిని పిలిపించి మంత్రించి భూతాన్ని వదిలించారు. తదుపరి ఉపాధ్యాయులు ఐదుగురు విద్యార్థులను బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. వాస్తవంగా నేటి పరిస్థితుల్లో దెయ్యాలు, భూతాలు లేవని, క్షుద్రశక్తులు, చేతబడులను నమ్మవద్దని ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆదివాసీ ప్రజలను ఇంకా మూఢ నమ్మకాలు విడనాడడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. దీనికి తోడు భూతవైద్యుడు మంత్రించగా విద్యార్థులకు స్వస్థత కలగడంతో వారిలో మూఢ నమ్మకాలు ఇంకా పెరిగిపోతున్నాయి. -
శ్రీకాళహస్తిలో ‘క్షుద్ర’ కలకలం
శ్రీకాళహస్తిలో తరచూ క్షుద్ర పూజల నిర్వహణ కలకలం రేపుతోంది. శక్తి ఆలయం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. పదవీయోగం సిద్ధిస్తుందని.. గుప్త నిధుల లభ్యమవుతాయని.. శత్రువులకు హాని చేయవచ్చనే మూఢ నమ్మకాలతో ఒళ్లు గగుర్పొడిచే పూజలు నిర్వహిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వేడాం సమీపంలోని భైరవకోనలో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి సమాచారం మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ఓ ఉద్యోగిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో ఉన్న భైరవ కోన, వెయ్యిలింగాల కోన పరిధిలో తరచూ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి, నూతన సంవత్సరం వంటి ముఖ్యమైన రో జుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడ జనసంచారం పెద్దగా ఉండదు. దీంతో ఈ ప్రాంతాన్ని కొందరు మూఢ నమ్మకాలతో కొన్ని పూజలకు నిలయంగా మార్చుకున్నారు. ఎన్నికల ముందు.. సాధారణ ఎన్నికల ముందు 2018 జనవరి 5న గుర్తు తెలియని వ్యక్తులు భైరవ కోన వద్ద క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ పూజను ఆలయంలో పనిచేసే అధికారి ధనపాల్ అనే వ్యక్తి నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల తరువాత తిరిగి ఆయన విధుల్లో చేరారు. అది కూడా పదోన్నతిపై. అతని పదోన్నతిపై తిరిగి విధుల్లో చేరేందుకు అప్పటి దేవదాయశాఖ మంత్రి రాతపూర్వకంగా లేఖ కూడా ఇచ్చారని తెలిసింది. నాటి నుంచి నేటి వరకు ఆయన ఆలయ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నా రు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ధనపాల్ సహకారంతో చెన్నైకి చెందిన కొందరు భైరవ కోనలో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఉద్యోగి సూచనల మేరకే.. శ్రీకాళహస్తి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి సూచనల మేరకే భైరవ కోనలో ఈ పూజలు నిర్వహించేందుకు వచ్చినట్టు తమిళనాడు వాసులు చెప్పినట్టు సమాచారం. అయితే అక్కడ జరిగింది క్షుద్రపూజా.. మరేదైనా పూజ తేలాల్సి ఉందని సీఐ ఆరోహణరావు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయమై ప్రభుత్వం స్పందించింది. శ్రీకాళహస్తీశ్వరాలయ పరిధిలో జరిగిన పూజలపై విచారణ చేపట్టి వెంటనే నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ మంత్రి ఆదేశాలు జారీచేశారు. అవి క్షుద్రపూజలే ఆగమ సంబంధమైన ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఆలయ పరిసర ప్రాంతాల్లో రాత్రి 9 గంటలు దాటాక ఏ పూజ చేసినా క్షుద్రపూజే. – సింగరాజు ప్రకాశం పంతులు, పురోహితులు, శ్రీకాళహస్తి -
క్షుద్రపూజలు చేయించిందని వేధించడంతో..
సాక్షి, హసన్‌పర్తి(వరంగల్): క్షుద్ర పూజలు చేయించావంటూ ఓ కుటుంబం చేస్తున్న వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ అర్బన్ హసన్‌పర్తి మండలం హరిశ్చంద్రు నాయక్ తండాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. హరిశ్చంద్రునాయక్ తండాకు చెందిన కవిత(18) పదో తరగతి పూర్తిచేసింది. ఆమెకు జ్యోతితో పాటు మరో ఇద్దరు యువతులు స్నేహితులు ఉన్నారు. ఇటీవల కోమటిపల్లిలో జ్యోతి ఫొటోకు క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు కవితే కారణమని జ్యోతి, ఆమె తండ్రి బిక్షపతి, సోదరుడు అనిల్ వేధించడం ప్రారంభించారు. క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఎవరు చేయించారో చెప్పాలని వేధించారని కవిత బంధువులు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారే బెదిరింపులకు గురి చేశారని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో వారి వేధింపులు భరించలేక కవిత స్థానికంగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు జ్యోతి, బిక్షపతి, అనిల్ వేధింపులతోనే కవిత ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. జ్యోతి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
అతీంద్రీయ శక్తులు చెప్పాయని.. అత్యంత కిరాతకంగా
ముంబై: ‘నీకు ఎవరో చేతబడి చేశారు. అందుకే నీ జీవితంలో ఇన్ని కష్టాలు. ఈ కడగళ్లు తీరాలంటే.. కవలల్ని బలి ఇవ్వు. అప్పుడు జీవితం నువ్వు కోరినట్లు మారుతుంది’ ఈ వ్యాఖ్యలు పదే పదే చుగాని చెవుల్లో మారుమోగుతున్నాయి. అవును అతీంద్రీయ శక్తులు చెప్పింది నిజమే. నాకు చేతబడి చేశారు. అందుకే ఈ కష్టాలు. ఇవి తీరాలంటే కవలల్ని బలి ఇవ్వాలి. నా చుట్టుపక్కల, తెలిసిన వారిలో ఎవరికి కవల పిల్లలు ఉన్నారు. ఆ గుర్తుచ్చొంది. నా స్నేహితుడి ప్రేమ్‌కు ఇద్దరు కవల పిల్లలే కదా. వారిని చంపేస్తే.. నా సమస్యలు తీరిపోతాయి.. ఇలా రాసుకొచ్చాడు అనిల్ చుగాని అనే వ్యక్తి తన డైరీలో. నాలుగు రోజుల క్రితం ముంబై కొలబా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిని ఏడో అంతస్తు నుంచి కిందకు విసిరేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన అనిల్ చుగాని స్వయంగా తానే పోలీసులకు లొంగిపోయాడు. విచారణలో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాడు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన చుగాని మొరాకోలో ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ప్రతి ఏడాది రెండు నెలల పాటు ఇండియాకు వచ్చే వాడు. కానీ ఈ సారి వచ్చి.. ఇక్కడే ఉండి పోయాడు. అయితే భారత్‌కు వచ్చే ముందు చుగానితో పాటు పని చేసే ఓ స్నేహితురాలు ఒకామె అతడికి చేతబడి చేశారని.. అందుకే అతన్ని సమస్యలు చుట్టుముట్టాయని తెలిపింది. కవలల్ని బలి ఇస్తే ఈ సమస్యలు తీరతాయని కూడా చెప్పింది. ఆమె మాటలు చుగాని మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఇండియా వచ్చిన తర్వాత కూడా దీని గురించే ఆలోచించడం ప్రారంభించాడు చుగాని. ఈ క్రమంలో అతీంద్రీయ శక్తులు కూడా తనతో ఇదే విషయాన్ని చెప్పాయని డైరీలో రాసుకున్నాడు చుగాని. ఇక అప్పటి నుంచి కవలల కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి తన స్నేహితుడు ప్రేమ్ కవల పిల్లలు శ్రేయ, సన్యలు కనిపించారు. దాంతో వీరిద్దరిని చంపాలని భావించాడు చుగాని. ఈ ఏడాది మే నెల నుంచి వారిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి చుగాని, ప్రేమ్ కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కాసేపు అతని పిల్లలతో ఆడుకుంటానని కోరాడు. దాంతో ప్రేమ్ తల్లి పిల్లలను తీసుకుని చుగాని ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన చుగాని తన ఇంటికి వచ్చిన పిల్లలకు భోజనం పెట్టి చేతులు శుభ్రం చేసే నెపంతో ఓ చిన్నారిని తీసుకెళ్లి తన ఇంటి నుంచి అనగా ఏడో అంతస్తు కిటికి నుంచి కిందకు పడేశాడు. మరో చిన్నారిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. కానీ చిన్నారుల నానమ్మ ఆ పాపతో పాటే ఉండటంతో కుదరలేదు. చిన్నారి పై నుంచి కిందపడటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుగానిని అరెస్ట్ చేశారు. పోలీసులను చూసిన చుగాని ఏ మాత్రం కంగారు పడకుండా చిన్నారిని తానే చంపానని ఒప్పుకోవడమే కాక ఇలా చేసినందుకు తనను అరెస్ట్ చేస్తారని తెలుసని పేర్కొన్నాడు. జైలుకు వెళ్లినప్పటికి తన సమస్యలు పరిష్కారం అవుతాయని చుగాని పోలీసులకు తెలిపాడు. -
దాయాదులే నిందితులు..!
సాక్షి, భువనగిరి: అనుమానం పెనుభూతమైంది. తన భార్యకు చేతబడి చేయడంతోనే అనారోగ్యం బారిన పడిందని అనుమానించాడు. అందుకు కారణమైన వ్యక్తిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదునుచూసి వెంబడించి వేటాడి ఘాతుకానికి ఒడిగట్టాడు. వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్యను దాయాదులే మట్టుబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ శివా రులో ఈ నెల 23న చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యోదంతా నికి పాల్పడిన నలుగురు నిందితులను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని వలిగొండ గ్రా మానికి చెందిన బోయిన ఎట్టయ్య కుమారుడు శంకరయ్య(62) ఒగ్గు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఎట్టయ్య పాలివారైన బోయిని బుచ్చయ్య కుమారుడు శంకరయ్య 20ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి చికెన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బంధువు చనిపోతే.. రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన బోయిన ఎట్టయ్య, బుచ్చయ్య బంధువు చనిపోయాడు. అంత్యక్రియలకు హైదరాబాద్‌లో ఉంటున్న శంకరయ్య కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఆ సందర్భంలో శంకరయ్య వరుసకు కుమారుడైన శంకరయ్య భార్య చెవులను పట్టుకుని మాట్లాడాడు. అప్పటినుంచి శంకరయ్య భార్యకు చెవులు లాగడం, కడుపులో నొప్పిగా ఉండడం ఇతరత్ర అనారోగ్యాల బారిన పడింది. అయితే తన భార్య అనారోగానికి వరుసకు బాబాయి అయిన శంకరయ్య చేతబడి చేయడమే కారణమని భావించాడు. కక్ష పెంచుకుని.. తన భార్య అనారోగ్యం భారిన పడడానికి బాబాయి శంకరయ్యే కారణమని శంకరయ్య కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని శంకరయ్య నిర్ణయించుకున్నాడు. అందుకు అదునుకోసం వేచి చూస్తున్నాడు. కొ ద్దిరోజులుగా శంకరయ్య కదలికలపై నిఘా పెట్టించాడు. ఒక్కడి వల్ల కాదని.. అయితే, బాబాయి శంకరయ్యను హత్య చేయడం తన ఒక్కడి వల్ల కాదని భావించిన శంకరయ్య తన చికెన్ దుకాణంలో పనిచేసే టేచౌత సాయికిరణ్, సంగెం గ్రామానికే చెందిన బోయిని ప్రభాకర్, బోయిని యాదయ్యలను ఆశ్రయించాడు. వరుసకు బాబాయి అయ్యే శంకరయ్యను హత్య చేసేందుకు సహకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటాడి.. వేటాడి.. సంగెం గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 23(శుక్రవారం)న చౌటుప్పల్ మండలం వాయిళ్లపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ఒగ్గుకథ చెప్పేం దుకు ఉదయం వెళ్లాడు. అప్పటికే సమాచారం ఉన్న శంకరయ్య హైదరాబాద్ నుంచి స్కార్పియో వాహనంలో తన దుకారణంలో పనిచేసే సాయికిరణతో కలిసి చౌటుప్పల్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న సంగెం గ్రామానికి చెందిన ప్రభాకర్, యాదయ్యలను కలుసుకున్నాడు. శంకరయ్య వాయిళ్లపల్లికి కథ చెప్పడానికి వెళ్లాడని తెలుసుకుని అక్కడే మాటేశారు. ఒగ్గుకథ పూర్తయిన తర్వాత శంకరయ్య ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. అదే దారిలో స్కార్పియో వాహనంలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు శంకరయ్యను వెంబడించారు. సరిగ్గా సంగెం గ్రామ శివారులోకి రాగానే శంకరయ్య బైక్‌ను స్కార్పియోతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకరయ్య బైక్‌పైనుంచి ఎగిరి కిందపడడంతో వెంటనే స్కార్పియో నుంచి దిగిన శంకరయ్య, సాయికిరణ్ కత్తులతో అతడి గొంతు కోసేశారు. అనంతరం చెవులను కోసుకుని అక్కడినుంచి అదే వాహనంలో పరారయ్యారు. కాసేపు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన శంకరయ్య ప్రాణాలు విడిచాడు. అనుమానంతో అదుపులోకి తీసుకోగా.. శంకరయ్య తండ్రి ఎట్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే మొదట శంకరయ్య ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే హత్య చేసిన అనంతరం బుచ్చయ్య కుమారుడు శంకరయ్యపై పోలీసులకు అనుమానం కలిగింది. స్కార్పియో వాహనంలో ఆదివారం అతడు సాయికిరణ్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళుతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. హత్యోదంతంలో పాల్గొన్న బోయిని ప్రభాకర్, యాదయ్యలను కూడా అరెస్ట్ చేసి కేసు నమో దు చేసినట్టు డీసీపీ వివరించారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ శివనాగప్రసాద్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు . -
మంత్రాలు చేస్తుందని చంపేశారు
సాక్షి, వేములవాడ : మంత్రాల నెపంతో హత్యకు గురైన వృద్ధురాలు లచ్చవ్వ కేసు ఎట్టకేలకు వీడింది. మంత్రాలు చేయడం వల్లనే తమ కుటుంబం మొత్తం అనారోగ్యం బారినపడుతున్నారని, తమ తమ తల్లిదండ్రులు చనిపోయారని భావించి పండుగ లచ్చవ్వ(75)ను గత డిసెంబర్ 26న అర్ధరాత్రి గడ్డపారతో అతి కిరాతకంగా హత్య చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంకెపల్లి గ్రామంలో గత డిసెంబర్ 26న జరిగిన హత్య కేసు వివరాలను మంగళవారం వేములవాడ రూరల్ సీఐ కార్యాలయంలో వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ లచ్చవ్వను హత్య చేసిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు అనే సోదరులను మంగళవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. హత్యకు సహకరించిన ఎండీ షబ్బీర్, పండుగ నర్సయ్య, జింక అంజయ్య, జింక రాజు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పండుగ లచ్చవ్వ అనే వృద్ధురాలు మంత్రాలు చేయడం వల్లే కుటుంబం మొత్తం అనారోగ్యంబారిన పడుతుందని భావించిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు మరో నలుగురి సాయంతో లచ్చవ్వను హత్య చేయాలని పథకం రూపొందించారన్నారు. ఇందుకు వీరంతా కలిసి గడ్డపార, ఇసుపరాడ్డు, కత్తితో అతికిరాతకంగా లచ్చవ్వను చంపేశారని, జరిగిన హత్యపై సమాచారం అందకపోవడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారిందన్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, పరిస్థితులను బేరీజు వేసుకున్న వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, టౌన్ సీఐ ఎన్.వెంకటస్వామి బృందం టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకునేందుకు కృషి చేశారన్నారు. మొబైల్ కాల్‌డాటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారన్నారు. వీరిని పట్టుకు నేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని చాలాప్రాంతాలను వెతకాల్సి వచ్చిందన్నారు. హత్య కేసుతోపాటు బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు, ఎండీ షబ్బీర్‌పై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. హత్య కేసును ఛేదించిన టౌన్ సీఐ వెంకటస్వామి బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి రివార్డులు అందిస్తామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ రఘుచందర్, పోలీసులు పాల్గొన్నారు. ముఢనమ్మకాలను నమ్మొద్దు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినప్పటికీ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని, ఇలాంటి వాటి ఉచ్చులో పడి మోసపోవద్దని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నేరాలకు పాల్పడితే వారి జీవితాలు, కుటుంబాలు వీధిన పడతాయని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణప్రాంతాల్లో మూఢనమ్మకాలపై తమ పోలీసు బృందాలు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నాయన్నారు. విద్యావంతులు, మేధావులు, యువతరం ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. -
మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..
సాక్షి, బెల్లంపల్లి(ఆదిలాబాద్) : మంత్రాల నెపంతో వేధిస్తున్నారని మండలంలోని పెద్దలంబాడి తండా గ్రామానికి చెందిన దరావత్ కళావతి అనే యువతి మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన దరా వత్ చత్రునాయక్, వెంకుబాయి దంపతులు, వారి కుమారుడు కిరణ్‌కు మంత్రాలు చేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన దరావత్ రాజ్‌కుమార్, అతడి తల్లి తులసీ, చెల్లి కళావతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులు మూడురోజుల క్రితం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తారా..? అంటూ చత్రునాయక్, వెంకుబాయి, కిరణ్, వారి బంధువులు కలిసి కళావతి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. విషయాన్ని రాజ్‌కుమార్ ఎస్సై మొగిళికి ఫోన్లో సమాచారం అందించారు. ఎస్సై పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పడంతో అంద రూ కలిసి వెళ్లారు. చత్రునాయక్ కుటుంబసభ్యులు కూడా వచ్చారు. పెద్దల సమక్షంలో మాట్లాడుదామని, అంతవరకు గొడవలు పడొద్దని ఎస్సై ఇరువర్గాలకు చెప్పి ఇంటికి పంపించాడు. ఇంటికెళ్లాక చత్రునాయక్ కుటుంబం రాజ్‌కుమార్ కు టుంబంపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కళావతికి గాయాలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన కళావతి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మం చిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. -
ఇద్దరు పిల్లల తలలు నరికి...ఆపై..
రాంచి : హత్య కేసులో బెయిలుపై బయటికి వచ్చిన ఓ నిందితుడు పాశవిక చర్యకు పాల్పడ్డాడు. తన షాపునకు వచ్చిన ఇద్దరు పిల్లల తలలను నరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని లాతేహర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... సెమార్హట్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ బాలిక(10) చాక్లెట్లు కొనుక్కొనేందుకు అతడి షాపులోకి వచ్చింది. ఆమెను ఇష్టం వచ్చినట్లుగా గట్టిగా తిడుతుండటంతో అక్కడే కాస్త దూరంగా ఆడుకుంటున్న బాలుడు(11) వాళ్ల దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల ఎవరూ లేనిది చూసిన బాలుడు, బాలిక ఇద్దరినీ ఇంట్లోకి లాక్కెల్లిన నిందితుడు గొడ్డలితో వాళ్ల తలలు నరికాడు. అనంతరం వాళ్ల శవాలు కాల్చి ఇంటి పక్కన ఉన్న మట్టి దిబ్బలో పూడ్చిపెట్టాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. కాగా గతంలో రెండు హత్యలు చేశాడని.. తాంత్రిక విద్యలు నేర్చుకునేందుకే నిందితుడు ప్రస్తుతం మరోసారి నరబలి ఇచ్చాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేశారు. -
భూత వైద్యం పేరుతో విద్యార్థినికి వాతలు
రామసముద్రం : భూతవైద్యం పేరుతో అమాయకురాలికి వాతలు పెట్టిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని పెద్దకురప్పల్లెకు చెందిన కృష్ణప్ప, మీనాక్షి దంపతుల కుమార్తె లావణ్యకుమారి మదనపల్లెలో పాలిటెక్నిక్ చదువుతోంది. కొంతకాలంగా లావణ్యకు మతిస్థిమితం తప్పింది. రాత్రివేళ కేకలు వేస్తుండడంతో తల్లిదండ్రులు పలుచోట్ల చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. దయ్యం పట్టిందని భావించి స్థానికుల సూచనల మేరకు కర్ణాటక సరిహద్దులోని గూకుంట గ్రామంలోని చర్చి వద్ద్దకు తీసుకెళ్లారు. అక్కడ పాస్టర్ జయప్ప అమ్మాయికి గాలి ఉందని, తాను తొలగిస్తానని నమ్మించాడు. గత వారం అక్కడికి వెళ్లి రాత్రీపగలు అక్కడే ఉన్నారు. తిరిగి చర్చి పక్కన గుట్ట వద్దకు లావణ్యను తీసుకెళ్లి భూతాన్ని తొలగిస్తానని చెప్పిన పాస్టర్ వాతలు పెట్టాడు. వాతలను చూసిన తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఎస్ఐ శివశంకర్‌ను వివరణ కోరగా, తమకు ఫిర్యాదు రాలేదన్నారు. -
చేతబడి అనుమానంతో..దంతాలను పీకేసేందుకు ప్రయత్నం
తూర్పుగోదావరి , తుని రూరల్: తుని మండలం తేటగుంట గ్రామంలో చేతబడి చేశారన్న అనుమానంతో ఓ కుటుంబంపై మరో కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడికి దిగిన ఘటన ఇది. ఈ మేరకు తుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తుండడంతో బాధితులు పాత్రికేయులను ఆశ్రయించారు. గురువారం తుని ఏరియా ఆస్పత్రిలో వారు మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. తేటగుంట గ్రామానికి చెందిన గురజా వెంకట్రావు నాయీ బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రోజాలాగే బుధవారం వృత్తి ముగించుకుని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా సమీపంలో నివాసం ఉంటున్న కోన నాగేశ్వరరావు, కోన పెదకాపు, కోన సోమేశ్వరరావు, కోన శ్రీను, మహిళలైన కోన గవర్రాజు, కోన చంటమ్మ, కోన ఆనందం, రాణియ్యమ్మ (రాణి)లు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి కర్రలు, చెప్పులతో గురజా వెంకట్రావుపై దాడి చేశారు. చేతబడి చేస్తావా అంటూ అతడి దంతాలు, పళ్లను పీకే ప్రయత్నం చేయగా తీవ్ర రక్తస్రావమైంది. చేతబడి అనుమానంతోనే.. రెండు నెలల క్రితం కోన కుసుమ కాకినాడలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరిందని, లో బీపీతో ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. నాటి నుంచి అనుమానంతో ఉన్న వీరందరూ ఆకస్మికంగా ముకుమ్మడిగా దాడికి పాల్పడ్డారన్నారు. తమతోపాటు ప్రసవానికి ఇంటికి వచ్చిన తమ కుమార్తె నిండు గర్భిణి రజనీపైనా వారు దాడి చేశారని వాపోయారు. తీవ్రంగా గాయపడిన తామిద్దరం వైద్యానికి ఆస్పత్రిలో చేరామన్నారు. కేసు నమోదులో తాత్సారం తీవ్ర గాయాలతో ఉన్న తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు బేరసారాలు జరిపేందుకు ఆస్పత్రికి వచ్చినట్టు వెంకట్రావు తెలిపారు. ఎవరివల్లనైనా పొరపాటు జరుగుతుందని, కేసు పెట్టకుండా ఉంటే రూ.30 వేల వరకు ఇస్తామన్నా అంగీకరించలేదని, దాడికి పాల్పడిన అందరికీ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 24 గంటలైనా కేసు నమోదు చేయలేదని బాధితురాలు కుమారి తెలిపారు. మరోవైపు బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై కె.సుధాకర్ గురువారం సాయంత్రం తెలిపారు. -
పులివెందులలో క్షుద్ర పూజలు?
వైఎస్ఆర్ జిల్లా ,పులివెందుల రూరల్ : పట్టణ పరిధిలోని భాకరాపురం సమీపంలోని పంట పొలాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రింగ్ రోడ్డు, హెలీప్యాడ్ ప్రాంతాల్లో గుర్తు తెలియని ఆకతాయిలు మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారని చెబుతున్నారు. పచ్చటి పొలాల్లో మద్యం తాగుతూ పంటలను నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎన్నికల్లో ఓడిపోవాలని.. ఏం చేశారో తెలుసా?
రాజాపేట (ఆలేరు) : ఓ వార్డు అభ్యర్థి ఇంటిముందు గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్డు, వేపకొమ్మలు పెట్టడంతో భయాందోళనకు గురవుతున్న సంఘటన మండలంలోని రఘునాథపురంలో చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బింగి నాగేష్ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డులో పోటీలో ఉన్నాడు. కాగా రాత్రి ఎన్నికల ప్ర చారం ముగించి శుక్రవారం తెల్లవారుజాము న లేచి చూసేసరికి ఇంటిముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపకొమ్మలు, కోడిగుడ్డుతో పూజలు చేసినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం కాలనీవాసులకు తెలవడంతోవారంతా ఆందోళన చెందుతున్నారు. -
భార్య, కుమార్తెను మంత్రగాడికి అప్పగించిన ఘనుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భార్యను, కుమార్తెను ఓ మంత్రగాడికి ఓ ప్రబుద్ధుడు అప్పగించాడు. ధర్మపురి జిల్లా దేవరాజపాళయంకు చెందిన మణి (60). ఈయన కోవైకు చెందిన యువతితో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి 16 ఏళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల మరో కుమార్తె ఉన్నారు. మణి భార్య కోవై పోలీసులు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఓ ఫిర్యాదు చేశారు.అందులో.. 2015 సెప్టెంబర్‌లో తన భర్త, ఆయన సోదరుడు దురైస్వామి, కుట్టిమణి అనే మంత్రవాదిని ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో పరిహార పూజలు చేయాలని ఆ మంత్రవాది చెప్పాడు. తమ తోటకు సమీపంలో ఉన్న దిగుడు బావి వద్దకు తనను ఒంటరిగా తీసుకెళ్లారు. రాత్రంతా అక్కడ మంత్రగాడు కుట్టిమణి పూజలు చేశాడు. ఆ సమయంలో అతడు తన తలపై, కడుపుపై ఏదో కాటుక లాంటిది పూశాడని, తర్వాత తనను బెదిరించి అత్యాచారం చేశాడని తెలిపారు. ఈ విషయాన్ని తన భర్తకు తెలుపగా పరువుపోతుందన్న ఆందోళనతో ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. ఆ తర్వాత తన పెద్ద కుమార్తెను ప్రతి అమావాస్యకు పూజ పేరిట తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని కుమార్తె తన వద్ద దాచిపెట్టింది. ఈ విషయంపై తాను భర్తతో గొడవ పడడంతో గత ఏడాది తనను భర్త 2016 పుట్టింటికి పంపించివేశాడు. ఆమె అన్నా, తమ్ముడు అందరూ కలసి తన వద్ద ఉన్న ఆరు సవర్ల బంగారు నగలను తీసుకుని ఇంటి నుంచి తరిమివేశారని ఫిర్యాదులో పేర్కొంది. తన, పిల్లల జీవితాన్ని నాశనం చేసిన భర్త, మంత్రవాదులపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
చేతబడి చేశారంటే నమ్మడం లేదని..
అహ్మదాబాద్ : చేతబడి చేశారంటే నమ్మడం లేదని భార్య, కూతురిని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కునాల్ త్రివేది(45) భార్య కవిత(42), కూతురు శ్రీన్(16)తో కలిసి నివాసముంటున్నాడు. గత కొద్ది రోజులుగా కునాల్ తాగుడుకు బాసిసయ్యాడు. రోజు తాగి వచ్చి ఇంట్లోవారితో గొడవకు దిగేవాడు. కాగా బుధవారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు తెరచి చూడగా కునాల్ ఫ్యాన్‌కు వేలాడు ఉన్నాడు. భార్య కవిత, కూతురు శ్రీన్ బెడ్ రూంలో విగత జీవులుగా పడిఉన్నారు. మరో గదిలో కునాల్ తల్లి జయశ్రీబెన్(75) అపస్మారక స్థితి పడి ఉన్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కునాల్ గదిలో ఒక లేఖ లభించింది. చేతబడి చేయడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో రాశాడు. ‘నాకు చేతబడి చేశారంటే ఎవరూ నమ్మడం లేదు. అమ్మ నువ్వు కూడా నన్ను నమ్మలేదు. చేతబడి చేయడం వల్లే నేను తాగుతున్నాను. కానీ మీరంతా నన్ను తాగుబోతుని చేశారు. మంత్రాలు చేశారంటే మీరు నమ్మలేదు. మీరు నమ్మి ఉంటే ఈ రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు’ అని లేఖలో రాసి ఉంది. భార్య, కూతురిని గొంతు పిసికి చంపి తర్వాత కులాన్ ఉరి వేసుకుని చనిపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నామని, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
చేతబడి పేరుతో..హింజిలిలో.. హింస..!
బరంపురం : చేతబడి చేస్తున్నారన్న నెపంతో ఓ కుటుంబంపై గ్రామస్తులంతా మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన గంజాం జిల్లాలోని హింజిలికాట్ నియోజకవర్గంలో శుక్రవారం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఐదుగురిపై గ్రామస్తులంతా దాడికి దిగడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోంది. సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటన జరగడం పట్ల పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఐఐసీ అధికారి ప్రశాంత్‌కుమార్ సాహు దుర్బాదా, సూలాయి గ్రామం మధ్య ఉన్న ఒక గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సుమారు 50 మంది వారిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘటనలో బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయంపై స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దీనికోసం అదనపు పోలీసు బెటాలియన్లను తరలించి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు ఐఐసీ అధికారి ప్రశాంత్‌కుమార్ సాహు తెలిపారు. -
వీడిన కేరళ హత్యల మిస్టరీ
సాక్షి, తిరువనంతపురం: నాలుగు రోజులక్రితం వెలుగులోకి వచ్చిన కేరళలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్యచేసి, ఇంటి వెనుక పూడ్చిపెట్టిన దారుణ ఘటన మిస్టరీ వీడింది. హత్యకు గురైన కన్నట్ కృష్ణన్ (52) స్నేహితుడు అనీష్ ఈ కేసులో ప్రధాన నిందుతుడుగా పోలీసులు గుర్తించారు. కేరళలోని ఇడుక్కి జిల్లా తొడుపుజాలో చోటు చేసుకున్న ఈ హత్యలకు అనుమానం, చేతబడి(బ్లాక మ్యాజిక్) కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ప్రధాన నిందితుడు అనీష్, హతుడు కృష్ణన్ కుటుంబానికి చాలా సన్నితుడు. భూత వైద్యుడిగా, జ్యోతిష్యుడిగా స్థానికంగా పేరొందిన కృష్ణన్ వద్ద చేతబడులు తదితర క్షుద్రపూజలు నేర్చుకున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత, అనీష్ తన సొంత బిజినెస్ ప్రారంభించాడు. అయితే తనకు బాగా కలిసి రాకపోవడంతో కృష్ణన్‌పై అనీష్ అనుమానం పెంచుకున్నాడు. తన శక్తులను, పవర్‌ను కృష్ణన్ లాగేసుకుంటున్నాడంటూ పగతో రగిలిపోయాడు, అతణ్నిఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. అంతేకాదు అతని దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలను కూడా సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితుడు లిబీష్ సహాయంతో ఒక పథకం ప్రకారం కృష్ణన్ కుటుబాన్ని హత మార్చాడు. గత ఆరు నెలలుగా ఇదే పథకంలో ఉన్నఅనీష్, స్నేహితుడు సహకారంతో ఈ హత్యలకు పూనుకున్నాడు. ఇడుక్కి ఎస్పీ వేణుగోపాల్ ఈ ఘటన వివరాలను మీడియాకు వివరించారు. జూలై 29వ తేదీ అర్థరాత్రి నిందితులిద్దరూ అనీష్, లీబేష్ బైక్ విడిభాగాలను మారణాయుధాలుగా వెంట తీసుకెళ్లారు. (ఈ కేసులో మరో నిందితుడు లిబీష్కు టూవీలర్ వర్క్ షాప్ ఉంది) పథకం ప్రకారం కృష్ణన్‌కు బయటకు రప్పించే ప్లాన్‌లో భాగంగా, వారి ఇంటిముందు కట్టేసి ఉన్న మేకను కొట్టారు. మేక అరుపులు విన్న కృష్ణన్ బయటకు రాగానే అతని తలపై మోది హత్య చేశారు. ఈ అలికిడికి బయటికి వచ్చిన భార్య సుశీల (50)పై లిబీష్ ఎటాక్ దాడిచేశాడు. అయితే ఆమె తప్పించుకుని లోపలికి వెళ్లినా వదల్లేదు. ఇంతలో కూతురు అర్ష (21) రాడ్ తీసుకొని స్వీయ రక్షణకు ప్రయత్నించింది. అనీష్ తలపై కొట్టింది. బిగ్గరగా అరవడం ప్రారంభించింది. కానీ అనీష్ ఆమెను కొట్టి అరచేతితో నోటిని గట్టిగా మూసి మరీ కొట్టాడు. ఇక చివరగా మానసిక వికలాంగుడైన కొడుకు అర్జున్ (18)ను కూడా కత్తితో గాయపర్చారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారదరూ చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును తీసుకొని నిందితులు పారిపోయారు. మరుసటిరోజు మృతదేహాలను మాయం చేసేందుకు తిరిగి సంఘటనా స్థలానికి వచ్చారు నిందితులు. అయితే అప్పటికి అర్జున్ ఇంకా బతికే ఉండటంతో అమానవీయంగా అతని తలపై మరోసారి సుత్తితో కొట్టి హత్య చేశారని ఎస్పీ వేణుగోపాల్ వెల్లడించారు. అయితే ప్రధాన నిందితుడు అనీష్ ఇంకా పరారీలో ఉన్నాడని, అతడి స్నేహితుడు, కరీకోడ్ నివాసి లిబీష్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. కాగా పొరుగింటివారి ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ దారుణం కలకలం రేపింది. కుటుంబంలోని నలుగురినీ చంపి, ఇంటివెనక పాతిపెట్టిన వైనం స్థానికులను కలవరపర్చింది. -
శవాలను ఒకదానిపై ఒకటి పేర్చి...
సాక్షి, తిరువనంతపురం: కనిపించకుండా పోయిన ఓ కుటుంబం దారుణంగా హత్యకు గురైన ఘటన కేరళలో కలకలం రేపింది. ఇడుక్కి జిల్లా తోడోపుజా గ్రామానికి చెందిన కృష్ణన్, అతని భార్య ఇద్దరు పిల్లలు గత నాలుగు రోజులుగా అదృశ్యమైనట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఇంటి పెరట్లోనే వారి మృతదేహాలను వెలికి తీశారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నాలుగు రోజులుగా ఆ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఇంట్లోకి వెళ్లిన బంధువులు ఇంటి గోడలకు రక్తపు మరకలు ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డాగ్ స్క్వాడ్ సాయం తీసుకోగా.. అవి పెరట్లోని ఓ గుంత వద్ద ఆగిపోయాయి. అక్కడ తవ్వి చూసిన పోలీసులు నాలుగు మృత దేహాలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. మృతులను కృష్ణన్(56), సుశీల(52), ఆర్ష(21), అర్జున్(19) గా గుర్తించారు. ఇంట్లో ఓ సుత్తి, కత్తికి రక్తపు మరకలు ఉండటంతో వారిని వాటితోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటిపై గాయాల ఆధారంగా వారిని కిరాతకంగా హత్య చేశారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణన్‌కు భూత వైద్యుడిగా, జ్యోతిష్యుడిగా ఆ ప్రాంతంలో పేరుంది. పలువురు ప్రముఖులు కూడా అతన్ని కలుస్తుంటారని తెలుస్తోంది. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే ఆ కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల వారితో కూడా కలివిడిగా ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. చేతబడి, కోణంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టాయం మెడికల్ కాలేజీకి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కేసును త్వరగా చేధిస్తామని అంటున్నారు. బురారీ కేసు; ఊహించని ట్విస్ట్ -
చేతబడి నెపంతో కుటుంబంపై దాడి
కైకలూరు : శాస్త్ర విజ్ఞానం శరవేగంగా ఓ వైపు దూసుకుపోతున్నా కొల్లేటి లంక గ్రామాల్లో మూఢ నమ్మకాల జాఢ్యం మాత్రం వీడటం లేదు. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబాన్ని చితకబాదిన ఘటన మండవల్లి మండలం నుచ్చిమిల్లి గ్రామంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. కైకలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నుచ్చిమిల్లి గ్రామంలో జయమంగళ రంగారావు, సత్యం సోదరుల మధ్య భూ సరిహద్దు వివాదం కొనసాగుతోంది. సత్యం కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాగుండలేదు. దీంతో ఓ స్వామీజీని ఆశ్రయించగా ఎవరో చేతబడి చేశారని చెప్పారు. విభేదాల కారణంగా రంగారావు ఈ పని చేయించాడని భావించి గ్రామ పెద్దలకు సత్యం బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ చెరువు వద్ద పంచాయితీ పెట్టారు. రంగారావు పూజలు చేస్తున్నాడని ఓ యువతి సాక్ష్యం చెప్పింది. రంగారావును పెద్దలు భయపెడుతూ నిలదీయగా, గ్రామంలో ఘంటసాల వెంకటేశ్వరరావు (40) కుటుంబం ఇటువంటి పూజలు చేస్తున్నారని చెప్పాడు. వారిని పిలిచి కొట్టడంతో తప్పని పరిస్థితుల్లో పూజలు చేశామని వారు ఒప్పుకున్నారు. దీంతో గ్రామస్తులు వెంకటేశ్వరరావును చితకబాదారు. అడ్డు వచ్చిన అతని భార్య లక్ష్మి, తల్లి చుక్కమ్మను కూడా కొట్టారు. వెంకటేశ్వరరావు కుమారుడు జయరామకృష్ణ స్టేషన్‌కు ఫోన్ చేస్తే డ్యూటీలో నేను ఒక్కడినే ఉన్నాను. మీ సర్పంచ్‌తో మాట్లాడతానని సదరు పోలీసు చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు పోలీసులు గ్రామానికి వచ్చారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో క్షతగాత్రులు కైకలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. తమను క్షుద్రపూజలు చేశారని ఒప్పుకోవాలని గ్రామ పెద్దలు చిత్రహింసలకు గురి చేశారని బాధితులు మండవల్లి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి రాజకీయవేత్త.. నుచ్చుమిల్లి వ్యవహారం వికటిండచడంతో గ్రామ పెద్దలు ఓ టీడీపీ నేతను ఆశ్రయించారు. అయ్యిందేదో అయ్యింది.. రాజీ పడతామని ఆయనతో చెప్పారు. దీంతో బాధితులతో రాయబారాలు నడుపుతున్నారు. నయానో, భయానో ఒప్పించడానికి యత్నాలు జరుగుతున్నాయి. చితకబాది ఇప్పుడు రాజీ అంటే ఎలా.. అని బాధిత బంధువులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అన్యాయంగా కొట్టిన పెద్దలకు శిక్ష పడాలని కోరుతున్నారు. ఈ విషయంపై కైకలూరు సీఐ రవికుమార్‌ను వివరణ కోరగా ఇద్దరు సోదరుల మధ్య వివాదం కారణంగా చిన్నపాటి ఘర్షణ జరిగిందని తేలిగ్గా కొట్టేశారు. తప్పుడు ఫిర్యాదుగా భావిస్తున్నామన్నారు. -
క్షుద్రపూజల పేరిట మోసం
ధర్మారం(ధర్మపురి) : ఇంట్లో లంకెబిందెలున్నాయని.. వాటిని బయటకు తీయాలని లేకుంటే ప్రాణనష్టం సంభవిస్తుందని మాయమాటలు చెప్పి రూ. 4 లక్షలు.. బంగారం వసూలు చేసిన ఘరా నా మోసగాన్ని ధర్మారం పోలీసులు మంగళవా రం ఆరెస్టు చేశారు. పోలీసుస్టేషన్లో పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ నరేందర్ వివరాలు వెల్లడించారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రా మానికి చెందిన దేవి లచ్చయ్య కూతురు సంకీర్తన 2014లో అనారోగ్యంతో మరణించింది. దీంతో తమ కుటుంబానికి గిట్టనివారు క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన తిరునహరి రాజును సంప్రదించాడు. 2016లో లచ్చయ్య ఇంటిని రాజు సందర్శించాడు. ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయని.. అందుకే ప్రాణనష్టం జరిగిందని, క్షుద్రపూజలు చేసి వాటిని బయటకు తీయాలని సూచించాడు. ఇందుకు 11తులాల బంగారం, 11తులాల వెండి, 11 తులాల రాగితో నాగదేవత ప్రతిమ చేయాలని, రూ. 16వేలు ఖర్చవుతుందని చెప్పి తీసుకున్నాడు. 2017లో ఇంటికి వచ్చి పూజలు చేశాడు. ఇందుకు రూ. 4లక్షలు, 4తులాల బంగారం తీసుకున్నాడు. కాగా పూజల తరువాత లంకెబిందెలు లభ్యమవకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న దేవి లచ్చయ్య ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాజును అరెస్టు చేశారు. అతడి వద్ద రూ. 1.70లక్షల నగదు, నాలుగు తులాల బంగా రం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సై దేవయ్య, ఏఏస్ఐ ఎండీ ఆమ్జద్ పాల్గొన్నారు. -
420 గురుస్వామి..!
తల్లాడ: ఆయనొక గురుస్వామి. ఓ మహిళ ఫిర్యాదుతో ఆయనపై ‘420’ సెక్షన్ కింద తల్లాడ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలు... ఖమ్మం నగరానికి చెందిన గూడూరు రమాదేవి, మద్యానికి బానిసగా మారిన తన భర్త రవిని దానికి (మద్యానికి) దూరం చేయాలని కోరుతూ తల్లాడకు చెందిన గురుస్వామి పస్తం రంగారావును ఆశ్రయించింది. దీనికి గురుస్వామి అంగీకరించాడు. ఇందుకుగాను పదివేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఆ మొత్తాన్ని అతడికి ఆమె ఇచ్చింది. ఆమె పలుమార్లు గురుస్వామి వద్దకు వచ్చి పూజలు చేసింది. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తానిచ్చిన డబ్బును తిరిగివ్వాలని కోరింది. పూజలు చేసినందుకు డబ్బంతా ఖర్చయిందని, తానేమీ తిరిగివ్వలేనని ఆ గురుస్వామి బదులిచ్చాడు. ఆమె గట్టిగా అడగడంతో ‘‘చేతబడి చేసి నిన్ను చంపుతా’’ అని బెదిరించాడు. ఆమె భయపడింది. తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మేడా ప్రసాద్, ఆ గురుస్వామిపై శుక్రవారం 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. -
చేతబడి.. అనుష్క చిత్రంపై బ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ : తొలిసారిగా ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చిన బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మ చిత్రానికి బ్రేక్ పడింది. ఆమె సినిమాను తమ దేశంలో విడుదల కానివ్వబోమంటూ పాకిస్థాన్ సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఈ చిత్రం తమ ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ఉందని, అనుష్క శర్మ చిత్రంలో చేతబడి, మంత్రశక్తులు వంటివాటిని ప్రమోట్ చేసేదిగా ఉందంటూ పాక్‌లో ఆమె సినిమాపై నిషేధం విధించారు. 'పరి కథ, మాటలు, కథా వరుస మొత్తం కూడా ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ చిత్రం కాన్సెప్ట్ మాకు సరిపడదు. ఈ సినిమా చూసేవారంతా కూడా బ్లాక్ మ్యాజిక్కు దగ్గరయ్యే ప్రమాదం ఉంది. మా మతానికి విరుద్ధంగా సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రమోట్ చేసేలా పరి చిత్రం ఉంది. అందుకే ఈ సినిమాను మా దేశంలో విడుదల కానివ్వబోము' అని పాక్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్ తెలియజేసింది. ఇదే విషయాన్ని పాక్ చిత్రాల డిస్టిబ్యూటర్ల సంఘం కూడా సమర్థించింది. ఆ సంఘ చైర్మన్ చౌదరీ ఎజాజ్ కమ్రాన్ మాట్లాడుతూ 'ఇస్లామిక్ చరిత్ర, సంస్కృతికి విరుద్ధంగా ఉన్నా ఏ చిత్రాన్నయినా పాక్‌లో బ్యాన్ చేయాల్సిందే' అని చెప్పారు. -
‘కొడుకు కోసం చంద్రబాబు క్షుద్రపూజలు’
సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు తప్పుకు మహిళా అధికారిణిని బలి చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. కొడుకు కోసం క్షుద్రపూజలు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయేసరికి నెపాన్ని అధికారులపైకి నెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న స్వార్థంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పూజలు చేయడం అరిష్టమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆ నెపాన్ని మహిళా అధికారి అనురాధపై నెట్టారని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలపై పీఠాధిపతులు చంద్రబాబును నిలదీయాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. -
బెజవాడ దుర్గమ్మ గుడిలో అలజడి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవస్థానంలో అపచారం జరిగినట్టు తెలుస్తోంది. ప్రవిత్రమైన అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు రావడంతో అలజడి రేగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్యకుమారి ఆధ్వర్యంలో గత నెల 26న అర్ధరాత్రి ఈ తంతు జరిగినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో దేవస్థానం పాలక మండలి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. డిసెంబర్ 26న అమ్మవారి గర్భాలయం వద్ద అర్చకులు బదులు అపరిచిత వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రధాన అర్చకుడిని ఆదేశించారు. అయితే ఆలయంలో ఎటువంటి తాంత్రిక పూజలు జరగలేదని ఈవో తెలిపారు. ఆలయంలో అలజడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్భగుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న ప్రచారంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు అరిష్టమని హిందూ పరిరక్షణ సమితి పేర్కొంది. ఈ వ్యవహారంపై దేవాలయ అధికారులు వివరణ ఇవ్వాలని, లేకుంటే పీఠాధిపతుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. అతడి వల్లే వివాదం: మంత్రి దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగలేదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ప్రధాన అర్చకుడు విశ్వనాథపల్లి బద్రినాథ్‌బాబు తన బంధువు రాజాను తీసుకెళ్లడం వల్లే అనుమానాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. అనుమతి లేకుండా బయటివ్యక్తిని గర్భగుడిలోకి తీసుకెళ్లం నేరమవుతుందని వెల్లడించారు. బెజవాడ దుర్గమ్మ గుడిలో అలజడి -
చేతబడి నెపంతో తండ్రీకొడుకులపై దాడి
ములకలపల్లి(అశ్వారావుపేట): చేతబడి నెపంతో మండలంలోని మొగరాళ్ళగుప్ప గ్రామంలో గురువారం తండ్రీకొడుకులపై దాడి జరిగింది. మొగరాళ్ళగుప్ప గ్రామానికి చెందిన గుండు రమేష్–సీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె గుండు అశ్విని, ఖమ్మంలోని బాలికల గురుకుల పాఠశాలలో రెండేళ్లపాటు చదివింది. ఇంటిలో ఆర్థిక ఇబ్బంది కారణంగా ఈ ఏడాది చదువు ఆపేసింది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. థైరాయిడ్ ఎక్కువగా ఉందని వైద్యులు చెప్పారు. మందులు వాడినప్పటికీ ఇది తగ్గలేదు. తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే తనకు ఇలా జరుగుతున్నదని ఆమె తన తల్లిదండ్రులతో చెప్పింది. ఆమె గురువారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు వచ్చారు. వారిలో కీసరి రామచంద్రం ఉన్నాడు. ఆయనను చూసి న అశ్విని కుటుంబీకులు... ‘చేతబడి చేసి చంపావు’ అంటూ కర్రలతో దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకుని, కాపాడేందుకు వెళ్లిన రామచంద్రం కుమారుడు శ్రీనును కొట్టారు. వారిని పాల్వంచ ఆస్పత్రికి ఎస్సై రామ్‌చరణ్ తరలించారు. దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
మంత్రాల నెపంతో మామను, అత్తను చంపేశాడు
జష్పూర్: ఛత్తీస్‌గఢ్ లో దారుణం జరిగింది. చేతబడులు చేస్తున్నారనే నెపంతో ఓ వ్యక్తి తన సొంత మేనమామ, అత్తలను కొట్టి చంపాడు. జష్పూర్ జిల్లా కరదరి గ్రామంలో ఈ ఘోరం వెలుగుచూసుంది. గ్రామానికి చెందిన లండ్రూ రాం భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి కారణం.. తన మేనమామ బిషున్ రాం(60), అతని భార్య బసంతి రాయ్(48)నే అని లండ్రూ అనుమానం. దీంతో వారిద్దరినీ అంతం చేయాలని పథకం పన్నాడు. ఆదివారం సాయంత్రం ఊరి బయట ఉన్న తన ఇంటికి వారిద్దరినీ ఆహ్వానించాడు. అయితే, ఆ దంపతులకు అనుమానం వచ్చింది. కానీ, లండ్రూరాం మాయమాటలు చెప్పి రప్పించాడు. మార్గమధ్యంలోనే వారితో వాదులాటకు దిగి ఇంటి సమీపంలోకి చేరాక ఇద్దరినీ కర్రతో తీవ్రంగా కొట్టి చంపాడు. సోమవారం సాయంత్రం ఆ మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లండ్రూను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య ఆరోగ్య సమస్యలకు వారి మంత్రాలే కారణమనే అనుమానంతో చంపేసినట్లు అంగీకరించాడు. దీంతో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
చేతబడి చేస్తున్నారన్న నెపంతో..
శంషాబాద్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోకి కొత్వాల్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురిని గ్రామస్తులు చితకబాదారు. అబ్రహం, ఆశిర్వాదం, మోసిన్, లలిత, జంగయ్య అనే వారు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో శనివారం గ్రామస్తులంతా కలిసి.. వీరిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఐదుగురినీ పోలీసులకు అప్పగించారు. -
యువతుల కోసం వశీకరణ కాటుక
చెన్నై: తమిళనాడు పెరంబలూరులో సంచలనం సృష్టించిన క్షుద్రపూజల కార్తికేయన్ ఉదంతంలో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షుద్రపూజలకు పాల్పడిన అతడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెరంబలూరు ఎంఎం నగర్‌కు చెందిన కార్తికేయన్ (32) తన ఇంట్లో క్షుద్రపూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (చదవండి...పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా) ఇలా వుండగా పోలీసులు తాజాగా జరిపిన విచారణలో ఇతగాడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు సమాచారం. కాగా ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్‌ను కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే అతడు నివాసం ఉంటున్న ఇంట్లో యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా
► చేతబడి, వశీకరణ విద్యలతో భుక్తి ► చెక్కపెట్టెలో యువతి మృతదేహం.. పెరంబలూరులో దారుణం ► నరబలి అనుమానంతో మంత్రవాది కార్తికేయన్, భార్య సహా నలుగురు అరెస్ట్ ► మంత్రులు, మాజీ మంత్రులు, బడా రాజకీయనేతలూ పూజలు చేయించుకున్నట్లు విచారణలో వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడతా, వారు ఆశపడిన కోర్కెలు తీరకుండానే మరణించి ఉన్నట్లయితే వారి నుంచే తెలుసుకుంటా...పరిహారాలు చేయించాలని బంధువుల నుంచి సొమ్ము తీసుకుంటా...’ పెరంబలూరులో పోలీసులకు పట్టుబడిన ఒక మంత్రవాది చెప్పిన భయానక మాటలు ఇవి. మానవుని బలహీనతలే అతనికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. మూఢనమ్మకాలే పొట్ట నింపుతున్నాయి. నరబలులు చేసే మాంత్రికుడిగా అనుమానిస్తూ కార్తికేయన్ అనే మంత్రవాదిని, అతని భార్య నశీమా అలియాస్ దీపిక, ఇద్దరు సహచరులను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. కార్తికేయన్ వద్దకు మంత్రపూజల నిమిత్తం తమిళనాడు, పుదుచ్చేరీలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, బడా రాజకీయనేతలు వస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... తమిళనాడులోని పెరంబలూరు మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే దారిలోని ఎంఎంనగర్లో శెట్టికుళం గ్రామానికి చెందిన శరవణన్‌కు రెండస్థుల భవనం ఉంది. ఈ భవనంలో పెరంబలూరు కల్యాణనగర్కు చెందిన కార్తికేయన్ (32) నెలకు రూ.20వేల అద్దె చెల్లిస్తూ గత మూడేళ్లుగా కాపురం ఉంటున్నాడు. కార్తికేయన్‌తోపాటు ఆయన భార్య, ఇద్దరు పనివాళ్లు కూడా అక్కడే నివసిస్తున్నారు. అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పెరంబలూరు ఎస్పీ సోనాల్ చంద్ర నేతృతంలో పోలీసు బృందం అక్కడికి చేరుకుని ఇంటిని తనిఖీ చేయగా, ఒక గదిలో రెండు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవుతో తెల్లని వస్త్రంతో చుట్టబడిబడి ఉన్న శవపేటికలో కుళ్లిపోయిన స్థితిలో యువతి శవం ఉంది. శవపేటిక పక్కనే సుమారు 20కి పైగా మానవ పుర్రెలు, పెద్ద సంఖ్యలో ఎముకలు పడి ఉన్నాయి. ఇతర గదుల్లో పూజసామగ్రి చిందరవందరగా పడి ఉంది. ఇంటిలో కాపురం ఉంటున్న కార్తికేయన్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రూ.5వేలు చెల్లించి చెన్నై నుంచి ఈ శవాన్ని తెచ్చుకున్నానని, దెయ్యాలతో సంబంధం ఉండే అఘోరీ పూజలు చేస్తూ మంత్రవాదిగా జీవిస్తున్నానని తెలిపాడు. అర్ధరాత్రి వేళల్లో పూజలు నిర్వహించి తన వద్దకు వచ్చే వ్యక్తుల కోర్కెమేరకు గతించిన వారి పూర్వీకుల ఆత్మలతో సంభాషిస్తానని, చనిపోయిన వారి కోర్కెలను అడిగి తెలుసుకుంటానని చెప్పాడు. కోర్కెలు తీరకుండానే ప్రాణాలు విడిచిన వారి ఆత్మలు చెప్పిన వివరాలను బంధువుల దృష్టికి తీసుకెళ్లి పరిహారం చేయిస్తానని చెప్పి డబ్బులు పుచ్చుకుంటానని పోలీసులకు వివరించాడు. అంతేగాక చేతబడి, పురుషులు, స్త్రీల వశీకరణం తదితర పూజలు కూడా నిర్వహిస్తానని అన్నాడు. కార్తికేయన్ చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న అనంతరం ఎస్పీ స్వర్ణలత క్లూస్‌టీమ్‌ను పిలిపించారు. శవపేటికలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఉందని క్లూస్‌టీమ్ తెలిపారు. రీపోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్తికేయన్, ఆయన భార్య నశీమాభాను, సుమారు 40 ఏళ్ల వయస్సున్న వారి సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో మంత్రతంత్రాలు చేయడం, ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణపై కార్తికేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా ఇటీవలే బెయిల్‌పై బైటకు వచ్చిరాగానే తన వైఖరిని మార్చుకోకుండా అదే వృత్తిని కొనసాగించడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఐటీ రాజధాని కాదు.. మాంత్రికుల రాజధాని
బెంగుళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరు వాసులను తాంత్రికశక్తులు నడిపిస్తున్నాయి. నగరంలో 33 ఏళ్ల మహిళ అరెస్టు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. గౌరిపలయా ప్రాంతానికి చెందిన ఓ మహిళా తాంత్రికురాలు కష్టాలు తీర్చాలని తనన ఆశ్రయించిన ఓ యువజంటకు బాలికను బలి ఇవ్వాలని చెప్పింది. ఆ తర్వాత ఆమె శరీరంతో ప్రత్యేకపూజలు నిర్వహించాలని తెలిపింది. దీంతో మొత్తం ఐదుగురు సంతానం కలిగిన ఆ జంట.. తమ పదేళ్ల బాలికను మంత్రగత్తె వద్దకు తీసుకెళ్లింది. బలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె క్షుద్రపూజల పేరిట బాలికను చంపింది. ఆ తర్వాత మరికొన్ని క్లిష్టమైన ప్రక్రియలను పూర్తి చేసి ఆ జంటను అక్కడి నుంచి పంపేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంత్రగత్తెను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన నిజాలు బయటకు వచ్చాయి. రాజధాని అంతటా చేతబడి తదితర మాంత్రిక పూజలు కొనసాగుతున్నట్లు ఆమె చెప్పింది. ప్రేమికులు, కార్పొరేట్ ఉద్యోగులు, కార్ రేస్ డ్రైవర్లు, ఆర్థికంగా నలిగిపోతున్న కుటుంబాలు ఇలా బాగా చదువుకున్నవారే తమ కష్టాలను తీర్చాలంటూ తాంత్రికశక్తులను ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించింది. మహిళ వెల్లడించిన సమాచారంతో షాక్‌కు గురైన పోలీసులు.. ఇలాంటి ఘటనలు ఇంకా జరిగాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మాంత్రికులను కలిసేందుకు సోషల్‌మీడియా తదితర ప్రత్యేక పోర్టల్స్ ద్వారా బెంగుళూరియన్లు అపాయింట్మెంట్లను తీసుకుంటున్నట్లు.. వ్యక్తి సమస్యను బట్టి రూ. 500ల నుంచి రూ. లక్షలోపు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ మంది ప్రజలు 'వశీకరణ క్రియ' పూజను నిర్వహించాలని కోరుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మాంత్రికుడు తెలిపారు. వశీకరణ క్రియ అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తన అవసరానికి అనుగుణంగా పనిచేయించడమని వివరించారు. 40 ఏళ్లుగా తాను బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి పూజలు నిర్వహించడానికి వ్యక్తి పుట్టిన తేదీ, ఫోటో, సమస్య గురించిన వివరాలు అవసరమవుతాయని చెప్పారు. తన వద్దకు వచ్చిన వారిలో ఎక్కువ మంది అవతలి వ్యక్తిని చంపడానికి ఏదైనా చేయమని అడిగారని తెలిపారు. బెంగుళూరులోని ఇందిరానగర్, రాజాజీనగర్ తదితర ప్రాంతాల్లో మాంత్రికులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. -
సీఎం జయకు చేతబడి?
లండన్ పత్రిక డైలీమెయిల్లో కథనం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలితపై కొందరు చేతబడి చేయడం వల్లే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ లండన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు తమకీ విషయం తెలిపినట్టు ఆ పత్రిక పేర్కొంది. డీఎంకేలోని కొందరు కొన్ని లక్షల రూపాయలు ఖర్చుచేసి చేతబడి చేసి ఉండవచ్చని, అలాగే అన్నాడీఎంకేలో సీఎం అంటే గిట్టనివారు కూడా ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొంది. కరుణానిధి అనారోగ్యం వెనుక కూడా తాంత్రిక శక్తులు అవకాశముందని కూడా జ్యోతిష్కుడు తెలిపినట్లు వార్త కథనంలో ఉంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడినందున సాధారణ వార్డులోకి మార్చుతారని తెలిసింది. పతకం అమ్మకు అంకితం అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో విజేతగా తాను సాధించిన పతకాన్ని సీఎం జయలలితకు అంకితమిస్తున్నట్లు ప్రముఖ ఆటగాడు ధరమ్‌రాజ్ సేరలాథన్ తెలిపారు. -
గర్భిణి అనుమానాస్పద మృతి
వైఎస్సార్ జిల్లా లోఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజంపేట మండలం బలిజపల్లి గ్రామం పూసల కాలనీలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. మూడు నెలల గర్భిణి అయిన అంజమ్మ ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తమ కుమార్తెను చేతబడి చేసి చంపారని మృతురాలి తల్లి ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రాల నెపంతో కత్తితో దాడి
వ్యక్తిగత విభేదాలతో మంత్రాలు చేశాడంటూ ఓ వ్యక్తి పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం తందులూరులో చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామ మాజీ సర్పంచి చిన్న సంజీవరాయుడి కాలికి ఇటీవల కాలిపై పుండు అయింది. దీనికి పొరుగింట్లో ఉండే హుస్సేన్ మంత్రాలు చేయటమే కారణమని అతని అనుమానం. దీనికి తోడు హుస్సేన్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న హుస్సేన్‌పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన హుస్సేన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఉప్పు...నిప్పు
ఒక కష్టం వస్తే... తీరే దారి కోసం చూస్తారు ఆ కష్టాన్ని తీర్చే వారి కోసం చూస్తారు కష్టాన్ని కాల్చేసే నిప్పులాంటి మంత్రం కోసం వెదుకుతారు అందుకే... నిప్పుల మీద నడిచే మంత్రగాడే దిక్కనుకున్నారు కష్టాల పెనం మీద నుంచి తప్పిస్తాడనీ అనుకున్నారు కానీ... అతగాడు... ద్వేషం అనే నిప్పుల్లోకి తోసేశాడు నాణేనికి రెండువైపులూ తెలిసిన మాయగాడతడు ఊరిని రెండుగా చీల్చాడు ఒకరికి బొమ్మ చూపించాడు ఒకరికి బొరుసు చూపించాడు ఊరిని ఉప్పు - నిప్పులా కణకణ మండించాడు ‘‘అయ్యో... అయ్యో! ఎంత ఘోరం!! అయినా గట్టిగా ఉన్న మనిషి పిట్టపిడుగున పోయాడు పాపం’’ సుందరయ్య పార్థివ దేహాన్ని చూస్తూ నొచ్చుకున్నది వరలక్షమ్మ. ‘‘పొద్దున పొలానికి మా ఇంటి ముందు నుంచే పోతూ నన్ను పలకరించాడొదినా. ఇంతలో మనిషిని ఇలా చూడాల్సి వచ్చింది’’ రమణమ్మ మాటల్లో ఆవేదన. ‘‘కాలువ మళ్లించి వస్తానని వెళ్లాడు’’ అంటూ కన్నీరు మున్నీరవుతోంది సుందరయ్య భార్య ఈశ్వరమ్మ. ఇంటి బయట మగవాళ్లు ఉత్తరక్రియల ఏర్పాట్లలో ఉన్నారు. అంతుబట్టని మరణం అని సరిపెట్టుకున్నారు కొడుకులిద్దరూ. తండ్రితో అనుబంధాన్ని దేవుడు అంతవరకే రాశాడని కళ్లు తుడుచుకున్నది కూతురు. అల్లుడు దగ్గరుండి ఇంట్లో వాళ్లకు ధైర్యం చెబుతున్నాడు. దశదిన కర్మలు పూర్తయ్యాయి. గుండెల్లో గూడు కట్టుకున్న బాధను అదిమి పెట్టుకుని డైలీ రొటీన్‌కు సిద్ధమవుతున్నారు సుందరయ్య భార్యాపిల్లలు. అయితే... సుందరయ్య మరణం ఇంటికే కాదు ఊరంతటికీ మానని గాయంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ‘‘నిజమేనా రమణమ్మా! నువ్వు వాళ్లింటికి వెళ్తుంటావుగా! పాపం సుందరయ్యకు చేతబడి చేశార్ట. అందుకే పోయాడంటున్నారు’’ గుసగుసగా అడిగింది పద్మావతి. ‘‘ఏమోనమ్మా. అప్పుడెప్పుడో కోటయ్యకి- సుందరయ్యకి పొలం గట్ల తగాదా ఉండేది. పంటలు పెట్టాక ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారాయె. అయినా కోటయ్య అంత పాపానికి ఒడిగట్టి ఉంటాడా? ఆ... కొడుకులు అంతటి కాలాంతకులే మరి’’ అంటూ ఆశ్చర్యపోతూనే సమాచారకథనాన్ని చిక్కబరిచింది రమణమ్మ. రెండో రోజు సాయంత్రానికి సుందరయ్య చేతబడి వల్లనే పోయాడని ఊరంతా గుప్పుమంది. ప్రతీకారపు రంకెలు! మంత్రగాడి ముందు దీనంగా కూర్చుని ఉంది ఈశ్వరమ్మ. పక్కనే కొడుకులు. ‘‘ఎవరైనా ఊరికే ఎందుకు చేయిస్తారు. వినాశం కోరుకునే వాళ్లే చేయిస్తారు. రోగాన పడి కోలుకునే చేత కూడా కాదది. ఏకంగా మనిషిని రక్తం కక్కించి ప్రాణం పీల్చుకునే చేతబడి చేశారు’’ ఆజ్యం పోశాడు మంత్రగాడు. పెద్ద కొడుకులో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఈశ్వరమ్మ కొడుకు భుజం మీద చేయి వేసింది తొందర పడకూడదన్నట్లు. నిప్పుల నడకలో ట్రిక్కు! పాదం చర్మం మందంగా ఉంటుంది. నిప్పు మీద కాలు పెట్టిన వెంటనే కాలదు. చర్మం కాలడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. ఈ లోపు అడుగు తీసేస్తాం. నిప్పు వేడి చర్మాన్ని కాల్చేలోపే అడుగు తీసేస్తామన్నమాట. అయితే కాలి పిక్కలకు తగిలే వేడిని భరించగలగాలి. అది ప్రాక్టీస్‌తో వస్తుంది. ఒక్క సుందరయ్య ఇల్లే కాదు. ఊరిలో ప్రతి ఒక్కరికీ ఏదో ఓ సమస్య. తమ మీద ఎవరో కుట్ర పన్నారనే ఆందోళన. ఎవరనే అన్వేషణతో ఒకరి మీద మరొకరికి ఈర్షాసూయలు చాపకింద నీరులా పాకిపోయాయి. కనిపిస్తే కత్తులు దూసుకునేటంత కోపంగా ఉంటున్నారు. ‘‘రమణమ్మా! మనం అనుకున్నది నిజమే. స్వాములోరు కూడా అదే చెప్పార్ట. ఇంకేం అనర్థం వస్తుందోనని ఈశ్వరమ్మ కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది. ఆ పిల్లాడేమో తిరుగుబడి చేయిస్తానని రంకెలు వేస్తున్నాడు’’ అన్నది పద్మావతి. ‘‘అయినా ఒకూళ్లో ఉండేటోల్లం. ఇట్లా చేసుకుని ఏం బావుకుంటారో’’ అన్నది పద్మావతి ఒకింత బాధగా. నిప్పులు కురిసే ఆగ్రహం! ఇదేమీ రెండు వర్గాల పోరు కాదు. ఒక కుటుంబం వాళ్లు ఫలానా కుటుంబం పట్ల ద్వేషంతో రగిలిపోతుంటే, మరొకరు వాళ్లకు అనుమానం ఉన్న వాళ్ల మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరికొకరు ఎదురుపడితే కళ్లలో నిప్పులు కురిపించుకుంటున్నారు. వెరసి గ్రామంలో ఎవరూ నిశ్చింతగా జీవించడం లేదు. ఊరు ఎందుకలా మారింది? మంత్రగాడి దగ్గరకు వచ్చిన వాళ్లు తమ కష్టాలను చెప్పుకున్నప్పుడు... ‘మీ మీద కోపంతో ఉన్న వారెవరో మీ మీద చేతబడి చేయించారు. అందుకే మీ ఇంట్లో ఇన్ని కష్టాలు వచ్చాయి. మీ కష్టాలు తొందరగా తీరిపోవాలంటే వారి మీద తిరిగి చేతబడి చేయవచ్చు. లేదంటే మీరు శాంతి పూజలు చేయించుకుంటూ ఉంటే మెల్లగా కష్టాలు పోతాయి’ వంటి మాటలతో నమ్మించేవాడు. నీ శత్రువుల ఆటకట్టించి నీ చుట్టూ తిరిగేలా చేస్తానని ఒకరిని, నీ మీద చేతబడి జరిగింది తిరుగుబడి చేయాలని మరొకరిని నమ్మించేవాడు. ఊరి వాళ్లను మానసికంగా విడగొట్టి పూజలు, దక్షిణ పేరుతో డబ్బు గుంజుతూ హాయిగా బతికేసేవాడు. స్వామివారు(మంత్రగాడు) చెప్పినట్లు చేయకుండా ఎదురు ప్రశ్నిస్తే అనర్థాలు జరుగుతాయని శిష్యగణం భజన మరో వైపు. ఈ డ్రామాకు తెరపడడానికా అన్నట్లు ఓ రోజు సుందరయ్య కొడుకు కోటయ్య మీద దాడి చేశాడు. కోటయ్య కొడుకు అదే స్థాయిలో సవాల్ చేయడంతో దావానలం బహిర్గతమైంది. కొమ్ములు తిరిగిన కోపం! ‘‘పొద్దున సాములోరి దగ్గరకు వెళ్లిన. పెద్ద బావ చేతబడి చేయించడంతోనే మన బర్రె చచ్చిపోయిందంట. మన ఇంటిని ఇంకా పీడ పట్టి పీడిస్తూనే ఉందంట’’ భర్తతో చెప్పింది నూకాలమ్మ. ‘‘దాని పాడితోనే ఇంటిని వెళ్లబార్చిన. అది పోయిన కాణ్నించి చేతిలో రూపాయాడడం లేదు...’’ స్వగతంగా అనుకుంటోంది. భర్తలో ఆమె కోరుకున్న ప్రతిస్పందన కనిపించకపోవడంతో గొంతు పెంచి... ‘‘వాళ్లకు తగ్గ శాస్తి జరగాలి, తిరుగు తిరుగుబడి చేయిద్దాం’’ అన్నది కసిగా. ‘‘మా అన్న అట్లా చేయడు. నువ్వూరుకో. ఈ మాట ఎక్కడా అనకు’’ అన్నాడామె భర్త మందలింపుగా. ‘‘అంతా నీకు మల్లేనే ఉంటారా? అన్న చేయకపోతే వదిన చేయదా? పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నా... మీ వదినకు నా మీద కొరకొరే ఆమె పుట్టింటికంటే కలిగిన ఇంటి నుంచి వచ్చాగా మరి’’ భర్తను కసురుకుంటూ తన వాదనను సమర్థించుకుంటోంది. ఇక భర్తతో కుదిరే పని కాదని రానున్న మంగళవారం స్వాములోరి దగ్గరకు వెళ్లి తిరుగుబడి చేయించాల్సిందేనని మనసులోనే తీర్మానించుకుంది నూకాలమ్మ. మంటల చీలికలు! దాదాపుగా అన్ని ఇళ్లలోనూ ఇలాంటి ఆవేశకావేషాలే. ఒకరి మీద మరొకరు చాడీలు చెప్పుకోవడంలోనే రోజు సరిపోతోంది. ఇలా ఉండగా ఓ రోజు... సుందరయ్య పెద్ద కొడుకు పక్క పొలం యజమాని కోటయ్య మీద దాడి చేసి గాయపరిచాడు. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఊరు ఒక్కసారిగా భగ్గుమన్నది. తిరుగు దాడి చేసి తీరుతామని కోటయ్య కొడుకు సవాల్ చేశాడు. ఊరు రెండుగా చీలిపోయింది. ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామం పోలీసు పహారాలోకి వెళ్లింది. సంకెళ్లతో, బూట్ల నాడాలతో అదుపు తెచ్చే సమస్య కాదని అర్థం కాగానే హేతువాద బృందం సహాయం కోరారు పోలీసులు. ఎత్తుకు పై ఎత్తు! నల్గొండ జిల్లా, నకిరేకల్ దగ్గర జరిగింది. మేము ఊళ్లో అడుగుపెట్టినప్పటి నుంచి మా కదలికలన్నీ మంత్రగాడికి చేరుతూనే ఉన్నాయి. ఊరి వారి ద్వారా మంత్రగాడు గ్రామస్తులను నమ్మించడానికి ఎలాంటి మాయలు చేశాడో తెలుసుకున్నాం. నిప్పుల మీద నడవడం వంటివన్నీ మేము కూడా చేసి చూపించాం. ప్రతి దానికీ శాస్త్రీయతను విడమరిచి చెప్పాం. సమావేశం మొదలుపెట్టినప్పుడు పది మంది కూడా లేరు. గ్రామస్తులంతా తలుపులేసుకుని కిటికీల నుంచి చూస్తూ ఉండిపోయారు. జనం మా ఎదురుగా ఉన్నట్లే ప్రసంగం మొదలుపెట్టాం. మా కార్యకర్తలందరి ప్రసంగాలు పూర్తయ్యేసరికి మూడు వందల మంది పోగయ్యారు. మోసపోయామని గ్రహించగానే ఆవేశంతో మంత్రగాడి ఇంటికి పరుగులు తీశారు. పోలీసుల జోక్యంతో దాడి ఆగింది. మంత్రగాడిని అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య మరణానికి నాలుగు రోజుల ముందు నుంచి నీళ్ల విరేచనాల వల్ల బిపి పడిపోవడమేనని అక్కడి ఆర్ఎంపి అన్నాడు. - టి. రమేశ్, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ పారని మంత్రం! ‘‘సుశీలా! మనూళ్లో అందరూ నిప్పుల మీద నడుస్తున్నారే! చూద్దాం రా’’ వగరుస్తూ వచ్చింది కళ్యాణి. మరో నలుగురు పిల్లలు పరుగు తీస్తూ వెళ్లి విచిత్రంగా చూశారు. ‘‘హత్తెరికి! మనూరి స్వాములోరు చేసేవి కూడా ఇవ్వేగా మరి’’ నోరెళ్లబెట్టాడు సతీశ్. ఇదంతా సైన్స్ తెలుసుకున్న వాళ్లు శాస్త్రీయ పరిజ్ఞానం లేని వారిని మోసం చేయడానికి చేస్తున్న మాయ అని పిల్లలకు త్వరగానే అర్థమైంది. అతీంద్రియ శక్తులేవీ ఉండవని, నిప్పుల మీద నడవవచ్చని తెలుసుకున్నారు. పిల్లలతో మొదలై ఒకరి తర్వాత మరొకరుగా దాదాపుగా నలభై మంది నిప్పుల మీద నడిచారు. ఊరంతా కలిసి కరడుకట్టిన మూఢత్వాన్ని కళ్లగంతలను విప్పినట్లు విప్పేశారు. - వాకా మంజులారెడ్డి (గమనిక: పేర్లు మార్చడమైంది) -
మంత్రాల నెపం మోపారని...
చేతబడి చేస్తున్నావంటూ గ్రామస్తులు చేసిన ఆరోపణలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కాలు విపరీతంగా వాచిపోయింది. ఎన్ని వైద్యాలు చేసినా అది నయం కావటం లేదు. ఇదే సమయంలో సదరు వ్యక్తికి అదే వీధికి చెందిన కరగాల రాజారావు(65) తరచూ కలలో కనిపిస్తున్నాడు. తన కాలి వాపునకు రాజారావు చేసిన చిల్లంగి(చేతబడి) కారణమని కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నాడు. ఇదే విషయమై కొందరు గ్రామస్తులతో కలిసి సోమవారం రాజారావును నిలదీశాడు. మనస్తాపం చెందిన రాజారావు మంగళవారం ఉదయం ఇంట్లోనే విషం తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
చేతబడి నెపంతో దారుణ హత్య
రాజమహేంద్రవరం: చేతబడులు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. తూర్పు గోదావరి జిల్లా వై.రాయవరం మండలం ఇర్లవాడ గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని కొందరు అనుమానించారు. ఈ విషయమై అతడితో గొడవపడి కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ముఖ్యమంత్రిని శపించిన మాంత్రికుడు!
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంటివద్ద శపించాడు. కాగా, శపించిన వ్యక్తి రాష్ట్రంలో చేతబడులు ఎక్కువగా చేసే కొల్లెగల ప్రాంతానికి చెందినవాడని సమాచారం. ఇంటి వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన వస్త్రాన్ని సీఎం సిద్దరామయ్య స్వీకరించకపోవడంతో కోపగించుకున్న అతను కారు డ్రైవర్ పక్కన కిటికీ నుంచి ముఖ్యమంత్రిని శపించారని తెలిసింది. ఈ ఘటనను సీఎం పట్టించుకోకుండా వదిలేశారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల అసలే సీఎం ప్రతిష్ట దిగాజారుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి సీఎంను శపించడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై మాట్లాడిన కార్యకర్తలు అసలే కొంతకాలంగా సీఎంను దురదృష్టం వెంటాడుతోందని, ఈ సమయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. అందుకే శాపాన్ని వెనక్కు తీసుకోవాలని అతన్ని కోరినట్లు వివరించారు. ఎలా జరిగింది..? మైసూరులోని ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉన్న బారికేడ్లలో నుంచి దూసుకుపోయి, సెక్యూరిటీ నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి అప్పుడే కారులోకి ఎక్కబోతున్న సీఎం సిద్ధరామయ్యను కలిసి పూజచేసిన వస్త్రాన్ని తీసుకోవాలని కోరాడు. అయితే, ఇలాంటి వాటిమీద పెద్దగా నమ్మకం లేని సీఎం అందుకు నిరాకరించడంతో.. అతడు తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, సాయం చేయాలని కోరాడు. దీనిపై స్పందించిన సీఎం ఇలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు, అబద్ధాలతో బతకాలని ప్రయత్నిస్తారని కార్యకర్తలతో అన్నారు. దాంతో కోపంతో రెచ్చిపోయిన అతను పోలీసుల నుంచి తప్పించుకుని కారు డ్రైవర్ కు పక్కగా వెళ్లి కిటికీలో నుంచి సీఎంను శపించాడు. కొల్లెగలకు మాంత్రికవిద్యలకు సంబంధం ఏంటి? కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో కొల్లెగల పట్టణం ఉంది. ఈ పట్టణానికి రాజకీయనేతలకు కొన్నేళ్లుగా ప్రత్యేక సంబంధం ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది ఈ ప్రాంతానికి మకాం మారుస్తారు. మాంత్రిక విద్యలను సాధన చేసే వారు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎలాగైనా ఓడించేందుకు వీరి సాయం తీసుకుంటుంటారు. కాగా, కర్ణాటక రాజకీయాల్లో మాత్రం ఈ ఊరి పేరు పెద్దగా వినిపించేది ఎవరైనా రాజకీయ నాయకుడు అనారోగ్యం పాలైనప్పుడే. జేడీ(ఎస్) నేతలు మంత్రగాళ్లతో తమవారిని శపింపజేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ ఆరోపించడం ఇందుకు నిదర్శనం. 2011లో అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తనకు మాంత్రిక శక్తుల వల్ల ప్రాణహాని ఉందని వ్యాఖ్యనించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. -
తల నరికి.. గాల్లోకి విసిరేసి..
కొబ్రా: చేతబడి చేస్తోందన్న అనుమానంతో సొంత అత్తను మేనల్లుడు చంపిన ఘటన చత్తీస్ ఘడ్ కొబ్రా జిల్లాలోని బెల్బహర్పురా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమ్మ, తమ్ముడు తరచూ జబ్బు పడటానికి తన అత్త భూదాన్ బాయ్ చేసిన చేతబడే కారణమని ఉదయ్ గోండ్(28) నమ్మాడు. దీంతో కోపావేశంతో రగిలిపోయిన గోండ్ గొడ్డలి తీసుకుని భూదాన్ బాయ్ ఇంటికి వెళ్లాడు. ఆమెను చితక్కొట్టిన గోండ్ అడ్డొచ్చిన ఆమె ఇద్దరి కూతుళ్లను కొట్టి పక్కకు తోసేశాడు. దీంతో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బాధితురాలు ఇంటి వెనుక ఉన్న కూరగాయల చేనులోకి వెళ్లింది. ఆమె వెనుకే వెంటాడిన గోండ్ గొడ్డలి ఆమె తలను నరికేశాడు. తర్వాత ఆ తలను చేతితో పట్టుకుని శవం నుంచి దూరంగా గాల్లోకి విసిరేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
క్రూరంగా రేప్ చేసి.. గుండెను బయటకు తీసి..
మినాయిస్ జెరాయిస్: పాఠశాలకు వెళ్లిన పదేళ్ల బాలికను పైశాచికంగా రేప్ చేసిన ఓ యువకుడు ఆమెను కిరాతకంగా చంపి గుండెను బయటకు తీసిన సంఘటనతో బ్రెజిల్ లోని మినాయిస్ జెరాయిస్ నగరం నిర్ఘాంతపోయింది. ముక్కుపచ్చలారని బాలికను క్రూరాతిక్రూరంగా చంపడంపై నిరసనల జ్వాలలు పెల్లుబికాయి. ఈ నెల జూన్ 1న పాఠశాలకు బయలుదేరిన రయానా అప్రెసిడా కెండిడా(10)ను జైరో లోప్స్(42) అనే వ్యక్తి రేప్ చేసి ఛాతిని చీల్చి ఆమె గుండెను బయటకు పీకి చంపాడు. ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత బాలిక శవం ఉందన్న సమాచారంతో బ్యూనోపాలిస్ ఫాం వద్దకు చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని, పక్కనే పడి ఉన్న ఆమె గుండెను గుర్తించారు. ఆ ప్రాంతంలోనే దాక్కున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకుని ఆగ్రహంతో రగిలిపోయిన స్థానికులు నిందితుడిని చంపుదామని భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు హెలికాప్టర్ ద్వారా అతన్ని స్టేషన్ కు తరలించాల్సివచ్చింది. నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని శరీరం మీద క్షుద్రశక్తులకు సంబంధించిన గుర్తులు ఉండటంతో చేతబడి కోసం ఆమెను చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా, బాలిక తల్లి అనారోగ్యంతో మరణించడంతో తండ్రి, నానమ్మల వద్దే పెరుగుతున్నట్లు చెప్పారు. పదహారేళ్ల అమ్మాయిపై 30 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణోదంతం మరవక ముందే బ్రెజిల్ మరో కిరాతకం చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రాలు చేస్తున్నాడని కొట్టి చంపారు..
మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టిచంపారు. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందాపురం నర్సయ్య(65) మంత్రాలు చేస్తున్నాడని, ఆయన కారణంగానే తమ కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురయ్యారని గ్రామానికే చెందిన మల్లయ్యకు అనుమానం. ఈ నేపథ్యంలోనే నర్సయ్యను మంగళవారం రాత్రి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆనంద్‌కుమార్ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేతబడి ప్రాక్టీస్ చేసిన హీరోయిన్!
చేతబడి, క్షుద్రవిద్యలాంటి మూఢనమ్మకాలను మారుమూల గ్రామాల్లో చదువుకోని ప్రజలే కాదు.. సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ సైతం నమ్ముతోందా? ఏకంగా ఇంట్లోనే చేతబడి లాంటి క్షుద్రవిద్యల్ని ఔపోసన పడుతోందా? అంటే తాజాగా అవునని అంటున్నాడు బాలీవుడ్ హీరో అధ్యాయన్ సుమన్. కంగన తన ఇంట్లోనే చేతబడిలాంటి క్షుద్రపూజలు చేసేదని అతను తాజాగా వెల్లడించాడు. క్షుద్రపూజల కోసం ఆమె తన అపార్ట్మెంట్లో ఓ గది కూడా ఉందని చెప్పాడు. కంగనా రనౌత్‌కు ఈ మధ్య కాలం కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే హీరో హృతిక్ రోషన్‌తో ఆమె గొడవ రోజూ మీడియాలో రచ్చ చేస్తుండగా తాజాగా ఆ మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ సంచలన విషయాలు వెల్లడించాడు. 2008లో 'రాజ్: ద మిస్టరీ కంటిన్యూస్' సినిమా సందర్భంగా సుమన్, కంగన ఏడాది పాటు డేటింగ్ చేశారు. కంగన మాజీ లవర్ ఆదిత్య పంచోలీ సూచనలు పెడచెవిన పెట్టి తాను కంగనాను ప్రేమించానని, కానీ ఒక రోజు తను ఇంటికి పిలిచి క్షుద్రపూజల్లో పాల్గొనేలా చేసిందని వివరించాడు. 'ఓరోజు రాత్రి కొన్ని పూజలు చేసేందుకు కంగన తన ఇంటికి పిలిచింది. రాత్రి 11.30 గంటలకు నేను వెళ్లాను. అర్ధరాత్రి 12 గంటలకు పూజ ప్రారంభమైంది. తన అపార్ట్మెంట్లో ఆమెకు ఒక చిన్న గెస్ట్ రూమ్ ఉంది. ఆ గది పూర్తిగా నల్లరంగుతో ఉంటుంది. కర్టెన్లు కూడా నల్లరంగులోనే ఉంటాయి. అక్కడ కొన్ని దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి. వాటిచుట్టూ మంటలు ఎగుస్తున్నాయి. పూజలో కొన్ని భయంకరమైనవి చేసింది. నేను చాలా భయపడిపోయాను. నేనేమీ చేయలేకపోయాను. వెంటనే బయటకు వచ్చి చేసిన పూజ చాలు అని చెప్పాను. దాంతో తను పల్లవితో మాట్లాడటం ప్రారంభించింది. పల్లవి ఓ రోజు రాత్రి 12 గంటలకు శ్మశానానికి వెళ్లాల్సిందిగా నన్ను కోరింది. నేను వణికిపోయాను. ఇక ఎప్పుడు అక్కడికి వెళ్లలేదు' అని సుమన్ వివరించాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిసి ఎంతో ఆందోళన చెందారని, కుటుంబ పూజారిని పిలిచి, ఆయనకు ఈ విషయం చెప్పారని సుమన్ చెప్పుకొచ్చాడు. 'నీ కోసం ఆమె అన్నం వండుతుందా? అని పూజారి అడిగాడు. అవును అని చెప్పాను. ఆ అన్నంలో ఆమె తన మలినమైన రక్తం కలిపి క్షుద్రపూజల కోసం వండేదని పూజారి చెప్పాడు. లండన్, న్యూయార్క్లాంటి దేశాల్లో చదివి, మెట్రోపాలిటన్ కిడ్ అయిన తాను ఇవన్ని విశ్వసించలేదు. కానీ రాశిఫలాలు చూసే ఓ మహిళ నీపై చేతబడి జరిగిందని, పహడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ చేతబడి చేస్తున్నదని తెలిపింది. వెంటనే ఆ అనుబంధం నుంచి బయటపడాలని సూచించింది. అప్పట్లో నాకు తెలిసి హిమాచల్ ప్రదేశ్‌కు తరచూ వెళ్లే వ్యక్తి నా గర్ల్‌ఫ్రెండ్ కంగనానే. అప్పటినుంచి తనతో అనుబంధం నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించాను. ఆ క్రమంలో ఎంతో మానసిక, శరీరక క్షోభ అనుభవించాను' అంటూ సమన్ డీఎన్ఏ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 'రాజ్ 2' సినిమా తర్వాత తన కెరీర్ పూర్తిగా పతనమవ్వగా, అదే సమయంలో కంగన సినిమాలు మాత్రం విజయవంతమయ్యాయని, వాటి గురించి మాట్లాడలంటేనే తనకు భయం అవుతున్నదని అతను చెప్పుకొచ్చాడు. -
దిగంబర పూజలు చేస్తున్నాడు: భార్య ఫిర్యాదు
బయటపెట్టిన రెండో భార్య టీ.నగర్: వైద్య కళాశాల ప్రిన్సిపల్ కావాలని కోరుతూ ఇంటిలో నగ్న పూజలు నిర్వహించిన ప్రొఫెసర్ వింత వైఖరి వెలుగులోకి వచ్చింది. ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు దీపక్. ఈయన మొదటి భార్య మృతి చెందడంతో సేలం జిల్లా ఆడయాంపట్టికి చెందిన మరొక యువతిని రెండో వివాహం చేసుకున్నారు. ఈమె కూడా ఇది వరకే వివాహమై భర్తను కోల్పోయింది. ఈ క్రమంలో నగ్న పూజలో పాల్గొనాలనిభర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఆరోపిస్తూ ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తమ వివాహానంతరం తరచూ పూజలు చేయాలని భర్త బయటికి వెళ్లి వస్తుండేవాడని ఆరంభంలో దీనిని తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. కాలక్రమంలో ఇంటిలోనే నగ్నంగా కూర్చొని పూజలు ప్రారంభించారన్నారు. తాను ఇటువంటి పూజలు చేయడం సరికాదని అనేక సార్లు తెలిపినప్పటికీ అతను పట్టించుకోవడం లేదని తనను దిగంబర పూజల్లో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది. దీంతో తమ మధ్య తరచుగా తగాదాలు జరిగేవన్నారు. దాంతో తాను తరచూ పుట్టింటికి వచ్చేదాన్నని, ఈ క్రమంలో తనకు విడాకుల నోటీసు పంపారన్నారు. దిగ్భ్రాంతి చెందిన తాను కుటుంబసభ్యులతో ధర్మపురికి వెళ్లానని ఆ సమయంలో కూడా అతను నగ్న పూజల్లో పాల్గొనడం ఆందోళన కలిగించిందన్నారు. అదే సమయంలో దీని గురించి నిలదీయగా తనపై దాడి చేశాడని దీంతో చికిత్సలు పొందుతున్నట్లు తెలిపారు. తన భర్త దిగంబర పూజ చేస్తున్న సమయంలో తీసిన ఫొటోలను ఆమె విడుదల చేసింది. -
చేతబడి నెపంతో వ్యక్తి హత్య
మేడిపెల్లి (కరీంనగర్) : మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నర్సయ్య(65) చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చేతబడి నెపంతో దంపతులను కాల్చేశారు
విజయనగరం: చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో దంపతులను హతమార్చి, దహనం చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. మక్కువ మండలం ఎస్.పెద్దవలస పంచాయతీ కొత్తకాముడవలస గ్రామానికి చెందిన గిరిజన దంపతులు గొల్లూరి పండు, సీతమ్మ దంపతులు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులకు అనుమానం ఉండేది. ఈ నెల 8వ తేదీన అదే గ్రామానికి చెందిన జన్నిశ్రీను అనే వ్యక్తి కాలికి గాయం కావడంతో మరణించాడు. అయితే శ్రీను మరణానికి కారణం పండు, సీతమ్మలేనని శ్రీను కుటుంబ సభ్యులు అనుమానంతో ఈ నెల 9, 12 వ తేదీలలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ శ్రీను బంధువులు పెట్టారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోమారు పంచాయితీ పెడదామని పెద్దలు అక్కడినుంచి వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామానికి చెందిన పాలిక వెంకటి, పాలిక చంద్రరావు, జన్నిధర్మ, పాలిక తిరుపతి, పాలిక జోగులు, జన్ని సన్యాసిరావు, ఒడిశాకు చెందిన జన్ని గంగరాజు, జన్నిగోవిందలు బలవంతంగా పండు, సీతమ్మలను గ్రామం సమీపంలో ఉన్న పంటపొలంలోకి తీసుకెళ్లి కర్రలతో ఇష్టానురాజ్యంగా కొట్టడంతో వారిద్దరూ మృతి చెందారని కుమార్తె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం మృతదేహాలను చిట్టిగెడ్డపక్కన మంగళవారం రాత్రి సుమారు 11గంటల సమయంలో దహనంచేసి చితిబుగ్గిని నదిలో కలిపేశారు. ఆ సమయంలో పండు కుటంబసభ్యులు ఉన్నప్పటికీ అడ్డుకోలేకపోయారు. జరిగిన విషయాన్ని బయటకు చెప్పితే కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సిద్ధార్థ కౌశిల్ తదితరులు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని హత్య, దహనపర్చిన స్థలాల్ని పరిశీలించి స్థానికులనుంచి సమాచారం తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
చేతబడినెపంతో వ్యక్తి హత్య
-
చేతబడినెపంతో వ్యక్తి హత్య
గురజాల మండలం గోగులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి, చేతబడి చేస్తున్నాడనే కారణంతో గ్రామస్తులు దాడి చేసి చంపారు. హత్యకు గురైన వ్యక్తి ముత్తన గురువారెడ్డి(55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చేతబడి నెపంతో పెద్దమ్మనే చంపేశాడు
భూపాలపల్లి: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తోందనే కారణంతో ఓ వృద్ధురాలిని ఆమె వరుసకు కుమారుడు అయ్యే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన చందుపట్ల పద్మ(69) చేతబడి చేస్తున్న కారణంగానే తన కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవుతున్నారని ఆమె మరిది కుమారుడు చందుపట్ల శ్రావణ్‌రెడ్డి భావించేవాడు. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే, గత నెల 25వ తేదీన పద్మ తన పత్తిచేనులో ఉండగా శ్రావణ్‌రెడ్డి ఆమెను బండరాయితో మోది చంపేశాడు. శవాన్ని గోనెసంచిలో ఉంచి రాయిని కట్టి గ్రామ సమీపంలోని చెరువులో పడేశాడు. రక్తంతో తడిసిన తన దుస్తులను గ్రామ సమీపంలో దాచి పెట్టాడు. గురువారం సాయంత్రం శ్రావణ్‌రెడ్డి దుస్తులను గమనించిన గ్రామస్తులు అతడిని నిలదీశారు. దీంతో అతను భూపాలపల్లి పోలీసులకు లొంగిపోయాడు. అతడు చెప్పిన ఆనవాళ్ల మేరకు శుక్రవారం ఉదయం చెరువులో గాలించగా పద్మ శవం లభ్యమైంది. మృతురాలి కుమారుడు శ్రీరాంరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గంగానమ్మకు గిరిజన మహిళ బలి
-
చేతబడి నెపంతో వ్యక్తి దారుణహత్య
డుంబ్రిగూడ (విశాఖపట్నం జిల్లా) : డుంబ్రిగూడ మండలం గుంటిసీమ పంచాయతీ సోబూరు గ్రామంలో సాగి కొండ(50) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. చేతబడి నెపంతో గ్రామస్తులు కొట్టి చంపి బూడిద చేశారు. ఈ దారుణం గత నెల 14 న జరిగినా ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించటంతో భార్యా,పిల్లలు భయపడి చెప్పలేదు. మంగళవారం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గంగానమ్మకు గిరిజన మహిళ బలి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన వై రామవరం మండలం చింతకర్ర పాలెంలో ఓ గిరిజన మహిళను స్థానికులు బలిచ్చారు. ఆమె వల్లే తమ గ్రామానికి అరిష్టం చుట్టుకుందనే మూఢనమ్మకంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, గత కొద్ది రోజులుగా ఓ పదిమంది వ్యక్తులు ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని వారే లేని పోని నమ్మకాలు అమాయక గిరిజనులకు కల్పించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లగా చింతకర్ర గ్రామంలో గంగానమ్మ దేవత ఆలయం ఉంది. దానికి ఎదురుగానే కేర చినలక్ష్మీ అనే గిరిజన మహిళ ఇళ్లు ఉంది. ఆమె ఆ గ్రామంలో కూలీ చేసుకొని బతుకుతుంటుంది. అయితే, ఇటీవలె ఆ గ్రామంలో ఓ సోది చెప్పే మహిళ గ్రామానికి అరిష్టం చుట్టుకుందని, అందువల్లే వర్షాలు రావడం లేదని, పంటలు పండలేదని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారితో కూడి స్థానికులు ఆమెను గంగానమ్మ దేవతకు బలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ఆమెను బలిచ్చే సమయంలో చిత్ర హింసలకు గురిచేసేముందు ఎన్ని అరుపులు అరిచినా కనీసం ఒక్కరు కూడా సహాయం చేసేందుకు రాలేదు అని తెలుస్తోంది. ఆమె శరీరంపై కర్పూరం పెట్టి గాయపరిచారని, అనంతరం తలపై చెంబుతో బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు. -
చేతబడి చేస్తోందని కాల్చేశారు
-
చేతబడి చేస్తోందని కాల్చేశారు
చేతబడి అనుమానంతో ఒక మహిళను గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. ఈ ఘనట విశాఖపట్టణం జిల్లా డుమ్రిగూడ మండలం రాంసింగ్ గూడలో జరిగింది. మానవుడు అభివృద్ధి వైపు దూసుకుపోతున్నా.. మూడనమ్మకాలు ప్రజలను మూర్ఖులుగా మారుస్తుందని ఈ ఘటన నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. గూడేనికి చెందిన రాజమ్మ (45) అనే మహిళ చేతబడి చేస్తోందన్న అనుమానంతో ఆమెను శనివారం సాయంత్రం ఇంట్లో సజీవ దహనం చేశారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పు పెట్టడంతో ఆమె మంటల్లో పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పీఛేముడ్ జైలుకెళ్లిన మంత్రగత్తె..
ఒకప్పుడు బ్రిటిష్ చట్టాలు చేతబడి వంటి విద్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణించేవి. ‘హెల్లిష్ నెల్’గా పేరుమోసిన మంత్రగత్తెకు 1944లో బ్రిటిష్ ప్రభుత్వం చేతబడుల చట్టం (విచ్‌క్రాఫ్ట్ యాక్ట్) కింద జైలుశిక్ష విధించింది. చేతబడి నేరానికి జైలుశిక్ష అనుభవించిన చిట్టచివరి మంత్రగత్తెగా ఈమె చరిత్రలో నిలిచిపోయింది. ‘హెల్లిష్ నెల్’ అసలు పేరు హెలెన్ మెక్‌ఫార్లేన్. మంత్రతంత్రాల సాధనలో మునిగితేలే ఈమెను పదహారో ఏటనే తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తర్వాత ఆమె హ్యారీ డన్కన్ అనే మంత్రగాడిని పెళ్లాడింది. ఇద్దరూ కలసి ఆత్మలతో సంభాషణ పేరిట జనాన్ని యథాశక్తి బురిడీ కొట్టిస్తూ బాగా సొమ్ము చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పాశ్చాత్య దేశాలలో ఇలాంటి విద్యలకు గిరాకీ మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం నాటికి అక్కడి జనాల్లో ఈ పిచ్చి పీక్కు చేరుకుంది. అలాంటి రోజుల్లో ‘హెల్లిష్ నెల్’ ప్రదర్శనలకు జనం తండోప తండాలుగా వచ్చేవారు. ప్రదర్శనలకు వచ్చే వారి నుంచి ఆమె భారీగా ప్రవేశ రుసుము వసూలు చేసేది. ఆమె ప్రదర్శించేదంతా బురిడీ విద్య మాత్రమేనంటూ 1931లోనే హ్యారీ ప్రైస్ అనే మానసిక శాస్త్రవేత్త బయటపెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ఆమె వ్యవహారం ప్రభుత్వానికే ఎసరుపెట్టే స్థాయికి చేరుకోవడంతో, చట్టాన్ని ప్రయోగించింది. ఇంతకీ ఏమైందంటే, 1941లో బ్రిటిష్ యుద్ధ నౌక ‘బర్హామ్’ జర్మనీ సమీపంలో తుపాను ధాటికి సముద్రంలో మునిగిపోయింది. అందులోని 800 మందీ మరణించారు. ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందుతాయని భావించి ప్రభుత్వం ఈ సంగతిని దాచిపెట్టింది. ఆ సంఘటన తర్వాత కొన్నాళ్లకు తన వద్దకు వచ్చిన ఒక మహిళతో ‘బర్హామ్’ నౌకలోని ఆమె కొడుకు మరణించాడని, ఆ నౌక మునిగిపోయిందని ‘హెల్లిష్ నెల్’ చెప్పింది. ఈ సంగతి కలకలం రేపడంతో పోలీసులు ఆమె ప్రదర్శనపై దాడిచేసి, అరెస్టు చేశారు. పాతబడ్డ ‘విచ్‌క్రాఫ్ట్’ చట్టం కింద ఆమెకు శిక్ష విధించారు. ఆ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన విన్స్టన్ చర్చిల్, ఆమెకు కాలంచెల్లిన చేతబడుల చట్టం కింద శిక్ష విధించడాన్ని ఖండించడమే కాకుండా, ఆ చట్టాన్ని రద్దు చేశాడు. -
కృష్ణాజిల్లాలో క్షుద్రపూజల కలకలం
తిరువూరు : కృష్ణాజిల్లా తిరువూరు మండలం వామకుంట్లలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన నగేశ్, వెంకట్రావమ్మ, రవిలు ఊరి పొలిమేరలో చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మరో 40మంది చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తున్నారని వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తరలిస్తున్న పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు పలు దఫాలుగా గ్రామ పెద్దలతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఆందోళన కొనసాగించారు. గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
చేతబడి చేశారన్న నెపంతో కుటుంబం వెలి
-
వరంగల్‌లో ఇద్దరి మహిళల భలికి యత్నం!
-
మంత్రాల నెపంతో దాడి
నవీపేట(నిజమాబాద్): నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో బంధువులే దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం...గ్రామానికి రఘుపతి భూమయ్య గ్రామ శివారులోని క్రషర్లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. అయితే సొంత చిన్నాన్న గంగారాంకు రఘుపతి మంత్రాలు చేస్తున్నాడని అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో భూమయ్య తనతోపాటు క్రషర్లో పని చేసే ఉద్యోగికి భోజనం తీసుకెళ్తుండగా గంగారాం అడ్డుకున్నాడు. తమ ఇంటి వెనుక పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేశావని, మంత్రాలు చేయడం వల్లే తమ ఇంట్లో పదేళ్ల పాప అనారోగ్యానికి గురైందని ఆరోపిస్తూ గొడవకు దిగాడు. అతనికి కుటుంబసభ్యులు తోడయ్యారు. అంతా కలసి రఘుపతిని ఇంట్లోకి ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేయడంతో భూమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం!
మెదక్:ఆధునిక సమాజంలో కూడా మూడ నమ్మకాల పరంపర కొనసాగుతుందనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. గుప్త నిధుల కోసం ఓ యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నించిన ఘటన జిల్లాలోని నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోవెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుప్త నిధుల పేరిట నాగరాజు అనే యువకుడ్ని కొంతమంది అపహరించుకుని పోయి బలి ఇవ్వడానికి యత్నించారు. అయితే ఆ యువకుడు దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
కాంగ్రెస్‌పై తాంత్రిక పూజలా?!
బెంగళూరు: దాదాపు మూడు దశాబ్దాలపాటు జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ప్రధాన కార్యాలయంగా కొనసాగిన నగరంలోని రేస్‌కోర్స్ రోడ్డులోని భవనంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం అడుగుపెట్టి భయభ్రాంతులకు గురయ్యార ట. భవనం ప్రాంగణంలో రక్తం లాంటి రంగు, నిమ్మకాయలు, ఎండు మిరపకాయల, ఇతర వస్తువులను చూసి వారు హడలిపోయారట. జేడీ (ఎస్) పార్టీ కార్యకర్తలు భవనాన్ని ఖాళీచేసి పోతూ...భూత ప్రేత పిశాచాలకు తాంత్రిక పూజలు చేశారన్నది వారి భయం. అంతకుముందు ఆదివారం నాడే జేడీ (ఎస్) ఈ భవనాన్ని ఖాళీ చేసింది. తమ పార్టీని చీకటి శక్తులు పీడించి పాడు చేయాలనే వారు అలా చేసి ఉంటారని భావిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ‘శుద్ధి’ కార్యక్రమం కోసం పేరున్న పండితుల కోసం తిరుగుతున్నారు. అయితే తాంత్రిక పూజా వార్తలను జేడీ (ఎస్) హెచ్డీ దేవెగౌడ ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ భవనాన్ని జేడీ (ఎస్) నుంచి స్వాధీనం చేసుకోవడానికి కాంగ్రెస్ సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన విషయం తెల్సిందే. ఈ భవనం కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2014, జనవరి నెలలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఏడాదిలోగా భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకే గత ఆదివారం నాడు జేడీ (ఎస్) ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. కర్ణాటక రాజకీయాల్లో లక్కీ నెంబర్లు, వాస్తు అంశాలతోపాటు భూత ప్రేత పిశాచాలను పిలిచి శత్రువులపై ప్రయోగించడానికి తాంత్రిక పూజలు చేయడం కూడా కొత్తేమి కాదు. కర్ణాటక రాజకీయ నాయకులు, సీఎం పదవులు చేపట్టిన వారు చీకటి శక్తులను వశం చేసుకోవడానికి తాంత్రిక పూజలు చేసేవారని రాజకీయ చరిత్రకారుడు ఏ వీరప్ప తెలియజేశారు. యెడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తన ప్రాణాలకు ముప్పుందని, తన చావుకోరుతూ జేడీఎస్ క్షుద్ర పూజలు చేసిందని ఆరోపించారు కూడా. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజున కూడా దుష్ట శక్తులను దూరం తరిమేందుకు ‘నర్సింహ కవచ, గార్దబ ప్రయోగ, మనుష్యుక్త పారాయణ’ తదితర పూజాది కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారని ప్రచారంలో ఉంది. హెచ్డీ దేవెగౌడ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి రేవన్న తన రాజకీయ జీవితంలో గాడిదలు బలి ఇస్తూ తాంత్రిక పూజలు ఎక్కువ చేసేవారన్నది ప్రచారంలో ఉంది. ఆయన అలాంటి పూజలు చేస్తూ మీడియా కెమేరాలకు కూడా చిక్కారు. -
మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
కడెం: అదిలాబాద్ జిల్లాలో శనివారం ఓ వ్యక్తి మంత్రాల నెపంతో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ కట్టకింది గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. మచ్చినేని చిన్నులు(60) అనే వృద్ధుడు చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో అతని సమీప బంధువులే కొట్టి చంపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
'నన్ను నరబలి ఇవ్వడానికి యత్నించారు'
సికింద్రాబాద్: నగరంలో శనివారం కిడ్నాప్ కు గురైన యువకుడు వారి చెరనుంచి తప్పించుకుని విస్తుగొలిపే విషయాలను వెల్లడించాడు. సికింద్రబాద్ వారసిగూడలో ఓ యువకుడు కిడ్నాప్ గురైన సంగతి తెలిసిందే. ఆ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను కొంతమంది కిడ్నాప్ చేసి నరబలి ఇవ్వడానికి యత్నించారని పేర్కొన్నాడు. అందులో భాగంగానే తనపై కిడ్నాపర్లు కుంకుమ, పసుపు చల్లి నరబలికి యత్నించారన్నాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు
భూతగాదాల నేపథ్యంలో మంత్రాల నెపం చూపి అన్నను చంపాడో తమ్ముడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం కమ్మరిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ధర్మయ్యను చంపేసిన తమ్ముడు వెంకటయ్య.. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మంత్రాలు వేస్తున్నందువల్లే అతడిని చంపినట్లు చెప్పాడు. గత కొంత కాలంగా పాముకాటు, తేలుకాటుకు ధర్మయ్య మంత్రాలు వేసేవాడు. ఇప్పుడు మనుషులపై కూడా మంత్రాలు ప్రయోగిస్తున్నాడని వెంకటయ్య ఆరోపించాడు. కానీ, తమకున్న వ్యవసాయ భూమిని దక్కించుకోడానికే ఇలా మంత్రాల నెపం పెట్టుకుని ధర్మయ్యను పొట్టన పెట్టుకున్నట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్షుద్రపూజలు చేస్తున్నారన్న నెపంతో ముగ్గురిపై దాడి
-
ఢిల్లీలో మంత్రగాళ్లు ఉన్నారు జాగ్రత్త !
-
చేతబడులు, మూఢనమ్మకాలపై మహారాష్ట్ర నిషేధం
చేతబడులు, ఇతర మూఢనమ్మకాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్సు చేసింది. ఈ ఆర్డినెన్సుపై గవర్నర్ కె.శంకర నారాయణన్ శనివారం సాయంత్రం సంతకం చేశారు. దీంతో ఇది వెంటనే అమలులోకి వచ్చినట్లయింది. ఇకపై చేతబడులు చేయడం లాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తారు. దేశంలోనే ఇలాంటి ఆర్డినెన్సు తెచ్చిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. త్వరలోనే దీనికి చట్టరూపం కూడా తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని ప్రకారం మూఢనమ్మకాలతో చేతబడి, బాణామతి లాంటివి చేస్తే వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. ప్రముఖ హేతువాది, ఉద్యకర్త నరేంద్ర దభోల్కర్ ఈ తరహా చట్టం కోసం జీవితాంతం పోరాడారు. గత వారం ఆయనను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో మహారాష్ట్ర సర్కారు నష్టనివారణ చర్యగా ఈ చట్టం చేసినట్లు చెబుతున్నారు. బుధవారం నాడు రాష్ట్ర మంత్రి వర్గం ఈ ఆర్డినెన్సును రూపొందించి పంపగా, శనివారం సాయంత్రం గవర్నర్ దానిపై సంతకం చేశారు.