పరి చిత్రంలో భయపెట్టే ఓ సన్నివేశంలో అనుష్క శర్మ
సాక్షి, న్యూఢిల్లీ : తొలిసారిగా ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చిన బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మ చిత్రానికి బ్రేక్ పడింది. ఆమె సినిమాను తమ దేశంలో విడుదల కానివ్వబోమంటూ పాకిస్థాన్ సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఈ చిత్రం తమ ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ఉందని, అనుష్క శర్మ చిత్రంలో చేతబడి, మంత్రశక్తులు వంటివాటిని ప్రమోట్ చేసేదిగా ఉందంటూ పాక్‌లో ఆమె సినిమాపై నిషేధం విధించారు.
'పరి కథ, మాటలు, కథా వరుస మొత్తం కూడా ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ చిత్రం కాన్సెప్ట్ మాకు సరిపడదు. ఈ సినిమా చూసేవారంతా కూడా బ్లాక్ మ్యాజిక్‌కు దగ్గరయ్యే ప్రమాదం ఉంది. మా మతానికి విరుద్ధంగా సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రమోట్ చేసేలా పరి చిత్రం ఉంది. అందుకే ఈ సినిమాను మా దేశంలో విడుదల కానివ్వబోము' అని పాక్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్ తెలియజేసింది. ఇదే విషయాన్ని పాక్ చిత్రాల డిస్టిబ్యూటర్ల సంఘం కూడా సమర్థించింది. ఆ సంఘ చైర్మన్ చౌదరీ ఎజాజ్ కమ్రాన్ మాట్లాడుతూ 'ఇస్లామిక్ చరిత్ర, సంస్కృతికి విరుద్ధంగా ఉన్నా ఏ చిత్రాన్నయినా పాక్‌లో బ్యాన్ చేయాల్సిందే' అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment