
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ అనుమానపు నీడలు అలుముకుంటూనే ఉన్నాయి. రియాపై రోజుకొక అభియోగం మోపుతున్నారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రియా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా వేరే మందులను సుశాంత్‌కు ఇచ్చిందని అతడి ఫిజికల్ ట్రైనర్ కూడా తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా సుశాంత్ చావుకు రియానే కారణమంటూ పలువురు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. సుశాంత్ కుటుంబం కూడా రియాపై అనేక ఆరోపణలు చేస్తోంది.
తాజాగా సుశాంత్ సోదరి మితు సింగ్ సుశాంత్ ప్లాట్‌లో క్షుద్ర పూజలు జరిగాయని, ఒక తాంత్రికుడిని పిలిపించి రియా ఇదంతా చేసిందని ఆరోపించారు. అదేవిధంగా సుశాంత్ స్నేహితుడు నీలోత్పల్ కూడా క్షుద్రపూజల విషయంలో విచారణ జరిపించాలని కోరారు. సుశాంత్ మరణంపై దర్యాప్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీకి మితు సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment