తల నరికి.. గాల్లోకి విసిరేసి.. | Man Beheads Aunt On Suspicion Of Black Magic | Sakshi
Sakshi News home page

తల నరికి.. గాల్లోకి విసిరేసి..

Published Tue, Jun 14 2016 6:08 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

Man Beheads Aunt On Suspicion Of Black Magic

కొబ్రా: చేతబడి చేస్తోందన్న అనుమానంతో సొంత అత్తను మేనల్లుడు చంపిన ఘటన చత్తీస్ ఘడ్ కొబ్రా జిల్లాలోని బెల్బహర్పురా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమ్మ, తమ్ముడు తరచూ జబ్బు పడటానికి తన అత్త భూదాన్ బాయ్ చేసిన చేతబడే కారణమని ఉదయ్ గోండ్(28) నమ్మాడు.

దీంతో కోపావేశంతో రగిలిపోయిన గోండ్ గొడ్డలి తీసుకుని భూదాన్ బాయ్ ఇంటికి వెళ్లాడు. ఆమెను చితక్కొట్టిన గోండ్ అడ్డొచ్చిన ఆమె ఇద్దరి కూతుళ్లను కొట్టి పక్కకు తోసేశాడు. దీంతో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బాధితురాలు ఇంటి వెనుక ఉన్న కూరగాయల చేనులోకి వెళ్లింది. ఆమె వెనుకే వెంటాడిన గోండ్ గొడ్డలి ఆమె తలను నరికేశాడు. తర్వాత ఆ తలను చేతితో పట్టుకుని శవం నుంచి దూరంగా గాల్లోకి విసిరేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement