behead
-
10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. మరణ దండనలో రాజీపడని సౌదీ..
రియాధ్: మరణదండన విషయంలో సౌదీ అరేబియా రాజీపటడం లేదు. 10 రోజుల్లోనే 12 మంది దోషుల తలలు నరికి మరణశిక్ష అమలు చేసింది. వీరంతా డ్రగ్స్ కేసులలో నేరం రుజువైన వారు. ఇలాంటి శిక్షలు తగ్గిస్తామని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అది కన్పిచండం లేదు. ఈ 12 మందితో కలిపి ఈ ఏడాది మొత్తం 132 మంది దోషులకు శిరచ్ఛేదము చేసింది సౌదీ ప్రభుత్వం. 2020, 2021లో రెండేళ్లలో అమలైన మొత్తం మరణశిక్షలకంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడు మరణశిక్ష విధించిన 12 మందిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్‌కు చెందినవారు, ముగ్గురు సౌదీ పౌరులు ఉన్నారు. మరణశిక్షలను తగ్గించే విషయంపై ఆలోచిస్తున్నామని, ఈ శిక్షలను వీలైనంత తక్కువగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని 2018లోనే సౌదీ యువరాజు తెలిపారు. జమల్ కషోగ్గి హత్య తర్వాత.. మరణ శిక్షను సవరించేలాా చట్టంలో మార్పులు చేయాలని 2020లో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అహింసా నేరాల్లో మృదువుగా వ్యవహరించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. కానీ ఇవేమీ ఆచరణకు నోచుకోవడం లేదు. చదవండి: రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. -
అసోంలో అమానుష ఘటన!
దిస్పూర్: అసోంలోని ఒక గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సమాజం ఎంతో ముందుకు వెళ్తూ విజ్ఞానం పెరిగినప్పటికీ ఇంకా మూడ నమ్మకాల భ్రమలో నుంచి చాలా మంది బయటపడలేక పోతున్నారు. మంత్రగత్తె అన్న అనుమానంతో ఒక వృద్ధ మహిళను గ్రామస్తులు తల నరికి చంపారు. ఈ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన 28 ఏళ్ల టీచర్‌ను కూడా గ్రామస్తులు విచక్షణారహితంగా తల నరికి ప్రాణం తీసేశారు. డోక్మోకా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాంగ్హిన్ రహీమాపూర్లో ఈ సంఘటన జరిగింది. గ్రామంలో రామావతి హలువా అనే మహిళ క్షుద్రపూజలు చేస్తుందనే నెపంతో గ్రామస్తులు ఆమెపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనను అడ్డుకోవడానికి అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలు బిజోయ్ గౌర్ ప్రయత్నించి, మూఢనమ్మకాల కారణంగా ఇలాంటి పనులు చేయవద్దు అని నిలువరించే ప్రయత్నం చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న గ్రామస్తులు ఆమెపై దాడి చేసి తల నరికేశారు. తరువాత వారి మృతదేహాలను కొండ ప్రాంతాలకు తీసుకువెళ్లి దహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని జిల్లా ఎస్పీ తెలిపారు. వారందరూ ఆర్ధికంగా వెనుకబడిన వారని, వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. చదవండి: జాతిపితపై గుడ్లు, రాళ్లు రువ్విన వేళ -
సంచలన కేసులో కొత్త కోణం!
జాడోలి కా బాస్(రాజస్థాన్): దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉమర్ మహ్మద్ హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవులను అక్రమ రవాణా చేస్తున్నాడనే ఆరోపణలతో భరత్పూర్ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన 35 ఏళ్ల ఉమర్‌ను నవంబర్ 10న దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. అతడి మృతదేహాన్ని రామ్‌గఢ్, జాడోలి కా బాస్ మార్గంలో రైలు పట్టాలపై పడేశారు. రైల్వే ట్రాక్‌పై పడేయటానికి ముందు అతడి తల నరికేశారని వెల్లడైంది. అయితే రైలు అతడి పైనుంచి వెళ్లడంతో మొండం నుంచి తల వేరైందని అంతకుముందు భావించారు. ముందు శిరచ్ఛేదం చేసి తర్వాతే రైల్వే ట్రాక్‌పై పడేశారని మృతదేహాన్ని ముందుగా గుర్తించిన రైల్వే కీమన్ సోను కుమార్ తెలిపినట్టు ‘న్యూస్ 18’ వెల్లడించింది. ‘మృతదేహం రెండు పట్టాల మధ్య ఉంది. తల మాత్రం బయటుంది. కాళ్లు, చేతులపై గాయాలున్నాయి. ఎవరో తెచ్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారని కచ్చితంగా చెప్పగలను. రెండు పట్టాల మధ్య పడేసిన బాడీపైనుంచి రైలు వెళ్లితే తల ఎలా వేరవుతుంది? మృతదేహాన్ని పట్టాల మధ్య నిలువుగా పడేశారు, అడ్డంగా కాదు. కాబట్టి కచ్చితంగా శిరచ్ఛేదం చేసిన తర్వాతే ఇక్కడ పడేశార’ని కుమార్ పేర్కొన్నాడు. మధుర చెందిన ఆయన 1489/3-4 రైల్వే ట్రాక్ వద్ద కీమన్గా విధులు నిర్వహిస్తున్నారు. మరో రైల్వే కార్మికుడు జగదీశ్ ప్రసాద్ కూడా కుమార్ వాదనతో ఏకీభవించాడు. మృతదేహం పడివున్న విధానాన్ని బట్టి చూస్తే తలనరికేసి ఇక్కడకు తీసుకొచ్చినట్టు కనబడుతోందని అభిప్రాయపడ్డారు. బాడీని రైలు పట్టాలపై అడ్డంగా పడుకోబెడితేనే తల తెగే అవకాశముందన్నారు. ఒకవేళ మృతదేహం పైనుంచి రైలు వెళితే శరీర భాగాలు అక్కడక్కడా పడే అవకాశముందని పదేళ్లు గేట్మాన్గా పనిచేసి ఏడాదిగా కీమన్గా పనిచేస్తున్న జగదీశ్ వివరించారు. మృతుడి ఛాతిపై ఎటువంటి బుల్లెట్ గాయాలు తాను గుర్తించలేదని కుమార్ తెలిపారు. ఉదర భాగంలో రంధ్రం గుర్తించానని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఈ అనుమానాలు నివృత్తి అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు రామ్‌వీర్ గుజ్జర్, భగవాన్ సింగ్‌లను అళ్వార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 201, 302 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు నేరాన్ని అంగీకరించారని అళ్వార్ ఏఎస్పీ తెలిపారు. ఉమర్ దేహాన్ని హంతకులు ఖండించినట్టు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే రైల్వే కార్మికులు చెప్పిన దాంట్లో వాస్తమున్నట్టు కనబడుతోంది. అసలేం జరిగిందనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. -
ఇరాక్‌లో ఐసిస్ మరో దుశ్చర్య
బాగ్దాద్: మతాచారాలను ఇరాక్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఇద్దరు సైన్యాధికారులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవికంగా తలనరికి చంపారు. షియాల ఆధిపత్యమున్న కర్బాలా సిటీలో మంగళవారం బహిరంగంగా ఐసిస్ ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సైన్యాధికారులు అబ్బాస్ యాసిన్ హుస్సేన్, అలీ అల్–దరాజీల శిరచ్ఛేదన దృశ్యాలను వీడియో తీసి ఉగ్రవాదులు ఆన్లైన్లో పోస్టుచేశారని ‘అరా న్యూస్’ వార్తా వెబ్సైట్ వెల్లడించింది. అమెరికా సహకారంతో దాడులుచేస్తున్న ఇరాక్ ప్రభుత్వబలగాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఐసిస్ ప్రకటించింది. దక్షిణ ఇరాక్‌లోని కర్బాలాలో ఇటీవల ఉగ్రవాదులపై సైనికదాడుల సమయంలో ఈ ఇద్దరు అధికారులు ఐసిస్‌కు చిక్కారు. మరోవైపు, అబూ బకర్ అల్–సమురాయ్ పేరు గల సైన్యాధికారిని ఐసిస్ ఉగ్రవాదులు మెడకోసి చంపేసి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మృత్యువుకు దగ్గరవుతున్న చివరిక్షణంలోనూ భయంకనబడని సైన్యాధికారి వీడియో మీడియాలో హల్చల్ చేస్తోంది. -
నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్ల తలలు నరికేశారు
రక్కా: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. తమ ఆదేశాలను లెక్కచేయలేదన్న కారణంతో నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్ల తలలను నరికేశారు. ఐసీస్ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా గల రక్కా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రీడాకారుల తలలను నరికేసి బహిరంగ ప్రదేశంలో పడేసిన ఈ ఘటన కలకలం రేపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఫుట్‌బాల్ ఆట ఇస్లాం మతాచారాలకు వ్యతిరేకమైందని, దానిని ప్రోత్సహించొద్దని గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే.. సిరియాలోని పాపులర్ ఫుట్‌బాల్ టీం అల్-షహబ్ తరపున ఆడుతున్న నలుగురు క్రీడాకారులు తమ ఆదేశాలను ధిక్కరించాడంతో పాటు.. కుర్దిష్ తిరుగుబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గత సంవత్సరం టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నారన్న కారణంతో 13 మంది యువకులను ఐసీస్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. -
గర్ల్ ఫ్రెండ్‌ని రేప్ చేశాడని ఫ్రెండ్ తల నరికి..
మిన్నెసోటా: జూన్ 24.. అర్థరాత్రి సమయం. అనుమానాస్పద లైసెన్స్ నెంబర్ ప్లేట్‌తో ఉన్న కారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారు వద్దకు వెళ్లారు. ఈలోగా కారులో ఉన్నవారు వేగం పెంచారు. పోలీసులు వారిని అందుకునే ప్రయత్నం చేయగా గంటలకు వందమైళ్ల వేగంతో ఆ కారు దూసుకెళ్లింది. అలా కొద్ది దూరం వెళ్లాక రెండు చోట్ల బలంగా ఢీకొని ఆగిపోయింది. కారు డ్రైవర్ అందులో నుంచి పారిపోయి సమీపంలోని ఓ నివాసంలో దాచుకోగా.. అందులో ఉన్న జోసెఫ్ క్రిస్టెన్ థార్సెన్ అనే వ్యక్తికి పోలీసులు ఎట్టకేలకు సంకెళ్లు తగిలించారు. అక్కడే ఓ పాడుబడ్డ ఇంట్లో దాక్కున్న డ్రైవర్‌ను బయటకు లాక్కొచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన నిజం చూసి పోలీసులు ఖిన్నులయ్యారు. ఇంతకు ఏమిటా నిజం అనుకుంటున్నారా.. థార్సెన్ హత్య చేశాడు. అవును.. తన స్నేహితుడైన డేవిడ్ అలెగ్జాండర్ హైమన్ అనే వ్యక్తిని కిరాతకంగా పొడవడమే కాకుండా అతడి తల నరికేసి అడవుల్లో పారేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడనే కారణంతోనే అతడిని హత్య చేశాడు. వాస్తవానికి థార్సెన్ మత్తుపదార్ధాలకు అలవాటుపడిన వ్యక్తి. అతడిపై రెండు మూడు నేరాల కేసులతోపాటు జైలుకు పోయి వచ్చిన చరిత్ర కూడా కలదు. 35 ఏళ్ల థార్సెన్ కు హైమన్(21)కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరు స్నేహితులయ్యారు. థార్సెన్‌కు ఒక గర్ల్ ప్రెండ్ కూడా ఉంది. ఒక రోజు థార్సెన్ గర్ల్ ప్రెండ్ వద్దకు వెళ్లిన హైమన్ ఆమెపై లైంగికదాడి చేశాడంట. అలా దాడి చేసినప్పుడే ఆమె కూడా అతడిపై తిరగబడి కొట్టింది కూడా. అయితే, డ్రగ్స్ బారిన పడిన ఈ ముగ్గురు మరో కారు డ్రైవర్‌తో కలిసి కారులో వెళుతూ మధ్యలో డ్రగ్స్ సేవించారు. అనంతరం కారు చెకింగ్ కోసం అని హైమన్ కిందికి దిగగా వెనుక నుంచి థార్సెన్ బలంగా బేస్ బాల్ బ్యాట్ తో దాడి చేశాడు. అనంతరం కత్తితో అతడిని పొడిచి కసిగా అతడి తల నరికేసి అడవిలో పారేశాడు. తర్వాత ఏం తెలియనట్లు నటించాడు. ఈ కథంతా విన్న పోలీసులు అవాక్కయ్యి థార్సన్ను అతడి గర్ల్ ఫ్రెండ్ ను మరో కారు డ్రైవర్ ను చివరకు అదుపులోకి తీసుకున్నాడు. -
తల నరికి.. గాల్లోకి విసిరేసి..
కొబ్రా: చేతబడి చేస్తోందన్న అనుమానంతో సొంత అత్తను మేనల్లుడు చంపిన ఘటన చత్తీస్ ఘడ్ కొబ్రా జిల్లాలోని బెల్బహర్పురా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమ్మ, తమ్ముడు తరచూ జబ్బు పడటానికి తన అత్త భూదాన్ బాయ్ చేసిన చేతబడే కారణమని ఉదయ్ గోండ్(28) నమ్మాడు. దీంతో కోపావేశంతో రగిలిపోయిన గోండ్ గొడ్డలి తీసుకుని భూదాన్ బాయ్ ఇంటికి వెళ్లాడు. ఆమెను చితక్కొట్టిన గోండ్ అడ్డొచ్చిన ఆమె ఇద్దరి కూతుళ్లను కొట్టి పక్కకు తోసేశాడు. దీంతో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బాధితురాలు ఇంటి వెనుక ఉన్న కూరగాయల చేనులోకి వెళ్లింది. ఆమె వెనుకే వెంటాడిన గోండ్ గొడ్డలి ఆమె తలను నరికేశాడు. తర్వాత ఆ తలను చేతితో పట్టుకుని శవం నుంచి దూరంగా గాల్లోకి విసిరేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
శుక్రవారం ప్రార్థనలకు రాలేదని.. కిరాతకం!
శుక్రవారం మత ప్రార్థనల్లో పాల్గొనకపోవడమే ఆ బాలుడి నేరమైంది. మతాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడని ఆ 16 ఏళ్ల బాలుడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద గ్రూపు అతి కిరాతకంగా తల నరికి చంపింది. ఈ ఘటన సిరియాలోని ఉత్తర అలెప్పొకు సమీపంలో ఉన్న జరాబ్లస్ పట్టణంలో జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనలేదన్న కారణంతో ఓ 16 ఏళ్ల బాలుడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అరెస్టు చేశారు. భారీగా గుమిగూడిన ప్రజల ముందు అతన్ని కేవలం కొన్ని నిమిషాలపాటు విచారించి.. ఆ వెంటనే బాలుడిని ప్రజలందరి ముందు తలనరికి చంపారు. ఇంకెవరు కూడా మసీదుల్లో ప్రార్థనలను తప్పించుకోకుండా ఉండేందుకు ప్రజలకు హెచ్చరికలాగా ఈ దారుణ శిక్షను అమలుచేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. జరాబ్లస్ నగరం 2013 నుంచి ఐఎస్ఐఎస్ గ్రూప్ అధీనంలో ఉంది. శుక్రవారం నాటి ప్రార్థనల్లో పాల్గొనలేదని అరెస్టు చేసిన మరునాడే బాలుడికి ఈ కిరాతక శిక్షను అమలుచేశారని, సెంట్రల్ జరాబ్లస్ నగరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుందని హక్కుల కార్యకర్త నాజర్ తల్జ్బిని ఏఆర్ఏ న్యూస్‌కు తెలిపారు. బాలుడికి కిరాతక శిక్ష అమలుచేయడానికి ముందు ఐఎస్ఐఎస్ షరియా కోర్టు జారీచేసిన అధికారిక ప్రకటనను చవిది వినిపించారని, మసీదుల్లో ప్రార్థనలు చేయనివారికి ఇదే రకమైన శిక్ష విధిస్తామని అందులో హెచ్చరించారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇటీవల ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 12 ఏళ్ల బాలికతో ఐదుగురు మహిళలను కాల్చిచంపించిన ఘటన మరువకముందే ఈ కిరాతకం వెలుగులోకి రావడం గమనార్హం. -
చెల్లి తల నరికి.. ఊరేగించారు
లక్నో: పరువు హత్యతో ఉత్తర ప్రదేశ్‌లోని షాహజాన్ పూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తమ కుటుంబం పరువుకు భంగం కలిగించిందనే కోపంతో తోడబుట్టిన చెల్లిని.... ఇద్దరు సోదరులు క్రూరంగా నరికి చంపేశారు. అంతేకాకుండా నరికిన తలతో వారిద్దరూ వీధుల్లో అరుచుకుంటూ బీభత్సం సృష్టించారు. బహమనీ పంచాయతీ పరిధిలోని పరౌరా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ...ఫూల్ జెహాన్(17) బాలిక, మహమ్మద్ అచ్చన్‌ను ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం తెలిసి వరుసకు సోదరులు అయిన గుల్ హసన్, నాన్హే మియాన్ ఆగ్రహానికి లోనయ్యారు. అందరూ చూస్తుండగానే గ్రామ నడివీధిలో ఫూల్ జెహాన్ తలను అతి దారుణంగా నరికేశారు. తరువాత మొండాన్ని అక్కడే వదిలేసి, తెగిపడిన తల భాగాన్ని పట్టుకొని వీధుల్లో అరుచుకుంటూ తిరిగారు. తమ కుటుంబాల్లో ఇంకెవ్వరూ ఇటువంటి పరువు తక్కువ పని చేయరాదంటూ హెచ్చరించారు. తమ చర్య అమ్మాయిలందరికీ గుణపాఠం కావాలంటూ వారిద్దరూ ఉన్మాదంతో ఊగిపోయారు. తాము సరైన శిక్ష విధించామంటూ ఆవేశంతో రెచ్చిపోతూ ఊరంతా కలియదిరిగారు. క్రైమ్ సినిమాలను తలపించే ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు.అయితే ఇంత దారుణం జరుగుతున్నా స్థానిక పోలీసులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా ప్రేమికుడు అచ్చన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎనిమిది మంది సోదరులు ఉన్న కుటుంబంలో ఫూల్ జెహాన్ ఒక్కతే ఆడపిల్ల. ఆరుగురు ఢిల్లీలో నివసిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటన తరువాత బాలిక తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. అయితే నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బబ్లూ కుమార్ తెలిపారు. గ్రామంలోఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక బలగాలను తరలించినట్లు చెప్పారు.