నలుగురు ఫుట్బాల్ ఆటగాళ్ల తలలు నరికేశారు | ISIS extremists behead four footballers | Sakshi
Sakshi News home page

నలుగురు ఫుట్బాల్ ఆటగాళ్ల తలలు నరికేశారు

Published Mon, Jul 11 2016 11:30 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

నలుగురు ఫుట్బాల్ ఆటగాళ్ల తలలు నరికేశారు - Sakshi

నలుగురు ఫుట్బాల్ ఆటగాళ్ల తలలు నరికేశారు

రక్కా: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. తమ ఆదేశాలను లెక్కచేయలేదన్న కారణంతో నలుగురు ఫుట్బాల్ ఆటగాళ్ల తలలను నరికేశారు. ఐసీస్ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా గల రక్కా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రీడాకారుల తలలను నరికేసి బహిరంగ ప్రదేశంలో పడేసిన ఈ ఘటన కలకలం రేపింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఫుట్బాల్ ఆట ఇస్లాం మతాచారాలకు వ్యతిరేకమైందని, దానిని ప్రోత్సహించొద్దని గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే.. సిరియాలోని పాపులర్ ఫుట్బాల్ టీం అల్-షహబ్ తరపున ఆడుతున్న నలుగురు క్రీడాకారులు తమ ఆదేశాలను ధిక్కరించాడంతో పాటు.. కుర్దిష్ తిరుగుబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గత సంవత్సరం టీవీలో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నారన్న కారణంతో 13 మంది యువకులను ఐసీస్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement