extrimists
-
నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్ల తలలు నరికేశారు
రక్కా: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. తమ ఆదేశాలను లెక్కచేయలేదన్న కారణంతో నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్ల తలలను నరికేశారు. ఐసీస్ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా గల రక్కా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రీడాకారుల తలలను నరికేసి బహిరంగ ప్రదేశంలో పడేసిన ఈ ఘటన కలకలం రేపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఫుట్‌బాల్ ఆట ఇస్లాం మతాచారాలకు వ్యతిరేకమైందని, దానిని ప్రోత్సహించొద్దని గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే.. సిరియాలోని పాపులర్ ఫుట్‌బాల్ టీం అల్-షహబ్ తరపున ఆడుతున్న నలుగురు క్రీడాకారులు తమ ఆదేశాలను ధిక్కరించాడంతో పాటు.. కుర్దిష్ తిరుగుబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గత సంవత్సరం టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నారన్న కారణంతో 13 మంది యువకులను ఐసీస్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. -
'ఆ జంటకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి'
సాన్ బెర్నార్డినో: ఊహించిందే నిజమైంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దాడులకు పాల్పడిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఫరూక్, మాలిక్ యువజంటకు ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫరూక్ పలుమార్లు ఇస్లామిక్ తీవ్రవాదులతో సంభాషణలు జరిపినట్లు తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన సమయంలో వందలాది మందిని హతమార్చడానికి సరిపడే మారణాయుధాలు ఫరూక్ వద్ద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దాడుల తర్వాత ప్రాధమికంగా చేపట్టిన విచారణలో ఫరూక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే విషయం స్సష్టంకాలేదు. వారి కుటుంబంతో పరిచయం ఉన్నవారు సైతం వారు దాడులకు పాల్పడ్డారంటే నమ్మలేకుండా ఉన్నారు. గతంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎఫ్‌బీఐ నిఘా పరిధిలో ఫరూక్ దంపతులు లేరని అధికారులు వెల్లడించారు.