
షిల్లాంగ్: ఆసియా కప్–2027 క్వాలిఫయింగ్ టోర్నమెంట్ మూడో రౌండ్‌ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. బంగ్లాదేశ్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌ను భారత్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించగా... రెండో అర్ధభాగంలో భారత్ జోరు కనబరిచింది. రెండు జట్లు గోల్స్ అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి.
68వ నిమిషంలో శుభాశీష్ బోస్, 81వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి బంగ్లాదేశ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్‌లు బయటకు వెళ్లాయి. గ్రూప్ ‘సి’లో భారత్‌తోపాటు బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్ జట్లున్నాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను జూన్ 10న సింగపూర్‌తో ఆడుతుంది. గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు 2027 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment